అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులు రూ.6.4 లక్షల కోట్లే
రూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయన్నది దుష్ప్రచారమే.. 2019లో బాబు దిగిపోయేనాటికే రూ.4.06 లక్షల కోట్ల అప్పులు
ఈ లెక్కన బాబు సర్కార్ కంటే జగన్ ప్రభుత్వం చేసిన అప్పులే తక్కువ
సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా, అదీ కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌లోనే తేలిపోయింది. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌కు రూ.91,443 కోట్ల అప్పులు, మరో రూ.1.09 లక్షల కోట్ల పన్నులు ఆధారంగా ఉండటం విశేషం.
ఓసారి రూ.14 లక్షల కోట్లు అప్పులని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఎల్లోమీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పయ్యావుల సోమవారం అసెంబ్లీకి సమరి్పంచిన బడ్జెట్ పత్రాల్లో స్పష్టమైంది. బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీల ద్వారా చేసిన అప్పులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2023–24 ఆర్థిక ఏడాది పూర్తయ్యేనాటికి రూ.6.46 లక్షల కోట్లేనని బడ్జెట్ పత్రాల్లో మంత్రి పేర్కొన్నారు.
ఇందులో బడ్జెట్ అప్పులు 2023–24 మార్చి కి రూ.4.91 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులు రూ.1.54 లక్షల కోట్లేనని చెప్పారు. 2024–25 ఏడాది మార్చికి బడ్జెట్ అప్పులు రూ.5,60,094.25 కోట్లకు చేరతాయని, ఇది జీఎస్‌డీపీలో 34.14%గా ఉంటుందని మంత్రి బడ్జెట్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.
వైఎస్ జగన్ పాలనలోనే అప్పులు తక్కువ
ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తేలిన రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. ఇందులో చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికే రూ.4,06,383 కోట్ల అప్పు ఉంది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో సైతం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తూ.. సుమారు రూ.2 లక్షల కోట్లకుపైగా డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రాష్ట్ర అప్పు ఇంతేనని తేలింది. ఈ లెక్కన వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు కంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులే ఎక్కువని బట్టబయలైంది. రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ టీడీపీ కూటమి నేతలు చెప్పింది దు్రష్పచారం అని తేటతెల్లమైంది.
Comments
Please login to add a commentAdd a comment