yellow media
-
‘సెల్’బ్రిటీ కష్టాలు!
సెలబ్రిటీల కదలికలు, వ్యక్తిగత జీవిత విషయాలను సొమ్ము చేసుకునే ఎల్లో మీడియా పాపరాజీ దారిలో రాజీ పడకుండా నడుస్తుంటుంది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని మీడియాతో సంబంధం లేని వారు కూడా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు పాపింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీల పాలిట పెను భూతం పాపరాజీ. ఇల్లు దాటి బయటికి వస్తే ఎవరు ఎక్కడ కెమెరాతో క్లిక్ అనిపిస్తారో తెలియదు. బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న నటి ఆయేషా ఖాన్ పాపరాజీపై మండిపడింది. తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అనవసర కామెంట్స్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీడియా పట్ల నాకు గౌరవం ఉంది. అయితే పాపరాజీ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. నా కారు వరకు నన్ను అనుసరించడం, నన్ను ముందుకు నడవనివ్వక పోవడం...ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చేతిలో మొబైల్ ఉంటే చాలు పాపింగ్ పేరుతో వెంటబడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయేషా విషయానికి వస్తే అభిమానులతో పాటు, నెటిజనులు ఆమెకు సపోర్ట్ చేస్తూ పాపరాజీ తీరుపై మండిపడుతున్నారు. ‘చౌకబారు మనసున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మీరు గళం విప్పినందుకు సంతోషంగా ఉంది. పాపరాజీ పేరుతో మిమ్మల్ని అసౌక్యరానికి గురి చేసే హక్కు వారికి లేదు’ అని ఒక నెటిజనుడు స్పందించాడు. -
అధికారులను విసిగించేలా ఈనాడు తీరు..
-
Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..
-
ఎల్లో మీడియా కొంపముంచిన చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేమిటి ఇలా అన్నారు.. అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన అలా అనకపోతేనే వింత అవుతుంది. సంపద సృష్టించే మార్గం ఏదైనా ఉంటే ఒక ఐడియా ఇవ్వండి అని ప్రజలనే అడుగుతున్నారు. అది కూడా ఆయన చెవిలో చెప్పాలట. ఈ మాట వినగానే ఎల్లో మీడియా నిర్ఖాంతపోయినట్లు ఉంది. తామేదో బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తుంటే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి కొంప ముంచారే అనుకుంటోంది. అందుకే అంత కీలకమైన వ్యాఖ్యలను ఎల్లో మీడియా దాచేసే యత్నం చేసింది.అన్నమయ్య జిల్లా సంబేపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎదురైన ఒక చేదు అనుభవం రీత్యా చంద్రబాబు ఈ విషయం చెప్పేశారు. ఒక రైతు తమకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడిగారు. దానికి కాస్త చికాకుపడిన చంద్రబాబు డబ్బులు వస్తే ఇస్తామని, దీనికి వర్క్ అవుట్ చేస్తున్నామని, అయినా మీకు ఇవ్వాలంటే ముందుగా డబ్బు సంపాదించాలిగా అని అన్నారు. అక్కడితో ఆగలేదు. డబ్బు సంపాదించే మార్గం ఉంటే తనకు చెవిలో చెప్పాలని చంద్రబాబు అనడంతో అక్కడ ఉన్నవారికి మతిపోయినంత పని అయింది. నిజానికి చంద్రబాబు ఇలాంటి ప్రశ్నలను ఊహించి ఉండరు. తన కుమారుడు, మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందు హామీలను నెరవేర్చకపోతే చొక్కా కాలర్ పట్టుకుని నిలదీయండని అన్నారు. అయినా తాము సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికలోని మరో 175 హామీలను ఎగవేస్తే మాత్రం ఎవరు అడుగుతారులే అన్న ధీమాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఉంటారు.కానీ, లోకేష్ కాలర్ డైలాగ్ బాగా వైరల్ అవుతుండటంతో ధైర్యం వచ్చిందేమో తెలియదు.. ఒక రైతు తమకు రావాల్సిన భరోసా మొత్తం రూ.20వేల గురించి ప్రశ్నించారు. దానికి ఏం చెప్పాలో అర్ధం కాని చంద్రబాబు చివరికి డబ్బులు లేవు పొమ్మంటూ, మీరే ఐడియా ఇవ్వండి అని చెప్పి చేతులెత్తేశారు. కేంద్రం గత ఏడాదికి గాను రైతు భరోసా కింద ఆరువేల రూపాయల చొప్పున మంజూరు చేసి ఉండాలి. అది పోను మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అయినా చంద్రబాబు ప్రభుత్వం సిద్దపడి ఉండాల్సింది. ఎన్నికల ప్రణాళిక ప్రకారం ప్రతీ రైతుకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో అందిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక అసలుకే మోసం తెచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆరువేల రూపాయలను కూడా ప్రభుత్వం ఎగవేయడం విశేషం. ఈ ఏడాది నుంచి కేంద్రం పదివేల చొప్పున ఇస్తుంది. దానినైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రతీ ఒక్కరూ తెలివితేటలతో ఆర్ధికంగా ఎదగాలని కూడా సలహా ఇచ్చారు.ఇంతకాలం తన తెలివితేటలతో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అభివృద్ది చెందుతారని హోరెత్తించిన చంద్రబాబు ఇప్పుడు ఎవరి బతుకు వారే చూసుకోవాలని అంటున్నారు. ఆయన చెప్పేది వాస్తవమే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకుని మోసపోకుమా అన్న శ్రీశ్రీ గేయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈయనేమీ వైఎస్ జగన్ కాదు కదా!. చెప్పినవి చెప్పినట్లు చేయడానికి అని ఇప్పుడు జనం భావిస్తున్నారు. మరో ఘటన కూడా జరిగింది. కొందరు యువకులు మదనపల్లె వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయరాదని కోరుతూ నినాదాలు చేశారు. వారికి సమాధానం ఇవ్వకపోగా, ఒకరిద్దరు వచ్చి ఇలా చేస్తారని, వారు అవుట్ డేటెడ్ అని కొట్టిపడేశారు. వామపక్షాలు చంద్రబాబుతో కలిసి ఉంటే కమ్యూనిజం గొప్పదని చెబుతారు. ఆయన బీజేపీతో కలిస్తే కమ్యూనిజం కాదు.. టూరిజం ముఖ్యమని అంటారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వపరంగా చేపట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయినట్లే అని అర్ధం అవుతోంది. ఇప్పటికే 750 మెడికల్ సీట్లను ఈ ప్రభుత్వం వదులుకుని విద్యార్ధులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరో మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. మదనపల్లె మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయవద్దని కోరిన విద్యార్ధులను పోలీసులతో బయటకు నెట్టేయించారు. నారా లోకేష్ ఎన్నికలకు ముందు చొక్కా కాలర్ పట్టుకోమన్నారు కదా అని ఎవరైనా ప్రయత్నిస్తే, పోలీసులతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని తేలిపోయింది. తల్లికి వందనంతో సహా ఆయా పథకాలను జూన్‌లో ఇస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత చెప్పారు. అప్పుడు ఏం ఇస్తారో తెలియదు కానీ, ఈ సభలో మాత్రం తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఒకసారి ఇవ్వాలా?రెండు దఫాలుగా ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకుని అందిస్తామని అన్నారట. ఈ పాయింట్ ఆధారంగా ఎల్లో మీడియా మళ్లీ వెంటనే ఆ స్కీమ్ అమలు అయిపోతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చి కథనాలు వండి వార్చాయి. తాము చెప్పినదానికన్నా ఎక్కువే చేసి చూపిస్తామని చంద్రబాబు అన్నారని కూడా రాసేశారు.హామీలు ఇచ్చినవాటికే దిక్కు లేదు కానీ.. ఎల్లో మీడియా బిల్డప్ ఏమిటా అని అంతా అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగవేసిన విషయాన్ని మాత్రం జనం మర్చిపోవాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఎల్లో మీడియా కోరికగా ఉంది. అధికారం రావడమే ఆలస్యం అన్నీ జరిగిపోతాయని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇన్ని రకాలుగా పిల్లిమొగ్గలు వేస్తున్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని గతంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు వాట్సాప్ పాలన లోకేష్ ఆలోచన అని కుమారుడిని ప్రమోట్ చేసేపనిలో ఉన్నారు. చంద్రబాబు తన ప్రచారం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ల పంపిణీకి స్వయంగా చంద్రబాబు వెళ్లవలసిన అవసరం ఏముందని అంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో వృద్దులకు పెన్షన్‌గా మూడువేల రూపాయలు ఇచ్చేవారు. దానికి మరో వెయ్యి అదనంగా ఇస్తున్నారు. అంతవరకు ఓకే. మరోవైపు పెన్షన్లను ప్రతీ నెలా కోత పెడుతున్నారని చెబుతున్నారు. ఈ పెన్షన్లను గతంలో వలంటీర్లు అందచేసేవారు. ఆ వలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి వారి ఉద్యోగాలకే మంగళం పలికారు.ఒక వలంటీర్ చేయగలిగిన పనిని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా సభ పెట్టి పంపిణీ చేసి, ప్రసంగం చేసి ప్రచారం జరిగేలా చూసుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాకపోతే, ఆయన స్టైలే అది. పావలా కోడికి రూపాయి మసాలా అన్నట్లుగా ఆయన యావ ఎప్పుడూ ప్రచారంపైనే ఉంటుంది. చంద్రబాబు ఏపీలోనే కాదు.. ఢిల్లీ వెళ్లి సైతం అక్కడ జరుగుతున్న ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న సందర్భంగా కూడా పలు అసత్యాలు చెప్పి వచ్చారు. 2019లో చంద్రబాబుకు మద్దతుగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విశాఖపట్నం వచ్చి ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు అదే కేజ్రీవాల్‌ను ఓడించాలని చంద్రబాబు ప్రచారానికి దిగారు. గతంలో మోదీని నానా రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతున్నారు. అలాగే 2019లో కేజ్రీవాల్ విద్యావంతుడు, నిజాయితీపరుడు, ఢిల్లీని బాగా అభివృద్ది చేశారని చంద్రబాబు ప్రశంసించారు. 2024 వచ్చేసరికి ఆయన దృష్టిలో కేజ్రీవాల్ అవినీతిపరుడయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు అని చంద్రబాబు అనగలిగారంటే ఏమనుకోవాలి?. కేజ్రీవాల్‌పై వచ్చిన లిక్కర్ స్కామ్ గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కానీ, అదే స్కాంలో భాగస్వామి అన్న ఆరోపణలు ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టిక్కెట్‌ను ఇదే చంద్రబాబు ఇచ్చారు.ఏపీకి ఏడు నెలల్లో ఏడు లక్షల పెట్టుబడులు వచ్చేసినట్లు కూడా చంద్రబాబు ఆ సభలలో చెప్పుకోవడం విశేషం. దావోస్ వెళ్లి ఒక్క ఎంవోయూ కుదుర్చుకోకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చారన్న విమర్శలను ఎదుర్కోవడానికి కొత్త గాత్రం అందుకుని ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అబద్దపు ప్రచారం ఆరంభించారు. దానిని ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి బడ్జెట్లో ప్రత్యేకంగా ఏమీ రాకపోయినా కేంద్ర బడ్జెట్‌ను మెచ్చుకోవాల్సిన నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎల్లో మీడియా యథాప్రకారం విశాఖ స్టీల్, పోలవరం ప్యాకేజీలు కొత్తవి అయినట్లు, అమరావతి అప్పును కేంద్రం సాయం కింద అబద్దపు ప్రచారం చేశారు. కేంద్రం రాష్ట్రానికి దన్నుగా నిలబడిందని కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ప్రభుత్వపరంగా ఒక ప్రకటన చేస్తూ ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరారు. సరిగ్గా అదే పద్దతిలో ఇప్పుడు ఐడియాలను చెవిలో చెప్పాలని అంటున్నారు.ఇంతకాలం చంద్రబాబు తన ఐడియాలతో స్కీములు అమలు చేస్తారనుకుంటే, జనమే ఆ ఐడియాలు ఇవ్వాలని కోరుతున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లు కొండను తాను ఒక్కడినే మోస్తానని ప్రజలందరితో నమ్మబలికి.. తీరా కొండను మోసే సమయం వచ్చేసరికి, జనం అంతా వచ్చి కొండను తన భుజాలపై పెడితే మోసి చూపిస్తానన్నారట. ఆ సినిమా సన్నివేశం హాస్యం కోసం అయితే, చంద్రబాబు ప్రకటన జనాన్ని మోసం చేయడం కోసం కాదా!. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు ముఠా.. బాగా దోచుకో పంచుకో..!
-
చంద్రబాబు అబద్ధాలు మోయడమే జాకీ మీడియా పని.. చెల్లుబోయిన సీరియస్ కామెంట్స్
-
అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?
సాక్షి, అమరావతి: అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల ఏడాది తిరక్కుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.5,820 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్లోనే కేవలం మార్కెట్ రుణాల ద్వారా చేసిన అప్పులు రూ.80,827 కోట్లకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.71,000 కోట్లు అప్పు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ.10 వేల కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా బడ్జెట్ బయట రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే రూ.1,26,527 కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్ర నుంచి తీసుకునే అప్పలు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్‌సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం. -
నాపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది
-
పెద్దిరెడ్డిపై ఎల్లో మీడియా విషపు రాతలు.. భూమన స్ట్రాంగ్ కౌంటర్
-
తనపై ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలపై పెద్దిరెడ్డి ఆగ్రహం
-
పట్టా భూములను అటవీ భూములంటారా?: పెద్దిరెడ్డి
తిరుపతి అర్బన్: ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.1981లోనే అవి ప్రైవేట్ భూములని నిర్ధారించారు..నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుసార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశాం. తాజాగా పులిచర్ల ప్రాంతంలోని 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులకు తెలియకుండా తారు రోడ్డు నిర్మించామంటూ, భూమిని పెంచామంటూ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో కథనాలను వెలువరించారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీచేశారు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టాం. కేంద్ర అటవీశాఖ నుంచి 27.6.2022న క్లియరెన్స్ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చారు. రెండుసార్లు విచారణ.. అవి ప్రైవేట్ భూములేఈ భూములపై ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి అది అటవీభూమి కాదని.. పూర్తిగా ప్రైవేట్ భూమేనని నిర్ధారించారు. అదే వెంకటరమణారెడ్డి 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అంశంపై ఫిర్యాదు చేశాడు. తిరిగి మరోసారి దీనిపై విచారణ జరిపిన అధికారులు అది ప్రైవేటు భూమి అని మరోసారి నిర్ధారించారు. దీనిపై వెంకటరమణారెడ్డి హైకోర్ట్‌లో కేసు వేయగా డిస్మిస్ చేశారు. ఫారెస్ట్ గెజిట్ 1968లోనే అది పక్కా ప్రైవేటు భూమి అని చూపించారు.ఆరోపణలకే పవన్ పరిమితం..ఇసుకలో రూ.40 వేల కోట్ల దందా చేశామని, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశామని, నేపాల్‌లో పట్టుబడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మాపై నిరాధార ఆరోపణలు చేశారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? మేం ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు తేలిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనను మాపై నెట్టేందుకు యత్నించింది.భూమి పెరిగిందా..? బుర్ర తరిగిందా?ఈనాడు ఆరోపణ: భూమి కూడా పిల్లల్ని కంటుందని మీకు తెలుసా? పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రమే అడవి మధ్యలో పట్టా భూములు ఎలా వచ్చాయి?వాస్తవం: భూమి పెరుగుతూ వచ్చిందనేది శుద్ధ అబద్ధం. సెటిల్మెంట్ నివేదికే దీనికి నిదర్శనం. అవి ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ విభాగం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసిన పెద్దిరెడ్డి కుటుంబం అక్కడ పశు పోషణతోపాటు మామిడి తోటలను సాగు చేస్తోంది. రిజర్వు ఫారెస్టు ఎలాంటి ఆక్రమణలకు గురి కాలేదని 1968 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కూడా స్పష్టమవుతోంది. అక్కడ 75.74 ఎకరాల భూములున్నాయని, 30 అడుగుల దారి కూడా ఉందని పేర్కొంది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హ యాంలో రెండుసార్లు ఉమ్మడిగా సర్వే నిర్వహించిన రెవెన్యూ, అటవీశాఖల అధికారులు కూడా అవి ప్రై వేట్ భూములేనని నిర్ధారించారు. దీనిపై దాఖలైన వ్యాజ్యాన్ని సైతం న్యాయస్థానం కొట్టి వేసింది.ఈనాడు ఆరోపణ: ఎఫ్ఎంబీ, ఫెయిర్ అడంగల్ ప్రకారం 23.69 ఎకరాలుంటే 75.75 ఎకరాలున్నట్లు ఆన్లైన్లో ఎలా నమోదు చేశారు? అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది?» డాక్యుమెంట్ నంబర్ 2346/2000: విస్తీర్ణం 15 ఎకరాలు» డాక్యుమెంట్ నంబర్ 1/2001: విస్తీర్ణం 10 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2345/2000: విస్తీర్ణం 11 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 139/2001: విస్తీర్ణం 18.94 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2347/2000: విస్తీర్ణం 10.80 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2/2001: విస్తీర్ణం 10 ఎకరాలు » మొత్తం విస్తీర్ణం : 75.74 ఎకరాలుఈ రిజిస్ట్రేషన్లు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పూర్తయ్యాయి.ఈనాడు ఆరోపణ: విలాస భవనాలను కట్టుకున్నారు.. ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు నిర్మించుకున్నారు.వాస్తవం: ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉండటం.. ఎడ్లబండి మాత్రమే వెళ్లేందుకు దారి ఉన్నందున తమకు తారు రోడ్డు కావాలని కోరుతూ రైతులు అటవీశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర అటవీశాఖ ఆమోదంతో రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చారు. అయినా పెదిరెడ్డిది కూడా పొలమే కదా? ఆయన కూడా వ్యవసాయం చేయి స్తున్నారు కదా? అది కూడా అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటు చేసుకున్నారు. అసలు రామోజీ కుటుంబానికి మించిన విలాస సౌథాలు ఎవరికి మాత్రం ఉంటాయి? దాదాపు వెయ్యి దేశవాళీ ఆవులను సంరక్షిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం వాటి కోసం షెడ్లు నిర్మించింది. స్వతహాగా రైతు కావడం, వ్యవసాయంపై మక్కువతో వయసు మళ్లిన వాటిని కూడా పోషిస్తున్నారు. » టీడీపీ కూటమి సర్కారుకు బాకాగా పనిచేస్తున్న ఈనాడు దినపత్రిక ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విషం చిమ్ముతూ పతాక శీర్షికలతో పేజీలకు పేజీలు తప్పుడు కథనాలను ప్రచురించింది. మార్కెట్ విలువ ఎకరా రూ.3 లక్షలు మాత్రమే ఉన్న పట్టా భూములను అటవీ ప్రాంతంగా చిత్రీకరించేందుకు రూ.కోట్ల విలువైన స్థలాన్ని వృథా చేసేందుకు కూడా ఈనాడు వెనుకాడలేదు. -
ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై పెద్దిరెడ్డి ఆగ్రహం
-
ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తా: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు, కుత్రంతాలు ప్రజలకు బాగా తెలుసు అని విమర్శించారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు(Eenadu), ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మాకు సంబంధించిన భూములపై ఎల్లో మీడియా(Yellow Media) తప్పుడు కథనాలు రాస్తోంది. 2001లోనే మేము భూములు కొనుగోలు చేశాం. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేశారు. 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం. ఇప్పుడు అది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చింది. అంతకంటే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అప్పుడు కూడా అటవీ భూములు కాదని తేల్చారు. 2001 నుంచి భూములను సాగు చేస్తున్నాం. ఈనాడు, ఈటీవీ తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తాను.గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాశారు. అప్పుడు వారిపై రూ.50కోట్లకి పరువు నష్టం దావా వేశాం. ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారు. 19.11.1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిని వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాతన గెస్ట్ హౌస్ కట్టాలని వార్తలు రాశారు. 2001 లోనే అక్కడ పని చేసే వారి కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం. కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 1968లో ఇచ్చిన ఫారెస్ట్ గెజిట్‌లో కూడా ఆ 76 ఎకరాలు వారికి సంబంధం లేదు అని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారు.27.06.2022 లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందాన అంటున్నారు. గతంలో ఇసుక ద్వారా 40 వేల కోట్లు మింగేసాను అని, ఆ తర్వాత నేపాల్‌లో నాకు సంబంధించిన ఎర్ర చందనం దొరికింది అని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఇన్ని రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు.బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) కుట్రలు, కుతంత్రాలు అందరికీ తెలుసు.ఎన్నికల సందర్బంగా చెప్పిన ప్రకారం.. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. ఏపీలో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఎవరు పార్టీలో ఉన్నా, లేకున్నా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ నాయకత్వంలో మళ్ళీ అధికారం ఖాయం. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. కరోనాతో ప్రపంచమంతా అల్లకోల్లోలం అయినా కూడా ఎక్కడా పథకాలు ఆపలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
దావోస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్
-
ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు!
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పెద్ద స్థాయి వారు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి? ఇచ్చిన వాగ్ధానాల అమలు ఎలా? ఆ క్రమంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడం ఎలా? వంటివని మనం అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల అమరావతికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ భవనంలో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు కూడా హాజరైన ఈ సమావేశంలో వాళ్లు మాట్లాడుకున్న విషయాలు తెలిస్తే సామాన్యులు విస్తు పోవాల్సిందే. తెలుగుదేశం మీడియా చెప్పిన దాని ప్రకారమే.. ఈ సమావేశంలో ప్రధాన చర్చ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న భవనాలపై సాగింది! అంత పెద్ద నేతలు ఇంత చీప్‌గా టైమ్‌పాస్ మాటలు మాట్లాడుకుంటారా? అబద్ధాల ముచ్చట్లు పెట్టుకుంటారా?. జగన్ భవనాల గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం మీకూ రావచ్చు. అయితే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా జగన్‌పై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న పచ్చ బ్యాచ్‌కు మాత్రం ఈ సందేహం రాలేదు. అందుకే టీడీపీ జాకీ మీడియా ఆ సొల్లు పురాణాన్ని పతాక శీర్షికలకు ఎక్కించి సంతోషించింది. ‘‘జగన్ జల్సా భవన్లు’’లపై ఆరా తీసిన అమిత్ షా అంటూ ఆనందపడింది. టీడీసీ,జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు కావస్తున్నా ఈ పచ్చ మూక జగన్‌పై విమర్శలు మినహా సాధించిందేమీ లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూటమి పెద్దలు ఇలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని చూస్తూ, ‘‘నది పక్కన మీ ఇల్లు చాలా బాగుంది’’ అని అమిత్ షా మెచ్చుకున్నారట. పనిలో పనిగా జగన్ పాలెస్ల గురించి ఆరా తీసినట్లు తెలిసిందని ఈ జాకీ మీడియా రాసింది. అది చూస్తే ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది. అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి గురించి అడిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది అక్కడ టాపిక్ కాదు. కానీ.. విజయవాడలో ప్రకృతి వైపరీత్యానికి కారణమైన చంద్రబాబు ఇంటి గురించి హోం మంత్రి అడిగారన్న సమాచారమే బయటకు వెళితే అది తమకు ఇబ్బంది అవుతుంది కనుక టీడీపీ నేతలు పనిగట్టుకుని ఇలా అబద్ధాలు ప్రచారం చేసి ఉండాలి. హైదరాబాద్‌లో జగన్‌కు వంద గదలు ప్యాలెస్ ఉందని టీడీపీ నేతలు చెబితే అమిత్ షా చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారన్నమాట!. ఈ సోది రాసిన పత్రిక వారికి నిజం తెలియదా? నాలుగు బెడ్ రూమ్‌ల ఇల్లు ఉంటే వంద రూమ్లని వీళ్లు రాస్తారా? కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇంత చెత్తగా వార్తా కథనాలు ఇచ్చి పాఠకులను మోసం చేస్తారా?. జగన్ ఇంటి గురించి నిజంగానే సమాచారం కావాలంటే నిమిషాలలో తెప్పించుకునే శక్తి అమిత్ షా కు ఉండదా? బెంగుళూరులో ఇల్లు ఉంది, తాడేపల్లిలో ఇల్లు ఉందని చెప్పారట. ఈ రోజుల్లో కాస్త మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవారు సైతం ఆయా ముఖ్యమైన నగరాలలో రెండు, మూడు ఇళ్లు కలిగి ఉంటున్నారు. అందులోను హైదరాబాద్‌తోపాటు ఏపీలోని సొంత ప్రాంతంలో కూడా ఇళ్లు ఉంటాయి. దానిని భూతద్దంలో చూపి జగన్ పై దుష్ప్రచారం చేయడానికి వీరు చూపిన శ్రద్ద రాష్ట్ర సమస్యలను వివరించడంపై పెట్టి ఉంటే బాగుండేది. పోనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు హైదరాబాద్ లో ఇళ్లు లేవా? ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఇళ్లు లేవా? అవి ఎంత భారీగా ఉన్నాయో తెలియదా? అవి ప్యాలెస్‌లు కాదా? కృష్ణ కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉండడం లేదా? ఆ ప్యాలెస్ ప్రభుత్వానిది అని ఒకసారి, లింగమనేని రమేష్ ది అని మరోసారి మాటలు మార్చలేదా? ఆ ఇల్లు మునిగిపోకుండా చూడడానికి బుడమేరు లాకులను ఎత్తివేసిన ఫలితంగానే విజయవాడ మునిగిందన్న సంగతి నిజం కాదా? హోం మంత్రి అమిత్ షా కు పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాల నివారణలపై ఏమాత్రం శ్రద్ద ఉన్నా ముందుగా చేయవలసిన పని ఏమిటి? చంద్రబాబు కృష్ణానది ఒడ్డున కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించిన కట్టిన ఇంటిలో ఎలా ఉంటున్నావని హోం మంత్రి ప్రశ్నించాలి కదా? ఆ పని చేయలేదా? చేసినా దాని గురించి ప్రచారం చేయకుండా జగన్ పై కట్టుకధలు వ్యాప్తిలోకి తెచ్చారా? చంద్రబాబుకు జూబ్లిహిల్స్ లో ఉన్నది ఎంత పెద్ద పాలెస్సో ఆ రోడ్డులోకి వెళ్లి చూసిన వారందరికి తెలుస్తుంది. ఆ భవన నిర్మాణానికి ఏ,ఏ దేశాల నుంచి వస్తువులు తెప్పించింది ఆ రోజుల్లో పలు వార్తలు వచ్చాయి కదా? అయినా ఆయన చాలా సింపుల్ గా ఉన్నట్లు అనుకోవాలి. తాజాగా.. అమరావతి సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు కదా. ఇది కాకుండా కుప్పంలో కూడా గృహ నిర్మాణం చేస్తున్నారు కదా? వీటి గురించి ఏమి చెబుతారు? ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేత వైఎస్ జగన్. అంతేకాదు. సతీసమేతంగా పూర్తిగా అక్కడే నివసిస్తున్న నేత కూడా ఆయనే. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు పూర్తిగా అక్కడే ఉంటున్నారా? చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే నివసిస్తుంటారు కదా! ఇది తప్పని చెప్పడం లేదు. కాని ఎదుటి వ్యక్తిమీద మాత్రం బురద వేసి సంతోషపడుతుండడమే దారుణమనిపిస్తుంది. అమిత్ షా కు మరో విషయం గుర్తుకు రాలేదా? ఈ మధ్య కాలంలో ఏడిఆర్ నివేదిక ఒకటి వచ్చింది కదా? అందులో చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తితో అత్యంత ధనికుడైన సీఎం అని వెల్లడైంది కదా? దానిపై హోం మంత్రి వివరాలు తెలుసుకునే యత్నం చేయలేదా? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును ఉద్దేశించి అవినీతిపరుడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు కదా! మళ్లీ పొత్తు కుదరగానే నీతిమంతుడు అయిపోయారా? అలాగే చంద్రబాబు కూడా వీరిద్దరిని ఎన్ని మాటలు అన్నారు. జనం ఇవేవి గుర్తుకు తెచ్చుకోరాదన్న ఉద్దేశంతో జగన్ పై డైవర్ట్ చేస్తుంటారు.అమిత్ షా మరుసటి రోజు ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయల మేర కేంద్రం సాయం చేసిందని ప్రకటించారు. అది నిజమా? కాదా? దానిని ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త మార్చి రాశాయి. ఏపీకి మూడులక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా అన్నట్లు ఈనాడు మార్చేసింది. హిందూ పత్రికలో మాత్రం మూడు లక్షల కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇచ్చారని చంద్రబాబు తన ప్రసంగంలో చెబితే, అమిత్ షా మాత్రం దానిని రుణంగానే చెప్పారన్న సంగతి తెలుస్తుంది. హడ్కో, వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.27 వేల కోట్ల రుణం ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. వక్రీకరించి వార్తలు రాసి పాఠకులను టీడీపీ జాకీ మీడియా మోసం చేస్తోందని పదే,పదే రుజువు చేసుకుంటున్నాయి. కేంద్రం నిజంగానే రూ.మూడు లక్షల కోట్లు సాయం చేసి ఉంటే ఆ డబ్బంతా ఏమైపోయిందో అర్థం కాదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు ఏమీ చేపట్టకుండా ఆ నిధులు ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఇవి చాలక ఇప్పటికే రూ.70 వేల కోట్ల అప్పులు తీసుకు వచ్చారు. కరెంటు ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల మేర బాదారు. ఈ విషయాల గురించి కానీ విభజన హామీల గురించి ప్రస్తావించకుండా అమిత్ షా భజన చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అధిక సమయం కేటాయించినట్లు ఉంది. కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డామని, ఇప్పటికీ పేషంటే అని చంద్రబాబు చెబుతున్నారు. యథాప్రకారం రూ.పది లక్షల కోట్ల అప్పు అని అదని, ఇదని గత ప్రభుత్వానికి సంబంధించి అబద్దాలు చెప్పి అమిత్ షాను మోసం చేస్తే ఏమి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగైతే సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలి కదా! అమిత్ షా తో తమ సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళిక హామీల అమలు తీరు గురించి మాత్రం చర్చించలేదు. జగన్ ఇళ్ల గురించి ఇంత కీలక నేతలు మాట్లాడుకున్నారంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలియడం లేదా! పోచికోలు కబుర్లు చెప్పుకోవడానికి వీరికి ఇంత ఖాళీ టైమ్ ఉంటుందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు దావోస్ పర్యటన..బాహుబలికి మించి ఎల్లో మీడియా ఎలివేషన్స్
-
‘దావోస్‌లో బాబు.. 2014-19 మధ్య ఒప్పందాల సంగతేంటి?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కి వెళ్తుందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాలుగుసార్లు దావోస్(Davos) వెళ్లి ఏం సాధించారు?. ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారే చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పారిశ్రామిక వేత్తలు ఏపీలో వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?. ఆంధ్రాకి అలీబాబా, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్, కుమియుమి 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి, రాష్ట్రానికి సౌదీ ఆరాంకో, మైక్రోసాఫ్ట్ సంస్థ హైబ్రిడ్ క్లౌడ్.. అంటూ ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేశారు. చివరికి హీరోహోండా కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో జిందాల్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు వచ్చేసినట్టే ఎల్లోమీడియాలో భజన చేశారు.కానీ, ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదు. దీనికితోడు నేషనల్ మీడియాలో దండోరా చేయించడానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. కానీ, ఏ కంపెనీని తీసుకురాలేకోయారు. వైఎస్ జగన్ తన హయాంలో ఎలాంటి ప్రచారం లేకుండా దావోస్ వెళ్లారు. అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంటుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఓర్వకల్లు దగ్గర గ్రీన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుని వేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీన్ని పవన్ కూడా మెచ్చుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో లక్షా 26 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. అవన్నీ నిర్మాణంలో ఉండగా ఉత్పత్తులు ప్రారంభించాయి. అదీ వైఎస్ జగన్ గొప్పతనం. చంద్రబాబు ప్రస్తుతం దావోస్ వెళ్లారు కాబట్టి రేపట్నించి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కు చేరుకుంటుంది. ఆ ఎలివేషన్‌కు ముందు 2014-19 నాటి ఒప్పందాల వివరాలు కూడా చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
పాత ప్రాజెక్టులకు కొత్తగా శంకుస్థాపనలు.. అంతా బాబు షో
-
అంతా బాబు షో!.. పాత ప్రాజెక్టులకు కొత్తగా శంకుస్థాపనలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కొత్తగా భారీ ప్రాజెక్టులు ఇస్తున్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రకటిస్తుంటే.. అదంతా సీఎం చంద్రబాబు చలవే అని టీడీపీ, దాని తోక పార్టీలతో పాటు ఎల్లో మీడియా బాకాలూదుతోంది. వాస్తవం మాత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రంలో శంకుస్థాపన చేయనున్న మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే. గత ప్రభుత్వ హయాంలో భూమి లీజుపై ఒప్పందం చేసుకుని మరీ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు స్వయంగా ఎన్టీపీసీ గత ఏడాది ఫిబ్రవరి 20న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై అనేక రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీపడి మరీ సాధించి 2020లోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ అధికారికంగా కేంద్రం లెటర్ (31026/62/22)ను 2022లోనే పంపింది. అటువంటి బల్క్ డ్రగ్ పార్క్‌నకు ఇప్పుడు కొత్తగా ప్రధాని చేత శంకుస్థాపన చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. రైల్వేల్లో కొత్త లైన్ల ఏర్పాటు, రైల్వే జోన్‌కు భూ కేటాయింపు ఇలా ఒకటేమిటి.. ప్రధాని నేడు శంకుస్థాపన చేయబోయే మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే కావడం గమనార్హం.మెజార్టీ ప్రాజెక్టులదీ అదే తీరు » కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదానో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించే విధంగా చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అయితే ఏడాది, రెండేళ్ల క్రితం ప్రకటించి.. భూ కేటాయింపులు, లీజు ఒప్పందాలు కూడా ముగిసిన పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసేందుకు సిద్ధమవుతుంటే మహా ప్రసాదం ప్రభో అంటూ కీర్తించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. » వాస్తవానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును పూడిమడకలో ఏర్పాటు చేయనున్నట్టు.. ఇందుకు ఏపీఐఐసీతో 1,200 ఎకరాల భూ లీజు ఒప్పందంపై 2024 ఫిబ్రవరి 20న అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఎన్జీఈఎల్) సంతకం చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా రూ.1.85 లక్షల కోట్ల ఈ ప్రాజెక్టును తామే సాధించామన్నట్టుగా చంద్రబాబు గొప్పలకు పోతున్నారు. నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్కు కోసం ప్రత్యేకంగా 2020లో ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. » రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్‌ను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాటు ఈ పార్కులో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ 2022 నవంబర్ 7న కేంద్ర ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ అండర్ సెక్రటరీ అధికారికంగా లేఖ (31026/62/2022) పంపారు. మొత్తం రూ.1,876 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడత కింద రూ.223 కోట్లను మార్చి 2023లో విడుదల చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని చేత శంకుస్థాపన చేయించేందుకు సిద్ధమైంది. » రైల్వే జోన్‌కు ముడసర్లోవలో అవసరమైన భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. అయితే.. అసలు భూమి కేటాయించలేదని, అక్కడ భూమి నిర్మాణాలకు అనువైనది కాదంటూ తప్పుడు ఆరోపణలు చేసి.. ఇప్పుడు అదే ప్రాంతంలో రైల్వే జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయిస్తున్నారు.» ఇవేకాకుండా.. దువ్వాడ–సింహాచలం, విశాఖపట్నం–గోపాలపట్నం మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణ పనులకు కూడా గతంలోనే అనుమతులు వచ్చాయి. ఈ పనులు కూడా కొంత మేర ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా కొత్తగా చేపడుతున్నట్టు జాబితాలో చేర్చారు. కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ ఏర్పాటు, గుత్తి–పెండేకల్లు డబ్లింగ్ పనులు.. ఇలా ఒకటేమిటి మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. -
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్‌ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్‌ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్‌ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్‌కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్‌ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో పీపుల్‌ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్‌లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్‌వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎల్లో మీడియా ఫేక్ ఆరోపణలపై సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..
-
బాబు వైఫల్యాలు.. ఒప్పేసుకున్న ఎల్లో మీడియా!
ఏడంటే ఏడు నెలలు.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది!. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాళానికి చేరిన సంగతి తెలిసిందే. ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదు.. అక్షరాలా టీడీపీ అనుకూల పచ్చ పత్రిక ‘ఈనాడు’ నిగ్గుదేల్చిన వాస్తవం. ఈ కథనంలోనే వైఎస్ జగన్ సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతున్నా.. ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారికి నోరు రాకపోయింది!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. మరో శ్రీలంక అవుతోందని ఈనాడు తన కథనాల ద్వారా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మా బాబు అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది. సంక్షేమ పథకాల అమలు సంగతి అలా ఉంచండి.. చేసిన అప్పులే కొండంతయ్యాయి!. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వల్లనే అని కలరింగ్ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి ఉండవచ్చు కానీ.. బాబు నిర్వాకాల పుణ్యమా అని ఏపీ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? అన్న అనుమానాలైతే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా.. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ అంకెలకు మధ్య తేడా కూడా ఎక్కువైంది. అయితే, ఈనాడు తన కథనంలో వైఎస్ జగన్ హయంలోని అంకెలను ప్రస్తావించకుండా బాబుకు జాకీలేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేనలు రెండూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికార భాగస్వామి. ఇన్ని అనుకూలతలున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు జగన్ కాలం కంటే (రూ.22,213 కోట్లు) తక్కువగా (రూ.9703 కోట్లు) ఉండటం గమనార్హం. దీన్ని బట్టే బాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగం ఏపాటిదో అర్థమైపోతుంది.రాష్ట్రంలో భూముల విలువలు తగిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పేవారు. టీడీపీ మీడియా, పార్టీ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. జనం చాలా వరకూ నమ్మారు కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తే.. ఈ ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి రూ.5,438 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.6306 కోట్లుగా ఉంది.చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు. దాంతో కంగారుపడుతున్న చంద్రబాబు అండ్ కో.. హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా రూ.31 వేల కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం అప్పులు కూడా సమీకరిస్తున్నారు. అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు వెయ్యి కోట్లు తగ్గింది. తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే 2023 డిసెంబర్లో 12 శాతం వృద్ధి ఉంటే, 2024 డిసెంబర్లో అంటే కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ మైనస్ ఆరు శాతంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం సమయంలో మూలధన వ్యయం నవంబర్ నాటికి రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, చంద్రబాబు పాలనలో అది కేవలం రూ.8329 కోట్లు ఉంది. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఏం సంపద సృష్టించారో అర్థం కాదు.ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్ జగన్ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు హయంలో ఆర్థిక నిర్వహణ నాసిరకంగా ఉందని అంకెలు చెబుతున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అవే అబద్దాలను వల్లె వేస్తుంటుంది. ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలను పరిశీలిద్దాం.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13,500 కోట్ల రాబడి అంచనా వేస్తే కేవలం రూ.5438 కోట్లే వచ్చాయి. మిగిలిన నాలుగు నెలల్లో రూ.8వేల కోట్ల ఆదాయం రావడం కష్టమే. అమ్మకం పన్ను ద్వారా రూ.24,500 కోట్లు వస్తాయని లెక్కేస్తే ఇప్పటివరకూ వచ్చింది ఇందులో సగం కంటే తక్కువగా రూ.11303 కోట్లే మాత్రమే. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.25,587 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్ అంచనాగా చూపారు. ఇప్పటివరకూ వసూలైంది రూ.13154 కోట్లు!. కేంద్ర పన్నులలో వాటా రూ.35 వేల కోట్లని చెప్పారు. వాస్తవంగా అందింది.. రూ.22వేల కోట్లు. ఇతర పన్నులు, సుంకాలు రూ.8645 కోట్లు అంచనా ఆదాయమైతే, నికరంగా లభించింది రూ.3483 కోట్లు మాత్రమే. భూమి శిస్తు మాత్రం రూ.57 కోట్ల అంచనాలకు రూ.194 కోట్లు వచ్చాయి. ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అప్పట్లో రూ.47 వేల కోట్లు ఉంటే, అది 2024 నవంబర్ నాటికి రూ.56 వేల కోట్లకు చేరుకుంది. ఇదన్నమాట చంద్రబాబు సృష్టించిన సంపద.రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికి రూ.1.12 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లకపోయినా, ఈ ప్రభుత్వం ఎందుకింత అప్పులు చేసిందీ ఇంతవరకు వివరించ లేదు. నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.మరో వైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం రూ.15 వేలు కోట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా, పోర్టులు, మెడికల్ కాలేజీలు, తదితర అభివృద్ది పనులు చేపట్టింది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంది. అలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా, స్కీములు అమలు చేయకపోయినా, అభివృద్ది ప్రాజెక్టులు లేకపోయినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్న కూటమి సర్కార్‌ను ఏమనాలి? ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ, తమది ‘విజన్-2047’ అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అండ్ కో వారికే చెల్లిందని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబ్బాబూ పుణ్యముంటుంది.. ఆయన్ను అరెస్టు చేయండి..
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.-ఎం.రాజేశ్వరి -
బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'
సాక్షి, అమరావతి: వారం.. వారం అప్పులే! బడ్జెట్లోనూ.. బడ్జెట్ బయటా అప్పుల మోతలే! ఎటు చూసినా రుణ భారమే! ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే! రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తాజాగా రూ.1.19 లక్షల కోట్లను దాటేశాయ్! చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంట్ చార్జీల బాదుడు.. ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు.. మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన రూ.5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకు ఎగబాకింది! సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మూడు నెలల ముందే..మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి రూ.74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని ‘కాగ్’ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం రూ.8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కార్పొరేషన్ల పేరుతో మరిన్ని..కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారెంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు–మర్చంట్ బ్యాంకర్‌ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి ఒక్కటీ అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు.పథకాలు లేవు.. మరి ఏం చేస్తున్నట్లు?వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మిన విషయం తెలిసిందే. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్ సిక్స్, సెవెన్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూలు పిల్లలకు ‘అమ్మ ఒడి’ లేదు. విద్యార్థులకు రూ.3,900 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. హామీలను అమలు చేయకుండా.. పథకాలను నిలిపివేస్తూ.. ఎడాపెడా అందినకాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కారు అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. అటు అప్పులు.. ఇటు అమ్మకాలుఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అప్పులతోనే అమరావతి!రాజధాని అమరావతి కోసం తొలి దశలో రూ.52 వేల కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి రూ.5 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సీఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా రూ.21 వేల కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
జగన్ ఇంటిపై రాళ్ళ దాడి.. ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్