ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై వైఎస్సార్‌సీపీ ధ్వజం | YSR Congress Party Slams Yellow Media | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై వైఎస్సార్‌సీపీ ధ్వజం

Jul 1 2025 10:20 PM | Updated on Jul 1 2025 10:24 PM

YSR Congress Party Slams Yellow Media

తాడేపల్లి : తమ పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు రాతలు రాస్తున్న ఎల్లోమీడియాపై వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాధార ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం ఎల్లో మీడియాకు ఒక అలవాటుగా మారిందని మండిపడింది. వైఎస్సార్‌సీపీని దెబ్బతీసే దురుద్దేశంతో తమ  పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి కుట్రలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయిందని, సజ్జలపై ఆంధ్రజ్యోతి, ఈటీవీ-2 సహా ఇతర ఎల్లో మీడియాలో ప్రచురించిన, ప్రసారమైన వార్త కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. 

కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం చేయడం అత్యంత దారుణమని పేర్కొంది. ఆ వార్తల్లో పేర్కొన్న ప్రేమ్‌చంద్‌ అనే వ్యక్తితో కాని, అతనిపై వచ్చిన ఆరోపణలతో కాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ తెలిపింది. పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలకు వెనుకాడమని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement