sajjala ramakrishna reddy
-
ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సజ్జల
-
ప్రత్యర్థుల విష ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం.. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా కమ్యూనికేషన్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. మీడియా అంశాలపై పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలకు శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగీపురం శ్రీనాధాచారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తాజా పరిణామాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని.. సమర్థ వాదనతో ప్రజల్లో సానుకూలత సాధించాలన్నారు. ప్రత్యర్థులు చేసే విషప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సజ్జల చెప్పారు. -
ఎల్లో మీడియా ఫేక్ ఆరోపణలపై సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..
-
టార్గెట్ సజ్జల.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ(Kutami Prabhutvam) ప్రతీకార పాలన కొనసాగుతోంది. నిత్యం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆరోపణలు, తప్పుడు కేసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకుని ఎల్లో మీడియాతో అడ్డగోలు కథనాలను అచ్చేయిస్తోంది.సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలను కూటమి అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. కబ్జా కథనాలను తీవ్రంగా ఖండించింది. ‘‘అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఆ మీడియా చానెల్స్ చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమికూడా సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. అలాంటప్పుడు కబ్జా అన్న ప్రశ్నే తలెత్తదు. 1995 ప్రాంతంలోనే అంటే ఇప్పటి చంద్రబాబు(Chandrababu) అప్పుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఇక్కడ పనికిరాని భూములను సజ్జల, ఆయన సోదరులు కొనుగోలుచేశారు. మామిడితోటలు వేశారు. దీనికి దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆయనకు ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.2014లో ఫారెస్ట్, రెవిన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవిన్యూశాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.కేవలం సజ్జల రామకృష్షారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా ప్రయత్నిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతున్నారు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. -
‘విద్యుత్ చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టండి’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని(power tariff hike) మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను విధించడం దుర్మార్గమని అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచము అని ప్రజలకు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి రాగానే ఏకంగా రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారంను విధించడం దారుణం. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలి. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించాలి. అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. ప్రజాసమస్యలపై వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. ‘విద్యుత్ చార్జీల పెంపుదల అన్ని వర్గాలపై ఆర్థికంగా భారంను మోపుతోంది. అయా వర్గాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వారంతా వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ కార్యక్రమం ద్వారా పాలకులకు అర్థం కావాలి. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని సూచించారు.‘పార్టీ శ్రేణులు, గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలి. ఇందుకోసం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీలు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం ద్వారానే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రజలకు వైఎస్సార్సీపీ(YSRCP కష్ట సమయంలో అండగా ఉంది అనే సంకేతాలను పంపాలి. అలాగే తాజాగా వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు పార్టీ నేతలు రైతులను కలుసుకోవాలి. వారికి వచ్చిన కష్టంలో అండగా ఉంటామనే భరోసాను అందించాలి’ అని పిలుపునిచ్చారు. -
కూటమి ప్రభుత్వంపై సజ్జల ఫైర్
-
‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు’’
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపి నందిగాం సురేష్(Nandigam Suresh) అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. మంగళవారం(డిసెంబర్ 24) గుంటూరు జైలులో సురేష్‌ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు... ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్సార్సీపిని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. -
కోట్ల మంది గుండె చప్పుడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, విజనరీ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడిగా కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా మారారని తెలిపారు. గెలుపు, ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచి్చన అభిమానుల కోలాహలంగా మధ్య జరిగిన ఈ వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పేద మహిళలకు చీరలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వందలాది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు, ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.తాడేపల్లిలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీవైఎస్సార్సీపీ విద్యార్థి – యువజన – సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న.. ప్రజా సేవకా.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాడేపల్లి పురవీధుల్లో ర్యాలీ చేశారు.మేలును గుర్తుచేసుకున్న ప్రజలుగత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రజలు గుర్తుచేసుకున్నారు. ‘పేద ప్రజలకు సుపరిపాలన అందించిన ధీరుడు మా అన్న జగన్మోహనుడు.. పారిశ్రామిక ప్రగతిలో తనదైన ముద్ర వేశారు.. రాష్ట్రం ఎయిర్ కండీషన్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ హబ్‌లకు వేదికైంది.. చదువుతోనే పేద బిడ్డల తల రాత మారుతుందని నమ్మిన ఏకైక నేత.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన వారందరికీ ప్రతీ పథకం ఇంటి వద్దనే అందించాలని తపనపడే మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు’ అని వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. -
పిల్లల భవిష్యత్ కు బాటలు వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం
-
జగన్ ఒక అరుదైన నేత: సజ్జల
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నేళ్ల పాలనాకాలంలో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది వైఎస్ జగన్ మోహన్‌రెడ్డినే అని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ(డిసెంబర్ 21) పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు.. జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని కోట్లాధి మంచి అభిమానుల గుండె చప్పుడు వైఎస్ జగన్. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజాసంక్షేమమే ఆయన లక్ష్యం. అయిదేళ్ళ పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంధి పలికారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రస్థానం ఒక చరిత్ర. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు. జగన్ రియల్ విజనరీ. నేతల్లోనే జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు అని అన్నారు.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి విలువలు, నిబద్దతతో కూడిన నాయకుడుగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టారు. కేవలం పదేళ్ళలో ఒక విజనరీగా, తాను ఏం అనుకుంటున్నాడో దానిని కార్యరూపంలోకి తీసుకురాగలిగిన ప్రజాప్రతినిధిగా, మంచి పరిపాలకుడు, జనరంజకుడుగా ఎదిగారు. వైయస్ జగన్ గారు తన ఆదర్శపాలనను దేశం అంతా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారు. మాటకు కట్టుబడే నాయకుడుగా జనం ఆయనను మెచ్చారు. అందుకే అధికారంను కట్టబెట్టారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం. ఆయన నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడానికి ఏనాడు అంగీకరించలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులను సగౌరవంగా స్వీకరించారు. గెలుపు ఓటములు కాదు, ప్రజలకు మనం ఏం చేశాము, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఎలా వ్యవహరించాము అనేదే ముఖ్యమని పార్టీకి దిశానిర్ధేశం చేసిన మార్గదర్శకుడు వైయస్ జగన్... పేదలకు ఉచిత బస్సు ప్రయాణాలు, గ్యాస్ సిలెండర్లు వంటి తాయిలాలు ఇవ్వడం కాదు, వారి జీవితాల్లో మంచి మార్పు రావాలి, తమ తలరాతను తామే రాసుకునే స్థాయిలో వారు నిలబడేందుకు ప్రభుత్వంగా మనం అండగా ఉండాలనే లక్ష్యంతో గత అయిదేళ్ళలో ఆయన పాలన సాగింది. భవిష్యత్తును ఆలోచించి ఆయన తన పాలనలో అనేక పథకాలను అమలు చేశారు. ఏదో విజన్ అంటూ హంగామా చేయడం కాదు, అయిదేళ్ళ పాలనలో గొప్ప పునాదులతో కూడిన విధానాలను అమలులోకి తీసుకువచ్చి, భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని తపించిన నేత వైయస్ జగన్. అటువంటి విజనరీ జన్మదినం సందర్భంగా ఆయన పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడుగా ఎదగాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన మంచిపనులు, దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకు వచ్చిన సంస్కరణల వల్ల తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అదుకోవాల్సి ఉంటే, గత ఎన్నికల్లో అన్ని శక్తులు ఏకమై చేసిన దాడి, చెప్పలేని అనేక కారణాల వల్ల అధికారానికి దూరమయ్యాము. కానీ ఆయన మాత్రం ప్రజల పక్షాన నిలబడాలని, నిరుత్సాహం నుంచి ప్రజల క్షేమమే ధ్యేయంగా అందరినీ ముందుకు నడిపిస్తున్న ధీశాలి అని సజ్జల అన్నారు.సజ్జలతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు, చిల్లపల్లి మోహన్ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాలు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక.. బర్త్ డే వేడుకల్లో తొలుత.. జగన్ కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆపై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్‌కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. జగన్‌పై అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చినవాళ్లను సజ్జల అభినందించారు. -
ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంరాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..ఈ నెల 21 న మన అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్‌గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్‌గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాంసోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు. -
ఇది రైతుల పక్షాన నిలబడాల్సిన సమయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవారు లేక, గిట్టుబాటుధర అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు...అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, రైతులు సంయుక్తంగా ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లీ, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలి...ఇది రైతులకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వం ధాన్యం సేకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రైతులకు న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శాంతియుతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి కావాలని అనుమతులు నిరాకరించి, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తే, దానిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపడుతున్న ఈ కార్యక్రమంపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి వ్యక్తమవుతుంది. వైఎస్సార్సీపీ ఎంత బలంగా ఉందో, ప్రజా సమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడవుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ దీనిని విజయవంతం చేయాలి.ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులకు అండగా, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతుల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
-
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం(డిసెంబర్10) ఏపీ హైకోర్టు విచారించింది. సజ్జల కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మరో రెండు వారాలపాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్పీ నేతలకు వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనపై 41ఏ నోటీసుకు వీలులేని సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇదీ చదవండి: బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం -
‘బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం’
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌తో పోరాడాల్సిన సమయం వచ్చిందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాపక్షాన నిలబడాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో రాజీ ప్రస్తావన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారాయన. మంగళవారం వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రజా పోరాట కార్యాచరణను ఈ సందర్భంగా ఆయన వాళ్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఉందనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ మనం వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడుదాం’ అని పార్టీ నేతలతో అన్నారు. 👉అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నుంచే అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటినీ నిలబెట్టుకోలేకపోయింది.పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను, నెలకొల్పిన వ్యవస్ధలను ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను.. వాళ్లకు అందకుండా చేశారు. ఇంటింటికే డెలివరీలాంటి వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలించారు. ఇదేకాదు..👉రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. కుట్ర పూరితంగా కేసులు నమోదు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ పరిస్థితుల నడుమ ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రజల పక్షంగా వారి తరపున నిలబడాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.ఈ పోరాట కార్యాచరణను అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం ప్రకటించారు. ‘రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలి. రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.17వేల కోట్ల కరెంట్ భారం ప్రజలపై మోపింది. రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీల భారంపై డిసెంబరు 27న చేపట్టబోతున్నాం. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టనున్నాం.అదే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనవరి ౩వ తేదీన మూడో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటికే 4 క్వార్టర్లు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి వాళ్లకు అండగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం.👉మనం చేసిన మంచినంతా నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ గట్టిగా తీర్మానం చేసింది. ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అన్నివర్గాల తరపున పోరాడుతూ.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఏ స్ధాయిలోనైనా అండగా నిలబడుతుందనే విషయం ఆ వర్గాలకు తెలియజేయాలి.👉రైతులకు అండగా వైఎస్సార్సీపీ అనే మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేలా అందరూ ముందుకు రావాలి. ఆయా జిల్లాల్లో చేపట్టబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రేణులు, రైతులు తరలి వచ్చేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకు వెళ్లి ర్యాలీలో పాల్గొనడంతోపాటు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలి అని సజ్జల తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జేసీఎస్ మండల ఇంఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
మనం చంద్రబాబులాగా కాదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారని.. కానీ 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీలను ఉద్దేశించి ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..‘‘వైఎస్సార్సీపీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ. పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకుని దాన్ని అమలు చేసే పార్టీ మనది కాదు. అభిమానులతో నడిచే పార్టీ ఇది.. అందరి అభిప్రాయాలను తీసుకుని నడిచే పార్టీ. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఐదారు నెలలుగా అందుకు ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చింది. 2019 తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్లపాటు అసలు కనపడలేదు. తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారు. మనం ఎప్పుడూ జనంలోనే ఉన్నాం. ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చింది..మన సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉంది. ప్రజల కోసం మళ్లీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవటానికి దోపిడీలు చేసేస్తున్నారు. 2014-19 మధ్యలో ఉన్నట్లు కొంతైనా మొహమాటం కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారు..ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎంగా ప్రమాణం చేయకముందే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో అక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చాక రోజుకొక కొత్త ఇష్యూతో రచ్చ చేస్తున్నారు. చివరికి తిరుపతి లడ్డూ మీద కూడా రాజకీయం చేశారు. జగన్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే.. చంద్రబాబు అన్నిటినీ ప్రయివేటు పరం చేస్తున్నారు. పోర్టులు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, చివరికి రోడ్లు కూడా ప్రయివేటు పరం చేస్తున్నారు. వచ్చిన మెడికల్ కాలేజీ సీట్లను పోగొట్టారు. ఐదు, ఆరు వందల మంది విద్యార్థులకు అన్యాయం చేశారు..ఇప్పుడు ఏం చేసినా జనం ఏమీ పట్టించుకోరని, ఎన్నికల నాటికి అన్నీ మర్చిపోతారని చంద్రబాబు భావిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మన హయాంలో చేసిన మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. మన పార్టీ కార్యకర్తలు, నాయకులకు జనంలో గౌరవం ఉంది. పార్టీ కార్యకర్యక్రమాలను ప్రతిస్థాయిలోనూ గట్టిగా తీసుకెళ్లాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఎవరూ వెనుకడుగు వేయలేదు. కార్యకర్తలు కసిగా పనిచేసి 2019లో గెలిపించారు. మనవెంట నడుస్తున్న వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: ఇక ప్రజా పోరాటాలే.. 4న వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి సమావేశం..ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులకు ఇకనుంచి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అనేక అభివృద్ది కార్యక్రమాలను భుజాన వేసుకుని ఐదేళ్లలో పూర్తి చేయాలనే తపనతో పని చేశాం. దానివలన కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. ప్రభుత్వ పనిలో పడి, పార్టీకి ఏం అవసరమో అది చేయలేకపోయాం. ఇకమీదట అలా ఉండదు. మీకే ప్రాధాన్యత ఉంటుంది...ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాల్సిన బాధ్యత ఇప్పుడు మనమీద ఉంది. జడ్పీ అధ్యక్షులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాను యాక్టీవ్ చేయాల్సిన అసవరం ఉంది. సమస్యల మీద ఎంపీపీలు కూడా చిన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టాలి. ఎంపీపీలందరితోనూ వైఎస్ జగన్ సమావేశమయ్యే ఏర్పాటు కూడా చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌గా సజ్జల
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌గా సజ్జల
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు.అంతకుముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు. కాగా, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల కీలక వ్యాఖ్యలు
తాడేపల్లి, గుంటూరు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిన వేళ.. ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది. ఏ సోషల్ మీడియా కార్యకర్తకు ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్న వారిపై న్యాయపోరాటం చేద్దాం. ఈ విషయంలో జిల్లా, నియోజకవర్గాల నాయకత్వం వెంటనే స్పందించాలి. పోలీసులు ఎవర్నైనా అరెస్టు చేస్తే న్యాయ సహాయం అందించాలి. ఇందుకోసం ఎక్కడికక్కడ పార్టీ తరఫున సమన్వయ కమిటీలు ఏర్పాటు కావాలి’’ నేతలకు దిశానిర్దేశం చేశారాయన.సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై ప్రయివేటు కేసులు వేస్తామని ఈ సమావేశంలో సజ్జల అన్నారు. ‘‘సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తే పార్టీ లీగల్ టీం వెంటనే పీఎస్ లకు వెళ్లాలి. కావాల్సిన న్యాయ సహాయం అందించాలి. సీనియర్ అడ్వకేట్స్ తో కేంద్ర కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. 24 గంటలూ అందుబాటులో ఉండేలా కొందరు లాయర్లను ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవటంలో ఎక్కడా వెనక్కు తగ్గాల్సిన పనిలేదు. వైయస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటారు’’ అని సజ్జల చెప్పారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా, లీగల్ సెల్ ముఖ్య నేతలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ఏపీపై చంద్రబాబుకు ఏమాత్రం మమకారం లేదు: సజ్జల
సాక్షి, తిరుపతి: ఏపీ మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. రుషికొండపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టించిన భవనం చూసి చంద్రబాబు సంతోషపడ్డారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రుషికొండపై ఉన్న భవనం వైఎస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి అని కామెంట్స్ చేశారు.చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయి. ఒక మాఫీయ రాజ్యం ఏలుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారు. పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నాలుగు నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాం. అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారువైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ కట్టడాలు చేయలేదు. కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారు. వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోపడ్డారు. వైఎస్ జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రుషికొండపై ఉన్న భవనం వైఎస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి. ఇప్పటికైనా చంద్రబాబు తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. అసెంబ్లీ భవనాలు చూస్తే నీ పాలన అర్థం అవుతుంది. వైఎస్ జగన్ చేసిన వేల కోట్ల సంక్షేమంతో నీవు పోల్చుకోగలవా చంద్రబాబు?. సూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదు. ఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు ప్రతీరోజు అప్పు చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి. వైఎస్ జగన్ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయి.ఈ నేలపై చంద్రబాబుకు ఏ రోజు మమకారం లేదు. ఎన్నికలు కూడా త్వరగా వచ్చేట్లు ఉన్నాయి. పటిష్టమైన కార్యకర్తలతో పార్టీని సిద్ధం చేస్తున్నాం. ఇదే మా తొలిఅడుగు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం చేస్తాం. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం అని చెప్పారు. -
ఏపీలో మాఫియా రాజ్యమేలుతోంది
-
గిఫ్ట్ డీడ్‌ను షర్మిల దుర్వినియోగం చేశారు
సాక్షి, అమరావతి: రక్తం పంచుకు పుట్టిన చెల్లి షర్మిలపై ప్రేమాభిమానాలతోనే సొంత ఆస్తుల్లోనూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటా ఇస్తామన్నారని, కానీ గిఫ్ట్ డీడ్‌ను షర్మిల దుర్వినియోగం చేసి, తల్లి పేరిట షేర్లుగా మార్చారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్దే ఉన్నాయని తెలిసే అవి పోయాయని అబద్ధాలాడారని, షర్మిల చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలపై క్రిమినల్ కేసు పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు. సజ్జల శుక్రవారం పార్టీ నాయకులు, శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఎన్సీఎల్టీలో అర్జీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? షర్మిల తీరు, ఎల్లో మీడియా దు్రష్పచారాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. సరస్వతి పవర్ షేర్ల మ్యాటర్ హైకోర్టులో ఉందన్నారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులపై స్టేటస్కో మెయిన్‌టెయిన్ చేయాలని హైకోర్టు నిర్దేశించిందని తెలిపారు. వైఎస్ జగన్‌పై అప్పట్లో కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తే.. ఆయన ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగిందని తెలిపారు. అలా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే, దాన్ని ఆపాలంటూ వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇచ్చారని వివరించారు. అంతేతప్ప, ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదన్నారు. సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలిసి కూడా షర్మిల కుయుక్తులు పన్నారని చెప్పారు. న్యాయపరంగా జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే సీఎం చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేశారన్నారు. ఇది తెలిశాక ఆ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమంటూ ఆపాలంటూ చెల్లెలికి జగన్ లేఖ రాశారని చెప్పారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయనిపుణుల అభిప్రాయాన్ని తీసుకొన్నారని తెలిపారు. షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని, దానిని ఆపకుంటే ఇబ్బందులొస్తాయని న్యాయ నిపుణులు చెప్పారన్నారు. ఈ వాస్తవ విషయాలను పార్టీ నాయకులు, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. -
సజ్జల పిటిషన్.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
-
సజ్జల పిటిషన్.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఎల్వోసీ ఇవ్వడంపై కోర్టు ధిక్కరణ కింద సజ్జల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. డీజీపీ, ఎస్పీ, హోం సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
ఏపీ హైకోర్టులో సజ్జల క్వాష్ పిటిషన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లుక్ అవుట్ నోటీసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.వైఎస్సార్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లుక్ అవుట్ నోటీసును క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈనెల 25వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన LOC ఇవ్వటంపై కోర్టు ధిక్కరణ కింద క్వాష్ పిటిషన్ వేశారు.ఇది కూడా చదవండి: ‘పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా?’ -
సజ్జలపై టీడీపీ వేధింపులు..
-
అక్రమ కేసులకు భయపడం..
-
అక్రమ కేసులకు భయపడం: సజ్జల
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యాయలంపై దాడి చేశారంటూ పెట్టిన అక్రమ కేసులో మంగళగిరి పీఎస్‌లో విచారణకు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ, అధికారం ఉందని అక్రమ కేసులు పెడుతున్నారు పాలనను గాలికొదిలేసి.. దాడులకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను. దాడి జరిగిన రోజు నేను బద్వేలులో ఉన్నా. స్వేచ్ఛగా తిరగకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులతో ఎయిర్‌పోర్టులో కూడా ఆపుతున్నారు. ప్రజలు పాలించమని అధికారాన్ని ఇస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కేసులు వైఎస్సార్సీపీ నేతల్లో ధైర్యాన్ని మరింత పెంచుతాయి.’’ అని సజ్జల స్పష్టం చేశారు.120 నిందితుడిగా నా పేరు చేర్చారు. సంఘటన జరిగినప్పుడు నేను ఇక్కడ లేనే లేను. కానీ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో నేను ఉన్నట్టు నేను చెప్పినట్లు వాంగ్మూలంలో ఉంది. అది ఎలా సాధ్యం?. నేను ఏదో చేయాలని చెప్పానంటా.. అప్పిరెడ్డితో చెప్పానంటా.. ఇదంతా కథలా లేదా?. స్టోరీలు రాస్తున్నారు.. ప్రొసిజర్స్ ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలి. నేను కార్యాలయంలో ఉన్నట్లు పోలీసులు రాసుకున్నారు. స్వేచ్చగా తిరిగేందుకు లేకుండా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల్లో పట్టుదల పెరుగుతుంది.ఇదీ చదవండి: ఇచ్చిన హామీలేంటి?.. బాబు చేస్తున్నదేంటి?: వైఎస్ జగన్.. విష సంస్కృతి మొదలు పెట్టారు. విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్లో ఎవరో వాంగ్మూలం ఇచ్చారని పేర్లు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న భావిస్తే అది సాధ్యం కాదు. ఆ రోజు పట్టాభి ప్లాన్‌తోనే తప్పుడు మాటలు మాట్లాడారు. ఈ కేసును పొడిగించాలనే సీఐడీకి అప్పగించారు. ఎల్వోసి ఇవ్వడంపై కోర్టుకు వెళ్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
విచారణకు సజ్జల పోలీసుల ఓవరాక్షన్ పై పొన్నవోలు ఫైర్
-
అక్రమ కేసు.. విచారణకు సజ్జల హాజరు
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యాయలంపై దాడి చేశారంటూ అక్రమ కేసు విచారణకు హాజరు కావాలంటూ నిన్న(బుధవారం) వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అవినాష్, నందిగం సురేష్లను పోలీసులు విచారించారు. ఈ కేసులో సజ్జలను 120వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.కాగా, సజ్జల వెంట పొన్నవోలు, అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఉండగా, పోన్నవోలు సుధాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదిని అడ్డుకోవడం రాజ్యాంగం విరుద్ధం అంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.ఇదీ చదవండి: విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలకు అర్థం లేదు: వైఎస్ జగన్ -
ఏపీలో అరాచకం తప్ప ఏమీ లేదు..
-
సజ్జలకు నోటీసులు.. కాకాణి సీరియస్..
-
అరాచకాలకు హద్దే లేదా?
-
అరాచకానికి హద్దు లేదా?.. నోటీసులపై సజ్జల రియాక్షన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణకు హాజరు కావాలంటూ మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అబద్ధాన్ని అయినా చంద్రబాబు నిజంగా మల్చుతారని.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు‘‘మాకు న్యాయ స్థానాలపై విశ్వాసం ఉంది. నేను విదేశానికి వెళ్లానని తెలిసి లుకౌట్ నోటీసు ఇచ్చారు. అక్టోబర్ 7న విదేశానికి వెళ్తే 10న నోటీసు ఇచ్చారు. 2021లో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగితే ఇప్పుడు మళ్లీ కొత్తగా మాకు నోటీసులు పంపుతున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి?. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అరాచకానికి హద్దు లేదా?’’ అంటూ సజ్జల నిప్పులు చెరిగారు.‘‘అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు. దానిపై మేము న్యాయం కోర్టుకు వెళ్తాం. ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది. మీ పెండ్యాల శ్రీనివాసరావు, ఇతర నేతల్లాగా నేనేమీ పారిపోవడం లేదు. కానీ లుకౌట్ నోటీసులు పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన టీడీపీ ఆఫీసు మీద దాడి కేసును ఇప్పుడు బయటకు తీశారు. అసలు ఆ దాడి జరగడానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసు..టీడీపీ నేతలు సీఎం జగన్ ని దారుణంగా దూషించారు. సుప్రీంకోర్టు నాకు ఇంటీరియమ్ ప్రొడక్ట్ ఇచ్చింది. అది కూడా సెప్టెంబర్ 20నే ఇచ్చినా కూడా ఇప్పుడు నాకు నోటీసులు ఎలా ఇస్తారు?. చేతిలో అధికారం ఉందని ఎలాగైనా నోటీసులు ఇస్తారా?. దీన్ని బరితెగింపు అనాలా? పొగరు అనాలా? ఇంకేమైనా అనాలా?. అసలు రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా?. ఏమాత్రం బేస్‌లేని విషయాలలో కూడా నోటీసులు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు?. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అటాచ్మెంట్ చేసిందంటే చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయింది. అందుకే ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. కానీ చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా రాస్తారు? అంతకన్నా బరితెగింపు ఉంటుందా?’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.ఇదీ చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’! ‘‘అలా తప్పుడు ప్రచారం చేసి జనాన్ని నమ్మించగలరేమోగానీ కోర్టును నమ్మించలేరు. జత్వానీ కేసులో కూడా నన్ను ఇలాగే ఇరికించారు. ఏదోలాగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. పట్టాభి ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌ని దూషించారు. అప్పుడు టీడీపీ ఆఫీస్‌పై గొడవ జరిగింది. వైఎస్ జగన్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి నేరం జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేసి కేసులు పెడుతున్నారు. బోట్లతో ప్రకాశం బ్యారేజిని కూల్చాలని ప్లాన్ చేశారని కూడా కేసులు పెట్టారు. అలాంటి వారికి న్యాయంతో పనిలేదు. ఏదోలా కేసులలో ఇరికించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారందరినీ టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. -
సజ్జలకు పోలీసుల నోటీసులు
-
సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 10:30 గంటలకు సజ్జల హాజరు కావాలని నోలీసులు ఇచ్చారు. -
‘రెడ్‌బుక్’ కుట్రలు.. ఆగని అక్రమ కేసులు.. వేధింపులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలు వెర్రితలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా వరుస అక్రమ కేసులతో వారిని వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తోంది. అందులో భాగంగానే.. గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని వక్రీకరిస్తూ.. ఆ ఉదంతంతో ఎలాంటి సంబంధంలేని వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌లపై లుక్అవుట్ నోటీసు జారీచేయడమే ఇందుకు తాజా నిదర్శనం. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చీరాగానే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే దాదాపు నిర్మాణం పూర్తయిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయాన్ని అర్థరాత్రి బుల్డోజర్లతో కూల్చివేసింది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టే మంజూరైంది. అయినాసరే కూల్చివేతకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేశారు కాబట్టి. కానీ, మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడలేని అత్యుత్సాహం చూపిస్తోంది. అప్పట్లో టీడీపీ నేత పట్టాభి నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు మనస్తాపం చెంది తీవ్రస్థాయిలో నిరసన తెలిపి ధర్నా చేశారు. ఈ ఘటనను వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.నోటీసులతో వేధింపులు..ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన మరో విమానంలో హైదరాబాద్‌కు రావల్సి ఉంది. కానీ, సజ్జలపై లుక్అవుట్ నోటీసు జారీ అయ్యిందని ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ని అడ్డుకున్నారు. లుక్అవుట్ నోటీసు జారీ అయిన విషయంపై తనకు సమాచారం లేకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. అలాగే, కొన్నిరోజుల క్రితం విదేశాలకు వెళ్తున్నప్పుడు లేని లుక్అవుట్ నోటీసు.. విదేశాల నుంచి తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. తాను విదేశాలకు వెళ్లడంలేదని.. తిరిగి వచ్చానని.. తనను హైదరాబాద్ వెళ్లేందుకు అడ్డుకోవడం ఏమిటని నిలదీస్తే ఇమిగ్రేషన్ అధికారులు నీళ్లు నమిలారు. కొద్దిసేపటి తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లేందుకు అనుమతించారు. కానీ, అప్పటికే ఆయన ప్రయాణించాల్సిన హైదరాబాద్ విమానం టేకాఫ్ అయిపోయింది. ఇదే తరహాలో కొన్నిరోజుల క్రితం మరో వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్‌ను కూడా శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ఇదే అక్రమ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ప్రభుత్వం వేధిస్తోంది. ఆయన్ని అక్రమంగా అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఆయనపై మరో అక్రమ కేసులో అరెస్టుచేయడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం. ఇదే రీతిలో లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్లతోపాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది.మూడోసారి వైఎస్సార్సీపీ నేతల విచారణ..ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సోమవారం మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో వారిని మంగళగిరి రూరల్ పోలీసులు విచారించడం ఇది మూడోసారి. మరోవైపు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం చైతన్యను పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
చంద్రబాబు, పవన్ కి సజ్జల వార్నింగ్
-
పవన్ లైన్ బీజేపీకి నచ్చడం లేదు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్ అరాచకాలు చేస్తోందన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌ను దెబ్బకొట్టాలనే తిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కాషాయం పట్టి బీజేపీ కంటే నేను ముందు ఉన్నానని చెబుతున్నాడని కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు పల్నాడు లోక్‌సభ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్వీకార కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, విడదల రజినీ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పార్టీ ఓటమి షాక్‌లా అనిపించింది. కూటమి నేతలు మోసంతోనే అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు మాయ లోకాన్ని రెండేళ్ల ముందు నుండే ప్రజలకు చూపించారు. హామీలు అమలు చేయరని తెలిసి కూడా ఓటు వేశారు. 14 లక్షలు కోట్లు అప్పు అని అసత్య ప్రచారం చేశారు. రావడం రావడమే అరాచకం, హింసా కాండ చేశారు. వైజాగ్ స్టీల్ ఏమవుతుందో తెలియదు. వైఎస్ జగన్ ఆనాడే చెప్పారు.. వారికి ఓటెస్తే అమ్మేసినట్లే అని. అధికారంలో ఉండి పూర్తిగా బరితెగించారు. గ్రామ కమిటీల వరకూ పక్కాగా నియామకాలు చేస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్వీప్ చేస్తాం. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సీనియర్లందరూ కలిసి కట్టుగా పని చేయాలి.తిరుపతి ప్రసాదంపై సుప్రీం కోర్టు చంద్రబాబుకు మొట్టి కాయలు వేసింది. పవన్ కళ్యాణ్ కాషాయం పట్టి బీజేపీ కంటే తాను ముందు ఉన్నానని చెప్పాడు. వైఎస్ జగన్‌ను దెబ్బకొట్టాలనే కల్తీ ప్రసాదం అంటూ కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీశారు. ఇంత నీచానికి దిగజారారు అంటే.. జగన్ అంటే ఎంత భయపడుతున్నాడో తెలుస్తోంది. సనాతన ధర్మానికి తానే చాంపియన్ పవన్ కళ్యాణ్ తీసుకున్న లైన్ బీజేపీ పెద్దలకు నచ్చటం లేదు. దీన్ని బట్టే వీరెంత కాలం కలిసుంటారో తెలియడం లేదు. వాళ్లలో వాళ్ళే కొట్టుకునేట్లున్నారు. దీంతో ప్రజలకు మరిన్ని సమస్యలు రానున్నాయి.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘పదవిగా కాదు బాధ్యతగా భావిస్తున్నాం. గెలుపు వైపునకు తొలి అడుగు ఇక్కడ నుండే పడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి చంద్రబాబును గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తాం. పదవులు వస్తాయి పోతాయి. రేపల్లెలో పుట్టా, సత్తెనపల్లిలో పెరిగా గుంటూరు వచ్చాను. లోకేష్ రెడ్ బుక్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాడు. నేను గ్రీన్ బుక్ పెట్టి కష్టపడిన ప్రతి కార్యకర్త పేరు రాసుకుంటాం. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వెలుతురిచ్చే శక్తి ఉండాలంటే సూర్యుడిలా మండే శక్తి ఉండాలి. వైఎస్ జగన్‌కు అటువంటి శక్తి ఉంది. కార్యకర్తలకు రుణపడి ఉంటాం. నేను, అంబటి రాంబాబు రామలక్ష్మణులు వంటి వాళ్లం. లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు సిట్ వేసింది. చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలి. బలహీన వర్గాలకు ఆ పదవి అప్పగించాలి. సీబీఐ నుండి ఇద్దరిని, రాష్ట్రం నుండి ఇద్దరిని సిట్‌లో నియమించారు. సిట్ విచారణ సక్రమంగా జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదుమాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..టీడీపీని ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నాం. అంబటి, మోదుగుల నాయకత్వంలో ముందుకెళుతాం. అంబటిని అధ్యక్షుడిగా నియమించడం శుభపరిణామం.మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న అంబటి రాంబాబు, మోదుగులకు శుభాకాంక్షలు. జగనన్నే మన ధైర్యం జగనన్న పాలన అంటే గుర్తుకొచ్చేది సంక్షేమం. బెంచ్ పార్క్ పాలన అందించాం. విద్య, వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది. జగనన్న మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. సూపర్ సిక్స్ వంద రోజుల్లోనే డకౌట్ అయింది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రజాబలం ఎవరికి ఉందో ఈవీఎం బ్యాచ్‌కు తెలుసు: పేర్ని నాని -
లడ్డూ వివాదం.. చంద్రబాబుకు భయం పట్టుకుంది.. అందుకే సిట్ : సజ్జల
సాక్షి,అమరావతి : తిరుమల లడ్డు వివాదంపై వైఎస్సార్సీపీ కోర్టుకు వెళ్లడంతో భయపడిన సీఎం చంద్రబాబు సిట్ వేశారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లడ్డూపై తాను తప్పుడు ఆరోపణలు చేయలేదని అనుకుంటే సుప్రీం కోర్టు విచారణను కోరుతూ చంద్రబాబు ప్రభుత్వమే అఫిడవిట్ వేయాల్సిందన్నారు. ఆధారాలు, ధైర్యం లేదు కాబట్టే సిట్ విచారణ అని అంటున్నారు. ముందుగా విచారణ చేపట్టామని చెప్పుకునేందుకే సిట్ వేశారు.లడ్డూ వివాదంపై వైఎస్సార్సీపీ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో చంద్రబాబు బయపడ్డారు. లడ్డూపై చంద్రబాబు చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు విచారణను కోరాల్సిందని సజ్జల రామకృష్ణారెడ్డి తలిపారు. 👉 చదవండి : ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది -
చంద్రబాబుకు సజ్జల ఛాలెంజ్
-
కోట్లాది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశాడు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
-
బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జల
సాక్షి, హైదరాబాద్: శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిదంటూ చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. బాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టును లీక్ చేశారని మండిపడ్డారు. ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లు ఘోరమైన ఆరోపణలు చేశారని విమర్శించారు.అయితే ప్రభుత్వ ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్లు ఖండించారని, దేనికైనా సిద్దమని చెప్పారని తెలిపారు. అంతేగాక లడ్డూ వివాదంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. సోమవారం ఈ కేసు విచారణకు కూడా రానుందని తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్ర బాబు ఘోరమైన అబద్ధం ఆడారు. బాబు అన్నట్టుగా జంతువుల కొవ్వు మాట షోకాజ్ నోటీసులో లేవు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ, బుడమేరు బాధితుల అంశాలు పక్కన పెట్టి.. ఇప్పుడు టీడీడీ లడ్డూను తెరపైకి తీసుకువచ్చారు . చలో తిరుపతి అని వైయస్ జగన్ ఏమైనా పిలుపు ఇచ్చారా? ఇష్యూ చేసింది టీడీపీ, ఉద్రిక్తత సృషించారు‘జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనకు అనుమతి లేదని మా నేతలకు ఇచ్చిన నోటీసులలో ఉంది. డిక్లరేషన్ అంశం భక్తుడు, టీటీడీకి సంబంధించిన అంశం. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి నేతలు పాప పరిహారం చేసుకోవాలి. జగన్ హుందాగా వ్యవహరించారు. మతం వ్యక్తిగతం అన్నది చంద్రబాబుకు తెలియదా? ఇప్పటికే పలు మార్లు జగన్ తిరుమలకు వెళ్లి వచ్చారు. ఎప్పుడు లేని డిక్లరేషన్ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? జగన్ తిరుమలకు వెళతా అంటే కట్టలు కట్టుకుని వచ్చి రాజకీయం చేశారు’ అని మండిపడ్డారు. -
నిజాల నిగ్గు తేల్చాలి
సాక్షి, అమరావతి : ‘వందల కోట్ల మందికి శ్రీవారు ఆరాధ్య దైవం. తిరుమల ప్రసాదానికి అత్యంత పవిత్రత ఉంది. అలాంటి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారన్న అనుమానాలు రేకెత్తించింది ముఖ్యమంత్రి చంద్రబాబే కాబట్టి.. వాటి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ఆయనదే. అసలు కల్తీ నెయ్యిని వాడనప్పుడు.. అపచారానికి తావే లేదు. ఈ విషయంలో పూర్తి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన చంద్రబాబు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టారు.దాన్ని సవరించాల్సిన బాధ్యతను విస్మరించి సంప్రోక్షణ అంటూ ఇంకా డ్రామాలు చేస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు దేవుణ్ని వాడుకోవడం దారుణం అన్నారు. ‘నిజానికి నెయ్యిని అలా కల్తీ చేయడం సాధ్యమా? ఎవరైనా ఆ పని చేస్తారా? ఒకవేళ చేస్తే దేశ ద్రోహులు మాత్రమే ఆ పని చేయాలి. టెర్రరిస్టులో లేక మత విద్వేషం ఉన్న వారో చేయాలి. ఒకవేళ నెయ్యిలో నాణ్యత లేకపోతే, దాన్ని లోపలికి కూడా పోనివ్వరు. అలాంటప్పుడు నాణ్యత లేని నెయ్యిని వాడే అవకాశమే లేదు. కానీ, చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధానికి, సీజేఐకి లేఖ రాస్తానని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారించాలని కోరారు. వాస్తవాలు తేల్చాలని, భక్తుల మనోభావాలు నిలబెట్టాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. చంద్రబాబు కుట్ర కోణం మూడు రోజులుగా జరుగుతున్న తతంగం చూస్తే, అసలు దాన్ని విపరీతంగా ప్రస్తావించింది, ప్రచారం చేసింది సీఎం చంద్రబాబేనని సజ్జల చెప్పారు. నెయ్యిలో కల్తీ కాదు.. ఏకంగా జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యి వాడుతున్నారని పచ్చిగా నింద మోపుతూ, చాలా నింపాదిగా మాట్లాడటం స్పష్టంగా కనిపించిందన్నారు. బాబు మాటలను బట్టి ఇదంతా కుట్ర అని స్పష్టమవుతోందన్నారు. ‘జూలై 23న నెయ్యి పరీక్ష రిపోర్ట్ వస్తే.. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? ఆ రిపోర్ట్ అంత సీరియస్‌గా ఉంటే టీటీడీ ఈవో కానీ, సీఎం కానీ తక్షణ చర్యలకు ఎందుకు దిగలేదు? నెయ్యిలో ఏవో వెజిటబుల్ ఫ్యాట్ (వనస్పతి) గుర్తించామని, తగిన చర్యలు తీసుకుంటున్నామని తొలుత ఈవో చెప్పారు. ఇప్పుడు రెండు నెలల తర్వాత మాట మార్చి చెబుతున్నారు. అందుకే ఇది కుట్ర అని అనుమానాలు వస్తున్నాయి. అదుపులో లేని వ్యాధితో బాధ పడుతున్న వారు లేదా.. స్వార్థం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నా ఫరవాలేదనుకునే శాడిస్ట్‌లే ఇలాంటి పని చేస్తారు’ అని ధ్వజమెత్తారు. ‘ఏదైతే ఫీడ్ (ఆహారం) ఇస్తారో.. అంటే పామాయిల్ కేక్ వంటివి.. ఆ ఆవుల పాలలో అది కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు చంటి పిల్లల తల్లులు తీసుకునే ఆహారం వల్ల వారి పాలల్లో కూడా వాటి లక్షణాలు ఉంటాయి. సరిగ్గా.. ఇక్కడ కూడా ఆ పశువులకు ఇచ్చే దాణాలో ఉండే పదార్థ లక్షణాలు వాటి పాలలో కనిపిస్తాయి. ఇది సహజం. అంత మాత్రాన జంతువుల కొవ్వు ఉందని చెప్పడం దుర్మార్గం’ అన్నారు. ‘అమెజాన్‌లో కొట్టి చూడండి. నెయ్యి కేజీ బ్రాండ్‌ను బట్టి రూ.450 నుంచి రూ.550 వరకు ఉంటుంది. టీడీపీ హయాంలో కూడా నెయ్యి కిలో రూ.350కే సరఫరా చేశారు. మరి అప్పుడు నాణ్యత లేని, కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లా? నెయ్యిలో కల్తీ చేస్తే చెడు వాసన వస్తుంది. సొంత డెయిరీ ఉన్న చంద్రబాబుకు ఈ విషయాలు తెలీవా?’ అని సజ్జల మండిపడ్డారు. -
లడ్డులో కొవ్వు మాత్రమే కాదు - తిరుమలలో ప్రతి పరిస్థితిపై పూర్తి విశ్లేషణ
-
సజ్జల అనే వ్యక్తిని నేను ఎప్పుడు కలవలేదు..
-
టీడీపీ నేతలు, ఎల్లో మీడియాపై సజ్జల పరువునష్టం దావా
-
అసత్య కథనాలపై ఆగ్రహం.. ఎల్లోమీడియాపై సజ్జల పరువు నష్టం దావా
సాక్షి, అమరావతి : టీడీపీ నేతలు, ఎల్లోమీడియాపై వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ‘ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం’ పేరుతో ఎల్లోమీడియా అసత్య కథనాలు ప్రచురించడమే కాకుండా, టీవీ ఛానల్స్‌లోనూ దుష్ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అసత్య కథనాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈనాడుతో పాటు, ఆ కథనం ఆధారంగా టీడీపీ ఆఫీసులో మాట్లాడిన వర్ల రామయ్యపై సజ్జల పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే అందరికీ లీగల్ నోటీసులు పంపించారు. -
‘ఈనాడు’ తప్పుడు రాతలు.. సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: ‘ఈనాడు’ తప్పుడు రాతలను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ముంబై నటికి వేధింపుల కేసులో తన పేరు ప్రస్తావనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు.‘మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన మీడియా కొత్త పన్నాగం మొదలు పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు.’’ అని సజ్జల మండిపడ్డారు.‘‘ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం’.. ‘అంటూ ఈనాడు పత్రిక రాసిన కథనం కూడా ఆ కోవలోనిదే. ఆ పత్రిక రాసిన కథనాన్ని పట్టుకుని టీడీపీ, ఆపార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, మరికొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ కథనం పూర్తిగా అవాస్తవం. అసంబద్ధం. అన్యాయంగా, అడ్డగోలుగా రాశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేలా ఇలాంటి కథనం రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
సజ్జలపై దుష్ప్రచారం.. తీవ్రంగా హెచ్చరించిన వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించిన మీడియా సంస్థపై, వాటి ఆధారంగా విమర్శలకు దిగిన తెలుగు దేశం పార్టీపై వైఎస్సార్సీపీ తీవ్రంగా మండిపడింది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించింది. ‘‘తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే…, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మీ రాజకీయ ప్రత్యర్థులపైన, మీ వ్యతిరేక పార్టీలపైన మీరు ప్రయోగించే అనైతిక సూత్రమే “వ్యక్తిత్వ హననం’’. మీరు నమ్మిన సిద్ధాంతమే ఇది. ఇదీ చదవండి: నారా లోకేష్ లేడుగా.. అందుకే క్యాన్సిల్!.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంపేస్తే దాన్ని ప్రజాస్వామ్యమని రాశారు. బాలకృష్ణ తుపాకీతో కాల్పులు జరిపితే, ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఫీజులను ఒక పారిశ్రామిక వేత్తతో కట్టించి, అది నారా లోకేష్ ప్రతిభ అన్నారు. మహిళలతో అసభ్యంగా తైతక్కలాడితే అవి చిన్ననాటి సరదాలు అంటారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోతే కనీసం వాయిస్ శాంపిల్ ఇవ్వకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు తప్పించుకున్నారు. మీలో నీతి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు, నైతికత ఇసుమంతైనా మీలో కనిపించడం లేదు అంటూ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచింది.‘‘తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి’’రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలా @JaiTDP?తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే…, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మీ రాజకీయ… https://t.co/v8xK6Q3lqe— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
కూటమికి దాడులు ట్రెండ్ అయిపోయింది
-
ఏపీలో అరాచకం తాండవిస్తోంది: సజ్జల
సాక్షి, ఢిల్లీ: ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై వైఎస్సార్సీపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గళం విప్పనుంది. ఈ ధర్నాపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో అరాచకం తాండవిస్తోంది. రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి. వెయ్యికిపైగా దాడులు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు కూడా చేశారు ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారు. .. నిన్న కూడా వైఎస్సార్సీపీ నేతపై దాడి జరిగింది. ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారు.. ఈ అరాచకాలను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నాం’ అని అన్నారాయన. -
ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధమే: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. సమకాలీన చరిత్రను మనం ప్రత్యక్షంగా చూశామని, ఆ సంక్షోభం, ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిందే వైఎస్సార్సీపీ అని గుర్తుచేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడిగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాల మధ్యనే ఈ పార్టీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ రోజు నుంచి కోట్ల మందికి జగన్ ఆశాదీపం అయ్యారన్నారు. వైఎస్సార్‌కి మించి అడుగులు ముందుకు వేసే బిడ్డగా జగన్ ఈ రాష్ట్రానికి 30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని తన ఐదేళ్ల పాలనా కాలంలో అందరూ గర్వపడేలా చేసి చూపించారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే...విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు..రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశాం. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలమెక్కారు. హామీలిచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్‌కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పనిలేకుండా ఆయన పాలించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే ఆయన పరిపాలన అందించారు. ప్రజల్లో మమేకమైన పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నా లోతుకుపోవటం సరైంది కాదు. మరోసారి మోసానికి బాబు శ్రీకారం..ఇక అధికారంలోకి వచ్చి నెల దాటిందో లేదో ఇచ్చిన హామీలు ఇప్పట్లో నెరవేర్చటం కష్టమని అప్పుడే చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన అలవిగాని హామీలిచ్చారు. ఆసాధ్యమైన హామీలిచ్చి 2014లో ప్రజలను ఎలా మోసం చేశారో ఇప్పుడు ఆదే రీతిలో మరోసారి మోసానికి బాబు శ్రీకారం చుట్టారు. ఖజానా ఇంత ఖాళీ అయి ఉంటుంది అనుకోలేదని అప్పుడే చంద్రబాబు అంటున్నారు. ఖజానా బాగాలేదు కాబట్టి హామీలు నెరవేర్చటం కష్టమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇది అత్యంత మోసం, దగా.రాష్ట్రం రావణకాష్టం..అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎలా ఆరాచకం సృష్టిస్తున్నారో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఎలా రావణకాష్టం చేస్తున్నారో, ఎలా దాడులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సామాన్యులు తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఐదేళ్లలో రూపుదిద్దుకున్న ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు గండికొట్టడం ప్రారంభమైంది. వైద్యంలో స్పెషలిస్టు సేవలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లేలా చంద్రబాబు చేస్తున్నారు. మన లోటుపాట్లు సరిదిద్దుకుని ముందుకెళ్దాం. మళ్లీ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దాం. బాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌పైన, వైఎస్సార్సీపీపైన కూటమి నేతలు దాడిచేస్తున్నారు.తాను అమలుచేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని బాబు చూస్తున్నారు. అది జరగకుండా.. మనం ఎక్కడా డీలాపడకుండా కలిసికట్టుగా అడుగులు వేయాలి. ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మనమంతా పునరంకితం అవుదామని శపథం చేద్దాం. ఇందుకు ఇంతకంటే మంచి రోజు, వైఎస్సార్ జయంతిని మించిన రోజులేదు. అనంతరం.. మాజీమంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో.. మాజీమంత్రి జోగి రమేష్, నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, అంబటి మురళీ, మలసాని మనోహర్‌రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చల్లా మధు, కొమ్మూరి కనకారావు, ఎ.నారాయణమూర్తి, బందెల కిరణ్‌రాజ్, న్యాయవాది కొమ్మసాని శ్రీనివాస్‌రెడ్డి, మహిళా నేతలు నారమల్లి పద్మ, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపర భగీరథుడు వైఎస్సార్’ పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు..ఇదిలా ఉంటే.. వైఎస్ జయంతి సందర్భంగా పుత్తా ప్రతాప్‌రెడ్డి ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం నిర్వహించారు. వికలాంగులకు, వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. తొలుత.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు. -
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలి
సాక్షి, అమరావతి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా ఘనంగా నిర్వహిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ జయంతి రోజైన జూలై 8 (సోమవారం)న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో రామకృష్ణారెడ్డి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి వైఎస్సార్ 75వ జయంతి అయినందున రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమాలపై ఇప్పటికే సమాచారం అందించామని తెలిపారు. విగ్రహాలను సిద్ధం చేసి కింది స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. మళ్లీ పార్టీ చైతన్యవంతమై, ప్రజల్లోకి దూసుకుపోయేందుకు ఇది తొలి అడుగులా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఆదేశించారని తెలిపారు.వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్వైఎస్సార్ మరణించి 15 సంవత్సరాలైనా ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఆయన ఆలోచనలనే సిద్ధాంతాలుగా చేసుకుని వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, ప్రజల్లో మమేకమైన నాయకుడు ఎలా ఉండాలో ఆయన ద్వారా నేర్చుకున్నామని తెలిపారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్ ప్రజలతోనే మమేకమై ఉన్నారని, పార్టీ కూడా ఎప్పుడూ ప్రజలతోనే నడిచిందని వివరించారు. వైఎస్సార్ మొదలు పెట్టిన పథకాలకు వైఎస్ జగన్ గత 5 ఏళ్లలో పూర్తి రూపం ఇవ్వడమే కాకుండా, వాటికి మరిన్ని జోడించి వ్యవస్థల్లో మంచి మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో తొలిసారి వైఎస్ జగన్ పేదరికాన్ని పారదోలి, అందరికీ సమాన అవకాశాలను కలిగించేలా పేదలను చేయి పట్టుకుని నడిపిస్తూ, సుస్థిరమైన అభివృద్ధి, అభ్యుదయం దిశగా రాష్ట్రాన్ని నడిపిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదన్నారు. మనం చేసిన మంచి పనుల వల్ల వచ్చిన మార్పులు కళ్ల ముందే కనపడుతున్నాయని తెలిపారు. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకుందని, ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. ఎప్పటికీ ప్రజలతో మమేకమై ఉంటాంపథకాల లబ్ధిదారులంతా ఓటు రూపంలో మనకు అండగా నిలుస్తారనుకున్నామని, కానీ టీడీపీ మోసపూరిత, అమలు సాధ్యం కానీ హామీలను ప్రజలు నమ్మి ఉండొచ్చని, ఇతర కారణాలు కూడా తోడై ఈ ఫలితాలు వచ్చాయని సజ్జల అభిప్రాయపడ్డారు. పోలింగ్ అయిన వెంటనే టీడీపీ రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. -
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..
-
చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..
-
ఏపీలో అమ్ముడుపోయిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ లో కొత్త రూల్స్
-
చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు: సజ్జల
గుంటూరు, సాక్షి: దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నాం వైఎస్సార్సీపీ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దని చెప్పాం’’ అని సజ్జల మీడియాకు వివరించారు.సజ్జల ఇంకా మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల అన్నారు.కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోందిపార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాంఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పాం.10:30 గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం.పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా?ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలను తామే ఉల్లంఘించటమేంటి?దేశం అంతా ఒక రూల్, ఏపిలో ఒక రూల్ ఎంటి?పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు తీసుకు రావడం ఎంటి?ఏపీలో ఒక్క చోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై ప్రత్యేక వెసులు బాటు ఇవ్వడం ఏంటి.?ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు.వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదుఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు.నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు.చంద్రబాబుకు ఉన్న స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయట పెట్టుకున్నారు.బీజేపీ జాతీయ వ్యూహాలను ఎపిలో అమలు చేయాలని చూస్తోందివైసిపి బలమైన పార్టీ ఎవర్నీ రెచ్చగొట్టల్సిన అవసరం లేదు.ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతా యుతంగా ఉన్నాం.సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు.హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యింది.21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వస్తుంది?నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు.పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.నార్తులో బీజేపీ పోతుంది.అందుకే సౌత్‌లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది..సౌత్ లో సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నారు.మేము జనంతో ఉన్నాం జనం మాతో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం.ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా.?చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు. -
కౌంటింగ్ లో రెప్పవాల్చొద్దు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో డ్రామాలాడటం, తప్పుడు లెక్కలు చూపించడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని, సంయమనం కోల్పోకుండా అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ ఏజెంట్లకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన తీరుపై ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఏజెంట్లకు ఆయన వర్చువల్‌గా దిశానిర్దేశం చేశారు. 175 నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు దీనికి హాజరయ్యారు. విశ్రాంత ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే.. రెచ్చగొట్టి ఏమార్చే యత్నాలు.. ప్రతీ ఓటు చాలా విలువైందనే విషయాన్ని ఏజెంట్లు మరచిపోవద్దు. ఎన్నికల నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు పార్టీకి దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి. పోస్టల్ బ్యాలెట్‌పై అధికారి సంతకం విషయంలో అనుమానం వస్తే వెంటనే స్పందించాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ దృష్టి మళ్లించేందుకు చేసే ప్రయత్నాలపై జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనమే గెలుస్తున్నాం. జాతీయ మీడియా సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో ఓ పార్టీ 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పుకొచ్చాయి. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు. ఇలాంటి విద్యలు ప్రదర్శించటంలో చంద్రబాబును మించిన వారులేరు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈవీఎంలపైనా జాగ్రత్త.. ఈవీఎంల కౌంటింగ్‌లో కూడా ధ్యాస పెట్టి జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు వచ్చినవి, ప్రత్యర్థులకు వచ్చినవి, స్వతంత్ర అభ్యర్థులకు లభించిన ఓట్లను సరిగ్గా నమోదు చేసుకుని సంఖ్య సరిచూడాలి. వివరాలు నమోదు చేసుకోకుండా ప్రత్యర్థులు మన దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలి. పోస్టల్ బ్యాలెట్లపై న్యాయ పోరాటం..కౌంటింగ్ రోజు కుట్రలకు కూటమి పథకం వేస్తోంది. మన ప్రత్యర్థులు వ్యవస్థల్లోకి చొరబడి అధికారులను వారికి అనుగుణంగా మలుచుకుంటున్న నేపథ్యంలో ఏజెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ వేళ మనసు లగ్నం చేసి పని చేస్తూ బ్యాలెన్స్ దెబ్బ తినకుండా చూసుకోవాలి. ఒకవేళ అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే రికార్డు అయి తీరాలి. పోస్టల్ బ్యాలెట్ వద్ద సంక్లిష్ట ప్రక్రియ ఉంది. ఇన్ వ్యాలిడ్ ఓటు (చెల్లనివి) పొరపాటున కూడా వ్యాలిడ్ కాకూడదు. వ్యాలిడ్ ఓటు ఇన్ వ్యాలిడ్ అవ్వకూడదు.కౌంటింగ్ విధానంపై అనుమానాలున్నా, కూడికలో తేడా వచ్చినా మళ్లీ చూపించమని అడగవచ్చు. దీన్ని పట్టించుకోకపోతే అబ్జర్వర్ దృష్టికి తేవాలి. పోస్టల్ బ్యాలెట్ కవర్లపై గెజిటెడ్ అధికారి సంతకం చేసి స్టాంప్ వేయాలి. స్టాంప్ వేయకపోతే ఆయన ఎక్కడ పని చేస్తున్నారో స్వయంగా చేతిరాతతో రాసి సంతకం చేస్తే అనుమతించాలని ఈసీ సూచించింది. కానీ ఏపీ సీఈవో మాత్రం చేతితో డిజిగ్నేషన్ (హోదా) రాయకపోతే స్పెసిమన్ సంతకాలు కలెక్ట్ చేసి కౌంటింగ్ అధికారులకు ఇవ్వాలని, ఆ విధంగా చెక్ చేసుకోవాలని తాజాగా ఆదేశాలిచ్చారు. మరి ఈ సంతకం ఎవరిదని తెలుస్తుంది? దీనిపై పార్టీ తరపున అభ్యంతరం చెబుతున్నాం. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఇక్కడ తెచ్చారు. దీనిపై మన పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. సుప్రీం కోర్టులో కేసు వేస్తున్నాం. ఏ తీర్పు వస్తుందనేది సోమవారం నాటికి తెలుస్తుంది. ఒకవేళ రిలీఫ్ వస్తే సంతకంతోపాటు డిటెయిల్స్ కానీ, సీల్ కానీ ఉండాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత రాగానే మళ్లీ తెలియజేస్తాం. బీజేపీ టార్గెట్‌కు అనుగుణంగా ఫిగర్స్ సర్వేల అడ్డగోలు లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. సర్వే సంస్థలు జాతీయ స్థాయిలో బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా ఉంది. అందుకు అనుగుణంగా సర్వే లెక్కలు ఇచ్చుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇండియా టుడే సర్వే చూస్తే మరింత ఆశ్చర్యమేస్తుంది. పొత్తులో ఉంటే చాలు.. పోటీ చేసిన స్థానాల కన్నా ఎక్కువగా ఫలితాల్లో చూపారు. బిహార్‌లో అలాగే చేశారు. మనకు సంబంధించి రెండు ఇచ్చారు. ఒడిశాలో సున్నా ఇచ్చారు. బీజేపీ 400 సీట్ల టార్గెట్‌కు అనుగుణంగా ఫిగర్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఇలా చేసి ఈ రెండు రోజుల్లో వీళ్లు ఏం సాధిస్తారో అర్థం కావట్లేదు. ఈవీఎంలో నమోదైన వాటిని వీళ్లు ఏం చేయగలుగుతారు? అధికారంలో వాళ్ల చేతిలో ఉంది కాబట్టి కౌంటింగ్‌లో ఏమైనా మిస్యూజ్ చేయటానికి అవకాశం ఉందా? అనే డౌట్ వస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబుకి వాళ్ల జోడీ దొరికిన తర్వాత ఏమైనా చేసే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ద్వారా ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఎదుటివారికి ఇబ్బందులు కలిగించడంలో చంద్రబాబు పీహెచ్డీ పొందారు కాబట్టి మనం చాలా చాలా అలర్ట్‌గా ఉండాలి. మన పార్టీ నేతలు కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అందుబాటులో ఉంటారు. -
మళ్లీ ఘన విజయం ఖాయం
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనకు మెచ్చిన ప్రజలు వైఎస్సార్సీపీకి మరోసారి అఖండ విజయాన్ని చేకూరుస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీకి సానుకూలత ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైందని, అవి ఊహించిన దానికంటే అధిక స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోíష్టిగా మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. నిరంతరం మీడియాలో ప్రచారం కోసం వెంపర్లాడే చంద్రబాబు ఘోర ఓటమిని గ్రహించే పోలింగ్ నుంచి ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉండిపోయారని చెప్పారు. బీజేపీ భజన చేసే రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ఎన్డీయేకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని, వాటిని చూసి టీడీపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు. ఈనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటల వరకూ వారు సంబరాలు చేసుకోవచ్చని వ్యంగ్యోక్తులు విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోతే టీడీపీ కార్యాలయంలో శ్మశాన నిశ్శబ్దం నెలకొంటుందని వ్యాఖ్యానించారు. ఈసీని అడ్డుపెట్టుకుని డ్రామాలుప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు ఈసీని అడ్డుపెట్టుకుని డ్రామాలాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఓట్ల లెక్కింపులోనూ అరాచకాలకు పాల్పడేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రల పట్ల వైఎస్సార్సీపీ ఏజెంట్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడిస్తే కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ఎన్డీయే భజన చేశాయని విమర్శించారు. వాటిని చూస్తే నవ్వొస్తోందన్నారు. తమిళనాడులో కాంగ్రెస్ తొమ్మిది చోట్ల పోటీ చేస్తే 13 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానాలోనూ ఉన్న లోక్‌సభ స్థానాల కంటే ఎన్డీయే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించాయన్నారు. తప్పుల తడక లాంటి ఆ ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విశ్వసనీయత లేదని సజ్జల స్పష్టం చేశారు. కచ్చితంగా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. -
కౌంటింగ్‌లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. కాబట్టి మన వాళ్లు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు అని సూచించి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.కాగా, ఎన్నికల కౌంటిగ్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి.పోస్టల్ బ్యాలెట్‌పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానుం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్‌ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనం గెలుస్తున్నాం. నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పారు. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు.ఇలాంటి డ్రామాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందుకే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలి’ అని సూచనలు చేశారు. -
చంద్రబాబుపై రెచ్చిపోయిన సజ్జల
-
విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..
-
టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
సాక్షి,అమరావతి: కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించేలా తెలుగుదేశం కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొడుతున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ట్రైనింగ్ క్యాంపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లను తరిమికొట్టాలని, కౌంటింగ్ ప్రాంతంలో లేకుండా చేయాలని రెచ్చగొట్టేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల నియమావళిపై కనీస అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ అధినేతకు ఓటమి భయం పట్టుకుందని.. కనుకనే అల్లర్లు సృష్టించి ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజా తీర్పును మార్చేందుకు ప్రయతి్నస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఎక్కడా దౌర్జన్యకాండ జరగకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, కఠినంగా వ్యవహరించాలని ముందస్తుగా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మల్లాది విష్ణు మండిపడ్డారు. సజ్జల మాటలను తెలుగుదేశం లీగల్ సెల్ పూర్తిగా వక్రీకకరించి, ఆయనపై తప్పుడు కేసు బనాయించిందని నిప్పులు చెరిగారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదెవరో ఓటర్లకు బాగా తెలుసన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సైకో అని, గొడ్డలి అని, ఘర్షణలు సృష్టించేలా నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, కూటమి టీడీపీ నేతలపై నేటికీ కనీస చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఇచ్చిన దాదాపు వందకి పైగా ఫిర్యాదులు ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ముఖ్యంగా కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్ డ్రా చేసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, వైఎస్సార్సీపీ గ్రీవెన్సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఉన్నారు. -
ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
సాక్షి, అమరావతి: ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్ సీపీ పట్ల పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జూన్ 4న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లు తమవైపే నిలిచారనే విషయం ఎగ్జిట్ పోల్స్‌లో తేలిందన్నారు. శనివారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళలను సమాజంలో ఆత్మగౌరవంతో నిలబెట్టారని, సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు కుటుంబాన్ని నడిపించగల శక్తిని అందించారన్నారు. సీఎం జగన్ వల్లే తమకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో మహిళలు వారి కుటుంబాలు పోలింగ్‌కు పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నారు. ఐదేళ్లలో తమ కుటుంబాల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను గమనించడంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్నారు. ఎక్కువ సైలెంట్ ఓటింగ్ జరగడంతో కొన్ని సర్వే సంస్థలకు వైఎస్సార్ సీపీపై క్షేత్ర స్థాయిలో ఉన్న సానుకూలత కనిపించలేదన్నారు. పాజిటివ్ అజెండా పని చేసింది.. వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం మొత్తం పాజిటివ్ కోణంలో నిర్వహించాం. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగాం. చంద్రబాబు మరోసారి అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ 2014లో మాదిరిగా మోసం చేసేందుకు వస్తున్నాడని గుర్తు చేశాం. టీడీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడారు. సీఎం జగన్ అంతు చూస్తామని, అధికారంలోకి వచ్చేశామంటూ విర్రవీగారు. సొంతంగా పోటీ చేయలేక కూటమి కట్టారు. మా నాయకుడు మాత్రం పాజిటివ్ అజెండాతో ప్రజలను ఓట్లు అడిగారు. పాజిటివ్ అజెండా పని చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈసీ ఒత్తిడికి తలొగ్గితే ఎలా? ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. గతంలో చంద్రబాబు ఏపీ సీఈవోపైకి దండయాత్రలా వెళ్లి బెదిరించలేదా? ఆ తర్వాత ఈవీఎంలు మోసం చేశాయంటూ దు్రష్పచారం నడిపారు. అలాంటి పార్టీకి చెందిన వాళ్లు ఈ రోజు మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పోస్టల్ బ్యాలెట్ విషయలో టీడీపీ గందరగోళం సృష్టించాలని యత్నించింది. ఏ రూల్స్ అవసరం లేకుండా నేరుగా పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవాలన్న టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మేం కోర్టుకెళ్లాం. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మా ఏజెంట్లకు చెప్పాం. తిరస్కరించాల్సిన ఓటును చెల్లుబాటయ్యేలా టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని చెప్పాం. దీనికే నాపై కేసులు మోపడం హాస్యాస్పదం. సుప్రీం కోర్టుకు వెళ్తాం.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం. జూలై 2023లో ఈసీ స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది. అందులో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు, తిరస్కరణ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీల్ లేకుంటే కనీసం హోదా వివరాలైనా రాయాలని ఉంది. పోలింగ్ అయ్యాక అది అవసరం లేదని ఈసీ చెప్పడం అనైతికం. వాళ్లిచ్చిన నిబంధనలను వాళ్లే తుంగలో తొక్కితే ఎలా? చంద్రబాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు. అందుకే చంద్రబాబు కుట్రలు.. గత ఐదేళ్లలో పౌర సేవలు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ప్రజలపై ఉండదనుకుంటే అది భ్రమే. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్ సీపీకి వస్తాయనే భయంతో పవన్, బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్‌తోనూ కలసి ఎన్నికలకు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చి లాభపడాలని నానా గడ్డి కరిచి విష ప్రచారం చేశారు. ఆయన ఇన్ని చేసినా మాపట్ల ప్రజల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. ఇటీవల ఎన్నికల రిగ్గింగ్ మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ కూడా రిగ్గింగ్ జరుగుతున్నట్టుంది. బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు బాగా తగ్గుతుండటంతో దక్షిణాదిలో పెరుగుతున్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వారికి నచ్చిన లెక్కలేసి చెబుతున్నారు. మాకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వైఎస్సార్ సీపీకి కచ్చితంగా అనుకూలించింది. ఐదేళ్లలో మేం ప్రజలకు మంచి చేశాం. టీడీపీకి ఎందుకు అనుకూలంగా సర్వేలు వచ్చాయో వాళ్లు చెప్పగలరా? మరో రెండు రోజులు వారికి నచ్చిన అంకెలు చెప్పుకుంటూ ఆనందం పొందాలంటే పొందొచ్చు. -
వైఎస్సార్సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వైఎస్సార్సీకి అనుకూలంగా ఉందని.. మేం అంచనా వేసిందే ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చాయని.. ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహిళలే కాదు కుటుంబం మొత్తం తమవైపే ఉందన్నారు. ‘‘మా పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. సీఎం జగన్ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల అన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదు. వైఎస్సార్సీపీకి పాజిటివ్ అజెండా కలిసి వచ్చింది. ఈ ఐదేళ్లలో మార్పు వచ్చిందని ప్రజలు నమ్మారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. భారీస్థాయిలో మహిళలు వైఎస్సార్సీపీని మరోసారి ఆదరించారు. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి’’ అని సజ్జల చెప్పారు. -
సజ్జల అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్...దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయ్ బాబు
-
కౌంటింగ్ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
-
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్‌షాప్, జూమ్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి, శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కించే విధానం⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాలి⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణించాలి.⇒ 13– ఏ డిక్లరేషన్‌లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్‌లో పేర్కొన్న బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయకపోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించినప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్ పేపర్లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (ఫారం–20)లో నమోదు చేయాలి. -
మళ్లీ జగనే.. నో డౌట్
-
అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఈసీ అంపైర్‌లా లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్ సోకిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అందుకే ఎన్నికల కమిషన్ అంపైర్‌లా నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని.. పోలింగ్ రోజు నుంచి ఇప్పటివరకూ వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అన్నింటినీ గత ఐదేళ్లూ సీఎం జగన్ అమలుచేశారు. సుపరిపాలన అందించారు.పరీక్షలో వంద శాతం మార్కులు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం పరీక్షలు అలాగే రాశాం. వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యం. వారంలో టీడీపీ పీడ విరగడ కావడం ఖాయం. బహుశ బీజేపీకి ఉత్తరాదిలో కలిసొస్తుందన్న కారణంతో అమిత్ షా దక్షిణాదిలో సీట్లు వస్తాయని చెప్పారేమో. ఉద్యోగులూ సమాజంలో భాగమే. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు.. తమకు అనుకూలంగా ఉన్నట్లు టీడీపీ భ్రమపడుతోంది. గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్‌పై సీరియల్ నంబర్‌లేదని తిరస్కరించారు. ఈసారి ఏమీలేకున్నా పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ వాళ్లే అడుగుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ మార్గదర్శకాలు జారీచేసినా దేశమంతా ఒకేలా ఉండాలి. దేశమంతా ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఇక్కడ కూడా అవే నిబంధనలు అమలుచేయాలి.మాచర్లలో పిన్నెల్లి లక్ష్యంగా కుట్ర..ఇక 15 రోజులుగా మాచర్లలో ఏం జరుగుతోందో అందరూ గమనించాలి. అక్కడి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతోంది. మాచర్ల కేంద్రంగా టీడీపీ, ఎల్లోమీడియా గందరగోళం సృష్టిస్తోంది. నిష్పక్షపాతంగా ఈసీ వ్యవహరించాలన్నదే మా కోరిక. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్ సోకినట్లుగా ఉంది. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరే ఈ అనుమానాలకు కారణం. ఈసీ జోక్యం మాచర్ల కేసులో తీవ్రంగా కనిపిస్తోంది.మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసినట్లుగా ఉన్న వీడియో ఎలా బయటకొచ్చిందో ఈసీ చెప్పడంలేదు. అదే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఆ వీడియోలను బయటపెట్టాలి. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడుల వీడియోలనూ బయటపెట్టాలి. ఈవీఎంలు ధ్వంసమైన పోలింగ్ కేంద్రాల పరిధిలో రిగ్గింగ్‌కు పాల్పడింది కాబట్టే టీడీపీ రీపోలింగ్ కోరడంలేదు. వైఎస్సార్సీపీకి అన్యాయం జరిగింది కాబట్టే ఎమ్మెల్యే పిన్నెల్లి రీపోలింగ్ కోరుతున్నారు.పదిరోజులు ఆ సీఐ నిద్రపోయారా?ఇక ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇవ్వగానే.. పోలింగ్ మరుసటి రోజు అంటే ఈనెల 14న జరిగిన అల్లర్లలో తన తలకు గాయమైందని.. ఆ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారని పది రోజుల తర్వాత సీఐ కేసు పెట్టడమేంటి? పది రోజులూ సీఐ ఎక్కడ నిద్రపోయారు? ఆ సీఐ తరఫున ప్రైవేట్ లాయర్ ఎలా వాదిస్తారు? ఇందుకు ఈసీ ఎలా అనుమతిస్తుంది. పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. అందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దించారు.అలాగే, మాచర్లలో పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేశారు. కారంపూడిలో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఆస్తులపై టీడీపీ రౌడీలు ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడితే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంలో ఆంతర్యమేమిటి? పోలింగ్ అయిపోయిన తరువాత బైండోవర్, రౌడీషీట్లు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఇదంతా తాత్కాలికమే. ఫలితాల అనంతరం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. గీత దాటి పక్షపాతంగా వ్యవహరిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.కౌంటింగ్ సమయంలో ఈసీ నిష్పక్షపాతంగా ఉండాలిచంద్రబాబు గతంలో ఎన్నికల కమిషన్‌పై ఎలా దాడికి వెళ్లారో చూశాం. వైఎస్ జగన్ ఎప్పుడూ ఈసీపై చంద్రబాబులా వ్యవహరించలేదు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. కౌంటింగ్ సమయంలోనైనా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మేం కోరుతున్నాం. కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.గోబెల్స్ ప్రచారం చేసి.. వ్యక్తిత్వ హననానికి పాల్పడి.. బెదిరించి అధికారులను లొంగదీసుకుని తమ వైపు తిప్పుకునేలా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయం. ఎన్నికల సమయంలో చీఫ్ సెక్రటరీ (సీఎస్)ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయనపై అభూతకల్పనలతో తప్పుడు కథనాలు అచ్చేసి.. వాటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది. -
కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వరాదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, రీజనల్ కో–ఆర్డినేటర్లతో మంగళవారం ఆయన తాడేపల్లి నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఈసీ అనుసరిస్తున్న తీరు, అధికార యంత్రాంగంపై అనుమానాలున్న నేపథ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ⇒ ప్రజల ఆదరాభిమానాలతో వైఎస్సార్సీపీ తిరిగి విజయం సాధించబోతోంది. కాబట్టి మరింత జాగరూకత అవసరం. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలుంటే వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను 31వ తేదీలోగా ఇవ్వాలి. పారీ్టకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలి. ⇒ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని కుయుక్తులు పన్నుతున్నందున నియమ నిబంధనలు కచి్చతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఏజెంట్లదే. పోస్టల్ బ్యాలెట్, ఇతర అంశాలపై ఈసీ గైడ్‌లైన్స్‌కు భిన్నంగా ఆదేశాలు ఇవ్వమని కూడా ఈసీపై ఒత్తిడి చేస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతాలలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ⇒ కౌంటింగ్ ఏజెంట్ల నియామకం రెండు రోజుల్లో పూర్తి చేయాలి. కౌంటింగ్ ప్రారంభ సమయంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. ఫైనల్ గా డిక్లరేషన్ తీసుకునే వరకు అప్రమత్తంగా ఉండాలి. ⇒ సీఎం జగన్ తిరిగి విజయం సాధించాలని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో ఏజెంట్లు కూడా ప్రతి టేబుల్ దగ్గరా అంత పట్టుదలగా ఉండాలి. ఈ నెల 29వ తేదీనాటికి కౌంటింగ్ ఏజెంట్ల ఫార్మాట్లో పేర్లు, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందించాలి. మన ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలో ముందుగా తెలుసుకోవాలి. ⇒ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చాలా అప్రమత్తత అవసరం. వీటివల్లే గతంలో గుంటూరులో వేలాది ఓట్లు మనపార్టీ నష్టపోవాల్సి వచి్చన విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
ఈసీకి చంద్రబాబు వైరస్
-
ఈసీ అంఫైర్‌లా వ్యవహరించలేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు. -
టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?
సాక్షి, అమరావతి: అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు సాక్ష్యాలున్నా చర్యలెందుకు తీసుకోవట్లేదని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించారు. అలాగే పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమం (ఎక్స్)లో పోస్టు చేశారు. ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైనదేనా? కాదా? అనేది నిర్ధారించకుండానే ఈసీ చర్యలకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచి్చంది? మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఎన్నికల కమిషనే చెబుతోంది.అలాంటప్పుడు కేవలం ఈ ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేశారు? ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను.. 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలను ఎందుకు బయటపెట్టట్లేదు? ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటకు ఎలా వదిలారు?అన్ని వీడియోలు బయటకు వస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది కదా! తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?’ అని సజ్జల ప్రశి్నంచారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సజ్జల చెప్పారు.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని నిలదీశారు. టీడీపీ మూకల రిగ్గింగ్‌లపై తాము ఫిర్యాదు చేసిన అన్నిచోట్లకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు కచి్చతంగా ఉందన్నారు. మాచర్లలో ప్రజాబలమున్న పిన్నెల్లి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. ఐదోసారి కూడా గెలవబోతున్నారని చెప్పారు. ఏదో నలుగురు అధికారులను మేనేజ్ చేసి.. అవసరమైనంత వరకే వీడియోను కట్ చేసి.. దొంగ వీడియోలను లీక్ చేసి.. కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదన్నారు. -
ఈసీకి సజ్జల 10 ప్రశ్నలు
-
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది? -
కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది