సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment