Polling Agents
-
కౌంటింగ్‌లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. కాబట్టి మన వాళ్లు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు అని సూచించి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.కాగా, ఎన్నికల కౌంటిగ్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి.పోస్టల్ బ్యాలెట్‌పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానుం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్‌ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనం గెలుస్తున్నాం. నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పారు. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు.ఇలాంటి డ్రామాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందుకే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలి’ అని సూచనలు చేశారు. -
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం
Counting Updates అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్ ఫిగర్ స్థానాలు 30పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్మేజిక్ ఫిగర్ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ ప్రేమ్ సింగ్ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్‌సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్కస్థానంలో లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో లీడింగ్10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో గెలుపు29 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి చెందారు. శుక్రవారం నాడు ఏర్పడిన అత్యధిక ఉష్ణోగ్రతలకు తాళలేక జనం విలవిలలాడిపోయారు. ఈ నేపధ్యంలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన 15 మంది పోలింగ్ సిబ్బంది కన్నుమూశారు. ఈ వివరాలను ఎన్నికల అధికారులు తెలిపారు. యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో 13 మంది ఎన్నికల సిబ్బంది ఎండి వేడిమి కారణంగా తీవ్ర జ్వరం, అధిక రక్తపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 23 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోన్‌భద్ర జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు ఈరోజు (శనివారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటర్లు ఎండవేడిమికి గురికాకుండా ఉండేందుకు పలు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పారామెడికల్ సిబ్బందిని, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచారు. ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని, వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవాలని అధికారుల సూచించారు. -
రేపే చివరి విడత పోలింగ్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రేపు(శనివారం) చివరి(ఏడో)విడత పోలింగ్ జరగనుంది. ఈమేరకు ఏడో విడత పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడో విడతలో భాగంగా 57 లోక్ సభ స్థానలకు పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. రేపు(శనివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10.06కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్లమంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళ ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రముఖుల స్థానాలుప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( వారణాసి), బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ (మండి) స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీరితో పాటు పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. -
అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ముగిసిన ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Updatesముగిసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశంమహబూబాబాద్ 2 గంటల వరకు పోలింగ్ శాతంపురుషులు: 10745మహిళలు: 6462మొత్తం: 17207శాతం: 49.26% సూర్యాపేట జిల్లా :ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ 2 గంటల వరకు 52.8 శాతంMale: 17968Female: 9220Total: 27188యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో 2 గంటల వరకు 47.92 శాతం నమోదుపురుషులు:9673మహిళలు: 6659మొత్తం: 16332శాతం: 47.92 జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మధ్యాహ్నం 2:00 గంటల వరకు 49.66% పోలింగ్ నమోదు వరంగల్ జిల్లా వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు పోలింగ్ శాతం 30.18 %జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:00 గంటల వరకు 28.38% పోలింగ్ నమోదుమహబూబాబాద్ జిల్లా:వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు 28.49 పోలింగ్ శాతం నమోదుహనుమకొండ: ప్రశాంతంగా కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్మధ్యాహ్నం 12గంటల వరకు హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 32.90యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71 శాతం నమోదు పురుషులు: 5902మహిళలు: 3543 మొత్తం: 9445 నల్లగొండ జిల్లా:జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 పోలింగ్ శాతం నమోదునల్గొండ:సూర్యాపేట జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం 31.27%పురుషులు: 10813మహిళలు: 5290మొత్తం: 16103 నల్గొండ:మిర్యాలగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు.నల్గొండ:తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్నల్లగొండ:నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు గన్ మెన్ కేటాయింపునార్కెట్పల్లి గొడవ నేపథ్యంలో అధికారుల నిర్ణయంవరంగల్:మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణపోలీసులకు ఓటు వేయాలని ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ200 మీటర్ దూరం లో ఉన్నాం మీ కు ఇబ్బంది ఇంటి అని పోలీసుల తో వాగ్వివాదంనల్లగొండ ఎన్జీ కాలేజ్ లో అధికారుల నిర్లక్ష్యంవికలాంగులు ఓటేసేందుకు కనీస సౌకర్యాలు లేని వైనంమేమేం చేయాలి చైర్లు లేకపోతే అంటూ సిబ్బంది సమాధానంఇబ్బందులు పడుతోన్న వికలాంగులు నల్లగొండ నార్కెట్‌పల్లి లో ఓ షెడ్డులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట స్వతంత్ర అభ్యర్థి అశోక్ నిరసనస్టేషన్ ఎదుట బైఠాయించిన అశోక్ సూర్యాపేటలో 11 శాతం పోలింగ్..సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ ఎన్నికలో పది వరకు గంటల పోలింగ్ శాతం:Male: 4258Female: 1570Total: 5828Percentage: 11.32% నల్లగొండ:నార్కెట్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తతఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ఇరు వర్గాల మధ్య వాగ్వాదంపోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ: సూర్యాపేట: గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 459 బూత్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్:మహబూబాబాద్ లోని 178వ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్: జనగామ ప్రెస్టన్ కళాశాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఖమ్మంఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా చర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది.చర్ల మండలం లో మొత్తం 1122 ఓటర్లు ఉన్నారు.వీరికోసం చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.గ్రాడ్యుయేట్ లు కూడా అర్ధ రాత్రి వరకు రాజకీయ పార్టీల నేతల రాక కోసం ఎదురు చూశారు.కొంతమంది నాయకులు గ్రాడ్యుయేట్ లను కలిసి అన్ని చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిమూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు వరంగల్:హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు నల్లగొండ:మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వరంగల్:పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోందిహనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిసూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చున్నారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంవరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులువరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారువీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌నేడు వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు -
టీఎంసీకి బూత్ ఏజెంట్ ప్రచారం.. పట్టుకున్న బీజేపీ ఎంపీ
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. హుగ్లీలో టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న బూత్ ఏజెంట్‌ను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీ బూత్ ఏజెంట్‌కు డబ్బులు ఇచ్చి, ఒక ఆశా వర్కర్‌ను బూత్‌లో కూర్చోబెట్టారని లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. ఆ ఆశా వర్కర్ బూత్‌లోకి వచ్చిన ఓటర్లతో టీఎంసీకి అనుకూలంగా ఓటువేయాలని కోరుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ మహిళ తృణమూల్ ఏజెంట్ అని లాకెట్ చటర్జీ పేర్కొన్నారు.ఆ మహిళను పట్టుకుని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదని ఆమె అన్నారు. దీనిపై బూత్ ఏజెంట్‌ను ప్రశ్నించగా, ఆమె ఓటర్లు క్యూలో నిలుచునేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బూత్ వద్ద ఎక్కువ మంది ఓటర్లు లేరని లాకెట్ చటర్జీ తెలిపారు. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు. -
ఫోను వెలుగులో పోలింగ్ పార్టీల అవస్థలు!
దేశంలో దాదాపు నెల రోజుల పాటు వివిధ దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసే పోలింగ్ పార్టీలు పలు అవస్థలను ఎదుర్కొంటున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో పోలింగ్ నిర్వహణ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని సదర్ నియోజక వర్గం పరిధిలోగల పలు పోలింగ్ బూత్‌లలో పనిచేస్తున్న పోలింగ్ సిబ్బంది మీడియాకు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కొన్ని చోట్ల కరెంటు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఫోన్ల టార్చ్ వెలుతురు సాయంతో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల నీటి కుండల స్టాండ్లు మాత్రమే ఉన్నాయని, నీటి కుండలు మాత్రం లేవని వాపోయారు. పైఅధికారులకు చెప్పినా ఫలితం లేదని వారు వాపోతున్నారు.సదర్ అసెంబ్లీ పోలింగ్ కేంద్రమైన బూత్ 31వ బూత్ ప్రిసైడింగ్ అధికారి మహ్మద్ ఇబ్రహీం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఐదు నిమిషాలకు విద్యుత్ ట్రిప్ అవుతోందని, దీంతో పోలింగ్‌కు ఏర్పాట్లు సరిగా చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. బూత్ నంబర్ 39 ప్రిసైడింగ్ అధికారి కమత ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ ఉన్నా బల్బులు లేవని అన్నారు. దీంతో కొవ్వొత్తులు లేదా మొబైల్ టార్చ్‌లతో పోలింగ్‌కు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. -
టీడీపీ గుండాలు ప్రాణం తీశారు!
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఓటమిని ఊహించి.. ఎన్నికల పోలింగ్ రిగ్గింగ్‌కు ప్రయత్నించింది. ఈ క్రమంలో హింసకు తెర లేపింది. వైఎస్సార్సీపీ నేతలను, పోలింగ్ ఏజెంట్లను, కార్యకర్తలను, పార్టీ సానుభూతిపరుల్ని.. ఆఖరికి ఓటేసిన వాళ్లను సైతం వదలకుండా దాడులకు తెగబడింది. ఈ క్రమంలో శ్రీకాకుళంలో టీడీపీ గుండాల చేతిలో ఓ నిండు ప్రాణం బలైంది. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ తండ్రి ఒకరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాధితుల్ని తోట మల్లేశ్వరరావుగా పోలీసులు ప్రకటించారు. దాడికి పాల్పడింది టీడీపీ నేత అచ్చెన్నాయుడి అనుచరగణమేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయితీ బూత్-228లో మాధవరావు అనే వ్యక్తి వైఎస్సార్సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించారు. అయితే మాధవరావు కుటుంబాన్ని టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. గురువారం గుడిలో పూజ చేస్తుండగా మాధవరావు తండ్రి మల్లేష్‌పై అచ్చెన్నాయుడి వర్గీయులు దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ రావును శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మల్లేష్ కన్నుమూశారు. తన తండ్రి మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని మాధవరావు డిమాండ్ చేస్తున్నారు. -
CM YS Jagan and YS Bharathi: పులివెందులలో ఓటేసిన సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
AP Assembly Elections 2024: ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పోలింగ్ సామాగ్రి తరలింపు కోసం అధికారులు బిజీ (ఫొటోలు)
-
ఆ బూత్‌లో 9 గంటలకే 100 శాతం పోలింగ్!
ఈరోజు (మంగళవారం) దేశంలో లోకసభ ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే ఒక పోలింగ్ బూత్‌లో ఉదయం 9 గంటలకే వందశాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పోలింగ్ కేంద్రం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది.వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని షెర్దాండ్ పోలింగ్ స్టేషన్ నంబర్ 143లో మొత్తం ఐదుగురు ఓటర్లు తమ ఓటు వేశారు. దీంతో ఇక్కడ 100 శాతం పోలింగ్ పూర్తయ్యింది. ఎంపీని ఎన్నుకునేందుకు వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.షెర్దాండ్ పోలింగ్ కేంద్రం కొరియా జిల్లాలోని సోన్హట్ జన్‌పాడ్ పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. ఐదుగురు ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, ఉదయం 9కే 100 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే, సీఈవో డాక్టర్ అశుతోష్ చతుర్వేది, అదనపు కలెక్టర్ అరుణ్ మార్కం, ఎస్డీఎం రాకేష్ సాహు తదితర జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటర్లకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే కృతజ్ఞతలు తెలిపారు.వనాంచల్ ప్రాంతంలోని షెర్దాండ్‌లో మొత్తం ఐదుగురు ఓటర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు. ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడికి చేరుకోవడానికి పక్కా రోడ్లు లేవు. గ్రామపంచాయతీ చందా నుంచి పోలింగ్ పార్టీలు ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని, ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాయి. -
పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు.. ఒక పోలీసు మృతి!
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలలోని 336 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఇవి ఎంతో కీలకం కానున్నాయి. కాగా మూడు ప్రావిన్సుల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడు ప్రాంతాల్లో పోటీకి దిగిన అభ్యర్థులు మృతి చెందిన నేపధ్యంలో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో ఎన్ఏ-8 (బజౌర్), పీకే-22 (బజౌర్), పీకే-91 (కోహట్), పీపీ-266 (రహీమ్ యార్ ఖాన్) ఉన్నాయి. ఇదిలా ఉండగా పాక్‌లోని ట్యాంక్ ఏరియాలోని ఒక పోలింగ్ బూత్‌పై దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందాడు. ఈ సమాచారాన్ని ఏఆర్వై న్యూస్ వెల్లడించింది. -
పోలింగ్‌లో గందరగోళం.. పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు మాయం!
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభించే ముందు బ్యాలెట్ పేపర్లు కలిగిన బ్యాగులను అధికారులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు ఎన్నికల కేంద్రాల వద్ద ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ పత్రాలు ఉన్న బ్యాగులను తెరిచి చూడగా వాటిలో కొన్ని చిరిగిపోయి ఉండగా, మరికొన్ని బ్యాలెట్ పత్రాలు కనిపించకుండా పోయాయి. కరాచీ ఎన్నికల అధికారి దీనిపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేసేందుకే ఈ బ్యాలెట్ పత్రాలను ఎవరో మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ ప్రారంభించేముందు పాక్ ఎన్నికల సంఘం ఈ బ్యాలెట్ పత్రాలను వివిధ ఎన్నికల కేంద్రాలకు పంపింది. వాటిని పంపే సమయంలో బ్యాలెట్ పేపర్లు చినిగిపోయిన విషయాన్ని పాక్ఎన్నికల సంఘం గమనించలేదా? లేక దారిలో ఎవరైనా ఇలా చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కాగా ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
పోలింగ్ బూత్‌లో కుప్పకూలిన ఏజెంట్.. గుండెపోటుతో మృతి?
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. పాలి జిల్లాలో ఓ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ శనివారం ఉదయం పోలింగ్ జరుగుతుండగా కుప్పకూలిపోయాడు. సుమేర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 47లో శాంతిలాల్ అనే పోలింగ్ ఏజెంట్ కుప్పకూలినట్లు పోలింగ్ అధికారి తెలిపారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలింగ్ ఏజెంట్ మృతికి గుండెపోటు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే మృతి చెందిన పోలింగ్ ఏజెంట్ పార్టీకి సంబంధించినవారు అనే వివరాలు వెంటనే తెలియరాలేదు. కాగా రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగున్నాయి. కరణ్‌పూర్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. -
సిరా చుక్క..దానికో లెక్క
ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు కనిపించడం మామూలే. ఈ సిరా వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. ఓటు వేసిన వ్యక్తి మళ్లీ ఓటు వేయకుండా ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి 1962 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది. దొంగఓట్లు వేయకుండా కట్టడి చేసేందుకు సిరా గుర్తు పద్ధతి సత్ఫలితాలనిస్తోందనే చెప్పాలి. సాక్షి, హైదరాబాద్: సిరా చుక్క.. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా అదే. ఎన్నికల్లో ఉపయోగించే సిరాను చెరగని సిరా (ఇండెలబుల్ ఇంక్) అంటారు. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్ మార్కర్లను తీసుకొచ్చారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమచేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. ఎన్నికలు.. పోలియో డ్రాప్స్.. ఎన్నికల వేళ కీలకంగా మారిన సిరాను భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) ఒకటైతే, హైదరాబాద్‌లోని రాయుడు లే»ొరేటరీస్ మరొకటి. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా, ప్రపంచంలోని దాదాపు వందదేశాలకు దేశాలకు రాయుడు లేబొరేటరీస్ తయారు చేస్తోన్న సిరా సరఫరా అవుతోంది. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండటం వల్ల ఇంకు గుర్తు 3–4 రోజుల వరకు చెరిగిపోదు. ఈ ఇంక్‌ను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు పోలియో చుక్కలు వేసే సమయంలోనూ గుర్తుపెట్టేందుకు ఉపయోగిస్తున్నారు. -
మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్
ఐజ్వాల్: అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), విపక్ష జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య తీవ్రపోటీకి వేదికగా నిలిచిన మిజోరం శాసనసభ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 40 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం మేరకు 77.39 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్.లియాంజెలా చెప్పారు. సవరించిన తుది ఫలితాలు బుధవారం వచ్చేసరికి పోలింగ్ శాతం 80 శాతాన్ని తాకొచ్చు. 18 మంది మహిళలు సహా మొత్తంగా 174 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 8.57 లక్షల ఓటర్లు ఉన్నారు. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 84.49 శాతం, ఐజ్వాల్ జిల్లాలో అత్యల్పంగా 73.09 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 7,200 భద్రతా సిబ్బందిని నియోగించారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ఓటేయబోతే మొరాయించింది ఐజ్వాల్‌లోని ఒక ఈవీఎం ఏకంగా ముఖ్యమంత్రినే రెండోసారి పోలింగ్‌కేంద్రానికి రప్పించింది. మొదటిసారి మొరాయించడమే ఇందుకు కారణం. ర్యామ్హ్యూన్ వెంగ్లాయ్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఉదయాన్ని ముఖ్యమంత్రి జోరామ్‌థంగా విచ్చేశారు. అప్పుడే ఈవీఎం మొరాయించింది. చేసేదేం లేక ఇంటికి వెనుతిరిగారు. మళ్లీ 9.40 గంటలకు వచ్చి ఓటేశారు. ‘ ఈసారి కనీసం 25 చోట్ల గెలుస్తాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లాల్సావ్తా ఐజ్వాల్ వెస్ట్–3 నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 96 ఏళ్ల అంధుడు పూ జదావ్లా పోస్టల్ బ్యాలెట్‌ను కాదని స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. పోలింగ్ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేశారు. రాకపోకలను ఆపేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 81.61 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. డిసెంబర్ మూడో తేదీన ఓట్లలెక్కింపు ఉంటుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. విపక్ష జెడ్పీఎం ఎనిమిది చోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో, కాంగ్రెస్ ఐదు చోట్ల విజయబావుటా ఎగరేశాయి. ‘ఈసారి పట్టణప్రాంతాల్లో జెడ్పీఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్ఎఫ్ ఎక్కువ సీట్లు గెలవొచ్చు’ అన్న విశ్లేషణలు వినిపించాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో 71% పోలింగ్
రాయ్‌పూర్/చర్ల: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలి అంకానికి మంగళవారం ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలు శ్రీకారం చుట్టాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకుగాను తొలి విడతలో 20 నియోజకవర్గాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదింటికి అందిన సమాచారం మేరకు 71.48శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలను నక్సల్స్ నిషేధించడం, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత వంటి సమస్యలున్నా పోలింగ్ 70 శాతాన్ని మించడం విశేషం. మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించడంతో ముందుజాగ్రత్తగా మధ్యాహ్నం మూడింటి వరకే పోలింగ్‌ను అనుమతించారు. వేరే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరి ఉండటంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి. తొలి దశలో 20 నియోజకవర్గాల్లో 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 16 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత రమణ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్ దీపక్, ముగ్గురు రాష్ట్ర మంత్రుల పోటీచేస్తున్న స్థానాల్లోనూ పోలింగ్ జరిగింది. రాజ్‌నంద్‌గావ్ నుంచి బరిలో నిల్చిన రమణ్ సింగ్ తన స్వస్థలం కవర్ధాలో ఓటేశారు. ‘ ఈరోజు పోలింగ్ జరిగిన 20 స్థానాలకు 14 చోట్ల బీజేపీదే విజయం’ అని రమణ్‌సింగ్ అన్నారు. బస్తర్ డివిజన్లో ఏడు జిల్లాల పరిధిలోని 126 గ్రామాల్లో స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారిగా ఆయా గ్రామాల్లో ఏర్పాటైన పోలింగ్ కేంద్రాల్లో గ్రామస్తులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకప్పుడు నక్సలైట్ జీవితం గడుపుతూ అమ్‌దాయ్ ఏరియా కమాండర్‌గా ఉన్న మాజీ మహిళా నక్సలైట్ సుమిత్రా సాహూ తొలిసారిగా ఓటేశారు. 34 ఏళ్ల సుమిత్రా నక్సలిజం వీడి 2019లో పోలీసు శాఖలో చేరి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజ్‌నంద్‌గావ్ పరిధిలోని రామ్‌నగర్ పోలింగ్ స్టేషన్లో ఒక ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటర్లు భారీ క్యూలో చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. దేశంలో తొలిసారిగా.. అంతాగఢ్ నియోజకవర్గంలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏడువర్ణాల్లో ‘రెయిన్బో’ మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. రెయిన్బో పోలింగ్‌బూత్‌లు ఏర్పాటుచేయడం దేశంలోనే తొలిసారి. ఇక్కడ భద్రత కోసం నలుగురు ట్రాన్స్‌జెండర్ పోలీస్ సిబ్బందిని నియమించడం విశేషం. పూర్తిగా మహిళా సిబ్బందితో 200 ‘సంఘ్వారీ’ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. 20 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులైన సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్, మాజీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబు ఐజ్వాల్ సౌత్–2 నియోజకవర్గంలోని పోలింగ్‌కేంద్రంలో ఓటు వేశారు. దద్దరిల్లిన బస్తర్ ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత పోలింగ్ సందర్భంగా మావోయిస్టులు రెచ్చిపోయారు. నాలుగుచోట్ల భద్రతాబలగాలతో ఎదురుకాల్పులకు దిగారు. ఒక మందుపాతర పేల్చారు. సుక్మా జిల్లా తొండామర్కా క్యాంపు సమీపంలోని ఎల్మగుండ వద్ద మావోలు అమర్చిన మందుపాతరపై పొరపాటున కాలుమోపిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో శ్రీకాంత్ గాయపడ్డారు. కాగా, చింతగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కాంకేర్ జిల్లా బందే పోలీస్‌స్టేషన్ పరిధిలోని పనావర్ గ్రామం సమీపంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలి నుంచి ఒక ఏకే–47 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బిజాపూర్, సుక్మా జిల్లా బందా, నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, బలగాలకు మధ్య స్వల్ప ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. -
3 రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడంతో స్టాక్ సూచీల 3 రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా, యూరప్ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్‌లో 383 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 64,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 94 పాయింట్ల పరిధిలో కదలాడింది. ఆఖరికి ఐదు పాయింట్ల నష్టంతో 19,407 వద్ద నిలిచింది. చైనా అక్టోబర్ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు డేటా వెల్లడికావడంతో ఆసియాలో ఒక్క తైవాన్ తప్ప మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు 2% నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన, ఇంధన షేర్ల పతనంతో యూరప్ మార్కెట్లు ఒకశాతం మేర పతనమయ్యాయి. హోనాసా కన్జూమర్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.324) వద్దే లిస్టయ్యింది. చివరికి 4% లాభంతో రూ.337 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,848 కోట్లుగా నమోదైంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ చివరిరోజు నాటికి 73.15 రెట్లు సబ్స్క్రయిబ్ అ య్యింది. 5.77 కోట్ల ఈక్విటీలను జారీ చేయగా 422 కోట్ల ఈక్విటీలకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ కోటా 173.52 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్ల కోటా 84.37 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 16.97 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
మిజోరంలో నేడే పోలింగ్
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మధూప్ వ్యాస్ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. 149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్‌లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు. -
నేడు ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ
సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సిద్ధమైంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. తొలి దశలో పోలింగ్ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.] మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లకు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) చెప్పారు. పది నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగా(సీఏపీఎఫ్)లున్నాయి. తొలిదశలో బరిలో ఉన్న అభ్యర్థులలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత కేబినెట్లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ సహా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్‌లు బరిలో ఉన్నారు. తొలిదశలోని 20 స్ధానాల్లో ముఖ్యంగా చిత్రకోట్, రాజ్‌నంద్‌గావ్, కవర్ధా, కొండగావ్, కొంటా, కేశ్కాల్, నారాయణ్‌పూర్, బిజాపూర్, అంతాగఢ్, దంతెవాడ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ మాజీ సీఎం రమణ్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ల మధ్య నెలకొంది. రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ సీటు రమణ్ సింగ్‌కు బలమైన కోటగా పరిగణిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఈ స్థానం నుంచి గెలుపొందారు. రమణ్‌సింగ్‌కు పోటీగా కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. చిత్రకోట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వినాయక్ గోపాల్ దీపక్‌కు సవాల్ విసిరారు. కొండగావ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ మార్కంకు కాంగ్రెస్ మళ్లీ టికెట్ ఇవ్వగా.. రమణ్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లతా ఉసేందిని బీజేపీ రంగంలోకి దింపింది. కవార్ధా అసెంబ్లీ స్థానం నుంచి భూపేశ్ బఘేల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహమ్మద్ అక్బర్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, అక్బర్‌ను ఓడించేందుకు బీజేపీ విజయ్ శర్మను రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ఒడిశా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కొంట అసెంబ్లీ 24 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అదీనంలో ఉంది. కొంటా నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కవాసీ లఖ్మాను కాంగ్రెస్ పోటీకి దింపింది. -
పోలింగ్‌కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
బాబాల మాయలో మధ్యప్రదేశ్ సర్కార్? ‘ఓట్ల ఆశీర్వాదం’ కోసం పడిగాపులు?
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మత గురువుల ప్రాధాన్యత అంతకంతకూ పెరిగిపోతోంది. రాజకీయ పార్టీలు బాబాల దయ కోసం వెంపర్లాడుతున్నాయి. కొందరు బాబాలు అధికార పక్షం వారిని ఆశీర్వదిస్తుండగా, మరికొందరు బాబాలు ప్రతిపక్షాలపై ఆశీస్సులు కురిపిస్తున్నారు. సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ నుంచి శివరాజ్ సింగ్ వరకు బాబాల వైభవాన్ని కొనియాడుతున్నారు. బాబాలకు భక్తులుగా మారేందుకు పోటీ పడుతున్నారు. కొన్నిసార్లు కమల్‌నాథ్.. బాగేశ్వర్ ధామ్‌లోని ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో కనిపిస్తుండగా, మరికొన్నిసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్.. ప్రదీప్ మిశ్రా ఆశ్రమంలో సేదతీరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాబాల ఆధిపత్యం అధికంగా కనిపించింది. ఇప్పటి (2023) విషయానికొస్తే కొత్త బాబాలు చాలామంది పుట్టుకు వచ్చారు. ఈ జాబితాలో కంప్యూటర్ బాబా, బాగేశ్వర్ ధామ్ సర్కార్, ప్రదీప్ మిశ్రా, పండోఖర్ సర్కార్, జయ కిషోరి, రావత్పురా సర్కార్, సంత్ రవిశంకర్, కమల్ కిషోర్ నాగర్ తదితరులు ఉన్నారు. వీరిని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీకి హిందుత్వ అనే ట్యాగ్‌లైన్ ఉంది. కాంగ్రెస్ లౌకిక పార్టీ.. అయినా కమల్ నాథ్ మతతత్వవాది. చింద్వారాలో బాబా బాగేశ్వర్‌ను తరచూ కలుస్తుంటారు. ఈ బాబాతో కలిసి హెలికాప్టర్లో తిరుగుతూ చాలాసార్తు కనిపించారు. ఈ బాబా కాంగ్రెస్‌కు మద్దతి ఇచ్చినా, బీజేపీకి కూడా వత్తాసు పలుకుతుంటారు. ఛతర్పూర్ ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది నిత్యం బాబాల సేవలో ఉంటారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతి కార్యక్రమంలో బాబాలను సన్మానిస్తుంటారు. బాబా బాగేశ్వర్ నుండి రుద్రాక్ష్ బాబా (ప్రదీప్ మిశ్రా) వరకు అందరూ బీజేపీని ఆశీర్వదించారు. అయితే ఈ బాబాల ఆశీస్సులను కాంగ్రెస్ కూడా కోరుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త జయ కిషోరిని కూడా తమ వైపునకు తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. కాగా మత ప్రచారకుల మొగ్గు బీజేపీ వైపు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్.. మత పెద్దల ఆశీర్వాదాలను కోరుకుంటోంది. ఈ విధంగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని ఆ పార్టీ తాపత్రయ పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఖలీద్ మషాల్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి? -
బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి..
కలకత్తా: బెంగాల్లో నేడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు కాగా.. ఒకరు చొప్పున బీజేపీ, మరో ఇద్దరు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలే ఈ ఘటనలకు కారణమని అన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఉదయాన్నే 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఈ క్రమంలో అల్లర్లకు కేంద్ర స్థానమైన ముషీరాబాద్ జిల్లాలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీని దుండగులు హత్య చేశారు. అదే జిల్లాలోని రేజినగర్ ప్రాంతంలో టీఎంసీకి చెందిన మరో కార్యకర్త బాంబు దాడిలో మరణించగా.. ఖార్గ్రామ్ ఏరియాలో మరో కార్యకర్త మృతి చెందాడు. కూచ్ బిహార్ జిల్లాలో బీజేపీకి చెందిన మాదవ్ బిశ్వాస్ అనే కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. తూర్పు బర్దమాన్ జిల్లాలో సీపీఐఎమ్కు చెందిన మరో కార్యకర్త రజిబుల్ హోక్ తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ఘటనలపై అధికార టీఎంసీ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. దాడులతో కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టింది. అధికార పార్టీయే దాడులను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అధికార బలంతో టీఎంసీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు అన్నారు. 63,229 సీట్లకు పోలింగ్.. పశ్చిమ బెంగాల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఇదీ చదవండి: వర్షంలోనూ బారులు తీరిన ఓటర్లు.. బ్యాలెట్ పేపర్లకు నిప్పంటించిన దుండగులు.. -
బిగ్ అప్డేట్.. పోస్టల్ బ్యాలెట్ రద్దుకు ఈసీ ప్రతిపాదన!
న్యూఢిల్లీ: ఎన్నికల విధుల్లో ఉండి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే, ఈ పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి గురవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ‘పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు’ ఈ ప్రతిపాదనను ఈసీ తీసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు గత వారం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల వినియోగానికి ఎన్నికల నిర్వహణ చట్టం 1961లోని 18వ నిబంధనకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేలు సూచించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సర్వీస్ ఓటర్లు, కస్టడీలో ఉన్నవారు ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా ఈ 18వ నిబంధన వీలు కల్పిస్తోంది. జాతీయ స్థాయి ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా 10లక్షలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సుమారు కోటి మంది ఎన్నికల విధుల్లో ఉంటారు. అందులో పోలీసులు, పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల డ్యూటీలో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఎన్నికల విధుల్లోకి వెళ్లేవారికి శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్‌ను అందిస్తారు. వారు అక్కడి నుంచి విధుల్లోకి వెళ్లేలోపు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లతో ఫెసిలిటేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ చాలా మంది పోస్టల్ బ్యాలెట్‌ను తమతో తీసుకెళ్తున్నట్లు గుర్తించామని, సుదీర్ఘంగా వారితోనే పోస్టల్ బ్యాలెట్‌ను ఉంచుకోవటం ద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాంటి వాటిని తగ్గించేందుకే ఫెసిలిటేషన్ సెంటర్స్‌లోనే అభ్యర్థుల ముందు ఓటు వినియోగించుకునేలా నిబంధనల్లో మార్పు చేయాలని ఈసీ ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు షాక్.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ నో.. -
పోలింగ్ కు సర్వం సిద్ధం
-
నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
కొనసాగుతున్న ఉపఎన్నిక పోలింగ్
-
మహారాష్ట్ర, హరియాణాలో పోలింగ్ ప్రారంభం
-
హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
-
వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు
-
రౌడీ ఏజెంట్లు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల కౌంటింగ్ వేళ ఫలితం తేడా వస్తే అలజడి సృష్టించడం ద్వారా కౌంటింగ్‌ను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నుతోంది. ఓటమి తప్పదని భావిస్తున్న ఆ పార్టీ ఓట్ల లెక్కింపు సమయంలో అల్లర్లు సృష్టించేందుకు వీలుగా భుజబలం ప్రదర్శించే వారిని ఏజెంట్లుగా నియమించి కౌంటింగ్ హాళ్లలోకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. వీరిద్వారా అలజడి సృష్టించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొందరు ఆ పార్టీ కార్యకర్తలపైనే నమ్మకం లేక సొంత కుటుంబానికి చెందిన వారినే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చొబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తమ పార్టీ వారితో పాటు కాంగ్రెస్, జనసేన, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల తరఫున కూడా టీడీపీ కార్యకర్తలను ఏజెంట్లుగా పెట్టేందుకు ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో అధికార పార్టీ అభ్యర్థి పూర్తిగా తన సొంత మనుషులపైనే ఆధారపడ్డారు. ఒకరిద్దరు పార్టీ నాయకులు మినహాయిస్తే మిగిలిన వారందరూ తన సోదరులు, సొంత బంధువర్గంపైనే ఆధారపడ్డారు. తన ఇద్దరు సోదరులు, అల్లుడు, బావ, ఇతర దగ్గరి బంధువులు, సొంత మనుషులనే ఏజెంట్లుగా నియమించినట్టు తెలుస్తోంది. మరో పార్టీ అభ్యర్థిని మేనేజ్ చేసి అతని ఏజెంట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ వారినే కూర్చొపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల జాబితాలు సిద్ధం చేసుకున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అవసరమైతే కౌంటింగ్‌లో అల్లరి చేయడానికి సిద్ధంగా ఉండేవారిని, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని నియమించే యత్నం చేస్తున్నారు. ఇతర పార్టీల ఏజెంట్లూ టీడీపీవారే! ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గాల వారీగా ఉన్న టేబుళ్లలో ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్‌ను నియమించాల్సి ఉంటే వారి ఏజెంట్లతోపాటు కాంగ్రెస్, జనసేన, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల తరఫున కూడా టీడీపీ కార్యకర్తలనే ఏజెంట్లుగా పెట్టేందుకు ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకుల ముసుగులో రౌడీ షీటర్లను, నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఏజెంట్లుగా నియమించి కౌంటింగ్ హాలులో అల్లరి సృష్టించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రచారం సాగుతోంది. డీఎస్పీలకు మౌఖిక ఆదేశాలు అధికారులు వివిధ పార్టీల నుంచి వచ్చిన ఏజెంట్ల జాబితాలను కంప్యూటరీకరించి వాటిని పార్లమెంటరీ నియోజక వర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీ జాబితాలను సిద్ధం చేసి వారి చిరునామాలతోపాటు ఫొటోను ఎంక్వయిరీ చేసి నివేదిక ఇవ్వాలని డివిజనల్ పోలీస్ అధికారులు (డీఎస్పీ)లకు పంపిస్తారు. అయితే అక్కడ డీఎస్పీలు వీటిని పరిశీలించకుండానే కొంత మంది సిబ్బందికి ఇచ్చి తూతూ మంత్రంగా వాటిని చూసి తిరిగి కలెక్టరేట్‌కు పంపించేందుకు సహకరించాలని ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఒక ఉన్నతాధికారి నుంచి జిల్లాస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతోపాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సరళి ప్రకారం జిల్లాలో ఈసారి అధికార పార్టీకి గడ్డుకాలం తప్పదన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి పార్టీకి 15 మంది చొప్పున ఉండాలి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు రౌండ్‌కు 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంటు ప్రతి పార్టీ నుంచి ఉంటారు. అలాగే ఒక్కో నియోజకవర్గానికి ఒక జనరల్ ఏజెంట్ ఉంటారు. ఈ లెక్కన ప్రతి పార్టీకి 15 మంది అసెంబ్లీకి, 15 మంది పార్లమెంటుకు ఏజెంట్స్ ఉంటారు. వైఎస్సార్ సీపీకి నియోజకవర్గానికి 15 మంది ఉంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం కాంగ్రెస్, జనసేన, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఏజెంట్లతో కలిపితే 45 నుంచి 60 మంది ఏజెంట్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఏజెంట్ల పేర్లతో కూడిన జాబితాలను ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల నుంచి జాబితాలు ఇప్పుటికే అధికారులకు చేరాయి. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ఇంత వరకూ సంబంధిత జాబితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. నేరచరితుల పేర్లను ఏజెంట్లుగా ప్రతిపాదిస్తే వారిని తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకుని అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తారో లేదో ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది. -
పోలింగ్ ప్రశాంతం
ఆత్మకూరు(పరకాల): జిల్లాలో సోమవారం మొదటి విడత పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. తొలి దశలో ఐదు జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా 58 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో 80.67శాతం పోలింగ్ నమోదు కాగా 1,35,046మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బరిలో 201 మంది అభ్యర్థులు.. తొలి విడత ఎన్నికల బరిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 201 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదు జెడ్పీటీసీలకు 32 మంది, 58 ఎంపీటీసీలకు 169 మంది బరిలో ఉన్నారు. వర్దన్నపేట జెడ్పీటీసీకి 10 మంది, పర్వతగిరి, సంగెం, దుగ్గొండి మండలాల్లో ఆరుగురి చొప్పున, నర్సంపేటలో నలుగురు బరిలో ఉన్నారు. 354 పోలింగ్ స్టేషన్లు జిల్లాలో తొలి దశలో 354 పోలింగ్ స్టేషన్లలో 2,451 మంది సిబ్బందిని నియమించారు. పీఓలు 425, ఏపీఓలు 425, ఓపీఓలు 1,601 మందిని నియమించారు. వీరంతా విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ సంగెం: సంగెం మండలంలోని కాపులకనిపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ముండ్రాతి హరిత సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళితో పాటుగా పోలింగ్ కేంద్రంలోని వసతి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుండడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ మట్టపల్లి సంపత్‌రావు, ఏపీడీ పరమేశ్వర్, ఆర్డీఓ మహెందర్‌జీ, తహసీల్దార్ కొండాయి లక్ష్మిపతి తదితరులున్నారు. అలాగే మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్ కాపులకనిపర్తి, కాట్రపల్లి, కుంటపల్లి, గవిచర్ల, తీగరాజుపల్లి, తిమ్మాపురం, ఎల్గూర్‌రంగంపేట, మొండ్రాయి, పల్లారుగూడ, చింతలపల్లిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పర్వతగిరి: మండలంలోని కొంకపాక, గోపనపల్లి, అనంతారం పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత సోమవారం సందర్శించారు. పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన వీల్ చైర్‌ను పరిశీలించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ చూడాలని పోలింగ్ అధికారులను ఆదేశించారు. పర్వతగిరిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముగిసిన మూడో విడత ఉపసంహరణ జిల్లాలో 53 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను గురువారం వరకు స్వీకరించారు. నెక్కొండ మండలం వెంకటాపురం ఎంపీటీసీ ఏకగ్రీవమైంది. 52 ఎంపీటీసీలకు 157మంది, 5 జెడ్పీటీసీ స్థానాలకు 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతరం అభ్యర్థులను గుర్తులను కేటాయించారు. మూడో విడతలో చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. చెన్నారావుపేటలో 11 ఎంపీటీసీ స్థానాలకు 33 మంది, జెడ్పీటీసీకి 4, నెక్కొండలో 16 ఎంపీటీసీలకు 50 మంది బరిలో ఉన్నారు. నెక్కొండ మండలంలోని వెంకటాపురం ఎంపీటీసీ అభ్యర్థి గుండారపు అపర్ణ రవీందర్రావు(కాంగ్రెస్) ఏకగ్రీవమైంది. ఆత్మకూరు 9 ఎంపీటీసీ స్థానాలకు 28 మంది అభ్యర్థులు జెడ్పీటీసీకి 4గురు, దామెర మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలకు 20 మంది అభ్యర్థులు జెడ్పీటీసీకి 4, గీసుకొండ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు 26 మంది, జెడ్పీటీసీకి 7 గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
పరిషత్ ఎన్నికల పోరులో 76.80శాతం పోలింగ్
-
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా.. .
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యం త్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ను ఎంపికచేసి, అక్కడ వినియోగించిన వీవీప్యాట్ యం త్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెగ్మెంట్‌కు లెక్కించే వీవీప్యాట్ సంఖ్యను పెంచాలని నిర్ణయిం చారు. ఈ మేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి రాండమ్‌గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు/వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
ఉత్సాహంగా పోలింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం 117 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో రాత్రి 8 గంటల వరకు 65.61% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ)తెలిపింది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ మినహాయిస్తే మూడు దశల్లో ఇప్పటి వరకు 302 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగినట్లయింది. రెండో విడతలో వాయిదా పడిన త్రిపుర (తూర్పు) నియోజకవర్గం పోలింగ్ కూడా మంగళవారం జరిగింది. మూడో విడతతో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలతోపాటు ఉత్తరాదిన గుజరాత్లో పోలింగ్ ముగిసినట్లయింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌లో 79.77శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడతలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్సీపీ అధినేత శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, లోక్తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పశ్చిమబెంగాల్, కశ్మీర్లో జరిగిన ఎన్నికల హింసలో ఇద్దరు చనిపోయారు. ఈ విడతలో 2.81 లక్షల బ్యాలెట్ యూనిట్లను వినియోగించగా, వివిధ లోపాలు తలెత్తడంతో 1593 యూనిట్లను మార్చామని ఈసీ తెలిపింది. ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. అనంత్‌నాగ్‌లో అత్యల్పం.. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికలో అత్యల్పంగా 13.61% (2014లో 39.37%) ఓటింగ్ నమోదైంది. ఈ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం పోలింగ్ విధులు ముగించుకుని వస్తున్న ఐటీబీపీ జవాన్ల వాహనంపై కోకర్నాగ్ ప్రాంతంలో అల్లరి మూక రాళ్లు రువ్వగా అది బోల్తా పడటంతో ఆ వాహనం డ్రైవర్ చనిపోయారు. బెంగాల్, యూపీల్లో.. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నియోజకవర్గం భగ్వాన్‌గోలా సమీపంలోని బలిగ్రామ్‌లో ఓటేయడానికి వెళ్లిన తియారుల్ షేక్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. తమ కార్యకర్త తియారుల్‌ను టీఎంసీ వాళ్లే చంపారని ముర్షిదాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని అబు హెనా ఆరోపించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఈసీ ఆదేశించింది. బాలుర్ఘాట్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్ బయట రెండు వర్గాల వారు పరస్పరం బాంబులు విసురుకున్నారు. జంగిపూర్లో గుంపును చెదరగొట్టేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు లాఠీచార్జి చేశాయి. త్రిపురలో పోలింగ్ బూత్ ఏజెంట్లు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలంగా ఓట్లేయిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈటాలోని ప్రిసైడింగ్ అధికారిని విధుల నుంచి తప్పించారు. పోలింగ్ శాతాలిలా.. గుజరాత్ (26)లో 63.67% పోలింగ్ నమోదైంది. యూపీ(10)లో 61.35%, కేరళ(20)లో 76.82%, కర్ణాటక(14)లో 67.56%, మహారాష్ట్ర(14)లో 57.01%, గోవా(2)లో 73.23%, ఛత్తీస్‌గఢ్(7)లో 64.68%, పశ్చిమబెంగాల్(5)లో 79.67%, ఒడిశా(6)లో 61%, అస్సాం(4)లో 80.73%, బిహార్(5)లో 59.97%, త్రిపుర(1)లో 79.57% పోలింగ్ నమోదైంది. వీటితోపాటు దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్‌ల్లోని ఒక్కో సీటు కూడా పోలింగ్ జరిగింది. -
పోలింగ్ తగ్గెన్.. ఓటింగ్ ముగిసెన్
సాక్షి, జగిత్యాల: లోక్‌సభ సమరం ముగిసింది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.04 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 77.61 శాతం నమోదైంది. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 62.53శాతం నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 69.20 శాతం, కోరుట్ల నియోజకవర్గంలో 68.85శాతం ఓటింగ్ నమోదైంది. ఎండ తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే చాలా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తగ్గిన ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 77.61 శాతం పోలింగ్ నమోదుకాగా ప్రస్తుతం 70.04 శాతానికి పరిమితమైంది. ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీలో 78.02శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 62.53, కోరుట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో 75.45 శాతం, లోక్‌సభ ఎన్నికల్లో 68.85, జగిత్యాలలో 79.35 శాతం నుంచి 69.20 శాతానికి పడిపోయింది. తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందనే చర్చ ఆసక్తిగా మారింది. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మాక్‌పోలింగ్ నిర్వహణ జాప్యం కావడంతో పోలింగ్ సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. రాయికల్ మండలం మూటపల్లి, మైతాపూర్ బూత్ నంబరు 46, పెగడపల్లిలోని 262 పోలింగ్‌కేంద్రంలో, సారంగాపూర్తోపాటు కోనాపూర్ గ్రామాల్లో 9 గంటలకు పోలింగ్ మొదలైంది. కోరుట్ల మండలం పైడిమడుగులో 114 పోలింగ్‌కేంద్రం, కోరుట్లలోని 181 ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మల్లాపూర్తోపాటు రాఘవపేటలోని 84 పోలింగ్‌కేంద్రంలో, మల్లాపూర్ మండలం వెంకట్రావ్‌పేటలోని 59 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల మండలం ధరూర్‌లో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. జిల్లా కేంద్రంలోని 164 పోలింగ్‌కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక 9 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. లింగంపేటలో, మెట్‌పల్లిలోని 196 కేంద్రంతోపాటు కోరుట్లలోని కల్లూరు 141 కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్ మొదలైంది. జగిత్యాలలోని కొత్తవాడలో ప్రభుత్వ బాలికల పాఠశాల, జగిత్యాల మండలం కల్లెడ, పొరండ్ల గ్రామాల్లో పోలింగ్ ముగింపు సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ జాప్యమైంది. కేంద్రాలు సందర్శించిన అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ 192 పోలింగ్ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత సందర్శించారు. గొల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ సందర్శించారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాయి. పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను ఎన్నికల అధికారులు జిల్లా కేంద్రంలోని వీఆర్కే కళాశాలకు తరలించారు. ఓటింగ్ ముగియడంతో నిజామాబాద్ స్థానం నుంచి బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పు డు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజా తీర్పు మే 23న వెలువడనుంది. -
అందుకే సిటీలో ఓటింగ్ తగ్గింది
సాక్షి, హైదరాబాద్ : కేవలం నాలుగు నెలల్లో ఎంత తేడా.. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రి పొద్దుపోయే వరకు కూడా పోలింగ్ స్టేషన్లు బారులు తీరిన ఓటర్లతో కళకళలాడాయి. గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని అనేక చోట్ల ఓటర్లు లేక వెలవెలబోయా యి. ఎన్నికల పట్ల నిరాసక్తత, చాలాచోట్ల ఓటర్లకు పోల్ చీటీలు అందకపోవడం వంటి కారణాలతో పాటు లక్షలాది మంది నగరవాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లడంతో ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. చాలా మంది నగరవాసులు సొంత ఊళ్లలోనే ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో నగరంలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి సందడి కనిపించలేదు. ఉప్పల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నగరవాసుల సొంత ఊరి ప్రయాణం పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. గత ఎన్నికల్లో 50 శాతం దాటిన నియోజకవర్గాల్లో ఈ సారి 42 శాతం వరకే నమోదైంది. సుమారు 15 లక్షల మందికి పైగా నగరవాసులు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే ఈ మార్పు ఎక్కువగా కనిపించింది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్,రాజేంద్రనగర్, పటాన్చెరు, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మూడ్రోజుల్లో 1,573 ప్రత్యేక బస్సులు.. హైదరాబాద్ నుంచి ప్రతీ రోజు 3,500 బస్సులు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా మరో 1,573 బస్సులను అదనంగా నడిపారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ ఉదయం వరకు ఈ బస్సులు మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతా ల నుంచి వెళ్లాయి. ఈ 4 రోజుల్లో సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సొంత ఊళ్లకు వెళ్లారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక బస్సులను నడిపారు. మరో 1,000 ప్రైవేట్ బస్సులు కూడా ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. ఈ బస్సుల్లో 5 లక్షల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. నగరవాసులను తమ సొంత ఊళ్లకు రప్పించడంలో ప్రధాన పార్టీలు స్వయంగా రవాణా సదుపాయాలను ఏర్పాటు చేశాయి. సికింద్రాబాద్ నుంచి రికార్డు స్థాయిలో.. ఎన్నికల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి రోజు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 151 రైళ్లతో పాటు అనూహ్యంగా పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు 23 రైళ్లను అదనంగా నడిపింది. సికింద్రాబాద్, లింగంపల్లి, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. కాకినాడ, నర్సాపూర్, విజయవాడ, తిరుపతి, తదితర ప్రాంతాలకు ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సికింద్రాబా ద్ రైల్వేస్టేషన్ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికు లు సొంత ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10న ఒక్క రోజే 1.24 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. మూడ్రోజులపాటు 3,38,538 మంది ప్రయాణికులు ఒక్క సికింద్రాబాద్ నుంచే సొంత ఊళ్లకు వెళ్లారు. అలాగే నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి 70,231 మంది, 85,382 మంది ప్రయాణికులు లింగంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లారు. మరో 64,377 మంది కాచిగూడ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఎన్నికల సందర్భంగా 5,58,548 మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లారు. వీరిలో 4, 32,987 మంది జనరల్ బోగీల్లో తరలి వెళ్లిన వారే. ‘‘ఎన్నికల సందర్భంగా ఇలాంటి రద్దీ ఉంటుందని ఊహించలేకపోయాం. కొన్ని రైళ్లలో అప్పటికప్పుడు అదనపు బెర్తులు ఏర్పాటు చేశాం. ప్రయాణికులు కనీసం కూర్చొని వెళ్లేందుకు వీలుగా జనసాధారణ రైళ్లను నడిపాం. సంక్రాంతి రద్దీని తలపించింది’’అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. -
బీఎల్వోల బాధలు పట్టవా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల్లో మహిళా బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విధుల్లో బీఎల్వోలకు సరైన సౌకర్యాలు లేక, మండుటెండలో విలవిలలాడాల్సిన పరిస్థితి ఎదురైంది. పలు చోట్ల కూర్చోవడానికి సరిపడా కుర్చీలు, తాగడానికి నీరు కూడా లేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని జిల్లాల్లో చెట్ల నీడలు, గోడల పక్కన కూర్చుని విధులు నిర్వర్తించుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. వీరికి కనీస సదుపాయాలు కల్పించాల్సిన జిల్లా ఎన్నికల యంత్రాంగం అవేమీ పట్టనట్లు వ్యవహరించిందని పలువురు బీఎల్వోలు ఆవేదన చెందారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో సరైన వసతుల్లేక బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటికి తోడు ఏజెంట్ల బెదిరింపులు, ఓటరు స్లిప్పుల పంపిణీలో తప్పిదాలతో నానా చీవాట్లు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో కమలమ్మ అనే అటెండర్ స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి ఘటనలు పోలింగ్ సమయంలో తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అంగన్వాడీలే అధికం.. బీఎల్వో డ్యూటీ చేసే వాళ్లలో 80 శాతం అంగన్వాడీ కార్యకర్తలే ఉండగా మిగిలిన 20 శాతం ఆశ కార్యకర్తలు, సాక్షరభారత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. చాలీ చాలని జీతాలతో పగలనక రాత్రనక కష్టపడి పనిచేసినా అధికారుల నుంచి, ఓటర్ల నుంచి చీవాట్లు తప్పడం లేదని వాపోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు డోర్ టు డోర్ సర్వే చేసే సమయంలో రాజకీయ నాయకులు పార్టీలకు ప్రచారం చేస్తున్నారా అంటూ వేధింపులకు పాల్పడుతున్నారని, అలాగే ప్రతి సంవత్సరం బీఎల్వోలకు రావాల్సిన రెమ్యునరేషన్ ఏడు వేల రూపాయలను కూడా ఆర్డీవో స్థాయి అధికారులు చెల్లించకుండా వేధిస్తున్నారని, ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్నట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. గతేడాది బీఎల్వో రెమ్యునరేషన్ విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో 2017 సంవత్సరం రెమ్యునరేషన్ మాత్రమే చెల్లించారని, అది కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల బీఎల్‌లోలకు అందడం లేదని వాపోతున్నారు. నో వాటర్, నో టిఫిన్.. మండుటెండలో విధులు నిర్వర్తిస్తున్న బీఎల్వోలలో కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు కూడా లేక ఉదయం 7 గంటల నుంచి విధుల్లో ఉన్న బీఎల్వోలకు కనీసం టిఫిన్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు పలువురు బీఎల్వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్వోల విధులు.. ►ఓటరు స్లిప్పులు అందించడం ►కొత్త ఓటర్లను నమోదు చేయడం ►డోర్ టు డోర్ సర్వే చేయడం ►ఓటరు కార్డులో ఏవైనా తప్పులుంటే 8సీ ఫామ్ సంబంధిత తహసీల్దార్‌కి అందించడం పట్టించుకునేవారు లేరు.. బీఎల్వో డ్యూటీ చేసే అంగన్వాడీ కార్యకర్తల్లో వయసు పైబడిన వారు పోలింగ్ కేంద్రాల్లో వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలనే కనీస గౌరవం కూడా లేకుండా ఏజెంట్ల బెదిరింపులు, రాజకీయనాయకులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఏటా ఇవ్వాల్సిన రూ.7 వేలు కూడా చెల్లించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరించాలి. భిక్షపమ్మ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ స్టేట్ ప్రెసిడెంట్ -
పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి టీడీపీ అభ్యర్ధి బెదిరింపులు
-
ఏజెంట్లకు ..రూల్ కంపల్సరీ
సాక్షి, విజయవాడ : గెలుపోటముల మధ్య నిర్ణాయకంగా నిలిచే వ్యక్తుల్లో పోలింగ్ ఏజెంట్ ఒకరు. పోలింగ్ జరిగే సమయంలో ఏజెంట్ అనుక్షణం అప్రమత్తతోపాటు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రత్యర్థి పార్టీ ఏజెంట్ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకొని పోలింగ్‌లో అక్రమాలకు తెరతీసే పెను ప్రమాదం ఉంది. పోలింగ్‌లో ఏజెంట్ పాత్ర కీలకంగా కాబట్టి ఏజెంట్లుగా ఉండే వారు చట్టబద్ధంగా వారు చేయవలసిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఓటింగ్ యంత్రాల ద్వారా జరుగుతుంది కావున తాజాగా అమలులో ఉన్న నియమ నిబంధనలు తెలుసుకోవాలి. ఏదైనా సందేహాలు ఉంటే అధికారిని అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి. పోలింగ్ ఏజెంట్ అర్హతలు పోలింగ్ ఏజెంటుకు ఫలానా విద్యార్హతలు ఉండాలి అనే నిబంధన చట్టంలో లేదు. పోలింగ్ ఏజెంట్ స్థానికుడై ఉన్నందున ఆ బూత్‌లో నమోదైన ఓటర్లను గుర్తించే అవకాశం ఉంటుంది. దీని వలన దొంగ ఓట్లు పోలవకుండా అరికట్టడంలో పోలింగ్ సిబ్బందికి సహకరించవచ్చు. పోలింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసితులై ఉండాలి. నిర్ణీత పోలింగ్ సమయానికి ఒక గంట ముందుగానే పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవాలి. దీని వలన పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారి వివరించే ప్రాథమిక అంశాలను తెలసుకోవచ్చు. చట్ట పరంగా పోలింగ్ ఏజెంట్ ఫలానా సమయానికి హాజరు కావాలన్న నిబంధన లేదు. ఏజెంట్ ఎప్పుడు వచ్చినా ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాల్సిందే. పోలింగ్ ఏజెంట్ వద్ద విధిగా ఉండాల్సిన మెటీరియల్ అధికారికంగా ధ్రువపరిచిన ఎన్నికల జాబితా కాపీని ఏజెంట్ పోలింగ్ స్టేషన్లోకి తీసుకెళ్లవచ్చు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఏజెంట్‌గానీ రిలీఫ్ ఏజెంట్‌గానీ టిక్కులు పెట్టిన ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ వెలుపలకు తీసుకెళ్లటం నిషిద్ధం. ఓటర్ల జాబితాలో ఓటు వేసిన లేదా ఓటువేయని వారి సీరియల్ నంబర్లను పేర్కొంటూ ఏజెంట్ వెలుపలకు స్లిప్పులు పంపించవచ్చు. పోలింగ్ ఏజెంట్ తన నియామక పత్రాన్ని విధిగా ప్రిసైడింగ్ అధికారికి సమర్పించాలి. అలా సమర్పించటానికి ముందుగా అన్ని రకాలుగా చెక్ చేసుకోవాలి. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశం పొందిన ఏజెంటుకు ప్రిసైడింగ్ అధికారి పాస్ అందజేస్తారు. దానిని వినియోగించుకొని ఏజెంట్ రాకపోకలు సాగింవచ్చు. పోలింగ్‌స్టేషన్ లేదా స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో పార్టీ జెండాను సూచించే ఎలాంటి బ్యాడ్జి ఏజెంట్లు ధరించకూడదు. అభ్యర్థి పేరు మాత్రం కనిపించేలా బ్యాడ్జి కట్టుకోవచ్చు. పోలింగ్ ఏజెంట్ల ప్రధాన విధులు పోలింగ్ స్టేషన్లో తనని నియమించిన అభ్యర్థి ప్రయోజనాలను కాపాడటమే ఏజెంట్ విధుల్లో అత్యంత ప్రధానమైనది. ఒకరికి బదులు మరొకరు దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నిస్తే వారి గుర్తింపును సవాల్ చేయవచ్చు. దొంగ ఓటు వేసే వారిని ప్రిసైడింగ్ అధికారి వద్ద నిరూపించాలి. పోటీ చేసే ప్రతి అభ్యర్థి ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక పోలింగ్ ఏజెంట్లను ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఎవరు పోలింగ్ స్టేషన్లో ఉంటారో వారే పోలింగ్ ఏజెంటుగా పరిగణించబడతారు. రిలీఫ్ ఏజెంట్ అయినప్పటికీ పోలింగ్ కేంద్రంలో వారు విధుల్లో ఉన్నంతసేపు ఏజెంటుకు ఉండే హక్కులు, బాధ్యతలు ఉంటాయి. పోలింగ్ జరిగే రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత మాత్రం ఏ పోలింగ్ ఏజెంట్ పోలింగ్ స్టేషన్‌ను విడిచి వెళ్లటానికి అనుమతించరు. మధ్యాహ్నం 3 గంటల తరువాత రిలీఫ్ ఏజెంట్లను అనుమతించరు. -
టీడీపీ అడుగడుగునా అరాచకాలే
-
పోలింగ్ బూత్‌లో అపశృతి..వృద్ధుడు మృతి
-
రాప్తాడులో ఈవీఎంలు ధ్వంసం..ఉద్రిక్తత!
-
టీడీపీ దౌర్జన్యం..నిలిచిపోయిన పోలింగ్
-
జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత
-
పోలింగ్ ఏజెంటే ‘కీ’లకం
సాక్షి, సత్తెనపల్లి : ఎన్నికల ప్రచారం ముగిసింది. బలాబలాల బేరీజులో అభ్యర్థులు మునిగిపోయారు. ప్రస్తుతం పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఎన్నికల యుద్ధానికి సర్వం సన్నద్ధమైంది. ఈ తరుణంలో పోలింగ్ కేంద్రంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఏజెంటు పాత్ర ఎంతో ప్రధానమైనది. ఏ మాత్రం తేడా వచ్చినా అభ్యర్థుల భవితవ్యమే తారుమారవుతుంది. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ అభ్యర్థి ఒక్కరే పర్యవేక్షించడం సాధ్యం కాదు. కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రానికి ఆయన తరుఫున ఒక ఏజెంటును నియమించుకుంటారు. ఈ ఏజెంటు ప్రత్యర్థి పార్టీకి తలొగ్గి, లోపాయికారీ ఒప్పందం చేసుకున్నా.. అసమర్థుడైన వ్యక్తి అయితే ఇక అంతే సంగతులు.పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లను తమ అదుపులో ఉంచుకోగలిగితే అభ్యర్థుల పంట పండినట్లే. కేంద్రంలోకి వచ్చే ఓటరు గురించి సిబ్బందికి తెలియకపోవడంతో నిర్ధారణకు పోలింగ్ ఏజెంటు కీలకంగా వ్యవహరిస్తాడు. ఏజెంట్ల నియామకం, బాధ్యతలు, నిబంధనలను ఒక సారి పరిశీలిస్తే... అదే పోలింగ్ బూత్‌లో ఏజెంటు ఓటరుగా ఉండాలి. లేదంటే అదే నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నా అనుమతిస్తారు. పోలింగ్ ఏజెంటుగా ఉండాల్సిన వ్యక్తికి తప్పనిసరిగా ఓటరు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉండాలి. ప్రతి పోలింగ్ ఏజెంటు తాము ఏ పార్టీ అభ్యర్థి తరుఫున పోలింగ్ కేంద్రంలో ఉంటున్నాడో ఫారం–బి ని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఏజెంటు తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నారా, లేదో నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభానికి గంట సమయం ముందుగానే ఏజెంటు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంటు, ఇద్దరు ప్రత్యామ్నాయ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆయన పోలింగ్ కేంద్రంలోనే ఉండాలి. పోలింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు , వైర్లెస్ సెట్లు తీసుకోని రాకూడదు. ఓటు వేసిన, వేయని వారి క్రమ సంఖ్యలు, పేర్లను కాగితంపై రాసి బయటకు పంపకూడదు. ఓటరు జాబితాను పోలింగ్ స్టేషన్ బయటకు తీసుకొని వెళ్లకూడదు. అత్యవసర పరిస్థితుల్లో పోలింగ్ ఏజెంటు కేంద్రాన్ని విడిచి వెళ్లాల్సి వస్తే ఆ పార్టీకి చెందిన ప్రత్యామ్నాయ ఏజెంటు సిద్ధంగా ఉన్న తర్వాత మాత్రమే వెళ్లాలి. పోలింగ్ ఏజెంటు కేంద్రంలోకి వచ్చే సమయం, వేళ్లే సమయాన్ని ప్రత్యేక పుస్తకంలో నమోదు చేయాలి. ఏజెంటుకు ఫొటో గుర్తింపు కార్డు లేకపోతే పోటీ చేస్తున్న అభ్యర్థి లిఖిత పూర్వకంగా దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణలోని సిబ్బందికి ఏజెంట్లు సహకరించాలి. సిబ్బందిని ప్రలోభాలకు గురి చేయకూడదు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు ముఖాలు కనిపించెలా కూర్చోవాలి. జాతీయ, ప్రాంతీయ, పార్టీల తర్వాత స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు వరుస కమ్రమంలో కూర్చోవాలి. -
క్యూలైన్లో డబ్బులు పంచిన టీడీపీ నేతలు
-
ఓటర్లతో కలిసి ధర్నాకు దిగిన ఆర్కే
-
చీరాలలో పనిచేయని ఈవీఎంలు
-
ఏలూరులో వైఎస్ఆర్సీపీ ఏజెంట్‌పై టీడీపీ దాడి
-
ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్ధి
-
నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్
-
మైదుకూరులో రెండు వర్గాల మధ్య తోపులాట
-
ఒంగోలులో మొదలైన పోలింగ్
-
ప్రారంభమైన తొలివిడత పోలింగ్
-
ఏపీ పోలింగ్ : జాతీయ రహదారిపై ఆందోళన
సాక్షి, కృష్ణా : విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 47వ పోలింగ్ బూత్‌లో ఉదయం నుంచి ఈవీఎం పనిచేయకపోడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. సాయంత్రం 6 గంటలలోపు లైన్లలో వేచిఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. అయితే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దగ్గర ఉండి ఓట్లు వేయిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని టీడీపీ నాయకులు తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. మరోపక్క వల్లభనేని వంశీ కూడా తన అనుచరులతో అక్కడే ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పశ్చిమ గోదావరి : దెందులూరు నియోజకర్గంలోని ప్రత్తికొల్లలంకలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు. ఓటింగ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఈ వివాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారంటూ మాజీ సర్పంచ్ మహాలక్ష్మీరాజు కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న 7 కుటుంబాల సభ్యులపై దాడికి తెగబడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆస్పత్రిలో బాధితులు.. పశ్చిమ గోదావరి : ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అల్లుడు కొట్టు మనోజ్ వీరంగం సృష్టించాడు. స్థానిక 150 వ పోలింగ్ స్టేషన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామరాజుపై మనోజ్, అతని అనుచరులు దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన రామరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అనుచరులు పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతున్నారని రామరాజు మధ్యాహ్నం అధికారులకు సమాచారమిచ్చాడు. దీంతో రామరాజు, అతని తల్లి తండ్రులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. రాత్రి 10 గంటల సమయంలో మరోమారు ఎమ్మెల్యే అల్లుడు మనోజ్ రామరాజుపై దాడి చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామరాజు అమరావతి : ఈవీఎంలు మొరాయించడం.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతుందని ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని చెప్పారు. పోలింగ్ శాతం 80కి చేరువలో ఉందని తెలిపారు. సాక్షి, కర్నూలు : రాత్రి తొమ్మిది అవుతోన్న ఆళ్లగడ్డలో పోలింగ్ జరుగుతోంది. అయితే టీడీపీ శ్రేణులు దీనికి అడ్డుతగులుతున్నారు. తెలుగు తమ్ముళ్లు రాళ్లతో దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. అప్పటికే నిల్చున్న ఓటర్ల మధ్యలో కొంతమందిని బలవంతంగా చేర్చి వారితో కూడా ఓటు వేయించాలని గొడవకు దిగారు. దీనికి అధికారులు ఒప్పుకోకపోవడంతో.. రాళ్లురువ్వి భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు, టియర్‌గ్యాస్ ప్రయోగించడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితలు నెలకొన్నాయి. హైదరాబాద్: తన ఓటమి తప్పదనే భావించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిని కూడా మరిచి దిగజారిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పోలింగ్ ముగిసిన సందర్భంగా రాత్రి 8:30 గంటలకు వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు శాంతియుతంగా జరగకుండా, ఓటింగ్ శాతం తగ్గించడానికి చంద్రబాబు అనేక కుట్రలు పన్నారన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం తమకు అనుకూలమని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. 8 దాటినా పలుచోట్ల పోలింగ్ అమరావతి : రాత్రి 8 దాటినా పలుచోట్ల పోలింగ్ కొనసాగుతుంది. నిర్ణీత సమయంలోపు క్యూలైన్లో వేచిఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఇంకా పోలింగ్ జరుగుతోంది. చీరాల, గాజువాకలో ఓటర్లు ఇంకా బారులు తీరారు. అప్పుడే రీపోలింగ్‌పై నిర్ణయం.. అమరావతి : సాయంత్రం 5 గంటల వరకు 65.96 శాతం పైగా పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 25 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారని, ఆరుచోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసారని తెలిపారు. ఈ అన్నివిషయాలను కేంద్రఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. రాజకీయపార్టీలు రీపోలింగ్ కూడా కోరుతున్నాయని, కేంద్ర ఎన్నికల పరిశీలకుల స్క్రూటీని తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మూడు గంటలకు పోలింగ్ ఆగిపోయిందని, రిపోలింగ్ నిర్వహించే విషయంపై పరిశీలిస్తున్నామన్నారు. క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించామని తెలిపారు. ఇక మొత్తం పోలింగ్ 80 శాతం పైగా అయ్యే అవకాశం ఉందన్నారు. సిద్ధారెడ్డిపై టీడీపీ నేతల దాడి అనంతపురం: కదిరిలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డిపై టీడీపీ నేతల దాడికి యత్నించారు. వారిని ఆయన గన్‌మెన్ గిరి అడ్డుకోగా... అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కదిరి లోని 88 పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పోలైన ఓట్ల శాతం 65.96 శ్రీకాకుళం 63.77 % విజయనగరం 74.18% విశాఖపట్నం 55.82 % తూర్పుగోదావరి 69.85 % పశ్చిమగోదావరి 67.28 % కృష్ణా 64.50 % గుంటూరు 61.12 % ప్రకాశం 70.74 % నెల్లూరు 66.90 % కడప 63.90 % కర్నూలు 63 % అనంతపురం 67.08 % చిత్తూరు 69.32 % అప్పటి వరకు అందరు జాగ్రత్తగా ఉండాలి: విజయసాయిరెడ్డి హైదరాబాద్ : ఈవీఎంలు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ పంపేవరకు అందరు జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎలాంటి కుయుక్తులైనా పాల్పడే అవకాశం ఉందని, పోలింగ్ ముగిసే చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ముగిసిన పోలింగ్ సమయం.. బారులు తీరిన ఓటర్లు అమరావతి : ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. గడువులోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు టోకెన్లు ఇచ్చి మరి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికి.. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం.. పార్టీల నేతలు వాగ్వాదాలకు దిగడంతో పోలింగ్‌కు కొంత ఆలస్యమైంది. ఇక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అయినా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. హెలీకాప్టర్ల ద్వారా ఈవీఎంల తరలింపు తూర్పుగోదావరి జిల్లా : రంపచోడవరం నియోజకవర్గంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన గుర్తేడు - 4, దారగండి -1, పాతకోట - 1 బొద్దగండి - 1 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలతోపాటు ఎన్నికల సిబ్బందిని రెండు ఓఎన్జీసీ హెలీకాప్టర్ల ద్వార కాకినాడకు తరలించారు. వాకలపూడిలోని నేవి బేస్‌కు ఎజెన్సీ ఎన్నికల సిబ్బంది చేరుకుంది. పోలింగ్ ముగింపుకు కౌంట్ డౌన్.. అమరావతి : పోలింగ్ ముగింపుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది విజ్ఞప్తి చేశారు. 6 గంటల్లోపు క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. క్యూలైన్లో ఉన్న చివరి ఓటరు నుంచి ఓటరు స్లిప్‌లు జారీ చేస్తామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలింగ్ కొంత ఆలస్యం అవుతుందన్నారు. 4 గంటల వరకు 54.66 శాతం పోలింగ్ అమరావతి: సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 54.66 శాతం పోలింగ్ నమోదైంది. గడువులోపు పోలింగ్ బూత్‌కు వచ్చిన వారికి ఎంతసమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇక జిల్లాల వారిగా 4 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు శ్రీకాకుళం 52.11 % విజయనగరం 62.30% విశాఖపట్నం 45.79 % తూర్పుగోదావరి 57.32 % పశ్చిమగోదావరి 55.67 % కృష్ణా 52.53% గుంటూరు 52.41% ప్రకాశం 56.47 % నెల్లూరు 56.29 % కడప 56.44 % కర్నూలు 51 % అనంతపురం 54.96 % చిత్తూరు 57.30% రీపోలింగ్‌కు డిమాండ్ అనంతపురం : పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు మండలంలోని తలమర్ల గ్రామంలో ఉదయం నుంచి ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు 20 శాతం పోలింగ్ కూడా పూర్తికాలేదు. దీంతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మావోయిస్టు ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ అమరావతి : మావోయిస్టు ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్యే పుష్పవాణిపై దాడి విజయనగరం: జియ్యమ్మవలస మండలం చినకుదమలో ఉద్రికత్త చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పుష్పవాణిపై టీడీపీ నేత రామకృష్ణ దాడి చేశారు. పోలీసులు లేకపోవడంతో పుష్పవాణికి ప్రజలు రక్షణగా నిలిచారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ రిగ్గింగ్.. గుంటూరు : చిలకలూరి పేటలో పోలీసుల సాయంతోనే టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బయటపెట్టారు. టీడీపీ నేతలు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతుండగా.. బయట పోలీసులు కాపలా ఉన్నారు. కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తల దాడి చిత్తూరు జిల్లా : పుంగనూరు నియోజకవర్గం వనములదిన్నె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పరిశీలించారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారన్నారు. పోలింగ్ బూత్‌లో ప్రచారం.. ఓటర్ ఐడీలో రిగ్గింగ్ విశాఖపట్నం : పశ్చిమ నియోజవర్గం, బుచ్చిరాజుపాలెంలోని సెయింట్ ఆన్స్ తెలుగు మీడియం స్కూల్లో టీడీపీ నేతలు బరితెగించారు. 59, 60,61,పోలింగ్ బూతుల్లో సైకిల్‌కు ఓటెయ్యాలంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఈవాగ్వాదం సందర్భంగా టీడీపీ నేతల నుంచి ఓటర్ ఐడీ కార్డులు బయటపడ్డాయి. ఈ ఓటర్ కార్డులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త మృతి చిత్తూరు : టీడీపీ నేతల దాడిలో గాయపడి వెంకట్రాయపరెడ్డి అనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చెందారు. పెద్దతిప్పసముద్రం మండలం టీ సదుంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్న టీడీపీ నేతలను వెంకట్రాయపరెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు వెంకట్రాయపరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలైన వెంకట్రాయపరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లిలోని క్రిస్టియన్‌పేట పోలీస్ స్టేషన్లో ఆయన ఓటు వేశారు. మందకొడిగా పోలింగ్.. విజయనగరం జిల్లా : నెల్లిమర్ల నియోజకవర్గం బోగాపురం మండలం సవరవిల్లిలో మందకొడిగా పోలింగ్ జరుగుతోంది. క్యూలైన్ లో సుమారుగా 700 మంది ఓటర్లున్నారు. టీడీపీ దష్ప్రచారంపై ప్రశాంత్ కిషోర్ ఫైర్ హైదరాబాద్ : తన పేరుతో ఓ నకిలీ ట్వీట్ ఇమేజ్ను ప్రచారం చేస్తున్న టీడీపీపై వైఎస్సార్ సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫైర్ అయ్యారు. ఓటమి కళ్ల ముందున్నప్పుడే ఇలాంటి దిగజారిన చర్యలకు పాల్పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయినప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారన్నారు. అసత్యాలు, నకిలీ వార్తలను టీడీపీ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఏపీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును నిర్ణయించుకున్నారని బై..బై.. బాబు అంటూ ట్వీట్ చేశారు. .@ncbn when you lose trust of the people and your faith in their wisdom, after abuses and lies, you stoop down to circulating fake news. Few hours left for the polling to close but it’s clear that people of AP have decided their verdict. It is time to say #ByeByeBabu pic.twitter.com/TH3K4dwXqB — Prashant Kishor (@PrashantKishor) April 11, 2019 పేట్రేగిన టీడీపీ శ్రేణులు.. చిత్తూరు : పూతలపట్టులో టీడీపీ శ్రేణులు పేట్రేగాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఎంఎస్ బాబును ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది. రౌడీ షీటర్లను అనుమతిస్తున్నారని .. అనంతపురం : ప్రసన్నాయనపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వివాదం చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన రౌడీ షీటర్లను అనుమతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వక్తం చేశారు. దీంతో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్ చేసి.. టీడీపీ నేతలను వదిలేసారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈవీఎం సామాగ్రి ధ్వంసం వైఎస్సార్ జిల్లా : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లెలో టీడీపీ నేత హల్చల్ చేశాడు. పోలింగ్ బూత్ 176 లోకి ప్రవేశించి మరి ఈవీఎం సామాగ్రిని ధ్వంసం చేశాడు. ఇంత చేసినా పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు జిల్లాలవారిగా పోలింగ్ శ్రీకాకుళం 54% విజయనగరం 63% విశాఖపట్నం 51% తూర్పుగోదావరి 52% పశ్చిమగోదావరి 50 % కృష్ణా 51 %, గుంటూరు 50 % ప్రకాశం 58 % నెల్లూరు 53 % చిత్తూరు 57 % కర్నూలు 40 % కడప 63 % అనంతపురం 53%, కర్నూలు : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌పై బీజేపీ అభ్యర్థి బీవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ భరత్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, పోలీసులకు లంచాలు ఇచ్చి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బూత్‌ల వద్ద అనుచరులతో కలిసి టీజీ భరత్ హడావిడి చేస్తున్నారన్నారు. ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ విజయనగరం: సాలూరు నియోజకవర్గం, ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని కొఠియా గ్రామంలో గిరిజనులను ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. గుంటూరు : మాచవరం మండలం కొత్తగణేషునిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. దళితులను ఓటింగ్‌కు వెళ్లనీయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకొని గ్రామానికి వెళ్లిన గురజాల వైఎస్సార్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. గ్రామానికి ఎందుకు వచ్చావంటూ రెండు కార్లను ధ్వంసం చేశారు. పూతలపట్టు వైఎస్సార్సీపీ అభ్యర్థి కిడ్నాప్ చిత్తూరు : పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబును టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై టీడీపీ నేతలు భౌతికదాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మంత్రి ప్రతిపాటి భార్య బెదిరింపులు గుంటూరు: చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య బెదిరింపులకు దిగారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ ఏకంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను ఆమె హెచ్చరించారు. ఉద్యోగుల వైపు వేలు చూపిస్తూ ఆమె వార్నింగ్ ఇవ్వడంతో మంత్రి సతీమణి తీరుపై ఎన్నికల సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయనగరం: బాడంగి మండలం ముగడలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు దాడి చేసి కొట్టారు. అంతేకాకుండా ఆయనను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపేసి.. అరాచకంగా ప్రవర్తించారు. తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గం సొరకాయలపాలెంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరులోని వసంతపేట స్కూల్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి.. లాఠీచార్జ్ చేశారు. 2 లక్షలతో పట్టుబడ్డ గంటా అనుచరుడు విశాఖపట్నం: ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు టీడీపీ నేతల ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల ప్రలోభాలు కొనసాగుతుండగా.. తాజాగా విశాఖపట్నంలో మరో టీడీపీ నాయకుడు డబ్బుతో పట్టుబడ్డాడు. మర్రిపాలెం జ్యోతినగర్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు కొప్పిరెడ్డి రామకృష్ణ రూ. 2 లక్షలతో దొరికిపోయాడు. అతను ఈ డబ్బును ఓటర్లకు పంచేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. ఓటింగ్ శాతం వివరాలివి.. చిత్తూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతం కొనసాగుతోంది. ఓటర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటవరకు నమోదైన సరాసరి ఓటింగ్ శాతం నియోజకవర్గాలవారీగా ఈ కిందివిధంగా ఉంది. తంబల్లపల్లి : 43.80% పీలేరు : 37% పుంగనూరు : 46% చంద్రగిరి : 32% సత్యవేడు : 38% జీడీ నెల్లూరు : 40.56% చిత్తూరు : 38% కుప్పం : 44.60% పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలవరకు జిల్లాలో మొత్తంగా 20.41 శాతం పోలింగ్ నమైందింది. ఉదయం 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలోని నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొవ్వూరు : 23.86 % నిడదవోలు : 12.14 % ఉంగుటూరు : 21.15 % ఏలూరు : 32.50 % నర్సాపురం : 25.81 % పాలకొల్లు : 12 % భీమవరం : 20.20 % ఆచంట : 26.60 % ఉండి : 11.2 % తణుకు : 16.76 % చింతలపూడి : 27.89 % దెందులూరు : 25 % గోపాలపురం : 31 % తాడేపల్లిగూడెం : 21 % పోలవరం : 28 % ఉదయం 11 గంటలవరకు అందిన సమాచారం మేరకు జిల్లాల వారీగా చూసుకుంటే.. శ్రీకాకుళం 19.78%, విజయనగరం 31.57%, విశాఖపట్నం 21.64 %, తూర్పుగోదావరి 27.50%, పశ్చిమగోదావరి 20.41 %, కృష్ణా 24.10 %, గుంటూరు 24 %, ప్రకాశం 22 %, నెల్లూరు 23.32%, చిత్తూరు 25.18 %, కర్నూలు 23 %, కడప 17.84 % పోలింగ్ నమోదైంది. అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నాం వరకు ఓటర్లు పోటెత్తుత్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు జల్లా వ్యాప్తంగా 38.86 శాతం పోలింగ్ నమోదైంది. రాయదుర్గం : 26.00% ఉరవకొండ : 47.00% తాడిపత్రి : 27.62% గుంతకల్ : 39.00% సింగనమల : 37.14% అనంపురం అర్బన్ : 29.00% కళ్యాణదుర్గం : 49.00% రాప్తాడు : 31.30% మడకశిర : 42.00% హిందూపురం : 38.00% పెనుకొండ :49.00% పుటపర్తి : 37.00% ధర్మవరం :51.00% కదిరి: 41.33% అనిల్‌కుమార్ యాదవ్‌పై దాడి నెల్లూరు : నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూల్ వద్ద పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. దీనిని గుర్తించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలు ఆయనపై దాడి చేశారు. గోపిరెడ్డిని కారుతో ఢీకొట్టిన ‘పచ్చ’ నేత గుంటూరు: యలమందలో టీడీపీ నేతలు గూండాయిజానికి దిగారు. నర్సరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకుడు కడియల రమేశ్ దాడికి దిగాడు. అంతేకాకుండా గోపిరెడ్డిని కారుతో అతను ఢీకొట్టాడు. దీంతో గోపిరెడ్డి గాయపడ్డారు. బరితెగించి మరీ టీడీపీ నేతలు పోలింగ్ రోజున రెచ్చిపోతుండటంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనిగోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను సైతం కిడ్నాప్ చేశారని, ఈ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తాడిపత్రిలో దాష్టీకం అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు బరితెగించారు. ఇక్కడి వీరాపురంలో జేసీ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనిని గుర్తించిన వైఎస్సార్సీపీ నాయకులు రిగ్గింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు వేట కోడవళ్లతో దాడులకు దిగారు. జేసీ వర్గీయుల దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందారు. చదవండి: వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణహత్య దుష్ప్రచారాన్ని నమ్మకండి: ద్వివేది రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని, సమస్యలు లేవని తాజాగా విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. 30శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని కొన్ని టీవీ చానెళ్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15శాతం పోలింగ్ నమోదైందని ఆయన వెల్లడించారు. ఒకరికి ఓటు వేస్తే వేరొకరికి వెళ్తుందన్నది కూడా దుష్ప్రచారమేనని, ఈవీఎంలపై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని ఆయన ఓటర్లకు సూచించారు. చదవండి: మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు : ద్వివేది పచ్చపార్టీ నేతల దౌర్జన్యం పచ్చపార్టీ నేతలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల దాడులకు తెగబడుతున్నారు. పోలింగ్‌కు అంతరాయం కలిగించేలా కొన్ని ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉత్సావవంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా, పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ప్రజలు బారులు తీరారు. కొన్నిచోట్ల మొదట ఈవీఎంలు మొరాయించినా.. ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారం కావడంతో దాదాపు రాష్ట్రమంతటా పోలింగ్ సజావుగా సాగుతోంది. చదవండి: రెచ్చిపోతున్న పచ్చపార్టీ నేతలు సీఈవోను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు అమరావతి : రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో ఈవీఎంలపై పచ్చ మీడియాలో దుష్ప్రచారాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ఈసీని కలిశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పోలింగ్, పోలింగ్ సందర్భంగా తలెత్తిన పరిస్థితులు సీఈవోకు వివరించిన వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలింగ్ ప్రారంభమైన రెండు గంటలకే రీ పోలింగ్ అంటున్నారని విమర్శించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ, నాగిరెడ్డి మండిపడ్డారు. పచ్చ చొక్కాలతో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారని, ఇలా చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని వారు అన్నారు. టీడీపీ ప్రలోభాలు.. ప్రకాశం: పోలింగ్ రోజున కూడా టీడీపీ ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని కొత్తపేటలో ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేత ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాడు. దీంతో పోలింగ్ కేంద్ర వద్దే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత చుండూరు వాసును పోలీసులు అరెస్టు చేశారు. ఆ పత్రికా యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతా: డీఎల్ వైఎస్సార్ జిల్లా: తనపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. తనపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని, ఇందుకుగాను పరువునష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు కథనాలు రాసిన పత్రికా యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతానని డీఎల్ హెచ్చరించారు. స్వేచ్ఛగా ఓటు వేయండి.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎన్నికలకు సంబంధించిన దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, పలుచోట్ల ఈవీఎంలలో తలెత్తిన లోపాలు సరిదిద్దామని తెలిపింది. చదవండి: ఈవీఎంలో లోపాలు.. ఈసీ కీలక ప్రకటన ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతాలివే! ఏపీ అంతటా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు.. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతున్నా.. చాలావరకు పోలింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 12.95శాతం పోలింగ్ నమోదు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 14శాతం పోలింగ్ నమోదు తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 12.36శాతం పోలింగ్ నమోదు విజయనగరం: కురపాం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 15శాతం నమోదు దాడులు.. దౌర్జన్యాలు.. రాప్తాడులో ఉద్రిక్తత! అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత వర్గీయులు దౌర్జన్యానికి దిగుతుండటంతో ఇక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు సనపలోని ఓ పోలింగ్ కేంద్రంలో పరిటాల అనుచరులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. సిద్ధరాంపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు రాళ్ల దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మరూరు గ్రామంలో పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఏకంగా ఓటర్లను బెదిరించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. టీజీ వెంకటేశ్ హల్చల్ కర్నూలు: పోలింగ్ కేంద్రాల బూత్‌ల వద్ద టీడీపీ నేత, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ హల్చల్ చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా.. ఓటర్లు టీడీపీకి ఓటు వేసేలా ఆయన పోలింగ్ కేంద్రాల వద్ద వ్యవహరిస్తుండటంపై ఆయన తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ జిల్లా : జమ్మలమడుగు మండలం పొన్నతోట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఏకంగా పోలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సా సీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. లోకేష్ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఓటర్లతో కలిసి ధర్నాకు దిగారు. శ్రీకాకుళం : సంతబొమ్మాలి మండలం నిమ్మడలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల సిబ్బందిపై అచ్చెన్నాయుడు అనుచరులు బెదిరింపులకు దిగారు. నిమ్మడ పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలను తొలగించి వైఎస్సార్ సీపీ ఏజెంట్‌ను బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. ఇంత జరుగుతున్నా పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు రాకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ వల్ల ‘హోదా’ సజీవంగా ఉంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రతి జిల్లాలనూ యువభేరి కార్యక్రమాలతో హోదా పట్ల యువతలో వైఎస్ జగన్ అవగాహన పెంచారని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలిపారు. యువత పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటోందని ఆమె అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితి చూస్తే.. మళ్లీ రాజన్న రాజ్యం రాబోతుందని అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పులివెందులలో వైఎస్ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత వైఎస్సార్ జిల్లా: పొట్లదుర్తిలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దౌర్జన్యానికి దిగారు. పొట్లదుర్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌పై సీఎం రమేశ్ చేయి చేసుకున్నారు. చిత్తూరు: ఐరాలం మండల నాంపల్లి, పేరయ్యగారిపల్లి, కమ్మకిందపల్లిలో ఓటు వేసేందుకు వెళుతున్న దళితులను అడ్డుకున్న టీడీపీ.. విశాఖ: పాయకరావుపేట మండలం పింటకోట పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ గుర్తు పడకపోవడంతో పోలింగ్ నిలిపివేత గుంటూరు: నర్సరావుపేట రామచంద్రాపురం పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకున్న టీడీపీ నేతలు టీడీపీ దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ ఏజెంట్ల కిడ్నాప్! గుంటూరు: నర్సరావుపేట మండలం యలమందలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ముగ్గురు వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకొని.. వారిని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో ఒక ఏజెంట్ గాయపడ్డారు. వైఎస్సార్సీపీ నర్సరావుపేట అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపైనా పచ్చ పార్టీ నేతలు దాడికి దిగారు. దీంతో ఆయన సెల్‌ఫోన్‌తోపాటు మీడియా ప్రతినిధి కెమెరా ధ్వంసమయ్యాయి. మంగళగిరి : ఉండవల్లిలో సీఎం చంద్రబాబునాయుడు దంపతులు, మంత్రి నారా లోకేశ్ దంపతులు ఓటు వేశారు. మొరాయిస్తున్న ఈవీఎంలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే, సాంకేతిక సమస్యలతో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. మరికొన్ని చోట్ల పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 7.40 గంటల కల్లా అందుతున్న సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు బూత్ నంబర్ 197లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఇదే జిల్లాలోని చింతలపూడిలో 153 బూత్‌లో ఈవీఎం లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని 161వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ జగన్.. పులివెందుల : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. జనం మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్నట్టు చెప్పారు. నిర్భయంగా ఓటు వేయాలని కొత్త ఓటర్లకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైఎస్ జగన్ పులివెందులలోని భాకరాపురం ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. ముందుగా లోక్‌సభ అభ్యర్థికి, ఆ తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఆయన ఓటు వేశారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి బయల్దేరే ముందు వైఎస్ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి గోపాల క్రిష్ణ ద్వివేది తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని మున్సిపల్ హై స్కూల్ లో పోలింగ్ తీరును ఆయన పరిశీలించారు. మొరాయించిన ఈవీఎంలను టెక్నికల్ టీమ్ రిపేర్ చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, సాయంతం 6గంటల వరకు క్యూలైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కును కల్పిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ బూగ్ నంబర్లు 20,24,26, 39,27, 51, 54, 69 లో ఈవీఎంలు పనిచేయడం పనిచేయడం లేదు. శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం లో 214, 210 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. 210 బూత్‌లో ఇంకా మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. పార్వతీపురం 38వ పోలింగ్ బూత్ లో మాక్ పోలింగ్‌లో ఈవీఎం మొరాయించింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 122వ పోలింగ్ కేంద్రంలోఈవీఎం మొరాయించింది. గట్టిగా నొక్కినా ఓట్లు పడలేదు. అలాగే ఓటు వేశాక బీప్ సౌండ్ రాలేదు. ఏజెంట్లు రానిపక్షంలో వారి కోసం 15 నిముషాలు ఎదురుచూశారు. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,120 పోలింగ్ కేంద్రాలకు గాను 28,000 చోట్ల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు సాఫీగా ప్రారంభంమైంది. ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ఐదున్నర గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలీంగ్ నిర్వహించారు. అన్ని పార్టీల ఏజెంట్లు మాక్పోలింగ్కి అందుబాటులో ఉండేలా చూసి ఈ మాక్‌పోలింగ్‌ను జరిపారు. రాష్ట్రంలో175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలకు గాను 46,120 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. -
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
-
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల పంపిణీ
-
మొదలైన ప్రలోభాల ఎర
సాక్షి, అమరావతి : జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. టీడీపీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో విచ్చల విడిగా మద్యం, డబ్బులు పంచుతున్నారు. అడ్డాకూలీలతో జెండాలు మోయిస్తూ ప్రచారంలో హడావుడి చేస్తున్నారు. టీడీపీ పాలనపై సానుకూలత లేకపోవడంతో ఓటర్లతో బేరసారాలకు దిగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలు సేకరిస్తూ, స్లిప్పులు పంచుతూ ఆ ఇంటిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. ఆ తరువాత వారికి డబ్బులు ఇస్తున్నారు. మరి కొందరి బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకుని నగదు జమచేస్తున్నారు. ప్రధానంగా డ్వాక్రా సంఘాల మహిళ ఓట్లు పొందేందుకు కానుకలతో వల విసురుతున్నారు. బాపట్ల, సత్తెనపల్లిలో చీరెలు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలకు చేరిన డబ్బు మూటలు టీడీపీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే డబ్బుల మూటలు సిద్ధం చేసుకున్నారు. గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పొన్నూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఆయా గ్రామాల్లో తమ అనుకూలంగా, నమ్మకంగా ఉండే నాయకుల వద్దకు డబ్బు సంచులు చేర్చి పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో సీఎం తనయుడు లోకేష్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో అందరి చూపై ఆ నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంచి వ్యక్తిగా, రాజధాని ప్రజల సమస్యలపై పోరాటం చేయడంతోపాటు, నిత్యం అందుబాటులో ఉండి ప్రజల మన్ననలు పొందారు. దీనికితోడు రాజన్న క్యాంటీన్లో నాలుగు రూపాయలకు భోజనం, పది రూపాయలకు ఐదు రకాల కూరగాయలు పంపిణీ ద్వారా పేద ప్రజలకు సేవ చేశారు. ప్రచారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందంజలో ఉండగా, టీడీపీ అభ్యర్థి లోకేష్ వెనుకబడిపోయారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తలంపుతో అక్కడ డబ్బులు భారీగా పంచుతున్నారని టీడీపీ నాయకులే పేర్కొంటున్నారు. ఏజెంట్లపై గురి టీడీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో ఎన్నికల్లో ఏదో విధంగా గట్టెక్కేందుకు రకరకాల ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో చోటామోటా నాయకులకు డబ్బులతో ఎర వేస్తున్నారు. పోలింగ్ రోజున ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంబంధించి పోలింగ్ బూత్‌ల్లో కూర్చునే ఏజెంట్లుగా ఎవరు ఉంటారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారీని పోలింగ్ ముందు రోజు రాత్రి నయానోభయానో డబ్బులతో లొంగదీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పొన్నూరు, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లు, చోటామోటా నాయకులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ అభ్యర్థులు గెలుస్తామని ఆశపెట్టుకొన్న నియోజక వర్గాలోనూ ఎదురుగాలి వీస్తుండటంతో డబ్బు మూటలపైనే ఆశలు పెట్టుకొన్నట్లు టీడీపీ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతోంది. టీడీపీ ప్రలోభాలను దీటుగా తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద పోలింగ్ గడువు సమీపించే కొద్దీ ఓటరు దేవుళ్లలను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. -
నిజామాబాద్‌లో.. పోలింగ్ ప్రతిష్టాత్మకం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం యుద్ధప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈవీఎంల చరిత్రలోనే తొలిసారిగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఈ స్థానం పోలింగ్ నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాల్‌గా మారింది. దీంతో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్‌కు కేవలం వారం రోజులే గడువుండటంతో ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ స్థానం పోలింగ్ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. అనేక ఊహాగానాలు, ఉత్కంఠకు తెరదించుతూ నిజామాబాద్ స్థానానికి ఈవీఎంల ద్వారానే షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేప థ్యంలో పోలింగ్ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ధునాతన ఎం–3 రకం ఈవీఎంలను జిల్లాకు తెప్పించింది. వీటి పనితీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లు ఈసీఐఎల్, బెల్ కంపెనీలకు చెందిన ఇంజినీర్లు జిల్లా కు చేరుకున్నారు. సుమారు 600 మంది పైగా ఇంజినీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి వచ్చారు. కొందరు ఇంజనీర్లను జగిత్యాల జిల్లాకు పంపినట్లు తెలుస్తోంది. వీరికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించారు. ప్రైవేటు హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లను కేటాయించారు. ప్రారంభమైన ఫస్ట్ లెవల్ చెకింగ్.. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాలున్నాయి. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో కంట్రోల్ యూనిట్, వీవీపీఏటీలతో పాటు 12 బ్యాలె ట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈవీఎంలు ప్రత్యేక కంటెనర్లలో బుధవారం జిల్లాకు వచ్చాయి. నగర శివారులోని విజయలక్ష్మి గార్డెన్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షం లో ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియ చేపట్టారు. ర్యాండమ్ చెకింగ్ వంటి ప్రక్రి యలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈవీఎంలలో బ్యాలె ట్ పేపర్ అమర్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. వారం రోజులే గడువుండటంతో మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాకు కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్‌జైన్ బుధవారం జిల్లాకు చేరుకున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు వచ్చిన ఆయన ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ బుద్ద ప్రకాష్, ఈసీఐ కన్సల్టెంట్ నిఖిల్‌కుమార్ లు కూడా జిల్లాకు చేరుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా కూడా జిల్లాకు వచ్చారు. సాంకేతిక నిపుణుల సేవల వినియోగం.. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీ ప్యాట్, 12 బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగిస్తామన్నామని సుదీప్‌జైన్ పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల సమస్య వస్తే దానినే మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంటే 12 బీయుఎస్లో ఒక బ్యాలెట్ యూనిట్ సమస్య వస్తే దాని స్థానంలో అక్కడే మరో బ్యాలెట్ యూనిట్ అమర్చాలని, దీనికి అవసరమైన సాంకేతికత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంతో మంది నిష్ణాతులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణు లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నందున వారి సేవలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. అధికారులు అత్యంత నమ్మకంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రపంచంలోనే మొదటిసారి : నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గం ఎన్నిక ఒక చరిత్రకు నాంది కానున్నదని కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్‌జైన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సం ఘం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్లో ఎన్ఎల్ఎమ్టీ నిష్ణాతులతో సమావేశమయ్యారు. సుదీప్‌జైన్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు ఎం–2 ఈవీఎంఎస్ ద్వా రా, నాలుగు బ్యాలెట్ యూనిట్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించామన్నారు.ఇక్కడ 185 మంది బరిలో ఉండటంతో ఎం–3 ఈవీఎంలతో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇంత వరకు ఎం–3 ద్వారా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఒక చరిత్రకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం వేదిక అవుతుందని చెప్పారు. వందల సంఖ్యలో సాంకేతిక నిపుణులు : ఈసీ కన్సల్టెంట్ నిఖిల్‌కుమార్ ఎన్నికల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతులలో నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కన్సల్టెంట్ నిఖిల్ కుమార్ పేర్కొన్నారు. వందల సంఖ్యలో ఈసీఐఎల్, బెల్ నిపుణు లు ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ సాంకేతిక సహకారం అందించనున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానం పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకు అధికారులను సన్నద్ధం చేశామని, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈవో బుద్ద ప్రకాష్, ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌరవ్ దాలియా, ప్రత్యేక అధికారి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, సీపీ కార్తికేయ, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, బెల్, ఈసీఐఎల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల సిబ్బందే ఎన్నికల అధికారులు!
సాక్షి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ నాయకులను ఓటమి భయం వెంటాడుతోంది. అందుకే పోల్ మేనేజ్మెంట్కు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత ఉండటంతో అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లను నియమించుకుంటున్నారు. వారికి ఎన్నికల విధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు నడుపుతున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారినే ఎన్నికల విధులకు నియమిస్తున్నట్లు తెలుస్తోంది. పోల్ మేనేజ్మెంట్లో భాగంగానే టీడీపీ నేతలు ఇదంతా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేనా?..: గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన అభినందన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ విద్యా విహార్ పాఠశాల నుంచి ఏడుగురు ఉపాధ్యాయులను, అదే మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి పాఠశాల నుంచి 12 మందిని, తాళ్లూరులో టీడీపీ నేత కొల్లి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన శ్రీవివేకానంద విద్యానికేతన్ నుంచి 20 మంది ఉపాధ్యాయులు, క్రోసూరు టీడీపీ నేత రవి గోవర్దన్‌రెడ్డికి చెందిన పద్మావతి పబ్లిక్ స్కూల్ నుంచి 11 మందిని ఎన్నికల విధుల కోసం నియమించుకోవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. నరసరావుపేట పట్టణంలోని నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్యకు చెందిన కృష్ణచైతన్య పాఠశాల నుంచి, టీడీపీ నాయకుడు మైనేడి శ్రీనివాసరావుకు చెందిన హిందూ స్కూల్, భావన, వాసవి కళాశాలల నుంచి సైతం ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు తీసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో గొట్టిముక్కల వెంకటేశ్వర్లుకు చెందిన ఇండియన్ జెమ్స్ స్కూల్ నుంచి 20 మంది ఉపాధ్యాయులను, పెదనందిపాడు టీడీపీ జెడ్పీటీసీ నగరాజకుమారి కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఎల్‌ఎంహెచ్ స్కూల్ నుంచి 20 మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధుల కోసం నియమించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఎన్నికల విధుల కోసం తీసుకున్న టీచర్లలో 70 శాతం మంది టీడీపీ నేతలు నడుపుతున్న పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు మొండిచేయి విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు, మంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థలు, టీడీపీ ఎంపీ అభ్యర్థి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్న మాన్సాస్ సంస్థకు చెందిన ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులకు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ), ఏపీఓ విధులు కేటాయించారు. వాస్తవానికి ముందుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పీఓ, ఏపీఓ ట్రైనింగ్ ఇచ్చారు. కానీ, రెండోసారి ట్రైనింగ్‌కు పిలవలేదు. వారికి పీఓ, ఏపీఓ డ్యూటీలు వేయలేదు. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సైతం పక్కనపెట్టి, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఎన్నికల విధులు కేటాయించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ నాయకుడి కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలు నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు మిద్దె శాంతిరాముడుకు చెందిన ఆర్జీఎం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, బనగానపల్లె, నందికొట్కూరు, డోన్, శ్రీశైలం అసెంబ్లీతోపాటు నంద్యాల పార్లమెంట్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ మంగళవారం తెలిపారు. టీడీపీ నాయకుడు శాంతిరాముడు, ఆయన కుమారుడు మిద్దెశివరాంలు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులకు చెందిన ప్రైవేటు కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
నిజామాబాద్‌లో 3,30,780 మంది పోలింగు ఏజెంట్లు
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నికల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారింది. 185 మంది అభ్యర్థులు పోటీపడుతుండడంతో వారంతా ప్రతి బూత్‌లో ఏజెంట్లను నియమించుకుంటే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. బూత్‌లలో కాకుండా విశాలమైన ఆవరణల్లో పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. మోర్తాడ్: రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులకు పార్టీకి సంబంధించిన గుర్తులను కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు వివిధ రకాలైన గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయించారు. పోలింగ్ రోజున ఓటర్లను గుర్తించడానికి ప్రతి అభ్యర్థి పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజామాబాద్ ఎంపీ స్థానం పరిధిలో 1,788 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. బరిలో 185 మంది అభ్యర్థులు ఉన్నారు. వారు పోలింగ్ కేంద్రాలలో తమ ఏజెంట్లను నియమించుకుంటే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో 3,30,780 మంది పోలింగ్ ఏజెంట్లు అవసరం అవుతారు. అందరు అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకుంటే రికార్డు స్థాయిలో ఏజెంట్లు పోలింగ్ స్టేషన్లలో కొనసాగించాల్సి వస్తుంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి ఒక్కో పోలింగ్ బూత్‌లో తన ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. పోలింగ్ స్టేషన్లు ఎక్కువగా పాఠశాలల్లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నాయి. ఎక్కడ పోలింగ్ బూత్ ఉన్నా గది విస్తీర్ణం చిన్నగా ఉంటుంది. ఒక పోలింగ్ స్టేషన్లో 185 మంది ఏజెంట్లను కూర్చోబెట్టాలంటే ఆ గది సరిపోదు. అయితే పోలింగ్ ఏజెంట్లు కూర్చోడానికి పోలింగ్ స్టేషన్ల ఆవరణల్లో టెంట్లు వేసి కుర్చీలను ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పోలింగ్ ఏజెంట్ స్థానిక ఓటరు అయి ఉండాల్సి ఉంటుంది. అంటే ఓటర్లలో ఎక్కువ శాతం మంది పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అందరూ తమ పోలింగ్ ఏజెంట్లను నియమించుకున్నా లేకపోయినా ఎన్నికల అధికారులు మాత్రం ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారికి అవసరమైన సౌకర్యాల కోసం పరిశీలిస్తున్నారు. అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో ఉండడం వల్ల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది. -
పోలింగ్ సవాలే!
జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఓవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా చూస్తేనే మరోవైపు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది. అయితే జిల్లాలోని పలు గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ అధికార్ల ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందులో భాగంగా మండలాల వారీగా సున్నితమైన సెంటర్లను గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అత్యంత సమస్యాత్మక గ్రామాలు, 128 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఆయా సెంటర్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, వికారాబాద్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 11వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. జిల్లాలోని 8 లక్షల మందికిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 165, గ్రామాల్లో 961 సెంటర్లు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు గ్రామాలు, పోలింగ్ స్టేషన్ల వద్ద గొడవలు చేసుకుని భద్రతాపరమైన సమస్యలు తలెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలు రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త సర్వేలో జిల్లాలోని ఎనిమిది గ్రామాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ పట్టణం, రావులపల్లి, హుస్నాబాద్, కుదురుమల్ల, చెల్లాపూర్ అత్యంత సమస్యాత్మకమైనవిగా నిర్ధారించారు. ఐదు పంచాయతీల పరిధిలో 32 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలోని నస్కల్, సుల్తాన్పూర్, దోమ గ్రామాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటి పరిధిలో తొమ్మిది అత్యంత సున్నితమైన సెంటర్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. వీటితోపాటు జిల్లాలో 128 సమస్యాత్మక సెంటర్లు ఉన్నట్లు తేల్చారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 32, వికారాబాద్‌లో 26, తాండూరులో 32, కొడంగల్‌లో 38 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు సైతం సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘలను లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలింగ్ రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను మొహరిస్తాం. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. – నారాయణ, ఎస్పీ -
ఎన్నికల రథసారథులు..
సాక్షి, ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎన్నికల వేడి జోరందుకుంది..ఇప్పటికే భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..దీనికి తోడు ఎన్నికల ప్రచారాలు, సన్నాహాలు, నాయకుల విమర్శలు వాతావరణాన్ని మరింత వేడిసెగలు కక్కేలా చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసి అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తుండగానే.. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల విధులు నిర్వహించే రథసారధులు వారి బాధ్యతలు సమర్థంగా పూర్తి చేస్తేనే చివరి ఓటరు వరకు ఓటుహక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఎన్నికల తంతును విజయవంతంగా ముగించడంలో బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారుల కృషి విశేషంగా ఉంటుంది. ఏ ఒక్కరూ వారి విధులను సక్రమంగా నిర్వర్తించకున్నా పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు వెల్లడించే వరకు ప్రతీ సందర్భాన్ని అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఏవిధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ప్రధాన ఎన్నికల అధికారికి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతీ జిల్లాకు ఒక ఎన్నికల అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ జిల్లావ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికలు నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తారు. రిటర్నింగ్ అధికారి శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపుతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది నియామకం, శిక్షణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వంటి అన్ని రకాల పనులు ఆర్ఓ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ఆయా నియోజవర్గాల పరిధిలోని రెవెన్యూ డివిజినల్ అధికారి లేదా జేసీ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సెక్టోరల్ ఆఫీసర్ ఎనిమిది నుంచి పది కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక సెక్టోరల్ అధికారిని నియమిస్తారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు, అవసరమైనచోట 144 సెక్షన్ విధించే అధికారం సెక్టోరల్ అధికారికి ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ బూత్‌లు గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటుకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటాడు. ఆయన పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం, పోలింగ్ అనంతరం సీల్ వేసి స్ట్రాంగ్‌రూమ్‌కు వచ్చే వరకు ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతడికి సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్ కేంద్రంలో జరిగే అన్ని కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలోనే నడుస్తాయి. ఫ్లయింగ్‌స్క్వాడ్ మూడునాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందం ఉంటుంది. ఈ బృందం తమకు కేటాయించిన మండలాల పరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం వీరి బాధ్యత. ఓటరు నమోదు అధికారి ఓటర్ల జాబితా తయారు చేయడం ఈ అధికారి ప్రధాన బాధ్యత. ఓటును నమోదు చేసుకునే వారు జాబితాల్లో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు అధికారులు ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. పోలింగ్ ఏజెంట్లు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని నేరుగా పరిశీలించే అవకాశం ఉండనందున ప్రతీ పోలింగ్ కేంద్రంలో తన పక్షాన ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. ఈయనే పోలింగ్ ఏజెంట్. ఇతను ఓటు వేసేందుకు వచ్చిన వారి వివరాలను ఓటర్ల జాబితాలో సరి చేసుకుని అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెబుతారు. దీంతో దొంగ ఓట్లు పడకుండా చూడవచ్చు. పోలింగ్ ఏజెంట్ సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిర్వహణ జరిగిన తీరుపై నివేదిక రూపొందించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపించడంలో మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యవహరిస్తారు. బూత్‌లెవల్ అధికారులు కొత్తగా ఓటు నమోదు చేసకునే వారికి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయడం. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం. ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పు తదితర అంశాల్లో బూత్‌లెవల్ అధికారులు సేవలందిస్తారు. -
ఎన్నికలను నడిపించేది వీరే..
సాక్షి, పశ్చిమ గోదావరి : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. అధికారుల ఉరుకుల పరుగులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నచ్చిన వ్యక్తికి వేసుకోవడానికి అధికారుల పాత్ర కీలకమైనది. భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఎన్నికల ప్రకటన వచ్చిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అధికారులంతా ఎన్నికల సంఘం కింద పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎందరో అధికారుల శ్రమ దాగి ఉంటుంది. అన్నివర్గాల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా వ్యహరించాలి. ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. రిటర్నింగ్ అధికారి శాసనసభల ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, అభ్యర్థుల తుది జాబితాను వీరు తయారుచేస్తారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నియామకం, వారికి శిక్షణ, ఓట్లు లెక్కింపు, ఫలితాలు ప్రకటన వంటి అన్నిరకాల పనులు ఈయన పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఆయా నియోజకవర్గాల్లోన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) లేదా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యహరిస్తారు. సెక్టోరల్ అధికారి పది నుంచి ఎనిమిది మంది వరకు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఒక సెక్టోరల్ అధికారిని నియమిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు గాను అవసరమైన చోట 144 సెక్షన్ విధించే అధికారం సెక్టోరల్ అఫీసర్‌కు ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ బూత్‌లు గుర్తించి అక్కడ బందోబస్తుకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఆయన పోలింగ్‌కు అవసమైన ఈవీఎంలు, వీవీ పాట్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడం, పోలింగ్ అనంతరం సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే వరకు ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతని సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్ కేంద్రంలో జరిగే అన్ని కార్యకలాపాలు ఈయన పర్యవేక్షణలో జరుగుతాయి. ఓటర్ల నమోదు అధికారి ఓటర్ల జాబితా తయారు చేయడం ఈయన బాధ్యత. ఓటు నమోదు చేసుకునే వారు, జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు వీరిని సంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు సిబ్బంది పనిచేస్తారు. బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ) కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి దరఖాస్తులను అందజేయడం, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం, ఓటరు జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పు తదితర సేవలను బూత్ లెవెల్ అధికారి అందిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఉంటుంది. వీరు ఆ పరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేస్తారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికలు జరిగే తీరుపై నివేదిక రూపొందించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపడంలో మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యహరిస్తారు. పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రంలో తమ తరఫున ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. ఆయనే పోలింగ్ ఏజెంట్. వీరు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెబుతారు. ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతి జిల్లాకు ఒక జిల్లా అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ, జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణలో కీలక భూమిక పోషిస్తారు. -
టీడీపీలో మొదలైన టెన్షన్
సాక్షి, తిరుపతి: ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియను ముగించేలా నిర్ణయం తీసుకుంది. ఆమేరకు ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. పో లింగ్‌కు కేవలం నెలరోజుల సమయమే ఉండడంతో జిల్లాలోని అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. నెల రోజుల్లో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో పూర్తిచేయాల్సి ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 11న పోలింగ్.. మే 23న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. పోలిం గ్‌కు నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో తిరుపతి పార్లమెంట్, చిత్తూరు, నగరి, పూతలపట్టు, శ్రీకాళహస్తి, తిరుపతి, గంగాధరనెల్లూరు, సత్యవేడు, తంబళ్లపల్లి, మదనపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ఇంకా ఖరారు చెయ్యలేదు. దీంతో ఆ స్థానాలను ఆశిస్తున్న వారంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి దొరక్కపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు? నెల రోజుల సమయంలో అభ్యర్థుల్ని ఎప్పుడు ఎంపిక చేస్తారు?, మేనిఫెస్టో తయారుచేసి ఎప్పుడు ప్రకటిస్తారని టీడీపీ శ్రేణులు అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మార్చి 18న నోటిఫికేషన్ రావడం.. మార్చి 25తో నామినేషన్లు వేసేందుకు సమయం ముగుస్తుండడం పార్టీలను పరుగులు పెట్టిస్తోంది. అంటే 15 రోజుల్లోనే అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసేందుకు కూడా వారం సమయం మాత్రమే ఉండడం. ప్రచారానికి కూడా తక్కువ సమయం ఉండడం అధికార పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై నాన్చివేత ధోరణి అవలంభిస్తుండడంపై ఆశావాహులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, జనసేన జిల్లాలో ఊసే లేకుండా పోయింది. జనం హర్షం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిడంపై ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అరాచకాలు.. అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలతో విసిగి పోయిన జనం మాత్రం షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో కొందరు బాణా సంచాలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. నేటితో అరాచకపాలనకు తెరపడినట్లేనని సంబరపడుతుండటం గమనార్హం. -
రుద్రారంలో ఓట్ల తేడాపై ఈసీకి నివేదిక
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలం రుద్రారంలోని 183వ నంబర్ పోలింగ్ బూత్‌లో శుక్రవారం ఉదయం పోలింగ్ ఏజెంట్లతో నిర్వహించిన మాక్ పోలింగ్ ద్వారా వేసిన ఓట్లను తొలగించకుండానే పోలింగ్ కొనసాగించారు. ఈ కేంద్రంలో మొత్తం 565 ఓట్లు ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 518 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తం ఓట్లను సరిచూసుకోగా 555 ఓట్లు పోలైనట్లు కనిపించింది. వాస్తవ ఓట్ల కంటే 37 ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేసేందుకు నిరాకరించి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి బిక్కుసింగ్ సెక్టోరియల్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఓటింగ్ యంత్రాలను సీజ్ చేసి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ ఆదేశించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. మాక్ ఓటింగ్ క్లియర్ చేయడాన్ని ప్రిసైడింగ్ అధికారి మర్చిపోయారని, ఇదే విషయాన్ని ఈసీకి నివేదించామని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశం ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటామని, రీపోలింగ్ జరిపే అవకాశం లేదని స్పష్టం చేశారు. -
‘వలస’ ఓట్లను వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: సొంత రాష్ట్రంలో ఉండకపోయి నా ఎన్నికల సమయాల్లో వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే వారిపై కాంగ్రెస్‌పార్టీ దృష్టి పెట్టింది. ఉన్న ఓటర్లతోపాటు వలసఓటర్లను ఆకర్షించేలా ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులకు సూచనలు చేసింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ వలస కార్మికులను ఓటింగ్ కోసం రప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లి పట్టణాల్లో నివసిస్తున్న ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చింది. రాష్ట్రంలోని సరిహద్దు నియోజకవర్గాల నుం చి కర్ణాటక, మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలకు కార్మికులు వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 50 వేల గిరిజనుల జనాభాలో 35 వేల మంది వలస వెళ్లినవారే. జహీరాబాద్, జుక్కల్, బోధన్, నారాయణపేట్, ఆదిలాబాద్, బోథ్, అలంపూర్, గద్వాల, మక్తల్, అచ్చంపేట, కల్వకుర్తి, కోదాడ, ఆదిలాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఉపాధి అవకాశాల కోసం వెళ్లినవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఏ పార్టీ అయినా, 5 వేల ఓట్లకు తక్కువ మెజార్టీతోనే గట్టెక్కే అవకాశాలుంటాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షిస్తున్న కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని బృందం పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టి, వలస కార్మికులను పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా అభ్యర్థులకు మార్గదర్శనం చేసింది. దీంతోపాటే ఉత్తర తెలంగాణలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉండటంతో, వారి ఓట్లను రాబట్టుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
ప్రచారానికి తెర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఈనెల 7వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా.. 38 గంటల ముందుగానే ప్రచారం పరిసమాప్తమైంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బరిలో నిలిచిన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. జిల్లాలో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా 62 మంది బరిలో ఉండగా.. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరంగా సాగించారు. ఇప్పటివరకు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఆటోలు, ప్రచార వాహనాలపై మైకులతో ప్రచార జోరు సాగిం చారు. అభ్యర్థుల అనుచరులు కూడా తమకు పరిచయం ఉన్న ఇళ్లకు వెళ్లి.. తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 7వ తేదీన పోలింగ్ ఉండడం వల్ల ప్రచారం సమాప్తం కావడంతో పల్లెలు, పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. జిల్లాలోని మద్యం దుకాణాలను సాయంత్రం 6 గంటల నుంచి మూసివేశారు. ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులు చివరి నిమిషం వరకు తమ ప్రచారం కొనసాగించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించగా.. ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ నగరంలోని 15వ డివిజన్లో చివరి సభ నిర్వహించారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి తిరుమలాయ పాలెం మండలం రమణతండాలో.. ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో.. మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క మధిర మండలం సిద్ధినేనిగూడెంలో చివరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మధిర టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిర పట్టణంలో చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించి.. పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా అభ్యర్థించారు. వైరా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మదన్‌లాల్, ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాణోతు విజయ నియోజకవర్గంలోని వైరా మండలం అష్ణగుర్తిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సత్తుపల్లిలో ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ, సీపీఎం–బీఎల్పీ సైతం చివరి రోజు ఎన్నికల ప్రచార సభల ను ఆయా గ్రామాల్లో విస్తృతంగా నిర్వహించాయి. రాష్ట్ర, జాతీయస్థాయి నేతల ప్రచారం ఈసారి ఎన్నికలను రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు సర్వశక్తులొడ్డి పోరాడుతున్నాయి. ఇటు టీఆర్ఎస్, అటు ప్రజాకూటమి పక్షాలతోపాటు బీజేపీ, బీఎల్ఎఫ్–సీపీఎం కూటమి, స్వతంత్ర అభ్యర్థులు జోరుగా ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ, బీఎల్ఎఫ్–సీపీఎం కూటమి తరఫున రాష్ట్ర, జాతీయ నాయకులు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ తరఫున ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో రెండుసార్లు పర్యటించగా.. కేటీఆర్ కూడా ఒకసారి ఖమ్మంలో రోడ్‌షో చేపట్టారు. ప్రజాకూటమి తరఫున ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో కలిసి పాల్గొన్నారు. మరో సారి చంద్రబాబునాయుడు సత్తుపల్లిలో పర్యటించి.. టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఇక మధిరలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఖమ్మంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ రోడ్‌షోలు చేసి.. ఆయా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థుల తరఫున స్వామి పరిపూర్ణానంద, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఎల్ఎఫ్–సీపీఎం తరఫున సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రచారం చేశారు. అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొనడంతో అభ్యర్థులు అలుపెరగకుండా ప్రచారం నిర్వహించారు. ఎత్తుగడల్లో అభ్యర్థులు ప్రచారానికి తెరపడడంతో అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ఏ ప్రాం తంలో పరిస్థితి ఎలా ఉంది? ఓట్లు సాధించడానికి ఏం చేయాలనే దానిపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రచా రం ముగించిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అడ్డుకట్ట వేసేందుకు చర్యలు జిల్లాలో డబ్బుల పంపిణీ ఊపందుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. మండల కమిటీలతోపాటు జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీలను వేశారు. ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ తదితర బృందాలతో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన ప్పటి నుంచి పోలీసులు వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో నగదు తీసుకెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతోపాటు లెక్కలు చూపని వాటిని సీజ్ చేశారు. పోలింగ్ రోజున అభ్యర్థులు ఎటువంటి ప్రచారం నిర్వహించవద్దని హెచ్చరించారు. కాగా.. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. -
సిరిసిల్ల: ప్రలోభాల పర్వం
జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత అభ్యర్థుల ప్రచారం ముగుస్తుంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం, మనీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడికక్కడ ఓటు లెక్కన ముట్టజెప్పడానికి అన్నిఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నేటిసాయంత్రం నుంచి పోలింగ్ రోజువరకు జిల్లాలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయి. దీంతో ముందస్తు వ్యూహంతో భారీ స్థాయిలో మద్యం నిల్వలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం, డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఉంచినా.. యంత్రాంగం కళ్లుగప్పి తమపని తాము చేసుకుపోవడానికి అభ్యర్థులు రెడీ అవుతున్నట్లు సమాచారం. సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో అభ్యర్థుల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత మైకులు, ప్రచారాలు, ప్రసంగాలు ఉండరాదని, ప్రచారం కోసం వచ్చిన బయటి వ్యక్తులు సైతం సాయంత్రానికల్లా నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. ప్రచారపర్వం తర్వాత, పోలింగ్ సమయానికి ముందున్న 48 గంటల పాటు జిల్లాలో ప్రలోభాల పర్వం జోరుగా సాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరెండు రోజుల్లో చీకటిమాటున పెద్దఎత్తున ఓటర్లను డబ్బు, మద్యంతో ఎరవేసి ప్రలోభపర్చుకోవడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నిఘా కళ్లు గప్పి.. జిల్లాలోని కొంతమంది అభ్యర్థులు నిఘా కట్టుదిట్టం కాకముందే జాగ్రత్తపడి ముందస్తుగానే తమ నియోజవర్గాల్లోని నమ్మకస్తుల వద్ద, మండలస్థాయి నాయకుల వద్ద అవసరమైన సరుకు నిల్వ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న బడా వ్యాపారులు, బంధువుల ద్వారా నిధుల సమీకరణ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లకు ఎర.. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఆయా పార్టీల బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణ కోసం జనసమీకరణలో మహిళలనే భారీసంఖ్యలో భాగస్వామ్యం చేసుకోవడంపై దృష్టి సారించాయి. వారి ఓట్లను రాబ ట్టుకోవడానికి అభ్యర్థులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు తమ ఔదర్యాన్ని ఒలకబోస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు కమ్యూనిటీహాళ్ల నిర్మాణం విషయంలో తామంటే తాము నిర్మిస్తామని హామీలు గు ప్పిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల మహిళా సంఘా ల గ్రూపులకు ఒక్కో బృందానికి రూ.30 వేల చొప్పున సమకూర్చుతూ వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
పోలింగ్ స్లిప్ పై గూగుల్‌మ్యాప్!
సాక్షి, పెద్దపల్లిఅర్బన్: జిల్లావ్యాప్తంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసేలా అవగాహన ర్యాలీలు, ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై వివిధ సంస్థల ద్వారా కార్యక్రమాలు కొనసాగించారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందిస్తున్నారు. ఓటుహక్కు వినియోగించుకుంటే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీదేవసేన సందేశ పత్రాన్ని ఓటర్లకు అందజేస్తున్నారు. గ్రామాల్లో ఓటుహక్కు వినిచయోగించుకునే వారి సంఖ్య బాగానే ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంపై అధికారులు ఆలోచనలోపడ్డారు. ఇందులో భాగంగా పోలింగ్ స్లిప్పుల్లో కొత్తగా మార్పులు చేపట్టారు. పోలింగ్ స్లిప్ మీద ఓటరు ఫొటోతో పాటు వెనకాల బూత్‌కు వెళ్లే దారి, చిరునామా, గూగుల్‌మ్యాప్ ప్రింట్చేశారు. పోలింగ్ స్టేషన్ నంబర్, పోలింగ్ తేదీని ముద్రించారు. తేలికగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని 6,17,726 మంది ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం 804 పోలింగ్ స్టేషన్ల వివరాలు గూగుల్ మ్యాప్‌తో అనుసంధానం చేశారు. పోలింగ్‌శాతం పెరిగేలా.. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా నమోదవుతోంది. చదువుకున్నవారు, మేధావులు, వ్యాపారులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఓటింగ్ నమోదవడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారాన్ని చేపట్టడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2009 ఎన్నికలతో పోల్చుకుంటే 2014లో ఓటింగ్ శాతం మెరుగైనప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. స్పందించిన అధికారులు కారణాలను అన్వేషించి కొత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో పెరిగిన ఓటింగ్.. 2009 ఎన్నికల్లో మంథనిలో 2,02,756 ఓటర్లుండగా 1,50,881 ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,25,755 ఓటర్లుండగా 1,59,384 ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 2,04,981 మంది ఓటర్లుండగా 1,19,051 ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో మంథనిలో 2,10,161 ఓటర్లుండగా 1,69,898 ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,20,926 ఓటర్లుండగా 1,11,674 ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 2,22,354 మంది ఓటర్లుండగా 1,39,394 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కావడం విశేషం. అంటే 2009లో మంథనిలో 74.40, పెద్దపల్లి 70.60, రామగుండం 58.08, 2009లో మంథనిలో 81.02 పెద్దపల్లి 75.97, రామగుండం 61.91గా నమోదైంది. మంథనిలో చైతన్యం.. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కంటే మంథని నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మారుమూల ప్రాంతంకావడం, పోలింగ్ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉన్నప్పటికీ, మావోయిస్టుల ప్రభావాన్ని సైతం అధిగమించి ఓటింగ్‌లో పాల్గొని మిగితా వారికి ఆదర్శంగా నిలిచారు. 2009లో 74.40 శాతం, 2014లో 81.02 శాతం ఓటింగ్ నమోదుచేసి రికార్డు సృష్టించారు. 2009లో 58.08, 2014లో 61.91 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా రామగుండం అట్టడుగునా నిలిచింది. యూత్‌పై ప్రత్యేక దృష్టి.. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని పోలింగ్ బూత్‌కు తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఓటుహక్కు పొందిన వారిపై దృష్టిని కేంద్రీకరించారు. 18 నుంచి 35 ఏళ్ల యువతను పోలింగ్ కేంద్రానికి రప్పించేలా టెక్నాలజీ సహాయాన్ని తీసుకుంటున్నారు. గూగుల్ సహాయంతో పోలింగ్ కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌లు ప్రింట్చేసి ఆకట్టుకుంటున్నారు. జిల్లాలో 1,64,009 మంది యువత ఓటుహక్కును కలిగి ఉన్నారు. వీరిలో పురుషులు 88,076 మంది కాగా యువతులు 75,933 మంది ఉన్నారు. -
సిరిసిల్ల: ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తిచేయగా.. ఈవీఎంలలో బ్యాలెట్ పత్రాల కమిషనింగ్ సైతం కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 505 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 2,910 మంది సిబ్బందిని సిద్ధంచేశారు. జిల్లాలో 4,10,999 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా దివ్యాంగుల కోసం సిరిసిల్ల బాలికల హైస్కూల్, వేములవాడ మండలం కోనాయిపల్లి పాఠశాలలో దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మహిళల కోసం మొత్తం మహిళా పోలింగ్ సిబ్బందితో సిరిసిల్ల గీతానగర్ స్కూల్, వేములవాడ సాంస్కృతిక డిగ్రీ కళాశాలలో ప్రత్యేక మహిళా కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. పోలింగ్ సిబ్బంది నియామకం.. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం 2,910 మంది సిబ్బందిని నియమించారు. వేములవాడ నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలు ఉండగా 15శాతం అదనపు సిబ్బందితో కలిపి 271 మంది పోలింగ్ అధికారులను, మరో 271 మంది ఏపీవోలను, 542 మంది అదనపు పోలింగ్ సిబ్బందిని నియమించారు. మరో 271 మందిని ఎన్నికల నిర్వహణకు ఎంపికచేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 270 పోలింగ్ కేంద్రాలు ఉండగా 311 మంది పోలింగ్ అధికారులు, మరో 311 మంది ఏపీవోలు, 622 మంది ఓపీవోలను, 311 మంది అదనపు సిబ్బందిని నియమించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామరెడ్డి పూర్తిచేశారు. ఫొటో పోల్ చిట్టీల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఫొటో పోల్ చిట్టీలను బూత్ లెవల్ అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 62వేల మందికి ఈ చిట్టీలను పంపిణీ చేశారు. వీటితోపాటు కొత్తగా ఓటర్లుగా నమోదైన యువకులకు ఓటరు గుర్తింపుకార్డులను జారీచేస్తున్నారు. మూడురోజల కిందటే జిల్లాకు కొత్త ఓటరు గుర్తింపుకార్డులు వచ్చాయి. వీటిని జిల్లావ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఎన్నారై ఓటర్లు ఇద్దరు ఉండగా సర్వీసు ఓటర్లు 93 మంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పనులు చురుకుగా సాగుతున్నాయి. వెబ్ కెమెరాలకు ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కోసం వెబ్కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే లాప్‌ట్యాప్‌లు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి వెబ్‌కాస్టింగ్‌పై శిక్షణ ఇచ్చారు. హై ఫ్రీక్వెన్సీ ఉన్న కెమెరాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 69 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వి«ధిగా కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఎన్నికలు 2018 మరిన్ని వార్తలకు... -
ఎన్నికల్లో ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి
డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వర్తించే అదికారులు, సిబ్బంది ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా, సూక్ష్మంగా పరిశీలించాలని జేసీ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్లో మంగళవారం ఎన్నికల మైక్రో అధికారులతో ఆమె సమావేశమయ్యారు. సాక్షి,సిరిసిల్ల : ఎన్నికల్లో ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాలని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సూచించారు. స్థానిక పొదుపు భవన్లో పోలింగ్ సూక్ష్మస్థాయి అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో జరిగిన ప్రతీ అంశాన్ని మైక్రో పరిశీలకులు నివేదిక రూపంలో అందజేయాలన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మైక్రో పరిశీలకులు కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఒకరోజు ముందుగానే మైక్రో పరిశీలకులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్‌లో వచ్చిన ఓట్లను ఈవీఎంలతో సరిపోల్చి, ఈవీఎం పనిచేస్తున్న విధానాన్ని ఏజెంట్లకు తెలపాలన్నారు. అన్ని సవ్యంగా ఉంటే ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీజ్‌చేయాలని సూచించారు. లోటుపాట్లు ఉంటే ఎన్నికల అధికారులకు నివేదించాలని కోరారు. సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రవత్ కుమార్లెంక, ఎల్డీఎం రంగారెడ్డి, ఎంఈవో రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
ఓటేస్తూ సెల్ఫీలు వద్దు
షాద్‌నగర్ టౌన్: ఇటీవల సెల్ఫీలు తీసుకోవడం జనానికి ఓ సరదాగా మారిపోయింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇట్టే సెల్‌ఫోన్ కెమెరాతో బంధిస్తున్నారు. విందులు, వినోదాలు, శుభకార్యాలు, విహార యాత్రలతో పాటుగా మిత్రులు, బంధువులతో సరదాగా గడిపే సన్నివేశాలను సెల్ఫీలు తీసుకుంటుంటారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌ను సైతం యువత సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రంలో ఓటేస్తూ సెల్‌ఫోన్‌తో సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే ఇబ్బందులు తప్పవు. ఓటేస్తూ పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలు దిగడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఓటేస్తూ సెల్ఫీలు దిగడం నిషేధం పోలింగ్ కేంద్రంలో ఓటేస్తూ సెల్ఫీలు తీసుకోవడాన్ని ఎన్నికల సంఘం పూర్తిగా నిషేధించింది. ఒకవేళ ఓటరు అలా చేస్తే 49ఎం(ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు ఎన్నికల అధికారులు ఓటరును బయటకు పంపించేస్తారు. ఆ ఓటును ఎన్నికల నియమావళిలోని 17ఏలో నమోదు చేస్తారు. అయితే, ఓట్ల లెక్కింపు సమయంలో సదరు ఓటును పరిగణలోకి తీసుకోరు. ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసి సెల్ఫీలు తీసుకొని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా మెలగడం మంచిది. ఎన్నికల్లో ఒక్కో ఓటు కూడా ఎంతో కీలకం. ఈనేపథ్యంలో సెల్ఫీలు కట్టిపెట్టి నిబంధనలు పాటించి ఈవీఎంలో తమకు నచ్చిన నేతకు ఓటు వేసి బయటికి రావాలి. -
ఏ అధికారి ఏం చేస్తాడో.. మీకు తెలుసా..?
మెదక్ అర్బన్: ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా... అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించింది. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల నామినేషన్ పత్రాల దాఖలు, పోలింగ్ ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెలువరించేంత వరకు బూత్‌లెవల్ అధికారుల నుంచి జిల్లా ఎన్నికల అధికారుల వరకు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏ బాధ్యత రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తున్న ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్వర్తించే బాధ్యతలను వివరిస్తూ ప్రత్యేక కథనం.... ప్రిసైడింగ్ అధికారి... ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చడం వరకు వీరి బాధ్యత. వీరికి సహాయ ప్రిసైడింగ్ అధికారులు అవసరమైన చోట సహాయం అందిస్తుంటారు. పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలు వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి. సెక్టోరియల్ అధికారి... నియోజకవర్గాల్లోని 8 నుంచి పది పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు సెక్టోరియల్ అధికారులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఆయా పోలింగ్ బూత్‌లలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడం వీరి బాధ్యతలు. అక్కడి పరిస్థితులను బట్టి ఆయా చోట్ల 144 సెక్షన్ విధించే అధికారం కలిగి ఉంటారు. రిటర్నింగ్ అధికారి... ఎన్నికల నిర్వహణకు కేంద్రం రిటర్నింగ్ అధికారులను నియమిస్తుంది. సంబంధిత నియోజకవర్గాలను పర్యేవేక్షించడం, ఆ పరిధిలోని మండలాల్లో విస్తృతంగా పర్యటించడం, నామినేషన్ల ప్రక్రియ, ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించడం, వారికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణంగా ఆర్డీఓలకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు. జిల్లా ఎన్నికల అధికారి.. ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతీ జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడం, నామినేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం తదితర కార్యక్రమాల్లో ఎన్నికల అధికారి పాత్ర ఎంతో ఉంటుంది. బూత్ లెవల్ అధికారులు... కొత్తగా ఓటరు లిస్టులో చేరే వారిని, తొలగింపులు, తప్పుల సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడటం, ఓటర్ల జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ప్రతిపాదించడం వంటివి చేస్తుంటారు. వీఆర్ఏలు, పంచాయతీ కారోబార్లు, అంగన్వాడీ టీచర్లను బూత్‌లెవల్ అధికారులుగా నియమిస్తారు. కొత్తగా ఓటరు లిస్టులో చేరే వారిని, తొలగింపులు, తప్పుల సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడటం, ఓటర్ల జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ప్రతిపాదించడం వంటివి చేస్తుంటారు. వీఆర్ఏలు, పంచాయతీ కారోబార్లు, అంగన్వాడీ టీచర్లను బూత్‌లెవల్ అధికారులుగా నియమిస్తారు. పోలింగ్ ఏజెంట్లు... ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులు పోలింగ్ జరిగే ప్రతీ కేంద్రాన్ని నేరుగా పరిశీలించలేరు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ ఏజెంట్‌ను నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. పోలింగ్ ఏజెంట్ ఆ కేంద్రంలో ఓటరై ఉండాలి. ఓటరు నమోదు అధికారి... ఓటరు నమోదు అధికారి ప్రతీ నియోజకవర్గానికి ఒకరు ఉంటారు. ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా తయారీ వీరి ప్రధాన విధులు, జాబితాలో పేర్లు, చిరునామా, ఫొటోలు, ఏమైనా తప్పులు ఉంటే ఈ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం.. ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన మెదక్, నర్సాపూర్‌లో ఎన్నికలకు సంబంధించి సిబ్బంది నియామకం పూర్తికావచ్చింది. సూక్ష్మపరిశీలకుల నియామకం ఇంకా రెండు మూడు రోజుల్లో జరుగుతుంది. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది నియామకం ర్యాండమ్ పద్ధతిలో జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నాం. –నగేశ్, జాయింట్ కలెక్టర్, మెదక్ సూక్ష్మ పరిశీలకులు... కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల పర్యవేక్షణపై నివేదిక రూపొందించి పంపించేందుకు సూక్ష్మపరిశీలకులను నియమిస్తారు. వీరు ప్రతి మండలానికి ఒకరు మాత్రమే ఉంటారు. వీరంతా ఎన్నికల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం..
సాక్షి, కల్వకుర్తి టౌన్ : రానున్న ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు దరఖాస్తు గడువు పూర్తయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పక్క రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం కాగా.. అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లను జియో ట్యాగింగ్ చేశారు. దీనికోసం లాంగిట్యూడ్, లాటిట్యూడ్ పక్రియ పూర్తయింది. తద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ పోలింగ్ స్టేషన్లో జరిగే పోలింగ్ సరళినైనా అధికారులు పరిశీలించే వెసలుబాటు కలగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలే కాకుండా మారుమూల గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల జియో ట్యాగింగ్ కూడా పూర్తయింది. ఇందుకోసం ప్రతీ పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఛాయాచిత్రాలను ఎస్ఐలు, సిబ్బంది ట్యాబ్‌ల ద్వారా సేకరించి జియో ట్యాగింగ్ చేశారు. తద్వారా పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఏవైనా అనుకోని సంఘటనలు, గొడవలు జరిగితే రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తించేందుకు వెసలుబాటు కలుగుతుంది. దీంతో కింది స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపించేందుకు జియో ట్యాగింగ్ ఉపయోగపడనుంది. పకడ్బందీగా నిర్వహించేందుకు... ముందస్తు ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ముందుచూపుతో వ్యవహరిస్తోంది. జిల్లాలోని సున్నితమైన ప్రాంతాలను, అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పక్రియ చివరి దశకు చేరుకుంది. పోలింగ్ కేంద్రాలలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల భవనాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరిగి కేసులు నమోదై ఉంటే ఆ ఘటనలను పరిగణనలోకి తీసుకుని వాటిపై ప్రత్యేక నిఘా ఉంచునున్నారు. పాత నేరస్తులపై నిఘా అన్ని పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటుగా ఆయా పోలింగ్ కేంద్రాలలో ఉన్న పాత నేరస్తులు, హిస్టరీ షీట్స్ ఉన్న వ్యక్తులు, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో ఉన్న వారందరినీ బైండోవర్ చేస్తున్నారు. తద్వారా వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆయా వ్యక్తులు ఎక్కడకు వెళ్తున్నారు, ఇంకా నేర ప్రవృత్తిలో యాక్టివ్‌గా ఉన్నారా, లేదా అన్న పూర్తి విషయాలపై సమాచారాన్ని కూడా సిద్ధం చేశారు. గుర్తింపు సులభం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,635 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో 775 పోలింగ్ కేంద్రాలు, వనపర్తి జిల్లాలో 278, జోగులాంబ గద్వాల జిల్లాలో 507, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,332 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినప్పుడు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని అత్యధిక మండలాలు రంగారెడ్డి జిల్లా కలవటంతో ఎన్నికల నిర్వహణ బాధ్యత అంతా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లపోయింది. షాద్‌నగర్ నియోజకవర్గం కూడా రంగారెడ్డి జిల్లాలోకి, కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఇలా వెళ్లిన నియోజకవర్గాల ఎన్నికల పక్రియ ఆయా నూతన జిల్లాల అధికారులే నిర్వహిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలు, కొడంగల్‌లో 264 పోలింగ్ కేంద్రాలు, షాద్‌నగర్‌లో 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సీసీ కెమెరాలతో నిఘా ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ గట్టి బందోబస్తులో పాటు పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను జియో ట్యాగింగ్ చేశారు. అలాగే, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ పక్రియ పూర్తయింది. జియో ట్యాగింగ్ చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయా మండల పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. జియో ట్యాగింగ్ చేసిన పోలింగ్ స్టేషన్లను ప్రత్యేక విభాగం ద్వారా పరిశీలించనున్నారు. అంతేకాకుండా మొత్తం పోలింగ్ కేంద్రాలపై జియో ట్యాగింగ్‌తో పాటుగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఆయా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ పోలింగ్ నిర్వహణ తీరు ఎలా ఉందనే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో డీజీపీ తెలుసుకొనే వెసులుబాటు కలగనుంది. జియో ట్యాగింగ్ పూర్తయింది.. అన్ని పోలింగ్ కేం ద్రాలను జియో ట్యాగింగ్ ద్వారా ల్యాంగిట్యూడ్, లాటిట్యూడ్ పూర్తి చేశాం. నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మరికొన్ని చోట్ల కేంద్రాలను అదే గ్రామంలో వేరే ప్రాంతానికి మార్చటం వల్ల వాటి జియోట్యాగింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్లను జియోట్యాగింగ్ చేసి ఆయా మండలాల పోలీస్స్టేషన్లకు అనుసంధానం చేశాం. పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి ఉంచి, వారి కార్యాకలాపాలపై నిఘా పెంచాం. - పుష్పారెడ్డి, కల్వకుర్తి డీఎస్పీ -
ఎవరెవరు.. ఏం చేస్తారంటే..?
కరకగూడెం: ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా, అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమిస్తుంది. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కుని వినియోగించుకునే వాతావరణం కల్పించడం, చూడడం అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అభ్యర్థుల నామినేషన్ పత్రాల దాఖలు, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెలువరించేవరకు బూత్ లెవల్ అధికారుల నుంచి జిల్లా ఎన్నికల అధికారుల వరకు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించారు. ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తారో తెలుసుకుందాం! జిల్లా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతీ జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడం, నామినేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబిత ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేయడం తదితర కార్యక్రమాల్లో ఎన్నికల ప్రధాన అధికారి పాత్ర ఎంతో ఉంటుంది. రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిర్వహణకు కేంద్రం రిటర్నింగ్ అధికారులను నియమిస్తుంది. సంబంధిత నియోజకవర్గాలను పర్యవేక్షించడం, ఆ పరిధిలోని మండలాల్లో విస్తృతంగా పర్యటించడం, నామినేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబిత ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, వారికి శిక్షణనివ్వడం తదితర కార్యక్రమాలు చేస్తారు. ఆర్డీఓలకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు. సెక్టోరియల్ అధికారి ఆయా నియోజకవర్గాల్లోని 8 నుంచి 10 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు సెక్టోరియల్ అధికారిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరి బాధ్యతలు ఆయా బూత్‌లలో ప్రశాంతమైన వాతవరణం ఉండేలా చర్యలు తీసుకోవడం. అక్కడి పరిస్థితులను బట్టి ఆయా చోట్ల 144 సెక్షన్ విధించే అధికారం కలిగి ఉంటారు. ఓటరు నమోదు అధికారి ఓటరు నమోదు అధికారిగా ప్రతీ నియోజవర్గ స్థాయిలో ఉంటారు. ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా తయారి వీరి ప్రధాన విధులు. జాబితాలో పేర్లు , చిరునామా, ఫొటోలు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించాల్సింటుంది. ప్రిసైడింగ్ అధికారి ప్రతీ పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఎన్నికలకవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూంకు చేర్చడం వరకు వీరి బాధ్యత కీలకం. వీరికి సహాయ ప్రిసైడింగ్ అధికారులు అవసరమైన సహాయం అ«ందిస్తారు. పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలు వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి. సూక్ష్మ పరిశీలకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల పర్యవేక్షణపై నివేదిక రూపొందించి పంపించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తారు. ప్రతి మండలానికి ఒకరు మాత్రమే ఉంటారు. వీరంతా ఎన్నికల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పోలింగ్ ఏజెంట్లు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటిపడే అభ్యర్థులు పోలింగ్ జరిగే ప్రతీ కేంద్రాన్ని నేరుగా పరిశీలించలేరు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ ఏజెంటును నియమించుకోవచ్చు. పోలింగ్ ఏజెంటు ఆ కేంద్రంలో ఓటరై ఉండాలి. బూత్ లెవల్ అధికారులు కొత్తగా ఓటర్ల జాబితాలో చేరేవారికి ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పు ల సవరణకు అవసరమైన ఫారాలివ్వడం, అర్హులైన ఓటర్లంత ఓటర్లుగా నమోదయ్యేలా చూడడం, ఓటర్ల జాబితా ప్రదర్శన పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకారం అందించడం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ప్రతిపాదించడం వంటివి చేస్తుంటారు. వీఆర్ఏలు, కారోబార్లు, అంగన్వాడీ టీచర్లను బూత్ లెవల్ అధికారులుగా నియమిస్తారు.