ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రేపు(శనివారం) చివరి(ఏడో)విడత పోలింగ్ జరగనుంది. ఈమేరకు ఏడో విడత పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడో విడతలో భాగంగా 57 లోక్ సభ స్థానలకు పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఏడో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. రేపు(శనివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
10.06కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్లమంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళ ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
ప్రముఖుల స్థానాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( వారణాసి), బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ (మండి) స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీరితో పాటు పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment