మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్‌ భారతీ | AAP Somnath Bharti Says Will Shave My Head If bjp wins Over Exit Polls | Sakshi

మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్‌ భారతీ

Published Sun, Jun 2 2024 8:55 AM | Last Updated on Sun, Jun 2 2024 8:55 AM

AAP Somnath Bharti Says Will Shave My Head If bjp wins Over Exit Polls

ఢిల్లీ:  పలు పర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి సుమారు 350 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. బీజేపీ, ఎన్డీయే కూటమికి అధిక సీట్లు వస్తాయిని పేర్కొన్న సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతీ తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం కౌంటింగ్‌ రోజున అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తప్పని తేలిపోతాయని అన్నారు. బీజేపీ అధిక సీట్లు గెలుచుకొని మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేయించుకుంటానని ఛాలెంజ్‌ చేశారు.

‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేసుకుంటా. నా మాటలు రాసిపెట్టుకోండి. అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తప్పు అని జూన్‌ 4న తెలిసిసోతుంది. నరేంద్రమోదీ మూడోసారి పీఎం కాలేడు. ఢిల్లీ మొత్తం ఏడు స్థానాల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి గెలుస్తుంది. మోదీపై ఉన్న భయంతో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఆయన ఓడిపోతారని వెల్లడించవు. మేము జూన్ 4న విడుదల అయ్యే నిజమైన ఫలితాల కోసం ఎదురు చుస్తున్నాం. ప్రజలు ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ భారీగా ఓట్లు వేశారు’’ అని సోమనాథ్‌ భారతీ  ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

 

ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించిన బీజేపీ.. తాము సులభంగా అధిక సీట్లు గెలుస్తామని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తెలిపాయి. దేశ ప్రజలు మోదీ మూడుసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ, సోమనాథ్‌ భారతీలానే చాలా మంది ప్రతిపక్ష నేతలు ఎగ్జిట్‌ పోల్స్‌ను తప్పని అంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.

2019లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మొత్తం ఏడు సీట్లకు 6 సీట్లు కౌవసం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడిస్తే.. ఏకంగా ఏడు సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి  ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 4 స్థానాల్లో, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో  పోటీ చేసింది. ఈసారి ఏడు సీట్లలోను తామే గెలుస్తామని ఆ రెండు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement