Exit Polls 2024
-
Maharashtra Elections: మళ్లీ మహాయుతి!
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలూ అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక్క లోక్‌పోల్ మాత్రమే ఎంవీఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి.జార్ఖండ్‌లో టఫ్ ఫైట్ జార్ఖండ్‌లో అధికార జేఎంఎం–కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్టు పేర్కొన్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరికి హంగ్ వచి్చనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లొస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్టు సంస్థ తెలిపింది. -
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ .. ఎవరి సత్తా ఎంతంటే?
సాక్షి,ఢిల్లీ: మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని వెల్లడించాయి. ఇక, సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర (పీపుల్స్‌పల్స్)బీజేపీ 182, కాంగ్రెస్ 97,ఇతరులు 9 మహరాష్ట్ర (ఏబీపీ) : బీజేపీ 150-170 కాంగ్రెస్ 110-130ఇతరులు 8-10 ఝార్ఖండ్ (పీపుల్స్ పల్స్) ఎన్డీయే-46-58జేఎంఎం కూటమి 24-37 ఇతరులు 6-10 చాణక్య (మహారాష్ట్ర)ఎన్డీఏ 152-160ఇండియా 130-138చాణక్య(ఝార్ఖండ్) ఎన్డీఏ 45-50జేఎంఎం 35-38ఏబీపీ(మహారాష్ట్ర)ఎన్డీఏ 150-170ఎంవీఏ 110-130ఇతరులు 6-8కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగ్గా. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్‌పవార్ 86 సీట్లలో తలపడుతున్నారు.ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30 సీట్లలో, జేఎంఎం 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 81 సీట్లలో తలపడుతోంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి. -
హస్తం అస్తవ్యస్తం
హరియాణాలో ఈసారి కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, తీవ్రంగా నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, ఎలాగూ గెలిచేది మేమేనన్న కాంగ్రెస్ నేతల అతి ఆత్మవిశ్వాసం.. వెరసి హస్తం పార్టీని మరోసారి అధికారానికి దూరంచేశాయి. మోదీ–షా ద్వయం రాజకీయ చతురత ధాటికి కాంగ్రెస్ మూడోసారీ ఓటమిని మూటగట్టుకుంది. స్వీయ తప్పిదాలు సైతం కాంగ్రెస్‌ను విజయానికి ఆమడదూరంలో ఆపేశాయి. కేవలం జాట్ వర్గం పైనే గంపెడాశలు పెట్టుకోవడం, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హూడా అడుగుజాడల్లో నడవడం, కుమారి సెల్జా వంటి దళిత నాయకురాలికి ప్రాధాన్యత తగ్గించడం, అగ్రనేతల మధ్య లోపించిన ఐక్యత వంటి అంశాలు కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారం పీఠంపై కూర్చోనివ్వకుండా చేశాయి.ఏకమైన జాట్ వ్యతిరేక ఓట్లుమొదట్నుంచీ రాష్ట్రంలోని జాట్ ఓట్లనే కాంగ్రెస్ నమ్ముకుంది. జాట్యేతర దళితులు, ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాలను కాంగ్రెస్ పసిగట్టలేకపోయింది. ఇది కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం. బీజేపీ అత్యధిక టికెట్లను ఓబీసీలు, బ్రాహ్మణులకే ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ భూపీందర్ నిర్ణయాలపై ఆధారపడింది. దీన్ని అలుసుగా తీసుకున్న భూపీందర్ కేవలం తన అనుచరగణానికే పెద్దపీట వేశారు. ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలను శాసించే భూపీందర్ పరోక్షంగా పార్టీ ఓటమికి కారణమయ్యారు.గెలుపు గుర్రాలా? కాదా? అనేది చూసుకోకుండా తన అనుచరవర్గానికే అత్యధికంగా పార్టీ టికెట్లు దక్కేలాచేశారు. రాష్ట్రంలో 90 స్థానాలుంటే 72 చోట్ల కాంగ్రెస్ టికెట్ పొందిన వాళ్లు భూపేందర్ మనుషులే. తాను గెలిచి తన వారినీ గెలిపించుకుంటానన్న భూపీందర్ అతివిశ్వాసమే కాంగ్రెస్ పుట్టి ముంచిందని తెలుస్తోంది. కుమారి సెల్జా తన అనుచరుల్లో 9 మందికి టికెట్ దక్కేలా చేశారు. రణ్‌దీప్ సూర్జేవాలా సైతం తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో గెలుపు గుర్రాలను పక్కనబెట్టిన కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది.దూరంగా ఉండిపోయిన సెల్జాబీజేపీకి దగ్గరవుతున్న దళితులను కాంగ్రెస్ వైపునకు తిప్పే సత్తా ఉన్న దళిత నాయకురాలు కుమారి సెల్జా. అయితే ఈమె ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. సిర్సా ఎంపీ అయిన సెల్జాను పార్టీ అధిష్టా నమే హరియాణా ఎన్నికల్లో కలగజేసు కోవద్దని సూచించినట్లు సమాచారం. దీని వెనుక భూపీందర్ హస్తముందని వార్తలొచ్చాయి. పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ సెల్జా పాల్గొనలేదు. కీలక ప్రచార ఘట్టాల్లోనూ ఆమె జాడ లేదు. ఒకే పార్టీలో వేర్వేరుగా ప్రచారంరాష్ట్ర నేతలంతా కలిసి ఒకే ప్రచార కార్యక్రమం చేస్తే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అందుకు భిన్నంగా ముఖ్య నేతలు ఎవరికి వారే భిన్న కార్యక్రమాలు చేపట్టి దేనికీ అగ్రతాంబూలం దక్కకుండా చేసుకున్నారు. భూపీందర్ వర్గం విడిగా ‘ఘర్ ఘర్ కాంగ్రెస్’ అంటూ ఇంటింటికీ ప్రచారం మొదలెట్టింది. వీళ్లకు పోటీగా కాంగ్రెస్‌లోనే సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలాలు ‘కాంగ్రెస్ సందేశ్’ యాత్రను మొదలెట్టారు. హరియాణా జనాభాలో 26–28 శాతం మంది జాట్లు ఉంటారు. ఇక్కడ 17 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. మెజారిటీ మార్కును చేరుకోవడానికి అవకాశాలను పెంచే ఈ ఎస్సీ స్థానాలపై కాంగ్రెస్ పెద్దగా దృష్టిపెట్టలేదు. దెబ్బకొట్టిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులుప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీనిని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అవరోధంగా తయారయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులకు మళ్లాయి. దీంతో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు. ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. చాలా స్థానాల్లో గెలుపు మార్జిన్లు చాలా స్వల్పంగా ఉండటం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా చీలినట్లు అర్థమవుతోంది. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా కేవలం 0.85 శాతం కాగా, ఒంటరిగా పోటీ చేసిన ఆప్‌కు 1.79 శాతం ఓట్లు రావడం గమనార్హం.మరోవైపు దళితుల ఓట్లు పెద్దగా కాంగ్రెస్‌కు పడలేదు. జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, ఆజాద్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు ప్రధానంగా దళితుల ఓట్లపై దృష్టిపెట్టాయి. దీంతో దళితులు కేవలం ఒక్క పార్టీకే ఓటేయకుండా వేర్వేరు పార్టీలకు ఓట్లేయడంతో ఓట్లు చీలాయి. ఇవి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చగా కాంగ్రెస్ నష్టపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాట్ల ఆధిపత్యం కొనసాగుతుందన్న భావనతో ఇతర కులాలు, వర్గాలు ఉద్దేశపూర్వకంగానే ఒక్క బీజేపీకే ఓటేశాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బరిలో నిల్చొని దాదాపు 10 స్థానాల్లో విజయావకాశాలను కాంగ్రెస్ రెబల్స్ దెబ్బతీశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్‌దే విజయం అని ఎగ్జిట్‌పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్‌తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి. దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్లో ఖాతా తెరవడం విశేషం. మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం. కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది. అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్‌కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది. ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రభావం చూపింది. అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్బ్యాంక్పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి. ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్‌ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది. మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది. -
హరియాణాలో హ్యాట్రిక్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి. హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్‌కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీచండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది. మల్లయోధురాలి గెలుపు పట్టు బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్‌పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్‌లకు కంచుకోటగా ఉంది. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్‌చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 13 మందిమహిళల విజయం 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్‌సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు. -
ఎగ్జిట్‌పోల్స్ తలకిందులు..‘హర్యానా’లో బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో ఐపీఎల్ మ్యాచ్‌ను తలపించాయి. ఫలితాల తొలి రౌండ్ల ట్రెండ్స్ పూర్తిగా యూటర్న్ తీసుకుని తీవ్ర ఉత్కంఠ రేపాయి. మంగళవారం(అక్టోబర్8) ఫలితాలు వెలువడడం మొదలైన కొద్దిసేపటికి హర్యానాలో లీడ్స్ పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. తొలి రౌండ్ల లీడ్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా మ్యాజిక్‌ఫిగర్ మార్కు 46ను కూడా దాటేసింది. ఇంకేముంది ఎగ్జిట్‌పోల్స్ చెప్పినట్లుగా కాంగ్రెస్‌దే ఈసారి హర్యానా పీఠమని అంతా అనుకున్నారు. అటు హర్యానా, ఇటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరని టీవీ ఛానళ్లు కథనాలు కూడా వేయడం మొదలుపెట్టాయి. ఇంతలోనే వచ్చింది అసలు ట్విస్టు.ఒక్కసారిగా ఫలితాల ట్రెండ్స్ తలకిందులయ్యాయి. హస్తాన్ని వెనక్కినెట్టి కమలం జెట్ స్పీడుతో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది.కాంగ్రెస్‌ను కేవలం 30పైచిలుకు సీట్లకే పరిమితం చేసి బీజేపీ మ్యాజిక్‌ఫిగర్ మార్కు 46ను అవలీలగా దాటింది. ఈ ట్రెండ్‌ను బీజేపీ తర్వాత కూడా కొనసాగించి విజయం దిశగా పయనించింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థలతో పాటు రాజకీయ పండితులంతా తలలుపట్టుకున్నారు. సంబరాలు జరుపుకోవడం ఈసారి కమలనాథుల వంతైంది. ఎగ్జిట్‌పోల్స్‌కు అందని ఫలితాలు సాధిస్తామని తాము ముందే చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.జాట్లలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి కలిసొచ్చిందని, కురుక్షేత్ర ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది.కాగా, మరోపక్క జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉండగా బీజేపీ ఇక్కడ కూడా గట్టిపోటీ ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
హరియాణాలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కలలకు కాంగ్రెస్ గండి కొట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించనుందని ఇండియాటుడే మొదలుకుని పీపుల్స్ పల్స్ దాకా అన్ని పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఆ పార్టీ అలవోకగా మెజారిటీ మార్కును దాటేస్తుందని జోస్యం చెప్పాయి. ఆప్ సున్నా చుడుతుందని, ప్రాంతీయ పార్టీల్లో ఐఎన్ఎల్డీ 2 నుంచి 4, జేజేపీ ఒకటి నుంచి రెండు స్థానాలకు పరిమితమవుతాయని పేర్కొన్నాయి. ఇక జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సంకీర్ణం ఆధిక్యం సాధిస్తుందని తెలిపాయి.ఆ కూటమికి మెజారిటీ రావచ్చని ఇండియాటుడే, పీపుల్స్ పల్స్ పేర్కొనగా అందుకు అతి సమీపానికి వస్తుందని చాలా పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి 20 నుంచి 35 స్థానాల వరకు రావచ్చని పేర్కొన్నాయి. ఎన్సీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డాయి. మరో ప్రాంతీయ పార్టీ పీడీపీకి 6 నుంచి గరిష్టంగా 18 స్థానాలిచ్చాయి.ఈ అంచనాలను ఫక్తు టైంపాస్ వ్యవహారంగా ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఖాయమన్నారు. బీజేపీ మాత్రం తామే అతి పెద్ద పార్టీగా అవతరిస్తామని ధీమా వెలిబుచ్చింది. జమ్మూకశ్మీర్‌లో సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. హరియాణాలో పోలింగ్ ప్రక్రియ శనివారం ఒకే విడతలో ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడవనున్నాయి. -
హర్యానా ఎగ్జిట్ పోల్స్.. ఓటర్లు ఎటువైపు?
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారనేది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సర్వే సంస్థలు తమననిర్వహించిన సర్వే విడుదల చేస్తున్నాయి. Dainik Bhaskarబీజేపీ.. 15-29కాంగ్రెస్.. 44-54జేజేపీ.. 0-1ఐఎన్ఎల్డీ.. 1-5ఆప్.. 0-1ఇతరులు.. 4-9Dhruv Researchబీజేపీ.. 22-32కాంగ్రెస్..50-64జేజేపీ.. 0ఐఎన్ఎల్డీ..0ఆప్.. 0ఇతరులు.. 2-8Peoples Pulseబీజేపీ.. 20-32కాంగ్రెస్..49-61జేజేపీ.. 0-1ఐఎన్ఎల్డీ.. 2-3ఆప్.. 0ఇతరులు.. 3-5Republic Bharat- MATRIZబీజేపీ- 18-24కాంగ్రెస్..55-62ఆప్..0-3జేజేపీ.. 0-3ఐఎన్ఎల్డీ..3-6ఇతరులు..2-5హర్యానా హస్తగతమేనా?హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ప్రకటించింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్-55 , బీజేపీ-26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ, తన ప్రత్యర్థి బీజేపీపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల తర్వాత సీఎల్పీ లీడర్ భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది ముఖ్యమంత్రి కావాలని మద్దతిస్తున్నారని తెలిపింది.హర్యానా కాంగ్రెస్‌దే అంటున్న మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్మ్యాట్రిజ్ సర్వే ప్రకారం హర్యానాలో కాంగ్రెస్‌కు 55 నుంచి 62 సీట్లు..హర్యానాలో బీజేపీకి 18 నుంచి 24 సీట్లు మాత్రమే వస్తాయంటున్న మ్యాట్రిజ్మూడు నుంచి ఆరు సీట్లకే పరిమితం కానున్న ఐఎన్ఎల్డీసీఎన్ఎన్ సర్వేహర్యానాలో కాంగ్రెస్‌కు 59, బీజేపీకి 21 సీట్లువచ్చే అవకాశంకాగా గత రెండు పర్యాయాలుగా హర్యానాలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. మూడోసారి సైతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామినే ధీమాను వ్యక్తపరుస్తోంది కాషాయ పార్టీ. మరోవైపు పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరి రాష్ట్ర ఓటర్లు బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందివ్వనున్నారా లేక.. మార్పు కోరుకుంటూ కాంగ్రెస్‌కు అందలం ఇవ్వనున్నారా అనేది మరికాసేపట్లో తేలనుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం సర్వేల ఆధారంగా తెలిపే వివరాలు మాత్రమే.. అక్టోబర్ 8న వెలువడే అధికారిక ఫలితాలే తుది ఫలితాలు. -
తెలంగాణలో ఫలించిన ఎగ్జిట్ పోల్స్
-
బెంగాల్లో దీదీ మేజిక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మేజిక్ మరోసారి పనిచేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో 42 స్థానాలకుగాను 29 చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు, సందేశ్ఖాలీసహా రాష్ట్రంలో పలు చోట్ల అంతర్గత సమస్యలు తలెత్తినా అవేమీ దీదీ నేతృత్వంలో టీఎంసీ విజయయాత్రను ఆపలేకపోయాయి. పశ్చిమబెంగాల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు ఒడిసిపట్టాలని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా కాళ్లకు బలపం కట్టుకుని మరీ తెగ ప్రచారంచేశారు.ఎగ్జిట్ పోల్స్ సైతం ఈసారి బెంగాల్లో కమలవికాసం ఖాయమని అంచనాలు వెలువరిచాయి. ఈసారి మోదీ మేనియా ఉండొచ్చన్న రాజకీయ పండితుల లెక్కలూ తప్పు అని మమత మరోసారి నిరూపించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో కొనసాగబోనంటూ వేరుబడి కూడా సార్వత్రిక ఎన్నికల్లో మమత జయకేతనం ఎగరేయడం విశేషం. ‘ బెంగాల్లో బీజేపీ అంతర్గత కలహాలు, వ్యవస్థాగతంగా బలహీనంగా ఉండటం, బలమైన లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి నేపథ్యంలో తృణమూల్ వ్యతిరేక ఓటును బీజేపీ తనవైపునకు తిప్పుకోలేకపోయింది’ అని రాజకీయ విశ్లేషకుడు మైదుల్ ఇస్లామ్ చెప్పారు. అందుకే 2019తో పోలిస్తే తృణమూల్ ఓటు షేరు నాలుగు శాతం పెరిగి 47 శాతానికి చేరుకుంది. బీజేపీ 12 చోట్ల విజయం సాధించింది. 2019 ఎన్నికల్లాగే సీపీఐ(ఎం) పార్టీ ఈసారి కూడా బోణీ కొట్టలేక చతికిలపడింది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. జట్టు కట్టకపోవడంతో పుంజుకుందికాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు ఒప్పందం నుంచి మమత జనవరిలోనే వైదొలగడం టీఎంసీకి బాగా కలిసి వచ్చింది. దీంతో త్రిముఖపోరులో మైనారిటీలు, బీజేపీ వ్యతిరేకులు మరోమార్గంలేక టీఎంసీకే ఓటేశారు. గతంలో బీజేపీ సైతం ఇలాగే టీఎంసీ వ్యతిరేక ఓట్లను ఒడిసిపట్టి 2014లో 17 శాతంగా ఉన్న ఓటు షేరును 2019లో 40 శాతానికి పెంచుకుంది. స్థానిక సమస్యలు, ఎస్ఎస్సీ ఉద్యోగాల రద్దు, సీఏఏ అమలు అంశాలు ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయి. మైనారిటీ ఓటుతో పైపైకిమైనారిటీల బలం దీదీ పార్టీకి ఎంతో దోహపడింది. సీఏఏ అమలు, రామకృష్ణమిషన్, భారత్ సేవాశ్రమం సంఘ్‌లను వ్యతిరేకిస్తూ మమత వ్యాఖ్యలు, 77 ముస్లిం ఉపకులాలకు ఓబీసీ హోదా రద్దుచేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పుతో మమత మాత్రమే తమను పట్టించుకుంటారని భావించి మైనారిటీలు టీఎంసీ వెంట నడిచి పార్టీ విజయాన్ని సులభం చేశారు. లక్ష్మీర్ భండార్, కన్యశ్రీ పథకాల లబ్ధిపొందిన మహిళలూ మమతకు మద్దతు పలికారు.మోదీ తక్షణమే రాజీనామా చేయాలి: మమతలోక్సభ ఎన్నికల్లో నైతిక ఓటమిని అంగీకరిస్తూ ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి వైదొలగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లు సాధిస్తుందంటూ ప్రచారం చేసుకున్న మోదీ వాస్తవానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన మెజారిటీని సైతం సాధించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. మోదీ విశ్వసనీయత కోల్పో యారు. ఇండియా గెలిచింది. మోదీ ఓడిపోయారు. ఎన్నో రాజకీయ పారీ్టలను ఆయన ముక్కలుచెక్కలుగా చేశారు. ప్రజలే ఆయన్ను నైతికంగా దెబ్బకొట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మోదీ టీడీపీ, నితీశ్ కుమార్ల వద్ద కాళ్లబేరానికి వచ్చారు’అని మండిపడ్డారు. -
‘అబ్ కీ బార్...’ పాచిక పారలేదు
లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తిరుగులేని విజయాలు. ఈసారి 370 సీట్ల లక్ష్యం. 300 నుంచి 350 స్థానాల దాకా ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యం. కానీ ఎగ్జాక్ట్ ఫలితాలు బీజేపీకి తేరుకోలేని షాకిచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా కనీసం మెజారిటీ మార్కును కూడా అందుకోలేకపోయింది. కేవలం 240 స్థానాలకు పరిమితమై చతికిలపడింది. తరచి చూస్తే ఇందుకు పలు కారణాలు కని్పస్తున్నాయి...⇒ అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన ఎవరూ ఊహించనిది. అక్కడ బీజేపీ బలం 62 నుంచి ఏకంగా 33 స్థానాలకు పడిపోయింది. రాష్ట్రంలో ఓబీసీలతో పాటు ప్రధానంగా దళిత, ముస్లిం ఓట్లను ఎస్పీ–కాంగ్రెస్ కూటమి పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడమే ఇందుకు కారణం. దాంతో వాటి భాగస్వామ్యం యూపీలో సూపర్‌హిట్టయింది. బీజేపీకి దేశవ్యాప్తంగా తగ్గిన 63 సీట్లలో సగానికి సగం యూపీలోనే కావడం విశేషం. ⇒ యూపీ తర్వాత కీలకమైన మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీలి్చన తీరును జనం వ్యతిరేకించారు. తాజా ఫలితాల్లో చీలిక వర్గాలకే ఆదరణ లభించింది. ఆ మేరకు రాష్ట్రంలో ఎన్డీఏ స్థానాలకు భారీగా గండి పడింది. ⇒ ప్రచారం పొడవునా మోదీతో పాటు బీజేపీ నేతలు ప్రదర్శించిన మితిమీరిన దూకుడు కూడా బెడిసికొట్టింది. ⇒ నానాటికీ పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మధ్య తరగతి, యువతలో ఆగ్రహానికి కారణమయ్యాయి. ⇒ సైన్యంలో చేరేందుకు మోదీ సర్కారు తెచ్చిన అగ్నివీర్ పథకాన్ని యువత దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఆ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ యువకులను బాగా ఆకట్టుకున్నాయి. ⇒ సైనిక దళాల్లో యువత ఎక్కువగా చేరే రాజస్తాన్, హరియాణాల్లో బీజేపీకి సీట్లు తగ్గడం అగ్నివీర్ పథకంపై ఆగ్రహ ప్రతిఫలమే. ⇒ ఓవైపు ఇన్ని సమస్యలు కన్పిస్తుంటే పట్టించుకోకుండా బీజేపీ ఇచ్చిన ‘అబ్ కీ బార్, 400 పార్ (ఈసారి 400 సీట్లకు మించి)’ నినాదాన్ని ప్రజలు హర్షించలేదు. 2004 నాటి ‘ఇండియా షైనింగ్’ నినాదం అంతగా కాకున్నా ‘అబ్ కీ బార్...’ బీజేపీకి కాస్త చేటే చేసిందంటున్నారు. నిజంగానే అన్ని సీట్లు వస్తే నిరంకుశత్వానికి బాటలు పడతాయన్న భావన ప్రబలింది. అంతేగాక బీజేపీ నేతల్లో అలసత్వానికి కూడా ఈ నినాదం కారణమైంది. మోదీ మాటతీరు... ⇒ పార్టీని పూర్తిగా తోసిరాజని ఈసారి ప్రచారంలో సర్వం మోదీమయంగా మారింది. ప్రతిదానికీ ‘మోదీ హామీ’ అంటూ ప్రధాని పదేపదే చెబుతూ వచ్చారు. ఏకంగా బీజేపీ మేనిఫెస్టో పేరునే ‘మోదీ కీ గ్యారెంటీ’గా మార్చేశారు! సర్వం తననే కేంద్రం చేసుకుని నడిపించారు. ⇒ దీనికి తోడు మోదీ మాటతీరును, విపక్షాలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు ఆమోదించలేదు. విపక్షాలపై ఆయన చేసిన ముజ్రా తదితర విమర్శలు బీజేపీకి మేలు కంటే కీడే ఎక్కువ చేశాయి. ⇒ మంగళసూత్రాలు మొదలుకుని మాంసాహారం, ముస్లిం రిజర్వేషన్ల దాకా మోదీ చేసిన వ్యాఖ్యలను జనం జీరి్ణంచుకోలేదని ఫలితాలు చెబుతున్నాయి. ⇒ వీటికి తోడు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన దేశవ్యాప్తంగా ఆ వర్గం ఓట్లు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితమయ్యేందుకు కారణమైంది. ⇒ షా ప్రకటనను కాంగ్రెస్, విపక్షాలు అందిపుచ్చుని బీజేపీ మళ్లీ వస్తే మొత్తం రిజర్వేషన్లనే ఎత్తేస్తుందంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఇది బీజేపీకి చెప్పలేనంత చేటు చేసింది. ⇒ విపక్షాలపైకి మోదీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న ప్రచారం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టు కూడా చేటే చేసింది. ⇒ ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, మహిళలకు ఏటా రూ.లక్ష సాయం వంటి హామీలు ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యాయి. ⇒ మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి కొద్దిమంది కుబేరులకే భారీ లబ్ధి చేకూరుతోందంటూ కాంగ్రెస్, విపక్షాలు పదేపదే చేసిన ప్రభావం కూడా ప్రజల్లోకి వెళ్లింది. ⇒ అభ్యర్థుల ఎంపికలోనూ బీజేపీ పలు తప్పిదాలు చేయడం పలు చోట్ల ఓటమికి కారణాలుగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సందట్లో సైబర్ వల
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పేరుతో ఫోన్లకు లింక్ పంపిస్తున్నారు. ఎవరైనా ఆతృతతో ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ఎన్నికల ఫలితాల చర్చల ఆధారంగా ఆయా సోషల్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ సర్వేలతో కూడిన లింకులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఏ పారీ్టకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు వెంటనే వాటిని తెరుస్తున్నారు. ఇంకేముంది వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతోంది. ఆపై పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలను హ్యాక్ చేసి.. ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ముల్ని కాజేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగులకు పాల్పడుతున్న వారు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. తాము బెట్టింగ్ వేసిన పార్టీ, అభ్యర్థి గెలుపోటముల గురించి పదేపదే తెలుసుకోవడంలో భాగంగా వారు తమకు కనిపించే ప్రతి ఎగ్జిట్ పోల్ లింకును తెరిచి చూస్తున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. అయితే.. మోసపోయిన వారు ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోవడం కూడా సైబర్ నేరగాళ్లకు కలిసివస్తోంది. తాము మోసపోయామని చెబితే బెట్టింగ్ వేసిన విషయం కూడా బయటకు వస్తుందనే భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. అఅప్రమత్తం చేస్తున్న బాధితులుఇలా మోసపోయిన వారిలో కొందరు మరొకరికి ఇలా జరగకూడదని భావించి.. సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అలాంటి లింకులను చూసి మోసపోవద్దని, వాటిని ఎవరూ తెరవద్దని పోస్టులు పెడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియాలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రచారం జరిగింది. కాగా.. మంగళవారం ఫలితాలు వెలువడే వరకూ ఇలాంటి ఫేక్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
Akhilesh Yadav: ఎగ్జిట్ పోల్స్‌లో విశ్వసనీయత ఎంత?
లక్నో: ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ ఫలితాలిచ్చిన పలు ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం లక్నోలో పత్రికాసమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే అనుమానమొస్తోంది. వీటిని ఎలా విశ్వసించాలి?. ఫలితాల వెల్లడివేళ బీజేపీ అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఎగ్జిట్ పోల్స్ ప్రయతి్నస్తున్నాయి’ అని ఆరోపించారు. -
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు
-
మళ్లీ వైఎస్ఆర్ సీపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ పై కొమ్మినేని రియాక్షన్
-
ఎగ్జిట్ పోల్స్ పై ఆచంట ఎమ్మెల్యే రియాక్షన్
-
ఎగ్జిట్ పోల్స్ పై పాడేరు ఎమ్మెల్యే రియాక్షన్
-
పైకి ధీమా.. లోన టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. పైకి గెలుపు ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందోనని లోలోన టెన్షన్ పడుతున్నా రు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.జహీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గం భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ ఒక పర్యాయం కాంగ్రెస్ విజయం సాధించగా, రెండుసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. నాలుగోసారి జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవగా, రెండుచోట్ల బీఆర్ఎస్, ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, గ్యాంరటీ పథకాల అమలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేశారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు శ్రమించాయి. దీంతో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది.జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. అ సెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బలమైన క్యా డర్ ఉండడంతో పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తామ ని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాల ద్వారా లబి్ధపొందినవారు తమ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కే ఓటేశారని, దీంతో జహీరాబాద్‌లో హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాతో గులాబీ లీడర్లు ఉన్నారు.అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకున్న బీజేపీ సైతం జహీరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క కామారెడ్డిలోనే ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ఓటర్లు మూడోసారి మోదీ రావాలని బలంగా కోరుకున్నారని, దీంతో మారుమూల గ్రామాల్లో సైతం తమకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈసారి జహీరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ నమ్మకంతో ఉన్నారు. విభిన్నంగా ఎగ్జిట్ పోల్స్..జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రకటించిన ఫలితాలు సైతం విభిన్నంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఒకటిరెండు సంస్థలు బీఆర్ఎస్కూ విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పో ల్స్ ఒక్కోటి ఒక్కో తీరుగా ఫలితాలు వెలువరించిన నేపథ్యంలో ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఆయా పారీ్టల నేతలు తమ క్యాడర్ ఇచ్చి న సమాచారం ప్రకారం తమదే గెలుపంటూ ధీమాతో ఉన్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.ఇవి చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు -
రియల్ ఎగ్జిట్ పోల్స్ ఇవే..గెలిచేది మళ్లీ జగనే
-
మళ్లీ సీఎం జగన్ ప్రభంజనం
-
జగన్ 2.0.. 4వ తేదీన రాష్ట్రంలో ఫ్యాన్ సునామీ
-
ఎగ్జిట్ పోల్స్ పై KK రాజు రియాక్షన్
-
ఎగ్జిట్ పోల్స్ పై రాయదుర్గం ఎమ్మెల్యే రియాక్షన్
-
lok sabha exit poll 2024: మార్కెట్లకు ఫలితాల జోష్!
న్యూఢిల్లీ: ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే శనివారం(1న) వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికార బీజేపీ అధ్యక్షతన ఏర్పాటైన ఎన్డీఏ భారీ విజయా న్ని సాధించనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. దీంతో మంగళవారం(4న) వెలువడనున్న లోక్‌సభ ఫలితాలలో తిరిగి బీజేపీ కూటమి అధికారాన్ని అందుకుంటుందన్న అంచనాలు బలపడినట్లు రాజకీయ వర్గాలు తెలియజేశాయి. వరుసగా మూడో సారి భారీ మెజారిటీతో నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టే వీలున్నట్లు పేర్కొన్నాయి. వెరసి స్టాక్ మార్కెట్లలో ప్రోత్సాహకర సెంటిమెంటుకు తెరలేవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో నేడు(3న) మార్కెట్లు జోరు చూపే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.అయితే 4న ప్రకటించనున్న వాస్తవిక ఫలితాలు భిన్నంగా వెలు వడితే.. మార్కెట్లలో దిద్దుబాటుకూ అవకాశమున్న ట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. కాగా.. గత వారం సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 76,010కు, నిఫ్టీ 23,111కు చేరినప్పటికీ సెన్సెక్స్ 1,449 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి, నిఫ్టీ 426 పాయింట్లు(1.9 శాతం) పతనమై ముగిశాయి. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1.5 శాతం చొప్పున డీలా పడ్డాయి. జీడీపీ దన్ను గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు సైతం ఇన్వెస్టర్లకు జోష్‌నివ్వనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం పురోగతిని సాధించగా.. పూర్తి ఏడాదికి అంచనాలను మించుతూ 8.2 శాతం వృద్ధి చూపింది. ప్రోత్సాహకర ఎగ్జిట్ పోల్స్, జీడీపీ గణాంకాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) సైతం కొనుగోళ్లకు ఆసక్తి చూపే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఎగ్జిట్ పోల్స్ పరిధిలోనే వాస్తవిక ఫలితాలు సైతం వెలువడితే.. రాజకీయ, పాలసీ కొనసాగింపుపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు చెక్ పడుతుందని ఎమ్కే రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. రెపో యథాతథం లోక్‌సభ ఫలితాల తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లను శుక్రవారం(7న) వెలువడనున్న ఆర్బీఐ పాలసీ సమీక్షా నిర్ణయాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 5న ప్రారంభంకానున్న ఆర్బీఐ పాలసీ సమావేశం 7న ముగియనుంది. 2024 ఏప్రిల్‌లో నిర్వహించిన పాలసీ సమీక్షలో ఆర్బీఐ కమిటీ వరుసగా ఏడోసారి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. ఇక ఈ వారంలో మే నెలకు తయారీ(3న), సరీ్వసెస్ పీఎంఐ(5న) గణాంకాలు వెలువడనున్నాయి. చైనా, యూఎస్ తయారీ, ఉపాధి గణాంకాలు సైతం 3, 5న వెల్లడికానున్నాయి. వీటికితోడు ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరు, విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ నిపుణులు ప్రస్తావించారు. -
ఒడిశాలో హోరాహోరీ
భువనేశ్వర్: 147 స్థానాలున్న ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పదని ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. విపక్ష బీజేపీకి 62 నుంచి 80 స్థానాలు లభించే అవకాశం ఉందని, అధికార బిజూ జనతాదళ్(బీజేడీ)కి సైతం 62 నుంచి 80 స్థానాలే దక్కే వీలుందని అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ బీజేడీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసినట్లే అని చెప్పొచ్చు. ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నవీన్ పట్నాయక్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒడిశాలో కాంగ్రెస్ 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ ఓట్ల శాతం 42 శాతానికి పెరుగుతుందని, బీజేడీ ఓట్ల శాతం 42 శాతం పడిపోతుందని, కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తెలియజేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 112 సీట్లు, బీజేపీ 23, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నాయి. 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 18–20 వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది! -
నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్ ఎడిటర్ రాజీదీప్ సర్దేశాయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు రాజ్‌దీప్ సర్దేశాయ్ చురకలంటించారు.స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్ రాహుల్ కన్వల్ స్పందిస్తూ.. కేజ్రివాల్ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్‌ల్లో.. హేమంత్ సోరేన్ అరెస్టు వల్ల జార్ఖండ్‌లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్ పోల్స్‌లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్‌గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ 2021లో పశ్చిమ్ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. -
టైమ్స్ నౌ–ఈటీజీ ఎగ్జిట్ పోల్‌లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ కలిగిన టైమ్స్ నౌ–ఈటీజీ రీసెర్చ్ ఆదివారం తన ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చిచెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 51 శాతం ఓట్లతో మొత్తం 117–125 సీట్లు కైవసం చేసుకుంటుందని.. అదే సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ (ఎన్డీయే) కూటమి 47 శాతం ఓట్లతో 50–58 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. అలాగే, లోక్‌సభ పోలింగ్ విషయానికొస్తే.. వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 14 ఎంపీ స్థానాలు, ఎన్డీయే కూటమి 48 శాతం ఓట్లతో 11 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఈసారి ఏపీలో దాదాపు 82శాతం పోలింగ్ నమోదైందని.. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది ఇంచుమించు రెండుశాతం అధికమని వివరించింది. అంతేకాక, మహిళల ఓటింగ్ కూడా ఈ దఫా 15శాతం అధికంగా నమోదైందని టైమ్స్ నౌ–ఈటీజీ రీసెర్చ్ తెలిపింది. -
వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి అన్నారు. ఏ ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు.‘నేషనల్ మీడియా సంస్థలన్నీ కేంద్రానికి భయపడి తల తోక లేని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. గత ఐదేళ్లలో జగన్మోహన్రెడ్డి మంచి చేశారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వైసీపీకి అధికారం కట్టబెట్టనున్నారు. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ పడిన కష్టం ఈనెల 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడంతో ఫలితం దక్కబోతోంది. గతం కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ స్థానాలు రాబోతున్నాయి.రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వరుసగా రెండవసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9వ తేదీన వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది’అన్నారు. -
ఎగ్జిట్‌పోల్స్‌పై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్‌పోల్ ఫలితాలు కాదని మోదీ మీడియా పోల్స్ అని రాహుల్ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించడానికి ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పాయి. -
ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్
-
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు
-
YSRCPదే ప్రభంజనం..
-
మళ్లీ ఫ్యాన్ హవా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అగ్నివీర్.. ఆరా మస్తాన్.. ఆత్మసాక్షి.. జన్మత్పోల్.. ఆపరేషన్ చాణక్య... ఏబీపీ సీఓటర్... ఇలా పలు సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్కటే ఫలితాలు! ‘ఫ్యాన్’ మరోసారి సునామీ సృష్టిస్తుందని అంచనా వేసి చెబుతున్నాయి. గత నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయా లను క్రోడీకరించి ఈ సంస్థలు శనివారం వెల్లడించాయి. ఏవో ఒకటీ రెండు మినహా మిగతావన్నీ ఒకేతరహా ఫలితాలను అంచనావేస్తూ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని చేపట్టినా క్షేత్రస్థాయిలో మాత్రం అప్పటి నుంచే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ సంచలన విజయానికి వ్యూహరచన చేశారు. పక్కా ప్రణాళికతో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ గత ఐదేళ్లలో ప్రజలకు చేరువయ్యారు. రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించినా రాష్ట్రంలో మాత్రం ఆయన పర్యవేక్షణలో వైద్యసేవలు, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శప్రాయం అయ్యాయి. అందుకే ‘మీ ఇంటిలో మంచి జరిగిందంటేనే ఓటు వేయండి’ అని ధైర్యంగా అడిగిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలమనసులో ఒక దమ్మున్న నాయకుడిగా నిలిచిపోయారు. ఆయన ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవాలనే సంకల్పంతోనే ఓటర్లు గతంలో కనీవినీ ఎరుగని రీతిలో గత నెల 13వ తేదీన పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే రోజున ఓటర్ల నాడి తెలుసుకునేందుకు కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌కు నడుంబిగించాయి. 👉 విజయం మళ్లీ వారిదే... రెండు జిల్లాల్లోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఓటర్లు వైఎస్సార్సీపీకే అండగా నిలిచారని ఎగ్జిట్ పోల్స్ తేలి్చచెప్పాయి. ముఖ్యంగా మహిళలు అర్ధరాత్రి వరకూ బారులు తీరి మరీ సంక్షేమ ప్రభుత్వానికే ఓటు వేశారని అంచనా వేస్తున్నాయి. బీసీలు, పేద, అణగారిన వర్గాలు అత్యధికంగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో ఫ్యాన్‌దే హవా ఉంటుందని చెప్పకనే చెప్పాయి. అంతేకాదు వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా విజయపతాకం ఎగురవేయనున్నారని అంచనా వేశాయి. ఈ ప్రకారం... 👉విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి బెల్లాన చంద్రశేఖర్ మరోసారి విజయం సాధించనున్నారు. అరకు లోక్‌సభ స్థానంలో కొత్తగా బరిలో నిలిచిన డాక్టర్ తనూజారాణి కూడా గెలుపు సాధించనున్నారు. 👉ఉపముఖ్య మంత్రి పీడిక రాజన్నదొర సాలూరు (ఎస్టీ) నియోజకవర్గంలో వరుసగా ఐదోసారి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీడీపీ కూటమి అభ్యరి్థని మట్టికరిపించి అభిమానుల మనసులో మన్యం పులిగా నిలిచిపోనున్నారు. మరో రెండు ఎస్టీ నియోజకవర్గాలైన కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో విశ్వాసరాయి కళావతి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోనున్నారు. 👉ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన పార్వతీపురం, రాజాంలో కూడా వైఎస్సార్సీపీ జెండా మరోసారి రెపరెపలాడనుంది. పార్వతీపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగుపెట్టించిన అలజంగి జోగారావు మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేలా ప్రజలు ఆశీర్వదించినట్టు సర్వేలు తేల్చాయి. రాజాం ప్రజలకు వైద్యసేవలతో చేరువైన డాక్టర్ తలే రాజేష్ కూడా ఈ ఎన్నికల్లో తొలిసారిగా విజయం సాధించనున్నారు. 👉బీసీల జిల్లాలో తమను విస్మరించి అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించిన టీడీపీ కూటమికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్లలో బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి తమ విజయాన్ని నమోదు చేయనున్నారు. బొబ్బిలిలో టీడీపీ కూటమి అభ్యర్థి బేబీ నాయన గెలుపు ఖాయమంటూ ఓ వర్గం గత రెండేళ్లుగా ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థి, సీనియర్ నాయకుడైన శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడికే మద్దతు పలికారనే సంకేతాలు వెలువడుతున్నాయి. శృంగవరపుకోటలో కూడా కడుబండి శ్రీనివాసరావు ప్రత్యర్థుల ఆశలను గల్లంతు చేస్తూ మంచి మెజార్టీతో మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. 👉విజయనగరం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులతో రూపురేఖలు మార్చేసిన డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ సీనియరు నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి గెలుపు ఖాయమనే క్యాడర్ అంచనాలు వాస్తవమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.వైఎస్సార్సీపీదే పైచేయి... ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు కొత్తగా జిల్లాల ఏర్పాటుతో శ్రీకాకుళం జిల్లా నుంచి విలీనమైన రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చాటిచెబుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ఈ రెండు జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వీటి పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 4వ తేదీన వెల్లడికానున్న 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా అదే తరహాలో సునామీని సృష్టిస్తాయని వైఎస్సార్సీపీ క్యాడర్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శనివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించు అదే తరహాలో ఫలితాలు ఉంటాయని చాటిచెబుతున్నాయి. ఈ తీపికబురుతో వైఎస్సార్సీపీ క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. 4వ తేదీన కౌంటింగ్‌కు ఎంతో ఉత్సాహంతో సిద్ధమవుతున్నవారిలో ఊపు తీసుకొచ్చింది. -
బీజేపీ అందుకే వెనకపడింది
-
మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్ భారతీ
ఢిల్లీ: పలు పర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి సుమారు 350 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. బీజేపీ, ఎన్డీయే కూటమికి అధిక సీట్లు వస్తాయిని పేర్కొన్న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతీ తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం కౌంటింగ్ రోజున అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలిపోతాయని అన్నారు. బీజేపీ అధిక సీట్లు గెలుచుకొని మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేయించుకుంటానని ఛాలెంజ్ చేశారు.‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేసుకుంటా. నా మాటలు రాసిపెట్టుకోండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని జూన్ 4న తెలిసిసోతుంది. నరేంద్రమోదీ మూడోసారి పీఎం కాలేడు. ఢిల్లీ మొత్తం ఏడు స్థానాల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి గెలుస్తుంది. మోదీపై ఉన్న భయంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆయన ఓడిపోతారని వెల్లడించవు. మేము జూన్ 4న విడుదల అయ్యే నిజమైన ఫలితాల కోసం ఎదురు చుస్తున్నాం. ప్రజలు ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ భారీగా ఓట్లు వేశారు’’ అని సోమనాథ్ భారతీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.I will shave off my head if Mr Modi becomes PM for the third time.Mark my word!All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.In Delhi, all seven seats will go to India ALLIANCE.Fear of Mr Modi does not allow…— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) June 1, 2024 ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన బీజేపీ.. తాము సులభంగా అధిక సీట్లు గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దేశ ప్రజలు మోదీ మూడుసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ, సోమనాథ్ భారతీలానే చాలా మంది ప్రతిపక్ష నేతలు ఎగ్జిట్ పోల్స్‌ను తప్పని అంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.2019లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మొత్తం ఏడు సీట్లకు 6 సీట్లు కౌవసం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తే.. ఏకంగా ఏడు సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి ఏడు సీట్లలోను తామే గెలుస్తామని ఆ రెండు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..
-
ఏపీలో పనిచేయని NDA హవా.. షర్మిలకు డిపాజిట్ గల్లంతు
-
కాంగ్రెస్ ఖాతాలో రాయ్‌బరేలీ? రాహుల్‌కు పట్టం?
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్‌లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుండి విజయం సాధించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తన సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీని కాపాడుకోవడంలో విజయం సాధించనుంది. అలాగే మంచి ఆధిక్యతనూ దక్కించుకోనున్నదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి.రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ ఈ సీటు కాంగ్రెస్‌కే దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపొందిన ఏకైక స్థానం రాయ్‌బరేలీ. సోనియా గాంధీ ఇక్కడ నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలిచారు. రాయ్‌బరేలీ మినహా యూపీలోని మరే సీటులోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అయితే అదేసమయంలో కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించారు. సోనియా గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కుమారుడు రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపాలని సోనియా ముందుగానే నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ తన కుమారుడిని రాయ్ బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన ఈ ప్రకటన ఓటర్లను ఆకట్టుకుంటుందని కాంగ్రెస్ భావించింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అంచనాలకు ఊతమిస్తున్నాయి.రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. 1951-52లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానం కాదు. అప్పట్లో రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్‌లను కలిపి ఒక సీటు ఉండేది. తొలి ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1957లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానంగా మారడంతో ఫిరోజ్ గాంధీ ఈ స్థానం నుంచి తరిగి పోటీ చేసి, విజయం సాధించి పార్లమెంటుకు చేరుకున్నారు. ఇందిరా గాంధీ వరుసగా నాలుగు సార్లు ఇక్కడ నుండి ఎంపీ అయ్యారు. మొదటి లోక్‌సభ ఎన్నికల నుండి 2019లో జరిగిన ఎన్నికల వరకు మొత్తం 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ స్థానం నుండి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి ఓడిపోయిన సందర్భాలు మూడు మాత్రమే ఉన్నాయి. -
గెలుపు ఎవరిదో తేలిపోయింది..
-
బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..
-
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Exit polls 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా స్థానాలు కచి్చతంగా లభిస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు తెలుసున్న తర్వాతే ఈ సంఖ్య చెబుతున్నామని వెల్లడించారు. తమది ప్రజల సర్వే అని, బీజేపీది ప్రభుత్వ సర్వే అని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల సరళి, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై రెండున్నర గంటలపాటు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కె.సి.వేణుగోపాల్ పాల్గొన్నారు. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, రాఘవ్ చద్ధా, జేఎంఎం నాయకులు చంపయ్ సోరెన్, కల్పనా సోరెన్, డీఎంకే నేత టి.ఆర్.బాలు, జమ్మూకశీ్మర్ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నాయకుడు డి.రాజా, సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ హాజరు కాలేదు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. ఫలితాల పేరిట బీజేపీ మీడియా మిత్రులు తప్పుడు అంకెలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా కౌంటింగ్ హాళ్లనుంచి బయటకు వెళ్లొద్దంటూ తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించామని ఖర్గే తెలిపారు. ఇండియా కూటమిలో తామంతా ఐక్యంగా ఉన్నామని, తమను విభజించే ప్రయత్నం చేయవద్దని మీడియాను కోరారు. బీజేపీ 220 సీట్లకే పరిమితం: కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా, బీజేపీకి 220 సీట్లు వస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మొత్తం 235 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తమ కూటమి ముందుకు సాగుతోందని తెలిపారు. -
ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
సాక్షి, అమరావతి: ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్ సీపీ పట్ల పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జూన్ 4న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లు తమవైపే నిలిచారనే విషయం ఎగ్జిట్ పోల్స్‌లో తేలిందన్నారు. శనివారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళలను సమాజంలో ఆత్మగౌరవంతో నిలబెట్టారని, సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు కుటుంబాన్ని నడిపించగల శక్తిని అందించారన్నారు. సీఎం జగన్ వల్లే తమకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో మహిళలు వారి కుటుంబాలు పోలింగ్‌కు పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నారు. ఐదేళ్లలో తమ కుటుంబాల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను గమనించడంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్నారు. ఎక్కువ సైలెంట్ ఓటింగ్ జరగడంతో కొన్ని సర్వే సంస్థలకు వైఎస్సార్ సీపీపై క్షేత్ర స్థాయిలో ఉన్న సానుకూలత కనిపించలేదన్నారు. పాజిటివ్ అజెండా పని చేసింది.. వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం మొత్తం పాజిటివ్ కోణంలో నిర్వహించాం. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగాం. చంద్రబాబు మరోసారి అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ 2014లో మాదిరిగా మోసం చేసేందుకు వస్తున్నాడని గుర్తు చేశాం. టీడీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడారు. సీఎం జగన్ అంతు చూస్తామని, అధికారంలోకి వచ్చేశామంటూ విర్రవీగారు. సొంతంగా పోటీ చేయలేక కూటమి కట్టారు. మా నాయకుడు మాత్రం పాజిటివ్ అజెండాతో ప్రజలను ఓట్లు అడిగారు. పాజిటివ్ అజెండా పని చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈసీ ఒత్తిడికి తలొగ్గితే ఎలా? ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. గతంలో చంద్రబాబు ఏపీ సీఈవోపైకి దండయాత్రలా వెళ్లి బెదిరించలేదా? ఆ తర్వాత ఈవీఎంలు మోసం చేశాయంటూ దు్రష్పచారం నడిపారు. అలాంటి పార్టీకి చెందిన వాళ్లు ఈ రోజు మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పోస్టల్ బ్యాలెట్ విషయలో టీడీపీ గందరగోళం సృష్టించాలని యత్నించింది. ఏ రూల్స్ అవసరం లేకుండా నేరుగా పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవాలన్న టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మేం కోర్టుకెళ్లాం. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మా ఏజెంట్లకు చెప్పాం. తిరస్కరించాల్సిన ఓటును చెల్లుబాటయ్యేలా టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని చెప్పాం. దీనికే నాపై కేసులు మోపడం హాస్యాస్పదం. సుప్రీం కోర్టుకు వెళ్తాం.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం. జూలై 2023లో ఈసీ స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది. అందులో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు, తిరస్కరణ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీల్ లేకుంటే కనీసం హోదా వివరాలైనా రాయాలని ఉంది. పోలింగ్ అయ్యాక అది అవసరం లేదని ఈసీ చెప్పడం అనైతికం. వాళ్లిచ్చిన నిబంధనలను వాళ్లే తుంగలో తొక్కితే ఎలా? చంద్రబాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు. అందుకే చంద్రబాబు కుట్రలు.. గత ఐదేళ్లలో పౌర సేవలు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ప్రజలపై ఉండదనుకుంటే అది భ్రమే. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్ సీపీకి వస్తాయనే భయంతో పవన్, బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్‌తోనూ కలసి ఎన్నికలకు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చి లాభపడాలని నానా గడ్డి కరిచి విష ప్రచారం చేశారు. ఆయన ఇన్ని చేసినా మాపట్ల ప్రజల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. ఇటీవల ఎన్నికల రిగ్గింగ్ మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ కూడా రిగ్గింగ్ జరుగుతున్నట్టుంది. బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు బాగా తగ్గుతుండటంతో దక్షిణాదిలో పెరుగుతున్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వారికి నచ్చిన లెక్కలేసి చెబుతున్నారు. మాకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వైఎస్సార్ సీపీకి కచ్చితంగా అనుకూలించింది. ఐదేళ్లలో మేం ప్రజలకు మంచి చేశాం. టీడీపీకి ఎందుకు అనుకూలంగా సర్వేలు వచ్చాయో వాళ్లు చెప్పగలరా? మరో రెండు రోజులు వారికి నచ్చిన అంకెలు చెప్పుకుంటూ ఆనందం పొందాలంటే పొందొచ్చు. -
Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్
ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజా రిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ యూపీలో స్థానాలను పెంచుకోవడంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేస్తుందని కర్ణాటకలో హవా కొనసాగించడమే గాక బెంగాల్లో చొచ్చుకుపోతుందని చెప్పాయి. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి 150 మార్కు దాటొచ్చని తెలిపాయి. న్యూఢిల్లీ: కేంద్రంలో పాలక ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కూటమి హ్యాట్రిక్ కొట్టడం, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. శనివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగుస్తూనే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని వాటిలో చాలావరకు పేర్కొన్నాయి. కర్నాటకలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని, పశ్చిమబెంగాల్లో మరింతగా చొచ్చుకుపోతుందని వెల్లడించడం విశేషం. బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో మాత్రం ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గుతాయని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విపక్షాల అవకాశవాద రాజకీయాలను జనం పూర్తి గా తిరస్కరించారన్నారు. వాస్తవ ఫలితాల్లో తమకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి వస్తాయని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను మోదీ ప్రభావితం చేశారని ఆరోపించింది. వాస్తవ ఫలితాలు చాలా భిన్నంగా రాను న్నాయని విశ్వాసం వెలిబుచి్చంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడిక అందరి కళ్లూ జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరిగాక రాబోయే అసలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఏ సర్వే ఏం చెప్పింది...? ఇండియాటుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకు 361 నుంచి 401 స్థానాలిచి్చంది. ఇండియా కూటమికి 131 నుంచి గరిష్టంగా 166 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 368 దాకా వస్తాయని రిపబ్లిక్ భారత్–మారై్టజ్ సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి 133, ఇతరులకు 48 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 392 దాకా, ఇండియాకు 161, ఇతరులకు 20 దాకా రావచ్చని జన్ కీ బాత్ అభిప్రాయపడింది. ఎన్డీఏకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న మేరకు 401 స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అంచనా వేయడం విశేషం. ఇండియా కూటమికి 139, ఇతరులకు 38 స్థానాలు రావచ్చని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కూడా ఎన్డీఏకు 385 నుంచి ఏకంగా 415 సీట్లిచి్చంది! ఇండియా కూటమి 96 నుంచి 118 మధ్య సాధిస్తుందని పేర్కొంది. న్యూస్ నేషన్ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 స్థానాలిచి్చంది. దైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమికి 350 దాకా, ఇండియా కూటమికి గరిష్టంగా 201, ఇతరులకు 49 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ సర్వేలో ఎన్డీఏకు 359, ఇండియాకు 154, ఇతరులకు 30 స్థానాలొచ్చాయి. ఏబీపీ న్యూస్–సీ వోటర్ ఎన్డీఏకు 353–383, ఇండియాకు 152 నుంచి 182 సీట్లిచ్చింది. ఎన్డీఏకు 371, ఇండియాకు 125 రావచ్చని ఇండియా న్యూస్ పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 స్థానాలిచ్చింది. రాష్ట్రాల్లో ఇలా... కేంద్రంలో అధికార సాధనకు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంటోందని సర్వేలన్నీ తెలిపాయి. బీజేపీకి యూపీలో ఏకంగా 67 సీట్ల దాకా రావచ్చని ఇండియాటుడే వెల్లడించింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్లకే పరిమితమవుతాయని తెలిపింది. కర్నాటకలో ఈసారి కూడా బీజేపీకి 23, భాగస్వామి జేడీ(యూ)కు 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పశి్చమబెంగాల్లోనైతే పాలక తృణమూల్ కాంగ్రెస్‌ను తోసిరాజని 23 నుంచి 27 స్థానాలతో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో అతి పెద్ద పారీ్టగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇండియాటుడే అయితే బెంగాల్లో బీజేపీకి 30 పై చిలుకు, తృణమూల్‌కు 11 నుంచి 12 స్థానాలివ్వడం విశేషం. కీలకమైన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సీట్లు 2019తో పోలిస్తే కాస్త తగ్గి 30 నుంచి 32 దాకా రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఒడిశాలోనైతే 21 సీట్లకు గాను ఎన్డీఏకు ఏకంగా 18 నుంచి 20 వస్తాయని, అధికార బిజూ జనతాదళ్ ఒకట్రెండు సీట్లకు మించబోదని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. దక్షిణాదిన కేరళలోనూ తొలిసారి కమలవికాసం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అక్కడ బీజేపీకి 3 సీట్ల దాకా ఖాయమని పేర్కొన్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ కుదేలవుతుందని, కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు వస్తాయని తెలిపాయి. రాజస్తాన్, బిహార్లలో ఎన్డీఏకు ఐదారు స్థానాలు తగ్గి ఆ మేరకు ఇండియా కూటమికి పెరగవచ్చని పేర్కొన్నాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే గాక మెజారిటీ లోక్‌సభ స్థానాలూ నెగ్గుతుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమని మరికొన్ని పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ లోక్‌సభ స్థానాలొస్తాయని తెలిపాయి.2019లో ఏం జరిగింది?2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ గెలుస్తుందనే జోస్యం చెప్పాయి. మొత్తం 13 ఎగ్జిట్ పోల్స్ సగటును చూస్తే ఎన్డీఏకు 306, యూపీఏకు 120 సీట్లొస్తాయని పేర్కొన్నాయి. చివరికి ఎన్డీఏకు 353 స్థానాలు రాగా యూపీఏ కేవలం 93 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు రాగా కాంగ్రెస్ కేవలం 53 సీట్లు నెగ్గింది. -
వైఎస్సార్సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్), చాణక్య (పార్థదాస్) తేల్చాయి. జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్ నిర్వహించే సర్వే, ఎగ్జిట్ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేను ఆరా మస్తాన్ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్సీపీ, 10–12 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్ చాణక్య, పోల్ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్ లాబొరేటరీ, జన్మత్ పోల్, సీపీఎస్ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని క్యూ మెగా అమేజీ పొలిటికల్ సొల్యూషన్స్ సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ తెలిపారు. 22 పార్లమెంట్ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, ఎన్డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్ఎక్స్, దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్డీటీవీ, న్యూస్–18 వంటి జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం. -
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్‌కింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
-
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్ఎస్ కు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్ సర్వేఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్ లాబొరేటరీపోల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్ స్టార్ట్ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్ చాణక్య ఆపరేషన్ చాణక్య ప్రకారం.. కాంగ్రెస్ 7, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్ ఆఫ్ ఇండియాటైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్ 5-8, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్ సర్వే అయితే కాంగ్రెస్, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్ఎస్ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్ 24న్యూస్ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది. -
నో డౌట్ పక్కా సీఎం జగన్
-
ఢిల్లీ పీఠం ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ సంచలనం..
సాక్షి,న్యూఢిల్లీ: సుదీర్ఘంగా నలభై రోజులకుపైగా జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ శనివారం(జూన్1) సాయంత్రం 6 గంటలకు ముగిసింది.అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న2024 పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తుది, ఏడవ విడత పోలింగ్ ముగిసిన వెంటనే టీవీ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు రిలీజ్ చేశాయి. రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ఎన్డీఏ-354ఇండియా-153ఇతరులు-30మొత్తం -543ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఇప్పటికి ప్రకటించినవి -463ఎన్డీఏ -294-329ఇండియా- 123-154ఇతరులు- 8-20మొత్తం సీట్లు-543ఎన్డీటీవీఎన్డీఏ-365ఇండియా-142ఇతరులు -36జన్‌కీ బాత్ ఎన్డీఏ-362-392ఇండియా-141-161ఇతరులు -10-20న్యూస్ నేషన్ ఎన్డీఏ-340-378ఇండియా-153-169ఇతరులు -21-23దైనిక్ భాస్కర్ఎన్డీఏ-281-350ఇండియా-145-201ఇతరులు -33-49 -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఏపీలో మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనమే
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. వైఎస్సార్ సీపీ విజయ భేరి మోగించనుందని స్పష్టం చేశాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం జగన్ ప్రభుత్వానికే మరోసారి జనం జై కొట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆరా సంస్థ తేల్చింది. 94 నుంచి 104 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్ తెలిపారు. 13-15 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుందని ఆరా అంచనా వేసింది. షర్మిలకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆరా మస్తాన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 98 నుంచి 116 వరకు.. టీడీపీ 59-77 వస్తాయని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది. వైఎస్సార్సీపీకి 117 నుంచి 120.. టీడీపీకి 48 నుంచి 50 సీట్లు దక్కవచ్చని రేస్ తెలిపింది.ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్:ఆత్మసాక్షి: వైఎస్సార్సీపీ: 98-116టీడీపీ 59-77రేస్:వైఎస్సార్సీపీ-117-120టీడీపీ-48-50పోల్ స్ట్రాటజీ గ్రూప్:వైఎస్సార్సీపీ- 115-125టీడీపీ- 50-60ఆపరేషన్ చాణక్య:వైఎస్సార్సీపీ: 95-102టీడీపీ: 64-68చాణక్య పార్థదాస్:వైఎస్సార్సీపీ: 110-120టీడీపీ: 55-65 పోల్ స్ట్రాటజీ గ్రూప్:వైఎస్సార్సీపీ: 115-125టీడీపీ: 50-60జన్మత్:వైఎస్సార్సీపీ: 95-103టీడీపీ: 67-75అగ్నివీర్:వైఎస్సార్సీపీ: 124-128టీడీపీ: 46-49పోల్ లాబొరేటరీ:వైఎస్సార్సీపీ: 108టీడీపీ: 67WRAP స్ట్రాటజీస్:వైఎస్సార్సీపీ: 158-171టీడీపీ-0-4ఏబీపీ- సీ ఓటర్:వైఎస్సార్సీపీ 97-108టీడీపీ 67-78ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్:ఆరా మస్తాన్:వైఎస్సార్సీపీ: 13-15టీడీపీ:10-12ఆత్మసాక్షి:వైఎస్సార్సీపీ: 17టీడీపీ: 08రేస్:వైఎస్సార్సీపీ-19టీడీపీ- 06టైమ్స్ నౌ-ఈటీజీ:వైఎస్సార్సీపీ: 14టీడీపీ-11 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైఎస్సార్సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్సార్సీపీకి అవకాశం కల్పించారని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చెబుతున్నాయి. -
వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..
-
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
-
ఎగ్జిట్ పోల్స్ ఏం తేలుస్తాయి ?
-
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు..
జూన్ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల హ్యాష్ ట్యాగులు ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది. ఇక.. 2019 ఏపీ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. 2019 మే 23వ తేదీ వెలువడ్డ ఫలితాలతో పోలిస్తే.. ఆ అంచనాలు ఎంత వరకు ఫలించాయో పరిశీల్తిస్తే.. 2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో ఎక్కువ సర్వే సంస్థలు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. లోక్‌సభ స్థానాల్లో 20కి దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ చెప్పింది. వాటిల్లో.. 👉లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.👉 ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.👉 టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైఎస్సార్సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.👉 న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా.. అంతకు మించే ఫలించింది. 25 స్థానాలకుగానూ 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని, అలాగే ఏపీ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. 👉 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.👉 వైఎస్సార్సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.👉 ఆరా మస్తాన్ సర్వేలో వైఎస్సార్సీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.👉 వీడీపీ అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.👉 ఐపల్స్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.👉 కేకే సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి👉 మిషన్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు. ఇక్కడా ఆ అంచనాలు మించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టిస్తూ సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారాన్ని కైవసరం చేసుకుంది. మరి ఈసారి ప్రతిపక్షం కూటమిగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీ సంక్షేమ పాలన నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. చూద్దాం.. సాయంత్రం రాబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉంటాయో!. -
ఎగ్జిట్ ఉత్కంఠ
సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. మన రాష్ట్రంలో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ ముగిసినా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు మరో మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో సర్వే సంస్థలు, టీవీ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించలేదు. చివరిదశ పోలింగ్ నేడు(శనివారం) ముగియనుంది. సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగుస్తుంది. దీంతో 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ను సర్వే సంస్థలు వెల్లడించనున్నాయి. దీని కోసం బెట్టింగ్ రాయుళ్లు, రాజకీయపార్టీల నేతలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ నాలుగో తేదీన ఉన్నప్పటికీ ఎగ్జిట్‌పోల్స్‌తో గెలుపోటములపై ఓ అంచనా వచ్చే అవకాశం ఉంది. దీంతో అందరిలోనూ ‘ఎగ్జిట్’ ఉత్కంఠ నెలకొంది. – సాక్షిప్రతినిధి కర్నూలు: సార్వత్రిక సమరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగింది. పోలింగ్, కౌంటింగ్‌కు 22 రోజులు గడువుంది. ఈ మధ్యలో జిల్లాలో జోరుగా బెట్టింగ్‌లు జరిగాయి. 14 అసెంబ్లీలలో అభ్యర్థుల విజయావకాశాలను బట్టి అభ్యర్థులు ఎవరికివారు లెక్కలు వేసుకుని ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. కొంతమంది పోలింగ్‌రోజే ఎగ్జిట్‌పోల్స్ చేయించారు. మరికొందరు పోలింగ్ ముగిసి తర్వాత పోలింగ్‌బూత్‌ల వారీగా ఏజెంట్లు, ముఖ్యనేతలను పిలిపించుకుని బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు పోలై ఉంటాయనే లెక్కలు వేసుకున్నారు. ఆపై అభ్యర్థులు, ముఖ్యనేతలు వారి పరిధిలో పరిచయం ఉన్న మీడియా ప్రతినిధులు, సర్వేసంస్థల ప్రతినిధులను కలిసి ఓ అంచనాకు వచ్చారు. దీని ప్రకారం బెట్టింగ్‌లు కాశారు.ఉమ్మడి జిల్లాలో రూ. వంద కోట్లకుపైగా బెట్టింగ్లుఅసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై గతంలో ఏ ఎన్నికల్లో లేని విధంగా బెట్టింగ్‌లు నడిచాయి. గత నాలుగు ఎన్నికల ఫలితాలు, ఈ దఫా జరిగిన పోలింగ్‌ను బట్టి రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక స్థానాలు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కై వసం చేసుకుంటుందనే అభిప్రాయం ప్రజలతో పాటు రాజకీయపార్టీల్లో కూడా స్పష్టత ఉంది. అయితే ఏ అసెంబ్లీ వైఎస్సార్సీపీ గెలుస్తుంది? ఎక్కడ టీడీపీ గెలుస్తుందనే అంశంలోనే అందరిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశమే బెట్టింగ్‌లు భారీగా కాసేందుకు ప్రభావం చూపింది. ఫలానా అసెంబ్లీ స్థానాన్ని వైఎస్సార్సీపీ గెలుస్తుందంటే, లేదు అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని బెట్టింగ్‌లకు సిద్ధమయ్యారు. బెట్టింగ్‌లు చాలా రకాలుగా జరిగాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు? ఎంత మెజార్టీతో గెలుస్తారు? ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఇలా రకరకాలుగా బెట్టింగ్‌లు కాశారు. మెజార్టీ వ్యక్తులు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, మెజార్టీ స్థానాలు వైఎస్సార్సీపీ గెలుస్తుందని బెట్టింగ్ నిర్వహించారు. అప్పటి వరకూ 1:1 లెక్కన బెట్టింగ్ జరిగింది. పల్లెల్లో రూ.50వేలు, లక్ష నుంచి ఓ స్థాయి నాయకులు రూ.10లక్షలు, రూ.50లక్షలు బెట్టింగ్ కాశారు. మరికొందరు గుంపుగా ఏర్పడి రూ.కోటి, 2కోట్లు కూడా బెట్టింగ్ కాశారు.సీఎం వ్యాఖ్యల తర్వాత మారిన తీరుపోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ఆపై నాలుగురోజులకు 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ల కంటే అధిక స్థానాలు గెలువబోతున్నామని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇదే అందరిలోనూ గుబులు రేకిత్తించింది. పక్కా సమాచారం లేకుండా సీఎం వ్యాఖ్యానించరని, కచ్చితమైన రిపోర్టులతోనే ఈ ప్రకటన చేశారని అంతా భావించారు. ఈ ప్రకటనల తర్వాత చాలామంది బెట్టింగ్‌లు వెనక్కి తీసుకున్నారు. అయితే తర్వాత నాలుగైదురోజులకు బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య 1:2, 1:3 లెక్కల బెట్టింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు అంశంలోనూ ఈ రకమైన పందమే జరిగింది. దీంతో చాలామంది టీడీపీ నేతలు, బెట్టింగ్‌రాయుళ్లు పోతే ఒకటే, గెలిస్తే 2, 3 రెట్లు డబ్బు వస్తుందని పందెం కాశారు. దీంతో తిరిగి పందేలు ఊపందుకుని రూ.100 కోట్లకుపైగా జరిగి ఉంటాయని తెలుస్తోంది. కొందరు పొలాలు, స్థలాలు కూడా పందెం కాశారు. మరి కొంతమంది యువకులు విదేశీపర్యటనల ఖర్చును బెట్టింగ్ కాశారు. అయితే నగదుపై జరిగిన బెట్టింగ్ ఎక్కువగా ప్రొద్దుటూరు, విజయవాడ, గుంటూరుతో పాటు తూర్పు, పశ్చిమ గోదావారి ప్రాంతంలోని వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. వీరితో పాటు హైదరాబాద్ కేంద్రంగా కూడా ఇక్కడి వ్యక్తులు బెట్టింగ్ కాచారు. రెండువైపుల నగదును హైదరాబాద్‌లోని మధ్యవర్తులకు ఇచ్చారు. -
ఎగ్జిట్‌పోల్స్.. ఏం చెబుతాయో!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగియనుండటంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. శనివారం చివరి దశలో ఎన్నికలు జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నాయి. జూన్ ఒకటి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించకుండా న్యూస్ ఛానెల్‌లను ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేస్తుందన్న దానిపై అంచనాలను వెల్లడించనున్నాయి. రాజకీయ పండితులు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) విజయం సాధిస్తుందని అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి చివరివరకు గట్టిగా పోరాడటంతో ఎగ్జిట్ పోల్స్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ సొంతంగా 303 స్థానాలు, ఎన్డీఏ కూటమితో కలిసి 352 స్థానాలు గెలుచుకున్నాయి. -
ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా రేపు వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటితో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడాల్సి ఉంది. అయితే.. నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. రేపు అంటే జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రం 6:30 తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని తాజా ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు,అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే వీటన్నింటికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో అంతటా పోలింగ్ ముగిసిన తర్వాతే వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు మార్చి 28వ తేదీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈసీ స్పష్టం గా పేర్కొంది.