దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్‌లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుండి విజయం సాధించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తన సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీని కాపాడుకోవడంలో విజయం సాధించనుంది. అలాగే మంచి ఆధిక్యతనూ దక్కించుకోనున్నదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి.
రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ ఈ సీటు కాంగ్రెస్‌కే దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపొందిన ఏకైక స్థానం రాయ్‌బరేలీ. సోనియా గాంధీ ఇక్కడ నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలిచారు. రాయ్‌బరేలీ మినహా యూపీలోని మరే సీటులోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అయితే అదేసమయంలో కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించారు. సోనియా గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కుమారుడు రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపాలని సోనియా ముందుగానే నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ తన కుమారుడిని రాయ్ బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన ఈ ప్రకటన ఓటర్లను ఆకట్టుకుంటుందని కాంగ్రెస్ భావించింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అంచనాలకు ఊతమిస్తున్నాయి.
రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. 1951-52లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానం కాదు. అప్పట్లో రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్‌లను కలిపి ఒక సీటు ఉండేది. తొలి ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1957లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానంగా మారడంతో ఫిరోజ్ గాంధీ ఈ స్థానం నుంచి తరిగి పోటీ చేసి, విజయం సాధించి పార్లమెంటుకు చేరుకున్నారు. ఇందిరా గాంధీ వరుసగా నాలుగు సార్లు ఇక్కడ నుండి ఎంపీ అయ్యారు. మొదటి లోక్‌సభ ఎన్నికల నుండి 2019లో జరిగిన ఎన్నికల వరకు మొత్తం 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ స్థానం నుండి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి ఓడిపోయిన సందర్భాలు మూడు మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment