51 శాతం ఓట్లతో 117–125 అసెంబ్లీ సీట్లు కైవసం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్ కలిగిన టైమ్స్ నౌ–ఈటీజీ రీసెర్చ్ ఆదివారం తన ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చిచెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 51 శాతం ఓట్లతో మొత్తం 117–125 సీట్లు కైవసం చేసుకుంటుందని.. అదే సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ (ఎన్డీయే) కూటమి 47 శాతం ఓట్లతో 50–58 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది.
అలాగే, లోక్‌సభ పోలింగ్ విషయానికొస్తే.. వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో 14 ఎంపీ స్థానాలు, ఎన్డీయే కూటమి 48 శాతం ఓట్లతో 11 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఈసారి ఏపీలో దాదాపు 82శాతం పోలింగ్ నమోదైందని.. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది ఇంచుమించు రెండుశాతం అధికమని వివరించింది. అంతేకాక, మహిళల ఓటింగ్ కూడా ఈ దఫా 15శాతం అధికంగా నమోదైందని టైమ్స్ నౌ–ఈటీజీ రీసెర్చ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment