Times Now
-
ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన సంగతి గుర్తుందా?
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ట్వీట్లతో లోకేశ్ చేసిన హడావుడిని ఆంగ్ల మీడియా ఛానెల్ టైమ్స్ నౌ జాతీయ స్థాయిలో ఎత్తి చూపింది. ‘‘ఫ్రాంక్లీ స్పీకింగ్’’ పేరుతో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఛానల్ యాంకర్ నుంచి వచి్చన ప్రశ్నతో లోకేశ్ తెల్లమొహం వేశాడు. ‘2024 ఏప్రిల్‌లో అనుకుంటా ఎన్నికల ముందు మీరు నేరుగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేశారుగా’ అంటూ యాంకర్ ప్రశ్న అడగడంతో లోకేశ్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ట్వీట్లో ఏముందంటే.. ఎన్నికల సమయంలో ఏప్రిల్ 12న ఎలన్ ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేస్తూ ‘2017లో అప్పటి సీఎం చంద్రబాబుతో కలిసి మీతో చర్చలు జరిపామని, మీరు ఇప్పుడు ఇండియాకు వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మా బృందం దీనిపై చర్చించుకున్నామని, పెట్టుబడులకు ఏపీ ఒక ముఖద్వారమని, ఈరోజు నుంచి రెండు నెలల్లో టెస్లా ఏపీ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుంది’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. యాంకర్ ప్రశ్నల వర్షం.. ఇప్పుడు ఇదే ట్వీట్‌ను టైమ్స్‌నౌ యాంకర్ గుర్తు చేస్తూ ‘ఎన్నికల ముందు ట్యాగ్ చేశారు కదా.. ఇప్పటికే మూడు నెలలు దాటిపోయింది..ఎలన్ మస్క్‌తో ఏమైనా సంప్రదింపులు చేశారా’ అని అడిగింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న లోకేశ్ వెంటనే తేరుకొని ‘ఆయన ఎప్పుడు ఇండియాకు వస్తే అప్పుడు చర్చలు జరుపుతాం’ అన్నారు. అంటే ఆయన ఇండియాకి వస్తేనే చర్చలు అంటే దానిపై నాకు నమ్మకంలేదు.. ప్రజలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకుంటున్నారు.. ఈ షో పేరే ‘ఫ్రాంక్లీ స్పీకింగ్’ సరైన సమాధానం చెప్పండి అని యాంకర్ రెట్టించి అడగడంతో లోకేశ్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.. ముఖంమీదకి లేని చిరునవ్వు తెప్పించుకుంటూ తాము 2015 నుంచే ఎలన్ మస్క్‌తో చర్చలు జరుపుతున్నామని, అధికారంలో లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఏపీలో పెట్టుబడుల గురించి సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకుపోతుంటే యాంకర్ మధ్యలో అందుకొని ఇదంతా కాదు...మీరు అధికారం చేపట్టి 100 రోజులు దాటిన తర్వాత అడుగుతున్నా.. ఇంత వరకు మీరు చర్చలు జరిపారా? లేదా? అని మరోసారి అడిగితే నేరుగా సమాధానం చెప్పకుండా దేశంలో పెట్టుబడులకు ఏపీ మొదటిస్థానమని, టెస్లానే కాకుండా అన్ని రంగాల గురించి చర్చిస్తున్నామంటూ లోకేశ్ సమాధానం దాటవేయడంతో జాతీయ స్థాయిలో లోకేశ్ పరువు పోయింది.. దీంతో యాంకర్చేసేది లేక వేరే ప్రశ్నలకు వెళ్లిపోయింది.నిక్కచ్చిగా అబద్ధాలు ... 100 రోజుల పాలనలో ఏపీకి ఏమి తీసుకొచ్చారు అని యాంకర్ అడిగితే ఇంత వరకు రాష్ట్రానికి రాని పెట్టుబడులు వచ్చేసినట్లు అబద్ధాలను కళ్లు మూయకుండా చెప్పుకుంటూ పోయాడు. టీసీఎస్ వచ్చేసిందని, లులు వెనక్కి వస్తోందని, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 7గిగావాట్ల పెట్టుబడులు, ఫార్మా, ఐటీ, ఎల్రక్టానిక్స్, పెట్రోకెమికల్స్, యూనివర్సిటీలు ఇలా అనేకం ఐదేళ్లలో రాష్ట్రానికి వస్తున్నాయంటూ చెప్పారు. అంతేకాదు విజయవాడ వరదల్లో 40 డ్రోన్లతో 50,000 మందికి ఆహారం సరఫరా చేశామని చెప్పడాన్ని నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఒకరు 59డ్రోన్లు అంటారు మీ కార్యదర్శి 412 డ్రోన్లు అంటారు మీరు 40 అంటున్నారు ఇంతకీ ఏది నిజం అంటూ నిలదీస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా లోకేశ్ మరింతట్రోలింగ్కు గురికావడంతో జాతీయ స్థాయిలో తమ నాయకుడు పరువు పోయిందంటూ తెలుగు తమ్ముళ్లు తెగ మధన పడిపోతున్నారు. -
టైమ్స్ నౌ–ఈటీజీ ఎగ్జిట్ పోల్‌లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ కలిగిన టైమ్స్ నౌ–ఈటీజీ రీసెర్చ్ ఆదివారం తన ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చిచెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 51 శాతం ఓట్లతో మొత్తం 117–125 సీట్లు కైవసం చేసుకుంటుందని.. అదే సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ (ఎన్డీయే) కూటమి 47 శాతం ఓట్లతో 50–58 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. అలాగే, లోక్‌సభ పోలింగ్ విషయానికొస్తే.. వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 14 ఎంపీ స్థానాలు, ఎన్డీయే కూటమి 48 శాతం ఓట్లతో 11 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఈసారి ఏపీలో దాదాపు 82శాతం పోలింగ్ నమోదైందని.. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది ఇంచుమించు రెండుశాతం అధికమని వివరించింది. అంతేకాక, మహిళల ఓటింగ్ కూడా ఈ దఫా 15శాతం అధికంగా నమోదైందని టైమ్స్ నౌ–ఈటీజీ రీసెర్చ్ తెలిపింది. -
YS Jagan Interview: క్లీన్ స్వీప్ ఖాయం
సాక్షి, అమరావతి : ‘రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సుపరిపాలన అందించాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశాం. అర్హతే ప్రామాణికంగా, వివక్ష చూపకుండా.. అవినీతికి తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. విప్లవాత్మక సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించాం. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత, నమ్మకమే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడానికి దారితీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిణామాలపై సీఎం వైఎస్ జగన్‌ను టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్–ఇన్–చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.నవికా: రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ చెల్లెళ్లు మీ మీద పోరాటానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఎవరితో పోరాడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? సీఎం జగన్: మా ప్రభుత్వంపై పోరాటానికి వస్తున్న ప్రతి ఒక్కరితో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ కూడా చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబు నా చెల్లెలు షర్మిలను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నా చెల్లిని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ ఓటర్లలో చీలిక తెచ్చి లబ్ధి పొందాలని వాళ్లు భావిస్తు న్నారు. మా ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా వ్యతి రేకత లేదు. ప్రజాస్వామ్యంలో 50 శాతానికి పైగా ఓట్లతో గెలిచాం. చెప్పినవి చేసి చూపించాం. అందువల్ల ప్రజలు మాతోనే ఉన్నారు. దేవుడి దయతో మేం స్వీప్ చేయబోతున్నాం.నవికా: కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపారని మీరు అంటున్నారు. ఈ విషయం బీజేపీకి తెలియదంటారా?సీఎం జగన్: ఈ ప్రశ్న మీరు ఆ పార్టీ వాళ్లను అడగాలి.నవికా: మీరు పరాజయం పాలవ్వబోతున్నారనే బీజేపీ మీతో పొత్తు పెట్టుకోలేదా? టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని మీరేమైన నిరాశకు గురయ్యారా?సీఎం జగన్: పొత్తు పెట్టుకుంటానని నేను ఏ పార్టీని కోరలేదు. గొప్ప పరిపాలనను మేం అందించాం. ఈ క్రమంలో మేం పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. మా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు అప్రధానం. వాళ్ల పార్టీ, వాళ్లకు ఇష్టం వచ్చినట్టు పొత్తులు పెట్టుకున్నారు. మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కొన్ని సందర్భాల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి కొన్ని బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చాం. ప్రజల ప్రయోజనాలకు ఇబ్బంది అనిపించినప్పుడు ఆ బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు. ఉదాహరణకు మైనార్టీల హక్కులకు విఘాతం కలిగించే బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు. సీఏఏకు వ్యతిరేకంగా మేం అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.నవికా: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమే మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారనే వాదన ఉంది. ఈ క్రమంలో హోదా అంశంపై ఏదైనా భరోసా లభించిందా?సీఎం జగన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒప్పుకుంది. కానీ.. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని విభజన చట్టంలో చేర్చకుండా అన్యాయం చేసింది. పార్లమెంట్లో కేంద్రం చేసిన ప్రకటన మేరకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందని మేం నమ్మాం. కానీ.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు చెలగాటం ఆడాయి. ప్రత్యేక హోదాను సాధించడమే ప్రధాన అజెండాగా మేం అడుగులు ముందుకు వేశాం, వేస్తున్నాం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను సాధిస్తాం.నవికా: పూర్తి మెజార్టీతో కాకుండా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తేనే హోదా వస్తుందని భావిస్తున్నారా?సీఎం జగన్: ఇది నిజం. అందరికీ ఇది తెలిసిన అంశమే.నవికా: మెజార్టీ లేక సంకీర్ణం.. కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందని మీరు భావిస్తున్నారు? సీఎం జగన్: జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో అంచనా వేయడం సాధ్యం కాకపోవచ్చు. జాతీయ మీడియా చేసిన సర్వేలు కొన్ని సార్లు నిజం కావచ్చు. కాపోవచ్చు. నవికా: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మీరు అనుకుంటున్నారా?సీఎం జగన్: రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఇద్దరిని నేను దగ్గరగా చూశాను. వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ, మోదీతో పోల్చి చూస్తే.. మైనార్టీలకు వ్యతిరేకం అని తప్పితే మిగతా అంశాల్లో మోదీనే మంచివారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న నా తండ్రి మరణించాక నా కుటుంబాన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేశారో అందరికీ తెలుసు. ఆ వేధింపులకు నేనే సాక్షి. ఈ క్రమంలో ఏ విధంగా రాహుల్ గాంధీ మంచివాడని అనాలి?నవికా: రాజకీయాల్లో ఉన్నత ఆశయాలు ఉన్నాయని చెబుతున్నారు మీరు.. అందుకే మీ చెల్లెళ్లు్ల మీ నుంచి దూరమయ్యారా? మీరు పార్టీలోకి రానివ్వకపోవడంతోనే వేరే పార్టీల వైపు వెళ్లారా?సీఎం జగన్: వాళ్లను తీసుకొస్తే అది కుటుంబ రాజకీయంగా మారిపోతుంది. ఒకే కుటుంబలోని ఒక జనరేషన్ నుంచి ఎక్కువ మంది రాజకీయాల్లో ఉంటే అది పార్టీ అవ్వదు. మరేదో అవుతుంది. నాకు స్పష్టమైన విజన్ ఉంది. పార్టీ వారసత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. ప్రజలకు మంచి చేసేందుకు నాకు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. వారసత్వం అనేది వేరే ప్రస్తావన. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలంటే.. ఎవరైనా వస్తే సంతోషంగా మాట్లాడుకోగలగాలి. అందరూ కలిసి ఒకేచోట కూర్చుని సరదాగా ఉండాలి. అంతేగానీ ప్రతి చోట రాజకీయం అంటే ఎలా? ఒక కుటుంబం నడిపే పార్టీ ఎప్పటికీ బతకదు.నవికా: మీ చెల్లెలితో మీ అనుబంధం ఎలా ఉండేది?సీఎం జగన్: దురదృష్టవశాత్తు ఆమె చంద్రబాబుతో కలిసింది. ఆయన చెప్పినట్టే రాజకీయాలు చేస్తోంది. మా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తోంది. (నవికా: ఆమె మీ కుటుంబమే కదా..) మా కుటుంబ సభ్యురాలు అయి ఉండి కూడా.. బయటకు వెళ్లడం, రాజకీయ శత్రువులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోంది.నవికా: మీ ఇద్దరి విషయంలో.. రెండు వైపులా మీ తల్లి ఎలా మేనేజ్ చేస్తున్నారు?సీఎం జగన్: ఈ రోజు రాజకీయాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు.. ఎవరు చేయట్లేదు అనేది కాదు. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన మంచిని మేము చెబుతున్నాం. ఇక్కడ జగన్ ఒక వైపు.. మిగిలిన వారందరూ మరో వైపు ఉన్నారు. ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతు తెలుపుతారు. అలాంటి రాజకీయమే నడుస్తోంది. కుటుంబ రాజకీయాలు ఇక్కడ పని చేయవు.నవికా: చంద్రబాబు చెప్పినట్టే.. ఆయనకు ఏమి అవసరమో అదే.. మీ చెల్లెలు చేస్తున్నారని ఎలా చెబుతున్నారు? కాంగ్రెస్ పార్టీలోని సభ్యులు ఆమెకు ఆశలు కల్పించి ఉండొచ్చుకదా?సీఎం జగన్: ఇక్కడ వాస్తవం ఏమంటే.. ఏమి జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు. (నవికా: మీరేమైనా ఫోన్ ట్యాపింగ్ చేశారా? తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారని చెబుతున్నట్టు) ఎవరైనా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆమె నా సొంత చెల్లెలు. అందుకే ఏం జరిగిందో ఏం జరుగుతోందో నాకు తెలుసు. ఎవరు ఆడిస్తున్నారో.. ఎవరు నీచ రాజకీయాలు చేస్తున్నారో నాకు తెలుసు.నవికా: నారీ శక్తిని విశ్వసిస్తున్న దేశంలో.. తండ్రి వారసత్వం వాటా కొడుకులకు మాత్రమే కాదు.. కూతుళ్లకు వర్తిస్తుందంటే మీరు ఏమంటారు?సీఎం జగన్: దీనినే సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారసత్వం కోసం పోరాటం జరగట్లేదు. మా నాన్న 2009లో అందరినీ విడిచి వెళ్లిపోయారు. మనం 2024లో మాట్లాడుకుంటున్నాం. దాదాపు 15 ఏళ్లు అవుతుంది నాన్న వెళ్లిపోయి. ఇక్కడ ముఖ్యమంత్రిగా నా ఐదేళ్ల పాలనను ప్రజలు చూశారు. నా పాలనను విశ్వసిస్తే వారే ఓటు రూపంలో నాకు మద్దతుగా నిలుస్తారు. లేకుంటే వేరే వైపు చూస్తారు. ఆ పోరాటమే నడుస్తోంది గానీ, వారసత్వం ఎక్కడి నుంచి వస్తుంది?నవికా: ఏపీలో కాంగ్రెస్, ఎన్డీఏ, జగన్ ముక్కోణపు పోటీలో ఉన్నారు? ఏమైనా మీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారా?సీఎం జగన్: ఈ రోజు నేను చెప్పే మాటలను (మార్క్) గుర్తు పెట్టుకోండి. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ రండి. కాంగ్రెస్‌కు నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతృత్వంలోని కూటమి మధ్యే పోటీ.నవికా: 2019 ఎన్నికల్లో మీరు రికార్డు విజయం సాధించారు. 175 శాసనసభ స్థానాల్లో 151 స్థానాలు, 25లో 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఎన్ని స్థానాలను మీరు గెలవబోతున్నారు?సీఎం జగన్: ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం అనేది ముఖ్యమైనది. గత ఎన్నికల్లో మేము 49.96 శాతం ఓట్లు సాధించాం. ఈ సారి దేవుడి దయతో 2019లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ తెచ్చుకుంటామని నాకు బలమైన నమ్మకం ఉంది. మీరు మంచి విశ్లేషణ చేస్తారు.. మీరే ఆ రోజు టీవీలో నంబర్లు చూస్తారు.నవికా: దేశంలో ప్రత్యర్థి పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయి? దీనిపై మీరు ఏమంటారు?సీఎం జగన్: నేను దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాంటప్పుడు వేరే విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.నవికా: ఏపీలో బీజేపీ పొత్తును మీరు టార్గెట్ చేశారు. 2014లో కలిసి పోటీ చేసిన వాళ్లు.. తిరిగి 2024లో వస్తున్నారు? మీరు దీనిని అవకాశవాద పొత్తుగా ఎందుకు చూస్తున్నారు?సీఎం జగన్: ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తుంది. అదే పార్టీ విజన్‌ను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే మార్గదర్శకంగా ఉంటుంది. పాలనా పని తీరును కూడా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో నేరవేర్చామా లేదా అని పోల్చి చూడాలి. ఇదే ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లను అడిగేందుకు మన అర్హతను నిర్ణయిస్తుంది. ఇప్పుడు కూటమిగా వస్తున్న వాళ్లే.. గతంలో చంద్రబాబు సంతకంతో రకరకాల హామీలతో కరపత్రం ముద్రించి 2014లో ప్రతి ఇంటికీ పంపించారు. కూటమి నాయకుల ఫొటోలతో ముద్రించారు. ఇదే విషయాన్ని నా ప్రతి బహిరంగ సభలోనూ ప్రజలకు చెబుతున్నాను. వాళ్ల మేనిఫెస్టోను చూపించి.. అందులోని వాగ్ద్ధానాలను చదివి.. ఇవన్నీ 2014 ఎన్నికల తర్వాత అమలు చేశారా? లేదా? అంటూ ప్రజలనే అడుగుతున్నాను. అందులో నెరవేర్చిన ఒక్క హామీనైనా చెప్పమంటున్నాను. చెప్పడానికి అందులో ఒక్కటంటే ఒక్కటీ లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అప్పట్లో ఆ కూటమి ప్రజలను మోసం చేసింది. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం నుంచి తుడిచి పెట్టుకుపోయాడు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాల్లో మేము గెలిచాం. మళ్లీ అదే కూటమి.. అదే చంద్రబాబు.. కొత్త మేనిఫెస్టోతో వచ్చారు.నవికా: ఐదేళ్ల మీ పాలనను ప్రజలు చూశారు. చంద్రబాబు కంటే మీరు మెరుగైన పాలన అందించారని ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా?సీఎం జగన్: చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ మేం 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్రికరణశుద్ధితో అమలు చేశాం. మా మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకే ఇచ్చి.. అందులో వారికి ప్రభుత్వం నుంచి ఏమేం అందాయో టిక్ చేయమని చెప్పాం. మొదటి ఏడాదిలోనే దాదాపు 86, 87 శాతం హామీలు అమలు చేస్తే.. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు చేశారని ప్రజలే చెబుతున్నారు. అది మా ప్రభుత్వం, మా పార్టీపై ప్రజలకున్న విశ్వసనీయత. అదే మా నమ్మకం.నవికా: చంద్రబాబు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాక సభలు నిర్వహించారు. అదే సమయంలో మీరూ సిద్ధం సభలు పెట్టారు. చంద్రబాబుకు ప్రజల నుంచి సానుభూతి రాకూడదనే మీరు సిద్ధం సభలు నిర్వహించారని ప్రతిపక్షాలు అంటే మీరేమంటారు? సీఎం జగన్: (నవ్వుతూ..) నేను సిద్ధం సభలు పెట్టినట్టే వారూ రాజకీయ సభలు పెట్టారు. కానీ జగన్ సిద్ధం సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. వారి సభలకు ఎవరూ రాలేదు. దానికి నేనేం చేయగలను.. ఈ ప్రశ్న వారినే అడగాలి. జగన్ అంత జనాన్ని ఎలా ఆకట్టుకుంటున్నాడు.. మీరెందుకు ప్రజలను ఆకట్టుకోలేకపోయారని వారినే అడగండి.నవికా: మీ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య మీ కుటుంబంలో వివాదాస్పదంగా మారింది. ఆ హత్య కేసులో ఆయన భార్య, మీ చెల్లెళ్లు కూడా గత ఐదేళ్లుగా కేసు దర్యాప్తులో న్యాయం జరగలేదంటున్నారు. సీఎం జగన్: ఈ అంశం మా కజిన్స్ మధ్య ఉంది. మా కజిన్ సిస్టర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్న మరో కజిన్ బ్రదర్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆరోపణలు కజిన్‌పై చేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఘటన జరిగినప్పుడు ఇవేమీ లేవు. కానీ సడెన్‌గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? దీనికంతటికీ కారణం చంద్రబాబే.నవికా: ప్రతి సమస్యకు చంద్రబాబుతో సంబంధం ఉంటుందా?సీఎం జగన్: ఇక్కడ జరుగుతున్నది జగన్, చంద్రబాబు మధ్య పోరాటం. జగన్‌ను ఒంటిరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నా కుటుంబాన్నే నాకు వ్యతిరేకంగా మార్చాలని చూస్తున్నారు. జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు.. నా వెనుక ప్రజలున్నారు. ఇలాంటప్పుడు నాపై వ్యతిరేకత ఎందుకొస్తుంది! ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఇతర పార్టీల అవసరం ఏముంది? నవికా: రాజకీయ ప్రతీకారంతో అనుకోండి, లేదా మరేమైనాగానీ మీపై ఉన్న సీబీఐ కేసుల గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.. అవి మీ ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారతాయనుకుంటున్నారా?సీఎం జగన్: నాపై ఉన్న కేసులు నా ప్రభుత్వంలో, నా పాలనలో నమోదైనవి కాదు. మా నాన్న చనిపోయినప్పుడు.. నేను రాజకీయంగా వారికి ఎక్కడ అడ్డు తగులుతానో అని భయపడి చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రతో పెట్టిన కేసులు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. నాపై అక్రమ కేసులు బనాయించడానికి చేసిన ఆరోపణలు ఏ కాలానికి సంబంధించినవి? అప్పటికి నేను ఎమ్మెల్యేను కాను, ఎంపీనీ కాను. పైగా అప్పట్లో నేను హైదరాబాద్‌లో కూడా లేను. ఆ సమయంలో నేను ఏ ఒక్క మంత్రితోగానీ ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌తోగానీ ఏ ఒక్క ఐపీఎస్ అధికారితో గానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది వాస్తవం. నవికా: కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయా? సీఎం జగన్: అవును, నిజానికి నా జీవితంలో 16 నెలలు ఎవరు చెల్లిస్తారు? నన్ను జైల్లో పెట్టారు, కారణం ఏంటి?నవికా: కేంద్రంలోని బీజేపీ తన ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకు కేంద్ర ఏజెన్సీలను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ చెబుతోంది, మీరేం చెబుతారు?సీఎం జగన్: అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? నాపై నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ. 2004 నుంచి 2009 వరకు నా తండ్రి ముఖ్యమంత్రి. ఇప్పుడు 2024 వచ్చింది. కాంగ్రెస్ ఏం చేసింది.. అధికారంలో ఉన్నవారు తమ అధికారాన్ని చెడు కోసం వాడుకుంటున్నారు. ఇలా చేయడం దురదృష్టకరం. ఒక వేలు ఒకరి వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయి, అది అర్థం చేసుకోవడం లేదు.నవికా: ఎన్డీఏ, ఇండియా కూటమిలో మీరు భాగస్వామ్యం కాలేదు ఎందుకు? రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వంటి ప్రతిపక్ష నేతలు ఉండటం వల్ల ఇండియా కూటమి మీకు అంత అనుకూలం కాదనుకున్నారా?సీఎం జగన్: ఈ రెండు జాతీయ పార్టీలూ ఆంధ్రప్రదేశ్‌లో అప్రధానమైనవి అనేది మనం ముందుగా గుర్తించాలి. ఎవరైనా వాటితో కలిసి ఎందుకు పోటీ చేయాలనేది ప్రాథమిక ప్రశ్న. రాష్ట్ర ప్రయోజనాలు, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అంశాల వారీగా కేంద్రానికి వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుంది. దేనికి మద్దతివ్వాలి.. దేనికి ఇవ్వకూడదనేది మేం ఆలోచించుకుంటాం.నవికా: ఒకవేళ ఎన్ఆర్సీ వస్తే మద్దతిస్తారా?సీఎం జగన్: మద్దతు ఇవ్వం.నవికా: జగన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా తనకంటూ సొంత గుర్తింపుతోనే ముందుకు వెళ్లాలనుకుంటోందా? దానికి మీరు పూర్తిగా కట్టుబడి ఉన్నారా?సీఎం జగన్: కచ్చితంగా. విశ్వసనీయత, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. రాజకీయాలలో విశ్వసనీయత ప్రధానమైనదని నేను గట్టిగా నమ్ముతాను. ప్రజల కోసం ఎవరితోనైనా పోరాటం చేయడానికి సిద్ధం.నవికా: ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏమనుకుంటున్నారు. చాలా సమావేశాల్లో ఆయనతో కలిసి మీరు పాల్గొన్నారు. ఈ మధ్య ఆయన చాలా పొత్తులు పెట్టుకున్నారు. మీరెలా భావిస్తున్నారు?సీఎం జగన్: రాజకీయాల్లో మోదీని, రాహుల్ గాంధీలను చూశాం. అయితే మైనార్టీలకు వ్యతిరేకం వంటి కొన్ని విషయాల్లో మోదీతో మేం విభేదించవచ్చు. కానీ ఆయన మంచి నాయకుడే.నవికా: రాహుల్ గాంధీ గురించి చెప్పాలంటే ఏం చెబుతారు. మీరొక భారతీయ పౌరుడిగా చెప్పండి.సీఎం జగన్: నేను ఇప్పటికే ఈ విషయంపై చెప్పాను. ఒక వేళ రాహుల్ మంచి నాయకుడైతే ప్రజలే ఓట్లేసి గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాకు చేసిన అన్యాయాన్ని బట్టి రాహుల్‌పై నా అభిప్రాయం నాకుంది. నాకైతే రాహుల్ అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేదు.నవికా: మూడు రాజధానుల అంశం గురించి ఏమంటారు?సీఎం జగన్: ఆ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ పరిపాలన రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో విజయం సాధించి.. సీఎంగా నేను ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తాను.నవికా: ఎన్నికల్లో మీకెన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయనుకుంటున్నారు? 151 సంఖ్యను దాటుతామని అనుకుంటున్నారా? బీజేపీకి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? సీఎం జగన్: మా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. నన్ను నమ్మండి. నంబర్స్ చూస్తూ ఉండండి.నవికా: ప్రధాన మంత్రి ఎవరవుతారని అనుకుంటున్నారు?సీఎం జగన్: అది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. అందరూ చెబుతున్నది, టీవీల్లో చూస్తున్నదానిని బట్టి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని అన్పిస్తోంది. ఎవరు అధికారంలోకి వస్తారు.. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి నేనేమీ సెఫాలజిస్ట్(విశ్లేషకుడు)ను కాదు. ఒక వేళ ఎవరైనా ఏదైనా చెబితే అది కేవలం ఒక అంచనా మాత్రమే.నవికా: మీరు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇంత కంటే గొప్పగా ఏం చేస్తారు? సీఎం జగన్: మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ పెద్ద హామీయే. అవన్నీ చేస్తాం.నవికా: మీ సోదరిని మిస్ అవుతున్నారా?సీఎం జగన్: కచ్చితంగా మిస్ అవుతున్నాను(భావోద్వేగంతో). దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లింది. కానీ ప్రేమలు ఎక్కడికిపోతాయి?నవికా: ఆమె విషయంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారా?సీఎం జగన్: దురదృష్టవశాత్తు ఆమె ఆ మార్గాన్ని ఎంచుకుంది. ఈ పరిస్థితి మారచ్చు.. మారకపోవచ్చు.నవికా: వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని మోదీ అన్నట్టు.. రాజకీయాలు, కుటుంబం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?సీఎం జగన్: ఆయన ఏ సందర్భంగా అన్నారో నాకు తెలియదుగానీ మోదీ అన్న మాటలను నేను బలంగా నమ్ముతున్నాను. కుటుంబాన్ని బేలెన్స్‌గా చూసుకోవాలన్నది నా బలమైన నమ్మకం. అయితే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే పార్టీని నడపలేం. అలాంటప్పుడు అప్రమత్తంగా లేకపోతే పార్టీ నష్టపోతుంది. పులివెందులలో నేను నామినేషన్ వేసినప్పుడు ఈ అంశంపై స్పష్టంగా చెప్పాను. కడప నుంచే ఆమె (షర్మిల) ఎంపీగా పోటీ చేస్తోంది. ఇదే స్థానం నుంచి నా కజిన్ ఎంపీగా ఉండి నా పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా నేను ఉన్నానంటే అది దేవుడి దయ. ఈ పదవి అణగారిన, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణ పేదలకు మేలు చేయడానికి లభించిన అవకాశం. నేను డబ్బు సంపాదించుకోవడానికో లేక నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయడానికో కాదు. వారు నా నుంచి అలాంటివి ఆశలు పెట్టుకోకూడదు. ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాను.నవికా: ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు మీకు ఎన్నికల్లో పోటీదారు అనుకుంటున్నారా? చంద్రబాబు జైలుకెళ్లి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందనుకుంటున్నారా? లేక ఉచిత పథకాలు ఫలితాలిస్తాయని అనుకుంటున్నారా?సీఎం జగన్: ఇవన్నీ కాదు. మా ఐదేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలకు ఇస్తున్నవి ఉచిత పథకాలుగా చూడకూడదు. అవి సామాజిక పెట్టుబడి. పరిపాలన, విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గొప్ప సంస్కరణలు తెచ్చాం. ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారాయి. స్కూల్స్ అప్‌గ్రేడ్ అయ్యాయి. మూడో తరగతి నుంచే పిల్లలు టోఫెల్ గురించి ఆలోచిస్తున్నారు. ఆరో తరగతి నుంచే డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. ఐబీ సిలబస్ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2025 నుంచి ఒకటో తరగతిలోనే ఐబీ సిలబస్ బోధిస్తాం. 2035 నుంచి మా పిల్లలు ఐబీ సర్టిఫికెట్ పొందుతారు. ఇవన్నీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో మార్పు వచ్చింది. ఏ గ్రామానికి వెళ్లినా దాదాపు 600 రకాల సేవలు ఇంటి వద్దకే అందుతున్నాయి. ప్రతి సర్టిఫికెట్, ప్రతి సంక్షేమ పథకం, ప్రతి సేవ.. వలంటీర్ ద్వారా ఇంటి గుమ్మం ముందుకే వస్తున్నాయి. విలేజ్ క్లినిక్, రైతుల కోసం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), ఇంగ్లిష్ మీడియం స్కూల్, నవీకరించిన పాఠశాలలు, నవీకరించిన సిలబస్.. ఇలాంటివేవీ గతంలో లేవు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నేను అధికారంలోకి రాక ముందు, ఇవన్నీ చేయక ముందు ఏదైనా సంక్షేమ పథకంలో ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా, వివక్ష చూపకుండా అర్హులందరికీ చేరుతుందంటే ఎవరూ నమ్మే వారు కాదు.నవికా: మరి మీ చెల్లి వాళ్లతో పనిచేస్తోంది. పవర్ పాలిటిక్స్‌లో ఆమె ఏ విధంగా రాణిస్తుందనుకుంటున్నారు? షర్మిలకు సునీత కూడా తోడయ్యారు.సీఎం జగన్: వాళ్లకు వాళ్ల వ్యక్తిగత కారణాలున్నాయి. అయితే వాళ్లు ఎంచుకున్న మార్గం, సమయం రెండూ సరైనవి కావు. ప్రతి కుటుంబంలో ఒక జనరేషన్లో ఒకరు మాత్రమే రాజకీయాలను లీడ్ చేస్తారు. మిగిలిన వాళ్లు లీడ్ చేసే వారికి మద్దతుగా నిలుస్తారు. రెండో జనరేషన్ రాజకీయాల్లోకి రాకూడదు. దీన్ని నమ్ముతాను. ఈ క్రమంలో వారిని రాజకీయాల్లోకి రావద్దనే సూచించాను. వ్యాపారాలు, ఇంకా వాళ్లకు ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాను. రాజకీయాల్లోకి వచ్చి కుటుంబంలో సంబంధాలు దెబ్బతినేలా చేయొద్దని కోరాను. రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులు దీన్ని అవకాశంగా మలుచుకుని మన మధ్యే చిచ్చుపెట్టి సంబంధాలను కలుషితం చేస్తారని చెప్పాను. మనలో మనమే ప్రత్యర్థులుగా మారిపోతామని తెలియజేశాను.నవికా: వారి వెనకాల చంద్రబాబు ఉన్నారని మీరు నమ్ముతున్నారా?సీఎం జగన్: అవును. నమ్మాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. చంద్రబాబు వాళ్లను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, సిద్ధాంతాలు ఉండాలి. పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న నా తండ్రి పేరును కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్లలో పెట్టింది. అక్రమ కేసులు పెట్టి నన్ను జైలు పాలు చేసింది. నాపై కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈ కేసులో కో పిటీషన్ వేసింది టీడీపీ. నా తండ్రి బతికి ఉన్నన్ని రోజులు, నేను ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు నేను నిజాయితీపరుడిని. నేను ఆ పార్టీ వీడిన వెంటనే నా తండ్రి, నాపైనా అవినీతి మరక వేశారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఈ రోజుకూ వారు నాపై మోపిన తప్పుడు కేసులపై పోరాటం చేస్తున్నాను.నవికా: అందుకే చంద్రబాబు నాయుడినిజైలుకు పంపించారా?సీఎం జగన్: చంద్రబాబు నాయుడు చేయకూడని పని చేశారు. స్కిల్ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించారు. అలా అతను చేసి ఉండకూడదు. ఆయన స్కామ్‌లో ప్రమేయం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. కోర్టుల్లోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలతో వాదనలు జరిగాయి. అందుకే కటకటాల వెనక్కి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సాక్ష్యాలతో కోర్టులు ఏకీభవించాయి. అందుకే అతను 52 రోజులు జైలులో ఉన్నాడు.నవికా: చివరికి బెయిల్ వచ్చింది కదా?సీఎం జగన్: బెయిల్ పొందడం అనేది హక్కు. అది జైలులోకి వెళ్లిన ఎవరికైనా.. ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. అంతేగానీ, సరైన సాక్ష్యాలు లేకుంటే చంద్రబాబు జైలుకి వెళ్లేవారు కాదేమో! చంద్రబాబుపై కేసుల్లో ఎక్కడా రాజకీయ కోణంలో వ్యవహరించలేదు.నవికా: మీపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి.. దానికి మీరేమంటారు?సీఎం జగన్: దాదాపు 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా (డీబీటీ) ప్రజల ఖతాల్లో జమ చేశాను. ప్రజల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలతో సహా ఆధారాలు ఉన్నాయి. మరి అవినీతి చేశానని వారు ఎలా అంటారు? 90 శాతం కుటుంబాలకు మేలు జరిగింది.నవికా: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు మీరు మద్దతిస్తారా?సీఎం జగన్: కచ్చితంగా మద్దతిస్తాం. ఇప్పటికే మద్దతిచ్చాంనవికా: యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతిస్తున్నారా? సీఎం జగన్: మేం మద్దతివ్వడం లేదు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. -
YSRCP: ఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. జాతీయ సర్వేలో ఎన్ని సీట్లంటే..
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. వచ్చే ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అలాగే, టీడీపీ కూటమికి 4-5 స్థానాల వస్తాయని వెల్లడించింది. సర్వే ప్రకారం ఫలితాలు ఇలా... 👉: YSRCP: 19-20. 👉: TDP: 3-4. 👉: JSP: 0. 👉: BJP: 1-1. Others: 0. TIMES NOW- @ETG_Research Survey Andhra Pradesh (Total Seats: 25) | Here are seat share projections: YSRCP: 19-20 TDP: 3-4 JSP: 0 BJP: 1-1 Others: 0 @PadmajaJoshi also takes us through vote share projections. pic.twitter.com/dzSNkzsEXB — TIMES NOW (@TimesNow) April 17, 2024 READ THIS ARTICLE IN ENGLISH : YS Jagan Again as CM: Top Surveys ఇది కూడా చదవండి: ఏపీ ఎన్నికల ఫలితాల గురించి అన్ని సర్వేలు ఏం చేబుతున్నాయంటే.. -
YSRCP మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని సర్వే రిపోర్ట్
-
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 383 స్థానాలు.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీకి 22, తెలంగాణలో కాంగ్రెస్‌కు 9 ఎంపీ సీట్లు... టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే వెల్లడి .. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok sabha elections 2024:ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్‌సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి. -
Times Now ETG Survey: ‘ఫ్యాన్’ ప్రభంజనమే
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ–ఈటీజీ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ప్రజల అభిప్రాయాన్ని టౌమ్స్ నౌ సంస్థ నెల రోజులపాటు విస్తృతంగా సర్వే చేసింది. ఈ సర్వే ఫలితాలను గురువారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్ ప్రసారం చేసి చర్చ నిర్వహించింది. అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంటుందని వెల్లడైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టి జట్టుగా వచ్చినప్పటికీ ఘోర పరాభవం తప్పదని సర్వేలో తేలింది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేల్చింది. టీడీపీ, జనసేన కూటమి మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలతో ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. విశ్వసనీయతకు పట్టం.. సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు స్పష్టం చేశారు. గత ఎన్నికలతో పోల్చితే వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి కారణాలపై ప్రధానంగా చర్చ సాగింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం వాగ్దానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేసి ‘‘చెప్పాడంటే.. చేస్తాడంతే..’’ అనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచుకున్నారు. మీ బిడ్డగా మీ ఇంటికి మంచి చేశానని నమ్మితే ఓటేయాలంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. రాష్ట్రంలో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తుండటంతో ప్రజలంతా సంక్షేమ సర్కారుకు జై కొడుతున్నారు. కూటమిగా చేరిన టీడీపీ, బీజేపీ, జనసేన పారీ్టలు నైతిక స్థైర్యం కోల్పోయి ఉనికి కోసం కుట్రలు చేస్తున్నాయి. -
రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం
-
Times Now ETG Survey: ఏపీలో YSRCPదే హవా
-
Times Now and ETG Survey: బీజేపీకి 333 పైమాటే
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఘనవిజయం ఖాయమని టైమ్స్ నౌ చానల్–ఈటీజీ సర్వే శుక్రవారం పేర్కొంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను ఆ పార్టీ ఒంటరిగా ఏకంగా 333 నుంచి 363 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 378 స్థానాలదాకా సాధించవచ్చని వివరించింది. విపక్ష ఇండియా కూటమికి కేవలం 120, ఇతరులకు 45 స్థానాలు రావచ్చని పేర్కొంది. ఇండియా కూటమిలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌కు 28 నుంచి గరిష్టంగా 48 సీట్లొస్తాయని వివరించింది. తమిళనాట డీఎంకేకు 24 నుంచి 28 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 10 నుంచి 11 సీట్లు వస్తాయని వెల్లడించింది. 42 లోక్‌సభ స్థానాలున్న పశి్చమబెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 17 నుంచి 21 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. అక్కడ బీజేపీకి 20 నుంచి 24 సీట్లు రావచ్చని పేర్కొంది. ఏడు సీట్లున్న ఢిల్లీలో ఆప్ 5 నుంచి మొత్తం 7 స్థానాలూ కొల్లగొట్టవచ్చని సర్వే వెల్లడించడం విశేషం. యూపీలో బీజేపీ క్లీన్‌స్వీప్ అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ ఖాయమని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో 80 స్థానాలకు ఎన్డీఏ కూటమికి 72 నుంచి 78 వస్తాయని, కాంగ్రెస్, సమాజ్‌వాదీలతో కూడిన ‘ఇండియా’ కూటమి 2 నుంచి 6 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఇక బీఎస్పీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. గుజరాత్‌లోనైతే మొత్తం 26 సీట్లనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని పేర్కొంది. బిహార్‌లో 42 సీట్లకు గాను బీజేపీ, జేడీ(యూ)తో కూడిన ఎన్డీఏ కూటమికి 31 నుంచి ఏకంగా 36 స్థానాలు రావచ్చని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితరులతో కూడిన ఇండియా కూటమి 2 నుంచి 4 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఇక 48 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లతో కూడిన ఎన్డీఏ కూటమికి 34 నుంచి 38, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్)లతో కూడిన ఇండియా కూటమికి 9 నుంచి 13 స్థానాలు రావచ్చని వివరించింది. కర్ణాటకలో ఎన్డీఏకు 22 నుంచి 24, కాంగ్రెస్‌కు కేవలం 4 నుంచి 6 సీట్లు రావచ్చని పేర్కొంది. -
AP: ఖాయంగా తు‘ఫ్యానే’
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని టౌమ్స్ నౌ – ఈటీజీ రీసెర్చ్ సర్వే తేల్చి చెప్పింది. వైఎస్సార్ సీపీ 49 శాతం ఓట్లతో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. టీడీపీ – జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3 నుంచి 4 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని తేల్చింది. బీజేపీ 2 శాతం ఓట్లు, కాంగ్రెస్, వామపక్షాలు తదితరులు 4 శాతం ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది. జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని ఇప్పటికే తేల్చాయి. టీడీపీ – జనసేన పొత్తు కుదిరాక గతేడాది డిసెంబర్ 13 నుంచి ఈనెల 7 వరకూ రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది అభిప్రాయాలను సేకరించి సర్వే ఫలితాలను రూపొందించినట్లు టైమ్స్‌నౌ – ఈటీజీ సర్వేను శుక్రవారం టైమ్స్‌నౌ ఛానెల్లో సమర్పించిన సంస్థ సీనియర్ న్యూస్ ఎడిటర్ పద్మజా జోషి వెల్లడించారు. ఆ అభిప్రాయాలను క్రోడీకరిస్తే వైఎస్సార్సీపీ సంచలన విజయం సాధించడం ఖాయమని తేలిందన్నారు. టీడీపీ–జనసేన పచ్చి అవకాశవాదంతో పొత్తు పెట్టుకున్నాయని అధిక శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. హామీల్లో 99 శాతం అమలు, సుపరిపాలన ద్వారా సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత చాటుకున్నారని, వైఎస్సార్సీపీ ఘనవిజయానికి ఇదే బాటలు వేస్తున్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు. -
లోక్‌సభ ఎన్నికల సర్వే.. ఏపీలో YSRCPదే హవా
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ ETG సర్వేలో.. మొత్తం 25 సీట్లలో వైఎస్సార్సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అలాగే టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. ఎన్టీయే కూటమికి 0(ఇంకా టీడీపీ-జనసేనలతో పొత్తు ఖరారు కాలేదు), ఇతరులు సున్నా కైవసం చేసుకుంటారని వెల్లడించింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 49 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీయే కూటమికి 2 శాతం, ఇతరులకు 4 శాతం ఓటింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది. 2023 డిసెంబర్ 13వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఏపీలో ఈ సర్వేను ఈటీజీ నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 3లక్షల 20 వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ 85 శాతం కాగా.. ఫోన్ల ద్వారా మరో 15 శాతం అభిప్రాయాలను సేకరించారు. TN-@ETG_Research Survey#LokSabhaElections2024 | Andhra Pradesh: Total Seats: 25 Seat Share: - YSRCP: 21-22 - TDP+JSP: 3-4 - NDA: 0 - Others: 0 Watch #IndiaUpfront as @Padmajajoshi further decodes the vote share projections. pic.twitter.com/4jexZ6TWHk — TIMES NOW (@TimesNow) March 8, 2024 -
ఏపీలో వైఎస్సార్సీపీదే విజయ దుందుభి
సాక్షి, అమరావతి: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలన్ని తమ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలొస్తే ప్రజలు ఎవరిని గెలిపిస్తారని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ టౌమ్స్‌నౌ సర్వే ఫలితాలను విడుదల చేసింది. తాజా సర్వే ఫలితాల్లో ఏపీలో ఈసారి కూడా వైఎస్సార్సీపీ అత్యధిక లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ స్థానాలకు గాను అధికార వైఎస్సార్సీపీ 19 స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తుందని స్పష్టం చేసింది ఇక.. ప్రతిపక్ష పార్టీలు ‘టీడీపీ-జనసేన’ ఎటువంటి ప్రభావం చూపకుండా కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుందని టౌమ్స్‌నౌ సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ సర్కార్ పనితీరుకు పట్టం కట్టారు ప్రజలు. టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పనితీరు పట్ల 38 శాతం మంది అత్యద్భుతం అని కితాబు ఇచ్చారు. మరో 26 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్ పరిపాలన బాగుందని ప్రశంసించారు. ఈ రెండు కలిపితే ఏకంగా 64 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు. -
Times Now ETG Survey on Elections 2024: మళ్లీ ఎన్డీఏనే!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్ బుధవారం వెల్లడించింది. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 163 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 57 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనైతే ఆ పార్టీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేస్తుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 354 సీట్లు రావడం తెలిసిందే. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 93 సీట్లు రాగా ఇతరులకు 96 దక్కాయి. -
Times Now ETG Survey: ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 24–25 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది. ఫ్యాన్ తుపాన్లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. టీడీపీ గరిష్టంగా ఒక స్థానంలో ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. జనసేన ఖాతా తెరిచే అవకాశమే లేదంది. టైమ్స్‌నౌ ఈటీజీ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి టైమ్స్‌నౌ ఛానల్ ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ.. ప్రస్తుతం మరింత బలపడిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24–25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నది తేల్చింది. గత ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ మరింతగా పెరిగింది. అందుకే ఆ పార్టీ 22 లోక్‌సభ స్థానాల నుంచి 25 లోక్‌సభ స్థానాల్లోనూ క్వీన్ స్వీప్ చేసి, తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని విశ్లేషించింది. TIMES NOW- @ETG_Research Survey Who will win how many seats in Andhra Pradesh? Total Seats- 25 - YSRCP: 24-25 - TDP: 0-1 - JSP: 0 - NDA: 0 Watch @TheNewshour as @NavikaKumar also takes us through seat share projections from K'taka, Tamil Nadu, Assam & Telangana. pic.twitter.com/O8FcOFcojh — TIMES NOW (@TimesNow) December 13, 2023 -
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉందని ఈటీజీ సంస్థతో కలిసి టైమ్స్ నౌ చేపట్టిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నుంచి 10 స్థానాలు గెలిచే వీలుందని తెలిపింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయని పేర్కొంది. బీజేపీ కూడా కనిష్టంగా మూడు, గరిష్టంగా 5 స్థానాలు దక్కించుకునే వీలుందని తెలిపింది. వాస్తవానికి బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.92 శాతం ఓట్లు సాధిస్తే, 2023లో 13.9 శాతం తెచ్చుకుంది. 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌కు ఓటింగ్ 10.97 శాతం పెరిగింది. బీఆర్ఎస్కు ఓట్లు 9.52 శాతం తగ్గాయి. -
ETG Survey: బీఆర్ఎస్కు షాక్ తప్పదా?
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం సీట్లపై టైమ్స్‌నౌ ఈటీజీ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదని వెల్లడైంది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ హవా చూపొచ్చని అంచనా వేసింది సర్వే. కాంగ్రెస్ 8 నుంచి 10 సీట్లు కైవసం చేస్కోవచ్చని తెలిపింది. ఇక గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాల తరహా దెబ్బ తగలవచ్చని ఈటీజీ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ 3-5 సీట్లు పరిమితం కావొచ్చని, అలాగే బీజేపీ 3 నుంచి ఐదు స్థానాలు గెలవొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ మాత్రం పుంజుకుని తన స్థానాలు పెంచుకుంటుదని సర్వే తెలిపింది. TIMES NOW - @ETG_Research Survey Telangana Total Seats: 17 Who will win how many seats in Lok Sabha if elections were to be held today? BRS: 3-5 BJP: 3-5 Cong: 8-10 Others: 0-1 We (Cong) are confident of securing between 10-15 seats in the LS elections - @ShujathAliSufi… pic.twitter.com/HDhdHirvq1 — TIMES NOW (@TimesNow) December 13, 2023 -
టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే.. YSRCP ప్రభంజనం
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం వైఎస్సార్సీపీ వెంటేనని మరోసారి స్పష్టమైంది. టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వేలో ఫ్యాన్ ప్రభంజనం ఎలా ఉండనుందో వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 24 నుంచి 25 సీట్లు సాధిస్తుందని టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే తేల్చి చెప్పింది. ఇక ప్రతిపక్ష టీడీపీ ఒక్క ఎంపీ స్థానానికి మాత్రమే పరిమితం కావొచ్చని సర్వే అంచనా వేసింది. పవన్ కల్యాణ్ జనసేన మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఖాతా కూడా తెరవదని టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే తెలిపింది. TIMES NOW- @ETG_Research Survey Who will win how many seats in Andhra Pradesh during general elections if polls were to be held today? Total Seats- 25 - YSRCP: 24-25 - TDP: 0-1 - JSP: 0 - NDA: 0@Padmajajoshi decodes the projections. pic.twitter.com/necke1puki — TIMES NOW (@TimesNow) December 13, 2023 ఇదీ చదవండి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ ఛానల్– ఈటీజీ రీసెర్చ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒపీనియన్ పోల్‌లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కే ఆధిక్యం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో పోటా పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు స్వల్ప మొగ్గు కనపడుతోంది. బీజేపీ 43.7 శాతం ఓట్లతో 107–115 స్థానాల్లో నెగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్న సర్వే.. కాంగ్రెస్ 44.9 ఓట్లతో 112–122 సీట్లు సాధిస్తుందని తేలి్చంది. ఇతరులు కేవలం 1–3 స్థానాలకే పరిమితమవుతారని పేర్కొంది. మరోవైపు రాజస్తాన్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. 43.8 శాతం ఓట్లతో బీజేపీ 114–124 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. కాంగ్రెస్ 41.9 శాతం ఓట్లతో 68 నుంచి 78 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 51–59 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని, బీజేపీ 27 నుంచి 35 స్థానాలకు పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ విషయానికి వస్తే సర్వే వివరాలు పూర్తిగా అందనప్పటికీ ప్రాథమిక సమాచారాన్ని బట్టి అధికార బీఆర్ఎస్కే మొగ్గు కనపడుతోందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. -
తెలంగాణలో కారు జోరు.. 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు బీఆర్ఎస్కే..
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ 9 నుంచి 11 సీట్లు గెలుచుకుంటుందని ‘టైమ్స్ నౌ’ తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో బీజేపీకి 2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 4 సీట్లు లభిస్తాయని సర్వే నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్ సీపీ 24 నుంచి 25 స్థానాలు దక్కించుకుని ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడించింది. టీడీపీకి సున్నా నుంచి ఒక స్థానం రావొచ్చని పేర్కొంది. ఏపీలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన తర్వాత ఈ సర్వే జరగడం గమనార్హం. జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేనే మరో సారి విజయం సాధిస్తుందని తెలిపింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి 307 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ‘ఇండి యా’ కూటమి 175 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. తెలంగాణలో పెరిగిన బీఆర్ఎస్ బలం 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచింది. ఈసారి ఎన్నికల్లో 9 నుంచి 11 సీట్లు తన ఖాతాలో వేసుకోనుంది. బీజేపీకి 2 నుంచి 3, కాంగ్రెస్‌కు 3 నుంచి 4 సీట్లు లభిస్తాయి. ఇతరులు మరో స్థానం దక్కించుకోబోతున్నారు. 80 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయేకు 70 నుంచి 74 సీట్లు లభిస్తాయని సర్వే బహిర్గతం చేసింది. ఇండియా కూటమికి 4 నుంచి 8, బహుజన సమాజ్ పార్టీకి ఒకటి, ఇతరులకు ఒకటి నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. చదవండి: కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం Times Now Survey : ‘ఫ్యాన్’ ప్రభంజనం! -
టైమ్స్ నౌ సర్వేలో ఫ్యాన్ ప్రభంజనం
-
కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం
న్యూఢిల్లీ: దేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజా సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేసింది. మెజార్టీ మార్కును సులువుగా అధిగమించి, కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చిచెప్పింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా’ కూటమి 175 స్థానాలకే పరిమితం అవుతుందని వివరించింది. ఇతరులు 61 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక 25 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ సర్వే ఉద్ఘాటించింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తర్వాత ఈ సర్వే జరిగింది. సర్వే ఫలితాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ 24 నుంచి 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుంది. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్సీపీ ఈసారి దాదాపు మొత్తం సీట్లను కైవసం చేసుకుంటుంది. అంతేకాదు 51.10 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. ప్రతిపక్ష టీడీపీకి ఒక స్థానం లభించే అవకాశం ఉంది. ఆ పారీ్టకి 36.40 శాతం ఓట్లు లభిస్తాయి. జనసేన పార్టీ కనీసం ఒక్క స్థానంలోనూ గెలిచే పరిస్థితి లేదు. కేవలం 10.10 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీకి కనాకష్టంగా 1.30 శాతం ఓట్లు పడతాయని అంచనా. ఇతరులు 1.10 శాతం ఓట్లు సాధించనున్నారు. -
వైఎస్ఆర్ సీపీకి 51.3% ఓట్ల శాతం: ఈటీజీ-టైమ్స్ నౌ సర్వే
-
Times Now ETG Survey: మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ సర్వేలో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని తెలిపింది. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తేలిన విషయం తెలిసిందే. జూన్ 15– ఆగస్టు 12వ తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయని తెలిపింది. ఏప్రిల్‌లో జరిగిన సర్వే, తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఆ తేడా జాతీయ స్థాయి ఫలితాల్లోనే కనిపించింది. ఏపీకి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని తేలింది. కాగా, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పాలన.. వైఎస్సార్సీపీకి జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యం కాదని ఆ పార్టీ తొలి నుంచి చెబుతోంది. If BJP joins TDP, they're strengthening Chandrababu Naidu. Else, YSRCP can sweep all 25 seats: @sreeramjvc, on seat share in AP as per @ETG_Research Survey In last 3 LS polls, Cong's highest seat share in K'taka was 9, while BJP has got 25: @Sanju_Verma_ tells @PadmajaJoshi pic.twitter.com/4xm06LEprr — TIMES NOW (@TimesNow) August 16, 2023 -
Times Now Survey On 2024 Elections: మళ్లీ ఎన్డీయేనే..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్ నౌ’సర్వే తేలి్చచెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని తేలి్చంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని తేలి్చచెప్పింది. అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్ఎస్) 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు వైఎస్సార్సీపీ 24–25 ఎన్డీయే 0–1 ఇండియా 0 ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం వైఎస్సార్సీపీ 51.3 ఎన్డీయే 1.13 ఇండియా – తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు బీఆర్ఎస్ 9–11 ఎన్డీయే 2–3 ఇండియా 3–4 ఇతరులు 1 తెలంగాణలో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం బీఆర్ఎస్ 38.40 ఎన్డీయే 24.30 ఇండియా 29.90 ఇతరులు 7.40 జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543) కూటమి సీట్లు ఎన్డీయే 296–326 (ఓట్ల శాతం 42.60) ఇండియా 160–190 (ఓట్ల శాతం 40.20) పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆమ్ ఆద్మీ పార్టీ 5–7 ఇతరులు 70–80 ఏ కూటమికి ఎన్ని సీట్లు కూటమి సీట్లు ఓట్ల శాతం ఎన్డీయే 296–326 42.60 ఇండియా 160–190 40.20 మొత్తం సీట్లు 543 – ఏ పారీ్టకి ఎన్ని సీట్లు పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆప్ 5–7 ఇతరులు 70–80 -
ఈటీజీ-టైమ్స్ నౌ సర్వే: BRSకి ఎన్ని సీట్లంటే..
సాక్షి, ఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలన్ని తమ తమ సత్తా చాటుకునేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ప్రజలు ఎవరిని గెలిపిస్తారన్నది ఈటీజీ-టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకుగానూ బీఆర్ఎస్ 9-11 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈటీజీ-టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. బీజేపీ(ఎన్డీయే కూటమికి) 2-3 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 3-4 ఎంపీ స్థానాలు, ఇతరులు ఒక్క స్థానం గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది. అలాగే.. బీఆర్ఎస్ ఓటింగ్ శాతం 38.40 శాతంగా ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీ(బీ)ఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానం నెగ్గాయి. -
ఈటీజీ టైమ్స్ నౌ సర్వేలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
సాక్షి, హైదరాబాద్: ఏపీ సంక్షేమ ప్రభుత్వం వైఎస్సార్సీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనుందని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మొత్తం 25 సీట్లు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో.. ఏపీలో వైఎస్సార్సీపీకి ఓట్ల శాతం మరింత పెరుగుతుందని, 51.3 శాతం ఓట్ల శాతంతో మొత్తం 25 ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే తెలిపింది. టీడీపీ ఒక్క ఎంపీ సీటు దక్కితే దక్కొచ్చని, వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం టీడీపీ ఖాతా నిల్ అని విషయాన్ని చెప్పేసింది ఈటీజీ టైమ్స్ నౌ సర్వే. ఇక ఈ సర్వేలో జనసేన ఖాతాకు ఒక్క సీటు కూడా దక్కదని ప్రస్తావించింది. ఇక 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలో ప్రభంజనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 25 లోక్ సభ స్థానాలకు గానూ.. వైఎస్సార్సీపీ 22 స్థానాలను కైవసం చేసుకుని జయకేతనం ఎగరేసింది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. If BJP joins TDP, they're strengthening Chandrababu Naidu. Else, YSRCP can sweep all 25 seats: @sreeramjvc, on seat share in AP as per @ETG_Research Survey In last 3 LS polls, Cong's highest seat share in K'taka was 9, while BJP has got 25: @Sanju_Verma_ tells @PadmajaJoshi pic.twitter.com/4xm06LEprr — TIMES NOW (@TimesNow) August 16, 2023 -
టైమ్స్ నౌ సర్వే: ఇప్పటివరకు ఒక లెక్క.. వైఎస్ జగన్ వచ్చాక మరో లెక్క!
దేశంలో ఎన్నికల మానిఫెస్టోని తన మంత్రివర్గ సహచరుల ముందు, ఐఏఎస్ అదికారుల ముందు పెట్టి దీనిని అమలు చేసి తీరాలని చెప్పిన నేత ఎవరైనా ఉన్నారా? ఒక్కరే ఉన్నారు. ఆయనే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన పాలన ఫలితాలు మీ ఇంటికి అందాయని, మీకు మేలు జరిగిందని నమ్మితే మద్దతు ఇవ్వండని కోరిన నేత ఎక్కడైనా ఉన్నారా? అదీ ఒక్కరే. మళ్లీ వైఎస్ జగనే అని చెప్పాలి. ఇలా ఒకటికాదు. అనేక విషయాలలో సీఎం జగన్ మొదటి స్థానంలో ఉన్నందునే తాజాగా వెల్లడైన సర్వేలో 25 లోక్ సభ స్థానాలకు గాను ఇరవైనాలుగు వైఎస్సార్ కాంగ్రెస్‌కు వస్తాయని వెల్లడైంది. ఓట్ల శాతాన్ని యధాతథం టైమ్స్ నౌ, నవభారత టైమ్స్ సర్వేలో వైఎస్సార్సీపీకి యాబై ఒక్క శాతం ఓట్లు వస్తాయని అంచనా వేయడం కూడా సంచలనాత్మకమే అని చెప్పాలి. నాలుగేళ్ల పాలన తర్వాత, ప్రభుత్వంపై సాదారణంగా ఎంతో కొంత వ్యతిరేకత ఇక్కడా ఉందని అనుకుంటారు. అలాంటిది తన ఓట్ల శాతాన్ని యధాతథంగా ఉంచుకోవడమే కాదు.. కొద్దిగా పెంచుకోవడం కూడా అరుదైన ఘట్టమే అని చెప్పాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి, ప్రధాని మోదీకి ఎలాంటి ఆదరణ ఈ సర్వేలో కనిపించిందో, రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్సీపీకి, జగన్‌కు అంతకు మించిన అభిమానాన్ని ప్రజలు కనిపిస్తున్నారని అర్థం అవుతుంది. జగన్ చెప్పే మాటలలో విశ్వసనీయత, నిజాయితీ, నిబద్దత కనిపించడం కూడా దీనికి కారణం అవుతాయి. 2019 ఎన్నికల ముందు వైఎస్ ఏవైతే ప్రకటించారో, వాటిని అమలు చేయడమే కాకుండా, అదనంగా కూడా ఆయన వివిధ కార్యక్రమాలు అమలు చేశారు. దేశంలో ఇంతకాలం ఒక అబిప్రాయం ఉండేది. ఎన్నికల మానిఫెస్టో చూసి ఓట్లు వేస్తే వేయవచ్చు కానీ, తర్వాత అంతా వాటిని మర్చిపోతారని. రాజకీయపార్టీలు అంతే.. ప్రజలు అంతే అని అనుకుంటారు. అలాంటి పరిస్థితిని మార్చిన ఘనత మాత్రం జగన్ దే. మానిఫెస్టోని భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో పోల్చిన తొలి నేత ఈయనే అని చెప్పాలి. అలాగే రాష్ట్రంలో ఎన్నో కొత్త వ్యవస్థలను సృష్టించడం ద్వారా ఇదీ అభివృద్ది అంటే. ఇది ప్రజలను ఆదుకోవడం అంటే అని కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి జగన్ అవుతారు. వైఎస్సార్సీపీని అనుసరిస్తున్న బాబు గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిన్స్, వలంటీర్లు, డిజిటల్ లైబ్రరీలు.. ఇలా ఏపీ అంతటా కలిపి యాభైవేలకు పైగా సంస్థలను ఏర్పాటు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు పరిశ్రమల రంగంలో, ఇతరత్రా అభివృద్దిలో జాగ్రత్తలు తీసుకుంటూనే సంక్షేమాన్ని విస్తారంగా అమలు చేసి చూపించారు. చివరికి పద్నాలుగేళ్లు అనుభవం ఉందని పలుమార్లు చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం సీఎం జగన్ విధానాలను అవలంభించడానికి సిద్దపడడం పెద్ద విజయం కాదా? చంద్రబాబు మినీ మానిఫెస్టో అంతా మోసఫెస్టో అయినా, జగన్ చేసిన సంక్షేమం కంటే అయిదు రెట్లు అదనంగా చెస్తానని చెప్పడం ద్వారా వైఎస్సార్సీపీని ఆయన అనుసరిస్తున్నారన్న సంగతి అందరికి ఇట్టే తెలిసిపోయింది. ఇలా రకరకాల కారణాలతో సీఎం యాభై ఒక్క శాతం ఓట్లతో 24 లోక్‌సభ సీట్లను గెల్చుకుంటే శాసనసభ ఎన్నికలలో సైతం దాదాపు 175 సీట్లు గెలిచే పరిస్థితి ఉంటుందని భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్క సంగతి గుర్తించాలి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కొంత ఫలించి కొంతమంది మద్దతుదారులలో వ్యతిరేకత వచ్చి ఉండవచ్చు. కాని అంతకన్నా ఎక్కువ మంది ఇతర పార్టీలవారు, తటస్థులు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషించుకోవచ్చు. సీఎం జగన్ ఫిలాసఫీ సక్సెస్ కావడం వల్లే కులం చూడను, ప్రాంతం చూడను, మతం చూడను, పార్టీలు చూడను అన్ని జగన్ ఫిలాసఫీ సక్సెస్ కావడం వల్లే ఇలా కొత్త మద్దతుదారులు రావడంతో ఆయన ఓట్ల శాతం ఏ మాత్రం తగ్గలేదు. ఇక తెలుగుదేశం పార్టీకి గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే ఇంకా నాలుగు శాతం ఓట్లు తగ్గుతున్నాయి. గత ఎన్నికలలో నలభై శాతం ఓట్లు వస్తే, ఈ సర్వేలో అవి 36 శాతానికి పడిపోయాయి. దానికి కారణం ఆయన విధ్వంసకర పాత్రను పోషిస్తుండడమే అనిపిస్తుంది. ఏపీలో అబివృద్ధికి అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది. అరాచకంగా ఏపీ ప్రభుత్వంపై వార్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని, నిజంగా ప్రజలు ఏమి ఆశిస్తున్నారన్నదాని గురించి చంద్రబాబు ఆలోచించలేకపోతున్నారనిపిస్తుంది. పైగా ఈ కార్యక్రమాలను ప్రజలు మర్చిపోవడం కోసం అన్నట్లు లేని శాంతి భద్రతల సమస్యను అధికంగా పోకస్ చేయడం వల్ల టీడీపీకి నష్టం జరుగుతుండవచ్చు. ఈనాడులో ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరీ సీఎం జగన్‌పై చెడరాస్తున్నారు. మార్గదర్శి స్కామ్‌ను బయటపెట్టారన్న కోపంతో రాస్తున్నారా అన్న అనుమానం ఉండేది. కాని దానికన్నా బహుశా వారి సొంత సర్వేలలో సైతం జగన్ మద్దతు తగ్గడం లేదన్న సంగతి గుర్తించి వారు ఆందోళన చెంది. మరీ అరాచకంగా ఏపీ ప్రభుత్వంపై వార్తలు, కథనాలు, సంపాదకీయాలు ఇచ్చి ప్రజలలో వ్యతిరేక భావనలు సృష్టించడానికి ఈనాడు రామోజీరావు పడరాని పాట్లు పడుతున్నారనుకోవాలి. పవన్‌కు ఎజెండా లేకపోవడమే కారణం ఆంధ్రజ్యోతి గురించి చెప్పడం అనవసరం. ఇక్కడ మరో సంగతి గుర్తించాలి. స్థానిక ఎన్నికలతో పోల్చితే టీడీపీ ఓట్ల శాతం కొంత పెరిగింది. కాని అది శాసనసభ ఎన్నికలలో విజయానికి సరిపోదు. అలాగే స్థానిక ఎన్నికలలో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్ల శాతం కన్నా కొంత తగ్గినా, ప్రభుత్వంలో అధికార పగ్గాలు చేపట్టడం చాలా సులువేనని ఈ టైమ్స్ నౌ, నవభారత్ టైమ్స్ సర్వే చెబుతోంది. జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఎంత కృషి చేసినా, జనంలో ఆదరణ పెంచుకోలేకపోతున్నారు. అసలు తనకంటూ ఒక ఎజెండా లేకపోవడం, సీఎంగా పనికిరానని తనకు తానే చెప్పుకుని సెల్ఫ్ గోల్ వేసుకోవడం తదితర కారణాలతో జనసేన ముందుకు వెళ్లలేకపోతోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా ఫలితంలో పెద్ద తేడా ఉండదని తేటతెల్లమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం యధాతథంగా కొనసాగుతుందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ సీఎం జగన్ ప్రభుత్వం కానీ, వైఎస్సార్సీపీ పార్టీ కానీ ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు, రామోజీరావు వంటివారు ప్రత్యక్ష యుద్దం కన్నా, కుట్రలు, కుతంత్రాలపైనే ఎక్కువ ఆధారపడతారు. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టవలసిందే. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
సర్వే రాగానే టీడీపీ నేతలు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు
-
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
2024 లోకసభ ఎన్నికలపై టైమ్స్ నౌ- ETG రీసెర్చ్ సర్వే
-
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీదే జయభేరీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ 175/175 అని తరచుగా చెబుతోన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటనలు ఎంత మాత్రం అతిశయోక్తి కాదంటున్నాయి తాజా సర్వేలు. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ నౌ నవభారత్ చేపట్టిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమయింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే.. వైఎస్సార్ సీపీ భారీ విజయాన్ని సాధిస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. 25కు 24 లేదా 25 వస్తాయని సర్వే తెలిపింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి 0-1 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని, ఆ పార్టీకి అంతకంటే మించి అవకాశం లేదని తెలిపింది. #JanGanKaMann: आज लोकसभा चुनाव हुए तो #AndhraPradesh में किसको कितनी सीटें? #YSRCP 24-25 #TDP 0-1 #JSP 0 BJP 0 अन्य 0@PadmajaJoshi @ETG_Research #BJP #Congress pic.twitter.com/mEYQ87rQM8 — Times Now Navbharat (@TNNavbharat) July 1, 2023 ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి 0-1 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని, ఆ పార్టీకి అంతకంటే మించి అవకాశం లేదని తెలిపింది. ఇక విలువలు మరిచి బూతులకు పరిమితమైన పవన్ కళ్యాణ్ కు కనీసం ఒక్క సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. ఇచ్చిన ప్రతీ హామీని వందశాతం నెరవేర్చడంతో పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తోన్న సీఎం జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని తెలిపింది. 2019లో ఒక ప్రభంజనంలా వచ్చిన వైఎస్సార్సీపీ.. ఆ ఎన్నికల్లో 22 లోక్ సభ ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే గడువు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే ఊపును కొనసాగించడం, ఓ రకంగా అంతకంటే ఎక్కువగా సీట్లను గెలుచుకునే అవకాశాన్ని, పరిస్థితులను సృష్టించుకోవడం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌కే చెల్లింది. -
దెబ్బకు దిమ్మతిరిగింది.. చంద్రబాబుకు ‘సర్వే’ షాక్
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 25 సీట్లకు 25 అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు వస్తాయని టైమ్స్ నౌ, ఈటీజీ సర్వే వెల్లడించడం అత్యంత ఆసక్తికరంగా ఉంది. కొన్నాళ్ల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు చోట్ల ప్రతిపక్ష తెలుగుదేశం గెలవగానే ఇంకేముంది.. మొత్తం పరిస్థితి మారిపోయింది.. ఇక మనం అధికారంలోకి రావడమే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన పార్టీవారు కాని చాలా హడావుడి చేశారు. కౌన్సిల్ ఎన్నికలకు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని ఎందరు విశ్లేషించినా, టీడీపీ మద్దతుదారులు మాత్రం దానిని పట్టించుకోకుండా ప్రజలను మభ్య పెట్టడానికి విశేష యత్నం చేస్తున్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నేతకు ఆ సంగతి తెలియకపోదు. కాని ఆయన కావాలని ప్రజలను తప్పుదారి పట్టించి, టీడీపీ ఏదో గెలిచిపోతోందన్న భావన కలిగించడానికి తంటాలు పడుతుంటారు. కాని ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి చెందిన టైమ్స్ నౌ న్యూస్ చానల్ చేసిన ఈ సర్వే టీడీపీ వారికి చాలా నిరాశ మిగుల్చుతుంది. ముఖ్యమంత్రి , వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్లుగా వై నాట్ 175 అన్న చందంగానే దాదాపు మొత్తం లోక్ సభ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఏర్పడితే ప్రతిపక్షానికి స్థానం లేనట్లే కదా! గతంలో వచ్చిన కొన్ని సర్వేలలో ఆరేడు సీట్ల వరకు టీడీపీకి రావచ్చని జాతీయ సర్వేలు అంచనా వేసేవి. కాని ఈసారి మాత్రం టీడీపీకి సున్నా లేదా ఒక సీటు అంటే గతంలో ఉన్నవాటికంటే తక్కువ అన్నమాట. ఇంతకుముందు 2019లో మూడు లోక్ సభ స్థానాలను మాత్రమే టిడిపి గెలుచుకుంది. ఈ సర్వే పూర్తిగా నిజమైతే పార్లమెంటులో మొదటిసారిగా టీడీపీకి అసలు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. లోక్ సభలో ఒక్క సీటు గెలవకపోతే దిగువ సభలో టీడీపీ ఉనికి ఉండదు. అలాగే రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి ఒకరే ఎంపిగా ఉన్నారు. ఆయన కాలపరిమితి వచ్చే ఏడాది ముగుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో గతసారి మాదిరే ఇరవై, ముప్పై సీట్లే వస్తే, అప్పుడు కూడా రాజ్యసభలో స్థానం దక్కే అవకాశం ఉండదు. ఇది సహజంగానే టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే. టీడీపీతో పాటు ఆ పార్టీని భుజాన వేసుకుని కంటికి రెప్పలా కాపాడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలకు కలవరం కలిగిస్తుంది. ఎలాగొలా టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలని విశ్వయత్నం చేస్తూ, నిత్యం అబద్దాలు వండి వార్చుతున్న వారికి ఈ పరిణామం తీవ్ర ఆశాభంగమే అవుతుంది. ఈ సర్వే మరో సంకేతాన్ని కూడా ఇస్తోంది. మీడియా సంస్థల వల్లే రాజకీయ పార్టీల గెలుపు ఓటములు ఉండబోవని సర్వే స్పష్టం చేస్తోంది. రాజకీయ వర్గాలలో ఒక ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా సొంతంగా కొన్ని సర్వేలు చేయించుకుంటే వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంచనాలు వస్తున్నాయట. దాంతోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ వ్యూహం అవలంబించాలో అర్ధంకాక సతమతమవుతున్నారట. అందుకే ఆయనకు ఉండే అలవాటు ప్రకారం ఎదుటి పార్టీ నేతలను ముఖ్యంగా అధినేతను వ్యక్తిగతంగా బదనాం చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. ముఖ్యమంత్రి జగన్‌పై నిత్యం దూషణలకు దిగుతున్నారు. అదంతా ప్రస్టేషన్ వల్లేనని చాలామంది భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అందరిని కోటీశ్వరులను చేస్తా.. ఇంటికో ఉద్యోగం ఇస్తా.. అంటూ ఊకదంపుడు వాగ్దానాలను ప్రజలు నమ్మడం లేదు. అది ఆయనకు పెద్ద మైనస్ అవుతోంది. తత్పలితంగానే వైసీపీలోని వ్యక్తులను టార్గెట్ చేసుకుని, ఆయా వ్యవస్థలను ప్రభావితం చేయడం ద్వారా ఏమైనా గిట్టుబాటు అవుతుందా అన్న ఆలోచన సాగిస్తున్నారు. కాని దానివల్ల టీడీపీకి ఏమీ పాజిటివ్ అవడం లేదని ఈ తాజా సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లోబరచుకుని పొత్తు పెట్టుకోవాలని గట్టి యత్నం చేస్తున్నారు. పవన్ కూడా చంద్రబాబు చెప్పినట్లు చేయడానికి సిద్దపడుతూనే ఉన్నారు. అయితే ఒకవైపు బీజేపీతో పొత్తు వదలుకోవడం ఎలా అన్నదానిపై పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు.ఇంకో వైపు జనసేన హార్డ్ కోర్ అభిమానులు టీడీపీతో పొత్తు అంటే కొన్ని నిర్దిష్ట షరతులు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఉదాహరణకు కాపు సంక్షేమ సమితి నేత అయిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక ప్రకటన చేస్తూ శాసనసభ సీట్లను టీడీపీ, జనసేన చెరిసగం పంచుకుని పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ ఒక వేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని పవన్, చంద్రబాబు ఇద్దరు చెరో రెండున్నరేళ్లు నిర్వహించేలా ఒప్పందం ఉండాలని ఆయన చెబుతున్నారు. అలా చేయకుండా చంద్రబాబుకే మొత్తం టరమ్ అంతా సీఎం పదవి అని ఒప్పుకుంటే, పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారని వైసీపీ ప్రచారం చేస్తుందని, దాని వల్ల చాలా నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జోగయ్య వంటి పవన్ అభిమానులు చాలా ఎక్కువ మంది ఇలాగే ఫీల్ అవుతున్నారు. అందులోను పవన్ అంటే ఒక అపనమ్మకం ఉండడం, చంద్రబాబు సన్నిహితుడైన ఒక మీడియా అధిపతి పవన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారని ప్రచారం చేయడంతో బాగా డామేజీ అయ్యారు. చంద్రబాబును పూర్తిగా నమ్మితే ప్రమాదమేనన్న భావన జనసేనలో లేకపోలేదు. పవన్ కూడా బీజేపీని వీడలేక, టీడీపీని కలవలేక టెన్షన్ లో ఉన్నారని చెబుతున్నారు. దానికి తగ్గట్లు ఇప్పుడు ఈ తాజా సర్వే టీడీపీ, జనసేనలకు పుండుమీద కారం చల్లినట్లయింది. ఈ సర్వే మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్‌లో ఆత్మ విశ్వాసం మరింత పెంచుతుంది. అదే సమయంలో చంద్రబాబు, పవన్‌ల ఆత్మ స్థైర్యం బాగా దెబ్బతింటుంది. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని టైమ్స్‌నౌ–ఈటీజీ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంది. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలున్న సంగతి తెల్సిందే. అంటే వైఎస్సార్సీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే వెల్లడించింది. పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను మరింతగా పెంచాయని వైఎస్సార్సీపీ నమ్ముతోంది. అందుకే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని ఆ పార్టీ ముందునుంచీ చెబుతోంది. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కేంద్రంలో బీజేపీ కూటమి మూడోసారి అధికారంలోకి రానుందని సర్వే వెల్లడించింది. ఆ కూటమి 292 నుంచి 338 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగనుందని ప్రముఖ వార్తా చానల్ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్సార్సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్ నౌ–ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా మోదీ మేనియా కొనసాగనుందని, కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ విజయం ఖాయమని సర్వే . బీజేపీ కూటమికి 292 నుంచి 338 స్థానాలు రావచ్చని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 వరకు, ఇతరులకు 66 నుంచి 96 దాకా సీట్లు లభిస్తాయని తెలిపింది. బీజేపీ కూటమికి 38.2 శాతం, కాంగ్రెస్ కూటమికి 28.7, ఇతరులకు 33.1 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీ నిస్సందేహంగా 300 పై చిలుకు స్థానాలు గెలుస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది, కష్టమని 26 శాతం, ఎన్నికల నాటికే దీనిపై స్పష్టత వస్తుందని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు. 13 శాతం ఏమీ చెప్పలేమన్నారు. మోదీ 2.0 పాలన తీరు అత్యంత సంతృప్తికరంగా ఉందని ఏకంగా 51 శాతం మంది చెప్పారు! చాలావరకు సంతృప్తికరమేనని 16 శాతం, ఓ మాదిరిగా ఉందని 12 శాతం చెప్పగా, బాలేదని 21 శాతం బదులిచ్చారు. మోదీ సర్కారు అతి పెద్ద వైఫల్యం ద్రవ్యోల్బణమని 34 శాతం, నిరుద్యోగమని 46 శాతం మంది పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తేలేకపోవడమని 13 శాతం, చైనా దూకుడును అడ్డుకోవడంలో వైఫల్యమని 7 శాతం చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం ప్రమాదంలో పడ్డాయా అన్న ప్రశ్నకు 41 శాతం మంది లేదని బదులిచ్చారు. చాలాసార్లు అలా అని్పంచిందని 21 శాతం, అది విపక్షాల దృక్కోణమని 14 శాతం, ఏమీ చెప్పలేదని 24 శాతం అన్నారు. ప్రాంతీయ పారీ్టల్లో పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 20 నుంచి 22 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 నుంచి 13 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ‘ప్రధాని’గా మోదీకి పోటీయే లేదు అత్యంత శక్తిమంతుడైన ప్రధాని అభ్యర్థిగా మోదీకి 64 శాతం మంది ఓటేశారు. రాహుల్‌కు 13, కేజ్రీవాల్‌కు 12, నితీశ్‌కు 6, కేసీఆర్‌కు 5 శాతం ఓట్లొచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో విపక్షాల సారథిగా రాహుల్‌కు 29 శాతం, కేజ్రీవాల్‌కు 19, మమతకు 13, నితీశ్‌కు 8, కేసీఆర్‌కు 7 శాతం ఓట్లొచ్చాయి. 2024 ఎన్నికలకు ముందే విపక్షాలు ఒక్కటవుతాయని 31 శాతం, లేదని 26 శాతం, ఎన్నికల అనంతర పొత్తులుండొచ్చని 26 శాతం అన్నారు. చదవండి: వివేకాపై కక్ష గట్టింది ఆ ఇద్దరే.. రాహుల్‌పై వేటు కాంగ్రెస్‌కు లాభించదు రాహుల్‌గాందీపై అనర్హత వేటు కాంగ్రెస్‌కు ఎన్నికల్లో పెద్దగా లాభించదని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. అది కేవలం న్యాయపరమైన అంశమని వారన్నారు. ఈ అంశానికి జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతేమీ ఉండదని మరో 11 శాతం మంది అన్నారు. 23 శాతం మంది ఇది రాహుల్‌కు సానుభూతి తెస్తుందని చెప్పగా 27 శాతం ఏమీ చెప్పలేమన్నారు. దొంగలందరికీ ఇంటిపేరు మోదీయే ఎందుకు ఉంటుందంటూ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యలు చేసినందుకు పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, తర్వాత 24 గంటల్లోపే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, ఇది కక్షసాధింపని కాంగ్రెస్, విపక్షాలు దుయ్యబట్టడం తెలిసిందే. -
పూర్తి సహకారమందిస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగించనున్న నిపుణుల కమిటీకి తమ పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ప్రతిపక్ష నేతలు, సామాజిక ఉద్యమ కారులు, పాత్రికేయులు తదితరులపై కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ సాయంతో నిఘా పెట్టిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్య్ర సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఇటీవల ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి కావాల్సిన మౌలిక, మానవ వనరుల, ల్యాబొరేటరీ వసతులు, సమాచారం ఇలా అన్ని రకాల సహాయసహకారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2021’లో మంత్రి ప్రసంగించారు. ‘ చట్టాన్ని మీరి మోదీ సర్కార్ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో మాకు ఎలాంటి చింతా లేదు. నిపుణుల కమిటీ తుది నివేదిక ఎలా ఉన్నా మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు’ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇంతవరకూ దేశాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ పెగాసస్ స్పైవేర్‌ను కొనలేదంటారా?’ అన్న సూటి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా గతంలోనే స్పష్టంచేశాం. చట్టాల చట్రంలోనే మా పాలన కొనసాగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఆయా చట్టాలను గతంలో రూపొందించారు. ఆ చట్టాల నాలుగు గోడల మధ్యే మేమున్నాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణపై ఆయన మాట్లాడారు. మన సంస్కృతి దెబ్బతినకుండా, భవిష్యత్ పరిణామాలకు తగ్గట్లుగా ఐటీ మార్గదర్శకాలు రూపొందాయన్నారు. -
సర్వే సంచలనం
-
టైమ్స్ నౌ జాబితాలో విజయ్ దేవరకొండ
ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆన్లైన్ ద్వారా 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' పోటీని నిర్వహించింది. దీనిలో భారతీయ చిత్ర సీమకు చెందిన హీరోలతో పాటు క్రికెట్ స్టార్ల వరకు అవకాశం కల్పించింది. 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారి జాబితాను ఆన్లైన్లో ఉంచి వీరిలో మోస్ట్ డిజైరబుల్ మెన్‌కు ఆన్లైన్ ద్వారా ఓట్లు వేయాలని కోరింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇంకా మరికొంత మంది హీరోలు కూడా ఉన్నారు. తమిళ, కన్నడ ఇలా సౌత్ ఇండియాకు చెందిన స్టార్లు నివీన్ పౌలీ, దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. ఇక క్రీడల విషయానికి వచ్చే సరికి విరాట్‌కొహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు మొదటి, రెండవ స్థానాలలో నిలిచారు. మూడో స్థానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు. ఈ జాబితాలోని టాప్ 10లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మాత్రమే ఉండటం గమనార్హం. విజయ్ దేవరకొండకు తప్ప మరే తెలుగు హీరో టాప్ 10లో స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. ఇటీవల కాలంలో నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి వరుస పరాజయాలను చవిచూసినప్పటికి విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. చదవండి: విజయ్ @ 80 లక్షలు -
నోట్ల రద్దుకు మద్దతివ్వడం మా తప్పు: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జాతీయ పార్టీలేవీ లేవని, అలా చలామణిలో ఉన్నవన్నీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్–2020 సమ్మిట్‌లో పాల్గొన్నారు. ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలేవీ లేవు. బీజేపీ, కాంగ్రెస్ సైతం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుంది. కేంద్రం విధివిధానాలు ఎన్ని ఉన్నా వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కేంద్రం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని చెప్పారు. మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు కీలకంగా ఉంటాయన్నారు. రాష్ట్రాలు ఇస్తేనే కదా.. ‘రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తన సొంత నిధులు ఇస్తుందన్న ఆలోచన సరికాదు. రాష్ట్రాలు కూడా కేంద్రానికి నిధులు సమకూరుస్తుందన్న విషయం మరవకూడదు. తెలంగాణ నుంచి గడిచిన ఐదేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి తెలంగాణకు కేంద్రం రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే.. కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచుకోవాలి’అని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తాం ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించట్లేదు. రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాడుతాం. అలాంటి పార్టీలతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. తమ వాదన లేదా సైద్ధాంతికతకు వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలను, లేదా ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. కేంద్రం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన మేం.. ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలనూ వ్యతిరేకించాం’అని పేర్కొన్నారు. నోట్ల రద్దుపై మా నిర్ణయం తప్పు.. ‘పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి మంచి జరుగుతుంది.. సంపూర్ణ క్రాంతి వస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం అన్న మాటలు నమ్మి మద్దతిచ్చాం. కానీ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిన తర్వాత మా నిర్ణయం తప్పని తేలింది’అని కేటీఆర్ వివరించారు. ‘టీఆర్ఎస్.. బీజేపీ ‘బీ’టీమ్ అని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ‘బీ’టీం అని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. మేం తెలంగాణ ప్రజలకు ‘ఏ’టీం మాత్రమే. ఎవరికీ మేం ‘బీ’టీం కాదు’అని చర్చలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ‘గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయి. ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేకపోయాయి. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు’అని కేటీఆర్ వివరించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ఇలాంటి వివాదాస్పద చట్టాలపై కాకుండా.. అతి ప్రాధాన్యత కలిగిన ఇతర అంశాలపై దష్టి సారించాల్సి ఉంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. అలాంటప్పుడు ఒక వర్గంపై ఎలా వివక్ష చూపుతారు?’అని మంత్రి ప్రశ్నించారు. రెండో రాజధానిగా ప్రజలు స్వాగతిస్తారో లేదో తెలియదు ‘జీవించడానికి అనుకూలమైన అత్యుత్తమ నగరాల్లో మెర్సర్ గత ఐదేళ్లుగా హైదరాబాద్‌కు అగ్రస్థానం కల్పిస్తూ వస్తోంది. భారతదేశాన్ని రెండో జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో నాకు అనుమానం ఉంది’అని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తి ఏది? ‘కో–ఆపరేటివ్ ఫెడరలిజం, టీమిండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి.. ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నాం. నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా, ఇప్పటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’అని దుయ్యబట్టారు. కేంద్రం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. -
జగన్‌కు నెటిజన్ల జేజేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం మాట్లాడుతున్నారు...? ఏం చేస్తున్నారు...? ఏ సమస్యపై ఎలా స్పందిస్తున్నారు..? ఇలాంటి ప్రతి అంశాన్నీ రాష్ట్ర ప్రజలే కాదు నెటిజన్లూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ప్రధానిగా ఎన్నికైన నరేంద్రమోదిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న తర్వాత జగన్ కొన్ని జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని చూసిన నెటిజన్లు ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాటల్లో ఎంతో పరిణతి కనిపిస్తోందని, జగన్ మంచి పోరాటయోధుడని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నేతనా కాంగ్రెస్ వదులుకున్నది అని ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులో అనేక ముఖ్యమైన అంశాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండడం అరుదైన విషయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వేల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్లే కాదు కామెంట్లూ కనిపిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడి గురించి ఇంత స్థాయిలోచర్చ జరగడం, సామాజిక మాధ్యమాలలో సానుకూల స్పందనలు కనిపించడం అరుదని విశ్లేషకులంటున్నారు. వాటిలో మచ్చుకు కొన్ని.. వైఎస్ జగన్ ‘టైమ్స్ నౌ’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంతో ఆకట్టుకుంది. ఆయన మాటల్లో పదును, పరిణతి, చిత్తశుద్ధి కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు సమ ఉజ్జీ ఇప్పుడు దొరికాడు. ఇలాంటి రాజకీయ నాయకులు అరుదు. జగన్‌ని వదులుకొని కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయింది. – సందీప్ ఘోష్, రచయిత గతంలో ఎప్పుడూ ఇంత అద్భుతమైన యువ నాయకుడిని చూడలేదు. చాలా ప్రశాంతంగా, నిజాయతీగా కనిపించడమే కాదు శక్తిమంతంగా మాట్లాడుతున్నారు. – మధుకర్ ఉపాధ్యాయ, రచయిత కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా నిలిచి ఎన్నోసార్లు అధికార అందలాన్ని ఎక్కించిన ఆంధ్రప్రదేశ్‌ను ఆ పార్టీ విభజించి ఉండకూడదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి శక్తిమంతమైన నాయకుడిని వదలుకోకుండా ఉండాల్సింది. వీటి వల్ల కాంగ్రెస్‌కి జరిగిన నష్టం అపారం. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. – సాధ్వి కోశల, సామాజిక కార్యకర్త ఆంధప్రదేశ్ విభజన, జగన్ మోహన్ రెడ్డి అంశంలో కాంగ్రెస్ ఎవరి సలహాలు తీసుకుందో విస్మయంగా ఉంది. జగన్‌ను అవమానించి పార్టీ నుంచి గెంటేశారు. వైఎస్సార్ కుమారుడు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. జగన్ ఒక రాజు. స్ఫూర్తి ప్రదాత. – మాలిని అవస్తి, గాయని జగన్ ముక్కుసూటి మనిషి. ఆయన బహిరంగంగానే చెబుతున్నారు ఏది చెయ్యగలనో, ఏది తన చేతుల్లో లేదో. చంద్రబాబులా ఊసరవెల్లిలా రంగులు మార్చడం, అమలు కాని హామీలు ఇవ్వడం చేయడం లేదు. తను అనుకుంటున్నదేమిటో స్పష్టంగా చెబుతున్నారు. జగన్ ఒక లీడర్. – పింకీ, ఫ్యాషన్ డిజైనర్ ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఒక మనిషిని నమ్మటం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్న విషయం కాదు. జగన్ గారు చేసింది పదేళ్ల యుద్ధం. ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా శక్తిని కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపిన యోధుడు. హేట్సాఫ్ టూ యూ జగన్ మోహన్ రెడ్డి. – పూరీ జగన్నాథ్, దర్శకుడు వైఎస్ జగన్ ఇంటర్వ్యూలను చూడండి. మార్పు కోసం ఆయన ఎంత తాపత్రయపడుతున్నారో అర్థమవుతుంది – సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కలుసుకొని వైఎస్ జగన్ ఎంతో అనుకూల వాతావరణం సృష్టించారు. కానీ మూడు సార్లు సీఎం పీఠం ఎక్కిన మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడూ ఘర్షణ వాతావరణం, శత్రుత్వాన్నే అందరిపై పెంచుకున్నారు. – రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. ఎంత ఎదిగినా మీరు ఒదిగిపోయే కనిపిస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరింత కష్టపడతారని ఆశిస్తున్నాము. – బ్రిడ్జింగ్ ది గ్యాప్, సామాజిక అధ్యయన సంస్థ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. ఆయనలో దమ్ము, మానసిక పరిణతి కనిపించాయి. కృతనిశ్చయంతో, అహం లేకుండా మాట్లాడిన మాటలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. చంద్రబాబులో ఉండే అహం జగన్‌లో మచ్చుకైనా కనిపించలేదు. ప్రధాని మోదీ కూడా ఆయనను మనఃçపూర్వకంగా అక్కున చేర్చుకోవడం ఆనందం కలిగించింది. – తరుణ్ భట్నాగర్, డాక్టర్ జగన్‌ని వదులుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పిదం – స్వాతి చతుర్వేది, జర్నలిస్టు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జగన్ సర్ని చూశాను. విమానం ఎక్కడానికి నేను బస్సులో వెళుతుంటే, ఆయన తన కారులో వెళుతున్నారు. జగన్ సర్ని చూసి నేను చిరునవ్వు నవ్వితే.. ఆయన చెయ్యి ఊపుకుంటూ వెళ్లారు. ఇంతటి మర్యాదపూర్వకమైన సీఎంని ఎప్పుడూ చూడలేదు. వైఎస్ జగన్ సర్కి ప్రణామాలు – అమిత్ డోక్వాల్, నెటిజన్ వైఎస్సార్ మృతి తర్వాత జరిగిన ఒక సంఘటన నాకు ఇంకా కళ్ల ముందే ఉంది. మా నాన్న నన్ను జగన్ దగ్గరకి తీసుకువెళ్లి ఆయనను సీఎం అని పిలవమని అన్నారు. అప్పుడు నేను జగన్‌తో మిమ్మల్ని సీఎం అని పిలవాలా అంకుల్ అని అడిగాను. దానికి జగన్ పిలుద్దువులేమ్మా దానికి ఇంకా టైమ్ ఉంది అని బదులిచ్చారు. – ఎల్.ప్రేమ్‌చంద్ రెడ్డి, నిర్మాత ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటమని ప్రజలు నిరూపించారు. జగనన్నకి అభినందనలు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఇన్నాళ్లకు ప్రభుత్వం ఏర్పడింది. – మంచు విష్ణు, నటుడు జగన్ మోహన్ రెడ్డికి సోనియా చేసిన అవమానం, ఏపీకి శాపంగా మారిన కాంగ్రెస్ పార్టీ, జగన్ పోరాట పటిమతో మళ్లీ ఎదిగిన తీరు. కలా నిజమా? ఇదంతా ఒక సినిమాను తలపించేలా ఉంది. – ప్రియా రమణి, నెటిజన్ -
కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడమే ధ్యేయం
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పాలనను అందించడమే నా లక్ష్యం. ఇందుకు ప్రధాని నరేంద్రమోదీ సహకారం, ఆశీస్సులు అవసరం. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానమంత్రిని కోరాను. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలతో అవినీతిరహిత పాలన అందిస్తాం. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం’ అని ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘టైమ్స్ నౌ చానల్’ మేనేజింగ్ ఎడిటర్ నావికా కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ సంగ్రహంగా... - నావికా కుమార్: ముఖ్యమంత్రి స్థానానికి మీ ప్రస్థానం మీరు ఆశించిన విధంగానే ఉందా? వైఎస్ జగన్: భగవంతుని దయ, ప్రజల ఆశీస్సులతో మాకు ఘన విజయం దక్కింది. 14 నెలలపాటు 3,600 కిలోమీటర్లకు పైగా నేను చేసిన పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపించింది. ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రెండు మూడురోజులకు నేను నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు భారీగా పోటెత్తారు. ఎన్నికల్లో మా పార్టీ ఘన విజయం సాధిస్తుందని అప్పుడే స్పష్టమైంది. - నావికా: 303 సీట్లతో దేశం మొత్తం నరేంద్ర మోదీకి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏపీలో మోదీ మ్యాజిక్ పనిచేయలేదు కదా.. జగన్: ఏపీ ప్రజలు తమను మోసం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామనే హామీతోనే అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై రాష్ట్రాన్ని విభజించాయి. హోదా ఇస్తామనే హామీతోనే 2014లో బీజేపీ పోటీ చేసింది కూడా. కానీ హోదా ఇవ్వకుండా మోసం చేయడంతో ప్రజలు ఆగ్రహించారు. - నావికా:మోదీ భారీ మెజార్టీతో గెలవడం పట్ల మీరు నిస్పృహ చెందారా? జగన్: నాకు 22 సీట్లు ఇచ్చారు. ఈ తీర్పుతో మేము ప్రత్యేక హోదా తెస్తామని భావించాను. జాతీయస్థాయిలో సమీకరణలు అనుకూలించలేదు. ఆయన ప్రధాని, నేను ముఖ్యమంత్రిగా సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రస్తుతం అప్పులు రూ. 2.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదికి వడ్డీలే రూ. 20వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 40వేల కోట్లు అప్పులు తీర్చాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని సహకారం, ఆశీస్సులు మాకు కావాలి. మా పరిస్థితిని గమనించి సహకరించాలని కోరాను. - నావికా: ప్రధాని సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు కదా! జగన్: అవును. ఆయన మాటలు సంతోషం కలిగించాయి. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అని ఇది వరకు అన్నారు. ఇప్పుడు ‘సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్’ అని అన్నారు. మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నాం. - నావికా: 30న మీ ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారా? జగన్: ఆహ్వానించాను. నా ప్రమాణస్వీకార కార్యక్రమానికి మీరు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే మా రాష్ట్రం పట్ల గొప్ప ఔదార్యం కనబర్చినట్లు అవుతుందని చెప్పాను. మీరు వస్తామంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం.. నా ప్రమాణ స్వీకారం కంటే కూడా రాష్ట్రానికి మీరు చేసే ప్రకటనే ప్రధాన అంశమవుతుందని చెప్పాను. కానీ అదే రోజు ఆయన తన ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్ణయించారు. అయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని కోరుతూనే ఉంటాను. కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందిగా కోరుతూనే ఉంటాను. ఆయన ఒప్పుకునేవరకు ప్రయత్నాలు కొనసాగిస్తాను. - నావికా: 2014–19 మధ్య ప్రధాని పాలనను చూసి మైనార్టీలు కేంద్ర ప్రభుత్వం పట్ల ఎలా ఉన్నారని భావిస్తున్నారు? జగన్: ఇంత భారీ మెజార్టీ వచ్చిన తరువాత మైనార్టీలు నరేంద్ర మోదీకి ఓటు వేయలేదని ఎవరూ చెప్పలేరు. అలా విభజించడం సరికాదు. అందరి నమ్మకాన్ని గెల్చుకుంటేనే ఇంత భారీ మెజార్టీ వస్తుంది. - నావికా: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు చేయాలంటారా? జగన్: అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. వరుసగా రెండుసార్లు ప్రజలు తిరస్కరించారంటే వాళ్లు ఆత్మ విమర్శ చేసుకుని సమీక్షించుకోవాలి. నాయకత్వ మార్పా, విధానాల మార్పా అన్నది వారి నిర్ణయం. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఫలితాలు కూడా వారే భరించాలి. - నావికా: గాంధీ కుటుంబ నాయకత్వంలేని కాంగ్రెస్ పార్టీ సాధ్యమా? జగన్: అది కుటుంబం పార్టీ. ఆ పార్టీలో మరొకరికి నాయకత్వం వచ్చే అవకాశం రాదు. అది అంతే. - నావికా: కుటుంబ వారసత్వ ఓటు బ్యాంకులకు ఈ ఎన్నికల్లో దెబ్బ తగిలింది. అమేథీలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. జ్యోతిరాదిత్య సింథియా, బుపిందర్ హుడా, సుస్మితా దేవ్, మిలింద్ దియోరా ఇలా ఎంతోమంది ఓటమి చెందారు. కానీ వైఎస్సార్ కొడుకుగా మీరు ఘన విజయం సాధించారు. కుటుంబ వారసత్వాల పట్ల వచ్చిన వ్యతిరేకత ప్రభావం మీపై చూపించలేదు... జగన్: అదంతా ప్రజల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. తండ్రి బాగా పని చేస్తే కొడుకు, కూతురు, కుటుంబ సభ్యులకు ఓటేసి ప్రజలు కృతజ్ఞత చూపిస్తారు. ప్రజల ఆదరణను నిలుపుకోవడం, కొనసాగించడం అన్నది పూర్తిగా వారసుల మీద ఆధారపడి ఉంటుంది. కొందరు నిరూపించుకుంటారు. కొందరు నిరూపించుకోలేరు. - నావికా: 2018 మే 23న కుమారస్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మహాకూటమి నేతలు చేతులు కలిపారు. కుమారస్వామి, చంద్రబాబు, మాయావతి, అఖిలేశ్, మమతాబెనర్జీ.. ఇలా అందరూ వేదికపై కనిపించారు. కానీ వారు మోదీని ఎందుకు ఓడించలేకపోయారు? జగన్: ఆ నేతలెవ్వరికీ అఖిల భారత స్థాయి లేదు. మోదీకి వ్యతిరేకంగా ఓట్లు కూడగట్ట గలిగే సామర్థ్యం లేదు. మోదీకి ప్రత్యమ్నాయంగా వాళ్లు నిలబడలేదు. సమర్థ ప్రత్యామ్నాయ నేతగా ఎవరినీ చూపించలేకపోయారు. మోదీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీల సమూహాన్ని మాత్రమే ప్రత్యామ్నాయంగా చూపించారు. దాన్ని ప్రజలు విశ్వసించలేదు. - నావికా: కౌంటింగ్ ముందు రోజు కూడా చంద్రబాబు ఢిల్లీలో అందరి తలుపులు తట్టి ఈవీఎంల మీద సందేహాలు లేవనెత్తారు. మీరు ఈవీఎంల మీద ఏమనుకుంటున్నారు? జగన్: చంద్రబాబు తన పరువు కోల్పోయారు. మొదట నియోజకవర్గానికి ఒక వీవీ ప్యాట్ లెక్కించాలి అని ఈసీ చెప్పింది. దీనిపై చంద్రబాబు తదితరులు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా పారదర్శకత కోసం నియోజకవర్గానికి కనీసం 5 వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పింది. కానీ 50శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు మళ్లీ అనవసర రాద్ధాంతం చేశారు. అసలు ఈ వ్యవహారానికి చంద్రబాబే ఓ వైరస్‌లా మారి ఈవీఎంలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. ఆయన తన ఓటమికి ఓ సాకు వెతకాలని భావించారు. ప్రజలు నన్ను వేరే కారణంతో గెలిపించారని నమ్మించాలనుకున్నారు. కానీ చివరికి ఏమైంది.. నియోజకవర్గానికి లెక్కించిన 5 వీవీప్యాట్ల స్లిప్పులు ఈవీఎంలలోని ఓట్లతో సరిపోయాయి. అన్నీ సక్రమంగా ఉన్నాయి. చంద్రబాబు దేశ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించారని స్పష్టమైంది. ఆయన దేశాన్ని తప్పుదారి పట్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రుజువైంది. రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రస్తుతం అప్పులు రూ. 2.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదికి వడ్డీలే రూ. 20వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 40వేల కోట్లు అప్పులు తీర్చాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని సహకారం, ఆశీస్సులు రాష్ట్రానికి కావాలి. మా పరిస్థితిని గమనించి సహకరించాలని కోరాను. కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందిగా కోరుతూనే ఉంటాను. ఆయన ఒప్పుకునేవరకు ప్రయత్నాలు కొనసాగిస్తాను. – వైఎస్ జగన్ చంద్రబాబు తన ఓటమికి ఓ సాకు వెతకాలని భావించారు. అందుకే చంద్రబాబే ఓ వైరస్‌లా మారి ఈవీఎంలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. మొదట నియోజకవర్గానికి ఒక వీవీ ప్యాట్ లెక్కించాలని ఈసీ చెప్పింది. దీనిపై చంద్రబాబు తదితరులు కోర్టుకు వెళ్లారు. కోర్డు కూడా పారదర్శకత కోసం నియోజకవర్గానికి కనీసం 5 వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పింది. కానీ 50శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు మళ్లీ అనవసర రాద్ధాంతం చేశారు. కానీ చివరికి ఏమైంది.. నియోజకవర్గానికి లెక్కించిన 5 వీవీప్యాట్ల స్లిప్పులు ఈవీఎంలలోని ఓట్లతో సరిపోయాయి. అన్నీ సక్రమంగా ఉన్నాయి. చంద్రబాబు దేశ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించారని స్పష్టమైంది. – వైఎస్ జగన్ -
వైఎస్సార్సీపీకు జైకొట్టిన మరో రెండు సర్వేలు..!
-
ఫ్యాన్‌కు జైకొట్టిన మరో రెండు సర్వేలు..!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మరో సర్వే స్పష్టం చేసింది. స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో వైఎస్సార్సీపీ నిలుస్తుందని వీడీపీ అసోషియేట్స్ అనే సర్వే సంస్థ అంచనా వేసింది. ఫ్యాన్ హవాతో ఏపీలో ఉన్న 175 సీట్లకు గాను వైఎస్సార్సీపీ 106 నుంచి 118 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. ఇక అధికార టీడీపీ 68 నుంచి 54 సీట్లు సాధిస్తుందని తెలిపింది. జనసేన ఒకటి నుంచి మూడు సీట్లు సాధించే అవకాశముందని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్ సహా బీఎస్పీ, సీపీఐ, ఇతరులెవరూ ఖాతా తెరవరని వివరించింది. వైఎస్సార్సీపీ 43.85 శాతం ఓట్లు, టీడీపీ 40 శాతం ఓట్లు, జనసేన 9.8 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది. 20 లోక్‌సభ సీట్లు ఆ పార్టీవే.. జాతీయ వార్తా సంస్థ టైమ్స్‌నౌ, వీఎమ్మార్.. ‘2019 ఒపినీయన్ పోల్’ పేరిట చేపట్టిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపింది. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ 20 చోట్ల ఘన విజయం సాధిస్తుందని టైమ్స్‌నౌ స్పష్టం చేసింది. ఇక అధికార టీడీపీ కేవలం 5 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. వైఎస్సార్సీపీ 43.7 శాతం ఓట్లు, టీడీపీ 35.1 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది. (చదవండి : ఏపీలో వైఎస్సార్సీపీ హవా) (చదవండి : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం) (చదవండి : మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్) -
మ్యాజిక్ ఫిగర్‌కు ఎన్డీఏ దూరం
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్(ఎన్డీయే) కూటమి అధికారానికి 20 సీట్ల దూరంలో నిలవనుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఎన్డీయేకు 252, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 147, ఈ రెండు కూటముల్లోనూ లేని ఇతర పార్టీలకు 144 సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. జనవరి నెలలో ఆంగ్ల వార్తాచానెల్ ‘టెమ్స్ నౌ’.. వీఎంఆర్ సంస్థతో కలిసి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సర్వే నిర్వహించింది. జనవరి 14 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 15, 731 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. గతంలో ఇండియాటుడే, రిపబ్లిక్ చానెళ్లు ప్రకటించిన సర్వేల తరహాలోనే ఈ సర్వే సైతం ‘ఇతరులకు’ కీలక స్థానం కల్పించింది. మొత్తం 543 సీట్లలో మెజారిటీ మార్కు 272కి 20 సీట్ల దూరంలో ఎన్డీయే నిలవడం విశేషం. యూపీఏకు కేవలం 147 సీట్లు రానున్న నేపథ్యంలో.. ఇతర పార్టీలు సాధించిన 144 స్థానాలు అత్యంత కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 215, కాంగ్రెస్‌కు 96 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. 2014లో ఎన్డీయే 336 సీట్లు సాధించి అధికారంలోకి రాగా, అందులో మెజారిటీ మార్కు 272ను మించి 282 సీట్లు బీజేపీ గెల్చుకున్నవే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 సీట్లు సాధించగా, ఈ ఎన్నికల్లో కొంత పుంజుకున్నా.. సెంచరీ స్థానాలకు కొంత దూరంగానే నిలుస్తుందని సర్వే తేల్చింది. ఇతరుల్లో.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తమతమ రాష్ట్రాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది. పశ్చిమబెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లో 32 సీట్లను తృణమూల్ కాంగ్రెస్.. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సీట్లలో అత్యధికంగా 23 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటాయంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 10 సీట్లను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), 5 స్థానాలను కాంగ్రెస్, ఒక్కో సీటు చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలుచుకుంటాయంది. ఒడిశాలో బీజేపీ బలం పుంజుకుంటుందని సర్వే అంచనా వేసింది. మొత్తం 21 సీట్లలో 13 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, బీజేడీ 8 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. ఇక్కడ 2014లో బీజేడీ 20 సీట్లు గెలుచుకుంది. 2019లో ఈశాన్య రాష్ట్రాల్లోని 11 సీట్లలో బీజేపీ 9 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ– వీఎంఆర్ సర్వే పేర్కొంది. యూపీలో.. కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ– బీఎస్పీ కూటమికి 51, ఎన్డీయేకు 27 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. 2014లో వేర్వేరుగా పోటీ చేసి ఎస్పీ 5 సీట్లు గెలుచుకోగా, బీఎస్పీ బోణీ చేయకపోవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో యూపీలో ఎన్డీయే 73 సీట్లు గెలుచుకుంది. ఇతర కీలక రాష్ట్రాల్లో.. రాజస్తాన్‌లో బీజేపీ గతంలో మొత్తం 25 సీట్లను గెలుచుకోగా, ఈసారి ఆ సంఖ్య 17కి తగ్గుతుందని, 8 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 2014లో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లను క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఈ సారిఅందులోనుంచి రెండు సీట్లను కాంగ్రెస్‌కు కోల్పోనుంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 14 సీట్లు గెలుచుకుంటాయి. మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో బీజేపీ 23, కాంగ్రెస్ 6 గెలుచుకోనున్నాయి. 2014లో బీజేపీ 27, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో ఎన్డీయే 43 (2014 కన్నా ఒక సీటు ఎక్కువ), యూపీఏ 5 గెలుచుకుంటాయి. బిహార్‌లో(40) గత ఎన్నికల్లో ఎన్డీయే 30 సీట్లు గెలుచుకోగా.. ఈ సారి 25 కి పరిమితమవుతుంది. యూపీఏ బలం 15కి పెరుగుతుంది. మొత్తం సీట్లు: 543 ఎన్డీఏ: 252 యూపీఏ: 147 ఇతరులు: 144 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ (1), డామన్ డయ్యూ (1), అండమాన్ నికోబార్ దీవులు (1) లోక్‌సభ స్థానాలను ఎన్డీయే పార్టీలు, అటు చండీగఢ్ (1) స్థానాన్ని యూపీఏ గెలుస్తుంది. లక్షద్వీప్ (1)లో ఎన్సీపీ, సిక్కింలో ఉన్న ఒక్క స్థానాన్ని ఇతరులు గెలుచుకుంటారు. పుదుచ్చేరిలోనూ ఒక లోక్‌సభ సీటు ఉన్నప్పటికీ దాని గురించి సర్వే నివేదికలో ప్రస్తావించలేదు. -
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కష్టమే!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే, ఢిల్లీ గద్దెనెక్కే పార్టీల భవితవ్యం తేల్చే ప్రధాన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 80 ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. 2014లో ఈ ఒక్క రాష్ట్రం నుంచే బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీయేతర పక్షాలు మహా కూటమిగా ఏర్పడితే బీజేపీకి కష్టమేనని, గెలుచుకునే స్థానాల సంఖ్య భారీగా తగ్గుతుందని ‘టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్’ల తాజా సర్వే తేల్చింది. విపక్షంలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)లు వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీ 55 సీట్లు గెలుచుకోగలదు కానీ, ఆ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే మాత్రం బీజేపీ 31 స్థానాలకే పరిమితమవుతుందని, విపక్ష కూటమి 49 సీట్లలో గెలుస్తుందని ఆ సర్వే తేల్చింది. అంటే, వేర్వేరుగా పోటీ చేసినా బీజేపీ గెలిచే స్థానాల సంఖ్య 2014 కన్నా 16 సీట్లు తక్కువే కావడం గమనార్హం. కాంగ్రెస్‌ను కాదని ఎస్పీ, బీఎస్పీలు మాత్రమే జట్టుకడితే ఆ కూటమి 33 స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకుంటాయని, 45 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. -
టీఆర్ఎస్కు 70 సీట్లు
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తాజా సర్వే తేల్చింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మహాకూటమికి 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ – సీఎన్ఎక్స్ సంస్థలు ఈ నెల 12 నుంచి 18 మధ్య వారంపాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తాజా అంచనాలను వెల్లడించాయి. కాంగ్రెస్– టీడీపీల దోస్తీని తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను కాంగ్రెస్ గాయపరిచిందని ఈ సర్వేలో తేలడం విశేషం. ఈ బాబు– రాహుల్ దోస్తీని వ్యతిరేకిస్తున్నట్లు 52.44% మంది స్పష్టం చేశారు. సీఎంగా కేసీఆర్ రావాలంటూ 45%, కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి కావాలని 30% ప్రజలు కోరుకుంటున్నట్లుగా తేలింది. మహా కూటమిలోని కాంగ్రెస్, టీడీపీలు 2014 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసి 36(కాంగ్రెస్ 21, టీడీపీ 15) సీట్లు గెల్చుకోగా.. ఈసారి అవి మొత్తంగా గెలుచుకునే స్థానా లు 33(కాంగ్రెస్ 31, టీడీపీ 2) కావడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు సాధించిన ఓట్లశాతం(కాంగ్రెస్ 25.20%+టీడీపీ14.70%= 39.90%) కన్నా ఈ ఎన్నికల్లో తక్కువే ఉంటుందని(కాంగ్రెస్ 27.98%+టీడీపీ 05.66%=33.64%) పేర్కొంది. -
ఆ 5 నగరాలే కీలకం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎన్నికల ముందస్తు సర్వేలో అంచనా వేసింది. సాధారణంగా భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిన్‌లు బీజేపీ, కాంగ్రెస్‌లకు కీలకం. ఈ ఐదు నగరాల్లో ఎన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే అంత ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. ఈసారి బీజేపీ గెలిచినా గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెజారిటీ బాగా తగ్గుతుందనీ, 230 సీట్లున్న శాసన సభలో బీజేపీ 122, కాంగ్రెస్ 95 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే నివేదిక వెల్లడించింది. 2013 ఎన్నికల్లో బీజేపీకి 165, కాంగ్రెస్‌కు 65 సీట్లు వచ్చాయి. ఈ నెల 28న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉండే సీట్లలో 70శాతం బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనీ, కాంగ్రెస్ 27శాతమే దక్కించుకోగలదని సర్వే వెల్లడించింది. చౌహాన్ ముఖ్యమంత్రి కావాలని 40.11% ఓటర్లు కోరుకోగా, కమల్‌నాథ్‌కు 20.32%, జ్యోతిరాదిత్య సింధియాకు 19.65% మద్దతు పలికారు. ప్రాంతాల వారీగా చూస్తే చంబల్ మినహా మల్వా నిమార్, బఘేల్ఖండ్,భోపాల్, మహాకౌశల్లలో ఇతర పార్టీల కంటే బీజేపీదే పైచేయిగా ఉంది.సర్వేలో భాగంగా 77 నియోజకవర్గాల్లో 9240 మంది అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని గత ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఐదు నగరాలు... భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిన్‌లు రెండు పార్టీలకూ కీలకం. ఈ ఐదు నగరాల్లో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంతవరకు ఈ నగరాలు బీజేపీకి కంచుకోటలుగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈ కోటల్ని బద్దలు కొట్టగలిగితేనే చౌహాన్ అధికారంలోకి రాకుండా నిరోధించగలుగుతుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నగరాల్లో బీజేపీదే పై చేయి. గత ఎన్నికల(2013)విషయానికి వస్తే ఇక్కడున్న 36 సీట్లలో బీజేపీ 30 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఆరింటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇవి కాకుండా సత్నా, సాగర్ వంటి వాణిజ్యప్రధాన ప్రాంతాలు కూడా పార్టీ గెలుపులో కీలక భూమిక వహిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి 51 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ వశమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి సీట్లే కాక ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇటీవలి సర్వేలో పట్టణాల్లో బీజేపీ ఓట్ల శాతం 40 నుంచి 45 శాతానికి పెరిగిందని, కాంగ్రెస్ ఓట్ల శాతం 25–35 శాతాల మధ్య ఊగిసలాడుతోందని వెల్లడయింది. ఓట్ల శాతంలో తక్కువ తేడా ఉన్నా సీట్ల సంఖ్యలో తేడా వస్తుంది. ఈ కారణంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరుగుతోందని టైమ్స్ నౌ తేల్చింది. ఏబీపీ–సీఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 42శాతం ఓట్లు, బీజేపీకి 40శాతం వస్తాయని అంచనా వేసింది. ఈ తేడాను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే 117 సీట్లు గెలుచుకోవడం కష్టం కాదని ఆ సర్వే పేర్కొంది. అయితే, ఈ లక్ష్యం సాధించాలంటే కాంగ్రెస్ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓట్లను కొల్లగొట్టి ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుందనీ, అదంత సులభం కాదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం, వ్యవసాయ సంక్షోభం, బీజేపీ ప్రభుత్వ నేతలపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ఉపయోగించుకుని, విభేదాల్ని తాత్కాలికంగానైనా పక్కనపెట్టి గట్టి అభ్యర్ధులను పోటీకి దింపితే–ముఖ్యంగా ఈ ఐదు నగరాల్లో– ఫలితాలను తిరగరాసే అవకాశాలు కాంగ్రెస్‌కు ఉన్నాయని సర్వే నివేదిక తెలిపింది. -
ఆర్నబ్ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్
-
ఆర్నబ్ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానల్ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి వీడ్కోలు ప్రసంగం వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. మూడు నిమిషాల నిడివున్న ఈ వీడియోను గురువారం ఆన్ లైన్ లో పెట్టారు. 'ఆట ఇప్పుడే మొదలైదంటూ' తన సహచరులను ఉద్దేశించి ఆర్నబ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. మీడియా స్వేచ్ఛపై నమ్మకం కోల్పోవద్దని తన టీమ్ కు సూచించారు. 'ఇండిపెండెంట్ మీడియా గురించి మనకు ఎవరూ బోధించరు. మనతంట మనమే నేర్చుకోవాలి. నేను ఇంత స్వేచ్ఛగా పనిచేయగలిగానంటే అందుకు మీరే కారణం. విధి నిర్వహణలో భాగంగా నేను కొంతమంది నోరు పారేసుకున్నాను. వారికి క్షమాపణ చెబుతున్నాను. మన చానల్ ను టాప్ లో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించాన'ని వివరణయిచ్చారు. ప్రైమ్‌టైమ్ షో ‘ద న్యూస్ అవర్'తో పాపులరయిన ఆర్నబ్ గోస్వామి పదేళ్ల పాటు 'టైమ్స్ నౌ'లో పనిచేశారు. ఆయన సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరుగుతోంది. -
టాటా సన్స్ చైర్మన్‌గా ఆర్నాబ్ గోస్వామి?
న్యూఢిల్లీ: ‘టైమ్స్ నౌ’ టీవీ ఛానెల్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్న ఆర్నాబ్ గోస్వామికి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఖాతా లేకపోయినా, ఫాలోవర్లు మాత్రం పుంఖానుపుంఖంగా ఉన్నారు. ఆర్నాబ్ తన పదవికి రాజీనామా చే సినట్లు వార్త వెలువడగానే ఆగమేఘాల మీద యూజర్లు స్పందించి తమదైన రీతిలో ట్వీట్లు చేశారు. స్వీట్లు పంచారు. ‘ఇంతకాలం టీవీలో అనధికార జడ్జీగా వ్యవహరించిన ఆర్నాబ్ ఇప్పుడు అధికారికంగా సుప్రీం కోర్టు జడ్జీగా వెళ్లేందుకు రాజీనామా చేశారు......కాదు, కాదు, పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు....అదికాదు, టాటా సన్స్ చైర్మన్ పదవిని చేపట్టేందుకు వెళ్లారు....ఆర్నాబ్ నిష్క్రమణతో టైమ్స్ నౌ ‘వ్యాల్యూ’ సారీ, సారీ ‘వ్యాల్యూమ్’ తగ్గింది......మొన్న టాటా సన్స్‌లో, నిన్న ట్విట్టర్లో, నేడు టైమ్స్ నౌలో ఉన్నత పదవులు ఖాళీ, అర్హులు ధరఖాస్తు చేసుకోండి....ఆర్నాబ్ రాజీనామా ఎలా చేసి ఉంటారు? కచ్చితంగా అరచి, గీపెట్టి చెప్పే ఉంటారు.....ఆయన చెప్పా పెట్టకుండా రాజీనామా చేస్తే ఎలా? నా అభిప్రాయం ఎలా ఉండాలో ఇప్పుడు నాకెవరు చెబుతారు?....ఎస్ఎమ్మెస్ పోల్ లేకుండా ఎలా రాజీనామా చేస్తారు?..... ‘24 గంటలపాటు ఆర్నాబ్‌ను భరించే ఛానెల్ పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా?....దీపావళి అంటే నిజంగా ఇదే, పటాసుల పేలుళ్లు లేకుండా ప్రశాంతంగా ఉంది....నేను మాత్రం ఒక్క క్షణం టపాసులు పేలుస్తా కాలుష్యం పోయినందుకు....తూ కిత్నే ఆర్నాబ్కో మారేగా హర్ ఛానెల్ సే ఏక్ ఆర్నాబ్ నిక్లేగా.....ఆర్నాబ్ నిష్క్రమణకు ఆందోళనే అవసరంలేదు ఛానెల్, ఆర్కీవ్స్ నుంచి పాత న్యూస్ అవర్ కార్యక్రమాల వీడియోలు ప్రసారం చేస్తే చాలు, తేడా ఎవరూ గుర్తించరు...’ అంటూ ట్వీట్లు ఇలా సాగిపోతున్నాయి. ఆర్నాబ్ గోస్వామి రాజీనామా గురించి తానుగానీ, టైమ్స్ నౌగాని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ పాశ్చాత్య మీడియాను కాలదన్నే స్థాయిలో భారత్ మీడియా సామ్రాజ్యం ఎదగాలని ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కనుక అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన బయటకు వెళ్లి ఉంటారని....తాను సొంతంగా ఎప్పటి నుంచో ఓ మీడియా చానెల్ ప్రారంభించాలన్నది ఆయన కోరికని, ఆ ప్రయత్నాల్లోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఊహాగానాలు చెలరేగులుతున్నాయి. Arnab Goswami 'resigns' from Times Now. To start his own venture. After being one unofficially. He will now officially become S.C. Judge. — Sorabh Pant (@hankypanty) 1 November 2016 Arnab the new Chairman of Tata Sons? — ClooneyOfKerala (@sidin) November 1, 2016 -
బ్రేకింగ్ న్యూస్: ఆర్నబ్ గోస్వామి ఔట్!
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానెల్ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఆయన గతకొన్నిరోజులుగా ప్రైమ్‌టైమ్ షో ‘ద న్యూస్ అవర్'లో కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఎడిటోరియల్ మీటింగ్‌లో ఆర్నబ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్నట్టు సమాచారం. టైమ్స్ నౌ చానెల్లో ఆవేశపూరితమైన చర్చలు చేపట్టడం ద్వారా ఆర్నబ్ ప్రముఖంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆర్నబ్ పలు ఆవేశపూరితమైన టీవీ చర్చలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు 'వై కేటగిరీ' భద్రత కల్పించింది. దీంతో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు సహా మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది ఆయనకు నిరంతరం రక్షణ కల్పిస్తున్నారు. ఆర్నబ్ రాజీనామా వార్త తెలియడంతో ట్విట్టర్లో ఆయన ట్రేండ్ అవుతున్నారు. -
మహిళా రిపోర్టర్‌ను అసభ్యంగా తిట్టిన ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఓ మీడియాకు చెందిన మహిళా ప్రతినిధిని కర్ణాటక ఎమ్మెల్యే అశోక్ ఖేని ఇష్టమొచ్చినట్లు తిట్టేశాడు. ఓ సమాచారం సంబంధించి ఆమె ఆయనను ప్రశ్నించగా 'దీనిని అరెస్టు చేయండి' అంటూ అసభ్య పదజాలం ఉపయోగించాడు. ఈ నేపథ్యంలో ఆయనను లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే,క్షమాపణ చెప్పేందుకు అంగీకరించిన ఆయన ముందు ఆ రిపోర్టర్ క్షమాపణ చెబితేనే తాను చెబుతానని అన్నాడు. కర్ణాటకలో రాజ్యసభ సీట్ల విషయంలో అవినీతి జరిగిన విషయంపై టైమ్స్ నౌ ముంబయి బ్యూరో-చీఫ్ మేఘా ప్రసాద్ ఆయనను ప్రశ్నించగా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'అరెస్ట్ కరో సాలీకో' (దీనిని అరెస్టు చేయండి) అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ డైలాగ్ లు ప్రత్యక్షంగా వీడియోలో రికార్డయ్యాయి. అనంతరం సోషల్ మీడియాలోకి ఎక్కాయి. ఈ విషయాన్ని తాము అంత తేలికగా వదిలిపెట్టాలనుకోవడం లేదని, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి భాష ఉపయోగించి మాట్లాడాడో అందరికీ తెలియజేయాలని నిర్ణయించుకున్నామని టైమ్స్ నౌ తెలిపింది. ఈ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి సదరు ఎమ్మెల్యే లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా అందుకు అంగీకరించాడు. అయితే, ముందు ఆ రిపోర్టర్ చెబితేనే తాను క్షమాపణ చెబుతానని చెప్పాడు. -
ఇదేమి రాజనీతి?
‘టైమ్స్‌నౌ’ న్యూస్ చానెల్ ప్రధాన సంపాదకుడు అర్నాబ్ గోస్వామి న్యూస్ అవర్ కార్యక్రమంలో వరుసగా రెండు రోజులు ఉతికి ఆరేసిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మరింత ఎత్తిపొడవటం వల్ల ప్రయోజనం లేదు. గోదావరి మహాపుష్కరాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 14వ తేదీ ఉదయం రాజమండ్రిలోని పుష్కరఘాట్‌లో 29 మంది అమా యకుల ప్రాణాలు పోవడానికి నైతిక బాధ్యత స్వీకరించి పదవి నుంచి వైదొలిగి ఉంటే చంద్రబాబునాయుడు (మంత్రి పల్లెరఘునాధరెడ్డి న్యూస్ అవర్ డిబేటులో అభివర్ణించినట్టు) రాజనీతిజ్ఞుడి (స్టేట్స్‌మన్)గా నిజంగానే పేరు తెచ్చుకునే వారు. లాల్‌బహదూర్‌శాస్త్రి, అడ్వానీల తర్వాత నైతికతకు ఆనవాలుగా చంద్రబాబునాయుడు పేరు చెప్పుకునేవాళ్ళం. అంతటి ఉదా త్తమైన స్పంద నను నేటి రాజకీయాలలో ఆశించడం అత్యాశ. కానీ ఈ రోజున ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కొన్ని అవాంఛనీయమైన రాజకీయ ధోరణుల సమీక్ష మాత్రం అత్యవసరం. పని చేసేవారే పొరపాట్లు చేస్తారు. పొరపాట్లు గ్రహించి సవరించుకునే రాజకీయ నాయకులు కొద్దిమంది ఇంకా మిగిలి ఉన్నారు. డబ్బుపోసి అధికారం సంపాదించడం, అధికారంతో డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో తిరిగి అధికారం దక్కించుకోవడం అనే చట్రంలో పడి తిరగడమే రాజకీయ మని త్రికరణశుద్ధిగా విశ్వసించే రాజకీయనాయకులు నానాటికీ అధికం అవుతున్నారు. రాజ్యాంగాన్నీ, చట్టాలనూ ఉల్లంఘించగలుగుతు న్నారు కానీ ఏదో ఒక అంతుచిక్కని అద్భుతం ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా సజీవంగా ఉన్నది కనుక ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలను ఎదుర్కో వడం తప్పనిసరి అవుతోంది. ఎన్నికలలో గెలుపొందడం కోసం కులాన్నీ, మతాన్నీ, ప్రాంతాన్నీ ప్రయోగించడం, అరచేతిలో ఆకాశం చూపించడం, అల వికాని వాగ్దానాలు చేయడం, ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కిన తర్వాత అన్నీ విస్మరించడం రె ండో రకం రాజకీయ నాయకుల లక్షణం. ఒకసారి ఎన్నికలైపోయిన తర్వాత తిరిగి ఎన్నికలు వచ్చేవరకూ అధికారం తమ హక్కుభుక్తమని తలపోసే రాజకీయ నాయకులు ఈ రకానికి చెందినవారు. వీరికి గమ్యం ముఖ్యం కానీ మార్గం కాదు. ఎత్తులపైనా, జిత్తులపైనా ఆధార పడిన రాజకీయం వీరిది. ఎదురుదాడి లేదా మౌనం తప్పు చేసి దొరికిపోయినప్పుడు వీలైతే ఎదురుదాడి చేయడం లేకపోతే మౌనంగా ఉండటమే కానీ పదవీత్యాగం చే యాలన్నంత దూరం ఆలోచించే నాయకులు లేరు. ఒకసారి ఎన్నికలలో గెలుపొందితే వచ్చే అయిదేళ్ళ వరకూ తామే సార్వభౌములమనే భావన బలంగా నాటుకున్న నాయకులు మితి మీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మంత్రివర్గ సహచరులను సంప్రదించరు. ఉన్నతాధికారుల సలహాలు ఆలకించరు. తమ పోకడను ప్రశ్నించే వారిని శత్రువులుగా పరిగణిస్తారు. తమ వాదంతో ఏకీభవిం చనివారిని ప్రత్యర్థులుగా చూస్తారు. వారి నోరు మూయించడానికి అవస రమైతే పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తారు. తమ అనుభవం, తెలివితేటలు వినియోగించే అవకాశం ఉన్నతాధికారులకూ ఉండదు. ఎంతటి ఉన్నతా ధికారైనా సరే ముఖ్యమంత్రి వెంట ఫైలుపట్టుకొని తిరగవలసిందే. వారి అభిమతం తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవలసిందే. వారి ఎత్తుగడలు. వ్యూహాలు ఎక్కడైనా ఎప్పుడైనా బెడిసి కొడితే అందుకు మూల్యం అనివార్యమైతే అధికారులే చెల్లించాలి. శాసన సభ్యులకు ఆదాయ వనరు చూపించాలి. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’నంటూ భర్తృహరి ఏనాడో చెప్పాడు. ఇసుక కావచ్చు. కంకరతో, సిమెంటుతో పని కావచ్చు. డబ్బు మిగిలే పనులు శాసనసభ్యులకూ, ఇతర ప్రజాప్రతినిధులకూ అప్పగించాలి. ఇసుక దొంగతనం చేస్తున్న శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి మందలించలేరు. చౌర్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి దాడికి గురైన మహిళా తహసీల్దారు వనజాక్షి నోరు మూయిం చారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత రెడ్డిని తప్పుపట్టకపోగా అతడిని కథా నాయకుడిగా పార్టీ సహచరులు కీర్తించారు. తెరాస శాసనసభ్యుడు స్టీఫెన్సన్కి డబ్బు ఇస్తున్న దృశ్యాన్ని లోకం అంతా చూసిన తర్వాత కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు మీసం మెలేస్తూ, తొడగొడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సవాలు చేస్తున్న రేవంత రెడ్డి దృశ్యాలు తెలుగుదేశం పార్టీ నాయకులలో ఎవ్వరికీ రవ్వంత ఎబ్బెట్టుగా కనిపించకపోవడం, ఒక్కరు కూడా తప్పు జరిగి పోయిందని ఒప్పుకోకపోవడం రాజకీయ, నైతిక విలువల పతనానికి పరాకాష్ఠ. భిన్నమైన రాజకీయనేత చంద్రబాబునాయుడు ఇతర రాజకీయ నాయకుల కంటే భిన్నమైన వ్యక్తి. రాజకీయం ఆయనకు ఒక క్రీడ. ఏదో విధంగా పాయింట్లు సంపాదించాలి. లక్ష్యం సాధించాలి. నిర్దిష్టమైన సిద్ధాంతాలూ, సూత్రాలూ పట్టుకొని వేళ్ళాడ కూడదు. కార్యసాధన ప్రధానం. పరిస్థితుల ప్రకారం ప్రవర్తన మారాలి. 1978లో ఇందిరాగాంధీ ఇచ్చిన స్వేచ్ఛను వినియోగించుకొని రాజగోపాల నాయుడు కాంగ్రెస్(ఐ) టిక్కెట్టు ఇప్పించినప్పుడు కాంగ్రెస్‌వాదిగానే వ్యవహరించారు. నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపిం చినా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత చల్లగా ఆయన పంచన చేరారు. మంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు వ్యక్తులు ప్రధానులు కావడానికి దోహదం చేశారు. వామపక్షాలతో భుజం కలిపి పనిచేశారు. హరికిషన్‌సింగ్ సూర్జిత్నీ, బర్దన్నీ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ కలిసేవారు. ఎన్డీఏ హయాంలో వాజపేయినీ, అడ్వానీనీ మెప్పించి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులను అదుపులో ఉంచేవారు. గంగామాత పిలిస్తే వారణాసి వచ్చి పోటీ చేస్తున్నానంటూ ప్రకటించిన నరేంద్రమోదీ నేపథ్యం వేరు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి తిరుపతి లడ్డూ సంచీలు పట్టుకొని వెడుతున్నారు. ప్రధాని మోదీనీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షానీ, హోంమంత్రి రాజ్నాథ్సింగ్నీ కలుసుకొని తిరుపతి ప్రసాదం ఇస్తున్నారు. అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక మార్గం. భక్తిప్రపత్తులు పెరిగాయి. ఇదివరకు భువనేశ్వరి బహిరంగ సభలకు వచ్చేవారు కాదు. అమరావతికి శంకుస్థాపన చేసినా, గోదావరిలో పుష్కర స్నానం చేసినా పక్కన అర్థాంగి, మరో పక్కన కుమారుడు లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులూ ఉండటం యాదృచ్ఛికం కాదు. సంప్రదాయ హిందూ కుటుంబం పెద్దగా భార్యాపిల్లలతో కలసి పుణ్య కార్యాలు నిర్వహిస్తున్నట్టు కనిపించడం దేశంలో ప్రస్తుతం ఆమోద యోగ్యమైన రాజకీయ వాతావరణానికి చక్కగా సరిపోతుంది. 1999కూ, 2015కూ మధ్య తేడా ఏమిటంటే నాటి ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకి తెలుగు దేశం పార్టీ మద్దతు అవసరం. ఇప్పుడు బీజేపీకే స్వయంగా లోక్‌సభలో సాధారణ మెజారిటీ ఉంది. మిత్రపక్షాలు బుద్ధిగా ఉంటేనే అధికారంలో భాగస్వామ్యం. ఈ పరిమితి తెలుసు కనుకనే చంద్రబాబునాయుడు ప్రధాని మోదీ సమక్షంలో ఒదిగి ఉంటున్నారు. మోదీ ఆధిక్యాన్ని అంగీకరించినప్పటికీ దేశంలోని ముఖ్యమంత్రులలో తానే అగ్రగణ్యుడనని నిరూపించుకోవాలన్న తపన చంద్రబాబునాయుడికి ఉంది. ముఖ్యంగా లోగడ తన మంత్రివర్గంలో అంత ప్రాధాన్యం లేని శాఖను నిర్వహించిన కేసీఆర్ కంటే తాను తెలివైన, సమర్థుడైన రాజకీయ నాయ కుడని లోకానికి చాటుకోవాలన్న బలమైన కోరిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నిలువనీయడం లేదు. రెండు కళ్ల సిద్ధాంతానికి కాలం చెల్లినప్పటికీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని కళ్లకు కడుతున్నప్పటికీ ఇక్కడ కంటికి కన్నూ, పంటికి పన్నూ మాదిరి రాజకీయ క్రీడ సాగించాలని ప్రయత్నించడం వల్లనే రేవంతరెడ్డి ఉదంతం సంభవించింది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలహీనపరచడానికి కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. సందేహం లేదు. వాటిలో అనేకం అనైతికమైనవీ, చట్టబాహ్యమై నవీ కావచ్చు. కానీ రెండు తెలుగురాష్ట్రాల ప్రయోజనాల మధ్య వైరుధ్యం ఉన్నంతకాలం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మనుగడ కష్టం. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొనే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవు. పరస్పర దూషణలోనే ఇరు పక్షాలకూ ప్రయోజనం ఉన్నప్పుడు సఖ్యతకు అవకాశం లేదు. అయినా సరే రాజకీయాలలో అసాధ్యమంటూ లేదనే చంద్రబాబునాయుడి నమ్మకం. డబ్బు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదని ప్రగాఢ విశ్వాసం. ఆధిక్యం ప్రదర్శించడానికి ప్రతి సందర్భాన్నీ ఒక ఈవెంట్‌గా చంద్ర బాబునాయుడు పరిగణిస్తారు. హుద్‌హుద్ తుపాను వస్తే అది ఒక ఈవెంట్. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని ఆలోచిస్తారు. ఎన్నికలు వస్తే మరో ఈవెంట్. మండలి ఎన్నిలూ ఈవెంటే. అదే విధంగా గోదావరి పుష్కరాలు. పుష్కరాలు బాగా నిర్వహించినట్టు పేరు తెచ్చుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా చాటు కోవాలి. ఇందుకు రూ. 1,650 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు. ప్రచారం బాగా జరగాలి. తన పేరు మారుమోగాలి. ఒక ఈవెంట్ మేనేజర్ ఏదైనా ఈవెంట్‌ని సమర్థంగా నిర్వహించి వాటి తాలూకు దృశ్యాలను చూపించి అంత కంటే పెద్ద ఈవెంట్‌కు ఆర్డరు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. అతడి వ్యాపారానికి ప్రచారం అవసరం. ఒక ముఖ్యమంత్రికి ప్రచారం ఎందుకు? 2003లో గోదావరి పుష్కరాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయంటే జవహర్‌రెడ్డి అనే అధికారి నేతృత్వంలో జరిగాయని చెబుతారు. 2004లో కృష్ణా పుష్కరాలకు ఎవరు సారథి అంటే ప్రభాకరరెడ్డి అనే అధికారి పేరు చెబుతారు. 2015లో గోదావరి పుష్కరాలకు ఎవరు కర్త, కర్మ, క్రియ? చంద్ర బాబునాయుడే. రాజనీతిజ్ఞుడుగా అభివర్ణించాలని కోరుకునే చంద్రబాబు నాయుడు స్థాయి 2003 నాటి కంటే పెరిగిందా, తగ్గిందా? ఆయనే ఆలోచిం చుకోవాలి. ప్రతివిషయం తానే పర్యవేక్షిస్తున్నట్టూ, సర్వం తనకే తెలిసినట్టూ, తక్కినవారందరూ నిష్ర్పయోజకులన్నట్టూ వ్యవహరించడం మానుకోవడం ఆయనకే మంచిది. - కె.రామచంద్రమూర్తి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ -
ఏపీ ప్రభుతాన్ని ఏకిపారేసిన జాతీయఛానల్
-
‘అచ్ఛే దిన్’ వచ్చాయా!
మోదీ సర్కారుపై వెల్లడైన సానుకూలత సర్వేల్లో స్పష్టమైన మద్దతు న్యూఢిల్లీ: మోదీ ఏడాది పాలనకు ఫస్ట్ క్లాస్ మార్కులే పడ్డాయి. టైమ్స్ నౌ, సీఎన్ఎన్ ఐబీఎన్ ఆంగ్ల వార్తాచానెళ్ల వేర్వేరు సర్వేల్లో మోదీ సర్కారు పనితీరుపై స్పష్టమైన సానుకూల వైఖరి వ్యక్తమైంది. గత యూపీఏ పాలనాకాలం కంటే ఇవి ‘అచ్ఛేదిన్(మంచి రోజులు)’ అనే సర్వేల్లో పాల్గొన్న వారిలో మెజారిటీ తేల్చి చెప్పారు. క్షేత్ర స్థాయిలో నిర్దిష్ట ఫలితాలేం పెద్దగా కనిపించకపోయినా.. మోదీ సర్కారుపై ప్రజల విశ్వాసం సడలలేదని ఈ సర్వేల్లో తేలింది. ఎన్డీయే సర్కారు ఏడాది పాలనపై దేశవ్యాప్తంగా 75 వేల మందిపై టైమ్స్ నౌ ఆంగ్ల వార్తాచానెల్, సీ ఓటర్ సంయుక్తంగా జరిపిన సర్వేలో మోదీ అనుకూల వైఖరి స్పష్టంగా కనిపించింది. ‘అచ్ఛే దిన్’ హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని 27.7% స్పష్టం చేయగా, త్వరలో మంచి రోజులొస్తాయన్న నమ్మకాన్ని 37.6% మంది వ్యక్తపరిచారు. యూపీఏ పాలన కన్నా మెరుగ్గా ఉందని 62.5% ప్రజలు అంగీకరించడం, స్పష్టమైన ఫలితాలు కనిపించేందుకు మరింత సమయం అవసరమని 84.2% మంది అభిప్రాయపడటం మోదీ పాలనపై నెలకొన్న సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. సంస్కరణలు, అవినీతిపై పోరు, విదేశాంగ విధానం, బ్రాండ్ మోదీ.. ఇవి ఏడాది పాలనలో సాధించిన విజయాలని, అలాగే, భూ సేకరణ బిల్లు, పాక్‌తో సంబంధాలు, ద్రవ్యోల్బణం, నల్లధనం.. ఇవి వైఫల్యాలని పలువురు అభిప్రాయపడ్డారు. 52.9% మంది నల్లధనం వెనక్కు తెచ్చే విషయంలో మోదీ సర్కారు విఫలమైందని తేల్చి చెప్పారు. యూపీఏ ప్రభుత్వ విదేశాంగ విధానం కన్నా ఎన్డీయే విదేశాంగ విధానం చాలా బావుందని 71% మంది చెప్పడం గమనార్హం. అవినీతిని అంతం చేయడంలో ప్రభుత్వ తీరు ప్రశంసనీయంగా ఉందని 52.3% మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు ‘సీఎన్ఎన్ ఐబీఎన్’ జరిపిన సర్వేలో 72% మంది మోదీ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయడం మోదీకి తగ్గని ప్రజాదరణను ప్రతిఫలిస్తోంది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 153 జిల్లాల్లో సీఎన్ఎన్ ఐబీఎన్ సర్వే జరిపింది. 72 % మంది ఓకే మోదీ సర్కారు ఏడాది పాలనపై సీఎన్ఎన్-ఐబీఎన్ చానెల్ దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 153 జిల్లాల్లో సర్వే చేయించింది. సర్వేలో పాల్గొన్న 72 శాతం మంది మోదీ పాలనపై సంతృప్తి వ్యక్తంచేశారు. అదే సమయంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, భూసేకరణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు. -
పుట్టి మునగొచ్చు!
=‘సీ ఓటర్’ అంచనాలతో కాంగ్రెస్ నేతల్లో గుబులు =రాష్ర్టంలో అప్పుడే వ్యతిరేక పవనాలు = లోక్‌సభ ఎన్నికలపై పెట్టుకున్న ఆశలు గల్లంతు = కనీసం సగం స్థానాల్లోనూ గెలవలేని దుస్థితి = ఫలితాలపై యూపీఏ-2 కుంభకోణాల ప్రభావం = అదుపు తప్పిన ధరలపై ఓటరు మరింత ఆగ్రహం = అప్పను చేర్చుకుంటే... బీజేపీ గెలుపు ఖాయం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మొన్ననే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చి ఏడాదయ్యాక... అంటే వచ్చే మే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున పెద్దగా ప్రజా వ్యతిరేకత ఉండబోదని అంచనా వేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో కర్ణాటకపై పార్టీ పటిష్టమైన అంచనాలతో ఉంది. అయితే ‘సీ ఓటర్’ సహకారంతో ‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టీవీ’లు నిర్వహించిన ఎన్నికల సర్వేలో అధికార కాంగ్రెస్ మొత్తం 28 స్థానాలో సగం గెలుచుకోవడమూ గగనమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడే కనుక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 12, జేడీఎస్‌కు మూడు స్థానాలు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకులతో భేటీ అయినప్పుడు 25 స్థానాలను గెలుచుకుని తీరాలని దిశా నిర్దేశం చేశారు. బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వేరు పడడం, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ బలహీనంగా కనిపించండ లాంటి పరిణామాలతో ఉపాధ్యక్షుడు నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా పూర్తి చేస్తామని రాష్ర్ట నాయకులు ధీమా కనబరుస్తూ వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుండడంతో ప్రస్తుతం గుబులు చెందుతున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అన్నట్లు ఏ అవినీతి నినాదంతో కాంగ్రెస్ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిందో, అదే నినాదం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పుట్టి ముంచేట్లు ఉందని పార్టీ నాయకులు కలత చెందుతున్నారు. బీజేపీ నాయకుల అవినీతిని పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో సొమ్ము చేసుకున్న కాంగ్రెస్‌కు అదే ప్రస్తావన తిరుగు బాణమై వచ్చి గుచ్చుకునేట్లుంది. కేంద్రంలోని యూపీఏ-2 కుంభకోణాలకు పర్యాయ పదంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు, అదుపు లేని పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు యూపీఏ సర్కారుపై ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల గడువు ఉన్నందున యూపీఏ సర్కారు మరింతగా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటుందనే విశ్లేషణలున్నాయి. అదే కనుక జరిగితే ప్రస్తుతం అంచనా వేస్తున్న స్థానాలు లభించడం కూడా దుర్లభమే. అప్పను చేర్చుకుంటేనే బీజేపీ గెలుపు.. హాసన, మండ్య, బెంగళూరు గ్రామీణ స్థానాలు జేడీఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి. లింగాయత్‌లు ప్రాబల్యం కలిగిన ఉత్తర కర్ణాటకతో పాటు సంఘ్ పరివార్‌కు గట్టి పునాదులున్న కోస్తా తీరంలోని స్థానాల్లో విజయం సాధించడానికి బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను మచ్చిక చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బేషరతుగా పార్టీలో చేరాలన్న కమలనాథుల షరతును యడ్యూరప్ప సమ్మతించడం లేదు. పార్టీలో తనకు గౌరవప్రదమైన పదవిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక దశలో ఈ డిమాండ్‌ను కూడా పక్కన పెట్టి బీజేపీలో కేజేపీని విలీనం చేయడానికి ఆయన సిద్ధమైనా అనుయాయులు వారించారు. ‘వారికి మన అవసరం ఉందే తప్ప వారి అవసరం మనకు లేదు’ అని ఆయనను నిలువరించారు. ఏదో విధంగా యడ్యూరప్పను తమ దారికి తెచ్చుకోకపోతే బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందడం చాలా కష్టమవుతుంది. మొన్న శాసన సభ ఎన్నికల్లో పది శాతం ఓట్లను తెచ్చుకున్న కేజేపీని తక్కువగా అంచనా వేస్తే బీజేపీకే నష్టమనే రాజకీయ వాదనలున్నాయి. విలీనం లేదు : యడ్డి బీజేపీలో కేజేపీని విలీనం చేసే ప్రసక్తే లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. హుబ్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. పొత్తుపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని, ఒక వేళ పొత్తు కుదరక పోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదని కుండ బద్ధలు కొట్టారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది తన ఆశయమని, ఈ క్రమంలో ఎన్డీఏకు దగ్గర కావడానికి ప్రయత్నించానని తెలిపారు. ఇంతకు మించి ఎటువంటి బలహీనతలు, పదవీ కాంక్ష, అధికార వాంఛ తనకు లేదని స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జోరు