ETG Times Now Survey 2023: BRS Party May Get 11 Lok Sabha Seats - Sakshi
Sakshi News home page

ఈటీజీ-టైమ్స్‌ నౌ సర్వే: BRSకి ఎన్ని సీట్లంటే..

Published Wed, Aug 16 2023 9:47 PM | Last Updated on Sat, Aug 19 2023 6:29 PM

Etg Times Now Survey 2023 Brs Party May Get 11 Lok Sabha Seats - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలన్ని తమ తమ సత్తా చాటుకునేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ప్రజలు ఎవరిని గెలిపిస్తారన్నది ఈటీజీ-టైమ్స్‌ నౌ సర్వే నిర్వహించింది.

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకుగానూ బీఆర్‌ఎస్‌ 9-11 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈటీజీ-టైమ్స్‌ నౌ సర్వే వెల్లడించింది. బీజేపీ(ఎన్డీయే కూటమికి) 2-3 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్‌ 3-4 ఎంపీ స్థానాలు, ఇతరులు ఒక్క స్థానం గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది.

అలాగే.. బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం 38.40 శాతంగా ఉంటుందని సర్వే వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్ని‍కల్లో టీ(బీ)ఆర్‌ఎస్‌ 9, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం 1 స్థానం నెగ్గాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement