సాక్షి, హైదరాబాద్: ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్ 9 నుంచి 11 సీట్లు గెలుచుకుంటుందని ‘టైమ్స్ నౌ’ తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో బీజేపీకి 2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 4 సీట్లు లభిస్తాయని సర్వే నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్ సీపీ 24 నుంచి 25 స్థానాలు దక్కించుకుని ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడించింది. టీడీపీకి సున్నా నుంచి ఒక స్థానం రావొచ్చని పేర్కొంది.
ఏపీలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన తర్వాత ఈ సర్వే జరగడం గమనార్హం. జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేనే మరో సారి విజయం సాధిస్తుందని తెలిపింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి 307 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ‘ఇండి యా’ కూటమి 175 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది.
తెలంగాణలో పెరిగిన బీఆర్‌ఎస్ బలం
17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచింది. ఈసారి ఎన్నికల్లో 9 నుంచి 11 సీట్లు తన ఖాతాలో వేసుకోనుంది. బీజేపీకి 2 నుంచి 3, కాంగ్రెస్‌కు 3 నుంచి 4 సీట్లు లభిస్తాయి. ఇతరులు మరో స్థానం దక్కించుకోబోతున్నారు. 80 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయేకు 70 నుంచి 74 సీట్లు లభిస్తాయని సర్వే బహిర్గతం చేసింది. ఇండియా కూటమికి 4 నుంచి 8, బహుజన సమాజ్ పార్టీకి ఒకటి, ఇతరులకు ఒకటి నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
చదవండి: కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం
Comments
Please login to add a commentAdd a comment