ఏపీలో 21–22 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ–ఈటీజీ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ప్రజల అభిప్రాయాన్ని టౌమ్స్ నౌ సంస్థ నెల రోజులపాటు విస్తృతంగా సర్వే చేసింది.
ఈ సర్వే ఫలితాలను గురువారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్ ప్రసారం చేసి చర్చ నిర్వహించింది. అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంటుందని వెల్లడైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టి జట్టుగా వచ్చినప్పటికీ ఘోర పరాభవం తప్పదని సర్వేలో తేలింది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేల్చింది. టీడీపీ, జనసేన కూటమి మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలతో ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది.
విశ్వసనీయతకు పట్టం..
సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు స్పష్టం చేశారు. గత ఎన్నికలతో పోల్చితే వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి కారణాలపై ప్రధానంగా చర్చ సాగింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం వాగ్దానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేసి ‘‘చెప్పాడంటే.. చేస్తాడంతే..’’ అనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచుకున్నారు.
మీ బిడ్డగా మీ ఇంటికి మంచి చేశానని నమ్మితే ఓటేయాలంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. రాష్ట్రంలో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తుండటంతో ప్రజలంతా సంక్షేమ సర్కారుకు జై కొడుతున్నారు. కూటమిగా చేరిన టీడీపీ, బీజేపీ, జనసేన పారీ్టలు నైతిక స్థైర్యం కోల్పోయి ఉనికి కోసం కుట్రలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment