
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మరో సర్వే స్పష్టం చేసింది. స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో వైఎస్సార్‌సీపీ నిలుస్తుందని వీడీపీ అసోషియేట్స్ అనే సర్వే సంస్థ అంచనా వేసింది. ఫ్యాన్ హవాతో ఏపీలో ఉన్న 175 సీట్లకు గాను వైఎస్సార్‌సీపీ 106 నుంచి 118 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. ఇక అధికార టీడీపీ 68 నుంచి 54 సీట్లు సాధిస్తుందని తెలిపింది. జనసేన ఒకటి నుంచి మూడు సీట్లు సాధించే అవకాశముందని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్ సహా బీఎస్పీ, సీపీఐ, ఇతరులెవరూ ఖాతా తెరవరని వివరించింది. వైఎస్సార్‌సీపీ 43.85 శాతం ఓట్లు, టీడీపీ 40 శాతం ఓట్లు, జనసేన 9.8 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది.
20 లోక్‌సభ సీట్లు ఆ పార్టీవే..
జాతీయ వార్తా సంస్థ టైమ్స్‌నౌ, వీఎమ్మార్.. ‘2019 ఒపినీయన్ పోల్’ పేరిట చేపట్టిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపింది. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ 20 చోట్ల ఘన విజయం సాధిస్తుందని టైమ్స్‌నౌ స్పష్టం చేసింది. ఇక అధికార టీడీపీ కేవలం 5 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ 43.7 శాతం ఓట్లు, టీడీపీ 35.1 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది.
(చదవండి : ఏపీలో వైఎస్సార్‌సీపీ హవా)
(చదవండి : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం)
(చదవండి : మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్)
Comments
Please login to add a commentAdd a comment