VDP Associates
-
మూడో స్థానంలో నిలిచిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ప్రజా నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరో గౌరవం దక్కింది. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ‘దేశ్ కా మూడ్’ పేరిట చేపట్టిన సర్వేలో తేలినట్లు వీడీపీ అసోసియేట్స్ వెల్లడించింది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఈ సందర్భంగా తేల్చింది. ఈ క్రమంలో అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు వైఎస్ జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలే ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన నాటి నుంచే వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికై ఆయన చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిందని పేర్కొంటున్నారు. ఇక ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఐదో స్థానంలో నిలిచారు. కాగా ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు వైఎస్ జగన్ అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా, మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఏకంగా 151 శాసనసభ స్థానాలు, 23 లోక్‌సభ స్థానాలు సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. Overall Satisfaction with performance of Chief Ministers(Good+Average) #DeshKaMood pic.twitter.com/QLGCIQG8en — VDPAssociates (@VDPAssociates) August 15, 2019 -
వైఎస్సార్సీపీకు జైకొట్టిన మరో రెండు సర్వేలు..!
-
ఫ్యాన్‌కు జైకొట్టిన మరో రెండు సర్వేలు..!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మరో సర్వే స్పష్టం చేసింది. స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో వైఎస్సార్సీపీ నిలుస్తుందని వీడీపీ అసోషియేట్స్ అనే సర్వే సంస్థ అంచనా వేసింది. ఫ్యాన్ హవాతో ఏపీలో ఉన్న 175 సీట్లకు గాను వైఎస్సార్సీపీ 106 నుంచి 118 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. ఇక అధికార టీడీపీ 68 నుంచి 54 సీట్లు సాధిస్తుందని తెలిపింది. జనసేన ఒకటి నుంచి మూడు సీట్లు సాధించే అవకాశముందని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్ సహా బీఎస్పీ, సీపీఐ, ఇతరులెవరూ ఖాతా తెరవరని వివరించింది. వైఎస్సార్సీపీ 43.85 శాతం ఓట్లు, టీడీపీ 40 శాతం ఓట్లు, జనసేన 9.8 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది. 20 లోక్‌సభ సీట్లు ఆ పార్టీవే.. జాతీయ వార్తా సంస్థ టైమ్స్‌నౌ, వీఎమ్మార్.. ‘2019 ఒపినీయన్ పోల్’ పేరిట చేపట్టిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపింది. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ 20 చోట్ల ఘన విజయం సాధిస్తుందని టైమ్స్‌నౌ స్పష్టం చేసింది. ఇక అధికార టీడీపీ కేవలం 5 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. వైఎస్సార్సీపీ 43.7 శాతం ఓట్లు, టీడీపీ 35.1 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది. (చదవండి : ఏపీలో వైఎస్సార్సీపీ హవా) (చదవండి : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం) (చదవండి : మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్) -
మోస్ట్ పాపులర్ సీఎంగా కేసీఆర్
-
మోస్ట్ పాపులర్ సీఎంగా కేసీఆర్
- రెండో స్థానంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ - ఏడో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు, రాజస్థాన్ సీఎం రాజే - వీడీపీ అసోసియేట్స్ సంస్థ సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఎంపికైనట్లు ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ వీడీపీ అసోసియేట్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ప్రజాదరణపై చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం ఈ సంస్థ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రజాదరణ విషయంలో నిర్వహించిన సర్వేలో 87 శాతం రేటింగ్‌తో సీఎం కేసీఆర్ మళ్లీ ఆగ్రస్థానంలో నిలిచారని పేర్కొంది. తర్వాత 85 శాతం రేటింగ్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండో స్థానంలో, 79 శాతం రేటింగ్‌తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో స్థానంలో నిలిచారని తెలిపింది. గతకొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత 75 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సంయుక్తంగా 58 శాతం రేటింగ్‌తో ఏడోస్థానంలో నిలిచారు. వీడీపీ అసోసియేట్స్ ప్రకటించిన ముఖ్యమంత్రుల రేటింగ్స్ వివరాలివీ..