ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మరో సర్వే స్పష్టం చేసింది. స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో వైఎస్సార్‌సీపీ నిలుస్తుందని వీడీపీ అసోషియేట్స్ అనే సర్వే సంస్థ అంచనా వేసింది. ఫ్యాన్ హవాతో ఏపీలో ఉన్న 175 సీట్లకు గాను వైఎస్సార్‌సీపీ 106 నుంచి 118 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది.