ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘గొప్ప విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. దేవుడి దయ, ప్రజల దీవెనలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది. ప్రజలంతా విశ్వసనీయతకు ఓటు వేశారు. ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటాం. తొలి సంతకం కాదు...నవరత్నాల హామీలును అమలు చేస్తాం.
ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది
Published Thu, May 23 2019 6:26 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement