AP Election Results 2019
-
ఏపీలో కొనసాగుతున్న కౌంటింగ్ (ఫొటోలు)
-
సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ?
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్.’ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా? అంటూ విజయసాయరెడ్డి విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారని, పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్ మూడేళ్లలో పూర్తయ్యేదన్నారు. 7లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేదని, ప్రధానమంత్రి మోదీ అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదని ఆయన ధ్వజమెత్తారు. నీళ్లు తాగారు..ఓట్లేయలేదు: చంద్రబాబు కాగా గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చంద్రబాబు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా ప్రజలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. తప్పంతా ప్రజలదే అన్నట్లు ఆక్రోశం వెళ్లగక్కడం పరిపాటిగా మారింది. తమను ఓడించారనే కారణంతో ప్రజలను నోటికొచ్చినట్లు నిందిస్తున్నారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన వేమురు నియోజకవర్గ కార్యక్తల సమావేశంలో కూడా అదే ధోరణితో మాట్లాడారు. తాను ఎంతో కష్టపడి పట్టిసీమను కట్టి తాగడానికి నీళ్లిచ్చానని, వాటిని తాగారు కానీ తనకు ఓటేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయానో ఇప్పటికి అర్థం కావడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. -
అప్పుడే నాకు ఓటమి కనిపించింది: పవన్
సాక్షి, అమరావతి: నాయకత్వం లోపం కారణంగానే గత ఎన్నికల్లో ఓడిపోయామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్ పలు సమావేశాల్లో పాల్గొన్నారు. పవన్ మాట్లాడుతూ..‘తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయండి అంటే నేతలు గ్రూపులు కట్టారు. అప్పుడే నాకు ఓటమి కనిపించింది. నేను రోడ్ల మీద తిరిగితే పార్టీ బలపడుతుందని సలహా ఇస్తున్నారు. నేను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, అభిమానులు నన్ను తిరగనిస్తారా? అయినా, కచ్చితంగా వస్తాను’ అని అన్నారు. -
అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్
సాక్షి, అమరావతి: ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సొంత పార్టీ నేతల వద్ద అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన పార్టీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులతో నిన్న(శుక్రవారం) ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని వారితో చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో గానీ, ఇప్పుడు 2019 ఎన్నికల సమయంలో గానీ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అయినా, ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలతో పోరాడామన్నారు. ఈ ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దామని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరుఫున గెలిచిన తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను పవన్ అభినందించారు. -
అఖండ మెజారిటీ సేవ చేసేందుకే..
-
జగన్ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?
సాక్షి, హైదరాబాద్ : ప్రజలు అందించిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకేనని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారని, అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు. మనం మాత్రం వారిలా కాకుండా దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలని, ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకేనని అర్థం చేసుకోవాలన్నారు. చూస్తున్నారా చంద్రబాబూ? మద్యం బెల్ట్ షాపు ఒక్కటి కూడా కనిపించరాదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తే వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని చెప్పారన్నారు. ఇదో సాహసోపేత నిర్ణయమని, కానీ లిక్కర్ లాబీకి లొంగిపోయిన చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలన్నిటినీ గాలికొదిలిందని మండిపడ్డారు. దీంతో వీధికో బెల్టు షాపు తెరుచుకుందన్నారు. ‘తానేం చేసినా అడ్డుకోరాదని చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారు. సీబీఐని బ్యాన్ చేశారు. ఐటీ దాడులను అడ్డుకున్నారు. ఈడీ ఎలా వస్తుందని గుడ్లురిమారు. కానీ సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దొంగలను రక్షించేది లేదని తేల్చిచెప్పారు. చూస్తున్నారా చంద్రబాబూ?’ అని విజయసాయిరెడ్డి దెప్పిపొడిచారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వారసులొచ్చారు..
సాక్షి, గుంటూరు : జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ వారసులు విజయదుందుభి మోగించారు. తమ వారసత్వ రాజకీయాలను కొనసాగించారు. ప్రజా సేవలో రాణిస్తున్నారు. నరసరావుపేట ఎంపీ, గురజాల, మాచర్ల, బాపట్ల, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారి తాతలు, తండ్రులు, మామల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించడం విశేషం. అయితే జిల్లాలో గెలిచిన రాజకీయ వారసులంతా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలుపొందడం మరో విశేషం. ఎంపీగా భారీ మెజార్టీ జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 1.53 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత అయిన లావు రత్తయ్య కావడం అందరికి తెలిసిన విషయమే. అయితే లావు రత్తయ్య వేర్వేరు పార్టీల తరఫున రెండు సార్లు ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయ వారసునిగా శ్రీకృష్ణదేవరాయలు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన మొదటిసారే ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. వరుసగా నాలుగో సారి.. మాచర్ల ఎమ్మెల్యేగా వరుసగా నాల్గో సారి విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించారు. గతంలో అక్కడ ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలు పక్కన పడేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం వరుసగా నాల్గో సారి ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన బాబాయి పిన్నెల్లి సుందరరామిరెడ్డి పల్నాడులో మంచి పేరు సంపాదించినప్పటికీ 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో మరో బాబాయి పిన్నెల్లి లక్ష్మారెడ్డి సైతం పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన రామకృష్ణారెడ్డి అప్పటి నుంచి 2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. అన్నాబత్తుని వారసుడు.. తెనాలి నుంచి పోటీ చేసి గెలుపొందిన అన్నాబత్తుని శివకుమార్ తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ 1983, 1985 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన అన్నాబత్తుని శివకుమార్ 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మామ స్ఫూర్తితో.. పొన్నూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి వెంకట రోశయ్య ఐదు సార్లు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు కిలారి వెంకట రోశయ్య. 2009 ఎన్నికల్లో తెనాలి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మాత్రం అనూహ్యంగా పొన్నూరు నుంచి పోటీ చేసి సంచలన విజయం సాధించారు. కోన కుటుంబం నుంచి.. బాపట్ల ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొందిన కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఆయన తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మూడో తరం నేత మహేష్‌రెడ్డి రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ రాజకీయ కుటుంబంగా పేరొందినది కాసు కుటుంబం. మూడో తరానికి చెందిన కాసు మహేష్‌రెడ్డి ఎమ్మెల్యేగా గురజాల నుంచి పోటీ చేసి గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. మహేష్‌రెడ్డి తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, గవర్నర్‌గా పనిచేశారు. మరో తాత కాసు వెంగళరెడ్డి రాజ్యసభ్య సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, జిల్లాపరిషత్ చైర్మన్‌గా అనేక ఉన్నత పదవులు పొందారు. కాసు మహేష్‌రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మహేష్‌రెడ్డి మొదటిసారిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గురజాల నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది కాసు కుటుంబంలో మూడో తరం రాజకీయ నేతగా పేరొందారు. -
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాదయాత్ర
సాక్షి, దెందులూరు : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు, దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేశా. ఈ అయిదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై అబ్బయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 17 ఏళ్లు అనుభవం ఉన్న ఆయన...రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ సీపీలో చేరారు. దెందులూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. -
నువ్వు మారవు బాబూ..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నిశ్చయ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి టీడీపీ అధినేత చంద్రబాబును హుందాగా ఆహ్వానిస్తే దానికి ఇతర కథనం జోడించి సొంత మీడియాలో రాయించుకున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనుభవజ్ణులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే ప్రజలు యువనేతకు పట్టం కట్టారు. నువ్వు మారవు బాబూ.’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడైన పరివర్తన వస్తుందనుకుంటే.. ‘దేనిలో అనుభవజ్ణుడివి చంద్రబాబూ? కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, నయవంచన, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో తప్ప మీకు ఎందులో అనుభవం ఉంది బాబూ. చిత్తుగా ఓడిన తర్వాత కూడా అబద్ధాలతో ఆత్మవంచన చేసుకుంటున్నావు. మీ సలహా విన్న వారంతా ఏమయ్యారో తెలిసి కూడా మిమ్మల్ని అడుగుతారా బాబూ? మీ పిచ్చిగాని. 23 సీట్లకు పతనమైన తర్వాత అయినా పరివర్తన వస్తుందనుకుంటే ఇంకా మీకు రాలేదేంటి బాబూ. అనుకూల మీడియా ఉందని మీ కలలు, ఊహలన్నిటిని రాయించుకుని తృప్తి పడుతున్నారా? జూన్ 8 వరకు పదవీ కాలం ఉందని ఇంకా నమ్ముతున్నారా ఏంటి ఖర్మకాలి.’ అని విమర్శించారు. నేను పక్కనే ఉన్నా.. ‘ప్రజల ఆగ్రహం వల్ల ఓడిపోలేదట. సానుభూతి వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తేల్చాడు రాజకీయ మ్యానిపులేటర్ చంద్రబాబు. కిందపడ్డా నేనే గెలిచా అన్నట్టుంది ఆయన వాలకం. గెలిచిన పార్టీకి 50 శాతం ఓట్లు పడిన చరిత్ర ఉందా. దీన్ని సింపతీ అంటారా? మానసిక స్థితి ఇంకా దిగజారినట్టుంది. జగన్ గారు అత్యున్నత సంప్రదాయాన్ని పాటించి స్థానిక/జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలను ఫోన్ ద్వారా ఆహ్వానించే సమయంలో నేను పక్కనే ఉన్నా. మీకూ నాముందే ఫోన్ చేశారు. కానీ ఆయన మీ అనుభవం, సలహాలు అవసరం అనే మాటలే వాడలేదు. ఆయన అనని మాటల్ని అన్నట్టు ప్రచారం చేసుకునేంత నీచానికి దిగారు.’ అంటు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఇక గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆయన ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌లకు సైతం వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. -
వైఎస్సార్సీపీ ఘన విజయం.. అట్లాంటలో సంబరాలు
అట్లాంట : తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రపంచం నలుమూలలా ఉన్న వైఎస్సార్ అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని అట్లాంటకు చెందిన ఎన్నారైలు జై జగన్, జోహార్ వైఎస్సార్ నినాదాలు చేస్తూ.. వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. వైఎస్ జగన్ సాధించిన ఘన విజయాన్ని అట్లాంటలోని ఎన్నారైలు అందరూ కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. -
దుబాయ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
దుబాయ్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మెహన్ రెడ్డికి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్(యూఏఈ) సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని పురస్కరించుకుని లేబర్ క్యాంపుల్లో పనిచేస్తున్నవారికి ఆహారాన్ని వితరణ చేశారు. 250 ఆహారం పొట్లాలను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. యూఏఈలో ఉంటున్న కార్మికులకు ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేశ్ రెడ్డి, సోమిరెడ్డి, అక్రమ్, నాజీర్, రమణ, బ్రహ్మానంద్ రెడ్డి, కుమార్ చంద్ర, దిలీప్, కోటి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రావులు పాల్గొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
దుబాయ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
-
‘అక్కడ 9700 ఓట్లు లెక్కించలేదు’
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించారు. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదని ఆయన ట్వీటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్వో అక్రమానికి పాల్పడి టీడీపీ 4200 ఓట్లతో గెల్చినట్టు ప్రకటించారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గుంటూరు లోక్‌సభ స్థానంలోని సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్న కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడంతో వాటిని లెక్కించని విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, ఉత్తర గుంటూరు, దక్షిణ గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క దక్షిణ గుంటూరు మినహా అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. కానీ లోక్‌సభ స్థానంలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కాకుండా టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ను విజయం వరించింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుంటూరుతో పాటు శ్రీకాకుళం ఎంపీ స్థానంలోనూ అధికారుల తీరుతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చిందని, ఈ రెండు స్థానాలపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, టెక్కలి సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. -
గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటరీ ఫలితాలపై కోర్టుకు..
విజయవాడ సిటీ: గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ రెండు లోక్‌సభ స్థానాల ఫలితాలపై కోర్టుకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో సోమవారం వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండానే ఫలితాలను ఏవిధంగా ప్రకటిస్తారని వారు ప్రశ్నించారు. ఈ అంశాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్వోలు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బుధవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. గుంటూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ మినహా మిగిలిన ఆరు స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిందని మోదుగుల వివరించారు. ఈ ఆరు చోట్లా వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చిందన్నారు. తనకు మాత్రం తన ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయని వివరించారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారని, అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారని మండిపడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ పట్టుబట్టినప్పటికీ అధికారులు అంగీకరించలేదన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీ స్థానంలోనూ అధికారుల తీరుతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, టెక్కలి సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారన్నారు. మిగిలిన చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించిందన్నారు. అంతేకాకుండా పలుచోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం ఉద్యోగులు చేసిన పొరపాట్ల వల్ల పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటుకాకుండా పోయాయన్నారు. -
వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ: లోకేష్
సాక్షి, అమరావతి: 2024 ఎన్నికల్లోనూ తాను తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన సోమవారం మంగళగిరి కార్యకర్తలతో ఉండవల్లిలో మాట్లాడారు. త్వరలోనే తాను మంగళగిరిలో పర్యటించనున్నట్లు చెప్పారు. అయితే ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దొని, ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుని మనకి పార్టీ అండగా ఉందని అన్నారు. రాష్ట్ర మంత్రి హోదాలో మంగళగిరి బరిలో నిలిచిన లోకేష్... వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో ఘోర పరాజయం పాలైన తెలిసిందే. నారా లోకేష్ ఓవైపు ఓటమిపై తాను బాధపడటం లేదంటూనే మరోవైపు...మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడే అందరూ రాంగ్ సెలక్షన్ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా అందరూ అదే అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. కాగా ఓటమి అనంతరం నియోజకవర్గ సీనియర్ నేతలెవరూ చంద్రబాబు, లోకేష్‌లను కలవలేదు. అయితే రెండు రోజుల నుంచి చోటా నాయకులు, చంద్రబాబు, చినబాబును కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
హైకోర్టును ఆశ్రయించనున్న మోదుగుల
సాక్షి, అమరావతి : గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో పూర్తి ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని, అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మొత్తం నమోదైన 14 వేలకు పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లలో 4600 పైచిలుకు ఓట్లను మాత్రమే లెక్కించగా, వాటిల్లో మోదుగులకు దాదాపు 3 వేలు, గల్లాకు 12 వందలపైచిలుకు వచ్చాయి. మరో 9700 ఓట్లను తిరస్కరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారమ్ 13 (ఎ) ద్వారా నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 13 (బి) నంబర్ ను కవర్ పైన వేయలేదన్న సాకుతో ఆఓట్లను తిరస్కరించారని, ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదుగుల చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ఎన్నికల విధుల్లో నమగ్నమయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటిపైనా తగిన తర్ఫీదు ఇవ్వడంతో పాటు మొత్తం బాధ్యత ఎన్నికల అధికారిదేనని వివరించారు. ఎన్నికల అధికారి తన బాధ్యతలను నిర్వర్తించకుండా పోస్టల్ బ్యాలెట్లను ఏకపకంగా తిరస్కరించడానికి వీలులేదని, ఇది ఓటర్లకు ఉన్న హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. పైగా ఈ రకంగా 9700 ఓట్లను తిరస్కరించారని, మెజారిటీ తక్కువగా వచ్చిన సందర్భాల్లో ఇలాంటి ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించాలని నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొత్తం ఓట్లను లెక్కించకుండా ఎన్నికల జర్నల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మోదుగుల చెప్పారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే తరహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల మీడియాతో చెప్పారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ లెక్కింపు రోజున అధికారులు అంగీకరించలేదు. శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో.. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో రామ్మోహన్ నాయుడు గట్టెక్కారు. ఇక పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ -
శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ
-
చినబాబు....చివరికిలా
సాక్షి, మంగళగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. ఆయన గెలిస్తే చాలు.. పిలిస్తే నిధులొస్తాయి.. నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి బాట పట్టిస్తారు. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారం.. సర్వేలన్నీ లోకేష్ బాబు విజయంవైపే.. అన్ని రిపోర్టులూ చినబాబుకు తిరుగులేదనే.. ఇవీ పోలింగ్ ముగిశాక చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన నివేదికలు. ఎన్నికల్లో నారా లోకేశ్ ఓటమి పాలవడంతో ఇక చినబాబు రాజకీయ జీవితం ముగిసినట్టేనా.. రాజధాని ప్రాంతంలో మితిమీరిన అవినీతే కొంపముంచిందా? అధినాయకుడి అసమర్థతే ఓటమి మూటగట్టిందా? ఇదీ ఎన్నికల ఫలితాలు వెడివడ్డాక తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం. ఎందుకిలా అయ్యింది.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఓటమిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. రాష్ట్ర మంత్రి హోదాలో మంగళగిరి బరిలో నిలిచిన లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో ఘోర పరాజయం పాలవడం టీడీపీ నేతలను ఆందోళనలోకి నెట్టేసింది. రాంగ్ రిపోర్ట్ వాస్తవానికి ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక నాయకులు మండలాల వారీగా లెక్కలు కట్టారు. ప్రతి మండలంలో లోకేష్‌కు ఆధిక్యం వచ్చినట్లు చూపించారు. మొత్తం గా 25 వేలకుపైగా మెజార్టీతో చినబాబు గెలుస్తాడంటూ చంద్రబాబుకు నివేదికలు అందజేశారు. మళ్లీ అంతర్గత సర్వే చేయించుకున్న చంద్రబాబు లోకేష్ ఓటమి ఖాయమని తెలుసుకుని స్థానిక నాయకులకు చివాట్లు పెట్టారు. దీంతో టీడీపీ నాయకులే లోకేష్ ఓడిపోతాడంటూ బెట్టింగ్ పెట్టారని సమాచారం. అంతటా వ్యతిరేకతే.. తాడేపల్లి పట్టణంతోపాటు మండలంలో వైఎస్సార్ సీపీ 10 వేలకుపైగా మెజార్టీ రావడంతోనే ఓటమి తప్పదని గ్రహించిన నాయకులు మంగళగిరి మండలం, పట్టణంపై ఆశలు పెట్టుకున్నారు. అనంతరం దుగ్గిరాల మండలంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన మెజార్టీతో వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) 5339 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లోకేష్ రాజకీయ జీవితానికి తెరపడినట్టే(నా) లోకేష్ పోటీ అనంతరం మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు లోకేష్ రాజకీయ భవిష్యత్‌కు కూడా ముగిసినట్టేనని పేర్కొంటున్నారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడింది. పార్టీ నాయకులు ఇసుక, మట్టి దోపిడీకి సాగించారు. ఇలాంటి ప్రాంతంలో లోకేష్‌లాంటి నాయకుడ్ని తీసుకొచ్చి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ చతురత, ప్రజల్లో చొచ్చుకుపోయే తత్వం వంటి లక్షణాల ముందు లోకేష్ నిలవలేడని తెలిసి ఇక్కడ పోటీ చేయించడం అధిష్టానం తప్పేనని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ బాబు రాజకీయ భవితవ్యంపై ఆందోళనేనని చర్చించుకుంటున్నారు. లెక్కింపునకు ముందే ఓటమి ఈ నెల 23వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో లెక్కింపు కేంద్రానికి సైతం లోకేష్తోసహా మంగళగిరి నాయకులు ఎవరు వెళ్లకపోవడంతో ఓటమికి వారు ముందుగానే సిద్ధపడ్డారని స్థానిక కార్యకర్తలు అంటున్నారు. డబ్బు, అధికారం గెలిపిస్తుందనే ఆశతో ప్రత్యక్ష ఎన్నికలలో తొలిసారి బరిలోకి దిగిన లోకేష్‌ను మంగళగిరి ఓటర్లు శంకరగిరి మాన్యాలకు పంపించారని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఓటమి అనంతరం నియోజకవర్గ సీనియర్ నేతలెవరూ చంద్రబాబు, లోకేష్‌లను కలవలేదు. రెండు రోజుల నుంచి చోటా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఫలించని చిలుక జోస్యం ఇప్పటికే జగన్ సునామీలో తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు గల్లంతయ్యాయి. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేయడం.. రాష్ట్రం చూపు ఇటే ఉండడం.. చివరకు చినబాబు మట్టి కరవడం జరిగాయి. ఈ బాధలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆర్థికంగానూ చితికిపోయారు. సర్వేలన్నీ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నా.. టీడీపీపై ఉన్న అభిమానంతో అప్పులపాలయ్యారు. రాజధానిలో వివిధ రకాల బెట్టింగ్‌లతో కోట్ల రూపాయలు, భూములు నష్టపోయారు. వీరి ఆత్మవిశ్వాసం లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన చిలకజోస్యంతో అతి విశ్వాసం మారి ఇల్లు గుల్ల చేసుకున్నారు. రాష్ట్రంలో తమకు ఒక్క సీటయినా వైఎస్సార్ సీపీ కంటే ఎక్కువగా వస్తుందని తాడికొండ మండలంలో సుమారు రూ.10 కోట్లకుపైగా పందేలు కాశారు. కానీ పందెం తల్లకిందులైంది. ఒక్క సీటు కాదు ఏకంగా 128 సీట్లు వైఎస్సార్ సీపీకి ఎక్కువగా రావడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. తుళ్లూరు మండలంలో టీడీపీకి 8 వేలకుపైగా మెజార్టీ వస్తుందని పందేలు కాశారు. ఇక్కడ 6 వేలకే పరిమితమైంది. భూములిచ్చిన రైతులు, ఓ సామాజిక వర్గం టీడీపీకి సానుకూలంగా ఉన్నా..లంక, అసైన్డ్ భూముల రైతులు వైఎస్సార్ సీపీకి మొగ్గు చూపారు. లంక అసైన్డ్ భూముల రైతులను ప్యాకేజీ విషయంలో టీడీపీ నాయకులు దారుణంగా మోసం చేశారు. టీడీపీని తరిమికొట్టారు అతి తక్కువ ధరలకు మంత్రుల బినామీలు కొనుగోలు చేసి చట్టబద్ధం చేసుకొనేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లంక, అసైన్డ్ భూముల రైతులకు సాధారణ రైతులకు ఇచ్చే ప్యాకేజీ కంటే 20 శాతం ఎక్కువ ఇస్తామని ప్రకటించడడంతో వారు టీడీపీని తరిమికొట్టారు. తాడికొండ మండలంలో ఒక్క ఓటు అయినా తమకు మెజార్టీ వస్తుందని వేసిన పందేలు దాదాపు రూ.40 లక్షల వరకు బెడిసికొట్టాయి. ఇక్కడ వైఎస్సార్ సీపీకి 850కిపైగా మెజార్టీ వచ్చింది. రాజధాని ప్రాంతంలో టీడీపీ పాగా వేస్తుందనే గట్టి నమ్మకంతో కొందరు బెట్టింగ్ రాయుళ్లు శ్రావణ్ కుమార్ విజయంపై భారీగా పందేలు వేసి భంగపడ్డారు. ముంచిన ఎల్లో మీడియా ఎల్లో మీడియా, ఆంధ్రా ఆక్టోపస్ చిలక జోస్యంను నమ్మి అప్పన్నంగా తమకే సొమ్ము వస్తుందనే అత్యాశతో లక్షల్లో పందేలు కాసి కుదేలయ్యారు. దీంతో ‘సొమ్ము పోయే... శని పట్టే’ అన్న చందంగా తెలుగు తమ్ముళ్ల పరిస్థితి తయారైంది. రాజధాని వ్యాప్తంగా ఇదే పరిస్థితి రాజధానిలోని మంగళగిరిలో ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ పోటీ చేయడంతో ఎట్టి పరిస్థితులలో విజయం సాధిస్తాడనే నమ్మకంతో పందేలు కాశారు. నామినేషన్ సమయంలోనూ భారీగా బెట్టింగ్‌లు నడిచాయి. తుళ్లూరు మండలంలోని మందడం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని ఐదెకరాలతోపాటు లగడపాటి మాటలు నమ్మి రూ.2 కోట్ల పందెం కాసి నష్టపోయినట్లు చర్చ జరుగుతోంది. రాజధాని వ్యాప్తంగా సుమారు యాభై ఎకరాలకుపైగా భూములను టీడీపీ నాయకులు పందెం కాసి భంగపడ్డారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, బేతపూడి, నీరుకొండ, నిడమర్రు గ్రామాల్లోనూ బెట్టింగ్ నడిచాయి. ఇలా రాజధాని వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల వరకు టీడీపీ నేతలు బెట్టింగ్‌లు పెట్టి జేబులు గుల్ల చేసుకున్నారు. -
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
-
తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్
-
అందుకే వార్ వన్‌సైడ్: ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ప్రజలు భావించారని, అందుకే ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అయిందని తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రజలందరూ కూడబలుక్కుని వైఎస్సార్ సీపీకి ఓటు వేశారనిపిస్తోందన్నారు. ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర తిరగరాశారన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గత అయిదేళ్ల పాటు అబద్ధాలు చెప్పారంటూ శ్రీదేవి మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మలేదని అందుకే తమ ఓటు హక్కు ద్వారా సరైన గుణపాఠం చెప్పారన్నారు. తాడికొండ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్నారన్నారు. అందుకే ఆయన రాజధాని కూడా ఇక్కడ పెట్టారన్నారు. తుళ్లూరు పరిధిలోని 19 గ్రామాలు టీడీపీకి కంచుకోట అని, అలాంటి చోట వైఎస్సార్ సీపీ విజయ కేతనం ఎగురవేసిందన్నారు. ఇక రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. టీడీపీ పాలనలో ఉద్యోగాలు రాలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కాకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు. పేదలకు పక్కా ఇళ్లు కూడా ఇవ్వలేదని, వృద్ధులకు కనీసం పింఛన్లు కూడా సరిగ్గా అందించలేదన్నారు. ప్రజలందరూ మార్పు కోరుకున్నారని అందుకే వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది -
చంద్రబాబుపై హీరో విష్ణు సెటైర్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరుకు టీడీపీ అడ్రస్ గల్లంతయింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడుకి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలచుకోగా.. టీడీపీ 23 దగ్గరే ఆగిపోయింది. ఇక 22 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా.. మూడు స్థానాలకే టీడీపీ పరిమితమైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, టీడీపీలపై ట్రోలింగ్ మొదలైంది. తాజాగా హీరో మంచు విష్ణు నారాకు సరికొత్త అర్థం చెబుతూ ట్విటర్లో వ్యంగ్యంగా స్పందించారు. ‘నారా అంటే.. జాతీయ స్థాయిలో ఆశయాలు.. ప్రాంతీయ స్థాయిలో ఆకాంక్షలు. మన ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీజీ ఎవరినీ ఇలా ట్రోల్ చేశారో.. మనందరికీ తెలుసు’అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విష్ణు చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పాలనుకున్నారని.. కానీ ఏపీ ప్రజలు ఆయనకు విశ్రాంతినిచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ‘ఇంట్లోనే’ బాబు ఓడిపోయారు.. ఇక బయటేం గెలుస్తారు’అంటూ మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘NARA’ - ‘N’ational ‘A’mbition and ‘R’egional ‘A’spirations. I have a strong feeling our beloved PM @narendramodi ji is trolling someone we all know 🤔😉😳 — Vishnu Manchu (@iVishnuManchu) 26 May 2019 -
అమరావతి చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నిశ్చయ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం తన పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలను నివేదించారు. కేంద్రం నుంచి చాలా సహాయం అవసరమవుతుందని ప్రధానిని అభ్యర్థించారు. అన్ని రకాలుగా సాయపడాలని కోరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడుతూ ప్రధానితో చర్చించిన విషయాలను వెల్లడించారు. సోమవారం ప్రత్యేక విమానంలో గన్నవరంకు వచ్చిన వైఎస్ జగన్.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్ జగన్
‘‘ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రతి కాంట్రాక్టునూ పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. తిరిగి టెండర్లు పిలుస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ‘ఇండియా టుడే’ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. పగ తీర్చుకోవాలన్నది తన అభిమతం కాదని చెప్పారు. తనను కేసులతో వేధించిన వారిని దేవుడే శిక్షిస్తాడని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... రాజ్‌దీప్ సర్దేశాయ్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధ్యమవుతుందని మీరు ఊహించారా? జగన్మోహన్రెడ్డి: ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. ఇదంతా దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. నేను 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడే కిందిస్థాయి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించాను. మా పార్టీ అఖండ విజయం సాధించబోతోందని అవగతమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేను చేసిన తొలి ప్రకటన మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పాను. సర్దేశాయ్: మీ పార్టీని చీల్చుతూ 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మీ పార్టీని లేకుండా చేయాలనుకున్నారు. అసలు మీ విజయంలో మలుపు తిప్పిన అంశం ఏమిటి? జగన్: నా పాదయాత్రనే ఈ విజయంలో ప్రధాన పాత్ర వహించింది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను రూ 20–30 కోట్లిచ్చి, ప్రలోభాలకు గురిచేసి తీసుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అది చట్ట విరుద్ధం కానట్లుగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా కూడా చేయలేదు. వారి చేత రాజీనామాలు కూడా చేయించలేదు. స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని రుజువయ్యాయి. సర్దేశాయ్: మీరేమో చంద్రబాబు అవినీతి, దుశ్చర్యల వల్ల ఆగ్రహంతో ఓట్లేశారని అంటున్నారు. మరి ఇందులో జగన్‌కు సానుకూల ఓటు లేదా? ఇంతకీ ఈ ఓటు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటా? లేక జగన్ అనుకూల ఓటా? జగన్: ఇందులో రెండూ కలిసి ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రజలు రెండు అంశాలు చూస్తారు. ప్రభుత్వంలో ఉన్న వారిపై వ్యతిరేకతతో పాటు తమ ఆశలను నెరవేర్చే నాయకుడు ఎవరని కూడా చూస్తారు. ఈ రెండు అంశాలు కలిసినప్పుడే సహజంగా అది అఖండ విజయం అవుతుంది. ఉన్న నాయకుడిని వద్దనుకున్నప్పుడు, మరో నాయకుడిని కావాలనుకున్నప్పుడే ప్రజలు అఖండ విజయాన్ని అందిస్తారు. సర్దేశాయ్: ఏపీలో ఎన్నికలు మీకు, చంద్రబాబుకు మధ్య హోరాహోరీగా జరిగాయి కదా. ఎన్నికల ప్రచారంలో ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు ఆయన్ను తీవ్రస్థాయిలో విమర్శించారు కదా. చివరకు వచ్చేటప్పటికి మీ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకునే పరిస్థితిని కల్పించారు కదా! జగన్ : మౌలికంగా ఇది ప్రాంతీయ పార్టీల సమరం. జాతీయ పార్టీలకు ఇక్కడ ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు నాకు, చంద్రబాబుకూ మధ్యనే పోరాటం జరుగుతుంది కదా! సర్దేశాయ్: రాష్ట్రాన్ని 12 నెలల్లో మారుస్తానని చెప్పారు? మీరు అనేక హామీలు ఇచ్చారు. అసలు మీ ఎజెండా ఏంటి? మోడల్ స్టేట్ అంటే ఏంటి? జగన్: ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రజలు మెచ్చుకునే పారదర్శక పాలన అందిస్తా. ఏం చేస్తామో, ఎలా చేస్తామో చెబుతాం. ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మారుస్తా. పూర్తిగా ప్రక్షాళన చేస్తా. అప్పుడు మీరే వెల్డన్ అంటారు. ప్రతీ కాంట్రాక్టును పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. సర్దేశాయ్: వచ్చే ఏడాదిలో కాంట్రాక్టర్ల వ్యవస్థలో మార్పు తెస్తారా? జగన్: అవును. పెద్ద మార్పు ఉంటుంది. ఉదాహరణకు పవర్ టారిఫ్‌నే తీసుకోండి. సంప్రదాయేతర ఇంధన వనరులను పరిశీలిద్దాం. సౌర విద్యుత్ గ్లోబల్ టెండర్ల ద్వారా అయితే యూనిట్ రూ.2.65కే లభిస్తోంది. పవన విద్యుత్ విషయంలో నరేంద్ర మోదీ అనుసరించిన పారదర్శక విధానం అభినందనీయం. దీనివల్ల యూనిట్ రూ.3కే లభిస్తోంది. కానీ, మన రాష్ట్రంలో విద్యుత్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన విద్యుత్ యూనిట్ రూ.4.84 ఉంది. పీక్ అవర్స్‌లో ఏకంగా రూ.6 పెట్టి కొనడానికి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్ ఏమిటంటే, నువ్వో రూపాయి తీసుకో. నాకో రూపాయి అనే విధానం కొనసాగుతోంది. చంద్రబాబు ఆయనకు కావాల్సింది తీసుకుని ఇలాంటివి ప్రోత్సహించాడు. మేము ఈ వ్యవస్థను మారుస్తాం. గ్లోబల్ స్థాయిలోకి వెళ్లి ఇప్పుడున్న ధరలు తగ్గిస్తాం. ఇదొక్కటే కాకుండా జ్యుడీషియల్ కమిటీ వేస్తాం. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో ఒక వర్గం మీడియా చంద్రబాబుకు అనుకూలంగా మారింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వాటికి చంద్రబాబు ఎంత చెబితే అంత. వాళ్లు వేరే పక్షాన్ని మట్టిలో కలపాలని కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్‌ను పూర్తిగా మార్చాలని చూస్తున్నాం. జ్యుడీషియల్ కమిటీని వేసి, సిట్టింగ్ జడ్జిని పెడతాం. జరిగే ప్రతి టెండర్‌ను ఆయన ముందుంచుతాం. ఆయన ఏ విధమైన మార్పులు సూచిస్తే దాన్ని అనుసరిస్తాం. వాళ్ల నిర్ణయానికి అడ్డురాము. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఏ మీడియా అడిగినా ఫైళ్లు చూపిస్తాం. అసత్య ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం కేసులు వేసేందుకు కూడా వెనుకాడం. సర్దేశాయ్: మీకు కూడా సొంత మీడియా ఉంది కదా? ఇది మీడియా పోరాటం కాదా? జగన్: ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ట దిగజారిస్తే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా! ఇది అమలు జరిగితే దేశానికే మంచి సంకేతాలు వెళ్తాయి. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదీ అని అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతిపరుడని పేరు తెచ్చుకోకూడదు. కానీ, రాష్ట్రంలో ఒక వర్గం మీడియా వాస్తవాలు కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. సర్దేశాయ్: రాష్ట్రం ఇమేజ్, మీ ఇమేజ్ మీ టార్గెట్. మోడల్ స్టేట్‌గా మార్చడం మీ ప్రధాన ఆశయం.. అంతేనా? ఏడాది తర్వాత మళ్లీ మీ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మీకు బలమైన ఎజెండా ఉంది. మోదీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా? ఆయన సహకారం కోరుకుంటున్నారా? కేంద్రంతో మంచిగా ఉండాలనుకుంటున్నారా? జగన్: మోదీని కలిసిన ప్రతీసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతాను. ఆయన ప్రధానమంత్రి. ఆయన ఆశీస్సులు అవసరం. మోదీ నుంచి మనకు నిధులు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా నేను చెయ్యాల్సింది నేను చేస్తా. సర్దేశాయ్: గతం వదిలేద్దాం. ఇప్పుడు మీరు సాధించిన ఘన విజయం తరువాత వెంటనే మీకేమనిపించింది? జగన్: అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు. సర్దేశాయ్: ప్రజల్లో మీ బలం ఏమిటో అంచనా వేసుకోవడానికి ఓదార్పు యాత్ర తలపెట్టారనేది కాంగ్రెస్ పార్టీ భావన. పదేళ్ల తరువాత ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సొంతంగా గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని మళ్లీ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్లే విషయం పరిశీలిస్తారా? లేక ఇక ఎప్పటికీ ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: (ఆవేదనగా) కాంగ్రెస్ పార్టీ నా విషయంలో ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలన్నది నా అభిమతం కాదు. వారిని దేవుడే చూసుకోవాలి. నేను రోజూ బైబిల్ చదువుతాను. నేను దేవుడిని ప్రార్థిస్తాను. దేవుడే వారికి శిక్ష వేస్తాడు. సర్దేశాయ్: అంటే ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: నాకు సంబంధించినంత వరకూ నాపై చేసిన దానికి ఎప్పుడో క్షమించేశాను. ఎందుకంటే క్షమిస్తే శాంతి వస్తుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా నా రాష్ట్రంపైనా, నా ప్రజలపైనా మాత్రమే ఉంది. నా వ్యక్తిగత అంశాలు దేనికీ అడ్డు కారాదు. ఇవాళ నా ఆలోచన అంతా నా ప్రజల గురించే. నేను ఆలోచించాల్సిందల్లా నా రాష్ట్రానికి ఎలా మంచి జరుగుతుందనే. నేనిప్పుడు ఏపీ ప్రజల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. వారికి నేను బాధ్యుడిగా ఉన్నాను. నాపై వారు పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విషయాలను తీసుకురావడం మంచిది కాదు. సర్దేశాయ్: ఒకవేళ ఇవాళ సోనియాగాంధీ కనుక మీ వద్దకు వచ్చి... ‘జగన్ కమాన్.. మళ్లీ మన ఇంటికి వచ్చేయ్. మీ తండ్రి మా కాంగ్రెస్ వారే’ అని ఆహ్వానిస్తే స్పందిస్తారా? లేక ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: మీరే చెప్పారు కాంగ్రెస్‌కు అత్యల్పంగా ఓట్లు వచ్చాయని. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? వారితో నాకు అవసరం ఏమిటి? సర్దేశాయ్: మీకు వాళ్ల అవసరం లేదు. కానీ, వాళ్లకు మీ అవసరం ఉంది. జగన్: వాళ్లకు నా అవసరం ఉందంటే అది వారి సమస్య. -
ఉప్పులేటి కల్పనకు అచ్చిరాని టీడీపీ..
సాక్షి, విజయవాడ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో పార్టీ ఫిరాయించిన వారిని, వారి వారసులను కూడా ప్రజలు తిరస్కరించారు. ఐదేళ్లు వైఎస్సార్ సీపీలోనే ఉండి, తరువాత ఎన్నికల బరిలోకి దిగిన వారికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అచ్చిరాని టీడీపీ ఉప్పులేటి కల్పన 2009లో పామర్రు నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే రెండేళ్లు గడిచిన తరువాత టీడీపీలోకి వెళ్లిపోయారు. తిరిగి 2019లో టీడీపీ తరఫున తిరిగి పామర్రు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాగా రాజకీయాల్లోకి నూతనంగా అడుగుపెట్టిన కైలే అనిల్ కుమార్ చేతిలో 30,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ కల్పనకు అచ్చిరాలేదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయ పడుతున్నాయి. ఖాతూన్‌కు తప్పని ఓటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రాజకీయ జీవితం ముగిసిపోతున్న దశలో 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. అయితే ఏడాది దాటిన తరువాత ఆయన టీడీపీలోకి చేరారు. ఎన్నికల్లో ఆయనకు బదులుగా ఆయన కుమార్తె ఖాతూన్‌కు చంద్రబాబు నాయుడు సీటు కేటాయించారు. నియోజకవర్గ ప్రజలకు ఖాతూన్ కంటే జలీల్ఖాన్ను చూసి ఓటేయాలని కోరారు. అయితే ఖాతూన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో 7,671 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవంగా ఖాతూన్ ఓడిపోయిందనే దాని కంటే జలీల్‌ఖానే పరాజయం చెందారని నియోజకవర్గంలోనూ, టీడీపీలోనూ వినిపిస్తోంది. జనసేనలోకి వెళ్లి దెబ్బతిన్నారు... వైఎస్సార్ సీపీ నాయకుడు భాస్కరరావు భార్య రేవతి నూజివీడు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఆయన మేకా ప్రతాప్ అప్పారావుకు కుడిభజంగా ఉండేవారు. అటువంటి భాస్కరరావు వైఎస్సార్ సీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు కేవలం 5,464 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో జనసేన తుడిచిపెట్టుకుపోయింది. భాస్కరరావు స్వయంకృతాపరాధమే ఆయన కుటుంబ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడిందని నియోజకవర్గంలో వినపడుతోంది. -
‘ఆది’ నుంచి పార్టీ అంతం వరకూ...
సాక్షి ప్రతినిధి కడప : టీడీపీ నేలవిడిచి సాము చేసింది. ప్రజా శ్రేయస్సును విస్మరించి పాలకపక్షం స్వార్ధానికి అగ్రాసనమేసింది. పోల్ మేనేజ్మెంట్ నేర్పుంటే గెలుపొందుతామనే ధీమాతో వ్యవహరించింది. ఇదే? దిశగా టీడీపీ అధినేత పావులు కదిపారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆదినారాయణరెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబు అంచనాలకు తగ్గట్లుగా ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదినారాయణ వ్యూహం పన్నారు. జిల్లాలోని 831 మంది సభ్యులున్న ఎన్నికల్లో సామ దాన దండోపాయాలను ప్రదర్శించారు. ఫలితంగా ఆ ఫలితాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ప్రత్యక్షంగా పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడి, దాదాపు రూ.100కోట్లు పైగా ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుంది. అప్పట్లో 38ఏళ్లు రాజకీయ చరిత్రను 38ఓట్లతో కూల్చామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విర్రవీగేవారు. టీడీపీ నేతలు ‘వాపు చూసి బలుపు’అని భ్రమించారు. ఆపై నిస్సిగ్గుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన్ప్పటికీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. అమాత్య పదవి రాగానే అంతా తానై టీడీపీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు పార్టీని నాశనం చేసిందని ఆ పార్టీ సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆది తీరుకు తీర్పు... పులివెందుల వేదికగా వైఎస్ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని ఆదినారాయణ రెడ్డి భావించారు. అధికారానికి ఆయనలోని అహంకారం జత కలిసింది. అప్పటినుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2017 జనవరి 12న సింహాద్రిపురం మండలం పైడిపాళెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సాక్షిగా వైఎస్ కుటుంబసభ్యుల్ని చెప్పుతో కొట్టాలని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలకు యావత్తు ప్రజానీకం విస్తుపోయారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎంపికై ఆ పార్టీ పదవి అనుభవిస్తూ ఆదిరించిన కుటుంబాన్ని దూషించడాన్ని జిల్లా వాసులు తట్టుకోలేకపోయారు. కలత చెందారు. తర్వాత కూడా ఆది మరింతగా రెచ్చిపోయారు. తాను మాత్రమే వైఎస్ కుటుంబానికి దీటుగా నిలవగలనే స్థాయిలో ప్రతిసందర్భంలోనూ విపరీత వ్యాఖ్యానాలు చే?సేవారు. సమయం కోసం జనం నిరీక్షించారు. తాజా ఎన్నికల్లో ప్రజలు తీర్పుతో బదులిచ్చారు. ఆదితో టీడీపీ అభ్యర్థులందరినీ దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాసులరెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో 1,90,323 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి స్వయంగా పోటీచేసి అవినాష్‌రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. జమ్మలమడుగులోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి 51,641 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనిని బట్టి ఆది పట్ల ప్రజలు ఏ స్థాయిలో కసితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లుగా ప్రజలు వైఎస్ కుటుంబ సభ్యుల్ని కాకుండా దేవగుడి కుటుంబసభ్యుల్ని ఓట్ల ద్వారా తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టారని వారు విశ్లేషిస్తున్నారు. ఆదికి ఆరు గురు సోదరులు, ఇరువురు రాజకీయ వారసులు, బావ.. మొత్తం తొమ్మిది మంది ఒక్కో ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరించి రాజకీయాలు చేశారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లే 9మందికి తొమ్మిది చెప్పులు, వీరినే నమ్ముకొని రాజకీయాలు చేసిన రామసుబ్బారెడ్డికి అరచెప్పు గుర్తుంచుకునేలా ప్రజలు తీర్పు చెప్పారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కడపయాసలో చెప్పాలంటే టీడీపీ దిబ్బలమీద కోడిని తీసుకువచ్చి 2014లో పోటీచేయిస్తే రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. రాజకీయాల్లో తనకే చతురత ఉందని, వరుసగా మూడుసార్లు తాను కాబట్టే జమ్మలమడుగులో గెలిచానని భావించే ఆదినారాయణరెడ్డికి ఈసారి ఎంపీ ఎన్నికల్లో 3.80లక్షల ఓట్ల తేడా చిత్తుగా ఓడిపోయారు. దీనికి కారణం ఆయన వ్యవహారశైలేనని అభిప్రాయం పార్టీలో ఉంది. మదనపడుతున్న పీఆర్ వర్గీయులు... తొలినాళ్ల నుంచి టీడీపీని నమ్ముకొని రాజకీయాలు చేసిన కుటుంబాన్ని కాదనీ, వైరిపక్ష నేతను అధినేత చంద్రబాబు దరికి చేర్చుకున్నప్పుడే ధిక్కరించాల్సిందని సీనియర్లు ఇప్పుడు మదనపడుతున్నారు. ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎమ్మెల్సీ పదవీత్యాగం చేయాలని షరతు పెట్టినప్పుడైనా ధిక్కరించి, పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే మర్యాద దక్కేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు మదనపడుతోన్నారు. ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పీఆర్ కుటుంబసభ్యులు ప్రచారం చేయడంతోనే తమ కొంపమునిగిందంటున్నారు. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగులో అపారమైన అభిమానులున్నారు. వైఎస్ కుటుంబాన్ని ఆదినారాయణరెడ్డి టార్గెట్ చేస్తూ దూషించిన ఫలితం తమపై పడిందని వారు చెబుతున్నారు. జిల్లాలో టీడీపీ భారీ ఓటమికి ఆది ప్రధాన కారకుడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పులివెందుల.. రికార్డుల గర్జన
సాక్షి, కడప: పులివెందుల నియోజకవర్గం మరో రికార్డు నమోదు చేసుకోనుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నియోజకవర్గంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మూడో పర్యాయం ముఖ్యమంత్రి హోదా దక్కుతోంది. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. 2009లో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది కాలానికే ఆయన దురదృష్టవశాత్తూ అశువులు బాశారు. పదేళ్ల తర్వాత జరిగిన తాజా ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి సీటును అధిరోహించనున్నారు. ఈనెల 30న ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా రాజధానిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తండ్రీ తనయులు ముఖ్యమంత్రి కావడం దేశ చరిత్రలోనే అరుదు. నిన్నటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా మరికొన్ని న్ని రికార్డులను నమోదు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పులివెందుల ప్రజలు అతి ఎక్కువ మెజార్టీ( 90,110 ఓట్లు) కట్టాబెట్టారు. అదే అభిమానాన్ని కడప పార్లమెంటులోనూ ఓటర్లు చూపించారు. వైఎస్ అవినాష్‌రెడ్డికి 3,80,976 ఓట్లు ఆధికత్యను ఇచ్చారు. రాష్ట్రంలో ఎంపీల మెజార్టీలలో ఆయనకు వచ్చిన మెజార్టే అధికం. వైఎస్ఆర్ కుటుంబం పట్ల జిల్లా ప్రజానీకం చూపిన అత్యంత ఆదరణకు నిదర్శనమిది. ఈరెండు రికార్డులు కూడా వైఎస్ఆర్ కుటుంబసభ్యులకే దక్కాయి. 10ఎమ్మెల్యే సీట్లు, 2పార్లమెంటు స్థానాలను వైఎస్సార్సీపీకి అప్పగించి జిల్లా ప్రజలు అపార అభిమానాన్ని ప్రదర్శించారు. -
వైఎస్ జగన్‌తో అద్భుతమైన సమావేశం
-
బొండా, బోడే, కొల్లు తొలిసారితో సరి..
సాక్షి, విజయవాడ : శాసన సభ్యులుగా ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని జనానికి చేరువు కాకుండా రూ.కోట్ల సంపాదనపై దృష్టి పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరించారు. మంత్రులతో పాటు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రజలు ఏ మాత్రం దయ చూపలేదు. అందర్ని ఓడించి ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని చూపించారు. పదవి అలంకారం కాదు.. బాధ్యతల సమాహారం అని భావించాల్సిన వారు అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. దౌర్జన్యం.. దోపిడీకి కొమ్ము కాయడంతో ప్రజలు ఎన్నికల సమరంలో ఓటు అనే ఆయుధంతో కుళ్లబొడిచారు. ‘మీ ప్రజా సేవ చాలులే’ అని ఓటుతో చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఘోర పరాజయానికి స్వయంకృతమే తొలి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన అవకాశాన్ని.. ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమవ్వడం వల్లే ఫలితాలు టీడీపీ అభ్యర్థులకు చేదు నిజాన్ని తెలియజెప్పాయి. స్వయంకృతాపరాధం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కొల్లు రవీంద్రకు తొలిసారి ఎన్నిక కాగానే మంత్రి పదవి వరించింది. అయినా ఆయన రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. బొండా ఉమామహేశ్వరరావు ఐదేళ్లలో నియోజకవర్గాన్ని తన సొంత జాగీరుగా భావించి పెత్తనం సాగించారు. స్వాతంత్య్ర సమరయోధుల భూములు కబ్జా, ఒక మహిళకు చెందిన ఇంటిని కబ్జా చేశారు. ఓ కుటుంబానికి చెందిన చిన్నారి మరణానికి కారణమయ్యారు. తన నోటి దురుసుకు కార్పొరేటర్లు కూడా ఆయన్ను చీదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి ప్రచారం చేసినా ఆయన విజయం సాధించలేకపోయారు. చివరకు 25 ఓట్లు తేడాతో ఓడిపోయారు. బోడే ప్రసాద్ కూడా తన పదవీ కాలంలో ఇసుక దందాలు చేయడం, బిల్డర్ల వద్ద ముక్కుపిండి దందాలు చేశారు. దీంతో ఈసారి ప్రజలు ఆయన్ను పదవికి దూరం చేసి కె.పార్థసారథికి పట్టం కట్టారు. అవినీతే కొంప ముంచింది.. దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, జలీల్‌ఖాన్, వల్లభనేని వంశీమోహన్, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. నీరు–చెట్టు పథకం కింద రూ.కోట్లు కొల్లగొట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై కంటే ఆ పనుల్లో వచ్చే వాటాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఐదేళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే కనీసం రూ.100 కోట్లకుపైగా సంపాదించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మంత్రి ఉమా అయితే జలవనరుల ప్రాజెక్టుల నుంచి నీరు–చెట్టు పథకం వరకు ఎక్కడ అవకాశం వచ్చినా అడ్డంగా దోచేశారు. నియోజకవర్గానికి ఆయన చెప్పుకోదగిన పనులు ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఆయనకు షాక్ ఇచ్చారు. కొల్లు రవీంద్ర మంత్రిగా చెప్పుకోదగిన ప్రతిభ కనబరచలేదు. కేవలం మంత్రిగానే కొనసాగారు తప్ప నియోజకవర్గానికి కానీ, జిల్లాకు గానీ ఆయన సాధించింది ఏమీ లేదు. దీంతో ఆయన్ను మచిలీపట్నం ప్రజలు తిరస్కరించారు. అవనిగడ్డ నుంచి డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం, రైతులకు సాగునీరు ఇప్పించలేకపోవడంతో ఆయనకు ఓటర్లు బాయ్.. బాయ్ చెప్పారు. మహిళా అభ్యర్థులకు నో చాన్స్ ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తంగిరాల సౌమ్య (నందిగామ), ఉప్పులేటి కల్పన (పామర్రు), షాబానా ఖాతూన్ (విజయవాడ పశ్చిమ) ఎన్నికల బరిలో దిగారు. ఇందులో తంగిరాల సౌమ్య, ఉప్పులేటి కల్పన ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వీరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఖాతూన్ తండ్రి జలీల్‌ఖాన్ పార్టీ ఫిరాయించడం, వక్ఫ్ ఆస్తులపై కన్నేయడంతో ఆమెను ప్రజలు పదవికి దూరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ మహిళా అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో చుక్కెదురైంది. -
ఓటమిపై స్పందించిన నారా లోకేశ్!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయంపై చంద్రబాబు నాయుడి పుత్రరత్నం, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆదివారం ఆయన వరుస ట్వీట్లతో ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువవ్వాలని పిలుపునిచ్చారు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని, అందరికి పార్టీ అండగా ఉందని తెలిపారు. ‘ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని.’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవని, వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు కానీ కార్యకర్తలతో తనకు ఉన్న అనుబంధాన్ని మారదన్నారు. మంగళగిరి నియోజకవర్గం తన ఇల్లు అని, అక్కడి ప్రజలంతా నా కుటుంబమని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదని, గడప గడపకు వెళ్లానని, గెలిచినా ఓడినా వారితోనే ఉంటానని స్పష్టం చేశారు. సీఎం కుమారుడు, మంత్రిగా నారా లోకేశ్ మంగళగిరిలో ఓడి ఢీలాపడ్డారు. ఆయనపై వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మనకి పార్టీ అండగా ఉంది. pic.twitter.com/xdeNS8ahkz — Lokesh Nara (@naralokesh) May 26, 2019 -
ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూనే ఉంటా
-
మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆదివారం ఆయన న్యూఢిల్లీలో ఏపీ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని పరిస్థితుల్ని ప్రధానికి వివరించామన్నారు. బాబు పాలనలో రూ.2లక్షల 57 వేలకోట్ల అప్పులు రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 2 లక్షల 57వేల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని జగన్ తెలిపారు. అప్పులపై ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. హోదా గురించి అడుగుతూ ఉంటా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇచ్చేవరకూ ప్రధానిని తాము అడుగుతూనే ఉంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు చాలావరకూ అమలు చేయాల్సి ఉందన్నారు. ఒకవేళ బీజేపీకి 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే...హోదాపై సంతకం పెట్టించుకుని మద్దతు ఇచ్చి ఉండేవాళ్లమన్నారు. అందుకే ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటామన్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మద్యపాన నిషేధంపై స్పష్టంగా చెప్పామని అన్నారు. మద్యపాన నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాకే 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడుగుతామన్నారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంధం ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావిస్తామని, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలయ్యేలా చూస్తామని జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టంగట్టారని, దాన్ని సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తామన్నారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాను. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాల కోసం భేటీ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు నిలుస్తామన్నారని తెలిపారు. వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం ఇవాళ్ట నుంచి ఆరు నెలల్లోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తాం. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత శాఖలవారీగా సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్రంలో అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తాం. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామన్నారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉందని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని భూముల్లో అతి పెద్ద కుంభకోణం అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు. ఫలానా చోట రాజధాని వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసు. ప్రకటనకు ముందు రాజధాని వేరేచోట వస్తుందని ప్రచారం చేసి ప్రస్తుత రాజధాని ప్రాంతంలో బినామీలతో చంద్రబాబు తక్కువ ధరకు భూములు కొనిపించారు. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు. హెరిటేజ్ కంపెనీ సైతం 14 ఎకరాలు భూమి కొనుగోలు చేసింది. ల్యాండ్ పూలింగ్‌లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారు. ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డాడరు. ఇదంతా మామూలు స్కామ్ కాదు. సంచలనాత్మకమైన కుంభకోణం. వ్యక్తిగతంగా చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ నెల 30న తాను మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ తెలిపారు. డే వన్ నుంచి ఏం చేయబోతామనేది ప్రమాణస్వీకారం రోజు తెలియచేస్తామని అన్నారు. యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి పోలవరం ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ చేసి గతంలో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే అలాగే చేస్తాం. సత్వరమే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నాపై కేసులు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. అప్పట్లో ఏ మంత్రికిగాని, అధికారులకు ఫోన్ చేయలేదు. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లోనే లేను. బెంగళూరులో ఉన్నాను. అమ్మానాన్నలను చూసేందుకు మాత్రమే హైదరాబాద్ వచ్చేవాడిని. నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. నాన్న చనిపోయాక కాంగ్రెస్‌ను వ్యతిరేకించాకే నాపై టీడీపీ ప్రోద్భలంతో కేసులు పెట్టారని అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూ ఉంటా -
వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చా: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన వైఎస్ జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను.’ అని పేర్కొన్నారు. ఇక ఆ ట్వీట్ తెలుగు, ఇంగ్లీష్ రెండు బాషల్లో చేయడం విశేషం. ఇక ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న వైఎస్ జగన్ నేడు (ఆదివారం) ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన విషయం తెలిసిందే. విభజన హామీలను నెరవేర్చాలని, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రానికి సహాయం చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా మోదీని కోరారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రం అందకారంలో ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ప్రధానికి తెలియజేశారు. ఈ భేటీ సందర్భంగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 30న విజయవాడలో జరగనున్న తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. వైఎస్ జగన్‌తో అద్భుతమైన సమావేశం Had an excellent meeting with Andhra Pradesh’s CM designate @ysjagan. We had a fruitful interaction on several issues pertaining to AP’s development. Assured him all possible support from the Centre during his term. pic.twitter.com/u7bwPGI4t6 — Narendra Modi (@narendramodi) May 26, 2019 -
క్రాస్ ఓటింగ్‌తో గట్టెక్కారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ ఎంపీ అభ్యర్థులందరూ కొట్టుకుపోయినా ముగ్గురు మాత్రం తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. ఇందుకు ప్రధాన కారణం క్రాస్ ఓటింగేనని పోలింగ్ సరళిని బట్టి అర్ధమవుతోంది. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు ఎంపీ ఫలితాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. 2014 ఎన్నికలలో రామ్మోహన్నాయుడు 1,27,692 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే క్రాస్ ఓటింగ్ కారణంగా రామ్మోహన్ గట్టెక్కారు. - ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బెందాళం అశోక్‌కు 79,405 ఓట్లు వస్తే రామ్మోహన్‌కు 82,640 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్‌కు 71,931 ఓట్లు వస్తే ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు కేవలం 68,570 ఓట్లు వచ్చాయి. ఈ ప్రకారం 3,361 ఓట్లు క్రాసింగ్ జరిగింది. - పలాసలో గెలుపొందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు 75,357 ఓట్లు రాగా ఎంపీ అభ్యర్థి దువ్వాడకు కేవలం 65,939 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. 9,418 ఓట్లు తగ్గిపోయాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు 59,873 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 68,813 ఓట్లు వచ్చాయి. - రామ్మోహన్, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరికీ సొంత ప్రాంతమైన టెక్కలి నియోజకవర్గంలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగినా స్వల్పమే. - పాతపట్నం నియోజకవర్గంలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి 75,669 ఓట్లు రాగా, ఇక్కడ దువ్వాడకు 70,698 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణకు 60,975 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 64,656 ఓట్లు వచ్చాయి. నరసన్నపేటలో గెలుపొందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌కు 85,622 ఓట్లు రాగా దువ్వాడకు 80,855 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 66,597 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 72,890 ఓట్లు వచ్చాయి. - శ్రీకాకుళం నియోజకవర్గంలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు 82,388 ఓట్లు రాగా దువ్వాడకు 75,253 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి 77,575 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 84,631 ఓట్లు వచ్చాయి. ఆమదాలవలస నియోజకవర్గంలో గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంకు 76,801 ఓట్లు రాగా, దువ్వాడకు 74,781 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌కు 63,274 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 62,722 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో రామ్మోహన్నాయుడు గట్టెక్కారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు పార్లమెంట్ విషయానికొస్తే.. ఇక్కడి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా క్రాస్ ఓటింగ్ కారణంతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ గుంటూరు వెస్ట్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరు చోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చింది. మోదుగులకు మాత్రం ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. సుమారు 55 వేల ఓట్ల మేర క్రాస్ ఓటింగ్ జరిగింది. మరో విచిత్ర విషయం ఏమిటంటే.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో సుమారు 10వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల పట్టుబట్టినప్పటికీ అధికారులు అంగీకరించలేదు. విజయవాడలోనూ ఇంతే.. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామతో పాటు విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కంటే టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అటొక ఓటు.. ఇటొక ఓటు వేసిన ఫలితంగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్ ఓటమి పాలయ్యారు. - విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు మొత్తం 1,21,460 ఓట్లు రాగా.. కేశినేనికి మాత్రం 1,43,307 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులతో పోలిస్తే కేశినేని నానికి 21,847 ఓట్లు అదనంగా లభించాయి. - ఇక జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోనూ క్రాస్ ఓటింగ్ ద్వారా కేశినేని లబ్ధిపొందారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు 3,40,369 ఓట్లు రాగా, కేశినేని నానికి 3,48,652 ఓట్లు లభించాయి. అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థికి 8,283 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇదే నాలుగు నియోజకవర్గాల పరిధిలోని వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థులకు మొత్తం 3,79,516 ఓట్లు లభించగా, ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్‌కు 3,64,744 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులతో పోలిస్తే పొట్లూరికి 14,772 ఓట్లు తగ్గాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందనడానికి ఇవే తార్కాణాలు. -
వైఎస్ జగన్ దంపతులకు కేసీఆర్ ఘన స్వాగతం
-
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు
-
గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్
-
గురువారం మే 30.. మధ్యాహ్నం 12.23..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు రాజభవన్ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్ రాజభవన్లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. గవర్నర్ ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా వైఎస్ జగన్ బృందం...గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. మరోవైపు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార వేదికను అధికారులు పరిశీలించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గౌతమ్ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు, జీఏడీ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ రామారావు తదితరులు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్టేడియంతో పాటు నగరంలోని వివిధ కూడళ్లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. -
గవర్నర్‌తో వైఎస్ జగన్ సమావేశం భేటీ
-
వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
-
వైఎస్ జగన్ దంపతులకు కేసీఆర్ సాదర స్వాగతం
-
రాయపాటికి ఘోర పరాభవం
సాక్షి, గుంటూరు: రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరుగాంచిన రాయపాటి సాంబశివరావు...వైఎస్సార్ సీపీ ఫ్యాను గాలికి కొట్టుకుపోయారు. జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన ఆయన ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన విషయం విదితమే. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూస్తే ఎంతటి సీనియర్ నాయకులైన సరే... మట్టి కరవక తప్పలేదు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టీడీపీకి నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం మంచి పట్టున్న ప్రాంతం. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా యువ విద్యావేత్త లావు శ్రీకృష్ణదేవరాయులు మొట్టమొదటి సారిగా పోటీ చేసి 1.53 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. జిల్లాలో అతి చిన్న వయస్సులో ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఐదు సార్లు ఎంపీగా గెలిచిన రాయపాటిపై విజయం రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా మంచి పేరుంది. ఆయన జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసిన విజయం ఖాయం అంటూ జిల్లావాసులే చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అటువంటి రాయపాటికి ఓ యువకుని చేతిలో ఓటమి పరాభవం తప్పలేదు. జిల్లాలో 1982 నుంచి జిల్లాలో రాజ్యసభకు, లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ ఎంపీగా చలామణి అయ్యారు. అటువంటి నాయకుడిపై 37 ఏళ్ల యువ విద్యావేత్త లావు శ్రీకృష్ణదేవరాయులు అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, మట్టి కరిపించారు. వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ నరసరావుపేట ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావుపేట ఎంపీ అసెంబ్లీ స్థానాలైన నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్ధి కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో పాటు, ఎంపీ స్థానాన్ని సైతం లక్షన్నర మెజార్టీతో గెలుపొందడం గుంటూరు చరిత్రలో ఇదే తొలిసారి. పల్నాడులో వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం రాజకీయాలకు కొత్త ముఖమైన యువకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు.. రాజకీయాల్లో పండిపోయిన కురువృద్ధుడైన రాయపాటి సాంబశివరావును ఓడించడం, జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా సంచలనం కలిగించింది. ఇందిరాగాంధీ హయాం నుంచి రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఉన్న రాయపాటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోని లేని సమయంలో సైతం గుంటూరు పార్లమెంట్ ఎంపీగా గెలుపొంది ఉనికిని చాటుతూ వచ్చారు. కరుడు కట్టిన కాంగ్రెస్‌వాదిగా ఉన్న రాయపాటి రాష్ట్ర విభజన పరిస్థితుల్లో దానికి గుడ్ చెప్పి టీడీపీలో చేరి 2014లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా రాయపాటికే టీడీపీ ప్రభుత్వం ఎంపీ స్థానాన్ని కేటాయించింది. అయితే, టీడీపీపై వ్యతిరేకంగా ఉన్న పల్నాడు ప్రాంత వాసులు దానికి బుద్ధి చెప్పి వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబెట్టారు. యువ విద్యావేత్త లావు కృష్ణదేవరాయులుకు నరసరావుపేట ఎంపీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ కేటాయించడం.. 1.50లక్షల మెజార్టీతో గెలవడం లాంఛనప్రాయమైంది. లావు శ్రీకృష్ణదేవరాయులు గెలుపుతో రాయపాటి రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పడినట్లే అయిందనే పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
వైఎస్ జగన్ దంపతులకు కేసీఆర్ ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. గవర్నర్‌తో భేటీ తర్వాత నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు స్వాగతం పలికారు. సతీసమేతంగా వైఎస్ జగన్ ప్రగతి భవన్‌కు రాగా.. కేసీఆర్ పుష్పాగుచ్చాలిచ్చి.. జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు శాలువాతో సత్కరించారు. ఓ జ్ఞాపికను కూడా అందజేశారు. కేటీఆర్ జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా.. ఆయన సతీమణి శైలిమ వైఎస్ భారతీకి సంప్రదాయంగా బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్.. జగన్‌కు కుటుంబ సభ్యులు, మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలను పరిచయం చేశారు. ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకత గురించి కూడా చర్చించారు. వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు కేసీఆర్‌ను కలిశారు. కాగా మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సాఆర్ సీపీ 151, తెలుగుదేశం పార్టీ 23, జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలిచిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: జగన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. వైఎస్సార్ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ కూడా గవర్నర్‌ను కలిశారు. కాగా మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సాఆర్ సీపీ 151, తెలుగుదేశం పార్టీ 23, జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలిచిన విషయం తెలిసిందే. ఇక గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. -
వాళ్లకు మనకు తేడా ఏంటి : విజయసాయి రెడ్డి
సాక్షి, అమరావతి : ప్రజల దీవెనతో సాధించిన ఘన విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ్యత మరింత పెరిగిందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ట్వీటర్ వేదికగా ఆయన వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఐదేళ్ల నారాసుర పాలనలో వైఎస్సార్సీపీ సైనికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందులో నుంచి పుట్టిన కసిని జగనన్నను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించాలని సూచించారు. మాటకు మాట, ప్రతీకారాలు మనకు, వాళ్లకు తేడా లేకుండా చేస్తాయన్నారు. మరో ట్వీట్లో.. వైఎస్ జగన్ పాలనలో ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందని, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు భవిష్యత్తుపై పూర్తి భరోసా కల్పిస్తూ రైతన్నల కష్టాలకు కాలం చెల్లే రోజులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. నవరత్నాలతో ప్రతి పేదింటి గడప.. అభివృద్ధికి ఒక ప్రయోగశాలగా మారబోతోందన్నారు. ఇంక అంతకు ముందు వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి హృదయపూర్వక శుభాభినందనలు తెలియ జేస్తూ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపే శక్తిని జననేతకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాని తెలిపారు. -
హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన అనంతరం తొలిసారి హైదరాబాద్ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా వైఎస్ జగన్‌ను అభినందిస్తూ నగరంలో పలుచోట్ల భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. -
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార వేదిక ఖరారు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక ఖరారు అయింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏయే శాఖలు ఏర్పాట్లు చేయాలన్న దానిపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. పోలీస్, మున్సిపల్, ప్రొటోకాల్, సమాచార తదితర 15 శాఖల ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను పరిశీలిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ రామారావు మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లుపై సీఎస్ ఇవాళ మధ్యాహ్నం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ ఆర్పీ ఠాకూర్, జీఏడీ అధికారులు హాజరు అయ్యారు. లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ అయ్యనార్, విజయవాడ సిటీ కమిషనర్ ద్వారక తిరుమలరావు, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార విశ్వజిత్, అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ, ఏలూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర బాబు, కృష్ణాజిల్లా కలెకర్ట్ ఇంతియాజ్, కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఐఎస్‌డ్ల్యూ డీఐజీ రామకృష్ణ, ప్రకాశం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, స్పెషల్ సీఎస్ రమేష్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ నిరబ్ కుమార్ ప్రసాద్, మైనార్టీ సెక్రటరీ రాంగోపాల్, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేవీఎస్ ప్రసాద్, మున్సిసిపల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవన్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్, పొలిటికల్ సెక్రటరీ నాగులప్లి శ్రీకాంత్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అసెంబ్లీ సెక్రటరీ విజయరాజ్తో పాటు సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. -
అది తప్పు.. సెల్యూట్ నేనే చేశా: గోరంట్ల మాధవ్
సాక్షి, అమరావతి : పోలీస్ ఉన్నతాధికారులు తనకు సెల్యూట్ చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. తానే తన ఉన్నతాధికారులకు సెల్యూట్ చేశానన్నారు. శనివారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యతను ఉంచారు. మన దరిద్రం పోవాలంటే ప్రత్యేక హోదా రావాలని, ఎంపీలంతా ఏకతాటిపై ఉండి పోరాడాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టమెంటరీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. మిగతా పార్టీల ఎంపీలను కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు. నియోజకవర్గాలకు వెళ్లి ప్రజా సమస్యలను అధ్యయనం చేయమని ఆదేశించారు. మా ఎంపీలమంతా ప్రత్యేక హోదానే ఎజెండాగా ముందుకుసాగుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్.. సార్ నేనిక్కడ కూలీకి వెళ్లాను.. అలాంటి నన్ను ఎంపీనీ చేశారు అంటూ కన్నీటి పర్యంతమవుతూ వైఎస్ జగన్‌కు కృతజ్ఙతలు తెలుపుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంట్‌కు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది’ అని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. పోలీస్ శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తన పదవికి రాజీనామా చేసి హిందూపురం లోక్‌సభ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలిచిన ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు సెల్యూట్ చేశారని ఓ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఆ ఫొటోలో ఉన్నతాధికారులకు తానే మొదట సెల్యూట్ చేసినట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు. -
గవర్నర్‌తో భేటీకానున్న వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్..
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర సాయాన్ని వైఎస్ జగన్ కోరనున్నారు. కాగా రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే వైఎస్ జగన్‌కు నివేదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండాగా ప్రధానితో వైఎస్ జగన్ భేటీ అవుతున్నారు. కాగా వైఎస్ జగన్ ఈనెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఇలా.. ►రేపు ఉదయం 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టకు వెళ్తారు ►ఉదయం 7 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు ►ఉదయం 9.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు ►ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీతో భేటీ ►మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ భవన్ వెళ్తారు -
పవన్ కళ్యాణ్‌పై జాలేసింది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రక విజయం సాధించారని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని హీరో రాజశేఖర్ అన్నారు. తన భార్య జీవితతో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయంలోనూ మా పాత్ర ఉండటం ఆనందంగా ఉంది. జగన్ పాదయాత్రలో పాల్గొన్నప్పుడే విజయ సంకేతాలు అందాయి. జగన్ గెలుస్తాడని ముందే తెలుసు. జగన్‌కు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ‘మా’ ఎన్నికల్లో మద్దతిచ్చిన నాగబాబుకు మాకు ఎలాంటి విబేధాలు లేవు. ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయలేదు. పవన్ కళ్యాణ్‌పై జాలి వేసింది, ఒక్క చోటైనా గెలిస్తే బాగుండేద’ని రాజశేఖర్ అన్నారు. రోజా గెలవడం అదృష్టం: జీవిత వైఎస్ జగన్ గత పదేళ్లుగా ప్రజలతోనే ఉన్నారని, సామాన్యుడిలా పాదయాత్ర చేసి ప్రజలను కలిశారని జీవిత చెప్పారు. అంకితభావంతో కష్టపడిన జగన్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, వచ్చే పదేళ్లు ఆయనదేనని వ్యాఖ్యానించారు. తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నాగబాబుపై, తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల్లో నాగబాబు తమకు అండగా నిలబడ్డారని వెల్లడించారు. ‘ప్రజలు చాలా తెలివిగా కేంద్రంలో ఎన్డీఏను, రాష్ట్రంలో వైఎస్సార్సీపీని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ప్రత్యేక హోదా తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. రోజా గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె గెలవడం వైఎస్సార్సీపీ అదృష్టం. రోజాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నా’ని జీవిత అన్నారు. -
వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్ బయల్దేరతారు. సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అవుతారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం గవర్నర్‌కు శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అలాగే సాయంత్రం అయిదున్నరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అవుతారు. ఈ నెల 30న జరిగే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను వైఎస్ జగన్ ఆహ్వానించనున్నారు. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే. -
టీడీపీకి చావుదెబ్బ
సాక్షి ప్రతినిధి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో కింగ్‌మేకర్ కావాలని పావులు కదిపిన చంద్రబాబుకు, ఆయన సారథ్యంలోని టీడీపీకి ఈ ఎన్నికల్లో గట్టిదెబ్బతగిలిందని తమిళనాడులోని మీడియా కథనాలు ప్రసారం చేసింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ టీడీపీని చావుదెబ్బకొట్టిందని పేర్కొన్నాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఒక్క ఏపీలోనే అధికార పార్టీ అధికారాన్ని కోల్పోయింది అంటూ దినపత్రిక ‘దినమలర్’ కథనాన్ని ప్రచురించింది. ‘పాదయాత్ర నాయకుడు’ అంటూ వైఎస్ జగన్‌ను ప్రశంసించింది. జగన్ రాజకీయ జీవితంలో అనేక అడ్డంకులను అధిగమించారని పేర్కొంది. జగన్‌కు స్టాలిన్ శుభాకాంక్షలు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అభినందనలు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఐదోసారి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు స్టాలిన్ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
పవన్ నోరు అదుపులో పెట్టుకో..
కొండాపూర్(సంగారెడ్డి): వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి విషయంలో అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను హెచ్చరించారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు. జగన్మోహన్రెడ్డి చరిష్మా ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమన్నారు. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినా ఓటమి పాలైన పవన్ కళ్యాణ్, జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఎక్కడా మనో ధైర్యం కోల్పోకుండా 9 సంవత్సరాలు ప్రజల్లో ఉండి, ప్రజల కోసం నిరంతరం పని చేసిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. -
అందుకే నాది గోల్డెన్ లెగ్: ఎమ్మెల్యే రోజా
సాక్షి, అమరావతి: తిరుగులేని మెజారిటీతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్‌ను ప్రజలు ఎంత అభిమానిస్తున్నారనే దానికి తాజా ఎన్నికల ఫలితాలే తిరుగులేని నిదర్శనమన్నారు. వైఎస్సార్ఎల్పీ సమావేశానికి శనివారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై బాధ్యత కూడా చాలా పెరిగిందన్నారు. మొదటి సంవత్సరంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్ చెప్పారని.. ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా చెప్పలేదని గుర్తుచేశారు. తన తండ్రిలా రాష్ట్ర ప్రజలను ఆయన అభిమానించారని, ప్రజల కష్టాలు దూరం చేయాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇతర పార్టీల మద్దతు తీసుకోకుండా చంద్రబాబు పోటీ చేస్తే ఎలావుంటుందో ఈ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. ఆయన అనుభవం ఎంత శాతం ఉందో చంద్రబాబు వెనుకున్న ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తుందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. తన మీద ఐరన్ లెగ్ ముద్ర వేసి వైఎస్ జగన్ నుంచి తనను దూరం చేయడానికి టీడీపీ నాయకులు చాలా కుట్రలు చేశారని ఆరోపించారు. తిరుగులేని ఆధిక్యంతో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, తనది గోల్డెన్ లెగ్ అని టీడీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. -
కొత్త కొత్తగా ఉన్నది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి తొలిసారిగా 70 మంది ఎమ్మెల్యేలు అడుగు పెట్టనున్నారు. వీరిలో 67 మంది వైఎస్సార్సీపీ టిక్కెట్‌పై గెలుపొందగా, కేవలం ముగ్గురు టీడీపీ నుంచి కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. మొత్తం సభ్యుల్లో దాదాపు సగం మంది తొలిసారి నెగ్గినవారే కావడం గమనార్హం. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 52 ఎమ్మెల్యే స్థానాలుండగా, ఈ ప్రాంతం నుంచి 25 మంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 34 సీట్లకు గాను కొత్తగా 12 మంది గెలిచారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లకు గాను 13 మంది తొలిసారి గెలిచారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి 55 స్థానాలుండగా, 19 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. (చదవండి: ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు) అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతుండగా, సత్తెనపల్లి నుంచి విజయం సాధించిన అంబటి రాంబాబు 30 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. ఈయన తొలిసారిగా గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీశైలం నుంచి గెలుపొందిన శిల్పా చక్రపాణిరెడ్డి గతంలో ఎమ్మెల్సీగా కొనసాగారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్నారు. గూడూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ టిక్కెట్‌పై గెలుపొందిన వరప్రసాద్ గతంలో ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంత వెంకట్రామిరెడ్డి గతంలో అనంతపురం ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు అనంతపురం శాసనసభ స్థానం నుంచి గెలిచారు. (చదవండి: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ‘సిత్రాలు’) తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ జిల్లా జి. వెంకట సుబ్బయ్య (బద్వేల్), మూలె సుధీర్‌రెడ్డి (జమ్మలమడుగు) కర్నూలు జిల్లా బ్రిజేంద్రనాథ్‌రెడ్డి(ఆళ్లగడ్డ), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం), తొగురు ఆర్థర్(నందికొట్కూరు), హఫీజ్(కర్నూలు), శిల్పా రవిచంద్రారెడ్డి(నంద్యాల), శ్రీదేవి(పత్తికొండ), సుధాకర్‌బాబు(కోడుమూరు) అనంతపురం జిల్లా వెంకటరామిరెడ్డి(గుంతకల్), కేతిరెడ్డి పెద్దారెడ్డి(తాడిపత్రి), జొన్నలగడ్డ పద్మావతి(శింగనమల), వెంకట్రామిరెడ్డి(అనంతపురం), ఉషశ్రీచరణ్(కల్యాణదుర్గం), ప్రకాశ్‌రెడ్డి(రాప్తాడు), శంకర్‌నారాయణ(పెనుగొండ), శ్రీధర్‌రెడ్డి(పుట్టపర్తి), సిద్ధారెడ్డి(కదిరి) చిత్తూరు జిల్లా ద్వారకానాథ్(తంబళ్లపల్లి), నవాజ్ బాషా(మదనపల్లి), మధుసూదనరెడ్డి(శ్రీకాళహస్తి), కె.ఆదిమూలం(సత్యవేడు), శ్రీనివాసులు(చిత్తూరు), ఎంఎస్‌బాబు(పూతలపట్టు), వెంకటేశ్‌గౌడ్ (పలమనేరు) నెల్లూరు జిల్లా వరప్రసాద్(సూళ్లూరుపేట) ప్రకాశం జిల్లా ఎం.వేణుగోపాల్(దర్శి), సుధాకర్ బాబు(సంతనూతలపాడు), కేపీ నాగార్జునరెడ్డి(మార్కాపురం), బుర్రా మధుసూదన్ (కనిగిరి) గుంటూరు జిల్లా నంబూరి శంకరరావు(పెదకూరపాడు), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ), కిలారి రోశయ్య(పొన్నూరు), మేరుగ నాగార్జున(వేమూరు), శివకుమార్(తెనాలి), విడదల రజని(చిలకలూరి పేట), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ), కాసు మహేష్ రెడ్డి (గురజాల) కృష్ణా జిల్లా దూలం నాగేశ్వరరావు(కైకలూరు), సింహాద్రి రమేష్(అవనిగడ్డ), వసంత కృష్ణప్రసాద్(మైలవరం), కైలే అనిల్(పామర్రు), ఎం.జగన్మోహన్రావు(నందిగామ) పశ్చిమ గోదావరి జిల్లా జి.శ్రీనివాస నాయుడు(నిడదవోలు), పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు), అబ్బయ్య చౌదరి(దెందులూరు), తలారి వెంకట్రావు(గోపాలపురం), వెంకట శివరామరాజు(ఉండి), వీఆర్ ఎలిషా(చింతలపూడి) తూర్పు గోదావరి జిల్లా పర్వత పూర్ణచంద్రప్రసాద్(పత్తిపాడు), సూర్యనారాయణరెడ్డి(అనపర్తి), వేణుగోపాల్(రామచంద్రపురం), జక్కంపూడి రాజా (రాజానగరం), జ్యోతుల చంటిబాబు(జగ్గంపేట), ధనలక్ష్మి(రంపచోడవరం), చిట్టిబాబు (పి.గన్నవరం) విశాఖ జిల్లా తిప్పల నాగిరెడ్డి (గాజువాక), చెట్టి ఫల్గుణ (అరకు), భాగ్యలక్ష్మి(పాడేరు), గుడివాడ అమరనాథ్(అనకాపల్లి), అన్నంరెడ్డి అదీప్ రాజు(పెందుర్తి), పెట్ల ఉమాశంకర్ గణేష్(నర్సీపట్నం) విజయనగరం జిల్లా జోగారావు(పార్వతీపురం), అప్పలనాయుడు(నెల్లిమర్ల), శ్రీనివాసరావు(శృంగవరపుకోట) శ్రీకాకుళం జిల్లా అప్పలరాజు (పలాస), రెడ్డి శాంతి (పాతపట్నం), కిరణ్‌కుమార్(ఎచ్చెర్ల) తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టే టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాళి గిరి(గుంటూరు పశ్చిమ), వెంకట శివరామరాజు(ఉండి), ఆదిరెడ్డి భవానీ(రాజమండ్రి సిటీ) -
భువనేశ్వరి దత్తత గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ!
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామం.. ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న గ్రామం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్య బసవతారకం పుట్టినిల్లు.. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అమ్మమ్మ ఊరు. పైగా ఈ గ్రామాన్ని భువనేశ్వరి దత్తత కూడా తీసుకున్నారు. అభివృద్ధి చేస్తానంటూ ఆమె భారీఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం అభ్యర్థి కన్నా వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌కు 295 ఓట్ల మెజార్టీని ఇక్కడి గ్రామస్తులు కట్టబెట్టారు. ఈ గ్రామంలో 1,474 ఓట్లు పోలవ్వగా అందులో వైఎస్సార్సీపీకి 843 ఓట్లు రాగా, టీడీపీకి 548 ఓట్లు మాత్రమే లభించాయి. దత్తత తీసుకున్నా చేసిందేమి లేదు భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి చేసిందేమి లేదు. గ్రామంలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలను తీర్చలేకపోయారు. నారా దేవాన్ష్ కాలనీ పేరిట గృహనిర్మాణాలు అంటూ హడావుడి చేసినప్పటికీ కేవలం కొందరికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్ని రోజులపాటు టీడీపీని ఆదరించిన గ్రామస్తులు విసుగుచెంది ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. -
ఆంధ్రప్రదేశ్‌కు ఇక శుభదినాలే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభదినాలు మొదలయ్యాయని ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గెలుపొందాలని, గెలిస్తే బట్టలు పెడతానని దేవుళ్లకు మొక్కుకున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జీవితంలో అన్ని కోరికలు తీరిపోయాయని చెప్పారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నది తన చివరి కోరిక అని, అది కూడా నెరవేరిందని పేర్కొన్నారు. తానెంత సంతోషంగా ఉన్నానో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంతే సంతోషంగా ఉన్నారని చెప్పారు. జగన్ గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవాలని, మంచిపేరు తెచ్చుకోవాలని పోసాని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఏపీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అన్ని మీడియాలు తనకు సహకరించాయన్నారు. జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు గురించి తాను ఎంత గట్టిగా మాట్లాడానో అంతే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాయని ప్రశంసించారు. పోసాని ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘ఎన్నికల్లో ప్రజల తీర్పును చూసి చంద్రబాబులో మార్పు వచ్చినట్లుంది. అందుకే జగన్మోహన్రెడ్డికి, ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. నిన్నటి వరకు జగన్‌ను వాడు వీడు, రౌడీ, గూండా, ఫ్యాక్షనిస్టు అని సంబోధించిన చంద్రబాబు నేడు మనసు మారిపోయి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు గతంలో జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి, మీడియాను అడ్డం పెట్టుకొని జైలుకు పంపించారు. జగన్ అవినీతిపరుడు కాదని ప్రజలు గ్రహించారు. ఆయనను కుట్రపూరితంగా, అన్యాయంగా జైలుకు పంపించారని గుర్తించారు. జగన్‌పై అడ్డదారిలో పెట్టించిన కేసులను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబును కోరుతున్నా. లోకేశ్‌కు ఓటేయడం న్యాయమా? ఎన్నికల తేదీ కూడా తెలియని వ్యక్తి నారా లోకేశ్‌ను ప్రజలు ఎలా గెలిపిస్తారు? ముఖ్యమంత్రుల కుమారులు ఎన్నికల్లో గెలవాలని ఎక్కడా లేదు. ముఖ్యమంత్రులు కూడా మట్టి కరిచారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి గతంలో సర్పంచిగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించారు. ఆయన తల్లి కూడా సర్పంచిగా పనిచేసి నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రామకృష్ణారెడ్డికి ప్రజలు ఓట్లు వేయడం న్యాయమా లేక ఎన్నికల తేదీ తెలియని నారా లోకేశ్‌కు వేయడం న్యాయమా? పవన్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు పవన్ కల్యాణ్ కొత్త పార్టీ స్థాపిస్తూనే చంద్రబాబు నాయుడు సీనియర్ అని ఆయనకే మద్దతు తెలిపితే పార్టీ ఇమేజ్‌ని ఏవిధంగా పెంచుతాడు? అధికారంలో ఉన్న నాయకులను పక్కనపెట్టి జగన్మోహన్రెడ్డిని తిట్టడం పవన్‌కు మాత్రమే సాధ్యపడింది. అందుకే పవన్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. పవన్‌ను ఒక సోదరుడిగా భావించి చెపుతున్నా.. కొడతాను, తంతాను అన్న పదాలను ఇకనైనా నీ డిక్షనరీలోంచి తీసెయ్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో ఫ్రంట్ అంటూ పొరపాటు చేశారు’’ అని పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. -
‘దేశం’లో అసమ్మతి!
నిరంకుశ నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలు, చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో పరాభవం భారంతో టీడీపీ అధినాయకత్వం పట్ల అసమ్మతి జ్వాలలు రాజుకుంటున్నాయి.కౌంటింగ్‌కు కొద్ది రోజుల ముందు వరకు కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షల పేరుతో హడావుడి చేసిన చంద్రబాబు అసమ్మతి భయంతోనే ఇప్పుడు ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.‘రా... కదలిరా...’ అంటూ దివంగత ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో స్పందించి టీడీపీకి మద్దతిచ్చిన వర్గాలు ఒక్కో ఎన్నికలో ఆ పార్టీకి దూరమవుతూ వచ్చాయి. సొంతమామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సారథ్యంలో టీడీపీ దయనీయ స్థితికి చేరుకుంటోంది.రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యపార్టీకీ ఎదురుకాని విధంగా తాజా ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలవడానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ సీనియర్ నేతలు, శ్రేణులు మండిపడుతున్నాయి. – సాక్షి, అమరావతి బీజేపీ హవాలో రెండుసార్లు గట్టెక్కిన బాబు టీడీపీ ఆవిర్భావం తరువాత 1983 నుంచి 2014 వరకు అసెంబ్లీకి ఎనిమిదిసార్లు ఎన్నికలు జరగగా ఐదుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ నాయకత్వంలో మూడుసార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ హయాంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలు కూడా లబ్ధి పొందాయి. 1994 ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో అత్యధిక స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అడ్డదారిలో ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు బాబు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2కే కిలో బియ్యం, రూ.50కే హార్స్పవర్ విద్యుత్తు లాంటి పథకాలకు చంద్రబాబు స్వస్తి పలికి ప్రజలపై పెనుభారం మోపారు. టీడీపీని ధనవంతులు, కాంట్రాక్టర్లకు మేలు చేసే పార్టీగా మార్చేశారు. ఈ ధోరణితో ఒకప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలన్నీ క్రమేపీ దూరమయ్యాయి. చంద్రబాబు నాయకత్వంలో 2019 వరకు ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీడీపీ 1999, 2014లో మాత్రమే విజయం సాధించింది. గెలిచిన రెండుసార్లు కూడా బీజేపీ హవాలో టీడీపీ గట్టెక్కడం గమనార్హం. అయితే గతంలో ఓట్ల శాతం, సీట్లతో పోలిస్తే చాలా తగ్గాయి. చంద్రబాబు సొంతంగా పార్టీని ఏనాడూ విజయపథంలో నడిపించలేకపోయారు. ఎన్టీఆర్ హయాంలో అత్యధికంగా 216 అసెంబ్లీ సీట్లు, 46.21 శాతం ఓట్లు సాధించిన టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో 23 సీట్ల స్థాయికి దిగజారిపోవడం, ఓట్ల శాతం క్షీణించడం పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందనేందుకు నిదర్శనం. వ్యతిరేకించిన కాంగ్రెస్‌తోనే చేతులు కలిపి.... కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించగా చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ అదే పార్టీతో పొత్తులు కుదుర్చుకోవడం సొంత శ్రేణులనే నివ్వెరపరిచింది. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేయించారు. తాను గెలిచే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చుకున్న చంద్రబాబుకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఈ పరిణామంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తెరవెనుక ఒప్పందాలు చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీతో అంటకాగారు. ఈ పరిణామాలు సొంత శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ వ్యతిరేకతను పెంచాయి. ఫలితంగా ఎన్నడూ లేని రీతిలో పరాజయాన్ని చవిచూసింది. 10 శాతానికిపైగా ఓట్ల వ్యత్యాసంతో వైఎస్సార్సీపీ విజయభేరీ.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 1.96 శాతం మాత్రమే కావడం గమనార్హం. అతి తక్కువ ఓట్ల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఐదేళ్లుగా చేసిన అరాచకాలు, అక్రమాలను భరించలేక రాష్ట్ర ప్రజలు తాజా ఎన్నికల్లో గట్టి గుణపాఠం నేర్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 అసెంబ్లీ సీట్లు రాగా టీడీపీ 23 సీట్లు, జనసేన 1 స్థానానికి పరిమితమయ్యాయి. వైఎస్సార్ సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా 10.7 శాతం ఉండడం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1,56,86,511 ఓట్లు (49.95 శాతం) రాగా, టీడీపీకి 1,23,03,620 ఓట్లు (39.18 శాతం) వచ్చాయి. దళితులపై దారుణమైన వ్యాఖ్యలు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ గాలికి వదిలేయడంతో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్ధుల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడమే కాకుండా ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు దారుణంగా అవమానించే వ్యాఖ్యలు చేయడంతో ఆ వర్గాలు టీడీపీకి దూరమయ్యాయి. విజయవాడ సహా పలుచోట్ల ప్రార్థనా మందిరాలను కూల్చడం, పుష్కరాలను ప్రచారం కోసం వాడుకుని అమాయకుల మృత్యువాతకు కారణం కావడంతో ప్రజలు ఓటు ద్వారా తమ తీర్పును వెల్లడించారు. చంద్రబాబు ఒంటెత్తు పోకడల వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని పార్టీలో సీనియర్ నేతలతో పాటు క్యాడర్ పేర్కొంటోంది. కాంగ్రెస్‌తో పొత్తును ప్రజలు సహించరని, తరిమి కొడతారని చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వారు బహిరంగంగానే చెప్పారు. పార్టీకి ఎలాంటి సేవలు చేయని నారాయణ, సుజనాచౌదరి లాంటి వారికి ప్రాధాన్యం కల్పించడం, కుటుంబరావు లాంటి షేర్ బ్రోకర్లకు ప్రభుత్వంలో చోటు కల్పించడం, గ్రామాల్లో జన్మభూమి కమిటీల అరాచకాలు తదితర అంశాలను జీర్ణించుకోలేని పార్టీ శ్రేణులు ఈసారి ఎన్నికల్లో టీడీపీకి దూరమయ్యాయి. తిరుగుబాటు భయం! ఈ ఎన్నికల్లో దాదాపుగా మంత్రులంతా పరాజయం పాలవడం, ముఖ్యమంత్రి తనయుడు ఘోరంగా ఓడిపోవడం, నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోవడం లాంటి పరిణామాలతో టీడీపీలో అసమ్మతి స్వరాలు ఊపందుకుంటున్నాయి. కౌంటింగ్‌కు ముందు చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలను ప్రారంభించినా కార్యకర్తలు, నేతల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్షలు నిర్వహించడానికి కూడా ఆయన ధైర్యం చేయడం లేదు. పార్టీలో తన పట్ల అసమ్మతి తీవ్రంగా ఉండడంతో ఈ తరుణంలో సమీక్షలు నిర్వహిస్తే తిరుగుబాటు తప్పదనే ఆందోళన ఆయనలో వ్యక్తమవుతోంది. ఏటా మే 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు ఈసారి మహానాడు నిర్వహించడం లేదని ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. -
బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పొరపాట్లు అభ్యర్థుల తలరాతలు మార్చేశాయి. ఈ పొరపాట్లు కొందరికి వరంగా మారగా, మరికొందరికి శాపంగా పరిణమించాయి. కొన్ని కీలక స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయి. ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్న పోస్టల్, సర్వీస్ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఓటమి అంచుల దాకా వెళ్లిన కొందరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి గట్టెక్కారు. ఫలితాలు తారుమారై గెలుపు అంచుల వరకు వచ్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో పోస్టల్, సర్వీస్ ఓట్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలో 3.05 లక్షల పోస్టల్ బ్యాలెట్లు, 60 వేల సర్వీస్ ఓట్లను అధికారులు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం–12 పూర్తి చేయడంలో తలెత్తిన పొరపాట్లతో వేలాది ఓట్లు చెల్లకుండా పోయాయి. కొన్నిచోట్ల నిబంధనల మేరకు వాటిని సంరక్షించకపోవడం వివాదాస్పదమైంది. పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు బ్యాలెట్ పేపర్ మీద వరుస నంబర్ నమోదు చేయకపోవడం, అదే నంబర్‌ను పోస్టల్ బ్యాలెట్‌ను పంపే కవర్ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓటమి బారి నుంచి బయటపడగా, గెలవాల్సిన వారు ఓటమి చెందారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో ఇరుపార్టీల మధ్య తీవ్రస్థాయి చర్చ తర్వాత ఎన్నికల నిబంధనల మేరకు చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ప్రకటించారు. దాదాపు 6,653 ఓట్ల తేడాతో రామ్మోహన్ నాయుడు గెలిచారు. ఆ స్థానంలో గెలుపు అంచుల దాకా వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. గుంటూరు స్థానంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కూడా ఇలాగే బయటపడ్డారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో భారీగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి. ఫలితంగా 4,205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై గెలిచారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాలేదు. భవిష్యత్తులో పోస్టల్ బ్యాలెట్లలో పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత నిబంధనలను పూర్తిగా మార్చేయడంతో పాటు ఈవీఎంలలోనే ఈ ఓట్లు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ఇతర నేతలు కోరారు. -
ఫలితాల ముందు ఖజానా ఖాళీ
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా మరోపక్క ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేశారు. ఫలితాలకు ముందు రోజైన బుధవారం, ఫలితాలు వెల్లడించిన గురువారం నాడు మొత్తం రూ.2,325 కోట్ల మేర బిల్లులను చెల్లించేశారు. ఫలితాల సమయంలో చంద్రబాబు చెప్పిన రంగాలకు ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించడంపై ఆర్థిక శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్‌లో రూ.15 వేల కోట్ల బిల్లులు చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో పడిపోయాయి. ఇప్పుడు రూ.15,000 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయంలో కూడా ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు చెప్పినట్లు తలూపుతూ నీరు–చెట్టుకు బిల్లులు చెల్లించడంపై నివ్వెరపోతున్నారు. ఇతర బిల్లులు పెండింగ్‌లో పెట్టి మరీ.. టీడీపీ నేతలు, కార్యకర్తల జేబులు నింపే నీరు–చెట్టు పథకం బిల్లులను కొత్త ప్రభుత్వం అనుమతించదనే భయంతోనే చంద్రబాబు హడావిడిగా చెల్లించాలని, ఒకపక్క ఫలితాలు వెలువడుతుండగా ఆర్థిక శాఖ కార్యదర్శులు దీన్ని ఆమోదించడం ఏమిటని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ప్రశ్నించారు. వ్యవసాయానికి చెందిన బిల్లులతో పాటు ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టి మరీ అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం ఏమిటని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాలను జూన్ 1వ తేదీన చెల్లించడానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన ఆర్థిక శాఖ కార్యదర్శులు ఖజానాను ఖాళీ చేసేశారని, బుధవారం రూ.700 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్‌కు కూడా వెళ్లి బిల్లులు చెల్లించారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వేతనాలకు నగదు నిల్వ ఏది? దిగిపోయే ముందు టీడీపీ సర్కారు ఈ నెలలో ఇక అప్పు చేయడానికి కూడా వెసులుబాటు లేకుండా ఫలితాలు వెల్లడికి ముందు ఓపెన్ మార్కెటింగ్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. వచ్చే నెలలో ఇక రూ.1,000 కోట్లు మాత్రమే ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేయడానికి వీలుంది. జూన్ 1వ తేదీన వేతనాలు చెల్లించాలంటే రూ.4,500 కోట్లు అవసరం. ఈ వేతనాలను ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా వేతనాల కోసం 20వతేదీ నుంచి ఎలాంటి బిల్లులు చెల్లించకుండా నగదు నిల్వ చేస్తారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇందుకు భిన్నంగా వ్యవహరించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫలితాల రోజు రూ.300 కోట్ల బిల్లుల చెల్లింపు సాధారణంగా ప్రాధాన్యతా విధానంలో సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు చెల్లించాల్సిన ఆర్థిక శాఖ ఎన్నికల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు చెప్పిన అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులను చెల్లించింది. ఫలితాల ముందు రోజు ఏకంగా రూ.2,025 కోట్ల బిల్లులను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెల్లించారు. ఇందులో అత్యధికంగా నీరు–చెట్టు బిల్లులేనని జిల్లా ట్రెజరీ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్కో జిల్లాకు రూ.20 కోట్లకు పైగా నీరు– చెట్టు బిల్లులను చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫలితాల రోజైన గురువారం కూడా రూ.300 కోట్ల బిల్లులను ఆర్థిక శాఖ చెల్లించేసింది. ఆర్థిక శాఖ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి మరీ చంద్రబాబు చెప్పిన రంగాలకు బిల్లులు చెల్లించడం గమనార్హం. -
టీడీపీలో నిశ్శబ్దం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో టీడీపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఓటమి భారాన్ని దిగమింగుకోలేక, ఎలా ముందుకెళ్లాలో తెలియక పార్టీ తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఊహకు అందని రీతిలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేని పలువురు పార్టీ నేతలు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. ఫలితాల గురించి మాట్లాడేందుకు సైతం ఎవరూ ఇష్టపడడంలేదు. ఈవీఎంలను మేనేజ్ చేశారంటూ కొందరు నేతలు ఓటమికి సాకులను అన్వేషిస్తున్నారు. ఇంత అవమానకర ఓటమికి కారణాలేమిటనే దానిపై ఓడిన మంత్రులు, అభ్యర్థులు, ముఖ్యులు తీవ్రంగా మథన పడుతున్నారు. టీడీపీ పట్ల ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందని గ్రహించలేదంటూ అంతర్గతంగా వాపోతున్నారు. క్యాడర్ డీలా.. ప్రధానంగా జన్మభూమి కమిటీల వల్ల తీవ్ర నష్టం జరిగిందనే వాదనపై టీడీపీ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. ఎక్కువ మంది మాత్రం వైఎస్ జగన్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాలనే భావన రాష్ట్ర మంతటా బలంగా నెలకొనడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని చర్చించుకుంటున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా మీడియా ముందుకు వచ్చే నాయకులు ఈసారి టీవీ చర్చలకు సైతం సుముఖత వ్యక్తం చేయడం లేదు. మొన్నటివరకూ గెలుస్తామంటూ తొడలు కొట్టి నోరు పారేసుకున్న నేతలు ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నారు. పార్టీ క్యాడర్లో అయితే తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. కళావిహీనంగా బాబు ఉండవల్లి నివాసం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ప్రస్తుతం కళావిహీనంగా మారింది. శుక్రవారం ఎలాంటి హడావిడి కనిపించలేదు. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను కలిసేందుకు రాకపోవడం గమనార్హం. నిత్యం చంద్రబాబు వెంట ఉండే కొద్దిమంది మినహా మిగిలిన ముఖ్యులెవరూ ఆ దరిదాపుల్లో కానరావడం లేదు. బాబు కోటరీలోని కొందరు పరస్పరం నిందించుకుంటున్నట్లు సమాచారం. హిందుపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఒక్కరే శుక్రవారం చంద్రబాబును కలిసి వెళ్లారు. చంద్రబాబు నివాసం ఉన్న దారి గుండా రైతులను వారి పంటపొలాలకు వెళ్లనివ్వకుండా గురువారం అడ్డుకున్న పోలీసులు శుక్రవారం ఎవరినీ అడ్డుకోలేదు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై మౌనం ప్రజా తీర్పు వెలువడిన అనంతరం టీడీపీలో శాసన సభాపక్ష సమావేశం గురించి కనీసం చర్చ కూడా జరగడం లేదంటే ఆ పార్టీ నాయకులు ఎంత నైరాశ్యంలో ఉన్నారో బోధపడుతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా గెలిచిన ఎమ్మెల్యేలను సమావేశపరచడం, శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడం ఏ పార్టీలోనైనా సాధారణంగా జరుగుతుంది. అయితే టీడీపీ శాసన సభాపక్ష సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఎవరూ పెదవి విప్పకపోవడం గమనార్హం. చంద్రబాబు దీనిపై ఇంకా ఏమీ మాట్లాడకపోవడంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. -
ఆంధ్రావనిలో జగన్నినాదం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు సగం (49.95 శాతం) ఓట్లు ‘ఫ్యాన్’ ఖాతాలో పడ్డాయి. ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా, చీకటి ఒప్పందాలతో పోటీ చేసిన టీడీపీ 39.18 శాతం ఓట్లకు పరిమితమైంది. అంటే.. టీడీపీతో పోల్చితే 10.77 శాతం అధికంగా ఓట్లు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 85 శాతానికిపైగా అంటే 151 శాసనసభ స్థానాలను.. 90 శాతానికిపైగా అంటే 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1962 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ.. సింగిల్(ఒక్కటి)గా పోటీ చేసిన ఏ పార్టీ ఇంతటి భారీ స్థాయిలో విజయం సాధించిన దాఖలాలు లేవు. 1994 ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టి టీడీపీ ఇదే తరహాలో ఓట్లు సాధించినా, అది ప్రస్తుతం వైఎస్సార్సీపీ సాధించిన విజయానికి సాటి రాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, టీఆర్ఎస్ పొత్తులతో బరిలోకి దిగినా ఈ స్థాయి విజయాన్ని సాధించలేకపోయాయని గుర్తు చేస్తున్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా ఈ ఎన్నికల్లో పోటీచేసిన వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించి రికార్డు సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును గురువారం పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1,56,86,511 ఓట్లను దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో 1,29,31,730 ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 27,54,581 ఓట్లను అదనంగా సాధించింది. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ గత ఎన్నికల్లో 1,34,95,305 ఓట్లు దక్కించుకోగా.. ఈ ఎన్నికల్లో 1,20,03,620 (39.18) శాతం ఓట్లకు పరిమితమైంది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో టీడీపీ 14,91,685 ఓట్లను కోల్పోయింది. అన్నింటా ఏకపక్షమే ఈ ఎన్నికల్లో్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా పోటీ చేసింది. టీడీపీ ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోకున్నా, పరోక్షంగా రాజకీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసింది. అయినా సరే.. అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. రాయలసీమలో 52 శాసనసభ స్థానాలకుగాను 49 స్థానాల్లో వైఎస్సార్సీసీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఉత్తరాంధ్రలో 34 శాసనసభ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ అభ్యర్థులు 28 స్థానాల్లో ఘన విజయం సాధిస్తే, టీడీపీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో అత్తెసరు మెజార్టీతో గెలిచారు. కోస్తాలో 89 శాసనసభ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 74 స్థానాల్లో ఘన విజయం సాధిస్తే.. టీడీపీ అభ్యర్థులు 14 స్థానాల్లో గెలిచారు. జనసేన కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. రాయలసీమలో ఎనిమిది లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో ఐదు లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధిస్తే.. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో సాంకేతిక సమస్యల వల్ల టీడీపీ అభ్యర్థి అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. కోస్తాలో 12 లోక్‌సభ స్థానాలకుగాను పదింటిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటే, టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. ఇందులో గుంటూరు లోక్‌సభ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో సాంకేతిక సమస్యల వల్ల ఐదు వేల ఓట్ల వ్యత్యాసంతో, విజయవాడ లోక్‌సభ స్థానంలో ఎనిమిది వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు గట్టెక్కారు. అంటే.. కేవలం పది వేల లోపు ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ మూడు లోక్‌సభ స్థానాలను కోల్పోయినట్లు వెల్లడవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభంజనంతో కూలిన కోటలు వైఎస్సార్సీపీ దెబ్బకు టీడీపీ కంచు కోటలు కుప్పకూలాయి. కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని శాసనభ, ఎంపీ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మిగతా 9 జిల్లాల్లో సింహభాగం శాసనసభ, లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. వైఎస్ జగన్ ప్రభంజనంలో ముగ్గురు మినహా బాబు మంత్రివర్గంలోని సభ్యులందరూ ఓడిపోయారు. లోకేష్ మంగళగిరిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. బొబ్బిలి, విజయనగరం, కురపాం రాజ వంశీకుల కోటలు కొట్టుకుపోయాయి. కోట్ల, జేసీ వంటి రాజకీయ కుటుంబాలు వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు నిలబడలేకపోయాయి. -
ఈ గెలుపులో మీడియా ఓటమి జాడలు
ఇది చంద్రబాబునాయు డిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం మాత్రమే కాదు; తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ సీపీ గెలుపు మాత్రమే కాదు; అంతకు మించి తెలుగు మీడియా పరాజయం! మే 23 సూర్యోదయం తర్వాత న్యూస్ చానల్స్ అ..ఆ.. ఉ.. ఊ.. అంటూ తమను తాము సవరించుకోవడం ప్రారంభించాయి. అదే పూటనుంచి పత్రికల వెబ్సైట్లు, మరుసటి రోజు పత్రికలు ఏ విషయాలైతే చెప్పడం ఇష్టం లేదో వాటినే చెప్పక తప్పలేదు కనుక ఇప్పుడు ఇలా సాగు తున్నాయి. ఇంతవరకు పత్రికలనూ, చానళ్లనూ ప్రధాన స్రవంతి మీడియా అనీ, సోషల్ మీడియాను ప్రత్యామ్నాయ మీడియా అనీ పరిగణించేవారం. మీడియా ఎప్పుడైతే ప్రజలకు దూరంగా నిలిచి, యజమానుల రాజకీయ అవసరాల చిలుకపలుకులు వల్లెవేయడం ప్రారంభించిందో.. అప్పటినుంచే సోషల్ మీడియా ప్రజలకూ, ఆలోచనాపరులకూ, కళాకారులకూ సాధనం అయింది. ఇందులో పనికి రాని విషయాలు బోలెడు ఉండవచ్చు కానీ ప్రధాన మీడియా ఇవ్వని, ప్రచురించని అంశాలకు సోషల్ మీడియా వాహకమయ్యింది. మీడియా ఆది నుంచి స్వచ్ఛంగా ఉందని ఎవరూ అనడం లేదు. యజమానుల ఆశలూ, రాజ కీయ అవసరాలూ ఎంతో కొంత తీరుస్తూ సాగడం కొత్త కాదు. అయితే 21వ శతాబ్దంలో తెలుగు మీడియా పూర్తిగా సంచలనంగా, పాక్షిక దృష్టితోనే సాగటం మొదలైంది. దీనికి 2003 చివరినుంచి మొదలైన తెలుగు న్యూస్ చానల్స్ మరింత ఆజ్యం పోశాయి. పత్రికలతో పోటీపడుతూ చానళ్లూ, చాన ళ్లకు మరింత పోటీనిస్తూ పత్రికలు సాగుతూ విమర్శ బదులు నిందలు, విశ్లేషణలకు బదులు మరిన్ని ఉదాహరణలు ఇస్తూ తెలుగువారి ఆలోచనకు, నిష్పా క్షిక దృష్టికి మంగళం పాడుతూ సర్క్యులేషన్లు, టీఆర్ పీలు పెంచుకున్నాయి. దీనికి విరుగుడుగా వైఎస్సార్ ఒక తెలుగు దినపత్రిక, ఒక వార్తా చానల్ ప్రారం భించక తప్పలేదు. అవరోధం ఏమిటో, దానికి సాధనం ఏమిటో గమనించి సిద్ధం చేశారు కనుకే జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మెజారిటీ తెలుగు మీడియా మీద అఖండ విజయం సాధించారు. అందుకే ఇది మొనగాడి విజయం! ఈ సమస్య రెండు దశాబ్దాలలో మరింత విస్తృ తంగా మారి మేధావులకూ సోకింది. అధికారం, ధనం ఉన్నవారు అవకాశ వాదులుగా మారిపోతున్న పుడు మేధస్సు ఉన్నవారు తామెందుకు గట్టున కూచోవడమని భావించారు. నిజానికి ఆ రెండు వర్గాలకు లేనిదీ, ఈ వర్గానికి ఉన్నదీ తెలివి. దాని ఆధారంగా వీరు తమ చిరునామా మార్చుకుని ఉండాల్సింది కాదు. కానీ పత్రికల్లో ఫొటోతోబాటూ వ్యాసమూ, ఫోన్ నంబరూ, చానళ్లలో విజువల్స్‌గా చెలామణి పెరిగిపోతున్నప్పుడు ప్రలోభాలదే పై చేయి అయింది. చానల్ బట్టి మాటా, పత్రిక బట్టి బాణి మారిపోతున్నాయి. యజమాని ఆలోచనా ధోరణి మారగానే మీడియాలో పనిచేసే నిపుణులు, తమ నైపుణ్యాలు అందించే మేధావులు ఆ రీతిలో స్పందించడం అలవాటయింది. మరోవైపు సోషల్ మీడియా సామా న్యులకూ, పత్రికల్లో చానళ్లలో అవ కాశం దొరకని వారికీ వేదికగా మారిపోయింది. ఈ కోణంలోనే ప్రధాన మీడియాకు చెమటలు పట్టించింది సోషల్ మీడియా. ఈ సందర్భంగా 1971 మార్చి 12న నార్ల వెంక టేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’లో ‘మేము, మా పరా జయం’ అనే సంపాదకీయం గురించి చెప్పుకోవాలి. వాదనా బలం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే..! ఇలా చెప్పు కోవడానికి కూడా సిగ్గుపడనక్కర లేదు. అప్పటి కాలం వేరు, విలువలు వేరు. ఇప్పుడు మీడియా ఏ ప్రాంతానికా ప్రాంతంలో, ఏ పూటకాపూట విభి న్నంగా విలక్షణంగా సాగుతోంది. తమిళనాడులో ‘దినతంతి’ అనే అగ్రశ్రేణి దినపత్రిక ఏ పార్టీ అధి కారంలోకి వస్తే ఆ పార్టీని బలపరుస్తుంది. దీనికి ఈ పత్రిక చెప్పే కారణం– ఎక్కువమంది ప్రజలు ఎన్ను కునే పార్టీ అధికారం పొందుతుంది కనుక, మేము బలపరుస్తాము అనే..! ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ, ఎన్నికయిన ప్రతినిధులు, అధికార వర్గాలతో సమానంగా ‘ఫోర్త్ ఎస్టేట్’ అనే గౌరవం, స్థాయి పొందిన మీడియా పలు రకాలుగా దిగజారడం ఒక పార్శ్వం కాగా, మీడియాలో ప్రవేశించిన వ్యక్తుల సంపద, అధికారం విశేషంగా పెరగడం దీని వెనుక ఉన్న ఇంకో పార్శ్వం. సగటు మనిషి అవకాశం వచ్చినప్పుడు తనలో గూడుకట్టుకుని ఉన్న భావాలకు పోలింగ్ బూత్ ద్వారా భాష్యం చెబుతారు. మీడియా యజమానులు మారతారా, తమ పొరపాట్లు గుర్తిస్తారా అనే విష యాలు ఇక్కడ అవసరం లేదు. అయితే మీడియా ద్వారా చిలుకపలుకులు వల్లించే మేధావులు మాత్రం గౌరవం కోల్పోక తప్పదు. కనుక వ్యక్తిగతమైన, తమకే కనిపించే ప్రలోభాలకు ఈనాటి మీడియా మేధావులు లొంగకుండా సాగితే మంచిది. డా.నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త వర్తమాన అంశాల వ్యాఖ్యాత, రచయిత మొబైల్ : 94407 32392 -
ప్రతి దీవెనా ఒక స్వాతి చినుకు!
బ్రహ్మాండమైన ఈ గెలుపు జగన్మోహన్రెడ్డి స్వార్జితం. ఇది చారిత్రకం. ఇది ఘన విజయం కాదు జన విజయం. దేవుడికి ఆయన నచ్చారు. ప్రజలు ఆయనని మెచ్చారు. సగౌరవంగా బంగారు సింహా సనం అప్పగించారు. జగన్ తొమ్మిదేళ్ల దీక్ష, కఠోర పరిశ్రమ ఫలించింది. ఆయన చిత్తశుద్ధి ప్రజల మనసులని సూటిగా హత్తుకుంది. అన్నా, తమ్ముడూ, బిడ్డా అంటూ జనం ప్రేమగా దీవించారు. ప్రతి దీవెనా స్వాతి చినుకులా కురిసి, ఓటుగా ప్రతిఫలించింది. దాంతో పొజిషన్లో ఉన్నవారు అపోజిషన్‌లోకి వెళ్లి ఒక మూలన సర్దుకోవలసిన దుర్గతి పట్టింది. ఇది వారి స్వయంకృతం. ఇక్కడ అప్రస్తుతం. నాడు బుద్ధుడు ఆత్మీయుల్ని పక్కనపెట్టి, రాజ మందిరాన్ని వదిలి విశాల ప్రపంచంలోకి వచ్చాడు. అంతకుముందే జరారుజా మరణాల వైనం తెలుసుకున్నాడు. ఈ లోకంలో రకరకాల కారణాలతో మనుషులకి సంభవిస్తున్న దుఃఖాన్ని అడుగడుగునా చూశాడు. జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో అడుగడుగునా రాష్ట్ర ప్రజల సమస్యలు చూశాడు. వారి దుఃఖం చూశాడు. విలయ తాండవం చేస్తున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని కళ్లారా చూశాడు. ‘నేనున్నా, నేనున్నా... ఏడవకండేడవకండి’ అంటూ కోట్లాదిమంది కన్నీళ్లు తుడిచాడు. ఆ మహా పాదయాత్రకి వెనక తండ్రి పెట్టిన చెరగని ఒరవడి ఉంది. వేల మైళ్ల యాత్రకి జగన్ సంకల్ప బలం ఉంది. పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టుల, దగాపడిన తమ్ముల ఆక్రందనలు ఒకవైపు, పాలకుల ఎద్దేవాలు, ఎగతాళి కూతలు మరోవైపు! వీటి మధ్య రాష్ట్రం కొసనించి కొసదాకా నడిచి నడిచి నడిచి... ప్రజల సమస్యల్ని, పాలకుల అరాచకాలని ఆకళింపు చేసుకు న్నారు జగన్. ప్రజానీకానికి చిరునవ్వుతో అభయం ఇస్తూ ముందుకు సాగారు. మట్టిని, మట్టి మనుషుల్ని తట్టి పలకరించారు. మొత్తంగా స్కాన్ చేసు కుని మనసులో నిక్షిప్తం చేసుకున్నారు. వీరందరికీ మంచి చేయాలన్న కసి పెంచుకున్నారు జగన్. సమ యం వచ్చింది. ప్రజలు అంతే కసిగా స్పందించారు. లేకపోతే అన్ని ఓట్లా? అన్ని సీట్లా? అవసరానికి మించినన్ని. ‘అన్నా! నీకు అడ్డులేదు. నువ్ తలపెట్టిన మంచి పనులన్నీ చెయ్’ అంటూ ఆదేశిస్తూ ఆశీర్వదించారు. ఈ మెజారిటీ ఎంతటిదంటే, దీనితో అయిదేళ్లు కాదు, జగన్మోహన్రెడ్డి ఏకంగా పదేళ్లు పాలించవచ్చునని ఒక పెద్దాయన ఆనందంతో మునకలు వేస్తూ అన్నాడు. తథాస్తు! కులం బలం లేదు. మీడియా తాలూకు వీర బాకాలు అసలే లేవు. తొమ్మిదేళ్లు వాడిపోకుండా, కొత్త చిగుళ్లు తొడుగుతూ బతికి బట్ట కట్టడం ఆయనకే చెల్లింది. ఇప్పుడే అసలు సిసలు బాధ్యత మొదలైంది. అడుగడుగునా చెప్పిన మాటలు నెరవేర్చాలి. నిన్నటిదాకా ఒట్టిపోయిన ఖజానాని సరిచేసుకోవాలి. నిన్న∙వినయంగా చెప్పిన మాటలు నిలుపుకోవాలి. ఇంతటి అఖండ విజయం ఇచ్చిన వారికి ఎన్నో ఆశలుంటాయ్. జగన్ రావాలని కలవరించిన అశేష ప్రజానీకానికి కనుల పండువగా ప్రమాణ స్వీకారోత్సవం జరగాలని ఆశిద్దాం. గెలుపుకి దోహదపడ్డ జగన్ సన్నిహిత కుటుంబ సభ్యులకు ఏపీ ప్రజల తరఫున అభివాదాలు. చివరిదాకా ఈ ధీరుడు ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు. గెలుపు సొంతం చేసుకున్నారు. రూలింగ్ పార్టీ కలికంలోకి కూడా రాకుండా పోయింది. చేపలు పట్టేసిన చెరువులా నిశ్శబ్దం ఆవరించింది. రెండ్రోజుల్లో భయంకరమైన ఫలితాలు రానున్నవేళ ఆంధ్రా ఆక్టోపస్‌నంటూ లగడపాటి గాంధోళి ఫార్స్‌కి తెర తీశారు. టీడీపీ ఎందుకు గెలవనున్నదో లగడపాటి విశ్లేషించడం కులం దురదకి పరాకాష్టగా విశ్లేషకులు అభివర్ణించారు. మరో అయిదేళ్లపాటు టీడీపీ వార్తల్లో కూడా ఉండదని అనుభవజ్ఞుల అంచనా. జగన్మోహన్రెడ్డి స్టేట్‌లో సెంట్రల్లో నూతన ఒరవళ్లతో కొత్తశకం ఆవిష్కరిస్తారని ఆశిద్దాం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి’
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు చేసిన పొరపాట్లు పోటీ చేసిన అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి. కీలక స్థానాల్లో నిబంధనలు పాటించకపోవడంతో ఫలితాలు తారుమారై ఓటమి పాలయ్యారు. ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పోస్టల్, సర్వీస్ ఓట్లు చెల్లకుండా పోవడం అభ్యర్ధుల్ని ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో ఓటమి అంచుల వరకూ వెళ్లిన కొందరు అధికార పార్టీ సిట్టింగులు... ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి బయటపడ్డారు. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించడంలో పోస్టల్, సర్వీస్ ఓట్లు కీలకంగా మారాయి. మూడు లక్షల అయిదువేల పోస్టల్ బ్యాలెట్లు, అరవైవేల సర్వీస్ ఓట్లను జారీ చేశారు. వీటిలో 2లక్షల 20వేల ఓట్లు... పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం12 పూర్తి చేయడంలో చేసిన పొరపాట్లుతో చెల్లకుండాపోయాయి. కొన్ని చోట్ల నిబంధనల మేరకు వాటిని సంరక్షించకపోవడం కూడా వివాదాస్పదమైంది. అలాగే కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు ఆ బ్యాలెట్ పేపర్ మీద వరుస నంబర్ నమోదు చేయకపోవడం, అదే నంబర్‌ను పోస్టల్ బ్యాలెట్ పంపే కవర్ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు ఓటమి బారి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. 6,653 ఓట్ల తేడాతో కింజారపు గెలిచారు. అలాగే గుంటూరు నుంచి గల్లా జయదేవ్ కూడా ఇలాగే సేఫ్ అయ్యారు. గుంటూరు పార్లమెంటు నియోజక వర్గంలోనూ భారీగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై 4205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్ గెలిచారు. పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. -
చంద్రబాబుకు వర్మ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు నాయుడుకి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. ఇప్పటికే సెటైరికల్ ట్వీట్లతో చంద్రబాబును ఓ ఆటాడుకున్న వర్మ.. తాజాగా మరో ముందుడుగేశారు. ‘ఎక్కడయితే మాజీ సీఎం నన్ను అరెస్టు చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎల్లుండి(ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ పెట్ట బోతున్నాము. బస్తి మే సవాల్!!! ఎన్టీఆర్ నిజమైన అభిమానులకి ఇదే నా బహిరంగ ఆహ్వానం.. జై జగన్’అంటూ వర్మ ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక విక్టరిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ పాటను విడుదల చేశారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ‘విజయం విజయం.. ఘన విజయం’ పాటకు వైఎస్సార్సీపీ సంబరాలు, జగన్ పాదయాత్ర విజువల్స్‌ను జోడించి పాటను రూపొందించారు. ఈ పాటకు ‘ చంద్రబాబుపై జగన్ గ్రాండ్ విక్టరి. ఇది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రివేంజ్’ అంటూ క్యాఫ్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఏపీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ, చంద్రబాబుపై వరుస ట్వీట్లతో వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘నిన్న రాత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపినందుకే చంద్రబాబును దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు.’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ఈ వేసివకాలంలో ఏపీలో చాలా స్టోక్స్ వచ్చాయని, కానీ ఒకే ఒక స్టోక్‌కు టీడీపీ విలవిలలాడిందని పేర్కొన్నారు. ఇలా వైఎస్ జగన్ విజయం.. చంద్రబాబు ఓటమిని వర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడయితే Ex CM నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!! ఎన్ టి ఆర్ నిజమయిన అభిమానులకి , ఇదే నా బహిరంగ ఆహ్వానo..జై జగన్ — Ram Gopal Varma (@RGVzoomin) May 24, 2019 -
వైఎస్సార్సీపీ అసాధారణ విజయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణమైన విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. 2014 ఎన్నికల్లో కేవలం రెండు శాతం కన్నా తక్కువ ఓట్ల వ్యత్యాసంతో ఓటమి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఫలితాల్లో మాత్రం చరిత్ర రికార్డును బ్రేక్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 50 (49.95) శాతం ఓట్లను సాధించుకుంది. టీడీపీకి 39.18 శాతం ఓట్లు నమోదయ్యాయి. రెండు పార్టీల మధ్య 10.7 శాతం (దాదాపు 11 శాతం) ఓట్ల వ్యత్యాసం ఉంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం (1,56,86,511 ఓట్లు) ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో రికార్డు విజయం సాధించింది. 39 శాతం (1,23,03,620) ఓట్లతో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం రెండు శాతం లోపే ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలకు కలిపి 46.6 శాతం ఓట్లు రాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ రికార్డు సంఖ్యలో 151 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గతంలో 102 స్థానాలు గెలిచిన టీడీపీ ఈసారి 79 స్థానాలు కోల్పోయి 23 సీట్లు గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయగా, జనసేన మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈసారి సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేసింది. జనసేనకు 6 శాతం లోపు ఓట్లు పోలయ్యాయి. జనసేన మిత్రపక్షాలైన సీపీఐ (0.11 శాతం), సీపీఎం (0.32 శాతం), బీఎస్పీ (0.28 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈ పార్టీలన్నింటకీ కలిపి నోటాకు పోలైనన్ని ఓట్లు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో నోటాకు 1.28 శాతం (4,01,968 ఓట్లు) పోలయ్యాయి. లోక్‌సభ ఫలితాల్లోనూ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లోనూ పోలింగ్ లో ఇదే సరళి కొనసాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.15 శాతం ఓట్లు నమోదు కాగా టీడీపీకి 39.6 శాతం ఓట్లు వచ్చాయి. అటు అసెంబ్లీ ఇటు లోక్‌సభ రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మధ్య పది శాతం ఓట్ల తేడా ఉంది. ఇంతటి భారీ తేడాతో ఓట్లు సాధించి అధికారం చేపట్టడం చరిత్రలో జరగలేదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్ (1.29 శాతం) బీజేపీ (0.96 శాతం) ఓట్లు రాగా నోటాకు 1.49 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన, సీపీఐ, సీపీఎంలతో పాటు మిగిలిన స్వతంత్రులందరికీ కలిపి 7.3 శాతం మేరకు ఓట్లు లభించాయి. జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 1.17 శాతం, బీజేపీ 0.84 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. ఈ పార్టీలు పోటీ చేసిన దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయాయి. జనసేన దాని మిత్రపక్షాల అభ్యర్థులు సైతం అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన అసెంబ్లీలో అధికార తెలుగుదేశం మిత్రపక్ష బీజేపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సభలో ఉండగా, అప్పట్లో నవోదయ పార్టీ తరఫున గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా సభలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ తప్ప మరోపార్టీ ప్రాతినిథ్యం లేదు. జనసేన తరఫున గెలిచిన ఒక సభ్యుడు (స్వతంత్ర) సభలో ఉండనున్నారు. -
రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం రేపు(మే 25న) ఉదయం పదిన్నర గంటలకు పార్టీ కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఎమ్మెల్సీలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ శాసనసభ్యుల బృందం రేపు మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నట్లు పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. -
జగన్ విజయంపై వర్మ సాంగ్!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అఖండ విజయం సొంతం చేసుకున్న తెలిసిందే. ఆయన చారిత్రాత్మక విక్టరిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ పాటను విడుదల చేశారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ‘విజయం విజయం.. ఘన విజయం’ పాటకు వైఎస్సార్సీపీ సంబరాలు, జగన్ పాదయాత్ర విజువల్స్‌ను జోడించి పాటను రూపొందించారు. ఈ పాటకు ‘ చంద్రబాబుపై జగన్ గ్రాండ్ విక్టరి. ఇది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రివేంజ్’ అంటూ క్యాఫ్షన్‌గా పేర్కొన్నాడు. గురువారం ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ, చంద్రబాబుపై వరుస ట్వీట్లతో వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ.. మరుసటి రోజు(శుక్రవారం) కూడా విడిచిపెట్టలేదు. ‘నిన్న రాత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపినందుకే చంద్రబాబును దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు.’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ఈ వేసివకాలంలో ఏపీలో చాలా స్టోక్స్ వచ్చాయని, కానీ ఒకే ఒక స్టోక్‌కు టీడీపీ విలవిలలాడిందని పేర్కొన్నారు. ఇలా వైఎస్ జగన్ విజయం.. చంద్రబాబు ఓటమిని వర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. “Vijayam” victory song of @ysjagan over @ncbn The revenge of NTR #LakshmisNTR https://t.co/gZh8yLtLmq — Ram Gopal Varma (@RGVzoomin) 24 May 2019 నిన్న రాత్రి స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారు నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్ విడుదల ఆపినందుకే CBN ని దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు. pic.twitter.com/5oOZfpUjm5 — Ram Gopal Varma (@RGVzoomin) 24 May 2019 -
ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పి బొక్కబోర్లాపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఇక జీవితంలో సర్వేల జోలికి వెళ్లనని ప్రతినబూనారు. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఏపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు..సైకిల్ విజయం తథ్యం అంటూ బీరాలు పలికిన ఆయనకు ఫలితాల అనంతరం దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫ్యాన్ ప్రభంజనంతో సైకిల్ కొట్టుకుపోవడంతో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి అభాసుపాలయ్యారు. ఫలితాల అనంతరం మీడియా ముందుకు వస్తానని బీరాలు పలికిన లగడపాటి...ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌కి మొహం చాటేసి...చివరకు ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలం అయినందుకు చింతిస్తున్నానంటూ అధికారికంగా ఓ లేఖ విడుదల చేశారు. కారణాలు ఏమైనప్పటికీ తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల నాడి పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలం అయినందుకు ఇక భవిష్యత్‌లో సర్వేలకు దూరంగా ఉండదలచుకుంటున్నట్లు చెప్పారు. తన ఫలితాల వలన ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకుని ఉంటే మన్నించాలంటూ లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పాలంటూ లగడపాటి ఆకాంక్షించారు. చదవండి: బాబు కోసం బోగస్ సర్వేలు సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి విదూషకుల విన్యాసాలు -
మంగళగిరి అని స్పష్టంగా పలకలేని...: ఆర్కే
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించి అఖండ మెజార్టీతో తీర్పు ఇచ్చారన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్‌పై విజయం సాధించిన ఆర్కే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లు అండగా ఉండి, సమస్యలను పరిష్కరిస్తామన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలిచారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్న నమ్మకంతో తమకు అండగా నిలబడి, విజయాన్ని అందించారని అన్నారు. మంగళగిరి అని స్పష్టంగా పలకలేని అభ్యర్థిని గెలిపిస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని నియోజకవర్గ ఓటర్లు ఆలోచించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావలంటే కనీస అవగాహన ఉండాలని ....అలాంటిది లోకేశ్‌కు నియోజవర్గ సరిహద్దులు కూడా తెలియకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా లోకేశ్ ఏనాడూ మంగళగిరి నియోజకవర్గంలోని ఏ గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదని, కనీసం రైతుల సమస్యలను కూడా వినలేదని అన్నారు. పోలింగ్ తేదీనే మరిచిపోయిన మాలోకానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఆర్కే వ్యాఖ్యానించారు. దోచుకున్న వేలకోట్ల అవినీతి సొమ్ముతో ఓట్లును కొనాలని చూసిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలిందని అన్నారు. -
ఆదివారం గవర్నర్‌తో ద్వివేది భేటి
సాక్షి,అమరావతి : రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఉదయం 11.30 గంటలకు భేటికానున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆయన గవర్నర్‌కు అందజేయనున్నారు. ద్వివేదితో పాటు అడిషనల్ సీఈవోలు వివేక్ యాదవ్, సుజాత శర్మలు కూడా గవర్నర్‌తో సమావేశం కానున్నారు. గెలుపొందిన సభ్యులు జాబితాను గవర్నర్ అమోదించిన తర్వాత శాసనసభ్యుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురించనున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటులో అధికారిక లాంఛనాలు పూర్తయ్యాక సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని నియోజక వర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు సంబంధిత ఆర్వోలు ధృవీకరణ పత్రాలను అందచేశారు. శనివారం ఉదయం తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోనున్నారు. అనంతరం జగన్ గవర్నర్‌తో భేటీ అవుతారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ను జగన్ కోరుతారు. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక స్థానాలున్న పార్టీగా వైఎస్సార్సీపీ అవరతరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జగన్‌ను గవర్నర్ కోరవచ్చు. ఎన్నికల సంఘం నుంచి ఎన్నికైన శాసనసభ్యుల వివరాలను గెజిట్‌లో ముద్రించేందుకు గవర్నర్ అనుమతించిన వెంటనే ఆ జాబితాతో గెజిట్ రూపొందుతుంది. ఈ అధికారిక లాంఛనాలు పూర్తైన వెంటనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. -
మొదటి బరిలోనే జయకేతనం
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 8 మంది వైఎస్సార్సీపీ నుంచే విజయం సాధించడం విశేషం. నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోచా బ్రహ్మానందారెడ్డి, డాక్టర్ సంజీవ్‌కుమార్ పోటీ చేశారు. అలాగే నంద్యాల, ఆళ్లగడ్డ, పత్తికొండ, కోడుమూరు, నందికొట్కూరు, కర్నూలు అసెంబ్లీ స్థానాల నుంచి వరుసగా శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల నాని, కంగాటి శ్రీదేవి, జె.సుధాకర్, తొగురు ఆర్థర్, హఫీజ్‌ఖాన్ బరిలో ఉన్నారు. వీరంతా తమతమ ప్రత్యర్థులు వరుసగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియా, కేఈ శ్యామ్‌బాబు, రామాంజనేయులు, బండి జయరాజు, టీజీ భరత్‌లను మట్టి కరిపించారు. అలాగే పోచా బ్రహ్మానందరెడ్డి మాండ్రశివానందరెడ్డిని, డాక్టర్ సంజీవ్‌కుమార్ కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని ఓడించారు. వీరంతా మొదటి సారి పోటీ చేసినా విజయబావుటా ఎగురవేశారు. ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు... ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటి సారి కొందరు పోటీ చేసి ఓటమిని మూట గట్టుకున్నారు. అందులో కర్నూలు నుంచి టీజీ భరత్, కోడుమూరు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, పత్తికొండ నుంచి పోటీ చేసిన కేఈ శ్యామ్‌బాబు, నందికొట్కూరు నుంచి పోటీ చేసిన బండి జయరాజు, నంద్యాల ఎంపీగా పోటీ చేసిన మాండ్ర శివానందరెడ్డి ఓడిపోయి ఇంటి బాట పట్టారు. 8 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 8 మంది వైఎస్సార్సీపీ నుంచే విజయం సాధించడం విశేషం. నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోచా బ్రహ్మానందారెడ్డి, డాక్టర్ సంజీవ్‌కుమార్ పోటీ చేశారు. అలాగే నంద్యాల, ఆళ్లగడ్డ, పత్తికొండ, కోడుమూరు, నందికొట్కూరు, కర్నూలు అసెంబ్లీ స్థానాల నుంచి వరుసగా శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల నాని, కంగాటి శ్రీదేవి, జె.సుధాకర్, తొగురు ఆర్థర్, హఫీజ్‌ఖాన్ బరిలో ఉన్నారు. వీరంతా తమతమ ప్రత్యర్థులు వరుసగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియా, కేఈ శ్యామ్‌బాబు, రామాంజనేయులు, బండి జయరాజు, టీజీ భరత్‌లను మట్టి కరిపించారు. అలాగే పోచా బ్రహ్మానందరెడ్డి మాండ్రశివానందరెడ్డిని, డాక్టర్ సంజీవ్‌కుమార్ కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని ఓడించారు. వీరంతా మొదటి సారి పోటీ చేసినా విజయబావుటా ఎగురవేశారు. ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు... ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటి సారి కొందరు పోటీ చేసి ఓటమిని మూట గట్టుకున్నారు. అందులో కర్నూలు నుంచి టీజీ భరత్, కోడుమూరు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, పత్తికొండ నుంచి పోటీ చేసిన కేఈ శ్యామ్‌బాబు, నందికొట్కూరు నుంచి పోటీ చేసిన బండి జయరాజు, నంద్యాల ఎంపీగా పోటీ చేసిన మాండ్ర శివానందరెడ్డి ఓడిపోయి ఇంటి బాట పట్టారు. -
టీడీపీ మంత్రుల నేమ్ ప్లేట్లు తొలగింపు
సాక్షి, అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. దీంతో సచివాలయంలో టీడీపీ కేబినెట్ మంత్రుల నేమ్ ప్లేట్లను తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖల ముందు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులను తొలగించాల్సిందిగా జీఏడీ అధికారులు ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. దీంతో సచివాలయంలోని అన్ని బ్లాకుల్ని పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలో పలువురు మంత్రుల పేషీల్లో ఉన్న ఫోటోలను తొలగించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను జీఏడీ సిబ్బంది తొలగించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే లోపు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయనున్నారు. పనికిరాని డాక్యుమెంట్లను క్లియర్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల మాట్లాడుతూ నూతన ప్రభుత్వానికి ఉద్యోగులు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. వైఎస్ జగన్ గెలుపుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ ...గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో ఉద్యోగుల కష్టాలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉద్యోగులకు ఎలాంటి కష్టాలు లేవని అన్నారు. -
బాబు.. ఆ అడుగుల చప్పుడు వినిపించలేదా?
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించించడం.. టీడీపీ అడ్రస్ లేకుండా గల్లంతవ్వడం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ దారుణ ఓటమిపై సోషల్ మీడియాలో కుళ్లు జోకులు కూడా పేలాయి. ముఖ్యంగా చంద్రబాబును నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. తాతకు మనవడితో ఆడుకునే సమయం దొరికిందని, బాబు ప్రయాణం మాయవతి టూ గవర్నర్ వయా సోనియా, మమతలుగా సాగి ముగిసిందనే ఫన్నీమీమ్స్, కామెంట్స్‌ను ట్రెండ్ చేశారు. అయితే తాజాగా ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య తన ట్విటర్లో షేర్ చేసిన ఓ కార్టూన్ నెటిజన్లను, రాజకీయ వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వైఎస్ జగన్ పాదయాత్రను ప్రతిబింబించేలా ఉన్న ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఏడాది పాటు మొక్కవోని దీక్షతో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్లు మేర చేసిన పాదయాత్ర ఆయనకు అఖండ విజయానందించింది. అయితే ఈ పాదయాత్రను లెక్కచేయని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరవర్గం.. జగన్ పాదయాత్రను అవహేళన చేస్తూ మాట్లాడారు. ఇదే వారిని చావుదెబ్బతినేలా చేసింది. ఈ విషయాన్నే సతీష్ ఆచార్య తన కార్టూన్లో తెలియజేశారు. ఆ కార్టూన్‌కు ‘చంద్రబాబు ఆ అడుగుల చప్పుడు వినిపించలేదా?’ అనే క్యాప్షన్ ఇచ్చారు. -
ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ‘సిత్రాలు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 25 స్థానాలగానూ 22 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలిచారు. ఆరుగురు అభ్యర్థులు 2 లక్షలకు పైగా మెజారిటీతో విజయాలు దక్కించుకున్నారు. ఎనిమిది మంది లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అత్యల్ప మెజారిటీతో గట్టెక్కారు. (అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు వీరివే..) అత్యధిక మెజారిటీ.. ♦ కడపలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డి 380976 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై విజయం సాధించారు. ♦ రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి 268284 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ నంద్యాలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మనందరెడ్డి 250119 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మంద్రా శివానందరెడ్డిపై గెలుపొందారు. ♦ తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లిదుర్గాప్రసాద్ 228376 ఓట్ల ఆధిక్యం సాధించారు. ♦ అరకులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి 224089 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్‌పై విజయం దక్కించుకున్నారు. ♦ ఒంగోలులో టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 214851 ఓట్ల తేడాతో గెలిచారు. అత్యల్ప మెజారిటీ.. ⇔గుంటూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ⇔విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి మాత్కుమిల్లి భరత్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ 4414 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ⇔శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై కె. రామ్మోహన్ నాయుడు 6653 ఓట్ల తేడాతో గెలిచారు. ⇔విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని 8726 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌పై విజయాన్ని దక్కించుకున్నారు. -
వైఎస్ జగన్‌కు మహేశ్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. కేంద్రంలో ఘనవిజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి కూడా మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక గురువారం వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. Congratulations @ysjagan on your landslide victory in Andhra Pradesh. May the state achieve great heights of success and prosperity in your tenure as the CM. 👍👍 — Mahesh Babu (@urstrulyMahesh) 24 May 2019 Honorable Prime Minister @narendramodi ji, many congratulations on your glorious win. May the nation continue to prosper and grow under your leadership 🙏🏻🙏🏻 — Mahesh Babu (@urstrulyMahesh) 24 May 2019 -
ఒళ్ళంతా ఉప్పూ- కారం పూసి బుద్ధి చెప్పారు!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కించపర్చాలని చూసిన చంద్రబాబుకు ఒళ్లంతా ఉప్పూ-కారం పూసి బద్ధిచెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితం అనంతరం ఆయన వరుస ట్వీట్లతో చంద్రబాబు... ఆయన అనుకూల మీడియాపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ‘కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, అబద్ధాలు, యూ-టర్నులు, వేల కోట్ల పంపిణీలు ప్రజలను ఏమాత్రం ఏమార్చలేక పోయాయి. పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కించపర్చాలని చూస్తే వళ్ళంతా ఉప్పూ-కారం పూసి బుద్ధి చెప్పారు. నీ అంత దిగజారిన నీచుడు ప్రపంచంలోనే ఎక్కడా కనిపించడు చంద్రబాబూ.’ అంటూ మండిపడ్డారు. ‘ఒక యువ నాయకుడిపై ప్రజలు ఇంత అపూర్వమైన ప్రేమ, అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించడం దేశ చరిత్రలోనే అరుదు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పని కుటుంబానికి ప్రజలు నీరాజనం పలికారు. అభివృద్ధిలో దేశానికే వెలుగు దివ్వెగా మారుతుంది ఆంధ్రప్రదేశ్. దేశమంతా ఏపీ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది.’ అన్నారు. ఇక చంద్రబాబు పాదం మోపిన చోటల్లా ప్రాంతీయ పార్టీలకు శని దాపురించిందని, గతంలో 33సీట్లు గెలిచిన మమత ఈసారి 22 స్థానాలకే పరిమితమయ్యారన్నారు. ఢిల్లీలోని 7 సీట్లలో అయితే కేజ్రీవాల్ ఖాతా కూడా తెరవలేదని, బీఎస్పీ 38 సీట్లలో నిలిస్తే 11 చోట్ల గెలిచిందని తెలిపారు. అఖిలేశ్ 6 దగ్గర ఆగాడని, కుమార స్వామికి ఒక్కటే సీటు వచ్చిందని పేర్కొన్నారు. ‘కులమీడియా దళారులు ఎంత సిగ్గుమాలిన వార్తలు రాశారు. చంద్రబాబు ప్రధాని రేసులో ఉన్నాడని కూడా రాశారు. ప్రతిపక్ష కూటమికి మీరే నాయకత్వం వహించాలని అఖిలేశ్ యాదవ్ అనకున్నా అన్నట్టు చూపించారు. జర్నలిజాన్ని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టారు గదా.’ అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. -
‘పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నందుకు..’
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించింది. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన పుప్పాల వాసుబాబు 33 వేల ఓట్ల మెజర్టీతో గెలుపొందారు. ఈ క్రమంలో వాసుబాబును అభినందించడానికి అభిమానులు ఆయన నివాసానికి పోటేత్తారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. అందుకే ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పంష్టం చేశారు. -
వైఎస్ జగన్‌తో ఐఏఎస్ అధికారుల భేటీ
సాక్షి, అమరావతి: ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఐఏఎస్ అధికారులు భేటీ అయ్యారు. 23 మంత్రిత్వ శాఖలకు చెందిన 57మంది అధికారులు శుక్రవారం ఉదయం ఆయనను తాడేపల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వివరాలను వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారులు వివరించారు. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలు, నేతలుతో పాటు అభినందనలు తెలిపేందుకు వస్తున్న వారితో అక్కడ కోలాహలం నెలకొంది. -
ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు
సాక్షి, అమరావతి: దేశమంతా ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ పరంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. విజయవాడ సెంట్రలక్ష నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అతి స్వల్ప మెజారిటీలో గట్టెక్కారు. 21 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులు 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. నలుగురు అభ్యర్థులు వెయ్యిలోపు ఆధిక్యంతో బయటపడ్డారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు.. ఒకరు టీడీపీ, ఒకరు జనసేన పార్టీకి చెందిన వారు. ♦ పులివెందులలో సతీశ్‌కుమార్ రెడ్డిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 90110 ఓట్ల భారీ మెజారిటీ ♦ గిద్దలూరులో ముత్తుముల అశోక్‌రెడ్డిపై అన్నా రాంబాబుకు 81035 ఓట్ల ఆధిక్యం ♦ సూళ్లూరుపేటలో పర్సా వెంకట రత్నయ్యపై కలివేటి సంజీవయ్య 61292 ఓట్ల ఆధిక్యం ♦ అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి 55207 మెజారిటీ ♦ కడపలో అమీర్‌బాబు నవాజ్‌షాన్‌పై అంజాద్ భాషా 54794 ఆధిక్యం ♦ జమ్మలమడులో రామసుబ్బారెడ్డిపై మూలె సుధీర్‌రెడ్డికి 51641 మెజారిటీ ♦ గుంతకల్‌లో జితేంద్రగౌడ్‌పై వెంకటరామిరెడ్డికి 48532 ఆధిక్యం ♦ తంబళ్లపల్లెలో గొల్లల శంకర్‌పై పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి 46938 మెజారిటీ ♦ శింగనమలలో బండారు శ్రావణిశ్రీపై జొన్నలగడ్డ పద్మావతికి 46242 ఆధిక్యం ♦ గంగాధర నెల్లూరులో అనగంటి హరికృష్ణపై కె. నారాయణస్వామికి 45594 మెజారిటీ ♦ గూడూరులో పాశిం సునీల్‌కుమార్‌పై వెలగపల్లి వరప్రసాదరావుకు 45458 ఆధిక్యం ♦ సత్యవోలులో జెడ్డా రాజశేఖర్‌పై కోనేటి ఆదిమూలంకు 44744 మెజారిటీ ♦ బద్దేల్లో డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌పై జి. వెంకట సుబ్బయ్యకు 44734 ఆధిక్యం ♦ పాణ్యంలో గౌరు చరితారెడ్డిపై కాటసాని రాంభూపాల్ రెడ్డికి 43857 మెజారిటీ ♦ పుంగనూరులో అనీషా రెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 43555 ఆధిక్యం ♦ ప్రొద్దటూరులో మల్లెల లింగారెడ్డిపై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి 43148 మెజారిటీ ♦ పాడేరులో గిడ్డి ఈశ్వరిపై భాగ్యలక్ష్మి కొత్తగుల్లికి 42804 ఆధిక్యం ♦ పోలవరం బొరగం శ్రీనివాసులుపై తెల్లం బాలరాజుకు 42070 మెజారిటీ ♦ పత్తికొండలో కేఈ శ్యామ్‌కుమార్‌పై కంగటి శ్రీదేవికి 42065 ఆధిక్యం ♦ చంద్రగిరిలో పులివర్తి వెంకట మణి ప్రసాద్‌పై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 41755 మెజారిటీ ♦ నందికొట్కూరులో బండి జయరాజుపై తొగురు ఆర్థర్‌కు 40610 ఆధిక్యం ♦ కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై బుర్రా మధుసూదన్ యాదవ్‌కు 40903 మెజారిటీ అతికష్టంగా గట్టెక్కారు! ⇔విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమాపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు ⇔తిరుపతిలో టీడీపీ అభ్యర్థి సుగుణపై వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి 708 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. ⇔రాజోలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ 814 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ⇔గన్నవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 838 ఆధిక్యంతో బయటపడ్డారు. -
చంద్రబాబు అహంకారం, అవినీతి వల్లే
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్ మీద నమ్మకం ఉంచి ప్రజలు ఆయనకు భారీ విజయం కట్టబెట్టారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు అహంకారం, అవినీతే టీడీపీని ఓటమి పాలు చేసిందని విమర్శించారు. అవినీతి పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడారని హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోదీ గురించి టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ముక్కముక్కలుగా నరుకుతామని ప్రతిపక్ష నేతను బెదిరించేవారు. కోడికత్తి పార్టీ అంటూ వైఎస్సార్ సీపీని చంద్రబాబు హేళన చేసేవారు’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు. టీడీపీ కుట్రల వల్లే.. ఏపీలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని జీవీఎల్ విచారం వ్యక్తం చేశారు. తమ ఓటమికి టీడీపీ కుట్రపూరిత రాజకీయాలే కారణమని ఆరోపించారు. బీజేపీ వంశపారంపర్య రాజకీయాలకు దూరమని, వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్, రాహుల్, కవిత ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అభివృద్ధిని చూసిన దేశ ప్రజలు రెండోసారి గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. -
‘జనాలు చింతమనేని పాలనపై విసిగిపోయారు’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై రికార్డు విజయం సాధించిన కొఠారు అబ్బయ్య చౌదరిని అభినందించేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. తన గెలపుకు కారణమైన దెందులూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చింతమనేని పదేళ్ల పాలనపై విసుగెత్తి పోయిన దెందులూరు ప్రజలు ఓటు రూపంలో తీర్పునిచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తానని పేర్కొన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటానన్నారు. దెందులూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్‌కు ప్రజలు పట్టం కట్టారు
-
‘వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తారు’
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ కాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయన వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్రే వైఎస్ జగన్‌ను గెలిపించిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియా మాట్లాడుతూ.. ‘పట్టాభిషేకానికి ముందు శ్రీరాముడు పడ్డ కష్టాలే వైఎస్ జగన్ పడ్డారు. వైఎస్ జగన్ రాష్ట్రానికి మంచి పాలన అందిస్తారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు తరహాలో 30 ఏళ్లకు పైబడి వైఎస్ జగన్ పాలన అందిస్తారు. వైఎస్ జగన్ తను అనుకున్నది సాధిస్తారు. ప్రజల ఆశీస్సులు వైఎస్ జగన్‌కు ఉండటం వల్లే.. ఆయనకు బ్రహ్మారథం పట్టార’ని తెలిపారు. అలాగూ కేంద్రంలో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన సినీనటి సుమలతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సందడి
-
ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందన్నది..!
సాక్షి, హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రజలు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అఖండ విజయం అందించారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆయన ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ చూడనంతటి భారీ వైఫల్యాన్ని తెలుగుదేశం మూటగట్టుకుంది. కేవలం 23 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. ఇక నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుని తిరిగిన చంద్రబాబు పాచికలు ఈ ఎన్నికల్లో పారలేదు. ఆయన మేనేజింగ్ స్కిల్స్ ఫ్యాన్ గాలి హోరులో సై‘కిల్’ కాకుండా కాపాడలేకపోయాయి. ఇక సామాజక మాధ్యమాల్లో టీడీపీ ఘోర ఓటమిపై మీమ్స్, సెటైర్స్ పేలుతున్నాయి. చంద్రబాబు పవర్ తగ్గలేదని కొందరు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఎక్కిడికెళ్లినా తన ప్రభావం చూపుతారని అంటున్నారు. ‘ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందని అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖేల్ ఖతమైంది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.. ఆమ్ఆద్మీ పార్టీ చిత్తయిపోయింది. ఆయన బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. ఆయన బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తయ్యారు. ఆయన యూపీ వెళ్లారు.. మాయావతి, అఖిలేశ్ యాదవ్ అడ్రస్ గల్లంతైంది. ఆయన అశోక్ గహ్లోత్‌తో తిరిగారు.. రాజస్తాన్‌లో సింగిల్ సీటు కూడా రాలేదు. ఆయన దేవగౌడతో భేటీ అయ్యారు.. ఫస్ట్ టైం ఓడిపోయారు. బాబు లెగ్ పవర్ అలాంటిది. పవర్ లేకున్నా లెగ్‌పవర్ తగ్గేది లేదు. తగ్గాల్సింది మనమే తమ్ముళ్లూ’ అంటూ సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నాయి. -
కోడెలను చొక్కా విప్పి కొట్టారంటేనే...
సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధికారం కోల్పోతుందని ముందే చెప్పినట్టు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ముప్పై సీట్ల కంటే ఎక్కువ రానివ్వమని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. చంద్రబాబుతో గతంలో పొత్తు కారణంగా రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు నష్టపోయాయనా చెప్పారు. ప్రజలు నాలుగేళ్లు టీడీపీ ఆరాచకాలను మౌనంగా చూస్తూ వచ్చారన్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా సాక్షాత్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావును చొక్కా విప్పి కొట్టారంటే ప్రజలు టీడీపీ పాలన పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థంచేసుకోవచ్చన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఇచ్చిన తీర్పుకు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఒరిజినాలిటీ లేని నాయకుడని, జగన్‌లో ఒరిజినాలిటీ ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. (చదవండి: ఫ్యాన్ విజయ దుందుభి) -
బాబూ.. సంఖ్య '23' చరిత్రే కదా..!
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ చూడనంతటి భారీ వైఫల్యాన్ని తెలుగుదేశం మూటగట్టుకుంది. గురువారం (మే 23) వెల్లడైన ఫలితాల్లో ఏపీ ప్రజలు జననేత జగన్‌కు జైకొట్టారు. ఆయన ఆద్వర్యంలోని వైఎస్సార్సీపీకి 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ సీట్లతో అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఇక నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకు తిరిగిన చంద్రబాబు పాచికలు ఈ ఎన్నికల్లో పారలేదు. ఆయన మేనేజింగ్ స్కిల్స్ ఫ్యాన్ గాలి హోరులో సై‘కిల్’ కాకుండా కాపాడలేకపోయాయి. ఇక సామాజక మాధ్యమాల్లో టీడీపీ ఘోర ఓటమిపై మీమ్స్, సెటైర్స్ పేలుతున్నాయి. అధికార దాహంతో చంద్రబాబు సాగించిన ఎమ్మెల్యేల అనైతిక కొనుగోళ్లను ఎత్తిచూపుతూ.. ‘'23' చరిత్రలో నిలిచిపోయే సంఖ్య..! 23 మందిని కొన్నావు. ఈ ఎన్నికల్లో 23 మందే గెలిచారు. కౌటింగ్ 23నే అయింది’ అంటూ వేదాంత ధోరణిలో చంద్రబాబుకు చురలంటిస్తున్నారు. ఫలితాల వెల్లడి మే23న కాకుండా ఈ నెల 31 జరిగితే బాగుండునని మరికొందరు అంటున్నారు. కనీసం అప్పుడైనా చంద్రబాబుకు 31 సీట్లు దక్కేవని జాలి చూపిస్తున్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని కోడికత్తి అని ఎద్దేవా చేసిన చంద్రబాబును.. ప్రజలు కోడికత్తితో కసితీరా పొడిచారని మరొకరు పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో తమ అధినేత అనుసరించిన వ్యూహాలన్నీ తల్లకిందులయ్యాయనే అభిప్రాయాన్ని టీడీపీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
-
చంద్రబాబును ఎద్దేవా చేసిన అమిత్ షా..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ చుట్టూ తిరిగేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కృషి ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు సాధించుకునేందుకు చేసుంటే ఆయనకు మరికొన్ని సీట్లైనా దక్కేవని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజాయాన్ని సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగిన విజయోత్సవ సభలో షా మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షపార్టీలను ప్రస్తావిస్తూ మరీ ముఖ్యంగా చంద్రబాబుకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నానని అంటూ పైవిధంగా వ్యాఖ్యానించారు.‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ తరపున అభినందనలు తెలుపుతున్నా’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
జననేతపై అభిమానాన్ని చాటుకున్న పోసాని
సాక్షి, హైదరాబాద్ : జననేత వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తు భారీ మద్దతు పలికారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మొదటి నుంచీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానాన్ని చాటుకునే దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి వైఎస్సార్సీపీ అఖండ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ సీఎం కావాలన్నది నా బలమైన కోరిక. ఆ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన సీఎం కావాలని దేవుళ్లకు మొక్కుకున్నా. కోరిక నెరవేరడంతో అమీర్‌పేట్, బేగంపేట్, పిలింనగర్‌లోని ఆలయాల్లో దేవుళ్లకు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నా. ప్రజాతీర్పు చూసి చంద్రబాబులోపల మార్పు రావడం సంతోషం. జగన్‌పై తప్పుడు కేసులు బనాయించేలా చేసిన చంద్రబాబు.. వాటిని ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, మోసాలు మానేస్తే ఆయనకు పాదాభివందనం చేస్తా. జనరంజక పాలన చేసి మంచి పేరు తెచ్చుకొని.. జగన్ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. కేసీఆర్ సీఎం కావాలని కూడా గతంలో దేవుణ్ణి కోరుకున్నా. మొక్కులు తీర్చుకున్నా కష్టాల నుంచి పైకొచ్చిన నేను ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా ఉన్నా’ అన్నారు. -
రాష్ట్రాన్ని చుట్టి.. ప్రజల మనసు తట్టి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారం వైఎస్సార్సీపీ ఘనవిజయానికి అదనపు ఇంధనంగా పనిచేసింది. రాజన్న రాజ్య స్థాపన కోసం వారిద్దరూ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహంలో క్రియాశీలపాత్ర పోషించారు. వైఎస్ జగన్ పర్యటించలేని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి ప్రచారాన్ని హోరెత్తించారు. విజయమ్మ ప్రచారం ప్రజల మనసులను సున్నితంగా తాకుతూ ఆలోచింపచేయగా.. షర్మిల ప్రచారం జంఝామారుతంలా ఓటర్లను ఉర్రూతలూగించింది. కేవలం 20రోజుల్లో విజయమ్మ 9 జిల్లాల్లో 27 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 6 జిల్లాల్లో 39 నియోజకవర్గాల్లో షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. విజయమ్మ, షర్మిల తమదైన ప్రసంగాలతో ఓటర్లను ఆలోచింపజేశారు. కేసులకు భయపడి వైఎస్ జగన్ కేంద్రంతో రాజీపడ్డారన్న టీడీపీ దుష్ప్రచారాన్ని విజయమ్మ సమర్థంగా తిప్పికొట్టారు. ‘నా బిడ్డ ఆనాడు సోనియాగాంధీకే భయపడలేదు. ఇక మోదీకి భయపడతారా’అని నేరుగా ప్రశ్నించడం అందర్నీ ఆకట్టుకుంది. తండ్రిని చూసి పెరిగిన తన తనయుడు అదే విధంగా సంక్షేమ రాజ్యం అందిస్తారని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆమె ప్రసంగాలు వైఎస్సార్సీపీ పట్ల ప్రజల్లో మరింత సానుకూలతను పెంచాయి. ఇక షర్మిల ప్రచార హోరుతో రాష్ట్రాన్ని ఉర్రూతలూగించారు. వైఎస్సార్సీపీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని చెబుతూ ‘సింహం సింగిల్గానీ వస్తుంది.. జగనన్న సింగిల్‌గానే వస్తాడు’ అన్న ఆమె ప్రసంగం జనంలోకి బాగా చొచ్చుకువెళ్లింది. చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఆమె సూటిగా, ధాటిగా చేసిన విమర్శలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ‘బాబు వస్తే జాబు వస్తుందో రాదో తెలీదుగానీ కరువు మాత్రం వస్తుంది’, ‘బాబు వస్తే ఎవరికీ జాబులు రాలేదు కానీ పప్పుకు మాత్రం జాబ్ వచ్చింది’అంటూ ఆమె చలోక్తులకు ప్రజలు కేరింతలు కొట్టారు. షర్మిల తన ప్రసంగం చివర్లో ‘బాయ్ బాయ్ బాబు..’అంటూ చెబుతూ చివర్లో ‘బాయ్ బాయ్ పప్పు’ అంటూ వేసిన పంచ్ డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్‌గా మారి హల్చల్ చేశాయి. ఈ విధంగా విజయమ్మ, షర్మిల తమదైన శైలిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఓటర్ల మనసు గెలుచుకున్నారు. పార్టీ ఘన విజయంలో తమ వంతు కీలక పాత్ర పోషించారు. -
మిస్టర్ కూల్
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మెజార్టీలో ముందుంటే తీవ్ర హైరానా పడిపోతారు. ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతారు. అయితే కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్ మాత్రం గురువారం నిర్వహించిన ఎన్నికల కౌం టింగ్‌లో ప్రత్యర్థి అభ్యర్థి టీజీ భరత్ ము ందంజలో ఉన్నా గెలుపు తననే వరిస్తుందన్న ధీమా కనబర్చడం ఆశ్చర్య పరిచింది. ఇండియా క్రికెట్ టీంలో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిలాగా తన గెలుపుపై ఏ మాత్రం ఆందోళన చెందకుండా చివరకు మూడు రౌండ్లు ఉండగానే విజయాన్ని అందుకున్నారు. తీవ్ర ఉత్కంఠగా సాగిన లెక్కింపు... కర్నూలు అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి హఫీజ్‌ఖాన్, టీడీపీ నుంచి టీజీ భరత్ బరిలో ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ రెండు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. ప్రతి రౌండు ఫలితం తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది. మొదట్లో పోస్టల్ బ్యాలెట్లో టీజీ భరత్ ఆధిక్యాన్ని కనబరిచారు. తరువాత కొన్ని రౌండ్లలో హఫీజ్‌ఖాన్, మరికొన్ని రౌండ్లలో టీజీ భరత్ అధిక్యాలను కనబరచారు. ఇలా మొత్తం 27 రౌండ్లలో 8వ రౌండ్ వరకు టీడీపీ 271 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉండేది. తరువాత 11వ రౌండ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 157 ఓట్ల ఆధిక్యం వచ్చింది. చివరకు 16వ రౌండ్ వరకు టీడీపీనే ఆధిక్యంలో ఉండడంతో కొన్ని టీవీ చానళ్లు టీజీ భరత్ విజయం సాధించినట్లు బ్రేకింగ్‌లు ఇచ్చారు. అయితే 17వ రౌండ్ వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీకి 3,248 ఓట్ల ఆధిక్యం వచ్చింది. తరువాత నుంచి ఆ మెజార్టీ తగ్గలేదు. మరో మూడు రౌండ్లు మిగిలి ఉండగానే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం కావడంతో టీజీ భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. హఫీజ్‌ఖాన్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆది నుంచి విజయంపై ధీమా కర్నూలు అసెంబ్లీలో 27 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంది. ఇందులో 16 రౌండ్ల వరకు టీడీపీ స్వల్ప అధిక్యం సాధిస్తూ వచ్చింది. దీంతో టీడీపీనే గెలుస్తుందని అందరూ భావించారు. అయితే, హఫీజ్‌ఖాన్ ఏ మాత్రం హైరానా పడలేదు. రోజాలో ఉన్నా ముఖంలో కళ తగ్గలేదు. ప్రార్థనలు చేస్తూ విజయం తనకే వరిస్తుందని..కౌంటింగ్ ప్రక్రియ ఒక్కసారిగా తనకు అనుకూలంగా మారుతుందని సహచరులకు చెప్పగా వారేవరూ నమ్మలేదు. ఆయన అన్నట్టుగానే 17 రౌండ్ నుంచి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీకి 3,248 ఓట్ల అధిక్యం వచ్చింది. అప్పటి నుంచి ఆయన మెజార్టీ పెరగడమే కానీ తగ్గలేదు. మూడు రౌండ్లు మిగిలి ఉండగానే విజయం సాధించారు. -
పార్టీ చరిత్రలో ఇదే ఘోర పరాభవం..!
సాక్షి, అమరావతి: ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ చూడనంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం పార్టీ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. తమ ఊహకు అందని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్మోహన్రెడ్డికి గెలుపు అవకాశాలున్నాయని భావించినా పైకి మేకపోతు గాంభీర్యం నటించిన నేతలు ఫలితాల తీరు చూసి అవాక్కయ్యారు. ఒక్క నాయకుడికీ నోట మాట రాని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. 150 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలవడమంటే ఆషామాషీ విషయం కాదని, క్షేత్రస్థాయిలో జగన్ పట్ల ఆ స్థాయి సానుకూలత ఉన్న విషయాన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమ అధినేత గుర్తించలేకపోయారనే అసహనం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. క్షేత్ర స్థాయి వాస్తవాలను పట్టించుకోకుండా కొందరు అధికారుల చెప్పు చేతల్లో ఉంటూ అంతా తనకు తెలుసున్న రీతిలో ఐదేళ్లు పాలన సాగించిన తమ అధినేత ప్రజల నాడి పట్టుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు చెప్పే కాకి లెక్కలు నమ్మి ప్రజల్లో ప్రభుత్వం పట్ల 70 శాతం సంతృప్తి ఉందనుకోవడం వల్లే ఇంత దారుణ ఓటమిని మూటగట్టుకోవాల్సివచ్చిందని వాపోతున్నారు. వ్యూహాలన్నీ తల్లకిందులు ఎన్నికల్లో తమ అధినేత అనుసరించిన వ్యూహాలన్నీ తల్లకిందులయ్యాయనే అభిప్రాయాన్ని పార్టీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రత్యర్థి అయితే కేసీఆర్‌ను తిట్టడం ద్వారా ఆంధ్రా సెంటిమెంటును రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నాలు వికటించాయని, మోదీని తిట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం బెడిసికొట్టిందని వాపోతున్నారు. పవన్ కళ్యాణ్‌తో రహస్య మిత్రుత్వం, కేఏ పాల్ వంటి వారిని రంగంలోకి దించి లబ్ధి పొందాలనుకోవడం వంటివన్నీ తమ పార్టీకే చేటు చేశాయని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తు ఏమిటి? మోదీతో వైరం పెట్టుకుని ఇష్టానుసారం ఆరోపణలు చేశారని, దీని పర్యవసానం తప్పకుండా ఉంటుందనే భయం వారిని వణికిస్తోంది. ఈ ఐదేళ్లలో చేసిన అవినీతి, తప్పులు తమను వెంటాడతాయని, ఇవన్నీ తమ అధినేతను ఎక్కడికి తీసుకెళతాయోననే ఆందోళనను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తిరుగులేని విజయాన్ని దక్కించుకున్న జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొని నిలబడడం కష్టమని మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వయసు మీద పడిన దశలో చంద్రబాబు వచ్చే ఐదేళ్లు పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారో అర్థం కావడంలేదని వాపోతున్నారు. మొత్తంగా ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణులు నైరాశ్యానికి లోనవడంతోపాటు తీవ్ర భయాందోళనల్లోకి నెట్టివేసింది. ఎన్టీయార్ అరుదైన ముద్ర.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రయోగాలకు తెరతీశారు. మొదటిసారి 1983లో గుడివాడ, తిరుపతి; 1985లో గుడివాడ, హిందూపూర్, నల్లగొండ; 1989లో హిందూపూర్, కల్వకుర్తి; 1994లో హిందూపూర్, టెక్కలి నుంచి పోటీ చేశారు. కల్వకుర్తిలో ఓటమిచెందిన ఆయన మిగిలిన అన్ని స్థానాల్లోనూ గెలిచారు. ఆయన నెగ్గిన అన్నిచోట్లతో పోలిస్తే 1994లో హిందూపూర్‌లో అత్యధికంగా 60,050 ఓట్లు, అత్యల్పంగా 1985లో గుడివాడనుంచి 7,597 ఓట్ల మెజారిటీ సాధించారు. -
అడ్రెస్ గల్లంతు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి నేతల అంతరంగం ఒక్కటేనన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. ఓటుతో తగిన బుద్ధి చెబుతూ లోప భూయిష్టమైన రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆ నేతలకు ప్రత్యక్షంగా హితవు పలికారు. ఇన్నాళ్ల పాటు జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు నేడు ఓటమిపాలు కావడంతో ఇప్పటిదాకా వారి వెంట ఉన్న అభిమానులు, కార్యకర్తలు అంతర్మథనంలో పడిపోయారు. పార్టీ మారిన నేతలకు వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి, భూమా అఖిలప్రియలకు ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అధికార పార్టీ చూపిన డబ్బు సంచులకు, మంత్రి పదవులకు అమ్ముడుపోయిన వారికి ఓటు వేసేది లేదని తెగేసి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కర్నూలులో టీజీకి ఎదురు దెబ్బ పారిశ్రామిక వేత్తగా, వ్యాపారవేత్తగా జిల్లా రాజకీయాలను శాసించే దురంధరులలో టీజీ వెంకటేశ్ ఒక్కరు. ప్రత్యర్థులను తన కాసులతోనే మట్టి కరిపించేందుకు పదును పెట్టే వ్యూహాలను రచించే మేధావి. నేడు తన కుమారుడు టీజీ భరత్ రాజకీయ అరంగేట్రంతో మరోసారి రాజకీయ చక్రాన్ని తిప్పాలని వ్యూహాలు పన్నారు. డబ్బులు, ప్రలోభాలతో ప్రజలను, నాయకులను మభ్య పెట్టారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభజనం ముందు టీజీ కుయుక్తులు పారకపోవడం, ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పడంతో టీజీ భరత్ ఓటమి పాలయ్యారు. వారసులుగా శిల్పా రవి, గంగుల నాని శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్రకిశోర్‌రెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు బ్రిజేంద్రరెడ్డి (నాని) అళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. వీరిద్దరూ విజయఢంకా మోగించడంతో ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ అభిమానుల్లో, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఓటమి పాలైన కేఈ శ్యాంబాబు గత ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేఈ కృష్ణమూర్తి రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. జిల్లాలో సీనియర్ బీసీ నేతగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. ఓ వైపు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా శ్యాంబాబు గెలుపు కోసం వ్యూహాలు రచించారు. అయితే ముఠా తగాదాలను జీర్ణించుకోలేని పత్తికొండ నియోజకవర్గ ప్రజలు కేఈ శ్యాంబాబును ఓటమి పాలు చేశారు. -
‘అతి సామాన్య’ విజయం..!
సాక్షి, అమరావతి: నాయకులకు జనం కష్టసుఖాలు తెలిసుండాలనేది వైఎస్సార్సీపీ అభిమతం. ఈ నేపథ్యమున్న ఏ నాయకుడికైనా ప్రజలు బ్రహ్మరథం పడతారన్న పార్టీ అధినేత నమ్మకం అక్షరాల రుజువైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అతి సామాన్యులు రాజకీయ దిగ్గజాలను ఢీ కొట్టారు. అంగ, అర్థ బలం ఉన్నవారిని సైతం అతి సామాన్య అభ్యర్థులు మట్టి కరిపించారు. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన తలారి రంగయ్య ఓ ప్రభుత్వోద్యోగి. డీఆర్డీఏలో పీడీగా పనిచేశారు. బీసీలకు పెద్దపీట వేయాలన్న వైఎస్ జగన్ ఆశయంతో ఉత్తేజితుడై ఎన్నికల్లోకొచ్చారు. టీడీపీ నేత జేసీ తనయుడు పవన్‌ను ఓడించారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నందిగం సురేష్ ఓ సాధారణ కార్యకర్త. టీడీపీ సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రిని ఈ ఎన్నికల్లో ఓడించారు. అరకు ఎంపీగా పోటీ చేసిన గొడ్డేటి మాధవి ఓ సాధారణ గిరిజన మహిళ. ప్రత్యర్థిగా బరిలో ఉన్న కిశోర్ చంద్రదేవ్ రాజవంశీకుడు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. అయినా మాధవి ప్రజాభిమానం పొందింది. హిందూపురం ఎంపీగా వైఎస్సార్సీపీ తరఫున నిలిచిన గోరంట్ల మాధవ్ పోలీసు ఉద్యోగి. ప్రజాసేవ ద్వారానే ఫ్యాక్షన్ మూలాలు పెకిలించాలని భావించిన మాధవ్.. హిందూపురంలో ప్రత్యర్థి నిమ్మల కిష్టప్పను మట్టి కరిపించారు. చిత్తూరు పార్లమెంట్ స్థానం వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన రెడ్డప్ప సైతం ఓ సాధారణ కార్యకర్తే. ఆయన ఎన్ శివప్రసాద్‌పై గెలుపొందారు. ఎచ్చెర్లలో సాధారణ కార్యకర్త గొర్లె కిరణ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావును ఓడించారు. పలాసలో ఓ సాధారణ వైద్యుడు అప్పలరాజు అధికార పార్టీ అభ్యర్థిని చిత్తు చేశారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో టీడీపీ కంచుకోటను రాజకీయాలకే కొత్త అయిన వైసీపీ అభ్యర్థి కలిదిండి శ్రీనివాస్ బద్దలు కొట్టారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కోళ్ల అప్పలనాయుడు ఏడుసార్లు, ఆయన కోడలు లలితకుమారి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ చరిత్రను శ్రీనివాస్ తిరగరాశారు. వైఎస్సార్సీపీలో సామాన్య నేతలైన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అభ్యర్థి ముప్పిడి వెంకట్రావ్, కృష్ణా జిల్లా పామర్రు అభ్యర్థి కైలే అనిల్‌కుమార్ ఘనమైన విజయం సాధించారు. కర్నూల్ జిల్లా నందికొట్కూర్‌లో మాజీ పోలీసు ఉద్యోగి ఆర్థర్ అధికార పార్టీని మట్టి కరిపించారు. ఇక రాజకీయ అనుభవం లేని అబ్బయ్య చౌదరి దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌పై గెలుపొందారు. -
ఫ్యాన్ సునామీ
ఫ్యాన్ సునామీ సృష్టించింది. ఈ ఉధృతికి సైకిల్ అడ్రెస్ లేకుండా కొట్టుకుపోయింది. గ్లాస్ ముక్కలుచెక్కలుగా పగిలిపోయింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ‘కంచుకోట’లో తిరుగేలేదని బలంగా చాటిచెప్పింది. జిల్లా ప్రజలంతా విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టారు. రాజకీయాల్లో విలువల పరిరక్షణకు, ప్రజలందరి శ్రేయస్సు కోసం పరితపిస్తున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారు. జిల్లాలోని అన్ని స్థానాలను ఒక పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మే 23 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా సరికొత్త చరిత్రను లిఖించింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ అన్నింటినీ గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చరిత్రలో తనదైన రికార్డును నమోదు చేసుకుంది. 2014 ఎన్నికల్లోనూ 14 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది. అలాగే రెండు ఎంపీ సీట్లనూ కైవసం చేసుకుంది. తదనంతరం ఇద్దరు ఎంపీలతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినప్పటికీ తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నామంటూ జిల్లా ప్రజలు స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తమకు అభిమానం తరిగిపోదని మరోసారి రుజువు చేశారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 14 అసెంబ్లీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీని రాజకీయ సమాధి చేసి.. వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారు. మరోవైపు జిల్లా రాజకీయాలను తమ చేతుల్లో బంధించుకుని నడిపిన కోట్ల, కేఈ కుటుంబాలను రాజకీయ సమాధి చేశారు. ఈసారి కూడా రెండు పార్లమెంటు స్థానాలనూ వైఎస్సార్సీపీకే ప్రజలు కట్టబెట్టారు. మొదటి నుంచి 13 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ కనిపించినప్పటికీ కర్నూలులో మాత్రం విజయం దోబూచులాడింది. రౌండు రౌండుకు ఉత్కంఠ పెంచింది. చివరకు కర్నూలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని నిరూపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు డాక్టర్లలో ఎంపీగా సంజీవ్‌కుమార్, కోడుమూరు ఎమ్మెల్యేగా సుధాకర్ గెలుపొందగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాటసాని రాంభూపాల్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ సారి కాటసాని జిల్లాలోనే అత్యధికంగా 43,857 ఓట్ల మెజార్టీ సాధించారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో మొదటి ఫలితం ఆదోని అసెంబ్లీ స్థానానిది వెలువడగా..చివరి ఫలితం పాణ్యం స్థానానిది వెలువడింది. పోస్టల్ బ్యాలెట్ల నుంచి మొదలైన వైఎస్సార్సీపీ ఆధిపత్యం చాలా నియోజకవర్గాల్లో చివరి రౌండ్‌వరకు కొనసాగుతూనే వచ్చింది. కోట్ల, కేఈ కుటుంబాలకు గుణపాఠం మొదటి నుంచి ఉప్పు–నిప్పుగా ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు తమ మధ్య విభేదాలు మరిచి తెలుగుదేశం పార్టీలో చేరాయి. కర్నూలు పార్లమెంటు నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేయగా.. పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. ముఖ్యంగా కోట్ల, కేఈ కుటుంబాలు కర్నూలు పార్లమెంటు పరిధిలో కలియతిరిగి.. గతంలో తమ వల్ల దెబ్బతిన్న కుటుంబాలు కలిసి పనిచేయాలని కోరారు. అయితే, వీరి వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చింది. ఈ కుటుంబాల రాజకీయాల వల్లనే కర్నూలు పార్లమెంటు వెనుకబడి ఉందన్న భావన వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి మరోసారి తమను మోసం చేసేందుకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఫలితంగా ఈ రెండు కుటుంబాలు పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ భారీ ఓటమిని గిఫ్టుగా ఇచ్చారు. గెలిచిన డాక్టర్లు కోడుమూరు నియోజకవర్గం నుంచి డెంటల్ డాక్టర్ జె. సుధాకర్, కర్నూలు పార్లమెంటు నుంచి డాక్టర్ సంజీవ్‌కుమార్ బరిలో నిలిచారు. ఇద్దరూ రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ప్రజాసేవ చేస్తారనే నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్లను కేటాయించింది. ఈ ఇద్దరూ రాజకీయ ఉద్దండులతోనే పోటీ పడ్డారు. కర్నూలు పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రి కోట్ల టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఆయనపై రాజకీయాలకు కొత్తగా వచ్చి పోటీ చేసిన సంజీవ్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక కోడుమూరు నుంచి బరిలో ఉన్న డాక్టర్ సుధాకర్ కూడా రాజకీయాలకు కొత్తే. ఈ నియోజకవర్గంలో ఒకవైపు కోట్ల, మరోవైపు విష్ణువర్దన్ రెడ్డితో పాటు కొత్తకోట ప్రకాష్ రెడ్డికూడా టీడీపీలోనే ఉన్నారు. వీరందరూ మూకుమ్మడిగా టీడీపీ అభ్యర్థి అయిన రిటైర్డు ఐఏఎస్ అధికారి రామాంజినేయులుకు మద్దతు పలికారు. అయితే, కోట్ల కుటుంబం నుంచి బయటకు వచ్చిన కోట్ల హర్షవర్దన్ రెడ్డి, రిటైర్డు ఎస్ఈ కృష్ణారెడ్డి వంటి నేతలు వైఎస్సార్సీపీ వెంట నడిచారు. అటువంటి రాజకీయ ఉద్దండులను వీరందరూ కలిసి ఢీ కొట్టి వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ సమకూర్చారు. వరుసగా రెండోసారి... డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బుగ్గన డోన్ నుంచి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు. రెండోసారి కూడా కేఈ ప్రతాప్‌పైనే విజయం సాధించారు. ఇక ఆలూరు నుంచి కూడా గుమ్మనూరు జయరాం వరుసగా రెండోసారి గెలుపొందారు. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. వరుసగా రెండోసారి... డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బుగ్గన డోన్ నుంచి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు. రెండోసారి కూడా కేఈ ప్రతాప్‌పైనే విజయం సాధించారు. ఇక ఆలూరు నుంచి కూడా గుమ్మనూరు జయరాం వరుసగా రెండోసారి గెలుపొందారు. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. కాటసాని ఆరోసారి.. అతి చిన్నవయసు నుంచే ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చరిత్ర కాటసాని రాంభూపాల్రెడ్డిది. 1985, 1989, 1994, 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి పాణ్యం శాసనసభ్యునిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విధేయునిగా ఉన్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంపై పార్టీ అభిమానులు, పాణ్యం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణరెడ్డికి నివాళి జిల్లా చరిత్రలో పత్తికొండకు ప్రత్యేక స్థానం ఉంది. కరువు పీడిత ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ను పోషించే ముఠా నాయకుల ఆగడాలను నిరోధించేందుకు చెరుకులపాడు నారాయణరెడ్డి చేసిన కృషి వెలకట్టలేనిది. ఆయన ప్రజలతో మమేకమైన తీరును చూసి ఎన్నికల్లో తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే కుట్రతో నారాయణరెడ్డిని అంతమొందించారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. ఆయన సతీమణి కంగాటి శ్రీదేవికి జిల్లాలో తొలి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయిస్తూ బహిరంగసభలో ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన కంగాటి శ్రీదేవి అలుపెరగని పోరాటం సాగించి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపు నారాయణరెడ్డికి ఘనమైన నివాళియేనని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. త్యాగానికి విజయ‘ఫలం’! గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు మంత్రి పదవుల కోసం పాకులాడి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పచ్చపార్టీలో చేరి మంత్రులుగా వెలగబెట్టిన నేతలకు బుద్ధి చెప్పేలా వ్యవహరించిన ఏకైక నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలకు కట్టుబడి తన ఎమ్మెల్సీ పదవిని తృణపాయంగా వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తద్వారా పార్టీ అభిమానుల్లో, ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆయన చేసిన త్యాగానికే విజయం వరించిందని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన వారు వీరే.. అసెంబ్లీ నియోజకవర్గం పేరు గెలిచిన అభ్యర్థి ఆలూరు గుమ్మనూరు జయరాం పాణ్యం కాటసాని రామిరెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రాలయం వై.బాలనాగి రెడ్డి ఆదోని వై.సాయి ప్రసాద్ రెడ్డి ఆళ్లగడ్డ గంగుల బీజేంద్రా రెడ్డి కోడుమూరు(ఎస్సీ) డాక్టర్ సుధాకర్ నంద్యాల శిల్పా రవించంద్ర కిశోర్ రెడ్డి ఎమ్మిగనూరు ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కర్నూలు హఫీజ్ ఖాన్ నందికొట్కూరు టి.ఆర్థర్ బనగానపల్లె కాటసాని రామిరెడ్డి పత్తికొండ కంగాటి శ్రీదేవి శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి ఎంపీలు కర్నూలు సింగరి సంజీవ్ కుమార్ నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి -
ఉండవల్లి వెలవెల తాడేపల్లి కళకళ..
విజయవాడ సిటీ: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూలమైన తీర్పు రావడంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వెలవెలబోగా, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివా సం ఉన్న తాడేపల్లి ప్రాంతం జన సందోహంతో కళకళలాడింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చరిత్రా త్మక విజయం సాధించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు గురువా రం తాడేపల్లిలోని జగన్ నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. మరోవైపు అక్కడికి సమీపంలోనే ఉన్న చంద్ర బాబు నివాసం వద్ద ఎలాంటి సందడి కనిపిం చలేదు. కౌంటింగ్ ప్రారంభమైన అరగంటలోనే పసుపు జెండాల రెపరెపలు ఆగిపోయాయి. నిన్నటి దాకా తొడలు కొట్టిన వాళ్లంతా ఇళ్లకే పరి మితమయ్యారు. ఉండవల్లిలోని ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, పరిసరాలు నిర్మాను ష్యంగా మారాయి. ఉదయం 9 గంటలకే ఫలి తాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం కావడంతో టీడీపీ అధికార ప్రతిని« దులంతా బయటకు రాలేదు. ఒక్కరు కూడా మీ డియా పాయింట్‌కు రాకపోవడంతో ఎప్పుడూ కిటకిటలాడే ఆ ప్రాంతం బోసిపో యింది. వైఎస్సార్సీపీ జెండాల రెపరెపలు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడే పల్లిలోని తన నివాసంలో ఉండి, ఎన్నికల ఫలి తాలను టీవీలో వీక్షించారు. కుటుంబ సభ్యులు, ఆంతరంగికులతో కలిసి ఫలితాలను సమీక్షిం చారు. అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలివ చ్చారు. వారి రాకతో తాడేపల్లి కిటకిటలాడింది. అడుగడుగునా వైఎస్సార్సీపీ జెండాలు రెపరెప లాడాయి. విజయోత్సాహంతో కుర్రకారు జోరుకు అడ్డే లేకుండా పోయింది. బాణాసంచా మోతలతో తాడేపల్లి దద్దరిల్లిపోయింది. మహిళా నేతలు, అభిమానులు నృత్యాలు చేశా రు. వైఎస్ జగన్ నివాసం ముందు భారీగా బాణసంచా కాల్చారు. ‘ఇదే ప్రజాతీర్పు.. బై బై బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్ర హ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్, విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ ఉన్నతా ధికారులు జగన్ కలిసిన వారిలో ఉన్నారు. -
నారి.. విజయ విహారి
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 15 మందికి, టీడీపీ 19 మంది మహిళలకు టికెట్లు కేటాయించాయి. వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన 15 మందిలో 13 మంది విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన 19 మందిలో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని ఒక్కరే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 187 మంది పోటీ చేయగా 14 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. పాతపట్నం నుంచి రెడ్డిశాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి, కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి, పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ, నగరి నుంచి ఆర్.కె. రోజా, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. విశాఖపట్నం తూర్పు నుంచి ఎ.విజయనిర్మల, పెద్దాపురం నుంచి తోట వాణి ఓడిపోయారు. అలాగే అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి సత్యవతి, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వంగా గీత, అరకు లోక్‌సభ స్థానం నుంచి గొడ్డేటి మాధవి విజయం సాధించారు. -
బాబు భ్రమలకు మహిళలు బ్రేక్
ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మహిళలు బ్రహ్మరథం పట్టారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో పాటు.. ప్రాంతాలకతీతంగా మహిళలంతా ముక్తకంఠంతో జననేతకు జై కొట్టారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసి.. తీరా ఎన్నికల వేళ పసుపు–కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెడదామనుకున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పారు.. సాక్షి, అమరావతి : తమను గెలిపిస్తుందని చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న పసుపు – కుంకుమ పథకం టీడీపీని చావు దెబ్బే తీసింది. ఐదేళ్లుగా అనేక రకాలుగా మోసం చేసినా రాష్ట్రంలో 95 లక్షల మంది దాకా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఏదో ఒక తాయిలం ఇస్తే వాళ్ల ఓట్లన్నీ తనకే పడతాయని భ్రమల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు మహిళలను విశేషంగా ఆకట్టుకోవడంతో వైఎస్సార్సీపీకి వారంతా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,13,33,631 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 1,98,79,421 మంది మహిళా ఓటర్లే. కాగా 1,57,87,759 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహిళలు అత్యధికంగా ఓట్లు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. మొత్తం సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మాఫీ పేరుతో మాయ మొత్తం 1.98 కోట్ల మంది మహిళా ఓటర్లలో దాదాపు కోటి మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికల వాగ్దానంలో భాగంగా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జీరో వడ్డీ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల తాయిలం ప్రకటించారు. సరిగ్గా పోలింగ్‌కు రెండురోజుల ముందు ప్రభుత్వ ఖజానా నుంచి డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చారు. దీంతో మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయని, గెలుపు తమదేనని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తీరా టీడీపీకి మహిళలు దిమ్మ తిరిగిపోయే ఫలితాన్నివ్వడంతో డీలాపడిపోయారు. -
‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో సంబరాలు
-
టీడీపీ ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సునామీలో టీడీపీ ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి. రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి టికెట్లు దక్కించుకుంటే వారికి ఘోర పరాజయం తప్పలేదు. దశాబ్దాల వైరాన్ని మరచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో సర్దుబాటు చేసుకుని మరీ పోటీకి దిగిన ఆ కుటుంబానికి చేదు అనుభవమే మిగిలింది. చంద్రబాబుకు ముందస్తుగా విధించిన షరతు మేరకు కోట్ల తాను కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి తన భార్య సుజాతమ్మను ఆలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో వారిద్దరూ ఓడిపోయారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు కేఈ శ్యాంబాబును పత్తికొండ నుంచి సోదరుడు కేఈ ప్రతాప్‌ను డోన్ నుంచి బరిలోకి దించారు. వారిద్దరూ వైఎస్సార్సీపీ ముందు నిలవలేకపోయారు. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి.. నంద్యాల నుంచి ఆమె సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి.. ఆయన అల్లుడు, కుమార్తెలు నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు. పోలింగ్ అయ్యాక ఎస్పీవై రెడ్డి మరణించారు. కానీ.. ఆ ఫ్యామిలీ మొత్తం ఓడింది. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయులు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. సినీ నటుడు బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి.. చిన్న అల్లుడు భరత్ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, ఆత్మకూరు నుంచి ఆయన సోదరుడు కృష్ణయ్య టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. మంత్రి గంటా శ్రీనివాసరావు.. మరో మంత్రి పి.నారాయణ, భీమవరం మాజీ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు వియ్యంకులు. గంటా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటమి అంచున ఉన్నారు. నెల్లూరు, భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన ఇద్దరు వియ్యంకులు ఓటమిపాలయ్యారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అశోక్ గజపతిరాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అథితి ఓడిపోయారు. -
ఓటమితో తెగబడిన పచ్చమూకలు
అనంతపురం సెంట్రల్/పిడుగురాళ్ల/బొల్లాపల్లి (గుంటూరు) : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగడంతో టీడీపీ శ్రేణుల్లో అసహనం పెల్లుబికింది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై వేటకొడవలితో దాడిచేయగా.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న వారిపై మహిళలు కారం చల్లగా.. టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడిచేశారు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, ఇదే జిల్లా బొల్లాపల్లి మండలంలోనూ టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గొల్ల వెంకటేశ్ యాదవ్ తమ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఉత్సాహంతో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టీడీపీ నాయకుడు, మార్కెట్ యార్డు చైర్మన్ దొడగట్ట నారాయణ తన కుటుంబ సభ్యులు మధు, అశోక్‌లను ఉసిగొల్పి వెంకటేశ్‌పై దాడికి తెగబడ్డాడు. మధు, అశోక్‌లు వేట కొడవలితో దాడిచేయగా వెంకటేశ్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే బాధితుడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు పట్టణ పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇదే జిల్లా పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు చంద్రశేఖర్‌రెడ్డి, సోమశేఖర్రెడ్డిలపై టీడీపీ నేత.. ఎంపీపీ భర్త కేశవయ్య, వడ్డే శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుష్పనాథ్, శ్రీనాథ్, శంకరయ్య, రాజప్ప, శ్రీనివాసులు, లక్ష్మయ్య, గజేంద్రలు రాళ్లతో దాడిచేశారు. దాడిలో చంద్రశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు వేరే వాహనాలలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికీ గాయాలయ్యాయి. బాధితులను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక పెనుకొండలో వైఎస్సార్సీపీ గెలవడంతో గోరంట్లలోని బీసీ కాలనీకి చెందిన పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటుండగా.. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను స్టేషన్ పిలిపించి మందలించారు. అనంతరం పోలీసుస్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు నాగరాజు, శివప్ప, రవి తదితరులు.. ఇంటివద్ద ఉన్న అక్కమ్మ, రగప్ప దంపతులతో పాటు ప్రసాద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడిచేశారు. దాడిలో అక్కమ్మ తీవ్రంగా గాయపడింది. ఇక అనంతపురంలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్త ద్విచక్రవాహనంపై తన అభిమానాన్ని తెలియజేసేందుకు జెండా కట్టుకుని మంత్రి పరిటాల సునీత నివాసం ముందు నుంచి వస్తుండగా.. అక్కడే ఉన్న టీడీపీ రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనుచరులు అతడిని పట్టుకుని కొట్టారు. ఒంటరిగా వస్తున్న యువకుణ్ణి పదుల సంఖ్యలో టీడీపీ అనుచరులు కలిసి చితకబాదారు. అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీలో రౌడీషీటర్ మనోహర్‌నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. స్థానికంగా నివాసముంటున్న చంద్రశేఖర్‌రెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై కట్టెలతో దాడిచేశారు. రౌడీషీటర్‌తో పాటు మరో పదిమంది ఈ దాడిలో పాల్గొన్నారు. పిడుగురాళ్లలో మాటువేసి దాడి ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ విజయోత్సవ ర్యాలీపై గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో టీడీపీ నేతలు ఊహించని విధంగా దాడిచేశారు. వైఎస్సార్సీపీ విజయం ఖాయం కావడంతో గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ముదిరాజ్ బజార్‌కు ర్యాలీ ప్రవేశిస్తుండగా అప్పటికే పక్కా ప్రణాళికతో కాపు కాసిన మహిళలు డాబాల మీద నుంచి ర్యాలీపై కారంపొడి చల్లారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే టీడీపీ నాయకులు.. చల్లా కోటిరెడ్డి, సుంకు పవన్‌రెడ్డి, ఎంపీటీసీ భర్త గున్నంరెడ్డి శెవిరిరెడ్డిలపై వేటకొడవళ్లు, గొడ్డళ్లతో దాడిచేశారు. దీంతో చల్లా కోటిరెడ్డి తల వెనుక భాగంపై, మెడపై నరం తెగడంతో తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమంగా మారింది. చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ నుంచి నరసరావుపేటకు తరలించారు. సుంకు పవన్‌రెడ్డికి తలపై, ఎడమ కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీటీసీ భర్త శెవిరిరెడ్డికి నుదురు భాగంలో గాయమైంది. కాగా, ఇదే సమయంలో పొలం నుంచి ద్విచక్ర వాహనంపై గ్రామంలోకి వస్తున్న ముడేల శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి అక్కడినుంచి పరారయ్యారు. అనంతరం.. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనతో ఎలాంటి సంబంధంలేని గున్నంరెడ్డి రంగారెడ్డిని పోలీసులు చితకబాదడంతో అతని కంటి భాగంలో తీవ్రగాయమైంది. గ్రామంలో పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. రాళ్లు, కర్రలతో దాడి కాగా, ఇదే జిల్లా బొల్లాపల్లి మండలం గండిగనుమల పంచాయతీ శివారు షోలాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో మహిళలని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు. దీంతో జవిశెట్టి రాములమ్మ, బత్తి ముసలయ్యలకు గాయాలయ్యాయి. వీరితో పాటు చిన్నారులు లక్ష్మీ, గురవయ్య కూడా గాయపడినట్లు బాధితులు తెలిపారు. తనను కాళ్లతో ఛాతీపై తన్నినట్లు రాములమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. బాధితులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
గెలుపు సూత్రం ఇదే..
ఇచ్చిన మాటకు ఆరునూరైనా కట్టుబాటు...చెక్కుచెదరని ధైర్యంతో ముందడుగు...ఆపదొస్తే అందరికీ నేనున్నాననే ఓదార్పు...అవసరమైతే కొండనైనా ఢీ కొట్టే తెగింపు...జన యాత్రలతో మమేకమయ్యే ఓర్పు... ఉక్కు సంకల్పంతో పోరాడే నేర్పు...భవితకు భరోసా ఇచ్చే చల్లని చూపు...‘అన్నా’ అంటూ అక్కున చేర్చుకునే పిలుపు...నైతిక విలువలే ప్రధానమనే తీర్పు...సడలని దీక్షకు అతడే ఓ గుర్తింపు... సాక్షి, అమరావతి: మాట తప్పని, మడçమ తిప్పని రాజకీయ వారసత్వానికి లభించిన తిరుగులేని అఖండ విజయమిది. పాదయాత్రికుడి కష్టం ఫలించిన తరుణమిది. ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడించిన దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడి, విశ్వసనీయతకు ప్రజలు పట్టం గట్టిన రోజు ఇది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలనే ఆలంబనగా చేసుకుని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన నవరత్నాలపై ప్రజలకు కుదిరిన నమ్మకమిది. దృఢ వ్యక్తిత్వం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాలనే ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థుల కుట్రలను తుత్తునియలు చేస్తూ ఒంటి చేత్తో తన పార్టీకి అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. 2014 ఎన్నికల ఓటమిని ఓ అనుభవంగా తీసుకున్న జగన్, తొలుత తన బలాబలాలేమిటో కచ్చితంగా అంచనా వేసుకోవడంతోపాటు పార్టీలో ఉన్న లోటుపాట్లపై క్షుణ్నంగా అధ్యయనం చేశారు. పార్టీ శ్రేణులను ప్రజలతో మమేకమయ్యే విధంగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు సర్కార్ మోసంతో నిరాశకు లోనైన రైతులు, మహిళలు, నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు. ఎన్నో దీక్షలు, ఆందోళనలు ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అధికార పక్షం శాసనసభలో స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కే యత్నం చేసినా చలించకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే స్థాయికి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. ప్రజాసంకల్పంతో ప్రజల హృదయాల్లోకి.. ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్ర వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. 341 రోజుల పాటు 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయడం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. ఈ యాత్రలో మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా అన్ని వయసుల వారు, వర్గాల వారు జగన్‌ను తమ ఆత్మీయుడిగా అక్కున చేర్చుకున్నారు. పాదయాత్ర ద్వారా జనాదరణ పొందడాన్ని జీర్ణించుకోలేని శక్తుల కుట్ర ఫలితంగా జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీన్ని అధికార పక్షం గేలి చేస్తూ మాట్లాడినప్పటికీ.. జగన్ సంయమనం, హుందాతనం ఆకట్టుకున్నాయి. నవరత్నాలతో నమ్మకం: అన్ని వర్గాల లబ్ధికి జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ‘గడప గడపకూ వైఎస్సార్’, ‘రావాలి జగన్ – కావాలి జగన్’, ‘వైఎస్సార్ కుటుంబం’ వంటి కార్యక్రమాలను చేపట్టారు. 175 నియోజకవర్గాల్లో ప్రతి బూత్లోనూ పార్టీ జెండా పట్టుకుని ఓట్లేయించే కార్యకర్తలను పార్టీకి సమకూర్చుకోగలిగారు. శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో జగన్ ఎక్కడా రాజీ పడలేదు. ఇడుపులపాయలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఒకే రోజు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రత్యేక హోదాపై రాజీలేని పోరు: ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టని టీడీపీ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ జగన్ పోరాటానికి నడుం కట్టారు. కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షంగా, భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా ఊసు ఎత్తకపోవడం ఆ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో మసకబార్చింది. జగన్ ప్రత్యేక హోదా అవసరం ఎంతగా ఉందో తెలియజెబుతూ యువభేరీ సదస్సులు నిర్వహించారు. గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఫలించిన బీసీ డిక్లరేషన్ బీసీల అభ్యున్నతికి ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు చేసిన సూచనలకు అనుగుణంగా ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో జగన్ చేసిన బీసీ డిక్లరేషన్ వెనుకబడిన వర్గాలపై ఒక మంత్రంగా పనిచేసింది. ప్రభుత్వ పరిధిలోని నామినేటెడ్ పదవులన్నింటిలోనూ, కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా 41 మంది బీసీ అభ్యర్థులకు అసెంబ్లీ సీట్లు, ఏడుగురికి ఎంపీ సీట్లను కేటాయించారు. వీటన్నింటికీ తోడు ‘నిన్ను నమ్మం బాబూ’.. ‘బైబై బాబూ’.. ‘రావాలి జగన్– కావాలి జగన్’ నినాదాలు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఒక నాయకుడు పట్టుదలతో పోరాడితే దక్కేది ఘన విజయమేనని నిరూపించారు. -
జనం నమ్మని జనసేన
సాక్షి, అమరావతి: సినీ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఓటర్లు మట్టి కరిపించారు. ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా తిరిగి టీడీపీ గెలుపు కోసమే ఆ పార్టీ పోటీ చేస్తోందని విశ్వసించిన ఓటర్లు ఆ పార్టీని పూర్తిగా తిర్కసరించారు. భీమవరం (పశ్చిమగోదావరి), గాజువాక (విశాఖపట్నం)ల నుంచి పోటీ చేసిన పవన్ రెండుచోట్లా ఓడారు. మొత్తం 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే కేవలం ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే అత్తెసరు మెజార్టీతో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఏడు శాతం లోపు ఓట్లు మాత్రమే దక్కించుకుంది. టీడీపీతో కుమ్మక్కు రాజకీయాల వల్లే.. 2014 ఎన్నికల ముందే జనసేన పార్టీని ఏర్పాటు చేసినా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చింది. ఆ తర్వాత కూడా పవన్ దాదాపు నాలుగేళ్ల పాటు టీడీపీకే ప్రతి సందర్భంలో మద్దతిస్తూ వచ్చారు. ప్రశ్నించడానికే జనసేన స్థాపించానంటూ వల్లె వేస్తూ వచ్చిన పవన్.. చంద్రబాబు ప్యాకేజీలకు ‘ఖర్చ’వుతూ వచ్చారు. తిరిగి ఈ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి చంద్రబాబును విభేదిస్తూ తన రాజకీయాలను కొనసాగించారు. అయితే, ఈ కాలంలో టీడీపీపై అప్పడప్పుడూ విమర్శలు చేసినా.. రహస్య మిత్రులుగా కొనసాగుతూ వచ్చారన్న విమర్శలున్నాయి. సీఎం తనయుడు లోకేష్ పోటీ చేసే మంగళగిరిలో కనీసం జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా సీపీఎంనే పవన్ పోటీలో ఉంచారు. సీఎం చంద్రబాబు సైతం పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. పవన్ వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించిన ఓటర్లు.. కర్రుకాల్చి వాత పెట్టారు. పవన్‌తోపాటు నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడు కొణిదెల నాగబాబును సైతం చిత్తుగా ఓడించారు. అక్కడ వైఎస్సార్సీపీ ప్రభంజనంలో నాగబాబు మూడో స్థానానికి దిగజారారు. -
అక్కచెల్లెమ్మల ఆత్మీయత జగన్‌కే..
సాక్షి, అమరావతి: అమ్మ దీవించింది. అవ్వా తాతలు ఆశీర్వదించారు. అక్కచెల్లెమ్మలు ఆత్మీయత పంచారు.. అన్నా తమ్ముళ్లు అండగా నిలిచారు. అఖిలాంధ్ర ఓటర్లు జననేతకు బ్రహ్మరథం పట్టారు. వయో భేదం లేకుండా వైఎస్ జగన్ విజయాన్నే కోరుకున్నారు. కులమతాలు, ప్రాంతాలతో ప్రమేయం లేకుండానే జగన్ వైపే జనం నిలిచారు. వెన్నుపోటు రాజకీయం బతుకు భరోసా లేకుండా చేస్తుందనే కసితో జనం ఓటేశారు. విపక్ష నేతగా ప్రజల కోసం పోరాడిన జగన్‌ను గెలిపించుకోవడం బాధ్యతగా భావించారు. భావితరాల కోసం ఆయననే గెలిపించాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇప్పుడు గెలిచింది ప్రజలు.. వారి విశ్వాసం. నమ్మకం. అవధులు లేని ఆనందం ‘నా అన్నే సీఎం అయ్యాడు’ అని ప్రతీ చెల్లీ భావిస్తోంది. ‘నా తమ్ముడే సీఎం అయ్యాడు’ అని ప్రతీ అక్కా ఆనందపడుతోంది. ‘మనవడొచ్చాడు’ అంటూ అవ్వాతాతల్లో ఆనందం కన్పిస్తోంది. ‘గెలిచామన్నా’ అనేది తమ్ముళ్ల సంతోషం. ఇక రైతే రాజని కర్షకులు.. కష్టానికి ఫలితమొచ్చిందని కార్మికులు భావిస్తున్నారు. చావు బతుకుల్లో పోరాడుతున్న రోగులకు జగన్ గెలుపు ధైర్యాన్నిస్తుంది. ఆరోగ్యశ్రీ ఆయువు పోస్తుందనే ధీమా తెచ్చింది. రాష్ట్రానికి హోదా దక్కుతుందన్న ధీమా ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. జిమ్మిక్కులు లెక్కచేయని అక్కచెల్లెమ్మలు.. తాయిలాలు ఇస్తే ఎన్నికల్లో మహిళలు ఓట్లు వేయరనే విషయం ఈ ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ఏ అక్కాచెల్లీ నమ్మలేదు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి తీరాలని తీర్మానించుకున్నారు. ‘ఈ తాయిలం మాకెందుకు... జగన్ గెలిస్తే ఇంతకన్నా ఎన్నో రెట్లు మేలు జరుగుతుంది’ అని చెప్పి మరీ అక్కాచెల్లెమ్మలు ఓట్లేశారు. అవ్వాతాతలదీ అదే దారి. పాదయాత్రలో కష్టాలు చెప్పినప్పుడు జగన్ కరిగిపోయాడు. అధికారంలోకొస్తూనే అందరికీ పింఛన్ ఇస్తానన్నాడు. ఇచ్చే పింఛన్ పెంచుతానన్నాడు. చంద్రబాబు హడావుడిగా పింఛన్ పెంచేశారు. జగన్ మాటతోనే ఇంత కదలిక వస్తే.. ఆయనే సీఎం అయితే.. ఆ నమ్మకమే అవ్వాతాతలు జగన్‌కు ఓటేసేలా చేసింది. అదిగో మన నేత.... ‘అదిగో ఆయనే. మన ఇంటికొచ్చింది ఆయనే. మనతో కలిసి నడిచిందీ ఆయనే’ ఆనందం మేళవించిన అనుభూతిలో జనహృదయ స్పందన ఇది. నిన్నటిదాకా తమ ముందే తిరిగిన నేత రాష్ట్రాధినేత అవ్వడంతో ప్రజలు మురిసిపోతున్నారు. పాదయాత్రలో జగన్‌తో సెల్ఫీ దిగని వ్యక్తి లేరు. హారతులు పట్టని పల్లె లేదు. ఆదరించని ఊరు లేదు. మండువేసవిలోనూ, జోరువానలోనూ జననేతతో అడుగులో అడుగులేశారు. ఎముకలు కొరికే చలిలోనూ తమ నేత కోసం పడిగాపులుగాశారు. ప్రజల కష్టాలను విన్నారు. వారికి భరోసా ఇచ్చారు. పాదయాత్రలో ప్రతీ అడుగూ జన ప్రభంజనమే. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి.. తమవాడే అన్న నమ్మకం కలిగించిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠమెక్కాడనే గర్వం జనంలో స్పష్టంగా కన్పిస్తోంది. రాక్షస సంహారమే... వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని ప్రజలు నరకాసుర సంహారమే అంటున్నారు. కష్టాలను అనుభవించిన వాళ్లు, కసితో ఓటేసిన వారి అభిప్రాయమది. ఐదేళ్లుగా గిట్టుబాటు ధర లేని రైతు గుండె మంట నుంచీ వచ్చే మాటిది. రుణమాఫీ ద్వారా మోసపోయిన రైతుల, దగాపడ్డ అక్కచెల్లెమ్మల ఆవేదనిది. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆక్రందనల ఫలితమిది. జన్మభూమి కమిటీల దోపిడీ మూకలపై జనం తిరుగుబాటిది. అధికార అహంకారంపై ప్రభుత్వ ఉద్యోగుల కన్నెర్ర ఫలితం ఇది. సహజ వనరులను దోచుకుని, నల్లధనంతో విపక్ష ఎమ్మెల్యేలను సంతలో çపశువుల్లా కొన్న అప్రజాస్వామిక విధానాలకు చెప్పిన గుణపాఠమిదని ప్రజలు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీకి మహిళల బ్రహ్మరథం తమను గెలిపిస్తుందని చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న పసుపు– కుంకుమ పథకం టీడీపీని చావు దెబ్బే తీసింది. ఐదేళ్లుగా అనేక రకాలుగా మోసం చేసినా రాష్ట్రంలో 95 లక్షల మంది దాకా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఏదో ఒక తాయిలం ఇస్తే వాళ్ల ఓట్లన్నీ తమకే పడతాయని భ్రమల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు మహిళలను విశేషంగా ఆకట్టుకోవడంతో వైఎస్సార్సీపీకి వారంతా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,13,33,631 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 1,98,79,421 మంది మహిళా ఓటర్లే. కాగా 1,57,87,759 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహిళలు అత్యధికంగా ఓట్లు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. మొత్తం సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మాఫీ పేరుతో మాయ మొత్తం 1.98 కోట్ల మంది మహిళా ఓటర్లలో దాదాపు కోటి మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికల వాగ్దానంలో భాగంగా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జీరో వడ్డీ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల తాయిలం ప్రకటించారు. సరిగ్గా పోలింగ్‌కు రెండురోజుల ముందు నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చారు. దీంతో మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయని, గెలుపు తమదేనని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తీరా టీడీపీకి మహిళలు దిమ్మ తిరిగిపోయే ఫలితాన్నివ్వడంతో డీలాపడిపోయారు. -
గల్లంతైన బాబు కేబినెట్!
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మంత్రివర్గం దాదాపు గల్లంతైంది. 24 మంది మంత్రుల్లో 22 మంది పోటీచేయగా 19 మంది ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రజల గురించి పట్టించుకోకుండా ఐదేళ్లు ఇష్టారాజ్యంగా అవినీతి వ్యవహారాల్లో మునిగితేలిన మంత్రులపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శాఖలపై ఏమాత్రం పట్టులేకుండా, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ, ప్రతిరోజూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్న మంత్రులందరినీ ప్రజలు ఇంటిదారి పట్టించారు. చంద్రబాబు వీరవిధేయుడిగా ఆయన మంత్రివర్గంలో కీలకమైన జలవనరుల శాఖ నిర్వహిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంలో ఓటమిపాలయ్యారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, జగన్ అధికారంలోకి రావడం కలేనని డబ్బా కొట్టుకున్నా మైలవరం ప్రజలు మాత్రం ప్రజాప్రతినిధిగా పనికిరారని తేల్చి ఇంటికి పంపారు. దీంతో ఉమా నోటికి తాళం పడింది. తమ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్.. దేవినేని ఉమను ఓడించారు. కొల్లు, ప్రత్తిపాటి, సోమిరెడ్డి, నక్కా, ఆది సైతం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర.. గుంటూరు జిల్లాకు చెందిన నక్కా ఆనంద్‌బాబుకు వేమూరులో పరాభవం ఎదురైంది. చంద్రబాబు కేబినెట్లో వ్యవ సాయ శాఖ మంత్రులుగా పనిచేసిన ఇద్దరూ ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు, ఆ తర్వాత ఆ శాఖను చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరాజయం పొందారు. పుల్లారావు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి విడదల రజనీ చేతిలో ఓడి పోయారు. సోమిరెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అలాగే, వ్యవసాయంలో అంతర్భాగంగా ఉన్న పశుసంవర్థక శాఖకు మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి కూడా కడప లోక్‌సభ నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ‘కళా’ కూడా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ మంత్రి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓడిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన ఓడిపోవడం టీడీపీ పతనావస్థను తెలుపుతోంది. - ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా రకరకాల సమీకరణలతో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసిన పితాని సత్యనారాయణ, చెరకువాడ రంగనాథ రాజు చేతిలో ఓటమి చవిచూశారు. - గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచి మంత్రి అయిన కేఎస్ జవహర్‌పై అక్కడి కేడర్ తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు ఆయనకు కృష్ణా జిల్లా తిరువూరు సీటిచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. తిరువూరులో వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి చేతిలో జవహర్ ఓడిపోయారు. - చంద్రబాబు కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఘోరంగా ఓడిపోయారు. - ఇటీవల వరకూ మంత్రిగా ఉన్న అదే జిల్లాకు చెందిన కిడారి శ్రావణ్‌కుమార్ అరకులో పరాజ యం పాలయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చడంతో ఆయన కొడుకు శ్రావణ్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి సానుభూతి కార్డు ప్రయోగించినా ప్రజలు మాత్రం తిరస్కరించారు. - వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరా యించి మంత్రి పదవులు పొందిన సుజయకృష్ణ రంగారావు, అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవి పొందిన ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగా పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు. - మంత్రిగా ఉండి ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగిన శిద్ధా రాఘవరావుకూ ఓటమి తప్పలేదు. - చంద్రబాబు సన్నిహితుడిగా.. ఆయన మంత్రివర్గంలో కీలకంగా ఉండి, రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మరో మంత్రి నారాయణ నెల్లూరు సిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. - ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన కుమారుడు శ్యాంబాబును పత్తికొండలో పోటీ చేయించినా గెలిపించుకోలేక చతికిలపడ్డారు. ఆయన సోదరుడు కేఈ ప్రతాప్ కూడా డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. - అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కొడుకు శ్రీరామ్‌ను గెలిపించలేక చేతులెత్తేశారు. - సమాచార శాఖ మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసరావుకూ రాయదుర్గంలో పరాభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడు, విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాత్రమే అతికష్టంపై గెలిచారు. మిగిలిన మంత్రులంతా ఓడిపోవడంతో రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు కేబినెట్ అత్యంత ప్రజావ్యతిరేకమైనదిగా స్పష్టమైంది. మంగళగిరిలో బోర్లాపడ్డ లోకేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో పరాభవం తప్పలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న ఈ స్థానంలో గెలుపొందేందుకు లోకేశ్ వందల కోట్లు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుచేశారు. అయినా ప్రజలను ఆకర్షించలేకపోవడం, తరచూ తప్పులు మాట్లాడుతుండడంతో ప్రజల్లో బాగా చులకనైపోయారు. అయినా, చంద్రబాబు తన తనయుణ్ణి గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేకపోయారు. నిజానికి ఎమ్మెల్యేగా పోటీచేసే పలువురిని ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించిన చంద్రబాబు లోకేశ్‌ను మాత్రం రాజీనామా చేయించలేదు. ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినా దొడ్డిదారిన వచ్చిన ఎమ్మెల్సీ పదవితో కాలక్షేపం చేసే ఉద్దేశంతో లోకేశ్ ఆ పదవిని అంటిపెట్టుకునే ఉన్నారు. ఏమాత్రం సమర్థత లేకపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయడం, ఏకంగా కీలకమైన మూడు శాఖలు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వచ్చినా చంద్రబాబు లెక్కచేయలేదు. కొడుకును పార్టీపైనా, ప్రజలపైనా రుద్దేందుకు ప్రయత్నించినా ప్రజాక్షేత్రంలో మాత్రం విఫలంకాక తప్పలేదు. -
ఫ్యాన్ విజయ దుందుభి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం పట్టారు. ఇటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం మొదలు అటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఫ్యాన్ గాలికి సైకిల్ కకావికల మైంది. టీడీపీ కంచుకోటలకు బీటలు పారాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, టీడీపీ లోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ ఒక్కరే గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచిన వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. టీడీపీ 20 స్థానాలతోనే సరిపెట్టు కుంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 102 స్థానాల్లోనూ, బీజేపీ నాలుగు చోట్ల గెలు పొందగా మరో ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. తూర్పు గోదావరి జిల్లా రాజో లులో మాత్రమే జనసేన నెగ్గింది. పవన్ కల్యాణ్ సోదరుడు, సినీనటుడు నాగబాబు నర్సాపురం లోక్ సభ స్థానంలో ఓటమి పాలయ్యారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఆ రెండుచోట్లా ఘోర పరాజయం పొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పలు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. అన్ని స్థానాల్లో ఫ్యాన్ క్లీన్‌స్వీప్ చేసింది. 2014 ఎన్నిక లతో పోల్చితే ఈ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైస్సార్సీపీ పూర్తి ఆధిక్యత కనబర్చింది. వైఎస్సార్, విజయనగరం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కుప్పంలో తగ్గిన చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలకు గాను 29 స్థానాలను టీడీపీకి కట్టబెట్టారు. పశ్చిమలో ఆ పార్టీ మొత్తం 15 స్థానాలనూ నెగ్గింది. బాబు సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేశారని భావించినవారు... ఉప్పెనలా స్పందించి టీడీపీ పునాదులను పెకలించారు. ఈసారి టీడీపీని ఆరు స్థానాలకే పరిమితం చేశారు. బీసీ రిజర్వేషన్‌పై మోసం చేసినందుకు కాపులు చంద్రబాబుకు గట్టి గానే బుద్ధి చెప్పారు. ఇదే సామాజిక వర్గంపై గంపె డాశలు పెట్టుకున్న జనసేనకు చుక్కలు చూపించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరంలో పోటీ చేసి బొక్కబోర్లా పడ్డారు. నవరత్నాలు, మహా నేత వైఎస్‌లా మాటపై నిలబడతారనే నమ్మకంతో జగన్ వైపే మొగ్గు చూపారు. సంప్రదాయంగా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే బీసీలలో బలమైన శెట్టిబలిజ, గౌడ సామాజిక వర్గాలు జగన్ ప్రకటించిన ఏలూరు బీసీ డిక్లరేషన్‌తో వైఎస్సార్సీపీ వైపు ఆకర్షితుల య్యారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒక్క సీటు కూడా గెలవని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి 13 సీట్లలో విజయ ఢంకా మోగించింది. పశ్చిమ గోదా వరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభా కర్ అసెంబ్లీ చిత్తుగా ఓడిపోయారు. చింతమనేనిపై 17,459 ఓట్ల తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణపై ఆచం టలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు 12,231 ఓట్ల తేడాతో గెలుపొందారు. భీమవరంలో జనసేన అధ్య క్షుడు పవన్‌కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్ 7,790 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఏలూరు పార్ల మెంట్ సభ్యునిగా కోటగిరి శ్రీధర్, నర్సాపురం నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజు గెలుపొం దారు. గత ఎన్నికల్లో 3 సీట్లు మాత్రమే పొందిన విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఫ్యాన్ మొత్తం 9 సీట్లను కైవసం చేసుకుంది. రాయలసీమలోని నాలు గు జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలకు గాను కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హిందూపురంలో నంద మూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. మిగిలిన 49 స్థానా ల్లో వైఎస్సార్సీపీ నెగ్గింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 34 స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 28 స్థానా లను గెలుచుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మొదటిసారి పోటీ చేసిన మంత్రి నారా లోకేశ్ ఓటమి పాలయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావుతోపాటు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా పరాజయం చవిచూశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల నుంచి 2014 ఎన్నికల్లో 75,243 వేల మెజార్టీతో గెలుపొందగా, ఇప్పుడు 90 వేల పైచిలుకు ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. ఆయన మెజారిటీ 15 వేలు పెరిగింది. కుప్పం నుంచి చంద్రబాబు మెజార్టీ గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు 17 వేలకు పైగా తగ్గడం గమనార్హం. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ కేవలం కుప్పం స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ జిల్లాలోని పుంగనూరు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 43,555 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఎన్ని కుటుంబాలు ఏకమైనా.. కర్నూలు జిల్లాలో సుదీర్ఘ రాజకీయ ప్రాధాన్యం గల పెద్ద కుటుంబాలు ఏకమై టీడీపీ తరఫున పోటీ చేసినా ప్రజలు ఆదరించలేదు. దశాబ్దాలుగా బద్ధ శత్రువుల్లా వేర్వేరు పార్టీల్లో కొనసాగిన కోట్ల, కేఈ కుటుంబాలు గెలవాలనే స్వార్థమే లక్ష్యంగా ఎన్నికల ముందు కలిసిపోయాయి. కాంగ్రెస్సే నా శ్వాస అని చెబుతూ వచ్చి రాజకీయ ప్రత్యర్థి కేఈతో రాజీపడి, టీడీపీలో చేరి, కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆలూరు నుంచి బరి లోకి దిగిన ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మను ప్రజలు ఓడించారు. అలాగే పత్తిపాడు నుంచి కేఈ తనయుడు శ్యామ్‌కుమార్, డోన్ నుంచి కేఈ ప్రతాప్ (కేఈ కృష్ణమూర్తి సోదరుడు) ఇద్దరినీ ప్రజలు తిరస్క రించారు. పత్తికొండ నుంచి శ్రీదేవి చేతిలో శ్యామ్ కుమార్, డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో కేఈ ప్రతాప్ ఓటమి చవిచూశారు. ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించి.. మంత్రి పదవి కోసం టీడీపీలోకి ఫిరాయించిన అఖిలప్రియ తోపాటు ఆమె సోదరుడినీ ప్రజలు ఓడించారు. స్వార్థపు కలయికలను తిరస్కరించిన జనం వైఎస్సార్ జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్య ర్థులుగా కొనసాగిన రామసుబ్బారెడ్డి, ఆదినారా యణరెడ్డి రాజకీయ స్వార్థంతో కలిసిపోయి పోటీ చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలు రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి కలిసిపోయిన విషయం విదితమే. ఆదినారాయణరెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌రెడ్డి చేతిలో 51వేల పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. సిక్కోలు గడ్డపై విజయ పతాక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లను శ్రీకాకుళం ప్రజలు ఇంటికి పంపించారు. మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వల్ప మెజార్టీతో ఓటమి తప్పించుకున్నారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో 4,409 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవిపై, తమ్మినేని సీతారాం ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌పై ఆమదాలవల సలో 13,856 ఓట్లతో ఘన విజయం సాధించారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే ధర్మా న కృష్ణదాస్ 19,129 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కంబాల జోగు లు, విశ్వాసరాయి కళావతి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. టెక్కలిలో నుంచి మరోసారి బరిలోకి దిగిన మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడి పరిస్థితి చివరివరకూ గెలుపు ఓటములతో దోబూచు లాడింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఆయనకు ముచ్చెమటలు పట్టించారు. చివరకు అచ్చెన్న 8,851 ఓట్లతో గట్టెక్కారు. విశాఖ జిల్లాలో విజయనాదం టీడీపీకి పెట్టని కోటగా భావించే విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేయగా, 3 పార్లమెంటు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే విజయఢంకా మోగించారు. సీనియర్ మంత్రి చింత కాయల అయ్యన్నపాత్రుడు ఓటమి పాలవ్వగా, గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్, విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అరకు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి, ఐదు పర్యాయాలు ఎంపీగా చేసిన కిషోర్ చంద్రదేవ్రాజుపై సాధారణ టీచర్‌గా పనిచేసిన వైఎస్సార్సీపీ అభ్యర్ధి గొట్టేటి మాధవి రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. గాజువాకలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి జనసేన అభ్యర్థి పవన్‌కల్యాణ్‌పై 16,774 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ హవా ఆవిర్భావం నుంచి టీడీపీ పట్టుగొమ్మగా ఉన్న కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. 16 అసెంబ్లీ స్థానాలకు గాను 14 చోట్ల వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఓటమి పాల య్యారు. ఆయనపై 5,852 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్ని నాని ఘనవిజయం సాధించారు. మైలవరంలో మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓడిపోయారు. టీడీపీ కంచుకోటలకు బీటలు జన ప్రభంజనంలో పచ్చపార్టీ కంచుకోటలకు బీటలు వారాయి. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంది. టీడీపీకి 2 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం మాత్రమే దక్కింది. మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్, మాజీ మంత్రి ఆలపాటి రాజా, స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, సీనియర్ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. మంగళగిరి శాసనసభ స్థానానికి బరిలో నిలిచిన మంత్రి నారా లోకేశ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) చేతుల్లో ఓటమి పాలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయనగరంలో చరిత్ర సృష్టించిన ఫ్యాన్ విజయనగరం జిల్లాలో వైఎస్సాఆర్ కాంగ్రెస్‌పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. జిల్లాలోని మొత్తం లోక్‌సభ, అసెంబ్లీ సీట్లులో గెలుపొందింది. ఫ్యాన్ సునామీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టుకుపోయారు. విజయనగరం జిల్లాలో మొత్తం విజయనగరం లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితోపాటు అరుకు, విశాఖపట్నం లోక్‌సభ స్థానాలు పరిధి కూడా నాలుగు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. అన్ని సీట్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్ భారీ మోజార్టీతో విజయం సాధించారు. ఈయనపై పోటీ చేసిన తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి, కేంద్రమాజీ మంత్రి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు ఓటమి పాలయ్యారు. -
కడప గడపలో రికార్డుల మోత
సాక్షి ప్రతినిధి కడప: సార్వత్రిక ఎన్నికల్లో కడప గడపలో రికార్డుల మోత మోగింది. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఘనతను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజల అభిమానానికి తగ్గట్లుగా ఆయనకు అత్యధిక మెజార్టీ దక్కింది. వైఎస్ జగన్‌కు 90,110 ఓట్లు ఆధిక్యతను పులివెందుల ప్రజలు కట్టబెట్టారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాల్లో జగన్‌దే అత్యధిక మెజార్టీ. వైఎస్సార్ జిల్లాలో కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు అంజాద్‌బాషా, డాక్టర్ సుధీర్‌రెడ్డి 52వేలు పైగా మెజార్టీని దక్కించుకొని మరో రికార్డు సాధించారు. అన్నకు తగ్గ తమ్ముడిగా కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి 3.54 లక్షల ఓట్ల ఆధిక్యతను సొంతం చేసుకున్నారు. ఆల్‌టైం రికార్డు వైఎస్ కుటుంబం సొంతం పులివెందుల నియోజకవర్గంలో ఆల్‌టైం రికార్డు వైఎస్ కుటుంబం సొంతమని మరోమారు నిరూపితమైంది. దివంగత వైఎస్ఆర్ పులివెందుల అభ్యర్థిగా 1985లో 30వేలు పైచిలుకు మెజార్టీ సాధించి అప్పట్లో అబ్బరపర్చారు. ఆ తర్వాత 1989లో వైఎస్ వివేకానందరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి 47,746 ఓట్లు మెజార్టీ సొంతం చేసుకొని తన అన్న రికార్డును మించిపోయారు. 1991 ఉప ఎన్నికల్లో పోటీచేసిన డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి 97,448 ఓట్లు మెజార్టీ సాధించారు. 2009లో ముఖ్యమంత్రి హోదాలో పోటీచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 68,681 ఓట్లు మెజార్టీ కైవసం చేసుకున్నారు. కాగా వైఎస్సార్ సీఎంగా రెండోసారి ప్రమాణశ్వీకారం చేసిన అనతికాలంలోనే దివంగతులు కావడంతో.. ఆ తర్వాత ఉప ఎన్నికలల్లో వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2011లో పోటీచేసిన వైఎస్ విజయమ్మ తన భర్త వైఎస్సార్ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువగా.. 81,333 ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల ప్రజానీకం మనస్సులను చూరగొని రికార్డు స్థాయిలో 90,110 ఓట్లు మెజార్టీ దక్కించుకున్నారు. త్యాగానికి ప్రతిఫలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి వైఎస్ అవినాష్‌రెడ్డి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో 3.54 లక్షలు ఓట్లు మెజార్టీ సాధించారు. భారతదేశంలో అత్యధిక మెజార్టీ సాధించిన నేతల సరసన వైఎస్ అవినాష్‌రెడ్డిని కడప ప్రజలు నిలిపారు. అదేరీతిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి 2.64లక్షల మెజార్టీ కట్టబెట్టారు. పదవీత్యాగానికి ప్రతిఫలంగా వైఎస్సార్ జిల్లా ప్రజలు గతంలో లభించిన మెజార్టీ కంటే అత్యధికంగా అప్పగించడం విశేషం. కాగా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన వారి సరసన కడప ఎమ్మెల్యేగా అంజాద్‌భాషా, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా డాక్టర్ సుధీర్‌రెడ్డి నిలుస్తున్నారు. కడపలో 52,539 ఓట్లు మెజార్టీ సాధించగా, జమ్మలమడుగులో 52,035 ఓట్లు మెజార్టీ స్వంతమైంది. ఇప్పటివరకూ కడపలో 10కి 10సీట్లు సాధించిన చరిత్రలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రికార్డు కూడా సొంతమైంది. వెరశి కడప గడపలో రికార్డుల మోత మోగింది. -
బాబు మోసానికి ప్రతీకారం
సాక్షి, అమరావతి: కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చి 2014 ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబునాయుడికి రాష్ట్ర ప్రజలు గట్టి గుణపాఠం నేర్పారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ పరాజయానికి ముఖ్యకారణాల్లో చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలు, మాయమాటలేననడంలో అతిశయోక్తి లేదు. ప్రజలను తక్కువ అంచనా వేస్తూ తాను ఎన్ని మాయలుచేసినా వారికి గుర్తుండదని, ఎన్నికల ముందు కొన్ని తాయిలాలు పంచి మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబుకు ప్రజలు మర్చిపోలేని షాక్ ఇచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన మోసాలకు, వేధింపులకు తాజా ఎన్నికల్లో ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. తమ బాధలు వింటూ, తమకు అండగా ఉండి చివరి వరకు వెన్నంటి నడిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చారు. చంద్రబాబు చరిత్ర మొత్తం మాయలు, మోసాలేనన్నది జగమెరిగిన సత్యం. వీటికి ప్రతీకారంగానే ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు సరైన సమాధానం ఇచ్చారు. ఇంతటి దారుణమైన పరాజయం ఆపార్టీ చరిత్రలోనే కాదు రాష్ట్ర చరిత్రలోనూ ఇంతకు ముందెన్నడూ లేదు. 600లకుపైగా హామీలు ఇచ్చి.. 2014 ఎన్నికల్లో 600లకు పైగా హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల అనంతరం వాటిని విస్మరించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, చిరుద్యోగులు, కార్మికులు, వివిధ వృత్తి కార్మికులు, కులాల వారీగా పలు హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీచేస్తామని, డ్వాక్రా, చేనేత రుణాలన్నిటినీ రద్దుచేస్తామని, రైతులు కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి వారి ఇంటికి చేరుస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటినీ (1.42 లక్షలు) భర్తీచేస్తామని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, నెలకు రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ఏటా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మద్యం బెల్టు షాపులను పూర్తిగా తొలగిస్తామని, రైతులకు 9 గంటల నిరాటంక ఉచిత విద్యుత్తు ఇస్తామని, పేదలందరికీ ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రూ. 2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామనే లాంటి హామీలు ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఏ ఒక్కదాన్నీ పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదు. తొలిసంతకం అంటూ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, బెల్టు షాపుల రద్దు హామీలకు అధికారంలోకి వచ్చిన తొలిరోజునే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అరకొరగా చేసిన రైతు రుణమాఫీ మొత్తం బ్యాంకు వడ్డీలకూ సరిపోలేదు. దీంతో రైతులు అప్పుల ఊబిలో మునిగిపోయారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. మరోపక్క అక్కచెల్లెమ్మలకు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు తుంగలో తొక్కారు. బెల్టుషాపులను పెంచేసి మద్యాన్ని ఏరులై పారించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో అధికారం లేదని రిజర్వేషన్లపై పలు కులాలకు హామీ ఇచ్చి చంద్రబాబు వారందరినీ మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించిన నవరత్నాలను కాపీ చేసి వృద్ధాప్య పింఛన్లను రూ. 2 వేలకు పెంచుతున్నట్లు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. బాబు మోసాలను మరిచిపోలేని ప్రజలు గతంలో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోవడమే కాకుండా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకూ చంద్రబాబు తూట్లు పొడిచారని ప్రజలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. 1994 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే రూ. 2కే కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి పథకాలను అమల్లోకి తెచ్చారు. వ్యవసాయ విద్యుత్తులో కూడా హార్స్‌పవర్‌కు రూ. 50 వసూలు వంటి నిర్ణయాలు అమలు చేశారు. అయితే చంద్రబాబు 1995లో ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న వెంటనే రూ.2కే కిలో బియ్యం ధరను అమాంతం రూ. 5.25కి పెంచేశారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన జనతా వస్త్రాల స్కీమునూ చంద్రబాబు ఎత్తేశారు. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధానికి నిలువునా తూట్లు పొడిచి దానికీ మంగళం పాడేశారు. పింఛన్లను గ్రామానికి కోటాను నిర్ణయించి ఆమేరకు మాత్రమే ఇచ్చారు. ఎవరైనా కొత్తగా పింఛన్ కావాలని దరఖాస్తు పెట్టుకొంటే జాబితాలోని వారిలో ఎవరో ఒకరు చనిపోతేనే కానీ కొత్తవారికి పింఛన్ మంజూరు అయ్యేది కాదు. 2014లో అధికారం చేపట్టాక కూడా ఆయన తీరులో మార్పు రాలేదు. -
ముసుగు పొత్తులకు ఓటరు చక్కటి సమాధానం
సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు లోపాయికారీ పొత్తుల కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ప్రజల్ని వంచించాలన్న టీడీపీ ఎత్తులను చిత్తుచేశారు. లోపాయికారీ పొత్తులో ప్రధాన సూత్రధారి టీడీపీని తుడిచిపెట్టేశారు. ఈ రాజకీయ కుట్రలో చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్‌కు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. లోపాయికారీ కుట్రలో మైనర్ పార్టనర్లు అయిన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. నిజాయితీ రాజకీయాలకే తాము పట్టం కడతామంటూ జగన్‌కు జైకొట్టారు. లోపాయికారీ పొత్తుల కుట్ర ప్రతి ఎన్నికకు కొత్త పొత్తులతో ప్రజలను ఏమార్చే చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో కొత్త రాజకీయ కుట్రకు తెరలేపారు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు లోపాయికారీ పన్నాగాన్ని రచించారు. అందులో భాగంగానే 2018లో పవన్ కల్యాణ్ టీడీపీ నుంచి వేరుపడ్డారు. అడపదడపా జిల్లాల్లో పర్యటిస్తూ హడావుడి చేశారు. కేవలం జనసేనతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం సాధ్యంకాదని చంద్రబాబు కొత్త పార్టీలను ఆ పొత్తుల చట్రంలోకి తీసుకువచ్చారు. సీపీఎం, సీపీఐలతోపాటు బీఎస్పీతో కూడా జనసేన పొత్తు పెట్టుకునేట్లుగా చంద్రబాబు కథ నడిపించారు. ఇక ఆ నాలుగు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును కూడా చంద్రబాబు కన్నుసన్నల్లోనే సాగింది. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేలా సీపీఎం, సీపీఐలకు చెరో ఏడు నియోజకవర్గాలు జనసేన కేటాయించింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచిన సీట్లనే అత్యధికంగా వామపక్షాలకు కేటాయించారు. ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తే.. టీడీపీ ఓట్లే చీలి టీడీపీ మరింత బలహీనపడుతుంది. అందుకే ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి లోపాయికారీగా సహకరించేందుకే జనసేన పోటీచేయలేదు. మంత్రి లోకేశ్ పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పోటీచేయకపోవడం ఇందులో భాగమే. ఆ నియోజకవర్గంలో కాస్త పట్టున్న సీపీఎంకు కాకుండా సీపీఐకు ఆ స్థానాన్ని కేటాయించడంతో ఆ పార్టీల కుట్ర బట్టబయలైంది. ఇక బీఎస్పీకి కూడా వైఎస్సార్సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలనే కేటాయించారు. మరోవైపు.. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో జట్టుకట్టిన చంద్రబాబుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోపాయికారీగా సహకరించింది. వైఎస్సార్సీపీ ఓట్లను కొంతమేరైనా సరే చీల్చడమే లక్ష్యంగా పనిచేసింది. ప్రచారంలోనూ కుట్రలే కుట్రలు కాగా, ఎన్నికల ప్రచారంలో కూడా జనసేన, వామపక్షాలు, బీఎస్పీలతో చంద్రబాబు లోపాయికారీ కుట్రలను కొనసాగించారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేయలేదు. అలాగే, పవన్ స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో చంద్రబాబు కూడా టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించనే లేదు. పవన్ కల్యాణ్ కూడా తన ప్రచారంలో చంద్రబాబునుగానీ టీడీపీ ప్రభుత్వాన్నిగానీ పెద్దగా విమర్శించకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పైనే ఆరోపణలు గుప్పించారు. జనసేనకూ దారుణ పరాభవం ఇక 136 నియోజకవర్గాల్లో పోటీచేసిన జనసేనను కూడా ఓటర్లు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకలలో ఓడిపోయి తీవ్ర అవమానాన్ని మూటగట్టుకున్నారు. ఓ పార్టీ అధినేత రెండుస్థానాల్లో పోటీచేసి రెండింటిలోనూ ఓడిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. 2009లో తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీచేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి.. తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. 1989లో టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు హిందూపూర్, వనపర్తి (తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లా)లలో పోటీచేయగా.. హిందూపూర్‌లో గెలిచి వనపర్తిలో ఓడిపోయారు. కానీ, ఈసారి పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. వామపక్షాలకూ ఘోర ఓటమి ఇక సీపీఎం, సీపీఐ చెరో ఏడు నియోజకవర్గాల్లో పోటీచేయగా అన్నింటిలోనూ ఘోరంగా ఓడిపోయాయి. సీపీఎం పోటీచేసిన ఏడు నియోజకవర్గాల్లో కురుపాం, అరకు, రంపచోడవరం, విజయవాడ సెంట్రల్, సంతనూతలపాడు, కర్నూలు స్థానాల్లో వైఎస్సార్సీపీని ప్రజలు గెలిపించారు. పొత్తుల్లో భాగంగా సీపీఎం పోటీచేసిన కర్నూలు, నెల్లూరు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. సీపీఐ పోటీచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో వైఎస్సార్సీపీని ఓటర్లు విజయ తీరానికి నడిపించారు. ఆ పార్టీ పోటీచేసిన కడప, అనంతపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయదుందుభి మోగించింది. అలాగే, వైఎస్సార్సీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న దళితుల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రయోగించిన బీఎస్పీ కార్డును సైతం ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ పార్టీ పోటీచేసిన 32 నియోజకవర్గాలతోపాటు తిరుపతి, చిత్తూరు, బాపట్ల ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. బాబు ఎత్తులు చిత్తుచిత్తు చంద్రబాబు లోపాయికారీ కుట్రను ఓటర్లు చిత్తుచిత్తు చేశారు. టీడీపీకి దారుణ పరాజయాన్ని కానుకగా ఇచ్చారు. జనసేన సినిమా రైట్స్‌ను టీడీపీకి అమ్మిన పవన్ కల్యాణ్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న వామపక్షాలు, బీఎస్పీలను డిపాజిట్లు దక్కకుండా ఓడించారు. లోపాయికారీ రాజకీయ కుట్రలో ప్రధాన భాగస్వామి అయినా టీడీపీకి చావు దెబ్బకొట్టారు. టీడీపీ పోటీచేసిన 175 నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో చిత్తయ్యింది. కేవలం 25 స్థానాలలోపే కట్టడి చేశారు. 1982లో టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీ ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. చంద్రబాబు మంత్రివర్గంలోని 24మంది మంత్రుల్లో ఏకంగా 22మంది ఓడిపోవడం ప్రజాగ్రహానికి నిదర్శనంగా నిలుస్తోంది. వారిలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఉండటం గమనార్హం. -
అలుపెరుగని యోధుడు
‘నాయకత్వం వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి... నిస్వార్థంగా ఉండండి... అనంత సహనం కలిగి ఉండండి... అంతిమంగా విజయం మీదే’ – స్వామి వివేకానంద గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేళ్లుగా తన రాజకీయ ప్రస్థానంలో త్రికరణశుద్ధిగా ఆచరించి చూపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఓ గొప్ప ముఖ్యమంత్రిగా చూసిన యువనేతగా వైఎస్ జగన్ దశాబ్దం క్రితం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ మరణించిన తరువాత కూడా కోట్లాది మంది గుండెల్లో జీవించి ఉండటం ఆయనకు స్ఫూర్తినిచ్చింది. తానూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ధ్యేయంతో ప్రజాపథంలో సాగారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని దక్కించుకుందామన్న కొందరి సూచనలను తిరస్కరించి రాజకీయ విలువలు చాటారు. కేంద్ర మంత్రి, సీఎం పదవులు ఇస్తామన్నా సరే తన స్వార్థం చూసుకోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు అధికారాన్ని తృణప్రాయంగా త్యజించారు. రాజకీయ ప్రత్యర్థులు కుమ్మక్కై పన్నిన కుట్రలు, బనాయించిన అక్రమ కేసులను అత్యంత సహనంతో ఎదుర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తనపై దుష్ప్రచారానికి దిగి 2014లో అధికారానికి దూరం చేసినా ప్రజాపథాన్ని వీడలేదు. రాష్ట్ర హక్కులు, ప్రజా సంక్షేమం కోసం ఉద్యమపథంలో సాగారు. తమ పార్టీ టికెట్లపై నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుని రాజ్యాంగ విలువను అపహాస్యం చేసినా తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నారు. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి నేనున్నానని భరోసా ఇచ్చేందుకు చరిత్రాత్మక రీతిలో 3,648 కి.మీ. పాదయాత్ర చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తనను అంతమొందించేందుకు యత్నించినా వెరవలేదు. లోపాయికారీ పొత్తుల కుట్రలకు బెదరలేదు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం అజెండాగా పార్టీ మేనిఫెస్టోను రూపొందించి ప్రజాతీర్పు కోరారు. పదేళ్లుగా మొక్కవోని దీక్షతో సాగుతున్న జగన్‌కు రాష్ట్రం యావత్తూ జేజేలు పలికింది. ‘ప్రజలు ఆశీర్వదిస్తే సంక్షేమరాజ్యం స్థాపిస్తా’ అన్న జగన్‌కు పట్టాభిషేకం చేసింది. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో రికార్డు సీట్లతో వైస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందించారు. – సాక్షి, అమరావతి తొలి అడుగులు అత్యంత ప్రజాదరణ కలిగిన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ తాను యువరాజు హోదా అనుభవించాలని ఏనాడు భావించలేదు. ఆ ఐదేళ్లలో కనీసం సెక్రటేరియట్లో కూడా అడుగు పెట్టలేదు. అధికార కేంద్రానికి దూరంగా బెంగళూరులో తన కుటుంబంతోనే ఉన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడానికి 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ 1,78,846 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి మరణం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హఠాన్మరణం చెందడం ఆ కుటుంబంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వైఎస్సార్ అకాల మృతితో నాడు దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జగన్ సీఎం కావాలని కోరుతూ సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు జగన్‌కు సూచించారు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని చెప్పి జగన్ రాజకీయ విలువలకు కట్టుబడ్డారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా అందుకు సమ్మతించ లేదు. ఓదార్పు యాత్ర ఇచ్చిన మాటకు కట్టుబడి తీరాలని జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయన గమనాన్ని, గమ్యాన్ని మార్చేసింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకుంటే అందుకు కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అంది. తన తల్లి, సోదరితో కలసి వెళ్లి ఓదార్పు యాత్రకు అనుమతించాలని కోరినా సోనియాగాంధీ సమ్మతించలేదు. పైగా తమ మాట వింటే కేంద్ర మంత్రిని చేస్తాం, కొన్నాళ్లకు ముఖ్యమంత్రిని కూడా చేస్తామని చెప్పారు. తమ మాట వినకుంటే కష్టాలు తప్పవని హెచ్చరించారు. అధిష్టానం మాట వింటే పదవులు దక్కుతాయి. కానీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తే ప్రభుత్వం వేధిస్తుంది, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇచ్చిన మాటకు కట్టుబడతారని పేరున్న వైఎస్సార్ తనయుడిగా జగన్ తన తండ్రి బాటనే అనుసరించారు. ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 640 మంది అభిమానుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు నాడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ పార్టీ ద్వారా గెలిచిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు వైఎస్ జగన్, విజయమ్మ 2010లో రాజీనామాలు చేశారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. వైఎస్ జగన్ ఏకంగా 5,45,672 ఓట్ల అఖండ మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా జగన్ 2011 మార్చి 12న వైఎస్సార్సీపీని స్థాపించారు. రైతుల సమస్యలు పరిష్కారించాలనే డిమాండ్‌తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే ఎమ్మెల్యే పదవులకు అనర్హులమవుతామని తెలిసినప్పటికీ 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వారిపై అనర్హత వేటు వేయడంతో 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 15 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు నెల్లూరు ఎంపీ స్థానంలో ఘన విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా ఆవిర్భవించింది. రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై జగన్ ప్రజా పోరాటాలు చేశారు. జలదీక్ష, రైతు దీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష తదితర దీక్షలు, ధర్నాలతో ఉద్యమించారు. కక్షతో కేసులు.. బెయిల్ నిరాకరణ తిరుగులేని ప్రజానేతగా ఆవిర్భవించిన వైఎస్ జగన్‌ను అడ్డుకునేందుకు అప్పటి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించాయి. ఆయనపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం మూడు నెలల్లో బెయిల్ రావాల్సి ఉండగా అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ 16 నెలలపాటు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. అయితే జగన్ ఏమాత్రం వెరవకుండా ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. సమైక్య ఆంధ్ర ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు వైఎస్ జగన్ సైద్ధాంతిక, రాజకీయ నిబద్ధత కనబరిచారు. తెలుగువారి అభివృద్ధి కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశారు. అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగా వ్యవహరించినా జగన్ ఒక్కడే సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించారు. పార్లమెంట్లో తెలుగువారి ఆవేదనను వినిపించారు. అన్ని పార్టీలు రాజకీయ అవకాశవాదంతో వ్యవహరించగా జగన్ ఒక్కడే సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడి రాష్ట్ర ప్రయోజనాలపట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. ప్రతిపక్ష నేతగా... 2014 ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణాత్మక పాత్ర పోషించారు. అసెంబ్లీ లోపల, బయట ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించారు. టీడీపీ సర్కారు అవినీతి, అసమర్థ విధానాలపై పోరాడారు. రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం సాగించిన భారీ భూ దోపిడీని పూర్తి ఆధారాలతో వెలుగులోకి తెచ్చారు. ఇసుక, మైనింగ్, మద్యం, కాంట్రాక్టు మాఫియాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. చంద్రబాబు, లోకేష్ అండతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సాగిస్తున్న దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హుద్‌హుద్ తుపానుతోపాటు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో భక్తుల దుర్మరణం, ఉద్దానం కిడ్నీ వ్యాధుల బాధితులు, సామాన్యుల ప్రాణాలు బలిగొంటున్న టీడీపీ ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ దందా... ఇలా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా తానున్నానంటూ అండగా నిలిచారు. ఫిరాయింపులను ప్రోత్సహించినా.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కుట్ర పన్నిన చంద్రబాబు వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. పార్టీ ఫిరాయిస్తే పదవులకు రాజీనామా చేయాలన్న నిబంధనను పాటించలేదు. నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న విజ్ఞప్తిని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టించుకోలేదు. ఈ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. టీడీపీ ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరేందుకు వస్తే పదవులకు రాజీనామా చేయాలని షరతు విధించి జగన్ రాజకీయ విలువలకు కట్టుబడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ చేసిన ఉద్యమం జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని జగన్ 2014 నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ సీఎం చంద్రబాబు తన స్వార్థ, అవినీతి రాజకీయాల కోసం హోదాను గాలికి వదిలేశారు. అవినీతి, కేసుల భయంతో ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే మేలని అడ్డగోలుగా వాదించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పోలీసు బలాన్ని ప్రయోగించినా జగన్ వెరవకుండా ప్రజల తరఫున పోరాడారు. యువభేరీ సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. అమరావతి నుంచి ఢిల్లీ వరకు హోదా కోసం దీక్షలు చేశారు. రాష్ట్ర బంద్‌తోపాటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టి ప్రత్యేక హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచారు. హోదా ఇవ్వనందుకు నిరసనగా తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఎన్నికల భయంతో యూటర్న్ తీసుకుని హోదా కావాలని మాట మార్చినా ప్రజలు విశ్వసించలేదు. ప్రజా సంకల్ప యాత్ర అవినీతి, అసమర్థత పాలనతో నష్టపోయిన రాష్ట్రం దశ, దిశను మార్చేందుకు వైఎస్ జగన్ చరిత్రాత్మక ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. 2017 నవంబరు 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర పాదయాత్ర చేసి 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగించారు. 134 నియోజకవర్గాల మీదుగా సాగుతూ 2,516 గ్రామాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల పరిధిలో పాదయాత్ర చేశారు. 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు. జగన్ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. హత్యాయత్నం పాదయాత్రలో జగన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్రలకు తెగించింది. ఏకంగా జగన్‌ను హత్య చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో 2018 అక్టోబరు 25న జగన్‌ను హతమార్చేందుకు పదునైన కత్తితో హత్యాయత్నం జరిగింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జగన్ ప్రజాక్షేత్రంలో కొనసాగాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రజలకు అండగా నిలవడమే ధ్యేయంగా పాదయాత్రను కొనసాగించడం ఆయన దృఢ చిత్తానికి నిదర్శనం. ఒంటరి పోరాటం అధికారంలోకి వచ్చేందుకు పొత్తులు పెట్టుకోవాలని కొందరు చేసిన సూచనలకు జగన్ సమ్మతించలేదు. తాను విశ్వసిస్తున్న రీతిలో రాజన్న ఆశయాలను సాధించేందుకు ఒంటరిగానే పోటీ చేసి ప్రజామోదం పొందాలన్న నిర్ణయానికే కట్టుబడ్డారు. మరోవైపు ప్రతి ఎన్నికకు కొత్త పొత్తులతో ప్రజలను వంచించే చంద్రబాబు 2019లో మరో కుట్రకు తెరతీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జనసేన పార్టీ విడిగా పోటీ చేసేలా పవన్ కల్యాణ్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. వామపక్షాలు, బీఎస్పీలతో జనసేన పొత్తు కుదుర్చుకోవడం, ఆ పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగాయి. టీడీపీకి మరోవైపు కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కూడా ఉంది. అయినప్పటికీ జగన్ ఏమాత్రం వెరవకుండా తాను నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేశారు. దుష్ప్రచారంతో 2014లో అధికారానికి దూరం 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను అడ్డుకోడానికి రాజకీయ ప్రత్యర్థులు అంతా ఒక్కటయ్యారు. జగన్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీకి కాంగ్రెస్ పార్టీ లోపాయికారీ మద్దతు ఇచ్చింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా పెద్దఎత్తున దుష్ప్రచారం చేసినా జగన్ మాత్రం విలువలతో కూడిన రాజకీయాన్నే చేశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తే అధికారంలోకి రావచ్చని కొందరు జగన్‌ను సూచించినా అసాధ్యమైన వాగ్దానాలు చేయబోనని చెప్పి విలువలు, విశ్వసనీయతకే కట్టుబడ్డారు. చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీతోపాటు 640కిపైగా మోసపూరిత హామీలిచ్చి ప్రజలను వంచించారు. ఫలితంగా 2014లో వైఎౖస్సార్సీపీ అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోయినా జగన్ వినమ్రంగా ప్రజల తీర్పును గౌరవించారు. ప్రజలకు కష్టం వచ్చిన ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. విజయ దరహాసం ప్రతిబంధకాలు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పదేళ్లుగా తమ కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌ను ప్రజలు తమ తీర్పుతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్‌కు అఖండ విజయాన్ని చేకూర్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 151కి పైగా సీట్లతో వైఎస్సార్సీపీని గెలిపించారు. విశ్వసనీయతకు పట్టాభిషేకం చేసి నూతన రాజకీయ శకానికి తెరతీశారు. కష్టాలకు వెరవకుండా నిజాయితీ, నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిని ప్రజలు ఆదరిస్తారని జగన్ రాజకీయ ప్రస్థానం నిరూపించింది. విలువల దారిలో నడిచే నేత వెంట యావత్ ప్రజానీకం సాగుతుందని నిరూపించి జగన్ భావి తరాలకు ఆదర్శంగా నిలిచారు. -
అందరూ ఒక్కటైనా..!
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య సౌధానికి శాసన నిర్మాణ వ్యవస్థ.. కార్యనిర్వాహక వ్యవస్థ.. న్యాయ వ్యవస్థ మూడు స్తంభాలైతే.. మీడియాను నాలుగో స్తంభంగా అభివర్ణిస్తారు. ప్రభుత్వ అరాచకాలు, అవినీతి, అక్రమాలపై జనం పక్షాన అక్షరయుద్ధం చేయాల్సిన గురుతర బాధ్యత మీడియాపై ఉంటుంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాల్సిన ఆవశ్యకత మీడియాపై ఉంది. కానీ.. రాష్ట్రంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఎల్లో మీడియా ఆ బాధ్యతను విస్మరించి ప్రజల తరఫున పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అడ్డగోలుగా విషం కక్కింది. విలువలకు వలువలు వదిలేసి.. ప్రభుత్వ ఖజానానూ ఇష్టారాజ్యంగా దోచేస్తూ.. సీఎం చంద్రబాబు నిర్మించిన అవినీతి సామ్రాజ్యానికి అడుగడుగునా వెన్నుదన్నుగా నిలిచింది. ఇలా చంద్రబాబుతో కలిసి ఎల్లో మీడియా పన్నిన ‘కుట్ర’లన్నింటినీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఎల్లో మీడియా విషం చిమ్ముతున్నా లెక్క చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై అలుపెరగకుండా పోరాటంచేసి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఇదే ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయి విజయాన్ని కట్టబెట్టింది. టీడీపీ చరిత్రలో ఘోరమైన ఓటమి టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ లేని రీతిలో ఈ ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని ఇప్పుడు చవిచూసింది. 2014 ఎన్నికల్లో 600లకు పైగా హామీలిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ.. అధికారం చేపట్టాక ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదు. వందిమాగధులు, బినామీలతో కలిసి ప్రభుత్వ ఖజానా, సహజ వనరులను చంద్రబాబు యథేచ్ఛగా లూటీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలోను, ప్రజాక్షేత్రంలోనూ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ వచ్చారు. ప్రభుత్వ అరాచాకాలపై పోరాటం చేయాల్సిన మీడియా తన ధర్మాన్ని విస్మరించి.. ప్రతిపక్ష నేతగా బాధ్యతతో వ్యవహరిస్తున్న జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మింది. అదే సమయంలో సీఎం చంద్రబాబుకు దన్నుగా నిలిచాయి. గోదావరి పుష్కరాల్లో తన ప్రచార పిచ్చికి 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నా ఎల్లో మీడియా స్పందించలేదు. ఇసుక మాఫియా ఆగడాలకు చిత్తూరు జిల్లా ఏర్పేడులో 14 మంది అసువులు బాసినా నోరు మెదపలేదు. రాజధానిలో కాల్‌మనీ సెక్స్ రాకెట్లో పచ్చ కాలకేయులు మహిళల మానప్రాణాలతో చెలగాటమాడినా ఎల్లో మీడియాకు పట్టలేదు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి 25 వేల ఎకరాల భూములను అత్తెసరు ధరలకే కాజేసి రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న చంద్రబాబు అండ్ కో ఆగడాలు ఎల్లో మీడియాకు కన్పించలేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో.. రాష్ట్రానికి చుక్కానిగా నిలవాల్సిన పోలవరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్లు దోచేసినా మీడియాకు పట్టలేదు. దోచేసిన సొమ్ముతో విపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసించినా.. తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల్లో పట్టుబడినా పచ్చ మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా.. ప్రజాసమస్యల పరిష్కారం. సర్కార్ దోపిడీపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు కనుసైగల మేరకు అవాస్తవాలు, అభూత కల్పనలతో ఎల్లో మీడియా అసత్య కథనాలను వార్చుతూ వచ్చింది. అంతేకాదు.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో మండుటెండను కూడా లెక్క చేయకుండా 3,648 కి.మీల మేర చేసిన సుదీర్ఘ పాదయాత్రను కూడా చిన్నదిగా చూపించేందుకు కుయుక్తులు పన్నింది. చివరకు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను మట్టుబెట్టి భయభ్రాంతులకు గురిచేసి విజయం సాధించాలనే ధ్యేయంతో వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని ప్రభుత్వ పెద్దలే హత్య చేయించారు. హత్య చేసిన కిరాతకులను వదిలిపెట్టి.. ఆ హత్యను వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులపైకి నెట్టేందుకు చంద్రబాబు చేసిన కుట్రలకు ఎల్లో మీడియా పదును పెట్టి ఓటర్లను ప్రభావితం చేసే యత్నం చేసింది. ఎల్లో మీడియా అంతా ఒక్కతాటిపైకి వచ్చి చేసిన విష ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చంద్రబాబు, టీడీపీ నేతల దురాగతాలను వివరిస్తూ.. వాటికి ఎల్లో మీడియా కొమ్ముకాస్తున్న తీరును విడమర్చి చెబుతూ ప్రజలకు వాస్తవాలను వివరించారు. నిజాలను తెలుసుకున్న ప్రజలు ప్రజానేత ఎవరో ఎంచుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. దాంతో ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో.. రికార్డు స్థాయిలో విజయదుంధుబి మోగించింది. -
వైఎస్ జగన్ రికార్డు మెజారిటీ
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు వైఎస్ జగన్, ఆయన మాతృమూర్తి విజయమ్మ రాజీమాలు చేశారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలంటూ వారి తీర్పునే కోరారు. 2011 ఉప ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంనుంచి బరిలోకి దిగి సవాల్ విసిరారు. కాంగ్రెస్, టీడీపీలు తమ తరపున సీనియర్లు డీఎల్ రవీంద్రారెడ్డి, ఎంవి మైసూరారెడ్డిలను బరిలోకి దింపాయి. అయితే అక్కడి ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి 5,45,672 మెజారిటీ ఇచ్చారు. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో అప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మూడో అత్యధిక మెజారిటీ రికార్డును వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. (2004 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్ నియోజకవర్గంనుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో నెగ్గి అప్పటి వరకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నారు. 1991 ఉప ఎన్నికల్లో అప్పటికే ప్రధాని పదవిలో ఉన్న పీవీ నరసింహారావు కాంగ్రెస్‌నుంచి పోటీచేసి 5,80,035 మెజారిటీ సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. చిన్నాచితకా పార్టీలు నామమాత్రపు పోటీ ఇచ్చాయి.) అనంతరం 2014 జనరల్ ఎన్నికల్లో గుజరాత్‌లోని వదోదర లోక్‌సభ స్థానం నుంచి అప్పటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 5,70,128 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. 2014లో మహరాష్ట్రలోని బీడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్ ముండే 6,92,245 ఓట్ల మెజారిటీ సాధించి ఆమె లోక్ సభ ఎన్నికల చరిత్రలో మొదటి స్థానాన్ని పొందారు. మిగిలిన వారంతా ప్రధాన పార్టీలనుంచి పోటీ చేయగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగి అనూహ్య విజయాన్ని సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిహిట్... - 2014 జనరల్ ఎన్నికల్లో పులివెందులనుంచి తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మొదటి హిట్టే దిమ్మతిరిగేలా కొట్టారు. 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇది కూడా సీమాంధ్రలో రికార్డే. విజయమ్మ తరువాత ఇంత మెజారిటీ ఎవరూ సాధించలేదు. అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితాలలో ప్రతిపక్షనేతగా పులివెందులనుంచే బరిలోకి దిగి 90, 110 ఓట్ల మెజారిటీ సాధించారు. - 2011 ఉప ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆ మెజారిటీని ఆ తరువాత ఏపీలో ఎవ్వరూ దాటలేకపోయారు. చంద్రబాబుకూ తప్పని ఓటమి... 1978నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు 1983 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1978లో చంద్రగిరి స్థానంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జనతా పార్టీ అభ్యర్థిపై నెగ్గిన ఆయన 1983లో టీడీపీ చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆయన టీడీపీలో చేరి, తనకు ఓటమిని చవిచూపిన తన సొంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంనుంచి కుప్పంకు మారారు. అప్పటినుంచి జరిగిన ఎన్నికల్లో గెలుపొందుతున్నారు. 1978లో చంద్రగిరిలో 2,494 ఓట్ల స్వల్ప మెజారిటీతో నెగ్గిన ఆయన 1999లో కుప్పంనుంచి తన ఎన్నికల కెరీర్లో అత్యధికంగా 65,678 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్టీయార్ అరుదైన ముద్ర.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రయోగాలకు తెరతీశారు. మొదటిసారి 1983లో గుడివాడ, తిరుపతి; 1985లో గుడివాడ, హిందూపూర్, నల్లగొండ; 1989లో హిందూపూర్, కల్వకుర్తి; 1994లో హిందూపూర్, టెక్కలి నుంచి పోటీ చేశారు. కల్వకుర్తిలో ఓటమిచెందిన ఆయన మిగిలిన అన్ని స్థానాల్లోనూ గెలిచారు. ఆయన నెగ్గిన అన్నిచోట్లతో పోలిస్తే 1994లో హిందూపూర్‌లో అత్యధికంగా 60,050 ఓట్లు, అత్యల్పంగా 1985లో గుడివాడనుంచి 7,597 ఓట్ల మెజారిటీ సాధించారు. -
రూ.1000 కోట్లు హుష్ కాకి!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమిని మూటకట్టుకుని ఓ వైపు.. రూ.కోట్లు సొమ్ము పోగొట్టుకుని మరోవైపు టీడీపీ శ్రేణులు గొల్లుమంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు నుంచే బెట్టింగ్ రాయుళ్లు గెలుపోటములపై భారీ పందేలకు దిగారు. రానురాను వారిలో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుపై నమ్మకం సన్నగిల్లడంతో ఎన్నికల తేదీ నాటికి టీడీపీ గెలుపుపై సొంత పార్టీ శ్రేణులే వెనక్కు తగ్గారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంశం మినహాయించి నియోజకవర్గాల వారీగా టీడీపీ, వైఎస్సార్ సీపీ గెలుపోటములపై బెట్టింగులకు పరిమితమయ్యారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబు సొంత గూటి చిలుక లగడపాటి లీకులిచ్చి, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడంతో మళ్లీ టీడీపీ శ్రేణులు బెట్టింగులకు దిగారు. రూపాయికి రూపాయిన్నర ఇస్తామని కొన్ని నియోజకవర్గాల్లో బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. దీంతో గడిచిన పది రోజుల్లోనే రూ.700 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా. మొత్తం రూ.వెయ్యి కోట్లు వరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో బెట్టింగులకు పాల్పడినట్లు సమాచారం. ఫలితాలు ఏకపక్షంగా ఉండటంతో 80 శాతం డబ్బు టీడీపీ శ్రేణులు, 20 శాతం జనసేన పోగొట్టుకున్నాయి. బెట్టింగులను ప్రోత్సహించింది చంద్రబాబే.. టీడీపీ గెలుపు అవకాశాలపై వీసమెత్తయినా సందేహించవద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. టీడీపీయే గెలుస్తుందని బుకీలు భారీగా బెట్టింగులు పెడుతున్నారని స్వయానా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో పేర్కొనడంతో ఆ పార్టీ శ్రేణులు బెట్టింగుల వైపు మళ్లారు. తెలుగువారున్న అన్ని రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లో ఉన్న వారిని టీడీపీ నేతలు రెచ్చగొట్టి మరీ బెట్టింగుల వైపు మళ్లించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని బెట్టింగులకు దిగారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానా నుంచి లగడపాటి బినామీ సంస్థకు దోచిపెట్టిన సొమ్ముతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. పోలింగ్ ప్రక్రియ ముగియడానికి ఒక రోజు ముందు లీకులు.. ప్రక్రియ ముగిశాక టీడీపీ ఘన విజయం సాధించబోతుందని లగడపాటితో చిలుక పలుకులు పలికించారు. వీటిని నమ్మిన టీడీపీ ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, టీడీపీ సానుభూతిపరులైన బడా పారిశ్రామికవేత్తలు, నేతలు భారీ బెట్టింగులు కాశారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బరిలోకి దిగారు. వైఎస్సార్ సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పోటీ పడటంతో ఈ నియోజకవర్గ రాజకీయం రసకందాయంగా మారింది. లోకేష్ గెలుపుపైనా బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలకు దిగారు. ముఖ్యంగా టీడీపీ నేతలు లోకేష్ గెలుపుపై గట్టి ధీమా ప్రదర్శించి రూ.వందల కోట్లు పోగొట్టుకున్నారు. ఫలితాలు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి రావడంతో టీడీపీ ఓడిపోవడం, జనసేన ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లాయి. చంద్రబాబు, లగడపాటి మాటలు నమ్మి బెట్టింగులు కాసి భారీగా డబ్బు పోగొట్టుకుని నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. -
లోక్‌సభ స్థానాల్లోనూ బాబుకు ఘోర పరాభవం
సాక్షి, అమరావతి : లోక్‌సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఘోరమైన ఓటమి తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి కొత్త చరిత్రను సృష్టించింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసమయ్యాయి. ఇక విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలో అర్ధరాత్రి వరకూ ఫలితం తేలలేదు. ఈ నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయిన అనంతరం అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మూడుచోట్లా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య విజయం దోబూచులాడుతోంది. చంద్రబాబుకు గట్టి షాక్ కాగా, ఇప్పటివరకు జాతీయస్థాయిలో తానే సీనియర్ నేతనని, ప్రధాని మోదీ కూడా తనకన్నా జూనియర్ అని, కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన చంద్రబాబుకు తాజా లోక్‌సభ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. కొన్ని స్థానాలైనా వస్తే కేంద్రంలో ఎన్డీయేతర పార్టీలతో కలిసో, అదీ కుదరకపోతే వెనుక ద్వారాల ద్వారా బీజేపీ పంచనో చేరుదామనుకున్న చంద్రబాబుకు ఈ ఫలితాలు మింగుడుపడడంలేదు. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి 15, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లోక్‌సభ స్థానాలు వచ్చాయి. అయితే, ఎన్నికలు ముగిసిన పిదప చంద్రబాబునాయుడు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎంపీలు కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలను చంద్రబాబు తనవైపు తిప్పుకున్నారు. ఎన్నికల ముందు బుట్టా రేణుక తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో పోటీచేసిన చంద్రబాబునాయుడు.. కేంద్ర కేబినెట్లో రెండు మంత్రి పదవుల్లో తన ఎంపీలను కూర్చోబెట్టారు. ఇన్ని చేసినా రాష్ట్రానికి ఒక్క మంచిపనినీ సాధించలేదు. కేవలం తన సొంత పనులను చక్కబెట్టుకోవడానికి, కేంద్రంలో పైరవీలకు, కమీషన్లకు మాత్రమే చంద్రబాబు పరిమితమయ్యారు. రాష్ట్రానికి అతి కీలకమైన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కమీషన్లు దండుకోవాలనుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అసెంబ్లీలో గెలవలేకపోయినా కనీసం ఎంపీ స్థానాలు కొన్నైనా వచ్చి ఉంటే కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో అంటకాగవచ్చని భావించారు. అధికారంలో ఉన్న సమయంలో తన అవినీతి అక్రమాలపై విచారణలు జరగకుండా బయటపడవచ్చని అనుకున్నారు. కానీ, ప్రస్తుత ఫలితాలను చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినంత పని అయ్యిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బాబుకు స్పందించని జాతీయ పార్టీలు కాగా, ఇప్పటివరకు ఏదో ఒక వంకతో జాతీయస్థాయిలో విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నానని హడావుడి చేసిన చంద్రబాబుకు ఈ ఫలితాలు దిమ్మదిరిగేలా చేశాయి. నిన్నటివరకు ఈవీఎంలపై పోరాటం అంటూ ఢిల్లీ వీధుల్లో, వివిధ రాష్ట్రాల రాజధానుల్లో తిరిగిన చంద్రబాబుకు ఈ ఫలితాలు బ్రేకులు వేశాయి. కౌంటింగ్‌కు ముందు జాతీయస్థాయిలో విపక్షాల సమావేశం అంటూ చంద్రబాబు హడావుడి చేయబోయినా ఎగ్జిట్‌పోల్స్ చూసి జాతీయ పార్టీలు చంద్రబాబుకు స్పందించడం మానేశాయి. పైగా.. సమావేశం లేదంటూ డీఎంకే తదితర పార్టీలు స్పష్టమైన ప్రకటనలూ చేశాయి. ఈ నేపథ్యంలో.. జాతీయస్థాయిలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడమే కాకుండా ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలు కూడా ఆశించిన స్థానాలను పొందాయి. ఈ పరిణామం చంద్రబాబును మరింత కుంగదీస్తోంది. తనకు సీట్లు రాకపోవడం ఒక విషాద పరిణామం కాగా.. మోదీ నాయకత్వంలో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో బాబుకు ఎటూ పాలుపోవడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా మోదీ ప్రధాని కాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలో మోదీ అధికార పగ్గాలు చేపడితే తనపై ఉన్న అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతుందన్న ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. -
ఫ్యాన్ గాలికి.. సై'కిల్'
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ కకావికలమైంది. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఫ్యాను గాలి హోరులో తెలుగుదేశం అభ్యర్ధులు అనేక స్థానాల్లో కొట్టుకుపోయారు. స్పీకర్, మంత్రులు, సీనియర్ నాయకులు సైతం పరాజయం పాలయ్యారు. టీడీపీ చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలో కూడా ఏ పార్టీకి ఇలాంటి పరాభవం ఎదురుకాలేదు. ఇంతటి ఘోరమైన పరాభవాన్ని చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చవిచూసింది. హామీలన్నీ గాలికొదిలేసి.. గత ఐదేళ్లుగా చంద్రబాబు సాగించిన ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన ఓటర్లు టీడీపీకి గుణపాఠం చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతి మహామహుల ఓటమి ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 20 మాత్రమే దక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లోని మంత్రుల్లో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప మినహా తక్కిన వారంతా ఓటమి చెందారు. పార్టీలో ఓటమి ఎరుగని నేతలుగా పేరుపడ్డ సీనియర్ నేతలు సైతం ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 9సార్లు ఎన్నికలు జరిగాయి. ఏనాడూ ఇంతటి ఘోరపరాభవాన్ని టీడీపీ ఎదుర్కొనలేదు. - టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు ఎచ్చెర్లలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని, తొలిసారిగా పోటీకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గొర్లె కిరణ్ చేతిలో పరాజయం పాలయ్యారు. - సీనియర్ నాయకుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓటమిపాలయ్యారు. - ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఓడిపోయారు. - చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మంత్రి నారాయణ నెల్లూరులో పోటీచేసి వైఎస్సార్సీపీ గాలిలో కొట్టుకుపోయారు. - మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రడు, పితాని సత్యనారాయణ, జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్నాధరెడ్డి.. ఇలా మంత్రులంతా ఇంటిబాటపట్టారు. - విశాఖ జిల్లా అరకులో వైఎస్సార్సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు నక్సల్స్ చేతిలో హతమవ్వగా.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ను టీడీపీలోకి తీసుకొని మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో తండ్రి చనిపోయిన సెంటిమెంటు కూడా కలసిరాక శ్రావణ్ ఓడిపోయారు. విచిత్రమేమంటే ఇక్కడ టీడీపీకి వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. టీడీపీకి మాయని మచ్చ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం మాయనిమచ్చగా మిగిలిపోనుంది.ఆ పార్టీ ఇదివరకెన్నడూ ఇంత ఘోరంగా ఓడిపోలేదు. రాష్ట్ర చరిత్రలో కూడా ఇలాంటి అపజయం వేరే పార్టీకి కూడా రాలేదు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఎంతలా దూరమైందో ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేస్తోంది. గడచిన అయిదేళ్ల కాలంలో చంద్రబాబు అప్రజాస్వామిక పాలన, అవినీతి అక్రమాలు చూసిన ప్రజలు విసుగెత్తిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు గుణపాఠం చెబుదామా? అని అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూశారు. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, బీసీలు, నిరుద్యోగులు, విద్యార్ధులు.. ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనలో నానా అవస్థలు పడ్డారు. హామీలన్నీ గాలికి 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి, బీజేపీ, జనసేన పార్టీల మద్దతులో చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలను ఒక్కదాన్నీ నిలబెట్టుకోలేదు. వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి.. ఇలా అనేక హామీలను గాలికి వదిలేశారు. పైగా రైతులతో సహ అన్ని వర్గాల ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, ఇలా ఒకరేమిటి అందరినీ వేధించారు. అంతేకాకుండా జన్మభూమి కమిటీలంటూ తన పార్టీ నాయకుల ద్వారా ప్రజలను దోపిడీ చేశారు. వేల కోట్ల దోపిడి రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు నుంచి అన్ని ప్రాజెక్టుల పనుల్లో, కాంట్రాక్టు పనుల్లో వేలకోట్ల మేర దోపిడీ చేశారు. ఇసుక నుంచి బొగ్గువరకు, మట్టినుంచి గనుల వరకు.. అన్ని వనరులను టీడీపీ నేతలు కొల్లగొట్టారు. అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించారు. రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను తన స్వార్థంకోసం ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కేంద్రానికి తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ప్రత్యేక హోదా అన్నవారిపై కేసులు పెట్టించారు. చివరకు తన రాజకీయ అవసరాలకోసం కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నా ప్రజలు ఆయన మాటలు విశ్వసించలేదు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా.. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన తీరును రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజాధనం వృథా రాష్ట్రం తీరని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీక్షలు, విదేశీ యాత్రలంటూ చంద్రబాబు వందలకోట్ల నిధులు వృధాగా ఖర్చు చేశారు. కొత్తగా రేషన్‌కార్డులు, పెన్షన్లు, నిరుపేదల చిన్నచిన్న అవసరాలకు నిధులు లేవంటూ ఇలా వృధా చేయడం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. రైతుల నుంచి తీసుకున్న భూములను తనకు కావలసిన వారికి వందల ఎకరాలను చాలా తక్కువ ధరలకు ధారదత్తం చేశారు. పోలీసు విభాగం సహ పలు శాఖలను తన సొంత పనులకు, రాజకీయ అవసరాలకు వాడుకుంటూ వ్యవస్థలను నీరుగార్చారు. ముఖ్యంగా పోలీసు అధికారులను చట్టం ప్రకారం పనిచేయనివ్వకుండా కేవలం ప్రత్యర్థి పార్టీలను వేధించడానికి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయించడానికి ఇతర అప్రజాస్వామిక పనులకు వాడుకోవడం ప్రజలలో టీడీపీ పట్ల వ్యతిరేకతను పెంచింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ఇవన్నీ ప్రతిబింబించి తెలుగుదేశాన్ని మట్టికరిపించాయి. ప్రస్తుతం వెలువడిన ఫలితాలు తెలుగుదేశంపై, చంద్రబాబుతో సహ ఆపార్టీ నేతలకు చెంపపెట్టులాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిసారి ఒంటరిపోటీలో దిగి తెలుగుదేశం గతంలో ఏనాడూ ఒంటరిగా పోటీచేయలేదు. ఈసారి కూడా జనసేన, కాంగ్రెస్ పార్టీలతో తెరచాటు ఒప్పందాలతో చంద్రబాబు ఒంటరి పోరుకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక ద్వారా ఎన్నికల్లో గండం గట్టెక్కవచ్చన్న అభిప్రాయంతో ఇలా చేసినా ఆ ప్రయోగం వికటించినట్లు ప్రస్తుత ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో గద్దెనెక్కారు. 1999లో బీజేపీ అండతో, వాజిపేయి హవాలో విజయం సాధించారు. 2004లో పొత్తుల్లో పోటీచేసి ఓడిపోయి బీజేపీ వల్లనే ఓటమి అంటూ నెపాన్ని ఆపార్టీపైకి నెట్టేశారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అంటూ పలు పార్టీలను కలుపుకొని పోటీకి దిగినా చంద్రబాబుకు పరాభవం తప్పలేదు. 2014లో తిరిగి బీజేపీతో పొత్తులు, మోడీ ప్రభంజనం, జనసేన మద్దతుతో అత్తెసరు ఓట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఈ గణాంకాలు చూస్తే ఏనాడూ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఒంటరిగా పోటీచేసి గెలుపొందలేదు. కేవలం ఇతర పార్టీల మద్దతుతోనే బతికిబట్టకట్టిందన్నది తేటతెల్లం. ఈ ఎన్నికల్లోనూ ఎన్ని మాయోపాయాలు పన్నినా ప్రజలు టీడీపీని, చంద్రబాబును గట్టిగా తిరస్కరించారు. పలు జిల్లాల్లో ఖాతా తెరవని వైనం గతంలో తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆపార్టీ కొన్ని జిల్లాల్లో ఖాతాలనూ తెరవలేకపోయింది. కడప, నెల్లూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేకపోయింది. కొన్నిజిల్లాల్లో ఒకటి, రెండు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ‘పార్టీకి ఇంతటి ఘోరమైన ఫలితాలు వస్తాయని కలలో కూడా ఊహించలేకపోతున్నాం. ఒకప్పుడు అన్నివర్గాలు ముఖ్యంగా బీసీలు వెన్నెముకగా ఉన్న టీడీపీకి ఇంటి ఘోరపరాజయం ఎదురవ్వడానికి పార్టీ అధిష్ఠానం తీరే కారణం. ఒంటెత్తుపోకడలు, మితిమీరిన అవినీతి అక్రమాలు, విచ్చలవిడితనంతో ప్రభుత్వమంటేనే ప్రజల్లో ఏవగింపు కలిగేలా చంద్రబాబు చేశారు. పార్టీకి, పార్టీ యంత్రాంగానికి దూరం పెంచేశారు. నాయకులే కాదు గ్రామస్థాయిలో కూడా జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గాలు ప్రజల్లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. వాటిఫలితమే ప్రస్తుత ఫలితాలు’ అని పార్టీ సీనియర్‌నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్ని మాయోపాయాలు పన్నినా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు చేయని కుట్రలు, కుతంత్రాలు లేవు. ఒకపక్క జనసేనతో లోపాయికారీ ఒప్పందాలు కొనసాగిస్తూ.. మరోవైపు ఆ పార్టీని వేరుగా బరిలోకి దించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు ప్రయత్నించారు. ఏకంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అపాయింట్మెంటు కూడా ఇవ్వని మాయవతితో మాట్లాడించి బీఎస్పీతో జనసేనకు పొత్తులు కుదిర్చారు. ఆ పార్టీ అభ్యర్ధులను తానే నిర్ణయించడమే కాకుండా.. ఏకంగా వారికి కావలసిన ఆర్థిక వనరులు కూడా చంద్రబాబు సమకూర్చారు. మరోవైపు కేఏపాల్‌ను ప్రజాశాంతి పార్టీని బరిలోకి దించి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పోలిన విధంగా కండువాలు, జెండాలు ఏర్పాటు చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాను గుర్తును పోలి ఉండేలా హెలికాప్టర్ గుర్తును కూడా ప్రజాశాంతి పార్టీకి రావడం ద్వారా ఓట్లు చీలుతాయనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాయమాటలు, చేష్టలు గమనించి ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చకుండా మోసం చేయడమే కాకుండా .. ఈ ఎన్నికల ముందు మళ్లీ పసుపు కుంకుమ, పెన్సన్ల మొత్తం పెంపు, నిరుద్యోగ భృత వంటివి తెరపైకి తెచ్చినా చంద్రబాబును ప్రజలు విశ్వసించలేదు. నానాటికీ తీసికట్టుగా టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు చూస్తుంటే.. గతంలో ఏ పార్టీకి ఇంతట ఆదరణ లేదన్నది సుస్పష్టమవుతోంది. 1983లో ఎన్టీరామారావు టీడీపీని స్థాపించి పోటీచేసిన స్థానాలు 290 కాగా.. గెలిచిన స్థానాలు 204 అంటే 70.30 శాతం స్థానాలను గెల్చుకున్నారు. అదే 1985లో వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని 250 స్థానాల్లో టీడీపీ పోటీచేయగా.. 202 (80శాతం) చోట్ల గెలిచింది. మళ్లీ 1994లో వివిధ పార్టీలతో పొత్తుల్లో 251 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ 216 (86శాతం) స్థానాల్లో గెలుపొందారు. అదే చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. 1999లో బీజేపీతో పొత్తుల్లో 269 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ 180 (66 శాతం) స్థానాలకు పరిమితమైంది. ఆ తరువాత 2004, 2009లో వరుసగా ఓటమి పాలైంది. 2014లో బీజేపీ, జనసేన పొత్తుల్లో 163 స్థానాల్లో పోటీచేసి 102 (62 శాతం) స్థానాల్లో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కి సీట్లు పెరిగినా ఓట్ల శాతం మాత్రం చాలా తక్కువే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా కేవలం 1.96 ఓట్లు మాత్రమే అదనంగా సాధించి ప్రభుత్వంలోకి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. రాత్రివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీడీపీ 175 నియోజకవర్గాల్లో తొలిసారిగా ఒంటరిగా పోటీచేసింది. ఆ పార్టీకి కేవలం 20 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. ఇక ఓట్ల శాతాలు భారీగా తగ్గినట్లు ఆయా అభ్యర్దులకు వచ్చిన మెజార్టీలు చెబుతున్నాయి. -
టీడీపీ కుట్రలకు చెల్లు చీటీ...
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలు, మాయోపాయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన రీతిలో తగిన బుద్ధి చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఆయన వేసిన అడ్డదిడ్డమైన ఎత్తులను ఏకపక్ష తీర్పుతో చిత్తు చేశారు. వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతూ... రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే పెద్దఎత్తున ఆమోదంతో, కనీవిని ఎరుగని భారీ మెజార్టీలతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. ఈ సునామీలో మంత్రులు సహా తెలుగుదేశం పార్టీ హేమాహేమీలు ఘోర పరాజయం పాలయ్యారు. అన్ని ఎత్తులను తుడిచిపెట్టేశారు... వైఎస్సార్ కాంగ్రెస్ పారీ, వైఎస్ జగన్‌ను అడ్డుకునేందుకు దశాబ్దం నుంచి టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయంగానే కాక ఇతర మార్గాల్లోనూ అనేక పన్నాగాలు పన్నారు. ఈ ఎన్నికల్లో వాటిని పరాకాష్టకు తీసుకెళ్లారు. ఎలాగైనా గెలవాలనన్నట్లుగా టీడీపీ ఎంచుకున్న అడ్డదారులను, చివరకు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడటాన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు పసిగట్టి గట్టిగా తిప్పికొట్టారు. పురిట్లోనే గొంతు నులిమేయాలని... 2011 సమయంలో దేశంలో అత్యంత బలీయ నాయకురాలైన సోనియాగాంధీని ఎదిరించి... కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మరుక్షణమే చంద్రబాబు దొంగదెబ్బకు సిద్ధమయ్యారు. ఆ ఏడాది ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీలతో గెలవడంతో తమకు, తమ పార్టీలకు వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పెనుముప్పని ఊహించిన చంద్రబాబు... ఏకంగా బద్ధ శత్రువు, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, వైఎస్సార్ కాంగ్రెస్‌ను అణగదొక్కడంపైనే దృష్టిపెట్టారు. అధికార పార్టీ అరాచకాలను పట్టించుకోలేదు. కానీ, దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీలో నిలదీసింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. టీడీపీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది. చివరకు జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి సీబీఐని ఉసిగొల్పారు. 2014లో నలుగురూ ఒక్కటై 2014 సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెస్ సీనియర్ నేతలను టీడీపీలో చేర్చుకోవడమే కాక ఆ పార్టీతో తెరవెనుక ఒప్పందంతో వారి ఓట్లు తమకు పడేలా చంద్రబాబు వ్యూహాలు పన్నారు. ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఓడించే సత్తా లేక, షరా మామూలుగా ఒంటరి పోరుకు భయపడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. మరోవైపు సినీ నటుడు పవన్ కల్యాణ్ నుంచి బేషరతు మద్దతుకు పాకులాడారు. అన్నిటికి మంచి నీచస్థాయికి దిగజారి... వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నేతలపై అసత్య ఆరోపణలు చేయించారు. రూ.వేల కోట్లను మంచి నీళ్లలా వెదజల్లి, కులాల వారీగా ఓటర్లను చీల్చి అనారోగ్యకర వాతావరణం సృష్టించారు. అయినా, కేవలం 1.96 (5 లక్షల ఓట్లు) శాతం ఓట్ల తేడాతోనే నెగ్గగలిగారు. అధికారంలోకి వచ్చాక మరిన్ని కుతంత్రాలు విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరునాటి నుంచే మరిన్ని కుట్రలు పన్నారు చంద్రబాబు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాక, నలుగురికి మంత్రి పదవులిచ్చారు. ప్రజా సమస్యలు ప్రస్తావించనీయకుండా మందబలంతో అసెంబ్లీలో ఆ పార్టీని అడ్డుకున్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి... రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెడితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం దానిపై ఆందోళనలు చేపట్టి డిమాండ్‌ను సజీవంగా ఉంచారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా తుని వద్ద రైలును దహనం చేసి ఆ కుట్రలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ఇరికించేందుకు యత్నించారు. రాజధాని ప్రాంతంలో రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై కేసులు బనాయించి జైలుకు పంపారు. ఇన్ని చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ ఆత్మ స్థైర్యంతో ప్రజల వెనుక నిలిచి పోరాటం కొనసాగించింది. ఎన్నికల కుట్రలెన్నెన్నో 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబుకు అడ్డులేకుండా పోయింది. అధికారం అడ్డంపెట్టుకుని నిబంధనలు, రాజ్యాంగ పరిధులను విస్మరించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అణచేందుకు ప్రయత్నాలు చేశారు. టీడీపీ అరాచక పాలనలో నలిగిపోతున్న ప్రజానీకాన్ని ఓదార్చేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేపడితే అడ్డుకొనేందుకు చంద్రబాబు, తెలుగుదేశం నేతలే కాక కొందరు పోలీసు ఉన్నతాధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. చివరకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికీ ఒడిగట్టారు. ఆ కేసును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నించారు. ఎన్నికల్లో ఓటమి తథ్యమన్న అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు ఆపసోపాలు పడ్డారు. జనసేన పార్టీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటూ ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగేలా చూశారు. ఆ పార్టీకి అభ్యర్ధులను ఎంపిక చేయడమే కాక వారికి రూ.కోట్లకు కోట్లు సమకూర్చారు. హెలికాప్టర్ గుర్తుతో, పార్టీ జెండాలు, కండువాలు ఒకేలా ఉండేలా చేసి ప్రజాశాంతి పార్టీ అంటూ కేఏ పాల్‌ను బరిలో దించి వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. ఈవీఎంలపై నెపాన్ని నెట్టే ప్రయత్నం ఇన్ని చేసినా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉండటంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఘోర పరాజయం తప్పదని తెలిసిపోవడంతో సాకులు వెదికారు. ఈవీఎంల వల్లనే ఓడామని చెప్పుకొనేందుకు వాటిపై పెద్ద రాద్ధాంతమే లేవదీశారు. తన వైఫల్యాలు, ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జాతీయ స్థాయి పోరాటమంటూ తిరిగారు. -
జగన్ ప్రచారం... వైఎస్సార్సీపీ జయకేతనం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రచారం వైఎస్సార్సీపీకి అఖండ విజయం అందించింది. ఆయన ఎన్నికల సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో 88 శాతం స్థానాల్లో పార్టీ విజయఢంకా మోగించడం ఇందుకు నిదర్శనం. జాతీయ స్థాయిలోనూ ఇది అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఫిబ్రవరి 6న తిరుపతిలో సమర శంఖారావం సభతో శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 9 వరకు 13 జిల్లాల్లో 73 సభల్లో పాల్గొన్నారు. రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనడం విశేషం. ఏప్రిల్ 9న గుంటూరు, తిరుపతిలలో సభలతో ఈ పర్వాన్ని ముగించారు. ఆయన ప్రచారం చేసిన 73 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 64 చోట్ల ఘన విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తమ్మీద తిరుపతి, కడప, అనంతపురం, ఏలూరు, నెల్లూరు, కాకినాడ, నర్సీపట్నం, నెల్లిమర్ల, పి.గన్నవరం, పాణ్యం, రాయదుర్గం, రాయచోటి, పోలవరం, అవనిగడ్డ, వేమూరు, కావలి, పలమనేరు, పులివెందుల, పలాస, పాడేరు, పిఠాపురం, చిలకలూరిపేట, తిరువూరు, ఆదోని, తాడిపత్రి, మదనపల్లె, పార్వతీపురం, పాయకరావుపేట, ముమ్మడివరం, చింతలపూడి, వినుకొండ, నందిగామ, సంతనూతలపాడు, బద్వేల్, మైదుకూరు, నగరి, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మడకశిర, పెనుకొండ, గూడరు, గిద్దలూరు, దర్శి, శృంగవరపుకోట, పెందుర్తి, భీమవరం, సత్తెనపల్లి, గురజాల, ఒంగోలు, మైలవరం, నెల్లూరు, నంద్యాల, కల్యాణదుర్గం, జమ్మలమడుగు, విజయవాడ సెంట్రల్, రాజానగరం, అనకాపల్లి, గాజువాక, మచిలీపట్నం, ఏలూరు, కాకినాడ రూరల్, మంగళగిరి, కర్నూలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నెగ్గింది. -
కంచుకోటలకు బీటలు
అనేక దశాబ్దాలుగా గెలుస్తూ తమ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లోనూ ఈసారి తెలుగు దేశం ఘోరంగా ఓడింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. రాష్ట్రంలో టీడీపీకి 47 వరకు స్థానాల్లో గట్టి పట్టుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు వీటిలో గెలుపొందింది. ఇలాంటి పలు స్థానాలు ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. మిగతా వాటిలోనూ తీవ్ర పోటీ ఎదురైంది. చంద్రబాబు కుప్పంలో ఎప్పుడూ 50 వేల పైగా ఓట్లతో గెలుస్తుండగా ఇప్పుడది 30 వేల లోపునకు పడిపోయింది. హిందూపురంలో ఆయన బావ మరిది, సినీ హీరో బాలకృష్ణకూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ రెండూ కాక ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 వరకు ఉన్నాయి. వీటిలో చాలాచోట్ల ఈసారి ఆ పార్టీ మట్టికరిచింది. సాక్షి, అమరావతి: - శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం (మొత్తం ఏడుసార్లు) సాధించింది. ఇప్పుడు మాత్రం టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషను వైఎస్సార్సీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు ఓడించారు. విజయనగరం జిల్లా నెలిమర్ల (ఏడుసార్లు నెగ్గింది)లోనూ ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బి.అప్పలనాయుడు... టీడీపీ అభ్యర్థి నారాయణను పరాజయం పాల్జేశారు. - 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు (టీడీపీ)... వైఎస్సార్సీపీ నేత కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడారు. ఇదే జిల్లా శృంగవరపు కోటలోనూ టీడీపీ ఏడుసార్లు గెలిచింది. తాజాగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కె.శ్రీనివాస్... కోళ్ల లలిత కుమారి (టీడీపీ)ని ఓడించారు. - పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ నెగ్గింది. - ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత (టీడీపీ)... వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తానేటి వనిత చేతిలో పరాయం పాలయ్యారు. ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ... వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీరంగనాథ రాజు చేతిలో ఓడారు. టీడీపీ ఏడుసార్లు నెగ్గిన నర్సాపురం, గోపాలపురంలలోనూ వైఎస్సార్సీపీ పాగా వేసింది. - ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామను వైసీపీ హవాలో టీడీపీ చేజార్చుకుంది. -1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... ఇప్పుడు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేతిలో ఓడిపోయారు. - అనంతపురం జిల్లా పెనుగొండలో టీడీపీ సీనియర్ నేత బీకే పార్థసారథి... వైఎస్సార్సీపీ అభ్యర్థి చేతిలో ఎం.శంకరనారాయణ చేతిలో ఓడారు. - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి... వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. - కర్నూలు జిల్లా పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబును దించగా వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి చేతిలో ఓడారు. హేమాహేమీలకు పరాభవం 1983 నుంచి ఆరుసార్లు నెగ్గిన 29 నియోజకవర్గాల్లో చాలావరకు టీడీపీ చేజారాయి. ఆ జాబితా చూస్తే... - పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకటరావు ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా)లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌పై ఓడారు. - విశాఖ జిల్లా భీమిలి, చోడవరం, మాడుగుల, అనకాపల్లి వైస్సార్సీపీ హస్తగతమయ్యాయి. నర్సీపట్నంలో టీడీపీ సీనియర్ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేశ్ చేతిలో ఓడారు. - రంపచోడవరం, తుని, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరుల్లోనూ సైకిల్ పంక్చరైంది. - రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనాలకు నెలవైన దెందులూరు (పశ్చిమగోదావరి)లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఓటర్లు తిరస్కరించారు. చింతలపూడిలోనూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. - కృష్ణా జిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమా వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో పరాజయం చవిచూశారు. అవనిగడ్డలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్... వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ చేతిలో ఓడిపోయారు. - గుంటూరు జిల్లా వినుకొండ, ప్రత్తిపాడు, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా సత్యవేడు, అనంతపురం జిల్లా ధర్మవరం, కల్యాణదుర్గం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. -
మోదీ, జగన్, నవీన్‌లకు కేసీఆర్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయ కత్వంలో దేశం మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షిం చారు. మరోవైపు ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజూ జనతాదళ్ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్‌కు సీఎం కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలో ఒడిశా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు. మీ కష్టానికి ప్రజల ఆశీర్వాదం దక్కింది: కేటీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు పడిన కష్టానికి అఖండ మెజారిటీ రూపంలో ప్రజల ఆశీర్వాదం దక్కింది. సాటి తెలుగు రాష్ట్ర పరిపాలనలో మం చి జరగాలని ఆశిస్తున్నా’అని ట్విట్టర్లో పేర్కొ న్నారు. ప్రధాన మంత్రి మోదీకి, బీజేపీ అధ్యక్షు డు అమిత్ షాకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపా రు. దేశ ప్రజలు స్పష్టమైన ఆధిక్యంతో ఎన్డీయేకు విజయం కట్టబెట్టారని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఓటర్లకు హరీశ్ కృతజ్ఞతలు.. మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు మాజీ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ లోకసభ నియోజకవర్గ పరిధి లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసాన్ని కనబర్చారని ట్విట్టర్లో పేర్కొన్నారు. మోదీ, జగన్‌లకు హరీశ్ శుభాకాంక్షలు లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజ యం సాధించిన ప్రధాని మోదీకి, ఏపీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డికి టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నవయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న జగన్మోహన్రెడ్డి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసేలా పాలన కొనసాగించాలని ఆకాంక్షించారు. -
అన్నొచ్చాడు..
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ విప్లవాన్ని సృష్టించింది. రికార్డు స్థాయి విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవ శకానికి నాంది పలికింది. నిజాయితీ, నిబద్ధతతో పదేళ్లుగా ప్రజల పక్షాన నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పట్టాభిషేకం చేసింది. నిండు మనసుతో దీవిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చింది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమే చేసింది. మొ త్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 151 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో విజయ దుందుభి మోగించి సరికొత్త చరిత్రను లిఖిం చింది. ఏపీ ప్రజలు వైఎస్సార్సీపీకి మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ పా ర్టీ చరిత్రలో ఇదే దారుణ ఓటమి అని చెబుతున్నారు. టీడీపీ దిగ్గజాల ఓటమి మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్ నాయకత్వానికి ఏపీ ప్రజలు ముక్తకంఠంతో జేజేలు పలికారు. కుట్రలు, కుతంత్రాలను ఎదురొడ్డుతూ ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పాదయాత్రికునికి పట్టం కట్టారు. దేవుడి ఆశీస్సులు కోరుతూ... రాజన్న రాజ్యం స్థాపన కోసం అలుపెరుగక శ్రమిస్తున్న జగన్‌ను మనసారా దీవించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 2014లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఐదేళ్లపాటు ప్రజావ్యతిరేక పాలన సాగించిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రజల ఓటుదెబ్బకు కుదేలైపోయింది. ఆవిర్భావం అనంతరం ఎన్నడూ లేని రీతిలో కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. 19 మంది మంత్రులు, స్పీకర్, చీఫ్ విప్, విప్‌లతోసహా ఆ పార్టీ అతిరథ మహారథులు ఓటమి పాలయ్యారు. ఇక తృతీయ ప్రత్యామ్నాయంగా అవతరిస్తామని చెప్పుకున్న పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. వెరసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. రాష్ట్ర చరిత్రలో అరుదైన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రమంతటా జగన్‌కు జేజేలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఏపీ ప్రజలంతా తాము వైఎస్ జగన్ వెన్నంటే ఉన్నామని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును గురువారం చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఇక ఈవీఎంలు తెరిచినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభంజనం మొదలైంది. మొదటి రౌండ్ నుంచే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా–గుంటూరు, నెల్లూరు– ప్రకాశం, రాయలసీమ... ఇలా ప్రాంతం ఏదైనా ఫలితం ఒక్కటే. అసెంబ్లీ నియోజకవర్గమైనా, లోక్‌సభ నియోజకవర్గమైనా ఫలితంలో తేడా లేదు. రాష్ట్ర మంతటా జగన్ నాయకత్వానికే ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారు. గురువారం ఉదయం 9 గంటలకల్లా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రానుందని తేటతెల్లమైంది. వైఎస్సార్సీపీ ఏపీలో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా.. ఎన్నికల ఫలితాల్లో ఏపీ అంతటా జగన్ ప్రభంజనం విస్పష్టంగా కనిపించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ వైఎస్సార్సీపీ జైత్రయా త్ర కొనసాగించింది. ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా యావత్ రాష్ట్రం జగన్‌కు నీరాజనాలు పలికింది. ఏ జిల్లాలో చూసినా వైఎస్సార్సీపీ తిరుగులేని రీతిలో విజయం సాధిస్తూ వచ్చింది. అన్ని జిల్లాల్లోనూ 2014 ఎన్నికల్లో గెలిచిన దాని కంటే రెండు రెట్లకు పైగా స్థానాల్లో ఘన విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాల్లో గెలిచి వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసి పెను సంచలనం సృష్టించింది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 28 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఉభయగోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాలకు గాను 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కృష్ణా, గుం టూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాల్లో 29 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 22 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. రాయలసీమలో వైఎస్సార్సీపీ జైత్రయాత్ర కొనసాగించింది. సీమ పరిధిలోని నాలుగు జిల్లాల్లోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 49 సీట్లలో అఖండ విజయం సాధించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ తోపాటు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని స్థానాలను స్వీప్ చేసింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ఒక్క కుప్పం మినహా మిగిలిన 13 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ బలంగా ఉందని భావించే అనంతపురం జిల్లా లోని 14 స్థానాలకు గాను 12 సీట్ల ను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. జగన్ సునామీలో కొట్టుకుపోయిన టీడీపీ వైఎస్ జగన్ సునామీలో అధికార టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. చంద్రబా బు ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి అవమానకర రీతిలో అధికార పీఠం నుంచి వైదొలగింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీ పీ కేవలం 20 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు టీడీ పీనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. జగన్ ప్రభం జనంలో టీడీపీలోని అతిరథ మహారథులు కూడా కొట్టుకుపోయారు. టీడీపీ కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాలు కూడా జగన్ ప్రభంజనం ధాటికి తునాతునకలైపోయాయి. చంద్రబాబు మంత్రివర్గంలోని 24 మంది మంత్రుల్లో 21 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఘోరపరాజయం పాలయ్యారు. మంత్రులు కళా వెంకట్రావు, సుజయ్‌కృష్ణ రంగారావు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు చిత్తుగా ఓడిపోయారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మంత్రి శిద్ధా రాఘవరావు ఘోర పరాజయం పాలయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరాజయం చవిచూశారు. 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి, తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన 23 మందికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వాళ్లలో ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో గొట్టిపాటి రవికుమార్(అద్దంకి) తప్ప మిగిలిన వారంతా ఘోరంగా ఓడిపోయారు. చంద్రబాబు తాను పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో మొదటి రెండు రౌండ్లలో వెనుకబడటంతో టీడీపీ షాక్‌కు గురై కొంతసేపు బెంబేలెత్తిపోవడం ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది. పత్తాలేని జనసేన పార్టీ ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్‌గా వ్యవహరించిన పవన్ కల్యాణ్‌ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. జగన్ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ అతి కష్టంపై విజయం సాధించారు. దాదాపు 40 శాతం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఓటర్లు ఆ పార్టీని ఎంతగా తిరస్కరించారన్నది దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇక జనసేనతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలు అడ్రస్ లేకుండా పోయాయి. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించిన బీజేపీ ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. 22 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్ గాలి ఏపీలో లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ రికార్డు విజయంతో చరిత్రను తిరగ రాసింది. కడపటి వార్తలు అందే సమయానికి మొత్తం 22 ఎంపీ సీట్లల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఇంకా శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఫలితాలు ప్రకటించిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, మచిలీపట్నం, నరసారావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, అనంతపురం, హిందూపూర్, కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించడం వైఎస్సార్సీపీ పట్ల ప్రజల ఆదరణకు ప్రతీకగా నిలిచింది. ఆ స్థానాల్లో ఫలితంపై ఉత్కంఠ శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు లోక్‌సభ స్థానాల ఫలితం ఇంకా తేలలేదు. అలాగే విశాఖ నార్తు, పర్చూరు, ఉరవకొండ అసెంబ్లీ స్థానాల్లోనూ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో ఎవరు నెగ్గుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అధికార టీడీపీని ప్రజలు ఎంత చిత్తు చిత్తుగా ఓడించారంటే ఏకంగా నాలుగు జిల్లాల్లో ఆ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ ధాటికి కడప, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ కనుమరుగైపోయింది. కనీసం ఒక్క సీటులో కూడా బోణీ కొట్టలేక చతికిలపడింది. -
ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రజలను ఎన్టీఆర్ ఆత్మ ఆవరించి చంద్రబాబును ఓడించిందని, ఇప్పుడు ఆయన ఆత్మ నిజంగా శాంతిస్తుందని టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వల్లనే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోయాయని మండిపడ్డారు. తనను నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు తన ఉసురే తగిలిందని చెప్పిన మోత్కుపల్లి.. చంద్రబాబును ఓడించిన ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. -
హీరో ఆగమనం!
అలలు అలలుగా అల్లుకుంటూ పెను ఉప్పెన కెరటమై ఉప్పొంగిన జనసంద్రపు గళ ఘోష చెవిలో ప్రతిధ్వనించినట్టు... కలలన్నీ కలిసిపోయి ఒక మహా స్వప్నాన్ని కనుల ముందట ఆవిష్క రించినట్టు... ఏమి విజయమిది! సమకాలీన రాజ కీయ చరిత్రలో దీనికి సాటి రాగల దృష్టాంతమెక్క డున్నది? నూటికి 90 శాతం లోక్‌సభ సీట్లను, సుమారు 85 శాతం అసెంబ్లీ సీట్లను తుడిచిపెట్టి 50 శాతానికిపైగా ఓట్లను కొల్లగొట్టి ప్రజాభిమానా నికి కొత్త హద్దురాళ్లను పాతిన అపూర్వ ఘట్టం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదే శ్లో 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రతి పక్షమే లేదు. కాంగ్రెస్‌లో టికెట్ దొరకని∙కొందరు తిరుగుబాటు అభ్య ర్థులూ, అక్కడక్కడా విసిరేసినట్టు కమ్యూనిస్టులు మాత్రమే పోటీ. అయినా కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి విజయాన్ని సాధించలేక పోయింది. 75 శాతం సీట్లను మాత్రమే గెలవగలిగింది. గణాంకాలను పరిశీలిస్తే 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిన విజయం మాత్రమే ఈ గెలుపునకు సమీపంగా నిలబడగలుగు తుంది. అయితే అప్పుడు టీడీపీకి ఉభయ కమ్యూనిస్టుల బలం తోడ య్యింది. ఆ రెండు పార్టీలు కలిసి 34 సీట్లను గెలుచుకున్నాయి. పోరాట పటిమలేని అర్భక శ్రేణుల నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడింది. గట్టిగా తంతే కుప్పకూలే శిథిల సౌధంలాంటి స్థితి నాటి కాంగ్రెస్ పరిస్థితి. మరి ఇప్పుడు? టక్కుటమార విద్యల్లో పుతిన్, ట్రంప్‌లకు పాఠాలు చెప్పగల అంతర్జాతీయ మాయల మరాఠీతో పోరాటం. రాష్ట్ర ప్రజల సహజ వనరు లను దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఎరవేశాడు. మొత్తం మీడియాలను కవచంలా వాడుకున్నాడు. వేయని ఎత్తు లేదు, చేయని తప్పు లేదు. వేయిగొడ్లను తిన్న రాబందును నేలకూల్చిన గాలివానలాగా వైఎస్సార్సీపీ సాధించిన ఈ గెలుపు ఎలా సాకారమయ్యింది? ఈ అపురూప విజయం కేవలం గణాంకాల వంటి సాంకేతిక అంశాల తోనే కొలిచేది కాదు. ఇదొక మానవీయ విజయం. ఇదొక మహోదాత్త విజయం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కోరి కష్టాలను కౌగిలించుకున్న ఒక హీరో పోరాట పటిమకు ప్రతిరూపం ఈ విజయం. ఈ ఒక్క మాట చెబితే అధికారం నీదేనని ఎందరు బతిమాలి చెప్పినా... అసత్య వాగ్దానాలను ఇవ్వడానికి నిరా కరించి, ఓటమికే సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డి వంటి రాజకీయ నాయ కుడు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కాగడా పట్టుకొని వెతికినా కనిపించడు. అవినీతి, అక్రమార్జన, స్వార్థాలే పరమార్థాలుగా పతనమవుతున్న నేటి రాజకీయ వ్యవస్థలో వైఎస్ జగన్ ఉత్థానం నిస్సంశయంగా ఒక మేలి మలుపు. జగన్ రాజకీయ రంగంలోకి ప్రవేశించి సరిగ్గా పదేళ్లు. ఈ పదేళ్లలో ఆయన జీవితం లిఖించిన చరిత్ర మరో వందేళ్ల వరకు పాఠాలు చెబుతుంది. ఈ పదేళ్లలో ఆయన తనను తాను మలుచుకున్న తీరు నిరుపమానం. ఇచ్చిన మాట తప్పితే అందలమెక్కిస్తామని ఆశలు చూపినా.. మా మాట వినకుంటే కష్టాలపాలవుతావని భయపెట్టజూసినా చలించకుండా జగన్మోహన్రెడ్డి నిబ్బరంగా నిలబడిన తీరు అనన్యసామాన్యం. చేయని తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినా, జైల్లో మగ్గాల్సి వచ్చినా మాట తప్పని తీరునూ, మడమతిప్పని తత్వాన్ని జనం క్రమంగా అర్థం చేసుకున్నారు. విలువలతో కూడిన రాజకీయ జీవితం కోసం ఆయన తనను తాను కష్టపెట్టుకున్న తీరును ప్రజలంతా గమనించారు. రాజకుమారుడిలాగా జీవించే అవకాశాలున్నా తృణప్రాయంగా కాలదన్ని కష్టాల కొలిమిలో తనను తాను కాల్చుకున్నాడు. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలాడు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రజల్లో తిరుగుతూ, వాళ్ల బాధలు, గాథలు వింటూ ధైర్యం చెబుతూ తన చెమట చుక్కలు ధారబోసి ఒక రాజకీయ పార్టీని ప్రజల హృదయాల్లో ఆయన నిర్మించుకున్నాడు. ఉన్నత విలువలతో కూడిన నిజాయితీ, నిబద్ధత కలిగిన రాజకీయాలు నడిపి ప్రజల మనసులను గెలుచుకున్నాడు. ఆయన పదేళ్ల కఠోర శ్రమకు ప్రజలిచ్చిన కానుక ఈ విజయం. అందుకే ఈ విజయం పవిత్రమైనది. ఈ విజయం అత్యంత విలువైనది. ఈ విజయం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఈ విజయం ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. అందుకే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మె ల్యేలు, ఎంపీలంతా ఈ విజయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించి విలువలతో కూడిన కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం చుట్టవలసి ఉంటుంది. ప్రజా సంక్షేమమే ఊపిరిగా భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో నిర్మించిన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని ప్రజలు భావి స్తున్నారు. మాట తప్పని నీతిమంతుడూ, మడమతిప్పని ధీరోదాత్తుడూ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతు న్నందువలన అనతికాలంలోనే ఒక పావన నవజీవన బృందావనంగా నవయుగాంధ్ర రూపుదిద్దుకోవాలని యావన్మంది ప్రజల ఆకాంక్ష. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
విలువలు, విశ్వసనీయత..బైబై బాబు!
సాక్షి, హైదరాబాద్ : ‘విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టండి’ అంటూ వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్షరాలా నిజం చేసి చూపించారు. మహానేత వైఎస్సార్‌ను కోల్పోయినప్పటికీ... తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని చెప్పినా ఆ మాతృమూర్తి ఎన్నడూ అడ్డు చెప్పలేదు. భర్తను కోల్పోయినప్పటికీ... రాజకీయ ప్రత్యర్థులు కుమారుడిని నెలల పాటు జైళ్లో ఉంచినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కుటుంబాన్ని, పార్టీ శ్రేణులను ముందుకు నడిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఓటమి పాలైనప్పటికీ జననేత జగన్‌తో పాటు ఆమె కూడా వారికి అండగా నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజారంజక పాలన అందించేందుకు వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేసిన తనయుడికి మద్దతుగా..ఎండల్ని సైతం లెక్కచేయక సుడిగాలి ప్రచారం నిర్వహించారు. 27 సభల్లో తనదైన శైలిలో ప్రచారం సాగించి చంద్రబాబు పాలనను ఎండగట్టారు. అదే దరహాసం.. తరగని విశ్వాసం ఓ పక్క హామీలను గాలొకొదిలేసి ప్రజలను వంచించిన అధికార పార్టీని విమర్శిస్తూనే.. మరోపక్క తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి పాలన అందిస్తారోనన్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించారు. వైఎస్సార్ పాలనను గుర్తు చేస్తూ.. రాజన్న తనయుడికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఉద్వేగపూరితంగా ఆమె చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలించాయి. ప్రజలకిచ్చిన మాటకోసమే జగన్.. సోనియాను ఎదిరించి మరీ ఓదార్పు యాత్ర చేశారని, ఈ నేపథ్యంలో ప్రజల్లో జగన్ పట్ల ఆదరణ పెరిగిపోవడంతో తట్టుకోలేని కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించాయని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి.. ఆస్తులు అటాచ్ చేశారని, చివరకు విచారణ పేరుతో పిలిచి జైల్లో పెట్టారంటూ జరిగిన సంఘటనలను సవివరంగా తెలియజేస్తూ, తను ఎందుకు బయటకు రావాల్సి వచ్చినదీ వివరించడం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఆనాడు తమ కుటుంబం వెంట నిలిచిన ప్రజలకోసం తాను, షర్మిల బయటకు వచ్చామని, ఈరోజు కూడా ప్రజలంతా తమ కుటుంబమనుకునే బయటకు వచ్చామన్న ఆమె మాటలు జనం గుండెలను తాకాయి. ఈ విధంగా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆలోచింపజేసిన విజయమ్మ మాటలు - రాజశేఖరరెడ్డి గారిలా జగన్ మాట ఇస్తే తప్పడు. వాళ్ల నాన్న మాదిరి పరిపాలన అందిస్తాడు. - జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. - ఈరోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది.. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టండి. - జగన్ సోనియా గాంధీనే ఎదిరించి నిలిచినవాడు.. ఈరోజు కేసులకు భయపడతాడా? ఓటమి భయంతో చంద్రబాబు ఇష్టానురీతిన దుష్ప్రచారం చేస్తున్నారు. అన్న బాణం.. దూసుకెళ్లిన షర్మిల.. వైఎస్సార్ తనయ, జగన్ సోదరి షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అన్న జైలులో ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ఆమె.. ప్రస్తుత ఎన్నికల్లో 39 సభల్లో పాల్గొని ప్రచారంలోనూ ప్రజలను ఉర్రూతలూగించారు. ‘మాకు ఎవ్వరితోనూ పొత్తుల్లేవు. సింహం సింగిల్‌గానే వస్తుంది.. నక్కలే గుంపులుగా వస్తాయి’ అంటూ ప్రచారం సాగించిన షర్మిల తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఎన్నికల ముంగిట పసుపు- కుంకుమ పేరిట ఇస్తున్న డబ్బులు డ్వాక్రా రుణాల వడ్డీలకు కూడా సరిపోవని వివరించిన తీరు మహిళలను ఆలోచింపజేశాయి. చంద్రబాబు ఏవిధంగా అబద్ధాలు చెబుతున్నారో, ప్రజల్ని ఏ విధంగా మోసగించారో ఆమె సూటిగా వివరిస్తూ.. విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు వంచించిన తీరును కళ్లకు కట్టారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ఆమె ప్రజల ముందుంచారు. సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు లోకేశ్ వ్యవహార శైలిని ఆమె తూర్పార పట్టిన తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతలో ఒక్కరికైనా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నిస్తూ జనం నుంచే లేదంటూ చెప్పించారు. వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న అవాస్తవ పొత్తుల ఆరోపణలను షర్మిల తిప్పికొట్టారు. హరికృష్ణ శవాన్ని ముందు పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పొత్తుల కోసం బేరాలాడిన నువ్వా పౌరుషం గురించి మాట్లాడేది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. చివరగా ప్రజా తీర్పు బై బై బాబు కావాలంటూ షర్మిల చెప్పగా ఆయా సభలకు హాజరైన ప్రజానీకం ఆమెతో గొంతు కలపడం విశేషం. ఇక మొత్తంగా వైఎస్ విజయమ్మ, షర్మిల కలిసి 66 సభల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మొత్తం 20 రోజుల పర్యటనలో వైఎస్ విజయమ్మ 27, షర్మిల 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. విజయమ్మ 9 జిల్లాల పరిధిలోనూ, షర్మిల 6 జిల్లాల పరిధిలోనూ పర్యటించి జననేత విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రజలను ఆకట్టుకున్న షర్మిలమ్మ మాటలు - బాబు వస్తే జాబు రాలేదు కానీ కరువు వచ్చింది. - రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు లేవు కానీ ఎటువంటి అనుభవం లేని సీఎం తనయుడు లోకేశ్‌కు మాత్రం ఉద్యోగం వచ్చింది. ఏకంగా మూడు ఉద్యోగాలు (మంత్రి పదవులు) దక్కాయి. - ప్రజా తీర్పు.. బై బై బాబు -
జగన్ ప్రభంజనం, చతికిలపడ్డ టీడీపీ
సాక్షి, అమరావతి : యావత్ దేశాన్ని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఏప్రిల్ 11 న జరిగిన పోలింగ్ అనంతరం దాదాపు 42 రోజుల తీవ్ర ఉత్కంఠ నడుమ గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఇటు శాసనసభ అటు లోక్ సభ ఎన్నికలు రెండింటిలోనూ ఘోర పరాజయం మూటకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తోపాటు కీలకమైన నేతలు,మంత్రులు ఓటమిపాలయ్యారు. మరోవైపు తొలినుంచి దూకుడు ప్రదర్శించిన జనసేన అధినేత ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా కుప్పకూలింది. కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మట్టికరిచింది. అందుతున్న సమాచారం మేరకు 160కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలను (85 శాతానికి పైగా నియోజకవర్గాల్లో) కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 24 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. జనసేన ఒక నియోజకవర్గానికి పరిమితమైంది. జిల్లాల వారిగా ఫలితాలను గమనిస్తే గతంలో ఎంతో అండగా నిలిచిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా టీడీపీకి ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ప్రతి ఎన్నికలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఈసారి మెజారిటీ కూడా తగ్గింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలవగా అనేక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై జాతి యావత్తు దృష్టి నిలిపించింది. యూపీఏకు దేశం పట్టం కడుతారని, అన్ని పక్షాలను ఏకం చేసి చక్రం తిప్పుతానిని చంద్రబాబు గత కొద్ది రోజులుగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఆయా పార్టీల నేతలను కలిసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో టీడీపీ ఓటమి తప్పదని తేల్చినప్పటికీ కొట్టిపారేస్తూ చంద్రబాబు పైకి బింకం ప్రదర్శించారు. జాతీయ స్థాయి సంస్థల ఎగ్జిట్ పోల్స్‌కు విరుద్ధం తనకు సన్నిహితంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ తో పోస్ట్ పోల్ సర్వే పేరుతో ఫలితాలను వెల్లడించి చివరి ఎత్తుగడలకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తిని ప్రదర్శించారు. పార్టీ నేతల చుట్టూ తిరిగిన చంద్రబాబుకు ప్రజల మధ్యన నిలిచిన జగన్ కు మధ్య జరిగిన ఈ పోటీలో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. చంద్రబాబు చేసిన హడావిడి చూసి ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ స్థాయి చక్రం తిప్పుతారని కొన్ని రాజకీయ పక్షాలు భ్రమల్లో మునిగితేలాయి. చంద్రబాబు అంచనాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రజలు ఆయనకు గట్టి షాకిచ్చారు. అనేక జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించిన టీడీపీ ఈసారి పూర్తిగా చతికిలపడింది. ఫలితాల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదిపత్యం ప్రదర్శించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై గడిచిన ఐదేళ్లుగా సాగించిన అనేక ఆందోళనలు, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండటం, గడిచిన ఏడాది కాలం పాటు ప్రజల మధ్యన సాగించిన పాదయాత్ర ఈ ఫలితాలకు కారణమైనట్టు ఆపార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం రాత్రి 10 గంటల తర్వాత కూడా కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ వీవీప్యాట్ ల లెక్కింపు కారణంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించడంలో జాప్యం జరిగింది. గురువారం రాత్రి పది గంటల వరకు అందుతున్న సమాచారం మేరకు శ్రీకాకుళం (10) 8, విజయనగరం (9) 9, విశాఖ (15) 11, తూర్పు గోదావరి (19) 14, పశ్చిమ గోదావరి (15) 12, కృష్ణా (16) 13, గుంటూరు (17) 14, నెల్లూరు (10) 10, ప్రకాశం (12) 8, అనంతపురం (14) 12, వైఎస్సార్ (10) 10, కర్నూలు (14) 14, చిత్తూరు (14) 13 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయనున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఏ జిల్లాలోనూ అధికార టీడీపీ పట్టు నిలుపుకోలేకపోయింది. 25న శాసనసభా పక్ష సమావేశం ఎన్నికల్లో ఘనవిజయంతో ఉండవల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఫలితాల చివరి దశలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పుతో తన విశ్వాసాన్ని బాధ్యతను పెంచుతుందని పేర్కొంటూ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశమైన అనంతరం ఈ నెల 25 వ తేదీన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ ఒక ప్రకటనతో తెలియజేసింది. ఆ సమావేశంలో పార్టీ శాసనసభా పక్షం నాయకుడి ఎన్నుకుంటారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి ఆ మేరకు సమాచారం ఇవ్వనున్నారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ఈ నెల 30 న మంత్రివర్గం పదవీ స్వీకార ప్రమాణం చేస్తుంది. -
ఆర్కేకు నారా లోకేష్ అభినందనలు
సాక్షి, అమరావతి : మంగళగిరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌బాబు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి ఆయన నమస్కారాలు తెలిపారు. నామినేషన్ వేసిన నాటినుంచి కౌంటింగ్ వరకు అహర్నిశలు తన కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిసారి ఎన్నికలలో పోటీచేసిన తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మీడియా మిత్రుల సహకారం మరువలేనిదన్నారు. ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు సహకరించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అందరూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. నియోజకవర్గ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. మంగళగిరి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతానని అన్నారు. -
మన్యం మదిలో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏడు గిరిజన నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలను గిరిజనులు నమ్మలేదు. ఈ ఐదు సంవత్సరాలుగా వారు పడుతున్న భాదలకు ఓటు రూపంలో బాబుకు గట్టి సమాధానం చెప్పారు. వైఎస్సార్సీపీ గెలిచిన ఈ స్థానాల్లో పార్టీ ఫిరాయించిన మూడు నియోజకవర్గాలు ఉండడం విశేషం. ప్రలోభాలకు లొంగి ఎమ్మెల్యేలు పార్టీ మారినా గిరిపుత్రులు మాత్రం వైఎస్సార్సీపీకి అండగా నిలిచారు. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ తమ ఓటును ప్యాన్ గుర్తుకు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించే వేదికగా ఉండాల్సిన గిరిజన సలహా మండలిని సైతం ఏర్పాటు చేయకపోవడం టీడీపీ ఓటమికి ప్రధాన కారణమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల లాగానే ఈ సారి కూడా గిరిజనులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే నమ్మారు. -
నేను రెండు స్థానాల్లో గెలవకపోయినా...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమిపై ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. సుదీర్ఘకాలం మార్పు కోసం తాను పార్టీ పెట్టానని చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడ్డామని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బలమైన మెజార్టీతో సీఎంగా గెలిచిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి ప్రధాని అవుతోన్న నరేంద్ర మోదీకి కూడా శుభాకాంక్షలు చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పార్టీలు ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంటారని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. జనసేన ద్వారా డబ్బులు, సారా పంచకుండా నూతన రాజకీయాలు చేశామని, అలాగే ఈ ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం కల్పించామని అన్నారు. నేను రెండు స్థానాల్లో గెలవకపోయినా నా తుది శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటూ పోరాడతానని స్పష్టం చేశారు. -
ముందే ఊహించాను: వైఎస్ విజయమ్మ
సాక్షి, తాడేపల్లి: తన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని తాను ముందే ఊహించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. దేవుడితో పాటు ప్రజల ఆశీస్సులు, భగవంతుడి కృప వల్లే విజయం దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తప్పకుండా అమలుపరుస్తారని తాను ఆశీస్తున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఇక టీడీపీ బీ టీమ్‌గా బరిలో దిగిన జనసేన గ్లాస్ పగిలిపోయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుండి వైఎస్సార్ జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గిర్రున తిరిగింది. ఫ్యాన్ గాలికి సైకిల్ ఎగిరిపోయింది. నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలుస్తుందని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడి పార్టీ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో పాటు టీడీపీ కేబినెట్లోని మెజార్టీ మంత్రులు పరాజయం పాలయ్యారు. అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. మొత్తం 25 లోక్ సభ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. -
వైఎస్సార్ సీపీ మహిళా అభ్యర్థుల ఘన విజయం
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. వైఎస్సార్ సీపీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. నగరి నుంచి ఆర్.కె. రోజా, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి, కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి, పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ్ ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు. కాగా సీట్ల కేటాయింపులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 15 మంది మహిళలకు అసెంబ్లీ సీట్లు కేటాయించిన ఆయన... నలుగురికి లోక్‌సభ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ 18 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా.. ఇందులో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. టీడీపీ 19 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా ఒకరు మాత్రమే గెలుపొందారు. -
అఖిల ప్రియకు షాక్..
సాక్షి, కర్నూలు: మంత్రి అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించారు. అఖిలప్రియ పోటీ చేసిన ఆళ్లగడ్డ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బీజేంద్రరెడ్డి గెలుపొందారు. అయితే ఈ ఓటమికి ఆమె వ్యవహార శైలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె ప్రవర్తన తీరు నచ్చక పలువురు నేతలు కూడా టీడీపీని వీడారు. ఇవన్నీ కూడా ఆమె ఓటమిలో కీలక భూమిక పోషించాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అఖిలప్రియ.. టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భూమ బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాలలో ఓటమి పాలయ్యారు. -
లోకేశ్ పరాజయం : చంద్రబాబుకు షాక్
సాక్షి, అమరావతి : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం వెల్లడైంది. ఉదయం నుంచి అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన ఈ నియోజవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి, టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి 5312 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రౌండు నుంచీ ఆర్కే తన ఆధిక్యతను కనబరిచారు. అయితే, ప్రతి రౌండులోనూ ప్రత్యర్థి లోకేశ్‌కు మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉండటంతో ఫలితంపై చివరి వరకు ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది రౌండు లెక్కింపు పూర్తయిన తర్వాత 5312 ఓట్ల ఆధిక్యతతో ఆర్కే జయకేతనం ఎగురవేశారు. లోకేశ్ ఓటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్‌లా తగిలింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన లోకేశ్‌ను ఎలాగైనా గెలిపించి సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పగించాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని గందరగోళంలో పడిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్ ను పోటీ చేయించాలని నిర్ణయించిన తర్వాత జనసేన అక్కడి నుంచి పోటీ చేయకుండా తప్పుకుంది. జనసేన పొత్తు పేరుతో ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. సామాజిక వర్గం, రాజధాని ప్రాంతం అంటూ అనేక కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే విజయం సులభమని భావించిన తర్వాతే లోకేశ్ ను అక్కడి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. లోకేశ్ కోసం అత్యంత శ్రేయోస్కరమైన నియోజకవర్గం ఏదవుతుందోనని అనేక విధాలుగా సర్వేలు చేయించిన తర్వాత భీమిలి, మంగళగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడం మంచిదని చంద్రబాబు నిర్ణయానికొచ్చారు. చివరగా మంగళగిరిని ఎంపిక చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్కే గట్టి పోటీనివ్వడంతో లోకేశ్ తన అధికార శక్తియుక్తులన్నీ ప్రయోగించారు. ఎన్నికల్లో పూర్తి సమయాన్ని వెచ్చించారు. ఆర్థిక అంగబలాన్నంతా ప్రయోగించారని వార్తలొచ్చాయి. తెలుగుదేశం పార్టీ బాధ్యతలను అప్పగించాలనుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిరోజూ నియోజకవర్గం నేతలతో సమాలోచనలు జరిపారు. ఇంత చేసినప్పటికీ చివరికి ఓటమి పాలవ్వడంతో చంద్రబాబుతో పాటు ఆయన సన్నిహితులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని పార్టీ వర్గాలు చెప్పాయి. నాయకత్వం వహించే విషయంలో మొదటి నుంచీ లోకేశ్ పై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమైనప్పటికీ చంద్రబాబు నాయుడు కుమారుడు కావడంతో పార్టీ నాయకులెవరూ బహిరంగంగా మాట్లాడలేకపోయారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ పార్టీ నేతలు ఒకరకమైన గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే, ప్రస్తుతం శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న లోకేశ్ ను ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో తాజా ఓటమికి నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకుంటారా? లేక కొనసాగుతారా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. -
సీమలో మీసం తిప్పిన వైఎస్సార్ సీపీ
సాక్షి, రాయలసీమ/అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో ప్రభంజనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ సునామికి అధికార పార్టీకి చెందిన పలువురు సిట్టింగులు సైతం తుడిచిపెట్టుకుపోయారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికార టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కుప్పంనుంచి గెలవగా ఆయన బావమరిది, సినీనటుడు బాలక్రిష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గెలుపొందారు. ఈ రెండు సీట్లు గెలవటం మినహా రాయలసీమలో ఏ స్థానంలోనూ టీడీపీ ముందజలో లేకపోవటం గమనార్హం. రాయలసీమలో మెత్తం 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో 30 చోట్ల విజయం సాధించిన వైఎస్సార్సీపీ ఈ సారి 19 స్థానాలు అత్యధికంగా గెలిచింది. గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచిన తెలుగుదేశం ఈ సారి రెండు స్ధానాలకు మాత్రమే పరిమితమయ్యింది. గత ఎన్నికల్లో కడపలో 9స్థానాల్లో గెలిచిన వైఎస్సార్ సీపీ ఈ సారి క్లీన్ స్వీప్‌చేసింది. మంత్రులుగా ఉన్న వారు సైతం ఈ ఎన్నికల్లో ఓటమిపాలవ్వటం గమనార్హం. -
అన్నదమ్ములకు ‘సినిమా’ చూపించారు..
సాక్షి, హైదరాబాద్ : ప్రశ్నిస్తా అంటూ ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఓటర్లు ‘సినిమా’ చూపించారు.. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు శాసనభ స్థానాల్లోనూ ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన సోదరుడు నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పవన్.. రెండు స్థానాల్లో పోటీచేయగా ఆ రెండు స్థానల్లో ప్రజలు తిరస్కరించారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైన జనసేనాని.. గాజువాకలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పాల నాగిరెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. ఇక ఎన్నికల ముందు పార్టీ కండువా కప్పుకొని నరసాపురం ఎంపీగా బరిలోకి దిగిన నాగబాబు.. వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో చిత్తుగా ఓడి మూడో స్థానంలో నిలిచారు. జనసేనాని ఓటమితో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి ఆ పార్టీ మద్దతుదారులు ఊహించని ఫలితాలతో ముఖం చాటేశారు. ఆ పార్టీ అధికారిక ట్విటర్ మూగబోయింది. -
వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు : లోకేశ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు... ‘గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ నరేంద్ర మోదీ, వైఎస్ జగన్‌లకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. కాగా ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఇటు శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకూ అన్ని జిల్లాల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఫ్యాన్‌గాలికి సైకిల్ కకావికలమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ హవా జోరుగా వీస్తోంది. -
పాలనలో చరిత్ర సృష్టిస్తాం : వైఎస్ జగన్
-
ఇప్పుడేమీ మాట్లాడను: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఫలితాలు ఎలా ఉన్నా... ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓటర్లకు చంద్రబాబు ధన్యవాదులు తెలుపుతూ, శ్రేయోభిలాషులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుంటామని, వాటిని విశ్లేషించుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఈవీఎంలపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని, తర్వాత విశ్లేషిస్తామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఫలితాలను గౌరవించడం అందరి బాధ్యత అంటూ... ప్రెస్‌మీట్‌ను మూడు ముక్కల్లో ముగించేశారు చంద్రబాబు. -
ఏపీ ప్రతిపక్షనాయకుడు ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం.. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఈ నెల 30న ముహుర్తం ఖరారు కావడం తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన టీడీపీ నుంచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటారనే అంశంపై టీడీపీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకున్న సమయానికి ఆ పార్టీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు మినహా హేమాహేమీలు ఫ్యాన్ సుడిగాలికి కొట్టుకుపోయారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు ఈ సారి ఘోర పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలను మరో సీనియర్‌కు అప్పగిస్తారనే అభిప్రాయం పార్టీలో అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. చంద్రబాబు రాజకీయ అనుభవమంత వయసున్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనుండటం.. రేపటి రోజున సభలో సభానాయకుడిని ఎదుర్కునే విషయంలో చంద్రబాబు ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుడిగా తన స్థానంలో మరో సీనియర్ని నియమించి తాను తప్పుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. -
కలిసొచ్చిన గురువారం!
సాక్షి, అమరావతి: ఆంధప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన వేళ గురువారానికి ఓ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో భారీ మోజారిటీ కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఆంధప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన ‘ఏప్రిల్ 11’, ఫలితాలు వెలువడిన ‘మే 23’ రెండు తేదీలు గురువారం కావడం, అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నా మే 30 వ తేదీ కూడా గురువారం కావడంతో.. ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక ఎలాంటి సెంటిమెంట్ లేకపోయినప్పటికీ ప్రసుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్‌గా మారింది. యాదృచ్ఛికంగా చోటుచేసుకున్న దీనిపై వైఎస్ జగన్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా, తను నమ్మిన సిద్థాంతంకోసం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకుసాగిన రాజన్న తనయుడికి ప్రజలు ఈ ఎన్నికల్లో బ్రహ్మారథం పట్టారు. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి నేనున్నాంటూ భరోసానిస్తూ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర సాగించిన జననేతను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. చర్రితలో నిలిచిపోయేలా విజయాన్ని అందించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అంటూ నిస్పష్టమైన తీర్పు ఇచ్చారు. -
ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు గురువారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు పంపారు. చంద్రబాబు రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకూ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. అలాగే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. -
రాత్రి 7గంటలకు చంద్రబాబు ప్రెస్‌మీట్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి 7 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇవాళ సాయంత్రం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. -
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆగయా అన్నా!!
అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు. జననేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందుకే ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు తన చిన్నాన్నను హత్య చేసి కుట్ర రాజకీయాలకు తెరతీసినా బాధను దిగమింగి.. సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయి అఖండ విజయం సాధించారు. అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, లోక్‌సభ సీట్లు క్లీన్‌స్వీప్ చేసేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు నాపై మరింత బాధ్యత ఉంచారు. మీ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటా. ఆరు నెలల నుంచి ఏడాదిలోపే మీ చేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. ఈనెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని పేర్కొన్నారు. ఈ క్రమంలో మహానేత తనయుడు జగనన్న పాలనలో మరోసారి రాజన్న రాజ్యం సిద్ధిస్తుందని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘జగన్ అనే నేను’ అంటూ జననేత పలికే మాటలను ఉటంకిస్తూ.. ‘అప్నా టైమ్ ఆగయా అన్నా’ అంటూ ఆకాశమే హద్దుగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పాదయాత్రికుడి ఏకపక్ష విజయాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. -
ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది
-
మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా..
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘గొప్ప విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. దేవుడి దయ, ప్రజల దీవెనలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది. ప్రజలంతా విశ్వసనీయతకు ఓటు వేశారు. ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటాం. తొలి సంతకం కాదు...నవరత్నాల హామీలును అమలు చేస్తాం. పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరి కష్టాలను నేను చూశా.... నేను విన్నా ..నేను ఉన్నా. ఈ నెల 30 విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా’ అని తెలిపారు. -
జనసేనాని రెండు చోట్ల ఘోర పరాభవం
-
చంద్రబాబు మనవడికి టైమ్ వచ్చిందోచ్!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన నారా చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభంజనంతో టీడీపీ ఘోరపరాజాయన్ని మూటగట్టుకుంది. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఈ ఎన్నికల్లో కనీస పోటీ లేకుండా వార్ వన్‌సైడ్ అయింది. దీంతో చంద్రబాబుపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేస్తున్నారు. తాను ప్రజల కోసం అహర్నిషులు కష్టపడుతున్నానని, కనీసం తన మనవడు దేవాన్ష్‌తో ఆడుకోవటానికి కూడా సమయంలేదని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘ఇక టైమ్ వచ్చింది నీ మనవడితో ఆడుకోపో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల తన మనవడితో ఆడుకున్న ఫొటోను చంద్రబాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోకే ఫన్నీ క్యాప్షన్ ఇస్తూ నెటిజన్లు వాట్సాప్ స్టేటస్లు, ట్వీట్లు చేస్తున్నారు. ‘అయ్యో చంద్రబాబు.. మన కోసం అహర్నిషులు కష్టపడుతూ.. మనవడితో ఆడుకోవడం లేదంటా.. ఈసారి ఆడుకునే సమయమిద్దాం.. బాబుగారు మీరు మీ మనవడితో ఆడుకోండి ఇక’ అంటూ ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తున్నారు. ‘నేను ఓడిపోతే నాకు కుటుంబం ఉంది. భార్య, కుమారుడు, మనవడు ఉన్నారు.’ మరి మోదీకి ఎవరున్నారు? అంటూ చేసిన కామెంట్స్‌పై కూడా జోకులు పేల్చుతున్నారు. ‘మోదీ గెలిచారు.. దేశ ప్రధానిగా ఫుల్ బిజీగా ఉంటారు.. మీరు ఓడారు మీ కుటుంబంతో గడపండి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
ప్రజలకు రుణపడి ఉంటాం : బొత్స
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మాటని ప్రజలు విశ్వసించారని అన్నారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాబు దుర్వినియోగం చేశారన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్‌కు లభించిన ఆదరణ ఓటు ద్వారా ఇలా చూపించారని తెలిపారు. ఊహించని విజయాన్ని చూడబోతున్నామని వైఎస్ జగన్ గత కొద్ది రోజులుగా చెపుతూ వచ్చారన్నారు. వైఎస్ జగన్ ఈ అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తారని, ఆయన వెంట తామంతా అభివృద్ధికోసం పాటుపడతామని చెప్పారు. ఈ విజయం ప్రజా విజయమని, ప్రజలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. చంద్రబాబుకు చెప్పింది చేసే అలవాటులేదని మండిపడ్డారు.