
ఎన్నికల పోలింగ్ సందర్భంగా సాక్షాత్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావును చొక్కా విప్పి కొట్టారంటే
సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధికారం కోల్పోతుందని ముందే చెప్పినట్టు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ముప్పై సీట్ల కంటే ఎక్కువ రానివ్వమని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. చంద్రబాబుతో గతంలో పొత్తు కారణంగా రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు నష్టపోయాయనా చెప్పారు. ప్రజలు నాలుగేళ్లు టీడీపీ ఆరాచకాలను మౌనంగా చూస్తూ వచ్చారన్నారు.
ఎన్నికల పోలింగ్ సందర్భంగా సాక్షాత్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావును చొక్కా విప్పి కొట్టారంటే ప్రజలు టీడీపీ పాలన పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థంచేసుకోవచ్చన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఇచ్చిన తీర్పుకు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఒరిజినాలిటీ లేని నాయకుడని, జగన్‌లో ఒరిజినాలిటీ ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. (చదవండి: ఫ్యాన్ విజయ దుందుభి)