somu veerraju
-
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కేసీఆర్‌పై సోము వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: దక్షిణాది రాష్ట్రాల సమావేశం, స్టీట్ప్లాంట్ ఉద్యోగుల దీక్షపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశం కోతికి కొబ్బరికాయ దొరికినట్టుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదంటూ ఆరోపించారు.విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ అంటూ డీఎంకే రాజకీయం చేస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా సీట్లు తగ్గాయని, పెరిగాయని డ్రాఫ్ట్ ఏదైనా రిలీజ్ అయిందా?. మా ముందు చాలామంది ఎన్నో కలలు కన్నారు.. అన్నీ కరిగిపోయాయి. మా ముందు ఎగిరే మీ రాష్ట్రాలు కూడా ఉండవు.. మీరూ ఉండరు. డీఎంకే ఎక్కువకాలం ఉండదు. లక్కీగా అయినా తెలంగాణ ముఖ్యమంత్రి స్క్వేర్ ఫీట్‌కు ఇంత అని లెక్కల్లో ఉన్నారు. మాదే స్టాండర్డ్ ఉన్న పార్టీ అని వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఉక్కు ఉద్యమంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా?. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మిక నాయకులే కారణం. కార్మిక నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు?. కార్మికులు కష్టపడుతుంటే కార్మిక నాయకుల కళ్ళు మండుతున్నాయి. జపాన్‌లో అయితే ఈ కార్మిక నాయకులను ఏం చేసేవారు. తిన్నది అరగక ఉద్యమం చేస్తున్నారా అని ఉద్యమ నాయకులని అడగాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదు. వాళ్ళు చైనా బాగుండాలని కోరుకుంటారు.. వాళ్లని నమ్మవద్దు. ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చాం ఇంకేం కావాలి అని ప్రశ్నించారు.అలాగే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారం అంటే అభివృద్ధి కోసం పనిచేయాలి. ప్రజల అభివృద్ధి కోసం కాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పని చేశారు. కల్లల్లో ఒత్తులు వేసుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం అని కామెంట్స్ చేశారు. -
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ చివరి అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. తద్వారా గత ఎన్నికల టైం నుంచి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలకు అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. చంద్రబాబు తన మార్క్ రాజకీయం నడిపించారు. ఒరిజినల్ బీజేపీ నేతలకు సీట్లు దక్కకపోవడంతో సంఘ్‌పరివార్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆయన ఆశించినా.. అది నెరవేరలేదు. సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తప్పు చేసిందనే చర్చ విపరీతంగా నడిచింది. అయితే ఆ తప్పును వీర్రాజు ఎంపిక ద్వారా అధిష్టానం ఇప్పుడు సరిద్దుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ప్రచారంలో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సినియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పవర్ బ్యాలెన్స్ చేసేందుకు ఆయన సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు టీడీపీ తీసుకుంది. ఒకటి జనసేన(కొణిదెల నాగబాబు), మరొకటి బీజేపీకి కేటాయించింది. -
ఏపీ బీజేపీలో కలకలం!
సాక్షి, రాజమహేంద్రవరం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (daggubati purandeswari), మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) మధ్య తూర్పుగోదావరి జిల్లా బీజేపీ (bjp) అధ్యక్షుడి నియామకం అంశంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎవరికి వారు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేశారు. తన మాట నెగ్గాలంటే.. తన మాట నెగ్గాలంటూ పావులు కదిపారు. చివరకు వీర్రాజు జాతీయ నేతలను ఒప్పించి తన అనుచరుడైన కొవ్వూరుకు చెందిన పక్కి నాగేంద్రకు జిల్లా అధ్యక్షుడి పగ్గాలు అప్పగించడం.. పురందేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీగా ఉండీ కూడా తన అనుచరురాలైన ఎన్.హారికను జిల్లా అధ్యక్షురాలిగా నియమించలేక పోవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం వద్ద పురందేశ్వరి మాట చెల్లుబాటు కాకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా పిక్కి నాగేంద్ర ఉత్తర్వులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడచినట్లు సమాచారం. బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని నూతన అధ్యక్షుడికి సోము వీర్రాజు సూచించారు. ఇదే విషయమై పురందేశ్వరి స్పందిస్తూ.. పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది కాబట్టే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు విస్మయానికి గురైనట్లు సమాచారం. టీడీపీతో అంటకాగుతున్నందుకేనా? పురందేశ్వరి బీజేపీలో ఉన్నా, ఆమె మనసంతా టీడీపీలోనే ఉందన్న ఆరోపణలున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి టీడీపీ బలోపేతం, అధికారంలోకి తీసుకురావడానికి సొంత పార్టీ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల సమయంలో అనపర్తి ఎమ్మెల్యే స్థానానికి కూటమి అభ్యరి్థగా బీజేపీ నేత శివరామకృష్ణంరాజును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయంతో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి వర్గంలో అప్పట్లో అలజడి రేగింది. నల్లమిల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో సొంత పార్టీ అభ్యర్థి శివరామకృష్ణం రాజుకు మద్దతు ఇవ్వాల్సింది పోయి.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పక్షాన పురందేశ్వరి నిలబడటం అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా తన మరిది (సీఎం చంద్రబాబు) ప్రయోజనాల కోసమే చేశారని అప్పట్లో చర్చ జరిగింది. అందువల్లే ఆమె సిఫారసులను కమలం పెద్దలు పట్టించుకోవడం లేదని తెలిసింది. పురందేశ్వరి, సోము వీర్రాజుల మధ్య ఆది నుంచి సయోధ్య కుదరడం లేదు. ఎన్నికల సమయంలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదని వీర్రాజు కోరారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించారు. ఈ నిర్ణయం వెనుక చిన్నమ్మ ఉన్నట్లు భావించిన సోము వర్గం అప్పటి నుంచి ఆమెను విభేదిస్తోంది. -
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ.. వీరి పేర్లు ఖరారు?
సాక్షి, ఢిల్లీ/ విజయవాడ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు. ఇక, నేడు మరోసారి పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశముంది. ఈరోజు సాయంత్రానికి ఫైనల్ జాబితాపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. కాగా, మరో రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన జీవీఎల్, పీవీఎన్ మాధవ్‌లకు నిరాశే ఎదురైనట్టు సమాచారం. మరోవైపు.. సోము వీర్రాజు విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తే సోము వీర్రాజుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల అంచనా.. అనకాపల్లి- సీఎం రమేష్, అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి, నరసాపురం- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ, రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- మాజీ ఐఎఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారం. -
బీజేపీకి ‘మూడొ’చ్చింది
పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమా సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీజేపీకి ‘మూడొ’చ్చింది. విపక్ష కూటమిలోకి వచ్చీ రాగానే ఉమ్మడి తూర్పు గోదావరిలోని మూడు జిల్లాల్లో మూడు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆ పార్టీ పట్టుపడుతోంది. లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి గతంలో తాము గెలుపొందిన రాజమహేంద్రవరం తమకు ఇవ్వాల్సిందేనని కమలనాథులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. దీంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలు కూడా కావాలనేది బీజేపీ ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఆ మూడు ఏవంటే కమలనాథుల దృష్టి కాకినాడ సిటీ, అమలాపురం, పి.గన్నవరం, అనపర్తి అసెంబ్లీ స్థానాలపై పడింది. ఈ నాలుగింటిలో మూడింటిని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న కాకినాడ సిటీ, గతంలో గెలుపొందిన పి.గన్నవరం (ఎస్సీ) స్థానంపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. పి.గన్నవరం నుంచి టీడీపీ తన అభ్యర్థిగా తొలుత సరిపల్లి రాజేష్ ను ప్రకటించింది. దీనిపై సొంత పార్టీతోపాటు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో రాజేష్ తనంత తానుగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అయింది. ఇక్కడ వివాదాల కారణంగా ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహచర నేతలతో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు మద్దతుగా బీజేపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలకు ప్రతిపాదించారు. అమలాపురం సీటు కోసం టీడీపీ, జనసేనల్లో ఆశావహులు బస్తీ మే సవాల్ అంటూ కాలు దువ్వుతున్నారు. రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నా ఇరు పార్టీల అగ్ర నాయకత్వాలు మాత్రం నోరు మెదపడం లేదు. దీనిపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కూటమి నేతలున్నారు. ఇంకా తర్జనభర్జనలే జనసేన తొలుత ఆశించిన కాకినాడ సిటీ విషయంలో కూటమి నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. కాకినాడ రూరల్ ఎలాగూ ఆ పార్టీకి ఖరారు చేయడం, పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో సిటీపై జనసేన ఆశలు వదిలేసుకుంది. పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడా సీటును ఆశిస్తోంది. సిటీ సీటు కోసం కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, బీజేపీ నాయకుడు డాక్టర్ ముత్తా వంశీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటితోపాటు రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని కూడా బీజేపీ మొదటి నుంచీ కోరుతోంది. ఈ స్థానానికి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసును టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ కాదన్న చంద్రబాబు..ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉన్న అనపర్తిని బీజేపీకి వదిలేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి బీజేపీకి అనపర్తి సీటుని కేటాయిస్తారంటూ బలమైన ప్రచారమే జరుగుతోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజు పేరు ప్రతిపాదిస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉండబట్టే టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి కనుసన్నల్లోనే ఆయన అనుచరులు అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణ మండపంలో శనివారం హడావిడిగా మూడు మండలాల పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. నల్లమిల్లికి సీటు ఇవ్వాల్సిందేనని తీర్మానించడమే కాకుండా రామవరంలోని ఆయన ఇంటికి ర్యాలీగా వెళ్లి సీటు విషయంలో సంఘీభావం ప్రకటించారు. -
ఒక కార్యకర్తగానైనా పని చేస్తా: సోము వీర్రాజు
సాక్షి, హైదరాబాద్: ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. మార్పులు చేర్పులపై తనకు బాధ లేదని.. ఒక కార్యకర్తగా కూడా పార్టీ కోసం పని చేస్తానని అన్నారాయన. అలాగే.. పురంధేశ్వరి నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తాం అని ఆయన ప్రకటించారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా పదవీ కాలం ముగియడంతో ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించి.. దగ్గుబాటి పురంధేశ్వరిని నూతన అధ్యక్షురాలిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఇదీ చదవండి: సారీ.. మరో ఛాన్స్ ఇవ్వలేం! -
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు అవుట్?
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి మార్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీకాలం ముగిసింది. అయితే మరోసారి బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం లేదంటూ జాతీయ అధిష్టానం స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనున్నారు. కాగా సోము వీర్రాజు 2020 జులై 27 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే.. కీలక బాధ్యతల అప్పగింత హామీని ఆయనకు అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కాషాయ పార్టీకి కొత్త బాస్ రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి, జీవీఎల్, పురందేశ్వరి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సాయంత్రం లోపు క్లారిటీ రానుంది. -
‘చంద్రబాబు ఎంతో ఇబ్బందిపెట్టారు.. మరిచిపోలేదు’
సాక్షి, తిరుపతి: రానున్న ఎన్నికల్లో అందరూ అనుకున్నట్లు టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని పారిచెర్లవారిపాళెం గ్రామంలో సోమవారం కేంద్ర ఐటీ సహాయ మంత్రి దేవూసిన్హ్ చౌహాన్‌తో కలసి ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో సోము వీర్రాజు మాట్లాడారు. బీజేపీ .. పొత్తులతో అధికారంలోకి రాదని, అందుకే రాష్ట్రంలో టీడీపీతో ఎలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే జనసేనతో మాత్రం కలసి నడుస్తామన్నారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఇబ్బంది పెట్టిన విషయం మరచిపోలేదని.. దీంతోనే కేంద్రంలోని పెద్దలు కూడా చంద్రబాబుతో పొత్తు అంటే అంగీకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో చంద్రబాబు పాలన సమయంలో రాష్ట్రానికి రూ.35వేల కోట్ల నిధులు ఇచ్చారని.. అయితే ఆయన వాటిని చంద్రన్న బాట పేరుతో ఖర్చుచేసి బీజేపీ ఏమి ఇవ్వలేదని చెప్పారని దుయ్యబట్టారు. ఇవాళ.. జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పలు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని దీంతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తిరుపతి జిల్లాలో 85 చెరువులను అమృత్ సరోవర్ పేరుతో ఆధునికీకరణ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. ప్యాకేజీ చాలన్నది బాబే.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీ చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ పాలన చేపట్టి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చిత్తూరులోని గంగినేనిచెరువు పార్కు వద్ద నిర్వహించిన జిల్లా మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. మోదీ పాలన దేశానికి ఆదర్శమన్నారు. చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మించారని ఆరోపించారు. బాబు పాలనలో సోమవారం పోలవరం అని కాలక్షేపం చేశారన్నారు. జనసేన, టీడీపీ పొత్తు విషయమై బాబునే ప్రశ్నించాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్
-
చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, ప్రకాశం: బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఈ క్రమంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడిని.. కేంద్రంలో చక్రం తిప్పానంటాడుగా. మరి అప్పుడు రైల్వేజోన్ ఎందుకు తేలేకపోయాడు. నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ అన్నారుగా.. ఇప్పుడు మాతో ఎలా పొత్తు పెట్టుకుంటారని బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు నిలదీశారు. ఆ అర్హత లేదు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయా?. తిరుపతిలో హోంమంత్రి అమిత్ షాపై దాడి చేస్తే.. వాళ్ల మీద చర్యలు తీసుకున్నావా?. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి.. లేకుంటే పద్ధతిగా ఉండదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారాయన. ఇదీ చదవండి: బాబూ.. శవాల మీద పేలాలు ఏరుకోకు! -
సోము వీర్రాజుకు నిరసన సెగ..!
-
మే 15 నుంచి బీజేపీ ప్రచార భేరి
రాజమహేంద్రవరం సిటీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరిస్తూ మే నెల 15వ తేదీ నుంచి జూన్ 15 వరకు ప్రచార భేరి కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకు పది రోజులపాటు పోరాటం చేయడంతో పాటు చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి, పార్టీ ఏపీ ఇన్చార్జి మురళీధరన్ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వివరాలను మాధవ్ మీడియాకు వివరించారు. వైఎస్సార్సీపీతో బీజేపీ కలిసి వెళ్తుందనే అసత్య ప్రచారం జరుగుతుందని.. దానిని తిప్పికొడతామని చెప్పారు. గతంలో తెలుగుదేశం కూడా రాష్ట్రంలో అరాచకాలు చేసిందన్నారు. అచ్చెన్నాయుడు, పితాని ఏదో ఊహించి మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ తమతోనే ఉన్నారని, వచ్చే ఎన్నికలకు జనసేనతోనే కలిసి వెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వంపై పోరాటం విషయంలో జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కోర్ కమిటీ సమావేశంలో పురందేశ్వరి, టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో చేరిన వ్యాపారవేత్త రామచంద్రప్రభు గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు శుక్రవారం రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు. పధాని మోదీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తన కుమారుడు తులసీ సీడ్స్ ఎండీ యోగేష్ చంద్రతో కలిసి బీజేపీలో చేరానని రామచంద్ర ప్రభు తెలిపారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. -
మా పొత్తు జనసేనతో మాత్రమే
సాక్షి, అమరావతి: బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే కలిసి ముందుకెళ్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, టీడీపీతో పొత్తు గురించి మీడియా ప్రశ్నించగా.. సోము వీర్రాజు జవాబిచ్చారు. బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని.. కలిసే ముందుకెళ్తాయని చెప్పారు. అందువల్లే పవన్‌కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిని కలిశారని పేర్కొన్నారు. పవన్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కలిసినంత మాత్రాన.. వాళ్లు రాజకీయంగా ఒక్కటైనట్టు కాదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబు వద్ద తాను కూడా కూర్చున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన కలిసి పోరాడతాయని తెలిపారు. రాజకీయాల్లో ఏదీ వ్యూహం ప్రకారం జరగవన్నారు. -
AP: జనసేనకు షాకిస్తూ బీజేపీకిలోకి..
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో విపక్షాల పొత్తులపర్వంపై గందరగోళం నడుస్తోంది. బీజేపీ-జనసేనల చెట్టాపట్టాల్పై ఆ పార్టీల నేతలకే స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో దోస్తీ ఉన్నా.. లేనట్లేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండడమూ చూస్తున్నాం. ఈ తరుణంలో జనసేనకు పండగనాడు ఊహించని షాక్ తగిలింది. జనసేన అధికార ప్రతినిధి ఆకుల కిరణ్ కాషాయం కండువా కప్పుకున్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరుకాగా, ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరాడు ఆకుల కిరణ్. -
పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు. సదస్సుపై శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం. ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. ప్రధాని నరేంద్రమోదీ నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామికవాతావరణాన్ని కలిగి ఉంది. విశాఖ వేదికగా చేసిన వాగ్దానాలు రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తాయని ఆశిస్తున్నాం. నితిన్ గడ్కరీ హాజరు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుందో చూపిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం మరియు ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. @narendramodi గారి నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామిక (1/2)@blsanthosh pic.twitter.com/TzmR5Cqrdz — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 3, 2023 -
జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తాం: సోము
గంగవరం(చిత్తూరు జిల్లా): జనసేనతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. గంగవరం మండల కేంద్రంలో శనివారం బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున సోము వీర్రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు గెలుస్తారని తెలిపారు. జనసేన పొత్తుతోనే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు 2024 ఎన్నికలకు కూడా వెళ్తామని తెలిపారు. -
పదివేల కోట్లు ఇచ్చినా బాబు రాజధాని కట్టలేదు
మదనపల్లె/ బి.కొత్తకోట: కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఇచ్చినా చంద్రబాబు రాజ«దాని నిర్మించకపోగా, రైతులను నడిరోడ్డు మీద పడేశాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోనూ, బి.కొత్తకోట మండలం అమరనారాయణపురంలో తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లతో జరిగిన సమావేశంలోనూ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు చంద్రబాబు అమరావతిలో సగం నిర్మాణాలు చేసి ఉన్నా ఈరోజు రాజధాని ప్రసక్తే ఉండేది కాదన్నారు. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి పెరిగిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రత్యేక అజెండాతోనే పార్టీ మారుతున్నారన్నారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, ఈ విషయాన్ని పవన్‌కళ్యాణ్ స్వయంగా ధృవీకరించారని తెలిపారు. కమ్యూనిస్టులు అంగన్వాడీ కేంద్రాల నుంచి వసూలు చేసే సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీలను ఓడించాలన్నారు. -
ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ.. సోము వీర్రాజుపై ఎఫెక్ట్ ఎంత?
సాక్షి, ఢిల్లీ: ఏపీ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై అసంతృప్తి నేతలు ఒక్కసారిగా తమ గళం వినిపించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసేందుకు కాషాయ నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. వివరాల ప్రకారం.. ఏపీ బీజేపీ నేతల పంచాయితీ ఢిల్లీకి చేరింది. దాదాపు 30 మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిగా సోము వీర్రాజు తమకు వద్దంటూ ఇంఛార్జ్ వద్ద మొరపెట్టుకున్నారు. నూతన అధ్యక్షుడు కావాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. ఆరు జిల్లాల అధ్యక్షులను తొలగించారని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. అయితే, ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంత మంది ఒకేసారి ఢిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారు ఖంగుతిన్నారు. ఇక, ఢిల్లీలో దిగిన 30 మంది ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మాట్లాడి పంపించేశారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని వారికి సూచించారు. ఇకపై రాష్ట్ర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తానని మురళీధరన్ తమకు హామీ ఇచ్చారని స్థానిక నేతలు చెబుతున్నారు. -
ఏపీలో బీజేపీ ఆ నానుడి మార్చివేసిందా?
ఆంద్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఏమీ తోచడం లేదు.పెద్దగా పని ఉండడం లేదు. అప్పుడప్పుడూ గుడులనో, గోపురాలనో హడావుడి చేస్తేనన్నా పార్టీ ఉనికి నిలబడుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, తాజాగా ఒక కారికేచర్ ఆధారంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు కురిపించి నిరసనలకు దిగారు. ఒకప్పుడు మానవ సేవే మాధవ సేవ అనేవారు. కాని ఏపీలో బీజేపీ ఆ నానుడిని మార్చివేసినట్లుగా ఉంది. పసిపిల్లవాడికి శివరాత్రి నాడు ముఖ్యమంత్రి జగన్ పాలుపడుతున్నట్లుగా ఒక కారికేచర్ వచ్చింది. దానిని వైసీపీ అధికారిక ట్విటర్ లో పోస్టు చేశారట. అందులో ఏదో పెద్ద తప్పు ఉన్నట్లు బీజేపీ నేతలు కనిపెట్టేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వారు నిరసనలు, ధర్నాలు అంటూ రంగంలోకి దిగారు. ఇక ప్రకటనల ఊదర ఎటూ ఉంటుంది. దానిపై వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు సీరియస్ గా స్పందించారు. నిజానికి బీజేపీ వారి చేష్టలపై అసలు స్పందించకపోయినా పెద్దగా పోయేదేమీ లేదు. కాని మతపరమైన అంశంగా బీజేపీ చిత్రీకరిస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారం సున్నితంగా ఉంటుంది కనుక వైసీపీ నేతలు దానిపై మాట్లాడినట్లు ఉన్నారు. ఆ కారికేచర్ గమనించినవారికి ఎవరికైనా ముందుగా వచ్చే ప్రశ్న అందులో ఏమి తప్పు ఉందని! ఇందులో హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయని! బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ఇన్ చార్జీ సునీల్ ధియోదర్, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తదితర ముఖ్యనేతలతో పాటు చిన్నా,చితక నేతలు కూడా దీనిపై ప్రచారం చేపట్టారు. ఈ ప్రభుత్వం ఏకంగా హిందూ వ్యతిరేక ప్రభుత్వమని వారు తేల్చేశారు. అదెలాగంటే పసిపిల్లవాడికి పాలు పట్టడమట. ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా? చిన్నారి బాలుడికి పాలు పడితే శివుడికి క్షీరాభిషేకం చేయడాన్ని అపహాస్యం చేసినట్లయిందని వారు ఆరోపిస్తున్నారు. హిందువులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఏదో ఈనాడు, తదితర టీడీపీ మీడియా ప్రచార సంస్థల ద్వారా ప్రచారం పొందడానికి తప్ప బీజేపీ నేతల చర్య ఎందుకన్నా ఉపయోగం ఉంటుందా?ఈనాడు కూడా అసలు ఆ ఫోటోలో ఏముందో రాయకుండా శివలింగానికి క్షీరాభిషేకాన్ని అవహేళన చేసేలా ఫోటో ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మాత్రమే పేర్కొనడం గమనించదగిన అంశం. ఆ ఫోటోను సవివరంగా ప్రచురిస్తే అసలు విషయం బయటపడిపోయి,ప్రజలకు వాస్తవం తెలిసిపోతుందన్నది ఈనాడు భయం కావచ్చు. సరే!వారి బాద వారిది! ఎక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మహా ప్రసాదంగా ఈనాడు భావిస్తోంది . అది వేరే సంగతి.సోము వీర్రాజు ఆద్వర్యంలో ఏకంగా మార్కాపురం, గిద్దలూరులలో ధర్నాలు కూడా చేసేశారు. ఆయనేదో అక్కడకు టూర్ కు వెళ్లినట్లున్నారు. ఏదో ఒకటి చేస్తే పోలా అని చేసినట్లుంది తప్ప ఏ మాత్రం ఇందులో అర్దం లేదు.ఏపీలో మతపరమైన వైరుధ్యాలు క్రియేట్ చేయడానికి గతంలోను బీజేపీతో పాటు జనసేన, టీడీపీలు ప్రయత్నాలు చేయకపోలేదు. గుడులలో చోరీలు జరిగాయనో, విగ్రహాలను పాడు చేశారనో , ఏవో సాకులతో అలజడి సృష్టించడానికి కృషి చేశారు. కాని అవేవి ఫలించలేదు. ప్రభుత్వం అలాంటి చిన్న ఘటన జరిగినా వెంటనే సీరియస్‌గా రియాక్ట్ అవడమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. ఉదాహరణకు అంతర్వేదిలో రధం దగ్దం అయిన ఘటనపై విపక్షం నానా రాద్దాంతం చేసింది. వెంటనే సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని కేంద్రం దానిపై స్పందించలేదు.శ్రీకాకుళం జిల్లాలో ఒక విగ్రహాన్ని తరలించిన ఘటనను వివాదాస్పదం చేశారు. తీరా చూస్తే టీడీపీవారే కావాలని అలా చేసి యాగీ చేశారని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వెల్లడైంది. రామతీర్దంలో రాముడి విగ్రహాన్ని ద్వంసం చేశారంటూ మరో గొడవను సృష్టించారు. ప్రభుత్వం వెంటనే మరో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ రకంగా హిందువుల మనోభావాలకు ఎక్కడా దెబ్బ తగలకుండా చర్యలు చేపడుతుంటే విపక్షానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత నిష్టతో ప్రతి హిందూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంక్రాంతి ,ఉగాది .. ఇలా ఒకటేమిటి? ఆలయాలలో ఉత్సవాలు పలు సందర్భాలలో ఆయనే పూజా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయినా బీజేపీ నేతలకు ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నించి భంగపడ్డారు. ఆయా కేసులలో టీడీపీవారే నిందితులుగా పట్టుబడుతుండడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అలాంటి ఘటనలే దాదాపు జరగకుండా ఆగిపోయాయి. ఏమి దొరకక బీజేపీవారికి ఈ చిన్న పిల్లాడి బొమ్మను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూడడం దారుణం. అదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ , మాజీ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు ప్రస్తావించారు. హిందూ మతం బీజేపీ సొంతం కాదని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 40 గుళ్లను కూల్చివేస్తే బీజేపీ నేతలు అప్పట్లో నోరు మెదపని విషయాన్ని వారు గుర్తు చేసి ప్రశ్నించారు. వీటికి వారి వద్ద సమాధానం ఉండదు. బీజేపీవారు ఇంతటి శ్రద్దను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో, ప్రత్యేక హోదా అంశంలో ,రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం విషయంలో చూపించి ఉంటే మంచి పేరు వచ్చేది. బీజేపీకి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పడం, జనసేన తమతో పొత్తులో ఉంటుందో, ఉండదో తెలియని వైనం తదితర కారణాలతో రాజకీయాలను డైవర్ట్ చేయడానికి బీజేపీ పూనుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుని బీజేపీ ఈ విమర్శలు చేసినట్లుగా ఉంది. కానీ అవి హేతుబద్దంగా లేకపోవడం, అర్ధవంతంగా లేకపోవడం వల్ల బీజేపీనే నవ్వులపాలవుతోంది. అందువల్ల ఇలా చిన్నపిల్లాడికి పాలు పడితే కూడా తప్పుపట్టే విధంగా బీజేపీ నేతలు మాట్లాడకుండా ఉంటేనే వారికి పరువు దక్కుతుంది. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
సోము వీర్రాజుకు ఇలాంటి రాజకీయాలు పద్దతి కాదు: కన్నబాబు ఫైర్
సాక్షి, కాకినాడ: బీజేపీ రాజకీయాలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయంలో ఆలయాలను కూలిస్తే బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను గౌరవిస్తారు. తిరుమలలో తొలి దర్శనం యాదవులకు కలిగేలా పునరుద్ధరణ చేశారు. మానవసేవే.. మాధవసేవ అని చెప్పే పార్టీ మాది. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజీయం చేస్తోంది. సునీల్ ధియోధర్ ట్వీట్ చాలా అవమానకరంగా ఉంది. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూల్చివేశారు. అప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారు?. ప్యాబ్రికేటెడ్ ఉద్యమాలు చేద్దామనుకుంటే బీజేపీకి వర్క్ అవుట్ కాదు. సీఎం జగన్.. అర్చకులకు ఆర్ధిక సహయం అందించడం నుండి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఆలయాల్లో వైభవం తీసుకువచ్చారు. మీ ఒక్కరికే హిందుత్వం మీద ప్రేమ ఉందా?. సోము వీర్రాజుకు రాజకీయాలు చేయాలను కుంటే ఇది పద్దతి కాదు. సునీల్ ధియోధర్ వంటి నాయకులను పెట్టుకుని ఏపీ రాజకీయాలు చేస్తే ఇంకా దిగిజారిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘చంద్రబాబు కూల్చిన ఆలయాలను పునర్మిర్తిస్తున్నాం’
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ నేతలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవసేవే మాధవసేవ అనేది బీజేపీ నేతలకు తెలియదా?. పేదలకు సాయం చేస్తే దేవుడికి సాయం చేసినట్టే అవుతుందని బీజేపీ నేతలు తెలుసుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, వెల్లంపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం బీజేపీ మానుకోవాలి. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూలిస్తే బీజేపీ ఏం చేశారు?. చంద్రబాబు కూల్చిన ఆలయాలను పునర్మిర్తిస్తున్నాం. బీజేపీ మత రాజకీయాలు ఏపీలో చెల్లవు. శివాలయాల వద్ద బీజేపీ డ్రామాలను ప్రజలు నమ్మరు అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. -
సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్
-
‘ప్రజల్ని రోడ్లపై వదిలేసే పార్టీలతో పొత్తు లేదు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ మానసికంగా సిద్ధమవుతోందా?. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆ విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జనసేన పొత్తుకు సైతం దూరంగా జరిగేలా ఆయన ప్రకటనలు ఇస్తుండడం గమనార్హం. ఇటీవల జగిత్యాల కొండగట్టు పర్యటనలో ‘బీజేపీతోనే ఉన్నా’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ మాత్రం ఏపీలో పవన్‌తో పొత్తు విషయంలో డైలమా ప్రదర్శిస్తోంది. ఒకప్పుడు జనసేనతోనే పొత్తు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన సోము వీర్రాజు వాయిస్‌లో ఒక్కసారిగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బీజేపీ ఏపీ చీఫ్.. ‘‘కలిసి వస్తేనే జనసేనతో పొత్తు.. లేదంటే జనంతోనే మా పొత్తు’’ అంటూ ప్రకటించడం గమనార్హం. పైగా ప్రజలను రోడ్లపై వదిలేసే పార్టీలతో పొత్తు ఉండదంటూ వ్యాఖ్యల ద్వారా పొత్తు విషయంలో ఊగిసలాట ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకు టీడీపీనే ప్రధాన కారణమని చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ప్రసంగాలు చేస్తున్న పవన్ కల్యాణ్, కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుతోనే చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ-బీజేపీలను ఒకచోట చేర్చేందుకు సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ తీరుపైనే బీజేపీలో అనుమానాలు మొదలైనట్లు స్పష్టమవుతోంది. పైగా టీడీపీతో కలిసి ఏమాత్రం ముందుకు వెళ్లడం ఇష్టంలేని బీజేపీ అవసరమైతే జనసేనాని కూడా దూరం పెట్టేందుకు సిద్ధమైంది!. ఈ క్రమంలో జనసేన కలిసి రాకపోయినా.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామనే రీతిలో సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టమవుతోంది. -
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.. స్పందించిన సోము వీర్రాజు
ఒంగోలు: పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌నే ప్రశ్నించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీతోనే ఉన్నానని పవన్ చెప్పారు. మేమూ అదే చెబుతున్నాం. టీడీపీతో జనసేన పొత్తు గురించి నన్ను అడగడం సరికాదు. అదేదో పవన్నే అడగండి’ అని సోము వీర్రాజు అన్నారు. తమ పొత్తు జనసేనతోనే కొనసాగుతోందన్నారు. చంద్రబాబు అటూ ఇటూ తిరగడం వల్ల ఆరేడు ప్రాణాలు పోవడం తప్ప ఏమీ ఉపయోగముండదన్నారు. బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్థన్‌రెడ్డి వంటి వారు మాట్లాడే అంశాలపై తాను స్పందించనని చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకులు సూర్యనారాయణరాజు, పీవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కన్నా ధిక్కార స్వరం దేనికి సంకేతం..?
-
సోముపై కన్నా మరోసారి ఫైర్.. ఏపీ బీజేపీ రియాక్షన్ ఇదే
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నియమించిన వారినే తొలిగించారంటూ సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా నిప్పులు చెరిగారు. కాగా, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహార శైలీపై ఏపీ బీజేపీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. కన్నా హయాంలో ఏనాడూ కేంద్ర కమిటీ నిర్ణయాలను పాటించలేదన్నారు. సోము వీర్రాజు కేంద్ర కమిటీ నిర్ణయాలనే అమలు చేస్తున్నారని ఏపీ బీజేపీ చెబుతోంది. చదవండి: కేసీఆర్‌వి పగటి కలలు: సోము వీర్రాజు -
కేసీఆర్‌వి పగటి కలలు: సోము వీర్రాజు
కర్నూలు కల్చరల్: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చి బీఆర్ఎస్ అంటూ పగటి కలలు కంటున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. కర్నూలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రాములవారిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పి అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మాట్లాడాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డుపడిన కేసీఆర్... ఇప్పుడు ఆంధ్రా అంటూ కూని రాగాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం నియంత్రణ చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. -
ఏపీ బీజేపీలో రాజీనామాల కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు. ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్ఆర్ఐల మధ్య సీట్ల పేచీ -
చంద్రబాబు ఆంధ్రాలో తిరుగుతారు.. హైదరాబాద్‌లో నిద్రపోతారు
గుంటూరు (వెస్ట్): ప్రతిపక్ష నేత చంద్రబాబు పగలు ఆంధ్రాలో తిరుగుతూ.. రాత్రికి మాత్రం హైదరాబాద్ వెళ్లి నిద్రపోతుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో తొలగించిన 26 పథకాలు అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 48 గంటల నిరసన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఇస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క భవనం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారని విమర్శించారు. 2014 నుంచి దళితుల అభివృద్ధికి కేంద్రం రూ.32 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. జాతీయ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దళితులకు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు ష్యూరిటీ లేని రుణాలిచ్చే పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇందులో 50 శాతం సబ్సిడీని కేంద్రమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని నీరు గార్చేశారని ఆరోపించారు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న లక్ష బ్యాక్లాగ్ పోస్టులను భర్తీని చేయకుండా దళితులపై సీఎం జగన్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. కేంద్రం మన రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని, రూ.65 వేల కోట్లతో రోడ్లు నిర్మించిందని చెప్పారు. అయితే డబ్బులు కేంద్రానివి.. స్టిక్కర్లు మాత్రం రాష్ట్రానివి అన్నట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. కుటుంబ పాలన కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసత్యాలను ప్రచారం చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టేశారని విమర్శించారు. ఓట్లకోసం సంక్షేమ బాటపట్టిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, మాగంటి సుధాకర్ యాదవ్, యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఎంగిలి కాఫీలు తాగే రకం!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎవరో చేసిన పనులను కూడా తానే చేసినట్లుగా చెప్పుకుంటారని, ఆయనో ఎంగిలి కాఫీలు తాగే రకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పొదుపు సంఘాలను తానే ఏర్పాటు చేశానని చంద్రబాబు చెబుతున్నారు. ప్రధాని కూడా తనను పొగిడారని చెప్పుకుంటున్నారు. ప్రధాని అలా అన్నారని ఆయనకు ఎవరు చెప్పారు? పొదుపు సంఘాలను చంద్రబాబు ఏర్పాటు చేయలేదు. వాటిని ఏర్పాటు చేసింది దివంగత ప్రధాని పీవీ నరసింహారావు. 1991–95 మధ్య పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో పొదుపు సంఘాల వ్యవస్థను తెచ్చి రివాల్వింగ్ ఫండ్ మంజూరు విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ కుగ్రామంలో ఒక ఎన్జీవో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఆ సంస్థ ఉంది. అందులో చంద్రబాబు ప్రమేయం ఏమీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పీవీ వీటిని తీసుకొస్తే.. వాజ్‌పేయి వచ్చాక డ్వాక్రా పేరుతో పట్టణాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. చంద్రబాబు మైక్ పట్టుకొని ఊగిపోతున్నారు. అదీ మన తడాఖా అంటున్నారు. ఏం తడాఖా..? అలాంటి వాటినే ఎంగిలి కాఫీలు తాగే రకాలు అంటారు’ అని ధ్వజమెత్తారు. ఇక ఇబ్బందులు ఉండవు.. బీజేపీ కార్యక్రమాలకు రాష్ట్రంలో పత్రికలు పెద్దగా కవరేజీ ఇవ్వడం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పవన్‌కళ్యాణ్ సమావేశం తర్వాత తమ మిత్రపక్షం జనసేన కార్యక్రమాల కవరేజీ కూడా తగ్గించేశారని చెప్పారు. మోదీ, పవన్‌కళ్యాణ్ మధ్య పలు అంశాలపై చర్చ జరిగిందని, ఇక రెండు పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. బీజేపీ, జనసేన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి పోరాడతాయన్నారు. పవన్‌కళ్యాణ్ కార్యక్రమాలను అధికారపార్టీ నేతలు నిరోధిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ సొమ్ము చర్చిలకు ఎలా కేటాయిస్తారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. బీసీలపై టీడీపీ తీరుకు నిదర్శనం: జీవీఎల్ టీడీపీ పూర్తి అభద్రతా భావంతో ఉందని జీవీఎల్ చెప్పారు. టీడీపీ ఏర్పాటు నుంచి పార్టీలో కొనసాగుతున్న యనమల లాంటి వారిని ఉద్దేశించి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని లోకేశ్ ప్రకటించటాన్ని బట్టి బీసీల పట్ల వారి వైఖరి తెలుస్తోందన్నారు. బీజేపీ–జనసేన భాగస్వామ్యంతో 2024లో పొలిటికల్ బ్లాక్‌బస్టర్ రావడం ఖాయమన్నారు. సాధారణ రోజుల్లో పెద్దగా కనిపించని రూ.2 వేల నోట్లు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెద్దఎత్తున బయటకు రావడంపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం టీడీపీ హయాంలో కూడా రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలోనే ఉందన్నారు. దీనిపై కేంద్ర విమానయాన మంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. -
పొలిటికల్ కారిడార్ : టీడీపీతో పొత్తుపై మోదీ క్లారిటీ ..
-
ఎల్లో మీడియాపై ఏపీ బీజేపీ సీరియస్.. చర్యలకు సిద్ధం!
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా కథనాలపై ఏపీ బీజేపీ సీరియస్ అయ్యింది. బీజేపీ కోర్ కమిటీ భేటీపై తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోము వీర్రాజుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఎల్లోమీడియా వక్రీకరించింది. అయితే, సోమువీర్రాజు తనలాగే 40 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రధాని వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది. ఎల్లోమీడియా కథనాలను బీజేపీ నేతలు ఖండించారు. కాగా, టీడీపీ అనుకూల మీడియా తప్పుడు వార్తలపై చర్యలకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక, కోర్ కమిటీ భేటీలో చంద్రబాబుతో అంటకాగిన నేతల ప్రచారంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ భేటీలో ఇద్దరు ఎంపీలు.. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బలహీనపడిందని అన్నారు. దీనిపై చర్చ నడిచింది. బాబుకి ఏజ్ లేదు.. లోకేష్‌కు సామర్థ్యం లేదని ఎంపీలు చెప్పారు. చంద్రబాబుపై నెగటివ్ కామెంట్స్ ఎల్లో మీడియా ప్రచురించలేదు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు సభలకు వాడుకున్న వైనంపై ప్రధాని మోదీ వద్ద చర్చించారు. ఆ అంశాన్ని చంద్రబాబు కోవర్టు బీజేపీ నేతలు మీడియాలో రాయించలేదు. ఇక, సోము వీర్రాజు నిర్వహించిన జనపోరు యాత్రను మోదీ అభినందించారు. -
ప్రధాని రోడ్డు షో సక్సెస్: సోము వీర్రాజు
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు షో విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. విశాఖలో శనివారం ప్రధాని బహిరంగ సభ అనంతరం వీర్రాజు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ప్రధాని రోడ్డు షోను విజయవంతం చేసిన ఇన్చార్జిలు, వివిధ విభాగాల బాధ్యులను ఆయన అభినందించారు. ప్రధాని మోదీతో కోర్ కమిటీ సమావేశంలో జరిగిన చర్చ, రాజకీయ అంశాల ఆధారంగా భవిష్యత్తులో పార్టీ ప్రగతిపై నేతలతో ఆయన చర్చించారు. వివిధ అంశాలపై వీర్రాజు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఏపీ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదు: విష్ణుకుమార్ రాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి భారీ బహిరంగ సభ జరగలేదని, ఇకపై జరగబోదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సభని అత్యద్భుతంగా విజయవంతం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ప్రధాని సభ అత్యద్భుతం: జీవీఎల్ నరసింహారావు మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖలో ప్రధాని సభ అత్యద్భుతంగా జరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాని విశాఖ పర్యటన విజయవంతమైందని.. ఊహించిన దానికంటే ప్రజలు అత్యధికంగా హాజరవడంతో ఏయూ గ్రౌండ్ కిక్కిరిసిపోయిందన్నారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ వేలాది మంది సభ బయట ఉండిపోయారని, ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సభాస్థలికి రాలేకపోయారన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన గురించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. -
ప్రధాని పర్యటనకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి పర్యటించనున్న నేపథ్యంలో రెండు రోజులుగా పార్టీ శ్రేణుల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం ప్రధాని పర్యటించే మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ 11వ తేదీన భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రధాన మంత్రికి ఘనస్వాగతం పలుకుతాయని తెలిపారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహిస్తామని, ఉత్తరాంధ్ర ప్రసిద్ధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజుకు చేదు అనుభవం
-
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు సోము వీర్రాజును కోరారు. వికేంద్రీకరణకు అనుకూలం అంటూనే అమరావతి ఫేక్ యాత్రకు ఎందుకు బీజేపీ మద్దతు తెలుపుతోందని వారు నిలదీశారు. సోము వీర్రాజు సూటిగా స్పందించకపోవడంతో వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు -
వీర్రాజు Vs కన్నా.. ఏపీ బీజేపీలో లుకలుకలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలయిక నేపథ్యంలో రెండు రోజులుగా సోము వీర్రాజునుద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ‘పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయంలో మా రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. గతంలో ఇలాంటి పార్టీ విషయాలపై రెండు నెలలకోసారి అందరమూ కూర్చొని మాట్లాడే వాళ్లం. ఇప్పుడు సోము వీర్రాజు ఒక్కరే ఇవన్నీ చూస్తున్నారు. ఎవరితోనూ చర్చించడంలేదు. చివరకు కోర్ కమిటీలో కూడా చర్చకు రావడంలేదు. అసలు పార్టీలో ఏం జరుగుతోందో మాకు తెలియడంలేదు’ అని వ్యాఖ్యానించారు. పవన్‌తో సమన్వయ లోపాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తించిందని, ఆ బాధ్యతను జాతీయ నాయకుడు మురళీధరన్‌కు అప్పగించినట్లు తెలిసిందని చెప్పారు. అయితే, 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అధిష్ఠానం స్పష్టం చేసిందని.. అందువల్లే ఆసంతృప్తితో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సోము వీర్రాజు మద్దతుదారులు అంటున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ కూడా రాష్ట్రంలో సోము వీర్రాజు నాయకత్వంలోనే పార్టీ వచ్చే ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. మరోవైపు.. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కన్నా కొట్టిపారేస్తున్నారు. తాను బీజేపీలో చేరిన నాటి నుంచి ఇలాంటి ప్రచారమే జరుగుతోందని అన్నారు. బుధవారం తాను ఎలాంటి కార్యకర్తల సమావేశం నిర్వహించలేదని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం వీర్రాజు ఢిల్లీ నుంచి రాగానే గన్నవరం ఎయిర్‌పోర్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడతారని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే, ఆయన విజయవాడకు రాలేదు. నేరుగా బెంగళూరుకు వెళ్లారని పార్టీ నాయకులు తెలిపారు. -
2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే అధ్యక్షుడు!
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజే 2024 ఎన్నికల వరకు కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ పరోక్షంగా స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజు నాయకత్వంలోనే ఏపీలో తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని.. ఆ మేరకు జాతీయ నాయకులు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత కనిపిస్తోందని, టీడీపీకి మళ్లీ అధికారం అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. కాగా, విశాఖలో పవన్‌కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడాన్ని బీజేపీ ఖండిస్తోందని చెప్పారు. పవన్‌తో సోము వీర్రాజు ఫోన్లో మాట్లాడారని.. పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీ మాధవ్‌ను అక్కడికి పంపామని పేర్కొన్నారు. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో " స్ట్రెయిట్ టాక్ "
-
కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు : సోము వీర్రాజు
-
మోదీ ఫొటోను చెప్పులతో కొట్టించింది మర్చిపోం
విజయనగరం గంటస్తంభం: టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసినా.. చంద్రబాబు ప్రధాని మోదీ ఫొటోను గాడిదకు తగిలించి ఎమ్మెల్యేలతో చెప్పులతో కొట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గుర్తు చేశారు. వాటన్నింటినీ బీజేపీ ఎప్పటికీ మర్చిపోదన్నారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ వల్లే విశాఖ రైల్వేజోన్ సాకారమవుతోందన్నారు. ప్రధానులను మార్చానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రైల్వే జోన్ ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతోనే రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి చెందలేదని విమర్శించారు. రాజధానికి ఇచ్చిన దాదాపు రూ.7 వేల కోట్లను సింగపూర్, చైనా ప్లాన్లు అంటూ మాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని.. ఆయన్ని చూసి ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయన్నారు. సభలో బీజేపీ నాయకులు తీగల హరినాథ్, పావని తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలపై సోము వీర్రాజు ఫైర్
-
ఆధారాలున్నాయా?.. ఏబీఎన్ రాధాకృష్ణపై సోము వీర్రాజు ఫైర్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలపై తప్పుడు రాతల విషయంలో ఏబీఎన్ రాధాకృష్ణపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ లేఖలో ‘విద్వేషపూరిత కథనాలతో బీజేపీ ప్రతిష్టకు భంగం కలిస్తారా?. అవినీతిపై ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తారా?. బీజేపీ నేతలు అవినీతికి పాల్పడినట్టు మీ దగ్గర ఆధారాలున్నాయా?. మీ రచనలు ‘ఎల్లో జర్నలిజం’గా కనిపిస్తున్నాయి. వారంలోగా ఆధారాలు చూపాలి. లేకుంటే క్షమాపణలు చెప్పాలి. వారంలో స్పందన లేకుంటే చట్టపరమైన చర్యలకు దిగుతాము’ అని వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు నిధులిస్తే రాజధాని ఎందుకు కట్టలేదు
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.6,500 కోట్లు కేంద్రం చంద్రబాబుకు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఆ నిధులతో రాజధానిని ఎందుకు కట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు నేడు రోడ్డుపై పాదయాత్రలు చేస్తున్నారని రైతులను రోడ్డుపై ఎవరు నడిపిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం గుంటూరులో లాడ్జిసెంటర్‌లో ప్రజా పోరు వీధి సమావేశానికి సోము వీర్రాజు హాజరయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్, మలేసియా, జపాన్ అంటూ అన్ని దేశాలు తిరిగి ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని తరహాలో ఏపీకి రాజధాని నిర్మాణం చేస్తానని పలు మార్లు చెప్పారన్నారు. దేశాలు తిరిగి వేల కోట్లు ఖర్చు చేశారే తప్ప, రాజధాని కట్టలేదన్నారు. -
Sakshi Cartoon 28-09-2022
ప్రపంచమంతా తిరిగి రాజధాని ఎలా కట్టాలో తెలుసుకోవడానికి ఆ ఖర్చు చేశారట సార్! -
రాజధాని పేరుతో చంద్రబాబు డబ్బంతా వృధా చేశారు : సోము వీర్రాజు
-
చంద్రబాబుపై ప్రశ్నల వర్షం.. ఆ 6,500 కోట్లు ఏం చేశావ్: సోము వీర్రాజు
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు.. ప్రజల డబ్బంతా వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం ఇచ్చిన రూ. 6,500 కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. రూ. 1800 కోట్లతో కేంద్రం ఎయిమ్స్ నిర్మించింది. అయితే, కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ బాగుందో లేక చంద్రబాబు రాజధాని బాగుందో చర్చకు రావాలి. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. సింగపూర్, మలేషియా, జపాన్ అంటూ దేశాలు తిరిగి వచ్చాడు. వేల కోట్లు ఖర్చు చేశాడు. కానీ.. రాజధానిని మాత్రం ఎందుకు కట్టలేదు’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఆనాడు దానిని అడ్డుకుంది చంద్రబాబే.. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -
పసుపు, కుంకుమ పేరుతో కేంద్ర నిధుల దుర్వినియోగం
నెల్లూరు(బారకాసు): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన నిధుల్లో పసుపు, కుంకుమ పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యా యని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పును ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయకుండా కేంద్రం ఇస్తున్న నిధులను సద్వినియోగపరచుకోవాలన్నారు. సముద్రతీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం 60 శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో తాము చేపట్టిన ప్రజాపోరు బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. -
‘హుందాతనంతో కృష్ణంరాజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు’
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన కృష్ణం రాజుకు ప్రమువురు ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం ఉదయం కృష్ణం రాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను. చలన చిత్ర పరిశ్రమలోనే కాదు పాలిటిక్స్‌లో కూడా కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. హుందాతనం కూడిన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. విలక్షణ నటుడుగా మన్ననలను పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణం బీజేపీకి, సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు. రెబల్ స్టార్ రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. దివంగత ప్రధాన మంత్రి వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
చంద్రబాబుకు చెక్.. జూ. ఎన్టీఆర్ సేవలను వాడుకుంటాము: సోము వీర్రాజు
సాక్షి, తూర్పుగోదావరి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని మునుగోడు పర్యటనలో భాగంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరి మధ్య రాజకీయంగా మంతనాలు జరిగినట్టు లీక్‌లు బయటకు రావడంతో పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమువీర్రాజు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జూ. ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటాము. చంద్రబాబుపై మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు. జూ.ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఆయనుకు ప్రజాదరణ ఎక్కడుంటే ఆయన సేవలు అక్కడే ఉపయోగించుకుంటాము. ఫ్యామిలీ పార్టీలకు దూరమని మా అధిష్ఠానమే చెప్పింది అని వ్యాఖ్యలు చేశారు. -
బల్క్ డ్రగ్ పార్క్ వద్దనడం దారుణం
అమలాపురం రూరల్: ఏపీ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కాకినాడ జిల్లాకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడటం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు కోరినా కూడా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అడ్డుపడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహించబోతున్నట్లు వీర్రాజు చెప్పారు. మోదీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని వివరిస్తామన్నారు. -
‘చవితి’పైనా రాజకీయమా?
సాక్షి, అమరావతి: వినాయక చవితి పండగను సైతం రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ, టీడీపీలు దుష్ట ఆలోచన చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి మండపాలు, పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విష్ణు మీడియాతో మాట్లాడారు. టీడీపీ–బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడిని తొలగించడానికి ప్రయత్నిస్తే.. తాము ఉద్యమించామని.. దాంతో వెనక్కి తగ్గిన మాట వాస్తవం కాదా? అని విష్ణు ప్రశ్నించారు. వినాయకుడి గుడిని తొలగించడానికి ప్రయత్నించిన మీకు వినాయక చవితి గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ఆ ఇద్దరు నేతలకు ఆయన స్పష్టంచేశారు. మళ్లీ వీరే ఇప్పుడు వినాయకుడిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఇక 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ–బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనల ప్రకారమే వినాయక మండపాలు, పందిళ్లకు అనుమతులిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. అప్పట్లో వినాయక మండపాలకు రూ.వెయ్యి విద్యుత్ ఛార్జీగా నిర్ణయిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. అలాగే, కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామికి రూ.6 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బంగారు రథాన్ని తయారుచేయిస్తోందని ఆయన గుర్తుచేశారు. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి.. హిందువులను పండగలు చేసుకోనివ్వడంలేదని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం ఉందని మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పగలరా అని చంద్రబాబు, సోము వీర్రాజులను మల్లాది విష్ణు సవాల్ చేశారు. వీళ్లు హిందువులే కాదు.. అసలు భారతీయులే కాదన్నారు. వీరికి మరో పనిలేకే ఇలాంటి దుష్ఫ్రచారం చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని.. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై వారిద్దరికీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే కేంద్రాన్ని అడిగి పోలవరానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తావా అని సోము వీర్రాజుకు విష్ణు సవాల్ విసిరారు. -
BJP Amaravati Padayatra: బీజేపీ నేతల్ని దొంగలన్న రైతు
తాడేపల్లి రూరల్: అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ‘మనం–మన అమరావతి’ పేరుతో వారం రోజులపాటు బీజేపీ తలపెట్టిన పాదయాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ప్రారంభించారు. ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఉండవల్లి మీదుగా పెనుమాకకు చేరుకుంది. పెనుమాకలో సోము వీర్రాజుకు తారసపడిన ఓ రైతు ‘మీరు దొంగలు’ అంటూ నిందించాడు. ‘మీ వల్లే రాజధాని రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు’ అని మండి పడటంతో సోము వీర్రాజు కొంత అసహనానికి గురయ్యారు. మరో రైతు కలగజేసుకుని అమరావతి విషయంపై ప్రశ్నించారు. అతడికి సోము వీర్రాజు బదులిస్తూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి సూత్రధారి చంద్రబాబేనని, కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు సరిగా ఖర్చుపెట్టి ఉంటే రైతులకు ఈ ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. బీజేపీ ఒకే రాజధానికి కట్టుబడి ఉందని, రాజధాని నిర్మాణానికి రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించడంతో పాటు అమరావతి స్మా›ర్ట్ సిటీ ఏర్పాటుకు రూ.2,500 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలోనే రైతులకు ప్లాట్లు కేటాయించి రాజధానిని అభివృద్ధి చేస్తామని వీర్రాజు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్‌కు వార్నింగ్ -
ప్యాకేజీకి అంగీకరించిన మీరే ఇప్పుడు హోదా అడుగుతారా
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో చంద్రబాబే కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పడంతో పాటు కేంద్రం ఇచ్చిన రూ. 7,798 కోట్లు తీసుకొని కేంద్రానికీ, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు లేఖ కూడా రాశారని తెలిపారు. ఇప్పుడు టీడీపీ నేతలు తమ రాజకీయ ఉనికి కోసం పార్లమెంట్‌లోనూ, బయటా హోదా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పేరు చెప్పి రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా కొందరు రాజకీయ కుట్రలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వంద శాతం ఆత్మీయ కౌగిలిలో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకి అవకాశం ఉందన్నారు. జనసేనతో కలసి మిత్రపక్షంగా ముందుకు సాగుతామన్నారు. -
బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతుందని శనివారం ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు హాజరవుతారని పేర్కొంది. ఈ నెల 2,3 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు చర్చించనున్నట్లు తెలిపింది. -
Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఒకే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రమాదకర నల్ల బెలూన్లు ఎగురవేయడం ద్వారా భారీ కుట్రకు పూనుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం విమానశ్రయం నుంచి భీమవరానికి బయలుదేరిన సమయంలో ఆ పార్టీ నేతలు ప్రమాదకర బెలూన్లు ఎగురవేయడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఘటన వెనుక సూత్రధారులు, పాత్రధారులను, కుట్ర అమలు చేసిన దుష్టశక్తులను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. చదవండి: (CM YS Jagan: తరతరాలకు స్ఫూర్తిదాత) -
సోము వీర్రాజుపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదైంది. బుధవారం ఉదయం రావుపాలెం జొన్నాడ వద్ద సోము వీర్రాజు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. విధుల్లో ఉన్న ఎస్ఐని వెనక్కి నెట్టి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు.. సోము వీర్రాజుపై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, బుధవారం ఉదయం.. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు రుబాబు చేశారు. ఇది కూడా చదవండి: ప్రజలతో మమేకం అయితేనే ప్రజాస్పందన తెలిసేది.. బాబుకి అది తెలీదు -
జొన్నాడలో బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దౌర్జన్యం
-
పోలీసులపై బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దౌర్జన్యం
సాక్షి, రాజమండ్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు రావుపాలెం జొన్నాడ వద్ద వీరంగం సృష్టించారు. నా కారును ఎందుకు ఆపారంటూ పోలీసులపై దౌర్జన్యం చేశారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు రుబాబు చేశారు. చదవండి: (గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్‌షాప్ ప్రారంభం) -
‘పొత్తు’ను పక్కన పెట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొత్తు అంశాలను పూర్తిగా పక్కనపెట్టి.. మన పార్టీని సొంతంగా ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశంపైనే దృష్టిపెట్టి నేతలందరూ పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. పొత్తుల గురించి ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవద్దని సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చిన నడ్డా రాత్రి నగరంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న సహచర పార్టీలు పొత్తులపై ఎలాంటి అంశాలను చర్చకు తీసుకొచ్చినప్పటికీ మన ప్రతి ఆలోచన, కార్యక్రమం మాత్రం స్వయంకృషితో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేలా ఉండాలని నడ్డా సూచించారు. బీజేపీ మాతో కలిసి పోటీచేస్తుందని కొన్ని ప్రత్యర్థి పార్టీల మైండ్ గేమ్ గురించి ఆలోచించవద్దన్నారు. తెలంగాణలో అక్కడి నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు అక్కడ మన పార్టీ ప్రత్యామ్నాయ స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు ఎక్కువగా రాష్ట్ర పర్యటనలకు వస్తారని చెప్పారు. అలాగే, జూలైలో మోదీ రాష్ట్ర పర్యటన సమయంలో ర్యాలీ నిర్వహించే అంశం గురించి చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఇతర నేతలు జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్, పురంధరేశ్వరి, సునీల్ దియోధర్, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, పీవీఎన్ మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను, మోదీ సంక్షేమం–అభివృద్ధిని పొలింగ్ బూత్ స్థాయికి తీసుకెళ్లెలా కోర్ కమిటీ సమావేశంలో రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేసినట్లు చెప్పారు. నేతల చేతుల్లోనే బీజేపీ పురోగతి అంతకుముందు.. నడ్డా బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జిల రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ పురోగతి నాయకులు, కార్యకర్తలు చేతుల్లోనే ఉందని.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అందించిన తోడ్పాటుపై రాష్ట్ర బీజేపీ రూపొందించిన పుస్తకాన్ని నడ్డా ఆవిష్కరించారు. అనంతరం నాలుగైదు పోలింగ్ బూత్‌లను కలిపి ఒకటిగా పేర్కొనే శక్తి కేంద్రాల ఇన్చార్జిలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘మిగతా పార్టీలకు భిన్నంగా మన పార్టీకి విలువలతో కూడిన సిద్ధాంతం, మోదీ లాంటి బలమైన నాయకత్వం ఉండటం మనందరి అదృష్టం. పార్టీ మీకు ఒక దారి చూపుతుంది. ఆ మార్గంలో మీరు నడిస్తే చాలు. మీరే కార్యక్షేత్ర యోధులు. శక్తి కేంద్రాల ఇన్చార్జిలు తమ పరిధిలోని బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహించి, కొత్త కార్యకర్తలను చేర్చుకుంటూ కమిటీలు వేయాలి. వీటిల్లో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ ఇలా అన్నివర్గాల వారికి స్థానం కల్పించాలి. వీరు ప్రతిరోజూ ఐదుగుర్ని కలిసి పార్టీ సిద్ధాంతాలను వివరించాలి. వీలైతే ఆ ఐదుగురిని పార్టీలో చేర్పించాలి. బీజేపీకి పోటీవచ్చే పార్టీల్లేవు ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీవచ్చే పార్టీల్లేవు. బీజేపీ రాజకీయంగా కుటుంబ పార్టీలతోనే పోరాడుతోంది. ఏపీలోని వైఎస్సార్సీపీ, టీడీపీ కూడా కుటుంబ పార్టీలే. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. కేంద్రం అమలుచేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీగా పేరుమార్చి అమలుచేస్తోంది’. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ : సోము ఆ తర్వాత సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. సాయంత్రం విజయవాడ నగర ప్రముఖులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ నడ్డా మాట్లాడారు. -
టీడీపీకి ఓ విధానం లేదా?
ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కుటుంబ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ దూరమని, వాటిని ప్రోత్సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎవరైనా పదవుల్లోని వ్యక్తి చనిపోతే జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయబోమని, అది తమ పార్టీ విధానమని తెలుగుదేశం పార్టీ పేర్కొంటోందని, అయితే గతేడాది జరిగిన తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎందుకు పోటీ చేశారని, పార్లమెంట్‌కు ఓ విధానం, అసెంబ్లీకి మరో విధానం ఆ పార్టీ సిద్ధాంతమా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో జరిగిన మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తారన్నారు. మీడియా సమావేశంలో కర్నాటి ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, కాకు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక!
ఆకివీడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్టు ఆ పార్టీ ఆకివీడు మండల కమిటీ అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు శనివారం తెలిపారు. ఆకివీడులోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీర్రాజు పార్టీ మండల కార్యాలయంలో కొద్దిసేపు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వస్తారని వీర్రాజు చెప్పినట్లు తెలిపారు. -
Somu Veerraju: టీడీపీతో పొత్తుపై సోమువీర్రాజు స్పష్టత
నల్లజర్ల: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనంతోనే తమ పార్టీ పయనిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే జనసేనతో కలుస్తామని, కానీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు. జూన్ 5న రాజమహేంద్రవరం, 6న విజయవాడలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలు జరుగనున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి శివనాగరాజు ఇంటివద్ద మంగళవారం జరిగిన శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని అభివృద్ధి చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యమన్నారు. చదవండి: (పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు) -
పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు: పొత్తుల విషయంలో తాము క్లారిటీగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీకి జనంతోనే పొత్తు.. అవసరమైతే జనసేనతో పొత్తు అని వ్యాఖ్యానించారు. ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనేది పవన్ కల్యాణ్‌ను అడగాలని అన్నారు. దేశంలో బీజేపీ ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేస్తుందని, దానితో ప్రజలను ఓట్లు అడుగుతామని సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తమకు ముఖ్యమని, 2024లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని జోస్యం చెప్పారు. -
చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ సిద్ధంగా లేదు: సోమువీర్రాజు
సాక్షి, విజయవాడ: పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ త్యాగం చెయ్యదన్నారు. బీజేపీ ఇప్పటికే చాలా త్యాగాలు చేసింది. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. జూన్ మొదటి వారంలో విజయవాడ, రాజమండ్రిలలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు. చదవండి: (ఎల్లో చానెల్లో మీటింగ్‌లు.. చాటింగ్‌లు) -
ప్రత్యేక హోదా ఖరీదు రూ.15 వేల కోట్లు
మదనపల్లె/చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేకహోదా ఖరీదు రూ.15,000 కోట్లుగా ప్యాకేజీని నిర్ణయించి వాటితో పాటుగా ఆరు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తే సరిపోతుందన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా, ఐదేళ్లు అధికారంలో ఉండి సింగపూర్, జపాన్ అంటూ మోసగించిన వారిని నిలదీయాలన్నారు. -
సోమువీర్రాజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి కారుమూరి
-
టీడీపీ వల్లే వంశధార నిర్వాసితులకు అన్యాయం
హిర మండలం: ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ పాలన వల్లే వంశధార నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. ‘జలం కోసం జన పోరు యాత్ర’ పేరుతో ప్రాజెక్టుల సందర్శనకు బీజేపీ నాయకులు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం హిరమండలంలోని వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు ఇంజనీరింగ్ అధికారుల నుంచి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 91 శాతం పనులు పూర్తయ్యాయని.. మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు వారికి చెప్పారు. అనంతరం జరిగిన సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో 10 ప్రాజెక్టులను సందర్శిస్తామని చెప్పారు. చంద్రబాబు విఫలమవ్వడం వల్లే వంశధార ప్రాంత నిర్వాసితులు, స్థానికులు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ, మధు కుమార్, పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
మా పొత్తు వారితోనే...!
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. విశాఖలోని లాసన్స్‌బేకాలనీలో ఉన్న బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాని బుధవారం ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ని ఇక్కడే కొనసాగించాలని ఏపీ బీజేపీ గతంలోనే కేంద్రానికి స్పష్టం చేసిందని చెప్పారు. గనుల రద్దు విషయం మైన్స్ పాలసీలో భాగంగానే జరిగిందని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ వస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేనతో పొత్తుపై ప్రశ్నించగా..రాష్ట్రంలో 1.35 కోట్ల రైస్ కార్డుదారులతో తమ పొత్తు ఉంటుందని, 30 లక్షల ఇళ్లు పొందిన ప్రజలతో పొత్తు ఉంటుందని, 1.35 లక్షల జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డులు పొందిన వారితో తమ పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు విష్ణుకుమార్‌రాజు,మాధవ్ తదితరులు పాల్గొన్నారు -
Sakshi Cartoon: ..ఇంకా ఎగస్ట్రా పెగాసస్ కూడా!
..ఇంకా ఎగస్ట్రా పెగాసస్ కూడా! -
టీడీపీతో బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తులేకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని, తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తిరిగి బీజేపీకే వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుల అభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్‌చార్జ్‌లు సునీల్ దియోధర్, మధుకర్ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. రెండురోజుల పాటు కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కర్నూలులోని మౌర్య ఇన్‌లోని పరిణయ ఫంక్షన్ హాలులో ఈ నెల 20, 21 తేదీలలో నిర్వహించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జ్ సుప్రకాశ్, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ దియోధర్, మధుకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు 13 జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, పదాధికారులు పాల్గొన్నారు. సమావేశం హాలులోకి మీడియాను కూడా అనుమతించలేదు. సమావేశం తర్వాత కూడా విషయాలను బయటికీ వెల్లడించలేదు. అయితే సమావేశానికి హాజరైన బీజేపీ ముఖ్యనేతలు ఇద్దరు విషయాలను ‘సాక్షి’కి వెల్లడించారు. వారి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీతో పొత్తుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు బీజేపీ విధానం, పార్టీ బలోపేతం, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సిద్ధం కావడంతో పాటు పొత్తు అంశాలపై చర్చించారు. చంద్రబాబునాయుడు బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చారని, బీజేపీతో కలవకుండా అతను అధికారంలోకి వచ్చిన సందర్భమే లేదని 13 జిల్లాల అధ్యక్షులు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత బలంగా ఉన్నారని, ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చంద్రబాబు చేయరని, తిరిగి బీజేపీతో జతకట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారని చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండకూడదని 13 జిల్లాల అధ్యక్షులు మూకుమ్మడిగా నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కీలక నేతలు స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు ఉండదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఆపార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేరని, కేవలం పొత్తులపై ‘మైండ్‌గేమ్’ ఆడుతున్నారన్నారు. జనసేనతో కూడా పొత్తులపై ఇప్పటికిప్పుడే ఏం చెప్పలేమని, పవన్‌కల్యాణ్‌తో పాటు జనసేన నేతల్లో స్థిరమైన నాయకత్వం లేదని, అలాంటివారిని నమ్మి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లలేమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి ఏదీ? బీజేపీ ఇన్‌చార్జ్‌లతో పాటు రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుల నుంచి సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తోంది. జాతీయపార్టీగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలవలేదంటే పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోవడమే కారణమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్ననేతలే బీజేపీలో ఉన్నారని, వారు బీజేపీ కాకుండా టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోందని ఓ వ్యక్తి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్, సుజనా చౌదరి టీడీపీలో ఎంత క్రియాశీలకంగా పనిచేశారో, చంద్రబాబుకు, వారికి మధ్య ఉన్న ధృడమైన బంధం ఎలాంటిదో, ఎలాంటి పరిస్థితుల్లో వారు బీజేపీలో చేరారో అందరికీ తెలిసిందే! ఇలాంటి వ్యక్తుల మాటలు విశ్వసించి పార్టీలో నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని సునీల్ దియోధర్‌తో పాటు సుప్రకాశ్కు పలువురు అధ్యక్షులు వ్యక్తిగతంగా కలిసి వివరించినట్లు తెలుస్తోంది. బైరెడ్డి గైర్హాజరు... పార్టీ వీడతారని చర్చ సమావేశానికి బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి గైర్హాజరయ్యారు. కనీసం రాష్ట్ర, జాతీయస్థాయి నేతలను వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. జనవరి 22న ఎస్టీబీసీ మైదానంలో జరిగిన ప్రజానిరసన సభలో కూడా ఆయన పాల్గొనలేదు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బైరెడ్డి బీజేపీని వీడతారనే చర్చ జిల్లాలో నడుస్తోంది. టీజీ వెంకటేశ్ వైఖరిపై ఫిర్యాదులు జిల్లా అధ్యక్షులు వ్యక్తిగతంగా పార్టీ నేతలతో కలిసి ముచ్చటించిన సందర్భంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వైఖరిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో, ఆయన తనయుడు టీడీపీలో కొనసాగుతున్నారని, ఈ వైఖరితో కర్నూలు ప్రజల్లో టీజీ ఫ్యామిలీ విశ్వసనీయత కోల్పోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఉంటే ఇద్దరూ బీజేపీలో, లేదంటే టీడీపీలో కొనసాగాలని, రెండు పడవలపై ప్రయాణం వద్దని కర్నూలు జిల్లా నేతలు సునీల్ దియోధర్‌కు చెప్పినట్లు తెలిసింది. -
సీమ అభివృద్ధికి కేంద్రం కృషి
సాక్షి, కడప/కోటిరెడ్డి సర్కిల్: ‘రాయలసీమ నుంచి అనేకమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్య మంత్రులయ్యారు. ప్రాజెక్టులతో పాటు అనేక రంగాలను విస్మరించడంతో రాయలసీమ అభివృద్ధిలో వెనకబడిపోయింది.. సీమ అభివృద్ధికి మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తుంది..’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కడపలో శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో ‘రాయ లసీమ రణభేరి’ సభను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. ఏపీ ప్రజ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ ఆధిక్యతతో గెలిపించినా మూడేళ్ల పాలనలో అభివృద్ధి ఏమీ లేదని.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని వి మర్శించారు. రాయలసీమలో పేదరిక నిర్మూలన కోసం పాలకులు ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తన భుజస్కంధాలపై వేసుకుందని, పూర్తి చేసేందుకు శక్తివంఛన లేకుండా కృషిచేస్తోందన్నారు. అనేక జా తీయ రహదారులు నిర్మిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం లోకి వస్తామన్నారు. రౌడీ ప్రభుత్వం పోతుందని, జనసేనతో కలిసి డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభు త్వాన్ని స్థాపిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. గండికోటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవాలయాలను కూడా కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని స్పష్టంచేశారు. బీజేపీ కార్యకర్తలపై వేధింపులు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై వేధింపులు సాగిస్తున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, జాతీయ ప్రధాన కార్యదర్శులు పురందేశ్వరి, వినోద్దౌడె, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌లు మాట్లాడుతూ.. రాయలసీమకు 200 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని తెలిపారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. సీమ అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డిలు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీని ఓడించాలంటే పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీనిగానీ, ప్రాజెక్టులనుగానీ పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందన్నారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర నేతలు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, తదితరులు కూడా పాల్గొన్నారు. -
బీజేపీ నేత జీవీఎల్ కు వెల్లంపల్లి సవాల్
-
ఉద్యోగాలు అమ్ముకున్న చంద్రబాబు
గుంటూరు మెడికల్ /నెల్లూరు (బారకాసు): తామర పురుగు వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై మహాధర్నా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్భాటం కోసం వినియోగిస్తుందని ఆరోపించారు. రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే రైతుయాత్ర చేస్తామని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు మాట్లాడుతూ.. రైతుల సమస్యలను సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు అమ్ముకున్న చంద్రబాబు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలను చేపడితే.. అందులో ఒక్కో ఉద్యోగాన్ని రూ.5 లక్షలకు అమ్ముకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సొమ్ము చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు నగరంలో జరిగిన శక్తి కేంద్రాల బలోపేత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొదుపు సంఘాలను దివంగత ప్రధాని పీవీ నరసింహరావు గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తే.. వాటిని దివంగత ప్రధాని వాజ్‌పేయి పట్టణాలకు విస్తరింపజేయడంతో పాటు బలోపేతం చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తానే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాçస్పదమన్నారు. -
అమరావతి రైతుల్ని చంద్రబాబు మోసగించారు
సాక్షి, మచిలీపట్నం: చంద్రబాబు ఐదేళ్లలో రాజధానిని నిర్మించలేదని, భూములిచ్చిన రైతులకు ఒక్క ప్లాటు కూడా ఇవ్వలేకపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు ఐదేళ్లలో రూ.7,200 కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులు దేనికి ఖర్చు చేశారో.. ఏం చేశారో తెలియదని అన్నారు. సింగపూర్, జపాన్, రష్యా అంటూ విదేశాల్లో జోరుగా తిరిగారని, ఎక్కడికి వెళితే అలా రాజధాని నిర్మిస్తామని చెప్పి ఐదేళ్లలో కట్టలేకపోగా.. రైతులను మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉండుంటే కేవలం రూ.10 వేల కోట్లతో అద్భుత రాజధాని నిర్మించేవాళ్లమ న్నారు. రాజధాని నిర్మిస్తే కేంద్రం రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పిందని, చంద్రబాబు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని గుర్తు చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 7 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేవలం 3 లక్షల ఇళ్లకు పునాదులు వేసి వదిలేశారని వివరించారు. ఆ ఇళ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి రూ.4 వేల కోట్లు రుణం కూడా తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఒక్క పోర్టయినా నిర్మించారా రాష్ట్రంలో 900 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంటే ఒక్కపోర్టయినా కట్టారా? అని వీర్రాజు ప్రశ్నించారు. 14 జెట్టీలు కట్టే అవకాశం ఉన్నా చంద్రబాబు ఒక్కటీ నిర్మించలేకపోయాడని దుయ్యబట్టారు. కేంద్రం ఒక్కో జెట్టీ నిర్మాణానికి రూ.600 కోట్లు ఇస్తుందని, అలా ఆరు జెట్టీలకు రూ.3,600 కోట్లు ఇస్తామని చెప్పి నట్లు గుర్తు చేశారు. -
ఏపీ బీజేపీ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు: మంత్రి వెల్లంపల్లి
-
చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీ నేతలు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీ నేతలు నడుస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, చంద్రబాబు పెట్టుబడిదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఏపీ బీజేపీలో పని చేస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: వాడుకుందాం.. వదిలేద్దాం.. అచ్చెన్న వ్యాఖ్యలు వైరల్ ‘‘గతంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ లు పవన్ కల్యాణ్ ఒక్కరే చదివేవారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు బీజేపీ నేతలు తోడయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరానికి నిధులు, కడపకు స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఇస్తామని చెప్పే సత్తా సోము వీర్రాజు, జీవీఎల్‌కు ఉందా?. బీజేపీ నేతలు కపట నాటకాలాడుతున్నారని’’ మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధికి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని.. ఇలాంటి వారు ఎంతమంది అడ్డుపడినా సీఎం జగన్ ఏపీని అభివృద్ధి చేసి తీరతారన్నారు. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చదవొద్దని ఏపీ బీజేపీ నేతలకు మంత్రి హితవు పలికారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇలాగే కొనసాగితే బీజేపీ మరింత హీనంగా తయారవుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు రాజధానిని కట్టలేకపోయారు: సోము
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు సీఎంగా ఉండి చంద్రబాబు రాజధానిని కూడా కట్టలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా ప్యానలిస్టులు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులతో పాటు ఇతర ఆర్థిక నిపుణులు, న్యాయవాద– వివిధ రకాల వృత్తి విభాగాల ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ నేత ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. -
వామపక్షాలకు మేమంటేనే నచ్చదు
విజయనగరం గంటస్తంభం: వామపక్షాల నేతలు ఇతర పార్టీలను ఒక్క మాట అనరని.. బీజేపీ ఎన్ని మంచి పనులు చేసినా తీవ్ర విమర్శలు చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, వైఎస్ జగన్ అంటే వామపక్షాలకు ప్రేమ ఎక్కువన్నారు. ప్రధాని మోదీ మాత్రం వారికి నచ్చరన్నారు. రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీలు, జూట్ పరిశ్రమలు మూతపడినా ఏమీ మాట్లాడరని.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేస్తున్నారని మాత్రం తెగ గోల చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఏటా నిధులు విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. -
టీడీపీ వల్లే డిస్కమ్‌లపై రూ.30వేల కోట్ల భారం
ఒంగోలు: గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకంవల్లే విద్యుత్ డిస్కమ్‌లు రూ.30వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఐదేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తోందని.. ఇది ప్రభుత్వానికి భారంగా మారడంతో ఇబ్బందిగా ఉందన్నారు. ప్రైవేటుకు లీజుకిచ్చే అంశంపై విద్యుత్ జేఏసీ అడిగిన విజ్ఞప్తికి తాము ఎటువంటి స్పష్టమైన హామీని ఇవ్వలేదన్నారు. అయినా వారి విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇక విద్యుత్ జేఏసీతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ్రారెడ్డి, తాను మాట్లాడామని.. జేఏసీ కోరికలన్నీ దాదాపుగా నెరవేరుస్తున్నామన్నారు. అలాగే పీఆర్సీకి సంబంధించి కమిషన్ కాదు.. కమిటీ వేయాలంటూ విజ్ఞప్తి వచ్చిందని, దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ సమస్యలను వక్రీకరించడం సబబుకాదు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని బాలినేని స్పష్టంచేశారు. ఎప్పుడైనా ఒకటి అరా సమస్యలు రావడం సహజమని, దానిని వక్రీకరించాలని చూస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్ రూ.2.50కు అందుబాటులో ఉంటే ఏకంగా రూ.4.87లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందన్నారు. దీనివల్ల విద్యుత్ డిస్కంలు ఏకంగా రూ.30 వేల కోట్ల భారాన్ని మోస్తున్నాయన్నారు. అయినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు విచిత్రంగా ఉంటున్నాయని.. కేంద్రం నిధులు ఇస్తామంటే వద్దని, అప్పులు ఎవరైనా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. నిజంగా సోము వీర్రాజుకు రాష్ట్రంపై ప్రేమే ఉంటే మోదీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. -
‘నాడు ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు తెచ్చుకున్న బాబు’
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాపై ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు.. సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం దగ్గర ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు కూడా తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పుడు రాష్ట్రానికి అదే విధంగా నిధులు రాబట్టుకోవాలన్నారు. విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు సీఎంగా ఉండి కూడా రాజధానిని కట్టకుండా చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. -
సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు: సోము వీర్రాజు
-
‘హోదా’పై ప్రత్యేక భేటీ!
సాక్షి, అమరావతి: ‘హోదా’పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదన పంపాలని.. అలా తమ పార్టీ కూడా కోరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇందుకోసం విడిగా ఒక సమావేశం అడగమనండి.. పెట్టమనండి అని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం అయినందున ఈనెల 17న తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆ అంశాన్ని అజెండా నుంచి కేంద్రం తొలగించిందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు తెలంగాణకు ఎలాంటి సంబంధంలేదని.. ఇది దానిలో పెట్టాల్సిన అంశం కాదని ఆయన చెప్పారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదాకు సరిపడా నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధం ఇక ప్రత్యేక హోదాకు సరిపడా నిధులు తీసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వంలో కొంత కసరత్తు జరిగిందని సోము వీర్రాజు వెల్లడించారు. అప్పట్లో ఆ మేర నిధులివ్వడానికి కేంద్రం సిద్ధపడిందని, హోదా అంశంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమేరకు ముందుకెళ్లిందని చెప్పడానికే ఈ అంశాలను తాను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానన్నారు. ప్రత్యేక హోదాకు సరిపడా నిధులివ్వడానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కసరత్తును ఈ ప్రభుత్వం మళ్లీ మొదలెట్టాలని వీర్రాజు అన్నారు. 17న కేంద్రమంత్రి గడ్కరీ రాక రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, మరికొన్నింటి శంకుస్థాపనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17న రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా 21 జాతీయ రహదారులను ప్రారంభిస్తారని, మరో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. రూ.64 వేల కోట్ల ఖర్చుతో 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందని.. ఇందులో అధిక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకోవాలని ఆయన సూచించారు. రిజర్వేషన్ల వ్యవహారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లుగానే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదని వీర్రాజు ప్రశ్నించారు. ఈనెల 17న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గడ్కరీ పాల్గొనే సభా వేదిక నిర్మాణాన్ని సోము వీర్రాజు పరిశీలించారు. -
అజెండాలోంచి హోదాను తీయిస్తే కానీ జీవీఎల్‌కు నిద్రపట్టలేదా: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: విభజన చట్టంలోని సమస్యలపై న్యాయం చేయాలని అనేకసార్లు ప్రధానిని కలిసి సీఎం జగన్ కోరారు. కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చారు. అప్పుడు చంద్రబాబు, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు అంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గోతికాడ నక్కల్లా చంద్రబాబు, బీజేపీ నేతలు కాచుకుని కూర్చున్నారు. చంద్రబాబు సలహా మేరకే జీవీఎల్ పట్టుబట్టి అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేశారు. ప్రత్యేక హోదాకు జీవం పోస్తే ఏపీలో బీజేపీ ఇంకా చచ్చిపోతుందనేదే జీవీఎల్ ఆలోచన. రాష్ట్రానికి మేలు జరగకుండా ఉండేందుకు జీవీఎల్ మంచి పాత్రే పోషిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో జీవీఎల్ బాగా పనిచేస్తున్నారు. అజెండాలోంచి తీసేసిన తర్వాత దెయ్యాల్లా వేదాలు వల్లిస్తున్నారు. చదవండి: (రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేంద్రం అదే చెప్పింది: మంత్రి బొత్స) చంద్రబాబు, జీవీఎల్, సోమువీర్రాజుని ప్రశ్నిస్తున్నా. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని 2014 మ్యానిఫెస్టోలో పెట్టారా లేదా చెప్పాలి. ఏపీ ప్రజలను వాగ్ధానాలతో మోసం చేశారా లేదా. ప్రత్యేక హోదాపై అప్పుడు ఇచ్చిన మాటను నిలబెడతారా.. చేతులెత్తేశారా. బీజేపీ పిల్లిమొగ్గలు వేసే పరిస్థితుల్లో ఉందా. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలాలు అనుభవిస్తున్నాయా లేదా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టమా, లేదా..?. ఏపీపై బఠాని గింజంత చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ నేతలు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది మీరా కాదా.. టీడీపీ సమాధానం చెప్పాలి. ప్యాకేజీ పేరుతో టోకుగా అమ్మేసింది మీరా కాదా. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తీసేయగానే మాట్లాడుతున్న హీన సంస్కృతి టీడీపీది. హోల్‌సేల్‌గా హోదాను అమ్మేసి సాధించిన ప్యాకేజీ వల్ల ఏపీకి ఏం చేశారు. చదవండి: (కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్ కుమార్) కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో ప్రత్యేకహోదా పెట్టడం దేశ ద్రోహమా. ఎందుకు చంద్రబాబు, జీవీఎల్ పట్టుబట్టి అజెండా నుంచి తీయించేశారు. జీవీఎల్ ఎందుకు భయపడ్డాడు. ఏపీకి ఎప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేది బీజేపీ, టీడీపీ స్టాండా.. చెప్పాలి. జీవీఎల్‌కు ఎందుకంత ఆత్రం. అజెండాలోంచి హోదాను తీయిస్తే కానీ జీవీఎల్‌కు నిద్రపట్టలేదా. ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్న టీడీపీ నేతలు అజెండా ప్రకటించినపుడు ఏమైపోయారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కనకమేడల ఏ కలుగులో దాక్కున్నారు. అజెండా నుంచి హోదాను తీసేయగానే ఎందుకు బయటికొచ్చారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ బాగుపడుతుందంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈర్ష్య, అసూయలతో నీచరాజకీయాలు మానుకోవాలని టీడీపీ, ఏపీ బీజేపీ నేతలను హెచ్చరిస్తున్నాం' అని మంత్రి పేర్ని నాని అన్నారు. -
బడ్జెట్‌పై దేశమంతా చర్చలు
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే తెలిపారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అనంతరం బడ్జెట్‌పై వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ప్రతిపక్షాలు బడ్జెట్‌పై చేస్తున్న అసత్యాలను ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నులు విధించకుండా ప్రాధాన్యతా రంగాలకు అధిక కేటాయింపులు చేసినట్లు చెప్పారు. జాతీయ రహదారులు, పోర్టులు, ఇండస్ట్రియల్ సెక్టార్‌కు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ భారతంలో పోస్టాఫీసుల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో పోర్టులు కట్టాలని మోదీ కలలు కంటున్నారని చెప్పారు. లతా మంగేష్కర్ మృతిపట్ల సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. లతా మరణం దేశానికి తీరని లోటని సోము వీర్రాజు పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడితే బీజేపీకి అధికారం కార్యకర్తలు కష్టించి పనిచేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించడం సాధ్యమేనని కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భగవత్ కిషన్‌రావు కరాడేకు ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, ప్రెసిడెంట్–ఎలక్ట్ పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌తో కూడిన బృందం వినతిపత్రం అందజేసింది. దుర్గమ్మ సేవలో కేంద్ర మంత్రి ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. -
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: హత్యలు చేసే కడప వాళ్లకు ఎయిర్‌పోర్టా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు. 'రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన' అని సోమువీర్రాజు అన్నారు. చదవండి: (పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్) ఇదిలా ఉండగా, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు నిర్మించాలన్న ప్రణాళికలో ఉన్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ జిల్లాలకు ఎయిర్‌పోర్టులు ఎందుకంటూ వ్యాఖ్యానించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో.. ‘జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎందుకు? కర్నూలులో ఎయిర్‌పోర్టు.. బస్సులు వెళ్లడానికి దారిలేనటువంటి కర్నూలులో ఎయిర్‌పోర్టు.. రాయలసీమకు ఎయిర్పోర్టులంట.. కడపలో ఎయిర్‌పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టు.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు. మేం ఎయిర్‌పోర్టు వేస్తాం. ఏం వేస్తారండి ఎయిర్‌పోర్టు.. మీరు రోడ్లు వెయ్యండి..’ అంటూ రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వీర్రాజు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు మండిపడుతుండడంతో తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గారు. -
సోము వీరా.. అది నోరా?: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): కడప ప్రజల మనోభావాలను గాయపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు దారుణమని, ఇది ఆయన పార్టీ అజెండానా? లేక సొంత అజెండానా? అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయ ప్రాంగణంలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గడికోట మీడియాతో మాట్లాడుతూ.. ఆంగ్లేయుల హయాంలోనే కడపలో ఎయిర్‌పోర్టు ఉందనే విషయాన్ని ఇలాంటి కుహనా నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మానవత్వం కడప సొంతం.. ఒక మనిషి ఆకలితో ఉంటే తట్టుకోలేని సంప్రదాయం.. తమ కడుపు మాడ్చుకొని ఇతరులకు అన్నం పట్టే సహృదయం కడప ప్రజల సొంతమని గడికోట పేర్కొన్నారు. సోము వీర్రాజు పద్ధతి మార్చుకోకుంటే తమ ప్రాంతంలో అడుగుపెట్టే హక్కును సైతం కోల్పోతారని హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కడప గూండాలు, రౌడీలు, పులివెందుల పంచాయతీ అంటూ చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. సీమలో ఆయా పార్టీల జెండాలు మోసే వ్యక్తులు ఇలాంటి కుహనా వ్యాఖ్యల పట్ల సిగ్గు పడాలన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చారని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫ్యాక్షన్ వద్దు.. ఫ్యాషన్ ముద్దు నినాదాన్ని తీసుకొచ్చారని వివరించారు. దిక్కుతోచకే బాబు విమర్శలు.. దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడినని తరచూ చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నట్లుగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో దిక్కుతోచని చంద్రబాబు ఈర‡్ష్యతోనే విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. బీజేపీ క్షమాపణ చెప్పాలి: వామపక్షాలు రాయలసీమకు విమానాశ్రయాలు ఎందుకంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాఖ్యలను వామపక్ష రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీర్రాజు చేసిన అవమానకర వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో మత విద్వేషాలు, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ విమర్శించారు. విజయవాడ లబ్బీపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని, విషప్రచారాల్లో నిమగ్నమై వికృత క్రీడ ఆడుతుందన్నారు. చదవండి: ‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’ -
ఉదయం దీక్ష.. మధ్యాహ్నం ఫైట్!
సాక్షి, అమరావతి/ఉయ్యూరు (పెనమలూరు)/గుడివాడ/ఉంగుటూరు (గన్నవరం): ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలు మంగళవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఎంపీ సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రాజు, విష్ణువర్దన్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకొచ్చిందని సోము వీర్రాజు ఆరోపించారు. కాగా, దీక్షను మధ్యాహ్నానికి విరమించి, బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామంటూ సోము నేతృత్వంలో పార్టీ నేతలు గుడివాడకు బయలుదేరి వెళ్లారు. నందమూరు అడ్డరోడ్డు వద్ద హైడ్రామా గుడివాడలో సంక్రాంతి సంబరాలను టీడీపీ వివాదాస్పదంగా మార్చింది. దీనికి వంతపాడుతూ గుడివాడ పర్యటనకు బయలుదేరిన బీజేపీ నాయకులను నందమూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి, సీఎం రమేష్ సహా 35 మంది బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఘర్షణకు దిగారు. వీర్రాజుతో పాటు 18 మందిని ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. వీర్రాజు మాట్లాడుతూ.. తాము చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకున్నా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఎందుకు అడ్డుకున్నారు? బీజేపీ ఎంపీ జీవీఎల్ సాక్షి, న్యూఢిల్లీ: సంక్రాంతి కార్యక్రమాల ముగింపు వేడుకలకు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం గుడివాడ వెళ్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారని, అరెస్ట్ చేసి బయటకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసుల ప్రవర్తన చూస్తే ఎంత అరాచకంగా వ్యవహరించారో తెలిసిపోతుందన్నారు. ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలంటే వైఎస్సార్సీపీ నేతలకు చేదా అని అడిగారు. -
సోము వీర్రాజు దేశ భక్తుడా? తెలుగుదేశం భక్తుడా?: వెల్లంపల్లి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దేశ భక్తుడా? తెలుగుదేశం భక్తుడా? అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో కలిసి ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని వెల్లంపల్లి విమర్శించారు. సోము వీర్రాజు కార్పొరేటర్‌గా కూడా పనికిరాని వ్యక్తి అని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా? అని సూటిగా ప్రశ్నించారు. సోము వీర్రాజు, సీఎం రమేష్, సుజనా చౌదరిలు రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని అన్నారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడుపోయారని విమర్శించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ పాలన చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు 40 దేవాలయాలు కూలిస్తే సోము వీర్రాజు ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీతో కలిసి ప్రభుత్వం పంచుకుంటూ గుడులు కూల్చిన ఘనత బీజేపీదేని మండిపడ్డారు. ఆయన సోము వీర్రాజు కాదని, సారా వీర్రాజు అని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి.. వైఎస్సార్సీపీపై మత, కుల ముద్ర వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోరని, అందుకే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని మండిపడ్డారు. -
జనసేనతోనే పొత్తు
కర్నూలు కల్చరల్: బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని, రెండు పార్టీల పెద్దలు చర్చించుకుని సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. టీడీపీ, వైఎస్సార్సీపీలతో సమాన దూరంలో వెళ్లాలని అమిత్‌షా నిర్ణయించి దిశా నిర్దేశం చేశారని తెలిపారు. కర్నూలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను వెంటనే రద్దుచేయాలని, ఉద్యోగులను మళ్లీ చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాడుతుందని, వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎస్డీపీఐ నేత అతావుల్లాను అరెస్ట్ చేయాలని, రాష్ట్రంలో ఎస్డీపీఐని నిషే«ధించాలని డిమాండ్ చేశారు. ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసిన నిధులపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
దీక్షలు కాదు.. ఏపీ హామీలపై మోదీని ప్రశ్నించండి
ఒంగోలు: పార్లమెంట్ సాక్షిగా ఏపీ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీని ఎందుకు అడగట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని పంజాబ్‌లో ఫ్లైఓవర్‌పై నిలిపివేశారని.. ఏలూరులో సోము వీర్రాజు దీక్షకు దిగడం హాస్యాస్పదమన్నారు. 20 నిమిషాల పాటు మోదీ రోడ్డుపై ఆగితే ఇంత యాగీ చేస్తున్న బీజేపీ నాయకులు.. ప్రజా సమస్యలపై ఎందుకు వెంటనే స్పందించట్లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులపై కనీసం ఒక్క వినతిపత్రమైనా ప్రధానికి ఇచ్చారా అని నిలదీశారు. రాష్ట్రంలో పొత్తులపై తమ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని తెలిపారు. కాగా, ఉద్యోగులను పీఆర్సీ నిరుత్సాహపరిచిందని రామకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 11న విజయవాడలో నిరుద్యోగులు, విద్యార్థులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు పీజే చంద్రశేఖర్, ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు. -
ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి
ఏలూరు (టూటౌన్)/ గుంటూరు మెడికల్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని, దేశ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దేశ ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఏలూరు, గుంటూరు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం మౌన దీక్షలు నిర్వహించారు. ఏలూరులోని గాంధీ మైదానం సెంటర్లో గాం«ధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సోము వీర్రాజు మాట్లాడారు. ప్రధాని మోదీకి ప్రపంచ వ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు రావడంతో కాంగ్రెస్ తట్టుకోలేక దుష్ట పన్నాగాలు పన్నుతోందని ఆరోపించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ లీగల్ సెల్ చైర్మన్ జూపూడి రంగరాజు మాట్లాడారు. -
చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు.. తర్వాత వదిలేస్తాడు: సోము వీర్రాజు
-
చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు.. తర్వాత వదిలేస్తాడు: సోము వీర్రాజు
సాక్షి, విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు ఒక అవకాశవాదని, అవసరమైనప్పుడు ఎవరినైనా లవ్ చేస్తాడంటూ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు అవకాశవాది. ఎవరినైనా లవ్చేస్తాడు. తర్వాత వదిలేస్తాడు. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్ధుడు.1996లో కాంగ్రెస్‌లో చంద్రబాబు చక్రం తిప్పాడు అప్పటి నుంచి అన్ని పార్టీలను లవ్ చేశాడు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు సోము వీర్రాజు. -
సారా మాటలు డైవర్షన్ కోసమే.. బీజేపీ చీప్ పాలిట్రిక్స్
సాక్షి, అమరావతి/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): సోము వీర్రాజు మాట్లాడిన ‘సారా మాటల‘ డైవర్షన్ కోసమే బీజేపీ చీప్ పాలిట్రిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరులో నిర్మించిన జిన్నా టవర్‌ను అడ్డం పెట్టుకుని ఇప్పుడు నీచ రాజకీయం చేయాలని చూడటం ఆ పార్టీ సంస్కృతిని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. జీవీఎల్ నుంచి విష్ణు వరకు ఆ పార్టీ నేతలందరికీ సోము వీర్రాజు వ్యాఖ్యల తర్వాతే జిన్నా టవర్ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిన్నా టవర్ పేరు మార్చాలని, లేదంటే తామే కూలుస్తామని బీజేపీ నాయకులు మూకుమ్మడిగా విద్వేష విషం చిమ్మడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిగ్గులేని సారా మాటలు మాట్లాడిందేగాక, డైవర్షన్ రాజకీయాలా? అని దుయ్యబట్టారు. చారిత్రక కట్టడమైన జిన్నా టవర్‌ను అప్పట్లో మత సామరస్యం కోసం కట్టారన్నారు. దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. మత ఘర్షణలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో ఉన్న జిన్నా టవర్ గురించి కడపలో ఉండే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్వీట్ చేయడం, దాన్ని సమర్థిస్తూ జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజాసింగ్ వంటి వారు గొంతు కలపడం చూస్తుంటే, ఇదంతా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ పథకం ప్రకారం చేస్తున్న కుట్రగా అర్థం అవుతోందని చెప్పారు. ఏపీలో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నంతకాలం వారి ఆటలు సాగవని చెప్పారు. బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ 2005లో పాకిస్తాన్లో జిన్నా సమాధి వద్ద.. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన లౌకికవాది జిన్నా అని, ఆయన హిందూ–ముస్లింలకు అంబాసిడర్ వంటి వారని మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు అర్థరహితం: ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరులో జిన్నా టవర్‌కు జాషువా, కలాం పేర్లు పెట్టవచ్చు కదా అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా చెప్పారు. బీజేపీ నేతలు ట్విట్టర్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయలబ్ధి కోసమేనని విమర్శించారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల వారు సామరస్యంగా మెలుగుతున్న తరుణంలో విద్వేషాలు సృష్టించేలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. -
చదువుపై అలా... మద్యంపై ఇలా..!!
-
ఆ వ్యాఖ్యలతో ఆ పార్టీ పరువు పోయింది!
-
‘సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా?’
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ దర్శన సమయంలో ఏపీ మంత్రులు ఆళ్ల నాని, నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. చదవండి: చీప్ లిక్కర్ రూ.75, కుదిరితే రూ.50కే.. వాహ్.. ఎంత గొప్ప పథకం: కేటీఆర్ అనంతరం ఆలయ వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా అర్థం కావడం లేదన్నారు. చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం జగన్ ఓ సింహం, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కోటీశ్వరులకు లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు చంద్రబాబు మాట వింటున్నాయన్నారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదని, ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని నారాయణ స్వామి అన్నారు. -
చీప్ లిక్కర్ రూ.75, కుదిరితే రూ.50కే.. వాహ్.. ఎంత గొప్ప పథకం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్‌ను రూ.75కు ఇస్తామని, కుదిరితే రూ.50కే ఇస్తామని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘వాహ్.. ఎంత గొప్ప పథకం.. ఏపీ బీజేపీ అత్యంత నీచ స్థాయికి దిగజారడం ఎంత సిగ్గుచేటు’అని వ్యాఖ్యానించారు. ‘రూ.50కే చీప్ లిక్కర్‌ను సరఫరా చేయాలనే బంపర్ ఆఫర్.. కేవలం పార్టీకి అత్యంత నిరాశాజనక పరిస్థితులున్న రాష్ట్రాలకే బీజేపీ జాతీయ విధానం పరిమితమా?’అని ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నించారు. -
రాజకీయాల్లో టీడీపీకి నీతి నిజాయితీ ఉన్నాయా?
సాక్షి, అమరావతి: బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మధ్యలో వదిలేసి కాంగ్రెస్‌తో కలిసిన టీడీపీకీ రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉన్నాయా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. బుధవారం పార్టీ సహచరులతో కలిసి విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియా కొడుకు పక్కకు తోసేస్తున్నా చంద్రబాబు వెళ్లి ఆయన భుజం మీద చెయ్యి వేసిన ఘటనను కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో అప్పట్లో అందరూ చూశారని వీర్రాజు చెప్పారు. మామ మీద ఓ పోటు, వేటు వేసి అధికారంలోకి వచ్చిన వాళ్లకు బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తుతో, వాజ్‌పేయి గ్లామర్‌తో 1999లో చంద్రబాబు గెలిచారని చెప్పారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఆయనతోపాటు బీజేపీ ఓటమికి కారణమయ్యారన్నారు. 2014లో మరోసారి మోదీ హవాతోనే చంద్రబాబు గెలిచారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి 2019లో ఓడిపోయారని గుర్తుచేశారు. ఇక దూకుడుతో కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని.. రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా దూకుడు ప్రదర్శిస్తుందని వీర్రాజు చెప్పారు. సీపీఐ ఒక పార్టీనేనా అని ప్రశ్నించారు. చందాలు వసూలు చేసుకుంటూ రామకృష్ణ జీవిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మద్యం ధరలపై మాట్లాడిన మాటలకు వివరణ ఇస్తూ.. పేదల పక్షాన, మహిళా తల్లుల పక్షాన తాను అలా మాట్లాడానని చెప్పారు. మద్యం తాగడాన్ని ప్రోత్సహించాలని, వాళ్లతో తాగిపించాలని మాట్లాడలేదన్నారు. చిన్న వీక్నెస్ను అడ్డంపెట్టుకొని వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మద్యం రేటు తగ్గిస్తే ఒక సీసా తాగే వారికి నెలకు రూ.6 వేలు, రెండు సీసాలు తాగే వారికి రూ.12 వేలు ఇచ్చినట్టు అని చెప్పారు. ఫుల్ గ్లాస్ టీనే కావాలి.. బీజేపీ–జనసేన పొత్తుపై వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికీ పొత్తునే కోరుకుంటున్నామని, కాకపోతే ఫుల్ గ్లాస్ టీ కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకూడదనే టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు తాము ఒకరికి అనుకూలం, మరొకరికి వ్యతిరేకం అంటూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని చెప్పారు. -
సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ కామెంట్లపై కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లిక్కర్‌పై మంగళవారం చేసిన కామెంట్స్‌పై పెద్ద దుమారం రేగుతోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్‌ను 50 రూపాయలకే ఇస్తామంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2024లో బీజేపీకి ఓటు వేయాలని కోరుతూ.. తాము అధికారంలోకి వస్తే ముందుగా ఒక్క క్వార్టర్ సీసాను రూ.75కే ఇస్తామని ఇంకా కుదిరితే రూ.50కే విక్రయిస్తామని అని సోము వీర్రాజు ప్రకటించారు. కాగా సోము వీర్రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో లిక్కర్ ఫర్ ఓటు అంటూ క్యాంపెయిన్ నడుస్తోంది. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా సోము వీర్రాజుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో 50 రూపాయిలకే చీప్ లిక్కర్ ఇస్తామనడం.. బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. అధికారం కోసం ఇంత దిగజారుతారా అంటూ ప్రశ్నించారు. ‘వావ్ వాటే స్కీమ్.. వాటే షేమ్.. 50 రూపాయలకే చీప్ లిక్కర్ అనే బంపరాఫర్ బీజేపీ జాతీయ విధానమా? లేక కేవలం బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలకి మాత్రమేనా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే.. చదవండి: అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ నజర్.. బీపాస్’తప్పనిసరి.. బైపాస్ లేదు! Wah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNu — KTR (@KTRTRS) December 29, 2021 -
బీజేపీపై బాబు గ్యాంగ్ పెత్తనం
సాక్షి, అమరావతి: దుష్టశక్తి లాంటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నయవంచక క్రీడలో బీజేపీ పావుగా మారడం జాలి కలిగిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభ టీడీపీ అనుబంధ విభాగం కార్యక్రమాన్ని తలపించిందని ఎద్దేవా చేశారు. తటస్థుల ముసుగులో చలసాని శ్రీనివాస్, గరుడ పురాణం శివాజీ లాంటి ఐదారుగురిని తయారు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు సీపీఐ, జనసేన, కాంగ్రెస్, బీజేపీతో తోలు బొమ్మలాట ఆడిస్తున్నారని మండిపడ్డారు. మాటకు కట్టుబడి జనరంజక పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను సార్వత్రిక ఎన్నికల కంటే 15 శాతం అధికంగా ఓట్లతో ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఆశీర్వదించారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బీజేపీపై ఆ ఇద్దరు ఎంపీల పెత్తనం.. చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ దళపతులు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ పంచన చేరి టీడీపీని కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే సుజనా చౌదరిని ప్రధాని మోదీ వద్దకు రాయబారానికి పంపారు. చంద్రబాబు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలిసిన ప్రధాని మోదీ ఆయన్ను మినహా మిగతావారిని బీజేపీలో చేర్చుకోవడానికి సిద్ధమని చెప్పారట. సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపి మిగతా వారంతా త్వరలోనే వస్తారంటూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారు. మరోవైపు జనసేన, సీపీఐ, కాంగ్రెస్‌లతోనూ అంటకాగుతూ 2024లో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని పథకం వేశారు. టీడీపీ నుంచి వెళ్లిన ఆ ఇద్దరు ఎంపీలు బీజేపీపై పెత్తనం చేయడం ఏమిటి? రూ.50కే చీప్ లిక్కర్ మీ విధానమా? సోము వీర్రాజు ప్రసంగం స్క్రిప్ట్ అంతా టీడీపీ కార్యాలయంలోనే తయారైంది. బీజేపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన చీప్ లిక్కర్ రూ.50కే అందిస్తామని సోము వీర్రాజు హామీ ఇవ్వడం ఆ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ట. తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నట్లుగా ఇదే బీజేపీ జాతీయ విధానమా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తారా? బీజేపీతో అంటకాగి హోదాకు సమాధి బీజేపీతో అంటకాగి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు ప్యాకేజీ ముద్దు అంటూ ప్రత్యేక హోదాకు సమాధి కట్టారు. చంద్రబాబు ప్యాకేజీని కోరినందున ప్రత్యేక హోదాపై తమ బాధ్యత లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎందుకు పోరాడదని ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న బీజేపీ నేతలే దానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాడాలంటున్నారు. ఇదెక్కడి చోద్యం. అధికారంలో ఉండగా పేదల ఇళ్ల రుణంపై వడ్డీ మాఫీ చేసేందుకు కూడా నిరాకరించిన చంద్రబాబు ఇప్పుడు ఓటీఎస్ పథకంపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. రాజధాని, ఇంగ్లిషు మీడియం, సినిమా టికెట్లు, ఉద్యోగ సంఘాలతో చర్చల వరకూ అన్ని అంశాల్లోనూ ఇదే రీతిలో చంద్రబాబు బురద చల్లుతున్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాలతో రాష్ట్రాలు బతుకుతున్నాయని బీజేపీ నేతలు మాట్లాడటం దారుణం. కేంద్రం అమలు చేసే పథకాలకు ఎక్కడా ప్రధాని, ఇతర నేతల పేర్లను తొలగించడం లేదు. బీజేపీకి విశాఖ కావాలా.. వద్దా? విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని కావాలా? వద్దా? అన్నది తేల్చి చెప్పాకే ఉత్తరాంధ్రలో బీజేపీ ఉద్యమం చేయాలి. అమరావతిని కుంభకోణాల రాజధానిగా అభివర్ణించింది బీజేపీ నేతలే. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కూడా వారే. ఓ 400 మంది చందాలు వసూలు చేసి నిర్వహిస్తున్న అమరావతి ఆందోళనకు అలాంటి బీజేపీ మద్దతివ్వడం శోచనీయం. చంద్రబాబైతే రాధాకు భద్రత కల్పించేవారా? తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని ఇటీవల ఒక సభలో వంగవీటి రాధా అనుమానం వ్యక్తం చేశారు. ఆ సభలోనే ఉన్న మంత్రి కొడాలి నాని ఈ అంశాన్ని సీఎం వైఎస్ జగన్‌కు తెలియజేయడంతో 2+2 భద్రత కల్పించాలని ఆదేశించారు. దీనిపై సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను ఆదేశించారు. అయితే తనకు భద్రత వద్దని వంగవీటి రాధా చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రాధాకు ఈ స్థాయిలో భద్రత కల్పించేవారా? బాధ్యతగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాయడం ఆశ్చర్యకరం. చదవండి: నాడు ‘పార్టీలేదు బొక్కాలేదు’.. నేడు చంద్రబాబు గుట్టు రట్టు చేసిన అచ్చెన్న -
అధికారం కోసం ఇంత దారుణానికి దిగజారుతారా ??
-
‘చంద్రబాబు వద్దన్నాడనే ప్రత్యేక హోదా ఇవ్వలేదు’
విజయవాడ: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా వద్దన్నాడనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు వద్దన్నాడనే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. బహిరంగ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘అమరావతిని సింగపూర్, జపాన్ చేస్తా అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ప్రజల డబ్బుతో చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు. ప్రత్యేక హోదా అంటున్నారు...ఎందుకు వద్దన్నాడో చంద్రబాబుని అడగండి. చంద్రబాబు ప్రత్యేకహోదా వద్దు... ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. చంద్రబాబు వద్దన్నాడని ప్రత్యేక హోదా ఇవ్వలేదు’ అని తెలిపారు. -
సోము వీర్రాజు సంచలన ప్రకటన..
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాలలో ఉండను అన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘‘42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఏపీలో బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.. నేను పదవులు ఆశించి పని చేయలేదు. నాకు సీఎం అవ్వాలని లేదు’’ అన్నారు. (చదవండి: టీడీపీ నేతతో బీజేపీ మంతనాలు) ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘‘2014 ఎన్నికల సమయంలోనే నాకు రాజమండ్రి సీటుతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారు. కానీ నేను ఇష్టపడకపోతే ఆకుల సత్యనారాయణకి అవకాశం దక్కింది. నేను బీజేపీ కార్యకర్తని... పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నాను. డిసెంబర్ మూడున ‘దివ్య కాశీ.. భవ్య కాశీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాశీ క్షేత్రం రూపురేఖలను ప్రధాని మోదీ పూర్తిగా మార్చారు.. కాశీ క్షేత్రం అభివృద్ది కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించే సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని అన్ని మండలాలలో స్క్రీన్ ల ద్వారా ప్రదర్శిస్తాం’’ అని తెలిపారు చదవండి: విభజన హామీలు నెరవేర్చమంటే ఎదురు దాడేంటి? -
వరద బాధితులకు అండగా నిలవండి
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నందున ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఆయా ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. వరద ప్రభావిత జిల్లాలోని పార్టీ నాయకులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారని పార్టీ మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు అధికంగా ఉన్న చోట వాగులు పొంగి, గ్రామాలు నీళ్లలో ఉన్నాయని.. ఈ ఆపద సమయంలో ఇబ్బందిలో ఉన్న వారికి అందరం చేయూతనిద్దామని నాయకులకు సూచించారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేయడానికి వేగంగా స్పందించాలని డిమాండ్ చేశారు. వర్షాలకు కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లను అధికారులు ముందుగా గుర్తించి, అలాంటి ఇళ్లలో ఉండేవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. -
విభజన హామీలు నెరవేర్చమంటే ఎదురు దాడేంటి?
బద్వేలు అర్బన్: విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను నెరవేర్చమని అడిగితే.. వాటికి సమాధానం చెప్పకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎదురు దాడికి దిగి వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపర్చిన అం శాలను నెరవేరిస్తే బీజేపీకి మద్దతు ఇస్తామని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పాలని అడిగిన తనకు బీజేపీ నేతల నుంచి సమాధానం వస్తుందని ఆశించానని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా వీర్రాజు ఎదురు దాడి చేస్తూ తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు,నాగార్జున మాట్లాడారు. -
వారికి ఓట్లు అడిగే అర్హత లేదు: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం నేరుగా ప్రజలకు అందుతోందన్నారు. రైతుల కోసం అనేక పథకాలు పెట్టామని తెలిపారు. ప్రజల ముందుకెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతాం. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అవగాహన లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు.. ప్రభుత్వం మీద నిందారోపణలు చేస్తున్నారని అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: డీఎల్‌పై మండిపడ్డ మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు -
టీడీపీ నేతతో బీజేపీ మంతనాలు
కాశినాయన/బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెంకటరెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, బద్వేలు బీజేపీ అభ్యర్థి పి.సురేష్ ఆదివారం మంతనాలు జరిపారు. వెంకటరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. అయితే బీజేపీలో చేరేందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీ ప్రచార రథాల ప్రారంభం బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సోము వీర్రాజు అన్నారు. బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ ప్రచార రథాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఏర్పాటు చేసి అందుకు తగ్గట్టుగా గ్రామీణ రహదారులను కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేశారన్నారు. రాయలసీమ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లు, నాలుగు లేన్ల రహదారులు నిర్మించిందన్నారు. నికర జలాలు ఇచ్చేందుకు కూడా బాధ్యత తీసుకుంటామన్నారు. -
జనసేన పోటీ నుంచి తప్పుకున్నా మేము బద్వేలులో పోటీచేస్తాం
సాక్షి, అమరావతి బ్యూరో: బద్వేలు ఉప ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థిని నిలుపుతామని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవ, సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన గుంటూరులో పర్యటించారు. రక్తదాన శిబిరం, ప్రధాని మోదీ జీవిత విశేషాలు తెలిపే ఫొటో ఎగ్జిబిషన్, పోస్టుకార్డుల ద్వారా మోదీకి ధన్యవాదాలు తెలపటం, చర్మకారులకు ట్రంక్ పెట్టెలు అందజేసే కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మిత్రపక్షం జనసేన పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించినప్పటికి తాము పోటీ చేస్తామని, బద్వేలు పోరులో సహకరించమని జనసేన పార్టీని కోరతామన్నారు. ఉప పోరు తర్వాత తమ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పారు. టీడీపీ కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది కదా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ‘ఓ పార్టీ తిరుపతిలో పోటీ చేస్తుంది.. జెడ్పీ ఎన్నికలు వచ్చేసరికి బహిష్కరిస్తున్నామని ప్రకటిస్తుంది. ఆ విధానమేంటో అర్థం కావట్లేదు’ అంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. -
‘బద్వేలు బరిలో బీజేపీ’
కడప కోటిరెడ్డి సర్కిల్: బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలో పోటీచేయాలని జనసేనను అభ్యర్థించామని, ఆపార్టీ అధ్యక్షుడు పవన్ విముఖత చూపారని అందుకే బీజేపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నామన్నారు. అభ్యర్థి విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వానికి కొన్ని పేర్లు పంపించినట్లు్ల చెప్పారు. -
సోము వీర్రాజు లేఖ బాబు స్క్రిప్టే
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాసిన లేఖ చంద్రబాబు అందించిన స్క్రిప్టులా ఉందని పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవో 217 వల్ల నష్టమేంటో చంద్రబాబు, వీర్రాజు చెప్పాలని డిమాండ్ చేశారు. వీర్రాజు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందన్నారు. రాజకీయ కుట్రతోనే మత్స్యకారులపై టీడీపీ, బీజేపీ కపట ప్రేమ చూపుతున్నాయని ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీ తెరచాటు బంధాన్ని ఇంకెంత కాలం కొనసాగిస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్టు డ్రామాలు ఆడొద్దని వీర్రాజుకు హితవు పలికారు. బాబు చెప్పినట్లు వింటే స్థాయి దిగజార్చుకున్న వారవుతారని సూచించారు. బాబు పేరెత్తితే.. మత్స్యకారుల రక్తం మరిగిపోద్ది మత్య్సకారులను చంద్రబాబు ఏ స్థాయిలో మోసం చేశారో అందరికీ తెలుసని మంత్రి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు పేరెత్తితే మత్య్సకారులందరి రక్తం మరిగిపోతుందన్నారు. ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేకపోవడానికి కారణాలేమిటని సూటిగా ప్రశ్నించారు. 217 జీవో వల్ల నష్టమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ జీవో నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితమని, మిగతా జిల్లాల వారెవరూ ఈ జీవోపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఆ జిల్లాలోని 27 ట్యాంకులకు బహిరంగ వేలం నిర్వహించి తద్వారా వచ్చిన డబ్బును ఒక్కో మత్స్యకారుడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించే దిశగా ప్రయత్నం జరుగుతోందన్నారు. దీన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, ట్యాంకులు అమ్మేస్తున్నట్టు అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి అప్పలరాజు తెలిపారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణంలో చేపలు అమ్మేందుకు మినీ రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా అమ్ముకునేలా మత్స్యకార మహిళలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో నాలుగింటికి మరికొద్ది రోజుల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. తీర ప్రాంతంలో మత్స్యకారులందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. -
‘సీఎం జగన్ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారు’
-
‘సీఎం జగన్ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారు’
సాక్షి, విజయవాడ: వినాయక చవితి పండగపై టీడీపీ, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయి అని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఇక్కడ కూడా అవే అమలు చేస్తున్నాం అని కొడాలి నాని తెలిపారు. ఏపీలో అడ్రస్ లేని బీజేపీ రాజకీయం చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది అంటూ కొడాలి నాని మండి పడ్డారు. (చదవండి: పని కట్టుకుని ఇన్ని అబద్ధాలా?) సోము వీర్రాజుకి విగ్రహాలతోనూ వినాయక చవితితోను రాజకీయం చేయడం అలవాటే అన్నారు కొడాలి నాని. తుప్పు చంద్రబాబు.. పప్పు లోకేశులు వినాయక చవితిపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళిద్దరికీ శవం ఎక్కడ దొరుకుతుందో అని ఎదురుచూస్తున్నారు.. కరోనాతో ప్రజలకి ఇబ్బంది వస్తే రాజకీయం చేయడం కోసం ఇప్పుడు ఈ డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారు అని కొడాలి నాని స్పష్టం చేశారు. చదవండి: ఉన్నది ఉన్నట్లుగా రాయండి -
మతాల మధ్య బీజేపీ చిచ్చు
సాక్షి, అమరావతి: బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఆదేశాలతోనే వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని.. కానీ, ఆయనపై మతం ముద్ర వేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు హిందూ మతంపై గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారని.. కానీ, ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. వినాయక చవితి చేసుకోవద్దని తాము చెప్పలేదని.. దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పండుగల విషయంలో కేంద్రం ప్రభుత్వమే మార్గదర్శకాలిచ్చిందని.. వాటిని మార్చమని సోము వీర్రాజు అదే కేంద్రాన్ని అడగాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. వీటిని జారీచేసిన కేంద్ర ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోమని చెప్పామని.. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చెయ్యొద్దని ఆయన కోరారు. పెద్ద పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు పెట్టకూడదని మాత్రమే సూచించామన్నారు. ప్రజలు బీజేపీకి ఓట్లు వేయలేదు కాబట్టి, ఏపీ ప్రజలకు ఏమైనా పర్వాలేదన్నది బీజేపీ విధానమా? అని కూడా మంత్రి ప్రశ్నించారు. కోవిడ్ వేళ ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఏమిటన్నారు. మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే కేసులే.. పండుగలకు సంబంధించి.. కేంద్రం ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో.. ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, ఆఖరికి బీజేపీ నేతలు వ్యవహరించినా వారి మీద కూడా కేసులు పెడతామని వెలంపల్లి హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహంలేదని స్పష్టంచేశారు. కోవిడ్ కాలంలోనే కుంభమేళాకు అనుమతిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. హిందూ మతం మీద ప్రేమ, గౌరవం బీజేపీకి ఉంటే.. చంద్రబాబు హయాంలో విజయవాడలో 50 పురాతన దేవాలయాలు కూల్చివేసినప్పుడు, గోదావరి పుష్కరాల్లో 30 మంది అమాయక భక్తుల్ని పొట్టనపెట్టుకున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ ధర్నాలు చేయాల్సింది రాష్ట్రంలోని కలెక్టరేట్ల ముందు కాదని.. మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర హోంమంత్రి కార్యాలయం ముందో లేదా కేంద్ర ప్రభుత్వం ముందో చేయాలని మంత్రి వెలంపల్లి సవాల్ చేశారు. -
వినాయక చవితి చేసుకోవద్దని మేం చెప్పలేదు: వెల్లంపల్లి
-
మతాల మధ్య సోము వీర్రాజు చిచ్చు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఆదేశాలతో వినాయక చవితి వేడుకలపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని మంత్రి అన్నారు. బీజేపీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారని, ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. ‘‘వినాయక చవితి చేసుకోవద్దని మేం చెప్పలేదు. దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మతం ముసుగులో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై మతం పేరుతో బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకే గణేశ్ ఉత్సవాలపై నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. గైడ్‌లైన్స్ మార్చమని కేంద్రాన్ని అడగండి. కుల,మతాల రాజకీయాలు చేసే ప్రభుత్వం మాది కాదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోమని చెప్పాం. దయ చేసి ప్రజలను రెచ్చగొట్టొదు. వినాయక చవితి అందరి పండుగ పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు పెట్టకూడదని మాత్రమే సూచించాం. మత విద్వేషాలతో లబ్ధి పొందాలని చూడొద్దని’’ మంత్రి హితవు పలికారు. ఇవీ చదవండి: కేంద్రం సూచనలతోనే ఏపీలో ఆంక్షలు: నరసింగరావు నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు! -
అసత్య ప్రచారాలు ఆపు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాల మేరకే అన్ని మతాల పండుగలు, కార్యక్రమాలకు ఒకే రకమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 28న కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో నాలుగో పేరా ప్రకారం బహిరంగ ప్రదేశాలలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టంగా ఉందన్నారు. ఆ మార్గదర్శకాలను ఒకసారి చదువుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సూచించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే సోము వీర్రాజు నిలదీయాల్సింది కేంద్రాన్ని అని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలిసి కూడా సోము వీర్రాజు అసత్యాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల గురించి తెలుసుకోకుండా, కరోనా థర్డ్ వేవ్ ముప్పును పట్టించుకోకుండా ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధిస్తున్నామంటూ అసంబద్ధమైన కార్యక్రమాలను తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బహిరంగ ప్రదేశాలు, పందిళ్లలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వడం లేదని వివరించారు. రానున్న పండుగ సీజన్లో జనం పెద్దసంఖ్యలో గుమిగూడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సిగ్గుందా?.. పచ్చి అబద్ధాలు ‘సోము వీర్రాజుకు అసలు సిగ్గు ఉందా? ఆలయాల్లో కూడా పండుగ నిర్వహించకూడదని ప్రభుత్వం చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో పండుగ వేడుకలు నిర్వహించకూడదని కేంద్రం స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేస్తే ఇక్కడ రాద్ధాంతం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను మీరే ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. కావాలంటే అలాంటి ఆదేశాలు ఎందుకు జారీ చేశారని కేంద్రాన్నే ప్రశ్నించాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన కరోనా వ్యాక్సిన్లు, ఇతర నిధుల గురించి సోము వీర్రాజు ఏనాడూ మాట్లాడలేదన్నారు. కరోనా కట్టడి కోసమే.. కరోనాను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని వాయిదా వేసిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించిందన్నారు. ఆదివారం గురు పూజోత్సవ కార్యక్రమాలను కూడా రద్దు చేసిందని వివరించారు. కరోనా కట్టడి కోసం, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసమే ఈ చర్యలు తీసుకుందన్నారు. ఎవరా స్వామీజీ? ‘ఎవరో శ్రీనివాసానంద సరస్వతి స్వామి అట.. అసలు ఆయన ఎవరో తెలియదు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా తెలియదు. దారినపోయే స్వామీజీలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నించడం సరి కాదు’ అని మల్లాది విష్ణు సూచించారు. -
బీజేపీ నాయకులు రావాల్సిన నిధులపై మాట్లాడరే : మల్లాది విష్ణు
-
బీజేపీ నాయకులు రావాల్సిన నిధులపై మాట్లాడరే : మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: పండుగల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేయడం తగదని బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విష్ణు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రమే తెలిపిందని, మరి అటువంటప్పుడు దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు. కరోనాతోనే వైఎస్సార్ అవార్డులు, ఉపాధ్యాయ దినోత్సవం వాయిదా వేశామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రజలను అనుమతించ లేదని చెప్పారు. ప్రజల మేలు కోసమే పండుగల ఇళ్లలో చేసుకోవాలని సూచించామని స్పష్టం చేశారు. అన్ని పండుగలకు పోలీసులు ప్రజలు గుమికూడకుండా చూస్తున్నారని వివరించారు. వ్యాక్సిన్లు, కోవిడ్ టెస్టులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడరని మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదని విమర్శించారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
20,21 తేదీల్లో బీజేపీ పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయంగా టీడీపీ బలహీనంగా ఉందని, ఈ నేపథ్యంలో ఆ పార్టీ మండల నేతలను స్వయంగా కలిసి బీజేపీలోకి ఆహ్వానించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. టీడీపీ నేతలను ఆకర్షించాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నెల 20, 21 తేదీల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో కనీసం 500 గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. 18,19 తేదీల్లో తిరుపతి, విజయవాడలో సభలు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు ఈనెల 18,19 తేదీల్లో తిరుపతి, విజయవాడలో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి ఆ సభలలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి సోమవారం ’స్పందన’లో ప్రజల సమస్యలను పార్టీ పరంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నేతలు సునీల్ థియోధర్, మధుకర్జీ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో 50 కోట్ల మందికి వ్యాక్సిన్
సాక్షి, విశాఖపట్నం: జూలై నాటికి దేశంలో లక్ష్యానికి మించి వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విశాఖ పట్నంలోని చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం ఆమె పరిశీలించారు. అనంతరం నర్సీపట్నం నియోజకవర్గం కేడీ పేటలో విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు సమాధి వద్ద పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుంచి కశింకోట మండలం తాళ్లపాలెంలో పీడీఎస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం పథకం కింద లబ్ధిదారులందరికీ సక్రమంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్‌ను పంపిణీ వ్యవస్థపై వివరాలడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తోందని తెలిపారు. రానున్న రెండునెలల్లో వ్యాక్సిన్ల సరఫరా పెరుగుతుందన్నారు. దేశీయంగా సరఫరా పెంచడంతోపాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వివరాలను కలెక్టర్ ఎ.మల్లికార్జున మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 2.36 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారని, వారిలో 1.74 కోట్ల మందికి మొదటిడోస్, మిగిలినవారికి రెండు డోస్‌లు వేసినట్లు చెప్పారు. జిల్లాలో 22 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా అందులో 17 లక్షల మందికి మొదటిడోస్, 5 లక్షల మందికి రెండు డోసులు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీలు గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌గణేష్, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, జాయింట్ కలెక్టర్లు వేణుగోపాలరెడ్డి, అరుణ్‌బాబు, ఆర్డీవో సీతారామారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. అరకు కాఫీ రుచిని ఆస్వాదించిన కేంద్రమంత్రి కొయ్యూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఏర్పాటు చేసిన తేనేటి విందుకు హాజరయ్యారు. అరకు కాఫీ రుచిని ఆస్వాదించారు. కృష్ణదేవిపేటలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమా«ధిని దర్శించి నివాళులర్పించిన మంత్రి అనంతరం అక్కడే ఉన్న ఎంపీ మాధవి అత్తగారి ఇంటికి వచ్చారు. అక్కడ అరకు కాఫీ తాగారు. ఈ సందర్భంగా మన్యం ప్రత్యేకతను, ఇక్కడి వాతావరణ పరిస్థితులను, గిరిజనుల జీవనశైలిని ఎంపీ వివరించారు. ఆమె వెంట రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా ఉన్నారు. -
వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు: విష్ణువర్ధన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై ఆదివారం బీజేపీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ ప్రాజెక్టు కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందన్నారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలను ప్రభుత్వం పరిష్కరించాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. -
సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావు: బాలినేని
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు మాట్లాడటం సరికాదు అని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కోవిడ్ ప్రభావంతో అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు క్షీణించాయని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. సోము వీర్రాజు ఎందుకు మాట్లాడలేదని బాలినేని ప్రశ్నించారు. జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ఉన్నాయని ఆయన మండి పడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి వుంటే... జలవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలి అని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు. -
బీజేపీ నేతల యాత్రలు పెద్ద డ్రామా
సాక్షి, అమరావతి: బీజేపీ నేతల మత రాజకీయాలతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో కలసి ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆలయాల సందర్శన పేరుతో డ్రామా యాత్రలకు ఎవరి మెప్పు కోసం తెరదీశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజుకు విష్ణు పలు ప్రశ్నలను సంధించారు. ► వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక తెలుగుదేశం హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాల పునర్నిర్మాణం చేపట్టారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి ఇవ్వకముందే.. ధర్నా చేయడం ఏమిటి? ► 2016లో కృష్ణాపుష్కరాల సమయంలో చంద్రబాబు హయాంలో శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన ఆలయాల మొదలు చిన్న ఆలయాల వరకు కూల్చివేశారు. ఆనాడు సోము వీర్రాజు ఎందుకు నోరు మెదపలేదు? ► తిరుమలలో పోటు గదులను మూసివేసి వాటిలో తవ్వకాలు జరిపారు. దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు. అర్చకులకు వంశపారంపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని అవమానించారు. అప్పుడేమయ్యారు? ► చంద్రబాబు హయాంలో వేధింపులు తట్టుకోలేక అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరావతి సదావర్తి భూములతో సహా.. దేవాలయాల భూములను మింగేశారు. ఇవన్నీ మీ భాగస్వామ్యంలో జరగలేదా? ► తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా.. కనీసం స్పందించలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణకు నిదర్శనం కాదా? -
టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు తగదు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణంలో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలనే మునిసిపాలిటీ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ధర్నా అనంతరం సోమువీర్రాజు విలేకరులతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హిందూ మతానికి వ్యతిరేకంగా, ముస్లిం, క్రైస్తవ మతాలకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పాలనను ముందుకు సాగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. తిరుపతి నుంచి రూ. 5 వేల కోట్లు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం దారుణమని అన్నారు. కలెక్టర్ అనుమతి లేకుండా విగ్రహాన్ని ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. విగ్రహం ఏర్పాటు కోసం చేసిన శంకుస్థాపనను, మున్సిపల్ తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. బీజేపీ నేతల అరెస్టు.. ధర్నా అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి మైదుకూరు రోడ్డు వరకు ర్యాలీగా వెళ్లేందుకు సోమువీర్రాజు, బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. శంకుస్థాపన చేసిన స్థలం వద్దకు వెళ్తే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతాయని ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు బీజేపీ నాయకులకు తెలిపారు. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినా వారు వినిపించుకోలేదు. ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఒకానొక దశలో బీజేపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బీజేపీ నేతలందరినీ పోలీసులు అరెస్టు చేశారు. సోమువీర్రాజును కడపకు తరలించగా ఇతర నేతలను ఎర్రగుంట్ల, చాపాడు, మైదుకూరు పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, రాష్ట్ర కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల వేళ కూల్చేసిన ఆలయాలన్నీ తిరిగి నిర్మించాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/నరసరావుపేట రూరల్ : పుష్కరాల సమయంలో కూల్చి వేసిన ఆలయాలన్నింటినీ తిరిగి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఇంద్రకీలాద్రి నుంచి ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కృష్ణానది తీరంలో కూల్చివేసిన ఆలయ ప్రాంతాలను, ప్రభుత్వం ఇటీవల నిర్మాణం చేపట్టిన నాలుగు ఆలయాలను వారు పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆలయాలు నేలమట్టమై, అంతర్వేది రథం దగ్ధమై, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమై చాలా కాలమైందన్నారు. అయినా ఈ ఘటనలకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత పోస్ట్‌లు ఒక వర్గానికే దక్కాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ మర్చిపోయారని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. తిరోగమనంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని త్రికోటేశ్వరస్వామిని కోరుకున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. -
ఎవరెన్ని కుట్రలు పన్నినా సంక్షేమ పథకాలు ఆపం: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు, పవన్‌తో కుమ్మక్కై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సంక్షేమ పథకాలు ఆపం అని తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. దుర్గ గుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.70 కోట్లు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. -
మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు సోమువీర్రాజు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో భేటీ కానున్నారు. అనంతరం పలువురు బీజేపీ అధిష్టాన పెద్దలను కూడా కలవనున్నారు. కాగా, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదంటు సోము వీర్రాజు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: రాజకీయంగా ఏ అంశంలోనూ తెలుగుదేశం పార్టీతో కలిసేదేలేదని బీజేపీ రాష్ట్ర శాఖ మరోసారి స్పష్టం చేసింది. చంద్రబాబు ఎన్ని కుయుక్తులకు పాల్పడినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎట్టి పరిస్థితులలో జరగదని తేల్చి చెప్పింది. ఆదివారం విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పి.మురళీధరన్, జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జి సునిల్ దియోధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శులు పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను ఎమ్మెల్సీ మాధవ్ విలేకరులకు వివరించారు. ఈనెల 21న యోగా దినోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. 28న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వర్చువల్ విధానంలో జరుగుతాయన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చర్చకు వచ్చినట్టు ఆయన తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అడ్డదారిలో ఆస్తి పన్నులు పెంచడం సిగ్గు చేటని, ప్రజలపై పెను భారానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. విశాఖ భూ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయన్నారు. -
మోదీ ప్రధాని కాకూడదని కాంగ్రెస్‌తో కలిసిన వ్యక్తి బాబు
సాక్షి, అమరావతి: బీసీ సామాజిక వర్గానికి చెందిన మోదీ రెండోసారి ప్రధాని కాకూడదని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి బీసీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మోదీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడలో సోము పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఊళ్లో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావుడి అన్నట్టు, ఇప్పుడు కేంద్రానికి మద్దతిస్తానని బాబు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ, వైఎస్సార్సీపీ రెండిటికీ తాము సమదూరంగా ఉంటామన్నారు. -
సమర్థంగా ప్రతిపక్ష పాత్ర
సాక్షి, అమరావతి : బడ్జెట్ సమావేశాలను టీడీపీ బాయికాట్ చేసినా తాము పాల్గొని ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, బడ్జెట్‌పై సోము వీర్రాజు వీడియో సందేశాన్ని పార్టీ శుక్రవారం మీడియాకు విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్న తీరుపై సీఎం సమీక్ష నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో పేర్కొన్న కేటాయింపులతో పాటు గవర్నర్ ప్రసంగంలో చోటు కల్పించిన అంశాలపై తాము శాసన మండలిలో తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు. కరోనా కట్టడితో పాటు రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాకు తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధుల కేటాయింపు జరగలేదన్నారు. రాష్ట్రంలో ఓడరేవులు, పోర్టులపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని సోము వీర్రాజు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు : ఎమ్మెల్సీ మాధవ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్.. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. కోవిడ్ పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. -
హైదరాబాద్‌పై ఏపీకి ఇప్పటికీ సంపూర్ణ హక్కులు
సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దులో అడ్డుకోవడంపై బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అంశాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని కేంద్రానికి లేఖ రాస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌పై ఇప్పటికీ సంపూర్ణ హక్కులున్నట్టు చెప్పారు. అంబులెన్స్‌లను అడ్డుకోవడంతో రెండు నిండు ప్రాణాలు పోయాయని, దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని సోము వీర్రాజు చెప్పారు. -
వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు ముగిసిన తరువాత రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఒకరేమో గెలుపు మనదేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు.. పోలింగ్ నాటికి పార్టీ ప్రభావమే లేకుండా చేశారు. మరొకరు ప్రచారం పీక్ లెవెల్‌కు వెళ్లాక పార్టీ పరువు తీశారు. ఆ ఇద్దరు.. బీజేపీ, టీడీపీల రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, అచ్చెన్నాయుడు. ఈ ఇద్దరికీ పదవీగండం పొంచి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే బీజేపీ ఈ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ విస్తృత సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తోందని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరతామని చెప్పారు. తీరా షెడ్యూల్ వచ్చిన తరువాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దుబ్బాక ఫలితం, జనసేన మద్దతు కలిసివస్తాయని నేతలు భావించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ధిపొందాలని అనేక ఎత్తుగడలు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత వాస్తవికతను గ్రహించిన ఆయన పార్టీ రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు? ఏవిధంగా గెలుస్తామంటున్నారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలకు సీరియస్‌నెస్ లేదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల అనంతరం వీర్రాజుకు పదవీగండం ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. సైకిల్ గాలి తీసిన అచ్చెన్నాయుడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు, లోకేశ్ రెండు వారాలు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలను, సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి్డలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించారు. ప్రచారం పీక్ లెవెల్‌కు చేరిందని భావిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో ఒక్కసారి టీడీపీ సైకిల్ గాలి తీసింది. టీడీపీ బాధితుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆవేదన నిజమేనని, లోకేశ్ సరిగా వ్యవహరించరని ఆ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిసింది. తండ్రీతనయుల శైలిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా వెల్లడించడం, ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు.. బొ.. లేదని స్వయంగా చెప్పడంతో పార్టీ ఒక్కసారిగా డీలాపడింది. 2019 ఫలితాల కంటే తాజా ఎన్నికల్లో టీడీపీ ఓట్లు గణనీయంగా తగ్గనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడికి పదవీగండం తప్పదని చంద్రబాబు సన్నిహితులుగా ఉన్న చిత్తూరు జిల్లా నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు టీడీపీ పెద్దలను నమ్మి మోసపోయినట్లు పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. తనతో సంప్రదించకుండానే అభ్యర్థిగా ప్రకటించారని, పోటీచేయనన్నా నిలబెట్టారని, పోలింగ్ సమీపిస్తున్న సమయంలో పార్టీ పెద్దలు చేతులెత్తేసి అవమానించారని చెప్పి ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. ఇక్కడ చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ఓటమికి కారణాలు వెతుకుతున్న టీడీపీ తీవ్రస్థాయిలో విభేదాలు.. టీడీపీలో సస్పెన్షన్ల కలకలం -
మేము పోటీలో ఉంటాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీని ఎదుర్కోగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందనే మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పార్టీ వైఖరిని తెలియజేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరుతో ఆ పార్టీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ఎన్నికల నుంచి ఎప్పుడూ తప్పుకోదని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలు రాష్ట్రంలో బీజేపీని మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా నమ్ముతున్నారని, ప్రజల కోసం మరింత బాధ్యతగా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను తామే పోషించబోతున్నామని పేర్కొన్నారు. వైద్య పరికరాల స్కామ్‌పై విచారణ వేగవంతం చేయాలి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల కొనుగోలు, నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతిపై సీఐడీ వేగంగా విచారణను పూర్తిచేసి అసలైన దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోము వీర్రాజు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాసినట్టు ఆ పార్టీ శుక్రవారం మరో ప్రకటనలో పేర్కొంది. -
చంద్రబాబు అసమర్థుడు
తిరుపతి అర్బన్: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలనే తాను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తిరుపతి నగరంలోని ఓ హోటల్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకోలేని అసమర్థుడంటూ దుయ్యబట్టారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని, కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ థియోధర్, నేతలు విష్ణుకుమార్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, పార్థసారథి ఉన్నారు. -
ఎమ్మెల్యే కానివాడు సీఎం కుర్చీ ఎక్కుతాడట!
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేన, బీజేపీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ఈ మేరకు.. ‘జరుగుతున్నది తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక, కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడం కాక మరేమిటి?. ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికిలేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: అత్యంత సంపన్న అభ్యర్థి ఆమే! 'గంట'ల పంచాంగం ‘టీడీపీ గెలుస్తోందని ఊదరగొడుతూ ఎన్నికలకు ముందు ఆంధ్రా ఆక్టోపస్ బయలుదేరాడు. ఆక్టోపస్ ఫ్లాప్ షోతో దిగ్గజ విశ్లేషకుణ్ణి పచ్చ మీడియా రంగంలోకి దించింది. ఇప్పుడు విశాఖ నుంచే మరో జోస్యుడు తయారయ్యాడు. అతను తిరుపతి ఉప ఎన్నికల్లో 'గంట'ల పంచాంగం చెబుతున్నాడు’ అని విజయసాయిరెడ్డి మంగళవారం నాటి ట్వీట్లో పేర్కొన్నారు. ‘తిరుపతి పేరు వింటేనే చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మొన్నటి పంచాయతీ, మున్సిపల్ తీర్పుతో వచ్చిన జ్వరం ఇంకా తగ్గక ముందే బై ఎలక్షన్ వచ్చిపడింది. 2లక్షల జనాభా,50 వార్డులున్న కార్పోరేషన్లో ఒక్కటే దక్కింది. మిగిలిన 6 సెగ్మంట్లలో ఇదే దుస్థితి. ఓటమి పగపట్టినట్టు తరుముతోంది’ అని ట్విటర్లో బాబుపై విమర్శలు గుప్పించారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు
తిరుపతి గాంధీరోడ్డు: ప్రత్యేక హోదా అనేదే లేదని.. ఏపీకి అది ఇవ్వడం కుదరదని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చి.. ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరఫున పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ తన జన్మభూమి అని.. కర్ణాటక తన కర్మభూమి అని తెలిపారు. తనకు అవకాశమిస్తే రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తుతానని చెప్పారు. జనసేనకు, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. డబ్బులకు అమ్ముడుపోకుండా ఓటు వేయాలని తిరుపతి ప్రజల్ని కోరారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు, అభివృద్ధికి దగ్గర కావడమే అజెండాగా పనిచేస్తానని చెప్పారు. తిరుపతిలో ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తారని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హోదా వద్దు అన్నది చంద్రబాబే
తిరుపతి, గాంధీరోడ్డు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా కన్నా ప్యాకేజీయే ముద్దు అన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం సోమవీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబే దగ్గరుండి ప్యాకేజీ తీసుకున్నారని తెలిపారు. ఈరోజు అధికారం పోయాక వారి ఎంపీలు హోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అధికార పార్టీ ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందన్నారు. తిరుపతి ఎన్నికల్లో ఇప్పటికే రెండు లక్షల దొంగ ఓట్లను వేసేందుకు ఆధార్ కార్డులు తయారు చేసినట్టు సమాచారం వచ్చిందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ చాలా దొంగ ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు గుర్తించారని వాటిని మీడియా సమక్షంలో చూపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీలో ప్రజలు బీజేపీని గెలిపించకపోయినా బీజేపీ మాత్రం రాష్ట్రంపై ఎప్పుడూ చిన్నచూపు చూడలేదన్నారు. ఇప్పటికే 503 ప్రాజెక్టులను ఎంపిక చేశారని,రూ.8 లక్షల కోట్లు త్వరలోనే ఇవ్వబోతున్నారన్నారు. వలంటీర్ల వ్యవస్థను అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులు, సాగరమాల, కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఎంతో నిధులు ఇచ్చినట్టు చెప్పారు. -
బరిలో ఉమ్మడి అభ్యర్థి
తిరుపతి అర్బన్: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థినే బరిలో నిలుపుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి పేర్కొన్నారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీటీడీకి చెందిన భూములను ధారదత్తంగా విక్రయిస్తున్న యాజమాన్య తీరును అడ్డుకున్నది బీజేపీనే అని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక పాలసీ తప్పుదోవ పడుతోందని విమర్శించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఫేక్ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేశాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇసుక పాలసీని రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇసుకను అందజేయాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగాలను అమ్ముకున్న చంద్రబాబు
నెల్లూరు (బారకాసు): కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్లకు అవసరమైన ఉద్యోగాలను నాలుగైదు లక్షల చొప్పున చంద్రబాబు అమ్ముకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నెల్లూరు నగరంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని 2014లో ప్రజలు చంద్రబాబుకు పట్టంగడితే ఆయనేమో రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేశారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక టీడీపీ తోక ముడిచిందన్నారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన అందిస్తున్నారని చెప్పారు. అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా గెలుపొందిన బీజేపీ మద్దతుదారులను వీర్రాజు సన్మానించారు. -
‘అమిత్‌షాపై రాళ్లదాడి’ టీడీపీ కక్ష సాధింపు కాదా?: సోము
సాక్షి, అమరవతి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేసినప్పుడుగానీ, ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో నల్ల జెండాలు చూపి నిరసన తెలిపినప్పడుగానీ చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసుల జారీపై విలేకరులు సోము వీర్రాజు వద్ద ప్రస్తావించినప్పుడు ‘నేను స్పందించదలుచుకోలేదు’ అంటూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఆ శూన్యత భర్తీ చేసేలా బీజేపీ–జనసేన కూటమికి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. -
‘పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపడం లేదు’
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు నోరెందుకు మెదపడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ, జనసేన పార్టీలకు క్లారిటీ లేదని, అందువల్లే వాళ్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై మమకారం ఉంది కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంతో గట్టి పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసివచ్చే పార్టీలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తామని వెల్లడించారు. పోస్కో సంస్థకు అవసరమైతే కడప, కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్లను తీసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే.. రెండేళ్లలో లాభాల బాట వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
‘సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్ధరహితం’
వైఎస్సార్ కడప: సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్ధరహితమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ అన్నారు. ఆ హోదాలో ఉన్న ఆయన అలా మాట్లాడటం తగదన్నారు. గడికోట శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సోము వీర్రాజు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. అధికారులను వాడుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసని మండిపడ్డారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రజల కోసం ఏర్పాటైన పార్టీ అని, ప్రజల మద్దతు ఉంటేనే ఏకగ్రీవాలు అవుతాయని గుర్తుచేశారు. పోలీసులను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పిన పార్టీ వైఎస్సార్సీపీ అని తెలిపారు. సోము వీర్రాజు కేవలం ఉనికి కోసం మాట్లాడుతున్నారని అన్నారు. చదవండి: చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు చదవండి: 57 మందితో బీజేపీ తొలి జాబితా.. హాట్ టాపిక్‌గా నందిగ్రామ్ -
స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్ వివరించాం: సోము
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. అనంతరం భేటీ వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివరించారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రజల సెంటిమెంటును కేంద్రమంత్రికి వివరించామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే, వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్లు సోము తెలిపారు. అయితే ఏపీ నేతలతో భేటీ అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకారణ చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
చంద్రబాబు హోంకి అవుతావా హోం మంత్రివి?
సాక్షి,అమరావతి: ‘నిన్న ఎవరో ఒకాయన నేనే ఈ రాష్ట్రానికి హోం మంత్రిని అవుతానని అంటున్నాడు. ఎవరికి హోం మంత్రివి అవుతావయ్యా.. చంద్రబాబు హోంకి హోం మంత్రివి అవుతావా’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. టీడీపీకి చెందిన పలువురు మండల స్థాయి నాయకులు గురువారం సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను సీఎం చేసే దమ్ము బీజేపీకే ఉందన్నారు. ఎవర్నో సీఎం చేయడానికి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనుకోవడం లేదని చెప్పారు. -
పాపం సోము వీర్రాజు.. అడ్డంగా బుక్కయ్యాడు
సాక్షి, కృష్ణాజిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై విమర్శలు చేసి తానే అభాసు పాలయ్యారు. వీర్రాజుకాండ్రపాడు గ్రామంలో గురువారం బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభానికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేశారు సోము వీర్రాజు. బీజేపీ కార్యాలయానికి ఇల్లు అద్దెకు ఇచ్చినందుకు ఆ ఇంటి యజమాని పెన్షన్ తొలగించారంటూ ఆరోపించారు. అయితే సోము వీర్రాజు ఆరోపణలో నిజం లేదని ఇంటి యజమాని రాయల బుల్లి తెలిపారు. ‘‘నెల రోజుల కోసమని ఇళ్ళు తీసుకొని ఎనిమిది నెలలైనా బీజేపీ నేతలు ఖాళీ చేయలేదు. నాకు ఇబ్బందిగా ఉంది ఖాళీ చేయమని చెప్పాను. దాంతో రాజకీయ స్వలాభం కోసం నా పెన్షన్‌కు ముడిపెట్టి ఆరోపణలు చేయటం బాధాకరం’’ అని రాయల బుల్లి ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఏం సాధించారని రథయాత్ర) -
ఏం సాధించారని రథయాత్ర
మహారాణిపేట(విశాఖ దక్షిణ): బీజేపీ నాయకులు రథయాత్ర దేనికోసం చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇక్కడి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో విజయవాడలో విగ్రహాలు,ఆలయాలు పడగొడితే అప్పుడు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. అదే విగ్రహాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారని. ఇలాంటి మంచి పనులను బీజేపీ నాయకులు ఎందుకు అంగీకరించరని ప్రశ్నించారు. ► రాష్ట్రంలో రెండు రకాల బీజేపీ నాయకులు ఉన్నారని, ఒకరు నిజమైన బీజేపీ నాయకులని, మరొకరు చంద్రబాబునాయుడు పంపిన నాయకులని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గ్రహించాలని సూచించారు. ► రథయాత్ర ప్రారంభించే ముందు బీజేపీ ఆలోచించాలని, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై బీజేపీ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ► అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినా నేటివరకు విచారణ ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. విశాఖలో రైల్వే జోన్, కర్నూలులో హైకోర్టు, కడప స్టీల్‌ప్లాంటు, వరద నష్టాలకు ఆర్థిక సహాయం వంటివి వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి, అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులకు లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె.రాజు తదితరులు పాల్గొన్నారు. -
సోమువీర్రాజు బాధ్యతగా ప్రవర్తించాలి
అనంతపురం: ఆలయాలపై దాడుల కేసులకు సంబంధించి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై సోమువీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సోమువీర్రాజు స్థాయికి తగదని హితవు పలికారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షడిగా వ్యవహరిస్తున్న ఆయన.. బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం డీజీపీ చేసిన తప్పా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసు వ్యవస్థ తమ పని తాము చేసుకుంటూ పోతుంటే.. ప్రతిపక్ష పార్టీలు ఏకంగా డీజీపీనే టార్గెట్ చేయడం వారి బరితెగింపుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దుష్టశక్తులు ఎంతటివారైనా వదిలపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆలయాలపై దాడులకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబాబు రాష్ట్రంలో మనుగడ అసాధ్యమని తెలిసి మతి భ్రమించి వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్మోహన్రెడ్డికి మంచి పేరు రాకూడదనే చంద్రబాబు ఆధ్వర్యంలోని దుష్టశక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ రథయాత్రపై స్పందిస్తూ.. యాత్రలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని పేర్కొన్నారు. -
సోము వీర్రాజు.. కన్నాలా వ్యవహరించకు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులకు అభివృద్ధిపై శ్రద్ధ లేదు.. మతం గురించి మాట్లాడే సోము వీర్రాజు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడరు అంటూ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. బీజేపీలో రెండు వర్గాలు ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కాగా.. మరొకటి టీడీపీ బీజేపీ అంటూ ఆ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రముఖులు విశాఖలో సమావేశం కావడం సంతోషకరమైన విషయంగా భావించాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని ఆశించాం. కానీ మూస ధోరణిలో మతం గురించి చర్చించారు. పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు రథయాత్ర చేస్తామన్నారు.. అది ఎందు కోసం చేస్తున్నారు. అంతర్వేది ఘటనపై ప్రజలు కోరిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ ఎందుకు ఇప్పటి వరకు విచారణ ప్రారంభించ లేదు’ అన్నారు ‘ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరు ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నాయకులు.. మరొకరు చంద్రబాబు నాయుడు పంపిన బీజేపీ నాయకులు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ చంద్రబాబు అజెండా చదివి పదవి కోల్పోయారు. ఇప్పుడు బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల వలలలో మీరు పడొద్దు. రాముడు అందరి దేవుడు. ఆయనని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. గతంలో అద్వానీ ప్రతి పక్షంలో రథయాత్ర చేస్తే అందరూ సహకరించారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉండగా రథయాత్ర ఎందుకోసం చేయాలి. మీరు పద్దేనిమిది నెలల్లో ఏపీ కోసం కేంద్రం నుంచి ఏం ప్రాజెక్టులు తీసుకువచ్చారో.. రథయాత్ర ప్రారంభించడానికి ముందు ఆలోచించండి. మేనిఫెస్టో అంశాలపై ఆత్మ విమర్శ చేసుకోండి’ అన్నారు. (చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!) ‘సీఎం జగన్ పాలనలో దేవాలయాల విషయంపై రాజీ పడే పరిస్థితి లేదు. నిందితులపై చర్యలు కఠినంగా వుంటాయి. చంద్రబాబు హయాంలో దాడులపై మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు అనవసర విమర్శలు చేస్తున్నారు. దేవాలయాల పునరుద్ధరణకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం మీరు గుర్తించరా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్న విషయం గమనించండి’ అని కోరారు.