వంశధార రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు
హిర మండలం: ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ పాలన వల్లే వంశధార నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. ‘జలం కోసం జన పోరు యాత్ర’ పేరుతో ప్రాజెక్టుల సందర్శనకు బీజేపీ నాయకులు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం హిరమండలంలోని వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు ఇంజనీరింగ్ అధికారుల నుంచి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 91 శాతం పనులు పూర్తయ్యాయని.. మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు వారికి చెప్పారు. అనంతరం జరిగిన సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో 10 ప్రాజెక్టులను సందర్శిస్తామని చెప్పారు. చంద్రబాబు విఫలమవ్వడం వల్లే వంశధార ప్రాంత నిర్వాసితులు, స్థానికులు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ, మధు కుమార్, పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment