daggubati purendeswari
-
టీడీపీ వల్లే వంశధార నిర్వాసితులకు అన్యాయం
హిర మండలం: ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ పాలన వల్లే వంశధార నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. ‘జలం కోసం జన పోరు యాత్ర’ పేరుతో ప్రాజెక్టుల సందర్శనకు బీజేపీ నాయకులు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం హిరమండలంలోని వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు ఇంజనీరింగ్ అధికారుల నుంచి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 91 శాతం పనులు పూర్తయ్యాయని.. మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు వారికి చెప్పారు. అనంతరం జరిగిన సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో 10 ప్రాజెక్టులను సందర్శిస్తామని చెప్పారు. చంద్రబాబు విఫలమవ్వడం వల్లే వంశధార ప్రాంత నిర్వాసితులు, స్థానికులు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ, మధు కుమార్, పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
అందుకే కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పా: పురందేశ్వరి
సాక్షి, విజయవాడ: భారతీయ జనతా పార్టీ పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో మంగళవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘పోలవరానికి 1935 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నివేదిక ఇంకా కేంద్రానికి అందలేదు. పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రాలో కలపమని కాంగ్రెస్ పార్టీ ఆనాడు బిల్లులో పెట్టలేదు.. అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీనే. ప్రాజెక్టు కోసం బీజేపీ శిత్తశుద్దితో పని చేస్తోంది. కేంద్రం సిమెంట్ రోడ్లు, 24 గంటలు కరెంట్ ఇస్తే వాటిని చంద్రబాబు తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. కడప ఉక్కుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ఎన్నిసార్లు నివేదిక అడిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. హోదాకు బదులు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారు. జమిలీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీకి గట్టిగా ఉంది. జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలపై టీడీపీ తమపై అభాండాలు వేయడం సరికాదు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొన్నారు. వారికి మంత్రి పదవులు ఇచ్చారు.. దానిపై ఎందుకు చంద్రబాబు మాట్లాడడం లేద’ని ప్రశ్నినించారు. -
'అతడిని విడుదల చేస్తే మృగాన్ని వదిలినట్టే'
హైదరాబాద్: 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ... రుణాల పేరుతో మహిళలను లైంగికంగా వేధించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై నిర్భయ కేసులు పెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. నిర్భయ కేసులో బాలనేరస్థుడిని జైలు నుంచి విడుదల చేయొద్దని ఆమె డిమాండ్ చేశారు. అతడిని విడుదల చేస్తే సమాజంలోకి మృగాన్ని వదిలినట్టేనని వ్యాఖ్యానించారు. కాగా, బాలనేరస్థుడిని విడుదల చేయొద్దని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.