
మాట్లాడుతున్న బీజేపీ నేత సోము వీర్రాజు
విజయనగరం గంటస్తంభం: టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసినా.. చంద్రబాబు ప్రధాని మోదీ ఫొటోను గాడిదకు తగిలించి ఎమ్మెల్యేలతో చెప్పులతో కొట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గుర్తు చేశారు. వాటన్నింటినీ బీజేపీ ఎప్పటికీ మర్చిపోదన్నారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ వల్లే విశాఖ రైల్వేజోన్ సాకారమవుతోందన్నారు.
ప్రధానులను మార్చానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రైల్వే జోన్ ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతోనే రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి చెందలేదని విమర్శించారు. రాజధానికి ఇచ్చిన దాదాపు రూ.7 వేల కోట్లను సింగపూర్, చైనా ప్లాన్లు అంటూ మాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని.. ఆయన్ని చూసి ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయన్నారు. సభలో బీజేపీ నాయకులు తీగల హరినాథ్, పావని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment