
నల్లజర్ల: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనంతోనే తమ పార్టీ పయనిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే జనసేనతో కలుస్తామని, కానీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు.
జూన్ 5న రాజమహేంద్రవరం, 6న విజయవాడలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలు జరుగనున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి శివనాగరాజు ఇంటివద్ద మంగళవారం జరిగిన శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని అభివృద్ధి చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment