alliances
-
మహారాష్ట్ర ఎన్నికలు.. బరిలో 7,995 మంది
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మొత్తం 288 స్థానాల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్లకు ఆఖరు రోజైన అక్టోబర్ 29న దాదాపు 4,996 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.దీంతో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండనున్నారనేది దాదాపు స్పష్టమైందని చెప్పవచ్చు. కాగా మహాయుతితోపాటు మహావికాస్ అఘాడిలపై పలువురు నాయకులు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. తిరుగుబాటు చేసిన అభ్యర్థుల్లో గోపాల్ శెట్టి (బోరివలి), రాజు పారవే (ఉమరేడ్), స్వీకృతి శర్మ (తూర్పు అంధేరి), నానా కాటే (చించ్వడ్) తదితరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు నాలుగో తేదీ వరకు గడువు ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు... ప్రధాన కూటములైన బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల కలయికతో ఏర్పడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల కలయికతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటముల అభ్యర్థులు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో అత్యధికంగా బీజేపీ తరఫున 148 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున 103 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 164 స్థానాల్లో, కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేశాయి. కానీ ఈసారి రాజకీయ సమీకరణాలు మారడంతో ప్రధాన కూటముల్లో సీట్ల పంపకాలు ఆలస్యమయ్యాయి. ఇక మిగిలిన పార్టీలైన శివసేన (యూబీటీ) 89, శివసేన (శిందే) 80, ఎన్సీపీ (ఎస్పీ) 87, ఎన్సీపీ (ఏపీ) 53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మహిం’లో ఎమ్మెన్నెస్‌కే మద్దతు -
Lok sabha elections 2024: జాతీయ పార్టిలకు... ద్రవిడ స్వప్నం!
దక్షిణాదిన జాతీయ పార్టిలకు కొరకరాని కొయ్యగా నిలుస్తున్న రాష్ట్రాల్లో ప్రధానమైనది తమిళనాడు! 50 ఏళ్లకు పైగా ఇక్కడ ప్రాంతీయ పార్టిలదే హవా. తమిళులు కూడా సినీ గ్లామర్, ప్రాంతీయ సమస్యలు, అంశాలకే ప్రాధాన్యమిస్తారు. కానీ 39 లోక్‌సభ స్థానాలతో సీట్లపరంగా దేశంలో ఐదో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడును పక్కనపెట్టే పరిస్థితి లేదు. దాంతో కాంగ్రెస్, బీజేపీ ఇక్కడి ప్రాంతీయ పార్టితో పొత్తులు పెట్టుకోక తప్పడం లేదు. ఈసారి మాత్రం రాష్ట్రంలో బీజేపీ గట్టిగా ఉనికిని చాటే ప్రయత్నాల్లో ఉంది... ఇండియా కూటమిదే హవా? ఒకప్పుడు కరుణానిధి డీఎంకే, జయలలిత అన్నాడీఎంకేలకు కంచుకోటైన నిలిచిన తమిళనాట వారి తదనంతరం పరిస్థితులు మారుతున్నాయి. అన్నాడీఎంకే వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీ బలహీనపడటంతో ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేసి ఈ కీలక దక్షిణాది రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాలక డీఎంకేతో జట్టుకట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన యూపీఏ కూటమి ఎన్డీఏను మట్టికరిపించింది. ఏకంగా 38 సీట్లను ఎగరేసుకుపోయింది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే 23 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలకు 8 దక్కించుకుంది. సీపీఐ, సీపీఎం చెరో రెండు, ఇతర చిన్న పార్టీలు ఒక్కో సీటు గెలుచుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలో 37 స్థానాలు కొల్లగొట్టిన అన్నాడీఎంకే 2019లో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి బొక్కబోర్లా పడింది. 21 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచు కుంది. బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ (ఎం) ఖాతా కూడా తెరవలేదు. ఈసారి ఇండియా కూటమి నుంచి డీఎంకే 21, కాంగ్రెస్ 9, సీపీఐ, సీపీఎం, వీసీకే రెండేసి స్థానాల్లో, ఎండీఎంకే, ఐయూఎంఎల్ చెరో చోట పోటీ చేస్తున్నాయి. ఒక స్వతంత్రుడు డీఎంకే మద్దతుతో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అవినీతి వర్సిటీకి చాన్సలర్ మోదీ దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ బీజేపీయే. అవినీతి పేరుతో యూనివర్సిటీ పెడితే దానికి మోదీయే చాన్సలర్ అవుతారు. ఆ అర్హతలన్నీ ఆయనకే ఉన్నాయి. – చెన్నై రోడ్‌షోలో సీఎం స్టాలిన్ బీజేపీ పాగా వేసేనా? ద్రవిడ రాజ్యంలో పాగా వేయాలని తహతహలాడుతున్న కమలనాథులకు అన్నాడీఎంకే దూరమవడంతో ఈసారి ఆదిలోనే షాక్ తగిలింది. దాంతో చిన్నాచితకా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ (ఎం)కు 3, ఎస్.రాందాస్‌కు చెందిన పట్టాలి మక్కల్ కచి్చకి 10, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)కు 2 సీట్లు కేటాయించింది. మరో 4 చోట్ల కూటమిలోని ఇతర పక్షాలు కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‌సెల్వంకు బీజేపీ మొండిచేయి చూపింది. ప్రధాని మోదీ తమిళనాట సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అయోధ్య, డీఎంకే అవినీతి, కుటుంబ పాలనను ప్రచారా్రస్తాలుగా మలచడంతో పాటు తమిళ భాషకు పెద్దపీట వేస్తామంటూ పదేపదే ప్రకటిస్తున్నారు. దివంగత విజయకాంత్ పార్టీ డీఎండీకే (5 సీట్లు), మరో రెండు పార్టిలతో (చెరో సీటు) అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తోంది. 32 చోట్ల ఆ పార్టీ బరిలో ఉంది. అన్నామలై... బీజేపీ తురుపుముక్క బీజేపీకి తమిళనాట ఎట్టకేలకు కె.అన్నామలై రూపంలో ఫైర్‌బ్రాండ్ నాయకుడు దొరికారు. 2021లో 36 ఏళ్ల అతి చిన్న వయసులో పార్టీ పగ్గాలు అందుకుని శరవేగంగా కీలక నేతగా ఎదిగారు. ‘సింగమ్ అన్న’గా పేరొందిన ఈ మాజీ ఐపీఎస్ మొత్తం పాదయాత్రతో క్రేజ్ సంపాదించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టడంతో పాటు హిందుత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దూకుడు, వాగ్ధాటితో బీజేపీకి జోష్ తెచ్చారు. కోయబత్తూరు నుంచి బరిలో ఉన్నారు. రాజధానిని నాగపూర్‌కు ఎలా మారుస్తారు? అర్థంపర్థముందా? కమల్ పిచ్చాసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే మంచిది. డీఎంకే ప్రాపకం, రాజ్యసభ స్థానం కోసమే ఆయన పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు – కోయంబత్తూరు ర్యాలీలో అన్నామలై ఐదుగురు ‘సినీ’ సీఎంలు తమిళ రాజకీయాలకు, సినిమాలకు బ్రిటిష్ కాలం నుండీ విడదీయరాని బంధం! నాటి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నుండి తాజాగా విజయ్ దాకా వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచి్చనవారే. సినీ పరిశ్రమ నుంచి తమిళనాట ఐదుగురు ముఖ్యమంత్రులయ్యారు. ద్రవిడ సిద్ధాంతాలను సినిమాల్లో చొప్పించిన వారిలో రాష్ట్ర తొలి ద్రవిడ సీఎం సీఎన్ అన్నాదురై ముందుంటారు. ఇక కవిగా, స్క్రీన్‌ప్లే, సంభాషణ రచయితగా పేరొందిన ఎం.కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడైన తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఎంజీఆర్ మరణానంతరం అతి స్వల్పకాలం పాటు సీఎంగా చేసిన ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సినీ నటే. అనంతరం ఎంజీఆర్ వారసురాలైన స్టార్ హీరోయిన్ జయలలిత సీఎంగా చెరగని ముద్ర వేశారు. తర్వాతి తరంలో విజయకాంత్ (ఎండీఎంకే), కమల్‌హాసన్ (మక్కల్ నీది మయం) పార్టిలు పెట్టినా రాణించలేదు. కమల్ ఈసారి ఇండియా కూటమికి మద్దతు తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టినంత పని చేసి చివరికి విరమించుకున్నారు. తాజాగా సూపర్‌స్టార్ విజయ్ కూడా తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. హీరో విశాల్ కూడా పార్టీ పెడతానని ప్రకటించారు. ఇండియా కూటమికే సర్వేల మొగ్గు తమిళనాట ఇండియా కూటమి మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని, నాలుగైదు స్థానాలూ వస్తాయని మరో సర్వే అంటోంది. అవినీతికి మారుపేరు డీఎంకే. దానిపై తొలి కాపీరైట్ ఆ పార్టిదే. అదో ఫ్యామిలీ కంపెనీ. రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది. భాష, కులం, మతం, విశ్వాసం అంటూ విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే వంటి కుటుంబ పార్టిలు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నాయి. కచ్చతీవు దీవిని 1974లో శ్రీలంకకు ధారాదత్తం చేసింది ఈ రెండు పార్టిలే. – వెల్లూరు సభలో ప్రధాని మోదీ ఎన్డీఏ ఈసారి అధికారంలోకి వస్తే దేశ రాజధానిని నాగపూర్‌కు మార్చేస్తుంది. త్రివర్ణ పతాకాన్ని కూడా కాషాయ జెండాగా మర్చాలని చూస్తున్నారు. గుజరాత్ మోడల్ కంటే ద్రవిడ మోడల్ చాలా గొప్పది. మేం దాన్నే అనుసరిస్తాం. – డీఎంకే తరఫున ప్రచారంలో కమల్ హాసన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: మరాఠా గడ్డపై మహా పోరు!
మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తుకు పై పొత్తు అన్నట్లుగా ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటుందో తెలియని ట్విస్టులతో మహారాష్ట్రలో రాజకీయం నానా మలుపులు తిరుగుతోంది. శివసేన, దిగ్గజ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పగ్గాలు చీలిక వర్గాల చేతికి వెళ్లడంతో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఆ రెండు పార్టీలతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసే కూటమిగా పోటీ చేస్తోంది. మరోపక్క, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో సహా చిన్నాచితకా పార్టీలు జట్టు కట్టి రంగంలోకి దిగాయి... స్టేట్ స్కాన్ 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్ర సీట్లపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా స్థానికాంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఎన్నికల వేళ అనూహ్య రాజకీయ మార్పులూ పరిపాటే. ఏ పార్టీ కూడా ఒంటిచేత్తో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. రెండేళ్లలో అంతా తలకిందులు పొత్తు రాజకీయాలకు పేరొందిన మహారాష్ట్రలో గడిచిన రెండేళ్లలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఏకంగా 41 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు దక్కించుకోగా, శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ మరో రెండు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బరిలోకి దిగినా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోటే గెలిచింది. ఎన్సీపీ 19 చోట్ల అభ్యర్థులను నిలబెట్టి 4 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయాయి. ఒకటి ఎన్డీఏలో, మరోటి మహాకూటమి పంచన చేరాయి. 48 లోక్‌సభ స్థానాల్లో 5 సీట్లు ఎస్సీలకు, 4 ఎస్టీలకు కేటాయించారు. మాటల యుద్ధం ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న కొద్దీ నేతల మాటల్లో వాడి, వేడి కూడా పెరుగుతోంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ తప్పుబట్టారు. ‘రాజ్ ఠాక్రే బీజేపీ ముందు మరీ ఇలా సాగిలపడిపోతారనుకోలేదు. పులి కాస్త గొర్రెలా మారింది. ఠాక్రే వంటి పోరాట యోధుడు బానిసగా మారారు. అతను బీజేపీకి మద్దతు ప్రకటించినా ఎన్నికల్లో మా విపక్ష ఎంవీఏ కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని విజయ్ పేర్కొన్నారు. కాగా, బుధవారం నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ‘సర్వేలన్నీ ఎన్డీఏ బంపర్ విజయం ఖాయమంటున్నాయి. ప్రతిపక్షాలు నాపై చేస్తున్న విమర్శలు, దూషణలతో మా బలం మరింత పెరుగుతోంది. ’అబ్కీ బార్ 400 పార్’ ట్రెండ్ బలపడుతోంది‘ అని స్పష్టం చేశారు. బీజేపీ తరపున డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఉండటం విశేషం. ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు కట్టబెట్టింది. మరోపక్క, కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ గాం«దీ, మల్లిఖార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే దన్నుగా నిలుస్తున్నారు. అధికార కుమ్ములాటలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించాయి. మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) పేరిట కలిసి బరిలో దిగిన కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపక్షానికి పరిమితయ్యాయి. అధికార పంపకంపై బీజేపీ, శివసేన కుమ్ములాట చివరికి కూటమి నుంచి సేన వైదొలిగేందుకు దారితీసింది. శివసేనకు ఎంవీఏ సీఎం పదవి ఆఫర్ చేయడంతో అది కూటమిలో చేరింది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 100కు పైగా సీట్లను దక్కించుకున్నా అధికారం దక్కకపోవడంతో బీజేపీ అదను చూసి శివసేనకు షాకిచ్చింది. శివసేన నేత ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆయన సీఎంగా బీజేపీ–శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది. శివసేన పార్టీ, గుర్తు షిండే వర్గానికే దక్కాయి. అటు ఎన్సీపీలోనూ అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగరేశారు. ఎమ్మెల్యేలను చీల్చి అధికార సంకీర్ణంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్సీపీ పేరు, గుర్తు కూడా అజిత్ వర్గానికే దక్కడంతో శరద్ పవార్ కొత్త పేరు, గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! ‘మహా’యుతి కూటమి బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి బలంగా కన్పిస్తోంది. శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయి. అయోధ్య రామ మందిరం సాకారం, అభివృద్ధి నినాదాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. మోదీ కేబినెట్లో రెండు విడతల్లోనూ మంత్రి పదవి దక్కించుకున్న మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) షిర్డీ లోక్‌సభ సీటు డిమాండ్ చేస్తోంది. దాన్ని తమ సిట్టింగ్ ఎంపీకే కేటాయించాలని సీఎం షిండే పట్టుబడుతున్నారు. షిర్డీ నుంచి తాను పోటీ చేసినా, చేయకపోయినా ఎన్డీఏతోనే ఉంటానని ఆర్పీఐ చీఫ్ రాందాస్ అథవాలే ప్రకటించారు. ఆయనకున్న ఓటు బ్యాంకు చాలా స్థానాల్లో కూటమికి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. బీజేపీ దాదాపు 30 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కానీ ఎన్సీపీ 10, శివసేన 18 సీట్లు కోరుతున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ 24, శివసేన 8, ఎన్సీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో 7 శాతం ఓట్లు సాధించిన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సారథ్యంలోని బహుజన్ అఘాడీ కూడా బీజేపీతో సీట్ల బేరం సాగిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా తాజాగా మోదీకి జై కొట్టారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు! ‘ఇండియా’ పైచేయి సాధించేనా? ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకం కొలిక్కి వచి్చంది. శివసేన (ఉద్ధవ్) 21 సీట్లు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాల చొప్పున పంచుకున్నాయి. ఎన్సీపీ, శివసేన ఓటు బ్యాంకు తమతోనే ఉందని ఎంవీఏ చెబుతోంది. కాంగ్రెస్ 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. మహాయుతి కూటమికి ఎంవీఏ గట్టి పోటీ ఇస్తున్నట్టు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో మహారాష్ట్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వేల సంగతేంటి? సర్వేల్లో మహారాష్ట్రపై మిశ్రమ అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని అధికార మహాయుతి కూటమికే మెజారిటీ సీట్లు కట్టబెట్టగా మరికొన్ని ఎంవీఏ భారీగా పుంజుకుని పైచేయి సాధిస్తుందంటున్నాయి. తాజా సర్వే ఒకటి ఎంవీఏ కూటమికి ఏకంగా 26 స్థానాలు అంచనా వేయడంతో కాంగ్రెస్ తదితర విపక్షాల్లో ఉత్సాహం నెలకొంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
హస్తినలో విపక్షాల ర్యాలీ నేడే
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. -
పొత్తులపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ
సాక్షి, విజయవాడ: బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు షాక్ తగిలింది. జనసేనతో జతకట్టిన చంద్రబాబు.. ఘోర ఓటమి భయం వెంటాడటంతో బీజేపీతో పొత్తు కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అయితే, పొత్తులపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశామని, 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టామని ఆమె పేర్కొన్నారు. ‘‘26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం. పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు. నిర్ణయిస్తారు. పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండ్‌దే’’ అని పురందేశ్వరి స్పష్టం చేశారు. మరోవైపు, బీజేపీలోని చంద్రబాబు మద్దతుదారులు పొత్తు కోసం ఢిల్లీలో పైరవీ చేస్తున్నా.. ఢిల్లీ పెద్దలు మాత్రం అంగీకరించడంలేదని టాక్. బీజేపీలో చేరినప్పటికీ వీరు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలే చెబుతుంటారు. అందుకోసమే చంద్రబాబు డైరక్టన్లోనే బీజేపీ వైపు నుంచి పొత్తు కోసం ప్రతిపాదన వచ్చేలా పైరవీలు సాగించారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సైతం పొత్తు కోసమే ప్రయత్నించారనే టాక్ నడిచింది. చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం. ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు -
బీజేపీతో పొత్తు ఉంటుంది: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో BRS పార్టీకి పొత్తు ఉంటుందంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న BJP, BRS లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి మల్లారెడ్డి ఆ మాటలు చెప్పాడా? లేక లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అన్నది వచ్చే కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మల్లారెడ్డి ఏమన్నాడంటే.. "బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేద" అన్నారు మల్లారెడ్డి మల్కాజి గిరి లోక్‌సభ సీటు గురించి మాట్లాడుతూ.. "మా మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్ భద్రంగా వుంది, బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మాదే. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. నా కొడుకుకు టిక్కెట్ ఇస్తే మాదంతా ఉమ్మడి కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మా యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు వుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేను ఏం చేయలేను" అన్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ? ఇవ్వాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. -
‘హీ నితీష్డ్ మీ’
న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ పదేపదే కూటములు మార్చడంపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్, జోకులు పేలుతున్నాయి. మోసానికి సిసలైన పేరు నితీశ్ అంటూ కొత్త విశేషణాన్ని ఖరారుచేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్‌లో కొన్ని... ‘అతను నన్ను మోసం చేశాడు’ అనడానికి ‘హీ నితీష్డ్ మీ’ అంటూ పలువురు ట్యాగ్ చేస్తున్నారు. ‘‘బీసీసీఐ కొత్త తరహా క్రికెట్ టోర్నమెంట్ ఫార్మాట్ తేనుంది. అదేంటంటే మ్యాచ్ మధ్యలో కెప్టెన్లు మారిపోతారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ. ఆదాయానికి ఆదాయం. వరల్డ్ కప్ లాగా అది ‘నితీశ్ కప్’ అని ఒక పాత్రికేయుడు ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. కార్పోరేట్ ప్రపంచంలో సీఈవోలకు నితీశ్ కుమార్ ఒక ఆదర్శనీయుడు. తొమ్మిదిసార్లు ‘కంపెనీ’ల విలీనాలు, టేకోవర్ల తర్వాత కూడా ఈయనే సీఈవోగా కొనసాగడం అద్భుతం’ అని మరో యూజర్ ట్వీట్‌చేశారు. కూటముల మధ్య తెగ ‘పల్టీలు కొట్టే పుత్రుడు’ని కన్నందుకు ‘పాటలీపుత్ర’కు ఆ పేరు వచ్చిందని మరొకరు కొత్త భాష్యమిచ్చారు. ‘‘జాతీయ రహదారులపై యూటర్న్ గుర్తు తీసేసి అక్కడ నితీశ్ ఫొటో పెట్టాలని కేంద్ర రహదారుల మంత్రి ఆదేశించారు’’ అని మరొకరు ట్వీట్‌చేశారు. బిహార్‌లో మహాఘట్బంధన్ కూటమికి చరమగీతం పాడి బీజేపీతో నితీశ్ జట్టు కట్టిన విధానాన్ని ఐదు అంశాల్లో నెటిజన్లు సరికొత్తగా నిర్వచించారు. 1. ఎటంటే అటు మారేలా అనువుగా ఉండాలి. 2. సరిగ్గా సరైన సమయం చూసి అటువైపు దూకేయాలి. 3. అదే సమయంలో పాత మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి. 4. చెడిపోయిన స్నేహాన్ని చిగురింపజేయాలి. 5. కొత్త అవకాశం చేతికొచ్చాకే పాత మిత్రుల చేయి వదిలేయాలి. గవర్నర్ బిత్తరపోయిన వేళ! ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వెళ్లిన నితీశ్, 15 నిమిషాల్లోపే తిరిగి రాజ్‌భవన్‌కు రావడం చూసి గవర్నర్ షాకయ్యారంటూ సరదా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అదేమంటే, రాజ్‌భవన్‌లో మర్చిపోయిన తన మఫ్లర్(స్కార్ఫ్)ను తీసుకోవడం కోసం నితీశ్ వెనుదిరిగి వస్తారు. అది చూసి గవర్నర్ బిత్తరపోతారు. ‘ఈసారి కూటమికి గుడ్‌బై చెప్పడానికి నితీశ్‌కు 18 నెలలు టైమ్ పట్టింది. ఇప్పుడేమిటి మరీ 15 నిమిషాల్లోపే మళ్లీ వచ్చారా?’ అని గవర్నర్ షాక్‌కు గురయ్యారంటూ కాంగ్రెస్ వ్యంగ్యంగా ట్వీట్‌చేసింది. ‘‘వెంటవెంటనే రాజీనామాలు, ప్రమాణాలతో నితీశ్ రాజకీయ రంగు మారుస్తున్నారు. ఈయనను చూసి ఊసరవెల్లి కూడా కొత్త రంగును వెతుక్కోవాల్సి వస్తోంది. ఆయారామ్ గయారామ్ బదులు ఇక ఆయా నితీశ్ గయా నితీశ్ అనుకోవాలి’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్‌లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
‘ఇండియా’లో పొత్తు చిచ్చు!
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇతర విపక్షాలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటు కత్తిమీద సాములా మారుతోంది. సీట్ల పంపకాల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు ఒకవైపు, భాగస్వామ్య పక్షాలు అధిక సీట్లు డిమాండ్ చేస్తుండటం మరోవైపు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పశి్చమబెంగాల్, బిహార్, జమ్మూ కశీ్మర్లలో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్‌కు పరీక్ష పెడుతోంది...! బెంగాల్లో బెంబేలు... సీట్ల సర్దుబాటుపై ముందు సొంత పార్టీ నేతల నుంచి కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ చేస్తోంది. దీనిపై ముకుల్ వాస్నిక్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘెల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్‌లతో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ఏఐసీసీ బృందం రాష్ట్రాలవారీగా నేతలతో భేటీ అవుతోంది. ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో కూటమి పక్షాలతో సీట్ల పంపకాలపై వారి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. పశి్చమబెంగాల్లో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్‌కు రెండే ఎంపీ సీట్లిస్తామని అధికార తృణముల్ కాంగ్రెస్ ఇప్పటికే తేల్చిచెప్పింది. మిగతా 40 చోట్ల తామే పోటీ చేస్తామంటోంది. ఈ మాత్రానికి తృణముల్‌తో పొత్తెందుకని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రశి్నస్తున్నారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకొని ఎక్కువ సీట్లలో కాంగ్రెసే పోటీ చేయాలంటున్నారు. అసలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా రాష్ట్రంలో అన్ని సీట్లలోనూ తామే పోటీ చేయాలని తృణమూల్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌దీ ఇదే అభిప్రాయమని కూడా చెబుతున్నారు! బిహార్‌లో పీటముడి! బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో 2019లో ఆర్జేడీ సహా చిన్నా చితక పారీ్టలతో కాంగ్రెస్ జత కట్టి పోటీ చేసింది. ఈసారి జేడీ(యూ) కూడా జత కూడుతుండటంతో సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. 2019లో ఆర్జేడీ 20, కాంగ్రెస్ 9, ఆర్ఎల్ఎస్పీ 5, హిందుస్థానీ అవామ్ మోర్చా (హమ్), వీఐపీ చెరో మూడు చోట్ల పోటీ చేశాయి. కాంగ్రెస్ కేవలం ఒక సీటు గెలవగా, అప్పట్లో బీజేపీతో పొత్తున్న జేడీ(యూ) 16 సీట్లు నెగ్గింది! బీజేపీ 17, లోక్ జనశక్తి పార్టీ 6 సీట్లు గెలిచాయి. ఈసారి కాంగ్రెస్‌కు భాగంగా కాంగ్రెస్‌కు 6 సీట్లే ఇస్తామని జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్ అంటుండటం పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు! జేడీ(యూ) 23, ఆర్జేడీ 9 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. మహారాష్ట్రలో ఐదు సీట్లే! 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలోనూ శివసేన (ఉధ్దవ్) పార్టీ ఏకంగా 23, మరో మిత్రపక్షం ఎన్సీపీ 20 సీట్లు కోరుతున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్‌కు దక్కేవి ఐదే సీట్లు! ఇది ఆ మూడు పారీ్టలతో కూడిన ఎంవీఏ కూటమిలో చిచ్చు రాజేస్తోంది. ఇక ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీతో పొత్తు మాటెత్తితేనే స్థానిక కాంగ్రెస్ భగ్గుమంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆప్‌తో పోరాడుతున్న తమకు పొత్తుల పేరిట అన్యాయం చేయొద్దంటున్నారు. కశీ్మర్లో కూడా మెజార్టీ సీట్లలో కాంగ్రెసే పోటీ చేయాలని, నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఎక్కువ సీట్లు వద్దని అక్కడి నేతలంటున్నారు. జనవరి మూడో వారానికల్లా సీట్ల సర్దుబాటును పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ను ఈ సమస్యలు చీకాకు పరుస్తున్నాయి. -
CWC meet: ఎన్నికలకు సిద్ధంకండి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. తెలంగాణ మినహా ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ నైతిక స్థైర్యం వీడకుండా ముందుకుసాగాలని పిలుపునిచి్చంది. కూటమి పక్షాలను కలుపుకుంటూ, విజయ లక్ష్యంతో నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించారు. సార్వత్రిక ఎన్నికలు, కూటమి పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాం«దీ, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి హాజరు కావాల్సిసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేదు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలోని అంశాలను తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘‘ పార్లమెంటు నుంచి 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ దాని మిత్రపక్షాలకు ధీటుగా విపక్షాల ‘ఇండియా’ కూటమిని పటిష్టవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ‘‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ప్రధాని చెప్పే విషయాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉంది’ అని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ‘‘దేశంలో సామాజిక ధ్రువీకరణ తీవ్రమవుతోంది. ఎన్నికల్లో లాభం పొందేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడింది. భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘4 రాష్ట్రాల ఫలితాలపై ప్రాథమిక విశ్లేషణ చేసి ఓటమి కారణాలను గుర్తించాం. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా ఓట్ల శాతం సానుకూలంగా ఉంది. శ్రద్ధ పెడితే వచ్చే ఎన్నికలను మలుపు తిప్పగలమన్న ఆశ పెరిగిందిం’అని చెప్పారు. -
21న సీడబ్ల్యూసీ కీలక భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలుచేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) డిసెంబర్ 21వ తేదీన సమావేశం కానుంది. డిసెంబర్ 19వ తేదీన విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ పూర్తయిన రెండు రోజులకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో కూటమి పారీ్టలతో సీట్లు పంపకం, ఎన్నికల ప్రచార వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటమిపై సమీక్ష జరగొచ్చు. నిరుద్యోగం, పెరిగిన ధరలను ప్రధాన విమర్శనా్రస్తాలుగా తీసుకుని పశి్చమ–ఈశాన్య భారతాల మధ్య రాహుల్‌గాంధీ మరోమారు పాదయాత్ర చేసే అంశాన్నీ చర్చించే వీలుంది. 19న ఇండియా ‘కీలక’ భేటీ ‘ఇండియా’ కూటమి విపక్ష పార్టీలు ఢిల్లీలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం సమావేశం కానున్నాయి. సీట్ల పంపకం, కనీస ఉమ్మడి కార్యాచరణ, సీట్ల పంపకం జరిగిన చోట్ల ఉమ్మడిగా ప్రచార ర్యాలీలు చేపట్టడం వంటి సవాళ్లు నేతలకు స్వాగతం పలకనున్నాయి. వీటిపై సమావేశంలో ఒక స్పష్టత వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘నేను కాదు, మనం’’ అనే కొత్త నినాదంలో జనంలోకి వెళ్లాలని విపక్షాల కూటమి నిర్ణయించిన సంగతి తెల్సిందే. -
బీజేపీకి భయపడుతున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులను కేసీఆర్ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే వేదికపై బీజేపీని విమర్శిస్తారు. ఇది కేసీఆర్‌కు ఇబ్బందికరమైన అంశం. అలా చేస్తే కేసీఆర్‌ను బీజేపీ సహించదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే వస్తే ఏమవుతుందోనని కేసీఆర్‌కు భయం పట్టుకుంది’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి మారడం వల్లే ఆ పార్టీ తో పొత్తు కుదరలేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ తమను సంప్రదించిందని చెప్పారు. తమకు భయపడే కాంగ్రెస్ పొత్తుల విషయంలో కిరికిరి చేసిందన్నారు. కొన్ని జిల్లాల్లో తమ పార్టీ ఉనికినే దెబ్బతీయాలనేది వాళ్ల కుట్ర అని ఆరోపించారు. సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు నష్టమని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని మండిపడ్డారు. రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని, అధికారం వస్తే సోనియాతో మాట్లాడి చెరో మంత్రి పదవి ఇప్పిస్తామనడంపై ధ్వజమెత్తారు. 1996లో జ్యోతిబసును ప్రధానిని చేస్తామంటేనే తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికార పార్టీపై ఎదురుగాలి... బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ తొమ్మిదేళ్లలో ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని తమ్మినేని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రస్తుతానికి ఎదురుగాలి వీస్తోందని, అయితే, అధికారం కోల్పోయేంత ఎదురుగాలి వీస్తుందో లేదో చూడాలన్నారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు చేరిన అనేక మంది నాయకులు అప్పుడు బీజేపీతో మంతనాలు జరిపిన వారేనన్నారు. బీఆర్ఎస్ను ఎవరు ఓడించగలరో ఆలోచిస్తున్నామని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు చెప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌లా మారిందన్నారు. బీజేపీ ఐదారు సీట్లలో గెలిచే అవకాశముందనీ, అక్కడ ఆ పార్టీని ఓడించే సత్తా ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర అభ్యర్థులకు ఓటేస్తామన్నారు. మగదేవుళ్ల ఆధిపత్యం సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కమ్యూనిస్టులు కొంత వెనుకబడుతున్నారని తమ్మినేని చెప్పారు. కమ్యూనిస్టులు ఇప్పటివరకు ఆర్థిక అంశాలపైనే దృష్టిపెట్టారన్నారు. కడుపు నిండే డిమాండ్లపైనే దృష్టిపెట్టామని, మైండ్‌ను వదిలేశామన్నారు. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రావాలని, సామాజిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్యాపిటలిజంలో సజీవ దేవుళ్లు అంటే బాబాలు ఉంటారన్నారు. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లంతా ఫ్యూడల్ సమాజంలో భాగమేనన్నారు. ఇంకా వెంకటేశ్వరస్వామి ఆధిపత్యమే ఉందన్నారు. సమాజంలో మగదేవుళ్ల ఆధిపత్యమే ఉందని చెప్పారు. మగ ఆధిపత్యం ఎక్కడున్నా అది ఫ్యూడల్ సమాజమే అవుతుందన్నారు. వచ్చేసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుతాడేమో... పార్టీ లో ఇంకా కమ్మ, రెడ్డోళ్ల ఆధిపత్యమేనా? జెండాలు మోసేది మాత్రం అణగారిన వర్గాలా అన్న ప్రశ్నపై తమ్మినేని స్పందిస్తూ... ‘కమ్యూనిస్టు ఉద్యమం అనేది రెవెల్యూషనరీ మూవ్మెంట్. నాలెడ్జ్ లేకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేం. కొన్ని వేల సంవత్సరాల వరకు కొన్ని కులాలకు చదువు, జ్ఞానం నిషేధం. నాలెడ్జ్ సంపాదించకుండా అభ్యుదయ ఉద్యమాలకు రావడం అసాధ్యమైన విషయం. ఆస్తి, చదువు సమకూరినప్పుడు అక్కడ విజ్ఞానానికి అవకాశం ఉంటుంది. ఈ చారిత్రక అసమతుల్యతను సరిదిద్దేందుకు కమ్యూనిస్టులు కృషిచేస్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఐదారు జిల్లాలు తప్ప ఓసీలు ఎక్కడా సీపీఎం జిల్లా కార్యదర్శులుగా లేరు. ఎస్సీల జనాభా ఎంతుందో అంతమంది జిల్లా కార్యదర్శులున్నారు. బీసీ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువగా పార్టీ కార్యదర్శులున్నారు. రాష్ట్ర కార్యదర్శి (తమ్మినేని) ఒకడున్నాడు. బహుశా వచ్చేసారి అది కూడా ఆలోచిద్దాం. ఒక్క లీడర్‌ను బట్టి కమ్మ అనడం సరికాదు. పార్టీలో చాలా మార్పులు తెచ్చామని’తమ్మినేని చెప్పారు. సీపీఐ, సీపీఎం ఐక్యమయ్యే అవకాశముందని, అయితే, దానికి సమయం పడుతుందన్నారు. -
నితీశ్ సిగ్గుపడాలి: ప్రధాని నరేంద్ర మోదీ
దమోహ్/గుణ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాక్షాత్తూ అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను దారుణంగా అగౌరవపర్చినా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరు విప్పడం లేదని, కనీసం ఖండించడం లేదని తప్పుపట్టారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల నితీశ్ సిగ్గుపడాలని అన్నారు. తల్లులు, అక్కచెల్లెమ్మల పట్ల ఏమాత్రం గౌరవం లేని నాయకులతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మహిళలను చిన్నచూపు చూసే వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మోదీ సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని దమోహ్, గుణ పట్టణాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్లినా సరే ఉచిత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. ప్రతి ఇంట్లోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడూ విద్యుత్ ఉత్పత్తిదారుడే అవుతారని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూ.80 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. ‘ఉచిత రేషన్’ పొడిగింపుపై కాంగ్రెస్ అక్కసు పేదల ప్రజలకు ఉచిత రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామంటూ తాను హామీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని, అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వారిని ఆ పాపం చేయనిద్దామని అన్నారు. తాను మాత్రం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు. 80 కోట్ల మందికి వచ్చే ఏదేళ్లపాటు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వబోతున్నామని తెలిపారు. తనను చాలామంది ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, అయిప్పటికీ అవినీతిపై పోరాటం ఆపబోనని తేల్చిచెప్పారు. ఎవరెంత తిట్టుకున్నా తాను లెక్కచేయనని అన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రులు బెట్టింగ్‌ల్లో భాగస్వాములవుతున్నారని, నల్లధనం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం తాము 2014లో అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి చేరుకుందని, 200 ఏళ్లపాటు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టేశామని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలతో మనవైపు చూస్తోందని అన్నారు. తాను మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని, భారత్‌ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘85 శాతం కమిషన్ వ్యవస్థ’ మళ్లీ అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. -
‘ఇండియా’లో లోక్‌సభ ఎన్నికల నాటికి ఐక్యత అవసరం
ముంబై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపడలంలో సభ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)చీఫ్ శరద్ పవార్ చెప్పారు. అయితే, 2024లో లోక్‌సభ ఎన్నికల వేళకు ఇవన్నీ సర్దుకుని, ఉమ్మడిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ప్రతిపక్షపార్టీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఇదే విధమైన మార్పు వస్తుందని చెప్పేందుకు తన వద్ద కచ్చితమైన సమాచారం లేదన్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని ఆయన గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బలంగా కాంగ్రెస్ ఉండగా, మరికొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో తలెత్తే విభేదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. -
సర్దుకుపోదాం..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో వామపక్షాలు సర్దుకుపోయే ధోరణిలో ఉన్నట్టు కన్పి స్తున్నాయి. రెండేసి చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఒప్పుకున్న సీపీఐ, సీపీఎంల్లో తాము పోటీ చేసే స్థానాల విషయంలో మాత్రం కొంత గందరగోళం నెలకొని ఉంది. కొత్తగూడెం, మునుగోడు స్థానా లను సీపీఐ కోరగా, కాంగ్రెస్ కొత్తగూడెం, చెన్నూ రు స్థానాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ తమకు మునుగోడే కావాలని ఇప్పటివరకు పట్టు బడుతున్న సీపీఐ తాజాగా కాస్త మెత్తబడుతున్నట్టు తెలిసింది. అవకాశం ఉంటే మునుగోడు ఇవ్వాలని, లేనిపక్షంలో చెన్నూరు బరిలో దిగుతామంటూ సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. ఇక సీపీఎం మిర్యా లగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానా లు ఇవ్వాలని కోరింది. అయితే భద్రాచలంలో ఇప్ప టికే తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. మిర్యాల గూడ స్థానానికి మాత్రం సరే అంది. కానీ పాలేరు విషయంలోనే ఎటూ తేలడం లేదని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. పాలేరు సీటు ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇంకో సీటు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదో ఒక సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుబడుతుండటంతో అనూహ్యంగా ఇప్పుడు ఆ జిల్లాలోని వైరా రిజర్వుడు స్థానం తెరపైకి వచ్చింది. వైరా నియో జకవర్గంలో సీపీఎంకు మంచి పట్టుంది. కాబట్టి పాలేరు సాధ్యం కాకుంటే వైరాను అడగాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కానీ వైరాలో కాంగ్రెస్ అభ్యర్థినే బరిలో దింపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పట్టదలతో ఉన్నట్టు తెలిసింది. దీంతో వైరా కూడా ఎంతవరకు ముడిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వామపక్షాల అసహనం! కాంగ్రెస్‌తో పొత్తు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవ డంతో సీపీఐ, సీపీఎం నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినా ఇంకా పని చేసుకోండంటూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లపై కూడా అను మానాలున్నాయా అనే సందేహాలు ఆ పార్టీ కార్య కర్తల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీపీఎంకు మిర్యాలగూడ ఖరారు చేసినా.. ఆ సీటు విషయంలోనూ పూర్తిగా భరోసా ఇవ్వలేదని ఆ పార్టీ చెబుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఎక్కడ పోటీలో ఉంటామో స్పష్టత లేకపోవడంతో వామపక్షాల నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రచారానికి తగిన సమయం ఉండదని అంటున్నాయి. అంతేకాదు పొత్తులపై తమ కేడర్‌కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నా మని చెబుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూసుకుపోతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. బీఎల్ఎఫ్ రెండో జాబితా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ఆ పార్టీ విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులను బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకా‹శ్ ప్రకటించారు. ఇల్లెందు బరిలో గుమ్మడి అనురాధ గతంలో ఇల్లెందు నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కుమార్తె గుమ్మడి అనురాధ ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. అనురాధ ఉస్మానియా లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తనకు న్యూడెమొక్రసీ, ప్రజాపంథా సహా పలు సీపీఐ (ఎంఎల్) పార్టీల మద్దతు ఉన్నట్లు ఆమె చెబుతున్నారు. అయితే బలమైన తండ్రి వారస త్వం ఆమెకు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘ఇండియా’కు మద్దతు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి 18 చిన్న పార్టీలు, 50కి పైగా పౌర సంఘాలు మద్దతు ప్రకటించాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమిలోని పారీ్టల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ‘ఇండియా గెలుస్తుంది: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం జాతీయ సదస్సు‘ పేరుతో వాటి నేతలు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. ముఖ్యంగా విపక్ష అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్న 100 నుంచి 150 లోక్‌సభ స్థానాల్లో ఈసారి వారికి దన్నుగా నిలుస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరైనట్టు చెప్పారు. -
‘ఇండియా’ కూటమిలోనే ఉంటాం: కేజ్రివాల్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి తాము బయటకు వచ్చే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ తేలి్చచెప్పారు. ఇండియా కూటమిలోనే భాగస్వామిగా ఉంటామని చెప్పారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యరి్థగా మీ పేరును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించగా... తామే ప్రధానమంత్రి అని దేశంలోని 140 మంది భారతీయులు భావించేలా ఒక వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేజ్రివాల్ బదులిచ్చారు. కేవలం ఒక వ్యక్తిని కాదని, పౌరులందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పారు. -
ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి
న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ప్రతిపక్ష ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశం హిందూమతమే లక్ష్యంగా జరిగిందని ఆరోపించారు. అయితే, తాము అన్ని మతాలను, ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తామని, అదేసమయంలో ఇతరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది. మనుషుల్ని సమానంగా చూడలేని మతం మతమే కాదని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. అటువంటి మతం రోగంతో సమానమన్నారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. దేశంలోని కోట్లాదిమంది ఆచరించే సనాతనధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని కరణ్ సింగ్ అన్నారు. క్షమాపణ చెప్పాలి ఉదయనిధి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్, అశోక్ గెహ్లాట్ తదితరులు మౌనంగా ఎందుకున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆ కూటమి హిందూ మతానికి వ్యతిరేకమని ఆరోపించింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి,అనురాగ్ ఠాకూర్ ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. ఇండియా కూటమి నేతలు క్షమాపణ చెప్పకుంటే దేశం వారిని క్షమించబోదన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉదయనిధిపై ముజఫర్‌పూర్‌కు చెందిన లాయర్ సుధీర్ కుమార్ ఓఝా కోర్టులో పిటిషన్ వేశారు. -
‘ఇండియా’ కమిటీల్లో నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని వివిధ కమిటీలకు మరికొన్ని నియామకాలు చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కూటమిని సన్నద్ధం చేసే క్రమంలో శుక్రవారం ప్రకటించిన సమన్వయ, ఎన్నికల వ్యూహ కమిటీలోకి వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులను తీసుకున్నారు. తాజాగా, ప్రచార కమిటీలోకి కాంగ్రెస్ నేత గుర్దీప్ సింగ్ సప్పాల్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేనకు చెందిన అనిల్ దేశాయ్, ఆర్జేడీ సంజయ్ యాదవ్, ఎన్సీపీ నుంచి పీసీ చాకో, జేఎంఎం నేత చంపాయి సోరెన్, ఎస్పీకి చెందిన నందా కిరణ్మయ్, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఎం నేత అరుణ్ కుమార్, సీపీఐఎంఎల్ నుంచి రవి రాయ్, వీసీకే నుంచి తిరుమావలన్, ఐయూఎంఎల్ నేత కేఎం కాదర్ మొయిదిన్, కేసీ–ఎం నేత జోస్ కె మణి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీ నేత మెహబూబ్ బేగ్‌లను నియమించారు. టీఎంసీ నుంచి ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది. -
నేటి నుంచే... ‘ఇండియా’ మూడో భేటీ
ముంబై: జాతీయ స్థాయిలో అధికార బీజేపీకి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకున్న విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల కీలక సమావేశం మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం ప్రారంభం కానుంది. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు 27 పార్టీలకు పైగా హాజరు కానున్నట్టు చెబుతున్నారు. కూటమి లోగోను, సమన్వయ కమిటీని ప్రకటించనున్నారు. కూటమి పక్షాలు అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడంతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా తయారీకి కొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలు, సీట్ల పంపకం కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించనున్నారు. భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసుకోనున్నారు. దీనిపై ముంబై భేటీలో ప్రకటన చేసే అవకాశం ఉంది. కూటమి సమన్వయకర్త, లేదా చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం గురించి కూడా చర్చ జరగనుంది. తిరోగమన విధానాలు అమలు చేస్తున్న అధికార ఎన్డీయేకు ప్రగతిశీల ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తీసుకొస్తూ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ముంబై భేటీలో ఖరారు చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా చెప్పారు. ’బీజేపీ వెళ్లిపో’ నినాదం ఇండియా కూటమిలో ప్రస్తుతం 26 పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ముంబై భేటీ సందర్భంగా మరిన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరనున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. ఇండియా తొలి రెండు సమావేశాలు పాట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో గురువారం నుంచి జరుగనున్న మూడో భేటీకి హాజరయ్యేందుకు ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు నగరానికి చేరుకున్నారు. ఈ భేటీ వేదిక నుంచి ’బీజేపీ చలే జావ్’ (బీజేపీ వెళ్లిపో) అనే నినాదం ఇవ్వబోతున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. ప్రధానమంత్రికి పదవికి అర్హులైన నాయకులు తమ కూటమిలో చాలామంది ఉన్నారని తెలిపారు. వారిలో శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని అన్నారు. ఇండియా పక్షాల నడుమ ‘కెమిస్ట్రీ’ మెరుగుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మిలింద్ దేవ్రా వ్యాఖ్యానించారు. తమ కూటమిలో సీట్ల పంపకం రాష్ట్రాల స్థాయిలోనే జరుగుతుందని వివరించారు. కన్వీనర్‌గా నితీశ్! ఇండియా కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండియా కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కూటమి ఏర్పాటు వెనుక తనకు వ్యక్తిగత అ జెండా గానీ, ఆకాంక్షలు గానీ లేవని, కన్వీనర్ పోస్టుపై తనకు ఆసక్తి లేదని ఆయన ప్రకటించినప్పటికీ ఊహాగానాలు ఆగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టే నేత నితీశ్‌కుమార్ మాత్రమేనని అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పేరును మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. ఆ పదవి పట్ల ఆమె విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కన్వీనర్‌గా ఎవరుండాలో గురువారమే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. -
అంత ఈజీ కాదు..!
ఎస్.రాజమహేంద్రారెడ్డి : వచ్చే ఏడాది నుంచి దేశాన్ని ఓ ఐదేళ్లపాటు ఎవరు పరిపాలించబోతున్నారు? ఇప్పటికిప్పుడైతే ‘ఎన్డీయేనే.. ఇంకెవరు?’ అనే సమాధానమే వస్తుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ వరుసగా మూడోదఫా అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జరిగిన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఆడుతూ పాడుతూ అందలం ఎక్కింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందా? అంటే అంత నమ్మకంగా చెప్పడానికి లేదు. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ సారథ్యంలో ‘ఇండియా’ కూటమిగా జతకట్టడంతో రసవత్తరమైన పోరుకు తెరలేచింది. గట్టి పోటీనిచ్చి ఎన్డీయేకు, ముఖ్యంగా బీజేపీకి చుక్కలు చూపించాలని ‘ఇండియా’ కూటమిలోని పార్టీలన్నీ ఉవి్వళ్లూరుతున్నాయి. మొత్తం మీద ఎన్డీయేకు ఈసారి సునాయాసంగా నెగ్గడం సులభం కాకపోవచ్చు! 2014 నుంచి మోదీ యుగం ఆరంభం ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ముంబైలో గురువారం నుంచి సమావేశమై తమ కార్యాచరణ ఖరారు చేసుకోనున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ కీలక సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది చూచాయగా తెలిసే అవకాశం ఉంది. భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పోరాడితే తమ అవకాశాలు ఎలా ఉంటాయో కూడా కూటమిలోని పార్టీలన్నీ బేరీజు వేసుకోనున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో(2014, 2019) కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎన్డీయే కూటమికి వచ్చిన ఓట్ల శాతానికి కొంచెం దగ్గర్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే(38 పార్టీల కూటమి)కి 45 శాతం ఓట్లు వస్తే, ఇండియా కూటమి(26 పార్టీలు)కి 38 శాతం ఓట్లు లభించాయి. రెండు కూటముల మధ్య వ్యత్యాసం 7 శాతంగా కనిపిస్తోంది. రెండు కూటముల్లోని పార్టీలకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిర్ధారణకు రావొచ్చు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ పడతాయి కాబట్టి ఓట్ల శాతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందనేది పరిశీలకుల అంచనా. ఎన్డీయే 2019 ఎన్నికల్లో 45 శాతం ఓట్లతో 341 సీట్లు గెల్చుకుంది. అంతకుముందు 2014లో ఎన్డీయే 39 శాతం ఓట్లతో 353 సీట్లు సాధించింది. 2014లో ఓట్ల శాతం తక్కువైనా ఎక్కువ సీట్లు గెల్చుకోవడం గమనార్హం. 1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒక కూటమి ఇన్ని సీట్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. సరిగ్గా ఇక్కడే మోదీ యుగం ఆరంభమైంది. మోదీ యుగం ఆరంభం కాకముందు 2009లో ఎన్డీయే 27 శాతం ఓట్లతో కేవలం 148 సీట్లు గెల్చుకోగలిగింది. ప్రస్తుతం ఇండియా కూటమిగా ఏర్పడ్డ పార్టీలకు 2009 ఎన్నికలు ఒక రకంగా స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఈ పార్టీలకు 2009లో 40 శాతం ఓట్లు రాగా, 347 సీట్లు దక్కాయి. అయితే, 2014 ఎన్నికల్లో ఈ కూటమి పార్టీల ఓట్ల శాతం 42 శాతానికి పెరిగినా 161 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఇండియా కూటమి ఓట్ల శాతం(38 శాతం), సీట్ల సంఖ్య(158) గణనీయంగా పడిపోయాయి. కాంగ్రెస్ నష్టం బీజేపీకి లాభం గత ఎన్నికల్లో రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే పోటాపోటీగానే కనిపిస్తున్నప్పటికీ, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో(2014, 2019) బీజేపీ ఆధిక్యం ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. ఎన్డీయేలోని మిగతా భాగస్వామ్య పక్షాలపై బీజేపీ లేదా నరేంద్ర మోదీ ఆధిపత్యాన్ని రుజువు చేస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 37 శాతం ఓట్లు సాధించింది. ఇదే ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన ఓట్ల శాతాన్ని బీజేపీ ఒక్కటే సాధించడం విశేషం. రెండు కూటముల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. రానురాను కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతుండగా, బీజేపీ ఆ మేరకు పుంజుకుంటోంది. ముక్కుసూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ నష్టం బీజేపీకి లాభంగా మారుతోంది. గణాంకాలు పరిశీలిస్తే 1991 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఏనాడూ 30 శాతం ఓట్ల మార్కును అందుకోలేకపోయింది. బీజేపీకి 1991 ఎన్నికల్లో 20 శాతం ఓట్లు రావడం గమనార్హం. 1991, 2019 ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓ సారూప్యత ఉంది. 1991లో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు, బీజేపీకి 20 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో ఇది తిరగబడింది. 2019లో కాంగ్రెస్‌కు 20 శాతం, బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్ కోల్పోయిన ఓట్లు బీజేపీ ఖాతాలో చేరడం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు 189 స్థానాల్లో ముఖాముఖి పోటీపడ్డాయి. ఇందులో బీజేపీ ఏకంగా 166 సీట్లు గెల్చుకుంది. అంటే నేరుగా కాంగ్రెస్‌తో తలపడ్డ స్థానాల్లో బీజేపీ 88 శాతం సీట్లు గెల్చుకుందన్నమాట. అయితే, కాంగ్రెసేతర పార్టీలతో నేరుగా తలపడ్డ స్థానాల్లో బీజేపీ 47 శాతం సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది. ఐదేళ్ల తర్వాత 2019లో బీజేపీ కాంగ్రెస్‌పైనా, కాంగ్రెసేతర పార్టీలపైనా తన గెలుపు శాతాన్ని పెంచుకుంది. బీజేపీతో నేరుగా తలపడిన ప్రతిసారీ కాంగ్రెస్ చతికిలపడుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా కూటమిలోని ఇతర పార్టీల మాదిరి కాంగ్రెస్ ఉనికి దేశవ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ 20 శాతం ఓట్లతో 52 సీట్లు మాత్రమే గెల్చుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని విజయపథాన నడిపించాలంటే కాంగ్రెస్ సొంతంగా తన ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవాలి. అదే గనుక జరిగితే బీజేపీతో నేరుగా తలపడి దాదాపు 200 స్థానాల్లో తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఇది బీజేపీకి తీవ్ర నష్టం కలిగించవచ్చు. కొసమెరుపు ప్రస్తుతం ఎన్డీయే పరిస్థితి బ్రహా్మండంగా ఎదురులేని విధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకున్నా, కూటమిలోని ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో పట్టు బిగించినా స్వల్ప ఓట్ల శాతం తేడా కూడా బీజేపీని నిలువరించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణ శక్తి ఎన్డీయేకు బలమైతే, ఐకమత్యంతో పోరాడడమే ఇండియా కూటమికి లాభిస్తుంది. గెలుపోటములు దైవాధీనం కాదు.. ఓటరాధీనం! -
Manipur violence: హింస నివారణలో ప్రభుత్వం విఫలం
ఇంఫాల్: మణిపూర్‌లో జాతి వైషమ్యాలను అదుపుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆరోపించింది. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ తీవ్ర ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. సత్వరమే పరిష్కరించకుంటే దేశ భద్రతకు సైతం సమస్యగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మహిళా గవర్నర్ అనసూయ ఉయికేకు ఇచి్చన వినతి పత్రంలో పేర్కొన్నారు. వారు శని,ఆదివారాల్లో మణిపూర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. బాధిత ప్రజలకు తక్షణమే పునరావాసం కలి్పంచాలని, రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా కాల్పులు, గృహ దహన ఘటనలు కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుండటంతో వదంతులు వ్యాప్తి చెంది జాతుల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయన్నారు. జాతుల మధ్య పెరిగిన వైషమ్యాలను తక్షణమే చల్లార్చాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో తక్షణమే సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని గవర్నర్‌కు విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో బయోమెట్రిక్ సర్వే 2021 సంవత్సరంలో మయన్మార్ దేశంలో సైనిక జుంటా అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లోకి పెరిగిన వలసలపై కేంద్రం అప్రమత్తమైంది. అక్రమంగా ప్రవేశించిన మయన్మార్ దేశస్తులను గుర్తించేందుకు బయోమెట్రిక్ సర్వే చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వం ఇటీవల మణిపూర్, మిజోరం రాష్ట్రాలను ఆదేశించింది. మిజోరంలోని మొత్తం 11 జిల్లాల్లో కలిపి 30 వేల మందికిపైగా మయన్మార్ దేశస్తులున్నట్లు అంచనా. కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ప్రస్తుతం సహాయక శిబిరాల్లో సర్వే చేపట్టినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్ థంగ్లియానా ఆదివారం చెప్పారు. సెపె్టంబర్ 30వ తేదీలోగా మయన్మార్ దేశస్తుల నమోదు పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ కోరిందన్నారు. తమ వర్గానికి చెందిన వారే అయినందున తిరిగి మయన్మార్ పంపించలేక వారికి మానవతాదృక్పథంలో ఆశ్రయం కలి్పస్తున్నట్లు తెలిపారు. కొందరు బంధువుల వద్ద, అద్దె ఇళ్లలో ఉంటుండగా ఎక్కువ మంది సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని చెప్పారు. -
‘ఇండియా’ కూటమి భేటీ వాయిదా?
న్యూఢిల్లీ: ముంబైలో ఆగస్ట్‌లో జరగాల్సిన ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల భేటీ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూటమిలోని కొందరు నేతలు ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నామంటున్నందున ఆగస్ట్ 25, 26వ తేదీల్లో సమావేశం జరక్కపోవచ్చని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల మొదటి రెండు సమావేశాలు పట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. -
మణిపూర్‌లో ఇండియా
ఇంఫాల్: కొంతకాలంగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల పర్యటన శనివారం మొదలైంది. ఇందుకోసం కాంగ్రెస్‌తో పాటు పలు పారీ్టలకు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరితో పాటు కనిమొళి (డీఎంకే), సుష్మితా దేవ్ (తృణమూల్ కాంగ్రెస్), ఆర్జేడీ, ఆరెల్డీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ తదితర పారీ్టల ఎంపీలు వీరిలో ఉన్నారు. రాజకీయాలు చేసేందుకు రాలేదని అధీర్ స్పష్టం చేశారు. ‘‘కేవలం బాధితులను కలిసి వారి సమస్యలను అర్థం చేసుకోవడమే మా ఉద్దేశం. సమస్యకు పరిష్కారానికి అన్ని పారీ్టలూ చిత్తశుద్ధితో కృషి చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. మణిపూర్ కల్లోలం దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందన్నారు. శనివారం తొలి రోజు ఇంఫాల్‌తో పాటు మొయ్రంగ్, విష్ణుపూర్ జిల్లాలతో పాటు తాజాగా హింసాకాండ చెలరేగిన చౌరాచంద్‌పూర్‌లో కూడా ఎంపీల బృందం పర్యటించింది. కుకీ తెగకు చెందిన బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. వారికి ధైర్యం చెబుతూ గడిపింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేలా ఒత్తిడి తేవాలని బాధితులు వారిని కోరారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హింసాకాండ బీజేపీ ఉద్దేశపూర్వకంగా అమలు చేస్తున్న కుట్ర ఫలితమేనని ఆరోపించారు. మణిపూర్ అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అ«దీర్ దుయ్యబట్టారు. ‘‘మమ్నల్ని పార్లమెంటులో నోరెత్తనివ్వడం లేదు. అందుకే నేరుగా ప్రభావిత ప్రాంతాలకే వచ్చి, బాధితులతో మమేకమవుతున్నాం. వారు అనుభవించిన చిత్రహింసలకు సంబంధించిన దారుణ గాథలను వారి నోటే విని చలించిపోయాం’’ అని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా ఇంఫాల్ నుంచి హెలికాప్టర్లో బృందం పర్యటన సాగింది. ఆదివారం వారు గవర్నర్ అనసూయా ఉయికెను కలిసి సమస్యపై చర్చిస్తారని సమాచారం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. ఇరు తెగత వారితోనూ చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. శనివారం చౌరాచంద్‌పూర్‌లో పునరావాస శిబిరాన్ని ఆమె సందర్శించారు. భారీ ర్యాలీ విపక్ష ఎంపీలు మణిపూర్‌లో అడుగు పెట్టిన రోజే రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వేలాది మంది కుకీ తెగ ప్రజలు ఇంపాల్‌లో భారీ ర్యాలీ జరిపారు. తమ ప్రాబల్యమున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కావాలంటూ నినదించారు. మణిపూర్ సమగ్ర సమన్వయ కమిటీ సారథ్యంలో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. భర్త, కొడుకుల మృతదేహాలు చూపించండి తన కుమారుడు, భర్త మృతదేహాలనైనా చూపించండంటూ అత్యాచార బాధితురాలు విపక్ష ఎంపీలను కోరారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ప్రత్యర్థి తెగకు చెందినవారు నగ్నంగా ఊరేగించడం తెలిసిందే. వారిలో ఒక మహిళను ఎంపీలు కనిమొళి (డీఎంకే), సుషి్మతాదేవ్ (టీఎంసీ) కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ Mýఆమె భర్తను, కొడుకును చంపడంతో పాటు ఆమె కూతురిపై కూడా అత్యాచారనికి ఒడిగట్టారన్నారు. ఈ కేసు విచారణను శనివారం సీబీఐ చేపట్టింది. మణిపూర్ హింసపై ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ గొంతులు అప్పుడేమైనట్టు: బీజేపీ మణిపూర్‌లో విపక్ష ఎంపీల పర్యటన ఫక్తు రాజకీయ నాటకమని బీజేపీ దుయ్యబట్టింది. గత ప్రభుత్వాల హయాంలో మణిపూర్ భగ్గున మండి నెలల తరబడి స్తంభించినప్పుడు వీరంతా పార్లమెంటులో కనీసం నోరైనా ఎత్తలేదెందుకని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. బీజేపీ విమర్శలను ఇండియా బృందం తిప్పికొట్టింది. ‘‘ప్రధాని సారథ్యంలో అఖిలపక్ష బృందం మణిపూర్‌లో పర్యటిస్తే అందులో ఆనందంగా భాగస్వాములం అయ్యేవాళ్లం. కానీ అందరికంటే ముందుగా, ఎక్కువగా స్పందించాల్సిన ఆయన అసలు సోదిలో కూడా లేకుండాపోయారు’అంటూ దుయ్యబట్టింది. -
నేడు మణిపూర్‌కు ‘ఇండియా’
న్యూఢిల్లీ: మణిపూర్‌లో పర్యటించి, అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమస్యలకు తగు పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు నివేదిక అందజేస్తామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నేతలు ప్రకటించారు. కూటమిలోని 16 పారీ్టలకు చెందిన 20 మంది ఎంపీలు ఈ నెల 29, 30వ తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నుంచి ఆధిర్ రంజన్ ఛౌధురి, గౌరవ్ గొగోయ్, టీఎంసీ నేత సుష్మితా దేవ్, జేఎంఎంకు చెందిన మహువా మాజి, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్, ఆర్ఎల్డీ జయంత్ చౌధరి, ఆర్జేడీ మనోజ్ ఝా, ఆర్ఎస్పీ ఎన్కే ప్రేమచంద్రన్, వీసీకే నేత తిరుమావళన్. వీరితో పాటు జేడీ(యు) చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్, జేడీ–యూకు చెందిన అనీల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐ నుంచి సందేశ్ కుమార్, సీపీఎం నేత ఏఏ రహీం, ఎస్పీ నుంచి జావెద్ అలీఖాన్, ఐయూఎంఎల్ ఈటీ మహ్మద్ బషీర్, ఆప్ నేత సుశీల్ గుప్తా, శివసేన(యూటీ) అరి్వంద్ సావంత్, డీఎంకే నేత డి.రవి కుమార్, కాంగ్రెస్ నేతలు ఫులో దేవి నేతం, కె.సురేశ్ ఈ బృందంలో ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో మణిపూర్ హింసపై దర్యాప్తు జరిపించాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో అంతా మంచిగానే ఉన్నట్లు చూపాలని కేంద్రం అనుకుంటోందని ఆరోపించారు. మహిళల గౌరవంతో ఆటలా? బీజేపీ అధికార దాహంతోమహిళల గౌరవంతో, దేశ ఆత్మగౌరవంతో ఆటలాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో వీడియో షేర్ చేశారు. మణిపూర్‌లో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా కేంద్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ, మహిళలను గౌరవించని దేశం పురోగమించదన్నారు. -
అందరితో చర్చించాకే పొత్తులపై నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అందరితో చర్చించాకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థాగతంగా రాష్ట్రంలో చేయాల్సిన మార్పులపై అధిష్టానానికి నివేదిక అందించారు. పొత్తుల గురించి నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఉందని, ఎన్నికలకు ముందు పొత్తుల గురించి నిర్ణయం ఉంటుందని పురందేశ్వరి భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్‌ను కలిసి ఏపీ ఆర్ధిక పరిస్థితులను వివరించానని పురందేశ్వరి తెలిపారు. ‘నేనేం తప్పులు చెప్పలేదు’ ఇటీవల మీడియా సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి తాను తప్పులు చెప్పలేదని.. 2023 జూలై నాటికి ఏపీకి రూ.10,77,006 కోట్ల అప్పు ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు అధికారికమా, అనధికారికమా అన్నది ఏపీ ప్రజలకు తెలియాలన్నారు. రాష్ట్రంలో చిన్న సన్నకారు కాంట్రాక్టర్లకు రూ.71 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. 15వ ఆర్థిక సంఘం పంచాయతీ నిధులను అనధికారికంగా వాడటంపై సర్పంచ్‌లకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. నిధులు దారి మళ్లించి అప్పులు తీసుకువచ్చి ఆ భారాన్ని ప్రజలపై రద్దుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి లేదని.. అప్పులు మాత్రమే ఉన్నాయని పురందేశ్వరి విమర్శించారు. -
బీజేపీని ఇండియా ఓడించడం ఖాయం
కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయెన్స్) కూటమి బీజేపీని తప్పక ఓడిస్తుందని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అమరుల వార్షిక దినోత్సవ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ‘బీజేపీని ఓడించేందుకు 26 రాజకీయ పార్టీలు ఏకం కావడం సంతోషంగా ఉంది. వారందరికీ ధన్యవాదాలు. ఇకపై బీజేపీ çహారేగా.. భారత్ జీతేగా అనేదే మా నినాదం. మా భవిష్యత్ కార్యక్రమాలన్నీ ఇండియా వేదికగానే జరుగుతాయి’అని ఆమె స్పష్టం చేశారు. కూటమి గెలుపుపైనే తన దృష్టంతా ఉందని, ఏ పదవినీ ఆశించడం లేదని తెలిపారు. దేశంలో శాంతిని, బీజేపీ ఓటమినే తాము కోరుకుంటున్నామన్నారు. ప్రజలు బీజేపీని అధికారం నుంచి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని మమత తెలిపారు. 2024లోనూ బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్న విషయం మనందరం గుర్తుంచుకోవాలని చెప్పారు. మణిపూర్ సంక్షోభంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బేటీ బచావో’ మన కూతుళ్లను కాపాడుకుందాం పథకం ఇప్పుడు ‘బేఠీ జలావో’ మన కూతుళ్లను కాల్చివేద్దాంగా మారిందన్నారు. ప్రతిపక్ష కూటమిలోని నేతలంతా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తారని చెప్పారు. -
పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..
హస్తినలో జనసేనాని పవన్ టూర్ తుస్ మందా.. పొత్తులపై ముందడుగు వేయాలనుకున్న పవన్‌కి ఆశాభంగమే ఎదురైందా.. ఎన్డీఏ సమావేశంలో అసలు రాష్ట్ర రాజకీయాలే చర్చకి రాకపోవడం.. మోదీ, అమిత్ షా లాంటి అగ్రనేతలని కలిసే అవకాశం రాకపోవడంతో పవన్ నిరాశతో తిరుగుముఖం పట్టారా.. ఇపుడు పవన్ దారెటు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి నిరాశే ఎదురైంది. బీజేపీతో కలవడానికి వేసిన ఎత్తుగడ ఫలించలేదు. ఇక టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు ఎన్డీఏ సమావేశాన్ని ఉపయోగించుకోవాలన్న పవన్ ఆశలు కూడా నెరవేరలేదు.. ఫలితంగా పవన్ ఢిల్లీ టూర్ మొత్తానికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాని కలవటం.. ఆ కొద్ది రోజులకి ఎన్డీఏ సమావేశం ప్రకటన రావడంపై ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చే సాగింది. ఒకానొక దశలో ఎన్డీఏ సమావేశానికి బీజేపీ నుంచి టీడీపీకి ఆహ్వానమందిందనే లీకులని తెలుగుదేశం పార్టీ మీడియాకి అందించింది. ఒకట్రెండు పచ్చపత్రికలు అడుగు ముందుకు వేసి ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందిందంటూ ఊదరగొట్టాయి. అసలు టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కానప్పుడు ఎలా పిలుస్తామని టీడీపీకి ఆహ్వానం లేదని ఆ తర్చాత బీజేపీ నేతలు కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు.. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు దత్తపుత్రుడిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక గత దశాబ్దకాలంలో ఏనాడూ ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశానికి పిలవని బీజేపీ తొలిసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి ఆహ్వానం పంపారు. ఇంకేం.. తమకి ఆహ్వానం అందకపోయినా తమ దత్తపుత్రుడికి ఆహ్వానం అందిందని టీడీపీ నేతలు సంకలు గుద్దుకున్నారు.. ఎలాగైనా పవన్ ఢిల్లీ టూర్లో పొత్తుల ప్రస్తావన వస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నారు.. మరో వైపు ఎలాగైనా ఢిల్లీ టూర్‌ని తమపొత్తులకి అనుకూలంగా మార్చుకోవాలని పవన్ భావించారు.. తీరా చూస్తే అంతా తుస్ మంది. ఎన్డీఎ సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చకి వస్తాయని భావించిన పవన్ కళ్యాణకి ఆశాభంగమే ఎదురైంది. ఏపీలో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని సమావేశంలో చెప్పాలనుకున్న పవన్‌కి ఆ అవకాశమే రాలేదు.. దేశ రాజకీయాలపైనే చర్చ జరగడంతో పవన్ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది...ఇక టీడీపీని ఎలాగైనా బీజేపీతో కలపాలని పవన్ ఢిల్లీలో పిల్లి మొగ్గలు వేసినా ఫలితం దక్కలేదు.. ఇక ఎన్డిఏ సమావేశం తర్వాతైనా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లాంటి అగ్రనేతలతో భేటీ ఉంటుందనుకున్నా అదీ జరగలేదు...కానీ ఈ రోజు ఉదయం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి మురళీధరన్ ఇంటికి వెళ్లి కలిసే అవకాశం మాత్రమే దక్కింది. ఇక ఇతర బీజేపీ అగ్రనేతలతోనైనా భేటికి అవకాశం దక్కుతుందేమో అనుకున్నప్పటికీ అదీ నెరవేరలేదు. ఎన్డిఏ భేటీకి ముందు.. తర్వాత కూడా పవన్ మీడియాతో మాట్లాడి తన మనసులో మాట మరోసారి బయటపెట్టారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తాయని చెప్పడం ద్వారా బీజేపీ నాయకత్వానికి తన ఆలోచనని మరోసారి స్పష్టం చేసినట్లైంది.. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. సమావేశంలో దేశ రాజకీయాలు గురించి తప్పితే ఎక్కడా రాష్డ్ర రాజకీయాల గురింవి ప్రస్తావనే రాలేదని స్వయంగా పవన్ కళ్యాణే మీడియాకి తేల్చి చెప్పేశారు. అదే చంద్రబాబు లాంటి నేత అయితే రెండు, మూడు రోజుల పాటు హైడ్రామానే నడిపించేవారని.. పవన్ కల్యాణ్‌కి రాజకీయ పరిపక్వత లేకే ఈ విధంగా మాట్లాడారని జనసేన నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.. మరో వైపు పవన్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం పొత్తులపై ఎక్కడా స్పందించలేదు.. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తాయన్న పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు స్పందించారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం ద్వారా తమ చేతులలో ఏమీ ఉండదని చెప్పకనే చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. అన్నట్లుగా జరిగింది. -వినాయక్, ఛీఫ్ రిపోర్టర్, సాక్షి టివి, విజయవాడ -
ఆ సర్వే పవన్‌కు షాకిచ్చిందా?.. పొత్తులపై కొత్త డ్రామా అందుకేనా?
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన పవన్ నేడు సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయమని ఎందుకు మాట్లాడారు.? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా అందరినీ ఏకం చేస్తానని శపథం చేసిన పవన్ నేడు పొత్తులకు ఇంకా సమయం ఉందని ఎందుకు పేర్కొన్నారు.? పొత్తుల కోసం అవసరమైతే బీజేపీ పెద్దలను ఒప్పించి తీరుతానని చెప్పిన పవన్ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా, పోత్తులతో ముందుకు వెళ్లాలా అనేది తరువాత మాట్లాడుకునే అంశమని ఎందుకు ప్రస్తావించారు? పొత్తులపై రోజుకో మాట మాట్లాడుతూ జనసేన నాయకులను, కేడర్‌ను ఉద్దేశపూర్వకంగా పవన్ ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు.? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యం అంటూ బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఊగిపోతూ తెగ మాట్లాడేవారు. దీని కోసం రాష్ట్రంలో ఉన్న పార్టీలు కలిసి ముందుకు రావాలని, ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ టీడీపీకి జనసేనకి మధ్య పొత్తు ఉంటుందనే సంకేతాలను పంపించారు. టీడీపీ, జనసేనే కాదు బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లేలా బీజేపీ జాతీయ పెద్దలను కూడా ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పదవిపై చంద్రబాబుతో జరిగిన ఒప్పందాన్ని కూడా పవన్ కళ్యాణ్ బయటపెట్టేసారు. తనకు సీఎం అయ్యే అర్హత లేదని, పొత్తుల్లో భాగంగా సీఎం అభ్యర్థి చంద్రబాబునేనని పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా తన మనసులో మాటను బయిట పెట్టారు.. సీఎం పదవి పొందాలంటే దానికి తగ్గట్టు సీట్లు ఉండాలని, అ సీట్లు తన దగ్గర లేవని స్పష్టం చేశారు.. సీఎం పదవి పొందేందుకు, అందుకు కావలసిన ఎమ్మెల్యేలు సంఖ్యా బలం తన దగ్గర లేనప్పుడు తాను ఎలా సీఎం అవుతాను అంటూ తిరిగి జనసేన నాయకులను, కార్యకర్తలను ప్రశ్నించారు.. రెండు పార్టీల పొత్తులో భాగంగా సీఎం అభ్యర్థి చంద్రబాబునేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చదవండి: అన్నా లెజెనెవా ఎవరు? పవన్‌కు ఎలా పరిచయమయ్యారు? దీంతో ఒక్కసారిగా జనసేన పార్టీలో కలకలం రేగింది.. జనసేన నాయకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు.. పవన్ సీఎం అవ్వాలని ఆశించిన కాపుల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తీరుపై ఆగ్ర ఆవేశాలు వ్యక్తం అయ్యాయి.. నువ్వు సీఎం కాలేనప్పుడు నీకు ఓటు వేయడం ఎందుకని, నీకు వేసే ఓటు కూడా దండగని మండిపడ్డారు.. చంద్రబాబును సీఎం చేయడం కోసం తమను బలి పశువులను చేయ వద్దని పవన్ కళ్యాణ్‌కు హితవు పలికారు.. కాపు నాయకుడైన వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మద్దతు పలుకుతారు అనే చర్చ జనసేన పార్టీలోనూ కాపుల్లోనూ మొదలయ్యింది.. పవన్ కళ్యాణ్ తీరుతో విసిగిపోయిన జనసేన శ్రేణులు, కాపులు జనసేన సభలకు సమావేశాలకు మొహం చాటేస్తున్నారు.. నీ ప్యాకేజీ కోసం, నీ అవసరాల కోసం కాపులందరి నీ బలి పశువులను చేస్తావా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. తాను సీఎంను కానంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అంతర్గతంగా సర్వే చేయించారనే టాక్ జనసేన వర్గాల్లో నడుస్తోంది. ఈ సర్వేలో నివేదికలు పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే విధంగా బయటపడినట్లు తెలుస్తోంది. తాను సీఎంను కాదు చంద్రబాబు సీఎం అవుతారంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానుల్లోనూ, పవన్ ను అభిమానించే కాపుల్లో వ్యతిరేకత మొదలైందనే విషయం బయటపడింది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను అభిమానించే యువతలో ఆగ్ర ఆవేశాలు వ్యక్తమయ్యాయి.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో అయితే జనసేనకు ఓటు వేయడానికి చాలామంది అసహ్యించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రజల నాడి ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు చంద్రబాబు కూడా అనేక సర్వేలు చేయించారనే ప్రచారం జరుగుతుంది.. టీడీపీ చేయించిన సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.. ఇప్పుడు కాపులు జనసేన శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు, వారి దృష్టి మరలచేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరో కొత్త డ్రామాకు తెరలేపారనే చర్చ టీడీపీ, జనసేనలో వినిపిస్తోంది. పవన్ తీరుపై వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడం కోసం అధ్యయనం తర్వాతే పొత్తులు గురించి చర్చ అంటూ పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చిలక పలుకులు పలికిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. సమయం వచ్చినప్పుడు పొత్తులు గురించి ప్రస్తావన ఉంటుందని చెబుతున్నారే తప్ప ఎక్కడ కూడా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని కానీ 175 కు 175 స్థానాల్లో జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థులు బరిలో ఉంటారని కానీ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వడం లేదు.. జనసేన కార్యకర్తలో నాయకుల నుంచి ఆగ్రహ ఆవేశాల నుంచి దృష్టి మరల్చడం కోసమే పవన్ కళ్యాణ్ కొత్తగా సమగ్ర అధ్యయనం తరువాతే పొత్తుల చర్చ అంటూ వారిని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: రాజకీయం అంటే వెబ్ సిరీస్ కాదు: పవన్‌పై మంత్రి అమర్నాథ్ ఫైర్ జనసేన నాయకులు కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ సృష్టించి పవన్ కళ్యాణ్ పై ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడం కోసమే పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. బయటికి పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నా అంతర్గతంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే సీట్లు పంపకానికి సంబంధించి కూడా చర్చలు పూర్తయ్యాయని వాదన కూడా వినిపిస్తోంది. -స్వామి నాయుడు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, విశాఖపట్నం -
బీఆర్ఎస్ తీరుపై కామ్రేడ్ల కస్సుబుస్సు
సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో బీఆర్ఎస్ తీరుపై వామపక్షాలు గరంగరంగా ఉన్నాయి. పొత్తులుంటాయా ఉండవా అనే అంశంపై సీపీఐ, సీపీఎం కేడర్‌లో గందరగోళం నెలకొంది. పొత్తులు, ప్రజాసమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను అపాయింట్మెంట్ కోరినా ఇప్పటివరకు లభించకపోవడంపై కామ్రేడ్లు కస్సుబుస్సులాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ తమను ఉపయోగించుకొని పొత్తులపై చర్చించాలనే సరికి మాత్రం పక్కనపెడుతోందని కొందరు నేతలు మండిపడుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభకు తమ జాతీయ నేతలైన కేరళ సీఎం పినరయి విజయన్, డి.రాజా వంటి వారిని వెంటపడి మరీ పిలిపించుకున్న సీఎం కేసీఆర్... ప్రస్తుతం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం ఎంబీ భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులతోనే ముందుకు... మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది బీఆర్ఎస్ మాత్రమేనని భావించి ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చాయి. అనుకున్నట్లుగానే బీజేపీ గెలవకుండా అక్కడ వామపక్షాల ఓట్లు సహకరించాయి. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించే సత్తాగల పార్టీకే మద్దతు ఇవ్వాలన్నది వామపక్షాల వైఖరి. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ను చెరో 10 అసెంబ్లీ స్థానాలు కోరాలనుకుంటున్నాయి. చర్చల్లో చివరకు చెరో ఐదు స్థానాలు తప్పనిసరిగా అడగాలన్నది వారి ఉద్దేశం. కానీ ఈ స్థానాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదన్న వాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్‌లున్న ఆయా స్థానాలను కామ్రేడ్లకు ఇవ్వడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు అలిగి సహకరించకపోతే ఓటు బదిలీ జరగక వారు ఓడిపోయే ప్రమాదం ఉందన్న భావనలో బీఆర్ఎస్ ఉందని వామపక్షాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పది సీట్లు ఇచ్చినా వామపక్షాలు డబ్బు ఖర్చు పెట్టవని, దానివల్ల కూడా సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకొనే దిశగా కూడా వామపక్షాలు ఆలోచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తుపై ఆసక్తి చూపించడంలేదని సమాచారం. -
మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇంఫాల్: మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా మైతీలు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడికిపోయిన ఇంఫాల్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో ప్రభుత్వం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దింపింది. కొన్ని జిల్లాల్లో నిరసనకారులకి, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం కేంద్రం మరో 20 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల్ని పంపింది. మరోవైపు రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేసింది. -
చంద్రబాబు-పవన్ భేటీలో ఏం జరిగింది? అసలు సమస్య అదేనా?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. పూర్తి స్థాయిలో ప్రస్టేషన్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎలాగొలా తాము కలిసి ఉన్నామన్న సంకేతం పంపడం ద్వారా అయినా తమ విజయావకాశాలు పెంచుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. అందువల్లే రాజకీయ విలువలతో నిమిత్తం లేకుండా వీరిద్దరూ భేటీ అవుతున్నారు. నేరుగా తెలుగుదేశంతో ఇంతవరకు జనసేన పొత్తు పెట్టుకోలేదు. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన నిత్యం టీడీపీతో కలిసి తిరుగుతోంది. గతంలో టీడీపీ వారు తనను ఎంతో అవమానించారని పవన్ వాపోయినా, ఇప్పుడు అవన్ని మర్చిపోయి, కనీసం తనైనా ఎమ్మెల్యేగా గెలవాలన్న తాపత్రయంతో చంద్రబాబుతో పొత్తు కోసం తహతహ లాడుతున్నారు. చంద్రబాబు ఏమో పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపు సామాజికవర్గ ఓట్లను లాగి అధికారం సాధించాలని ప్లాన్ వేస్తున్నారు. చంద్రబాబు చేసిన ఘోర పరాభవాలను మర్చిపోలేని భారతీయ జనతా పార్టీవారు తాము టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. భవిష్యత్తులో ఏమి అవుతుందో కాని, ఇప్పటికైతే టీడీపీ, జనసేన దాదాపు ఒక అవగాహనకు వచ్చేసినట్లే ఉన్నాయి. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన నేపథ్యంలో సహజంగానే అది పెద్ద రాజకీయ వార్త అవుతుంది. బీజేపీతో కాపురం, టీడీపీతో సహజీవనం చేస్తున్న పవన్ కల్యాణ్ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఒకటి అవడానికి యత్నిస్తున్నారు. నిజానికి వీరు ఇద్దరూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు. అఫ్ కోర్స్ .. ఇంకా ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనాం చేయాలి? ఎన్ని రకాలైన అబద్దపు కుట్రలు పన్నాలి అన్న విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు. మీడియా సమావేశం తర్వాత వీరిద్దరూ చెప్పిన మాటలు విన్న తర్వాత ఈ అభిప్రాయం కలుగుతుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే కొత్త ఎజెండాను ప్రకటించవచ్చు. విమానాశ్రయాలలో ఏ పార్టీ వారు అయినా పూలకుండీలు పగులకొట్టి, విధ్వంసం చేయవచ్చని వీరు హామీ ఇవ్వవచ్చు. ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ కారు టాప్‌పై తన ఇష్టం వచ్చినట్లు కూర్చున్నట్లుగా ఏపీలో ప్రజలు ఎవరైనా, కారుపై గాలితనంగా కూర్చోవచ్చనే హామీ ఇవ్వవచ్చు. రోడ్డుపై ఎవరు పడితే వారు తమ ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించవచ్చు. అయినా పోలీసులు ఏమైనా చర్య తీసుకుంటే వారిని టెర్రరిస్టులుగా ప్రకటించి తమ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని వీరిద్దరూ ఎన్నికల హామీగా ఇవ్వవచ్చు. రోడ్డుపై సభలు పెట్టి తొక్కిసలాటలు జరిగినా కేసులు ఉండవు. కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకుంటాం. తొక్కిసలాటలలో మరణిస్తే వారి ఖర్మే తప్ప, సంబంధిత పార్టీకి ఎలాంటి బాధ్యత ఉండదని చెప్పవచ్చు. తెలుగుదేశం, జనసేన సభలకు భారీ ఎత్తున జనసమీకరణకు కానుకలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించవచ్చు. ఈ కొత్త ఎజెండాతో వీరు ఎన్నికలకు వెళితే ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుందని వారు ఆశిస్తున్నారేమో తెలియదు. కందుకూరులో ఎనిమిది మంది తొక్కిసలాటలో మరణిస్తే పవన్ కల్యాణ్ వారిని ఎందుకు పరామర్శించలేకపోయారు? టీడీపీ వారి బాధ్యతారాహిత్యాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? గుంటూరులో కానుకల పేరుతో చంద్రబాబు సభకు జనాన్ని పోగుచేసి తొక్కిసలాటకు కారణమైన వారిని ఒక్క మాట అనని పవన్ కల్యాణ్, ప్రభుత్వం రోడ్లపై సభలు వద్దన్న జీఓతో ప్రజాస్వామ్యానికి ఏదో జరిగిపోయినట్లు చంద్రబాబుతో కలిసి మాట్లాడడం అంటే వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కుప్పంలో నిబంధనలు పాటించాలని కోరితే చంద్రబాబు పోలీసులను, ముఖ్యమంత్రి జగన్‌ను నోటికి వచ్చినట్లు దూషించి అదే ప్రజాస్వామ్యం అని అంటుంటే పవన్ అవునవును అంటున్నారు. బ్రిటిష్ కాలపు నాటి చట్టం అని చంద్రబాబు అంటుంటే అవును కదా అని తాన అంటే తందానా అంటున్నారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలలో రోడ్లపై నిరసన తెలిపినా కఠిన శిక్షలు ఉంటాయి. జరిమానాలు ఉంటాయి. కాని ఏపీలో మాత్రం రోడ్లు రాజకీయ పార్టీల వికృత క్రీడలకు వేదికలు అవుతున్నాయి. రోడ్డు మీద సభ పెడితే జన సమీకరణకు మరీ ఎక్కువ కష్టపడనవసరం లేదు. చుట్టు పక్కల ఉన్నవారంతా సభకు వచ్చినట్లే ప్రచారం చేసుకోవచ్చు. ఎటూ డ్రోన్ల ద్వారా ఉన్నవి, లేనట్లు, లేనివి ఉన్నట్లు చూపించవచ్చు. బహిరంగ సభకు జనం రాకపోతే పరువు పోతుందన్న భయం ఉండవచ్చు. ఈ జీఓకి వ్యతిరేకంగా ఏమి చేసేది చంద్రబాబు, పవన్‌లు ఎలాంటి కార్యాచరణను ప్రకటించలేదు. మరి వీరు ఏమి చర్చించి ఉంటారు? కచ్చితంగా వచ్చే ఎన్నికలలో పొత్తు ఎలా పెట్టుకోవాలి? బీజేపీని తమ గూటిలోకి ఎలా లాక్కురావాలి? ఒక వేళ వారు రాకపోతే, వీరిద్దరూ ఎలాంటి పొత్తు పెట్టుకోవాలి? మొదలైన విషయాలను చర్చకు వచ్చి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పనే చెప్పేశారు. రాజకీయాలలో పొత్తులు ఉంటాయని, గతంలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకున్న సంగతి చెప్పి ఉండాలి. కావాలనే ఆయన ఆ పాయింట్ చెప్పకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతకీ ముఖ్యమంత్రి పదవిని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారా? లేదా? కోరుకుంటే ఆ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారా?. తాము గెలిస్తే తనకు కాకుండా పవన్ కల్యాణ్‌కు సీఎం సీటు ఇస్తామని ఆయన చెప్పగలరా?. గతంలో ఎప్పుడూ తామే త్యాగం చేయాలా అని బాధపడ్డ పవన్ కల్యాణ్ దీనిపై పట్టుబట్టే శక్తి కలిగి ఉన్నారా? లేక చంద్రబాబు చెప్పే మాటలకు బుట్టలో పడిపోతారా? లేక తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పెద్ద పదవి అని సరిపెట్టుకుంటారా? ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు పలు విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ సంక్రాంతి కానుక అందుకోవడానికి తనను దత్తత తీసుకున్న తండ్రి వద్దకు వెళ్లారని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ సీఎం పదవితో నిమిత్తం లేకుండా పవన్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఏదో ప్యాకేజీ డీల్‌కు అమ్ముడు పోయారన్న విమర్శలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చదవండి: జీ హుజుర్.. చంద్రబాబుతో పవన్ భేటీ అందుకే.. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించే అవకాశం లేదు. అందుకే ఆయా పార్టీలను కలుపుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో జగన్ ఎంత బలవంతుడుగా ఉన్నది చెప్పకనే చెబుతున్నారనుకోవచ్చు. ఏది ఏమైనా ఏదో ఒక పేరుతో చంద్రబాబు, పవన్‌లు తరచుగా భేటీ అవుతూ టీడీపీ, జనసేన క్యాడర్‌కు ఒక సంకేతం పంపడానికి తంటాలు పడుతున్నారని అర్ధం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాలలో కమ్మ, కాపు సామాజికవర్గాల మధ్య చాలా అంతరం ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడని రాజకీయ వాతావరణం ఉంటుంది. దానిని తగ్గించడానికి వీరు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారని గమనించవలసి ఉంటుంది. బీజేపీని వదలిపెట్టి అయినా చంద్రబాబు వేలు పట్టుకుని నడవడానికి పవన్ కల్యాణ్ సిద్దపడుతున్నారన్న విషయం ఈ భేటీలతో బోధపడుతుంది. ఎజెండాతో నిమిత్తం లేకుండా ఇలా అనైతిక పొత్తులను ఏపీ ప్రజలు ఆమోదిస్తారా? అన్నదే అసలు సమస్య. -హితైషి -
పొత్తు తెచ్చిన చిక్కులు.. గులాబీ పార్టీలో టెన్షన్
తెలంగాణలో ఎర్ర పార్టీలు, గులాబీ పార్టీ ఏకమవుతున్నాయా? మునుగోడు ఫలితం వారిని మరింత దగ్గర చేసిందా? అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్ పొత్తు ఖరారైందా? అవుననే అంటున్నాయి వామపక్షాల శ్రేణులు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సీట్లు కూడా పంచుకుంటున్నారు. మరి గులాబీ పార్టీలో సిటింగ్‌లు, ఆశావహుల రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోంది? వారు ఏం చేయబోతున్నారు? పాలేరులో ఎవరు పోటీ? ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనరల్ సీట్లు. ఖమ్మంకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పాలేరుకు కందాల ఉపేంద్రరెడ్డి ఎమ్మెల్యే. ఈ సీటు కోసం కందాల, మాజీ మంత్రి తుమ్మల మధ్య పోరు సాగుతోంది. ఇంతలో పాలేరు నియోజకవర్గంలో ఎర్ర జెండా ఎగురుతుందంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన కామెంట్ జిల్లాలో సంచలనం రేపింది. గులాబీ కోటలో టెన్షన్ పెరుగుతోంది. పొత్తుల్లో భాగంగా పాలేరులో తానే పోటీ చేస్తానని పార్టీ సర్కిల్స్‌లో తమ్మినేని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. మరి సిటింగ్ ఎమ్మెల్యే కందాల, సీటుపై ఆశపడుతున్న తుమ్మల పరిస్తితి ఏంటనే చర్చ జిల్లాలో హాట్ హాట్‌గా సాగుతోంది. గ్రౌండ్లో ఎంట్రీ ఇచ్చేశారు వామపక్షాలతో పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని కొంతకాలంగా ఖమ్మం జిల్లాలోని గులాబీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. అయితే పొత్తుపై అగ్ర నాయకులకు క్లారిటీ ఉందని, గులాబీ, ఎర్ర పార్టీల శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాల్సిన రోజులొస్తున్నాయని సూచనలు అందుతున్నాయి. ఇంతలో పాలేరు నియోజకవర్గం పరిదిలోని ముత్తగూడెంలో జరిగిన సిపిఎం నేతల సమావేశంలో తమ్మినేని వీరభద్రం పొత్తుపై చేసిన కామెంట్స్ జిల్లాలో సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పాలేరులో ఎర్రజెండా ఎగరబోతోందని తమ్మినేని కార్యకర్తలకు చెప్పారు. పార్టీకి పట్టున్న గ్రామాల్లో నాలుగు నెలలుగా పర్యటిస్టున్న తమ్మినేని వీరభద్రం కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీల శ్రేణుల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే గులాబీ పార్టీ శ్రేణులే ఈ పరిణామాల్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ముచ్చటగా ముగ్గురికి ఆశలు పాలేరు సీటు సీపీఏంకు ఇస్తే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు పరిస్థితేంటన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఇద్దరు నేతలు టికెట్ పై ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాలేరు తనకే టికెట్ వస్తుందని, మరోసారి తాను ఎమ్మెల్యే కావడం ఖాయమని కందాల అనేక సార్లు చెప్పారు. ఇటు తమ్మల నాగేశ్వరరావు కూడ టికెట్ పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఇటివలే ములుగు జిల్లా వాజేడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సైతం తాను కేసీఆర్ వెంటే ఉంటానంటూ ప్రకటించారు. దీంతో తుమ్మలకు పాలేరు టికెట్ పై కేసీఆర్ ఇంటర్నల్‌గా ఏమైన భరోసా ఇచ్చారా అన్న చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో నడిచింది. ఇద్దరు నేతలు టికెట్ కోసం తీవ్రస్థాయిలో పోటి పడుతుంటే మధ్యలో సీపీఎం వచ్చి టికెట్ తనకే అనడంతో అసలు పాలేరు టీఆర్ఎస్లో ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లయితే పాలేరు సిటింగ్ ఎమ్మెల్యే కందాల, మాజీ మంత్రి తుమ్మల కచ్చితంగా జంప్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ నుంచి వచ్చేవారి కోసం కాంగ్రెస్, బీజేపీలు ఎదురు చూస్తున్నాయి. పాలేరులో ఇంకా ఎన్ని రాజకీయ సంచలనాలు జరుగుతాయో చూడాలి. చదవండి: తెలంగాణలో మరో పాదయాత్ర?.. ఆ నాయకుడెవరు? -
ఎన్నికలనాటి పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో పొత్తులు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో తమ పొత్తులు, అవగాహనలు ఉంటాయని సీపీఐ జాతీయ ప్రధా నకార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికశక్తులు, ప్రాంతీయ పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టు కుంటుందని వెల్లడించారు. తెలంగాణలోనూ ఇదే వైఖరి అవలంభిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ముందస్తుగానే ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన డి.రాజా గురువారం విలే కరులతో మాట్లాడారు. 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ వాగ్దానం ఏమైందని రాజా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను గవర్నర్లు ముందుకు తీసుకెళ్తున్నారని, ఇటీవల తమిళనాడు గవర్నర్ సనా తన ధర్మాన్ని ప్రస్తావించిన విషయాన్ని రాజా గుర్తుచేశారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లే అంశంలో తన ఆలోచనను మార్చుకోవాలని సూచించారు. అనేక ప్రాంతీయ పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని, బిహార్‌లో నితీశ్‌కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఒక కూటమిగా ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో ముందుకు సాగుతామన్నారు. గుజరాత్లో బీజేపీ ఓటమిపాలైతే, అక్కడి నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభం కానుందన్నారు. మిలియన్ సభ్యత్వాలు... మరో రెండేళ్లలో సీపీఐ శతాబ్ది వార్షికోత్సవానికి చేరుకోబోతున్న సందర్భంగా మిలియన్ సభ్యత్వాలను చేర్పించాలని రాజా పిలుపునిచ్చారు. కార్పొరేట్ ఫండ్స్‌లో బీజేపీకి ఎక్కువ వస్తున్నాయని, దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీ బీజేపీ అని, అధికారంలోనికి వచ్చేందుకు ఆ పార్టీ విపరీతమైన డబ్బులను వెదజల్లుతోందని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడేమీ చెప్పలేం: కూనంనేని ఎన్నికల పొత్తులో భాగంగా తాము బలంగా ఉన్న నల్లగొండ, ఇతర జిల్లాల్లోని స్థానాలను అడుగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. బీజేపీని ఓడించే బల మైన ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతోనే ఎన్నికల అవగాహన ఉంటుందన్నారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని స్పష్టంచేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడు తూ.. ప్రైవేటు విమానాల ద్వారా హవాలా డబ్బు, బంగారు ఆభ రణాలు తరలుతున్న నేపథ్యంలో ప్రైవేటు విమానాలలో తనిఖీ చేపట్టాలని, వీటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
మహారాష్ట్రలో మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్‌కు చెక్ పెట్టేందుకు పావులు
సాక్షి ముంబై: శివాజీపార్క్ సాక్షిగా మరో మహాకూటమి అవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) దీపావళిని పురస్కరించుకుని శివాజీపార్క్‌లో శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. దీంతో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శిందే వర్గం, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా రాజ్ ఠాక్రే కూడా వారి ఇంటికి వెళ్లి గణేశుడిని దర్శించుకోవడం ఆ సందర్భంగా బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి.. రాబోయే రాష్ట్రంలో కొత్తగా మహాకూటమికి శివాజీపార్క్‌లో బీజం పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు తారుమారైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయగా మరోవైపు బీజేపీ మద్దతులో ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ రాజకీయ పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన ఉత్పాతం సంభవించదని చెప్పొచ్చు. అనంతరం ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ, చిహ్నాన్ని రెండింటినీ తాత్కాలికంగా సీజ్ చేయడం ఆ తర్వాత ఉద్దవ్‌ఠాక్రేకు శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే పారీ్టగా, ఏక్నాథ్ శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన పార్టీగా ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మండుతున్న కాగడా (మశాల్), శిందే వర్గానికి కత్తులు డాలు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే పోటీ పడనున్నాయి. అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ, శిందే వర్గం నేతలు రాజ్ ఠాక్రేతో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్ ఈ విషయంపై పలుమార్లు బీజేపీ నాయకులు కూడా పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఆహా్వనం మేరకు ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఎమ్మెన్నెస్ దీపోత్సవానికి హాజరుకావడంతో పలు రకాల చర్చలకు ఊతం వచ్చేలా చేసింది. ముఖ్యంగా శివాజీపార్క్‌లో జరిగిన ఎమ్మెన్నెస్ దీపోత్సవ కార్యక్రమంలో శిందే, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమికి బీజం పడిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాత్రం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు. ఎప్పట్నుంచో కలవాలనుకున్నాను:సీఎం ఏక్నాథ్ శిందే ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఎప్పట్నుంచో కలవాలని ఉన్నప్పటికీ రాజకీయాల్లో తీరికలేని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు కలవలేకపోయానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు. ముఖ్యంగా గత పదేళ్లుగా ఎమ్మెన్నెస్ దీపోత్సవాలను నిర్వహిస్తోంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా అనేక నిర్బంధాలున్నాయి. అయితే ఈసారి మాత్రం మహమ్మారి తగ్గిపోవడంతో గణేశ్ ఉత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలతోపాటు దీపావళి ఉత్సవాలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. గతంలో మనసులో కలవాలన్న కోరిక ఉన్నప్పటికీ కలువలేకపోయాను. కానీ ఇప్పుడు దీపోత్సవం సందర్భంగా ఇలా కలిసేందుకు అవకాశం లభించిందన్నారు. -
సాక్షి కార్టూన్: 06-06-2022
టీడీపీతో పొత్తుకోసం ఎన్ని ఆప్షన్లయినా పెట్టుకుందాం సార్!! -
Somu Veerraju: టీడీపీతో పొత్తుపై సోమువీర్రాజు స్పష్టత
నల్లజర్ల: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనంతోనే తమ పార్టీ పయనిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే జనసేనతో కలుస్తామని, కానీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు. జూన్ 5న రాజమహేంద్రవరం, 6న విజయవాడలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలు జరుగనున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి శివనాగరాజు ఇంటివద్ద మంగళవారం జరిగిన శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని అభివృద్ధి చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యమన్నారు. చదవండి: (పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు) -
వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఢీకొట్టే ధైర్యం లేదా?
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఈ నెలాఖరుకు మూడేళ్లు నిండుతాయి. గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెల్చుకుని చరిత్ర సృష్టించడంతో పాటు ఆ తరువాత జరి గిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలోనూ అఖండ విజయాలు సాధించి... ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, అసెంబ్లీలో చోటు దక్కించుకోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వెన్నులో వణుకు పుట్టించింది. చివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాకాలోని తెలుగుదేశం కంచు కోట కుప్పం మునిసిపాలిటీని సైతం కొల్లగొట్టి ఆ పార్టీ అభిమా నులనూ, నాయకులనూ నిశ్చేష్టులను చేసింది. పాలనాపరంగా చూస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రెండేళ్లు కరోనా కష్టాలతోనే గడిచిపోయింది. కరోనా క్లిష్టపరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు ప్రశంసాపాత్రమైంది. వాలంటీర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించుకుని లబ్ధిదారులకు అన్ని రకాల సంక్షేమ పథకాలనూ అందించగలిగింది. ఈ విషయంలో జగన్ సర్కార్ ప్రజల జేజేలు అందుకుంది అనడంలో సందేహం లేదు. అయితే దేశమంతటా అలుముకున్న బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా తాత్కాలిక కరెంట్ కష్టాలను ఎదుర్కోక తప్పలేదు. ప్రతిపక్షాల విషయానికి వస్తే గత ఆరు నెలలుగా చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఎక్కడ మరణవార్త దొరికితే అక్కడికి పరిగెత్తి శవ రాజకీయాలు చెయ్యడంలో దిట్ట అనిపించుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ మహిళల మీద జరిగిన దాడులను తన మీడియా ద్వారా గోరంతలు కొండంతలు చేయిస్తూ ప్రభుతం పట్ల ప్రజల్లో ద్వేషాన్ని నింపాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి దుస్సంఘటనలు సంభవించినపుడు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పచ్చ మీడియా వాటిని కప్పిపుచ్చి ప్రభుత్వం మీద విషం చిమ్మడానికే ప్రాధాన్యం ఇస్తోంది. వాటి దుర్మార్గం ఎంతవరకూ వెళ్లిందంటే ఎంతో సహనంతో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కూడా ‘దుష్టచతు ష్టయం’ అనే పదప్రయోగం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. సమతూకంగా వార్తలు అందించాల్సిన మీడియా ప్రతిపక్షాల కన్నా రెచ్చిపోవడం, ప్రభుత్వం మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చెయ్యడం చూస్తుంటే వైసీపీ బలం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వైసీపీకి పదిహేను స్థానాలు కూడా రావు... జగన్మోహన్రెడ్డికి ఇదే చివరి అవకాశం.. అంటూ ఊదరగొడుతున్న విపక్షాలు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం, పొత్తులు పెట్టుకుందాం అని పిలుపులు ఇచ్చు కోవడం ఏమిటో అర్థం కాదు. నిజంగా వైసీపీ మీద అంతటి వ్యతిరేకతే ఉంటే ప్రజలే ఓడిస్తారు కదా! చంద్రబాబైతే మరీ ఆత్ర పడుతూ త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపు ఇస్తున్నారు! ఎవరు త్యాగాలు చెయ్యాలి? ఎవరి కోసం త్యాగం చెయ్యాలి? ‘మీరందరూ త్యాగం చెయ్యండి, నాయకత్వ బాధ్యతను నాకు వదిలేయండి’ అని బహి రంగంగానే పిలుపునిస్తున్నారు. (చదవండి: రామోజీ స్కూల్ నుంచి లాజిక్ లేని పాఠాలు) అంటే తనను ముఖ్యమంత్రిని చెయ్యడమే త్యాగాల పరమార్థం అన్నమాట. మరి అందుకు బీజేపీ, జనసేన సిద్ధం అవుతాయా? ముఖ్యమంత్రి కావాలనే జనసైనికుల ఆకాంక్షను జనసేనాధిపతి చంద్రబాబు కోసం త్యాగం చేస్తారా? మొన్నటిదాకా మోదీని తీవ్రాతి తీవ్రంగా దుమ్మెత్తి పోసిన చంద్రబాబు కోసం రాష్ట్ర బీజేపీ ఏ మేరకు త్యాగాలు చేస్తుంది? సామాన్యుడికి అర్థం కాని విషయం ఏమిటంటే, వైసీపీ పట్ల విపక్షాలు ఊహిస్తున్నంత వ్యతిరేకత జనంలో ఉంటే ఇంత మంది కట్టగట్టుకుని త్యాగాలు చెయ్యాలా? వైఎస్ జగన్ మీద అంత వ్యతిరేకత ఉంటే ఏ ఒక్క పార్టీకైనా ఒంటరిగా వెళ్లి జగన్‌ను ఢీకొట్టే ధైర్యం లేదా? ఏమిటో అంతా గమ్మత్తు! - ఇలపావులూరి మురళీ మోహన రావు సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
Sakshi Cartoon: ఎన్ని ఎత్తులు వేసిన.. ఎంత వేడుకున్నా పొత్తులుండవ్..
ఎన్ని ఎత్తులు వేసిన.. ఎంత వేడుకున్నా పొత్తులుండవ్.. ప్రస్తుతానికి... -
చంద్రబాబు రాజకీయ జీవితమే పొత్తుల మయం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: చంద్రబాబు రాజకీయ జీవితమే పొత్తుల మయం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన మంత్రి.. సచివాలయాల నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తామన్నారు. చదవండి: ఎల్లో చానెల్లో మీటింగ్‌లు.. చాటింగ్‌లు -
బీజేపీతో పొత్తు లేదు.. వైఎస్ షర్మిల
భద్రాచలం/బూర్గంపాడు: బీజేపీతో తమ పార్టీకి పొత్తు ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని, అలాంటివేమీ ఉండవని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమాన్ని అందించిన వైఎస్సార్ కూతురుగా తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. అలాగే ఏపీలో తన అన్న జగన్‌తో గొడవల వల్లే తెలంగాణలో పార్టీ స్థాపించానని కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ జగనన్నతో తనకు ఎలాంటి గొడవలు లేవని షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్పై తీరుపై ధ్వజమెత్తారు. యాదాద్రి, భద్రాద్రి.. తనకు రెండు కళ్లని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, యాదాద్రిపై తల్లి ప్రేమను, భద్రాద్రిపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే యాదాద్రిని అభివృద్ధి చేశారని, భద్రాద్రిలో వారికి భూములు లేనందున అనాథగా వదిలేశారని పేర్కొన్నారు. చిన్న జబ్బులకే ఢిల్లీకి పరుగెత్తే సీఎం కేసీఆర్‌కు.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గిరిజనులు పడుతున్న అవస్థలు కనిపించవా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించకుండా గోదావరిని కలుషితం చేస్తున్నారని, గంగా ప్రక్షాళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గోదావరి కనిపించటం లేదా అని నిలదీశారు. అంతకు ముందు బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో నిర్వహించిన రైతుగోస ధర్నాలో ఆమె ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా చేశామని చెప్పుకుంటున్న పాలకులు.. రైతులు కూలీలుగా ఎందుకు మారుతున్నారో వివరించాలని అన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గిరిజన రైతుల నుంచి భూములు లాక్కుని మొక్కలు నాటడమేనా రైతును రాజును చేయటమంటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు తెలంగాణలో అసలు గుర్తింపు లేకుండా పోయిందని విచారం వ్యక్తంచేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని అన్నారు. బూర్గంపాడు మండలం కొత్తూరులో ప్రారంభమైన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇరవెండి, కోయగూడెం, తాళ్లగొమ్మూరు, సారపాక గ్రామాల మీదుగా భద్రాచలం వరకు కొనసాగింది. -
అమెరికా సంచలన నిర్ణయం..! చైనాకు చావు దెబ్బే..?
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సెమికండక్టర్ విభాగంలో డ్రాగన్ కంట్రీను ఢీ కొట్టేందుకుగాను అమెరికా ఒక సెమీకండక్టర్ పరిశ్రమ కూటమిని ఏర్పాటుచేసేందుకు పావులను కదుపుతోంది. 4 దేశాల సెమీకండక్టర్ కూటమి..! అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో సెమీకండక్టర్ పరిశ్రమ కూటమిని ఏర్పరచాలని అమెరికా ప్రతిపాదించినట్లు సమాచారం. సెమికండక్టర్ పరిశ్రమలో ఆధిపత్యాన్ని చెలాయిస్తోన్న చైనాకు ఆగడాలకు నిరోధించేందుకుగాను అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అమెరికా ప్రతిపాదనపై దక్షిణ కొరియా పూర్తిగా అంగీకరించలేదని తైవాన్ న్యూస్ నివేదించింది. దక్షిణకొరియాకు యూఎస్ సహకారం మొదటి ప్రాధాన్యతగా ఉన్నప్పటీకి, సెమికండక్టర్ వ్యాపారంలో అతి పెద్ద కస్టమర్‌గా చైనా నిలుస్తోండడంతో..అమెరికా నిర్ణయంపై దక్షిణకొరియా తడబడే అవకాశం లేకపోలేదని తైవాన్ న్యూస్ వెల్లడించింది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..! సెమికండక్టర్ పరిశ్రమలో చైనా హావా..! ప్రపంచంలోని అత్యధిక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లను చైనా తయారు చేస్తోంది. కాగా ఈ గాడ్జెట్లను నిర్మించేందుకు ఆయా దేశాల సెమికండక్టర్లను దిగుమతి చేసుకుంటుంది. ఇక మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ తన భారీ మౌలిక సదుపాయాలను చైనాలో కల్గింది. దీంతో దక్షిణకొరియా వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు. ఇక సెమీ కండక్టర్ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా ఉన్న తైవాన్ను చైనా తన అధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అదే జరిగితే..! నాలుగు దేశాలతో సెమికండక్టర్ కూటమిను అమెరికా ఏర్పరిస్తే చైనాకు భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక తైవాన్ విషయంలో చైనా అవలంభిస్తోన్నతీరును చెక్ పెట్టవచ్చునని అమెరికా భావిస్తోంది. సెమికండక్టర్ పరిశ్రమలో రారాజు అయ్యేందుకుగాను చైనా తన కుటీల బుద్దిని ప్రదర్శిస్తోంది. తైవాన్‌కు చెందిన వాణిజ్యరహస్యాలను దొంగిలించడం, ఆ దేశ ఉద్యోగులపై గూఢాచర్యం వంటి ఆరోపణలను చైనా ఎదుర్కొంటుంది. ఇప్పటికే తైవాన్ దేశ న్యాయస్థానం చైనాకు చెందిన పలు కంపెనీలను విచారణ కూడా చేసింది. సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధిలో సెమీకండక్టర్లు లేదా 'చిప్స్' ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్‌గా నిలుస్తాయి.వీటి విషయంలో ఈ నాలుగు దేశాలు ఒక్కటైతే చైనా ఆగడాలకు చెక్ పెట్టే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇది కేవలం అమెరికా చేసిన ప్రతిపాదన మాత్రమే. ఈ నిర్ణయంపై కాలమే సమధానం చెప్పనుంది. చదవండి: భారత్ నుంచి నిష్క్రమణ..యాక్సిస్ బ్యాంకులో విలీనమైన దిగ్గజ బ్యాంకు..! -
బీజేపీది వన్ గేర్ కారు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరంగా ఓట్లను సంఘటితం చేసే రాజకీయాలకు ఇక చోటులేదని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌధురి అన్నారు. హిందుత్వ ఎజెండా రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ముస్లిం వ్యతిరేకతని తమ నైపుణ్యం అంతా ఉపయోగించి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత చేసినా... ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి సవాల్ విసురుతున్న జయంత్ చౌధరి ఒక వార్తా సంస్థతో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ప్ర: బీజేపీని వీడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎందుకు ఎస్పీలో చేరుతున్నారు ? జ: గత అయిదేళ్లుగా ప్రభుత్వంలో ఉండి ప్రజలకి ఏమీ చెయ్యలేకపోయామన్న అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. సరైన ప్రత్యామ్నాయం కనిపించగానే వరసపెట్టి వస్తున్నారు. ప్ర: ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఉందా? జ: విపక్షాల ఓట్లు చీలిపోయే ప్రసక్తే లేదు. గత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు ఎస్పీ కూటమి వైపే చూస్తున్నారు. పాలనా వైఫల్యం, నాయకత్వ లోపాలు, కాగడావేసి చూసినా కనిపించని అభివృద్ధి.. వీటన్నింటితో ఓటర్లు బీజేపీకి దూరమవుతున్నారు. ప్ర: హిందూత్వ రాజకీయాలు ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? జ: గత అయిదేళ్లలో హిందుత్వ ఎజెండాతో ఎన్నో ఘటనలు జరిగాయి. విద్వేషం రాజేయడం, దాడులు జరపడం కళ్లారా చూశాం. వాటితో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రజలు గ్రహిస్తున్నారు. మథురలో మందిరం అంశంపై బీజేపీ పిలుపునిస్తే పట్టుమని పది మంది కూడా రాలేదు. మతం, మందిరం అంటే ప్రజలు వినే రోజులు పోయాయి. బీజేపీ వన్ గేర్ కారులో వెనక్కి వెళుతోంది. ప్ర: ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలేమిటి? జ: రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కీలకం కానున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేసిన నిరసనలతో వారు బీజేపీపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తోంది. ప్ర: ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి విజయావకాశాలు ఎంత? జ: హిందుత్వ ఎజెండా ఓట్లను సంఘటితం చేస్తూ ఉండడం వల్ల ఇన్నాళ్లూ మేమెంతో నష్టపోయాం. ప్రజలెదుర్కొంటున్న అసలు సిసలు సమస్యలపై మేము దృష్టి పెట్టాం. ప్రజలు ఇప్పుడు మార్పుని కోరుకుంటున్నారు. దేశంలో ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా మరెక్కడా లేని విధంగా పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తామని హామీ ఇచ్చాం. 22 తీర్మానాలతో మా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది.అందుకే మా గెలుపు ఖాయం. -
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్‌బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్‌బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్‌బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్‌బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్‌ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్‌లను అధ్యయనం చేసేందుకు పీఎస్‌బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్‌బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్‌బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్‌బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్‌కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్‌కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
కాంగ్రెస్‌కు టీజేఎస్, టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు
సాక్షి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉపఎన్నిక అంకం నామినేషన్ల ఉపసంహరణకు చేరుకుంది. ఈ ప్రక్రియతో ఈ ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారో నేడు (గురువారం) తేలనుంది. బలమైన కొందరు ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీ లు బుజ్జగించాయి. నామినేషన్ ఉపసంహరించుకొని తమతో ప్రచారం నిర్వహించా లని చర్చలు జరిపాయి. ఇక ఉప ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారాయి. టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ ఇప్పటికే ప్రకటించగా, కాంగ్రెస్‌కు తమ మద్దతని తెలం గాణ జన సమితి తేల్చి చెప్పింది. తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణతో సీపీఎం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా..నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. హస్తం వైపు టీజేఎస్.. ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీపీఐ, టీజేఎస్ నేతలతో మంతనాలు చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ రెండు పార్టీలు ఆందోళన చేస్తున్నాయని, తమకు మద్దతు తప్పకుండా లభిస్తుందని కాంగ్రెస్ ఆశించింది. సీపీఐతో టీఆర్ఎస్ కూడా చర్చలు చేయడంతో ఆ పార్టీ.. టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక మిగిలిన టీజేఎస్ పలుమార్లు రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై చివరకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు నిర్ణయం వెలువరించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ నెల 4న హుజూర్నగర్ రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంట్ల ధర్మార్జున్ తెలిపారు. నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్‌కు మద్దతుగా చేయాల్సిన ప్రచార ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిసింది. టీజేఎస్ మద్దతు ఇవ్వడంతో తమ బలం మరింత పెరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌కు లాభిస్తుందని చర్చించుకుంటున్నారు. కారెక్కిన.. కంకికొడవలి.. టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ప్రకటించారు. తమ పార్టీకి ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు.. సీపీఐ నేతలతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. గత ఎన్నికలతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలమయ్యాని అప్పటికి, ఇప్పటికి క్షేత్రస్థాయిలో తమ బలం పెరిగిందని విజయం తమదేనని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. సీపీఐతో పాటు మాలమహానాడు కూడా పార్టీకి మద్దతు తెలపడంతో మెజార్టీ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ నెల 4న పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హుజూర్‌నగర్‌లో రోడ్డు షోకు హాజరవుతున్నారని, నియోజవర్గ వ్యాప్తంగా శ్రేణులు తరలిరావాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోడ్డు షోలో సీపీఐ, మాల మహానాడు నేతలు కూడా పాల్గొనున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన కొంతమంది నియోజకవర్గ నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ..టీడీపీ ఒంటరి పోరు.. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగాయి. ఈ రెండు పార్టీల నేతలు ఏ గ్రామం, మండల కేంద్రాల్లో తమ వాస్తవ బలం ఎంత ఉందో అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం అస్త్రంగా బీజేపీ చేసుకుంది. బరిలో ఉన్న అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో భారీగా ఉన్నాయని, ఈ ఓట్లతో పాటు ఇతర కులాల ఓట్లు తమ గెలుపునకు నాంది అని ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. టీడీపీకి ఎన్ని ఓట్లు పడతాయన్నది రాజకీయంగా చర్చ సాగుతోంది. సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరణ కావడంతో పార్టీ నిర్ణయమేంటో తేల్చలేదు. జిల్లా నేతల అభిప్రాయం తీసుకొని రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిసింది. బలమైన ఇండిపెండెంట్లకు బుజ్జగింపులు.. గత ఎన్నికల్లో పోటీ చేసి తమ విజయావకాశాలు దెబ్బ కొట్టడం, గెలిచినా మెజార్టీకి గండికొట్టిన బలమైన ఇండిపెండెంట్లు కొందరిని ప్రధాన రాజకీయ పార్టీలు బుజ్జగించినట్లు సమాచారం. ఈ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుండడంతో విజయంతో పాటు మెజార్టీని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 31మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందితే ఇందులో 18మంది ఇండిపెండెంట్లు కాగా, 13మంది రాజకీయ పార్టీల అభ్యర్థులు. ఇండిపెండెంట్లలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కవ ఓట్లు పడిన వారిని తమ వైపునకు రావాలని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు వారితో రాజకీయ పార్టీల నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే నామినేషన్ల ఉపసంహరణతో ఎంతమంది బరిలో ఉండనున్నారో గురువారం తేలనుంది. -
జిత్తులమారి మాటలు
-
కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ, బీఎస్పీ కూటమి
లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కలిసి పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు నిర్ణయించుకున్నాయి. అయితే, ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ లేకుండానే ఈ కూటమి రూపుదాల్చనుండటం గమనార్హం. కూటమి ఏర్పాటును ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి నేడు లక్నోలోని ఓ హోటల్లో జరిగే ఉమ్మడి మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన అఖిలేశ్.. కాంగ్రెస్‌ను కలుపుకుని పోవడంపై సమాధానం దాటవేశారు. తమ కూటమిని చూసి బీజేపీతోపాటు కాంగ్రెస్ భయపడుతున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు యూపీలోని 80 స్థానాల్లో చెరి 37 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ నియంతృత్వ పాలనకు ముగింపు పలకడమే ప్రతిపక్షాల లక్ష్యం కావాలి. కానీ, మమ్మల్ని వదిలేసి కూటమి ఏర్పాటు చేయడం చాలా ప్రమాదకరమైన పొరపాటు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. కాంగ్రెస్‌కు అమేథీ, రాయ్‌బరేలీ సీట్లను మాత్రమే వదిలివేసేందుకు ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నట్లు వచ్చిన వార్తలపై యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ బక్షి స్పందించారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగేందుకు సైతం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిలో చేరే విషయమై ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ స్పందించారు. తాము ఆరు సీట్లు కోరుతున్నామనీ, చర్చలు సాగుతున్నాయని తెలిపారు. -
చివరి కోరిక
‘‘ఇది విన్నారా? రఘు రావట్లేదంట. యూఎస్ నుంచి ఇందాకే కాల్ చేసి చెప్పాట్ట’’ ఒకింత ఆశ్చర్యంగా ఈ కబురు తెలిపింది నా శ్రీమతి.మోటార్ సైకిల్ పార్క్ చేసి, లోనికి వచ్చి కూర్చుని చెప్పాను‘‘అవునట. నాకూ ఇందాకే తెలిసింది. ఆఫీస్ నుంచి వస్తుంటే దార్లో రంగనాథంగారు కనబడి చెప్పారు’’రఘు రాలేకపోతున్నది ఏదో పెండ్లికో పేరంటానికో కాదు, సాక్షాత్తు తన తల్లి దశదిన కర్మలకి. రఘు అమెరికాలో పనిచేస్తున్నాడు. చాలా బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నాడు.కుక్కాంటీ అనబడే సరోజ ఆంటీకి రఘు ఒక్కగానొక్క కొడుకు. తన ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకుని ఐఐటీలో చదవించి, వాడి జీవితాన్ని ఒక దారిలో పెట్టిన కుక్కాంటీ అసలు ఊహించి ఉండదు ఇలాంటి పరిణామం. ఆవిడ చనిపోయిన రోజు కూడా రఘు రాలేకపోయాడు. బిజీగా ఉన్నానని అమెరికా నుంచి ఫోన్ చేశాడు.అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశాడు. తల మునకలయ్యేంత పనుల్లో ఉన్నానని, సెలవు దొరకదని, అంత్యక్రియలు కాలనీ పెద్దల ఆధ్వర్యంలో కానివ్వండని, దశదిన కర్మల లోపు వచ్చేస్తానని ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా పనులు కానివ్వండని అభ్యర్థించేటప్పటికి ఎవరూ కాదనలేకపోయారు. అతని కోణం నుంచి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నమే చేశారు.రంగనాథంగారు సరోజ ఆంటీకి బాగా దగ్గరి వారు. దూరపు చుట్టరికం కూడా ఉందనుకుంటాను. ఆయన బాధ్యత తీసుకుని, అన్ని పనులూ తన తలపై వేసుకుని వ్యవహారం కానిచ్చారు. కాలనీలోని ప్రతి ఒక్కరూ రంగనాథంగారికి సహకరించారు. సరోజ ఆంటీ అంటే అందరికీ ప్రత్యేక అభిమానం. ఆవిడ రుణం ఈ విధంగా తీర్చుకునే అవకాశం వచ్చిందని అందరూ అనుకున్నారు. తలలో నాలుక అన్నది చాలా చిన్నపదం అవుతుంది ఆవిడ విషయంలో. కాలనీలో అందరినీ తన పిల్లల్లా చూసుకునేది. పెళ్లి, పేరంటం, నామకరణం, పుట్టినరోజు వేడుకలు... ఇలా ఒక్కటేమిటి ఎక్కడ కోలాహలం ఉంటే అక్కడ కుక్కాంటీ ఉంటుందనేది జగమెరిగిన సత్యంగా మారింది.శుభకార్యాలు సరే, ఏ ఇంట్లో విషాదం జరిగినా, ఓదార్చడానికి తానే ముందుండేది. ఆయా ఇండ్లలో ఆ ఇల్లు ఆవిడదేనేమో అన్నట్లుగా తిరిగి అందరినీ ఓదార్చి ఒక పూటో రెండుపూటలో ఉండి వచ్చేది. ఆవిడ ఒక చైతన్యం, ఆవిడ ఒక శక్తి. ఆవిడ ఒక అండ.ఇలా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇలా ఆలోచిస్తూ ఉంటే, ఆవిడని నేను మొదటిసారి చూసిన సంఘటన గుర్తొచ్చింది. నా ఆలోచనలు క్రమంగా గతంలోకి పరుగులు తీశాయి.ఈ సంఘటన జరిగి దాదాపు పదిహేనేళ్లు అవుతోంది.‘‘ఇలా చలిగాలిలో తిరక్కూడదు. కడుపునిండా భోంచేసి చక్కగా ఇంట్లో పడుకోవాలి’’ కాసింత కటువుగా అన్నారెవరో.చలికి ఒకరికొకరం దగ్గరగా అతుక్కుని నడుస్తున్నామేమో, ఈ మాట విని చటుక్కుమని దూరంగా జరిగిపోయాం నేనూ మా ఆవిడా.‘‘అయ్యో! మిమ్మల్ని కాదులెండి. ఈ కుక్కల్ని అంటున్నాను’’ ఈ మాటతో మా అయోమయం ఇంకా ఎక్కువైంది.ఆ మాటలు అంటున్నావిడ కాస్త లావుగా ఉంది. ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకుని, తెల్లని శరీర ఛాయతో హుందాగా ఉంది. ఆవిడ చేతిలో అన్నం గిన్నె పట్టుకుని, చుట్టూ చేరిన ఐదారు కుక్కలకి అన్నం పెడుతోంది.ఆవిడ ధోరణి మాకు కాస్త విచిత్రంగా అనిపించింది. మనుషులతో మాట్లాడినంత చనువుగా, ఆప్యాయంగా ఉండుండి ఆ కుక్కలతో మాట్లాడుతోంది. వాటి వాలకాన్ని బట్టి చూస్తే అవన్నీ వీధి కుక్కలని తెలిసిపోతోంది. ఒక్కటి కూడా పెంపుడు కుక్కలా లేదు.అవాక్కయి నిలబడి చూస్తుండిపోయా మేమిద్దరం.‘‘గుడికెళ్తున్నారా? వెళ్లిరండి. హారతి టైమవుతుందనుకుంటాను’’ మమ్మల్ని ఉద్దేశించి ఆ రెండు మాటలూ అనేసి తిరిగి కుక్కలకు వడ్డించడంలో నిమగ్నమైపోయింది. ఆవిడని చూడటం అదే మొదటిసారి. ఆవిడ పేరు సరోజ అని తర్వాత తెలిసింది.ఆవిడని ఆ విధిలో అందరూ కుక్కాంటీ అనే పిలుస్తారని తెలిసింది. ఆవిడ అసలు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని మాకు క్రమంగా అర్థమైంది.ఆవిడ వెళుతూ ఉంటే, వెనకాలే కనీసం నాలుగైదు కుక్కులు తోకూపుకుంటూ వెళుతూ కనిపిస్తాయి.మామూలుగా మనం పక్కవీ«ధికి వెళితే పరిచయస్తులు ‘హలో.. హాయ్’ అని పలకరించినట్లు ఆ చుట్టుపక్కల వీధుల్లో ఎక్కడికెళ్లినా ఆయా వీధుల్లోని కుక్కలు ‘కుయ్.. కుయ్’మంటూ ఆవిడ దగ్గరగావచ్చి తమ విశ్వాసం ప్రకటిస్తాయి.నగరానికి నేనొచ్చిన కొత్త రోజులవి. విశ్వవిఖ్యాత దిగ్గజంలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో నాకు నేలపై కాళ్లు నిలబడేవి కావు ఆరోజుల్లో. చేతినిండా డబ్బు. కావలసినంత స్వేచ్ఛ.అమ్మానాన్నల ఇష్టానికి అనుగుణంగా నా మరదలినే పెళ్లి చేసుకుని నగరంలో స్థిరపడ్డాను. నగర కాలుష్యానికి దూరంగా, ఆఫీస్ క్యాంపస్‌కి కాస్త దగ్గరగా ఉండేలా చూసుకుని ఎదుగుతున్న ఆ కాలనీలో ఇండిపెండెంట్ ఇల్లు సొంతం చేసుకున్నాను. ఆ ఇంటి నిర్మాణం సందర్భంగా ఒకరోజు సాయంత్రం నిర్మాణ నిర్వహణ పనులు ముగించుకుని సతీసమేతంగా గుడికి వెళుతూ కుక్కాంటీగారిని ఇలా చూడటం తటస్థించింది. ఇంటికి దగ్గర్లోనే ఒక మంచి సాయిబాబా గుడి ఉండటం మాకు చాలా నచ్చింది. వీలైనంత వరకు ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవాడిని. నగరాల్లోని కాలనీల్లో ఎవరి జీవితం వారిది అనుకుంటూ కాలం గడిపేయడానికి అలవాటు పడిపోయాం అందరమూ. పక్కింటివాడి పేరు తెలియదు. ఏం చేస్తుంటాడో తెలియదు. ఇదో నాగరికత అనే భ్రమలో బతికేస్తుంటాం.ఇలాంటి భ్రమలకు తెరదించింది సరోజ ఆంటీ. నేను ఇంటి స్థలం తీసుకుని, నిర్మాణం పనులన్నీ ముగించి, కొలీగ్స్‌ని, బాగా దగ్గరి బంధువులను, ఆప్తమిత్రులు కొందరిని ఆహ్వానించుకుని ‘హరి ఓం’ అని గృహప్రవేశం చేసుకుంటున్నాను. ఇంతలో ఉరుములేని పిడుగులా సరోజ ఆంటీ ఊడిపడింది.‘‘ఏం నాయనా! నా సైజు చూసి బాగా మెక్కేస్తానని పిలవలేదా ఏంటి? సరిగా మీ ఇంటి వెనుకే ఉంటాను తండ్రీ. నా పేరు సరోజ. మీ అమ్మగారిలా అనుకో. ఇదిగో నా తరఫు నుంచి ఈ చిన్న కానుక. మీరు, మీ తదనంతరం మీ పిల్లలు, మీ మనవళ్లు, మనవరాళ్లు ఈ ఇంట్లో అనేక శత సంవత్సరాలు హాయిగా అనేకానేక శుభకార్యాలు నిర్వహించుకుంటూ సంతృప్తిగా, సంతోషంగా అషై్టశ్వర్యాలతో తులతూగాలని నా ఆకాంక్ష’’ అంటూ ఆవిడ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లా టకటకా చెప్పదలచిన నాలుగు ముక్కలూ చెప్పేసి, కానుక ఇచ్చేసి, అందరితో పరిచయాలు చేసేసుకుని, బలవంతం చేస్తే కొద్దిగా విందు ఆరగించి, ఎలా వచ్చిందో అలా వేగంగా వెళ్లిపోయింది. మొదటి చూపులోనే ఆవిడ మా వాళ్లందరికీ తెగ నచ్చేసింది. ఆ తర్వాత మా బంధువులంతా నగరానికి ఎప్పుడు వచ్చినా ఆవిడని కలవకుండా వెళ్లేవారు కాదు. మా అక్కయ్యలు, అన్నయ్యలు ఎప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడినా ఆవిడ గురించి కుశల ప్రశ్నలు అడిగిగాని సంభాషణ ముగించేవారు కాదు. అంతగా మా అందరిపై ప్రభావం చూపగలిగిందావిడ. పిచ్చిదానిలా కనిపించిన ఆవిడ, చాలా త్వరలోనే నా దృష్టిలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతుందని నాకప్పట్లో తెలియదు. ఆవిడ భర్త ఏదో చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఈవిడంత కలుపుగోరు మనిషి కాదాయన. తన పని తాను చేసుకుపోయేవాడు. అందరినీ చిరునవ్వుతో పలకరించేవాడు. ఈవిడ చేసే ఎలాంటి సేవా కార్యక్రమాలకు అడ్డు చెప్పేవాడు కాదాయన. అదే ఆయన చేసే సేవ అని చెప్పవచ్చు. వారికి ఒకే ఒక అబ్బాయి.వాడి పేరు రఘు. మేము ఆ కాలనీలో చేరేటప్పటికి రఘు రెండో తరగతో మూడో తరగతో చదివేవాడు. వాళ్ల ఆశలన్నీ రఘుపైనే. వాడిని బాగా చదివించి అమెరికా పంపించాలనేది ఆవిడ ఆశయంగా ఉండేది. అందరితో అదే మాట చెప్పేది. రఘు కూడా చదువులో మంచి ప్రతిభ చూపేవాడు. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్‌గా నిలిచేవాడు.ఇక కుక్కాంటీ విషయానికొస్తే చెప్పుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయి.స్వామీ వివేకానంద జన్మదినోత్సవం వస్తోందంటే చాలు, ఈవిడ ఓ హుండీలాంటి డబ్బా ఒకటి పట్టుకుని కాలనీలోని అన్ని ఇళ్లూ తిరిగి చందాలు వసూలు చేసేది. ‘‘మీకు తోచినంత ఇవ్వండి. ఎటువంటి బలవంతం లేదు’’ అనేది. అలా పోగైన డబ్బులన్నీ పట్టుకువెళ్లి మా ఇళ్ల దగ్గర్లో ఉన్న అనాథాశ్రమంలోని పిల్లలకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు కొని ఇచ్చేది. తన పుట్టినరోజని ఒకసారి, వాళ్లాయన పుట్టినరోజని ఒకసారి, వాళ్లబ్బాయి పుట్టినరోజని ఒకసారి ఇలా ఏదో ఒక సందర్భంలో అనాథాశ్రమం పిల్లలకు తన ఇంటి నుంచి తెచ్చిన విందుభోజనం పెట్టేది.తాను చేసే ఇలాంటి ధర్మకార్యాలకు ఎలాంటి ప్రచారమూ ఆశించేది కాదు. ఊరికి దూరంగా ఉన్న కారణంగా అనుకుంటాను మా కాలనీకి బిచ్చగాళ్లు తక్కువగా వచ్చేవారు. అనుకోకుండా వచ్చే ఒకటీ అరా బిచ్చగాళ్లకు చక్కని సరోజా ఆంటీ ఇంట్లో చక్కని భోజనం, వారి ఇంటి కాంపౌండ్‌లోని వేపచెట్టు కింద నవారుమంచంపై చక్కని నిద్ర దక్కేవి.కాలనీలో రోడ్లు పడ్డా ఆవిడకే ఆనందం, బోరుబావులు తవ్వినాఆవిడకే ఆనందం. చిన్నపిల్లలా అక్కడే ఉండి ఆయా కార్మికులని ఉత్సాహపరుస్తూ వాళ్లకు నీళ్లు, చిరుతిండ్లు తానే సప్లై చేసేది. మా ఇంటి దగ్గరి సాయిబాబా గుడికి ప్రతి గురువారం మధ్యాహ్నం పన్నెండింటికి చేరుకునేది. అక్కడ జరిగే అన్నదానంలో ప్రత్యక్షంగా వడ్డన ద్వారా, పరోక్షంగా ఆర్థికసాయం ద్వారా తనవంతు తోడ్పాటు అందించేది. అందరూ తన బంధువులేనేమో అనేంత ఆప్యాయంగా వడ్డించి, ఆకలి తీరిందో లేదో కనుక్కుని మరీ పంపేది. మా కాలనీ అంతా కలిపి వందా నూటయాభై ఇళ్లు ఉండేవి ఆ రోజుల్లో. నెలకోసారి అందర్నీ కలిపేలా చేసి ఏదో ఒక సాంఘిక కార్యక్రమం నిర్వహింపజేసేది ఆవిడ. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ చెత్త లేకుండా చూసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించేది. ఇప్పుడు మా కాలనీలో మంచి మంచి వృక్షాలు ఉన్నాయంటే అదంతా ఆవిడ చలవే.ఇటీవల ఒక టీవీ చానల్ వాళ్ల సర్వేలో తేలిందేమిటంటే రాష్ట్రం మొత్తం మీద సగటు ఉష్ణోగ్రత కంటే మా కాలనీలో ఐదారు డిగ్రీలు తక్కువే ఉంటుందట. ఇవన్నీ ఒక ఎత్తయితే కాలనీలోని ఆడపిల్లలందరినీ సమీకరించి వారికి వేదికనెక్కి ఉపన్యాసం ఇచ్చే కళని పదును పెట్టుకోమని ప్రోత్సహించేది. మా కాలనీ అమ్మాయిలు చాలామంది ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సునాయాసంగా నెగ్గడానికి కుక్కాంటీ చిన్నప్పుడు తమకు ఇచ్చిన శిక్షణే ఎంతో ఉపయోగపడిందని వారంతా ముక్తకంఠంతో చెబుతారు. ఇలా అందరి జీవితాలపై ప్రభావం చూపిన ఆవిడ తన కొడుకు రఘు విషయంలో సహజంగానే మరింత ప్రేమగా వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.దురదృష్టవశాత్తు రఘుకి ఆవిడ పూర్తిగా అర్థం కాలేదని చెప్పవచ్చు. అర్థం కాకపోతే పోయే. తల్లిదండ్రుల మీద, సొంత దేశం మీద ద్వేషం పెంచుకోవడమే విషాదం.యోగ్యులను దేవుడు పరీక్షలకు గురిచేస్తాడని అనుకునే వారి నమ్మకాన్ని నిజం చేస్తూ దేవుడు సరోజ ఆంటీకి ఒక పెద్ద పరీక్షే పెట్టాడు.రఘు ఇంకా పదో తరగతికి రాక ముందే ఆవిడని విధి చిన్నచూపు చూసింది. రఘు తండ్రిలేని వాడయ్యాడు. ఆవిడ కనీసం పదో తరగతి కూడా పాస్ కాకపోవడంతో భర్త ఉద్యోగం కూడా రాలేదు. కొంత పరిహారం, నెలనెలా అందే పింఛనుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కుదుపు ఆమెలోని కరుణకి ఆనకట్ట వేయలేకపోయింది. తిరిగి మామూలుగానే ఆమె సేవా కార్యక్రమాలకి నడుం బిగించింది. చిత్రంగా ఆమె మరింత సమయాన్ని సేవా కార్యక్రమాలకి వెచ్చించడం మొదలుపెట్టింది. బహుశ తన దుఃఖాన్ని ఈ విధంగా మర్చిపోయే ప్రయత్నం చేసేదనుకుంటా. అలాగని కొడుకు బాధ్యతలని, ఇంటి పనులని నిర్లక్ష్యం చేయలేదు. భర్త మరణం తర్వాత రఘు చదువుపై ఎక్కువ సమయాన్ని వెచ్చించేది.వాడు ఇంటర్‌కు వచ్చాక వేకువనే బ్రహ్మీముహూర్తంలో లేచి, నాలుగు నాలుగున్నరకల్లా వాడిని నారాయణగూడలోని ఐఐటీ కోచింగ్ సెంటర్లో దిగబెట్టి రావడంతో ఆవిడ దినచర్య ప్రారంభమయ్యేది. కోచింగ్ సెంటర్‌కీ, జూనియర్ కాలేజీకి, సాయంత్రం మరో కోచింగ్ సెంటర్‌కి తిరగడంతో ఆవిడకి కాలం వేగంగా గడిచినట్లు అనిపించేది. వేళకి రఘుకి టిఫన్లు, భోజనాలు ఏర్పాటు చేయడంలో ఆ జీవి ఎంత అలసిపోయేదో ఆ కర్మసాక్షికి మాత్రమే తెలుసు. రఘు గురించి ఆమె కన్న కలలన్నీ నిజమయ్యాయనే చెప్పవచ్చు. సహజంగా తెలివైన కుర్రాడు కావడం, చక్కని కోచింగ్ లభించడంతో రఘుకి ముంబై ఐఐటీలో మొదటి ప్రయత్నంలోనే కోరుకున్న బ్రాంచీలో సీటు రావడం, అక్కడ కూడా దిగ్విజయంగా కోర్సు పూర్తి చేసుకుని, చూస్తుండగానే చక్కని కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికా వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.కథ ఇక్కడి వరకే అయితే ‘సుఖాంతం’ అని చెప్పి చేతులు దులిపేసుకునేవాడిని నేను కూడా. అసలు కథ ఇక్కడే మొదలైంది మరి. రఘు ఐఐటీలో చేరిన కొత్తలో ఆవిడ ఇంటింటికీ తిరిగి తన పుత్రుడి గురించిన విశేషాలను చెప్పుకుంటూ ఆనందం పంచుకునేది. క్రమంగా ఆవిడలో ఆ ఉత్సాహం సన్నగిల్లింది. రఘు గురించిన ప్రస్తావన తానై తేవడం మానేసింది. ఎవరైనా అడిగితే ముక్తసరిగా చెప్పి ముగించేది ఆ సంభాషణ.వాడు ఐఐటీలో చేరింది లగాయతు మహా అంటే ఒకట్రెండు సార్లు వచ్చి ఉంటాడు ఇంటికి. ఇక అమెరికాకి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఇంటి మొహం చూసిన పాపానపోలేదు. వాడి దగ్గర ఉన్న స్టాక్ సమాధానం ‘బిజీగా ఉన్నాను’. ఎప్పుడూ చైతన్యానికి ప్రతీగా ఉండే కుక్కాంటీ డల్‌గా ఉండటం ఎవరూ ఎన్నడూ చూడలేదు. ఈ ప్రపంచంలోని ఆనందం, ఉత్సాహం తాలూకు కేరాఫ్ అడ్రస్సా ఈవిడ అన్నట్లు ఉంటుంది ఆవిడ ప్రవర్తన.అలాంటావిడ వెక్కివెక్కి ఏడ్వడం నేను చూడాల్సి వచ్చింది ఓసారి. అసలేం జరిగిందంటే...ఒకరోజు సాయంత్రం గుడికెళ్తూ అనుకోకుండా వారింటికి వెళ్లాను. ముందు గదిలో లైట్ కూడా వేసుకోకుండా కూర్చుని ఆవిడ వెక్కివెక్కి రోదిస్తోంది. నా మనసు ఎందుకో కీడు శంకించింది.ఆవిడ భర్త పోయినప్పుడు కూడా ఎంతో హుందాగా వ్యవహరించింది. అలాంటావిడ ఇలా ఏడ్వడం నాకు బాగా దుఃఖాన్ని కలిగించింది. ‘‘ఏమైంది ఆంటీ..?’’ నోరు పెగుల్చుకుని అడిగాను.ఆవిడ మౌనంగా ఓ ఎయిర్‌మెయిల్ ఉత్తరం నా చేతిలో పెట్టింది. లైట్ ఆన్ చేసి చదవడం ప్రారంభించాను. అది రఘు నుంచి.నేరుగా ఆవిడకి రాయలేదు. రంగనాథంగారికి రాశాడు.‘‘డియర్ అంకుల్బాగున్నారా? మీరంతా బాగున్నారని ఆశిస్తాను.నాకిక్కడ జీవితం ఆనందంగా గడిచిపోతోంది. అనేకమంది పరిచయమయ్యారు. రోజులు బాగా వేగంగా నడిచిపోతున్నాయి. నేను జీవితంలో ఏం కోల్పోయానో నాకు క్రమంగా అర్థమవుతోంది. నేను కోల్పోయినదంతా తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నాను.నేనేం కోల్పోయానో తెలుసా అంకుల్? జీవితం కోల్పోయాను. అవునంకుల్ నేను బాల్యం కోల్పోయాను. స్కూల్‌డేస్ తాలూకు ఆనందం కోల్పోయాను. కాలేజ్ డేస్ తాలూకు వేగం కోల్పోయాను. బాల్యం అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక జ్ఞాపకం పుస్తకాలు, పరీక్షలు. స్కూల్ అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక జ్ఞాపకం పోటీ, ర్యాంకులు, పరుగులు. కాలేజీ లైఫ్ మరీ ఘోరం అంకుల్. ఒక బందిఖానా నయం దానికంటే. పేపర్లలో ప్రకటనల కోసం మమ్మల్ని సమిధలుగా వాడుకున్నారు ఆ జూనియర్ కాలేజీ వాళ్లు. వాళ్ల దృష్టిలో మేం ర్యాంకులు తెచ్చిపెట్టే యంత్రాలం. మాకంటూ కొన్ని మనోభావాలుంటాయని అవి దెబ్బతింటాయని ఏనాడూ ఆలోచించలేదు వారు. హైదరాబాద్ అంటే కోచింగ్ సెంటర్లు గుర్తు వస్తాయి కాని ఎంజాయ్ చేసిన క్షణాలు బుర్ర బద్దలు కొట్టుకున్నా గుర్తురావడం లేదు. ఇక ఐఐటీలో అయితే ఊపిరి తీసుకోవడానికి కాదు కదా, చావడానికి కూడా మాకు టైమ్ ఉండేది కాదు. అలసి సొలసి ఇంటికి వచ్చిన నన్ను ఏనాడూ మా అమ్మ నన్ను ఒక మనసున్న మనిషిగా ట్రీట్ చేయలేదు. ఎంతసేపూ నాకెన్ని మార్కులు వచ్చాయని అడగడం, మంచి మార్కులు వచ్చాయనగానే స్వీట్స్ చేసి పెట్టడం, ఎప్పుడైనా ఒకటీ అరా తక్కువ వచ్చిన సందర్భాల్లో తాను డల్‌గా మారిపోవడం... ఇంతేనా జీవితమంటే అని అనిపించేది. నేను కంటి ముందు కనిపిస్తే చాలు ‘బాగా చదువుకో, అమెరికాలో ఉద్యోగం తెచ్చుకో’ ఈ రెండు మాటలే తప్ప మూడోమాట ఆవిడ నోట్లోంచి వచ్చేది కాదు. ఎక్కడో నాకూ మా అమ్మకీ మధ్యన ఉండాల్సిన సున్నితమైన ఏదో బంధం తెగిపోయినట్లనిపిస్తుంది నాకు. ర్యాంకులు, మార్కులు, పరీక్షలులాంటి టాపిక్స్ తప్ప మా మధ్య మాట్లాడుకోవడానికి ఏ టాపిక్స్ ఉండేవి కావు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత పరిస్థితి మరీ ఘోరం అయ్యిందని చెప్పవచ్చు.నాకెరీర్ని మా అమ్మ ఒక జీవన్మరణ సమస్యగా తీసుకున్నట్లనిపించేది నాకు.సినిమాల్లో చూపించినట్లు ఇంటి వాతావరణం అందంగా ఉండదని నాకు తెలిసిన క్షణం నుంచి నాలో ఒకవిధమైన విరక్తి కలిగింది.అలా అన్చెప్పి నాకు మా అమ్మపై ప్రేమ లేదని కాదు. ఆవిడ బాధపడితే నేను చూడలేను. ఆవిడ ఆనందంగా ఉండాలి. ఆవిడ ఆనందానికి మూలకారణం నా మార్కులే. నా విజయాలే అనే ధోరణి నాకు విపరీతమైన చిరాకు కలిగించేది.సెలవులకు రాకూడదా అని మీరు నాకు పదే పదే ఫోన్ చేయకండి. వీలైతే నేనే వస్తాను. తరచూ వచ్చి అక్కడ గడపడం నా వల్ల కాదు. నా ఇబ్బంది అక్కడికి రావడం కాదు. వచ్చాక ఒక విధమైన నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది ఇంట్లో. నాకక్కడ అసలేం తోచదు. నాకు మా అమ్మకి మధ్య ఓవిధమైన నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో తనకీ తోచదు, నాకూ తోచదు.ఇంతదూరం వచ్చి నా టైమ్ వేస్ట్ చేసుకుని వృథాగా గడిపి వెళ్లిన భావన కలుగుతుంది. దయచేసి నన్ను రమ్మని పిలవకండి. నేనే వీలు చూసుకుని తప్పకుండా ఒకసారి వచ్చి వెళతాను. అమెరికా రమ్మంటే తను రాదు. ఎన్నోసార్లు అడిగి విసిగిపోయాను. తనకు ఎంత డబ్బు కావాలన్నా పంపిస్తాను. తనని ఆనందంగా ఉండమని చెప్పండి. మీరంతా ఆవిడకి తోడు ఉన్నారన్న భరోసాతో నేనిక్కడ నింపాదిగా ఉండగలుగుతున్నాను. అమ్మని బాగా చూసుకోండి.మీ రఘు.ఆవిడ అక్షరాలని కూడబలుక్కుని చదివి ఉంటుంది ఆ ఉత్తరం.‘‘ఈ కాలనీ వారంతా మీ పిల్లల్లాంటి వారు కాదా ఆంటీ’’ అని చెప్పి ఓదార్చి వచ్చాను. కాని ఆవిడ దుఃఖాన్ని ఆపడం నా వల్ల కాలేదు. నన్ను ఎక్కువసేపు ఉండనివ్వలేదావిడ వారింట్లో. సున్నితంగా నన్ను వెళ్లిపొమ్మని సైగ చేసింది. నేను వచ్చేశాను.ఆ తర్వాత ఆమెలో కొత్త మనిషిని చూశాను. ఇదివరకటి కన్నా ఉత్సాహంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈ సంఘటన తర్వాత ఆవిడ ఎప్పుడూ రఘు గురించి మేమడిగినా ప్రస్తావించేది కాదు.ఆవిడలో ఒక స్థిరత్వాన్ని గమనించాను ఈ విషయంలో.మృత్యువు ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేకుండా, చివరి నిమిషం వరకు నవ్వుతూ నవ్విస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటూ హాయిగా గడిపేసింది ఆమె తన చివరి రోజులు.తానెన్నుకున్న మార్గం విషయంలో ఆమె ఎన్నడూ రాజీ పడలేదు.దుఃఖమే ఆమె ముందు దుఃఖించింది. అలసటే ఆమె ముందు అలసిపోయింది. ఓటమే ఆమె ముందు ఓడిపోయింది. ఆ విధంగా సరోజ ఆంటీ జీవితం ముగిసిపోయింది.మూడు నెలల తర్వాత ఒక ఆదివారం రంగనాథం గారి నుంచి పిలుపు వస్తే వెళ్లాను వారింటికి.మా కాలనీలో వేసవికాలాల సాయంత్రాలు నాకు చాలా ఇష్టం. ప్రతి ఇంట్లో చిన్న చిన్న తోటలు ఉంటాయేమో, సాంత్వన కలిగిస్తూ పిల్లగాలులు, మామిడాకు వాసనలు, మల్లెల పరిమళాలు. ఒకవిధమైన ఆహ్లాదం ఉంటుంది వీధుల్లో తిరుగుతుంటే గేటు తీసుకుని లోనికి వెళ్లాను.రంగనాథంగారి కంఠం నాకు పరిచయమే. లోపల్నుంచి ఏదో అపరిచిత కంఠం కూడా వినిపిస్తోంది. హాల్లోకి ప్రవేశించాను. రంగనాథం ఎదురుగా కూర్చున్నది ఎవరో కాదు. సరోజ ఆంటీ వాళ్లబ్బాయి రఘు. మంచి రంగు తేలాడు. బాగా ఒళ్లు చేశాడు. ‘‘హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు?’ నన్ను చూసి కుశల ప్రశ్నలు వేశాడు. నేను చిరునవ్వుతో తలపంకించాను. ‘‘ఎందుకంకుల్ ఎంత ఖరీదైనా నేనే కొంటాను ఇంటిని వేరే ఎవరికీ అమ్మవద్దని అంతలా ఒత్తిడి చేస్తున్నాడు ఆ శ్రీరామ్. ఇంతకీ ఎవరంకుల్ ఆయన’’రఘు ప్రశ్నిస్తున్నాడు రంగనాథం అంకుల్ని.రఘు అమెరికా నుంచి ఆన్లైన్లో తమ ఇంటిని వేలానికి పెట్టాడని ఇటీవలే తెలిసింది. ఆ విషయంగా బేరం ఫైనల్ చేసుకోవడానికి వచ్చాడట.‘‘శ్రీరామ్ ఎవరో తెలీదా నీకు?’’ రంగనాథం అంకుల్ ప్రశ్నించారు నెమ్మదిగా.తెలీదన్నట్టు తలూపాడు రఘు.‘‘మీ అమ్మగారి చివరి కోరిక తెలుసా?’’ రంగనాథం అంకుల్ ప్రశ్నించారు నెమ్మదిగా. మళ్లీ తెలీదన్నట్టు తలూపాడు రఘు. ‘‘మీ అమ్మగారి చివరి కోరిక తెలుసా నీకు’’ మరోసారి ప్రశ్నించారు రంగనాథం అంకుల్.రఘు తెల్లమొహం వేశాడు.నేను ఆసక్తిగా వింటుండిపోయాను. హాల్లో ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ గాలికి క్యాలెండర్ పేజీలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. కాసేపట్లో ఒక బ్రహ్మాండమైన నిజం బద్దలవుతుందని నాకా క్షణంలో తెలియదు. ఈ నిజాన్ని రంగనాథం అంకుల్ ఇన్నాళ్లూ కాపాడాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు రంగనాథం అంకుల్.‘‘ఆ శ్రీరామ్ ఒక అనాథ. మీ అమ్మగారి సాయంతో ఈవేళ ఒక మంచి స్థితికి చేరుకున్నాడు. మీ ఇంటి దగ్గర అనాథాశ్రమంలో ఒక విద్యార్థి వాడు. వాడికి తెలుసు మీ అమ్మగారి చివరి కోరిక. అందుకే వాడు ఆ ఇంటిని తానే కొనాలని పట్టుదలగా ఉన్నాడు. ఆశ్రమంవారు వాడిని ఇంటర్ వరకు చదివించి, ఆపై చదివించలేమని చేతులెత్తేశారు. అప్పుడు మీ అమ్మగారు పూనుకొని వాణ్ణి ఇంజనీరింగ్ చదివేలా ప్రోత్సహించింది. ఆపై ఎంబీఏ చదివించింది. వాడూ సలక్షణంగా చదువుకుని ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వెళ్లి చూడు. వాడి ప్రతి కంపెనీ పేరూ ‘సరోజా ఇండస్ట్రీస్’ అనే ఉంటుంది. వాడు మీఅమ్మని మరువలేదు. ఆవిడ చివరి కోరికనీమరువలేదు.‘‘ఏంటంకుల్ ఆ చివరి కోరిక’’ అడిగాడు రఘు.‘‘తన తదనంతరం ఇంటిని అనాథాశ్రమంగా మార్చాలన్నది ఆవిడి కోరిక. రఘూ! నీకొక నిజం చెప్పాలి. సరోజ ఆంటీ నీ సొంత తల్లి కాదు. నువ్వొక అనాథవి. పెంటకుప్ప దగ్గర పసిగుడ్డుగా పొత్తిళ్లలో కనిపిస్తే ఆ మహాతల్లి తీసుకువచ్చి నిన్ను పెంచింది. కానీ నీకెన్నడూ ఆ భావన రాకుండా పెంచింది. నీ జీవితం ఆవిడ ఇచ్చిన దానం. ఆ మహాతల్లే కనుక చేరదీయకపోతే నువ్వు ఆ క్షణమే నేలరాలిపోయేవాడివి. నీ జీవితమంతా సుఖంగా ఉండటానికి కాలేజీ వాళ్లు నిన్న పెట్టిన కష్టమే పెద్ద కష్టమని అంటున్నావు. ఆ చదువే లేకుంటే నీ జీవితం ఏమయ్యేదో ఊహించుకో. అమ్మ ఏది చేసినా నీ మంచికే అనే జ్ఞానం నీకు లోపించడం వల్ల నీలో ఈ విపరీత ధోరణి కలుగుతోంది’’ఎంతగా దాచాలనుకుంటున్నా రఘు తన కళ్ల నుంచి ధారగా కారుతున్న కన్నీటిని దాచలేకపోతున్నాడు.‘‘సరోజ అనాథ వసతి గృహం’’ఆ ఇంటిని అమ్మకుండానే తల్లి చివరి కోరిక తీర్చాడు రఘు. ఆ ఇంట్లోనే అనాథ వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు. - రాయపెద్ది వివేకానంద్ -
పొత్తులు పెట్టుకుంటే తప్పేంటి?: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఎన్ని కల్లో పొత్తులు పెట్టుకుం టే తప్పేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హను మంతరావు టీఆర్ఎస్ను ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడు తూ ‘మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు తప్పు లేదు కానీ మేము పెట్టుకుంటే తప్పా’ అని ప్రశ్నించా రు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు అవా కులుచెవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబ ట్టారు. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీ ఆర్ వైఫల్యాలపై ఊరూరా ప్రచారం చేసి ప్రజా తీర్పు కోరుతామన్నారు. ప్రజల దీవెనల కోసం ప్రజాసంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి ఇందిరమ్మ రథం ప్రారంభిం చనున్నట్లు వెల్లడించారు. -
కూటమిలో కుంపట్లు..!
-
కూటమి కోదండం!
సాక్షి, హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఇముడుతుందా? సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య పడిన పీటముడి విడిపోతుందా? ఇప్పుడు మహాకూటమి వర్గాల్లో ఈ ప్రశ్నలు హాట్‌టాపిక్ అవుతున్నాయి. తమకు 30కి పైగా స్థానాల్లో పోటీ చేసే అవకాశమివ్వాలని ప్రొఫెసర్ కోదండరాం కోరుతుండగా నాలుగైదు స్థానాలకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ అంటుండటంతో ఇరు పార్టీల మధ్య మడతపేచీ పడినట్లయింది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఉమ్మడి ఎజెండాతో కలసి పనిచేసేందుకు ఇరు పార్టీల మధ్య అవగాహన ఉన్నా సీట్ల సర్దుబాటే సమస్యగా మారుతుండటం కూటమి రాజకీయాలను వేడెక్కిస్తోంది. శనివారం రాత్రి సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. టీజేఎస్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు అవకాశం లేదని కోర్ కమిటీలో కాంగ్రెస్ ముఖ్యులు తేల్చేసిన నేపథ్యంలో కూటమిలో టీజేఎస్ సర్దుబాటు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. టీడీపీ, సీపీఐ ఓకే... కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, సీపీఐలతో పెద్దగా ఇబ్బందులు లేవని తెలుస్తోంది. 25 స్థానాలు కావాలని టీడీపీ, 12 సీట్లు కావాలని సీపీఐ కోరుతున్నా ఆ రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ నేతలు సఫలీకృతులయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీకి 10–14 స్థానాలు, సీపీఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ వర్గాలు కూడా సిద్ధమయ్యాయి. అయితే టీడీపీ, సీపీఐలకు ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలన్న దానిపై కొంత సమస్య ఉన్నా సీట్ల సంఖ్య తేలినందున అది కూడా సమసిపోతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు కోర్ కమిటీ సభ్యులు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మధు యాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ, సీపీఐలతో సమస్య లేనప్పటికీ టీజేఎస్ అడుగుతున్నన్ని స్థానాలు సర్దుబాటు చేయలేమనే అంచనాకు కాంగ్రెస్ ముఖ్య నేతలు వచ్చినట్లు తెలిసింది. టీజేఎస్ అధినేత కోదండరాం 33 స్థానాలు అడుగుతున్నారని, ఇరు వర్గాల మధ్య సయోధ్య రావాలన్నా కనీసం 20 స్థానాల వరకు టీజేఎస్‌కు ఇవ్వాల్సి ఉంటుందని, అలా సర్దుబాటు చేసుకోవడం సాధ్యం కాదనే అంచనాకు నేతలు వచ్చారు. నాలుగైదు స్థానాలు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చని, కానీ ఈ ప్రతిపాదనకు టీజేఎస్ అంగీకరిస్తుందా అన్నది అనుమామేననే అభిప్రాయం కూడా భేటీలో వ్యక్తమైంది. దీనిపై టీజేఎస్ ముఖ్యులతో మరోసారి మాట్లాడంతోపాటు పార్టీ క్షేత్రస్థాయి నాయకులతోనూ చర్చించి సోమవారం తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెస్ కోర్ కమిటీ వచ్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 8–10 స్థానాలు టీజేఎస్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చినా కోదండరాం అందుకు సమ్మతిస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఆ ప్రతిపాదన కూడా... సీట్ల సర్దుబాటు మడత పేచీ అలా ఉంటే కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య మరో ప్రతిపాదన విషయంలోనూ ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఎజెండాతో రూపొందించే కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) అమలు కమిటీ చైర్మన్‌గా కోదండరాంను నియమించాలని టీజేఎస్ ప్రతిపాదిస్తోంది. ఈ కమిటీ ప్రభుత్వ పనితీరును సమీక్షించే రీతిలో పనిచేయాలనే ప్రతిపాదనల నేపథ్యంలో కూటమిలో పెద్ద పార్టీగా ఉంటూ మరో పార్టీకి ఆ బాధ్యతలు అప్పగించడం సరైనది కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలను అధిగమించి కాంగ్రెస్, టీజేఎస్‌లు ఏకతాటిపైకి వస్తాయా లేక టీడీపీ, సీపీఐలే కాంగ్రెస్‌తో కలసి వెళ్తాయా అన్నది రెండు, మూడు రోజుల్లో అధికారికంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోదండ కోసం బీజేపీ యత్నం ఎట్టిపరిస్థితుల్లోనూ టీజేఎస్‌ను తమ వైపు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. కోదండరాంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనతో ఉన్న బీజేపీ నేతలు తమతో కలసి రావాలని టీజేఎస్‌ను ఇప్పటికే కోరారు. అయితే బీజేపీతో జట్టు కట్టేందుకు ప్రొఫెసర్ ఇష్టపడటం లేదని, రాజకీయంగా ఆ మైత్రి మంచిది కాదనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌తో కలిసే ప్రక్రియలో కూడా తమ గౌరవానికి ఎక్కడా భంగం వాటిల్ల కూడదనే ప్రాథమిక సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, అవసరమైతే స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగేందుకు కూడా సిద్ధమవుతున్నామని టీజేఎస్ నేతలు చెబుతుండటం గమనార్హం. -
పొత్తుకు సై
-
పొత్తులకు కోర్ కమిటీ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో టీటీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీలతో కలసి వెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఏఐసీసీ కోర్ కమిటీ టీపీసీసీకి అధికారికంగా అనుమతిచ్చింది. మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డితో ఏఐసీసీ కార్యాలయంలోని వార్‌రూమ్‌లో కోర్ కమిటీ సభ్యులు గులాంనబీ ఆజాద్, ఆంటోని, జైరాం రమేశ్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో ఇప్పటివరకు జరిగిన చర్చలు, సీట్ల పంపకాలపై ఆయా పార్టీల ప్రతిపాదనలు, రాష్ట్రంలో పొత్తులు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఉత్తమ్, జానాలు పార్టీ అధిష్టానానికి వివరించారు. దీంతో పొత్తులకు కోర్‌కమిటీ లాంఛనంగా ఆమోదం తెలిపింది. అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై కూడా కసరత్తు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీకి 10–14 సీట్లు, సీపీఐకి 3, టీజేఎస్‌కు 3 సీట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించింది. స్థానికంగా కూర్చుని మాట్లాడాక దీనిపై తుది నిర్ణయం తీసుకుని తమకు తెలపాలని ఆదేశించింది. సమావేశం అనంతరం కుంతియా మాట్లాడుతూ.. ‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించాం. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ కోర్‌కమిటీ కొద్ది రోజులుగా అన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశమవుతోంది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, పొత్తుల అంశాలపై కమిటీ ఆరా తీసింది. మున్ముందు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించాం’అని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని, పార్టీ లక్ష్మణ రేఖను దాటితే ఏ స్థాయి నేతలపై అయినా చర్యలకు వెనుకాడబోమని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇదివరకే స్పష్టం చేశారని పేర్కొన్నారు. కాగా, త్వరలోనే ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరంలతో పాటు కేరళ రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులతో కోర్‌కమిటీ వరుసగా చర్చలు జరుపుతోంది. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీలతో కుదుర్చుకోవాల్సిన పొత్తులపై చర్చిస్తోంది. అందులో భాగంగానే అధిష్టానం పిలుపు మేరకు ఉత్తమ్ మంగళవారం ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు. సోమవారమే ఢిల్లీ వెళ్లిన జానా కూడా అధిష్టానం వద్ద జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అవన్నీ అంతర్గత విషయాలు: ఉత్తమ్ కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లో చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఉత్తమ్ తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర పీసీసీ అనుసరించాల్సిన వ్యూహాలపై కోర్‌కమిటీ ఆరా తీసిందన్నారు. పొత్తులపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయం మేరకు కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలివ్వడంపై ఉత్తమ్‌ను ప్రశ్నించగా.. అవన్నీ పార్టీ అంతర్గత విషయాలని, తాము చూసుకుంటామని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పనిమీదే వచ్చా: జానారెడ్డి తన కుమారుడికి టికెట్ ఇప్పించేందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని జానారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికి వారు ఊహించుకొని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత, వ్యాపార పనిమీదే ఢిల్లీ వచ్చానని, ఇప్పుడు కోర్‌కమిటీ సమావేశానికి కబురు రావడంతో హాజరైనట్లు చెప్పారు. మిర్యాలగూడ నుంచి తన కుమారుడు పోటీ చేయడంపై అధిష్టానానిదే తుది నిర్ణయమని తెలిపారు. -
లైన్ క్లియర్?
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ముందస్తు ఎన్నికల పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ మేరకు స్థానాలు దాదాపు ఖరారయ్యాయి. తెలుగుదేశం పార్టీ కోరుతున్న స్థానాలు నగరంలోనే అధికంగా ఉండటంతో భారీ కసరత్తు అనంతరం తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి కూకట్పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట స్థానాల్లో ఏవైనా నాలుగు లేదా ఐదు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం కూకట్పల్లి నుంచి పార్టీ ముఖ్య నేత పెద్దిరెడ్డి, ఉప్పల్‌లో వీరేందర్‌గౌడ్, మల్కాజిగిరిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఓ ముఖ్య నాయకునికి, సనత్‌నగర్ స్థానాన్ని ఆశిస్తున్న కూన వెంకటేష్‌గౌడ్‌కు, ఖైరతాబాద్ లంకల దీపక్‌రెడ్డి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎంపికపై కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ గ్రీన్ స్నిగల్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించని కాంగ్రెస్...కొందరు అభ్యర్థులకు మాత్రం ప్రచారం చేసుకోండంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో గోషామహల్లో ముఖేష్‌గౌడ్, సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్లో దేవిరెడ్ది సుధీర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలంగౌడ్Š, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డికి టికెట్లు ఖాయమని, ఈ స్థానాల్లో అభ్యర్థులు ఖరారైనట్లేనని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఐతే తెలుగుదేశం పార్టీకి పొత్తులో కేవలం నాలుగు స్థానాలే ఇవ్వాలని, అంతకు మించితే పార్టీకి ఇబ్బందవుతుందని గ్రేటర్ నాయకులు పార్టీ దృష్టికి తీసుకువెళుతున్నారు. ఆయా స్థానాల్లో తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలంటూ మల్కాజిగిరికి చెందిన ఆకుల రాజేందర్, నంది కంటి శ్రీధర్, బండా కార్తీకరెడ్డి, ఆదం సంతోష్‌కుమార్, పల్లె లక్ష్మణరావు, అనిల్‌కుమార్‌యాదవ్, డాక్టర్ వినయ్‌కుమార్‌లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆర్.కృష్ణయ్య.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎల్బీనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తన రాజకీయ భవిష్యత్‌ను ఢిల్లీలో తేల్చుకునే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. అందులో భాగంగా తమ డిమాండ్లకు అనుగుణంగా కలిసివచ్చే పార్టీతో ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉప్పల్ టీఆర్ఎస్లో హై డ్రామా ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గం టీఆర్ఎస్లో హైడ్రామా నెలకొంది. పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అసమ్మతి రాగం రోజురోజుకు పెరుగుతోంది. అభ్యర్థికి అనుకూల, ప్రతికూల వర్గాలు బాహాటంగా పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణులలో అయోమయం నెలకొంది. కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. దీంతో టీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. పార్టీ అభ్యర్థిగా భేతి సుభాష్‌రెడ్డిని ప్రకటించడంపై అసమ్మతి రాగం రోజుకో మలుపు తిరుగుతోంది. అభ్యర్థి సుభాష్‌రెడ్డి ఓ పక్క అనుచరులతో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు అభ్యర్థితో కలిసి ప్రచారంలో రాకపోగా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ అనుచరులు, వార్డు కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు తదితరులు మూకుమ్మడిగా కార్పొరేటర్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ర్యాలీగా వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. -
కీలక దశకు ‘పొత్తు’ పొడుపు!
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడమే ధ్యేయంగా రూపుదిద్దుకుంటున్న మహాకూటమిలోని పార్టీల మధ్య చర్చలు కీలకదశకు చేరుకున్నాయి. ప్రాథమికంగా జరిగిన చర్చల అనంతరం మహాకూటమిలోని పార్టీలుగా పేర్కొంటున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తాము పోటీచేయాలనుకుంటున్న స్థానాల జాబితాలను పంపాయి. తమ పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు, అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలపై కాంగ్రెస్ ముఖ్యులు చర్చించారని, మరోమారు ఇతర పార్టీలతో చర్చించి సీట్ల పంపకాలను పూర్తి చేసుకుని, రెండు లేదా మూడు రోజుల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీ చేయబోతోందనే విషయంపై అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 28 నియోజకవర్గాలతో టీడీపీ ప్రతిపాదన కాగా, తమకు కనీసం 20 స్థానాల్లో పోటీ చేసే అవకాశమివ్వాలని కోరుతున్న తెలుగుదేశం పార్టీ 28 నియోజకవర్గాలతో కూడిన జాబితాను కాంగ్రెస్ పార్టీకి పంపింది. ఇందులో కీలక నేతల విషయంలో పీటముడి పడే అవకాశం ఉన్న చోట్ల రెండు నియోజకవర్గాలను ప్రతిపాదించింది. టీడీపీ ప్రతిపాదించిన ఈ జాబితాలో ఉప్పల్, కూకట్పల్లి, కోదాడ, ఖమ్మం, అశ్వారావుపేట, సత్తుపల్లి, పఠాన్‌చెరువు, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, మహబూబ్‌నగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాలున్నాయి. వీటికి తోడు ముఖ్యనేతల కోసం రెండు నియోజకవర్గాల చొప్పున పేర్లను కూడా పంపింది. అందులో నకిరేకల్/తుంగతుర్తి, నర్సంపేట/పరకాల, వరంగల్ ఈస్ట్/ వరంగల్ వెస్ట్, హుజూరాబాద్/హుస్నాబాద్, జగిత్యాల/కోరుట్ల, వనపర్తి/దేవరకద్ర, మక్తల్/నారాయణ పేట్, సికింద్రాబాద్/సనత్‌నగర్ నియోజకవర్గాలున్నాయి. ఈ జాబితాపై శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చర్చించారు. అయితే, టీడీపీ అడిగిన స్థానాలన్నింటినీ ఇవ్వలేమని, తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు కూడా అవకాశం కల్పించాల్సి ఉన్నందున 13–15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను టీడీపీ నేతలకు పంపుతామని, దీనిపై మరోమారు చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. 20 స్థానాలతో టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కూడా 20 స్థానాలతో తమ జాబితాను కాంగ్రెస్ పార్టీకి పంపినట్టు తెలుస్తోంది. అయితే, జనసమితికి 5 స్థానాల కన్నా ఎక్కువ ఇవ్వలేమని, కోదండరాం నేతృత్వంలో అమరవీరుల ఆకాంక్షల కమిటీకి ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ కారణంగా టీఆర్ఎస్ను గద్దె దింపాలన్న లక్ష్యం నెరవేరాలంటే టీజేఎస్ కొంత త్యాగం చేయకతప్పదని కాంగ్రెస్ నేతలంటున్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజ్గిరి, తాండూరు, ముదోల్, చెన్నూరు, వరంగల్‌వెస్ట్, దుబ్బాక, సిద్దిపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల విషయంలో ఇరు పార్టీల మధ్య మరోమారు చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఐ కూడా తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని అంటున్నా ఆ పార్టీకి 3 సీట్లు ఇవ్వగలమని కాంగ్రెస్ అంటోంది. అందులో హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, దేవరకొండ, వైరా నియోజకవర్గాలున్నట్టు సమాచారం. తెలంగాణ ఇంటిపార్టీ కూడా 2 స్థానాలు కోరుతోంది. మహబూబ్‌నగర్, నకిరేకల్ స్థానాలు తమకు కావాలని ఆ పార్టీ నేతలు అడుగుతున్నా రెండింటిలో ఒకటి మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు అన్ని పార్టీలతో చర్చించి ఏ పార్టీ, ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీచేస్తుందో నిర్ణయం తీసుకుంటామని, రెండు లేదా మూడు రోజుల్లో ఈ చర్చలు కొలిక్కి వస్తాయని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. తరచూ చర్చలు... మహాకూటమి ఏర్పాటు, మార్గదర్శకాల రూపకల్పన, ఉమ్మడి ఎజెండా తయారీ, సీట్ల పంపకాలపై కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ నేతలు తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఆయా పార్టీల నేతలకు వీలున్నప్పుడల్లా కలుస్తూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని సమావేశాల వివరాలను మీడియాకు చెబుతుండగా, చాలావరకు రహస్యంగానే కలుస్తూ చర్చించుకుంటుండటం గమనార్హం. ఈ క్రమంలోనే సీట్ల పంపకాల వరకు చర్చల ప్రక్రియ వచ్చిందని తెలుస్తోంది. మొత్తం మీద ఎలాంటి పీటముడి పడకుండా ఉంటే మూడు రోజుల్లో మహాకూటమిలోని ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘అవసరానికో పొత్తు.. అది చంద్రబాబు అవకాశవాదం’
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూస్తే చంద్రబాబుకి భయం పట్టుకుందనీ, తన నీడను చూసుకుని కూడా చంద్రబాబు భయపడుతున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధాని ఇమేజ్ను దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారనే ఎప్పుడో చెప్పామని అన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబు అవసరం కొద్ది పొత్తులు పెట్టుకుంటారని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బీజేపీకి కులం, మతం, రంగు లేదని ఉద్ఘాటించారు. కమ్యూనిస్టుల చరిత్రంతా విదేశీయులదేనని విమర్శలు గుప్పించారు. కోర్టు నోటీసులను బేఖాతరు చేస్తున్న చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రచార దాహంతోనే 29 మంది మృతి చెందారనీ, గోదావరి పుష్కారాల్లో తొక్కిసలాటకు ఆయనే కారణమని ఆరోపించారు. ప్రమాద ఘటన పై జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదిక అత్యంత దురదృష్టకరమని చెప్పారు. ముఖ్యమంత్రికి ధైర్యముంటే పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన, విశాఖ భూ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని సవాల్ విసిరారు. -
వామపక్షాలపై నమ్మకం పోయింది: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిందని దీంతో వామపక్షాలపై ప్రజలకు నమ్మకం పోయిం దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒకటేనని అందుకే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)గా ప్రజల ముందుకు సీపీఎం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో సీపీఎం 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. మిగతా స్థానాల్లో బీఎల్ఎఫ్ అభ్య ర్థులు పోటీలో ఉంటారన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 14 కులదురహంకార హత్యలు జరిగాయని, ఈ హత్యలను టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కులదురహం కార హత్యలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నాయిని ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఈ హత్యలకు నిరసనగా ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రణయ్ హత్య లో ఆరోపణలెదుర్కొంటున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర రాజకీయనేతల పాత్రపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న 20నుంచి 25 మందితో బీఎల్ఎఫ్ మొదటి జాబితాను ప్రకటిస్తామన్నారు. -
ఆ పొత్తులు ప్రమాదకరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్–టీడీపీ, టీఆర్ఎస్–ఎంఐఎం పొత్తులు ప్రమాదకరమని, వాటిని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అలాంటి అపవిత్ర పొత్తు లను ప్రజలు అçసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తామని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అంటున్నారని, అలాంటి వారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కర్ణాటక తరహా రాజకీయాలకు రాష్ట్రంలో తెరలేపుతున్నారని పేర్కొన్నారు. తాడు అనుకున్న మజ్లిస్ ఉరితాడు కాబోతోందని, ఇన్నాళ్లు పాముకు పాలు పోసి పెంచారన్నారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరి పోసేందుకు టీడీపీ, సీపీఐ పోటీ పడుతున్నాయని, అవి నీతి కాంగ్రెస్‌ను అవి బతికించలేవన్నారు. ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభిస్తారన్నారు. తర్వాత 15 రోజుల్లో కరీంనగర్లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందన్నారు. పారదర్శకత ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలన్నారు. మొదటి విడతలో 50 సభలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మొదటి విడతలో 50 సభలు నిర్వహిస్తామని, వాటిల్లో పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రులు పాల్గొంటారని లక్ష్మణ్ చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన అనేకమంది నేతలు తమకు టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర పథకాలు ప్రజలకు నేరుగా అందుతాయని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదన్నారు. ఆయష్మాన్ భారత్ ఫథకంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు భాగస్వామి కాలేదో చెప్పాలన్నారు. అమిత్ షా పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టించనుందని పేర్కొన్నారు. ఓటరు నమోదుకు అవసరమైతే మరింత గడువు పెంచాలని, అది పూర్తి అయ్యాకే ఎన్నికల షెడ్యూల్డ్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. టీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పించి, బీజేపీకి అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. టీఆర్ఎస్తో ఫిక్సింగ్ కావాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమకు ప్రధాన పోటీ టీఆర్ఎస్తోనేనన్నారు. -
పొత్తులు సరే.. ఆకాంక్షల సాధన ఎలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకన్నా టీజేఎస్పైనే ఎక్కువగా ఉంటుం దని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జిల్లా ఇన్చార్జిలు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలతో సమావేశమైన కోదండరాం.. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ ఆకాం క్షలపై చర్చించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలతో పొత్తులకు రంగం సిద్ధమైన నేపథ్యంలో పొత్తుల వల్ల తలెత్తబోయే సమస్యలను ప్రస్తావించారు. ఆకాంక్షలను కాపాడుకోడానికి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. -
కారెళ్లిపోతాంది.. రండహో!
అనూహ్యంగా ముందస్తు ఎన్నికల ప్రతిపాదన... ప్రతిపక్షాలు తేరుకునే లోపే అసెంబ్లీ రద్దు.. ఎవరూ ఊహించనట్లుగా 105 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటన.. ఆ వెంటనే ఎన్నికల ప్రచారంలోకి... ఇలా టీఆర్ఎస్ అధినేత ప్రదర్శించిన దూకుడుతో అవాక్కయిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తాజాగా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడంతోపాటు వలసలపై దృష్టి సారించింది. టీడీపీ సహా మరికొన్ని రాజకీయ పార్టీలతో పొత్తుల విషయంలో ఓవైపు చర్చలు జరుపుతూనే పార్టీలోకి వలస నేతలను చేర్చుకునేందుకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్లోని అసంతృప్తులు, కాంగ్రెస్ మాజీలకు గాలం వేస్తోంది. మొత్తంమీద కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ ‘వేదిక’ ఏర్పాటు దిశగా ముమ్మర కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలంటే రాష్ట్రంలోని ఇతర పార్టీలను కలుపుకొని పోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గతంలోనే నిర్ణయించుకున్నా టీడీపీతో కలిసే విషయమై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చొరవ తీసుకోవడం, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇందుకు అంగీకరించడంతో తెలుగుదేశంతో పొత్తు చర్చలు నేడో, రేపో కొలిక్కి రానున్నాయి. టీడీపీతోపాటు సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితిలను కూడా కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేసే దిశగా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సూచన మేరకు ఆదివారం టీడీపీ, సీపీఐ నేతలు కలసి ఓ అవగాహనకు వచ్చారు. సీపీఎంను కూడా కూటమిలో చేర్చుకోవాలని భావించి సీపీఐని ఇందుకు పురమాయించినప్పటికీ తమ నేతృత్వంలోనే నడుస్తున్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్), జనసేనలతో కలసి వెళ్లేందుకే సీపీఎం మొగ్గుచూపుతోంది. దీంతో సీపీఎం ఈ కూటమిలోకి రాకపోవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితితోనూ త్వరలోనే అవగాహన కుదుర్చుకునేలా కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ పార్టీలతో కలసి వెళ్లాల్సి వస్తే తాము పోటీ చేయాల్సిన స్థానాలు కొన్ని తగ్గే పరిస్థితి ఉన్నప్పటికీ టీఆర్ఎస్ను గద్దె దింపాలన్న తక్షణ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో సర్దుకుపోవాల్సిందేనని టీపీసీసీకి చెందిన ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో తలపడతామన్నారు. వలస పక్షులకు రెడ్ కార్పెట్... పొత్తుల వ్యూహాన్ని పకడ్బందీగా అమలుపర్చడంతోపాటు వలస పక్షులను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్‌లో చేరగా, టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ వలసలు మరింత పెరిగాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు డీఎస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, నందీశ్వర్‌గౌడ్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్లను ఈ వారంలోనే పార్టీలో చేర్చుకోనుంది. కాంగ్రెస్‌లో చేరేందుకు వారంతా ఢిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ తమ నేతలతో చర్చలు జరుపుతున్నారు. తమకు టికెట్లు దక్కకపోవడంతో టీఆర్ఎస్తో విభేదించి కేసీఆర్, కేటీఆర్‌లకు వ్యతిరేకంగా మాట్లాడిన కొండా దంపతులు ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఇంకా నిర్ణయించుకోనప్పటికీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. వారికితోడు టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కన్నేశారు. పలువురు నేతలతో ఆయన రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తంమీద అటు పొత్తులు, ఇటు వలసల వ్యూహంతో టీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. గుంభనంగా ‘గులాబీ’దళం... కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతుంటే టీఆర్ఎస్ శిబిరం మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. రాజ్యసభ సభ్యుడు డీఎస్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమని తేలడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ కె.ఆర్. సురేశ్‌రెడ్డి వికెట్ పడేసి స్కోరు సమం చేసింది. సురేశ్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలే తమతో టచ్‌లో ఉన్నారని, సమయానుకూలంగా వారందరినీ పార్టీలో చేర్చుకుంటామని గులాబీ నేతలు చెబుతున్నారు. ఎలాగూ అభ్యర్థులను ప్రకటించినందున టికెట్ ఆశించే వారిని కాకుండా క్షేత్రస్థాయిలో ప్రభావితం చేయగలిగిన నేతలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ వ్యూహాలు, కదలికలను అంచనా వేస్తూ ప్రచార వ్యూహాలకు పదును పెడుతూ ప్రణాళికలు రచిస్తోంది. -
చెరో దారేనా..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వామపక్ష పార్టీలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయనే అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే శాసన సభ ఎన్నికల్లో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 2009 వరకు దాదాపు ప్రతి ఎన్నికల్లో వామపక్షాలు ఒకే కూటమిగా ఏర్పడి.. వివిధ రాజకీయ పక్షాల మద్దతుతో పోటీ చేసి శాసనసభ స్థానాలతోపాటు లోక్‌సభ స్థానాలను సైతం గెలుపొందిన పరిస్థితి జిల్లాలో ఉండగా.. 2014 శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నుంచి సీపీఐ, సీపీఎంలు వేర్వేరు రాజకీయ పక్షాలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని వేరు కూటములు గా పోటీ చేశాయి. గత ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోగా.. సీపీఎం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. కాంగ్రెస్‌తో కుదిరిన పొత్తు మేరకు సీపీఐ ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు కొత్తగూడెం, పినపాక, వైరా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందింది. ఇక సీపీఎం మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు సీపీఐ కుదుర్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పోటీ చేసిన కొత్తగూడెం, వైరా, పినపాక నియోజకవర్గాలతోపాటు అదనంగా అశ్వారావుపేటను కోరాలని సీపీఐ అధినాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. సీపీఐతోపాటు టీడీపీ సైతం కాంగ్రెస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఎవరు ఆశించినా సీట్లు ఎవరికి లభిస్తాయి.. కాంగ్రెస్ జిల్లాలో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ సైతం గతంలో తాము పోటీ చేసిన స్థానాల్లో సత్తుపల్లితోపాటు మరికొన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. సీపీఎం మాత్రం ఈసారి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పేరుతో కొత్త కూటమికి తెరలేపింది. తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమిలో ప్రధాన రాజకీయ పక్షంగా సీపీఎం ఉంది. రాజకీయ పక్షాలే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే వివిధ రంగాల ప్రముఖులను సైతం కలుపుకునిపోయి.. వారిని ఆయా ప్రాంతాల్లో పోటీ చేయించే అంశాన్ని సైతం బీఎల్ఎఫ్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తటస్థ అభ్యర్థులు బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి ఎన్నికల గుర్తు ఏది కేటాయించాల్సి ఉంటుంది. తటస్థ అభ్యర్థులుగా అన్ని వర్గాల ఓట్లను పొందే అవకాశం కోసం బీఎల్ఎఫ్ను రాజకీయ పార్టీగా సైతం నమోదు చేశారు. దీంతో ఆ ఫ్రంట్ తరఫున పోటీ చేసే వారికి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఎన్నికల గుర్తు వచ్చే అవకాశం లభిస్తుందని బీఎల్ఎఫ్ భావిస్తోంది. సీపీఎంకు బలం ఉన్న ఖమ్మం, మధిర, భద్రాచలం, పాలేరు వంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాలని సీపీఎం భావిస్తున్నా.. బీఎల్ఎఫ్ తరఫున తటస్థ అభ్యర్థులు ముందుకు వస్తే వారిని బలపరిచేందుకు సైతం వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భంగపడిన వారికి అవకాశం? ఇక ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు సైతం బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు భావిస్తున్న ఫ్రంట్ వర్గాలు చివరి నిమిషం వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా వేచి చూసే ధోరణి అవలంబించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మధిర నియోజకవర్గం నుంచి సామాజిక ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్‌ను ఎన్నికల బరిలో బీఎల్ఎఫ్ తరఫున రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఒక దశలో ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ను సైతం బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నందున ఖమ్మం నుంచి పోటీచేసే అవకాశం లేకపోవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే గత ఎన్నికల్లో భద్రాచలంలో విజయం సాధించడం ద్వారా ఏకైక శాసనసభ స్థానాన్ని గెలుపొందిన సీపీఎం మళ్లీ అదే స్థానాన్ని నిలుపుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. సీపీఎం నుంచి గెలుపొందిన సున్నం రాజయ్య ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉండటంతో భద్రాచలం సీపీఎం అభ్యర్థిగా మాజీ ఎంపీ మిడియం బాబూరావును రంగంలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుమ్ముగూడెం ప్రాంతానికి చెందిన బాబూరావు 2004లో భద్రాచలం నుంచి సీపీఎం తరఫు న ఎంపీగా గెలుపొందారు. ఇక సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో ఎన్నికల అవగాహన కుదిరే అవకాశం ఉండటంతో జిల్లాలో తాము గతంలో పోటీ చేసిన ఖమ్మం ఎంపీతోపాటు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఈసారి పాగా వేసేందుకు ఆ పార్టీ శక్తియుక్తులు ఒడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీపీఎం, సీపీఐలు ఈ ఎన్నికల్లో తమదైన రీతిలో రాజకీయ పంథాను అవలంబించడం.. రాజకీయంగా చెరో దారిలో పయనించే అవకాశం స్పష్టంగా కనపడుతుండటంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బహుము ఖ పోటీ తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
ఎవరి సీటుకో ఎసరు..!
ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో ముందుకు సాగాలనే నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సూచన మేరకు సీపీఐ, తెలంగాణ సమితి (టీజేఎస్)తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తదితరులు చర్చలు జరిపారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ కానున్నారు. ఈ మేరకు టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్.రమణ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమాచారం కూడా అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు మినహా.. కలిసొచ్చే పార్టీలతో ‘మహాకూటమి’గా కాంగ్రెస్ బరిలోకి దిగనుందని అవగతం అవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పొత్తులు కుదిరితే మూడు, లేదా నాలుగు స్థానాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడనుండగా.. ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఏ పార్టీ నుంచి అవకాశం లభిస్తుంది? మరెవరికి ఛాన్స్ మిస్సవుతుందన్న తర్జనభర్జనలు జోరందుకున్నాయి. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ముందస్తు ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కాంక్షతో ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్ తదితర పార్టీలను కలుపుకునేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో పొత్తుకు టీడీపీ నేతలు కూడా సానుకూలంగా స్పందించగా, శనివారం చర్చలతో కొలిక్కి రానుంది. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లపై కూడా ఓ నిర్ణయానికి వస్తారన్న ప్రచారం జరుగుతుండగా, తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్లో సీట్ల సర్దుబాటు సమస్య అవుతుందన్న చర్చ కూడా పార్టీల్లో జరుగుతోంది. ఇదిలా వుండగా పొత్తుల్లో భాగంగా హుజూరాబాద్ నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కోరుట్ల నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా దాదాపుగా తెలంగాణలో సీపీఐ కేటాయించే ఒకటి, రెండు స్థానాల్లో హుస్నాబాద్ ఉంటుంది. ఈ స్థానంపై సీపీఐ కన్నేసింది. సీపీఐతో ఇదివరకే కాంగ్రెస్ చర్చలు జరిపింది. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఆ సీటు ఖాయమనే అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ జన సమితితో కూడా కలిసి నడవాలనుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ ఈ జిల్లాలో టికెట్ అడుగుతుందా? లేదా..? ఒకవేళ అడిగితే, ఎక్కడ అడుగుతారు? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీజేఎస్ కూడా ఒక స్థానం తప్పనిసరి అంటే.. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 స్థానాలే మిగలనున్నాయి. చివరికి ఎవరి సీటుకో ఎసరు.. జగిత్యాల, మంథని మినహా అన్ని స్థానాల్లో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబులే మళ్లీ పోటీ చేయనుండగా, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యం, సీహెచ్ విజయ రమణారావు, కవ్వంపెల్లి సత్యనారాయణ చొప్పదండి, పెద్దపల్లి, మానకొండూరు నియోజకవర్గాలపై కన్నేశారు. మానకొండూరు మాజీ విప్ ఆరెపెల్లి మోహన్‌కు ఖాయమంటుండగా కవ్వంపెల్లి సత్యనారాయణ కూడా లైన్లో ఉన్నానంటున్నారు. చొప్పదండి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతంతోపాటు మేడిపల్లి సత్యం ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి గొట్టి్టముక్కుల సురేష్‌రెడ్డి, సీహెచ్ విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు డాక్టర్ గీట్ల సవిత, ఈర్ల కొంరయ్య టికెట్ కోసం పోటీ పడుతున్నారు. రామగుండం, వేములవాడ, సిరిసిల్ల, కోరుట్ల నుంచి కూడా ఇద్దరు, ముగ్గురు, నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ధర్మపురి నుంచి అడ్లూరు లక్ష్మణ్‌కుమారే అంటున్నా.. మద్దెల రవీందర్ కూడా ఏఐసీసీ, టీపీసీసీలకు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా వుంటే పొత్తుల్లో భాగంగా టీడీపీకి రెండు, సీపీఐకి ఒక స్థానం కేటాయించాల్సి రావడంతో మూడు స్థానాల్లో కాంగ్రెస్ నేతలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. టీజేఎస్‌కు సైతం ఓ సీటు ఇవ్వాల్సి వస్తే నాలుగు స్థానాలను వదలాల్సిందే. ఇప్పుడు టీటీడీపీలో కీలకంగా ఉన్న ఇనుగాల పెద్దిరెడ్డి, ఎల్.రమణ కోసం హుజూరాబాద్‌తోపాటు కోరుట్లలో టీడీపీ డిమాండ్ చేయనుంది. హుస్నాబాద్‌ను సీపీఐకి కేటాయించడం అనివార్యం కాగా, చాడ వెంకటరెడ్డికే అవకాశం ఉంది. అప్పుడు హుజూరాబాద్ టీడీపీ(పెద్దిరెడ్డి)కి ఇవ్వక తప్పని పరిస్థితి. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి ఆశలు అడియాసలే. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి కూడా కాంగ్రెస్ టిక్కెట్ చేజారినట్లే. ఎల్.రమణ కోరుట్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైతే ఇక్కడ టిక్కెట్ ఆశించే కొమిరెడ్డి రామ్‌లు సహా మరో ముగ్గురికి కూడా నిరాశే కలగనుంది. కాగా.. పొత్తుల వ్యవహారం నేడు కొలిక్కి రానుండగా, ఈనెల 15 నాటికి సీట్లు, టిక్కెట్ల కేటాయింపుపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. -
పార్టీలతో కాదు ప్రజలతోనే పొత్తు: కేటీఆర్
ఇబ్రహీంపట్నం రూరల్: టీఆర్ఎస్ పార్టీకి ఏ ఇతర రాజకీయ పార్టీ లతో పొత్తులుండవని, నేరుగా ప్రజలతోనే పొత్తని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభ పనులను మంత్రి కేటీఆర్ గురువారం పరిశీలించారు. వేదికకు సంబంధించిన వివరాలు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాలను పట్టించు కోవడం మరిచిపోయారని, టీడీపీ, బీజేపీలకు ఇక్కడ ఉనికే లేదని విమర్శించారు. రాష్ట్రంలో యాభై ఏళ్లలో జరగని పనుల్ని కేవలం నాలుగేళ్లలో చేసి చూపించామన్నారు. రైతుబంధు, రైతుబీమా, కంటి వెలుగు లాంటి పథకాలు తీసుకొచ్చింది దేశ చరిత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. విప్లవాత్మక, గుణాత్మక మార్పునకు కారణం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుదేనన్నారు. రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రతిపక్షాలు అధికార దాహంతో బాధపడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి సొంత వెన్నెముక లేదన్నారు. -
‘చంద్రబాబు-రాహుల్ మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటవురట్ల సభలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పొత్తులపై సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్‌తో పొత్తు నిజం కాదా? ‘చంద్రబాబు ఆరో పెళ్లికి సిద్ధమయ్యారని తమ నాయకుడు అన్నది నిజం కాదా? చంద్రబాబు ఇతర పార్టీలతో పెళ్లిళ్ల సంగతి నిజం కాదా? విడాకులు తీసుకుంది నిజం కాదా? చంద్రబాబే స్వయంగా కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ నేతలతో చర్చించారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని బాబు అన్నట్లు పత్రికల్లో వచ్చింది. రాహుల్ గాంధీ మీటింగ్‌కు బ్రాహ్మణి వెళ్లింది నిజం కాదా? ఆమె ఎందుకు వెళ్లారు? కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్- చంద్రబాబు మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారు. టీడీపీ- కాంగ్రెస్ కొత్త రూపంలో ప్రజల్లోకి రాబోతోంది. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటారు. గత ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారు. పార్టీకి, తనకు సిద్దాంతం అంటూ ఉండదు. గెలవడానికి ఏదైనా చేస్తారు. దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలాంటి నాయకుడికి మద్దతిస్తున్న టీడీపీ నేతలు నైతిక విలువలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు కుట్ర, దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి. వైఎస్సార్ సీపీ ఒంటరిగానే 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటి చేస్తుంది. వైఎస్ జగన్ పాదయాత్రను చూసి చంద్రబాబుకు నిద్రపట్టట్లేదు. వైఎస్ జగన్ నిఖార్సైన రాజకీయ నాయకుడు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తన పని పడతారని బాబుకు భయం పట్టుకుంది. వైఎస్ జగన్ సీఎం అవ్వగానే చంద్రబాబు దోపిడీని కక్కిస్తాం’ అంటూ సుధాకర్ బాబు పేర్కొన్నారు. -
అధిష్టానం నిర్ణయమే ఫైనల్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకుని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పొత్తులను ఖరారు చేస్తారని, ఈ విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం గాంధీ భవన్లో ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘సర్వేల ఫలితాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. ఈసారి పొత్తులు లేకున్నా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. మా పార్టీ టికెట్ల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారంటేనే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని అర్థమవుతోంది. ఎన్నికలకు కొంత సమ యం ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఈ విషయంలో రాహుల్ కూడా సానుకూలంగా ఉన్నారు’అని ఉత్తమ్ పేర్కొన్నారు. సామాజిక సమతౌల్యత, గెలిచే సామర్థ్యమే అభ్యర్థుల ఎంపికలో కీలకం అవుతాయన్నారు. తనతో అధికార టీఆర్ఎస్కు చెందిన చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారని, వారిని త్వరలోనే పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో సెటిలర్లకు తగిన ప్రాధాన్యమిస్తామన్నా రు. నగరంలోని సీమాంధ్రులు, మైనారిటీలు ఈసారి కాంగ్రెస్పక్షానే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనన్నారు. కేసీఆర్ పుట్టిస్తానన్న భూకంపం ఏదీ? ముస్లిం రిజర్వేషన్ల కోసం అవసరమైతే ఢిల్లీలో భూకంపం పుట్టిస్తామని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు ఆ భూకంపం ఎటు పోయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లులో ఉన్న హామీలే సాధించలేని కేసీఆర్.. తమ పార్టీని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు విభజన హామీల గురించి కేసీఆర్ ఎందుకు అడగలేకపోయారని ఉత్తమ్ నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా మోదీకి మద్దతు పలుకుతున్న కేసీఆర్ విభజన హామీలపై మాట్లాడాలన్నారు. కేసీఆర్ ముమ్మాటికీ మోదీ ఏజెంటేనని.. కేసీఆర్, టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. వచ్చే నెలలో ఒక రోజు రాష్ట్రానికి రాహుల్... పార్లమెంటు సమావేశాల తర్వాత వచ్చే నెలలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఒకరోజు పర్యటిస్తారని ఉత్తమ్ వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన విద్యార్థులు, మహిళలు, తటస్థులతో సమావేశమవుతారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 వేల మంది బూత్ కమిటీ అధ్యక్షులతోనూ ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. ఇకపై రాష్ట్రంలో రాహుల్ పర్యటన ప్రతి నెలా ఉంటుందని ఉత్తమ్ వెల్లడించారు. ప్రభుత్వంపై తిరగబడండి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్,టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి మహిళా స్వయం సహాయక సంఘాలతో ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది. అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వ పెద్దలు కోట్ల రూపాయల కమీషన్లు కొట్టేశారు. వందల కోట్ల రూపాయలతో బంగళాలు కట్టించుకొని కిరాయి విమానాల్లో తిరుగుతున్నారు. కోట్లాది రూపాయలతో వాహనాలు కొనుగోలు చేసి విలాసాలు చేస్తున్నారు. ఇదంతా మీ సొమ్ముతోనే. కానీ మీకు నిధులు ఇవ్వడానికి మాత్రం వారికి చేతులు రావడం లేదు. తెలంగాణలో ఆ నలుగురు కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారు. మీరంతా తిరగబడాలి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్లకు బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి’అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్‌లో రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను సీఎం కేసీఆర్ మోసం చేశారని, స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. కేబినెట్లో కనీసం ఒక్క మహిళకు కూడా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని దుయ్యబట్టారు. మహిళలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 6 వేల మహిళా సంఘాలకు రూ. లక్ష చొప్పున ఉచితంగా అందిస్తామని, ఒక్కో మహిళా బృందానికి రూ. 10 లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలను ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే సెర్ప్‌లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, బీమా సౌకర్యం, ఆరోగ్య కార్డులు ఇస్తామని, వేతనాలు పెంచుతామన్నారు. ఈ సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతక్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు రెండో వారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన సందర్భంగా మహిళా సంఘాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారని, రాబోయే ఎన్నికలలో మహిళలకు ఎలాంటి హామీలు ఇవ్వాలో మహిళా సంఘాలతో చర్చించి కాంగ్రెస్ మహిళల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. -
రజనీకి బీజేపీ గాలం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీలకు తావులేని కొత్తకూటమిని ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. నటుడు రజనీకాంత్ ప్రకటించబోయే పార్టీతో పొత్తుపెట్టుకోవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పొత్తుకోసం అద్వానీ తదితర అగ్రనేతలు రాయబారాలు నడిపినా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నో చెప్పారు. జయ మరణాన్ని కేంద్రంలోని బీజేపీ అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా పెత్తనం సాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. బీజేపీ కారణంగానే అధికార పార్టీలోని సీఎం పళనిస్వామి వర్గంతో కలిసిపోవాల్సి వచ్చిందని పన్నీర్ సెల్వం ఒప్పుకున్నారు కూడా. పార్లమెంటు ఎన్నికలకు తమిళనాడు శాఖను సంసిద్ధం చేసేందుకు ఈనెల 9వ తేదీన అమిత్‌షా చెన్నైకి వచ్చినపుడు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన బహిరంగసభలో అనూహ్యంగా అన్నాడీఎంకే పాలనపై దుమ్మెత్తి పోశారు. అవినీతిలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యల ద్వారా అన్నాడీఎంకేకు రాంరాం చెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. రజనీకాంత్ పెట్టబోయే పార్టీతో పొత్తు ద్వారా కొత్తకూటమికి సన్నాహాలు చేయాలని రాష్ట్ర పార్టీకి అమిత్ సూచించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ భార్యపై విచారణ తమిళసినిమా(చెన్నై): వాణిజ్య ప్రకటనల సంస్థకు బకాయిలు ఎగ్గొట్టిన కేసులో ప్రముఖ నటుడు రజనీకాంత్ భార్య లత విచారణ ఎదుర్కోనున్నారు. ఆమెపై విచారణను కొట్టివేస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. లత విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చింది. 2014లో ‘కొచ్చాడయాన్’ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో నిర్మాణ సంస్థ, లత డైరెక్టర్‌గా ఉన్న మీడియావన్ గ్లోబల్‌తో కుదిరిన ఒప్పందం మేరకు ఏడీబ్యూరో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆ మొత్తంతో పాటు రూ.1.2 కోట్ల లాభాలను ఆ సంస్థ తిరిగి చెల్లించలేదని కేసు వేసింది. -
ఏ పార్టీతో పొత్తు ఉండదు
-
కాంగ్రెస్‌తో వామపక్షాల కూటమి?
కోల్‌కతా: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే విషయంపై వామపక్ష పార్టీలు సీరియస్‌గా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను ఎదుర్కొనేందుకు తప్పని పరిస్థితుల్లో పొత్తుగా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్లు బోగట్టా. అయిష్టంగానే... 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం కంచుకోట పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం లెఫ్ట్ ఫ్రంట్ మరియు సీపీఎంలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశాయి. కానీ, ఎన్నికల్లో కూటమి కన్నా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ లాభపడింది(ఎక్కువ ఓట్లు పోలయ్యాయి). దీంతో మరోసారి పొత్తు తెరపైకి రాగా.. పునరాలోచన చేసుకోవాలని వామపక్ష ఫ్రంట్(ఫార్వర్డ్ బ్లాక్.. ఆర్పీఎస్.. మరికొన్ని చిన్న పార్టీలు) సీపీఎంకు సూచిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారంపై సీపీఎంలో భేదాభిప్రాయాలు వ్యక్తం కావటం చూశాం. అయితే బీజేపీ, టీఎంసీలను ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గమని ఓ వర్గం నేతలు బలంగా వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై బెంగాల్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్వపన్ బెనర్జీ మాట్లాడుతూ..‘పొత్తులో భాగంగా వామపక్షా పార్టీలు కాంగ్రెస్‌కు ఓట్లు పడుతున్నాయి. కానీ కాంగ్రెస్ వైపు నుంచి మాకు ఓట్లు పడటం లేదు. పొత్తు వల్ల అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే లబ్ధిచేకూరుతోంది’ అని అన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం పార్టీ పెద్దలదేనని ఆయన స్పష్టం చేశారు. -
ప్రాంతీయ పార్టీలతో పట్టువిడుపులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీల సహాయంతో 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదిరించాలనే వ్యూహానికి కాంగ్రెస్ పదునుపెడుతోంది. ప్రాంతీయ పార్టీకి స్వేచ్ఛనిచ్చినట్లు చూపించడం ద్వారా పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక శక్తులైన ప్రాంతీయ పార్టీలను కూడగట్టాలనేది కాంగ్రెస్ ఆలోచన. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతున్న నేపథ్యంలో చిన్న పార్టీలతో కలిసి పోవడం కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. అయితే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో పార్టీ నేతల్లో అసంతృప్తిని అర్థం చేసుకోవడం, పార్టీ ప్రయోజనాలకోసం వారికి నచ్చజెప్పడం రాహుల్ గాంధీ ముందున్న పెద్ద సవాల్. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందే కూటములు ఏర్పాటు చేసుకోవాలంటూ రెండు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారు. ఇందులో భాగంగానే ఢిల్లీతోనే ఈ పొత్తులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు గానూ.. కాంగ్రెస్ 4, ఆప్ 3 స్థానాల్లో పోటీ చేసేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలో బలహీనంగా ఉన్నందున ఎస్పీ, బీఎస్పీలతో సీట్ల విషయంలో ఆ పార్టీ పట్టుబట్టకపోవచ్చని సమాచారం. -
కర్ణాటక: బీజేపీకి అసలు సవాలు ఇదే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నాలుగు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశ రాజకీయాలపై పెను ప్రభావాన్నే చూపనున్నాయి. ఇవి రాజకీయ శక్తుల పునరేకీకరణకు అవకాశం కల్పించాయి. లోక్‌సభ ఎన్నికలు దాదాపు 10 నెలలున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక పరిణామాలు కాంగ్రెస్, బీజేపీల్ని ఆలోచనలో పడేశాయి. తనను ఏకాకిని చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని బీజేపీకి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు చాలా అవసరమని కాంగ్రెస్‌కు కర్ణాటక రాజకీయం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. గత వారం రోజుల పరిణామాలతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వైరం మరింత తీవ్రమవడం ఖాయంగా కన్పిస్తోంది. కుమారస్వామి ప్రమాణంతో బీజేపీకి సవాలు బుధవారం జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి బీజేపీకి అసలు సవాలు మొదలవుతుంది. ప్రమాణస్వీకారం వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలు కలిసే అవకాశముంది. రాహుల్ గాంధీతో పాటు.. బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులతో పాటు సైద్ధాతికంగా కలిసివచ్చే పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఇదే వేదికగా బీజేపీ ఏకాకిని చేసేందుకు వీరంతా ముందడుగు వేయవచ్చు. ప్రాంతీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల మేరకు ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోతుందని.. 11 పెద్ద రాష్ట్రాల్లో తమను ఢీకొట్టే సత్తా ఆ పార్టీకి లేదని బీజేపీ సమర్ధించుకుంటోంది. ప్రస్తుతం పంజాబ్, మిజోరం, పుదుచ్చేరిల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తాము కర్ణాటకలో మంచి పనితీరు కనపర్చామని, ఉత్తరాది పార్టీ అన్న ముద్ర చెరిపేసుకున్నామనేది ఆ పార్టీ వాదన. ప్రాంతీయ పార్టీలతో కలిసి... మరోవైపు బీజేపీని నేరుగా ఢీకొట్టాల్సిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని 84వ ప్లీనరీలో తీర్మానించిన విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి ఒకరు గుర్తు చేశారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో ముందుకు వెళ్లకపోతే ఆ పార్టీకి నిరాశే మిగులుతుందని, కర్ణాటకను లౌకిక శక్తులు నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని, ఇరు పార్టీల మధ్య విభేదాలతో కూలిపోతుందని, ఆ పరిస్థితి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు సాయపడుతుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాల స్పందిస్తూ.. ప్రస్తుతం బీజేపీని నిలువరించకపోతే.. లౌకిక శక్తులకు అతి పెద్ద దెబ్బగా మారుతుందని, నరేంద్ర మోదీ నేతృత్వంలో సమాజం మరింత చీలిపోతుందని అన్నారు. -
తెలుగుదేశంలో గందరగోళం
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్వ కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఘనమైన చరిత్ర గల పచ్చపార్టీకి తెలుగు తమ్ముళ్లు ఇటీవల గట్టి షాకే ఇచ్చారు. రేవంత్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇంకొందరు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం టీటీడీపీ నేతలతో నిర్వహించిన సమీక్షలో చేసిన ప్రకటనలు మరింత గందరగోళంలో పడేశాయి. పొత్తులపై ఆయన చేసిన అస్పష్టమైన ప్రకటన పార్టీ కేడర్‌లో తర్జనభర్జనలకు తెరతీసింది. తెలంగాణలో పార్టీని వదిలేది లేదని.. విలీనం ఊసే లేదని.. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయంటూనే.. ఎన్నికల ముందే ప్రకటిస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపుతున్నాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: 2014లో పొత్తులు పెట్టుకుని, ఇన్నాళ్లు బీజేపీతో అంటగాగిన చంద్రబాబు బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదనడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇప్పటికే ఒంటిరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు లేకపోతే ఇక మిగిలింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే. గతంలో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన పొత్తు ఉంటాయని ప్రకటన చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తోనే పొత్తు ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చినట్లేనని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీని వీడిన సీనియర్లు..మిగిలింది ఇద్దరే.. తెలంగాణ టీడీపీలో రెండేళ్లుగా స్థబ్దత నెలకొనడంతో గత ఎన్నికల్లో పార్టీ టికెట్లపై పోటీ చేసిన వారు, కష్టాల్లోనూ పార్టీని పట్టుకొని ఉన్నవారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగారావు, హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు పేర్యాల రవీందర్రావు, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు కర్రు నాగయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు ఉమ్మడి జిల్లాలోని వీరి అనుచరులు, సీనియర్ నేతలు టీడీపీని వదిలి తమ భవిష్యత్‌ను చక్కదిద్దుకునేందుకు ఇతర పార్టీల్లో చేరారు. దీంతో మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు, 9 నియోజకవర్గాలకు ఇన్చార్జీలు లేకుండా పోయారు. కాగా.. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాలో మంత్రుల స్థాయిలో పనిచేసి ముఖ్యనేతలుగా ఉన్న తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, జాతీయ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి మాత్రమే పార్టీకి పెద్దదిక్కుగా మిగిలారు. అయినా.. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు అధ్యక్షులే లేకుండా పోయారు. అదేవిధంగా కరీంనగర్, రామగుండం, వేములవాడ నియోజవర్గాలకు 2014 ఎన్నికల నాటి నుంచే నియోజకవర్గ అధ్యక్షులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం జగిత్యాలకు రమణ, కోరుట్లకు సాంబారి ప్రభాకర్, ధర్మపురికి జాడిబాల్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి ఇన్చార్జి లేకపోయినా సీనియర్ నాయకుడు, పార్టీ నగర అధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. చందా గాంధీ, కందుల ఆదిరెడ్డిలాంటి సీనియర్లు పార్టీ కోసం పని చేస్తున్నారు. పొత్తులతో ఎవరికి లాభం.. పార్టీలో మిగిలేది ఎవరు.. టీడీపీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఖాయమని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. ఏ పార్టీతో పొత్తు అనే విషయాన్ని తేల్చకపోయినప్పటికీ టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీని వీడిన నేతల్లో అంతర్మథనం మొదలైంది. అధికార టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే తమ పరిస్థితి ఏంటని టీఆర్ఎస్లో చేరిన నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే జగిత్యాల నియోజకవర్గానికి టీడీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు మాత్రమే లాభం చేకూరే అవకాశం ఉంది. జగిత్యాలలో టీఆర్ఎస్ టికెట్ కోసం చాలా మందే పోటీ పడుతున్నా.. బలమైన నాయకుడు లేకపోవడంతో రమణకు లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మిగిలిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం బెర్త్ ఖరారు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పొత్తులో పెద్దిరెడ్డికి హుజూరాబాద్, హుస్నాబాద్ స్థానాలు దక్కే అవకాశం లేదు. హుజూ రాబాద్‌కు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, హుస్నాబాద్‌కు కెప్టెన్ లక్ష్మీకాంతరావు తనయుడు వొడితెల సతీష్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిని కాద ని పొత్తులో టీడీపీకి ఈ రెండు స్థానాల్లో ఇవ్వడం సాధ్యపడే అవకాశాలు తక్కువే. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే పెద్దిరెడ్డికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ఎన్నికలకు ముందే తన భవితవ్యం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. ఇదిలా వుండగా ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వలసలతో తెలుగుదేశం పార్టీ ఆవసాన దశకు చేరగా, ఆ పార్టీ నేత చంద్రబాబు ప్రకటన టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొత్తులు వల్ల ప్రతికూల పరిస్థితులు ఉండే మరికొందరు సీనియర్లు సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉండగా, పార్టీలో చివరకు ఎవరు మిగులుతారనే చర్చ జోరందుకుంది. -
తెలంగాణలో ఎవరితోనూ పొత్తుండదు : బీజేపీ
హైదరాబాద్ : తెలంగాణలో ఎవరితోనూ పొత్తు ఉండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షడు కె. లక్ష్మణ్ తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ..నియోజకవర్గాల పునర్ విభజన ఉండదని జాతీయ నాయకత్వం నుంచి సమాచారం ఉందని స్పష్టంగా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీనే మన టార్గెట్ అని అమిత్ షా అన్నారని వివరించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిని అమిత్ షాకు వివరించానని తెలిపారు. రాష్ట్ర పర్యటనల్లో కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని, వాటిని పట్టించుకోవద్దని అమిత్ షా సూచించారని అన్నారు. అలాగే ముందస్తు ఎన్నికలు ఉండవని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లోని రాజకీయ నిరుద్యోగులకే ఉద్యోగాలు వస్తున్నాయి కానీ..ఉద్యమంలో పోరాడిన విద్యార్థులు, యువకులకు రావడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలపై ఉద్యమాల్ని మరింత ఉదృతం చేస్తామని వివరించారు. రాష్ట్రంలో లక్షా 12వేల ఉద్యోగాలను భర్తీ చేసే వరకు పోరాడుతామని చెప్పారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడిపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించేందుకు బడ్జెట్లో మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో మతోన్మాద మజ్లిస్‌ను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని ప్రజలు మరచిపోలేదని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే తానులో ముక్కలని అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భవ పథకాలపై ఇంటింటికీ ప్రచారం చేస్తామన్నారు. సత్తుపల్లిలో టీఆర్ఎస్ నేత రామలింగేశ్వరరావు త్వరలో భాజపాలో చేరనున్నారని, బీజేపీలో చేరిన ఎన్నారై అమరేందర్ రెడ్డి, వనపర్తి నుంచి ఎమ్మెల్యే, లేదా మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేయనున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వనపర్తిలో కాషాయ జెండా రెపరెలాడుతుందన్నారు. కాగజ్ నగర్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాస్‌ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ప్రధాని మోదీని ఓడించాలంటే..?
న్యూఢిల్లీ: బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అడ్డుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారు. మహాకూటమితోనే బీజేపీ, మోదీని ఎదుర్కొగలరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఓడించగలదని అనుకోవడం మూర్ఖత్వమన్నారు. కలిసికట్టుగా పోరాడితే 2019లో బీజేపీపై విజయం సాధించే అవకాశాలున్నాయని చెప్పారు. ‘సీట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్‌కు చాలాపెద్ద నష్టమే జరిగింది. కానీ 2014 పార్లమెంటు ఎన్నికల్లో 59 శాతం, 2017 యూపీ ఎన్నికల్లో 69 శాతం ప్రజలు ప్రధానికి ఓటు వేయలేద’ ని మణిశంకర్ తెలిపారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌లో ఎటువంటి ఇబ్బంది లేదన్న అయ్యర్, జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడుతోందని అంగీకరించారు. పార్టీని పటిష్టం చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి యువతరాన్ని చేర్చుకోవాలని అయ్యర్ సూచించారు. 2004 స్ఫూర్తితో యూపీఏ మిత్రపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన కోరారు. కేంద్రంలో యూపీఏ ఓడిపోవడానికి కారణం ఈ కూటమి చెల్లాచెదురు కావడమేనన్నారు. అప్పట్లో సోనియా గాంధీ మిత్రపక్షాలను కలుపుకునిపోయారని, ఇప్పడు రాహుల్ గాంధీపై ఆ బాధ్యత ఉందన్నారు. మహాకూటమి ఏర్పాటు కంటే ముందు కాంగ్రెస్ అంతర్గతంగా బలపడాలని అయ్యర్ సూచించారు. -
ఆ పార్టీలకు పొత్తుల ఆలోచనలు వద్దు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కమ్యూనిస్టులు ఏ పార్టీతోనూ పొత్తుల కోసం ఆలోచించవద్దని.. దీని వల్ల పార్టీ క్యాడర్ దెబ్బ తింటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం–వామపక్షాల ఐక్య కార్యాచరణ, కమ్యూనిస్టుల ఐక్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆర్థిక పోరాటాలను రాజకీయ పోరాటాలుగా మార్చాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ తనది కమ్యూనిస్టు కులమని, తాను ఎప్పుడూ ప్యూడల్ విధానాన్ని ప్రోత్సహించలేదని అన్నారు. ఇవాల్టిదాకా కేసీఆర్‌ను కలవలేదని చెప్పారు. సీపీఐ శాసన సభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి ఎం.డి గౌస్, ఐఎస్యూసీఐ(సి) రాష్ట్ర నాయకులు మురహరి, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాధగోని రవి, రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, మాస్టార్జీ, నాయకులు కాలువ మల్లయ్య, ప్రొఫెసర్ విజయలక్ష్మి, సీపీఎం నాయకులు జి. రాములు తదితరులు పాల్గొన్నారు. -
కొత్తవారు అమ్ముడుపోతారేమో?
సాక్షి, ముంబై: కొత్తగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు తమ ప్రత్యర్థులతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకోకుండా అన్ని పార్టీల కార్యకర్తలు దృష్టిసారించారు. వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల కదలికలపై తమతమ పార్టీ నాయకులకు రిపోర్టులు అందజేస్తున్నారు. శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటముల మధ్య పొత్తు బెడిసి కొట్టడంతో ఈసారి అన్ని పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. శివసేన, బీజేపీ 25 ఏళ్ల తరువాత, కాంగ్రెస్, ఎన్సీపీ 15 ఏళ్ల తరువాత విడిపోయాయి. దీంతో నగరంలోని 36 శాసన సభ నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలన్నీ కొత్త అభ్యర్థులను బరిలో దింపాయి. అనేక నియోజక వర్గాల్లో కొన్ని పార్టీలకు బలమైన అభ్యర్థులే దొరకలేదు. అందులో కొత్తగా బరిలో దిగిన వారి సంఖ్య అధికంగా ఉండడంతో మరింత ఆందోళనకు గురవున్నారు. ఆఖరుక్షణంలో అభ్యర్థిత్వం ఇవ్వడంవల్ల వారు ఈ ఎన్నికల్లో నిలదొక్కుకోవడం కొంత కష్టంతో కూడుకున్న పనేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో తమ ప్రత్యర్థులతో రహస్య మంతనాలు జరిపి ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ప్రమాదం పొంచి ఉందనే భయం పార్టీల అధినేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఆకస్మాత్తుగా అభ్యర్థిత్వం పొందడంతో బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాలు, సభలకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకోలేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం కూడా వారిలో లేకుండా పోయింది. ఇలాంటి సందర్భంలో ఎన్నికల్లో డబ్బులు వృథా చేయడం కంటే నామినేషన్ ఉపసంహరించుకుంటే బాగుంటుందా? లేక ఒప్పం దం (సెట్టింగ్) కుదుర్చుకుంటే బాగుంటుందా? అని కొందరు అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులపై నిఘా పెట్టాలని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలకు ఆదేశాలిచ్చారు. -
మీకేవీ..మాకేవి !
సాక్షి, హైదరాబాద్: అధికారిక పొత్తు ప్రకటనకు ముందే టీడీపీ-బీజేపీల్లో సీట్ల పంపకాల లెక్కలు మొదలయ్యాయి. ‘దేశం’ బీజేపీల మధ్య పొత్తు అధికారికంగానే ప్రకటించాల్సి ఉందని ఇరుపార్టీల ముఖ్యనాయకులు అంతర్గతంగా అంగీకరిస్తుండటంతో నగరంలో సీట్ల పంపకాలపై చర్చ జోరందుకుంది. ఈమారు గ్రేటర్ పరిధిలో మూడు లోక్‌సభ, కనీసం పది శాసనసభ స్థానాలకు తగ్గకుండా తీసుకోవాలని బీజేపీ భావిస్తుండటంతో, ఆయాస్థానాలపై నమ్మకం పెట్టుకున్న టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. 1999లో టీడీపీ-బీజేపీ పొత్తుల సమయంలో నగరంలో బీజేపీ ముషీరాబాద్, మలక్‌పేట, కార్వాన్, యాకుత్‌పురా, మహరాజ్గంజ్లతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. ఈ మారు బర్పేట,ముషీరాబాద్,గోషామహల్,కార్వాన్,యాకుత్‌పూరా,మలక్‌పేట, ఖైరతాబాద్లోపాటు ఉప్పల్,కూకట్పల్లి, మల్కాజిగిరి శాసనసభ స్థానాలను పొత్తుల్లో భాగంగా తప్పకుండా తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదే విధంగా హైదరాబాద్,సికింద్రాబాద్ లోక్సభస్థానాలతో పాటు మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలన్న భావనను పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ‘దేశం’ నేతల గుండెలు గుభేల్ : బీజేపీ పొత్తు వార్తల నేపథ్యంలో టీడీపీ నాయకుల గుండెలు గుభేల్మంటున్నాయి. ఇప్పటికే అంబర్‌పేటలో మాజీమంత్రి కృష్ణాయాదవ్, ముషీరాబాద్‌లో ఎంఎన్ శ్రీనివాసరావు, ముఠాగోపాల్, కార్వాన్ డాక్టర్ ఎస్రావు, అమ్జద్అలీఖాన్,గోషామహల్లో ప్రేమ్‌కుమార్‌ధూత్, మలక్‌పేటలో ముజఫర్అలీఖాన్, ఖైరతాబాద్‌లో విజయరామారావుల పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికే గోషామహల్‌కు చెందిన టీడీపీ నాయకుడు వినోద్‌కుమార్ రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించారు. అదేవిధంగా మల్కాజిగిరి,ఉప్పల్, కూకట్పల్లి శాసనసభ స్థానాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లో తమకే దక్కుతాయంటూ బీజేపీ ముఖ్యనేతలు ఇచ్చిన భరోసాతో ఆయా నియోజకవర్గాల్లో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మల్కాజిగిరిలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న మైనంపల్లి హన్మంతరావు, బీకే మహేష్ వర్గాలు, ఉప్పల్‌లో దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ తనయుడు ఇప్పటికే ఎన్నికల ్రపచారా సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరి ఈ స్థానాలు కేటాయించాల్సి వస్తే టీడీపీ ముఖ్యనేతల పరిస్థితి ఇబ్బందికరంగా తయారుకానుంది. -
రండి బాబో.. రండి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం.. కొబ్బరి చిప్పల సమన్యాయంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం స్థానికంగా ఏ పార్టీ కలిసి వస్తే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుని మున్సిపాలిటీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అవసరమైతే వార్డుల వారీగా కలిసి వచ్చే పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల కోర్ కమిటీ స్పష్టం చేసింది. జిల్లాలో ప్రస్తుతం నాలుగు మున్సిపాల్టీలకు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగుతున్నాయి. వీటిలో ఒక్క మెదక్ మున్సిపాలిటీ మినహా మిగిలిన చోట్ల టీడీపీకి పెద్దగా బలం లేదు. దీంతో ఆ పార్టీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవాలని అగ్ర నాయకత్వం చెప్పడంతో జిల్లా నేతలు పొత్తుల కోసం అన్ని పార్టీల వైపు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాలో నలుగురు సభ్యులతో కూడిన కోర్ కమిటీని ఇటీవల చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును సమన్వయకర్తగా నియమించారు. ఈ కోర్ కమిటీ ఇటీవల పటాన్చెరులో తెలగుదేశం పార్టీకి చెందిన జిల్లా ముఖ్యనాయకులతో సమావేశమైంది. మున్సిపల్ ఎన్నిక ల్లో స్థానికంగా కలిసి వచ్చే అన్ని పార్టీలతో, ఎజెండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పొత్తులు పెట్టుకోవాలని, దీంతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం ఉండి టికెట్లు రాక.. అలకవహించిన వారిని పిలిచి టికెట్లు ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. దీంతో తెలగు తమ్ముళ్లు టికెట్ల ఖరారు లిస్టులో ఖాళీలు పెట్టి పక్క పార్టీల నుంచి వచ్చే నేతల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు నెత్తి మీదకొచ్చినా... టీడీపీలో ఇంకా నియోజకవర్గం ఇన్చార్జులనే పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పటికీ ఐదు నియోజకవర్గాలకు ఇన్చార్జులే లేరు. కోర్ కమిటీ లీడర్‌గా ఉన్న మైనంపల్లి జిల్లా బయటనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆయన ఈసారి రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో, పూర్తి సమయం మల్కాజ్‌గిరికే కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు పత్రికా సమావేశాలు పెట్టడానికి తప్పితే జిల్లా మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇన్చార్జులు లేకపోవడంతో కార్యకర్తలను, ఇతర గ్రామ, పట్టణ స్థాయి నాయకులను ప్రోత్సహించేవారు లేరు. దీంతో ఏళ్లకేళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులు గత్యంతరం లేని పరిస్థితులో ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే ఎన్నికలు రావడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. కొంతలో కొంతైనా పరువు నిలుపుకునేందుకు స్థానిక అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు పోవాలని పార్టీ నేతలు నిర్ణయించారు. -
పొత్తులుంటాయ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండు, మూడు రోజుల్లో పొత్తులపై స్పష్టత వస్తుందని తెలుగుదేశం సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్ తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య సీట్లసర్దుబాటు కుదిరే అవకాశముందని, అదేసమయంలో మనం కూడా పొత్తులకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల్లో చోటుచేసుకునే మార్పుల అనంతరం.. రాజకీయ సమీకరణలు మారిపోతాయని ఆయన అన్నారు. గురువారం జిల్లాలోని మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవేందర్ మాట్లాడారు. రాష్ట్రం ఇంకా సమైక్యంగా ఉందనే భ్రమల నుంచి బయటకు రావాలని, వ చ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులొడ్డాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున... ఎన్నికలు ఉంటాయా? లేదా అనే అంశంపై శుక్రవారం స్పష్టత వస్తుందని, ఎన్నికలు జరగకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1985 నుంచి జిల్లా పరిషత్‌ను టీడీపీ గెలుస్తోందని, ఈ సారి కూడా స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేసేలా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్టీని వదిలివెళ్లినవారిని ప్రజలు పట్టించుకోరని, నాయకులు వెళ్లిన కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారని అన్నారు. ఇబ్రీహ ంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇతర పార్టీల ప్రలోభాలకు కేడర్ లొంగకుండా పార్టీ నేతలు చూడాలన్నారు. కొంతమంది నేతల నిష్ర్కమణ కారణంగా పార్టీ నుంచి వెళ్లే ఆలోచన ఉన్న దిగువశ్రేణి నాయకులతో మాట్లాడి మనోధైర్యం చెప్పాలని సూచించారు.ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి స్వాగతం పలకాలని పేర్కొన్నారు. అతిత్వరలోనే నియోజకవర్గాల ఇన్చార్జిలను ప్రకటిస్తామని చెప్పారు. చివరి నిమిషంలో కొన్ని సెగ్మెంట్లకు కొత్త అభ్యర్థులు బరిలో దిగినా సహకరించాలని సూచించారు. గ్రూపు రాజకీయాలకు తావివ్వవద్దని, అభిప్రాయబేధాలను విడనాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు కేఎం వివేక్, నక్కా ప్రభాకర్‌గౌడ్, నందారెడ్డి, సుభాష్‌యాదవ్, చంద్రయ్య, ఉదయ్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.