చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సెమికండక్టర్ విభాగంలో డ్రాగన్ కంట్రీను ఢీ కొట్టేందుకుగాను అమెరికా ఒక సెమీకండక్టర్ పరిశ్రమ కూటమిని ఏర్పాటుచేసేందుకు పావులను కదుపుతోంది.
4 దేశాల సెమీకండక్టర్ కూటమి..!
అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో సెమీకండక్టర్ పరిశ్రమ కూటమిని ఏర్పరచాలని అమెరికా ప్రతిపాదించినట్లు సమాచారం. సెమికండక్టర్ పరిశ్రమలో ఆధిపత్యాన్ని చెలాయిస్తోన్న చైనాకు ఆగడాలకు నిరోధించేందుకుగాను అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అమెరికా ప్రతిపాదనపై దక్షిణ కొరియా పూర్తిగా అంగీకరించలేదని తైవాన్ న్యూస్ నివేదించింది. దక్షిణకొరియాకు యూఎస్ సహకారం మొదటి ప్రాధాన్యతగా ఉన్నప్పటీకి, సెమికండక్టర్ వ్యాపారంలో అతి పెద్ద కస్టమర్‌గా చైనా నిలుస్తోండడంతో..అమెరికా నిర్ణయంపై దక్షిణకొరియా తడబడే అవకాశం లేకపోలేదని తైవాన్ న్యూస్ వెల్లడించింది.
చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..!
సెమికండక్టర్ పరిశ్రమలో చైనా హావా..!
ప్రపంచంలోని అత్యధిక కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను చైనా తయారు చేస్తోంది. కాగా ఈ గాడ్జెట్‌లను నిర్మించేందుకు ఆయా దేశాల సెమికండక్టర్లను దిగుమతి చేసుకుంటుంది. ఇక మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ తన భారీ మౌలిక సదుపాయాలను చైనాలో కల్గింది. దీంతో దక్షిణకొరియా వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు. ఇక సెమీ కండక్టర్ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా ఉన్న తైవాన్‌ను చైనా తన అధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
అదే జరిగితే..!
నాలుగు దేశాలతో సెమికండక్టర్ కూటమిను అమెరికా ఏర్పరిస్తే చైనాకు భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక తైవాన్ విషయంలో చైనా అవలంభిస్తోన్నతీరును చెక్ పెట్టవచ్చునని అమెరికా భావిస్తోంది. సెమికండక్టర్ పరిశ్రమలో రారాజు అయ్యేందుకుగాను చైనా తన కుటీల బుద్దిని ప్రదర్శిస్తోంది. తైవాన్‌కు చెందిన వాణిజ్యరహస్యాలను దొంగిలించడం, ఆ దేశ ఉద్యోగులపై గూఢాచర్యం వంటి ఆరోపణలను చైనా ఎదుర్కొంటుంది. ఇప్పటికే తైవాన్ దేశ న్యాయస్థానం చైనాకు చెందిన పలు కంపెనీలను విచారణ కూడా చేసింది. సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధిలో సెమీకండక్టర్లు లేదా 'చిప్స్' ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్‌గా నిలుస్తాయి.వీటి విషయంలో ఈ నాలుగు దేశాలు ఒక్కటైతే చైనా ఆగడాలకు చెక్ పెట్టే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇది కేవలం అమెరికా చేసిన ప్రతిపాదన మాత్రమే. ఈ నిర్ణయంపై కాలమే సమధానం చెప్పనుంది.
చదవండి: భారత్ నుంచి నిష్క్రమణ..యాక్సిస్ బ్యాంకులో విలీనమైన దిగ్గజ బ్యాంకు..!
Comments
Please login to add a commentAdd a comment