taiwan
-
‘చిప్’ల కోసం ట్రంప్ స్కెచ్
వాషింగ్టన్/తైపీ: సెమీ కండక్టర్ల తయారీలో ద్వీపదేశమైన తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న సెమీ కండక్టర్లలో 90 శాతానికిపైగా తైవాన్‌లో తయారైనవే. సెల్ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల దాకా ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో ఈ చిప్‌లు ఉండాల్సిందే. చిప్‌ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరున్న తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ)తో అమెరికాలో 100 బిలియన్ డాలర్ల (రూ.8.69 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఈ మేరకు ఆ కంపెనీని ఒప్పించారు. గతవారం ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నిధులతో టీఎస్ఎంసీ అమెరికాలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంటే సెమీకండక్టర్లు అమెరికాలోనే ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచే విదేశాలకు చిప్‌ల ఎగుమతి జరుగుతుంది. ఆదాయం చాలావరకు అమెరికా ఖాతాలోకి వెళ్లిపోతుంది. చిప్‌ల ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు తైవాన్‌లో మంటలు రాజేస్తోంది. జాతీయ భద్రతా సంక్షోభం తైవాన్ అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టి(డీపీపీ)పై మాజీ అధ్యక్షుడు మా యింగ్–జియూ నిప్పులు చెరిగారు. చైనా బారి నుంచి తైవాన్ను కాపాడుతున్నందుకు ట్రంప్‌కు ‘ప్రొటెక్షన్ ఫీజు’ చెల్లిస్తున్నారని డీపీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఎస్ఎంఎస్ను అమెరికాకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం జాతీయ భద్రతా సంక్షోభమేనని తేల్చిచెప్పారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుపట్టారు. చిప్‌ల తయారీలో తైవాన్ స్థానాన్ని దిగజార్చడం తగదని అన్నారు. ట్రంప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తైవాన్ ప్రజల విశ్వాసాన్ని, ఇతర సంబంధాలను దెబ్బతీస్తుందని మా యీంగ్–జియూ ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదాను దిగజారుస్తుందని అన్నారు. అయితే, అమెరికాలో పెట్టుబడులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లా చింగ్–తే స్పష్టంచేశారు. టీఎస్ఎంసీ విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. దేశ ప్రతిష్టకు వచ్చే ముప్పేమీ లేదని ప్రజలకు హామీ ఇచ్చారు. తైవాన్ను గాలికొదిలేస్తారా? తైవాన్‌పై పొరుగు దేశం చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని, ఏనాటికైనా విలీనం కాక తప్పదని చైనా చెబుతోంది. మరోవైపు అమెరికా మద్దతుతోనే తైవాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తైవాన్ రక్షణ బాధ్యతను అమెరికా స్వీకరించింది. ఇందుకోసం తైవాన్ రిలేషన్స్ యాక్ట్ తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా స్వరం మారింది. ప్రధానంగా తైవాన్‌కు జీవనాడిగా ఉన్న చిప్‌ల తయారీ రంగంపై ట్రంప్ దృష్టి పెట్టారు. అక్కడి పరిశ్రమను క్రమంగా అమెరికా తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని పీల్చిపిప్పి చేసి, ఆఖరికి గాలికి వదిలేయాలన్నదే ట్రంప్ ప్లాన్ అని తైవాన్ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ మరో ఉక్రెయిన్‌లా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నాయి. అమెరికా–తైవాన్ సంబంధాల భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ‘ఈ రోజు ఉక్రెయిన్, రేపు తైవాన్’ అనే మాట తైవాన్‌లో తరచుగా వినిపిస్తోంది. -
మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు.. జిన్‌పింగ్ హెచ్చరిక
బీజింగ్: కొత్త ఏడాది వేడుకల వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తైవాన్ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరంటూ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. చైనా, తైవాన్ వేరు కాదంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తైవాన్ను చైనాలో కలుపుకోవడం ఎవరూ ఆపలేరని అన్నారు. చైనాలో తైవాన్ అంతర్భాగమేనని తెలిపారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబం. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరు. మాతృభూమి పునరేకీకరణను ఎవరూ ఆపలేరు. అందుకే తైవాన్ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టినట్లు చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక, ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెల కొన్నవేళ జిన్‌పింగ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.ఇదిలా ఉండగా.. గత కొద్ది కాలంగా రెండు దేశాల మధ్య ఈ విషయమై ఘర్షణ నడుస్తోంది. చాలాసార్లు చైనా.. తైవాన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిచింది. నిజానికి చైనా, తైవాన్ దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. తైవాన్ ప్రజాస్వామ్యదేశం కాగా, చైనా కమ్యూనిస్టు దేశం. ఇటీవల కాలంలో తైపీపై బీజింగ్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ద్వీపదేశమైన తైవాన్‌కు ప్రపంచదేశాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. మే నెలలో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ ఎన్నికైన తర్వాత ఆదేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటి వరకు మూడు సార్లు భారీ మిలటరీ విన్యాసాలు చేపట్టింది. తైవాన్‌ని బలప్రయోగం ద్వారా తన ఆధీనంలోకి తీసుకురావడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాలా సార్లు జల, గగన తలాల్లో నియమాలను ఉల్లంఘించింది.మరోవైపు.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో అధికారంలోకి రాబోతున్న తరుణంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తైవాన్‌ని అమెరికా ఆసియాలో వ్యూహాత్మక మిత్రదేశంగా భావిస్తోంది. అమెరికా తైవాన్‌కి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి తైవాన్‌ని రక్షించేందుకు అమెరికా అండగా నిలుస్తోంది. -
చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు
-
స్టోరేజ్ చిప్సెట్స్ తయారీలోకి మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న మైక్రోమ్యాక్స్, తైవాన్‌కు చెందిన స్టోరేజ్ చిప్ కంపెనీ ఫీజన్ తాజాగా మిఫీ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేశాయి. ఈ జేవీ కృత్రిమ మేధస్సుతో (ఏఐ) కూడిన స్టోరేజ్ చిప్సెట్ మాడ్యూళ్లను రూపొందించి, తయారు చేస్తుంది. నోయిడా ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభించామని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ కో–పౌండర్ రాహుల్ శర్మ గురువారం తెలిపారు. ‘ఎన్ఏఎన్డీ కంట్రోలర్, ఎన్ఏఎన్డీ స్టోరేజ్ టెక్నాలజీలలో ఫీజన్ అగ్రగామిగా ఉంది. జేవీలో మైక్రోమ్యాక్స్‌కు 55 శాతం, ఫీజన్కు 45 శాతం వాటా ఉంది’ అని శర్మ చెప్పారు. భద్రత, వ్యూహాత్మక దృక్కోణం నుండి ఏ దేశానికైనా సర్వర్స్ చాలా ముఖ్యమైన అంశం అని అన్నారు. స్టోరేజ్ చిప్సెట్ల రూపకల్పనపై సంస్థ దృష్టి సారిస్తుందని చెప్పారు. ధర పదో వంతుకు తగ్గింపు.. ఈ వెంచర్‌తో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) ధరను పదో వంతు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ వెల్లడించారు. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇది భారత్‌లోనే కాకుండా ఇతర మార్కెట్లలోనూ సంచలనం కలిగిస్తుందని చెప్పారు. భారత్‌లోని కొన్ని ప్రముఖ సంస్థలతో ట్రయల్స్ ఈ నెలలో పూర్తవుతాయని, 2025 మొదటి త్రైమాసికంలో వాణిజ్య పరంగా సరఫరా ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘స్టోరేజ్ పరిష్కారాలను అందించే కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. స్వదేశీ స్టోరేజ్ సొల్యూషన్స్ కంపెనీ లేని దేశాలకు.. ముఖ్యంగా భారత్‌కు ఇది చాలా ముఖ్యం. మా జాయింట్ వెంచర్ మన స్వంత డిజైన్, తయారీని కలిగి ఉండటం వల్ల విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది’ అని శర్మ చెప్పారు. మూడేళ్లలో 1,000 మంది.. కంపెనీ ఫ్రెషర్లను నియమించి వారికి స్టోరేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై శిక్షణ ఇస్తుందని రాహుల్ తెలిపారు. ‘మా కాన్సెప్ట్ మొదట భారత్ కోసం.. ఆ తరువాత ప్రపంచం కోసం రూపొందించబడింది. రెండు ఏళ్లలో మొదటి డిజైన్‌ను సిద్ధం చేయాలనేది మా ఆకాంక్ష. మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో 1,000 ఇంజనీర్లను కలిగి ఉండాలని భావిస్తున్నాం. వీరందరికీ ఫీజన్ శిక్షణ ఇస్తుంది. కంపెనీ ఇప్పటికే ఉన్న తయారీ సంస్థల నుండి వేఫర్లను కొనుగోలు చేస్తుంది. స్టోరేజ్ మాడ్యూల్స్ తయారీకి వాటిని ఉపయోగిస్తుంది’ అని వివరించారు. -
తైవాన్ జలసంధిలోకి అమెరికా, కెనడా యుద్ధనౌకలు
తైపీ: తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలకు తావిచ్చే మరో పరిణామమిది. ఆదివారం అమెరికా, కెనడా యుద్ధ నౌకలు చైనా, తైవాన్లను విడదీసే తైవాన్ జలసంధిలోకి ప్రవేశించాయి. అమెరికా యుద్ద నౌక యూఎస్ఎస్ హిగ్గిన్స్, కెనడా యుద్ధ నౌక హెచ్‌ఎంసీఎస్ వాంకూవర్ ఆదివారం తైవాన్ జలసంధి గుండా ప్రయాణించాయని, తైవాన్ జలసంధి గుండా వెళ్లేందుకు అన్ని దేశాల నౌకలకు స్వేచ్ఛ ఉందని చెప్పడమే తమ ఉద్దేశమని సోమవారం అమెరికా నేవీకి చెందిన ఏడో ఫ్లీట్ తెలిపింది. తైవాన్ భూభాగం తమదేనంటూ వారం క్రితం చైనా భారీ యుద్ధ విన్యాసాలతో ఆ దేశాన్ని పూర్తి స్థాయిలో దిగ్బంధించడం తెలిసిందే. గత నెలలో జర్మనీకి చెందిన రెండు యుద్ధ నౌకలు తైవాన్ జలసంధిలో ప్రయాణించాయి. కాగా, తాజాగా అమెరికా, కెనడాల చర్యను చైనా ఖండించింది. తైవాన్ అంశం స్వేచ్ఛా నౌకాయానానికి సంబంధించింది కాదు, తమ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు సంబంధించిన వ్యవహారమని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా, కెనడా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధిలోకి ప్రవేశించడం ఈ ప్రాంత శాంతి, సుస్థిరతలకు భంగకరమని చైనా మిలటరీ వ్యాఖ్యానించింది. అవి జలసంధిలో ఉన్నంత సేపు వాటిని పరిశీలించేందుకు తమ వైమానిక, నౌకా బలగాలను అక్కడికి తరలించామని వివరించింది. -
Chinese President: తైవాన్‌పై డ్రాగన్ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి
బీజింగ్/తైపీ: చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం పావులు కదుపుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా అధికారిక వార్తాసంస్థ ‘సీసీటీవీ’ ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. జిన్‌పింగ్ తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించారు. ‘‘రానున్న యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగుపెట్టేలా చర్యలు చేపట్టండి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉండండి’’ అని సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవల తైవాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్‌పై అతి త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదనేందుకు జిన్‌పింగ్ వ్యాఖ్యలు సంకేతాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. హద్దు మీరితే బదులిస్తాం: తైవాన్ చైనా దూకుడుపై తైవాన్ స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఆరు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో రెండు విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి ప్రవేశించాయని తెలిపింది. ‘‘తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం’’ అని స్పష్టం చేసింది. యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. ‘‘రెచ్చగొట్టే చర్యలు ఆపండి. మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణచివేసే చర్యలకు పాల్పడొద్దు. స్వతంత్ర తైవాన్ ఉనికిని గుర్తించండి’’ అని చైనాకు సూచించింది. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పని చేయాలన్నదే తమ ఆకాంక్ష చెప్పింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్‌తోపాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్‌కు ఆ దేశాల అండ తైవాన్ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుని తీరతామని చెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతోపాటు మరో 30 దేశాలు తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి. -
చైనా కవ్వింపులు.. యుద్ధానికి సిద్దం కావాలన్న జిన్‌పింగ్!
బీజింగ్: చైనా, తైవాన్ మధ్య మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది. తాజాగా చైనాకు చెందిన సైనిక విమానాలు, నౌకలు తైవాన్ భూభాగంలోకి వెళ్లినట్టు తైవాన్ తెలిపింది. మరోవైపు.. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్లు సమాచారం. దీంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 6 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) చైనాకు చెందిన ఆరు సైనిక విమానాలు, ఏడు నౌకాదళ నౌకలు తైవాన్ భూభాగంలో గుర్తించబడ్డాయి. రెండు విమానాలు మధ్యస్థ రేఖను దాటి తైవాన్ నైరుతి వైమానిక రక్షణ గుర్తింపు జోన్లోకి ప్రవేశించాయి. దీంతో, రక్షణ శాఖ అప్రమత్తమైందని తెలిపింది. ఇక, తైవాన్ చుట్టూ బీజింగ్ తరచుగా సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా..ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలి. దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలి. సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడాలని సైన్యానికి సూచించినట్లు చైనా వార్తా సంస్థలు తెలిపాయి.URGENT 🇨🇳 President Chino Xi Jinping orders his troops to prepare for war, visits installations and requests an increase in missile production as soon as possible. This appeared in the national broadcast on the state channel CCTV pic.twitter.com/9HXfSMMyLI— Nostr World (@newsandworld) October 20, 2024 -
విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా.. చైనాతో లింకులు
సాక్షి,విశాఖపట్నం : భారీ సైబర్ ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తూ వచ్చిన నిధుల్ని చైనా, తైవాన్లకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ క్రైమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు విశాఖ పోలీసులకు అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారం అందింది. దీంతో రంగంలోకి విశాఖ పోలీసులు సైబర్ నేరస్థుల్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల దందాపై సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్‌కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నాం. చైనాతో సంబంధాలు ఉన్న ఈ ముఠా గుట్టు రట్టు చేశాం. నిందితులు రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ బెట్టింగ్ యాప్ నడుపుతున్నారు. విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో ఒక వర్కింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును చైనా,తైవాన్లకు పంపుతున్నారు. నేరానికి పాల్పడ్డ నిందితుల్ని ఇప్పటి వరకూ ఏడుగురుని అదుపులోకి తీసుకున్నాం. నిందితులు నుంచి పది ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది పర్సనల్ కంప్యూటర్లు,కార్,బైక్ స్వాధీనం చేసుకున్నాం.వీటితో పాటు 800 అకౌంట్లు, చెక్ బుక్ లు, డెబిట్ కార్డులు, స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. -
తైవాన్ను దిగ్బంధించిన డ్రాగన్
తైపీ: డ్రాగన్ దేశం చైనా సోమవారం తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలకు తెరతీసింది. విమాన వాహక నౌక, యుద్ద నౌకలు, అత్యాధునిక యుద్ధ విమానాలతో తైవాన్ను, చుట్టుపక్కల దీవులను చుట్టుముట్టింది. కమ్యూనిస్ట్ చైనాలో అంతర్భాగమని అంగీకరించబోమంటూ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్–తె ఇటీవల చేసిన ప్రకటనకు సమాధానంగానే విన్యాసాలు చేపట్టినట్లు చైనా ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం జరిగిన జాతీయ ఉత్సవాల్లో అధ్యక్షుడు లాయ్ చింగ్–తె మాట్లాడుతూ.. తైవాన్ తమదేనంటూ చైనా చేస్తున్న వాదనను ఖండించారు. చైనా బెదిరింపులను, దురాక్రమణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం నచ్చని చైనా తాజాగా భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. విమాన వాహక నౌక లియోనింగ్ నుంచి జె–15 యుద్ధ విమానం టేకాఫ్ తీసుకుంటున్న వీడియోను అధికార టీవీ ప్రసారం చేసింది. అయితే, విన్యాసాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే విషయం తెలపలేదు. నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, మిస్సైల్ బలగాలు కలిసికట్టుగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతిచ్చే వారికి ఇదో హెచ్చరికని పేర్కొంది. దీనిపై తైవాన్ స్పందించింది. గుర్తించిన ప్రాంతాల్లో యుద్ధ నౌకలను, మొబైల్ మిస్సైళ్లను మోహరించామని, రాడార్లతో గట్టి నిఘా ఉంచామని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. 25 వరకు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను, మరో నాలుగు చైనా ప్రభుత్వ నౌకలను రాడార్లు గుర్తించాయని తైవాన్ పేర్కొంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో చైనా 125 సైనిక విమానాలను విన్యాసాలకు పంపిందని తైవాన్ తెలిపింది. వీటిలో 90 వరకు విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తమ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోనే కనిపించాయంది. చైనా మేలోనూ ఇదే రకంగా మిలటరీ విన్యాసాలను చేపట్టింది. 2022లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ సారథ్యంలోని బృందం తైవాన్ సందర్శన సమయంలో కూడా చైనా భారీ సైనిక విన్యాసాలతో తైవాన్ను దిగ్బంధంలో ఉంచింది. ఇలా ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనాలో విలీనం కాకమునుపు తైవాన్ జపాన్ వలసప్రాంతంగా ఉండేది. చైనా ప్రధాన భూభాగంపై మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పటయ్యాక 1949లో చియాంగ్ కై షేక్ నాయకత్వంలోని నేషనలిస్ట్ పార్టీ తైవాన్‌లో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
భారత్‌లో ఫాక్స్‌కాన్ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్
శ్రీపెరంబదూర్: భారత్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్లీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంపై దృష్టితో బ్యాటరీ తయారీ వ్యాపార విస్తరణపై ఫాక్స్‌కాన్ దృష్టి సారించింది. ఈ సంస్థ ఈ–బస్‌ల కోసం తైవాన్‌లో ఇలాంటి ప్లాంట్ ఒకదాన్ని ఇప్పటికే ఏర్పాటు చేయగా, ఈ ఏడాదే ఉత్పత్తి మొదలు కానుంది. ‘‘3ప్లస్3 భవిష్యత్ పరిశ్రమ ఏర్పాటుకు వేచి చూస్తున్నాం. తమిళనాడులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఏర్పాటు విషయంలో సహకారం ఎలా అన్నదానిపై పరిశ్రమల మంత్రితో చర్చిస్తున్నా’’ అని యాంగ్లీ తెలిపారు. సోలార్, విండ్ టర్బయిన్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నిల్వ చేసేందుకు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు వీలు కలి్పస్తాయి. మన దేశం పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దీంతో ఈ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఫాక్స్‌కాన్ ఆసక్తిగా ఉన్నట్టు యాంగ్లీ మాటలను బట్టి తెలుస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా ఫాక్స్‌కాన్ ప్రణాళికలు అమలు చేస్తోంది. త్వరలోనే ఈవీల తయారీ మొదలవుతుందని యాంగ్లీ తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకు తాము 1.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వ్యాపారం 10 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్లు చెప్పారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుత భారత పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల సీఎంలతో యాంగ్లీ సమావేశం కావడం గమనార్హం. ఎన్నో రాష్ట్రాలను సందర్శించిన తర్వాత భారత్ వృద్ధి పథకంలో ఉందని అర్థమవుతోందంటూ.. ఈ ప్రయాణంలో ఫాక్స్‌కాన్ సైతం భాగస్వామి కావాలనుకుంటున్నట్టు యాంగ్లీ చెప్పారు. -
తైవాన్‌లో భూకంపం
తైపే: తైవాన్ తూర్పుతీరంలో శుక్రవారం(ఆగస్టు16) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్డర్స్కేల్పై 6.1గా నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియలాజికల్సర్వే తెలిపింది. హులియెన్ నగరం సమీపంలో 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు తైవాన్ కేంద్ర వాతావారణ కేంద్రం వెల్లడించింది.భూకంపం విషయాన్ని తైవాన్ వాతావరణ కేంద్రం ముందుగానే పౌరులకు మొబైల్‌ఫోన్ సందేశాల రూపంలో చేరవేసింది. ఎక్కడివారక్కడ జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తైవాన్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. -
మెత్తబడ్డ తైవాన్.. చైనాకు స్నేహ హస్తం
తైపీ: చైనా భారీ ఎత్తున చేపట్టిన సైనిక విన్యాసాలతో తైవాన్ దిగొచ్చింది. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్ చింగ్-తె బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో చైనాకు వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఇది బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనికి ప్రతిగా తైవాన్ చుట్టూ డ్రాగన్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది.దీంతో లాయ్ చింగ్-తె దూకుడు తగ్గించారు. చైనాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమేనన్నారు. ఆదివారం తైపీలో ఓ సమావేశంలో పాల్గొన్న లాయ్‌చింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ సుస్థిరత చాలా ముఖ్యం. తైవాన్ జలసంధిలో అలజడులను ప్రపంచ దేశాలు అంగీకరించవు. చైనాతో కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని లాయ్ చింగ్ అన్నారు.కాగా, ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకిగా పేరొందిన లాయ్ చింగ్-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకార సందర్భంగా లాయ్‌చింగ్ మాట్లాడుతూ చైనా తమను బెదిరించడం ఆపాలని డ్రాగన్‌కు కాస్త గట్టిగానే చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైనా, తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో దూకుడు తగ్గించిన లాయ్ చింగ్ మెత్తబడ్డారు. -
పార్లమెంట్లో డిష్యుం.. డిష్యుం
చట్ట సభల్లో సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. ఒక్కోసారి అవి శ్రుతి మంచి దాడులకు దారి తీసిన దాఖలాలు లేకపోలేదు. అయితే తైవాన్‌లో ఆ పరిస్థితి ముష్టి యుద్ధానికి దారి తీసింది. పార్లమెంట్‌లోనే చట్ట సభ్యులు తన్నుకున్న వీడియోలు ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నూతన సంస్కరణలపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.పార్లమెంట్లో తప్పుడు ప్రకటనలు చేసే వాళ్లకు కఠిన శిక్ష పడేలా చేసిన తైవాన్ పార్లమెంట్ చట్టం చేయాలనుకుంది. ఇందుకుగానూ చట్ట సభ్యులకు అధిక అధికారం కట్టబెట్టే చట్ట ప్రాతిపాదనలపై శుక్రవారం చర్చ జరిగింది. ఆ సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం డిష్యుం.. డిష్యుంకి దారి తీసింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. ఇష్టానుసారం తన్నుకున్నారు. รัฐสภาไต้หวันวุ่น นักการเมืองทะเลาะกันนัว หลังไม่มีพรรคใดครองเสียงข้างมากกระทบการลงมติ #ทันโลกกับไทยพีบีเอส #ThaiPBS #ไต้หวัน #taiwan pic.twitter.com/M2Fkmf5f5T— ทันโลกกับThaiPBS (@TanlokeThaiPBS) May 18, 2024 మహిళా ప్రతినిధులు సైతం తమ వంతుగా ఈ గొడవలో భాగం అయ్యారు. జుట్టు జుట్టు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. కిందపడి పడి గుద్దులు గుద్దుకున్నారు. ఆ ఘర్షణల్లో ఓ ఎంపీ అక్కడి బిల్లు సంబంధిత ఫైల్స్‌ను తీసుకుని బయటకు పరిగెత్తడం బాగా వైరల్ అయ్యింది. 🚨🇹🇼#BREAKING: A member of Taiwan's parliament stole a bill and ran off with it to prevent it from being passed.LMFAOOOOOO 😭😭😭pic.twitter.com/CxcmWCusAI— Censored Men (@CensoredMen) May 17, 2024డెమొక్రటిక్ ప్రొగెసివ్ పార్టీ, కువోమింటాంగ్ పార్టీ ఎంపీల మధ్య చర్చ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ ఘర్షణలకు కారణమైంది. మరికొందరు స్పీకర్ కుర్చీ చుట్టు చేరడం, టేబుళ్ల మీద నుంచి దూకడం ఆ వీడియోలలో చూడొచ్చు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ గలాట.. మధ్యాహ్నం దాకా కొనసాగింది. తైవాన్ పార్లమెంట్లో 113 సీట్లు ఉన్నాయి. తైవాన్ నూతన అధ్యక్షుడు లై చింగ్ టె సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందే పార్లమెంట్ రణరంగంగా మారడం గమనార్హం. విశేషం ఏంటంటే.. చట్ట సభలో మెజారిటీ లేకున్నా చింగ్ టె అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతుండడం.డీపీపీ కంటే కేఎంటీకి సీట్లు అధికంగా వచ్చాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన బలం లేదు. దీంతో.. టీపీపీ మద్దతు తీసుకోవాలని కేఎంటీ భావిస్తోంది. -
National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులకు కొరత లేదు. ఇందులో గ్రీన్‌టీ, బ్లాక్ టీ ఇలా రకరకాల టీలు చాయ్ ప్రియులను ఉల్లాస పరుస్తుంటాయి. మరి బుబుల్ టీ అని ఒక ‘టీ’ ఉంది. దీని గురించిఎపుడైనా విన్నారా? ఈ రోజు(ఏప్రిల్ 30) నేషనల్ బబుల్టీ డే అట. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు. దీని వలన లాభాలేంటో ఒకసారి చూద్దామా..?బబుల్ టీ.. ఈ పేరే కొత్తగా ఉంది కదా. బబుల్ టీని బోబా లేదా పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో ముఖ్యంగా తైవాన్‌లో బాగా పాపులర్. అధిక ప్రోటీన్‌తో నిండి ఉంటుంది కనుక చైనా ధనవంతుల్లో దీనికి డిమాండ్ ఎక్కువ.బబుల్ టీని పాలు, పండ్లు, పండ్ల రసాలతో టీ కలిపి, చివర్లో టేపియోకా ముత్యాలను కలిపి సేవిస్తారు. దీన్ని శీతాకాలంలో వేడిగా, వర్షాకాలంలో చల్లగా సేవిస్తారు.అయితే, బబుల్ టీలో చక్కెర, కొవ్వులు ,సాధారణ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా మరియు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. మధుమేహం ,గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకని మితంగా తీసుకోవడమే ఉత్తమం.బబుల్ టీలో ఉపయోగించే టపియోకా ముత్యాలు కాసావా రూట్ నుండి తయారవుతాయిపైగా వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి అంతర్గతంగా అనారోగ్యకరమైనవి కానప్పటికీ, అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఈటీలో చేరతాయి.కేలరీల గని ఈ బబుల్ టీ. కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని రోజువారీ పానీయంగా కాకుండా అప్పుడప్పుడు తీసుకునే స్పెషల్ ట్రీట్‌గా మాత్రమే భావించాలి. సాధ్యమైనప్పుడు తక్కువ చక్కెర లేదా చక్కెరలేని స్వీట్నెర్లను, అలాగే క్యాలరీ ,కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు టపియోకా ముత్యాలకు బదులుగా ఫ్రూట్ జెల్లీలు లేదా అలోవెరా వంటి టాపింగ్స్‌ను వాడుకోవచ్చు. -
పాపాయిల కోసం ప్రాణాలే అడ్డేసిన నర్సులు
తైవాన్‌లో వచ్చిన అతిపెద్ద భూకంపం అక్కడి ప్రజలను వణికించింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడం ప్రకపనలు రేపింది. పెద్ద పెద్ద భవనాలు, నివాస గృహాలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా మార్గాలు స్థంభించాయి. ఈ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోను, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజనుల అభిమానాన్ని సంపాదించుకుంది. భూకంపం ప్రభావం అక్కడి ఆసుపత్రులను కూడా ప్రభావితంచేశాయి. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న వారు, ఆపరేషన్ థియేటర్లలో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకు ఆయా విభాగాల వైద్యులు, నర్సులు అప్రమత్తమవుతారు.ప్రాణాలకు తెగించి మరీ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఘటనే తైవాన్ భూంకపం సమయంలోనూ చోటు చేసుకుంది. (చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!) భూకంపం తైవాన్ను అతలాకుతలం చేస్తున్న సమయంలో స్థానిక ఆసుపత్రిలోని నర్సులు వెంటనే స్పందించారు. ఆస్పత్రి మెటర్నిటీ వార్డులో పసికందుల ప్రాణాలు కాపాడడానికి రంగంలోకి దిగారు. భూప్రకంపనలను గుర్తించిన వెంటనే పరుగు పరుగున వచ్చి ఉయ్యాలలో నిద్రపోతున్న శిశువులను రక్షించే ప్రయత్నం చేయడం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ప్రసూతి యూనిట్‌లోని నలుగురు సిబ్బంది ఉయ్యాలలను కదలకుండా ఉంచడానికి, గట్టిగా పట్టుకోవడానికి కష్టపడ్డారు. ఒక పక్క బిల్డింగ్ అటూ ఇటూ ఊగుతోంది. దీనికి పసిబిడ్డలు ఉయ్యాలలూ కదిలిపోతున్నాయి. మరోవైపు కిటికీలు పగులుతాయోమోనన్న భయం. ఈ సమయంలో వారి ఆందోళన, కష్టం సీసీటీవీలో రికార్డైనాయి. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) These nurses risk their lives to literally save lives of babies during earthquake in Taiwan. Real life heros! Be safe🙏pic.twitter.com/Q8YLdSKQkJ — Nico Gagelmann (@NicoGagelmann) April 4, 2024 -
Japan Earthquake: జపాన్‌లో కంపించిన భూమి..
టోక్యో: తైవాన్ భూకంప ఘటన మరువకముందే తాజాగా జపాన్‌లో భూమి కంపించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దీంతో, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. కాగా, తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం తైవాన్‌లో భూకంపం వచ్చిన మరుసటి రోజే నేడు జపాన్‌లో భూమి కంపించింది. హోన్షు తూర్పు తీరంలో రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 🚨🇯🇵 BREAKING: 6.3 magnitude earthquake near the east coast of Japan pic.twitter.com/Ro97HguPVZ — Kacee Allen 🇺🇸 (@KaceeRAllen) April 4, 2024 ఇదిలా ఉండగా.. తైవాన్‌లో బుధవారం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి. A dog sensed an earthquake in Taiwan seconds before it happened and alerted its owner..🐕🐾😳#Taiwan #Tsunami #Japan #TaiwanEarthquake #earthquake pic.twitter.com/10SdmUDENd — Zainab Fatima (@ZainabFati18) April 4, 2024 తైవాన్‌లో భూకంపం సందర్భంగా చిన్నారులను కాపాడిన నర్సులు.. ⚡️Nurses in a #Taiwan Hospital protecting babies during #earthquake.#Taiwan #earthquake #Japanpic.twitter.com/rF5It43iYO — Tajamul (@Tajamul132) April 4, 2024 -
తైవాన్‌లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్‌ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్‌ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్‌లో ఉంది. -
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. జనజీవనం అతలాకుతలం (ఫొటోలు)
-
తైవాన్ లో భారీ భూకంపం
-
తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు
తైవాన్‌లో అత్యంత భారీ భూకంపం తైవాన్ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్‌తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. भूकंप के समय मेट्रो के भीतर का हाल#earthquake #Taiwan pic.twitter.com/gd1dGN3BeA — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 3, 2024 Visuals of a Swimming Pool when the 7.4 earthquake hit Taiwan. #earthquake #Taiwan #Tsunami pic.twitter.com/YsBgfO9e2g — Aajiz Gayoor (@AajizGayoor) April 3, 2024 -
తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ
తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్‌లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. -
వీడియోలు: భూకంపంతో తల్లడిల్లిన తైవాన్.. సునామీ హెచ్చరిక జారీ
తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్‌లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల వివిధ ప్రాంతాల్లో 7 మంది మృతి చెందగా.. సుమారు 730 మంది గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఆస్తి నష్టం జగరినట్లు సమాచారం. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గత 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపమని అధికారులు తెలిపారు. 🚨🇹🇼 Building Collapse in Taiwan Due to Earthquakes | Visible Structural Damage Source: @northicewolf https://t.co/cpytWyIx4y pic.twitter.com/Qc0XS4ZXXx — Mario Nawfal (@MarioNawfal) April 3, 2024 మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. JUST IN: 7.5 magnitude earthquake strikes Taiwan, rocking the whole island and even causing several buildings to collapse. The earthquake triggered a tsunami warning of up to 10 feet from Japan. "Tsunami is coming. Please evacuate immediately. Do not stop. Do not go back,"… pic.twitter.com/E1783aoN3k — Collin Rugg (@CollinRugg) April 3, 2024 భూకంపం కారణంగా తైవాన్ రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయి. జపాన్‌లోని కొన్ని దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూప్రకంపనాలు సంభవిస్తున్న సమయంలో ఓ స్విమ్మింగ్ పూల్ నీళ్లు.. సముద్రంలో అలల్లా స్విమింగ్ పూల్‌లో అలజడికి గురయ్యాయి. స్మిమింగ్‌పూల్ ఉన్న భయభ్రాంతులకు గురయ్యాడు. దీనికిసంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. This is not just another funny video on social media. These visuals capture the scary moment a 7.4 earthquake hit Taiwan, even affecting a swimming pool. Prayers for Taiwan & Japan. 🙏 #Taiwan #Japan pic.twitter.com/iuGtutTeMo — Prayag (@theprayagtiwari) April 3, 2024 -
'ఓ నాన్న ప్రేమ'..! దూరమైన కూతుర్ని ఏకంగా ఏఐ సాంకేతికతో..!
ఏఐ సాంకేతికత చాలా విప్లవాత్మకంగా దూసుకుపోతుంది. ఈ ఏఐ సంకేతికతో దూరమైపోయిన మన కుటుంబికులను మన కళ్లముందు ఉండేలా డిజటల్ ప్రపంచంలోకి తీసుకువెళ్తోంది. ఆయా వ్యక్తుల దూరమయ్యరనే బాధను పోగొట్టి శాంతిని చేకూరుస్తుంది. ఇలా కూడా ఉపయోగపడుతుందా? అనేలా కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నాయి. అలాంటి ఆవిష్కరణే ఓ తండ్రి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ 'తండ్రి ప్రేమ' ఎంతటి సాహస కృత్యమైనా చేయిస్తుందనేందుకు నిదర్శనగా నిలిచాడు ఈ 'నాన్న'! తైవాన్ నటుడు, గాయకుడు టినో బావో తనకు దూరమైన 22 ఏళ్ల కూతురు రూపాన్ని, గాత్రాన్ని కుత్రిమ మేధ ఏఐ సాంకేతికతో రూపొందించాడు. తన భార్యకు గర్భసోకాన్ని తీర్చాడు. చెప్పాలంటే ఆమెకు ఒక కొత్త ఆశను కల్పించాడు. తన కూతురు ఎక్కడికో వెళ్లిపోలేదు ఇక్కడే ఉందనే చిన్ని ఆశను రేకెత్తించాడు. ఈ 56 ఏళ్ల నటుడు టినో బావో తన కుమార్తె బావో రాంగ్ డిజిటల్ వెర్షన్ వీడియో క్లిప్‌ని నెట్టింట విడుదల చేశాడు. అందులో ఆమె తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ..ఐ మిస్ యూ డాడ్ అండ్ మామ్ అంటున్న మాటాలు వినిపిస్తాయి. అందులో ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా ఉంటుంది. ఇది చూసి ఆమె తల్లి చాలా భావోద్వేగానికి గురవ్వుతుంది. పైగా అచ్చం మన కూతురు బావో రాంగ్‌లా ఉందేంటీ అని ఉద్వేగంగా తన భర్త బావోని అడుగుతుంది. దానికి నటుడు బావో అది మన కూతురే కాబట్టి అని సమాధానమిస్తాడు. నిజానికి ఈ జంట కూతురు పోయిన దుఃఖంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. ఏదైనా మాట్లాడితే కూతురు లేదనే విషయం గుర్తొచ్చి బాధపడాల్సి వస్తుందని మాట్లాడుకోవడమే మానేశారు ఆ దంపతులు. ఏఐ సాంకేతికతో రూపొందించిన ఈ డిజటల్ కుమార్తె వాళ్లిద్దర్నీ మళ్లీ తిరిగి మాట్లాడుకునేలా చేసింది. ఈ మేరకు బావో మాట్లాడుతూ.."నా కూతురు 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త వ్యాధితో మరణించింది. నా కూతురు చివరి రోజుల్లో ట్రాచల్ ఇంట్యూబేషన్ కారణంగా గొంతును కూడా కోల్పోయింది. ఆమె చనిపోయేంత వరకు మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈ ఘటనే తనను కూతురుని కళ్లముందు ఉండేలా చేయడం ఎల? అనే ఆలోచనకు తెరతీసింది. అదే అతడిని ఈ కృత్రిమ మేధస్సు ఏఐని అధ్యయనం చేసేందుకు దారితీసింది. తన ఏకైక బిడ్డను డిజిటల్‌గా పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఇంతటి ఆవేదన మధ్య ఏఐలో పీహెచ్డీ చేశాను. ఆ తర్వాత నా కుమార్తెను డిజటల్‌గా రూపొందించేందుకు సూపర్ బ్రెయిన్ అనే మెయిన్‌ల్యాండ్ కంపెనీ బృందంలో పనిచేశాను. అయితే కుమార్తె చిత్రాన్ని డిజిటల్‌గా రూపొందించడంలో ఇబ్బంది లేదు ఎందుకుంటే ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. కేవలం ఆమె వాయిస్‌ని రూపొందించేందుకే శ్రమ పడ్డాను. ఎందుకంటే..? ఆమె ఆ వ్యాధి కారణంగా గొంతును కోల్పోయింది. దీంతో నా కూతురు ఆఖరి ఘడియల వరకు మాతో ఏం మాట్లాడలేకపోయింది. అందువల్ల నా కుమార్తె తన తల్లితో వీడియో కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మూడు ఆంగ్ల వాక్యాలను మాత్రమే ఉపయోగించి వాయిస్‌ని క్రియేట్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ డిజటల్ కుమార్తె వీడియో క్లిప్. ఇది నన్ను నా భార్యను మళ్లీ దగ్గరకు చేసింది. ఈ ఐఏ సాంకేతికతో మా కూతుర్ని మళ్లీ పొందేలా చేసింది. కొంత ఉపశమనం కలిగించింది." అని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు బావో. అయితే బావోకి కూతురంటే ఎంత ప్రేమంటే..ఆమెకు బావో జుట్టుని ముట్టుకోవడం ఇష్టం అందుకని ఆమె తాకిన జుట్టుని అలానే ఉంచాలన్న ఉద్దేశ్యంతో కత్తిరించుకోవడం మానేశాడు. అలాగే ఆమె మరణించిన తర్వాత ఆమె శరీరంలోని ఎముకను కూతురు గుర్తుగా మెడలో గొలుసుగా వేసుకున్నాడు. ప్రేమ ఎంతటి ఘనకార్యాన్నైనా చేయిస్తుందనడానికి ఈ నాన్న ప్రేమే ఉదహారణ కదూ!. (చదవండి: నో స్మోకింగ్ డే ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహార పదార్థాలివే!) -
విమానంలో మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్
విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పైలెట్ డెలివరీ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న వీట్‌జెట్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఎంతో ధైర్యంగా. సమయస్పూర్తితో వ్యవహరించి గర్భిణీకి పురుడు పోసినపైలెట్ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాలు.. వీట్ జెట్‌కు చెందిన విమానం తైపీ(తైవాన్) నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వెళ్తోంది. విమానంలో ఓ గర్భిణి కూడా ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బాత్రూమ్లో ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించిన సిబ్బంది విషయాన్ని పైలట్ జకరిన్ సరార్న్రక్స్కుల్కు తెలియజేశారు. విమానం ల్యాండింగ్‌కు కూడా సమయంలో ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కెప్టెన్ జకరిన్ తన బాధ్యతలను కో పైలట్‌కు అప్పగించి కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చాడు. విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అడిగాడు. కానీ సమయానికి వైద్యులు కూడా లేకపోవడంతో వేరే మార్గం లేక తానే రంగంలోకి దిగాడు. మొబైల్ ద్వారా వైద్యులను సంప్రదించి.. వారి సూచనలతో మహిళకు పురుడు పోశాడు. ఇదంతా గమనించిన విమానంలోని ప్రయాణికులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. క్లిష్ట సమయంలో ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన పైలెట్‌ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. అనంతరం విమానం ల్యాండ్ అయ్యాక తల్లి, శిశువును ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డకు ముద్దుగా స్కై బేబబీ’ అని పేరు పెట్టారు. మరోవైపు 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపాడు. చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే -
Taipi: చైనాకు తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్
తైపీ: తైవాన్ తమ దేశంలో భాగమని అది ప్రత్యేకమైన దేశం కాదని చైనా మరోసారి స్పష్టం చేసింది. తాజాగా తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రి జోసఫ్ వూను భారత్‌కు చెందిన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన తైవాన్ స్వతంత్ర దేశం అని మాట్లాడారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేయడంపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అభ్యంతరం తెలిపింది. భారత్ ‘వన్ చైనా’ అనే దౌత్య పాలసీని పాటిస్తోంది. తైవాన్ చైనాలో అంతర్భాగం అయినప్పుడు భారత మీడియా ఇలాంటి ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం సరికాదని చైనా ఎంబసీ పేర్కొంది. అయితే చైనా ఎంబసీ అభ్యంతరంపై తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, తైవాన్లు రెండు స్వతంత్ర దేశాలని, తాము ఎవరి చేతిలో తోలు బొమ్మలం కాదని ఘాటుగా సమాధానమిచ్చింది. రెండు దేశాల్లో నియంతృత్వంలో పనిచేసే మీడియా కాకుండా స్వేచ్ఛగా పనిచేసే మీడియా ఉందని ఘాటుగా సమాధానమిచ్చింది. ఇదీ చదవండి.. రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ హవా -
చలో తైవాన్.. భారతీయులకు లక్షల్లో ఉద్యోగాలు..!
-
భారతీయుల కోసం తైవాన్.. లక్షల్లో ఉద్యోగాలు!
భారత్, తైవాన్ మధ్య బంధం బలపడుతోంది. ఇందులో భాగంగానే తైవాన్ దేశంలో ఇండియన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఇరు దేశాలు ఇటీవలే ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిని తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. చైనా దురాక్రమణలను తిప్పికొట్టేందుకు తైవాన్.. భారత్, అమెరికా దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోంది. ముఖ్యంగా ఇండియాతో తైవాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తూ.. ఇరు దేశాలకు ఉపయోగకరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తైవాన్ దేశంలో జననాల రేటు తక్కువగా ఉండటంతో 2025 నాటికి 20 శాతం వృద్ధ జనాభా ఉంటారని, కార్మికుల కొరత గణనీయంగా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే తైవాన్ ప్రస్తుతం వలస కార్మికుల మీద ఆధారపడుతోంది. ఇప్పటికే థాయ్‌లాండ్, ఇండోనేసియా, ఫిలిప్ఫిన్స్, వియత్నాం దేశాలకు చెందిన సుమారు 7 లక్షలమంది తైవాన్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనున్నట్లు గతంలోనే వెల్లడించింది. అనుకున్న విధంగానే ఇప్పుడు రెండు దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. అంటే భారతీయులకు రానున్న రోజుల్లో తైవాన్ భారీగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి #Taiwan🇹🇼-#India🇮🇳 relations reach a new high! The MOU on the Facilitation of Employment of Indian Workers, signed by @TWIndia2 Rep. Ger & @ita_taipei Rep. Yadav, promises mutual benefits for our people, igniting a powerful momentum for even deeper & more fruitful cooperation! pic.twitter.com/H9kNZvaI97 — 外交部 Ministry of Foreign Affairs, ROC (Taiwan) 🇹🇼 (@MOFA_Taiwan) February 16, 2024 -
డ్రాగన్‌కు పావురంతో పనేంటి?
కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక చైనీస్ అక్షరాలున్న ఒక పావురాన్ని గత మే నెలలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘అనుమానాస్పదమైన సమాచారం’ లభించకపోవడంతో విడుదల చేశారు. చివరకు అది తైవాన్ నుంచి తప్పిపోయి వచ్చిన రేసు పావురం అని తేలింది. ఇవి రోజుకు వెయ్యి కిలోమీటర్లు ఎగరగలవు. భారత అధికారులు ఒక పావురాన్ని బంధించటం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2020లో కూడా ఇలా జరిగింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కాలంలో పావురాలను నిఘా కోసం ఉపయోగించారు. కానీ గూఢచర్యం కోసం ఇప్పుడు అనేక అత్యాధునిక సాధనాలు ఉన్నప్పుడు, చైనా ఒక రేసు పావురాన్ని వదిలిపెడుతుందా? తరచూ మన దేశంలో చిత్ర విచిత్రాలు, అద్భుతమైన విషయాలు సంభవిస్తూ ఉంటాయని మనందరికీ తెలుసు. అసలలా ఉండటమే ఇండియాను ఉత్సుకతను రేకెత్తించేలా, ఉత్తేజం కలిగించేలా, అనేకసార్లు ఊహాతీత మైనదిగా చేస్తుంటుంది. అయితే ‘ద వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో ఇటీవల వచ్చిన ఒక కథనం ఇవేవీ కానటువంటి పూర్తి భిన్నమైన కొత్త కోణాన్ని ఇండియాకు జోడించింది. నిజం చెప్పాలంటే, ఆ కొత్త కోణాన్ని నేను ఏ విధంగానైనా వివరించగలనేమో నాకు తెలియటం లేదు. మీకే వదిలేస్తాను. ‘ద పోస్ట్’లో వచ్చిన కథనం ఇలా మొదలౌతుంది: ‘‘చైనా తరఫున గూఢచర్యానికి వచ్చి వాలిందన్న అనుమానంపై ఎనిమిది నెలల పాటు బందీగా ఉంచిన ఒక పావురాన్ని చివరికి అది గూఢచారి ఏజెంట్ కాదనీ, దిక్కుతోచక దారి తప్పి వచ్చిన తైవాన్ రేసింగ్ పక్షి అనీ నిర్ధారించుకున్న భారత అధికారులు దానికి విముక్తి కల్పించారు.’’ కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక ఈకల చాటున చైనీస్ అక్షరాలు కలిగి ఉన్న ఈ పావురాన్ని గత మే నెలలో ముంబైలోని ఒక ఓడరేవు సమీపంలో కనిపెట్టిన పోలీసులు దానిని అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘‘లోతైన మరియు సరైన దర్యాప్తుతో పాటుగా, అనేక విచా రణలను’’ జరిపిన అనంతరం ‘‘అనుమానాస్పదమైన సమాచారం గానీ, తగిన సాక్ష్యాధారాలు గానీ’’ తమకు లభించలేదని ముంబై పోలీసులు చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది. తదనుగుణంగా – ఇప్పటికి దాదాపు మూడు వారాల క్రితం – విడుదలైన ఆ పక్షి మంచి ఆరోగ్యంతో ఉంది. ‘ద పోస్ట్’ పత్రిక సంప్రదించిన నిపుణులు చెప్పటం ఏమిటంటే– బహుశా ఆ పావురం పరుగు పందేల్లోని పక్షి అయుండి, ‘‘తైవాన్ తీరానికి సమీపంలో జరిగిన రేసింగ్ పోటీల నుంచి దారి తప్పి, అక్కడి నుంచి పడవలో దాదాపు 3,000 మైళ్లు ప్రయాణించి’’ ఉండొచ్చని! అయితే రేసు పావురాల వ్యాపారం చేస్తుండే తైవాన్ కంపెనీ ‘నైస్ పీజన్’ యజమాని యాంగ్ త్సంగ్–టే ‘‘ఒక రేసు పావురం ఒక రోజులో 1,000 కిలోమీటర్ల వరకు ఎగరగలదనీ, అయితే అది ఇండియా వరకు ఎగురుతూ వెళ్లగలిగిందీ అంటే మధ్యలో కొన్ని మజిలీలు చేసి ఉంటుందనీ’’ అన్నారు. ‘‘ఏమైనా, కొన్ని పావురాలు తైవాన్ తీర ప్రాంతం నుంచి యూఎస్, కెనడా వరకు కూడా వచ్చిన ఉదంతాలు ఉన్నాయి’’ అని ఆ పత్రిక రాసింది. తైవాన్, ఉత్తర అమెరికాల మధ్య విస్తారమైన మహా సముద్ర జలం తప్ప వేరే ఏమీ లేనందున, పక్షులు అంతదూరం ఎలా వెళ్లగలిగాయో నాకైతే అంతు పట్టటం లేదు. ఒకవేళ పావురాలకు ఈత కొట్టటం గానీ తెలిసి ఉంటుందా? భారత అధికారులు ఒక పావురాన్ని పట్టి బంధించటం ఇదే మొదటిసారి కాదు. ‘ద పోస్ట్’ చెబుతున్న దానిని బట్టి 2015లో,మళ్లీ 2020లో ఇలా జరిగింది. ఆ సందర్భంలోనే... ‘‘భారీ సైనిక మోహరింపులతో ఉండే సరిహద్దుల మీదుగా ఎగిరొచ్చిన ఒక పాకి స్తానీ మత్స్యకారుడి పావురాన్ని పోలీసులు స్వల్పకాలం పాటు అదుపులోకి తీసుకున్నారు.’’ ఇప్పుడు మీరు వృత్తి పట్ల ఎంతో నిబద్ధతను కలిగి ఉన్న ముంబై పోలీసులను చూసి పరిహసించే ముందు, చరిత్రలో పక్షుల గూఢ చర్యం నిజంగానే ఉండేదని ఆ పత్రిక రాసిన విషయాన్ని గమనించాలి. ‘‘మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ... పావురాల ఛాతీకి కెమెరాలను కట్టి శత్రు దేశాల గుట్టుమట్లను కనిపెట్టేందుకు వాటిని ప్రయోగించేది. పక్షి కంటే కూడా ఆ పక్షికి కట్టిన కెమెరా పెద్దదిగా ఉండేదని నేను రూఢిగా చెప్పగలను. ‘‘రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు (జర్మనీని వ్యతిరేకించే బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మొదలైన దేశాలు) తమ మధ్య రహస్య సందేశాల బట్వాడాకు పక్షులను ఉపయోగించాయి.’’ దీని వెనుక ఉండే కారణానికి పెద్ద వివరణేమీ అక్కర్లేదు. ‘‘పావురాలు సాధారణ పక్షి జాతులు. కెమెరా కట్టి ఉన్న పావురాలైనా సరే, గూఢచారి పక్షుల్లా ప్రత్యేకంగా కాక, వేలాది ఇతర పక్షుల కార్యకలాపాల మధ్య దాగిపోయేవి’’ అని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చెప్పడమే కాకుండా, అలాంటి ఒక రహస్య కెమెరాను సైతం వృద్ధి చేసింది. స్వయంగా సీఐఏనే ఈ విషయాన్ని వెల్లడించింది కనుక అది నిజమే అయి వుంటుంది. అయితే ‘ద పోస్ట్’ సంప్రదించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై ఏకాభిప్రాయాన్నేమీ కలిగి లేరని తెలుస్తోంది. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ‘ద గ్లోబల్ పీజన్’ పుస్తక రచయిత కాలిన్ జరోల్మాక్కు ఇందులో భారతదేశ అసంబద్ధ పరిస్థితే కనిపించింది. ఆ స్థితిని సరిగ్గా చెప్పాలంటే, ‘చాలా హాస్యాస్పదం’ అన్నారు. ‘‘గూఢచర్యం కోసం చైనా అనేక అత్యాధునిక సాధనాలను కలిగి ఉందనీ, వాటిని విజయవంతంగా భారత్‌పై ప్రయోగిస్తుంది తప్పితే, రేసు పావురాలనైతే వదిలిపెట్టదు కదా’’ అని కాలిన్ జరోల్మాక్ వ్యాఖ్యానించారు. కావొచ్చు! నేను కిటికీ దగ్గర కూర్చొని, పావురాల ‘గూ.. గూ’ లను వింటు న్నప్పుడు, అవి నాపై నిఘా పెట్టేందుకు రాలేదు కదా అని అనుకోకుండా అయితే ఉండలేకపోయాను. నేను ఏం చేస్తున్నానో మన ప్రియమైన ప్రభుత్వం ఈ విధంగానే తెలుసుకుంటుందా? పావురాలు తరచూ కిటికీ అంచులపైన కనిపించడానికి కారణం అవి తమ రెట్టలను అక్కడ వదిలి వేయడానికే అయుంటుందా అన్నది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే వాటి చిన్నికళ్ల లోతుచూపులను బట్టి, అక్కడ అవి వదిలిన దాని కన్నా ఎక్కువగా తీసుకుని ఉంటాయా అని యోచిస్తాను. కాబట్టి, ఈసారి ఒక పక్షి మీ తలపైన ఎగురుతూ ఉండటాన్ని, లేదా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని కిందికి చూస్తూ ఉండటాన్ని మీరు గమనించినప్పుడు అది ఏదైనా ప్రయోజనం కోసం అక్కడికి వచ్చి వాలిందా అని ఆలోచించండి. బహుశా అంతదూరంలోని బీజింగ్ నుండి కాకపోయినా, దగ్గర్లోని ‘సౌత్ బ్లాక్’ (ప్రధానమంత్రి కార్యా లయం ఉండే చోటు) నుండి అది వచ్చి ఉండొచ్చు. అలాంటి పక్షులకు మేత మాత్రం వేయకండి. మనం వాటికి అందించే ఆహారపు తునకలు అవి తమ యజమానుల నుండి పొందే ప్రతిఫలాల ముందు పెద్ద విషయమేం కాదు. చివరిగా, ఈ వ్యాసం పక్షులకు సంబంధించినదని మీరనుకుంటే కనుక మీరలా అనుకోవటం సరైనదే కావచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చైనా మెచ్చని తైవాన్ తీర్పు
కొన్ని ఎన్నికలు, వాటి ఫలితాల ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో అమితంగా ఉంటుంది. జనవరి 13న తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలాంటివే. ఈ ఎన్నికల్లో అక్కడి ‘ప్రజాస్వామ్య అభ్యుదయ పార్టీ’ (డీపీపీ) వరుసగా మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించడం అనేక విధాల ప్రత్యేకమైనది. ద్వీపదేశమైన తైవాన్‌పై ఆధిపత్యం కోసం చైనా జోరుగా ప్రయత్నిస్తున్న వేళ, ఇండో– పసిఫిక్ ప్రాంతంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నవేళ వచ్చిన ఎన్నికల ఫలితాలు ఇక్కడి భౌగోళిక రాజకీయాల్లో కీలకమైనవి. 1.4 కోట్ల తైవానీయులు స్వయంప్రతిపత్తి గల ప్రజాస్వామ్యంగానే దేశం కొనసాగా లనీ, చైనాతో బంధంలో మార్పు అవసరం లేదనీ భావిస్తున్నట్టు ఫలితాలను వ్యాఖ్యానించవచ్చు. ఉపాధ్యక్షుడైన విలియమ్ లై చింగ్–తె తాజా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డీపీపీ తరఫున పోటీపడి, చైనాతో సర్దుబాటు కోరుతున్న ప్రధాన ప్రతిపక్షమైన కెఎంటి (కుయో మిన్ తాంగ్) అభ్యర్థిపై గెలిచారు. అయితే, మునుపటి 2020 ఎన్నికల్లో అప్పటి డీపీపీ అభ్యర్థి 57 శాతం ఓట్లు సాధిస్తే, ఈసారి అది 40 శాతానికి తగ్గింది. డీపీపీ పార్లమెంటరీ ఆధిక్యాన్ని కోల్పోయి, అతిపెద్ద పార్టీ కిరీటాన్ని ప్రతిపక్ష కెఎంటి పాల్జేయడం గమనార్హం. కొత్త విధానసభలో డీపీపీ 51, కెఎంటి 52 స్థానాలు గెలిచాయి. ఈ రెండు పార్టీల ద్విధాధిపత్యానికి గండికొడుతూ కొత్త రాజకీయ శక్తిగా అవతరించిన ‘తైవాన్ పీపుల్స్ పార్టీ’ (టీపీపీ) 20 శాతానికి పైగా ఓట్లతో, 8 స్థానాలు గెలిచింది. దేశీయ విధానంలో, చైనాతో వ్యవహారంలో అధికార పార్టీకి ఇది ఇబ్బందే. సభలో పట్టుకై ఇతర పార్టీలతో దోస్తీ కట్టాల్సి ఉంది. అలాగే, చైనా దూకుడు చూపుతున్నందున సైన్యాధిపతి అయిన తైవాన్ అధ్యక్షుడు ఇటు చైనా, అటు అమెరికాలతో నేర్పుగా వ్యవహరించాలి. నిజానికి స్వయంపాలక ప్రజాస్వామ్య దేశమైన తైవాన్ ఎన్నడూ కమ్యూనిస్టు చైనా నియంత్రణలో లేదు. అయితే, తైవాన్ ప్రజాభీష్టంతో సంబంధం లేకుండా, ఆ దేశంపై తమదే ఆధిపత్య మంటూ డ్రాగన్ అహంకారం చూపుతోంది. ఎన్నికలను వ్యూహాత్మకంగా చక్కటి అవకాశంగా భావించిన బీజింగ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు శతవిధాల ప్రయత్నించింది. ఆర్థిక నిర్బంధాల మొదలు అసత్య ప్రచారారాలు, భద్రతా సవాళ్ళ దాకా అనేక అస్త్రాలు ప్రయోగించింది. తైవాన్ను కలిపేసుకోవాలని చైనా అసహనంతో తొందరపడుతుంటే, ‘ఒకే దేశం – రెండు వ్యవస్థల’ విధానం హాంగ్‌కాంగ్‌లో విఫలమవడం చూసిన తైవాన్ అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తోంది. చరిత్ర చూస్తే 1895 నుంచి 1945 దాకా 50 ఏళ్ళు జపాన్ ఏలుబడిలో తైవాన్ ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందింది. తీరా 1945 ఆగస్ట్‌లో జపాన్ లొంగిపోవడంతో, తైవాన్ అప్పటి చైనా ప్రధాన భూభాగాన్ని ఏలుతున్న కెఎంటి పార్టీ హయాంలోకి వచ్చింది. అప్పట్లో తైవాన్‌లోని జపనీస్ ఆస్తులను కెఎంటి సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో, స్థానిక తైవానీయుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తైవాన్ జాతీయవాదుల ఉద్యమంగా మారిన ఆ నిరసనను 1947 ఫిబ్రవరి 28న కెఎంటి అణిచివేసింది. కెఎంటి సైన్యం 28 వేల మందిని పొట్టనబెట్టుకుంది. చియాంగ్ కై–షెక్ సారథ్యంలోని కెఎంటి జాతీయవాదులు 1949లో అంతర్యుద్ధంలో ఓటమి పాలై, తైవాన్‌కు తరలిపోయారు. అలా దాదాపు 20 లక్షల మంది కెఎంటితో కలసి చైనా నుంచి తైవాన్‌కు వలస వచ్చారు. ఇవాళ్టికీ 2.4 కోట్ల తైవాన్ జనాభాలో నాలుగోవంతు మంది ఈ ‘మెయిన్‌ల్యాండర్లే’. అంటే, చైనా భూభాగం నుంచి వలసదారులు, వారి సంతతే. కెఎంటి నియంతృత్వ పాలనలోనూ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టి పెట్టిన తైవాన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది. 1975 వరకు అధ్యక్ష పాలనలోనే ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’గా నడిచింది. తరువాతి పరిణామాల్లో రాజకీయ సరళీకరణ ఆరంభమైంది. 1991 నాటికి ప్రజాస్వామ్య ప్రక్రియ ఊపందుకుంది. ఉపాధ్యక్షుడి నుంచి అధ్యక్షుడిగా ఎదిన లీ తెంగ్–హుయి దేశాన్ని పూర్తి ప్రజాస్వామ్య దిశగా నడిపించడానికి ఉద్యుక్తుడయ్యేసరికి డ్రాగన్ తోక తొక్కినట్టయింది. 1996లో తొలిసారి స్వేచ్ఛాయుత అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా తైవాన్ జల సంధిలో చైనా వందలాది క్షిపణులు ప్రయోగించింది. తైవాన్‌కు మద్దతుగా అమెరికా యుద్ధనౌకలను పంపాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో లీ అపూర్వ విజయం అందుకున్నారు. కాలక్రమంలో స్థానిక తైవానీ యుల ప్రయోజనాలకు కట్టుబడ్డ డీపీపీ వేగంగా జనాదరణ పొందింది. లీ పదవీ విరమణ తర్వాత 2000లో డీపీపీ అభ్యర్థే అధ్యక్షుడిగా గెలిచారు. గమనిస్తే, తైవాన్‌లో ప్రజాస్వామ్యం ఏర్పాటు నుంచి ఇప్పటి దాకా 2008, 2012లోనే కెఎంటి ‘మెయిన్‌ల్యాండర్’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కెఎంటి అభ్యర్థి సహా అధ్యక్ష పదవికి పోటీపడ్డ ముగ్గురూ మెయిన్ ల్యాండర్లు కాకపోవడం గమనార్హం. ఒకరకంగా ఇది అధికార డీపీపీ తైవానీ అస్తిత్వ రాజకీయాలకు రాజముద్ర. ఆసియా భౌగోళిక రాజకీయ చిత్రపటంలో తైవాన్ కీలకం. ప్రపంచ సాంకేతిక నాయకత్వ భవితవ్యంలోనూ ఆ దేశం అవిస్మరణీయం. ప్రపంచ సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో 60 శాతం పైగా, అత్యాధునిక చిప్‌లలో 90 శాతం పైగా అక్కడ చేసేవే. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్ల నుంచి కార్లు, ఉపగ్రహాల దాకా ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నిటికీ అవే ప్రాణాధారం. స్వయంప్రతిపత్తి గల తైవాన్ మనకు సహజ మిత్రదేశం. అలా తాజా ఎన్నికల ఫలితాలు సానుకూల పరిణామమే. గత 8 ఏళ్ళ లానే వచ్చే నాలుగేళ్ళూ ఢిల్లీతో బంధానికే తాయ్‌పే ఆసక్తి చూపుతుంది. దౌత్య సంబంధాలు లేకున్నా ఇప్పటికే 250కి పైగా తైవానీ కంపెనీలు భారత్‌లో 400 కోట్ల డాలర్ల మేర పెట్టు బడులు పెట్టాయి. అందుకే, తైవాన్ జలసంధిలో సుస్థిరత, ప్రశాంతత కొనసాగితే భారత్‌కు అది శుభవార్త. తరచూ సైనిక విన్యాసాలతో అస్థిరత రేపుతున్న చైనా సైతం తైవాన్ ప్రజాభీష్టాన్ని గౌరవిస్తే మేలు. -
తైవాన్ అధ్యక్ష పీఠంపై జాతీయవాది
తైపీ: చైనాతో విభేదాలు తారస్థాయికి చేరిన వేళ స్వయం పాలిత తైవాన్‌లో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. కరడుగట్టిన జాతీయవాదిగా పేరొందిన డీపీపీ అభ్యర్థి లై చింగ్ టె నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతంఉపాధ్యక్షుడైన లై 40 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థులైన చైనా అనుకూల ప్రధాన విపక్షమైన కొమింటాంగ్ (కేఎంటీ) పార్టీ అభ్యర్థి హో యు ఈ 33 శాతం ఓట్లతో ఓటమి చవిచూశారు. మరో విపక్షం తైవాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి కో వెన్ జెకు 26 శాతం ఓట్లు దక్కాయి. ఎనిమిదేళ్లుగా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న తై ఇంగ్ వెన్ చైనా పట్ల అనుసరించిన దూకుడైన విధానాలను లై మరింత ముందుకు తీసుకు వెళ్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్ ద్వీపం చుట్టూ ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతోపాటే తైవాన్‌కు దన్నుగా నిలుస్తున్న అమెరికాతోనూ చైనా విభేదాలు తీవ్రతరమయ్యేలా కనిపిస్తున్నాయి. తైవాన్‌కు ఆయుధాల సరఫరాతో పాటు అన్నివిధాలా అమెరికా సహకరిస్తుండటం తెలిసిందే. పార్లమెంటులో చుక్కెదురు తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓ పార్టీ వరుసగా మూడుసార్లు నెగ్గడం ఇదే తొలిసారి. కానీ అధ్యక్ష పదవితో పాటే తైవాన్ పార్లమెంటుకు కూడా జరిగిన ఎన్నికల్లో మాత్రం అధికార డీపీపీ ఓటమి చవిచూసింది! 113 స్థానాలకు గాను 51 సీట్లతో సరిపెట్టుకుంది. విపక్ష కేఎంటీ 52, టీపీపీ 8 సీట్లలో నెగ్గాయి. పార్లమెంటులో మెజారిటీ సాధనకు ఆ రెండు పారీ్టలూ చేతులు కలిపే అవకాశాలున్నాయి. అధ్యక్ష పీఠంపై చైనా వ్యతిరేక డీపీపీ కొనసాగనుండగా పార్లమెంటుపై మాత్రం చైనా అనుకూల కేఎంటీ కూటమికి ఆధిపత్యం దక్కేలా ఉండటం ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర పిపాసి 64 ఏళ్ల లై చింగ్ టె స్వతంత్ర పిపాసిగా, ప్రస్తుత అధ్యక్షురాలు వెన్ను మించిన జాతీయవాదిగా పేరొందారు. తైవాన్ స్వతంత్ర దేశమని, ఈ విషయంలో చైనాతో ఎలాంటి చర్చలకూ ఆస్కారం లేదని ఆయన చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. చైనా కూడా లైని విపరీతంగా ద్వేషిస్తుంది. ఆయనను ఎన్నుకుంటే తీవ్ర చర్యలు తప్పవని పోలింగ్ వేళ తైవాన్ ప్రజలను నేరుగానే హెచ్చరించింది. తైవాన్‌తో యుద్ధమా, శాంతా అన్నది వారి తీర్పును బట్టే ఉంటుందని పేర్కొంది. కానీ ప్రజలు తమ తీర్పు ద్వారా ఆ హెచ్చరికలను బేఖాతరు చేశారు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. డ్రాగన్ దేశం గత 40 ఏళ్లలో తొలిసారిగా ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజల కొనుగోలు శక్తి శరవేగంగా క్షీణిస్తోంది. దాంతో జిన్‌పింగ్ ప్రతిష్ట నానాటికీ మసకబారుతోంది. ఈ నేపథ్యంలో చైనీయుల మనసు గెలుచుకునేందుకు తైవాన్‌పై ఆయన దూకుడు పెంచే ఆస్కారం లేకపోలేదని భావిస్తున్నారు. బలప్రయోగం ద్వారా దాన్ని విలీనం చేసుకునే ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని పాశ్చాత్య రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు తైవాన్లోనూ ఆర్థికాభివృద్ధి బాగా నెమ్మదించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరుగుతున్నాయి. ఇంటా బయటా ఎదురవుతున్న ఈ పెను సమస్యలను కొత్త అధ్యక్షుడు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. -
తైవాన్‌పై చైనా యుద్ధం ప్రకటిస్తే .. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
తైవాన్ దేశం తమ భూభాగమేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. తైవాన్ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్ గగనతంపై మీదకు యుద్ధ విమానాలు, నౌకలను పంపి డ్రాగన్ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే తైవాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మద్దతుగా ఉండటంతో చైనా అడుగులకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఒకవేళ చైనా తైవాన్ మీద దాడి చేస్తే మాత్రం భారీ యుద్ధానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదు. అంతకంతకూ పెరుగుతున్న చైనా ఆర్థిక, సైనిక శక్తి.. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం చేస్తున్న తైవాన్ పోరాటం, అమెరికా, బీజింగ్ మధ్య విభేదాలు రోజురోజుకీ ప్రమాదకరంగా మారనున్నాయి. తాజాగా చైనా ఇప్పటికిప్పుడు తైవాన్‌పై యుద్ధం ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుందో బ్లూంబెర్గ్ ఎకనామిక్స్ వెల్లడించింది. తైవాన్‌పై చైనా దండయాత్ర చేస్తేలక్షల కోట్ల నష్టం తప్పదని వెల్లడించింది. సుమారు రూ.830 లక్షల కోట్ల(పది ట్రిలియన్ డాలర్ల) మేర నష్టం వాటిల్లనున్నట్లు అంచనా వేసింది. ఇది ప్రపంచ జీడీపీలో 10 శాతం అని తెలిపింది. తైవాన్ను చైనా ఆక్రమించేందుకు సిద్ధమైతే... కొవిడ్, సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను మించిన సంక్షోభం తలెత్తుతుందని పేర్కొంది. తైవాన్ను తమ దేశంలో విలీనం చేసి తీరుతామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయ తెలిసిందే. తైవాన్ తన మాతృభూమితో కలవక తప్పదని.. చైనాతో విలీనం కావడం అనివార్యమని చెప్పారు. కాగా జనవరి 13న తైవాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు, తైవాన్ను చైనా ఆక్రమణ వార్తలు చర్చనీయాంశంగా మారియి చదవండి: సికాడాల దండయాత్ర.. వణుకుతున్న అమెరికా! -
ఫ్రీగా వచ్చిందని డిటర్జంట్ తినడంతో..
తైవాన్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాలు పోయే పరిస్థితిని కల్పిస్తుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది. తైవాన్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన లాండ్రీ డిటర్జంట్‌ను ముగ్గురు వ్యక్తులు పొరపాటున తిన్నారు. ఆ తర్వాత వారు అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరారు. సకాలంలో చికిత్స అందడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తైవాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లాండ్రీ డిటర్జెంట్ పంపిణీ చేశారు. దీనిని మిఠాయిగా బావించి, తిన్నవారు అనారోగ్యం పాలయ్యారు. సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం బాధితుల్లో ఒకరు తాను డిటర్జంట్‌ను పొరపాటున మిఠాయిగా భావించానని అన్నారు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన డిటర్జెంట్ ప్యాక్‌పై బట్టలు ఉతకడానికి అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఒక్కో ప్యాకెట్‌పై దీనితో ఎనిమిది కిలోల వరకు దుస్తులను ఉతకవచ్చని రాసి ఉంది. ప్రచార సమయంలో జాతీయవాద ప్రచార కార్యాలయం సుమారు 4,60,000 ప్యాకెట్లను పంపిణీ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘటన తర్వాత సెంట్రల్ తైవాన్‌లోని ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రతినిధి క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి మెటీరియల్‌ను ప్రజలకు పంపిణీ చేయబోమని కార్యాలయ చీఫ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఇది మిఠాయి కాదని, లాండ్రీ డిటర్జెంట్ అని కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కాగా ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరు వృద్ధులున్నారని వార్తా సంస్థ తెలిపింది. చికిత్స అనంతరం వారిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
2024: ఎన్నికల ఏడాది
2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి! ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. అలా 2024 రికార్డులకెక్కబోతోంది. పైగా అత్యధిక జనాభా ఉన్న టాప్ 10 దేశాల్లో ఏకంగా ఏడు ఈసారి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ లెక్కన ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ ఏడు ఓటు హక్కును వినియోగించుకోనుండటం ఇంకో విశేషం! ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ మొదలుకుని అగ్ర రాజ్యం అమెరికా దాకా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమైన దేశాలను ఓసారి చూద్దాం... బంగ్లాదేశ్ 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తొలి దేశం. జనవరి 7న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విపక్షాలన్నింటినీ నిరీ్వర్యం చేసి ఏకపక్ష ఎన్నికల ప్రహసనానికి తెర తీశారంటూ ప్రధాని షేక్ హసీనా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అణచివేతను తట్టుకోలేక పలువురు విపక్ష నేతలు ప్రవాసంలో గడుపుతున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్టతో పాటు విపక్షాలన్నీ బాయ్‌కాట్ చేసిన ఈ ఎన్నికల్లో హసీనా మరోసారి నెగ్గడం, వరుసగా ఐదోసారి అధికారంలోకి రావడం లాంఛనమే కానుంది. ప్రజాస్వామ్యానికి చెల్లుచీటీ పాడి చైనా మాదిరిగా దేశంలో హసీనా ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పేలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తైవాన్ చైనా పడగ నీడన తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న తైవాన్‌లో జనవరి 13న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార డీపీపీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు బదులుగా లై చింగ్ టే బరిలో ఉన్నారు. ఆయనకు వెన్కు మించిన స్వాతంత్య్ర ప్రియునిగా పేరుంది. ఉదారవాద క్యోమింటాంగ్ నేత హో యూ యీ, తైవాన్ పీపుల్స్ పార్టీ తరఫున కో వెన్ జే ఆయనను సవాలు చేస్తున్నారు. డీపీపీ 2016 నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అది అధికారంలోకి వస్తే యుద్ధానికి దిగైనా తైవాన్ను విలీనం చేసుకుంటానంటూ చైనా ఇప్పటికే బెదిరిస్తోంది. దాంతో ఈ ఎన్నికలు తైవాన్‌కు ఒకరకంగా జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. పాకిస్తాన్ 24 కోట్ల జనాభా ఉన్న పాక్ అనిశి్చతికి మారుపేరు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగాలి. కానీ అవి వాయిదా పడే సూచనలే ఎక్కువగా కని్పస్తున్నాయి. సైన్యాన్ని ఎదిరించి ప్రధాని పదవి కోల్పోయి అవినీతి కేసుల్లో జైలు పాలైన పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ పోటీకి దారులు మూసుకుపోయినట్టు కని్పస్తున్నాయి. ఆయన నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం అనుమానంగా మారింది. సైన్యం దన్నుతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) విజయం, ప్రవాసం నుంచి తిరిగొచి్చన ఆ పార్టీ నేత నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని కావడం లాంఛనమేనని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇండొనేసియా 27 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఇండొనేసియాలో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షునితో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ పార్లమెంటు సభ్యులకు ఫిబ్రవరి 14న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు టర్ములు పూర్తి చేసుకున్న అధ్యక్షుడు జొకో విడొడొ స్థానంలో రక్షణ మంత్రి 72 ఏళ్ల ప్రాబొవో సుబియంటో బరిలో ఉన్నారు. గంజర్ ప్రనోవో, అనీస్ బస్వేదన్ గట్టి పోటీ ఇస్తున్నారు. భారత్ 140 కోట్లకు పైగా జనాభా, 90 కోట్ల పై చిలుకు ఓటర్లతో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అలరారుతున్న భారత్ ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇన్ని కోట్ల మంది ఓటర్లు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించడం పరిపాటిగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ఖాయమని అత్యధిక రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని 2014లో ఆయన ఒంటి చేత్తో అధికారంలోకి తేవడం తెలిసిందే. 2019లోనూ మోదీ మేజిక్ రిపీటైంది. ఈసారి దానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ సారథ్యంలో 28 విపక్ష పారీ్టలతో కూడిన విపక్ష ఇండియా కూటమి ప్రయతి్నస్తోంది. మెక్సికో జూన్ 2న ఎన్నికలకు మెక్సికో సిద్ధమవుతోంది. 13 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా అధ్యక్ష పదవితో పాటు మొత్తం 32 రాష్ట్రాల గవర్నర్లు, జాతీయ కాంగ్రెస్, స్థానిక సంస్థల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. క్లాడియా షేన్‌బామ్ రూపంలో ఈసారి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టే ఆస్కారం కనిపిస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సైంటిస్టు, మెక్సికో సిటీ మాజీ మేయర్ అయిన ఆమె అధికార మొరేనా పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 దేశాల ప్రజలూ కీలకమైన ప్రతి ఐదేళ్లకోసారి యూరప్ పార్లమెంటులో తమ ప్రతినిధులను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. విద్య, వైద్యం మొదలుకుని ఉపాధి దాకా ఆ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసే పలు కీలక రంగాలకు సంబంధించి నిర్ణాయక చట్టాలు చేయడంలో పార్లమెంటుదే కీలక పాత్ర. దాంతో జూన్ 6 నుంచి 9 దాకా జరగనున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 720 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికవుతారు. దక్షిణాఫ్రికా 6 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో మే–ఆగస్టు మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 1994లో దేశంలో వర్ణ వివక్ష అంతమయ్యాక జరుగుతున్న ఏడో ఎన్నికలివి. అప్పటినుంచీ అధికారంలో కొనసాగుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ఈసారి విజయానికి కావాల్సిన 50 శాతం మార్కును దాటడం కష్టకాలమేనంటున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సర్వేలో ఆ పారీ్టకి మద్దతు 45 శాతానికి పడిపోయింది. అవినీతి మకిలి అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాకు ఈసారి ప్రధాన అడ్డంకిగా మారేలా కని్పస్తోంది. అధికారంలోకి వస్తూనే పూర్వ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతిని క్షమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. అధికారుల్లో పెచ్చరిల్లిన అవినీతి పరిస్థితిని ఏఎన్‌సీకి మరింత ప్రతికూలంగా మార్చిందంటున్నారు. విపక్ష డెమొక్రటిక్ అలయెన్స్ దానికి గట్టిపోటీ ఇచ్చేలా కని్పస్తోంది. అమెరికా 33 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షించేవే. అధ్యక్షున్ని ఎన్నుకోవడంతో పాటు ప్రతినిధుల సభలో మొత్తం స్థానాలతో పాటు సెనేట్‌లో మూడో వంతు సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి నవంబర్ 5న జరగనున్న ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొనేలా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనమే అందుకు ఏకైక కారణం! 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు ఆయన ససేమిరా అనడం, తననే విజేతగా ప్రకటించాలంటూ మొండికేయడం తెలిసిందే. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అధ్యక్షునిగా ప్రకటించకుండా అడ్డుకునేందుకు ఏకంగా క్యాపిటల్ భవనంపైకి తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పారు ట్రంప్. ఆ కేసులో ఆయన దోషిగా తేలడం, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా మారే ప్రమాదంలో పడటం విశేషం! ఈ గండం గట్టెక్కితే ట్రంప్ మరోసారి బైడెన్‌తోనే తలపడతారు. ఘనా 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి అధ్యక్షునిగా కొనసాగుతున్న ననా అకుఫో అడో స్థానంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీ, విపక్ష నేషనల్ డెమొక్రటిక్ కాంగ్రెస్ మధ్య ఈసారి హోరాహోరీ ఖాయమంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాకు షాక్.. భారత్ నుంచి తైవాన్‌కు వేలాది కార్మికులు!
చైనాకు గట్టి షాక్ ఇచ్చే పని చేస్తోంది భారత్. పక్కనే ఉన్న తైవాన్ దేశానికి వేలాది మంది కార్మికులను పంపనుంది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య వచ్చే నెలలో కార్మిక ఒప్పందం జరగనుందని తెలిసింది. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనుంది. ఎంప్లాయిమెంట్ మొబిలిటీ అగ్రిమెంట్‌పై డిసెంబర్లో భారత్, తైవాన్లు సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు. తైవాన్‌లో వయసు పైబడినవారి జనాభా పెరిగిపోయింది. ఫలితంగా పనిచేసే సామర్థ్యం ఉన్న యువతకు అక్కడ కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. అదే సమయంలో భారత్‌లో దీనికి విరుద్ధ పరిస్థితి నెలకొంది. దేశంలో యువత జనాభా పుష్కలంగా ఉంది. లేబర్ మార్కెట్లోకి ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు వచ్చి చేరుతున్నారు. అయితే ఈ ఉపాధి ఒప్పందం చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను రాజేసే అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా చైనాకు నచ్చదు. తైవాన్ స్వతంత్ర ప్రాంతంగా ఉన్నప్పటికీ అది తమ దేశంలో అంతర్భాగమే అని చైనా వాదిస్తోంది. ధ్రువీకరించిన అధికారి భారత్-తైవాన్ ఉపాధి ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాకు తెలియజేశారు. అయితే తైవాన్ కార్మిక శాఖ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తమ దేశానికి కార్మిక సహకారం అందిస్తే స్వాగతిస్తామని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు చెప్పింది. కాగా భారత్ ఇప్పటి వరకు జపాన్, ఫ్రాన్స్, యూకే సహా 13 దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్లతోనూ ఇదే విధమైన ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. -
టూరిస్టులకు థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్
పర్యాటకులకు థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని నిర్ణయించింది. సీజన్ సమీపిస్తున్నందున ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు థాయ్ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు. తాజా నిర్ణయంతో భారత్ తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చని అధికార ప్రతినిధి చై వచరోంకే తెలిపారు. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సీజన్లో 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ప్రయాణ రంగం ద్వారా వచ్చే ఆదాయంతో ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారిన బలహీన ఎగుమతులను లోటును భర్తీ చేయాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. కాగా థాయ్‌లాండ్‌కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్నుంచే ఎక్కువ పర్యాటకుల తాకిడి ఉంటుంది. జనవరి -అక్టోబర్ 29 మధ్య, థాయ్‌లాండ్‌కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు. తద్వారా దేశానికి భారీ ఆదాయమే సమకూరింది. 2019లో రికార్డు స్థాయిలో వచ్చిన 39 మిలియన్ల టూరిస్టుల్లో 11 మిలియన్లతో టాప్‌లోని లిచింది చైనా.ఈ నేపథ్యంలోనే అయిన కోవిడ్ తరువాత టూరిజం మార్కెట్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన చైనీస్ టూరిస్టుల కోసం సెప్టెంబరులో వీసా అవసరం లేకుండానే పరిమిత కాల పర్యటనకు అవకాశం కల్పించింది. -
స్వదేశీ జలాంతర్గామిని తయారుచేసిన తైవాన్
కవోసియంగ్(తైవాన్): తరచూ నావికాదళాలతో తమ వైపు దూసుకొస్తూ కవి్వంపు చర్యలకు పాల్పడే చైనాను అడ్డుకునేందుకు తైవాన్ తొలిసారిగా జలాంతర్గామిని తయారుచేసుకుంది. ప్రస్తుతం ఈ సబ్‌మెరైన్ పరీక్ష దశలో ఉంది. పరీక్షల్లో విజయవంతమై తైవాన్ అమ్ములపొదిలో చేరితే ఆ దేశ సైనిక స్థైర్యం మరింత ఇనుమడించనుంది. ‘గతంలో దేశీయంగా జలాంతర్గాముల తయారీ అనేది అసాధ్యం. కానీ ఈరోజు స్వదేశీ జలాంతర్గామి మీ కళ్ల ముందు ఉంది’ అని నౌకాతయారీకేంద్రంలో నూతన జలాంతర్గామి ఆవిష్కరణ కార్యక్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్–వెన్ వ్యాఖ్యానించారు. ‘ దేశ పరిరక్షణకు ప్రతినబూనిన మా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం ఈ సబ్‌మెరైన్. వ్యూహాలు, యుద్ధతంత్రాల్లో నావికాదళం సన్నద్థతలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని ఆమె అన్నారు. కొత్త జలాంతర్గామికి హైకున్ అని పేరుపెట్టారు. చైనా ప్రాచీనగాథల్లో హైకు అంటే అది్వతీయమైన శక్తులు గలది అని అర్ధం. హార్బర్, సముద్ర పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక నావికాదళానికి అప్పగిస్తారు. 2027 ఏడాదికల్లా రెండు సబ్మెరైన్లను నిర్మించి దళాలకు ఇవ్వాలని తైవాన్ యోచిస్తోంది. తైవాన్ సమీప సముద్ర జలాల్లో తరచూ నేవీ, ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిన్యాసాలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్న చైనాకు ఈ పరిణామం మింగుడుపడనిదే. -
చైనా దురాక్రమణ యత్నాలు తీవ్రతరం?
తైపీ: పొరుగు దేశాల విషయంలో ఆధిపత్య ప్రదర్శన కోసం చైనా చేసే యత్నాల గురించి తెలియంది కాదు. ఈ క్రమంలో.. తైవాన్‌పై అది మిలిటరీ వేధింపులకు పాల్పడుతూ వస్తోంది. తాజాగా.. ఏకంగా వందకి పైగా యుద్ధవిమానాలను తైవాన్ వైపు పంపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. చైనా చర్యలను కవ్వింపుగా అభివర్ణిస్తోంది తైవాన్ రక్షణశాఖ.. చైనా ఇప్పటివరకు పంపిన యుద్శ విమానాల్లో.. 40 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధి(అనధికార సరిహద్దు రేఖ) మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద దుందుడుకు చర్యగా తైవాన్ చెబుతోంది. యుద్ధవిమానాలతో పాటు తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తెలిపింది. మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అంటూ ఏదీ లేదని, తైవాన్ కూడా చైనాలో భాగమేనని పేర్కొనడం గమనార్హం. మరోవైపు తాజాగా తైవాన్ను విలీనం చేసుకునేందుకు బీజింగ్ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ప్రణాళికను ఆవిష్కరించడం గమనార్హం. -
దూకుడు పెంచిన చైనా.. తైవాన్‌కు యుద్ధ విమానాలు
తైపే: ద్వీపదేశమైన తైవాన్‌పై చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 20 యుద్ధ విమానాలు స్వైరవిహారం చేశాయి. ఎదో కుట్రపూరిత ఆలోచనతోనే అవి తైవాన్ జలసంధిలోని మధ్యస్థ రేఖను దాటినట్లు తైపీ అధికారులు తెలిపారు. కుట్రపూరితమైన ఆలోచనలతోనే.. స్వీయ పాలిత దేశం తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చైనాకు తమదేశానికి మధ్యలో ఉండే జలసంధిలో చానాకు చెందిన సుమారు 20 యుద్ధ విమానాలు రెండు దేశాలను వేరుచేసే మధ్యస్థ రేఖను దాటి దేశ ఆగ్నేయ నైరుతి వాయు రక్షణ జోన్లోకి ప్రవేశించాయన్నారు. చైనా దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఇటువంటి ట్రైనింగ్ మిషన్లను నిర్వహిస్తోందని దానికోసమే పెట్రోలింగ్ విమానాలతోనూ నౌకలతో ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. వారి జోక్యాన్ని సహించలేక.. ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతోనే బీజింగ్ డెమోక్రటిక్ తైవాన్ను తన స్వంత భూభాగంగా ప్రకటించుకుంటోందని వారు దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు కూడా సాహసిస్తుందని అందులో భాగంగానే సైనికపరమైన, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచిందన్నారు. ఇదే నెలలో అమెరికా, కెనడాకు చెందిన రెండు నౌకలు ఈ నెలలో తైవాన్ జలసంధి వద్ద విహరిస్తూ ద్వీపదేశానికి అండగా నిలిచే ప్రయత్నం చేయడంతో చైనా దళాలు అప్రమత్తమయ్యాయని తైపే రక్షణశాఖ తెలిపింది. ఇదేమీ కొత్త కాదు.. ఈ వారంలోనే ద్వీపం చుట్టూ విహరిస్తున్న 68 విమానాలను 10 యుద్ధ నౌకలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో కొన్ని విమానాలు మరియు యుద్ధనౌకలు చైనా షాన్డాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ద్వారా కొన్ని యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు సముద్రంలోనూ గాలిలోనూ శిక్షణ పశ్చిమ పసిఫిక్ వైపుగా వెళ్లాయని తెలిపింది తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే చైనా ఇంత వరకు ఈ చొరబాటు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ నెలలో బీజింగ్ ఇటువంటి మిలటరీ విన్యాసాలే చేయగా తైవాన్ అధ్యక్షుడు సై ఇంగ్ వెన్ విషయాన్ని కాలిఫోర్నియా వెళ్లి యూఎస్ హౌస్ సభాపతి కెవిన్ మెక్ కార్తీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తైవాన్ కేవలం 24 గంటల్లో ఏకంగా 71 చైనాకు చెందిన యుద్ధ నౌకలను గుర్తించింది. #China is moving military equipment to ports near Taiwan, raising fears of an invasion. #Taiwan says it has detected 57 Chinese warplanes and 10 warships in the past 24 hours. Is this a drill or a threat? pic.twitter.com/2O7eFroJ2d — News Hrs (@newshrstweet) September 14, 2023 ఇది కూడా చదవండి: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి -
భారత్‌లో ఫాక్స్‌కాన్ ఈవీ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తైవాన్‌కు చెందిన చిప్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ భావిస్తోంది. అయితే ఫాక్స్‌కాన్ ఇతర ఈవీ కంపెనీల కోసం కాంట్రాక్ట్ తయారీ చేపడుతుందా లేదా సొంత బ్రాండ్ కింద మోడళ్లను విక్రయించబోతోందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమిళనాడును తమ స్థావరంగా ఉపయోగించుకోవాలని ఫాక్స్‌కాన్ చైర్మన్ చర్చించినట్లు తెలుస్తోంది.ఫాక్స్‌కాన్ మాతృ సంస్థ హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యంగ్ లేయో యూఎస్‌లోని ఓహియోతోపాటు థాయ్‌లాండ్‌లో ఈవీ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అలాగే అతి త్వరలో భారత్‌లో కూడా ఈవీ ఫ్యాక్టరీని నిర్మిస్తాం అని తెలిపారు. -
తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు
బీజింగ్: చైనా, తైవాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చెంగ్–తె ఇటీవల పరాగ్వే పర్యటకు వెళ్లి తిరిగి వస్తూ శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాల్లో ఆగారు. దీంతో డ్రాగన్ దేశం తైవాన్‌కు తీవ్ర హెచ్చరికలు పంపింది. ద్వీపం చుట్టూ శనివారం సైనిక విన్యాసాలకు దిగింది. వేర్పాటువాదులు, విదేశీ శక్తుల కవి్వంపు చర్యలకు ప్రతిగానే తాము ఈ మిలటరీ డ్రిల్స్ చేపట్టినట్టుగా చైనా రక్షణ శాఖ వెల్లడించింది. యుద్ధ విమానాలు, నౌకల్ని కూడా మోహరించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. తైవాన్ను శాశ్వతంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఉపాధ్యక్షుడు విలియం అమెరికాలోని న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో పర్యటించారు. తైవాన్ తమ దేశంలో భాగమని అంటున్న చైనా విలియం లాయ్ పర్యటనకి హెచ్చరికగా ఇదంతా చేస్తోంది. మరోవైపు చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి రావడంపై తైవాన్ మండిపడింది. శనివారం ఉదయం నుంచి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు రావడం కవి్వంపు చర్యలకి దిగడమేనని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేసింది. -
అమెరికాను చైనా ఎందుకు హెచ్చరించింది?
తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లై ఇటీవలే చైనాలో పర్యటించారు. నాటి నుంచి అమెరికాపై చైనా విరుచుకుపడుతూ వస్తోంది. చైనా రక్షణ మంత్రి ఆమధ్య రష్యా, బెలారస్ పర్యటనకు వెళ్లినప్పుడు అతనికి అమెరికా ప్రతినిధులతో మాట్లాడే అవకాశం లభించింది. తైవాన్ విషయంలో కల్పించుకుని అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికాను హెచ్చరించింది. తైవాన్‌పై ఉక్కుపాదం మోపడం ద్వారా చైనాను అదుపులో ఉంచుకోవాలన్న అమెరికా ప్రయత్నం ఫలించదని చైనా రక్షణ మంత్రి పేర్కొన్నారు. ‘బాహ్య జోక్యాన్ని చైనా సహించదు’ అంతర్జాతీయ భద్రతపై మాస్కో కాన్ఫరెన్స్‌లో చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు మాట్లాడుతూ తైవాన్ను అడ్డుపెట్టుకుని చైనాను నియంత్రించే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. చైనా ప్రధాన భూభాగంతో తైవాన్ పునరేకీకరణ అనివార్యమని, దానిని ఎవరూ నివారించలేరని లీ షాంగ్ఫు అన్నారు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారమని, అందులో ఎలాంటి బాహ్య జోక్యాన్ని సహించేది లేదని చైనా రక్షణ మంత్రి హెచ్చరించారు. చైనాకు వంత పాడిన పుతిన్ చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ల యుద్ధ వాతావరణం మధ్యలో మాస్కోలో చైనా రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు మద్దతుగా నిలిచారు. అమెరికా ప్రపంచ వివాదాలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తున్నదని పుతిన్ ఆరోపించారు. ఉద్రిక్తతను పెంచిన విలియం లై పర్యటన తైవాన్ విషయంలో ఇప్పటికే అమెరికాపై చైనా ఆగ్రహంతో ఉంది. తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లై తైవాన్ పర్యటన ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. విలియం లై త్వరలో జరగబోయే తైవాన్ అధ్యక్ష ఎన్నికలలో ప్రధాన అభ్యర్థి కానున్నారు. కాగా విలియం లై ఇటీవలే పరాగ్వేను సందర్శించారు. పరాగ్వేకు వెళ్లే మార్గంలో ఆయన అమెరికాలో ఆగారు. ఫలితంగా విలియం లైపై చైనా గన్ను ఎక్కుపెట్టింది. విలియం లై పదేపదే ఇబ్బందులను సృష్టిస్తున్నాడని చైనా ఆరోపించింది. వన్ చైనా పాలసీ అంటే ఏమిటి? తైవాన్ను చైనా ఎప్పుడూ ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. తన దేశంలో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగానే పరిగణిస్తూ వస్తోంది. ఇది తైవాన్ను తమ దేశంలోని ఒక రాష్ట్రంగా భావిస్తుంది. ‘వన్ చైనా పాలసీ’ని గుర్తించాలని ప్రపంచానికి చెబుతుందటుంది. తైవాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగించాలనుకునే దేశాలు రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధాలను తెంచుకోవాల్సి వస్తుందని చైనా హెచరించింది. వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్ ప్రత్యేక దేశం కాదు. ఇది చైనాలో భాగం. తైవాన్ కూడా హాంకాంగ్, మకావు మాదరిగా చైనా దేశ అధికార పరిధిలోకి వస్తుందని చైనా నమ్ముతుంది. అయితే చైనా భావనలోని ఈ విధానాన్ని తైవాన్ అంగీకరించదు. తమది స్వతంత్ర దేశమని ప్రకటించుకుంది. చైనా- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో తైవాన్ విషయంలో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. నిజానికి తైవాన్ విషయంలో చైనా ‘వన్ చైనా పాలసీ’ని అనుసరిస్తుంది. ప్రపంచ దేశాలు ఈ విధానాన్ని గుర్తించాలని కోరుతుంటుంది. అయితే అమెరికా దీనిని సమర్థించడం లేదు. గతేడాది అమెరికా ప్రతినిధి తైవాన్ను సందర్శించారు. అప్పుడు చైనా.. అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం చైనా.. తైవాన్ సమీపంలో సైనిక కార్యకలాపాలను పెంచింది. తాజాగా తైవాన్ ఉపాధ్యక్షుడి అమెరికా పర్యటనపై చైనా మరోసారి మండిపడింది. ఇదిలా ఉండగా చైనా రక్షణ మంత్రి రష్యా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తైవాన్‌పై అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించాయి. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
మరో రూ.3,318 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ గ్రూప్ రాష్ట్రంలో మరో రూ.3,318 కోట్ల (400 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లో ఫాక్స్‌కాన్ ప్రతినిధి వీ లీ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ను ధ్రువీకరిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. ‘ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ బంధం వేగంగా పురోగమిస్తోంది. పరస్పర ఒప్పందంలో పేర్కొన్న అంశాలను ఇరువురం వేగంగా అమలు పరుస్తున్నాం. ఈ నేపథ్యంలో గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా రూ.4,562 కోట్ల (550 మిలియన్ డాలర్లు) పెట్టుబడి హామీని ఫాక్స్‌కాన్ నెరవేర్చింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలనే ప్రతిపాదననను ‘ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ’ (ఎఫ్ఐటీ) ఆమోదించినట్లు బోర్డు చైర్మన్ లూ సంగ్ చింగ్ కూడా మరో ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎయిర్పాడ్స్తోపాటు మొబైల్ ఫోన్ల ఇతర విడిభాగాల తయారీలో ఫాక్స్‌కాన్‌కు దిగ్గజ సంస్థగా పేరుంది. ఇది మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌కు ప్రధాన విడిభాగాల సరఫరాదారుగా ఉంది. ఫాక్స్‌కాన్ తొలి విడతలో రూ.1,244 కోట్లు (150 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌లో 196 ఎకరాల్లో ఏర్పాటు ఇప్పటికే కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫాక్స్‌కాన్ తెలంగాణలోనూ కార్యకలాపాలు ప్రారంభించే ఉద్దేశంతో గత మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌కు 196 ఎకరాలు కేటాయించింది. గత మే 15న ఫాక్స్‌కాన్ యూనిట్‌కు శంకుస్థాపన జరగ్గా ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, ఎల్ఈడీ విద్యుద్దీపాలు, వాననీటిని ఒడిసి పట్టి ఇతర అవసరాలకు వాడుకోవడం, సిబ్బందికి బస వంటి అనేక ప్రత్యేకతలు ఈ క్యాంపస్‌లో ఉంటాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుండగా, ఫాక్స్‌కాన్ యూనిట్ ఏర్పాటు ద్వారా స్థానికంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. -
తైవాన్ దిశగా చైనా నౌకలు, యుద్ధ విమానాలు
తైపీ: తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ దేశం చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం, బుధవారం పెద్ద సంఖ్యలో నావికాదళం నౌకలను, ఫైటర్ జెట్లు, బాంబర్లతో కూడిన యుద్ధ విమానాలను తైవాన్ దిశగా పంపించింది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శత్రువుల దండయాత్ర నుంచి తనను తాను కాపాడుకోవడమే లక్ష్యంగా తైవాన్ ప్రతిఏటా నిర్వహించే సైనిక విన్యాసాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తన నౌకలను, యుద్ధ విమానాలను తైవాన్ దిశగా నడిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ 38 యుద్ధ విమానాలను, 9 నౌకలను తైవాన్ వైపు మళ్లించింది. అంతేకాకుండా మరో 30 విమానాలు దూసుకొచ్చాయి. ఇందులో జె–10, జె–16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విమానాలు చైనా–తైవాన్ మధ్య జలసంధిలో అనధికారిక సరిహద్దు అయిన మిడ్లైన్ను దాటి ముందుకెళ్లినట్లు సమాచారం. చైనాకు చెందిన హెచ్–6 బాంబర్లు కూడా దక్షిణ తైవాన్ సమీపంలో సంచరించినట్లు తెలుస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని డ్రాగన్ చెబుతోంది. ఎప్పటికైనా కలిపేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. -
ఇదేం వంటకం రా అయ్యా!.. తినడం కాదు చూస్తేనే వణుకొస్తోంది
భోజన ప్రియులు, కుకింగ్ వీడియోలు చేసేవాళ్లు చిత్ర విచిత్రాల ఫుడ్ కాంబినేషన్లు ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా వాటిని వీడియోల రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తుంటారు. వీటిలో కొన్ని వంటకాలు నెటిజన్లకు నచ్చుతుండగా.. మరికొన్ని మాత్రం ఇవేం వంటకాలంటూ పెదవి విరుస్తున్నారు. తాజాగా ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఓ తైవానీస్ రెస్టారెంట్ వంటకం బయటకు వచ్చింది. ‘గాడ్జిల్లా రామెన్’గా పిలువబడే ఆ వంటకంలో మొసలి కాలు చూసి ప్రజలు వణుకుతున్నారు. ఇదేం వంటకం రా అయ్యా! వింత అంటే చాలు తక్షణమే అది సోషల్ మీడియాలో తక్షణమే కావాల్సిందే. ఈ మధ్యకాలంలో కొందరు వెరైటీ కాంబినేషన్లో తయారు చేస్తూ సరికొత్త రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వీటిలో కొన్ని వంటకాలు చూసేందుకు బాగున్నట్లు అనిపించగా.. మరికొన్ని కాంబినేషన్లు తింటే ఏమౌతుందో అని ఫుడ్ లవర్స్ సైతం ఆందోళన చెందుతున్నారు. తాజాగా తైవానీస్ రెస్టారెంట్ చేసిన ఓ వంటకం విచిత్రంగా, వికారంగా కనపడుతూ ఉన్నప్పటికీ అది ప్రజాదరణ పొందుతోంది. ‘గాడ్జిల్లా రామెన్’ అని పిలువబడే ఈ వంటకంలో ప్రధాన ఆకర్షణగా మొసలికాలు నిలుస్తోంది. మీరు విన్నది నిజమే. మొసలి కాలును ఆవిరి చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారట. ఈ వంటకంలో 40 రకాల మసాలాలు వాడతారట. తైవాన్ నుంచి వంటలు వైరల్ కావడం ఇది మొదటిసారి కాదు. కానీ చూడటానికి భయం కలిగించేలా ఉన్న ఈ వంటకంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేయగా.. మరికొందరు ఇలాంటి కాంబినేషన్లు విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: అసలేం జరుగుతోంది.. డిగ్రీ పట్టా అందుకొని ‘శవాలు’గా మారుతున్న విద్యార్ధులు! -
లెగ్గుపీసే కానీ కోడిది కాదు..
ఏ విషయంలో ముందున్నా లేకున్నా... అన్ని జంతువులను సమభావంతో చూడటంలో చైనీయులు, తైవాన్వాసులు ఎప్పుడూ ముందుంటారు.. అందుకే తినే విషయంలో అదీ ఇదీ అని చూడరు. కనువిందుగా కనిపిస్తే చాలు.. ఏదైనా సరే.. నాలుగు రకాల మసాలాలు కుమ్మేసి.. ఆ నూడుల్స్‌తో కలిపేసి.. ఎంచక్కా మింగేస్తుంటారు. తైవాన్‌కు చెందిన విచ్ క్యాట్ అనే రెస్టారెంటోడికి కూడా ఓ మొసలి ఇలాగే కనిపించినట్లుంది. పైగా అక్కడి చెఫ్‌లకు క్రియేటివిటీ కూడా కాసింత ఎక్కువేనట. అందుకే ఎప్పుడూ చికెన్ లెగ్గుపీసులేనా.. మనిసన్నాక కూసింత కళాపోసన ఉండాలని చెప్పి.. మొసలి లెగ్గు పీసుతో ఇదిగో ఈ వంటకాన్ని సిద్ధం చేసేశారు. దీన్ని రుచి చూస్తే. రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయట. అయితే.. రెస్టారెంట్‌కు వచ్చినోళ్లంతా.. ఫొటోలు తీసుకుంటున్నారు తప్పిస్తే.. దీన్ని ట్రై చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. మరి.. ఆ ధైర్యం మీకుందా? -
నోరూరించే నూడుల్స్‌పై చిరు కప్పలు.. లొట్టలేసుకుంటూ తింటున్న జనం!
మనదేశంలో తయారయ్యే ఫాస్ట్‌ఫుడ్‌లలో అత్యధికంగా అమ్ముడయ్యే ఆహారం నూడుల్స్. దేశంలో ఏ మూల చూసినా నూడుల్స్ దుకాణాలు కనిపిస్తాయి. అయితే ఇటీవలికాలంలో తైవాన్‌లో నూడుల్స్‌తో రూపొందించిన ఒక డిష్ ఎంతో ఆదరణ పొందుతోంది. ప్రపంచంలో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి ఆహారాలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆహార ప్రియులు అన్ని రకాల ఆహారాలను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అటు మాంసాహారులు, ఇటు శాకాహారులు తమకు అనువైన వంటకాల కోసం వెదుకుతుంటారు. కొన్ని దేశాల్లో పురుగులు, కీటకాలు, కప్పలు ఆహారంలో భాగంగా మారిపోయాయి. కొన్ని ఆహారాలు ఎంత వింతగా ఉంటాయంటే వాటి గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి విచిత్రమైన ఒక డిష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరు కప్పలతో నోరూరించే నూడుల్స్.. తైవాన్‌లో ఇటీవలికాలంలో కప్పల నూడుల్స్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఆహార ప్రియులు ఈ నూడుల్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తూ లాగించేస్తున్నారు. నోరూరించే వేడివేడి నూడుల్స్‌పై చిరు కప్పలను ఉంచి, సర్వ్ చేయడం ఈ డిష్ ప్రత్యేకత. కప్పలను ఉడికించి, మసాలా దట్టించి.. ఆడిటీ సెంట్రల్ న్యూస్ అందించిన ఒక రిపోర్టు ప్రకారం తైవాన్‌లోని యున్‌లిన్‌లో యువాన్ రమెన్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో కప్పల నూడుల్స్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ డిష్ ప్రత్యేకత ఏమిటంటే గార్నిషింగ్‌లో కప్పలను వినియోగిస్తారు. ఇందుకోసం కప్పలను ముందుగా బాగా ఉడికించి, వాటికి మసాలా దట్టించి, నూనెలో దోరగా వేయిస్తారు. ఈ డిష్ పేరు ఏమిటంటే.. నూడుల్స్‌పై అప్పటికే మసాలా దట్టించి సిద్ధం చేసిన కప్పలను గార్నిషింగ్ చేస్తారు. కప్పల పైచర్మాన్ని తీయకుండానే ఇందుకోసం వినియోగిస్తారు. సోషల్ మీడియా యూజర్స్ ఈ డిష్‌కు ‘ఫ్రాగ్, ఫ్రాగ్, ఫ్రాగ్ రమెన్’ అనే పేరు పెట్టారు. ధర ఎంతంటే.. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రమెన్ రెస్టారెంట్లో ఈ డిష్‌ను కేవలం మంగళవారం, బుధవారం రాత్రి డిన్నర్ సమయాలలో మాత్రమే వడ్డిస్తారు. ఈ విచిత్రమైన డిష్ ఖరీదు 8 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 650. రెస్టారెంట్‌కు వెళ్లిన ఎవరైనా ఈ డిష్‌కు ఫొటో తీసుకోవాలనుకంటే 3.2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ డిష్‌ను అక్కడి ఆహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు.. -
తైవాన్ సమీపంలో భారీగా చైనా విమానాలు, నౌకలు
తైపీ: చైనా మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం అమెరికా నేవీకి చెందిన పి–8ఏ పొసెడాన్ యాంటీ సబ్మెరీన్ గస్తీ విమానం చైనా– తైవాన్లను విడదీసే తైవాన్ జలసంధి మీదుగా చక్కర్లు కొట్టడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. దీంతో, శుక్రవారం యుద్ధ విమానాలను, నేవీ షిప్‌లను పెద్ద సంఖ్యలో తైవాన్ సమీపంలోకి పంపించి, బెదిరింపు చర్యలకు దిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి చెందిన 38 ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధ విమానాలు తమ భూభాగానికి అత్యంత సమీపంలోకి వచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రి శుక్రవారం తెలిపారు. ఈ నెలారంభంలో భారీగా సైనిక విన్యాసాలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో విమానాలు, నౌకలను తైవాన్ సమీపంలోకి తరలించడం ఇదే మొదటిసారి. -
రష్యా రాక్షసకాండను సహించబోం.. శిక్ష తప్పదు.. జీ7 దేశాల హెచ్చరిక
టోక్యో: తైవాన్‌పై చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జీ7 దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘తీరు మార్చుకుని అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు’’అని ఆ దేశాలను హెచ్చరించాయి. జీ7 దేశాలైన జపాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ విదేశాంగ మంత్రులు, అత్యున్నత ప్రతినిధుల మూడు రోజుల సదస్సు జపాన్‌లోని కరూయిజవాలో మంగళవారం ముగిసింది. చైనా, రష్యా, ఉత్తర కొరియాల కట్టడికి కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం మంత్రులు ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. రష్యాను దారికి తీసుకురావడమే లక్ష్యంగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాకు శిక్ష తప్పదన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా రాక్షసకాండను సహించబోమన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందన్నారు. చైనా, తైవాన్ మధ్య శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. జీ7 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మే లో జపాన్‌లోని హిరోషిమాలో జరగనుంది. చైనాపై జీ7 కూటమి కుట్రలు పన్నుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. -
తైవాన్‌పై దాడికి అవసరం వస్తాయి..!
తైవాన్‌పై దాడికి అవసరం వస్తాయి..! -
తైవాన్‌పై దాడికి దిగుతుందా?.. అనేలా చైనా కసరత్తులు
చైనా, తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తైవాన్ సమీప సముద్ర జలాల్లో జాయింట్ స్టోర్డ్ పేరిట చేపట్టిన యుద్ధ విన్యాసాలు ఆదివారం కూడా యథావిధిగా కొనసాగాయి. షెడ్యూల్ ప్రకారం నేటితో ముగియాల్సి ఉండగా వరుసగా మూడో రోజు కూడా యుద్ధ విన్యాసాలు కొనసాగించింది. ఈ మేరకు సరిహద్దు ప్రాంతంలో యుద్ధ నౌకలతో సహా డజన్ల కొద్ది విమానాలకు కూడా మోహరించింది చైనా. ఐతే తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ గతవారం యూఎస్‌లో హౌస్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీని కలవడంపై ప్రతిస్పందనగా చైనా యుద్ధ సన్నహాల గస్తీ మాటున మూడు రోజుల సైనిక కసరత్తులకు తెర తీసిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ విన్యాసాల్లో చైనా బలగాలు తైవాన్ను చుట్టు ముట్టడంపై సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా ఓ అధికారిక వార్తా సంస్థలో కథనంలో.. "తైవాన్‌పై లక్షిత దాడులకు సన్నాహం చేయడం, ద్వీపాన్ని చుట్టుముట్టడం వంటి వరుస కసరత్తులను ఒకదాని తర్వాత మరొకటి నిర్వహించింది. దీంతోపాటు తైవాన్‌ని ముట్టడించేలా..రెండు విమానా వాహక నౌకలు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, యూఎస్ఎస్ మిలియస్, బాంబర్లు, జామర్లు వంటి వాటిని మోహరించింది". అని పేర్కొంది. ఈ విన్యాసాలను లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్(పీఎల్ఏ) నిర్వహిస్తోంది. అలాగే సోమవారం చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని రాతి తీరంలోని మాట్సు దీవులకు దక్షిణంగా 80 కిలోమీటర్లు (50 మైళ్లు), తైపీకి 190 కిలోమీటర్ల దూరంలోనూ లైవ్-ఫైర్ డ్రిల్లను జరగనున్నాయి. ఈ మేరకు తైవాన్‌కు చైనాకు సమీపంలో ఉన్న ఆగ్నేయ ద్వీపం అయిన పింగ్టాన్ చుట్టూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ విన్యాసాలు నిర్వహించనున్నట్లు చైనా స్థానికి సీ అథారిటీ పేర్కొంది. ఈ కార్యకలాపాలు 'తైవాన్ స్వాతంత్యం' కోరుకునే వేర్పాటువాద శక్తులు కలిసి చేపట్టే కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా గట్టి హెచ్చరికగా పనిచేస్తాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్(పీఎల్ఏ) ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ చైనా చర్యను వ్యతిరేకించారు. నిరంతర నిరంకుశ విస్తరణవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా తోసహా ఇతర సారూప్య దేశాలతో కలిసి పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. (చదవండి: మోదీ గ్రేట్! భారత్ లాగానే మాక్కూడా చీప్‌గా కావాలి: ఇమ్రాన్ ఖాన్) -
ఎలక్ట్రిక్ విభాగంలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు!
ఎలక్టాన్రిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్’ సంస్థ సౌత్ తైవాన్‌లో ఎలక్ట్రిక్ విభాగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఫాక్స్‌కాన్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ కోసం రాబోయే మూడేళ్లలో తైవాన్‌లో 820 మిలియన్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే సౌత్ తైవాన్ Kaohsiung Cityలో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ బ్యాటరీలు తయారు చేసే ప్లాంట్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో ఫాక్స్‌కాన్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధులు తెలిపారు. కాగా, ఫాక్స్ కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్లను తయారు చేసే ప్రధాన ఉత్పత్తి దారుల్లో ఒకటిగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఇదే సంస్థ ఐఫోన్ల తయారీ యూనిట్లును నెలకొల్పేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. -
తైవాన్‌పై మళ్లీ చైనా ఆగ్రహజ్వాల
బీజింగ్: తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అమెరికాలో పర్యటించడాన్ని సహించని చైనా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎనిమిది యుద్ధనౌకలు, 71 యుద్ధవిమానాలను మోహరించి తైవాన్ సముద్రజల్లాల్లో ఉద్రిక్తత ను మరింత పెంచింది. తమ అధ్యక్షురాలు అమెరికాలో పర్యటించడంతో అక్కసుతో చైనా ఇలాంటి బెదిరింపు చర్యలకు దిగుతోందని తైవాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. 45 యుద్ధవిమానాలు ‘మిడిల్లైన్’ను దాటి మరీ తమ ప్రాదేశిక జలాలపై చక్కర్లు కొడుతున్నాయని తైవాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘యుద్ధ సన్నద్ధత గస్తీ’ మాటున మూడ్రోజులపాటు నౌకాదళ సంపత్తిని చైనా రంగంలోకి దించింది. అమెరికా పర్యటనలో భాగంగా తైవాన్ అధ్యక్షురాలు త్సాయి గురువారం కాలిఫోర్నియాలో అమెరికా పార్లమెంట్ ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీతో భేటీ అయ్యారు. దీంతో కోపం తెచ్చుకున్న చైనా పలు అమెరికన్ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. -
‘ఇండియన్ 2’.. తైవాన్ టు సౌతాఫ్రికా
తైవాన్‌కు బై బై చెప్పాడు భారతీయుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, బెనెడిక్ట్ గారెట్, గుల్షన్ గ్రోవర్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల తైవాన్‌లో మొదలైన ‘ఇండియన్ 2’ షెడ్యూల్ ముగిసింది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కమల్‌హాసన్ పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలతో పాటు విదేశీ ఫైటర్స్‌తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. తైవాన్ షెడ్యూల్ తర్వాత యూనిట్ సౌతాఫ్రికా వెళ్తుందని, అక్కడి లొకేషన్స్‌లో మరో యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసిందనికి వినికిడి. ఈ చిత్రాన్ని సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి నిర్మిస్తున్నారు. -
చైనాను రెచ్చగొట్టిన తైవాన్.. సరిహద్దులో ఉద్రిక్తత
బీజింగ్: తైవాన్, చైనాను రెచ్చగొట్టింది. డ్రాగన్ కంట్రీ వద్దని వారించినా సరే తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ అమెరికా పర్యటనలో అక్కడి హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీతో భేటీ అయ్యారు. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో చైనా భగ్గుమంది. చైనాకు చెందిన మూడు యుద్ధనౌకలు, ఓ ఎయిర్‌క్రాఫ్ట్ తైవాన్ సరిహద్దులో మోహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ సైతం ధృవీకరించింది. పరిస్థితి ప్రస్తుతానికి ఉద్రిక్తంగానే ఉందని, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు. అంతకు ముందు.. చైనా విదేశాంగ శాఖ సాయ్ ఇంగ్ చర్యను తీవ్రంగా ఖండించింది. చైనా సిద్ధాంతాలకు(వన్ చైనా ప్రిన్స్‌పుల్) వ్యతిరేకంగా ఆమె వ్యవహరించారని మండిపడింది. వన్ చైనా.. వన్ తైవాన్ అంటూ తైవాన్ను తప్పుదోవ పట్టించే తీరును మార్చుకోవాలంటూ అమెరికాను ఆ ప్రకటన ద్వారా చైనా హెచ్చరించింది. అంతకు ముందు.. బుధవారం కాలిఫోర్నియాలో మెక్కార్థీని కలిసిన సాయ్ ఇంగ్ వెన్.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ పరోక్షంగా చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఉద్దేశించి పేర్కొన్నారు. -
కలిస్తే ఖబడ్దార్.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చైనా
బీజింగ్: తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ప్రస్తుతం దౌత్యపరమైన ఒప్పందాల కోసం మధ్యఅమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే.. దేశ అంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో అగ్రరాజ్యంతో చర్చిస్తే.. చూస్తూ ఊరుకోబోమని డ్రాగన్ హెచ్చరించింది. అంతేకాదు.. పర్యటనకు ముందు సాయ్ చేసిన వ్యాఖ్యలను ధిక్కార స్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. సాయ్ ఇంగ్-వెన్ పర్యటనకు ముందు మాట్లాడుతూ.. తైవాన్‌కు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు(చైనాను ఉద్దేశించి..) ఈ మేరకు ఎలాంటి ప్రభావం తమపై చూపలేదంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆమె మధ్యలో కాలిఫోర్నియాను సందర్శించాల్సి ఉండగా.. యూఎస్ హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీతో భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అయితే.. ఈ భేటీ పరిణామంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఒకవేళ తైవాన్ అధ్యక్షురాలు గనుక అమెరికా చట్టసభ స్పీకర్‌ను కలిస్తే మాత్రం పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని, ఇది చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశంగా భావించక తప్పదని పేర్కొంది. మరోవైపు సాయ్ ఇంగ్-వెన్ వ్యాఖ్యపైనా చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను, చర్యలను బీజింగ్ వర్గాలను రెచ్చగొట్టడం కిందే చూడాల్సి వస్తుందని, ప్రతీకార చర్యలు తప్పవని, తర్వాతి పరిణామాలకు తైవాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
భారీ పెట్టుబడులు, ఒప్పందాలు: ఫాక్స్‌కాన్ షాకిచ్చిందిగా!
సాక్షి,ముంబై: తైవాన్ కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ ఇండియాలో కొత్త పెట్టుబడులపై క్లారిటీ ఇచ్చింది. తమ ఛైర్మన్ ఇండియాను సందర్శించి నప్పటికీ దేశంలోఎలాంటి కచ్చితమైన ఒప్పందాలు కుదుర్చుకోలేదని వెల్లడించింది. యాపిల్ ఐఫోన్ల తయారీలో అగ్రగామి ఫాక్స్‌కాన్ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సంస్థ శనివారం తోసిపుచ్చింది. దీంతో ఇకపై తక్కువ ధరకే మేడిన్ ఇండియా ఐఫోన్లు అందుబాటులోకి వస్తాయని ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లైంది. కర్ణాటకలో ఏర్పాటు కానున్న భారీ ప్లాంట్‌లో ఐఫోన్ల విడిభాగాల తయారీకి 700 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలన్న యోచనలో ఉందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఈ విషయంలో మీడియా వచ్చినట్టుగా చర్చలు,అంతర్గత సమీక్షలు, భారీ పెట్టుబడులు అనేది ఫాక్స్‌కాన్ అందించిన సమాచారం కాదని తేల్చి పారేసింది. అయితే భారీ పెట్టుబడి కోసం ఫాక్స్‌కాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గతంలో చెప్పారు.యంగ్ లియుతో వివరణాత్మక చర్చల తర్వాత రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదిరిందనీ, ఇది 1 లక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల భూమి కేటాయించినట్టుగా కూడా బొమ్మై ట్వీట్ చేశారు. దీంతోపాటు లక్షమందికి ఉపాధి కల్పించేలా రాష్ట్రంలో పెట్టుబడుల నిమిత్తం ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. కాగా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు గత ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల (మార్చి) 4 వరకు ఇండియాలో పర్యటించారు. సెమి కండక్టర్ల వంటి నూతన రంగాల్లో సహకారాన్ని కోరేందుకు ఉద్దేశించిందని అధికారికంగానే ప్రకటించారు. అలాగే కంపెనీ అభివృద్ధి అవకాశాలను దృష్టిలో నుంచుకొని స్థానిక ప్రభుత్వాలతో సంబంధాలను కొనసాగిస్తామని కూడా ఆయన ప్రకటించిన సంగతి విదితమే. -
తైవాన్‌లో చైనా బెలూన్ కలకలం
తైపీ: తైవాన్‌లో చైనా బెలూన్ తీవ్ర కలకలం సృష్టించింది. చైనా ప్రయోగించిన బెలూన్ తమ భూభాగంలో ల్యాండ్ అయ్యిందని తైవాన్ రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలోని తైయువాన్ సిటీలో ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చెందిన పరికరాలు ఇందులో ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. చైనాలో అంతర్భాగమైన ఫుజియాన్ ప్రావిన్స్ తీరానికి సమీపంలోని తమ మాత్సూ ఐలాండ్‌లో భాగమైన తూంగ్యిన్లో ఈ బెలూన్ నేలపైకి దిగినట్లు తెలియజేసింది. ఈ ఉదంతంపై చైనాలోని తైయువాన్ వైర్లెస్(రేడియో) ఫస్ట్ ఫ్యాక్టరీ లిమిటెడ్ అధికారి స్పందించారు. ఆ బెలూన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే తాము అందజేశామని, బెలూన్ను తాము తయారు చేయలేదని పేర్కొన్నారు. ఆ కంపెనీ చైనా వాతావరణ శాఖకు అవసరమైన పరికరాలను అందిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. తైవాన్ భూభాగంలో దిగిన బెలూన్ వాతావరణాన్ని పరిశీలించేందుకు ప్రయోగించినదేనని స్పష్టం చేశారు. ఇలాంటి బెలూన్లు తైవాన్ జలసంధిపై ఎగరడం సాధారణమేనని, ఇప్పుడు మాత్రమే దీనిపై అందరి దృష్టి పడిందని వివరించారు. చైనా బెలూన్ను ఇటీవల అమెరికా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇరు దేశాల నడుమ మాటల యుద్ధం సాగుతోంది. -
చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్! విస్తుపోయిన బీజింగ్
చైనాలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆంక్షలు సడలించాకే కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు పెరిగిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఇలాంటి మహమ్మారి పరిస్థితుల్లో చైనాకు ఆపన్నహస్తం అందించి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ ఆదివారం భారీగా పెరుతున్న కరోనా కేసులను కట్టడి చేయడంలో చైనాకు అవసరమైన సాయాన్ని అందిస్తానని ప్రకటించారు. ఈ కొత్త ఏడాదిలో మావనతా దృక్పథంతో మహమ్మారీ నుంచి ఎక్కువ మంది చైనా ప్రజలు బయటపడి ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా అవసరమైన సాయం అందించేందుకు తాము సదా సిద్ధంగా ఉన్నామని ఇంగ్ వెన్ చెప్పారు. అలాగే సమస్యలను పరిష్కరించడానికి యుద్ధం ఒక ఎంపిక కాదంటూ చైనాతో చర్చలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ద్వీప సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నయని, శాంతి స్థిరత్వానికి భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ.. ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా, చైనా అద్యక్షుడు జిన్‌పింగ్ నూతన సంవత్సరం ప్రసంగంలో తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబానికి చెందినవారు అంటూ ప్రసంగించారు. ఐతే కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో గతంలో తైవాన్, చైనా దేశాలు తమ చర్యలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మహమ్మారి విషయంలో తైవాన్ సమర్థవంతంగా పనిచేయలేదంటూ చైనా విమర్శించగా,.. మరోవైపు తైవాన్ చైనాలో పారదర్శకత లోపించిందని, తమ దేశానికి సరఫరా చేసే వ్యాక్సిన్లలో జోక్యం చేసుకుందంటూ మండిపడింది. ఐతే బీజింగ్ తైవాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. (చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు) -
శాంతి ఆకాశం నుంచి ఊడిపడదు: తైవాన్
తైపీ: చైనా నుంచి యుద్ధం, ఆక్రమణల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. తైవాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏడాది మిలిటరీ సర్వీస్‌ను తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి ఏనాటికైనా ఆక్రమణ తప్పదనే భయాందోళనలో ఉండింది ఈ చిన్న ద్వీప దేశం. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ స్వయంగా ఈ ప్రకటన చేయడం విశేషం. తైవాన్‌పై చైనా బెదిరింపులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ, నా తోటి పౌరులారా.. శాంతి ఆకాశం నుంచి ఊడిపడదని గుర్తించాలి అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో త్వరగతిన మారుతున్న పరిస్థితుల ఆధారంగా.. నాలుగు నెలల మిలిటరీ సర్వీస్ సరిపోదు. అందుకే దానిని ఏడాదికి పొడిగించాలని నిర్ణయించాం. 2024 నుంచి ఏడాది మిలిటరీ సర్వీస్ తప్పనిసరి కానుంది. 2005 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వాళ్లందరికీ.. కొత్త కొనసాగింపు వర్తిస్తుందని సాయ్ ఇంగ్ వెన్ ప్రకటించారు. రెండు రోజుల కిందట.. తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. వాష్టింగ్టన్, తైపీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని.. సైనిక విన్యాసాలను చైనా సమర్థించుకుంది కూడా. తైవాన్‌లో ఒకప్పుడ ఏడాది మిలిటరీ సర్వీస్ నిబంధన ఉండేది. కానీ, తర్వాతి కాలంలో దానిని నాలుగు నెలల కాలపరిమితికి కుదించారు. అయితే, సరిహద్దులో సైనిక చర్యల ద్వారా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యం.. డ్రాగన్ కంట్రీ నుంచి ఏనాటికైనా యుద్ధం తప్పదనే భావనలోకి చేరుకుంది తైవాన్. తమను తాము స్వపరిపాలన.. ప్రజాస్వామ్యిక దేశంగా తైవాన్ ప్రకటించుకుంది. కానీ, తైవాన్ తమ భూభాగానికే చెందుతుందని డ్రాగన్ కంట్రీ ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు అండగా అమెరికా ప్రకటనలు ఇవ్వడం, అక్కడి ప్రతినిధులు తైవాన్ గడ్డపై పర్యటించడం చైనాకు కోపం తెప్పిస్తోంది. ఈ పరిస్థితులకు తోడు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ మధ్య కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తైవాన్ సరిహద్దులో వరుసపెట్టి మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తుండడంతో.. తరచుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా తరహాలో చైనా కూడా తమ భూభాగంపై దురాక్రమణకు పాల్పడవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది తైవాన్. -
తైవాన్‌లో చైనా అనుకూల పార్టీ ప్రభంజనం!
తైపేయి: తైవాన్‌లో శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చైనా వ్యతిరేక నినాదం.. ప్రజల నుంచి ఓట్లు విదిలించలేకపోయింది. విశేషం ఏంటంటే.. చైనా నుంచి మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(DPP)ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారామె. అయితే.. ఈ ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ ఘన విజయం సాధించింది. ‘‘ఎన్నికల ఫలితాలు మేం ఆశించినట్లు రాలేదు. తైవాన్ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ఓటమికి అంతా నాదే బాధ్యత. డీపీపీ చైర్ఉమెన్ బాధ్యతల నుంచి ఇప్పటికిప్పుడే తప్పుకుంటున్నా’’ అని సాయ్ ఇంగ్-వెన్ మీడియాకు తెలియజేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకునప్పటికీ 2024 వరకు ఆమె తైవాన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. మేయర్లు, కౌంటీ చీఫ్‌లు, లోకల్ కౌన్సిలర్లు.. ఇలా జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఈ ఎలక్షన్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారామె. చైనా విధానాలకు, మిలిటరీ ఉద్రిక్తతల పట్ల తైవాన్ ప్రజల నుంచి ఏమేర వ్యతిరేకత ఉందో ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సాయ్ ఇంగ్-వెన్ భావించారు. కానీ, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. చైనా వ్యతిరేకత ప్రచారం వర్కవుట్ కాలేదు. ఇక చైనా నుంచి పరోక్ష మద్దతు ఉన్న కోమింటాంగ్ (KMT)పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రచార సమయంలో డీపీపీ చైనా వ్యతిరేక గళం వినిపించగా.. కేఎంటీ మాత్రం చైనాతో డీపీపీ ప్రభుత్వ వైరం శ్రుతి మించుతోందని, అది దేశానికి ప్రమాదకరమని ప్రచారం చేసింది. అయినప్పటికీ తాము చైనాకు కొమ్ము కాయబోమని.. తైవాన్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం సంప్రదింపులు జరుపుతామన్న ప్రచారంతో జనాల్లోకి దూసుకెళ్లింది. ఇక శనివారం వెలువడిన తైవాన్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో.. 21 నగర మేయర్ స్థానాలకు గానూ పదమూడింటిని కైవసం చేసుకుంది కేఎంటీ. అందులో రాజధాని తైపేయి కూడా ఉంది. కౌంటీ చీఫ్ సీట్ల సంఖ్యను సైతం పెంచుకుంది. అయితే.. గత ఎన్నికల్లో మాదిరే ఈ దఫా ఎన్నికల్లోనూ సైతం డీపీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 2018లో డీపీపీ కేవలం ఐదు స్థానాలే దక్కించుకోగా.. చైనాను ఎదుర్కొంటున్న పరిణామాలు జనాల నుంచి సానుకూల ఫలితాలు తెప్పిస్తాయని భావించింది. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఐదు స్థానాలే కైవసం చేసుకుంది. అందులో పెద్దగా ప్రభావితం చూపని ప్రాంతాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫలితంపై చైనా ఇంకా స్పందించలేదు. కానీ, జిన్హువా వార్తా సంస్థ మాత్రం తైవాన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ పనితీరుకు బాధ్యత వహిస్తూ సాయ్ రాజీనామా చేశారంటూ ఓ కథనం ప్రచురించింది. ఇదిలాఉంటే.. కరోనా సమయంలో తైవాన్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అందరికంటే ముందే మేల్కొని లాక్డౌన్ విధించకుండా.. కేసుల ట్రేసింగ్‌పై దృష్టి సారించారు ఆమె. తద్వారా తైవాన్‌లో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఈ ఘనతకు గానూ 2020 ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో సాయ్ ఇంగ్-వెన్కి చోటు దక్కింది. ఇప్పటికీ తైవాన్ ప్రయాణాలకు కరోనా నెగెటివ్ ఫలితం.. అదీ ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న సర్టిఫికెట్‌ను ఎయిర్పోర్ట్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పుతిన్‌కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు! -
అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్
రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా.. అమెరికా దాని మిత్రపక్షాలు కేవలం గ్లోబల్ ఆధిత్యం కోసమే ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అంతేకాదు.. ఉక్రెయిన్‌పై అణుదాడికి పాల్పడతారనే ఊహాగానాలపైనా ఆయన ఒక స్పష్టత కూడా ఇచ్చారు. తైవాన్ విషయంలో చైనా వాదనకు మద్దతు పలికిన పుతిన్.. అమెరికా విషయంలో సౌదీ అరేబియా వ్యవహరిస్తున్న తీరుపైనా ప్రశంసలు గుప్పించారు. పాశ్చాత్య ఉదారవాదానికి వ్యతిరేకంగా రష్యాను సంప్రదాయవాద విలువల విజేతగా చూపించాలన్నదే తన అభిమతమని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారాయన. రష్యా ఆక్రమణ నుంచి ఉక్రెయిన్ పోరాడేందుకు అమెరికా, దాని మిత్రపక్షాలు ఆయుధాల సరఫరా చేస్తున్నాయి. ఇందులో వాళ్ల తీరు గ్లోబల్ వైడ్‌గా ఆధిపత్యం చెలాయించాలన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని గురువారం జరిగిన ఓ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతేకాదు.. ఉక్రెయిన్ను పిచ్చుకతో పోల్చిన ఆయన.. ఆ దేశంపై అణు ఆయుధాల ప్రయోగ ఉద్దేశమే రష్యాకు లేదని స్పష్టం చేశారు. రష్యా, పాశ్చాత్య దేశాలకు శత్రు దేశం కాదని ప్రకటించిన పుతిన్.. అమెరికా ఆధిపత్యం ముగింపు దశకు చేరుకుందని పేర్కొన్నారు. అంతేకాదు.. తైవాన్ వ్యవహారంలో చైనా ప్రజాస్వామిక్యంగా వ్యవహరిస్తోందని.. అమెరికా జోక్యంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని మండిపడ్డారాయన. జాతి ప్రయోజనాల కోసం అగ్రరాజ్యం నుంచి విమర్శలు ఎదురైనా పట్టించకోవడంపై సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు పుతిన్. ఇక.. వచ్చే నెల ఇండోనేషియాలో జరగబోయే జీ-20 సదస్సుకు హాజరు అయ్యే అవశం ఇంకా పరిశీలనలోనే ఉందని.. బహుశా వెళ్లవచ్చనే సంకేతాలు అందించారు. ఇదిలా ఉంటే.. మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ సహా క్రెమ్లిన్ అధికారులంతా ఉక్రెయిన్ విషయంలో అణు యుద్ధం తప్పదనే దిశగా సంకేతాలు, హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ నడిచింది. మరోవైపు ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగం ఆరోపణలతో రష్యా.. అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ తరుణంలో అణు దాడి ఉండబోదని పేర్కొన్న పుతిన్.. అగ్రరాజ్యం సహా యూరప్ దేశాలను ఏకీపడేయడం గమనార్హం. ఇదీ చదవండి: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్ -
బలప్రయోగానికీ వెనుకాడం
బీజింగ్: తైవాన్ను చైనాలో ఐక్యం చేసుకొనే విషయంలో బలప్రయోగానికి సైతం వెనుకాడబోమని డ్రాగన్ దేశాధిపతి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శి షీ జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. తైవాన్ ముమ్మాటికీ తమదేశంలో ఒక అంతర్గత భాగమేనని ఉద్ఘాటించారు. చైనా జాతీయ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల కోసం సైన్యాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. రాజధాని బీజింగ్‌లోని ‘ఆర్నేట్ గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 20వ జాతీయ సదస్సులో జిన్‌పింగ్ ప్రసంగించారు. తైవాన్ విషయంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంచేశారు. తైవాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలకు అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామని వెల్లడించారు. బలప్రయోగానికైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ తప్పనిసరి చైనా పునరేకీకరణను పూర్తి చేస్తామని షీ జిన్‌పింగ్ ప్రతినబూనారు. పునరేకీకరణ అంటే తైవాన్ను చైనా ప్రధాన భూభాగంలో(మెయిన్ ల్యాండ్) కలిపేయడమే. జిన్‌పింగ్ ప్రతిజ్ఞకు సదస్సులో చప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. తైవాన్ అంశంలో కమ్యూనిస్ట్ పార్టీ దృఢసంకల్పంతో వ్యవహరించాలని జిన్‌పింగ్ సూచించారు. పునరేకీకరణ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ‘‘తైవాన్ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పూర్తిగా చైనాకు సంబంధించిన వ్యవహారం. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందే చైనానే’’ అని వ్యాఖ్యానించారు. పునరేకీకరణ విషయంలో శాంతియుత మార్గంలోనే ముందకెళ్తామని తెలిపారు. అదేసమయంలో బలప్రయోగానికి పాల్పడబోమన్న హామీని తాము ఇవ్వలేమన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ అనేది వాస్తవరూపం దాల్చడం తప్పనిసరి అని ఉద్ఘాటించారు. తైవాన్ సోదరుల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నామన్నారు. చైనా–తైవాన్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తామని వివరించారు. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని జిన్‌పింగ్ తెలియజేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) 2027లో వందేళ్లను పూర్తిచేసుకోనుందని అన్నారు. సైన్యాన్ని ఆధునీకరించాలన్న లక్ష్యాన్ని మరో ఐదేళ్లలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సోషలిస్ట్ దేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆహారం, ఇంధనం, పరిశ్రమలు, సప్లై చైన్స్, విదేశాల్లోని చైనీయుల హక్కుల విషయంలో మరింత సామర్థ్యంతో పని చేయాల్సి ఉందన్నారు. బ్రిక్స్, షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) వంటి వాటిలో చురుకైన పాత్ర పోషిస్తామని జిన్‌పింగ్ వివరించారు. హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని చెప్పారు. అగ్రనేతలకు స్థానచలనం! కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సు దాదాపు వారం రోజులపాటు జరుగనుంది. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి ఎన్నుకోనున్నారు. జిన్‌పింగ్ మినహా పార్టీలో అగ్రనేతలందరికీ ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. నంబర్–2గా పేరుగాంచిన లీ కెఖియాంగ్‌ను సైతం మార్చనున్నారు. ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తొలిరోజు సదస్సులో 2,300 మందికిపైగా ‘ఎన్నికైన ప్రతినిధుల’తోపాటు కమ్యూనిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు హూ జింటావో, సాంగ్‌పింగ్ తదితరులు పాల్గొన్నారు. 2002 దాకా అధ్యక్షుడిగా పనిచేసిన 96 ఏళ్ల జియాంగ్ జెమిన్ హాజరు కాలేదు. జిన్‌పింగ్ దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం పట్ల ఆహూతులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్.... చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్
తైపీ: బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడేదే లేదని, వెనక్కి తగ్గమని తెగేసీ చెప్పింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవటం ఇరుపక్షాల భాద్యత అని నొక్కిచెప్పింది. యుద్ధం ఒక్కటే ఆప్షన్ కాదని తేల్చి చెప్పింది. తైవాన్‌లో సుమారు 23 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. అలాగే తాము బీజింగ్ ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పింది. వాస్తవానికి 2016లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో ఉన్న సంబంధాలను కట్టడి చేసింది. రాజీకీయాలతో దిగ్బంధం చేసి సైనిక బలగాలతో బలవంతంగా అధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్రలను విడిచిపెట్టాలని చైనీస్ కమ్యూనిస్ట్ అధికారులకు పిలుపినిచ్చింది తైవాన్. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని, తైవాన్‌ని స్వతంత్ర దేశంలా ఉంచే క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ ఆరోపణలు చేశారు. పైగా శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తాం కానీ యుద్ధం చేయమని హామీ ఇవ్వం అని చెప్పారు. (చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్ కీలక ప్రకటన) -
హాంకాంగ్ హస్తగతమైంది.. తర్వాత తైవానే!
బీజింగ్: హాంకాంగ్‌ను పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. దాని ద్వారా అల్లర్ల నుంచి సుపరిపాలన దిశగా హాంకాంగ్ మార్పు చెందినట్లు చెప్పారు. మరోవైపు.. తైవాన్ వేర్పాటువాదంపై చైనా పోరాటం చేస్తోందన్నారు. తైవాన్ తమ అంతర్గత భాగమని, ఆ ప్రాంత సమగ్రతను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు జిన్‌పింగ్. ‘హాంకాంగ్‌లో పరిస్థితులు ఆందోళనల నుంచి సుపరిపాలన దిశగా మార్పు చెందాయి. స్వీయ పరిపాలన ద్వీపం తైవాన్‌లో వేర్పాటు వాదం, విదేశీ శక్తుల జోక్యంపై ప్రధానంగా పోరాటం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు జిన్‌పింగ్. తైవాన్ను స్వతంత్ర ప్రాంతంగా తాము అంగీకరించబోమని, తైపీ తమ అంతర్గత ప్రాంతమని చాలా సందర్భాలుగా చైనా చెబుతూ వస్తోంది. ఇటీవల అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ, ఇతర చట్ట సభ్యులు తైనాన్‌లో పర్యటించగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ను అష్టదిగ్భందనం చేసి.. యుద్ధ మేఘాలను ఆవరించింది. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే! -
తైవాన్ శాంతి ప్రతిపాదన... ఎలెన్ మస్క్‌కి థ్యాంక్స్ చెప్పిన చైనా!
వాషింగ్టన్: యూఎస్‌లోని చైనా రాయబారి క్విన్ గ్యాంగ్ టెస్లా దిగ్గజం ఎలెన్ మస్క్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల చైనా తైవాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎలెన్ మస్క్ ఒక శాంతి ప్రతిపాదనను సూచించారు. ఈ నేపథ్యంలోనే చైనా రాయబారి ఎలెన్మస్క్కి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఎలెన్ మస్క్ ఫైనాన్షియల్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో... తైవాన్ను చైనా ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్‌గా మార్చవచ్చని ఒక సలహ ఇచ్చారు. దీంతో చైనా రాయబారి ట్విట్టర్లో... ఒక దేశం రెండు వ్యవస్థలుగా తైవాన్ సమస్యను తీర్చే మీ సలహ ఉత్తమైమనది అని ప్రశంసించారు. ఇది చాలా శాంతియుత పునరేకికరణ అంటూ ఎలెన్ మస్క్‌ని ప్రశంసించారు. ఐతే చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలకు హామీ ఇచ్చినట్లయితే తైవాన్ పునరేకీకరణ తర్వాత ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా స్వయం ప్రతిపత్తిని, అభివృద్ధిని పొందుగలుగుతుందని క్విన్ గ్యాంగ్ ట్వీట్ చేశారు. ఐతే ఎలెన్ మస్క్ సలహ తైవాన్ ప్రజలకు నచ్చలేదు, పలు తైవాన్ రాజకీయ పార్టీలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అంతేగాదు మస్క్ వ్యాఖ్యలు జాతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లఘించడమే కాకుండా ప్రజాస్వామ్యానికి హాని కలిగించేవని తైవాన్ డెమోక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి హువాంగ్త్సాయ్ పేర్కొన్నారు. అయినా మస్క్‌కి చైనాలో పలు వ్యాపారాలు ఉన్నాయని అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతోంది తైవాన్. మరోవైపు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాత్రం తైవాన్ విషయంలో విదేశీ శక్తుల జోక్యాన్ని చైనా అంగీకరించదని దృఢంగా చెప్పడం విశేషం. (చదవండి: క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్.. ఉక్రెయిన్ ఘాటు కౌంటర్) -
చైనా నుంచి తైవాన్ను కాపాడుతాం
బీజింగ్: తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం పునరుద్ఘాటించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పష్టం చేశారు. చైనా ఆక్రమణ నుంచి అమెరికా బలగాలు, ప్రజలు తైవాన్ను రక్షిస్తారని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రానికి సంబంధించి తైవాన్ ప్రజలే సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. స్వతంత్రంగా ఉండాలంటూ వారిని మేం ప్రోత్సహించం’ అని అన్నారు. తైవాన్ అంశం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ విధానమని అనంతరం వైట్‌హౌస్ అనంతరం పేర్కొంది. ఈ విషయంలో తమ వైఖరి యథాతథమని తెలిపింది. అయితే, తైవాన్ విషయంలో సైనిక జోక్యంపై స్పందించలేదు. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవలి తైవాన్ సందర్శనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ ప్రాంతంపైకి క్షిపణులను ప్రయోగించడం, యుద్ధ విమానాలను మోహరించడం తదితర చర్యలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో బైడెన్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దాలుగా ఒకే చైనా విధానాన్ని అనుసరిస్తున్న అమెరికా తైవాన్‌తో అధికారికంగా సంబంధాలు కొనసాగించడం లేదు. బైడెన్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. -
తైవాన్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తూ.. మెలిక పెడుతున్న అమెరికా!
వాషింగ్టన్: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ ఫెలోసీ తైవాన్ పర్యటన ఎంత వివాదాస్పదమైంతో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా చైనా అమెరికాపై కస్సుమంటూ తైవాన్ సరిహద్దుల్లో సైన్యం మోహరింప చేసి యుద్ధాని రెడీ అంది. ఎంతగా అమెరికా నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వినకపోగా యుద్ధ కాంక్షతో రగిలిపోయింది. దీంతో అమెరికా కూడా తైవాన్‌పై దాడి చేస్తే ఊరుకోనని చైనాకి స్ట్రాంగ్కి వార్నింగ్ ఇచ్చింది. ఇలా ఇరు దేశాల మధ్య తైవాన్ విషయమై చిచ్చు మొదలైంది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ని మీడియా ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ లాగా ఆయుధాల సాయం కాకుండా యూఎస్ దళాలు తైవాన్ దేశాన్ని రక్షించడానికి ముందుకు వస్తాయా అని ప్రశ్నించిగా....దీనికి బైడెన్ చైనా దాడి చేసేందుకు రెడీ అయ్యితే కచ్చితంగా యూఎస్ దళాలు తైవాన్‌ని రక్షించేందుకు వస్తాయని నర్మగర్భంగా చెప్పారు. ఔను! తైవాన్ రక్షించుకోవమే కాకుండా తైవాన్ విషయంలో యూఎస్ తన నిబద్ధతకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. ఐతే తాము తైవాన్ స్వాతంత్య్రానికి మద్ధతు ఇవ్వలేదంటూ ఝలక్ ఇచ్చారు. అలాగే బీజింగ్‌కి సంబంధించిన చైనా వన్ పాలసీ విధానానికి వాషింగ్టన్ అధికారికంగా గుర్తించడమే కాకుండా దానికి కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఐతే తైవాన్ విషయంలో కాదని ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. (చదవండి: క్వీన్ ఎలిజబెత్2: ఆమెతో ఉన్నప్పుడూ మా అమ్మ గుర్తుకొచ్చింది.. బైడెన్ భావోద్వేగం) -
తైవాన్ భూకంపం: బొమ్మలాగా ఊగిపోయిన రైలు
తైపీ/టోక్యో: తైవాన్ను శక్తివంతమైన భూకంపనలు కుదిపేశాయి. శనివారం నుంచి సంభవిస్తున్న వరుస భూకంపాల నేపపథ్యంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం సాయంత్రం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఆదివారం మరోసారి 6.9 తీవ్రతతో భూమి కంపించింది. తీవ్రతకు హువాలియన్ నగరం యులి టౌన్‌లోని మూడంతస్తుల భవనం ఒకటి కూలిపోయింది. అందులో చిక్కుకుపోయిన నలుగురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో సిబ్బంది ఒకరు చనిపోయారు. శివారు ప్రాంతంలోని వంతెన కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులతోపాటు రెండు, మూడు వాహనాలు కిందపడిపోయినట్లు సమాచారం. కొండచరియలు విరిగిపడి యులిలోని ప్రముఖ పర్వత ప్రాంతంలో 400 మంది పర్యాటకులు చిక్కుబడిపోయారు. వేర్వేరు ఘటనల్లో 9 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఫులి టౌన్‌లోని డోంగ్లి స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పైకి శిథిలాలు పడిపోవడంతో ఒక రైలు పట్టాలు తప్పింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే శాఖ తెలిపింది. మరో చోట భూకంప తీవ్రతకు రైళ్లు బొమ్మలాగా ఊగిపోయిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ప్రాణాల కోసం బిక్కుబిక్కుమంటూ ఓ మూలన దాక్కున్నారు. ఇక షిసాంగ్ పట్టణంలో భూమికి 7 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉందని తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. ताज़ा रिपोर्ट के मुताबिक़ ताइवान में आए भूकंप की तीव्रता 7.2 है। देखिए स्टेशन पर खड़ी ट्रेन भूकंप के दौरान कैसे हिचकोले लेने लगी pic.twitter.com/KVGRs2Mgvr — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) September 18, 2022 తైవాన్‌లో 1999 సెప్టెంబర్‌లో సంభవించిన భూకంపం భారీది. సుమారు 2,400 మందిని బలిగొంది ఆ ప్రకృతి విలయం. ఇక జపాన్ దక్షిణ తీరాన్ని టైపూన్ వణికిస్తోంది. ప్రతికూల ప్రభావాలతో.. జపాన్, తైవాన్లకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అనంతరం వాటిని ఉపసంహరించుకుంది. సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది తరలింపు టైఫూన్ ‘నన్మదోల్’నేపథ్యంలో అధికార యంత్రాంగం కగోషిమాలోని 12 వేల మందిని ప్రత్యేక కేంద్రాలకు తరలించింది. పొరుగునే ఉన్న మియజకి ప్రిఫెక్చర్‌లోని 8 వేల మంది తమ నివాసాలను వీడారు. కుషిమా నగరంలో 15 మంది ప్రజలు తుపాను సంబంధిత ఘటనల్లో గాయపడినట్లు ప్రభుత్వ టీవీ తెలిపింది. ‘నన్మదోల్’మరింత తీవ్రమై గంటకు 162 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని జపాన్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం సాయంత్రానికల్లా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాటికి ‘నన్మదోల్’టోక్యోను తాకే అవకాశముందని తెలిపింది. ఇదీ చదవండి: పుతిన్ ‘తప్పు’టడుగులు ఏం చేస్తాయో? -
వారెవ్వా, సూపర్ ట్రాక్టర్.. డ్రైవర్ లేకపోయినా దూసుకుపోతుంది!
డ్రైవర్ లేకపోయినా ఫర్వాలేదు. ఎలాంటి పొలాన్నయినా ఇట్టే దున్నిపారేస్తుంది ఈ ట్రాక్టర్. డ్రైవర్‌లేని ట్యాక్సీలు ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వాడుకలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తైవాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఫాక్స్‌కాన్’ తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను రూపొందించింది. ‘మోనార్క్ ట్రాక్టర్’ సంస్థతో కలసి ‘ఫాక్స్‌కాన్’ పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ డ్రైవర్‌లెస్ ట్యాక్సీని అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసేలా తయారు చేసింది. దీనిని ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏకధాటిగా పదిగంటలు పనిచేస్తుంది. ఈ ట్రాక్టర్‌కు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 70 హార్స్పవర్ సామర్థ్యంతో ఎలాంటి పొలంలోనైనా ఇట్టే పనిచేయగలుగుతుంది. దీని పనితీరుపై ‘ఫాక్స్‌కాన్’ పరీక్షలు జరుపుతోంది. త్వరలోనే దీనిని మరింత మెరుగ్గా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్‌బ్లోయింగ్! -
తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు
తైపీ: అమెరికా నావికా దళానికి చెందిన రెండు యుద్ధనౌకలు ఆదివారం తైవాన్ జలసంధి గుండా ప్రయాణించాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వివాదాస్పద తైవాన్ పర్యటనతో అమెరికా, చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం తెలిసిందే. ఇందుకు ప్రతిగా తైవాన్ చుట్టూ చాలా రోజుల పాటు చైనా యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను మోహరించి, భారీ సైనిక విన్యాసాలకు తెర తీసింది. ఆ తర్వాత తైవాన్ జలసంధిలో యూఎస్ యుద్ధనౌకల సంచారం ఇదే తొలిసారి. తైవాన్, ఇతర ప్రాంతీయ భాగస్వాములను తృప్తి పరిచేందుకే అమెరికా ఈ దుందుడుకు చర్యకు దిగిందంటూ చైనా విమర్శలు చేసింది. చదవండి: (ఇల్లు లేక గ్యారేజీలో నిద్రించిన ప్రపంచ కోటీశ్వరుడి తల్లి) -
తైవాన్ జలసంధిలోకి అమెరికా యుద్ధ నౌకలు.. చైనా మండిపాటు
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించిన తర్వాత తైపీ, బీజింగ్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ వైపు చైనా హెచ్చరికలు చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గటం లేదు. పెలోసీ పర్యటన తర్వాత తొలిసారి.. తైవాన్ జలసంధి గుండా అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ప్రయాణించటం ప్రాధాన్యం సంతరించుకుంది. యూఎస్ఎస్ ఆంటియాటమ్, యూఎస్ఎస్ ఛాన్సలర్స్విల్లే నౌకలు సాధారణ ప్రక్రియలో భాగంగానే తైపీ జలసంధి గుండా వెళ్లినట్లు అమెరికాకు చెంది 7వ బెటాలియన్ తెలిపింది. ‘ఏ దేశ తీర ప్రాంత భూభాగానికి తాకకుండా జలసంధిలో తమ నౌకలు ప్రయాణించాయి. అమెరికా మిలిటరీ, నౌకాదళాలు.. అంతర్జాతీయ చట్టాలు అనుమతించే ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వర్తిస్తాయి. ఈ నౌకల ప్రయాణం ఇండో పసిఫిక్‌లో శాంతి, సామరస్యత కోసం అమెరికా నిబద్ధతను సూచిస్తుంది.’ అని పేర్కొంది జపాన్‌లోని వాషింగ్టన్ 7న బెటాలియన్. నిశితంగా పరిశీలిస్తున్నా: చైనా తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించటాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా మిలిటరీ వెల్లడించింది. తమ బలగాలు హైఅలర్ట్‌తో ఉన్నాయని, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా.. తగిన విధంగా స్పందిస్తామని పేర్కొంది. ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా గవర్నర్ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో? -
‘ఇక చాలు ఆపండి’.. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఆగస్టు 25-27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. ‘ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా-చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే.. తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. తైవాన్ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు. ఒకే చైనా పాలసీ, చైనా-అమెరికా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని అమెరికా రాజకీయ నేతలకు విన్నవిస్తున్నామని తెలిపారు. మరోవైపు.. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా వేచి చూస్తోందని ఆరోపించారు అమెరికా సెనేటర్ మార్షా బ్లాక్బర్న్. ఫిజీ పర్యటన ముగించుకుని గత గురువారం రాత్రి తైపీకి చేరుకున్నారు. పపువా న్యూ గనియా, ఫిజీ, తైవాన్లకు అమెరికా దౌత్యమద్దతును మరోస్థాయికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో తైవాన్ జాతీయ భద్రతా మండలి అధినేతతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం -
తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం
Taiwan's previous government reduced compulsory service from one year: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ పర్యటన ఎంతటి ఉద్రిక్తలకు దారితీసిందో తెలిసిందే. నాన్సీ పర్యటనతో చైనా యుద్ధానికి సై అంటూ వార్నింగ్‌లు ఇస్తూ.. తైవాన్ సరిహద్దు, జలసంధిలో పెద్ద ఎత్తున్న సైనిక కసరత్తులు, సైనిక విన్యాసాలు చేపట్టింది. ప్రపంచ దేశాలకు మరో యుద్ధం మొదలవుతుందేమో అన్నంత భయాన్ని కలిగించింది చైనా. సాక్షాత్తు అమెరికానే ఇది తమ వ్యక్తిగత సందర్శనని చెబుతున్నప్పటికీ చైనా శాంతించ లేదు. పైగా అక్కడ తైవాన్ సరిహద్దుల వెంబడి తమ సైనికులను మోహరింపచేసి.... అన్ని పనులు పూర్తి చేశాం, ఏ క్షణమైన యుద్ధానికి రెడీ అంటూ పెద్ద బాంబు పేల్చింది. దీంతో తైవాన్‌లో సర్వత్ర భయాలు, ఆందోళనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఎప్పటికైన చైనా తమ దేశంపై దండయాత్ర చేసి లాగేసుకుంటుందని భయపుడుతూనే ఉంది తైవాన్. కానీ ఇప్పుడూ చైనా తైవాన్ సరిహద్దుల్లో సాగిస్తున్న తాజా పరిణామాలతో ఆ భయాలు మరింత అధికమయ్యాయి. గతంలో తైవాన్ స్వచ్ఛంద దళాన్ని సృష్టించే లక్ష్యంతో ఒక ఏడాది నిర్బంధ సేవను అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ నిర్బంధ సేవను నాలుగు నెలలకు తగ్గించింది. వాస్తవానికి ఈ నాలుగు నెలల సమయం నిర్బంధ సైనిక శిక్షణకు సరిపోదు. ఈ మేరకు ఒక హెన్నీ చెంగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంజెంట్ మాట్లాడుతూ..తాను నాలుగు నెలల సైనిక శిక్షణ పూర్తి చేశాను కానీ ఎక్కువ కాలం రాత పనిలోనే గడిపినట్లు చెబుతున్నాడు. తమ పని యుద్ధం చేయడం కాబట్టి తుపాకి పట్టుకుని కాల్చడం నేర్పిస్తే సరిపోతుంది కానీ ఆ శిక్షణ ఇవ్వలేదని వాపోయాడు. అదీగాక ప్రస్తుతం తైవాన్‌లో సైనిక బలగం కూడా తక్కువగానే ఉంది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు యంత్రాంగం త్సాయ్ ఇంగ్-వెన్ సైనిక సేవనను పునరుద్ధరించాలా లేదా అనేదానిపై తీవ్ర సందిగ్ధంలో ఉంది. తైవాన్ నేషనల్ డిఫెన్స్ ప్రకారం సైనిక శిక్షణను పెంచడం తోపాటు జెట్ విమానాలు, యాంటీ షిప్ క్షిపణులు పెద్ద మొత్తంలో ఇప్పటికే తైవాన్ కొనుగోలు చేసింది కానీ అవి ఏ మాత్రం సరిపోవని తేల్చి చెప్పింది. అదీగాక ఉక్రెయన్లా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తైవాన్ ప్రజలు సిద్ధంగా లేరని తైపీ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చెబుతున్నారు. అంతేకాదు రైఫిల్ పట్టుకోవడమే కాదు, శిక్షణ ద్వారా సముహంగా యుద్ధ పరిస్థితులను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి అప్పుడే వారికి భవిష్యత్తులో ప్రతిఘటించాలనే ఆశ ఉంటుందన్నారు. ఏది ఏదీమైన చైనా తైవాన్‌ని తీవ్ర భయాందోళనలు గురిచేసి సంకటస్థితిలోకి నెట్టేసింది, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలయడం లేదని తైవాన్ ఆర్మీ ఆవేదనగా పేర్కొంది. (చదవండి: -
తైవాన్‌లో మరో కీలక నేత పర్యటన.. చైనాను అమెరికా రెచ్చగొడుతోందా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉంది చైనా. పెలోసీ పర్యటన తర్వాత తైవాన్ను యుద్ధ విమానాలతో చుట్టుముట్టింది. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే అమెరికా చట్టసభ్యుల బృందం తైవాన్‌లో పర్యటించి మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. చైనా సైనిక విన్యాసాలు చేపడుతూ తైవాన్ను బయపడుతున్న ఈ తరుణంలోనే అమెరికా గవర్నర్ తైపీలో పర్యటించారు. తైపీతో వాణిజ్య చర్చలు చేపడతామని అమెరికా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆయన పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక అభివృద్ధి ట్రిప్‌లో భాగంగా ఆదివారం తైవాన్ చేరుకున్నారు అమెరికాలోని ఇండియాన రాష్ట్ర గవర్నర్ ఎరిక్ హోల్కోంబ్. తైవాన్ అధ్యక్షుడిని సోమవారం కలిశారు. కొద్ది రోజుల క్రితం స్పీకన్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటాన్ని వ్యతిరేకిస్తూ మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది చైనా. దాంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తైవాన్‌కు మద్దతుగా దౌత్యపరమైన చర్యలు చేపడితే ఊరుకునేది లేదని, తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా గవర్నర్ హోల్కోంబ్తో భేటీ అయ్యారు తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్. బీజింగ్ మిలిటరీ డ్రిల్స్‌పై మాట్లాడారు. తైవాన్‌కు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం మనం ప్రపంచ నిరంకుశత్వ నిరంతర విస్తరణవాదాన్ని ఎదుర్కొంటున్నాం. తైవాన్ జలసంధి ద్వారా చైనా నుంచి సైనిక బెదిరింపులను తైవాన్ ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రజాస్వామ్య మిత్రపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి అన్ని విధాల సహకారం అందించాలి.’ అని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ పేర్కొన్నారు. తైవాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు అమెరికా గవర్నర్ హోల్కోంబ్. మరోవైపు.. బుధవారం దక్షిణ కొరియాకు వెళ్లేలోపు సెమీకండక్టర్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో హోల్కోంబ్ భేటీ అవుతారని అధికారవర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్! -
తైవాన్ తెగువ.. చైనా ఏం చేస్తదో?
తైపీ: తైవాన్‌లో అగ్రరాజ్యపు కీలక నేతల పర్యటన.. ‘తైవాన్ ఏకాకి కాదంటూ..’ వరుస మద్దతు ప్రకటనల నేపథ్యంలో చైనా ఉడికిపోతోంది. తమదిగా చెప్తున్న భూభాగంలో అడుగుమోపడమే కాకుండా.. తమను కవ్విస్తే ఎలాంటి చర్యలకైనా ఉపేక్షించబోమంటూ ప్రకటనలు ఇస్తూ.. తైవాన్ సరిహద్దులో సైనిక డ్రిల్స్ నిర్వహిస్తూ వస్తోంది. అయితే.. ఎప్పుడూ లేనిది తైవాన్ కొండంత బలం ప్రదర్శించింది. చైనాకు పోటీగా ఆయుధ సంపత్తి ప్రదర్శనకు దిగింది. తమ వద్ద ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్ ఎఫ్-16వీ తో సైనిక విన్యాసాలు చేయించింది. ఈ యుద్ధవిమానాలు కూడా అమెరికా సహకారంతోనే రూపొందించినవి కావడం విశేషం. మొత్తం ఆరు F-16v యుద్ధవిమానాలు, అందులో రెండు మిస్సైల్స్‌ను ప్రదర్శిస్తూ తైవాన్ తూర్పు తీర ప్రాంతమైన హువాలెయిన్ కైంటీ నుంచి గగనతలంలో చక్కర్లు కొట్టాయి. చైనా కమ్యూనిస్ట్ దళాల సైనిక విన్యాసాల నుంచి ముప్పు నేపథ్యంలో.. జాతీయ భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రదర్శన అంటూ తైవాన్ బహిరంగంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే గతంలోనూ ఇలా ప్రదర్శనలకు దిగినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ధైర్యంగా నిర్వహించడాన్ని సాహసమనే చెప్పాలి. తైవాన్.. చైనా ఆక్రమణ ముప్పుతో నిత్యం భయం భయంగా గడుపుతోంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా పాలించబడుతున్న ఈ ద్వీపం తమలో భాగమని, ఏదో ఒకరోజు.. అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని చైనా గతంలోనే ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు చైనా వ్యతిరేక దేశాలు తైవాన్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇక 90వ దశకం నాటి ఎఫ్-16వీ యుద్ధవిమానాల స్థానంలో.. అత్యాధునిక వెర్షన్లను తైవాన్‌కు కిందటి ఏడాది నవంబర్‌లో అందించింది అగ్రరాజ్యం. చైనా మీద తీవ్ర వ్యతిరేకతతో ట్రంప్ హయాంలో తైవాన్‌కు అన్నివిధాల మద్దతు అందిస్తున్న అమెరికా. ఇప్పుడు బైడెన్ హయాంలోనూ ఆ నైతిక మద్దతును కొనసాగిస్తోంది. ఇదీ చదవండి: కొడుకుతో రెస్టారెంట్‌కు వెళ్లిన కేంద్ర మంత్రి, ఆపై.. -
చైనా కక్ష పూరిత చర్య.. ఆంక్షల మోత!
చైనా: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన చైనాకి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఆఖరికి అమెరికా దిగొచ్చి కేవలం తమ డెమెక్రెటిక్ కాంగ్రెస్ సభ్యుల పర్యటన అని చైనాని బుజ్జగింపు ప్రయత్నం చేసింది. అయినా ససేమిరా అంటూ తైవాన్‌పై పదే పదే ద్వేషపూరిత చర్యలకు దిగుతోంది చైనా. అదీగాక ఆది నుంచి ప్రజాస్వామ్యయుతంగా స్వయంపాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారాన్ని తిరస్కరిస్తూ వస్తోంది చైనా. ప్రస్తుతం ఈ యూఎస్ అత్యన్నతాధికారి నాన్సీ పర్యటనతో తీవ్ర ఆగ్రహోజ్వాలతో రగలిపోతుంది చైనా. అందులో భాగంగా చైనా తాజగా ఏడుగురు తైవాన్ అధికారులపై ఆంక్షలు విధించింది. వారంతా తైవాన్ స్వాతంత్య్రానికి మద్ధతిచ్చినందుకే చైనా ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు చైనా అంక్షలు విధించిన తైవాన్ వ్యవహారాల కార్యాలయం అధికారుల్లో వాషింగ్టన్‌లోని తైవాన్ రాయబారి హ్సియావో బిఖిమ్ , తైవాన్ జాతీయ భద్రతా మండలి సెక్రటరీ జనరల్ వెల్లింగ్టన్ కూ ఉన్నారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. అంతేగాక తైవాన్ అధికార రాజకీయ పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పై కూడా ఆంక్షలు విధించింది. దీంతో ఆయా అధికారులంతా హాంకాంగ్, మకావులను పర్యటించలేరని తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు ఆయా సంస్థల పెట్టుబడు దారులు కూడా చైనాలో లాభం పొందేందుకు కూడా అనుమతించదని స్పష్టం చేశారు. ఈ ఏడుగురు అధికారుల తోపాటు అదనంగా మరో ముగ్గురు అధికారులు తైవాన్ ప్రీమియర్ సుత్సెంగ్ చాంగ్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వు, పార్లమెంట్ స్పీకర్ సికున్ల పై కూడా ఆంక్షలు విధించినట్లు తైవాన్ పేర్కొంది. (చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం) -
అమెరికా బృందం టూర్‌పై ఆగ్రహం.. తైవాన్ను చుట్టుముట్టిన చైనా!
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనతో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది చైనా. తైవాన్‌పై యుద్ధం చేసినంత పని చేసింది. ఆ ఆగ్రహ జ్వాలలకు మరింత ఆజ్యం పోస్తోంది అమెరికా. మరోమారు అమెరికాకు చెందిన చట్టసభ్యులు కొందరు తైవాన్‌లో పర్యటించారు. తైపీ నేతలతో సమావేశమైన క్రమంలో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ జలసంధివ్యాప్తంగా తాజాగా మిలిటరీ డ్రిల్స్ చేపట్టినట్లు ప్రకటించింది. యుద్ధ నౌకలు, మిసైల్స్, జెట్స్ వంటి వాటిని తైవాన్ సమీప జలాల్లోకి చైనా పంపించిన తర్వాత ఈ అప్రకటిత పర్యటన చేపట్టారు అమెరికా చట్టసభ్యులు. దీంతో డ్రాగన్‌కు మరింత కోపం తెప్పించినట్లయింది. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు చట్ట సభ్యుల బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరుకుంది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా-తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, వాతావరణ మార్పులు వంటి తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపింది. ఈ బృందం ఆకస్మిక పర్యటనతో బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించినట్లయింది. యుద్ధాన్ని ఎదుర్కునేందుకు పెట్రోలింగ్, యుద్ధ సన్నాహక ప్రదర్శనలు చేపట్టినట్లు సోమవారం ప్రకటించింది డ్రాగన్. ‘ తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని అణగదొక్కేందుకు నిరంతరం రాజకీయ కుట్రలు చేస్తున్న అమెరికా, తైవాన్లకు వ్యతిరేకంగా చేపడుతున్న మిలిటరీ డ్రిల్స్ ఇవి. జాతీయ సమగ్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు చైనా మిలిటరీ తూర్పు థియేటర్ కమాండ్ ప్రతినిధి షి యి. మరోవైపు.. పెలోసీ పర్యటనను చాకుగా చూపించి తమ ప్రాంతాన్ని ఆక్రమించుకునే కుట్రలు చేస్తోందని చైనాపై ఆరోపణలు చేసింది తైవాన్ ప్రభుత్వం. ఇదీ చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం -
తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం
తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనతో రేగిన ఉద్రిక్తతలు చల్లారకమునుపే మరికొందరు అమెరికా ప్రజాప్రతినిధులు ఆదివారం అక్కడ పర్యటించారు. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరింది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా–తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపనుంది. ఈ బృందం ఈనెల 2వ తేదీన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ సందర్శనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 12 రోజులుగా తైవాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలతో విన్యాసాలు జరుపుతోంది. -
భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
Taiwan said it will continue to enhance its self-defence capabilities: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ఎంత పెద్ద పెను వివాదంగా మారిందో తెలిసిందే. ఒక పక్క తైవాన్‌ని అడ్డుపెట్టుకుని అమెరికా తమపై కుట్ర చేస్తుందంటూ డ్రాగన్ కంట్రీ నిప్పులు కక్కుతోంది. అమెరికా సైతం తాము అనుకున్నదే చేస్తామని తగ్గకపోవడంతో భవిష్యత్తులో జరగబోయే ఏ పరిణామానికైన అగ్రరాజ్యమే కారణమంటూ కయ్యానికి కాలుదువ్వింది చైనా. ఈ మేరకు తైవాన్ జలసంధిలో మిలటరీ డ్రిల్లు చేపట్టింది. తైవాన్ భయపట్టించేలా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున్న సైనిక విన్యాసాలు ప్రారంభించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో జపాన్, భారత్‌తో సహ ఇతర దేశాలు తైవాన్ జలసంధి అంతటా అంతర్జాతీయ భద్రతను కాపాడేలా సమన్వయంగా వ్యవహరించాలని చెబుతూ.. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేలే పిలుపునిచ్చాయి. ఈ మేరకు భారత్ ఇతర దేశాల మాదిరిగా ఆందోళన వ్యక్తపరుస్తూ.. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గి ఈ ప్రాంతంలో శాంతి, సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలను నివారించాలని కోరుతున్నాము" అని విదేశీ వ్యవహారాలు మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చ పిలుపునిచ్చారు. దీంతో తైవాన్, చైనా విషయంలో భారత్‌తో సహా ఇతర దేశాలు తమకు మద్ధతు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో స్నేహం చేయడానికి, సంబంధాలు కొనసాగించడానికి తాము అర్హులమని తైవాన్ పేర్కొంది. ఈ క్రమంలో తైవాన్ అంతర్జాతీయ భద్రతను కాపాడేలా భారత్‌తో సహా ఇతర దేశాలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తూనే తమ ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించుకుంటామని వెల్లడించింది. -
ప్రశంసించడానికే వెళ్లాం! చైనాను బుజ్జగిస్తున్న అమెరికా!
వాషింగ్టన్: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా తైవాన్ చుట్టూతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గస్తీ కాయడమే కాకుండా సైనిక కసరత్తులు ప్రారంభించింది కూడా. అంతేగాక తైవాన్‌ని భయభ్రాంతులకు గురిచేసేలా సైనిక విన్యాసాలను కొనసాగించింది. పెలోసీ పర్యటన పూర్తయినప్పటికీ తన విన్యాసాలను కొనసాగించడమే కాకుండా తైవాన్ చుట్టూత తమ ఆర్మీ కార్యకలాపాలు పూర్తి అయ్యాయని, యుద్ధం చేయడమే తరువాయి అన్నట్లు ప్రకటించింది. పైగా ఏ క్షణమైన యుద్ధం చేసేందుకు రెడీ అంటూ.. తైవాన్ సరిహద్దులో తన ఆర్మీ డ్రిల్ కొనసాగుతుందని కరాఖండిగా చెప్పేసింది. దీంతో నాన్సీ పెలోసి ఈ విషయమై స్పందించి...కేవలం తైవాన్‌ని ప్రశంసించడానికే వెళ్లాం. చైనా గురించి ప్రస్తావించడానికి వెళ్లలేదు. చైనా తైవాన్‌ని ఒంటరి చేయదు అంటూ తమ స్నేహ హస్తాన్ని అందించడానికి వెళ్లాం. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించేలా, చైనాకు ఆయా ప్రాంతాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించేలా సాగిన పర్యటనే తప్ప మరోకటి కాదని చెప్పారు. పెలోసి ప్రతినిధి బృందం తైవాన్‌తో పాటు, సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లను కూడా సందర్శించిందన్న విషయాన్ని చైనాకు గుర్తు చేశారు. చైనా అధ్యక్షుడు ఏం చెప్పినప్పటికీ అమెరికా తన నిబద్ధతకు కట్టుబడి తన మిత్ర దేశాలకు అండగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు తైవాన్‌ని ఒత్తిడికి గురిచేసేలా సైనిక శిక్షణ కొనసాగించడానికి అమెరికా అనుమతించదని ఫెలోసీ నొక్కి చెప్పారు. (చదవండి: 'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!) -
'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన విషయమై చైనా అగ్గి మీద గుగ్గిలంలా మారిన సంగతి తెలిసిందే. దీంతో తైవాన్ చుట్టూత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గస్తీ కాసింది. తైవాన్ జలాల్లో చైనా దళాలు మోహరించడమే కాకుండా సైనిక విన్యాసలు చైసి తైవాన్‌ని భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ విన్యాసాలు కొద్ది రోజుల్లో ఆగిపోతాయని అంతా అనుకున్న సమయంలో తాజగా చైనా మరో బాంబు పేల్చింది. లైవ్ ఆర్మీ ఫైర్ డ్రిల్ పేరిట భూ వాయు గగన మార్గాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించి ఇప్పుడేమో అన్ని పనులు పూర్తి చేశామని ఇక ఏ సమయంలోనైనా యుద్ధం చేయడానికి రెడీ అని తెగేసి చెప్పేస్తోంది. దాదాపు వారం రోజుల సైనిక కసరత్తుల తదనంతరం తైవాన్ చుట్టుతా అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేశామని తన అధికారిక సోషల్ మీడియా వీబో అకౌంట్లో పేర్కొంది. ఈ మేరకు తమ దళాలు తైవాన్ జలసంధిలో ఎప్పటికప్పడూ పరిస్థితులను నిశితంగా గమనించడమే కాకుండా క్రమ తప్పకుండా పెట్రోలింగ్‌ని నిర్వహిస్తామని చెప్పింది. అలాగే ఏ సయమంలోనేనా పోరాడేందుకు సైనిక శిక్షణను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఒక పక్క యూఎస్ ఎంతలా హెచ్చరించినా.. తన దూకుడు తగ్గించుకోనని తెగేసి చెప్పడమే కాకుండా తైవాన్ చైనాలో భాగమని పదే పదే నొక్కి చెబుతుండటం గమనార్హం. (చదవండి: అమెరికాని ఆపడం అసాధ్యం...చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్) -
చల్లారని తైవాన్–చైనా ఉద్రిక్తత
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్ వైపు గుడ్లురిమి చూస్తున్న చైనా వారమైనా తన పంథాను మార్చుకోలేదు. తైవాన్ చుట్టూతా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు కొనసాగిస్తూ ద్వీప ఆక్రమణ భయాలను పెంచేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారమే ముగియాల్సిన సైనిక యుద్ధ క్రీడలను ఇంకా కొనసాగిస్తోంది. తైవాన్ జలసంధి వెంట లైవ్ ఫైర్ డ్రిల్స్ పేరిట చైనా నావిక, వాయు సేన దళాలు సంయుక్త విన్యాసాలు కొనసాగిస్తున్నాయని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. గత ఐదు రోజులుగా వేర్వేరు సామర్థ్యాలున్న క్షిపణులను చైనా ప్రయోగించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లను తీరం వెంట, గగనతలంలో చక్కర్లు కొట్టించింది. తైవాన్ స్పందనను చైనా విశ్లేషిస్తోందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
చైనా అరాచకం.. తైవాన్ రక్షణ శాఖ అధికారి ఖతం!
తైపీ: ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్ లీ–సింగ్ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది. ‘నేషనల్ చుంగ్–షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ డిప్యూటీ హెడ్ హోదాలో ఔ యాంగ్ వివిధ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్ ట్రిప్పై కొనసాగుతూ అనుమానాస్పదంగా మరణించారు. ఇదిలా ఉండగా, చైనా దాడుల్లోనే ఔ యాంగ్ ప్రాణాలు కోల్పోయాడని తైవాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక -
తైవాన్ ‘ఒకే చైనా’లో అంతర్భాగమే!
ఉద్రిక్తతల నడుమ తైవాన్‌కు యూఎస్ అసెంబ్లీ ప్రతినిధులసభ స్పీకర్ నాన్సీ పెలోసీని పంపించటంతో చైనా–తైవాన్‌ల మధ్య భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశాలను తెరపైకి అమెరికా తీసుకొ చ్చింది. ఇక యుద్ధ బూచితో ఆసియా పసిఫిక్ దేశాలకు ‘నాటో’ సభ్యత్వాన్ని ప్రోత్స హిస్తూ, మ్యాడ్రిడ్ నిర్ణయాల ప్రకారం నాటోను ఈ ప్రాంతానికి విస్తరించే ప్రయత్నంలో అమెరికా ఉంది. ఇప్పటికే మన భారతదేశానికి ‘నాటో ప్లస్’ సభ్యత్వం ఇవ్వటానికి 6వ దేశంగా అర్హత కోసం యూఎస్ అసెంబ్లీలో నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డిఏఏ)కు సవరణలు చేశారు. ఈ తరహా అర్హతలు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇజ్రాయిల్, దక్షిణ కొరియాలు కలిగి ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందితే నాటో దేశాలతో సఖ్యతగా మెలిగే అవకాశాలను మనదేశానికి కల్పించి, భవిష్యత్తులో నాటో చేసే యుద్ధాలకు మనల్ని బలి పశువులను చేసే అవకాశం ఉంది. పెలోసీ పర్యటనను మానుకోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హితవు పలికినప్పటికీ... యూఎస్ మిలటరీ, ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు పెడచెవినపెట్టి, పర్యటనను ప్రణాళిక ప్రకారం సాగించారు. నాన్సీ పెలోసీని తైవాన్‌కు పంపాలను కోవటం నిప్పుతో చెలగాటం వంటిదనీ, ఆ నిప్పులో ఆహుతిగాక తప్పదనీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీవ్ర స్వరంతో టెలిఫోన్లో బైడెన్‌ను హెచ్చరించాడు. ఈ హెచ్చరికతో తాత్కాలికంగా పెలోసీ పర్యటన దేశాల లిస్టులో కేవలం సింగపూర్, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల పేర్లు మాత్రమే ప్రకటించారు. తైవాన్ చైనాలో అంతర్భాగం గనుక మమ్మల్ని రెచ్చగొట్టటానికి ప్రయ త్నిస్తే తైవాన్‌లో అడుగుపెట్టే ముందే పెలోసీ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేస్తామనీ, లేకుంటే చైనా ఆర్మీ విమానాలు తైవాన్‌లో దిగుతాయనీ మిలిటరీ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. పెలోసీకి రక్షణగా అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘రొనాల్ట్ రీగన్’, దాని అనుబంధ గ్రూపు యుద్ధ విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, గైడెడ్ మిస్సెల్ డిస్ట్రాయర్, క్రూయిజ్‌తో సహా రెండు రోజుల క్రితమే సింగపూర్ నుండి తైవాన్ వైపు దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి వచ్చాయి. చైనా నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసి తైవాన్ జలసంధిలో మిలిటరీ విన్యాసాలు చేస్తున్న ఉత్కంఠ పరిణామాల మధ్య పెలోసీ ఆగస్టు 2 రాత్రి తైవాన్ విమానా శ్రయంలో దిగారు. ఇందుకు నిరసనగా ఆ తర్వాత తైవాన్ చుట్టుప్రక్కల ఉన్న సముద్రంలోని లక్ష్యాలపై క్షిపణుల వర్షం కురిపించి, తైవాన్ వాసులను చైనా భయకంపితులను చేసింది. ఈ దృశ్యాలను తైవాన్ మీడియా ప్రసారం చేసింది. అదేమంటే దీనికి పూర్తి బాధ్యత అమెరికాదేనని చైనా ఆరోపిస్తోంది. గతంలోకి వెళితే.. షియాంగ్ కై షేక్ పాలనలోని చైనాపై 1949లో మావో నాయకత్వాన విప్లవం విజయం సాధించగా, అమెరికా అండతో తైవాన్‌కు పారిపోయిన షియాంగ్ అక్కడ నుండి చైనాను పాలించడానికి ప్రయత్నించాడు. 1971 వరకు తైవాన్ కేంద్రమయిన ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’ను మాత్రమే ఐక్య రాజ్యసమితి గుర్తించింది. 1971 నుండి ‘ఒకే చైనా’ దేశంగా మెయిన్ ల్యాండ్ చైనాను తైవాన్‌తో సహా ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ (పీఆర్సీ)గా ఐరాస గుర్తించింది. ఈ ఒకే చైనాతో 1979 నుండి జిమ్మీ కార్టర్ ప్రభుత్వం దౌత్య సంబంధాలను ఏర్పర్చు కొంది. పీఆర్సీ అసలైన చైనా దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటంతో, ఎప్పటి వలెనే తైవాన్ చైనాలో అంతర్భాగంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కనీసం డజను దేశాలు కూడా తైవాన్‌తో దౌత్య సంబంధాలను ఏర్పర్చుకోలేదు. మనదేశం కూడా దౌత్య సంబంధాలు ఏర్పర్చుకోలేదు. చైనా, తైవాన్‌ల మధ్య తరచూ అమెరికా కలహాలు సృష్టిస్తూ ఆయుధాల్ని అమ్ముతూ, మూడవ సంస్థలు, వ్యక్తులు, కంపెనీల ద్వారా వర్తక వాణిజ్యాలు చేస్తూ పరోక్ష సంబంధాలతో చైనాను కవ్విస్తూనే ఉంది. స్వదేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికాలో బైడెన్ ప్రభుత్వాన్ని గద్దె దింప టానికీ, రానున్న మధ్యంతర ఎన్నికల్లో రిబ్లికన్లను నెగ్గించటానికీ ఉక్రెయిన్, తైవాన్ యుద్ధాలను ప్రోత్సహించటానికై విపక్షాలు, మిలటరీ పరిశ్రమలు తీవ్రంగా కృషి సల్పుతున్నాయి. యుద్ధ వాతావరణాన్ని తక్షణమే ఆపి, చైనాలో అంతర్భాగంగా తైవాన్ను గుర్తించి, చైనా–తైవాన్‌ల అంతర్గత వ్యవహారంగా ఒకే చైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఇప్పటికే అమెరికా ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందని అఫ్గానిస్తాన్, మధ్యప్రాచ్య యుద్ధాల చరిత్ర స్పష్టం చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఆ సంగతిని గట్టిగా ధ్రువీకరించింది. రానున్న కాలం బహుళ ధ్రువ ప్రపంచానిదే. చైనా–తైవాన్, చైనా–హాంగ్‌కాంగ్, చైనా–మకావ్ వంటి సమస్యలు చైనా ఆంతరంగిక విషయాలుగా పరిగణించి, విదేశీ శక్తుల జోక్యం లేకపోవటం శ్రేయస్కరం. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త హెచ్ఓడీ, ఫారెన్ లాంగ్వేజెస్, కేఎల్ యూనివర్సిటీ ‘ మొబైల్: 98494 91969 -
కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా!
బీజింగ్: జీ7 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటనలో కెనడా పాల్గొనడం విషయమైన చైనా మండిపడుతోంది. ఈ మేరకు ఈ విషయమై కెనడా దౌత్యవేత్త జిమ్ నికెల్ని పిలిపించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఐతే తైవాన్ జలసంధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాల్సిందిగా జీ 7 దేశాలు పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీజింగ్ తాజాగా కెనడా పై ఈ విధమైన దౌత్యపరమైన బెదిరింపులకు దిగింది. ఈ మేరకు చైనా డిప్యూటి విదేశాంగ మంత్రి క్సీ ఫెంగ్ కెనడా దౌత్యవేత్త నికెల్ని పిలిపించి...తైవాన్ విషయమై కెనడా తక్షణమైన తన తప్పులను సరిదిద్దుకోవాలని హెచ్చరించింది. అలా కాకుంటే జరబోయే పరిణామాలను భరించాల్సిం వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్) -
China-Taiwan: తైవాన్ జలసంధిపై చైనా బాంబుల వర్షం.. వీడియో విడుదల
బీజింగ్: తైవాన్ జలసంధిపై క్షిపణులతో విరుచుకుపడింది చైనా. ఈ చర్య అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టించింది. చైనా సైన్యంపై తైవాన్ సమీపంలో బాంబులు కురిపించిన వీడియోనూ ఆ దేశ అధికారిక మీడియా సీసీటీవీ విడుదల చేసింది. ఈ దృశ్యాలు ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేశాయి. డాంగ్‌ఫెండ్ క్షిపణులను కురిపించి తమ సేనలు అనుకున్న ఫలితాలు సాధించాయని చైనా సైన్యం ప్రకటించింది. సైనిక క్రీడల్లో భాగంగా చైనా తన అధునాతన యుద్ధవిమాన వాహక నౌక, అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గామిలను తైవాన్ జలసంధిలోకి ప్రవేశపెట్టింది. తైవాన్‌లోని జపాన్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ సమీపంలోనూ క్షిపణులు పడ్డాయి. ‘మేం ఏం చెప్తామో అదే చేస్తాం’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి టాన్ కెఫీ వ్యాఖ్యానించారు. క్షిపణి పరీక్షలంటూ చైనా రాకెట్లను ప్రయోగించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. విమాన సర్వీసులు రద్దు చైనా సైన్యం క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో అప్రమత్తమై తైవాన్ తన పౌర విమానాల రాకపోకలను వెనువెంటనే ఆపేసింది. రాజధాని తైపేలోని ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 50 విమాన సర్వీస్‌లు రద్దయ్యాయి. ప్రపంచవిపణిలో అత్యంత కీలకమైన ప్రాసెస్ చిప్స్‌ల సముద్రమార్గ రవాణా కొనసాగుతోందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న అదే ప్రాంతానికి సమీపంలోకి అమెరికా పీ–8ఏ పోసిడాన్ గస్తీ విమానం, ఎంహెచ్–60ఆర్ జలాంతర్గామి విధ్వంసక హెలికాప్టర్లు వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. తైవాన్ సైతం మిరాజ్, ఎఫ్–5 యుద్ధ విమానాలతో చైనా దళాలున్న చోటుపై పర్యవేక్షణకు వెళ్లి వచ్చాయని స్థానిక మీడియా వెల్లడించింది. చైనా చర్యను చట్టవిరుద్ధ, బాధ్యతారాహిత్య చర్యగా తైవాన్ అభివర్ణించింది. తైవాన్‌పై నోరు మెదపని పెలోసీ తైవాన్ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసిన పెలోసీ.. దక్షిణ కొరియా పర్యటనలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ద.కొరియా పార్లమెంట్ స్పీకర్ కిమ్ జిన్ ప్యోను పెలోసీ కలిసినా తైవాన్ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు. ఉ.కొరియా ‘అణు’ ప్రమాదంపై చర్చించామని జిన్ చెప్పారు. చదవండి: పంజా విసిరిన చైనా.. అదే జరిగితే ప్రపంచానికే ముప్పు! -
ఉక్రెయిన్ బాటలో తైవాన్ ?
-
పంజా విసిరిన చైనా.. అదే జరిగితే ప్రపంచానికే ముప్పు!
కోవిడ్ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రభావం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. పులి మీద పుట్రలా తైవాన్ చుట్టూ చైనా చేస్తున్న సైనిక విన్యాసాలు, క్షిపణి దాడులు ఆందోళన పెంచుతున్నాయి. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలిస్తే ప్రపంచ దేశాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశాలున్నాయి. అమెరికా కాంగ్రెస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో జరిపిన పర్యటన మరోసారి ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆమె పర్యటనకు ప్రతీకార చర్యగా తైవాన్ను అష్టదిగ్బంధం చేసి చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్ జలాల్లోనూ, గగనతలంలోనూ క్షిపణి దాడులకు దిగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దీని వల్ల ప్రపంచంలో బిజీగా ఉండే షిప్పింగ్ జోన్లో సరకు రవాణాకు గండిపడే అవకాశాలున్నాయి. - తూర్పు ఆసియా వాణిజ్యంలో తైవాన్ జలసంధి రవాణా పరంగా అత్యంత కీలకమైనది. తూర్పు ఆసియా దేశాల్లోని కర్మాగారాల్లో తయారయ్యే ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రపంచ మార్కెట్లకు చేరాలంటే ఈ జలసంధే మార్గం. - సహజ వాయువు సరఫరా కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. - ప్రపంచవ్యాప్తంగా రవాణా నౌకల్లో సగం ఈ ఏడాది ఏడు నెలల్లో తైవాన్ జలసంధి ద్వారా తిరిగాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. - చైనా దుందుడుకు చర్యలతో ఈ జలసంధిలో రవాణాకు అవకాశం లేకపోతే నౌకల్ని దారి మళ్లించినా ప్రపంచ దేశాల్లో సరఫరాకు ఆటంకాలు ఏర్పడతాయని, కోవిడ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇంకా కోలుకోని దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సింగపూర్‌కు చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన ఎస్. రాజరత్నం అభిప్రాయపడ్డారు. - తాత్కాలికంగా ఈ జలసంధిలో రవాణా నిలిచిపోతే జపాన్, దక్షిణ కొరియాపై అత్యధిక ప్రభావం పడుతుంది. - గురువారం నాటి విన్యాసాలతో నౌకల రవాణా సూచీ 4.6% నుంచి 1.05%కి పడిపోయింది - చైనా మిలటరీ విన్యాసాలతో ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో నౌకలు ప్రయాణించవద్దని ఇప్పటికే తైవాన్ నౌకాదళం హెచ్చరికలు జారీ చేసింది. - తైవాన్ జలసంధి నుంచి ఫిలిప్పీన్స్ సముద్రం వైపు నౌకలను మళ్లించాలన్నా భారీగా కురుస్తున్న వర్షాలతో ఆటంకాలున్నాయి. - చైనా సైనిక విన్యాసాల ప్రభావం గగనతల రాకపోకలపైనా పడింది. 400కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. చైనా ఎంతవరకు వెళుతుంది ? అమెరికా కాంగ్రెస్ హౌస్ స్పీకర్ పెలోసి తైవాన్ పర్యటనపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న డ్రాగన్ దేశం తన బలాన్ని చూపించడానికి ఎంత వరకు ముందుకెళుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో 1990, 1996లో సంక్షోభాల సమయంలో కూడా తైవాన్ జలాల్లో చైనా క్షిపణులతో దాడులు దిగింది. కొన్ని నెలల పాటు సైనిక విన్యాసాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు రాజేసింది. అయితే ప్రపంచీకరణ పరిస్థితులతో ఇప్పుడు సరకు రవాణాకు ఏ చిన్న అవాంతరం వచ్చినా చైనా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా అగ్రరాజ్యం అమెరికాతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితుల్లేవని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఏ న్యూ అమెరికన్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధి థామస్ షుగార్ట్ వ్యాఖ్యానించారు. - నేషనల్ డెస్క్, సాక్షి ఇది కూడా చదవండి: తైవాన్ను చుట్టుముట్టిన చైనా సైన్యం.. మిసైల్స్‌తో హడల్! -
తైవాన్ ద్వీపాన్ని దిగ్బంధించిన చైనా సైన్యం
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనతో మండిపడుతోంది చైనా. తైవాన్‌పై ఇప్పటికే ప్రతీకార చర్యలు చేపట్టింది. తైపీ దిగుమతులపై ఆంక్షలు విధించిన డ్రాగన్.. ఆ దేశానికి అతి సమీపంలో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. తైపీ సమీపంలోని సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. మిసైల్స్‌కు సంబంధించిన దృశ్యాలు చైనా అధికారిక మీడియా సీసీటీవీలో ప్రసారమయ్యాయి. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా తైవాన్ సమీపంలోని జలాల్లోకి మిసైల్స్ ప్రయోగించినట్లు పేర్కొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాంగ్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించినట్లు బీజీంగ్ మిలిటరీ సైతం ప్రకటించింది. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ డ్రిల్‌గా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదీ చదవండి: చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర -
చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర
తైపీ: చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (82) తైవాన్ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తైవాన్ తన భూభాగమేనని, దానితో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోరాదని చెబుతున్న చైనా ఈ పరిణామంపై మండిపడింది. ‘‘పెలోసీ నిప్పుతో చెలగాటమాడారు. అది అమెరికానే కాల్చేస్తుంది. తీవ్ర పరిణామాలుంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్ స్పందించారు. ఈ తప్పిదానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘చైనా సార్వభౌమాధికారాల పరిధిని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా ఉల్లంఘించింది. తైవాన్ జలసంధి వద్ద శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీసింది’’ అని విమర్శించారు. ‘‘చైనాను నిలువరించేందుకు తైవాన్ అంశాన్ని వాడుకోవడాన్ని అమెరికా ఇకనైనా కట్టిపెట్టాలి. తైవాన్ స్వాతంత్య్ర డిమాండ్లకు మద్దతివ్వొద్దు’’ అని డిమాండ్ చేశారు. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్‌ను మంగళవారం రాత్రి పిలిపించి పెలోసీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాతో కయ్యానికి కాలు దువ్వొద్దని హెచ్చరించారు. తైవాన్‌పై ఆంక్షలకూ చైనా తెర తీసింది. పళ్లు, చేపల దిగుమతులు, ఇసుక ఎగుమతులపై నిషేధం విధించింది. నిబద్ధత చాటుకున్నాం: పెలోసీ దక్షిణ కొరియా బయల్దేరే ముందు తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ భేటీ అయ్యారు. తైవాన్లోనూ, ప్రపంచంలో ఇతర చోట్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న అమెరికా సంకల్పం మరింత బలపడిందంటూ సంఘీభావ ప్రకటన చేశారు. తమకు చిరకాలంగా మద్దతుగా నిలుస్తున్నందుకు పెలోసీకి వెన్ కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ(ఎడమ) తైవాన్ చుట్టూరా సైనిక విన్యాసాలు పెలోసీ పర్యటనకు సమాధానంగా తైవాన్ను లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాత్రి తెరతీసిన భారీ సైనిక విన్యాసాలను చైనా మరింత తీవ్రతరం చేసింది. తైవాన్ జలసంధిలోకి మరిన్ని యుద్ధ నౌకలను తరలించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు, విన్యాసాల జోరు పెంచి అమెరికాకు హెచ్చరిక సంకేతాలు పంపింది. చైనా ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలం సమీపంలో విన్యాసాలకు దిగాయి. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తైవాన్ ద్వీపం చుట్టూ మరిన్ని సైనిక విన్యాసాలుంటాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది. ఇవి యుద్ధానికి దిగడంతో సమానమని పరిశీలకులంటున్నారు. బలప్రయోగంతోనైనా తైవాన్ను తనలో కలిపేసుకునే చర్యలకు చైనా దిగనుందనేందుకు ఇవి సంకేతాలేనంటున్నారు. చైనా చర్యలను తైవాన్ తీవ్రంగా నిరసించింది. ‘‘మేం జడిసేది లేదు. సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుని తీరతాం’’ అని తైవాన్ అధ్యక్షురాలు ఇంగ్ వెన్ అన్నారు. -
తైవాన్‌లోకి 27 చైనా ఫైటర్ జెట్స్.. ఇక బాంబుల వర్షమేనా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యాటనపై మొదటి నుంచే హెచ్చరికలు చేస్తోంది చైనా. జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. అయినప్పటికీ.. తైవాన్‌లో పర్యటించి తిరిగి స్వదేశానికి వెళ్లారు పెలోసీ. తైవాన్ నుంచి పెలోసీ వెళ్లిపోయిన వెంటనే ఆ ద్వీప దేశంపై చర్యలకు ఉపక్రమించింది చైనా. ఇప్పటికే ఆ దేశ దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తైవాన్ గగనతలంలోకి చైనాకు చెందిన 27 ఫైటర్ జెట్స్ ప్రవేశించినట్లు తైపీ ప్రకటించింది. ‘27 పీఎల్ఏ విమానాలు ఆగస్టు 3న తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఆరు జే11 ఫైటర్ జెట్స్, 5 జే16 జేట్స్ 16 ఎస్‌యూ-30 జేట్స్ ప్రవేశించాయి. వాటికి ప్రతిస్పందనగా తైవాన్ సైతం తమ ఫైటర్ జెట్స్‌ను రంగంలోకి దించింది. ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్‌ని మోహరించింది. ’ అంటూ ట్వీట్ చేసింది రక్షణ శాఖ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తైవాన్ లెక్కచేయలేదు. దీంతో అతి సమీపంలో ప్రమాదకర మిలిటరీ ప్రదర్శన చేపట్టి భయపెట్టే ప్రయత్నం చేసింది డ్రాగన్. స్పీకర్ విజిట్‌పై అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అలాగే.. హైఅలర్ట్ ప్రకటించింది చైనా మిలిటరీ. సైనిక డ్రిల్స్‌లో భాగంగా లాంగ్ రేంజ్ షూటింగ్ వంటివి ప్రదర్శించింది. దీంతో తైవాన్‌లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. తైవాన్‌కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు పెలోసీ. 27 PLA aircraft (J-11*6, J-16*5 and SU-30*16) entered the surrounding area of R.O.C. on August 3, 2022. Please check our official website for more information: https://t.co/m1gW2N4ZL7 pic.twitter.com/Aw71EgmRjj — 國防部 Ministry of National Defense, R.O.C. 🇹🇼 (@MoNDefense) August 3, 2022 ఇదీ చదవండి: భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు -
నెహ్రూ, వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో కలిశాయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయీల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయని ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నారని ధ్వజమెత్తారు. We Indians conceded that Tibet and Taiwan as part of China due the foolishness of Nehru and ABV. But now China does even honour the mutually agreed LAC and grabbed parts of Ladakh while Modi is in stupor stating "koi aaya nahin". China should know we have elections to decide . — Subramanian Swamy (@Swamy39) August 3, 2022 చైనా పదే పదే హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. పెలోసీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా.. తైవాన్ భూభాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. చదవండి: కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం! -
తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ.. చైనాను రెచ్చగొట్టేలా ట్వీట్లు
తైపీ/బీజింగ్: తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అడుగుపెట్టారు అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ. తైపీ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు సాదర స్వాగతలం లభించింది. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు.. చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది. Our delegation’s visit to Taiwan honors America’s unwavering commitment to supporting Taiwan’s vibrant Democracy. Our discussions with Taiwan leadership reaffirm our support for our partner & promote our shared interests, including advancing a free & open Indo-Pacific region. — Nancy Pelosi (@SpeakerPelosi) August 2, 2022 ఇప్పటికే చైనా-తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఉంటుంది. చైనా తీవ్ర అభ్యంతరాలు, హెచ్చరికల నడుమే తైవాన్‌లో అడుగుపెట్టారు యూఎస్ హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ. మొదటి నుంచి ఆమె పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. తాజాగా తైవాన్ భూ భాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. ట్రెండింగ్‌లో వరల్డ్‌వార్ త్రీ తైవాన్-చైనా ఉద్రిక్తతల నడుమ యుద్ధ వాతావరణం నెలకొనడంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్విటర్ ట్రెండ్ నడుస్తోంది. స్వీయ పరిపాలన ఉన్న తైవాన్ను తమ సొంతంగా ప్రకటించుకుంది చైనా. అలాగే.. పెలోసీ పర్యటన తమ(చైనా) తైవాన్ పర్యటన.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, చైనా ఆర్మీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది. తైవాన్ పర్యటన తర్వాత.. సింగపూర్, మలేషియా, జపాన్, సౌత్ కొరియాలోనూ ఆమె పర్యటించనున్నారు. -
ఆత్మహత్యా సదృశం
దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు. అవి లేకుండా ఏ పనైనా చేస్తే? పాతికేళ్ళుగా తమ దేశం నుంచి అత్యున్నత స్థాయివారెవరూ పర్యటించని తైవాన్‌కు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వెళతారనడం అలాంటిదే. ఆ వార్త తేనెతుట్టెను కదిలించింది. అమెరికా అధ్యక్షపదవికి తూగే హోదాలో ఉన్న ఆమె ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్‌నూ సందర్శిస్తారనడంతో చైనాకు పుండు మీద కారం జల్లినట్టయింది. జూలై 28న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంభాషిస్తూ, తైవాన్‌తో చైనా వ్యవహారంలో పరాయివారి జోక్యం సహించబోమని గట్టిగా చెప్పడం దాని పర్యవసానమే. వారాంతంలో తైవాన్ సమీపాన సాయుధ సైనిక విన్యాసాలకూ డ్రాగన్ దిగడంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతకు ఆజ్యం పోసింది. అసలే ఉక్రెయిన్‌లో యుద్ధంతో కిందా మీదా అవుతున్న ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో చైనాకు ఆగ్నేయ తీరంలో వంద మైళ్ళ దూరంలోని ఒక చిన్న ద్వీపమైనా తైవాన్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. భౌగోళికంగా అమెరికా విదేశాంగ విధానానికి కీలకమైన స్నేహపూర్వక ద్వీపాల గొలుసుకట్టు మధ్య అది నెలకొంది. తైవాన్ను గనక చైనా స్వాధీనం చేసుకుంటే, పశ్చిమ పసిఫిక్‌లో దాని పట్టు బిగుస్తుంది. సుదూర గువామ్, హవాయ్ల లోని అమెరికా సైనిక స్థావరాలకూ అది ముప్పే. చైనా మాత్రం తమకలాంటి ఉద్దేశం లేదంటోంది. 1949లో చైనాలో అంతర్యుద్ధంతో కమ్యూనిస్టు పాలన వచ్చినప్పటి నుంచి తైవాన్ ప్రత్యేకంగా ఉంటోంది. సొంత రాజ్యాంగం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలతో స్వతంత్ర దేశంగా అడుగులు వేస్తోంది. వాటికన్ కాక, ఇప్పటికి ప్రపంచంలో 13 దేశాలే తైవాన్ సార్వ భౌమాధికారాన్ని గుర్తిస్తున్నాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాలు ‘వన్ చైనా పాలసీ’కే కట్టు బడ్డాయి. ఇతర దేశాలేవీ ఆ ద్వీపదేశాన్ని గుర్తించకుండా ఉండేలా చైనా దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే ఉంది. స్వపరిపాలన సాగిస్తున్నప్పటికీ తైవాన్ తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్ అనీ, అది తమలో భాగమనీ మొదటి నుంచీ చైనా వైఖరి. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా సరే దాన్ని తమలో ‘పునరేకీకరించే’ లక్ష్యాన్ని సాధించి తీరాలనేది జిన్‌పింగ్ మాట. కానీ, అవసరమైతే బలగాలను దించి మరీ, తైవాన్ను తాము కాపాడడానికి సిద్ధమని బైడెన్ ఆ మధ్య అన్నారు. వాస్తవానికి తైవాన్‌పై చైనా దాడికి దిగితే సైనిక జోక్యం చేసుకోవాలా, వద్దా అనే అంశంలో అగ్రరాజ్యం అమెరికా దీర్ఘకాలంగా ‘వ్యూహాత్మక సందిగ్ధత’ విధానాన్నే అనుసరిస్తోంది. బైడెన్ మాటలు ఏమైనప్పటికీ, తమ వైఖరిలో మార్పు లేదని వైట్‌హౌస్ వర్గాలే తేల్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉరుము లేని పిడుగులా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌కు వెళతారనే వార్త తాజా తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇంతలో ఆదివారం మొదలైన ఆమె పర్యటన షెడ్యూల్లో ఇప్పటికైతే సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్ తప్ప తైవాన్ సందర్శన ప్రస్తావన లేకపోవడం ఊరట. వర్తమాన ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు 2017 –21 మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాం నుంచి శరవేగంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇరు దేశాల సంబంధాలు అలా ఉన్నా, అధినేతల స్థాయిలో రెండు గంటల పైగా గత వారం సంభాషణ సాగడం ఓ సాంత్వన. వాతావరణ మార్పు లాంటి వైరుద్ధ్యాలు లేని అంశాలపై చైనాతో మాటామంతీ జరుపుతూనే, దూకుడుకు పగ్గం వేయాలని బైడెన్ ఆలోచన. ఆంక్షలను సడలించేలా ఒప్పించి, అమెరికాకు చైనా సమస్కంధ అగ్రరాజ్యమని అంగీకరింపజేయాలనేది జిన్‌పింగ్ భావన. కానీ, ఎవరూ పట్టు సడలించడం లేదు. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలున్న బైడెన్ కానీ, ఈ ఏడాదిలోనే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ మహాసభలున్న జిన్‌పింగ్ కానీ తమ వారి ముందు తగ్గేదేలే అన్నట్టుగానే ఉండాలనుకోవడంతో చిక్కొచ్చి పడుతోంది. ఈ ఏడాది చివరలో ఇద్దరు అధినేతలూ ప్రత్యక్షంగా కలసి, చర్చించుకొనే సూచనలున్నాయి. అయితే, కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న తైవాన్ అంశం మళ్ళీ తెర పైకి వచ్చి, ఉద్రిక్తతలు పెంచుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా తైవాన్‌లో శాంతిభద్రతలు, ఆర్థిక వ్యవస్థ సుస్థిరత ప్రపంచానికి అవసరం. జీ7, నాటో, ఈయూ, క్వాడ్ దాకా అన్నీ ఆ మాటే గుర్తుచేస్తున్నాయి. ఎందుకంటే, కంప్యూటర్ చిప్‌ల ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచమంతా వాడే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాచీలు, గేమ్స్ కన్సోల్స్లోని ఎలక్ట్రానిక్ సామగ్రికి గుండె లాంటి కంప్యూటర్ చిప్‌లన్నీ తైవాన్ తయారీయే. ప్రపంచ మార్కెట్లో సగానికి పైగా ఒకే ఒక్క తైవానీ సెమీకండక్టర్ కంపెనీదే అని లెక్క. కొంతకాలంగా తరచూ తైవాన్‌లో గగనతల చొరబాట్లు సాగిస్తున్న చైనా గనక ఆ దేశాన్ని చేజిక్కించుకుంటే, ప్రపంచంలోని అతి ప్రధాన పరిశ్రమల్లో ఒకటి దాని వశమైనట్టే! అందుకే, తైవాన్‌లో చీమ చిటుక్కుమన్నా ఆ ప్రభావం అంతటా కనిపిస్తుంది. నిజానికి, చైనా, అమెరికా, తైవాన్లు మూడూ స్థూలంగా ప్రస్తుత యథాతథ స్థితి వైపే మొగ్గుతున్నాయి. కాకపోతే, ఎవరికి వారు అవతలివాళ్ళు దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అసలే కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైన పరిస్థితుల్లో యథాతథ స్థితిని కొన సాగనివ్వక ఎవరు కవ్వింపు చర్యలకు దిగినా, జిన్‌పింగ్ వేరే సందర్భంలో అన్నట్టు అది నిప్పుతో చెలగాటమే! అలాంటి అవివేక చర్యలను అనుమతించడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆత్మహత్యా సదృశమే! -
Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఓవైపు ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో చైనా, తైవాన్ మధ్య తారస్థాయికి చేరుతున్న ఉద్రిక్తతలు కలవరపరుస్తున్నాయి. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందునుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచుతోంది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది. అదే జరిగితే తైవాన్‌కు రక్షణగా నిలుస్తామన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఏమిటీ వివాదం? చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్‌కై షేక్ దేశం విడిచి తైవాన్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి. అమెరికాకేం సంబంధం? చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్‌తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్‌తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్‌కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన. డొనాల్డ్ ట్రంప్ హయాంలో తైవాన్‌తో సైనిక బంధాన్ని అమెరికా మరింతగా పెంచుకుంది. ఏకంగా 1,800 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆయుధాలను విక్రయించింది. బైడెన్ కూడా ఈ ధోరణిని మరింతగా కొనసాగిస్తున్నారు. చైనా దాడికి దిగేనా? తైవాన్ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీయొచ్చంటున్నారు. పెరుగుతున్న ‘స్వాతంత్య్రాభిలాష’ మరోవైపు తైవాన్‌లో పూర్తి ‘స్వాంతంత్య్రాభిలాష’ నానాటికీ పెరిగిపోతోంది. 2016లో సై ఇంగ్ వెన్ అధ్యక్షుడయ్యాక ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంది. చైనా, తైవాన్ మధ్య 1992లో కుదిరిన ‘ఒకే చైనా’ రాజకీయ ఒప్పందాన్ని అర్థం లేనిదిగా వెన్ కొట్టిపారేస్తుంటారు. తాజాగా యుద్ధ నౌకలో పర్యటించి ఉద్రిక్తతలను మరింతగా పెంచారామె. స్వీయ రక్షణకు ఎంత దూరమైనా వెళ్తామనే ప్రకటనలతో వేడి పెంచారు కూడా. అసలు ఒకే చైనా నిర్వచనంపైనే ఇరు వర్గాలు భిన్న వాదన విన్పిస్తుంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తైవాన్‌పై జోక్యం చేసుకోవద్దు
బీజింగ్: తైవాన్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చైనా అధినేత జిన్‌పింగ్ గట్టిగా హెచ్చరించారు. వ్యూహాత్మక కారణాలతో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య విభేదాలు మంచిది కాదని కూడా జిన్ పింగ్ పేర్కొన్నట్లు చైనా వెల్లడించింది. ఇలాంటి వైఖరి ప్రపంచ ఆర్థిక పురోగతిపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ‘చైనా ప్రధాన భూభాగం నుంచి వేరుపడేలా తైవాన్ను ప్రేరేపించే వెలుపలి శక్తులను ఎదుర్కొంటాం. 140 కోట్ల చైనా ప్రజల అభీష్టమైన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటాం. నిప్పుతో ఆడాలనుకుంటే భస్మం అవుతారు’అంటూ గట్టి హెచ్చరికలు పంపింది. ఒకే చైనా విధానాన్ని అమెరికా గౌరవించాలని పేర్కొంది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని తగ్గించడం, స్థూల ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం, కోవిడ్‌తో పోరాటం, ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించుకోవడం వంటి వాటిపై సహకరించాలని అమెరికాను జిన్‌పింగ్ కోరారని చైనా ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఈ ఇద్దరు నేతలు దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసీ త్వరలో తైవాన్ సందర్శిస్తారంటూ వస్తున్న వార్తలపై చైనాలింకా స్పందించలేదు. అయితే, బైడెన్, జిన్‌పింగ్ నవంబర్‌లో ఇండొనేసియాలో జరిగే జి–20 భేటీలో ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. -
యుద్ధానికి సై అంటున్న చైనా!... అమెరికాకు వార్నింగ్
Taiwan is China's Taiwan: తైవాన్ స్వయం పాలన, ప్రజాస్వామ్య దేశం. ఐతే చైనా ఈ తైవాన్‌ని తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒక రోజు స్వాధీనం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది కూడా. ఈ మేరకు సింగపూర్‌లో జరిగిన మూఖముఖి సమావేశంలోయూఎస్ రక్షణాధికారి లాస్టిన్తో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే చైనాను తైవాన్ నుంచి విడదీస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైన విడదీయడానికి ధైర్యం చేస్తే ఖర్చుతో నిమిత్తం లేకుండా యుద్ధం ప్రారంభించడానికీ చైనా వెనుకాడదని హెచ్చరించారు. అంతేకాదు తైవాన్ స్వాతంత్ర్యం కావాలని ప్రకటిస్తే బీజింగ్ తప్పక యుద్ధం ప్రారంభించడానికి వెనుకాడదు అని కూడా తేల్చి చెప్పారు. తైవాన్ చైనాకి సంబంధించినదేనని నొక్కి చెప్పారు. చైనాను నియంత్రించడానికి తైవాన్‌ని ఉపయోగించుకోవాలని చూడొద్దంటూ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఐతే ఆ సమావేశంలో అమెరికా రక్షణాధికారి ఆస్టిన్ తైవాన్‌ని ఇబ్బంది పెట్టే చర్యలకు చైనా చాలా దూరంగా ఉండాలంటూ ఆ దేశ రక్షణ మంత్రికి గట్టి కౌంటరిచ్చారు. (చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం!) -
జో బైడెన్ వార్నింగ్ బేఖాతరు.. చైనా కవ్వింపు చర్యలు
తైవాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొద్దిరోజుల క్రితం చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. తైవాన్‌లో చైనా ఆక్రమణకు పాల్పడితే డ్రాగన్ కంట్రీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా హెచ్చరించిన కొద్ది రోజులకే.. చైనా తన అసలు స్వరూపాన్ని చూపించింది. తైవాన్ పరిసర ప్రాంతాల్లో చైనా తన వైమానిక కార్యకలాపాలను పెంచింది. తైవాన్ వైమానిక దళంలోకి చైనా 30 యుద్ధ విమానాలను పంపింది. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకున్నది. అయితే, చైనా కవ్వింపు చర్యకు తైవాన్ ధీటుగానే స్పందించింది. తైవాన్ కూడా యుద్ధ విమానాలను మోహరించినట్లు తాజాగా వెల్లడించింది. అయితే, తన చర్యలను చైనా సమర్ధించుకుంది. సైనిక శిక్షణలో భాగంగానే వైమానిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైనా పేర్కొంది. కాగా, చైనా వ్యాఖ్యలపై తైవాన్ మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తోంది. తైవాన్ వైమానిక రక్షణ క్షేత్రంలో ఉన్న ప్రటాస్ దీవుల వద్దకు చైనా యుద్ధ విమానాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో 20 ఫైటర్ జెట్స్ ఉన్నట్టు సమాచారం. చైనా చర్యలో తర్వలో మరో యుద్ధాన్ని చూడాల్సి వస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. #China has made the second largest incursion into #Taiwan’s air defense zone this year with 30 jets reportedly entering the area, including more than 20 fighters https://t.co/N4yunKUje8 pic.twitter.com/J9vno2kT4H — Arab News (@arabnews) May 31, 2022 ఇది కూడా చదవండి: నా దుస్తులు అమ్మి అయినా ప్రజలకు చౌకగా గోధుమపిండి అందిస్తా! -
మమల్ని తక్కువ అంచనా వేయకండి: అమెరికాకు చైనా వార్నింగ్
బీజింగ్: చైనా దాడి చేస్తే తైవాన్‌కు తాము రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై చైనా ధీటుగా స్పందించింది. చైనాను ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. తైవాన్ విషయంలో బైడెన్చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్ వ్యవహారం చైనా సార్వభౌమాధికారం, అంతర్గత సమగ్రతకు సంబంధించినదని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనా రాజీపడే అవకాశమే లేదని పేర్కొన్నారు. సంబంధిత వార్త: ‘బీ కేర్‌ఫుల్’.. చైనాకు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ కాగా తైవాన్ను చైనా బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే తైవాన్‌కు తాము రక్షణ సహాయం కల్పిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేగాక ప్రమాదంతో ఆటలాడుతోందని చైనాను హెచ్చరించారు. టోక్యోలో జపాన్ ప్రధాన మంత్రితో సమావేశమైన జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ను తమ భూభాగంగా పరిగణిస్తోన్న చైనా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సాయం చేస్తుందా అనే ప్రశ్నపై బైడెన్ ఈ విధంగా సమాధానమిచ్చారు. చదవండి: ఉక్రెయిన్ కోర్టు తొలిసారి కీలక తీర్పు.. యుద్ధ నేరానికి పాల్పడిన రష్యా సైనికుడికి.. ఇదిలా ఉండగా క్వాడ్ కూటమిలోని జపాన్, భారత్, ఆస్ట్రేలియా నాయకులతో బైడెన్ మంగళవారం భేటీ కానున్నారు. ఇక చైనా తైవాన్‌పై దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో తమ సైనిక సంబంధాలను బలోపేతం చేయడంపై బైడెన్‌తో చర్చించినున్నట్టు జపాన్ ప్రధాని కిషిడా వ్యాఖ్యానించారు. బలమైన జపాన్.. అమెరికా-జపాన్ శక్తివంతమైన కూటమి ఈ ప్రాంతానికి చాలా కీలమైందని ఆయన పేర్కొన్నారు. చదవండి: చనిపోయే స్థితిలో రష్యా ‘మాక్స్’.. ప్రాణాలు నిలిపిన ఉక్రెయిన్‌కు సాయం -
‘బీ కేర్‌ఫుల్’.. చైనాకు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్
Joe Biden Serious Warning to China on Taiwan: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ‘ప్రమాదంతో ఆటలాడుకున్నట్టే’ అంటూ బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆసియా దేశాల పర్యటనలో భాగంగా అగ్ర రాజ్యం అధ్యక్షుడు బైడెన్ సోమవారం జపాన్ రాజధాని టోక్యో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. వన్ చైనా పాలసీని తాము అంగీకరిస్తామని, ఆ ఒప్పందంపై సంతకం కూడా చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే చైనా.. తైవాన్ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే.. తాము(అమెరికా) సైనికపరంగా చైనాను అడ్డుకుంటుదని హెచ్చరించారు. తైవాన్ను ఆక్రమించే న్యాయపరమైన హక్కు చైనాకు లేదని బైడెన్ తెలిపారు. ఇక, తైవాన్ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బైడెన్ హితవు పలికారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో జరుగుతున్న అకృత్యాలకు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా సుదీర్ఘకాలం ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుందని పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తున్న సమయంలో చైనాకు పుతిన్‌కు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. రష్యాకు ఆర్థికంగా, ఆయుధాలను కూడా అందించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. VIDEO: President Joe Biden says United States would defend Taiwan militarily if Beijing invaded the self-ruled island. "That's the commitment we made... We agreed with the One China policy, we signed on to it... but the idea that it can be taken by force is just not appropriate" pic.twitter.com/gWkmj2y7d9 — AFP News Agency (@AFP) May 23, 2022 ఇది కూడా చదవండి: భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే.. -
తాడిపూడి అబ్బాయికి తైవాన్ అమ్మాయితో పెళ్లి
సాక్షి, తాళ్లపూడి: దేశాలు వేరైనా వారిని వివాహ బంధం ఒక్కటి చేసింది.. ప్రేమ వారిని కలిపింది.. తాడిపూడి అబ్బాయికి తైవాన్ అమ్మాయితో వివాహం జరిగింది. భారతీయ వివాహ వ్యవస్థకు ఎల్లలు లేవని చాటి చెప్పింది. తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు గంటా సూర్యచంద్రం కుమారుడు రంగబాబు ఐఐటీ చదివి తైవాన్ టీఎస్ఎంసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో పనిచేస్తున్న తైవాన్ అమ్మాయి చెల్సీతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించడంతో పెళ్లి నిశ్చయించారు. బుధవారం బల్లిపాడులోని ఫంక్షన్ హాలులో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తైవాన్ అమ్మాయి చెల్సీ చీర కట్టులో ఆకట్టుకున్నారు. దీవించడానికి వచ్చిన పెద్దలకు ఆమె రెండు చేతులతో నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. మన సంప్రదాయం అంటే తనకు ఎనలేని గౌరవమని ఆమె పేర్కొన్నారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా కృష్ణ, పలువురు సర్పంచులు, ఆయా పార్టీల నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక) -
అమెరికా సంచలన నిర్ణయం..! చైనాకు చావు దెబ్బే..?
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సెమికండక్టర్ విభాగంలో డ్రాగన్ కంట్రీను ఢీ కొట్టేందుకుగాను అమెరికా ఒక సెమీకండక్టర్ పరిశ్రమ కూటమిని ఏర్పాటుచేసేందుకు పావులను కదుపుతోంది. 4 దేశాల సెమీకండక్టర్ కూటమి..! అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో సెమీకండక్టర్ పరిశ్రమ కూటమిని ఏర్పరచాలని అమెరికా ప్రతిపాదించినట్లు సమాచారం. సెమికండక్టర్ పరిశ్రమలో ఆధిపత్యాన్ని చెలాయిస్తోన్న చైనాకు ఆగడాలకు నిరోధించేందుకుగాను అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అమెరికా ప్రతిపాదనపై దక్షిణ కొరియా పూర్తిగా అంగీకరించలేదని తైవాన్ న్యూస్ నివేదించింది. దక్షిణకొరియాకు యూఎస్ సహకారం మొదటి ప్రాధాన్యతగా ఉన్నప్పటీకి, సెమికండక్టర్ వ్యాపారంలో అతి పెద్ద కస్టమర్‌గా చైనా నిలుస్తోండడంతో..అమెరికా నిర్ణయంపై దక్షిణకొరియా తడబడే అవకాశం లేకపోలేదని తైవాన్ న్యూస్ వెల్లడించింది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..! సెమికండక్టర్ పరిశ్రమలో చైనా హావా..! ప్రపంచంలోని అత్యధిక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లను చైనా తయారు చేస్తోంది. కాగా ఈ గాడ్జెట్లను నిర్మించేందుకు ఆయా దేశాల సెమికండక్టర్లను దిగుమతి చేసుకుంటుంది. ఇక మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ తన భారీ మౌలిక సదుపాయాలను చైనాలో కల్గింది. దీంతో దక్షిణకొరియా వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు. ఇక సెమీ కండక్టర్ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా ఉన్న తైవాన్ను చైనా తన అధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అదే జరిగితే..! నాలుగు దేశాలతో సెమికండక్టర్ కూటమిను అమెరికా ఏర్పరిస్తే చైనాకు భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక తైవాన్ విషయంలో చైనా అవలంభిస్తోన్నతీరును చెక్ పెట్టవచ్చునని అమెరికా భావిస్తోంది. సెమికండక్టర్ పరిశ్రమలో రారాజు అయ్యేందుకుగాను చైనా తన కుటీల బుద్దిని ప్రదర్శిస్తోంది. తైవాన్‌కు చెందిన వాణిజ్యరహస్యాలను దొంగిలించడం, ఆ దేశ ఉద్యోగులపై గూఢాచర్యం వంటి ఆరోపణలను చైనా ఎదుర్కొంటుంది. ఇప్పటికే తైవాన్ దేశ న్యాయస్థానం చైనాకు చెందిన పలు కంపెనీలను విచారణ కూడా చేసింది. సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధిలో సెమీకండక్టర్లు లేదా 'చిప్స్' ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్‌గా నిలుస్తాయి.వీటి విషయంలో ఈ నాలుగు దేశాలు ఒక్కటైతే చైనా ఆగడాలకు చెక్ పెట్టే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇది కేవలం అమెరికా చేసిన ప్రతిపాదన మాత్రమే. ఈ నిర్ణయంపై కాలమే సమధానం చెప్పనుంది. చదవండి: భారత్ నుంచి నిష్క్రమణ..యాక్సిస్ బ్యాంకులో విలీనమైన దిగ్గజ బ్యాంకు..! -
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. తర్వాత యుద్దం తైవాన్‌పైనే..!
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓసారి పుతిన్ పొడుగుతూ మరోసారి రష్యాను తిడుతూ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ట్రంప్. తాజాగా ఉక్రెయిన్-రష్యా వార్ జరుగుతున్న వేళ తదుపరి దండయాత్ర తైవాన్‌పైనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యయానికి గురి చేశారు. బుధవారం ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్ మాట్లాడుతూ.. తదుపరి దాడి తైవాన్‌పై జరిగే అవకాశం ఉంది. దీని కోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. జిన్‌పింగ్ ఎంతో తెలివైన వ్యక్తి.. ఆఫ్ఘనిస్తాన్‌ను అమెరికా ఎలా వీడి వచ్చిందో ఆయన గమనించారు. అందుకే ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా ఎదుర్కొన్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పరోక్షంగా జిన్ పింగ్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు. అగ్ర రాజ్యం అమెరికా మూర్ఖంగా వ్యవహరిస్తోందని.. అందుకే తమ నాయకులను ప్రపంచ దేశాల నేతలు అసమర్థులుగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే వారు చేయాలనుకున్నది భయం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తైవాన్‌పై దాడి జరుగవచ్చు అని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇది వారి సమయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఇది కుట్రలో భాగమేనా?.. అనుమానాస్పదంగా చైనా చర్యలు
Covid Leak From Wuhan Lab: ఈ కరోనా మహమ్మారికి కారణం చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని వేలెత్తి చూపించిన వేటిని లక్ష్యపెట్టక ఇప్పటికీ తనదైన శైలిలో దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. అంతేకాదు కోవిడ్ మూలాలుపై స్వతంత్ర దర్యాప్తు కోసం కాన్బెర్రా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయిన డ్రాగన్ కంట్రీ వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. మరోవైపు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వుహాన్ ల్యాబ్ భాద్యతలు తీసుకునే నిమత్తం చుట్టూ ఆర్మీ జనరల్‌ను మోహరించడం, కరోనా వైరస్‌కి సంబంధించిన విషయంలో ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించకుండా తప్పుడూ కథనాలను ఇచ్చేందుకు ప్రయత్నించిందని ప్రోవిడెన్స్ నివేదిక వెల్లడించింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) మీడియా వుహాన్ లాక్‌డౌన్‌ను డాక్యుమెంట్ చేసినందుకు ఒక చైనీస్ జర్నలిస్టును జైలులో పెట్టారు. పైగా ఈ కరోనా మహమ్మారీ వచ్చి అప్పుడే రెండేళ్లు గడిచిందని ఈ మహమ్మారీతో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూశామని ఇక దీనిపై విచారించాల్సింది, రుజువు చేయాల్సింది ఏమి లేదంటూ చైనా బుకాయిస్తోంది. అంతేకాదు కోవిడ్ -19 మూలానికి సంబంధించిన ప్రచురణలపై కూడా ఆంక్షలు జారీ చేసింది. మరోవైపు ల్యాబ్ లీక్‌లు జరుగుతాయని, దేశంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అని అడ్డకోలుగా మాట్లాడుతోంది. అంతేకాదు డిసెంబర్ 2021లో తైవాన్ అధికారికంగా SARS-COV-2 ల్యాబ్ లీక్‌ను ధృవీకరించింది కూడా. అయితే చైనా సీసీపీ మీడియా అధికారికంగా ఈ విషయం పై నోరు మెదపటం లేదు. దీంతో వ్యూహాన్ ల్యాబ్ లీక్ అనేది అనుకోకుండా జరిగిన ప్రమాదమా ? లేక కావాలని చేసిన పనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ పాశాత్య వైరాలజీ శాస్త్రవేత్తలు, జర్నలిస్ట్‌లు ఇది కుట్రగా అభివర్ణించడం గమనార్హం. (చదవండి: మహిళకు అరుదైన శస్త్ర చికిత్స.. కంటి నుంచి బొట్‌ఫ్లైస్ తొలగింపు!) -
మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్
బీజింగ్: చైనా - అమెరికాల తత్సంబంధాలు దెబ్బతినడంలో తైవాన్ కీలకం కానుంది. గత కొంతకాలంగా తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా జోక్యాన్ని సహించలేని చైనా.. తైవాన్‌కు మద్ధతు తెల్పడం ద్వారా అమెరికా వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం మీడియా వేదికగా హెచ్చరించారు. తైవాన్ను తమ స్వంత భూభాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నట్లు చైనా ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాకుండా గత రెండేళ్లలో తన సార్వభౌమాధికారాన్ని నొక్కిచెప్పేందుకు తైవాన్ రాజధాని తైపీలో సైనిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది కూడా. తైవాన్ స్వతంత్ర దళాలను ప్రోత్సహించడం ద్వారా దానిని అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టడమే కాకుండా, అందుకు యూఎస్ వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాంగ్ తాజాగా హెచ్చరించాడు. కాగా ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ అటు చైనా, ఇటు అమెరికా దేశాల మధ్య తైవాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఐతే తైవాన్ ద్వీపం తమది స్వతంత్ర దేశమని, దాని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలను పరిరక్షించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు చైనా మాత్రం తమ భూభాగంలో కలవడం తప్ప తైవాన్‌కు వేరే మార్గం లేదని వాంగ్ తాజాగా ధీమా వ్యక్తం చేశాడు. ఐతే తైవాన్‌కు అంతర్జాతీయ మద్ధతుదారు, ఆయుధాల సరఫరాదారైన అమెరికా, తైవన్పై చైనా దాడి చేస్తే, తైవాన్ను రక్షించేందకు సైనికంగా జోక్యం చేసుకుంటుందా లేదా అనే విషయంపై చాలా కాలంగా అమెరికా వ్యూహాత్మక ధోరణిని అనుసరిస్తోంది. చదవండి: రానున్న 2, 3 రోజుల్లో చలిగాలులతో కూడిన వానలు: వాతావరణ శాఖ -
చైనాతో ఢీ అంటే ఢీ అంటున్న తైవాన్.. అసలేం జరుగుతోంది!
చైనా ఆధిపత్యాన్ని తైవాన్ సవాల్ చేయాలనుకుంటోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సబ్ మెరైన్ ప్రాజెక్టును చేపట్టింది. 2023 నాటికి ఈ సబ్మైరైన్ను సముద్ర జలాల్లో పరీక్షించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. చైనా వైఖరితో సహనం నశించిన తైవాన్ 2015లోనే అమెరికా, జపాన్ దేశాల్లో కీలకమైన సబ్‌మెరైన్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. గతేడాది సబ్మెరైన్ల తయారీని లాంఛనంగా ప్రారంభించింది. కాగా సబ్‌మెరైన్‌లో కీలక భాగాల తయారీ, పరీక్షలు విజయవంతమైనందునే కీల్ లేయింగ్ ఉత్సవాన్ని గత నెల నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది సబ్మెరైన్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. మరోపక్క చైనా మాత్రం అడ్డగోలుగా నావికదళ బలాన్ని పెంచుకుంటోంది. దీంతో పట్టుదలగా ప్రయత్నించి తైవాన్ సొంతంగా సబ్మెరైన్ల తయారీని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుకు బ్రిటన్, అమెరికా, కెనడాల్లోని సంస్థలు సాయం చేస్తున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనం. కాగా తైవాన్ వద్ద పురాతన సబ్ మెరైన్లు ఉన్నాయి. కానీ చైనాతో యుద్దం జరిగితే కనుక అవి నిలువలేవు. దీంతో వాటిని తమ నేవీ శిక్షణ కోసం వినియోగిస్తోంది. ఇందుకు అమెరికా సైన్యం సహకరిస్తూ తమ కమాండోలతో శిక్షణ ఇస్తోంది. దీనికి తోడు సబ్మెరైన్ల తయారీకి అమెరికా, మిత్రదేశాలు సాయం చేస్తుండటం డ్రాగన్‌ను ఉకిరి బిక్కిరి చేస్తోంది. చదవండి: Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ఘోర అవమానం.. పరువు పాయే -
చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్లో ప్రవేశం
తైవాన్: చైనా దేశం తైవాన్‌పై మరోసారి బలప్రదర్శనకు దిగింది. తమ యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది. మొత్తం 27 విమానాలు బఫర్ జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తమ యుద్ధవిమానాల ద్వారా హెచ్చరించగా.. చైనా విమానాలు పసిఫిక్ మహా సముద్రం మీదుగా వెనుతిరిగాయని అధికారులు తెలిపారు. చదవండి: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రకంపనలు..భారత్‌లోనూ దడ ఏడాది కాలంగా తైవాన్‌పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుతూ.. చైనా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కిపైగా యుద్ధ విమానాలను తైవాన్ దేశం మీదకు వెళ్లాయి. కాగా, తైవాన్ను తన అంతర్భాగంగా చెబుతున్న చైనా.. ఆ దేశాన్ని పూర్తిగా తమలో కలుపుకుంటామని, అవసరమైతే సైనిక చర్యకూ వెనకాడబోయేది లేదంటోంది. -
వీడు మామూలోడు కాదు.. అంబులెన్స్‌ను ఫ్రీ ట్యాక్సీలా వాడేశాడు!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, హఠాత్తుగా ఎవరైనా అస్వస్థతకు గురైనప్పుడు వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేస్తాం. అయితే చాలా వరకు మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అంబులెన్స్ సేవలను ఉపయోగించుకుంటాం. అయితే ఓ వ్యక్తి ఏడాదిలో సుమారు 39 సార్లు స్థానికంగా ఉన్న ఆస్పత్రి అంబులెన్స్‌ను ఫోన్ చేసి.. సేవలను వినియోగించుకున్నాడు. అయితే ఏడాదికి 39 సార్లు ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. తైవాన్‌కు చెందని ఓ యువకుడు సూపర్ మార్కెట్లకు వెళ్లిన ప్రతిసారి తిరుగు ప్రయాణంలో అంబులెస్స్‌కు ఫోన్ చేశాడు. అలా చాలా సార్లు మెడికల్ ఎమెర్జెన్సీ అని కాల్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. చదవండి: సిగరెట్ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రిలో చేరినవారు చికిత్స తీసుకుంటారు. కానీ, ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ కనిపించకుండా వెళ్లిపోవడాన్ని ఆస్పత్రి సిబ్బంది గమనించారు. మరోసారి ఇలా జరిగినప్పుడు అతన్ని ఆస్పత్రి సిబ్బంది పట్టుకొని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను ఆస్పత్రి అంబులెన్స్‌కు పదేపదే కాల్ చేయడానికి కారణం ఏంటని అడగ్గా.. సూపర్ మార్కెట్ నుంచి తన ఇంటికి వెళ్లడానికి అంబులెన్స్‌ను టాక్సీలా వాడుకుంటున్నాని తెలపడంతో ఆశ్చర్యపోవటం ఆస్పత్రి సిబ్బంది వంతైంది. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: విదేశాంగ మంత్రి అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్పత్రి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి అంబులెన్స్ సేవలను దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా కూడా విధిస్తామని పోలీసులు సదరు యువకుడిని హెచ్చరించారు. అయితే అతని ఇల్లు పక్కనే ఆస్పత్రి ఉండటంతోపాటు, సూపర్ మార్కెట్ కూడా కేవలం 200 మీటర్లు దూరంలో ఉండటంపై సోషల్ మీడియాలో ఆ యువకుడి చేసిన పనికి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
తైవాన్‌కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు
తైపీ: తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో అయిదుగురు అమెరికా ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా ఆదేశానికి వెళ్లారు. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ను శుక్రవారం కలుసుకున్నారు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా తైవాన్, చైనా మధ్య ఘర్షణలు తారాస్థాయికి వెళ్లాయి. తైవాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధినేత బైడెన్‌కు ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. -
పోటాపోటీ పెద్దన్నలు!
ఒకరు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు బైడెన్... మరొకరు అగ్రస్థానానికి దూసుకువస్తున్న చైనా దేశాధినేత షీ జిన్‌పింగ్. ప్రపంచాన్ని శాసించే విషయంలో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న ఈ రెండు దేశాల అధినేతలూ కలసి మాట్లాడుకొంటే, అంతకన్నా పెద్ద వార్త ఏముంటుంది? వీడియో కాన్ఫరెన్స్‌లో అయితేనేం, సోమవారం నాటి ఈ అగ్రజుల భేటీ మీద అందరి దృష్టీ పడింది అందుకే! కానీ, చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికా... తైవాన్ అంశంలో అమెరికా వేలు దూర్చాలనుకోవడం నిప్పుతో చెలగాటమని హెచ్చరించిన చైనా... – ఇలాంటివే పతాక శీర్షికలకు ఎక్కాయి. అంటే, మూడున్నర గంటలు సాగిన ఈ భేటీ నిజంగా సాధించినదేమిటని అనుమానం రాక మానదు. రెండు దేశాల మధ్య అనేక విభేదాలున్నాయనీ, పోటీ తప్పదనీ మినహా ఈ చర్చల్లో తేలిన విషయం, చెప్పుకోదగ్గ విజయం ఏమిటన్నది విశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్న. ఈ స్థాయి చర్చలు ముగిశాక సాంప్రదాయిక సంయుక్త ప్రకటనైనా వెలువడకపోవడం గమనార్హం. ఇద్దరు నేతలూ ఈ ఏడాది రెండుసార్లు ఫోన్లలో మాట్లాడుకున్నా, ఈ వీడియో భేటీ అనేక అంశాలపై లోతైన చర్చకు తావిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ‘ఈ భేటీతో మేమేమీ అద్భుతాలు ఆశించలేదు. అదే జరిగింది’ అని తేల్చేశారో అమెరికన్ అధికారి. అయితే, నికర విలువ పరంగా, అమెరికాను దాటుకొని, ప్రపంచంలోనే ధనిక దేశంగా నంబర్ వన్ స్థానానికి చైనా ఎగబాకిందని తాజా మెకిన్సే నివేదిక తేల్చింది. ఆ పురోగతికి తగ్గట్టే, వాషింగ్టన్కు సమవుజ్జీ తామేనని బీజింగ్ భావిస్తున్నట్టు చర్చల్లో ఆ దేశాధ్యక్షుడి వైఖరి చెప్పకనే చెప్పింది. మానవ హక్కుల గురించి, ఉపఖండంలో దూకుడు గురించి అమెరికా సుద్దులు చెబితే చైనా డూడూ బసవన్నలా తల ఊపే పరిస్థితి కనపడలేదు. పైపెచ్చు, తాము అంతర్భాగమని భావించే తైవాన్ స్వాతంత్య్రంపై జోక్యం చేసుకుంటే తస్మాత్ జాగ్రత్త అని చైనా మాటకు మాట అప్పగించింది. ఆత్మవిశ్వాసంతో, నిక్కచ్చిగా మాట్లాడుతున్న చైనా మాటలను అమెరికా సావధానంగా వినక తప్పలేదు. అంతే కాదు... ‘మేము ప్రధాన ప్రపంచ లీడర్. అలాగే మీరు కూడా’ అని చైనాతో అమెరికా అంటే అది సహజం. కానీ ఈ భేటీలో బైడెన్, షీని ఉద్దేశించి, ‘మీరు (చైనా) ప్రధాన ప్రపంచ లీడర్. అలాగే అమెరికా కూడా’ అంటూ, చైనాకు పెద్ద పీట వేసి మాట్లాడడం మారిన పరిస్థితులకు ప్రత్యక్ష నిదర్శనం. చైనా జోరుకు బ్రేకులు పడేలా, భావసారూప్యం ఉన్న ప్రజాస్వామ్య దేశాలతో కలసి ‘క్వాడ్’ సహా రకరకాల పేర్లతో జట్టు కట్టడం అమెరికా వ్యూహం. ఈ వ్యూహాన్ని చైనా పరోక్షంగా ప్రస్తావించింది. శిబిరాల ఏర్పాటు వల్ల ప్రపంచానికి మళ్ళీ ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఉత్పాతం తప్ప ఒరిగేదేమీ లేదన్న షీ జిన్‌పింగ్ వ్యాఖ్య తీవ్రమైనదే. బైడెన్ సైతం షింజియాంగ్, టిబెట్, హాంగ్‌కాంగ్‌లలో చైనా అనుసరిస్తున్న విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘన వార్తల లాంటి ఘాటైన అంశాలను నిర్మొహమాటంగా షీతో ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్రయాన ప్రాధాన్యం గురించి లేవనెత్తారు. అదే సమయంలో పరస్పరం పోటీపడినప్పటికీ, ఘర్షణకు దిగకుండా, పర్యావరణ మార్పు లాంటి ఉమ్మడి ప్రయోజనాలున్న కీలక అంతర్జాతీయ అంశాల్లో కలసి పనిచేయాలంటూ అమెరికా అనడం ఆహ్వానించదగినది. ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం అంతర్జాతీయ బాధ్యతలలో ఇరుదేశాలూ భుజం కలపాలని చైనా అధినేత సైతం అంగీకరించారు. కానీ, వాస్తవంగా వాటి గురించి ఈ భేటీలో ఎంత చర్చ జరిగిందంటే, మళ్ళీ ప్రశ్నార్థకమే. ఇటీవలే ముగిసిన ప్రపంచ పర్యావరణ సదస్సు ‘కాప్–26’ సైతం పర్యావరణ పరిరక్షణకు అగ్రరాజ్యాలు చేయాల్సిన త్యాగాలను కుండబద్దలు కొట్టింది. ఆ సదస్సులో ఇరుదేశాల ప్రతినిధులూ ఒప్పందం కుదుర్చుకున్నా, ఇప్పుడీ భేటీలో అంతకు మించిన ఆచరణాత్మక ప్రణాళికను ప్రకటించే చొరవ దేశాధ్యక్షులు తీసుకోలేదు. కానీ పనిలో పనిగా అనేక అంశాల్లో చైనా తనను తాను సమర్థించుకుంది. భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంట, జపాన్‌తో సముద్రజలాలపైన చైనా ప్రదర్శిస్తున్న దూకుడుపై వస్తున్న విమర్శలను తగ్గించే ప్రయత్నం చేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా చైనా తనకు తానుగా ఏ యుద్ధాన్నీ మొదలుపెట్టలేదనీ, ఇతర దేశాల నుంచి అంగుళమైనా ఆక్రమించలేదనీ, దురాక్రమణ – ఆధిపత్యం తమ రక్తంలోనే లేవనీ నాణేనికి ఒక వైపునే చూపెట్టింది. ప్రజాస్వామ్యమనేది ఏకరూప నమూనాలో ఉండదనీ, తమదైన పద్ధతిలో లేవని ఆ ప్రజాస్వామ్యాలను కొట్టిపారేస్తే అది అప్రజాస్వామికమనీ అమెరికాకు పాఠాలూ చెప్పింది. ట్రంప్ కాలం నుంచి ఇరుదేశాలూ వాణిజ్య, సాంకేతిక పోటీ విషయంలో వాదులాడుకుంటున్నాయి. అలాగని సరఫరా వ్యవస్థల కొరత, ద్రవ్యోల్బణం, ట్యారిఫ్లను తగ్గించే అవకాశం లాంటి ఆర్థిక అంశాలేవీ తాజా భేటీలో చర్చించినట్టు లేరు. ఇకపై జరిగే వాణిజ్య చర్చల్లో చైనా పట్ల అమెరికా కొంత మెత్తబడేందుకు ఈ పెద్దల వర్చ్యువల్ భేటీ దారులు వేస్తుందని చైనా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘పోటీ ఓకే కానీ, పోరాటం వద్దు. పర్యవసానంగా సంబంధాలు చెడగొట్టుకోవద్దు’ అన్నదే ఈ పెద్దన్నల మాటల్లో తేలిన విషయం. ఈ మార్చిలో అలాస్కాలో రెండు దేశాల సీనియర్ అధికారుల మధ్య రెండు రోజుల పాటు మూడు రౌండ్ల చర్చల వేళ నిందారోపణలు బయటపడితే, ఈసారి స్వరం మారడం కొంత శుభసూచకం. విభేదాలున్నా, అవి విపరీత ఘర్షణకు దారితీయకూడదన్న వివేకం ప్రపంచానికి మంచిదే! ఇటుపై దీన్ని ఎలా ముందుకు తీసుకెళతారో చూడాలి. -
నిప్పుతో చెలగాటలొద్దు! మరోసారి నోరు పారేసుకున్న జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధినేత జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అని జిన్ పింగ్ నోరు వ్యాఖ్యానించినట్టు చైనా మీడియా అధికారికంగా వెల్లడించింది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య మంగళవారం వర్చువల్ సమావేశం జరిగింది. దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో రెండు అగ్ర రాజ్యాల మధ్య దెబ్బతిన్న ధ్వైపాక్షిక సంబంధాలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. చదవండి: అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా..ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా అవిర్భావం ఈ సందర్భంగా తైవాన్ విషయం చర్చలోకి రావడంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తైవాన్ను తమ భూభాగమని వాదిస్తోన్న చైనా.. అమెరికాను జోక్యం చేసుకోవద్దని పరోక్షంగా హెచ్చరించింది. ‘స్వాతంత్ర్యం కోసం తైవాన్ అధికారులు అమెరికాపై అధారపడుతున్నారు. అంతేగాక యూఎస్‌లోని కొంతమంది తైవాన్ను ఉపయోగించి చైనాను నియంత్రించాలని చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. నిప్పుతో ఆడుకోవడం లాంటిది. నిప్పుతో చెలగాటమాడితే కాలిపోతారు" అని చైనా అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్టు కథనాలు వెలువడ్డాయి. రెండు అగ్ర దేశాల మధ్య నెలకొన్న వైరుధ్యాలను తొలగించేందుకు, ధ్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరిచేందుకు ఈ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. వైట్‌హౌజ్ నుంచి జో బైడెన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఉన్న పోటీ ఉద్ధేశపూర్వకంగా అనాలోచితంగా విభేదాలుగా మారకుండా చూసుకోవాలని అన్నారు. దీనికి బదులుగా బీజింగ్ నుంచి జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘బైడెన్ నా పాత మిత్రుడే కానీ ప్రత్యర్థులు మరింత సన్నిహితంగా పనిచేయాలి’ అని ఆకాంక్షించారు. చైనా-యూఎస్ మధ్య కమ్యూనికేషన్‌ను, సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. -
తైవాన్‌కు అమెరికా అండ
బీజింగ్: తైవాన్‌పై చైనా దురాక్రమణకు సిద్ధమైతే తాము చూస్తూ ఊరుకోబోమని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. తైవాన్‌కు అండగా ఉంటూ రక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. కానీ, డ్రాగన్ దేశం తప్పులు చేస్తూ ఆ దిశగా తమని ప్రేరేపిస్తోందని ఆరోపించారు. తైవాన్ను కాపాడే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనాకు అర్థం కావడానికే ఈ విషయం చెబుతున్నానని, తమ బలమేంటో అందరికీ తెలుసని అన్నారు. తైవాన్ను తమ దేశంలో కలిపేసుకోవడానికి చైనా ఇటీవల కపట వ్యూహాలు పన్నుతోంది. తైవాన్ గగన తలం మీదుగా యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల వెంబడి సైనిక కవాతు నిర్వహిస్తోంది. కాగా, బైడెన్ వ్యాఖ్యల్ని చైనా తిప్పి కొట్టింది. తైవాన్ అంశంలో తాము ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదంది. తైవాన్ తమ భూభాగం కిందకే వస్తుందని పునరుద్ఘాటించింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, ప్రయోజనాలపై రాజీ పడబోమని తేల్చి చెప్పింది. -
ఈవీ తయారీలోకి ఫాక్స్‌కాన్.. భారత్‌లో కూడా!
Taiwan Foxconn EV India: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్, క్రేజ్ పెరుగుతున్న తరుణంలో పలు కంపెనీలు ఆటోమొబైల్ రంగం వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ ఈవీ తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. తైవాన్ టెక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ మేరకు బుధవారం ఫాక్స్‌కాన్ చైర్మన్ లీయూ యంగ్ వే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జర్మన్ ఆటోమేకర్స్ పరోక్ష సహకారంతో ఈ వాహనాల ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు సోమవారం మూడు కార్ల నమునాను సైతం లీయూ, తైపీలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శించారు. భారత దేశంతో పాటు యూరప్, లాటిన్ అమెరికా ఖండాల్లో ఈవీ వాహనాల తయారీని చేయనున్నట్లు ప్రకటించారాయన. ఇటలీ సంస్థ పినిన్‌ఫార్నియా డెవలప్ చేస్తున్న ‘ఇ సెడాన్’ మోడల్‌ను 2023లో విడుదల చేయనున్నట్లు, ఐదు సీట్లు కలిగిన ‘మోడల్ ఇ’ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే జర్మన్ టెక్నాలజీ నేపథ్యంలో తమ తొలి ప్రాధాన్యం యూరప్‌గానే ఉంటుందన్న లీయూ, ఆ తర్వాతి ప్రాధాన్యం మాత్రం భారత్‌లోనేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తైవాన్‌కు చెందిన హోన్ హాయ్ ప్రెసిషన్ కంపెనీ.. ఎలక్ట్రిక్ గూడ్స్ తయారీలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ట్యూచెంగ్ కేంద్రంగా అంతర్జాతీయంగా 13 లక్షల ఉద్యోగులతో భారీ మార్కెట్‌ను విస్తరించుకుంది. అంతేకాదు తైవాన్‌లో యాపిల్ ప్రొడక్టులకు సప్లయర్‌గా ఉంది. క్లిక్ చేయండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి గుడ్‌న్యూస్ -
తైవాన్‌లో భారీ అగ్నిప్రమాదం, 46 మంది ఆహుతి
తైవాన్ : తైవాన్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 46 మంది సజీవం దహనమైనారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ తైవాన్‌లో కౌహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల టవర్ బ్లాక్‌లో ఉదయం 3 గంటలకు మంటలు చెలరేగాయని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. బారీగా ఎగిసిన అగ్నికీలల్లో 46 మంది చిక్కుకొని అక్కడిడక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటలను అదుపులోకి తీసుచ్చిన రక్షణ, సహాయ దళాలు, బాధితుల కోసం గాలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ముందు పేలుడు శబ్దం వచ్చినట్లు పెద్ద శబ్దం వినిపించిందని సమీప నివాసితులు స్థానిక మీడియాకు తెలిపారు. భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది నాలుగు గంటలకు పైగా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందనీ, భవనంలోనిని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. At least 46 people have died in a 13-story building fire in Kaohsiung, Taiwan. The cause remains unclear but firefighters noted the flames burned most intensely where a lot of clutter was piled, and eyewitnesses say they heard an explosion around 3am https://t.co/PYjqh1dkls pic.twitter.com/XNqnJqLmTX — Bloomberg Quicktake (@Quicktake) October 14, 2021 -
Xi Jinping: తైవాన్ విలీనం తప్పనిసరి!
బీజింగ్: తైవాన్ను చైనాతో విలీనం చేసితీరతామని ఆదేశాధ్యక్షుడు జీ జింగ్పింగ్ మరోమారు స్పష్టం చేశారు. తైవాన్ విలీనం శాంతియుతంగా, ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అవసరం లేదంటూ పరోక్షంగా యూఎస్, జపాన్‌కు హెచ్చరికలు పంపారు. ఇటీవల కాలంలో తైవాన్ గగనతలంలోకి పలుమార్లు చైనా విమానాల చొరబాట్లు జరిగాయి. ఎప్పుడైనా చైనా తమను బలవంతంగా ఆక్రమిస్తుందని తైవాన్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. మరోవైపు తైవాన్‌కు అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఇందుకోసం తైవాన్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. తైవాన్ సార్వభౌమదేశంగా తనను తాను భావిస్తుండగా, చైనా మాత్రం అది తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతంగా భావిస్తోంది. చైనా విముక్తి వార్షికోత్సవాల్లో జింగ్పింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. చైనాతో తైవాన్ విలీనానికి తైవాన్ స్వాతంత్య్ర దళాలే అతిపెద్ద అడ్డంకన్నారు. తమతో కలవడంతో కలిగే ప్రయోజనాలను తైవాన్ భవిష్యత్‌లో గ్రహిస్తుందన్నారు. తైవాన్ విలీనం చైనీయులందరి కోరికగా అభివరి్ణంచారు. చదవండి: చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం వివాదం ఎందుకు? 1911 తిరుగుబాటు అనంతరం చైనా పాలన కిందకు తైవాన్ వచ్చింది. 1949 నుంచి తైవాన్ స్వతంత్య్రం కోసం పోరాడుతోంది. అయితే బలప్రయోగం ద్వారానైనా తైవాన్ను కలుపుకోవాలన్నది చైనా యోచనగా నిపుణులు భావిస్తున్నారు. తైవాన్ అగ్రిమెంట్‌ను చైనా గౌరవిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధిపతి బైడెన్ చెప్పారు. ఒప్పందాన్ని ఉల్లంఘించే చర్యలుండవని ఆశిస్తున్నామన్నారు. చైనా మాత్రం తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అక్కర్లేదని ఘాటుగా బదులిచి్చంది. ఇది తమ అంతర్గత వ్యవహారమని చెప్పింది. హాంకాంగ్లాగానే వన్ కంట్రీ, టూ సిస్టమ్స్ విధానాన్ని తైవాన్‌తో కుదుర్చుకుంటామని చైనా చెబుతోంది. కానీ హాంకాంగ్ విషయంలో చివరకు చైనా పెత్తనమే అంతిమమైంది. పైగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనే తమ లక్ష్యమని చైనా పేర్కొంటోంది. తైవాన్ అధ్యక్షుడు సైఇంగ్ వెన్ మాత్రం తమకు స్వాతంత్య్రమే అక్కర్లేదన్నారు. జింగ్పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. అయితే సవరణలతో జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయన యత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. చదవండి: సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా -
తైవాన్–కనెక్ట్ తెలంగాణ: పెట్టుబడులకు రెడ్ కార్పెట్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, అనుబంధ రంగాల్లో తైవాన్‌తో బలమైన భాగస్వామ్యం కుదుర్చుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘తైవాన్–కనెక్ట్ తెలంగాణ స్టేట్’ వర్చువల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని, తైవాన్ తెలంగాణ నడుమ మరింత వ్యాపార, వాణిజ్య అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న పెట్టు బడి అవకాశాలపై కంపెనీలకు అవగాహన కల్పిం చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కేటీ ఆర్ ప్రకటించారు. తైవాన్ తెలంగాణ నడుమ ఇప్పటికే పటిష్టమైన భాగస్వామ్యం ఉందని, ఆ దేశ పెట్టుబడుల కోసం గతంలో తాను తైవాన్‌లో పర్యటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. స్టార్టప్ బంధంలో ఏకైక నగరం.. తైవాన్‌కు చెందిన తైవాన్ కంప్యూటర్ అసోసి యేషన్ (టీసీఏ)తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, తైవాన్‌తో స్టార్టప్ బంధం ఏర్పరచుకున్న ఏకైక నగరం హైదరాబాదేనని కేటీఆర్ వెల్లడించారు. తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉందని, ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2020 నుంచి కరోనా సంక్షోభం విసిరిన సవాళ్లతో దెబ్బతిన్న వ్యాపార, వాణిజ్య రంగాలు మెరుగవుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేలా పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్లలో తెలంగాణ 32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు జీడీపీ, తలసరి ఆదాయం, సులభతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో నిలుస్తోందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణతో కలసి పనిచేయడం తమకు అత్యంత ఉత్సాహాన్ని ఇస్తోందని ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ దీపక్ బగ్లా అన్నారు. తైవాన్‌కు తెలంగాణ రాష్ట్రం సహజ భాగస్వామి అని, రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్, అనుబంధ రంగాల్లో ఇరు ప్రాంతాల నడుమ భాగస్వామ్యం మరింత పెంచుతామన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. -
తైవాన్ ఎక్సలెన్స్ గేమింగ్ కప్‌లో భారత్ నుంచి 8 వేల మంది..
తైపీ: విభిన్న రకాల ఆన్లైన్ గేమ్స్‌లో పోటీపడేందుకు రూ.10లక్షల దాకా ప్రైజ్ మనీని పొందేందుకు అవకాశం అందించే ఆన్లైన్ ఆటల సందడి మొదలైంది. అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ గేమింగ్ ప్రియుల ఆదరణ పొందిన తైవాన్ ఎక్స్‌లెన్స్ గేమింగ్ కప్ (టిఇజిసి) క్వాలిఫైర్స్ 2వ రౌండ్ అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టిఇజిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ తైవాన్ ఎక్స్‌లెన్స్ మార్క్ వ్యూ తెలిపారు. గత 16వ తేదీన ప్రారంభమైన ఈ గేమింగ్ సందడి డిసెంబరు 5తో ముగుస్తుందనీ, ఈ స్పోర్ట్స్ ప్రియులు అత్యధిక సంఖ్యలో ఈసారి భారత్ నుంచి పాల్గొన్నారని వివరించారు. ఈ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 8వేల మందిపైగా నమోదు చేసుకున్నారన్నారు. ఈ ఏడాది పలు ప్రాచుర్యం పొందిన కొత్త గేమ్స్ తాము పరిచయం చేశామని, అత్యాధునిక గేమింగ్ టెక్నాలజీని అందిస్తున్నామని తెలిపారు. చదవండి: తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్, కోహ్లి -
ఆ దేశం పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్
-
ఆ విషయంలో చైనాకు చెక్ పెట్టేలా ఇండియా ప్లాన్ !
chipset Crisis : చిప్సెట్ల తయారీలో స్వయం సమృద్ధి దిశగా ఇండియా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చైనాపై ఆధారపడకుండా దేశ అవరసరాలకు తగ్గట్టుగా చిప్సెట్ల తయారీపై దృష్టి సారించింది. తగ్గిన ఉత్పత్తి కరోనా ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చిప్సెట్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో మొబైల్ ఫోన్ నుంచి మొదలుపెడితే కార్ల తయారీ వరకు అనేక పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. చిప్సెట్ల కొరత కారణంగా కార్లు, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామార్థ్యం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనాకి చెక్ ఇండియాలో ఉపయోగిస్తున్న చిప్సెట్లలో సింహభాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. అయితే సంక్షోభ సమయంలో చిప్ సెట్ల సరఫరా విషయంలో భారత్‌కి స్పష్టమైన హామీ చైనా నుంచి రాలేదు. దీంతో ఎల్లకాలం చైనాపై ఆధారపడకుండా స్వంతంగా భారీ ఎత్తున చిప్‌లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెరపైకి తైవాన్ చిప్సెట్ల తయారీలో తైవాన్‌కి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. తైవాన్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. దీంతో సాంకేతిక రంగంలో తైవాన్ ప్రాధాన్యతను భారత్ గుర్తించింది. ఈ మేరకు భారత్ తరఫున ఇటీవల అధికారుల బృంధం తైపీలో పర్యటించారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఒప్పందం అయితే తైవాన్, భారత్‌ల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించిన అంశాలను ఇరు దేశాలు బాహాటంగా ఇంకా ప్రకటించలేదు. అయితే ఉన్నతస్థాయి అధికార వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం 7.5 బిలియన్ల డాలర్ల వ్యయంతో ఇండియాలో చిప్‌ల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తైవాన్ ఇండియాకు అందిస్తుంది. ఈ మేరకు చిప్సెట్ల తయారీ పరిశ్రమ ఎక్కడ నెలకొల్పానే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 5జీ టెక్నాలజీ తైవాన్ , భారత్ ప్రభుత్వం మధ్య కుదిరే ఒప్పందం ప్రకారం చిప్ తయారీ పరిశ్రమ స్థాపనకు అవుతున్న వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ గవర్నమెంట్ భరిస్తుంది. అంతేకాకుండా ట్యాక్సుల్లో కూడా మినహాయింపు ఇస్తుంది. తైవాన్ సంస్థ నెలకొల్పే చిప్ తయారీ పరిశ్రమలో 5జీ టెక్నాలజీకి సంబంధించిన చిప్సెట్ల నుంచి కారు తయారీ వరకు ఉపయోగించే అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్‌ని తయారు చేస్తారు. బోల్డ్ స్టెప్ తూర్పు లధాఖ్ ప్రాంతంపై ఇండియా చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తైవాన్‌తో కూడా చైనాకు సత్సంబంధాలు లేవు. పదే పదే చైనా యుద్దవిమానాలు తైవాన్ గగనతలంలోకి దూసుకొస్తున్నాయి. అయితే తైవాన్‌కి అండగా అమెరికా నిలబడింది. ఈ తరుణంలో ఏషియాలో కీలకమైన చైనాను కాదని తైవాన్‌తో భారీ వాణిజ్యం ఒప్పందం భారత్ చేసుకుంది. ఇకపై చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తామని పరోక్షంగా చెప్పింది. అయితే ఈ ఒప్పందంపై అధికార ప్రకటన రాకపోవడంతో చైనా అధికార బృందం మౌనంగా ఉంది. చదవండి : చిప్‌ల కొరత, కలవరంలో కార్ల కంపెనీలు -
సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?
Ever Given In Suez Canal Again ప్రపంచ వాణిజ్యంలో 15 శాతానికి పైగా నిర్వహించే సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కిపోయి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎవర్ గీవెన్ నౌక ఇప్పుడెక్కడుంది. సూయజ్ నుంచి ఎవర్ గీవెన్‌ని తొలగించిన తర్వాత ఏం జరిగింది. సూయజ్‌లో ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య నౌకల్లో ఎవర్ గీవెన్ ఒకటి. దాదాపు 400 మీటర్ల పొడవైన ఈ నౌకలో ఒకేసారి 2.20 లక్షల టన్నుల సరుకును తరలించే వీలుంది. ఇంత భారీ నౌక మధ్యధర సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు ప్రయాణిస్తూ 2021 మార్చి 23న కాలువలో కూరుకుపోయింది. పెనుగాలుల తీవ్రంగా కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. కూరుకుపోయిన నౌకను బయటకు తీసేందుకు ఆరు రోజుల సమయం పట్టింది. దీంతో ఆరు రోజుల పాటు ఈ కాలువ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయి బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మూడు నెలల తర్వాత సూయజ్ కాలువ నుంచి బయటకు తీసిన తర్వాత ఎవర్‌గీవెన్ నౌకను సూయజ్ కెనాల్ అథారిటీ సీజ్ చేసింది. ఆరు రోజుల పాటు కెనాల్ బ్లాక్ అయినందుకు గాను 916 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీంతో ఇటు సూయజ్ కెనాల్ అథారిటీ, ఎవర్‌గీవెన్ నౌక యాజమాన్యమైన షోయ్ కిసెన్ ఖైషా, ఇన్సురెన్స్ సంస్థల మధ్య చర్చలు జరిగాయి. మూడు నెలల చర్చల అనంతరం వీరి మధ్య 600 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఎవర్‌గీవెన్ నౌకను జులై 7న రిలీజ్ చేశారు. సూయజ్ టూ ఇంగ్లండ్ సూయజ్ కెనాల్ నుంచి రిలీజైన తర్వాత మరమ్మత్తులు నిర్వహించి జులై 29న హలండ్‌లోని రోటర్‌డ్యామ్‌కు చేరుకుంది,.అనంతరం ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌టోవ్ పోర్టుకు చేరుకుంది, అక్కడ మరోసారి సరుకులు నింపుకుని వాణిజ్య ప్రయాణానికి రెడీ అయ్యింది. ఆగస్టు 20న ఇంగ్లండ్ నుంచి చైనాకు ప్రయాణమైన ఎవర్ గీవెన్ ఆగస్టు 20న మరోసారి సూయజ్ కాలువని దాటింది. మరోసారి ప్రమాదం జరగకుండా సూయజ్ కెనాల్ అథారిటీ జాగ్రత్తలు తీసుకుని. ఎవర్‌గీవెన్‌కు తోడుగా రెండు టగ్ బోట్లను కూడా పంపింది. ఎవర్‌గీవెన్‌తో పాటు ఒకేసారి 26 చిన్న నౌకలు సైతం సూయజ్‌ను దాటినట్టు ఈజిప్టు మీడియా పేర్కొంది. 22వ సారి ఎవర్‌గీవెన్ నౌకను తైవాన్‌కు చెందిన తైవాన్‌కు చెందిన ఎవర్గ్రీన్ షిప్టింగ్ సంస్థ 2018లో తయారు చేసింది. ఈ భారీ నౌక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రపంచ యాత్రలు చేసింది. సూయజ్ కాలువను 21వ సారి దాటే క్రమంలో మట్టి దిబ్బల్లో ఇరుక్కుపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఎవర్‌గీవెన్‌పై పడింది. ఆ వివాదం నుంచి బయటపడి విజయవంతంగా 22వ సారి సూయజ్ కాలువను దాటింది. -
చైనా కావరం.. అణు బాంబులేస్తామని బెదిరింపులు
డ్రాగన్ కంట్రీ మరోసారి తన తలపొగరును ప్రదర్శించింది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే న్యూక్లియర్ వార్ తప్పదని జపాన్ను గట్టిగానే హెచ్చరించింది. ఈ మేరకు ఏకంగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక ఛానెల్ ఓ వీడియోను ప్రసారం చేసింది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే గనుక ఊరుకునేది లేదని చెబుతూ.. అవసరమైతే అణు ఆయుధాలు ప్రయోగిస్తామని జపాన్ను హెచ్చరించింది చైనా. ‘‘తైవాన్ విషయంలో కలుగజేసుకున్నందుకు జపాన్‌పై మేం బాంబులు వేస్తాం. ఆ తర్వాత లొంగిపోయామని జపాన్ మమ్మల్ని బతిమాలుకునేదాకా రెండోసారి బాంబులేస్తాం. తైవాన్ విముక్తి మా చేతుల్లో ఉన్న అంశం. జపాన్ జోక్యం సహించే ప్రసక్తే లేదు. జపాన్‌కు సంబంధించి ఒక్క యుద్ధ విమానం, ఒక్క సైనికుడు తైవాన్ సరిహద్దులో కనిపించినా ఆ దేశాన్ని(జపాన్) నామరూపాల్లేకుండా సర్వనాశం చేస్తామని’ని ఆ వీడియోలో కొందరు సైనికులు మాట్లాడినట్లు ఉంది. #CCP Vows to Nuke #Japan if Japan defends #Taiwan. As Japan is the only country that has been nuked, so nuking Japan "will get twice the result with half the effort." 中共軍事頻道威脅對日本實施連續核打擊,直到日本第二次無條件投降。 pic.twitter.com/dp45R2LXtD — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) July 13, 2021 పైగా చైనా అధికారిక ఛానెల్ సీసీపీకి సంబంధించిన ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనే ఈ వీడియో ప్రదర్శితం కావడం విశేషం. అయితే 2 మిలియన్ల వ్యూస్ తర్వాత ఆ వీడియోను ఛానెల్ డిలీట్ చేయగా.. యూట్యూబ్, ట్విటర్లో మాత్రం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తైవాన్ సార్వభౌమాధికారం-సౌభ్రాతృత్వం కాపాడేందుకు తాము ముందు ఉంటామని జపాన్ రెండు వారాల కిందట ప్రకటన చేసింది. బయటి శక్తులు తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తే.. అండగా నిలబడతామని జపాన్ డిప్యూటీ పీఎం తారో అసో ప్రకటించారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో మిలిటరీ ఫ్యాన్ బాయ్స్ పేరిట చైనా నుంచి ఈ వీడియో రిలీజ్ అయ్యింది. -
ఆస్ట్రాజెనికా లాగే పవర్ఫుల్.. ‘మెడిజెన్’కు గ్రీన్ సిగ్నల్!
తైపీ: కోవిడ్-19పై పోరులో తైవాన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కరోనా నిరోధక వాక్సిన్ల కొరత వేధిస్తున్న తరుణంలో స్థానికంగా తయారైన మెడిజెన్ టీకా వాడకానికి అత్యవసర అనుమతి ఇస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా టీకా వలె ప్రభావంతంగా పనిచేస్తూ, మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని తెలిపింది. ఈ మేరకు తైవాన్ ఆరోగ్య శాఖ.. ‘‘నిపుణుల బృందం మెడిజెన్ టీకా ఎమర్జెన్సీ వినియోగానికి ఆమోదం తెలిపింది. పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయాలు లేవని స్పష్టం చేసింది. ఆగష్టు మొదటి వారం నుంచే టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా తైవాన్ ఆరోగ్య శాఖా మంత్రి చెన్ షిహ్- చుంగ్ మాట్లాడుతూ.. త్వరలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచనున్నట్లు మెడిజెన్ తెలిపిందన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా ఎమ్వీసీ-కోవ్1901 పేరుతో మెడిజెన్ వాక్సిన్ బయోలాజిక్స్ కార్పొరేషన్ కోవిడ్ టీకాను ఉత్పత్తి చేస్తోంది. రెండో దశ ప్రయోగాల్లో సత్ఫలితాలు వచ్చాయని, క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావాల్సి ఉందని కంపెనీ ఇటీవల ప్రకటించింది. అయితే, 20 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే రెండు డోసుల్లో టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా చైనా మెయిన్‌లాండ్‌లో భాగమైన తైవాన్‌లో గతేడాది తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, సెకండ్‌వేవ్‌లో ఎయిర్‌లైన్ పైలెట్ల ద్వారా కోవిడ్ వ్యాప్తి తీవ్రమై, సుమారు 800 మంది మరణాలకు దారితీసింది. ఇక ఇప్పటికే తైవాన్ స్వతంత్ర భావజాలంపై చైనా ఇప్పటికే కన్నెర్ర చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఫైజర్ టీకా కొనుగోలు విషయంలో తాము చేస్తున్న ప్రయత్నాలకు డ్రాగన్ దేశం గండికొట్టిందని తైవాన్ ఆరోపించింది. అదే సమయంలో.. తమకు అండగా నిలుస్తున్న అమెరికా ఇప్పటికే 25 లక్షల వ్యాక్సిన్ డోసులను, జపాన్ 3.37 మిలియన్ టీకా డోసులను విరాళంగా ఇచ్చినట్లు తైవాన్ వెల్లడించింది. అదే విధంగా ఫోక్సోకాన్ అండ్ తైవాన్ సెమికండక్టర్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ సైతం 5 మిలియన్ వాక్సిన్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా మొత్తం 23 మిలియన్ జనాభా కలిగిన తైవాన్ ప్రస్తుతం స్థానికంగా తయారైన టీకా వాడకానికి ఆమోదం తెలపడం ద్వారా వాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు అడుగులు వేస్తోంది. -
జూడో క్లాస్; బాలుడిని 27 సార్లు నేలకేసి కొట్టాడు
తైపీ: జూడో క్లాస్ ఏడేళ్ల బాలుని నిండు ప్రాణాలు తీసింది. జూడోక్లాస్ అంటూ కోచ్ 27 సార్లు ఆ బాలుడిని నేలకేసి కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. 70 రోజుల పాటు కోమాలో ఉన్న ఆ బాలుడికి కొన్ని రోజులగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఉన్నట్టుండి బాలుడి శరీరంలో కొన్ని కీలక అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో తల్లిదండ్రుల అనుమతితో వైద్యులు బాలుడిని వెంటిలేటర్ పైనుంచి తొలగించారు. ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. ఏడేళ్ల హువాంగ్ జూడో నేర్చుకోవడానికి ఏప్రిల్ నెలలో హో అనే కోచ్ వద్ద చేరాడు. జూడో బాగా రావాలంటే శారీరకంగా బలంగా ఉండాలని అక్కడికి వచ్చే పిల్లలకు చెబుతూ వారిపై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వేధించేవాడు. గత ఏప్రిల్ 21న హువాంగ్ను టార్గెట్ చేసిన కోచ్ హో వాడిని పిలిచి జూడో మూమెంట్స్ అంటూ నేలకేసి కొట్టడం ప్రారంభించాడు. 12సార్లు కిందపడేసిన తర్వాత హువాంగ్ తల నొప్పిగా ఉందంటూ వాంతి చేసుకున్నాడు. ఆ తర్వాత తనను వదిలేయాలంటూ ఎంత ప్రాధేయపడినా కోచ్ కనికరించలేదు. మొత్తంగా 27 సార్లు నేలకేసి కొట్టడంతో ఆ బాలుడు సృహతప్పి పడిపోయాడు. దీంతో హువాంగ్ ప్రాణాలు పోయాయేమోన్న భయంతో హో అక్కడి నుంచి పారిపోయాడు. క్లాస్‌లో ఉన్న మిగతా పిల్లలు పోలీసులకు సమాచారం అందించడంతో హువాంగ్ను ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన ఆ బాలుడు 72 రోజలు పాటు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. కాగా బుధవారం హువాంగ్‌కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో పాటు అవయవాలు పనిచేయకపోవడంతో వెంటిలేటర్ నుంచి తొలగించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. కోచ్ హోపై కేసు నమోదు చేసిన పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల
తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్.. ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ ‘ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13’ను అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన జిఫిరస్ సిరీస్‌లో మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. 13 అంగుళాలతో ఏఎండీ రైజెన్ 5900హెచ్ఎస్, 5900హెచ్ఎక్స్ ప్రాసెసర్లతో కూడిన ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13 ల్యాప్‌టాప్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ఓజీ జెఫిరస్ డ్యూయో 15 ఎస్ఈ, జీ14, జీ15 మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌ల ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతాయని పేర్కొంది. ఆసుస్ ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13 విండోస్ 10 ల్యాప్‌టాప్ మీ రోజువారీ అవసరాల కోసం 13.4 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎమ్ డీ ఆక్టా కోర్ రైజెన్ 9 5900 హెచ్ఎస్ ప్రాసెసర్ ఉంది, దీనితో పాటు 16 జిబి ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డి స్టోరేజ్ ఉంది. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికొస్తే, ఇందులో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇది 1.3 కిలోల బరువు ఉంటుంది. దీని ధర భారతదేశంలో 1,19,990 రూపాయలు. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
చిప్స్ కంపెనీలకు క‘న్నీటి’ కష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు చిప్స్ కొరత ప్రపంచవ్యాప్తంగా వాహన తయారీదార్లను ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు ఈ సమస్య ఇతర పరిశ్రమలకూ పాకింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, ఏసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, యంత్రాలు, సర్వర్స్, బొమ్మలు.. ఇలా ఒక్కటేమిటి. వందలాది విభాగాలపై సెమికండక్టర్స్ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలుకొని స్టార్టప్స్ వరకూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతిమంగా కస్టమర్లపైనే భారం పడుతోంది. వస్తువుల ధర పెరగడంతోపాటు వీటిని అందుకోవడం కోసం వినియోగదార్లు వేచి చూడాల్సి వస్తోంది. దుకాణాల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. స్వచ్ఛమైన నీటి కొరతతో.. చిప్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న తైవాన్ వాటా 70 శాతముంది. క్వాల్కామ్ సహా పలు దిగ్గజాలకు చిప్స్‌ను సరఫరా చేస్తున్న తైవాన్ సెమికండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) వాటా పరిమాణం పరంగా ఏకంగా 55 శాతం ఉందని కౌంటర్‌పాయింట్ తెలిపింది. యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, వాన్గార్డ్ ఇంటర్నేషనల్ సెమికండక్టర్ కార్పొరేషన్, పవర్షిప్ సెమికండక్టర్ వంటి కంపెనీలూ ఇక్కడివే. అయితే వర్షాలు లేక 56 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర కరువు పరిస్థితులు తైవాన్ను చుట్టుముట్టాయి. సెమికండక్టర్స్ ఉత్పత్తి ప్రక్రియలో అత్యంత స్వచ్ఛమైన మంచి నీటిని వాడతారు. ఇప్పుడీ నీటికి కరువు ఏర్పడడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. రెండు దశాబ్దాల్లో.. చిప్ కొరతతో పలు దేశాల్లో ప్యాసింజర్ కార్ల రంగంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేయగా, మరికొన్ని తయారీ తగ్గించాయి. దీంతో ఈ సంస్థల అమ్మకాలూ తక్కువ నమోదయ్యాయి. సెమికండక్టర్ల కొరత కొన్నేళ్లు ఉంటుందని ఇంటెల్ కార్పొరేషన్ సీఈవో ప్యాట్ జెల్సింగర్ తెలిపారు. కొరత కారణంగా వ్యాపార అవకాశాలు మందగిస్తున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఎలక్ట్రానిక్స్ ముడిసరుకు ధర మార్చిలో భారీగా పెరిగింది. ఈ పెరుగుదల గడిచిన రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికమని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది. ఇళ్లలో వినియోగించే గ్యాడ్జెట్స్ కోసం కస్టమర్లు గతేడాది ఎగబడడంతో కంపెనీలకు చిప్స్ అవసరం మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ కోసం డిమాండ్ విపరీతంగా ఉంది. భారత్‌లో ల్యాప్టాప్స్, ఏసీలకు కొరత ఏర్పడింది. డిమాండ్‌తో పోలిస్తే ల్యాప్టాప్స్ 10 శాతమే సరఫరా అవుతున్నాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. అన్ని కంపెనీలకూ సమస్యే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో హార్డ్‌వేర్ అమ్మకాలు తగ్గాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలో ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని యాపిల్ ఫైనాన్స్ చీఫ్ లూకా మాయెస్ట్రీ తెలిపారు. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ నివేదిక ప్రకారం యూఎస్‌లో బోట్ బిల్డింగ్, బ్రూవరీస్, ఫాబ్రిక్ మిల్స్ వంటి సుమారు 170 పరిశ్రమలు ప్రత్యక్షంగా సమస్యను ఎదుర్కొంటున్నాయట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా చిప్ కొరత ప్రభావం ఉంటోందని నివేదిక వెల్లడించింది. చిప్స్, ఇతర ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తుల ధరను 5–12 శాతం పెంచుతున్నట్టు వర్ల్‌పూల్ సీఈవో మార్క్ బిజర్ తెలిపారు. ఏడాది చివరికల్లా పరిస్థితుల్లో మార్పు రావొచ్చని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయెన్సెస్, ఎయిర్ సొల్యూషన్స్ బిజినెస్ యూనిట్ హెడ్ డాన్ క్వాక్ వెల్లడించారు. హోమ్ అప్లయెన్సెస్ తయారీలో 1,000కిపైగా విభిన్న సెమికండక్లర్టను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఇదీ సెమికండక్టర్స్ పరిశ్రమ.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్ల పరిశ్రమ విలువ సుమారు రూ.32.7 లక్షల కోట్లు ఉంది. ప్రస్తుత సంవత్సరం 1.13 ట్రిలియన్ యూనిట్ల సెమికండక్టర్లు అమ్ముడవుతాయని అంచనా. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ధి అని ఈ రంగంలో ఉన్న రీసెర్చ్ సంస్థ ఐసీ ఇన్సైట్స్ తెలిపింది. 2019తో పోలిస్తే గతేడాది అమ్మకాల వృద్ధి కేవలం 3 శాతమే. ఇక యూఎస్‌కు చెందిన ఇంటెల్ ప్రీమియం చిప్స్ తయారీలో ఉంది. శామ్సంగ్, ఎస్కే హైనిక్స్, బ్రాడ్‌కామ్, క్వాల్కామ్, మైక్రాన్ వంటి కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. చదవండి: ఆటో, ఐటీ, మెటల్ మెరుపులు: లాభాల ముగింపు -
4సార్లు పెళ్లి..మూడు సార్లు విడాకులు..32 సెలవులు
ఆఫీసుల్లో సాధారణంగా సెలవు కావాలంటే.. పంటి నొప్పి నుంచి ఈ లోకంలో లేనివారి చావు వరకూ చాలా కథలే వినిపిస్తుంటాయి. అయితే తైవాన్ కి చెందిన ఓ బ్యాంక్ క్లర్క్.. కేవలం సెలవు కోసం ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకుని, మూడు సార్లు విడాకులు ఇచ్చాడు. తైవానీస్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి వివాహానికి 8 రోజుల వేతన సెలవులు(పెయిడ్ లీవ్స్) పొందే హక్కు ఉంది. దాని ప్రకారం సదరు హీరో.. గత ఏడాది ఏప్రిల్ 6న పెళ్లి చేసుకుని పెయిడ్ లీవ్స్ పొందాడు. అయితే.. 8వ(చివరి) రోజు తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆ మరునాడే మళ్లీ పెళ్లి అంటూ మరో 8 రోజుల పెయిడ్ లీవ్స్‌కి అప్లై చేసుకున్నాడు. ఇలా 37 రోజుల్లో 4 సార్లు పెళ్లి, 3 సార్లు విడాకులతో 32 రోజులు సెలవులు తీసుకున్నాడు. ఇతగాడి గారడీలను గుర్తించిన సదరు బ్యాంక్.. ఆ సెలవులకు అనుమతించకపోవడంతో న్యాయం చెయ్యాలంటూ తైపీ సిటీ లేబర్ బ్యూరోని ఆశ్రయించాడు ఆ పెళ్లికొడుకు. దర్యాప్తు ప్రారంభించిన బ్యూరో.. బ్యాంక్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిందని అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో యజమానికి 7వందల డాలర్లు జరిమానా కూడా విధించింది. ‘లేబర్ లీవ్ రూల్స్’ ఆర్టికల్ 2 ప్రకారం ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టంలోని లూప్ హోల్స్ ఉపయోగించుకున్నప్పటికీ.. దాన్ని కారణంగా తీసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే వాదోపవాదాల నడుమ బ్యాంక్‌కి, క్లర్క్‌కి జరిగిన సమరంలో ఈ ఏడాది ఏప్రిల్ 10న బ్యూరో మరో తీర్పునూ వెలువరించింది. బ్యాంక్ క్లర్క్ ప్రవర్తన అనైతికం అయినప్పటికీ.. గతంలో ఇచ్చిన తీర్పును అయిష్టంగానే సమర్థించుకుంటూ ‘అతను చట్టాన్ని ఉల్లంఘించలేదు’అని స్పష్టం చేసింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
నెల రోజుల్లో భార్యకు 3 సార్లు విడాకులిచ్చి..
వివాహం అనగానే ఉద్యోగులకు సహజంగానే సెలవులు ఇస్తారు. అయితే అది ఎన్ని రోజులనేది మనం పని చేసే సంస్థని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనం ఉంటున్న దేశం, అక్కడ అనుసరిస్తున్న చట్టాలకు అనుగుణంగా కూడా సెలవులు ఇస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా.. ఓ ఘనుడు ఎక్కువ పెయిడ్ లీవ్‌లను పొందడం కోసం ఒకే మహిళను ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. చివరకు ఆ బ్యాంకుకు అతని నిర్వాకం తెలియడంతో లీవ్ పొడిగింపును నిరాకరించింది. ఒకే మహిళను 4 సార్లు వివాహం తైవాన్ రాజధాని తాయ్‌పెయ్ నగరంలో ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న వ్యక్తి సుమారు నెల రోజుల వ్యవధిలో ఒకే మహిళను 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. కేవలం తన సంస్థ నుంచి సెలవు పొడిగింపు కోసమే అతనీ పని చేశాడు. తైవాన్ కార్మిక చట్టం ప్రకారం ఏ ఉద్యోగికైనా పెళ్లికి 8 రోజుల సెలవు తప్పనిసరి. దీన్నే అడ్డంగా పెట్టుకుని ఈ పెళ్లి స్టంట్ చేశాడు. సంస్థ మంజూరు చేసిన సెలవుతో అతను సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి కోసం సెలవు దరఖాస్తు చేశాడు. అలా అతను తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చి మళ్లీ ఆమెనే 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అందుకుగాను మొత్తం 32 రోజుల కోసం లీవ్ అప్లై చేశాడు. అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్ వారు ఈ విషయాన్ని పసిగట్టి అతనికి లీవ్‌ను పొడిగించేందుకు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి కోర్టుకెక్కాడు. ఏదేమైనా ఈ క్లర్క్‌కు చట్టాన్ని వాడుకోవడం బాగానే తెలిసినట్టు ఉంది. ( చదవండి: ఈ వ్యక్తి పందెం కోసం ఏకంగా పాములతో... ) -
కరువు తెచ్చిన అదృష్టం! నీళ్లలో ఏడాది పాటు...
గత 56 సంవత్సరాలలో తైవాన్ లో తీవ్ర స్థాయిలో కరువు ఏర్పడింది. ఈ కరువు వల్ల చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అయితే, ఒకరికి మాత్రం అదృష్టం ఈ కరువు తెచ్చి పెట్టింది. మిస్టర్ చెన్ అనే వ్యక్తి కరువు వల్ల పోయిన తన ఐఫోన్ 11ను తిరిగి పొందగలిగాడు. చెన్ ఒక సంవత్సరం క్రితం తైవాన్ లోని అత్యంత ప్రసిద్ధ సరస్సులలో ఒకటైన సన్ మూన్ సరస్సులో గత ఏడాది పాడిల్‌బోర్డింగ్ చేస్తున్నప్పుడు ఆకస్మికంగా తన ఐఫోన్ 11 పడిపోయినట్లు పేర్కొన్నాడు. తైవాన్ న్యూస్ ప్రకారం.. ఈ ద్వీపం తీవ్రమైన కరువు ఏర్పడటం వల్ల ఆ సరస్సు బంజరు భూమిగా మారిపోయింది. సన్ మూన్ సరస్సులో నీటి మట్టాలు రికార్డు స్థాయికి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తికి ఐఫోన్ 11 దొరికన తర్వాత తనను సంప్రదించినట్లు మిస్టర్ చెన్ పేర్కొన్నాడు. మిస్టర్ చెన్ పోయిన తన ఐఫోన్ 11 తిరిగి దొరికన సంతోషంలో నిద్రకూడా పట్టలేదని చెప్పారు. అదృష్టవశాత్తూ ఐఫోన్ 11కు కేసు, వాటర్ రెసిస్టెంట్ ఉండటం చేత సరస్సు అడుగులో ఒక ఏడాది ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ పనిచేసింది. మిస్టర్ చెన్ ఫోన్ ఛార్జ్ చేసిన తర్వాత బాగానే పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐఫోన్ 11కు సంబందించిన బూట్ చేసిన ఫోటోలను ఫేసుబుక్ లో షేర్ చేసాడు. అలాగే, యూట్యూబ్ లో ఈ వీడియోకి 3 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: బిలియనీర్ల అడ్డాగా బీజింగ్! -
నిద్రపోతున్న ప్రియుడిపై ప్రియురాలి దారుణం
తైపీ: తనతో సహజీవనం చేస్తున్న ప్రియుడు వేరే మహిళతో సంబంధంపెట్టుకోవడాన్ని ఆ మహిళ భరించలేకపోయింది. ప్రియుడికి ఎలాగైన బుద్ధి చెప్పాలనుకుంది. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడి అంగాన్ని కోసేసి తన కోపాన్ని తీర్చుకొంది. ఈ ఘటన తైవాన్‌లోని చాంఘువా కౌంటీలోని జిహుటౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. 52 ఏళ్ల హువాంగ్ తన ప్రియురాలు పూంగ్తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు. అయితే పుంగ్‌కు తన ప్రియుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో అతను రోజులాగే తాగి నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే పుంగ్ వంట గదిలోకి వెళ్లి ఒక పదునైన కత్తి తీసుకొని వచ్చి ప్రియుడి అంగాన్ని కొసేసింది. మత్తులో ఉన్న అతనికి నొప్పి తెలియలేదు. ఆ తర్వాత ఆమె దాన్ని బాత్రూంలో పడేసి ఫ్లష్ చేసింది. ఉదయాన్నే నిద్రనుంచి లేచిన హువాంగ్ అంగం వద్ద నొప్పిగా ఉండటంతో చూశాడు. ఆ తర్వాత బెడ్‌షిట్ అంతా రక్తపు మరకలే ఉన్నాయి. వెంటనే భయపడిపోయాడు. తన ప్రియురాలు కోసం అరిచాడు. ఆమె కనిపించలేదు. కాసేపు చుట్టుపక్కల తెగిపడిన అంగం కోసం వేతికాడు.. దొరకలేదు. వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. మూత్రం మార్గంలో ప్రత్యేకంగా సర్జరీ చేశారు. ఆ వ్యక్తికి మొదట ఈ పని ఎవరు చేశారో తెలియలేదు. అయితే, కొన్ని రోజులకు ఈ పనిచేసింది తన ప్రియురాలే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ‘తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు తనపై అనుమానంతోనే ప్రియురాలు ఈ పని చేసిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత పుంగ్నేరుగా పోలీసులు దగ్గరికి వెళ్లి లొంగిపొయింది. తను తన ప్రియుడిపై అనుమానంతోనే ఈ పనిచేసినట్లు ఒప్పుకొంది. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తారస్థాయికి విభేదాలు: అమెరికాకు చైనా వార్నింగ్!
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, అయితే అదే సమయంలో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం సహించబోమని పునరుద్ఘాటించారు. పరస్పర గౌరవం, సమానత్వ భావనతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అగ్రరాజ్యం- డ్రాగన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే, జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ, ఇటీవల అలస్కాలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టోనీ బ్లింకెన్, వాంగ్ యీ మధ్య జరిగిన మొట్టమొదటి భేటీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిన్జియాంగ్, హాంకాంగ్, తైవాన్ విషయంలో చైనా అవలంబిస్తున్న విధానాలు, ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా సైతం.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామంటూ దీటుగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో వాంగ్ యీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకొంటూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ, తమ మాటే శాసనం అనే వైఖరిని చైనా ఎన్నటికీ అంగీకరించబోదు. ముఖ్యంగా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించం. అంతేకాదు, తప్పుడు సమాచారం, అసత్యాల ఆధారంగా చట్టవ్యతిరేకంగా, ఏకపక్షంగా ఆంక్షలు అమలు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని అమెరికాను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం వెలువరించింది. కాగా అలస్కా సమావేశంలో భాగంగా, జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరుతోందన్న ఆరోపణలతో, చైనా అధికారులు, వస్తువులపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదిరిన నేపథ్యంలో వాంగ్ యీ ఈ మేరకు స్పందించడం గమనార్హం. చదవండి: భారత్‌లో బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్! బద్ధశత్రువులతో వేదికను పంచుకోనున్న భారత్ -
సొరంగంలో పట్టాలు తప్పిన ట్రైన్
-
తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం ఫోటోలు
-
ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సుమారు 350మందితో ప్రయాణిస్తున్న రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పడంతో 36 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 72 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే అందోళన వ్యక్తమవుతోంది. అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సరిగ్గా పార్క్ చేయని ట్రక్ ఒకటి రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. తైటంగ్‌కు ప్రయాణిస్తున్న ఈ రైలు హువాలియన్‌కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగంలో పట్టాలు తప్పింది. సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. సొరంగం మధ్య ఇరుక్కు పోవడం రక్షణ చర్యలు కష్టంగా ఉన్నాయని పేర్కొన్నాయి. గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పాముల్లాగే.. మన లాలాజలంలో విషం ఊరే అవకాశం!
పాముకు కోరల్లో విషం ఉంటుంది.. తేలుకు తన తోకలో ఉంటుంది.. అయితే మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అంటుంటారు.. ఇప్పటివరకైతే మనిషి శరీరంలో విషం (వెనమ్) ఉన్న ఆనవాళ్లు లేవు కానీ.. సమీప భవిష్యత్తులో పాముల మాదిరిగానే మన లాలాజలంలో విషం ఊరే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఇదీ మానవ పరిణామంలో ఒక భాగమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు జపాన్‌లోని ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పిట్ వైపర్ (రక్త పింజర) పాములపై పరిశోధనలు చేశారు. ఈ పాముల్లోని కోరల్లో విషానికి సంబంధించిన జన్యువుల గురించి తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు సాగాయి. ఈ క్రమంలో నోటిలో విష స్రావాలు వచ్చేందుకు దోహదపడే జన్యువులు.. సరీసృపాల (పాము జాతి)తో పాటు మానవుల్లో కూడా ఉన్నాయని, దీన్నిబట్టి మానవులు కూడా భవిష్యత్తులో విషం కక్కే రోజులు వస్తాయని చెబుతున్నారు. మానవుల లాలాజల గ్రంథులు, పాముల్లోని విష గ్రంథుల అమరిక కణ స్థాయిలో ఒకేరకంగా ఉంటాయని రుజువులు చూపిస్తున్నారు. అందుకే తాము ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నామని పేర్కొంటున్నారు. విషం అనేది ప్రోటీన్ల మిశ్రమం అని, జంతువులు తమ ఆహారాన్ని కదలకుండా చేసేందుకు, స్వీయ రక్షణ కోసం ఈ ఆయుధాన్ని వాడుతాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న అగ్నీశ్ బారువా అనే పరిశోధకుడు వివరించారు. ఇలాంటి విషం కొన్ని క్షీరదాలతో పాటు జెల్లీఫిష్, తేళ్లు, సాలీళ్లు, పాముల్లో ఉంటుంది. చాలా జంతువులు తమ నోటి ద్వారానే విషం విడుదల చేస్తాయి. విషంలోని ప్రోటీన్ల మిశ్రమం తయారయ్యేందుకు ప్రభావితం చేసే జన్యువుల గురించి గతంలో పరిశోధనలు జరిగాయి. కానీ తాజాగా వివిధ జన్యువులు ఎలా ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసుకుంటాయని పరిశోధనలు చేస్తున్నాయి. ‘విషం, విష గ్రంథులు ఆవిర్భవించక ముందు ఉన్న జన్యువులు, విష వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సహకరించిన జన్యువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అని బారువా చెప్పారు. ఇందుకోసం తైవాన్‌కు చెందిన హబు పాముల విషంపై కూడా అధ్యయనం చేశారు. దాదాపు 3 వేల ‘సహకార’ జన్యువులను వీరు గుర్తించారు. చాలా జంతువుల్లో గుర్తింపు.. ఇలాంటి జన్యువులు మరే జంతువుల్లోనైనా ఉన్నాయా అని పరిశోధకులు వెతికారు. కుక్కలు, చింపాంజీలు, మానవుల వంటి క్షీరదాల్లో వాటి వెర్షన్లలో ఈ జన్యువులు ఉన్నట్లు గుర్తించారు. క్షీరదాల్లోని లాలాజల గ్రంథుల నిర్మాణం, కణాల అమరిక అచ్చు.. పాముల్లోని విష గ్రంథులలాగే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ రెండు జాతులు కోట్ల సంవత్సరాల కింద వేరు పడటానికి ముందు నుంచీ ఈ గ్రంథులకు సంబంధించి ఒకే మూలాలు కలిగి ఉన్నాయని నమ్ముతున్నారు. పర్యావరణ పరిస్థితులు కనుక మనకు అనుకూలంగా లేకపోతే త్వరలోనే మన లాలాజల గ్రంథులు కాస్తా విష గ్రంథులుగా రూపాంతరం చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదు! – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. అయినా వాటికి అదే ఇష్టం! యాంటీ బయోటిక్స్ అని వాడితే.. చివరికి అవే విషంలా -
స్వాతంత్ర్యం అంటే యుద్ధమే: చైనా
బీజింగ్: తైవాన్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా తయారైంది. గత కొంతకాలంగా తైవాన్‌పై బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్న చైనా తాజాగా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ అంశంలో విదేశీ జోక్యం పెచ్చుమీరుతోందంటూ పరోక్షంగా అమెరికాపై మండిపడుతోంది. తాజాగా చైనా రక్షణ శాఖ చేసిన ప్రకటన ఈ వివాదాన్ని మరింత పెంచేలా ఉంది. తైవాన్‌కు స్వాతంత్ర్యం అంటే యుద్ధం తప్పదని హెచ్చరించింది. చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వు కియాన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ‘‘తైవాన్ జలసంధిలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన సైనిక కార్యకలాపాలు జాతీయ సార్వభౌమత్వాన్ని భద్రతను కాపాడటానికి చేపట్టిన చర్యలు. ఇక తైవాన్‌లో కొందరు మాత్రమే స్వాతంత్ర్యం కావాలంటున్నారు. నిప్పుతో చెలగాటం ఆడితే ఆ అగ్నికే ఆహుతి అయిపోతారంటూ’’ హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) ఇటీవలే చైనా యుద్ధ విమానాలు తన గగనతలంలోకి వచ్చాయని తైవాన్ ఆరోపించగా.. అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించాయి. ఈ పరిణామాలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. తన సార్వభౌమత్వాన్ని సవాలు చేసేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించినట్టు డ్రాగన్ భావిస్తోంది. మరోవైపు తైవాన్ అధ్యక్షుడు తై ఇంగ్ వెన్ తమది ఇప్పటికే స్వతంత్ర దేశమని.. తమ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పేర్కొంటుండడం కూడా డ్రాగన్‌కు కంటగింపుగా మారింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోన్న సంగతి తెలిసిందే. -
ఆ ‘ఐఫోన్ల’ కంపెనీలో అక్రమాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం శివారులో ఐఫోన్లను తయారు చేసే ‘విస్ట్రాన్ ఫెసిలిటీ’లో డిసెంబర్ 12వ తేదీ రాత్రి, నైట్ షిప్టులో పని చేస్తోన్న దాదాపు రెండు వేల మంది కార్మికులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించిన విషయం తెల్సిందే. సీనియర్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయాలను ధ్వంసం చేయడంతోపాటు వేలాది ఐఫోన్లు, లాప్ టాప్‌లను కార్మికులు ఎత్తుకెళ్లారు. వారిలో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విధ్వంసంలో కంపెనీకి ఏడు మిలియన్ డాలర్ల నష్టం(దాదాపు 51 కోట్ల, 54 లక్షల రూపాయలు) వాటిల్లినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగళూరు శివారులోని ఆ నర్సాపుర ప్లాంట్‌లో గత కొన్ని నెలలుగా వేతనాలు అతి తక్కువగా ఇస్తుండడంతో కార్మికులకు కడుపు మండి ఒక్కసారిగా కంపెనీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన ప్రభుత్వ బృందానికి అనేక చీకటి విషయాలు వెలుగు చూశాయి. ఐఫోన్ల ఉత్పత్తి కోసం తైవాక్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి కంపెనీలో అన్యాయాలు, అక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలో 10,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారికి ఎక్కువ జీతాలిస్తామని చెప్పి తక్కువ జీతాలు ఇస్తూ వచ్చారు. అప్పటి వరకు 8 గంటల షిప్టుల్లో పని చేసిన ఉద్యోగులకు గత అక్టోబర్ నెల నుంచి 12 గంటల షిప్టులు వేశారు. త్వరలోనే హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచుతామంటూ ఇంతకాలం కార్మికులను బుజ్జగిస్తూ వచ్చారు. ‘అదనంగా పెంచిన నాలుగు గంటలకు ఓటీ ఇస్తారా, లేదా? హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచి 12 గంటలు పని చేయించుకోవాలనుకుంటున్నారా?’ అన్న ఆలోచన, ఆందోళన ఉద్యోగుల్లో పెరిగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యువేట్లకు నెలకు 21 వేల రూపాయలు ఇస్తామని విస్ట్రాన్ కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే వారికి నెలకు 16 వేల రూపాయలే ఇస్తున్నట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది. కార్మిక శాఖ నుంచి అనుమతి లేదు కంపెనీ 12 గంటల షిప్టు గురించి కర్ణాటక కార్మిక శాఖకు తెలియజేయలేదు. మహిళా కార్మికుల అదనపు పని గంటల విషయంలో ముందుగా కర్ణాటక కార్మిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి, అదీ తీసుకోలేదు. కాంట్రాక్టు కార్మికులు, హైజ్ కీపింగ్ స్టాఫ్‌తో అదనపు గంటలు పని చేయించుకోవడంతోపాటు వారి అటెండెన్స్‌ను సక్రమంగా నమోదు చేయాల్సిన కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా తప్పుడు విధానంతో తగ్గించింది. ఉద్యోగుల విధ్వంసం నేపథ్యంలో కంపెనీని సందర్శించాక ప్రభుత్వ దర్యాప్తు బృందానికి కంపెనీ యాజమాన్యం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఉద్యోగుల వేతనాల్లో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. భారత్‌లో వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్న కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ను ఉద్యోగంలో తీసివేసినట్లు పేర్కొంది. ఉద్యోగుల ఫిర్యాదులను స్వీకరించేందుకు హాట్‌లైన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. విస్ట్రాన్ కంపెనీ నర్సాపురలో 43 ఎకరాల్లో మూడువేల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీని నిర్మించింది. రెండో తరానికి చెందిన ఐఫోన్ ఎసీఈ మోడల్‌తోపాటు నాలుగు మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత్‌లో విక్రయించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫ్యాక్టరీ విస్తరణ కోసం 1300 కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. ప్రస్తుతం పదివేల మంది ఉద్యోగుల్లో రెండు వేల మంది మాత్రమే కంపెనీ ‘రోల్స్’లో పని చేస్తున్నారు. మిగతా వారంతా కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నారు. రానున్న కాలంలో ఉద్యోగుల సంఖ్యను 20 వేలకు పెంచుతామని కంపెనీ యాజమాన్యం ఇది వరకే ప్రకటించింది. అయితే ఈ విధ్వంస సంఘటన నేపథ్యంలో కంపెనీ విస్తరణ ఆలస్యం అవుతుందని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కార్మికుల ఆత్మహత్యలు అమెరికాకు చెందిన ఐఫోన్ల దిగ్గజ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఉత్పత్తి కాంట్రాక్టులిచ్చింది. అలా కాంట్రాక్టు తీసుకున్న పలు కంపెనీలు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడడమే కాకుండా, వారి ప్రాణాలు తీస్తున్నా, వాటిని అరికట్టేందుకు అమెరికా కంపెనీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాదు. చైనాలోని షెన్జెన్ నగరంలో ఐఫోన్ల కాంట్రాక్టు తీసుకున్న నైట్‌లైన్ కంపెనీలో 18, 24 గంటల షిప్టులను తట్టుకోలేక 2012, ఏప్రిల్ నెలలో 18 మంది కార్మికులు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవడానికి ఆ కంపెనీ ఇనుప వలలను ఏర్పాటు చేయడం మరీ చిత్రం. జెంగ్జౌ నగరంలోని ఐఫోన్లను ఉత్పత్తి చేసే ఫాక్స్‌కాన్ కంపెనీలో 2018, జనవరి ముగ్గురు కార్మికులు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. -
పంది మాంసంతో పార్లమెంటులో రచ్చ
తైపీ: పంది మాంసం, బీఫ్ దిగుమతి విషయంలో విధానాల రూపకల్పన గురించి చర్చించే క్రమంలో తైవాన్ పార్లమెంటులో రసాభాస చోటుచేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షం పంది అవయాలు, మాంసాన్ని అధికార పార్టీ నాయకులపై విసిరారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాలు... చైనాకు కంటిలో నలుసులా తయారైన తైవాన్ గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. దౌత్యపరంగా ఇరు దేశాల మధ్య అధికారికంగా ఎలాంటి ఒప్పందాలు లేనప్పటికీ డబ్ల్యూహెచ్ఓలో సభ్యత్వం, రక్షణ రంగం తదితర అంశాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు అండగా నిలిచింది. ఈ క్రమంలో అధ్యక్షురాలు త్సాయి ఇంగ్- వెన్ అమెరికాతో వాణిజ్య బంధం ఏర్పరచుకునేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా పంది మాంసాన్ని దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తైవాన్‌లో పోర్క్‌పై గత కొన్నేళ్లుగా నిషేధం ఉంది. దీనిని ఎత్తివేస్తూ ఆగష్టులో నిర్ణయం తీసుకున్న త్సాయి సర్కారు, జనవరి నుంచి అమల్లోకి వచ్చేలా విధానాలు రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రీమియర్ సూ త్సెంగ్- చాంగ్ శుక్రవారం పార్లమెంటు ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేషనలిస్టు పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంది మాంసాన్ని సభలోకి తీసుకువచ్చి, అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పా(డీపీపీ) నాయకుల ముందు విసిరికొట్టగా.. వారు సైతం దీటుగానే బదులిచ్చారు. (చదవండి: తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!) అధికారంలోకి రాగానే మద్దతు! ఈ ఘర్షణలో సహనం కోల్పోయిన డీపీపీ నేత ప్రతిపక్ష నేతతో మల్లయుద్ధానికి దిగారు. ఈ విషయం గురించి నిరసనకు నాయకత్వం వహించిన నేషనలిస్ట్ పార్టీ నేత లిన్ వే- చౌ మాట్లాడుతూ.. ‘‘మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు అమెరికా పోర్క్‌ను వ్యతిరేకించారు. అధికారంలోకి రాగానే మాటమార్చారు. యూఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు’’ అంటూ త్సాయి ఇంగ్-వెన్ పార్టీని విమర్శించారు. అయితే డీపీపీ నేతలు మాత్రం ప్రీమియర్‌ను అడ్డుకోవడం సరికాదని, శాంతియుత వాతావరణంలో ఈ విషయం గురించి చర్చించాలంటూ విజ్ఞప్తి చేయడం విశేషం. కాగా పోర్క్, బీఫ్ వినియోగంపై నిషేధాన్ని ఎత్తివేయడం పట్ల ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.(చదవండి: అమెరికాపై డ్రాగన్ ఫైర్.. తైవాన్ కౌంటర్!) -
‘చికెన్’ మిరాకిల్.. కోమా నుంచి కోలుకున్నాడు
తైపీ: ‘ఫేవరెట్ ఫుడ్’ పిల్లల ఏడుపుని.. ఆకలిని, అలకని తగ్గిస్తుందని తెలుసు. కానీ ఏకంగా మెడిసిన్‌గా పని చేసి కోమా నుంచి కోలుకునేలా చేస్తుందని ఎప్పుడైనా విన్నారా.. లేదు కదా. కానీ ఇలాంటి సంఘటన ఒకటి తైవాన్‌లో చోటు చేసుకుంది. దాదాపు రెండు నెలలకు పైగా కోమాలో ఉన్న వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పగానే కోలుకున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. వివరాలు.. తైవాన్‌కు చెందిన చియు అనే యువకుడు రెండు నెలల క్రితం స్కూటర్ మీద నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లీహం, కుడి మూత్ర పిండం, లివర్ దారుణంగా దెబ్బ తిన్నాయి. అంతర్గత గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆస్పత్రిలో చేర్చిన చియుకు ఆరు ఆపరేషన్లు జరిగాయి. ప్రాణాపాయం తప్పింది కానీ అతడు కోమాలోకి వెళ్లాడు. ఇక చియు ఎప్పుడు కోలుకునేది తాము చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. (చదవండి: కోమా నుంచి బయటకు.. పదేళ్ల తర్వాత శిక్ష) ఈ క్రమంలో చియు కుటుంబ సభ్యులు అతడు కోలుకోవాలని.. దేవుడిని ప్రార్థించారు. ఏదైనా అద్భుతం జరిగి.. చియు కోలుకుంటాడేమోనని బెడ్ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకునేవారు. ఇలా 62 రోజులు గడిచిపోయింది. ఈ క్రమంలో చియు సోదరుడు అతడిని చూడటానికి ఆస్పత్రికి వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా.. చియు నేను నీ ఫేవరెట్ చికెన్ ఫిల్లెట్స్ తినబోతున్నాను అని తెలిపాడు. ఆశ్చర్యం.. రెండు నెలలకు పైగా కోమాలో ఉన్న చియుకి చికెన్ ఫిల్లెట్స్ పేరు వినగానే స్పృహ వచ్చింది. పల్స్ రేటు పేరిగింది. విషయం తెలుసుకున్న వైద్యులు చియు పరీక్షించి అతడు కోలకున్నాడని తెలిపారు. నిజంగా ఇది అద్భుతం అన్నారు. ఆ తర్వాత చియు పూర్తిగా కోలుకున్నాక అతడిని డిశ్చార్జ్ చేశారు. తాజాగా అతడు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ తీసుకెళ్లి ఇచ్చాడు. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: తైవాన్ ప్రతినిధి బృందం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానించినందుకు తైపీ ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్(టీఈసీసీ) డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ పర్యటనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. కాగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తైవాన్‌కు చెందిన వివిధ కంపెనీలతో మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్‌తో పాటు ఆ దేశానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. (చదవండి: తప్పుడు ప్రచారంపై టీడీపీ నేతలు ఇప్పుడేం చెప్తారు..?) ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇక సీఎం జగన్ హామీపై హర్షం వ్యక్తం చేసిన బెన్ వాంగ్, తైవాన్ ప్రతినిధులు... రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వివిధ రంగాలు, పరిశ్రమల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మాథ్యూ చిన్, ఇండియా ఫాక్స్‌లింక్ డైరెక్టర్ ఎరిక్ ని, అపాచీ పుట్‌వేర్‌కు చెందిన గవిన్ ఛాంగ్, పీఎస్ఏ వాల్సిన్ ప్రాజెక్టు మేనేజర్ నిరంజన్ ప్రకాష్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఆ శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
సెకండ్ వేవ్ టెన్షన్.. 200 రోజులుగా ఒక్క కేసు లేదు
తైపీ: ప్రపంచవవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా ఉధృతి ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఈ సమస్యలు ఇలా ఉండగనే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. ఇక ప్రారంభంలో కంటే కూడా సెకండ్ వేవ్‌లో భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ చిన్న దేశం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం 23 మిలియన్ల జనాభాలో కేవలం 553 మందికే వైరస్ సోకడం.. ఏడుగురు మాత్రమే చనిపోవడం వంటి విషయాలు అగ్రదేశాలను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎంటంటే గత 200 రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం. ఏప్రిల్ 12న చివరి కోవిడ్ కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వరకు స్థానికంగా (201 రోజులు) ఒక్క కేసు కూడా నమోదు లేదు. ఇంతకు ఆ దేశం పేరు చెప్పలేదు కదా.. అదే తైవాన్. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచే తైవాన్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రయాణాలు బంద్ చేసింది. చాలా పక్కగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడమే కాక మాస్క్ ధరించడం విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉంది. గతంలో సార్స్‌తో పోరాడిన అనుభవం కూడా బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం తైవాన్‌లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అసలే లేదని అంటు వ్యాధి వైద్యుడు మరియు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ పీటర్ కొల్లిగ్నాన్ తెలిపారు. కరోనా కట్టడి విషయంలో ప్రపంచంలోనే తైవాన్ ఉత్తమంగా నిలిచిందని అన్నారు. ఆస్ట్రేలియాతో సమానమైన జనాభా కలిగిన ఆర్థిక వ్యవస్థకు "ఇది మరింత ఆకట్టుకుంటుంది" అన్నారు ఇక్కడ చాలా మంది అపార్ట్మెంట్లలలో ఒకరితో ఒకరు కలిసి చాలా దగ్గర దగ్గరగా ఉంటారు. (చదండి:ఒకప్పుడు ఆ మసాజ్ పార్లర్‌కు 600 మంది..) మరింత తీవ్రంగా సెకండ్ వేవ్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరితం ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే రుజువు అవుతోంది. అమెరికాలో గురువారం నమోదయిన కేసులతో కొత్త రోజువారీ రికార్డును నెలకొల్పింది. ఒక్క రోజులో 86,000 కేసులతో అగ్రస్థానంలో ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మిన్నెసోటాలో కేసులు చాలా పెరిగాయి, టెక్సాస్‌లో వ్యాప్తి వేగవంతమైంది. శుక్రవారం నుంచి తిరిగి లాక్డౌన్లోకి వెళ్లేందుకు ఫ్రాన్స్ సిద్ధమయయ్యింది. ఆర్థిక కార్యకలాపాలను 15 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి బ్రూనో లే మైర్ తెలిపారు. జర్మనీలో కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఇక ఆర్థికంగా కూడా ఈ ఏడాది అన్ని దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా తైవాన్ మాత్రం ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉంది. ఇక 2020 లో స్థూల జాతీయోత్పత్తిలో 1.56 శాతం పెరుగుదల ఉండనున్నట్లు ఆగస్టులో ప్రభుత్వం అంచనా వేసింది. దాంతో తైవాన్ ఈ ఏడాది పురోగతి సాధించిన అతి కొద్ది ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండనుంది. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) బయట నుంచి వచ్చిన వారిలోనే కరోనా స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికి బయటి దేశాల నుంచి వస్తున్న వారిలో కోవిడ్ బాధితులు ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఫిలిప్పీన్స్, అమెరికా, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో మూడు కేసులను గుర్తించింది. గత రెండు వారాల్లో ఇలాంటి కేసులు 20 కి పైగా నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తైవాన్ మాజీ వైస్ పప్రెసిడెంట్, ఎపిడెమియాలజిస్ట్ చెన్ చియెన్-జెన్ ఒక ఇంటర్వ్యూలో ‘పాజిటివ్ వచ్చిన న వ్యక్తులను గుర్తించకుండా.. వారిని నిర్బంధించకుండా ఈ విజయాన్ని సాధించలేము’ అన్నారు. అలాగే ప్రజలను క్వారంటైన్లో ఉంచడం అంత సులభం కానందున భోజనం, కిరాణా సరుకులు డెలివరీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 35 వేల అమెరికన్ డాలర్లను జరిమానాగా విధించింది. ఈ క్రమంలో అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ ఒక ట్వీట్లో తైవాన్ విజయాన్ని ప్రస్తావిస్తూ "వారు దీన్ని ఎలా సాధించారు.. వారు సైన్స్‌ను నమ్ముతారు" అంటూ ట్వీట్ చేశారు. ఇక తైవాన్ ఈ విజయంలో సాధించడంలో కీలక పాత్ర పోయించిన అంశాలు ఏంటంటే.. సరిహద్దు నియంత్రణ జనవరిలో మహమ్మారి వ్యాప్తి మొదలైన ప్రారంభంలోనే కొద్దిసేపటికే తైవాన్ సరిహద్దులను మూసివేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి దాని సరిహద్దులపై గట్టి నియంత్రణను కలిగి ఉంది. బార్డర్ కంట్రోల్‌ని కఠినంగా అమలు చేయడం వల్ల తైవాన్ నిరంతరం విజయం సాధిస్తుందని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పాలసీ, ఔట్‌కమ్స్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జాసన్ వాంగ్ తెలిపారు. ప్రయాణికులు విమానాలు ఎక్కడానికి ముందు టెస్ట్ చేస్తారు. తేడా వస్తే వారిని క్వారంటైన్లో ఉంచుతారు. సెల్యులార్ సిగ్నల్స్ ద్వారా డిజిటల్ ట్రాకింగ్ చేస్తూ 14 రోజుల నిర్బంధాన్ని పూర్తి చేయాలి. (చదవండి: 9 లక్షల వైరస్లు మానవులపై దాడి!) మాస్క్‌ల పంపిణీ ఫేస్ మాస్క్‌ల నిల్వ, విస్తృత పంపిణీని కలిగి ఉండాలనే నిర్ణయం తైవాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మహమ్మారి ప్రారంభంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఫేస్ మాస్క్‌లన్నింటినీ నిల్వ చేసి, ఎగుమతిని నిషేధించింది. నాలుగు నెలల్లో, కంపెనీలు రోజుకు 2 మిలియన్ల నుండి 20 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తిని పెంచాయి. ఇక ఇక్కడ జనాలకు రేషన్‌లో మాస్క్‌లు సరఫరా చేస్తారు. కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ తైవాన్ ప్రపంచ స్థాయి కాంటాక్ట్ ట్రేసింగ్ను కలిగి ఉంది - సగటున, ధృవీకరించబడిన ప్రతి కేసుకు 20 నుంచి 30 మందిని పరీక్షించింది. వైరస్ బారిన పడిన తైపీ సిటీ హోస్టెస్ క్లబ్‌లోని కార్మికుడి వంటి తీవ్రమైన కేసులల్లో, ప్రభుత్వం 150 మందికి టెస్ట్‌లు చేసింది. వారందరికి నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వారిని రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉంచింది. ఇప్పటివరకు, సుమారు 340,000 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. క్వారంటైన్ నియమాలు ఉల్లఘించిన వారి సంఖ్య కేవలం 1000 మాత్రమే. అంటే 99.7శాతం మంది ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెన్ తెలిపారు. "23 మిలియన్ల మందిసాధారణ జీవితాలకు బదులుగా 3, 40,000 మంది జీవితాల్లోని ఓ 14 రోజులు త్యాగం చేశాము" అన్నారు చెన్. (చదవండి: కరోనా రోగులకు మరో షాక్?!) సార్స్ అనుభవం గత అంటువ్యాధులు మిగిల్చిన అనుభవాలు కోవిడ్‌పై పోరాడడంలో తైవాన్ విజయానికి మార్గం సుగమం చేశాయి.2003 లో సార్స్ విజృంభణతో వందలాది మంది అనారోగ్యానికి గురై, కనీసం 73 మంది మరణించారు. ఈ క్రమంలో సార్స్ సంక్రమణ రేటులో ప్రపంచంలో తైవాన్ మూడో స్థానంలో నిలిచింది. ఆ అనుభవం తరువాత, అంటు వ్యాధులు ప్రబలినప్పుడు అత్యవసర-ప్రతిస్పందన నెట్‌వర్క్‌ను నిర్మించడం ప్రారంభించింది. ఆ తరువాత బర్డ్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా హెచ్ 1 ఎన్ 1 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. దాంతో ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, తరచుగా చేతులు కడుక్కొవడం వంటి వాటిని తప్పక పాటిస్తారు. -
తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!
బీజింగ్: తైవాన్ను ఆక్రమించేందుకు మిలటరీ చర్యకు చైనా సిద్ధమవుతోందని మిలటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగ్నేయ తీరంలో చైనా భారీగా అత్యాధునిక ఆయుధాలను, సైనిక బలగాలను మోహరిస్తుండటంతో తైవాన్‌పై దాడికే ఈ మోహరింపు అని వివరిస్తున్నారు. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక కథనం ప్రకారం.. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఉన్న పాత డీఎఫ్ 11, డీఎఫ్ 15 క్షిపణుల స్థానంలో ఆధునిక ఢీఎఫ్ 17 క్షిపణులను చైనా మోహరిస్తోంది. ఈ ఆధునిక హైపర్సోనిక్ క్షిపణి అత్యంత కచ్చితంగా శత్రు లక్ష్యాలను చేధిస్తుంది. స్వీయ పాలనలో ఉన్న ద్వీప దేశం తైవాన్ను తన నియంత్రణలోకి తీసుకునేందుకు చైనా చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. తైవాన్ చైనాలో అంతర్భాగమని వాదిస్తోంది. తైవాన్ను ఆక్రమించేందుకు అవసరమైతే మిలటరీ చర్యకు వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. గ్వాంగ్డాంగ్, ఫ్యుజియన్ ప్రాంతాల్లో చైనా బలగాల, ఆయుధ వ్యవస్థల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కెనడాకు చెందిన ‘కన్వా డిఫెన్స్ రివ్యూ’ పేర్కొంది. తైవాన్ లక్ష్యంగా యుద్ధం చేసేందుకు తూర్పు, దక్షిణ కమాండ్స్ల క్షిపణి వ్యవస్థలను చైనా ఇటీవల రెట్టింపు స్థాయిలో బలోపేతం చేసిందని వెల్లడించింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైనిక దళాలకు మంగళవారం చైనా అధ్యక్షుడు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. -
నిజంగా మా అదృష్టం: తైవాన్ అధ్యక్షురాలు
తైపీ: భారతీయ వంటకాలంటే తమ ప్రజలకు ఎంతో ఇష్టమని, తాను కూడా అందుకు అతీతం కాదని తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్-వెన్ అన్నారు. భారత రెస్టారెంట్లు తమ దేశంలో ఉండటం నిజంగా అదృష్టం అంటూ కొనియాడారు. ఛాయ్ తాగినపుడు భారత్‌లో తనకు ఉన్న అందమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తాయంటూ అభిమానం చాటుకున్నారు. ఈ మేరకు.. ‘‘ఎన్నెన్నో ఇండియన్ రెస్టారెంట్లకు తైవాన్ నివాసంగా ఉండటం అదృష్టం. తైవాన్ ప్రజలు వాటిని ఎంతగానో ఇష్టపడతారు. నేనైతే ఎల్లప్పుడూ చనా మసాలా, నాన్ తీసుకుంటాను. ఇక ఛాయ్ తాగితనప్పుడల్లా, ఇండియా ప్రయాణం తాలూకు విశేషాలన్నీ జ్ఞాపకం వస్తాయి. విభిన్నమైన, రంగులతో కూడిన దేశం’’ అని ట్వీట్ చేశారు. అంతేగాక.. ‘‘మీకిష్టమైన భారతీయ వంటకాలు ఏమిటి?’’ అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఇక త్సాయి ఇంగ్- వెన్ ట్వీట్‌కు స్పందించిన భారత నెటిజన్లు.. ఆమెకు ధన్యవాదాలు చెబుతూనే, ఇండియన్ ఫుడ్ నచ్చనివారు ఎవరూ ఉండరు అంటూ తమ స్పందన తెలియజేస్తున్నారు. (చదవండి: తైవాన్ ప్రజలకు భారత నెటిజన్ల విషెస్) అదే విధంగా, తైవాన్ ప్రజలు సైతం ప్రెసిడెంట్‌కు ఇష్టమైన భోజనం తమకు కూడా నచ్చుతుందని, వారానికి రెండుసార్లైనా ఇండియన్ రెస్టారెంట్లను సందర్శిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తైవాన్ నేషనల్ డే సందర్భంగా కూడా అత్యధిక సంఖ్యలో భారత ప్రజలు సోషల్ మీడియా వేదికగా త్సాయి ఇంగ్- వెన్, తైవాన్ పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక గత నాలుగేళ్లుగా చైనా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, తన ఉనికి చాటుకుంటున్న తైవాన్ ప్రభుత్వం, ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికా అండతో విమర్శలకు పదునుపెడుతూ, డ్రాగన్ దేశానికి కంటిలో నలుసులా తయారైంది. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న చైనాకు దీటుగా బదులిస్తున్న తైవాన్, అక్టోబరు 10న నేషనల్ డే సందర్భంగా డ్రాగన్‌తో ఉపయుక్తమైన చర్చలకు సిద్ధమని చెబుతూనే, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని, ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. అటు అమెరికాతోనూ, ఇటు భారత్‌తోనూ స్నేహ బంధాన్ని పెంపొందించుకుంటూ చైనాకు సవాల్ విసురుతోంది. #Taiwan is lucky to be home to many Indian restaurants, & Taiwanese people love them. I always go for chana masala and naan, while #chai always takes me back to my travels in #India, and memories of a vibrant, diverse & colourful country. What are your favourite Indian dishes? pic.twitter.com/IJbf5yZFLY — 蔡英文 Tsai Ing-wen (@iingwen) October 15, 2020 -
తైవాన్ ప్రజలకు భారత నెటిజన్ల విషెస్!
తైపీ/బీజింగ్: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్- వెన్ ప్రకటించారు. దక్షిణ చైనా సముద్ర జలాలు, హాంకాంగ్ విషయంలో డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు, భారత్- చైనా బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు వంటి అతిపెద్ద సవాళ్లను చైనా ఎదుర్కొంటోందన్న ఆమె, తమతో శాంతి చర్చల ద్వారా మెయిన్‌లాండ్‌లోని సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని సూచించారు. యుద్ధ వాతావరణాన్ని తొలగించే దిశగా డ్రాగన్ అడుగులు వేస్తే, తాము ఇందుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. (చదవండి: తైవాన్ ప్రకటన; చైనాకు భారత్ గట్టి కౌంటర్) అయితే అదే సమయంలో, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని, ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తైవాన్ నేషనల్ డే సందర్భంగా శనివారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన త్సాయి ఈ మేరకు మీడియా ముఖంగా చైనాకు తమ వైఖరిని తెలియజేశారు. అదే విధంగా కరోనాను కట్టడి చేయడంలో తాము సఫలమయ్యామని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా 2016లో తొలిసారిగా అధికారం చేపట్టిన నాటి నుంచి చైనాతో చర్చలకు త్సాయి, పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ డ్రాగన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తైవాన్ తమలో అంతర్భాగమేనని చైనా పునరుద్ఘాటిస్తోంది. అదే విధంగా తమకు వ్యతిరేకంగా తైవాన్‌కు మద్దతు తెలుపుతున్న అమెరికా సహా యూరప్ దేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.(యుద్ధం మొదలవుతుంది: చైనా హెచ్చరిక) LIVE:2020 🇹🇼 Taiwan National Day Celebration Ceremony ⭐10:20 President Tsai Ing-wen’s National Day Address#ProudOfTaiwan https://t.co/RLOlX2vFFK — 蔡英文 Tsai Ing-wen (@iingwen) October 10, 2020 భారత నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు నేషనల్ డే సందర్బంగా భారత నెటిజన్ల నుంచి తైవాన్ పౌరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు, జర్నలిస్టులు త్సాయి ఇంగ్ వెన్, తైవాన్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాటి టాప్ ట్రెండ్స్‌లో #TaiwanNationalDay ఒకటిగా నిలిచింది. ఈ విషయంపై స్పందించిన జర్నలిస్టు అభిజిత్ ముజుందార్.. ‘‘అద్భుతం.. #TaiwanNationalDayఇండియాలో ట్రెండింగ్‌లో ఉంది. చైనా ఇప్పటికీ తైవాన్ పట్ల అలాగే వ్యవహరిస్తే మిత్ర దేశాలకు దూరం కావాల్సి వస్తుంది’’ అని హాంకాంగ్, తైవాన్, టిబెట్ వైఖరిపై చైనా తీరును ఎండగట్టారు. ఇక మరికొంత మంది త్వరలోనే ప్రపంచ దేశాలన్నీ తైవాన్‌కు మద్దతు ప్రకటించి, అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంటాయని అభిప్రాయపడ్డారు. -
తైవాన్ ప్రకటన; చైనాకు భారత్ కౌంటర్!
న్యూఢిల్లీ: తైవాన్ను ఉద్దేశించి చైనా, భారత మీడియాకు రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. భారత్‌లో మీడియాకు స్వేచ్ఛ ఉందని, తన దృష్టికి వచ్చిన ప్రతీ అంశాన్ని రిపోర్టు చేస్తుందంటూ డ్రాగన్ దేశానికి కౌంటర్ ఇచ్చింది. గురువారం నాటి సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు బదులుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ మేరకు సమాధానమిచ్చారు. కాగా అక్టోబరు 10న జరుగనన్న తైవాన్ నేషనల్ డే ఉత్సవాలను పురస్కరించుకుని త్సాయి ఇంగ్- వెన్ ప్రభుత్వం ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటనలు విడుదల చేసింది. ఈ క్రమంలో ఆమె ఫొటోతో పాటుగా, తైవాన్- భారత్‌లు సహజ మిత్రులు అన్న సందేశం కలిగి ఉన్న పత్రికా ప్రకటనలు భారత మీడియాలో ప్రచురిమతమయ్యాయి. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం.. తమ దేశంతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నీ ‘‘వన్- చైనా’’ పాలసీకి కట్టుబడి ఉండాలని సూచిస్తూ, తైవాన్ ప్రకటనలను ప్రచురించడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఒకే ఒక్క చైనా ఉందని, తైవాన్ కూడా అందులో అంతర్భాగమని స్పష్టం చేస్తూ బుధవారం లేఖ రాసింది. తైవాన్ను దేశంగా, త్సాయి ఇంగ్ వెన్ను తైవాన్ అధ్యక్షరాలిగా పేర్కొంటూ కథనాలు రాయకూడదని విజ్ఞప్తి చేసింది. ఇక ఈ విషయంపై తైవాన్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. ఇండియాలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని, కాబట్టి ఇలాంటి సెన్సార్‌షిప్‌లను ప్రజలు సహించరని చురకలు అంటించింది. ఇందుకు వారి దగ్గర ‘‘గెట్ లాస్ట్’’ అనే సమాధానం ఉంటుందంటూ డ్రాగన్‌కు కౌంటర్ ఇచ్చింది. (చదవండి: ‘జిన్‌పింగ్‌ను అంతగా విశ్వసించలేం’!) ముమ్మాటికీ చైనా భూభాగమే.. ఇక చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ.. తైవాన్ ముమ్మాటికీ చైనా భూభాగమేనని గురువారం ట్వీట్ చేశారు. కాగా తైవాన్ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపినప్పటికీ, డ్రాగన్ దేశం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదన్న సంగతి తెలిసిందే. అదే విధంగా తైవాన్ వలె స్వేచ్ఛ కోరుకుంటున్న హాంకాంగ్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ ఇటీవలే అక్కడ జాతీయ భద్రతా చట్టం ప్రవేశపెట్టింది. ఇక ఈ రెండు ప్రాంతాల విషయంలో చైనా వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా సహా యూరప్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే డ్రాగన్ మాత్రం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యసమితి వేదికగా తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. ఇక భారత్ విషయానికొస్తే, తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, న్యూఢిల్లీలో తైపీ ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక తైపీలో ఉన్న ఇండియా- తైపీ అసోసియేషన్ టూరిజం, వ్యాపారం, వాణిజ్యం తదితర అంశాలను ప్రమోట్ చేస్తూ పలు భిన్న కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. -
చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!
తైపీ/బీజింగ్/ న్యూఢిల్లీ: ‘‘తైవాన్ నేషనల్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మాకు శుభాకాంక్షలు తెలిపే వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఎన్నో కష్టనష్టాలకోర్చి స్వాత్రంత్ర్యం పొందిన ఆ రోజును పండుగలా నిర్వహించుకుంటాం. ప్రజాస్వామ్య దేశంగా మేం సాధించిన విజయాలను ఆస్వాదిస్తాం. మాతో పాటు మీరు ఇందులో భాగస్వాములు అవ్వండి. తైవాన్ ఎదుగుదల పట్ల మీరు కూడా గర్విస్తున్నారని ఇక్కడ తెలియజేయండి’’ అంటూ తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్- వెన్ నెటిజన్లను ఆహ్వానించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేసిన ఆమె.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించే తమ స్వతంత్ర వేడుకలను వీక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు. కాగా 1949 నాటి పౌర యుద్ధం తర్వాత తైవాన్ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపిన విషయం తెలిసిందే.(చదవండి: యుద్ధం మొదలవుతుంది: చైనా హెచ్చరిక) ఈ క్రమంలో 2016లో త్సాయి ఇంగ్- వెన్ తైవాన్ తొలిసారి అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చైనాలో భాగంగా తమను గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే, చైనా మెయిన్‌లాండ్‌లో భాగమైన తైవాన్ను వేరు చేసే ఏ చర్యను తాము సహించబోమని చైనా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక జనవరిలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన త్సాయి ఇంగ్- వెన్.. ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య విలువలకు, స్వాతంత్ర్య కాంక్షకు కట్టుబడే ఉన్నాం. బీజింగ్ అధికారులు చెప్పే మాటలను తైవాన్ ఎన్నటికీ అంగీకరించబోదు. మన సార్వభౌమత్వాన్ని కాలరాసే హక్కు ఎవరికీ ఇవ్వదు’’ అంటూ మరోసారి తమ వైఖరిని స్పష్టం చేశారు. అంతేగాక అగ్రరాజ్యం అమెరికాతో సహా భారత్ వంటి పలు ప్రధాన దేశాలతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసి చైనాకు కంట్లో నలుసులా తయారయ్యారు.(చైనా క్షమాపణ చెప్పాల్సిందే.. నాన్సెన్స్ అన్న డ్రాగన్) ఈ నేపథ్యంలో శనివారం (అక్టోబరు 10న) నేషనల్ డే ఉత్సవాల నిర్వహణకు సిద్ధమైన త్సాయి ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి పలు మీడియాలో ప్రకటనలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వార్తా పత్రికలు ప్రకటనలు (ఫుల్ పేజీ) ప్రచురితం చేశాయి. త్సాయి ఇంగ్- వెన్ ఫొటోతో పాటు.. ‘‘తైవాన్- భారత్ సహజ మిత్రులు’’అనే నినాదం కూడా ఇందులో దర్శనమిచ్చింది. కోవిడ్- 19పై పోరులో పరస్పరం సహకరించుకున్నామన్న ఉద్దేశంతో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. (‘జిన్‌పింగ్‌ను అంతగా విశ్వసించలేం’!) మండిపడుతున్న చైనా.. భారత మీడియాకు లేఖ ఇక ఇప్పటికే త్సాయి ఇంగ్- వెన్‌పై భగ్గుమంటున్న చైనా ఈ పరిణామంతో మరింత గుర్రు మీద ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఏకంగా భారత్‌తో బంధాన్ని చాటుతూ తైవాన్ వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం, భారత మీడియా సంస్థలను ఉద్దేశించి బుధవారం ఓ లేఖను విడుదల చేసింది. ‘‘సోకాల్డ్ ‘‘నేషనల్ డే ఆఫ్ తైవాన్’’ సమీపిస్తున్న సందర్భంగా మీడియా మిత్రులకు ఓ విజ్ఞప్తి చేయదలచుకున్నాం. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క చైనా ఉంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వమే చైనా భూభాగమంతటినీ పాలిస్తోంది. తైవాన్ కూడా చైనా భూభాగంలో అంతర్భాగం. కాబట్టి మాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నీ కూడా ‘‘వన్- చైనా పాలసీ’’ని గౌరవస్తాయని, మా విధానం పట్ల నిబద్ధతను కలిగి ఉంటాయని ఆశిస్తున్నాం. భారత ప్రభుత్వంతో కూడా మాకు అధికారిక దౌత్య సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి భారత మీడియా కూడా ప్రభుత్వ విధానాలకు కట్టుబడి తైవాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాలను ఉల్లంఘించదని భావిస్తున్నాం. ముఖ్యంగా తైవాన్ను దేశంగా(నేషన్) అభివర్ణిస్తూ, అధ్యక్షురాలు వంటి పదాలు ఉపయోగిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి మీడియా మిత్రుల పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’’అంటూ తైవాన్ పట్ల తమ వైఖరిని తెలియజేస్తూ, మీడియాకు విజ్ఞప్తి చేసింది. గెట్ లాస్ట్: తైవాన్ విదేశాంగ శాఖ తమ గురించి మీడియాను ఉద్దేశించి చైనా ఎంబసీ రాసిన లేఖపై తైవాన్ విదేశాంగ మంత్రి జౌషిష్ జోసెఫ్ వూ ఘాటుగా స్పందించారు. ‘‘ఈ భూమీ మీద ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. అక్కడ మీడియాకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ విధానాలను ప్రేమించే ప్రజలు ఉంటారు. కానీ చైనా వంటి కమ్యూనిస్టు దేశం మాత్రం ఉపఖండ మీడియాపై సెన్సార్షిప్ విధించాలని చూస్తోంది. తైవాన్‌కు ఉన్న భారత స్నేహితులు ఇందుకు ఇచ్చే సమాధానం ఒక్కటే: గెట్ లాస్ట్!’’ అంటూ ట్వీట్ చేశారు. భారత మీడియాకు చైనీస్ ఎంబసీ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను భారత ట్విటర్ యూజర్లు జోసెఫ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ మేరకు స్పందించారు. కాగా తైవాన్‌తో భారత్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, న్యూఢిల్లీలో తైపీ ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక తైపీలో ఉన్న ఇండియా- తైపీ అసోసియేషన్ టూరిజం, వ్యాపారం, వాణిజ్యం తదితర అంశాలను ప్రమోట్ చేస్తూ పలు భిన్న కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇక తైవాన్- చైనా మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే అమెరికా మాత్రం డ్రాగన్ దేశానికి కౌంటర్ ఇస్తూ అన్ని విధాలా అండగా నిలబడుతోంది. We thank everyone for the #TaiwanNationalDay🇹🇼 wishes we have received from around the world. On this day, we celebrate our nation’s hard-earned freedoms & democratic achievements. We invite you to join us here at @iingwen & show that you too are #ProudOfTaiwan. pic.twitter.com/62ght5cvGd — 蔡英文 Tsai Ing-wen (@iingwen) October 8, 2020 -
యుద్ధం మొదలవుతుంది: చైనా హెచ్చరిక
బీజింగ్/తైపీ: అమెరికాతో బంధం బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో యుద్ధం తప్పదంటూ చైనా చేసిన హెచ్చరికలపై తైవాన్ ఘాటుగా స్పందించింది. ‘‘సుదూర ప్రాంతం నుంచి వచ్చిన స్నేహితులతో కేవలం డిన్నర్ చేసినందుకే చంపేస్తామంటూ, బెదిరింపులకు దిగిన ఇరుగుపొరుగు వాళ్లను మీరెలా డీల్ చేస్తారు? అడుగుతున్నాం అంతే!’’ అంటూ అధ్యక్ష కార్యాలయానికి చెందిన అధికార ప్రతినిధి ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెదిరింపులకు ఏమాత్రం భయపడబోమని పేర్కొన్నారు. 1949లో జరిగిన పౌర యుద్ధం తర్వాత తైవాన్ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపినప్పటికీ డ్రాగన్ ఆ దేశాన్ని ఇంకా తమ భూభాగంగానే ప్రకటించుకుంటున్న విషయం తెలిసిందే. (చదవండి: చైనాపై భగ్గుమన్న యూరప్) అయితే 2016లో త్సాయి ఇంగ్- వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత డ్రాగన్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమె.. అగ్రరాజ్యం అమెరికాతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక అధికారికంగా తైవాన్‌తో ఎటువంటి దౌత్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకోనప్పటికీ కఠిన సమయాల్లో ఆ దేశానికి అమెరికా ఆ దేశానికి అండగా నిలబడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త, విదేశాంగ శాఖ కీలక అధికారి కీత్ క్రచ్ గురువారం తైవాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా త్సాయి ఇంగ్- వెన్ మాట్లాడుతూ.. ‘‘తైవాన్, అమెరికా ఇలాగే కలిసి పనిచేస్తూ.. ఇండో- ఫసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి, సుస్థిరతకై చర్యలు తీసుకుంటూ ఉమ్మడిగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నా. తైవాన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. యూఎస్‌తో ఆర్థికపరమైన, ఇతరత్రా సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా చర్యలు చేపట్టనుంది’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో తైవాన్ అధ్యక్షురాలి వ్యాఖ్యలపై స్పందించిన డ్రాగన్ దేశం అధికార మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ తుడిచిపెట్టుకుపోతుంది.. ఈ మేరకు..‘‘అమెరికా సీనియర్ అధికారితో డిన్నర్ చేసిన సమయంలో తైవాన్ నాయకురాలు త్సాయి ఇంగ్- వెన్ అమెరికాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ బూనడం నిప్పుతో చెలగాటం వంటిదే. యాంటీ- సెసెషన్ లా ఆఫ్ చైనాను ఉల్లంఘించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే, యుద్ధం మొదలవడం ఖాయం. అదే జరిగితే త్సాయి తుడిచిపెట్టుకుపోక తప్పదు’’ అని గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇందుకు బదులుగా తైవాన్ సైతం దీటుగానే సమాధానమిచ్చి తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి, హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలు, దక్షిణ చైనా సముద్రం, ఇండో- ఫసిఫిక్ సముద్ర జలాల్లో దుందుడుకు చర్యలు తదితర అంశాల నేపథ్యంలో చైనా- అమెరికాల మధ్య దౌత్య, వాణిజ్యపరమైన యుద్ధం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అంతేగాక తైవాన్ను ప్రత్యేక దేశంగా పరిగణించవద్దంటూ డ్రాగన్ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరడంతో, సానుకూలంగా స్పందించడమే గాక తైవాన్ను ఆరోగ్య అసెంబ్లీ సమావేశానికి ఆహ్వానించకుండా డబ్ల్యూహెచ్ఓ వ్యవహరించిన తీరుపై కూడా అమెరికా భగ్గుమంది. తైవాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త తైవాన్‌లో పర్యటించడం చైనాకు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పించింది. ఇక గతంలో చెక్ సెనేట్ అధ్యక్షుడు మిలోస్ వైస్ట్రిల్ తైవాన్ పర్యటనకు వెళ్లినపుడు కూడా చైనా ఇలాగే స్పందించడంతో తైవాన్‌తో పాటు యూరప్ దేశాలు కూడా డ్రాగన్ తీరును తప్పుబట్టాయి. -
చైనా బెదిరింపులకు భయపడం..
బీజింగ్ : భారత్‌తో సరిహద్దు వివాదంలో దుర్నీతితో తెగబడుతున్న చైనాకు అంతర్జాతీయ సమాజంలోనూ ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. చైనా నోటి దురుసుతో తాజాగా ఐరోపా దేశాలు డ్రాగన్ తీరును తప్పుపడుతున్నాయి. చెక్ సెనేట్ అధ్యక్షుడు మిలోస్ వైస్ట్రిల్ గురువారం ఉదయం తైవాన్ నేత సాయ్ ఇంగ్-వెన్ను తన పర్యటనలో భాగంగా కలవడం పట్ల చైనా తీవ్రస్ధాయిలో మండిపడింది. వైస్ర్టిల్ తైవాన్ పర్యటనను "అంతర్జాతీయ ద్రోహ చర్య"గా అభివర్ణించిన చైనా చెక్ అధ్యక్షుడి ప్రకటనలనూ తప్పుపట్టింది. ఇది బీజింగ్ ఒన్ చైనా విధానానికి విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసింది. వైస్ర్టిల్ రెడ్ లైన్‌ను అతిక్రమించారని ఐదు రోజుల యూరప్ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వి వ్యాఖ్యానించారు. తైవాన్ను తన భూభాగంగా పరిగణించే చైనా ఈ ద్వీపంతో ఇతర దేశాల అధికారిక సంప్రదింపులను వ్యతిరేకించే సంగతి తెలిసిందే. చెక్ సెనేట్ అధ్యక్షుడి తన హ్రస్వ దృష్టి ప్రవర్తనకు, రాజకీయ అవకాశవాదానికి భారీ మూల్యం చెల్లించేలా చైనా చర్యలు ఉంటాయని వాంగ్ వి హెచ్చరించారు. చదవండి : పబ్జీ నిషేధంపై చైనా కీలక వ్యాఖ్యలు చైనా బెదిరింపులకు భయపడం.. వాంగ్ హెచ్చరికలను జర్మనీ, స్లొవేకియా, ఫ్రాన్స్‌లు తోసిపుచ్చాయి. ఐరోపా దేశాలు తమ అంతర్జాతీయ భాగస్వాములను గౌరవిస్తాయని వారి నుంచి అదే ప్రవర్తనను ఆశిస్తాయని..బెదిరింపులు ఇక్కడ పనిచేయవని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్ చైనా విదేశాంగ మంత్రికి దీటుగా బదులిచ్చారు. ఫ్రాన్స్ విదేశాంగ శాఖ వాంగ్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. స్లొవేకియా అధ్యక్షుడు జుజనా కపుతోవా సైతం చైనా తీరును తప్పుపట్టారు. -
ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం
-
వైరల్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం
తైపీ: నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదానికి సంబధించిన వీడియో ఒకటి తెగ ట్రెండ్ అవుతోంది. మూడేళ్ల చిన్నారి గాలిపటం తోకలో చిక్కుకుని.. దాదాపు 100 అడుగుల ఎత్తు మేర ఆకాశంలోకి దూసుకెళ్లింది. లేచిన వేళ బాగుంది కాబట్టి.. ఆ చిన్నారి ఈ భయంకరమైన ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. వివరాలు.. తైవాన్‌లో కైట్ ఫెస్టివల్ జరగుతోంది. ఈ నేపథ్యంలో జనాలు ఒకచోట చేరి ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో సదరు చిన్నారి అక్కడ నిలబడి ఎంజాయ్ చేస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా బలమైన గాలి వీచడం ప్రారంభించింది. దాంతో ఓ పెద్ద గాలి పటం తోక ఆ చిన్నారి నడుముకు చుట్టుకుంది. ఇంతలో గాలి వేగం పెరగడంతో కైట్.. అది చుట్టుకున్న చిన్నారి కూడా ఆకాశంలోకి దూసుకెళ్లింది. (చదవండి: కలవరపాటుకు గురైన డేవిడ్ వార్నర్..!) గాలిపటం సుమారు 100 అడుగుల ఎత్తు(30 మీటర్లు) వరకు వెళ్లింది. ఇది చూసిన జనాలు భయంతో కేకలు వేస్తూ.. సాయం కోసం అరిచారు. ఇంతలో కొందరు సభ్యులు గాలిపటాన్ని నెమ్మదిగా నేలమీదకు చేర్చారు. దాని తోకలో చిక్కుకున్న చిన్నారిని బయటకు తీశారు. ఈ పీడకల ముగియడానికి దాదాపు 30 సెకన్లు పట్టింది. చిన్న చిన్న గీతలు మినహా చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటికే మిలియన్ల మంది దీన్ని వీక్షించారు. మీరు చూడండి.. -
వైఎస్సార్ జిల్లాలో విదేశీ మొబైల్స్ తయారీ!
సాక్షి, అమరావతి/వైఎస్సార్: విదేశీ ఫోన్ ట్రింగ్ ట్రింగ్‌తో త్వరలోనే వైఎస్ఆర్ కడప జిల్లా మారుమ్రోగనుంది. కోవిడ్–19 తర్వాత విదేశీ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇప్పుడు ఇండియాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటంతో ఈ కంపెనీలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) ఏర్పాటు చేస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లా కోపర్తి వద్ద సుమారు 500 ఎకరాల్లో ఈఎంసీ3ని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి సమీపంలో వికృతమాళ వద్ద 113.27 ఎకరాల్లో ఈఎంసీ1 , 501.40 ఎకరాల్లో ఈఎంసీ 2 ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 500 ఎకరాల్లో కోపర్తి వద్ద ఈఎంసీ3ని అభివృద్ధి చేయనున్నారు. తైవాన్‌కు చెందిన పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయని, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. (ప్రజా నాడి తెలిసిన నేత మరిలేరు) మొబైల్ తయారీ యూనిట్ల ఆకర్షణే లక్ష్యం యాపిల్, రెడ్మీ వంటి ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫాక్స్‌కాన్ కోపర్తి ఈఎంసీలో యూనిట్ ఏర్పాటు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. అలాగే యాపిల్ ఫోన్ తయారు చేసే మరో తైవాన్ సంస్థ పెగాట్రాన్ కూడా కోపర్తిలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కోవిడ్–19 తర్వాత పలు విదేశీ కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని, వీటిని ఆకర్షించడం కోసం కోపర్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈఎంసీ–3ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే విదేశాలకు చెందిన సుమారు 22 కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాయని, వీటిలో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కడప జిల్లా యాపిల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్‌లతో మారుమ్రోగనుంది. (‘అమూల్’ శిక్షణా తరగతులు)