తైవాన్ దేశం తమ భూభాగమేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. తైవాన్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్ గగనతంపై మీదకు యుద్ధ విమానాలు, నౌకలను పంపి డ్రాగన్ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే తైవాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మద్దతుగా ఉండటంతో చైనా అడుగులకు బ్రేక్‌లు పడుతున్నాయి.
ఒకవేళ చైనా తైవాన్ మీద దాడి చేస్తే మాత్రం భారీ యుద్ధానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదు. అంతకంతకూ పెరుగుతున్న చైనా ఆర్థిక, సైనిక శక్తి.. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం చేస్తున్న తైవాన్ పోరాటం, అమెరికా, బీజింగ్ మధ్య విభేదాలు రోజురోజుకీ ప్రమాదకరంగా మారనున్నాయి. తాజాగా చైనా ఇప్పటికిప్పుడు తైవాన్‌పై యుద్ధం ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుందో బ్లూంబెర్గ్ ఎకనామిక్స్ వెల్లడించింది.
తైవాన్‌పై చైనా దండయాత్ర చేస్తేలక్షల కోట్ల నష్టం తప్పదని వెల్లడించింది. సుమారు రూ.830 లక్షల కోట్ల(పది ట్రిలియన్ డాలర్ల) మేర నష్టం వాటిల్లనున్నట్లు అంచనా వేసింది. ఇది ప్రపంచ జీడీపీలో 10 శాతం అని తెలిపింది. తైవాన్‌ను చైనా ఆక్రమించేందుకు సిద్ధమైతే... కొవిడ్, సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను మించిన సంక్షోభం తలెత్తుతుందని పేర్కొంది.
తైవాన్‌ను తమ దేశంలో విలీనం చేసి తీరుతామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయ తెలిసిందే. తైవాన్ తన మాతృభూమితో కలవక తప్పదని.. చైనాతో విలీనం కావడం అనివార్యమని చెప్పారు. కాగా జనవరి 13న తైవాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు, తైవాన్‌ను చైనా ఆక్రమణ వార్తలు చర్చనీయాంశంగా మారియి
చదవండి: సికాడాల దండయాత్ర.. వణుకుతున్న అమెరికా!
Comments
Please login to add a commentAdd a comment