Bloomberg
-
మన్మోహన్‌కు అంతర్జాతీయ మీడియా నివాళులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: బీబీసీ 1991లో ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక సరళీకృత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. భారత అత్యున్నత పదవిని నిర్వహించిన మొదటి సిక్కుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నేత. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. పదవులు నచ్చని రాజు: రాయిటర్స్ మన్మోహన్ సింగ్.. పదవులు నచ్చని రాజు. భారత్‌లో అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరు. ఆయన పాలనలో జరిగిన ఆర్థిక వృద్ధి లక్షలాదిమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గొప్ప ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినా.. సోనియాగాంధీ చేతిలోనే ప్రభుత్వం ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. దూరదృష్టిగల నేత: న్యూయార్క్ టైమ్స్ మన్మోహన్సింగ్ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపైకి నడిపించిన దూరదృష్టి గల నేత, మృదుభాíÙ. పాకిస్తాన్‌తో సయోధ్య కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. సమగ్రతకు చిహ్నం: వాషింగ్టన్ పోస్ట్ మన్మోహన్సింగ్ టెక్నోక్రాట్ నుంచి ప్రధాని స్థాయికి నాటకీయంగా ఎదిగారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన హయాంలో జరిగిన ఇండో–యూఎస్ పౌర అణు ఒప్పందం ఒక మైలురాయి. సమగ్ర నాయకుడైన ఆయన శక్తిహీనులని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి: బ్లూమ్‌బర్గ్ మన్మోహన్సింగ్ గొప్ప సంస్కర్త. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అవినీతి కుంభకోణాలతో రెండో పర్యాయంలో ఆయన సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఎల్లలెరుగని స్నేహితుడు: ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మన్మోహన్సింగ్ పాత్ర అమోఘం. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఆయన చేసిన కృషి, సంస్కరణలు ఆయన పదవీకాలంలో మైలురాళ్లు. సామాజిక విధానం, దౌత్యంలో ఆయన నాయకత్వం గొప్పది. 2జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు కుంభకోణం వంటి వివాదాలు ఆయన తర్వాతి కాలాన్ని దెబ్బతీశాయి. సౌమ్యుడైన నాయకుడు: అల్ జజీరా మన్మోహన్ సింగ్ సౌమ్య ప్రవర్తన కలిగిన టెక్నోక్రాట్. గొప్ప వ్యక్తిగత సమగ్రత కలిగిన నాయకుడు. దూర దృష్టితో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. -
200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్‌ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
నాటో భేటీ వేళ రష్యా యాత్రా?
వాషింగ్టన్: నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఇది భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపగలదని ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు చెప్పుకొచి్చంది. ‘‘పుతిన్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అమెరికా ప్రభుత్వం లోపల, వెలుపల విమర్శలకు దారి తీసింది. వాషింగ్టన్లో నాటో సదస్సు జరుగుతుండగా మోదీ రష్యాలో పర్యటించడం బైడెన్ యంత్రాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది. పుతిన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న నాటో ప్రయత్నాలకు ఇది గండి కొట్టింది. అందుకే అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి కర్ట్ కాంప్‌బెల్ జూలై మొదట్లోనే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రాతో మాట్లాడారు. మోదీ రష్యా పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సిందిగా కోరారు’’ అని నివేదిక వివరించింది. ఈ ఉదంతంపై విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. అమెరికాతో స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భారత్‌లో ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ గురువారం మీడియాతో సమావేశంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అవి రష్యా పర్యటనను ఉద్దేశించేనని చెబుతున్నారు. రష్యాను విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్ర దేశంగా భారత్ పరిగణించడం పొరపాటని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయపడ్డారు. -
ఆసియా కుబేరుడు ఎవరు? బ్లూమ్‌బర్గ్ తాజా ర్యాంకులు
అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 111 బిలియన్ డాలర్ల (రూ.9.2 లక్షల కోట్లు) నికర సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని (109 బిలియన్ డాలర్లు) అధిగమించి సూచీలో 11వ స్థానంలో ఉన్నారు.వచ్చే పదేళ్లలో 90 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాలతో గ్రూప్ వేగంగా విస్తరిస్తున్నదని జెఫరీస్ చేసిన ప్రకటన నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలన్నీ శుక్రవారం షేర్ల ధరలను పెంచాయి. మార్కెట్ సానుకూలంగా స్పందించడంతో అదానీ గ్రూప్ షేర్లకు ఇన్వెస్టర్ల సంపద రూ.1.23 లక్షల కోట్లు పెరగడంతో ఇంట్రాడే ట్రేడింగ్‌లో వాటి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.94 లక్షల కోట్లకు పెరిగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.51 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రస్తుతం 207 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. 203 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్, 199 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
బ్లూం బెర్గ్ గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో భారతీయ కుబేరులు
ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది. 15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్ దిగ్గజం ‘లో రియాల్’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, డెల్ టెక్నాలజీస్ ఫౌండర్ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు. 1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్ కారణంగా డెట్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు తొలి స్థానం, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ రెండవ స్థానం, ఎలాన్ మస్క్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్ గ్రూప్‌లోకి భారత్ నుంచి ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సైతం చోటు దక్కించుకోవడం గమనార్హం. -
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్‌గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్‌లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్‌లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్‌తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. -
మంచులా కరిగిపోతున్న సంపద.. మస్క్‌కు దెబ్బ మీద దెబ్బ
ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి స్థానం కోల్పోయిన టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సంపద మంచులా కరిగిపోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 40 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయినట్లు బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న మస్క్‌ను అదిగమించారు. అయితే, స్వల్ప వ్యవధిలో 198 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయారు. లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. నిన్న మొన్నటి వరకు తొలిస్థానంలో ఉన్న మస్క్ ఏకంగా 108 బిలియన్ డాలర్లతో మూడో స్థానానికి పడిపోవడం విశేషం. టెస్లా షేర్ల పతనం మస్క్ అపరకుబేరుల స్థానం నుంచి పడిపోవడానికి, ఆయన సంపద మంచులా కరిగిపోవడానికి టెస్లా షేర్లే కారణం. టెస్లాలో మస్క్‌కు 21 శాతం వాటా ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరిగితే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా షేర్ల ధరలు అమాంతం పెరుగుతాయి. బిజినెస్ టైకూన్ సంపద సైతం పెరుగుతుంది. అదే టెస్లా కంపెనీపై ప్రతి కూల ప్రభావం ఏర్పడితే.. మస్క్ సంపదపై పడుతుంది. తాజాగా ఇదే జరిగింది. గిగా ఫ్యాక్టరీ షట్‌డౌన్ ఈ నెల ప్రారంభంలో చైనాలోని షాంఘైలో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గినట్లు టెస్లా రిపోర్ట్‌ను విడుదల చేసింది. మరోవైపు యూరప్‌లోని బెర్లిన్ ప్రాంతంలో ఉన్న టెస్లా గిగా ఫ్యాక్టరీ సమీపంలో అల్లరి మూకలు కాల్పులు తెగబడ్డాయి. దీంతో భద్రత దృష్ట్యా.. మార్చి 17 వరకు కరెంట్ సరఫరా నిలిపివేసింది. టెస్లా కార్లలో వినియోగించే ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. 55 బిలియన్ డాలర్ల వేతనంపై అభ్యంతరం దీనికి తోడు టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని తీసుకుంటున్నాడు. మస్క్‌కు అంత వేతనం అవసరమా అంటూ టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. డెలావర్ కోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. కోర్టు తీర్పుతో మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ వరుస పరిణామాలతో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మస్క్ సంపద 29 శాతం తగ్గింది. 2021 గరిష్ట స్థాయి నుండి 50 శాతం పడిపోయింది. ఇలా వరుస దెబ్బ మీద దెబ్బలు మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశీ జీ–సెక్యూరిటీలకు సై
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో దేశీ జీ–సెక్యూరిటీలను వర్ధమాన మార్కెట్(ఈఎం) స్థానిక ప్రభుత్వ ఇండెక్స్, సంబంధిత సూచీలలో చేర్చనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిధుల సమీకరణ వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనుంది. 2025 జనవరి 31 నుంచి ఇండియన్ ఫుల్లీ యాక్సెసబుల్ రూట్(ఎఫ్ఏఆర్) బాండ్లను బ్లూమ్‌బెర్గ్ ఈఎం లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్సులలో చోటు కలి్పంచనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో బాండ్ల పూర్తి మార్కెట్ విలువకు 10 శాతం వెయిటేజీతో వీటిని చేర్చనున్నట్లు తెలియజేసింది. తదుపరి ఎఫ్ఏఆర్ బాండ్ల పూర్తి మార్కెట్ విలువకు 10 శాతం చొప్పున ప్రతీ నెలా వెయిటేజీ పెరగనున్నట్లు వివరించింది. 10 నెలలపాటు వెయిటేజీ పెరగడం ద్వారా 2025 అక్టోబర్‌కల్లా పూర్తి మార్కెట్ విలువకు వెయిటేజీ చేరనున్నట్లు వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ ఈఎం లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్స్, 10 శాతం కంట్రీ క్యాప్డ్ ఇండెక్స్‌తోపాటు సంబంధిత సహచర ఇండెక్సులలోనూ వీటికి చోటు కలి్పంచనున్నట్లు పేర్కొంది. కాగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్ ప్రసంగంలో కొన్ని ప్రత్యేకించిన విభాగాల ప్రభుత్వ సెక్యూరిటీలు నాన్‌రెసిడెంట్ ఇన్వెస్టర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశీ ఇన్వెస్టర్లకు సైతం ఇవి అందుబాటులో ఉంటాయని, ఇండెక్సులలో లిస్ట్‌కానున్న వీటికి లాకిన్ అమలుకాబోదని తెలియజేశారు. బ్లూమ్‌బెర్గ్ ఈఎం మార్కెట్ 10 శాతం కంట్రీ క్యాప్డ్ ఇండెక్స్‌లో చేరాక చైనా, దక్షిణ కొరియా మార్కెట్ల జాబితాలో భారత్ చేరనుంది. -
అపరకుబేరుడు ఎలోన్ మస్క్‌కి భారీ షాక్
ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో బిలియనీర్ల స్థానంలో తొలిస్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. యథావిధిగా అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మస్క్ నెట్‌వర్త్ 198 బిలియన్లుగా ఉంది. అంత వేతనం వదులు కోవాల్సిందే టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5లక్షల కోట్లు) వేతనాన్ని తీసుకుంటున్నారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అంత వేతనం అందుకోవడంపై టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. పలు మార్లు ఈ అంశంపై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. తాజాగా మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పుతో టెస్లా షేర్లు పడిపోవడం, ఆ సంస్థలో అత్యధిక షేర్లున్న మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు. పడిపోయిన టెస్లా కార్ల ఎగుమతులు దానికి తోడు చైనాలోని షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుండి కార్ల ఎగుమతులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కనిష్ట స్థాయికి పడిపోయాంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో టెస్లా షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అమెజాన్‌లో అమ్మకాలో జోరందుకోవడం ఆ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్‌కి కలిసి వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకునేందుకు దోహదం చేసింది. -
Elon Musk: మూడు లక్షల కోట్లు తగలెట్టేశాడు
అపర కుబేరుడు ఎలోన్ మస్క్ 21 ఏళ్ల కుర్రాడిపై ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.3.50లక్షల కోట్లు తగలేశాడు. ఇప్పుడు ఇదే ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. మస్క్ 2022లో ‘వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’. ట్విటర్ (ఇప్పుడు ఎక్స్.కామ్‌గా మారింది) ను కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎలోన్ మస్క్ చెబుతున్న మాటలివి. అత్యంత ప్రభావంతమైన సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్లో దీనిపై నియంత్రణ ఉండటం సరికాదన్నది ఆయన అభిప్రాయం. అందుకే ట్విటర్ కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత తొలి సందేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. వాక్ స్వాతంత్ర్యం కాదు.. 21 ఏళ్ల కుర్రాడిపై అయితే మస్క్ ట్విటర్ కొనుగోలు చేయడానికి వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కాదని, 21 ఏళ్ల కుర్రాడిపై ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయం అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా.. అక్షరాల ఇదే నిజం అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ కర్ట్ వాగ్నెర్ (Kurt Wagner) పలు సంచలన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఆయనే స్వయంగా ఓ పుస్తకాన్ని రాశారు. ‘బ్యాటిల్ ఫర్ ద బర్డ్’ బుక్‌లో ట్విటర్ కొనుగోలుకు ముందు అప్పటి సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు, ఎలోన్ మస్క్ ఏం జరిగిందో కులంకషంగా వివరించారు. అది 2022 జనవరి నెల. ఆ నెలలో స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీలతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘ఎలోన్ జెట్’ అనే ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని అప్పటి ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను కోరారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇదే విషయాన్ని బ్యాటిల్ ఫర్ ద బర్డ్‌లో ప్రస్తావించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం పేర్కొంది. ఎలోన్ జెట్ అకౌంట్ ఎవరిది ఎలోన్ జెట్ ట్విటర్ అకౌంట్ 19 ఏళ్ల కుర్రాడు జాక్ స్వీనీ (Jack Sweeney)ది. అప్పట్లో జాక్ స్వీనీ తన టెక్నాలజీలో తనకున్న అపారమైన తెలివితేటలతో ఎలోన్ మస్క్‌ను బయపెట్టాడు. తన సొంత నైపుణ్యంతో విమానాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఓ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. అలా ప్రైవేటు వ్యక్తుల విమానాలు ఎప్పుడు.. ఎక్కడ.. ఉన్నాయో ఇట్టే చెప్పేస్తున్నాడు. అందుకోసం ట్విటర్‌ను వేదికగా చేసుకున్నాడు. స్వీనీ ట్రాక్ చేస్తున్న విమానాల్లో ఎలోన్ మస్క్‌తో పాటు ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు. 3లక్షలు వద్దు 37లక్షలు కావాలి ఇదే విషయం తెలుసుకున్న మస్క్.. స్వీనీని ట్విటర్లోనే (ఆ ట్వీట్‌ను కింద ఫోటోలో చూడొచ్చు) సంప్రదించారు. తన విమానాల్ని ట్రాక్ చేయడం ఆపాలని కోరారు. స్వీనీ విమానాల్ని ట్రాక్ చేయడం వల్లే తాను ఎంత నష్టపోతున్నానో వివరించారు మస్క్. అందుకు 5,000 (రూ.3.75 లక్షలు) డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశారు. కానీ, స్వీనీ అందుకు నిరాకరించాడు. తనకు 50,000 డాలర్లు (దాదాపు రూ.37.55 లక్షలు) కావాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తంతో తాను స్కూల్ ఫీజు చెల్లించడంతో పాటు టెస్లా కారు కొనుక్కుంటానని తెలిపాడు. ‘బ్యాటిల్ ఫర్ ది బర్డ్’ ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై ఈ నెల 20న విడుదల కానున్న బ్యాటిల్ ఫర్ ది బర్డ్‌లో “మస్క్ తన ప్రైవేట్ విమానాన్ని ట్రాక్ చేస్తున్న ట్విటర్ ఖాతాను తొలగించమని అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. అగర్వాల్ మస్క్ అభ్యర్థనను తిరస్కరించారు. ఇలా కొద్దిసేపటికే మస్క్ ట్విటర్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారని కర్ట్ వాగ్నెర్ హైలెట్ చేశారు. 2022 అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ ట్విటర్‌ని 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం ట్విటర్లో సిబ్బంది తొలగించారు. సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, పలువురు జర్నలిస్టులతో పాటు జాక్ స్వీనీ ట్విటర్ అకౌంట్ ఎలోన్ జెట్‌ను సస్పెండ్ చేశారు. మస్క్ ట్విటర్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారు? ►ఎలోన్ మస్క్ ఏప్రిల్ 14,2022 ఒక్క షేరును 54.20 చొప్పున మొత్తం షేర్లను 44 బిలియన్ డాలర్లకు అంటే (సుమారు రూ.3.50లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన ►ఏప్రిల్ 25న ట్విటర్ సైతం తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను మస్క్‌కు అమ్ముతున్నట్లు ధృవీకరించింది. ►మస్క్- ట్విటర్ మధ్య ఫేక్ ట్విటర్ అకౌంట్లపై వివాదం నెలకొంది. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం జులై 8న మస్క్ మరో ప్రకటన చేశారు. ట్విటర్‌ను కొనుగోలు చేయడం లేదని, ఫేక్ అకౌంట్లకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందన్న ఆరోపణలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు వెల్లడించారు. ►ఎట్టకేలకు మస్క్-ట్విటర్ మధ్య కొనుగోలు ఒప్పందం పూర్తయింది. 3.50లక్షల కోట్లు వెచ్చించిన ఈ అపరకుబేరుడు ట్విటర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ట్విటర్‌ను ఎక్స్.కామ్‌గా మార్చారు. ఇప్పుడు దానిని ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మస్క్. -
తైవాన్‌పై చైనా యుద్ధం ప్రకటిస్తే .. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
తైవాన్ దేశం తమ భూభాగమేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. తైవాన్ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్ గగనతంపై మీదకు యుద్ధ విమానాలు, నౌకలను పంపి డ్రాగన్ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే తైవాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మద్దతుగా ఉండటంతో చైనా అడుగులకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఒకవేళ చైనా తైవాన్ మీద దాడి చేస్తే మాత్రం భారీ యుద్ధానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదు. అంతకంతకూ పెరుగుతున్న చైనా ఆర్థిక, సైనిక శక్తి.. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం చేస్తున్న తైవాన్ పోరాటం, అమెరికా, బీజింగ్ మధ్య విభేదాలు రోజురోజుకీ ప్రమాదకరంగా మారనున్నాయి. తాజాగా చైనా ఇప్పటికిప్పుడు తైవాన్‌పై యుద్ధం ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుందో బ్లూంబెర్గ్ ఎకనామిక్స్ వెల్లడించింది. తైవాన్‌పై చైనా దండయాత్ర చేస్తేలక్షల కోట్ల నష్టం తప్పదని వెల్లడించింది. సుమారు రూ.830 లక్షల కోట్ల(పది ట్రిలియన్ డాలర్ల) మేర నష్టం వాటిల్లనున్నట్లు అంచనా వేసింది. ఇది ప్రపంచ జీడీపీలో 10 శాతం అని తెలిపింది. తైవాన్ను చైనా ఆక్రమించేందుకు సిద్ధమైతే... కొవిడ్, సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను మించిన సంక్షోభం తలెత్తుతుందని పేర్కొంది. తైవాన్ను తమ దేశంలో విలీనం చేసి తీరుతామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయ తెలిసిందే. తైవాన్ తన మాతృభూమితో కలవక తప్పదని.. చైనాతో విలీనం కావడం అనివార్యమని చెప్పారు. కాగా జనవరి 13న తైవాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు, తైవాన్ను చైనా ఆక్రమణ వార్తలు చర్చనీయాంశంగా మారియి చదవండి: సికాడాల దండయాత్ర.. వణుకుతున్న అమెరికా! -
Gautam Adani: ఒక్క రోజులో తారుమారు.. అత్యంత సంపన్నుడు అదానీనే
పోర్టుల నుంచి పవర్ వరకూ అనేక వ్యాపారాలు నిర్వహించే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ఒకప్పుడు ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు, 2022 సెప్టెంబర్ కాలంలో ఆయన సంపద దాదాపు 149 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. కానీ ఓ నివేదిక ఆయన్ను పాతాళానికి పడేసింది. దాని నుంచి బయటపడిన అదానీ పడిలేచిన కెరటంలా మళ్లీ అపర కుబేరుడి స్థానానికి చేరారు. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ స్థానం ఒక్కరోజులో మారిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని దాటి అత్యంత సంపన్న భారతీయుడిగా, ప్రపంచంలోని 12వ అత్యంత ధనికుడిగా గౌతమ్ అదానీ నిలిచారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో తాజా అప్డేట్ సూచించింది. ఒక్క రోజులో రూ.63 వేల కోట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసుపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం అదానీ సంపద ఒక్క రోజులోనే ఏకంగా 7.67 బిలియన్ డాలర్లు (సుమారు రూ.63 వేల కోట్లు) పెరిగింది. ఇప్పుడాయన నెట్‌వర్త్ 97.6 బిలియన్ డాలర్ల (రూ.8.1 లక్షల కోట్లు)కు చేరింది. 97 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్లు) ముఖేష్ అంబానీ సంపదను అధిగమించింది. అదానీ గ్రూప్ స్టాక్స్ దేశీయ మార్కెట్లలో ఊపందుకుంటున్న నేపథ్యంలో గౌతమ్ అదానీ సంపద త్వరలోనే 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను సైతం దాటుతుందని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ కొత్త ఏడాది 2024లో ఇప్పటివరకు తన సంపదలో 13.3 బిలియన్ డాలర్లు (రూ.1.1లక్షల కోట్లు) పెంచుకున్నారు. ఒక వ్యక్తికి ఇంత తక్కువ సమయంలో సంపద పెరుగుదల ఇదే ఎక్కువ. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ సంపద 665 మిలియన్ డాలర్లు (రూ.5,530 కోట్లు) మాత్రమే పెరిగింది. పాతాళానికి పడేసిన నివేదిక పోర్ట్స్ టు పవర్ వ్యాపార సమ్మేళనం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒకప్పుడు ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు, ఆయన సంపద 2022 సెప్టెంబర్ కాలంలో దాదాపు 149 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. కానీ 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన ఒక నివేదిక స్కై-హై వాల్యుయేషన్లను ఉటంకిస్తూ అదానీ గ్రూప్ స్టాక్‌లు 85 శాతం పడిపోతాయని అంచనా వేసింది. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి 150 బిలియన్ డాలర్లు క్షీణించాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి 27న అదానీ వ్యక్తిగత సంపద 37.7 బిలియన్ డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడడానికి ఒక రోజు ముందు వరకూ అదానీ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్నుడు. -
పూర్తిగా అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా సంస్థ..
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం రాఘవ్ బెహల్ నెలకొల్పిన డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో (క్యూబీఎంఎల్) మిగతా 51 శాతం వాటాను వ్యాపార దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది. తమ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. లావాదేవీ పూర్తయ్యాక ఏఎంఎన్ఎల్కు క్యూఎంఎల్ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. బీక్యూ ప్రైమ్ పేరిట మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించే క్యూబీఎంఎల్‌లో ఏఎంఎన్ఎల్ గతంలో రూ. 48 కోట్లకు 49% వాటాలను కొనుగోలు చేసింది. గతంలో బ్లూమ్‌బెర్గ్ క్వింట్గా పిలిచే బీక్యూ ప్రైమ్‌ను యూఎస్ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ మీడియా, భారత్‌కు చెందిన క్వింటిలియన్ మీడియా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అయితే, బ్లూమ్‌బెర్గ్ గత ఏడాది మార్చిలో ఆ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. -
ఆ ఒక్క మాటతో.. ఎలాన్ మస్క్‌కు రూ.1.64 లక్షల కోట్లు నష్టం!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. టెస్లా కార్ల ధరల్ని తగ్గిస్తామంటూ మస్క్ చేశారు. అంతే ఆ నిర్ణయంతో టెస్లా షేర్ వ్యాల్యూ భారీగా క్షీణించింది. మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు (రూ.1.64లక్షల కోట్లు) కోల్పోయారు. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..ఎలాన్ మస్క్ మొత్తం సంపద 234.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మస్క్ ప్రతీరోజు 530 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, మస్క్ నెట్ వర్త్‌ను మొత్తంలో ఏడు సార్లు కోల్పోయారు. అయినప్పటికీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రముఖ లగర్జీ గృహోపకరణాల సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్‌కు ఆర్నాల్ట్‌ల మధ్య వ్యత్యాసం కేవలం 33 బిలియన్ డాలర్లు మాత్రమే. మస్క్‌తో పాటు ఒక్కరోజులోనే భారీ మొత్తంలో సంపద కోల్పోయిన జాబితాలో టెస్లా సీఈవోతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలు సైతం ఉన్నారు. వారిలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బల్మెర్, మెటా బాస్ మార్క్ జుకర్ బర్గ్, ఆల్ఫాబెట్ కోఫౌండర్ లారీ పేజ్,సెర్గీ బ్రిన్ ఇలా టెక్ కంపెనీల సంపద 2.3శాతంతో 20.3 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయినట్లు అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ 100 ఇండెక్స్ తెలిపింది. ఒక్కరోజే 9.7 శాతం న్యూయార్క్ కేంద్రంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెస్లా షేర్ల విలువ ఏప్రిల్ 20 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై 20న 9.7 శాతంతో టెస్లా షేర్ ధర 262.90 డాలర్ల వద్ద కొనసాగుతూ వస్తుంది. ఇక, ఏప్రిల్ 20 నుండి టెస్లా భారీ నష్టాల్ని చవిచూస్తున్నట్లు మస్క్ ఓ సందర్భంలో తెలిపారు. టెస్లా మదుపర్లలో అలజడి అంతేకాదు ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో నాలుగు సంవత్సరాల కనిష్టానికి పడిపోయి గ్రాస్ మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. తాజాగా, అమెరికా ప్రభుత్వం ఆర్ధిక మాంద్యాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతే టెస్లా ధరలను తగ్గించాల్సి ఉంటుందని కంపెనీ మస్క్ హెచ్చరించారు. మస్క్ చేసిన ఈ ప్రకటనతో టెస్లా షేర్ హోల్డర్లలో తీవ్ర అలజడిని రేపింది. షేర్లను అమ్ముకోవడంతో ఎలాన్ మస్క్ సంపద భారీ క్షిణీంచింది. చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు -
టెస్లా జోష్: మస్త్..మస్త్..అంటూ దూసుకొచ్చిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ అపరకుబేరుడిగా నిలిచాడు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాగాడు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. 2023లో టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మస్క్ నికర విలువ 28 ఫిబ్రవరి నాటికి 187 బిలియన్ డాలర్లు. 2023లో మస్క్ సంపద దాదాపు 50 బిలియన్ డాలర్లు లేదా 36 శాతం పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ మొత్తం నికర విలువ 187 బిలియన్ డాలర్లకు చేరుకోగా, రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 185 బిలియన్ డాలర్లు. గత ఏడాది అధిక నష్టాల కారణంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తాగా టెస్లా షేర్లు భారీగా పుంజుకోవడంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడు.ఈ ఏడాదిలో టెస్లా స్టాక్ 100 శాతం ఎగిసింది. గత ఏడాది డిసెంబరులో మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోగా, ఆర్నాల్డ్ సంపదపెరగడంతో మస్క్‌ను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించిన సంగతి తెలిసిందే. అటు ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 84.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. మరోవైపు ఒకప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న స్థానంలో అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 37.7 బిలియన్ డాలర్ల సంపదతో ఈ సూచీలో 32వ స్థానానికి పడిపోయాడు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూపు షేర్లన్నీ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. -
జాబ్ పోయిందనే సంతోషంలో ఉద్యోగులు..బ్లూమ్ బర్గ్ సంచలన సర్వే!
ఉద్యోగుల్లో రోజు రోజుకీ అసహనం పెరిగి పోతుంది. ఒకరి లక్ష్యం కోసం మనమెందుకు పనిచేయాలి’అని అనుకున్నారో.. ఏమో! ఆర్ధిక మాంద్యం భయాలతో సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పుడా తొలగింపులతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పీడా విరగడైందని తెగ సంబరపడిపోతున్నారు. సాధారణంగా ఒక సంస్థ విధుల నుంచి తొలగించిందంటే సదరు ఉద్యోగి కెరియర్లో ఆటుపోట్లు ఎదురైనట్లే. 1969 జనవరి నుంచి ప్రస్తుతం ఈరోజు వరకు ఎన్నడూ లేనంతగా జాబ్ మార్కెట్లో నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నాయి. కానీ వాల్ స్ట్రీట్ నుంచి సిలికాన్ వ్యాలీ టెక్ సంస్థల వరకు ఉద్యోగులు ఉపాధి కోల్పోయినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలనుంచి తప్పుకున్నందుకు సంతోషిస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడుపుతూనే.. కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా లాస్ ఎంజెల్స్‌లో ఈ-స్పోర్ట్స్ కంపెనీలో సోషల్ మీడియా ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న బోబిన్ సింగ్‌ను ఇంటికి సాగనంపింది సదరు యాజమాన్యం. దీంతో హమ్మాయ్యా... ఇకపై టిక్‌టాక్ లాంటి షార్ట్ వీడియోల కోసం ఫ్రీల్సాన్ వీడియో ఎడిటింగ్ వర్క్ చేసుకోవచ్చు. నా న్యూఇయర్ రెసొల్యూషన్ ఇదే. తక్కువ పని.. నచ్చిన రంగంపై దృష్టిసారిస్తా’ అని అంటోంది. ఈ తరహా ధోరణి జెన్ జెడ్ కేటగిరి ఉద్యోగుల్లో 20 శాతం, 15 శాతం మంది మిలీనియల్స్ ఉన్నట్లు బ్లూమ్ బర్గ్ నిర్వహించిన సర్వేలో తేలింది. జనవరి 18న జార్జియాకు చెందిన 43 ఏళ్ల రిక్రూటర్‌ను అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి తొలగించింది. లేఆఫ్స్ గురించి తెలిసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించింది. చివరికి ఓ కంపెనీలు జాబ్ దొరికింది. ‘నా ఉద్యోగం పోయిందని తెలిసే సమయానికి నన్న తొలగించినందుకు సంతోషించాను. ఎందుకంటే నేను చేరబోయే కొత్త కంపెనీలో ఉద్యోగం నాకు సంతృప్తినిస్తుందని అనిపించింది. నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు చెందిన 47 ఏళ్ల కేసీ క్లెమెంట్‌ను గతేడాది జూలైలో గేమ్‌స్టాప్ సంస్థ అతన్ని ఫైర్ చేసింది. తొలగింపులతో ‘తొలగింపులు నా ఆలోచన ధోరణిని మార్చేశాయి. విభిన్న కోణాలను చూసేందుకు, అవకాశాలను సృష్టించుకోవడానికి సహాయ పడింది అంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ అవ్వడం..తన రంగంలో ఎక్స్పీరియన్స్ కారణంగా వరుసగా ఏడు కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇలా లేఆఫ్స్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగుల గురించి.. తొలగింపులు గతంలో కంటే భవిష్యత్‌లో వారి కెరియర్ బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు నిపుణులు. ఉద్యోగులు సైతం ఇదే తరహా ఆలోచిస్తున్నారంటూ బ్లూమ్ బర్గ్ సర్వేలో తెలిపింది. -
రూ.8.84లక్షల కోట్లు పోగొట్టుకున్న ఎలాన్ మస్క్!
340 బిలియన్ డాలర్లతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ప్రథమస్థానంలో ఉన్నారు. అయితే ట్విటర్ కొనుగోలుతో ఆయన ఆస్తి కరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలొఓ ఏకంగా 107 బిలియన్ డాలర్లు అంటే రూ.8.84 లక్షల కోట్లను కోల్పోయారు. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు. ఆయన స్థానాన్ని బెర్నార్డ్ అర్నాల్ట్ కైవసం చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..ఎలాన్ మస్క్ తన సంపద జనవరిలో $168.5 బిలియన్ల నుంచి $100 పైకి పడిపోయింది. దీంతో బుధవారం నాటికి ఆర్నాల్ట్ $172.9 బిలియన్ల నికర విలువ కంటే తక్కువగా ఉండటం..బెర్నార్ట్ మస్క్ కంటే 48 శాతం సంపద ఎక్కువ ఉండడంతో మస్క్ నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయారు. చేజేతులా నాశనం వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ జాబితాలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోవడానికి కారణం ఆయనేనని తెలుస్తోంది. సెప్టెంబర్ 2021 నుంచి నెంబర్ వన్ మల్టీ బిలియనీర్ స్థానంలో ఉన్న మస్క్ ఈ ఏడాది 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుతో మస్క్ సంపద మంచులా కరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా ఈ డీల్‌ను క్లోజ్ చేసేందుకు తన వద్ద తగినంద నిధులు లేకపోవడంతో ఏప్రిల్‌లో సుమారు $8.5 బిలియన్లు, ఆపై ఆగస్టులో మరో $6.9 బిలియన్ల విలువైన షేర్లను విక్రయించాడు. ఆర్ధిక మాంద్యం దెబ్బ దీనికి తోడు ఆర్ధిక మాంద్యాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌లు, ఇతర సెంట్రల్ బ్యాంకులు సైతం వడ్డీరేట్లను విపరీతంగా పెంచాయి. వడ్డీ రేట్ల పెంపుతో కొనుగోలు దారులు ఖర్చు చేయడం తగ్గించారు. ఖర్చు చేయడం ఎప్పుడైతే తగ్గించారో..ఆటోమొబైల్ తయారీ సంస్థల షేర్లు 50 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. వెరసీ అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ వన్‌స్థానం నుంచి రెండో స్థానానికి దిగజారారు. ప్రస్తుతం మస్క్ స్థానంలో బెర్నార్డ్ అర్నాల్ట్ కొనసాగుతున్నారు. -
భారీగా ఉద్యోగులపై వేటు..ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!!
ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఇంటెల్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ డిమాండ్ తగ్గడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. బ్లూం బెర్గ్ విడుదల చేసిన జులై రిపోర్ట్‌లో ఇంటెల్ మొత్తం ఉద్యోగులు 113,700 మంది పనిచేస్తున్నారు. అయితే తాజాగా పీసీ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఇంటెల్ 20శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు, వారిలో సేల్స్, మార్కెటింగ్ బృంద సభ్యులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నో కామెంట్ ఉద్యోగుల తొలగింపుపై ఇంటెల్ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా.. జులై నెలలో ఆ సంస్థ ప్రకటించిన సేల్స్ గణాంకాలే కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న ద్రవ్యోల్బణం, దీనికి తోడు కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోవడం, స్కూల్స్ ఓపెన్ కావడం, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాల నుంచి విధులు నిర్వహించడం వంటి ఇతర కారణాల వల్ల పీసీల వినియోగం తగ్గిపోయింది. చదవండి👉 'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్! చైనా- ఉక్రెయిన్ వార్ సెమీ కండక్టర్ల తయారీ సంస్థలకు కీలకమైన పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్ చైనాలో కోవిడ్-19 ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సప్లయి చైన్ సమస్యలు డిమాండ్‌పై ప్రభావంపై పడింది.అందుకే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఇంటెల్ కార్యకలాపాల్ని కొనసాగించాలని భావిస్తోంది. కాబట్టే ఉద్యోగుల్ని తొలగించడంపై దృష్టిసారించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 బెటర్‌డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి! -
ఐఫోన్ 14 సిరీస్ : ‘బెడిసి కొట్టిన యాపిల్ మాస్టర్ ప్లాన్’!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రో తయారీని పెంచాలనే ప్రయత్నాల్ని విరమించుకుంటున్నట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. సెప్టెంబర్ 16 న ‘యాపిల్ ఫార్ అవుట్’ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ సిరీస్‌లోని ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ పెరగడం.. ధర భారీగా ఉండడంతో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను యూజర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విడుదల ప్రారంభంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సేల్స్ బాగున్నా.. క్రమ క్రమంగా వాటి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల అమ్మకాలపై యాపిల్ పెట్టుకున్న భారీ అంచనాలు తారుమారయ్యాయి. అంచనాలు తలకిందులు ఈ తరుణంలో యాపిల్ సంస్థ ధర ఎక్కువగా ఉన్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల తయారీని తగ్గించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి విడుదలకు ముందు ఐఫోన్ 14 సిరీస్‌పై అంచనాలు భారీగా పెరగడంతో ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 6 మిలియన్ యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు..ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను తయారు చేయాలని భావించింది. ఆదరణ అంతంత మాత్రమేనా కానీ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా లేకపోవడం, వాటి ఆదరణ అంతంత మాత్రంగా ఉండడంతో తయారీని తగ్గించాలని యాపిల్ సంస్థ ఐఫోన్ తయారీ సంస్థల్ని ఆదేశించినట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. బదులుగా, అదే సమయానికి 90 మిలియన్ ఐఫోన్ 14 ఎంట్రీ లెవల్ ఫోన్లను తయారు చేయాలని భావిస్తోంది. ఎంట్రీ లెవల్ ఫోన్ల కంటే ఐఫోన్ 14 ప్రో మోడల్ ఫోన్ల డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని యాపిల్ తగ్గించనుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. -
చైనాకు గూగుల్ భారీ షాక్..‘వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం!’
జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చైనాకు గుడ్ బైకు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ల తయారీని చైనాలో నిలిపి వేసి భారత్‌లో ప్రారంభించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా గూగుల్ సైతం తన ఫ్లాగ్ షిప్ బ్రాండ్స్‌ను డ్రాగన్ కంట్రీలో కాకుండా భారత్‌లో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. చైనాలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులు, ప్రభుత్వ ఆంక్షలతో దిగ్గజ సంస్థలు సతమతమవుతున్నాయి. ఈ తరుణంలో గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్ఫోన్ల 5లక్షల నుంచి 10లక్షల యూనిట్ల తయారీ కోసం బిడ్లను సమర్పించాలని భారత్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్ని కోరింది. తాజాగా గూగుల్ నిర్ణయాన్ని ఊటంకిస్తూ.. ఓ నివేదిక హైలెట్ చేసింది. ఐఫోన్ చైనా నుంచి బయటకొచ్చిన రెండు నెలల తర్వాత యాపిల్ సంస్థ ..భారత్‌లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించాలని యోచిస్తోందంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. భారత్‌లో తయారీని వేగవంతం చేయడానికి యాపిల్ సరఫరాదారులతో కలిసి పనిచేస్తోంది. దేశం నుండి మొదటి ఐఫోన్ 14 లు అక్టోబర్ చివరలో లేదా నవంబర్‌లో పూర్తయ్యే అవకాశం ఉందంటూ బ్లూమ్‌బెర్గ్ ప్రస్తావించింది. టాటా ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టాటా యాపిల్‌కు చెందిన తైవాన్ సరఫరాదారు విస్ట్రన్ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతోంది. ఐఫోన్ల అసెంబ్లింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చర్చలు సఫలమైతే త్వరలో టాటా సంస్థ ఆధ్వర్యంలో యాపిల్ ఐఫోన్లు తయారు కానున్నాయి. -
తగ్గేదెలే! అగ్రరాజ్యం బ్రిటన్ను దాటేసిన భారత్.. మరింత బలంగా..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను తట్టుకొని నిలబడ్డ భారత్ ప్రపంచ పటంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అగ్రరాజ్యమైన బ్రిటన్ను దాటి అయిదోస్థానంలోకి దూసుకుపోయింది. 2022 మార్చి చివరి నాటికి భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా బ్లూమ్‌బర్గ్ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పదేళ్ల క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రిటన్ను ఆరో స్థానానికి నెట్టేసి అయిదో స్థానానికి ఎగబాకింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లు ఉంటే, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత్‌రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్ పౌండ్ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7శాతానికి పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2021–22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం మనం బ్రిటన్ కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో పదేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తలంటున్నారు. వలస పాలకుల్ని నెట్టేయడం గర్వకారణం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకొని ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన దేశం అయిదో స్థానానికి చేరుకోవడంతో కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి పరిపాలించిన బ్రిటన్నే ఆర్థికంగా వెనక్కి నెట్టేయడం ప్రతీ భారతీయుడు గర్వించాల్సిందేనని ట్వీట్లు చేశారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కర్మ సిద్ధాంతం పని చేసిందని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘‘రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’’ అన్న సూత్రంతోనే విజయం సాధించామని, ప్రధాని నరేంద్ర మోదీకే ఈ క్రెడిట్ దక్కుతుందని ట్విటర్లో పేర్కొన్నారు. ఆర్థిక కష్టాల్లో బ్రిటన్ బ్రిటన్ గత కొన్నేళ్లుగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకి బతుకు భారమైపోయింది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. 2021 ద్వైమాసికంలో బ్రిటన్ జీడీపీ కేవలం 1% మాత్రమే పెరిగింది. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కోలేక ఆర్థికంగా చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ అస్థిరత్వం, బోరిస్ జాన్సన్ రాజీనామా వంటివి ఆ దేశాన్ని మరింత కుదేల్ చేశాయి. 2024 వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేస్తోంది. -
ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: 5 కీలక అంశాలు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్ను వెనక్క నెట్టి ఇండియాఐదోస్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఆరో స్థానానికి చేరింది. ఒక దశాబ్దం క్రితం, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, యూకే 5వ స్థానంలో ఉంది. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి "అభివృద్ధి చెందిన" దేశంగా అవతరించాలని ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ కోరుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూకేను, అదీ రెండు శతాబ్దాల పాటు భారత ఉపఖండాన్ని పరిపాలించిన ఒకదానిని దాటడం ఒక ప్రధాన మైలురాయిగా భావిస్తున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలతో భారత్‌సహా వివిధ దేశాల ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమైనాయి. ఎక్కడిక్కడ వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు స్థంభించి పోవడంతో వృద్ధిరేటు పతమైంది. అయితే ఈసంక్షోభంనుంచి శరవేగంగా పుంజుకున్న ఇండియనన్ ఎకానమీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ముఖ్యంగా ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా కోవిడ్ కారణంగా క్షీణించిన దేశ ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. తాజా లెక్కల ప్రకారం, 2022 మార్చి చివరిలో యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ఇండియా ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై చాలా నివేదికలు వచ్చాయి బ్లూమ్‌బెర్గ్ ఏఎంఎఫ్ డేటాబేస్ , చారిత్రాత్మక మారకపు ధరలను ఉపయోగించడం ద్వారా ఈ నిర్ణయానికి వచ్చింది. ఈఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 85,407 కోట్ల డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 81,600 కోట్ల డాలర్లుగా భారత్ తరువాతి స్థానంలో ఉంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.కానీ భారత్ మాత్రం తన వృద్ధిరేటును మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరడం విశేషం. రానున్న సంవత్సరాలలో భారతదేశం, బ్రిటన్ మధ్య భారీ అంతరం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 5 కీలక అంశాలు, పోలికలు ఇరు దేశాలమధ్య జనాబా, తలసరి జీడీపీ, పేదరికం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్,యూనివర్సల్ హెల్త్‌కేర్ కవరేజ్ అంశాలను పోల్చింది. రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత ప్రాథమిక వ్యత్యాసాలలో జనాభా. 2022 నాటికి, భారతదేశంలో 1.41 బిలియన్ల జనాభా ఉండగా, యూకేజనాభా 68.5 మిలియన్లు. మరో మాటలో చెప్పాలంటే, భారత జనాభా 20 రెట్లు ఎక్కువ. రెండు దేశాల జనాభా వ్యత్యాసం నేపథ్యంలో తలసరి జీడీపీతో పోలిస్తే సగటు భారతీయుని ఆదాయం చాలా తక్కువ. దీన్ని దేశంలో పేదరిక స్థాయిని అంచనా వేయవచ్చు. 19వ శతాబ్దం ప్రారంభంలో, భారత్‌తో పోలిస్తే అత్యంత పేదరికంలో ఉన్న బ్రిటన్ ఇపుడు మెరుగ్గానే ఉంది. అయితే పేదరికాన్ని అరికట్టడంలో భారతదేశం భారీ ప్రగతిని సాధించినప్పటికీ బ్రిటన్ కంటే మెరుగ్గాలేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ జీడీపీ డేటా వేగవంతమైన ఆర్థిక వృధ్దిని సూచిస్తుంది. ఆరోగ్యం, విద్య , జీవన ప్రమాణాల సమ్మేళనమైన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో మాత్రం, 1980లో బ్రిటన్ ఉన్న స్థితికి భారతదేశం ఇంకా ఒక దశాబ్దం పట్టవచ్చు. యూనివర్సల్ హెల్త్‌కేర్ కవరేజ్ ఒక దేశంగా ధనవంతులుగా మారడానికి కీలకమైన అంశం పౌరులకు అందుబాటులో ఉండే జీవన నాణ్యత. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్ పునరుత్పత్తి, తల్లి, నవజాత, శిశు ఆరోగ్యం, అంటు వ్యాధులు, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు, సర్వీసెస్ సహా అవసరమైన సేవల సగటు కవరేజ్ విషయంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించినా 2005 నుండి ఆరోగ్య సంరక్షణ పథకాలపై ప్రభుత్వ విధాన దృష్టి భారతదేశానికి ప్రత్యేకమైన మెరుగుదలను అందించినప్పటికీ, బ్రిటన్‌తో పోలిస్తే ఇంకా చాలా గ్యాప్ ఉంది. -
భారత్‌కు ఉబర్ గుడ్‌బై.. స్పందించిన సీఈవో
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా, ఉబర్లు మెర్జ్ అవుతున్నాయా?ఊబర్ ఇండియాలో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు. పలు నివేదికల ప్రకారం.. ఓలా- ఉబర్లు మెర్జ్ అవుతున్నాయని, ఇందులో భాగంగా ఓలా సీఈవో భవీష్ అగర్వాల్..అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉబర్‌కు చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్‌లతో మంతనాలు జరిపారని నివేదికల సారాంశం. అయితే ఆ వార్తల్ని భవిష్ అగర్వాల్ కొట్టి పారేశారు. "అబ్సిల్యూట్ రబిష్" ఓలా లాభాల్ని గడిస్తుంది. అదే సమయంలో వృద్ధి సాధిస్తుంది. కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! మెర్జ్ అయ్యే అవకాశం లేదని ఖండించారు. భారత్ నుంచి బెర్ అవుట్ మరో రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ భారత్‌లో తన కార్యకలాల్ని నిలిపివేస్తున్నట్లు బ్లూం బెర్గ్ తన కథనంలో పేర్కొంది. ఈ కథంపై ఉబర్ సీఈవో డార ఖోస్రోషి స్పందించారు. భారత్‌లో రైడ్ షేరింగ్ మార్కెట్ ఎలా ఉందో మాకు బాగా తెలుసు. భారత్ నుంచి మేం వెళ్లి పోవడం లేదని, కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు బ్లూం బెర్గ్‌కు ఇప్పటికే చెప్పామని అన్నారు. బ్లూం బెర్గ్ ఏం రాసిందంటే ఈ ఏడాది జూన్‌లో ఓలా, ఉబెర్ల గురించి బ్లూం బెర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. పెరిగిపోతున్న ధరల కారణంగా ఆ సంస్థలు అభివృద్ధితో పాటు లాభాల్ని గడించడంలో ఇబ్బందులు పడుతున్నాయని హైలెట్ చేసింది. అందుకే భారత్ మార్కెట్ నుంచి ఉబర్ నిష్క్రమించవచ్చని సూచించింది. అయితే భవిష్యత్తులో ఉబెర్ భారత్‌లో కార్యకలాపాల్ని కొనసాగించేందుకు దేశీయంగా మరో రైడ్ షేరింగ్ సంస్థతో జతకట్టవచ్చని వెల్లడించింది. అందుకు ఉబర్ చైనాలో దీదీ గ్లోబల్‌తో, ఆగ్నేయాసియాలో గ్రాబ్ హోల్డింగ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్ని ఉదహరించింది. -
చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం..
బీజింగ్: ప్రధాన విభాగాల్లో విదేశీ సాంకేతికతలను పక్కనబెట్టే దిశగా చైనా ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్రాండ్ పర్సనల్ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలవే కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లలో ఈ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలవుతాయని బ్లూమ్‌బర్గ్ వార్తాసంస్థ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ముందుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సుమారు 5 కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్నారు. వీటి స్థానంలో స్థానికంగా డిజైన్ చేసిన సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది. చిప్స్, సర్వర్లు, ఫోన్లు మొదలుకొని ప్రతిదానిపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలనే దశాబ్ద కాలంనాటి నిర్ణయం తాజా ఆదేశాలతో కార్యరూపం దాల్చనుంది. రెండేళ్ల కార్యాచరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మొదలై ప్రొవిన్షియల్ ప్రభుత్వ విభాగాల్లోనూ స్థానిక సంస్థల తయారీ కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది. ప్రస్తుతం చైనాలో దేశీయ సంస్థ లెనోవో తర్వాత హెచ్‌పీ, డెల్ కంపెనీల పర్సనల్ కంప్యూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నూతన విధానంతో అమెరికాకు చెందిన హెచ్‌పీ, డెల్ తదితర సంస్థలపై మరింత ఒత్తిడి పెరగనుంది. అయితే, పీసీ బ్రాండ్లు, సాఫ్ట్వేర్కే తప్ప ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల మార్పిడిపై ఎలాంటి ఆదేశాలు లేవని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. (భయపెట్టేలా రంగు మారిన ఆకాశం.. స్థానికుల్లో టెన్షన్) -
అదానీనా మజాకానా.. ముఖేష్ అంబానీకి భారీ షాక్..!
దేశీయ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ..మరో బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీకి భారీ షాకిచ్చారు. ముఖేష్ అంబానీతో పాటు గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్,సెర్గీ బ్రిన్‌లను అధిగమించి 118బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోని 6వ అత్యంత ధనవంతుల జాబితాలో నిలిచారు. ఇక ఇన్వెస్ట్మెంట్ మాంత్రికుడు వారెన్ బఫెట్‌ను అధిగమించేందుకు అదానీకి కేవలం 9 బిలియన్ల సంపద అవసరం. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్ల ధరలు రాకెట్ వేగంతో పెరగడం వల్ల కేవలం 4నెలల కాలంలో అదానీ సంపద 53శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అదానీ నెట్ వర్త్ దేశీయ స్టాక్ మార్కెట్లో గౌతమ్ అదానీకి చెందిన క్లీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్ట్, పవర్ ప్లాంట్ షేర్ల ధరలు రాకెట్ వేగంతో పెరిగాయి. దీంతో అదానీ టాప్-6 వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ, రెనెవేబుల్ ఎనర్జీ షేర్లు ఈ ఏడాదిలో 60శాతం పెరిగాయి. మొత్తంగా అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీ షేర్లు 111శాతం వృద్ధిని సాధించాయి. ఇక స్టాక్ మార్కెట్లో మోస్ట్ వ్యాలీడ్ మార్కెట్ కేపిటలైజేషన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీతో టాప్-10 కంపెనీల్లో ఒకటిగా ఎయిర్టెల్ పోటీ పడుతుంది. గౌతమ్ అదానీ ఆస్తులు పెరగడానికి కారణం..గత శుక్రవారం అబుదబీ ఇంటర్నేషన్ హోల్డింగ్స్(ఐహెచ్సీ) అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్‌లో 2బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో గౌతమ్ అదానీ షేర్లు లాభాల బాట పట్టాయి. సంవత్సరంలోనే డబుల్‌కి డబుల్ అయ్యాయి గత శుక్రవారం కొన్ని నివేదికల ప్రకారం..అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 25శాతం పెరిగాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు 11శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 3శాతం పెరిగాయి. ఏప్రిల్ 4న బ్లూమ్ బెర్గ్ టాప్ -10..100 బిలియన్ క్లబ్లో భారత్ నుంచి అదానీ చేరారు. ఇక అనూహ్యంగా గతేడాది ఏప్రిల్ నెల నుంచి 54 బిలియన్ డాలర్ల నుంచి ఈ రోజుతో 118బిలియన్ డాలర్లను అర్జించారు. అంబానీకి షాక్ ఇదిలా ఉండగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొన్ని సంవత్సరాలుగా ఈ జాబితాలో అత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు 95.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్‌లో 11 వ స్థానంలో ఉన్నారు. తాజాగా అదానీ..అంబానీని దాటేసి ఏకంగా ఆరో స్థానానికి చేరారు. -
వంద బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీ మరో రికార్డు సాధించారు. ముకేశ్ అంబానినీ వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తొలిసారిగా వంద బిలియన్ల డాలర్ల క్లబ్లో చేరాడు. బ్లూంబర్గ్ తాజాగా ప్రకటించిన ఐశ్వర్యవంతుల జాబితాలో గౌతమ్ అదానీ వంద బిలియన్ డాలర్ల మార్కుని దాటారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడి హోదాను మరోసారి దక్కించుకున్నారు. గత రెండేళ్లుగా గౌతమ్ అదానీ సంపద ఆకాశమే హద్దుగా పెరిగిపోతుంది. ముఖ్యంగా మైనింగ్, గ్రీన్ ఎనర్జీ, పోర్టుల రంగంలో అదానీకి తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తోంది. పైగా ఇటీవల సౌదీ ఆరామ్కోతో సైతం అదానీ జట్టు కట్టారు. అన్నింటికి మించి రెండు నెలలుగా అదానీ గ్రూపుకి చెందిన కుకింగ్ ఆయిల్ విల్మర్ కంపెనీ షేర్లు 130 శాతం పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడింది. ఇలా అనేక అంశాలు అనుకూలంగా మారడంతో అదానీ సంపద రాకెట్ వేగంతో పరుగులు పెడుతోంది. వంద బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి తొలిసారిగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రవేశించారు. 1999లో ఆయన సంపద విలువల వంద బిలియన్ డాలర్లు దాటింది. ఆ తర్వాత వారెన్ బఫెట్ వంటి వారు ఈ జాబితాలో చోటు సాధించారు. 2017లో అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ వచ్చిన తర్వాత పోటీ ఎక్కువైంది. జెఫ్‌బేజోస్ రికార్డును 2021లో ఎలన్ మస్క్ క్రాస్ చేశారు. ప్రస్తుతం ఎలన్ మస్క్ 270 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే కుబేరుడిగా ఉన్నారు. 99 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. చదవండి: బ్రాండెడ్ బియ్యంపై అదానీ విల్మర్ దృష్టి -
పేటీఎమ్‌పై సంచలన ఆరోపణలు..! అందుకే బ్యాన్..!
కొత్త ఖాతాలను తెరవడం నిలిపివేయాల్సిందిగా పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ ఆఫ్ బ్యాంకు ఇండియా (ఆర్బీఐ) ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన వివరాలను చైనా కంపెనీలకు లీక్ చేశారని ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో సంచలన ఆరోపణలను చేసింది. చైనా కంపెనీల చేతిలోకి..! కొద్ది రోజుల క్రితం పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ గట్టిషాక్‌ను ఇచ్చింది. బ్యాంక్‌లో కొన్ని పర్యవేక్షణ లోపాలను గుర్తించడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు విదేశాల్లోని సర్వర్లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. చైనా ఆధారిత సంస్థలతో కంపెనీ సర్వర్లు సమాచారం పంచుకుంటున్నాయని ఆర్బీఐ వార్షిక తనిఖీల్లో గుర్తించాయని నివేదికలో వెల్లడించింది.అందుకే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం విధించినట్లు బ్లూమ్‌బెర్గ్ అభిప్రాయపడింది. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో పలు చైనా కంపెనీలు పరోక్షంగా వాటాను కలిగి ఉన్నాయి. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ, జాక్ మాస్ యాంట్ గ్రూప్ కో పేటీఎంలో వాటాలను కల్గి ఉన్నాయి. తప్పుడు వార్తలు..! బ్లూమ్‌బెర్గ్ నివేదికను పేటీఎం తీవ్రంగా ఖండించింది.అవన్నీ పూర్తిగా తప్పుడు ఆరోపణలంటూ పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన డేటాను ఎవరితో పంచుకోలేదని వెల్లడించింది. డేటా స్థానికీకరణపై ఆర్బీఐ ఆదేశాలను పేటీఎం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. బ్యాంకుకు సంబంధించిన డేటా మొత్తం భారత్‌లోనే ఉందని తెలిపింది. పూర్తి స్వదేశీ బ్యాంకుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఉన్నందుకు గర్విస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇక ఆర్బీఐ ప్రకటనతో పేటీఎం షేర్లు సోమవారం రోజున 13.3 శాతం మేర పడిపోయాయి. చదవండి: బెస్ట్ సెల్లింగ్ కార్.. 5 లక్షల కంటే తక్కువ ధరలోనే రెనాల్ట్ క్విడ్ -
అదిరిపోయే ఫీచర్లతో!! యాపిల్ ఫోల్డబుల్ మాక్ బుక్, ఐపాడ్..విడుదల ఎప్పుడంటే?!
వరల్డ్ వైడ్ గా ఉన్న టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అయితే తాజాగా ఈ టెక్ జెయింట్ 20 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే తో మ్యాక్ బుక్, ఐప్యాడ్లను టెక్ లవర్స్‌కు పరిచయం చేయనున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం..2026 నాటికి ఫోల్డబుల్ డిస్ప్లేతో ప్రొడక్ట్‌లను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత రెండేళ్లుగా యాపిల్ డ్యూయల్ స్క్రీన్, ఫోల్డబుల్ మ్యాక్‌బుక్/ఐప్యాడ్ హైబ్రిడ్‌ను తయారు చేయాలని భావిస్తుందని బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి గుర్మాన్ రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (డీఎస్సీసీ) విశ్లేషకుడు రాస్ యంగ్ నిర్ధారించారు. యాపిల్ కంటే ముందే లెనోవో యాపిల్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఫోల్డబుల్ ప్రొడక్ట్‌లను లెనోవో గతంలో విడుదల చేసింది. Lenovo ThinkPad X1 ఫోల్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్సనల్ కంప్యూటర్ కేవలం టాబ్లెట్/ మానిటర్‌గా పనిచేయడమే కాకుండా ఫోల్డ్ చేసి ఉన్న సగం స్క్రీన్ కీబోర్డ్‌లా పనిచేస్తుంది. అయితే ఈ తరహా ప్రొడక్ట్‌లు చాలా కాస్ట్లీగా ఉన్నాయని లెనోవో విడుదల చేసిన ఈ ఫోల్డబుల్ ప్రొడక్ట్ Lenovo ThinkPad X1 ధర మనదేశంలో రూ.2,43,198గా ఉంది. యాపిల్ ఫోల్డబుల్ ప్రొడక్ట్ కూడా ఇదే కాస్ట్లో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అదానీ ఆనందం ఒక్కరోజే.. మళ్లీ ముందుకొచ్చిన ముకేశ్
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా మారిన గౌతమ్ అదానీ కేవలం ఒక్క రోజు మాత్రమే ఆ స్థానంలో ఉండగలిగారు. 24 గంటలు గడిచేసరికి ముకేశ్ అంబారీ మరోసారి దూసుకువచ్చి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరి సంపదలో తేడా రావడంతో ముకేశ్ పైకి ఎగబాకగా ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ఏషియా నంబర్ 2, ప్రపంచంలో 11 స్థానానికి పరిమితమయ్యారు. 2022 ఫిబ్రవరి 9 బుధవారం ఉదయం బ్లూంబర్గ్ ఇండెక్స్ జాబితాలో ముకేశ్ అంబానీ సంపద 89.2 బిలియన్ డాలర్లకుగా నమోదు అయ్యింది. క్రితం రోజు ఈ విలువ 87.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక గౌతమ్ అదానీ సంపద 86.3 బిలియన్ డాలర్లుగా ఉంది. మునపటి జాబితాలో ఈ మొత్తం 88.5 బిలియన్లుగా ఉండేది. ఒక్క రోజు వ్యవధిలో ముకేశ్ సంపదలో 1.33 బిలియన్ డాలర్లు వచ్చి జమ అవగా అదానీ ఖాతా నుంచి 2.16 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. దీంతో ముకేశ్ ఏషియా నంబర్ 1 స్థానంతో పాటు ప్రపంచం కుబేరుల్లో పదో స్థానానికి మరోసారి చేరుకున్నారు. బ్లూంబర్గ్ జాబితాలో అంబానీ, అదానీలు వరుసగా 10వ 11వ స్థానాల్లో ఉండగా టాప్ 100 జాబితాలో 38వ స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ (33.8 బిలియన్ డాలర్లు), 48వ స్థానంలో శివ్‌నాడార్ (29 బిలియన్ డాలర్లు), 79వ స్థానంలో రాధాకిషన్ దమానీ (21.2 బిలియన్ డాలర్లు), 82వ స్థానంలో లక్ష్మీ మిట్టల్ (21 బిలియన్ డాలర్లు)లు ఉన్నారు. -
ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ
దేశంలోనే కాదు ఏషియాలోనే నంబర్ వన్ సంపాదనపరుడి హోదాలో కొనసాగుతున్న ముఖేశ్ అంబానీకి మరో గుజరాతి గౌతమ్ అదానీ ఝలక్ ఇచ్చారు. ఏషియా నంబర్ కుబేరుడి స్థానాన్ని ముకేశ్ నుంచి లాగేసుకున్నాడు గౌతమ్. ఫిబ్రవరి 8న బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో వీరిద్దరి స్థానాలు మారాయి. బ్లూంబర్గ్ ప్రపంచ కుబేరులు 500 జాబితాలో ఫిబ్రవరి 8న మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో గౌతమ్ అదానీ సంపద 88.50 బిలియన్ డాలర్లు ఉండగా ముకేశ్ అంబానీ సందప 87.90 బిలియన్ డాలర్లుగా ఉంది. ముకేశ్ కంటే అదాని సంపద 600 మిలియన్లు ఎక్కువగా నమోదైంది. దీంతో ఏషియాలోనే నంబర్ వన్ ధనవంతుడిగా అదానీ అవతరించారు. అంతకు ముందు ఈ స్థానం ముకేశ్ పేరిట ఉండేది. బ్లూంబర్గె్ ఇండెక్స్‌లో ప్రపంచ కుబేరుల జాబితాలో ఇప్పటి వరకు పదో స్థానంలో కొనసాగుతూ వచ్చిన ముఖేశ్ అంబానీ తాజాగా 11వ స్థానానికి పడిపోగా గౌతమ్ అదాని 11వ స్థానం నుంచి 10వ స్థానానికి చేరుకున్నారు. ఏడాది కాలంలో ముకేశ్ అంబానీ సంపద 2.07 బిలయిన్లు తరిగిపోగా అదానీ సంపద 12 బిలియన్లు పెరిగింది. మంగళవారం ఉదయం రిలయన్స్ షేరు ధర రూ.2312 దగ్గర ట్రేడవుతుంది. గత ఏడాది కాలంలో ఈ షేరు ధర 18 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో అదానీ కంపెనీ షేరు ఏకంగా 170 శాతం వృద్ధిని కనబరిచి రూ.1741 దగ్గరకి చేరుకుంది. దీంతో అదానీ సంపద గణనీయంగా పెరిగిందని బ్లూంబర్గ్ పేర్కొంది. చదవండి: జుకర్‌బర్గ్ కొంపముంచిన ఫేస్బుక్..! రయ్‌మంటూ దూసుకొచ్చిన అదానీ, అంబానీ..! -
Oxfam Report: డబ్బు వెల్లువలా వస్తూనే ఉంది, కానీ..
కరోనా మహమ్మారి కోరలు చాచిన రెండేళ్లలో (2020, 2021) సంవత్సరాల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల సంపద రెట్టింపైనట్టు ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రకటించింది. Oxfam Davos 2022 నివేదిక ప్రకారం.. అంతకుముందు 14 ఏళ్లలో పెరిగిన దానితో పోలిస్తే కరోనా టైంలోనే ఇది మరింతగా వృద్ధి చెందినట్టు గణాంకాలను విడుదల చేసింది. అదే సమయంలో పేదరికం, అసమానతలు తారాస్థాయికి పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేసింది. బిలియనీర్.. బిలియన్ డాలర్, అంతకు మంచి సంపద ఉన్నవాళ్లు. 2021లో భారత్ విషయానికొస్తే బిలియనీర్ల సంపద రెట్టింపునకు పైగా పెరిగింది. అంతేకాదు బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి.. 142 మందికి చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 40 మంది బిలియనీర్లు చేరారు!. ఈ వివరాలను ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021లో 142 మంది భారత బిలియనీర్ల వద్ద ఉమ్మడిగా ఉన్న సంపద విలువ 719 బిలియన్ డాలర్లు. అంటే.. దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలకుపైనే. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో.. 98 మంది సంపన్నుల దగ్గరా అంతే మేర (రూ.49 లక్షల కోట్లు) ఉంది. ►భారత్ లోని టాప్ 10 (విలువ పరంగా) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్లపాటు ఉచితంగా అందించొచ్చు. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది. ►భారత్ లోని టాప్ 98 ధనవంతులపై ఒక్క శాతం సంపద పన్నును వసూలు చేసినా ఆయుష్మాన్ భారత్ పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చు. ► రెండో వేవ్ ఇన్ఫెక్షన్ టైంలో ఆరోగ్య మౌలిక వసతులు, అంత్యక్రియలు, శ్మశానాలే ప్రధానంగా నడిచాయి. ► భారత్‌లో అర్బన్ అన్ఎంప్లాయిమెంట్ విపరీతంగా పెరిగిందని(కిందటి మేలో 15 శాతం), ఆహార అభద్రత మరింత క్షీణించింది. ► సంపద పునఃపంపిణీ పాలసీలను సమీక్షించాలని గ్లోబల్ ఆక్స్‌ఫామ్ దావోస్ నివేదిక భారత ప్రభుత్వానికి సూచిస్తోంది. ►గౌతమ్ అదానీ.. భారత్‌లో అత్యధికంగా అర్జించిన వ్యక్తిగా ఉన్నారని, ప్రపంచంలోనే ఈయన స్థానం ఐదుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. అదానీ 2021 ఏడాదిలో 42.7 బిలియన్ డాలర్ల సంపదను జత చేసుకున్నట్లు.. మొత్తం 90 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముకేష్ అంబానీ 2021లో 13.3 బిలియన్ డాలర్లు వెనకేసుకోగా.. ఈయన మొత్తం సంపద విలువ 97 బిలియన్డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే.. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్జీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్, లారీ ఎల్లిసన్, వారెన్ బఫెట్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్ 10 ప్రపంచ సంపన్నులుగా ఆక్స్ ఫామ్ నివేదిక పేర్కొంది. ►ఈ పది మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా, సంపద కరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది. ► అసమానతలు కరోనా సమయంలో ఎంతలా విస్తరించాయంటే.. ఆరోగ్య సదుపాయాల్లేక, ఒకవేళ ఉన్నా అవి అందుబాటులోకి రాక రోజూ 21,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడుస్తున్నారు. ►కరోనా దెబ్బకు 16 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ►స్టాక్ ధరల నుంచి.. క్రిప్టో, కమోడిటీస్ అన్నింటి విలువా పెరుగుతూ వస్తోంది. ►ప్రపంచంలోని 500 మంది ధనికులు 1 ట్రిలియన్ డాలర్ల సంపదను వెనకేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. -
ఎగబడి లోన్లు ఇచ్చిన బ్యాంక్.. చివరికి ‘చెత్త’ ఘనత
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన ఆ బ్యాంకు.. భవిష్యత్తు మొత్తం తనదే అనే ప్రతిష్ట సంపాదించుకుంది. కానీ, పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బ్యాంకుకు సంబంధించి రియల్టి విభాగం భారీ దెబ్బ వేసింది. పోటీతత్వంలో వెనుకంజ, అడ్డగోలుగా లోన్లు మంజూరు చేయడంతో పాటు ఎవర్‌గ్రాండ్ పరిణామాలు చెత్త బ్యాంక్ ట్యాగ్‌ను తగిలించాయి చివరికి!. చైనాకు చెందిన మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. కొన్నేళ్ల కిందటి దాకా ఆసియాలో ఇదే అతిపెద్ద బ్యాంక్‌గా ఉండేది. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ దిగ్గజం అప్పుల ధాటికి బాధితురాలిగా మారిపోయింది ఈ బ్యాంక్. అడ్డగోలుగా ఇచ్చిన లోన్ల కారణంగా మిన్‌షెంగ్ దారుణంగా పతనం అయ్యింది. గత ఏడాది కాలంలో స్టాక్ ధరలు 31 శాతం దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఈ చెత్త పర్ఫార్మెన్స్ కారణంగా ఇప్పుడు మరో అప్రతిష్ట మూటగట్టుకుంది. బ్లూమ్‌బర్గ్ వరల్డ్ బ్యాంకుల ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన బ్యాంక్‌గా నిలిచింది మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. ఈ సూచీలో ప్రపంచంలోని మొత్తం 155 బ్యాంకులను పరిగణనలోకి తీసుకుంటుంది బ్లూమ్‌బర్గ్. పైకి.. ఆపై పతనం 1996లో బీజింగ్ కేంద్రంగా నాన్-స్టేట్ కంట్రోల్ లెండర్(చైనాలోనే తొలి ఘనత) కార్యకలాపాలను మొదలుపెట్టింది మిన్‌షెంగ్. అనంతి కాలంలోనే ప్రపంచంలో టాప్ 20 బ్యాంకింగ్ దిగ్గజాల సరసన నిలిచింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ బ్యాంక్.. 2022 కార్యాచరణను ప్రకటించుకుంది. లోకల్ బ్రాంచ్ మేనేజర్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు ప్రాపర్టీ రుణాల హోల్డింగ్లను తగ్గించడం అత్యంత ప్రాధాన్యతగా పాటించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం లాంటి హేయనీయమైన నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగంపై పట్టు కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తోంది. ముఖ్యంగా ప్రాపర్టీ ఇండస్ట్రీని పునాదులతో సహా కుదిపేస్తోంది. ఈ పరిణామాలను తట్టుకోలేక ఎడాపెడా డిస్కౌంట్లతో ఆకర్షణ కోసం ప్రయత్నించింది రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండ్. చివరకు డిఫాల్ట్ ప్రకటనతో బాంబుపేల్చగా.. గ్లోబల్ రియల్ ఎస్టేట్‌పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవర్‌గ్రాండ్‌కు బిలియన్ డాలర్ల లోన్ కట్టబెట్టిన మిన్‌షెంగ్.. ఇప్పుడు లబోదిబోమంటోంది. సంబంధిత వార్త: పెనుసంక్షోభం అంచున డ్రాగన్.. ఆందోళనలో గ్లోబల్ బ్యాంకింగ్, రియల్టి రంగాలు! -
కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...!
ఒకప్పుడు మెక్‌డోనాల్డ్స్ ఔట్లెట్లో కస్టమర్లకు బర్గర్స్‌ను, కూల్ డ్రింక్స్ సర్వ్ చేసేవాడు. కట్ చేస్తే..ఇప్పుడెమో ముఖేశ్ అంబానీ సంపదనే దాటేసి ప్రపంచ కుబేర్ల జాబితాలో 11 వస్థానాన్ని కైవసం చేసుకున్నాడు చైనీస్ కెనాడియన్ చాంగ్‌పెంగ్ జావో. ఆ ఒక్క దానితో దశ తిరిగింది..! టెక్ బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ , మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రపంచ కుబేర్ల జాబితాలో చాంగ్‌పెంగ్ జావో నిలిచేందుకు ఆ ఒక్కటి ఎంతగానో ఉపయోగపడింది. అదే క్రిప్టోకరెన్సీ..! ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం బినాన్స్‌ను స్థాపించి ఒక్కసారిగా ప్రపంచ కుబేరులకే సవాలును విసిరాడు జావో. బ్లూమ్‌బర్గ్ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం...జావో నికర విలువ 96 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొంది. దీంతో ఇండియన్ టైకూన్ ముఖేష్ అంబానీ స్థానాన్ని కూడా దాటేశాడు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రిప్టో బిలియనీర్ జావో అలియాస్ సీజెడ్ అవతారమెత్తాడు. సాఫ్ట్వేర్ డెవలపర్..! జావో సాఫ్ట్వేర్ డెవలపింగ్‌లో సిద్ధ హస్తుడు. అంతేకాకుండా బ్లాక్ చైయిన్ టెక్నాలజీను వేగంగా అలవర్చుకున్నాడు. 2008లో వచ్చిన క్రిప్టోకరెన్సీ భవిష్యత్తులో వాడే డిజిటల్ కరెన్సీగా చెలామణీ అవుతుందనే నమ్మకం అతన్ని ఒమ్ము చేయలేదు. బినాన్స్‌ను 2017లో స్థాపించి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు అద్బుతమైన ప్లాట్‌ఫాంను క్రియేట్ చేశాడు ఈ సీజెడ్. ఈ ప్లాట్‌ఫాం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంగా నిలుస్తోంది. కలిసొచ్చిన ఆదరణ..! తొలినాళ్లలో క్రిప్టోకరెన్సీపై ఉన్న ఆదరణ గణనీయంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడే అదే ఆదరణ జావోను ప్రపంచ కుబేర్ల జాబితాలో ఉంచేలా చేసింది. బినాన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌ల సమీక్ష ప్రకారం... ఒక్క 2021లో 20 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక కంపెనీలో జావో సుమారు 90 శాతం మేర షేర్లను కల్గి ఉన్నాడు. అంతకుమించే...! ఇక జావో బహిరంగంగా తన వ్యక్తిగత క్రిప్టో హోల్డింగ్స్ గురించి ఎక్కడా వ్యాఖ్యానించలేదు. అదే విధంగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ ఆర్థిక విషయాల గురించి పెద్దగా బహిర్గతం చేయదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ క్రిప్టో ఎక్స్ఛేంజ్. బినాన్స్‌లో రోజుకు 170 బిలియన్ డాలర్ల క్రిప్టో ట్రేడ్లను ప్రాసెస్ చేస్తుంది. జావో పూర్తి సంపద ఎంతో తెలిస్తే అందరు షాక్ అవ్వడం కాయం. పూర్తిగా స్వచ్చంద సంస్ధకే..! జావో తన సంపదలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని ఒక ఇంటర్య్వూలో చెప్పాడు. అంతేకాకుండా.. ‘వ్యక్తిగతంగా, నేను ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నాను. నాకు డబ్బు అవసరం అంతగా లేదు.రాక్ఫెల్లర్ లాగే నా సంపదలో మెజార్టీ భాగాన్ని స్వచ్చంద సంస్థలకే అంకింతమని అన్నాడు. జావో తన సంపదలో 95 శాతం లేదా 99 శాతం స్వచ్చంద సంస్థలకే ఇవ్వాలనుకుంటున్నాడు. చదవండి: స్కార్పియో కావాలన్న కెన్యా పోలీసులు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ -
క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం డెడ్‌లైన్..! ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. బిల్లు వస్తోన్న నేపథ్యంలో...భారత్‌లోని క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. ఆస్తులుగా పరిగణించే అవకాశం..! ముఖ్యంగా క్రిప్టోకరెన్సీలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలను ఫైనాన్షియల్ ఆస్తులుగానే పరిగణించే అవకాశం ఉంది. ఇటీవల సర్క్యులేట్ చేయబడిన క్యాబినెట్ నోట్ ప్రకారం...క్రిప్టోకరెన్సీలకు బదులుగా బిల్లులో 'క్రిప్టో ఆస్తులు' అనే పదాన్ని చేర్చనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్బీఐ రిలీజ్ చేస్తోన్న డిజిటల్ కరెన్సీలకు, క్రిప్టో కరెన్సీలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండనుంది. ఉల్లంఘిస్తే రూ. 20 కోట్ల జరిమానా..! క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న బిల్లును క్రిప్టో ఇన్వెస్టర్లు ఉల్లంఘిస్తే ఏకంగా రూ. 20 కోట్ల జరిమానా లేదా 1.5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అంతేకాకుండా చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి కనీస థ్రెషోల్డ్ లేదా పరిమితిని కేంద్రం సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్చువల్ కరెన్సీల ద్వారా జరిపే లావాదేవీలపై పన్నులను విధించే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. భారత్‌లో 641 శాతం మేర వృద్ధి..! చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. చదవండి: క్రిప్టోకరెన్సీ బిల్లు..! ఆర్థిక శాఖ కీలక వ్యాఖ్యలు..! -
Avani Singh: 24 ఏళ్ల వయసులో ఏకంగా కంపెనీని స్థాపించి.. ఆపై
Avani Singh: Spicehealth CEO Features In 2021 Bloomberg Ones To Watch: దేశంలోనే రెండో అతిపెద్ద ఏవియేషన్ సంస్థకు అధిపతి కూతురామె. ఉద్యోగం చేయవలసిన అవసరం కానీ, చేయాలన్న బలవంతం కానీ ఏమీ లేదు. కానీ అమెరికాలో ఎమ్ఎస్ పూర్తిచేసి, వచ్చీరాగానే ఓ ప్రైవేటు కంపెనీలో అనలిస్టుగా చేరింది అవనీ సింగ్. ఇంతలో ప్రపంచమంతటా కరోనా పంజా విసిరింది. ఫలితంగా దేశం మొత్తం లాక్డౌన్ లోకి వెళ్లిపోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రమ్ హోం చేస్తోన్న అవనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఈ సమయంలో హెల్త్‌కేర్ రంగంలో అడుగుపెట్టి, కోవిడ్ టెస్టులు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అనిపించి ‘స్పైస్ హెల్త్’ పేరిట హెల్త్ కేర్‌ను ప్రారంభించి వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతోంది. దీంతో తాజాగా.. వివిధ రంగాల్లో అత్యంత ప్రభావవంతంగా పనిచేసిన ‘బ్లూమ్‌బర్గ్ వన్స్ టు వాచ్’ గ్లోబల్ వార్షిక – 50 మంది జాబితాలో అవనీ సింగ్ చోటు దక్కించుకుంది. స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ ముద్దుల కూతురే అవనీసింగ్. ఎకనామిక్స్, సైకాలజీలలో డిగ్రీ పూర్తయ్యాక, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో ఎమ్ఎస్ పూర్తిచేసి 2019లో ఇండియా వచ్చింది. రాగానే గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో అనలిస్ట్‌గా చేరింది. కరోనా మూలంగా వర్క్‌ఫ్రం హోం చేస్తోన్న అవని.. కరోనా కేసులు పెరగడం, టెస్టుల నిర్వహణ కష్టంగా ఉండడం వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది. దాంతో కోవిడ్–19 టెస్టింగ్ రంగంలోకి దిగితే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే అనలిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసి తన తండ్రి అజయ్‌సింగ్‌తో కలిసి 2020 నవంబర్‌లో ‘స్పైస్‌హెల్త్’ ఇండిపెండెంట్ కంపెనీని ప్రారంభించింది. ఆర్టీ–పీసీఆర్ ః రూ. 499 నాణ్యతలో ఎక్కడా తగ్గకుండా తక్కువ ఖర్చుతో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో స్పైస్ హెల్త్‌ను ప్రారంభించిన అవని ఐసీఎమ్ఆర్, ఎన్ఏబీఎల్ అనుమతితో మొబైల్ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటిదాకా రూ.2400 నుంచి రూ.4500 గా ఉన్న ఆర్టీ–పీసీఆర్ టెస్ట్‌ను కేవలం రూ.499కు అందించి సంచలనం సృష్టించింది. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోన్న డయాగ్నస్టిక్ కంపెనీ జెనేస్టోర్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా మొబైల్ లేబొరేటరీలను ప్రారంభించి ఆర్టీ–పీసీఆర్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ఢిల్లీ, అజాద్‌పూర్ మండిలో తొలిసారి మొబైల్ లేబొరేటరీ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఇతర ల్యాబొరేటరీలు టెస్టు ఫలితాలను ఇవ్వడానికి 24 నుంచి 48 గంటలు సమయం తీసుకుంటే..స్పైస్‌హెల్త్ మాత్రం ఆరుగంటలలోపే ఫలితాలను ఇచ్చేది. అంతేగాక మొబైల్ ల్యాబొరేటరీ ద్వారా రోజుకి 20 వేల నుంచి 50 వేల ఆర్టీ–పీసీఆర్ టెస్టులను నిర్వహించింది. మొబైల్ లేబొరేటరీలు విజయవంతం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పైస్‌హెల్త్‌తో కలిసి కోవిడ్ పరీక్షలను నిర్వహించింది. తొలి కంపెనీగా.. కోవిడ్ మొబైల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని అందుబాటులోకి తెచ్చిన తొలి కంపెనీగా స్పైస్ హెల్త్ నిలిచింది. అంతేగాక మారుమూల ప్రాంతాలు, కంటోన్మెంట్ జోన్లు, ఆసుపత్రులు, వైద్యసదుపాయాలు అందని మారుగ్రామాలకు ఈ మొబైల్ లేబొరేటరీ సేవలు అందించింది. కుంభమేళాలో కోవిడ్ టెస్టులు నిర్వహించేందుకు స్పైస్ హెల్త్ ఉత్తరాఖండ్ ప్రభుత్వ భాగస్వామ్యం తో మొబైల్ లేబొరేటరీస్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేబొరేటరీలను ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 50 లక్షల ఆర్టీ–పీసీఆర్ టెస్టులను నిర్వహించింది. ఆర్టీ–పీసీఆర్, వ్యాక్సిన్స్ తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులవైపు మొగ్గుచూపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది ప్రముఖ నగరాల్లో 18 టెస్టింగ్ ల్యాబ్స్, కలెక్షన్ సెంటర్లను నడుపుతోంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలతోపాటు ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను కూడా నిర్వహిస్తోంది. ఇటీవల కొంతకాలం క్రితం న్యూ ఢిల్లీ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫ్యాథాలజీ ల్యాబొరేటరీ ని ఏర్పాటు చేసి ప్యాథాలజీ సర్వీస్‌లను అందిస్తోంది. 24 ఏళ్ల వయసులో ఏకంగా ఒక కంపెనీని స్థాపించి తన వినూత్న నిర్ణయాలతో కంపెనీని విజయపథంలో నడిపిస్తోన్న అవనికి 2021వ సంవత్సరానికి గాను ఏషియా–పసిఫిక్ స్టీవ్ అవార్డు కార్యక్రమంలో ‘మోస్ట్ వాల్యుబుల్ మెడికల్ ఇన్నోవేషన్’ విభాగంలో ‘గోల్డ్ అవార్డు’ వరించింది. చదవండి: మహిళా వెడ్డింగ్ ప్లానర్స్ ఆకాశమే హద్దు... -
Gautam Adani.. అలా 2 సార్లు చావు నుంచి తప్పించుకున్నారు
Gautam Adani Escaped Death Twice Once During 26 11 Mumbai Attack సాక్షి, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముకేష్ అంబానీని.. వెనక్కు నెట్టి, ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు అదానీ. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అదానీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆసియా కుబేరుడిగా నిలిచిన అదానీ గతంలో రెండు సార్లు చావు నోటి నుంచి తప్పించుకున్నారట. టీనేజ్‌లో ఉండగా ఒకసారి.. 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడి సమయంలో మరోసారి అదానీ మృత్యుముఖం నుంచి బయటపడ్డారట. ఆ వివరాలు.. కాలేజీ డ్రాప్‌ఔట్.. ప్రస్తుతం ఆసియా కుబేరుడిగా ఖ్యాతి గాంచిన అదానీ కాలేజ్ డ్రాప్‌ఔట్. చదువు మధ్యలోనే ఆపేసి డైమండ్ ట్రేడర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ముంబై వెళ్లి అక్కడ మహేంద్ర బ్రదర్స్ కంపెనీలో పని చేశారు. అనంతరం 2-3 సంవత్సరాల తర్వాత ఆయన సొంతంగా ముంబై జవేరీ బజార్లో డైమండ్ బ్రోకరేజీ సంస్థను స్థాపించారు. (చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ) వ్యాపారంలో విజయంతో స్వరాష్ట్రంలో గుర్తింపు వజ్రాల వ్యాపారంలో విజయం సాధించాక 1981లో అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ తన బంధువు స్థాపించిన పీవీసీ వ్యాపారంలో సాయం చేయసాగారు. ఆ తర్వాత అదానీ ఎక్స్‌పోర్ట్స్ కింద కమోడిటీస్ ట్రేడింగ్ వెంచర్‌ను స్థాపించారు. అది కూడా విజయవంతం అయ్యింది. ఫలితంగా స్వరాష్ట్రంలో గుర్తింపు లభించింది. బిజినెస్ పేపర్లలో అదానీకి సంబంధించిన వార్తలు రాసాగాయి. సక్సెస్‌తో పెరిగిన శత్రువులు.. విజయం.. పేరు ప్రఖ్యాతులతో పాటు శత్రువులను కూడా తీసుకొస్తుంది అంటారు. అదానీ విషయంలో ఇది నిజం అయ్యింది. 1990 మధ్య నాటికి అదానీ సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా రాణిస్తున్నారు. ఆయన సంపద పెరుగుతున్న కొద్ది శత్రువులు కూడా పెరగసాగారు. ఆయన ఆస్తి మీద ఆశతో కొందరు దుండగులు 1997లో అదానీని కిడ్నాప్ చేశారు. (చదవండి: అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు!) తలకు తుపాకీ గురిపెట్టి.. కిడ్నాప్ జనవరి 1, 1998న ఫైల్ అయిన పోలీసు రిపోర్ట్ ప్రకారం దుండగులు కర్ణావతి క్లబ్ నుంచి బయటకు వస్తోన్న అదానీని, ఆయనతో పాటు ఉన్న శాంతిలాల్ పటేల్‌ను కిడ్నాప్ చేశారు. సుమారు 11 కోట్ల రూపాయలు ఇస్తేనే వారిని విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. అయితే అదానీని కిడ్నాప్ చేసింది అప్పటి అండర్ వరల్డ్ డాన్ ఫజల్-ఉర్-రెహ్మాన్ అలియాస్ 'ఫజ్లు రెహ్మాన్' అని వార్తలు వినిపించాయి. చివరకు అదానీ కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడ్డారు. అలా ఒకసారి మృత్యువు నుంచి తప్పించుకున్నారు అదానీ. 2008 మరో సారి.. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని దేశం ఇంకా మర్చిపోలేదు. ఈ సంఘటన జరిగిన నాడు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తాజ్ హోటల్లోనే అదానీ ఉన్నారు. ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో బేస్మెంట్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. (చదవండి: పెట్టుబడులను ఆకర్షించడంలో అదానీ దూకుడు..!) దీని గురించి అదానీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను తాజ్ హోటల్లో దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్‌ని డిన్నర్ కోసం కలిశాను. మేం హోటల్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా.. ఉగ్రదాడి ప్రారంభం అయ్యింది. అందరం తలోదిక్కుకు పరిగెత్తాం. కొందరు సోఫాల వెనక కూర్చుని దాక్కున్నారు. నేను బేస్మెంట్లో దాక్కుని ఉన్నాను’’ అని తెలిపారు. ‘‘కమాండోలు వచ్చే వరకు అందరం ప్రాణాలు అరచేత పట్టుకుని.. దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రోజు 15 అడుగుల దూరంలో నా మృత్యువు నాకు కనిపించింది. నవంబర్ 26 రాత్రి అంతా బేస్మెంట్లోనే ఉన్నాను. కమాండోలు మమ్మల్ని కాపాడి.. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన అహ్మదాబాద్ చేరుకున్నాను’’ అని తెలిపారు. అలా అదానీ రెండు సార్లు చావు నోటి నుంచి తప్పించుకున్నారు. చదవండి: అంబానీ.. అదానీ.. నువ్వా నేనా..! -
ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు కోసం ఆసియాలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన వారసుడు ఎవరు అనే దాని విషయంలో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. వారుసుల విషయంలో ఆసియాలోని ఇతర సంపన్న కుటుంబాలు చేసిన తప్పులను తను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ముకేష్ అంబానీ కుటుంబంలో అంతర్యుద్ధం రాకుండా ఉండటానికి నిపుణులతో చర్చిస్తున్నట్లు వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ ఒక కథనం ప్రచురితం చేసింది. బ్లూంబర్గ్ కథనం ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసత్వ విషయంలో ప్రణాళికలను రచిస్తున్నారు. కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో అంబానీ కుటుంబం ప్రస్తుత వాటా మార్చి 2019లో ఉన్న 47.27 శాతం నుంచి 50.6 శాతానికి పెరిగింది. రిలయన్స్ వైభవం భవిష్యత్తులో కూడా తగ్గకుండా ఉండటానికి యువ తరం అంబానీలను సిద్ధం చేస్తున్నారు. జూన్ నెలలో జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) ముఖేష్ అంబానీ ఇలా మాట్లాడారు.. "ఇషా, ఆకాశ్, అనంత్ నేతృత్వంలో రిలయన్స్ మరి౦త సుసంపన్న౦ అవుతుంది అనడంలో నాకు స౦దేహ౦ లేదు" అన్నారు. (చదవండి: రూ.10 వేల పెట్టుబడితో రూ. 2 లక్షలు లాభం!) ప్రస్తుతం అతని కవల పిల్లలు ఆకాశ్, ఇషా అంబానీలు ఇద్దరూ రిటైల్ & టెలికామ్ వ్యాపారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. 2014లో వారిద్దరూ ఆర్ఐఎల్ టెలికాం, రిటైల్ వ్యాపారాల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ప్రస్తుతం, అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అతను డైరెక్టర్‌గా రిలయన్స్ పునరుత్పాదక శక్తి, చమురు & రసాయన యూనిట్ల భాద్యతలు కూడా చూస్తున్నాడు. అంబానీ వారసత్వ ప్రణాళిక 208 బిలియన్ డాలర్ల(సుమారు రూ.15.60 లక్షల కోట్ల) విలువైన ఈ వ్యాపార సామ్రాజ్యం అన్నీ రంగాలలో విస్తరించి ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కోనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేశ్ అంబానీ తాజాగా వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నారు. కంపెనీ ప్రధాన కార్యకలాపాలను పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్‌కు అప్పగిస్తారు. వారంతా బయటవారే ఉంటారు. అంబానీ కుటుంబ అంతర్యుద్ధం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరజ్ లాల్ హిరాచంద్ అంబానీ 1973లో రిలయన్స్ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ అంచలంచెలుగా ఎదిగింది. కానీ, 2002లో ధీరుబాయ్ అంబానీ ఆకస్మిక మరణం తర్వాత కుటుంబం అనిశ్చితిలో మునిగిపోయింది. ఆ సమయంలో ముఖేష్, అతని సోదరుడు అనిల్ అంబానీ ఇద్దరూ వ్యాపారంలో పాల్గొన్నప్పటికీ, ఒకరినొకరు అడగకుండా మరొకరు నిర్ణయాలు తీసుకువిస్తున్నారని నమ్మడంతో విభేదాలు రావడం ప్రారంభించాయి. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లు, ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా..?) కొన్ని విషయాలలో ఇద్దరూ సోదరులు ప్రధాన నిర్ణయాలపై విభేదించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 2005లో వారి తల్లి కోకిలాబెన్ రిలయన్స్ ఆస్తులను విభజించడానికి ముందు ఈ అంతర్యుద్ధం మూడు సంవత్సరాలు వరకు కొనసాగింది. ముఖేష్ అంబానీకి రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, వస్త్ర వ్యాపారాలను అందించగా.. అనిల్ అంబానీకి టెలికమ్యూనికేషన్స్, ఆస్తి-నిర్వహణ, వినోదం, విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలకు బాధ్యతలు అప్పజెప్పింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా అభివృద్ది చేసి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. వాల్టన్ కుటుంబ వారసత్వ ప్రణాళిక ప్రముఖ వాల్ మార్ట్ సంస్థ అమెరికన్ వ్యాపారవేత్త శామ్ వాల్టన్ చేత స్థాపించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ సంస్థగా ఎదిగింది. అతని కుమారుడు రాబ్ వాల్టన్, అతని మేనల్లుడు స్ట్యూర్ట్ వాల్టన్, ఇద్దరూ వాల్ మార్ట్ బోర్డులో ఉన్నారు. సామ్ మనవడు గ్రెగ్ పెన్నర్ 2015లో కంపెనీ చైర్మన్ గా నియమితులయ్యారు. శామ్ వాల్టన్ తాను చనిపోవటానికి 40 ఏళ్ల ముందే కుటుంబ వాటాల్ని ట్రస్టుకు బదిలీ చేసి.. కుటుంబ సభ్యులకు ఆ సంస్థ బోర్డు డైరెక్టర్ బాధ్యతల్ని అప్పజెప్పారు. ఇప్పటికీ ఆ సంస్థ చీలిపోకుండా ఉందంటే అందుకు ఆయన అనుసరించిన వ్యూహమేనని నిపుణులు చెబుతారు. ఇప్పటికి వాల్ మార్ట్ సంస్థలో 47 శాతం వాటాను ట్రస్టులు, వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ రూపంలో వాల్ మార్ట్ కుటుంబీకుల చేతుల్లోనే ఉండటం గమనార్హం.ఇప్పుడు అదే విధంగా, ముకేశ్ అంబానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని చూస్తున్నారని బ్లూంబర్గ్ పేర్కొంది. -
ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ
ధనవంతుల జాబితాలో అగ్రస్థానం కోసం పోటీపడుతున్న ఇండస్ట్రీ లిస్ట్ గౌతమ్ అదానీ అనుకున్నది సాధించారు. ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని.., గౌతమ్ అదానీ బీట్ చేశారు. 2015 నుంచి ప్రతి ఏడాది ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ప్రథమస్థానంలోనే కొనసాగుతున్నారు. అయితే, తాజా గణాంకాల ప్రకారం రిలయన్స్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. దీంతో అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదానీ కొండనే డీకొట్టారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ స్థానంలో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నివేదికల ప్రకారం ఏప్రిల్ 2020 నుండి అదానీ నికర విలువ బాగా పెరిగింది. మార్చి 18, 2020న అతని నికర విలువ 4.91 బిలియన్ డాలర్లు ఉండగా.. కేవలం 20 నెలల్లో గౌతమ్ అదానీ నికర విలువ 1808 శాతానికి(83.89 బిలియన్ డాలర్లు) పైగా పెరిగింది. అదే సమయంలో ముఖేష్ అంబానీ నికర విలువ 250 శాతం (54.7 బిలియన్ డాలర్లు)పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో అదానీ ప్రస్తుత నికర విలువ 88.8 బిలియన్ అని సూచించింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ కంటే కేవలం 2.2 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది. అయితే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, మంగళవారం (నవంబర్ 23) అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు అంబానీ నికర సంపద 91 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ బుధవారంతో (నవంబర్ 24) బిలియనీర్ల జాతకాలు మారిపోయాయి. ఆరామ్కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.77% పడిపోయాయి. అయితే అదానీ షేర్లు 2.34% జంప్ చేయడంతో అదానీ ఆస్తులు పెరిగి అంబానీ ఆస్తులు తగ్గుముఖం పట్టాయి. ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం ఆరామ్కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజు క్షీణిస్తున్నాయి.1.07 శాతం తగ్గి రూ.2,360.70 వద్ద ఉన్నాయి. అదానీ గ్రూప్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 2.94 శాతం పెరిగి రూ.1757.70 వద్ద ఉంది. అదానీ పోర్ట్స్ 4.87 శాతం పెరిగి రూ.764.75కి చేరుకుంది. అదానీ ట్రాన్స్మిషన్ 0.50 శాతం లాభపడి రూ.1,950.75కి చేరుకోగా, అదానీ పవర్ షేర్లు కూడా 0.33 శాతం పెరిగి రూ.106.25కి చేరాయి. దీంతో బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అదానీ ప్రస్తుతం అంబానీని ఓవర్ టేక్ చేసి అగ్రస్థానానికి ఎగబాకారు. చదవండి: ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..! ఎంతకు కొనుగోలు చేశారో తెలుసా..! -
అంబానీ.. అదానీ.. నువ్వా నేనా..!
మన దేశ ధనవంతుల జాబితాలో అగ్రస్థానం కోసం గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీ పోటీ పడుతున్నారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు & చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 2021లో 52 బిలియన్ డాలర్లు(153.8 శాతం) పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అతని ప్రస్తుత నికర విలువ 85.8 బిలియన్ డాలర్లు. దీంతో గౌతమ్ అదానీ భారత దేశంలో రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దేశంలో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ నికర ఆస్తి విలువ(97.2 బిలియన్ డాలర్లు) కంటే 11.4 బిలియన్ డాలర్లు తక్కువగా గౌతమ్ అదానీ ఆస్తి ఉంది. ప్రస్తుతం అదానీ భారతదేశంలో రెండో ధనవంతుడు మాత్రమే కాకుండా ఆసియాలో రెండో ధనవంతుడిగా కూడా నిలిచారు. ఏప్రిల్ 2020 నుంచి అదానీ నికర ఆస్తి విలువ గణనీయంగా పెరిగింది. 18 మార్చి 2020న, అతని నికర విలువ 4.91 బిలియన్ డాలర్లు ఉంటే 20 నెలల్లోనే అతని నికర విలువ 1747 శాతానికి పైగా(80.89 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఇదే కాలంలో ముఖేష్ అంబానీ నికర విలువ 254 శాతం(59 బిలియన్ డాలర్లు) పెరిగింది. గౌతమ్ అదానీ భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అయిన అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఫోర్బ్స్ ప్రకారం, అతను ఆస్ట్రేలియాలో వివాదాస్పద బొగ్గు గనుల ప్రాజెక్టు అయిన అబోట్ పాయింట్ కొనుగోలు చేశాడు. భారతదేశంలో అత్యంత రద్దీ గల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 74 శాతం వాటాను కలిగి ఉన్నాడు. ఇటీవల, ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ డెవలపర్ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఎజీఈఎల్), భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ పవర్ ట్రాన్స్ మిషన్ & రిటైల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్(ఎటీఎల్) కాప్-26 సదస్సులో తమ ఎనర్జీ కాంపాక్ట్ లక్ష్యాలను ప్రకటించాయి. (చదవండి: 18 ఏళ్లలోపు వారికి కూడా పాన్ కార్డు.. పొందండి ఇలా?) -
పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే కాలుష్యం ఎక్కువ?
కాప్-26 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరుగుతోంది. ఈ వాతావరణ సదస్సులో పర్యావరణ సమస్యలపై ప్రపంచం దృష్టి సారించడంతో రాబోయే కాలంలో కాలుష్యం తగ్గించాలని అన్నీ దేశాలు భావిస్తున్నాయి. ఎక్కువగా పరిశ్రమలు, వాహనాల చేత వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పెట్రోల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఎక్కువ శాతం దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంధనాన్ని మండించడం వల్ల ప్రత్యక్ష కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో దాదాపు పావు వంతు రవాణా రంగం బాధ్యత వహిస్తుంది. అందులో ప్యాసింజర్ కార్లు 45% ఉన్నాయి. ఈ సవాలు నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఒక సమాధానంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇక్కడే మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఒక వాహనం తయారు కావాలంటే 20,000 నుంచి 30,000 విడిభాగలు అవసరం. ఈ విడిభాగల తయారీ కోసం కొన్ని వేల టన్నుల అల్యూమినియం, ఉక్కు ఇతర పదార్థాలు అవసరం. ఈ ముడి పదార్ధాల తయారీ సమయంలో పరిశ్రమల ద్వారా ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఐసీఈతో పోలిస్తే సంప్రదాయ అంతర్గత కంబస్టివ్ ఇంజిన్(ఐసీఈ)తో పోలిస్తే బ్యాటరీ-ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేటప్పుడు విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువులు అధిక భాగాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈవీ ఉత్పత్తి ఊపందుకోవడంతో బ్యాటరీ ఉత్పత్తి, పరిశోధనలు, అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల గ్రీన్ హౌస్ ఉద్గారాలు 2040 నాటికి 60% కంటే ఎక్కువకు పెరగబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే కంపెనీ తెలిపింది. ఈ సంస్థ "సరఫరా గొలుసులో డీకార్బనైజేషన్ ప్రాముఖ్యతను విస్మరించలేము" అని గ్రీన్ పీస్ ఈ వారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. (చదవండి: ఇది ట్రక్కు కాదు నడిచే ఇళ్లు.. అచ్చంగా హీరోల తరహాలో) ఈ నివేదికలో పేర్కొన్నట్టు మనం ఒకదాని గురుంచి తెలుసుకోవాలి.. మెరుగైన ఈవీ బ్యాటరీలను తయారు చేయడానికి, రేంజ్ ఎక్కువగా రావడానికి సాంకేతిక నిపుణులు భారీ పరిమాణంలో బ్యాటరీలను తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల బరువు పెరుగుతుంది. ఇతర భాగాల బరువు + బ్యాటరీ బరువు కలిపితే వాహనం బరువు పెరుగుతుంది. దీంతో మొత్తంగా వాహనం బరువు పెరగడం చేత మళ్లీ రేంజ్ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమస్యను అరికట్టడం కోసం కార్ల కంపెనీలు తేలికపాటి బరువు ఉండే అల్యూమినియం వినియోగం వైపు దృష్టి పెడుతున్నారు. సాంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో 45% లోహాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు నివేదికలో పేర్కొంది. అల్యూమినియం డిమాండ్ పెరగడం చేత లోహ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. ఉత్పత్తి పెరగడంతో వాయు కాలుష్యం అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ రకంగా చూస్తే పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే ఎక్కువ వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. (చదవండి: ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!) ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం పవర్ అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వల్ల విద్యుత్ కి డిమాండ్ పెరుగుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు, కంపెనీలు థర్మల్ కర్మాగారాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ సౌర విద్యుత్ ఆప్షన్ ఉన్న ప్రస్తుతం మన దేశంతో సహ ఇతర దేశాలలో ఇంకా అంత ఎక్కువగా అందుబాటులోక రాలేదు. అందుకని ఎలక్ట్రిక్ వాహన సంస్థలు, ప్రభుత్వాలు ఈ సమస్యల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. -
ఆపిల్ కొంపముంచిన చిప్స్...!
ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్స్(చిప్) కొరత పలు కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో పలు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా చిప్స్ కొరత ఆపిల్‌ను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌కు భారీ దెబ్బ...! గత నెలలో ఆపిల్ ఐఫోన్13 స్మార్ట్ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు సెమికండక్టర్ కొరత ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల తయారీపై పడనుంది. దీంతో ఆపిల్‌కు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. చిప్ కొరతతో సుమారు 10 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై తయారీ భారీ ప్రభావం పడనుంది. ఈ ఏడాది చివరినాటికి సుమారు 90 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఉత్పతి చేయాలని ఆపిల్ భావించింది. ఆపిల్ చిప్స్‌ను అందిస్తోన్నబ్రాడ్కామ్, టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ చిప్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.దీంతో ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై భారీ ప్రభావమే చూపనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..! ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే బెటర్...! ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే ఆపిల్‌పై చిప్స్ కొరత ప్రభావం తక్కువగా ఉన్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్ దిగ్గజం ఆపిల్‌తో సహా ఇతర టెక్ కంపెనీలకు అందించే ఫోన్ విడి భాగాల(కాంపోనెంట్స్)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..! -
వారెవ్వా..! జెఫ్ బెజోస్, ఎలన్‌మస్క్ సరసన ముఖేష్ అంబానీ...!
రిలయన్ అధినేత ముఖేష్ అంబానీ మరో సరికొత్త రికార్డును నమోదు చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్‌తో కలిసి ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన సంపద క్లబ్లో చేరాడు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం...3.22 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ సంపద 101 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే, ధర ఎంతంటే? 100 బిలియన్ డాలర్ల ఏలైట్ క్లబ్లో జాయినైనా తొలి ఆసియా వ్యక్తిగా ముఖేశ్ అంబానీ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ 73.3 బిలియన్ డాలర్ల సంపదతో 14 వ స్థానంలో కొనసాగుతున్నారు. తండ్రి నుంచి పగ్గాలు... రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన తండ్రి మరణాంతరం కంపెనీ పగ్గాలను చేపట్టాడు. చమురు శుద్ధి ,పెట్రోకెమికల్స్ వ్యాపారాలను వారసత్వంగా పొందినప్పటి నుంచి రిలయన్స్ పలు రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది.అంతేకాకుండా ఫేస్బుక్, గూగుల్, ఆరామ్ కో వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో గ్రీన్ ఎనర్జీకి ప్రతిష్టాత్మకమైన ప్రోత్సాహాన్ని ఆవిష్కరించారు. వచ్చే మూడు సంవత్సరాలలో సుమారు 10 బిలియన్ల డాలర్లను పెట్టుబడిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడితో వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి, శక్తి దిగుమతులను తగ్గించడానికి భారత్ పరిశుభ్రమైన ఇంధన గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చాలని ముఖేశ్ అంబానీ ప్రణాళికలు చేస్తున్నారు. చదవండి: Amazon: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్...! -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..!
ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తులు అంటే జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్‌గేట్స్ అని చెప్తాం. ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఏవంటే జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్‌గేట్స్ కుటుంబాలు మాత్రం కావు. తాజాగా ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం..గత సంవత్సరంలో ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల సంపద ఏకంగా 22 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచంలోని టాప్ 25 బిలియనీర్ కుటుంబాలు గత ఏడాది సుమారు 312 బిలియన్ డాలర్లను పొందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! అత్యంత సంపన్న కుటుంబాల్లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సంస్థను నిర్వహిస్తోన్న వాల్టన్ కుటుంబం తొలి స్థానాన్ని సాధించింది. వాల్టన్ కుటుంబం వరుసగా నాలుగు సార్లు అత్యంత సంపన్న కుటుంబ జాబితాలో చోటు దక్కింది. రెండో స్థానంలో ఫ్రాంక్ మార్స్ కుటుంబం, మూడో స్థానంలో కోచ్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు, నాలుగో స్థానంలో ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల తయారీ కంపెనీ హీర్మేస్ కుటుంబం, ఐదో స్థానంలో సౌదీకి చెందిన అల్సౌద్ రాజ కుటుంబాలు నిలిచాయి. అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ముఖేశ్ అంబానీ కుటుంబం ఆరో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన టాప్-10 కుటుంబాలు క్రమసంఖ్య కుటుంబం కంపెనీ కుటుంబఆస్తుల విలువ 1. వాల్టన్ వాల్‌మార్ట్ కంపెనీ 238.2 బిలియన్ డాలర్లు 2. ఫ్రాంక్ మార్స్ మార్స్ చాక్లెట్ కంపెనీ 141.9 బిలియన్ డాలర్లు 3. కోచ్ కోచ్ ఇండస్ట్రీస్ 124.4 బిలియన్ డాలర్లు 4. హీర్మేస్ హీర్మెస్ లగ్జరీ ఉత్పత్తులు 111.6 బిలియన్ డాలర్లు 5. అల్ సౌద్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్లు 6. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 93.7 బిలియన్ డాలర్లు 7. వెర్టైమర్ చానెల్ లగ్జరీ ఉత్పతులు 61.8 బిలియన్ డాలర్లు 8. జాన్సన్ ఫిడెలిటి ఇన్వెస్ట్మెంట్స్ 61.2 బిలియన్ డాలర్లు 9. థామ్సన్ థామ్సన్ రైయిటర్స్, మీడియా 61.1 బిలియన్ డాలర్లు 10. బోహ్రింగర్, వాన్ బాంబాచ్ బోహ్రింగర్ ఇంగెల్హీమ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ 59.2 బిలియన్ డాలర్లు చదవండి: స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతాని ఢీ కొట్టిన దమ్ము దమానీదే -
బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..!
గత కొద్ది రోజుల నుంచి బిట్‌కాయిన్ తీవ్ర అస్థిరతను చవిచూసింది. బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వాడార్ దేశం చట్టబద్దతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌కు చట్టబద్దతను కల్పించడంతో ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బిట్‌కాయిన్‌లో అనిశ్చితి నెలకొంది. కాగా ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ తిరిగి పుంజుకుంది. తాజాగా బిట్‌కాయిన్‌పై బ్లూమ్‌బర్గ్ విశ్లేకుడు మైక్ మెక్‌గ్లోన్ సంచలన ప్రకటన చేశాడు. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! ఈ ఏడాది చివర్లో బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్ల (సుమారు రూ. 73.65 లక్షలు)కు చేరుకుంటుందని తన ట్విట్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది ప్రజలు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో బిట్‌కాయిన్ 2021 చివర్లో గణనీయమైన పురోగతిని సాధిస్తుందని తెలిపారు. బిట్‌కాయిన్ పూర్వ ట్రేడింగ్ గణాంకాలను మూలంగా చేసుకొని బిట్‌కాయిన్ విలువ రెట్టింపు అవుతోందని అభిప్రాయపడ్డారు. 2021 ఏప్రిల్-మేలో జరిగిన బిట్‌కాయిన్ క్రాష్‌తో ప్రస్తుత ట్రేడింగ్ గణాంకాలతో సరిసమానం చేసుకుందని, భవిష్యత్తులో బిట్‌కాయిన్ భారీ ర్యాలీని నమోదుచేస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 45,542 డాలర్ల (సుమారు రూ. 33.54 లక్షలు) వద్ద ట్రేడవుతోంది. బిట్‌కాయిన్ త్వరలోనే 50వేల డాలర్ల మార్కును దాటేందుకు ప్రయత్నిస్తోంది. Can Bitcoin Reach $100,000 in 2021? Five Charts Show Potential - Past #Bitcoin trading trends and the crypto's declining supply vs. mainstream adoption suggest a significant advance in 2021, potentially to $100,000, we believe. pic.twitter.com/0tH7PS7QEI — Mike McGlone (@mikemcglone11) September 16, 2021 చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...! -
ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు
బీజింగ్: చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ పిండుయోడువో ఇంక్ వ్యవస్థాపకుడు కోలిన్ హువాంగ్ ఈ సంవత్సరం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంపదను కోల్పోయిన వ్యక్తిగా నిలిచాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం హువాంగ్ సంపద 27 బిలియన్ డాలర్లకు(19,85,72,31,00,000 రూపాయలు) పైగా పడిపోయింది. చైనా తన దేశంలోని ఇంటర్నెట్ దిగ్గజాలపై విరుచుకుపడడంతో కంపెనీ స్టాక్ ఇంత భారీగా పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లోని 500 మంది సభ్యులలో ఇది అతిపెద్ద క్షీణత కాగా కోలిన్ తర్వత అత్యధికంగా నష్టపోయిన తదుపరి వ్యక్తిగా చైనా ఎవర్‌గ్రాండే గ్రూప్ ఛైర్మన్ హుయ్ కా యాన్ నిలిచారు. ఈ చైనీస్ బిలయనీర్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఈ ఏడాది సుమారు $ 16 బిలియన్ కంటే ఎక్కువ మొత్తంలో కోల్పోయి.. అప్పుల కుప్పతో పోరాడుతోంది. దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ "సాధారణ శ్రేయస్సు" (కామన్ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవించాయి. జిన్‌పింగ్ తీసుకువచ్చిన నూతన విధానం ఫలితంగా పిండుయోడువో (పీడీడీ) షేర్లు ఈ సంవత్సరం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంటే ఎక్కువగా పడిపోయాయి. ఫలితంగా కోలిన్ భారీ నష్టాన్ని చవి చూశాడు. దీనిపై స్పందించేందుకు కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు. పిండుడువో అమెరికన్ డిపాజిటరీ రసీదులు ఈ సంవత్సరం 44 శాతం పడిపోయాయి. అలానే మరో దిగ్గజం ఆలీబాబా ఏడీఆర్ డిపాజిటరీ రసీదులు 33 శాతం క్షీణించగా... టెన్సెంట్ రసీదులు 20 శాతం పడిపోయాయి. హువాంగ్ 2015లో పిండుయోడువో కంపెనీలో 28 శాతం వాటా కలిగి ఉన్నాడు. కమ్యూనిటీ కొనుగోలుకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా పిండుయోడువోని అనతి కాలంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజంగా మలిచాడు. పీడీడీ వార్షిక క్రియాశీల వినియోగదారులు డిసెంబరులో 788 మిలియన్లకు చేరుకున్నారు. ఇది ఆలీబాబా ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లలో 779 మిలియన్లను అధిగమించింది. కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 125 బిలియన్ డాలర్లకు పడిపోయే ముందు గరిష్టంగా 178 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత నెలలో పబ్లిక్ కంపెనీగా మొదటి త్రైమాసిక నికర లాభాన్ని నివేదించింది. హువాంగ్, గత ఏడాది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన పదవికి రాజీనామా చేశారు. అలానే మార్చిలో మార్చిలో చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. చైనాలో ఆదాయ అంతరాన్ని తగ్గించేందుకు ప్రెసిడెంట్ జిన్‌పింగ్ తీసుకువచ్చిన దాతృత్వ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుత, భవిష్యత్తు కార్పొరేట్ లాభాలను తాకట్టు పెడుతున్న టెక్ దిగ్గజాలలో పీడీడీ ఒకటి. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి సహాయపడటానికి గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కేటాయిస్తామని పీడీడీ వెల్లడించింది. అంతకు ముందు, హువాంగ్, పీడీడీ వ్యవస్థాపక బృందం గత సంవత్సరం ఒక ఛారిటబుల్ ట్రస్ట్‌కు కంపెనీ వాటాలలో 2.4 బిలియన్ డాలర్లను కేటాయించారు. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఈ సంవత్సరం అతిపెద్ద నికర విలువ క్షీణత కలిగిన 10 మంది బిలియనీర్లలో ఆరుగురు చైనాకు చెందిన వారే ఉన్నారు. అంతేకాక అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఈ సంవత్సరం $ 6.9 బిలియన్ సంపదను కోల్పోయారు. -
డిగ్రీలో ఫెయిల్, నెమ్మదస్తుడు.. కానీ లక్ష కోట్లకు అధిపతి
దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తి ఎవరి అడిగితే ముఖేశ్ అంబాని అని ఠక్కున చెప్పేస్తాం. మరి రెండో వ్యక్తి ఎవరని అడిగితే టాటా,బిర్లా, మహీంద్రా, అజీం, శివనాడర్, బజాజ్ ఇలా పేర్లు వెతుకుతాం. కానీ వీళ్లెవరు కాదు .ఈ రెండో సంపన్నుడి పేరు రాధకిషన్ దమాని. ఏ మాత్రం పబ్లిసిటీని ఇష్టపడని ఈ మనిషి, కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కేవలం కామన్ సెన్స్‌ని పెట్టుబడిగా పెట్టి సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. D Mart Founder Radhakishan Damani: రాధా కిషన్ దమానీ వ్యాపారమే జీవన విధానంగా బతికే మర్వాడీ కుటుంబంలో 1954న జన్మించాడు. రాజస్థాన్‌లోని బికనేర్లోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఆయన తండ్రి శివ కిషన్ దమానీ ముంబై స్టాక్ ఎక్సేంజీలో బ్రోకర్‌గా పని చేయడానికి కుదరడంతో ఆ కుటుంబం ముంబైకి మకాం మార్చింది. రాధా కిషన్‌కి గోపి కిషన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అత్తెసరు మార్కులతోనే చదువు నెట్టుకొస్తూ.... ఎలాగొలా ముంబై యూనివర్సిటీలో బీకాంలో సీటు సాధించినా మొదటి ఏడాది తర్వాత కాలేజీకి వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో ఇంట్లో వాళ్లు అతని చేత బాల్ బేరింగ్ బిజినెస్ పెట్టించారు. తండ్రితో కలిసి సోదరుడు గోపి దమానీ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ పనులు చూసుకునే వాళ్లు. ఆ ఘటనతో... ఇటు పెద్దగా చదువు కోకుండా అటు బిజినెస్‌లో చురుగ్గా వ్యవహరించని రాధా కిషన్‌పై తండ్రికి ఎప్పుడూ అనుమానమే. అయితే రాధా కిషన్‌కి 32 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అకస్మాత్తుగా శివ్ దమానీ మరణించాడు. దీంతో తండ్రి స్థానంలో అయిష్టంగానే స్టాక్ మార్కెట్లోకి వచ్చాడు దమానీ కదలడు మెదలడు స్టాక్ మార్కెట్ అంటేనే గందరగోళం.. కొనేవాళ్లు, అమ్మేవాళ్లలతో హడావుడిగా ఉంటుంది. కానీ రాధకిషన్ దమానీ ఇందుకు విరుద్ధంగా నెమ్మదిగా ఉండేవాడు. అతని పేరేంటో కూడా తోటి బ్రోకర్లకి తెలిసేది కాదు. మార్కెట్లో అతను ప్రాతినిథ్యం వహించే జీఎస్ అనే బ్యాడ్జ్ అతని షర్ట్‌పై ఉంటే అదే పేరుతో జీఎస్ అనే ఎక్కువ మంది పిలిచేవారు. హడావుడి చేయకపోయినా అక్కడున్న వాళ్లని గమనిస్తూ మార్కెట్ పల్స్‌ని మాత్రం బాగా గమనించే వాడు. హర్షద్ మెహతాకు పోటీగా రాధ కిషన్ దమానీ స్టాక్ మార్కెట్లో కెరీర్ ప్రారంభించినప్పుడే మరో బిగ్బుల్, స్టాక్ మార్కెట్ స్కామర్ హర్షద్ మెహతా కూడా స్కాక్ మార్కెట్లో అడుగు పెట్టాడు. తెర వెనుక మంత్రాంగం నడుపుతూ మార్కెట్‌ను పైకి లేపడంలో హర్షద్‌కి పెట్టింది పేరు. అతనికి పోటీగా మార్కెట్లో నిలిచింది ట్రిపుల్ ఆర్‌లో రాధాకిషన్ దమానీ మూల స్థంభం. ఆ రోజుల్లో హర్షద్‌కి పోటీగా రాధా కిషన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాజ్ అనే ముగ్గురు ట్రిపుల్ ఆర్గా పోటీ ఇచ్చారు. అయితే వీళ్లపై ఎక్కువ సార్లు హర్షద్దే పై చేయి అయ్యింది. అయినా సరే పట్టు వదలకుండా పోటీలో నిలిచారంటే దానికి కారణం దమానీనే. అదే జరిగి ఉంటే ఓ కంపెనీ టైర్స్ షేర్ల విషయంలో హర్షద్ మెహెతా, ట్రిపుల్ ఆర్ల మధ్య పోటీ నెలకొంది. ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయంటూ హర్షద్ బుల్ జోరు కొనసాగిస్తే, ఆ షేర్లు పడిపోతాయంటూ ట్రిపుల్ ఆర్ బేర్ వైపు నిల్చుంది. హర్షద్ ఎత్తులతో చాలా రోజుల పాటు ఆ కంపెనీ షేర్లు పడిపోలేదు. మరో వారం గడిస్తే ఇల్లు, వాకిలి అమ్మేసి నడి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ట్రిపుల్ ఆర్ బృందానికి ఎదురైంది. అయితే హర్షద్ పాచికలు పారక కృత్రిమంగా పెంచిన ఆ కంపెనీ టైర్ల ధరలు పడిపోవడంతో దమానీ బృందం అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాతి కొద్ది రోజులకే హర్షద్ స్కాం వెలుగు చూడటంతో పరిస్థితి మారిపోయింది. హడావుడి చేయకుండా నిదానంగా ఆలోచిస్తూ మార్కెట్ ఎత్తులు వేసే రాధా కిషన్ దమానీ వైఖరి ఆయన్ని మార్కెట్లో మరో ఎత్తుకి తీసుకెళ్లింది. పట్టిందల్లా బంగారమే 1992 నుంచి 1998 వరకు రాధి కిషన దమానీ కొనుగోలు చేసిన కంపెనీ షేర్ల విలువ బాగా పెరిగింది. వీఎస్టీ, హెచ్డీఎఫ్సీ, సుందరం ఫైనాన్స్ ఇలా అన్ని కంపెనీలు లాభాలను కళ్ల చూశాయి. బేర్ మార్కెట్‌ను అంచనా వేసి తక్కువ ధర షేర్లు కొన్ని లాంగ్‌టర్మ్‌లో భారీ లాభాలను పొందే వ్యూహం అమలు చేశాడు. పదేళ్లు తిరిగే సరికి వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. అప్నా బజార్ తక్కువ ధరకే వస్తువులను భారతీయులు కొనుగోలు చేయాలనుకుంటారని, అందుక తగ్గట్టుగా తక్కువ ధరకే కిరాణా సామన్లు అందించే స్టోర్లుగా అప్నా బజార్ పేరుతో కోపరేటివ్ సూపర్ మార్కెట్ వ్యవస్థను 1998లో నెలకొల్పారు. అయితే ఇటు స్టాక్ మార్కెట్, అటు సూపర్ మార్కెట్ల మధ్య సమతూకం లేక అప్నా బజార్ నష్టాల పాలైంది. స్టాక్‌మార్కెట్‌కి గుడ్‌బై తొలి సారి బాల్‌బేరింగ్ వ్యాపారంలో వచ్చిన నష్టం దమానీని వేధిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా అప్నా బజార్లో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో దమానీలో పట్టుదల పెరిగింది. కోట్ల రూపాయల సంపద అందించిన స్టాక్ మార్కెట్‌కి 2000లో గుడ్‌బై చెప్పాడు. డీ మార్ట్ ముంబై నగర శివార్లలో పువై ప్రాంతంలో చవగ్గా స్థలం కొని ఏర్పాటు చేసి కిరాణ వస్తువుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్, గ్రూమింగ్ వరకు అన్ని వస్తువులు ఓకే చోట దొరికేలా డీ మార్ట్ హైపర్ మార్కెట్‌ని ఏర్పాటు చేశాడు. ప్రతీ వస్తువుని ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించాడు. నెమ్మదిగా డీ మార్ట్ విజయ పరంపర మొదలైంది. ధనవంతుల జాబితాలో డీ మార్ట్ ప్రారంభించిన తర్వాత పదేళ్లు గడిచే సరికి స్టోర్ల సంఖ్య 1 నుంచి పదికి పెరిగింది. అయితే మా సిటీలో కూడా డీమార్ట్ ఉంటే బాగుండు అనుకునే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. అందుకు తగ్గట్టే మరో పదేళ్లు గడిచే సరికి డీమార్ట్ స్టోర్ల సంఖ్య దేశ వ్యాప్తంగా 220కి చేరుకుంది. డీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకి 2017లో వెళ్లగా 145 శాతం అధిక ధర నమోదై రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. ఆగస్టు 19న ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి చేరింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. ఇండియాలో ముకేశ్ అంబానీ 57.9 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో ఉంటే దమానీ 19.30 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. విలువలే ఆధారంగా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తెల్ల అంగీ తెల్ల ప్యాంటు మాత్రమే ఆయన ధరిస్తారు.దీంతో ఆయన్ని మిస్టర్ వైట్ అండ్ వైట్‌గా పిలుచుకుంటారు. 80వ దశకంలో స్టాక్ మార్కెట్లో హర్షద్‌మెహతా ఎత్తులకు మిగిలిన ఇన్వెస్టర్లు చిత్తైపోతుంటే తెగువతో నిలిచారు దమానీ. ఆ పోరులో సర్వం కోల్పేయే వరకు వచ్చినా ధైర్యం కోల్పోలేదు. అందువల్లే స్కాములు చేసిన హర్షద్ ఎలా పైకి ఎదిగాడో అలాగే నేలకరిస్తే.. నెమ్మదస్తుడిగా పేరున్న దమానీ టాటా బిర్లాలనే వెనక్కి నెట్టి అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పటికీ అదే తీరు ముంబై స్టాక్ మార్కెట్లో బ్రోకర్‌గా అగుడు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు దమానీ. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, బయట పార్టీలకు వెళ్లడం, ఆఖరికి మార్కెట్ మీద సైతం కామెంట్ చేసేందుకు ఆయన ముందుకు రారు. ఎక్కడైనా విరాళాలు, సాయం అందించిన తనే పేరు రాయించడు, కనీసం మాట వరసకి కూడా చెప్పొదంటూ సాయం, విరాళం పొందిన వారిని రిక్వెస్ట్ చేస్తారు. ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు వచ్చిన సందర్భంలో ఆయన లేటెస్ట్ ఫోటోలు సైతం మీడియాకి లభించలేదంటే ఎంత లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం చదవండి : BigBull: పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు! -
వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ
ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ తరువాత స్థానంలో నిలిచారు. షేర్.. హుషారు శుక్రవారం ఒక్కరోజే ఇండియన్ స్టాక్ మార్కెట్లో రియలన్స్ షేర్ వ్యాల్యూ 4 శాతం పెరిగి..అంబానీ సంపాదనకు మరో 3.7 బిలియన్ల డాలర్లు చేరినట్లైంది. దీంతో 92.9 బిలియన్ డాలర్లతో వరల్డ్ వైడ్ బిలియనీర్ జాబితాలో 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయరన్‌ను వెనక్కి నెట్టారు. 92.60 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అపర కుబేరుడు వారెన్ బఫెట్ 103 బిలియన్ డాలర్లతో 10వస్థానంలో ఉన్నారు. కలిసొచ్చిన కామెంట్స్ దేశీయ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు కోసం రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ వాటాల్ని కొనుగోలు చేసినట్లు గురువారం తెలిపింది. ఈ ప్రకటన చేసిన మరుసటి రోజు (శుక్రవారం) నేషనల్ షాక్ ఎక్ఛేంజీలో 4.5 శాతానికి ఎగసి జీవితకాల గరిష్ట స్థాయిల్ని టచ్ చేయడంతో రియలన్స్ షేరు రూ .2,389.65 వద్ద ముగిసింది. దీంతో పాటు 'గ్రీన్ ఎనర్జీ' ద్వారా 100గిగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించడంతో రిలయన్స్ కు కలిసొచ్చింది. చదవండి: కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! -
5జీ నెట్ వర్క్...ముందు నుయ్యి వెనుక గొయ్యి
మనదేశంలోని టెలికాం కంపెనీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ టెక్ లవర్స్ సైతం 5జీ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న 4జీ కంటే 5జీ వినియోగం వల్ల టెక్నాలజీతో పాటు అన్నీరంగాల్లో అభివృద్ధి సాధిస్తాయని టెక్ నిపుణుల చెబుతున్నారు. కానీ 5జీ నిర్మాణం అంతసాధ్యం కాదని, భారీ ఇన్వెస్ట్మెంట్లు పెడితే కానీ లాభాలు చవిచూడలేమన్నది దేశీ టెలికాం మాట. మరోవైపు 5జీ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా లాభాలు వస్తాయని చైనా టెలికాం గణాంకాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా మిగిలిన దేశాల్లోకంటే చైనా 5జీ వినియోగంలో ముందంజలో ఉంది. తాజాగా బ్లూంబెర్గ్ రిపోర్ట్ ప్రకారం చైనా ప్రభుత్వానికి చెందిన చైనా మొబైల్ లిమిటెడ్ కంపెనీ మొదటి ఆరునెలల్లో 5జీ వినియోగం వల్ల 6శాతం లాభాల్ని మూటగట్టుకుంది. ఈ ఏడాది నికర ఆదాయం జనవరి నుంచి జులై మధ్య కాలంలో 59.1 బిలియన్ డాలర్లకు చేరింది. నిర్వహణ ఆదాయం 13.8శాతానికి పెరిగింది. ఆ కంపెనీ స్టాక్ వ్యాల్యూ 1.53 యువాన్లు ఉండగా ఇప్పుడు 1.63 యూవాన్లకు పెరిగింది. 5జీలో లాభాలు అధికంగా ఉండటంతో ఇటీవల అమెరికా స్టాక్ ఎక్సేంజీలో బహిష్కరణకు గురైన మూడు టెలికాం కంపెనీలు ఇప్పుడు 5జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 5జీలో లాభాలు ఎంతగా ఉన్నాయనేందుకు ఈ పెట్టుబడుల ప్రవహామే ఓ ఉదాహరణ. డ్రాగన్ కంట్రీలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తుంటే భారత్ టెలికాం కంపెనీలు మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయి. అందుకు కారణం 4జీ నెట్ వర్క్ లో భారీగా నష్టాలు రావడమే. ఒక్క జియో మినహాయించి మిగిలిన ఎయిర్టెల్, ఒడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కు నష్టాలు వెంటాడుతున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టెలికాం శాఖ మాత్రం 2022నాటికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5జీ నెట్ వర్క్‌ని అందుబాటులోకి తెస్తామని చెప్పింది. మరో 4,5ఏళ్లు 4జీ నెట్ వర్క్ అందుబాటులోకి ఉంటుందని కాబట్టి.. ఈలోపే 5జీ స్పెక్టమ్ ను వేలం వేస్తామని స్పష్టం చేసింది. టెలికాం సంస్థలు మాత్రం వేలంలో తామున్నామంటూ హింట్ ఇస్తున్నా..వేలకోట్లలో అప్పులున్న ఐడియా, వొడాఫోన్ లాంటి సంస్థలు 5జీ వల్ల ఏ మేరకు లాభాలు గడిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి : గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?! -
6 నెలల్లో లక్ష కోట్లు కోల్పోయిన చైనా బిలియనీర్
ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన మాజీ పాఠశాల ఉపాధ్యాయుడు లారీ చెన్ పరిస్థితి 6 నెలల్లో తలక్రిందులుగా మారింది. చైనా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా రంగంపై కఠిన నియమాలు విధించడంతో చెన్ బిలియనీర్ హోదాను కోల్పోయాడు. గ్వోటు టెచెడు ఇంక్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన చెన్ ఆస్తి ఇప్పుడు 336 మిలియన్(రూ.24,98,22,38,400.00) డాలర్లకు చేరుకుంది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, తన ఆన్ లైన్-ట్యూటరింగ్ సంస్థ షేర్లు శుక్రవారం న్యూయార్క్ ట్రేడింగ్ లో దాదాపు మూడింట రెండు వంతులు పడిపోయాయి. చైనా ప్రభుత్వం జూలై 24న విద్యా రంగానికి సంబందించి కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబందనల ప్రకారం పాఠ్యాంశాలను బోధించే సంస్థలు లాభాలు సంపాదించకూడదు, మూలధనాన్ని పెంచుకోకూడదు. 15 బిలియన్(రూ.11,15,27,85,00,000.00) డాలర్లు గల లారీ చెన్ సంపద రూ.2,498 కోట్లకు పడిపోయింది. గావోటు స్టాక్ ధర గత ఆరు నెల కాలంలో భారీగా పడిపోయింది. గావోటు "నిబంధనలను పాటిస్తుంది, సామాజిక బాధ్యతలను నెరవేరుస్తుంది" అని చెన్ శనివారం అర్థరాత్రి చైనీస్ సోషల్ మీడియా వీబోలో తెలిపారు. కేవలం చెన్ మాత్రమే తన సంపదను పోగొట్టుకోలేదు. న్యూయార్క్ లో కంపెనీ షేర్లు 71% పడిపోవడంతో తాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ జాంగ్ బాంగ్సిన్ సంపద 2.5 బిలియన్ డాలర్లు నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే, న్యూ ఓరియంటల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఇంక్. ఛైర్మన్ యు మిన్హాంగ్ తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. ఈ రెండు కంపెనీలు కూడా కొత్త నిబంధనలను పాటిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తూ ప్రకటనలను విడుదల చేశాయి. 2014లో గావోటును స్థాపించిన చెన్ కు కరోనా మహమ్మరి సమయంలో భారీగా సంపద కలిసి వచ్చింది. 2020 జనవరిలో అతని కంపెనీ స్టాక్ ధర ఏకంగా 13 రెట్లు పెరిగింది. 2021 జనవరి 27న 142 డాలర్లుగా ఉన్న షేర్ ధర నేడు 2.72 డాలర్లకు పడిపోయింది. చైనాలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు మన దేశంలో ఉన్న సంస్థలకు లాగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండదు. అక్కడి ప్రతి కంపెనీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడవాల్సి ఉంటుంది. -
ప్రైవేటు రంగ ఉద్యోగులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రాకతో భారత్‌లో నిరుద్యోగరేటు గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ ఎనాలిసిస్ ప్రకారం...భారత నిరుద్యోగిత రేటు 2019లో 5.27 శాతంగా నమోదవ్వగా, 2020లో నిరుద్యోగిత రేటు గణనీయంగా 7.11 శాతానికి చేరుకుంది. కోవిడ్ రాకతో సుమారు 12.2 కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా వైరస్ ఉదృతి తగ్గడంతో కంపెనీలు తిరిగి ఉద్యోగనియామాకాలను చేపట్టాయి. జీతాల పెంపు..! తాజాగా బ్లూమ్‌బర్గ్ భారత ఉద్యోగులకు తీపి కబురును అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతీయుల జీతాలు గణనీయంగా పెరుగుతాయనీ పేర్కొంది. కోవిడ్-19 ప్రేరిత లాక్డౌన్ల నుంచి కంపెనీలకు ఉపశమనం కల్గనున్నట్లు పేర్కొంది. భారత్‌లో ముఖ్యంగా ఈ-కామర్స్, ఐటీ, ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ రంగాలోని ఉద్యోగులకు గణనీయంగా జీతాల పెంపు ఉంటుందని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఎరోస్పేస్, పర్యాటకం, అతిథ్య రంగాలు పుంజుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం..కోవిడ్-19 మూడో వేవ్‌ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే దేశంలోని ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నుంచి వారి జీతాల్లో 8 శాతం మేర జీతాల పెంపు ఉండవచ్చునని పేర్కొంది. కరోనా మహామ్మారి సమయంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగ, వేతన కోతలను ఎదుర్కోన్న వారికి కాస్త ఉపశమనం కల్గనుంది. -
కేవలం వారంలో భారీగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద
ముంబై: ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క వారంలోనే 6.2 బిలియన్ డాలర్లు పెరిగింది. తన ప్రధాన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర 10 శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఆయన సంపద వృద్ది చెందింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం.. అంబానీ నికర ఆస్తి విలువ మంగళవారం(జూన్ 1, 2021) నాటికి 83.2 బిలియన్ డాలర్లు(రూ. 6.07 లక్షల కోట్లు)గా ఉంది. మే 23న 77 బిలియన్ డాలర్ల(రూ. 5.62 లక్షల కోట్లు) సంపదను కలిగి ఉన్నాడు. స్టాక్ ఎక్స్ఛేంజీ తాజా డేటా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖేష్ అంబానీ 49.14శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆర్ఐఎల్ షేర్లు మంగళవారం 0.5 శాతం పెరిగి రూ.2,169 చేరుకుంది. త్వరలోనే ఈ స్టాక్ ధర రూ.2,580 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రస్తావించదగిన మరో విషయం ఏమిటంటే, గత ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్ఐఎల్ స్టాక్ ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది. మార్చి 23న కనిష్ట ధర 875 రూపాయల నుంచి సెప్టెంబర్ 16న రూ.2,324కు చేరుకుంది. నిరంతరం జియో ప్లాట్‌ఫామ్, రిటైల్ బిజినెస్‌ల్లోకి నిధుల సేకరణ చేపట్టడంతో రిలయన్స్ స్టాక్ మార్కెట్లలో వృద్ది కనబడింది. ట్రేడింగ్ ధోరణి ఇలాగే కొనసాగితే త్వరలో అంబానీ వ్యక్తిగత సంపదలో మరో 10 బిలియన్ల డాలర్లు జత కలుస్తాయని అంచనా వేస్తున్నారు. స్వల్ప కాల వ్యవధిలో రిలయన్స్ షేర్లు మరో 15 శాతం పెరుగుతాయని అంచనా. అదే జరిగితే ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ ర్యాంక్ నుంచి 8వ స్థానానికి ఎదుగుతారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. టెలికాం మరియు రిటైల్ వ్యాపారాలలో వరుస నిధుల సేకరణ మరియు రికార్డు హక్కుల సమస్య తరువాత. అప్పటి నుండి, ఈ స్టాక్ శ్రేణికి కట్టుబడి ఉంది మరియు బెంచ్‌మార్క్ సూచికలను బలహీనపరిచింది. చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ -
చిన్న ట్వీట్ తో 3వ స్థానానికి ఎలోన్ మస్క్
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన రెండవ స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు రెండవ స్థానంలో ఎల్విఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. గత వారం గ్లోబల్ స్టాట్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్ తర్వాత టెస్లా షేర్లు బాగా పడిపోయాయి. మార్చిలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచికలో అగ్రస్థానంలో ఉన్న మస్క్ సంపద 160.6 బిలియన్ డాలర్ల(24 శాతం)కు తగ్గింది. దీనికి ప్రధాన కారణం టెస్లా ఇకపై డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్లను చెల్లింపుగా అంగీకరించట్లేదని మస్క్ మే 13న ట్వీట్ చేయడమే. ట్వీట్ చేసిన తర్వాత బిట్ కాయిన్ల షేర్ విలువ 6.2 శాతం తగ్గింది. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర 42,185 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 8 తర్వాత ఇదే తక్కువ. ఫిబ్రవరి 8న బిట్ కాయిన్ 43,564 డాలర్లు పలికింది. టెక్నాలజీ ఆధారిత స్టాక్స్‌లో గత ఏడాది కరోనా విజృంభణ కాలంలో టెస్లా షేర్లు దాదాపు 750 శాతం పెరిగిన తర్వాత జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్ నిలిచాడు. కానీ, ఎక్కువ రోజులు ఈ స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టెస్లా అధిక లాభాలను నమోదు చేయగా, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ కొరత, సాంప్రదాయ వాహన తయారీదారుల నుంచి పెరుగుతున్న పోటీ మధ్య దాని వాటాలు ఐదవ వంతు తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. బిట్ కాయిన్లను ఎందుకు అంగీకరించలేదంటే? బిట్ కాయిన్ల తయారీ, లావాదేవీలకు ఫాజిట్ ఫ్యూయల్స్ వాడుతారనే విషయం తెలిసిందే. అందులో ఎక్కువ శాతం బొగ్గు ఉంటుంది. రకరకాల ఇంధనాల వృథా నుంచి బొగ్గు తయారవుతుంది కాబట్టి అందుకే బిట్కాయిన్లను ప్రోత్సహించం అని ట్వీట్లో మస్క్ పేర్కొన్నాడు. ఈ సంవత్సరం మస్క్ సంపాదన 9 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. టెస్లా సీఈఓను అధిగమించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ తన నికర విలువ సంపాదన భారీగా పెరగింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో తన సంస్థ విలాస వస్తువుల అమ్మకాలు పెరగడంతో 72 ఏళ్ల అతని సంపాదన నికర విలువ 47 బిలియన్ డాలర్ల నుంచి 161.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో జెఫ్ బేజోస్, రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్, మూడవ స్థానంలో ఎలోన్ మస్క్ నిలిచారు. ఇక తర్వాత స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలిగేట్స్ ఉన్నారు. చదవండి: ఐటీ కొలువుల మేళా: భారీగా టెకీల నియామకం! -
మైక్రోసాఫ్ట్ బిగ్ ప్లాన్స్ : భారీ కొనుగోలుకు సన్నాహాలు
వాషింగ్టన్: ప్రముఖ మెసేజింగ్ సైట్ డిస్కార్డ్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ పావులు కదుపుతోంది. డిస్కార్డ్ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్లతో డిస్కార్డ్ను కొనుగోలు చేయాలనుకుంటునట్లు సమాచారం. చాలా సంస్థలు డిస్కార్డ్ ను కొనేందుకు ప్రయత్నిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ముందు వరుసలో ఉందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఇరు కంపెనీల ప్రతినిధులు కొనుగోలు విషయంపై క్లారీటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లింక్డ్ ఇన్, గిట్ హబ్, మైన్క్రాఫ్ట్ను కొనుగోలు చేసింది. ఈ వేదికలు కేవలం ప్రొఫెషనల్స్ కు మాత్రమే అందుబాటులో ఉండడంతో, సాధారణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ సోషల్ మీడియా సైట్ ను సొంతం చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.గతంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలకున్న, అది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే డిస్కార్డ్ పై దృష్టి పెట్టింది. డిస్కార్డ్ మెసేజింగ్ యాప్‌తో యూజర్లకు వీడియో, వాయిస్, టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ సేవలను అందిస్తుంది. ఈ యాప్ కరోనా మహమ్మారి సమయంలో అత్యంత ప్రజాదరణ పొందింది.100 మిలియన్లకు పైగా యూజర్లను డిస్కార్డ్ కలిగి ఉంది.ప్రముఖ గేమింగ్ బ్రాండ్ ఎక్స్ బాక్స్ కు రూపకల్పన చేసింది డిస్కార్డే. గత ఏడాది డిసెంబరు వరకు కంపెనీ విలువ 7 బిలియన్ల డాలర్లకు చేరింది.అంతేకాకుండా దీనిని ఐపీవో కంపెనీగా మార్చాలని నిర్వహకులు భావిస్తున్నారు. గతంలో డిస్కార్డే ఏపిక్ గేమ్స్, అమెజాన్ కంపెనీలతో చర్చలు జరిపింది. (చదవండి: గూగుల్‌పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి!) -
22 బిలియన్ డాలర్ల నష్టం; ఆసియా కుబేరుడిగా అంబానీ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరోసారి ఆసియా కుబేరుడిగా అవతరించారు. చైనా బిలియనీర్ జాంగ్ షంషన్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు. 80 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కాగా చైనాకు చెందిన అలీబాబా గ్రూపు అధినేత జాక్ మాను తోసిరాజని అంబానీ, గత రెండేళ్ల కాలంలో అత్యధిక రోజులు ఆసియా రిచెస్ట్ పర్సన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది డిసెంబరులో అనూహ్యంగా లాభాల పట్టిన చైనీస్ బిజినెస్ టైకూన్ షంషన్ సుమారు 98 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీని వెనక్కి నెట్టారు. తన కంపెనీలు వ్యాక్సిన్ తయారీ సంస్థ బీజింగ్ వాంటాయి బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజ్, నోన్గ్‌ఫూ బీవరేజ్ కంపెనీ షేర్లలో పెరుగుదల నమోదు కావడంతో ఈ మేరకు ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేగాక, వారెన్ బఫెట్‌ను అధిగమించి ఈ భూమ్మీద ఉన్న అత్యంత ఆరో సంపన్న వ్యక్తిగా ఘనతకెక్కారు. అయితే, తాజా బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం... షంషన్ గత వారం రోజుల్లోనే 22 బిలియన్ డాలర్ల మేర సంపద నష్టపోయారు. దీంతో ముకేశ్ అంబానీ ఆయన స్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం షంషన్ ఆస్తి 76.6 బిలియన్ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. చదవండి: అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ -
నంబర్ వన్ కుబేరుడిగా మళ్లీ ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దీంతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మళ్లీ రెండోస్థానానికి పరిమితమయ్యారు. మస్క్‌కి చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ తాజాగా సెకోయా క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 850 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. కంపెనీ విలువ 74 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి ఇన్వెస్టర్లు మదుపు చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద నికర విలువ 11 బిలియన్ డాలర్లు ఎగిసి.. 199.9 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఆయన నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. బెజోస్ సంపద 194.2 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా షేర్లు పడిపోవడంతో ఈమధ్యే స్వల్పకాలం పాటు బెజోస్ టాప్ బిలియనీర్‌గా నిల్చారు. -
మస్త్.. మస్క్!
న్యూయార్క్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి గురువారం టెస్లా షేర్ల ధర ప్రకారం ఆయన సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. కుబేరుల జాబితాలో గతేడాది తొలి నాళ్లలో 35వ స్థానంలో ఉన్న మస్క్.. ఏడాది తిరిగేసరికి అగ్రస్థానానికి చేరడం గమనార్హం. గురువారం టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది. టెస్లా షేరు ధర గతేడాది ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. ఏడాది వ్యవధిలో టెస్లా షేరు కనిష్ట ధర రూ. 65.42 డాలర్లు కాగా ప్రస్తుతం 811.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. గతేడాది నవంబర్ ఆఖర్లో మస్క్ 127.9 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను తోసిరాజని రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. రెండు నెలలు కూడా తిరక్కుండానే మరో 60 బిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుని నంబర్ వన్ స్థానానికి ఎగబాకారు. టెస్లాలో మస్క్‌కు 20 శాతం దాకా వాటా ఉంది. ఆయన గతంలో ఇంటర్నెట్ పేమెంట్స్ కంపెనీ పేపాల్ హోల్డింగ్స్‌ను కూడా నెలకొల్పి, మంచి లాభాలకు విక్రయించారు. స్పేస్ఎక్స్ అనే రాకెట్ల తయారీ సంస్థ, న్యూరాలింక్ అనే మరో సంస్థను కూడా నెలకొల్పారు. టనెల్స్ ద్వారా పూర్తి ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా బోరింగ్ కంపెనీని సైతం ఎలాన్ మస్క్ ప్రారంభించారు. -
పెట్టుబడులకు భారత్ స్వర్గధామం
న్యూఢిల్లీ: భారత్ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశమని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పేర్కొన్నారు. పట్టణీకరణ, రవాణా, ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మరింత ఆకర్షణీయ దేశంగా భారత్ ఉందని ఆయన అన్నారు. బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌ను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత్, కొన్ని ఆఫ్రికన్ దేశాలు రానున్న రెండు దశాబ్దాల్లో భారీ పట్టణీకరణ విప్లవాన్ని చూడనున్నాయి. పట్టణీకరణలోకి పరివర్తన చెందే క్రమంలో భారత్ ముందడుగు వేస్తోంది. ► కరోనా మహమ్మారి సవాళ్లు సమసిపోయిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు తిరిగి మెరుగుపడే స్థాయిలో ప్రపంచ పునరి్నర్మాణం జరగాలి. ప్రజల ఆలోచనా ధోరణి, విధానాలు సంబంధిత ప్రక్రియలో నవీనత లేకపోతే, కోవిడ్ తదుపరి వ్యవస్థను పునఃప్రారంభించలేము. ముఖ్యంగా డిజిటలైజేషన్ విధానానికి మరింత ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ► 2022 గడువుకు కోటి చౌక గృహాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది. ► 100 స్మార్ట్ సిటీ అభివృద్ధికి దాదాపు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రూ.1.4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కావడమో లేక పూర్తికాబోతున్న దశకు చేరడమో జరుగుతోంది. ► పట్టణీకరణలో పెట్టుబడులకు మీరు చూస్తున్నట్లయితే, భారత్ మంచి అవకాశాలను మీకు కలి్పస్తుంది. రవాణా, ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల విషయంలోనూ మీకు భారత్ ఇదే రకమైన అవకాశాలను అందిస్తుంది. -
ముకేష్ అంబానీ ఖాతాలో మరో రికార్డు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో తాజాగా ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేష్ అంబానీ.. అమెజాన్ అధినేత జేఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ తర్వాత స్థానంలో ఉన్నారు. ఈ ఇండెక్స్‌లో ముకేష్ అంబానీ 80.2 బిలియన్ డాలర్ల(సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు) సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను దాటేసి నాలుగో స్థానంలో నిలిచారు. కొన్నేళ్లుగా ఈ ఇండెక్స్‌లో అమెరికన్స్ మాత్రమే టాప్ 5లో ఉంటూ వచ్చారు. బెజోస్, బిల్ గేట్స్, గూగుల్ అధినేతలు సెర్గీ, లారీ పేజ్, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ వంటివాళ్లు టాప్ పొజిషన్లో ఉండేవారు. తాజాగా వారి జాబితాలో ముకేష్ అంబానీ చేరారు. ఫ్యాషన్ టైకూన్ ఆర్నాల్ట్, వారెన్ బఫెట్, స్టీవ్ బాల్మర్, లారీ పేజ్, సెర్గీ బ్రెయిన్ ఎలన్ మాస్క్ సహా అందరినీ వెనక్కు నెట్టారు అంబానీ. బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన నివేదికలో 10 మంది ప్రపంచ కుబేరుల్లో 8 మంది అమెరికాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరి సరసన చేరిన ముకేష్ అంబానీ భారత్ నుంచే కాక ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. (రిలయన్స్ ఇండస్ట్రీస్.. గ్లోబల్ టాప్–2) ఇక ఈ ఇండెక్స్‌లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి 187 బిలియన్ డాలర్ల సంపదతో ప్రథమ స్థానంలో ఉండగా.. 121 బిలియన్ల సంపదతో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ రెండో స్థానంలో నిలిచారు. ఇక ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆస్తి 102 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ముకేష్ అంబానీ ఆస్తి 80.2బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు. ఫ్యాషన్ టైకూన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ 80.2 బిలియన్ డాలర్ల సంపదతో ముకేష్ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాప్ట్ పెట్టుబడులు పెట్టడంతో ఆయన కంపెనీల షేర్ విలువ భారీగా పెరిగింది. దాంతో ఆస్తులు కూడా పెరిగాయి. -
రెండు వారాల్లో రష్యా టీకా!
మాస్కో: ప్రపంచంలోనే తొలి కరోనా టీకాను ఆగస్ట్ 10 లేదా ఆగస్ట్ 12వ తేదీలోగా విడుదల చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. గామాలెయ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఈ టీకాకు సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని రష్యా భావిస్తోందని ఈ మొత్తం ప్రక్రియతో సంబంధమున్న అధికారిని ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్’ఒక కథనం ప్రచురించింది. ఆగస్ట్ 15లోగా ప్రజల వినియోగానికి అనుమతి లభించవచ్చని అధికార మీడియా ప్రకటించింది. రష్యాలోనే మరో టీకాకు మానవ ప్రయోగాల దశ ప్రారంభమైందని కూడా వెల్లడించింది. జూలై 27న ఐదుగురు వాలంటీర్లకు ఈ టీకాను ఇచ్చారని, వారు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోలేదని తెలిపింది. మరోవైపు, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్ఫర్డ్ టీకా పరిశోధనలను దొంగిలించేందుకు రష్యా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్, కెనడా, అమెరికా ఆరోపిస్తుండగా ఈ ఒప్పందం కుదిరింది. ప్రమాణాలను పట్టించుకోవడం లేదు టీకాను విడుదల చేయాలన్న తొందరలో రష్యా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. రష్యా టీకాకు రెండో దశ ట్రయల్స్ కూడా పూర్తి కాలేదని, ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా ప్రయోగాలు దీనికన్నా ముందంజలో ఉన్నాయని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అయితే, తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని రష్యా అంటోంది. -
వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం
న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్‌లో ప్రారంభమై అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ కరోనా. దీనిని మొదట్లో న్యూమోనియా లాంటి అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ అని భావించినప్పటికీ, ఈ విధంగా తీవ్ర రూపం దాలుస్తుందని పరిశోధకులు, వైద్యనిపుణులు ఊహించలేకపోయారు. ఆరు నెలల కాలంలోనే వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. కరోనా వైరస్ అంటే నిన్నటి వరకూ మనకు తెలిసిన లక్షణాలు చాలా తక్కువ. దగ్గు, జ్వరం ఉంటాయని, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని మాత్రమే. ఆ తరువాత రుచి లేకపోవడం, వాసన కోల్పోవడం కొత్తగా చేరిన లక్షణాలు. ఇలా రోజుకో వ్యాధి లక్షణం, కొత్త సమస్య బయటపడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో కరోనా నివారణకు అందించే టీకా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని కలిగిఉండేలా ప్రభావవంతంగా ఉంటుందా..? లేక శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలకు ఏమి జరుగుతుంది. శరీరంలో వైరస్ పునర్నిర్మాణం సాధ్యమా వంటి అనేక అనుమానాలు సగటు మానవుడి మెదడుని తొలుస్తున్నాయి. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్) అయితే బ్లూమ్‌బెర్గ్ సంస్థ అందించిన నివేదిక ప్రకారం.. కోవిడ్ నుంచి కోలుకున్నవారికి లేదా తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉన్న వారికి భవిష్యత్తులో అంటువ్యాధుల నుంచి శాశ్వత రక్షణ లభించకపోవచ్చని రోగనిరోధక శక్తి, టీకాల మన్నికను అర్థం చేసుకోవడానికి నిర్వహించిన ఓ అధ్యయం సూచిస్తుంది. తేలికపాటి కోవిడ్ లక్షణాలు కలిగి ఉన 34 మంది రోగుల రక్తం నుంచి ప్రతిరోధకాలు తీసుకోగా వారికి ఇంటెన్సివ్ కేర్ అవసరం రాలేదు. కేవలం ఆక్సిజన్, హెచ్ఐవీ ఔషదాలు, రెమెడిసివిర్ మాత్రమే ఇచ్చారు. లక్షణాలు ప్రారంభమైన 37 రోజుల తర్వాత తీసుకున్న ప్రతిరోధకాలను మొదట విశ్లేషించగా, తర్వాత 86 రోజుల తర్వాత మరొక విశ్లేషణ చేశారు. (చైనా టీకా ఫలితాలూ భేష్!) పై రెండు ఫ్రేమ్‌ల మధ్య సుమారు 73 రోజుల తర్వాత యాంటీబాడీ స్థాయిలు త్వరగా పడిపోయాయని పరిశోధకులు కనుగొన్నారు. 2002-03లో వచ్చిన సార్స్‌తో పోలిస్తే కరోనా యాంటీబాడీస్‌ను కోల్పోవడం చాలా వేగంగా జరిగిందని గుర్తించారు. వీరి అధ్యయంలో ముఖ్యంగా స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి శాశ్వత కోవిడ్ యాంటీబాడీస్ ఉండకపోవచ్చని గుర్తించారు. వైరస్‌ను అడ్డుకోవడంలో యాంటీబాడీలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారిన పడినవారిలో చాలా వరకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వీరికి భవిష్యత్తులో కూడా తిరిగి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ అధ్యయనంలో తేలింది. -
అలీబాబా అధినేతను వెనక్కినెట్టి..
బీజింగ్ : కరోనా మహమ్మారి ప్రభావంతో అత్యంత సంపన్నుల జాబితాలూ తారుమారవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లో టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు అనూహ్యంగా పెరగడం, షాపింగ్ యాప్ పిండుడువో దూకుడు చైనా బిలియనీర్ల ర్యాంకింగ్‌ను తిరగరాశాయి. అతిపెద్ద గేమ్ డెవలపర్ టెన్సెంట్ హోల్డింగ్స్ అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌ను అధిగమించి ఆసియాలోనే అత్యంత విలువైన సంస్థగా ఎదిగింది. దీంతో చైనాలో అత్యంత సంపన్నుడు జాక్ మా (48 బిలియన్ డాలర్లు)ను టెన్సెంట్కు చెందిన పోనీ మా (50 బిలియన్ డాలర్ల) అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం పిడిడికి చెందిన కోలిన్ హువాంగ్ 43 బిలియన్ డాలర్ల నికర సంపదతో టాప్ 3 సంపన్నుల్లో మూడవ స్ధానంలో నిలిచారు. చైనా ఎవర్‌గ్రాండే గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం హుయ్ కా యాన్ నాలుగో స్ధానానికి పడిపోయారు. కరోనా మహమ్మారితో వినియోగదారుల అలవాట్లు మారడంతో పలు ఇంటర్నెట్ కంపెనీల షేర్లు నింగికెగిశాయి. దీంతో చైనా సంపన్నుల ర్యాంకుల్లో టెక్ దిగ్గజాలు అనూహ్యంగా దూసుకొచ్చాయి. తొలి టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు టెక్నాలజీ దిగ్గజాలే కావడం గమనార్హం. చదవండి : ‘అలీబాబా’ జాక్ మా కీలక నిర్ణయం! -
నాన్న కోసం నది దాటాడు
హి షియాంగ్ వయసు 77. ‘మిడియా’ అనే విద్యుత్ గృహోపకరణాల కంపెనీ యజమాని. బ్లూమ్‌బర్గ్ సంపన్నుల జాబితాలో ఆయనది చైనాలో ఏడవ స్థానం. ప్రపంచంలో 36వ స్థానం. కంపెనీ హాంగ్ కాంగ్ సమీపంలోని ఫొషాన్లో నది పక్కన ఉంది. అక్కడే ఆయన నివాస భవనం. ఆదివారం రాత్రి నలుగురు దుండగులు ప్రధాన ద్వారాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి షియాంగ్‌ను బందీగా పట్టుకున్నారు. భవంతినంతా గాలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న షియాంగ్ కొడుకు 55 ఏళ్ల జియాంగ్ ఫెంగ్ భవంతి వెనుక నుంచి తప్పించుకుని బయటికి వచ్చాడు. అడ్డంగా నది!! రాత్రంతా ఆ నదిని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరి పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లొచ్చి పెద్దాయన్ని విడిపించి ఇంకా అక్కడే ఉన్న దుండగులను అరెస్ట్ చేశారు. నదిని అంతసేపు ఎలా ఈదారని ఫెంగ్‌ని అడిగారు. ‘‘నాన్న బందీగా ఉన్నారు. ఆయన్ని విడిపించుకోలేక పోతే నా స్వచ్ఛకు అర్థం ఏమిటి?’’ అన్నాడు ఫెంగ్! -
ఆసియా కుబేరుడు అంబానీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌తో డీల్ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మళ్లీ ఆసియా కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. డీల్ వార్తల కారణంగా రిలయన్స్ షేరు ఒక్కసారిగా ఎగియడంతో అంబానీ సంపద 4.7 బిలియన్ డాలర్ల మేర పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో చైనా దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను అధిగమించి అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. జాక్ మా కన్నా అంబానీ సంపద 3.2 బిలియన్ డాలర్లు అధికంగా ఉంది. సంపన్నుల సంపదకు కొలమానంగా పరిగణించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ సుమారు 10 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారానికి ముందు ఈ ఏడాది ఇప్పటిదాకా అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. డాలర్ల మారకంలో చూస్తే ఆసియాలో అత్యధికంగా నష్టపోయినది ముకేశ్ అంబానీయే. కానీ, ఫేస్బుక్ డీల్ కలిసి వచ్చి రిలయన్స్ షేరు పుంజుకోవడంతో మళ్లీ ఆసియా కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్?
లండన్: వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యా న్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. నావెల్ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్, యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్ బృందం ప్రయోగం మొదటిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న 70 సంస్థలను గుర్తించగా, అందులో మూడు సంస్థలు ఇప్పటికే మనుషులపై ప్రయోగం చేశాయి. గిల్బర్ట్ ప్రయోగం తొలిదశలో 510 మంది వలంటీర్లను ఐదు గ్రూపులుగా విభజించి వారికి వ్యాక్సిన్ ఇచ్చి, వారిని ఆరు నెలల పాటు పర్యవేక్షిస్తారు. తొలి ఇమ్యునైజేషన్ ఇచ్చిన నాలుగు వారాల అనంతరం ఈ ఐదు గ్రూపుల్లో ఒక గ్రూపు వారికి వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తారు. వేసవి కాలంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగే తీరునిబట్టి వ్యాక్సిన్ పనితీరుని గుర్తిస్తారు. అదే కాలంలో ఇతర దేశాల్లోని భాగస్వాములతో కలిసి వ్యాక్సిన్ ఫలితాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కోవిడ్ వ్యాక్సిన్లు తయారుచేస్తోన్న ప్రతి ఒక్కరికీ వారి ప్రాథమిక నిర్ధారణలను, వారి ఆలోచనలను పంచుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు గిల్బర్ట్ లాన్సెట్ పత్రికకు చెప్పారు. -
చైనా కంటే ఆ దేశమే సమస్యాత్మకం..
వాషింగ్టన్ : వాతావరణ మార్పులపై పోరాటం, కార్బన్ ఉద్గారాల నియంత్రణలో చైనా కంటే భారత్ అత్యంత సమస్యాత్మకమని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధి, న్యూయార్క్ మాజీ మేయర్ మైకేల్ బ్లూమ్‌బర్గ్ అన్నారు. లాస్‌వెగాస్‌లో డెమొక్రటిక్ ప్రెసిడెన్షియల్ తొలి డిబేట్లో పాల్గొన్న బ్లూమ్‌బర్గ్ 2015 ప్యారిస్ వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి అమెరికాను దూరం చేయడం ట్రంప్ ప్రభుత్వ తప్పిదమని దుయ్యబట్టారు. ఇక వాతావరణ మార్పుల విషయానికి వస్తే చైనా ఈ విషయంలో కొంత వెనక్కితగ్గినా భారత్ అత్యంత సమస్యాత్మకంగా మారిందని దీనిపై ఏ ఒక్కరూ ఏమీ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాలో మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన క్రమంలో ఆ దేశం ప్రపంచంలోనే అత్యధికంగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న క్రమంలో చైనాను మీరు ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించగా చైనాతో మనం యుద్ధానికి వెళ్లమని, వారితో మనం చర్చించి టారిఫ్‌లతో మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో వారిని ఒప్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై చైనా స్పందించని పక్షంలో వారి ప్రజలతో పాటు మన ప్రజలూ ప్రాణాలు కోల్పోతారని, దీనిపై మనమంతా కలిసి పనిచేయాల్సి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పులపై అమెరికా భిన్నంగా స్పందిస్తోందని తాము బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేస్తున్నామని, ఇప్పటికే 304 ప్లాంట్లు మూతపడగా, యూరప్‌లో 80 కాలుష్యకారక ప్లాంట్లు మూతపడ్డాయని చెప్పారు. చదవండి : ఆ బిలియనీర్ బ్లూమ్‌బర్గ్‌ను అమ్మేస్తాడు.. -
ఆ బిలియనీర్ బ్లూమ్‌బర్గ్‌ను అమ్మేస్తాడు..
వాషింగ్టన్ : డెమొక్రాట్ల నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మైకేల్ బ్లూమ్‌బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికైతే తనను బిలియనీర్‌ను చేసిన బ్లూమ్‌బర్గ్‌ను ఆయన అమ్మేస్తారని మైకేల్ ప్రచార ప్రతినిధులు స్పష్టం చేశారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో తలపడే డెమొక్రాటిక్ నామినేషన్‌కు ఒపీనియన్ పోల్స్‌లో అనూహ్యంగా మైకేల్ బ్లూమ్‌బర్గ్ ముందుకొచ్చారు. లాస్‌వెగాస్‌లో బుధవారం ఆయన తొలి ఎన్నికల ప్రచార చర్చలో పాల్గొంటారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైతే మైక్ తన కంపెనీని విక్రయిస్తారని ఆయన ప్రతినిధి గలియా స్లేన్ వెల్లడించారు. వాణిజ్య సమాచారంతో పాటు వార్తలు అందించడంలో బ్లూమ్‌బర్గ్ ఎల్పీ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. మైకేల్ బ్లూమ్‌బర్గ్ 1981లో బ్లూమ్‌బర్గ్ ఎల్పీని ప్రారంభించారు. 2019లో బ్లూమ్‌బర్గ్ రాబడి రూ 70,000 కోట్ల పైమాటేనని బర్టన్ టేలర్ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్‌కు చెందిన ఓ అనలిస్ట్ అంచనా వేశారు. చదవండి : ట్రేడ్ డీల్‌పై ట్రంప్ కీలక ప్రకటన -
తండ్రి కోటీశ్వరుడు.. కానీ కొడుకు మాత్రం
మాస్కో : కొందరు ఎంత ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా తమకంటూ గుర్తింపు కోసం ఏదో ఒకటి చేయాలని భావిస్తుంటారు. తండ్రి ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తను సొంతంగా సంపాదించిన దానితోనే సుఖంగా ఉంటానంటున్నాడు రష్యాకు చెందిన అలెగ్జాండర్ ఫ్రిడ్మాన్. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం అలెగ్జాండర్ తండ్రి మికేల్ ఫ్రిడ్మాన్ రాష్యాలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరిగా ఉన్నారు. మికేల్ ఫ్రిడ్మాన్ ఆస్తి విలువ సుమారు 13.7 బిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ ఇవేవి వద్దనుకున్న అలెగ్జాండర్ తండ్రికి దూరంగా మాస్కో ప్రాంతంలో 500 డాలర్లకు ఒక రెండు గదుల ప్లాట్‌లో నివాసముంటున్నాడు. ఇదే విషయమై అలెగ్జాండర్‌ను బ్లూమ్‌బర్గ్ సంప్రదించగా 'నేను సంపాదించిన దాంట్లోనే తింటాను, తిరుగుతాను, బతుకుతాను తప్ప వేరే వారిపై ఆధారపడను. నా తండ్రి సంపాదించిన ఆస్తి నాకు అక్కర్లేదు' అని పేర్కొన్నాడు. అలెగ్జాండర్ గతేడాదే లండన్ నుంచి ఉన్నత విద్యను పూర్తి చేసుకొని వచ్చాడు. తిరిగి రాగానే తండ్రిపై ఆధారపడకూడదని ఇళ్లు వదిలిపెట్టి మాస్కో పట్టణం అవతల ఒక రెండు రూంల ప్లాట్‌లోకి దిగాడు. ఎస్ఎఫ్ డెవలప్మెంట్ పేరుతో సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదిలోనే 450 మిలియన్ డాలర్లతో కంపెనీని మంచి లాబాలబాట పట్టించాడు. దీంతో పాటు మాస్కోలో ఉన్న రెస్టారెంట్లకు హుక్కా మెటీరియల్‌ను అందించే వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టాడు. ప్రస్తుతం అలెగ్జాండర్ తన తండ్రి నుంచి సహాయం పొందకుండానే వ్యవస్థలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. -
భారత్... అవకాశాల గని!
న్యూయార్క్: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం ఆరంభమేనన్నారు. కార్పొరేట్ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన బ్లూంబర్గ్ వ్యాపార సదస్సులో భాగంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కార్పొరేట్లను, సంపద సృష్టికర్తలను గౌరవించే ప్రభుత్వం భారత్‌లో ఉందన్నారు. ‘‘విస్తరణకు అవకాశం ఉన్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు భారత్‌కు విచ్చేయండి. ఆధునిక ధోరణులు, ఫీచర్లను అభినందించే మార్కెట్లో చేయదలిస్తే భారత్‌కు రండి. భారీ మార్కెట్ ఉన్న చోట స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రండి. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద మౌలిక సదుపాయాల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు తరలిరండి’’ అని ప్రధాని అంతర్జాతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. కార్పొరేట్ పన్నును అన్ని రకాల సెస్సులు, చార్జీలతో కలుపుకుని 35 శాతంగా ఉన్నదాన్ని ఇటీవలే ప్రభుత్వం 25.17 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల పన్నులకు దీటుగా భారత కార్పొరేట్ పన్ను మారింది. ఆ నాలుగు అంశాలే భారత్‌కు బలం... ‘‘భారత వృద్ధి పథం నాలుగు కీలక అంశాలతో ముడిపడి ఉంది. ప్రపంచంలో వేరెక్కడా ఇవి లేవు. అవి ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మక శక్తి. ప్రజాస్వామ్యానికి తోడు, రాజకీయ స్థితర్వం, ఊహించతగ్గ విధానాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నవి పెట్టుబడుల వృద్ధికి భరోసానిచ్చేవి., రక్షణనిచ్చేవి. భారత్ తన పట్టణాలను ఎంతో వేగంగా ఆధునీకరిస్తోంది. ఆధునిక టెక్నాలజీలతో, పౌరులకు సౌకర్యమైన సదుపాయాలతో వాటిని తీర్చిదిద్దుతోంది. కనుక పట్టణీకరణపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రావాలి’’అని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రక్షణ రంగంలో ముందెన్నడూ లేని స్థాయిలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు ఆయన చెప్పారు.భారత్ కోసం, ప్రపంచం కోసం భారత్‌లో తయారు చేయాలనుకుంటే భారత్‌కు రావాలని ఆహ్వానం పలికారు. వ్యాపార వాతావరణం మెరుగుపరిచేందుకు గాను రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించిన అనంతరం.. మోదీ సర్కారు 50 చట్టాలను రద్దు చేసిన విషయం గమనార్హం. ఆరంభమే... మున్ముందు ఇంకా చూస్తారు ‘‘భారత ప్రభుత్వం వ్యాపార ప్రపంచాన్ని, సంపద సృష్టిని గౌరవిస్తుంది. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు కఠినమైన, భారీ నిర్ణయాలను తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం కొలువుదీరి కేవలం మూడు నాలుగు నెలలే అయింది. ఇది కేవలం ఆరంభమేనని చెప్పదలుచుకున్నా. ఇంకా ఎంతో పదవీ కాలం ఉంది. ఈ ప్రయాణంలో అంతర్జాతీయ వ్యాపార సమూహంతో భాగస్వామ్యం పటిష్టం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మీకు బంగారం లాంటి అవకాశం’’ అని మోదీ వివరించారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) దేశ జీడీపీని తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్ర సర్కారు విధించుకున్న విషయం గమనార్హం. ఇప్పటికే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల మేర జీడీపీ స్థాయిని పెంచామని, 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు. 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో ఇప్పటికే 120 గిగావాట్ల మేర సాధించినట్టు తెలిపారు. 450 గిగావాట్ల లక్ష్యాన్ని సమీప కాలంలో చేరుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గడచిన ఐదేళ్లలో భారత్ 286 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని, అంతక్రితం 20 ఏళ్లలో వచ్చినవి ఇందులో సగమేనన్నారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. సరుకు రవాణా, అంతర్జాతీయ పోటీతత్వం, అంతర్జాతీయ ఆవిష్కరణ, వ్యాపార సులభతర నిర్వహణ సూచీల్లో భారత్ తన స్థానాలను మెరుగుపరుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. -
నేను వారధిగా ఉంటాను: మోదీ
న్యూయార్క్ : భారత్‌లో కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మక అడుగు అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రగతికి ఆటంకాలు కలిగించే 50 చట్టాలకు స్వస్తి పలికామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన న్యూయార్క్‌లో జరిగిన బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ...భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామిక వర్గాలకు విఙ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు భారత్ అనుకూల దేశమని.. భారత్‌తో వాణిజ్య, వ్యాపారాల్లో భాగస్వామ్యం కావడం సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ‘ మీ కలలు, ఆశయాలకు భారత్ గమ్యస్థానం. మీ సాంకేతికతకు మా ప్రతిభను జోడిస్తే ప్రపంచాన్ని మార్చవచ్చు. మీ మెళకువలు- మా నైపుణ్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాయి. వీటన్నింటికీ నేను వారధిగా ఉంటాను’ అని మోదీ పిలుపునిచ్చారు. అదే విధంగా గత ఐదేళ్లలో ఎన్నెన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. రోడ్లు, ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ‘ మా ప్రజాస్వామ్య విలువలు, న్యాయ వ్యవస్థ మీ పెట్టుబడులకు భద్రతనిస్తాయి. ఇంజనీరింగ్, పరిశోధన- అభివృద్ధిలో భారత ప్రజలు అత్యంత ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. మౌలిక వసతుల కల్పన, దేశ రక్షణకు మేము అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. అన్ని రంగాల్లోనూ పారదర్శక విధానాలు అవలంబిస్తాం. భారత్‌లో పెట్టుబడులకు ఇదే అనుకూల సమయం అని మోదీ పేర్కొన్నారు. -
ఎలాన్ మస్క్‌కు భారీ షాక్.. 2 నిమిషాల్లో..
వాషింగ్టన్ : ఎలక్ట్రిక్ కార్ల సంచలనం టెస్లా సీఈవో, స్పేస్ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ ట్రేడింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల టెస్లా కంపెనీ షేర్లు 11 శాతం మేర పడిపోయాయి. ఈ క్రమంలో ఎలన్ మస్క్ 1.1 బిలియన్(సుమారు 69,18,75,00,000 రూపాయలు) డాలర్ల సంపద ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన నికర సంపద 22.3 బిలియన్ డాలర్లకు చేరిందని అని బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. కాగా ఈ ఏడాది ఆర్థిక సంత్సరం మొదటి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. గతేడాది నాలుగవ త్రైమాసికంలో 90, 966లుగా ఉన్న టెస్లా కార్ల అమ్మకాలు ప్రస్తుతం 63,000లకు పడిపోవడంతోనే కంపెనీ షేర్లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఎలన్ మస్క్.. స్పేస్ఎక్స్ ద్వారా 10 బిలియన్ డాలర్లు, టెస్లా సీఈఓగా 13 బిలియన్ డాలర్ల సంపద ఆర్జించినట్టు పలు ర్యాంకింగ్ సంస్థలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా టెస్లా షేర్లను ఒక్కొక్కటి 420 డాలర్లకు కొనుగోలు చేస్తానని, దానికి తగ్గ నిధులున్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన ఎలన్ మస్క్ టెస్లా చైర్మన్ పదవిని పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త చైర్‌పర్సన్‌గా రాబిన్ డెన్హోమ్(55)ను నియమితులు కాగా మస్క్ సీఈఓ పదవికి పరిమితమయ్యారు. మరోవైపు స్పేస్ ఎక్స్ (స్పెస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) ఇటీవలే అత్యంత శక్తివంతమైన మానవ రహిత రాకెట్‌ను ప్రయోగాత్మకంగా లాంచ్ చేసింది. -
ఇరాన్ చమురును భారత్ కొనుక్కోవచ్చు
వాషింగ్టన్: ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 8 దేశాలకు తాత్కాలికంగా అనుమతిచ్చినట్లు అమెరికా తెలిపింది. ఇరాన్ నుంచి ఇప్పటికే చమురు దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంకా కోత విధిస్తే మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే ముప్పు ఉన్నందునే అమెరికా తన వైఖరిని సడలించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో లావాదేవీల వ్యవహారంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన 8 దేశాల జాబితాలో భారత్, జపాన్, దక్షిణ కొరియా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారిని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌పై తాజా ఆంక్షలు అమల్లోకి వచ్చే నవంబర్ 4 నాటికి ఆ దేశం నుంచి చమురు కొనుగోలును పూర్తిగా నిలిపేయాలని అమెరికా ఇది వరకే భారత్ సహా పలు దేశాల్ని కోరిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తరవాత భారత్ రెండో స్థానంలో ఉంది. -
సంపద కోల్పోవడంలోనూ ప్రపంచ కుబేరుడి అరుదైన రికార్డు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీగా పతనమవడంతో ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారీగా సంపద కోల్పోయారు. గడిచిన రెండు రోజులుగా ఆయన 19.2 బిలియన్ డాలర్లు(సుమారు 1.40 లక్షల కోట్ల రూపాయలు) నష్టపోయారని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 16.5 బిలియన్ డాలర్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంపద కోల్పోవడంలోనూ జెఫ్ బెజోస్ కొత్త రికార్డు సృష్టించారని నివేదిక పేర్కొంది. సోమవారం నాడు అమెరికా మార్కెట్ సూచీ భారీగా కుదుపులకు లోనవడంతో అమెజాన్ షేర్లు 6.3 శాతం మేర పడిపోయాయి. కాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ ఆర్థిక సంస్థ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రపంచంలోని 500 మంది టాప్ బిలియనీర్లు భారీగా సంపద కోల్పోతున్నారని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్‌లో జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. మెక్సికన్ టెలికాం టైకూన్ కార్లస్ స్లిమ్ 2.5 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయి రెండో స్థానాన్ని ఆక్రమించారు. -
భారీగా సంపద కోల్పోయిన ఆపిల్, టెస్లా సప్లయర్
బీజింగ్ : అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో చైనా బిలీయనీర్లు భారీగా సంపద కోల్పోతున్నారు. ఇప్పటికే అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా, టెన్సెంట్ హెల్డింగ్స్ సీఈఓ మా హుటేంగ్ బిలియన్ డాలర్లను కోల్పోగా.. లెన్స్ టెక్నాలజీ సహ వ్యవస్థాపకురాలు జో కున్‌ఫెయ్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరారు. చైనాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా గుర్తింపు పొందిన జో కున్‌ఫెయ్ 6.6 బిలియన్ డాలర్ల(660 కోట్ల రూపాయలు) సంపద కోల్పోయారని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాలు ఆమె మొత్తం సంపదలో 66 శాతం అని పేర్కొంది. సంపద కోల్పోతున్న చైనీయుల్లో ఆమె ప్రథమ స్థానంలో ఉన్నారని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. కాగా చైనాలోని హనన్ ప్రావిన్స్‌లో గల జియాంగ్ జియాంగ్ పట్టణంలో 1970లో జన్మించిన జో మొదట ఓ గ్లాస్ తయారీ కంపెనీలో పనిచేశారు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి లెన్స్ టెక్నాలజీని స్థాపించారు. 2015లో వ్యాపార కలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు టచ్స్క్రీన్లను అందిస్తోంది. అదే విధంగా ఆటోమొబైల్ దిగ్గజం టెస్లాకు అవసరమైన డిస్ప్లే ప్యానెళ్లను తయారుచేసి ఇచ్చేది. అయితే గత కొంత కాలంగా అమెరికా- చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్‌వార్ ముదురుతున్నకారణంగా లెన్స్ టెక్నాలజీ ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ప్రధాన కస్టమర్లైన రెండు కంపెనీలు అమెరికాకే చెందినవి కావడంతో జో భారీగా సంపద కోల్పోయారు. (చదవండి : చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్) -
ఆసియా కుబేరుడు అంబానీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కునెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 1.6 శాతం పెరిగి రూ.1,099.80 ఆల్‌టైమ్ హై స్థాయికి చేరింది. దీంతో అంబానీ సంపద 44.3 బిలియన్ డాలర్ల(దాదాపు 3.05 లక్షల కోట్లు)కు పెరిగి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. జాక్ మా సంపద విలువ 44 బిలియన్ డాలర్లు(3.03 లక్షల కోట్లు)గా ఉంది. ఈ ఏడాది ముకేశ్ అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లమేర పెరిగితే, జాక్ మా సంపద 1.4 బిలియన్ డాలర్లమేర హరించుకుపోయింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
అదానీ, అంబానీలు భారీగా కోల్పోయారు
న్యూఢిల్లీ : భారత టాప్ 20 బిలీనియర్లు తమ సంపదను భారీగా కోల్పోయారు. 2018 ప్రారంభం నుంచి వీరు తమ నికర సంపదలో 17.85 బిలియన్ డాలర్లు కోల్పోయినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ వెల్లడించింది. కేవలం టాప్ 5లో ఉన్నవారే 15 బిలియన్ డాలర్ల మేర సంపదను హరించుకున్నారని తెలిపింది. భారీగా సంపదను కోల్పోయిన వారిలో గౌతమ్ అదానీ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 3.68 బిలియన్ డాలర్ల హరించుకుపోయి 6.75 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ బాగా ప్రయోజనాలు పొందారని తెలిసింది. అయినప్పటికీ ఈ ఏడాది ప్రారంభం నుంచి మాత్రం ఆయనే ఎక్కువగా సంపదను కోల్పోయారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈ క్యాలండర్ ఏడాదిలో 7 శాతం నుంచి 45 శాతం వరకు నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పవర్, అదానీ ట్రాన్సమిషన్, అదానీ పోర్ట్స్ సెజ్ కలిపి కేవలం తమ నికర లాభాలను 13.76 శాతం మాత్రమే పెంచుకోగలిగాయి. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో అదానీ 242వ సంపన్నుడిగా ఉన్నారు. మరో బిగ్ లూజర్‌గా అజిమ్ ప్రేమ్‌జీ నిలిచారు. దేశంలో మూడో పెద్ద ఐటీ సంస్థగా పేరున్న విప్రో వాటా కలిగి ఉన్న ప్రేమ్‌జీ, కంపెనీ ఇటీవల గడ్డు పరిస్థితులను ఎదుర్కొనడంతో తన సంపదను కోల్పోయినట్టు బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ తెలిపింది. ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాక్ 16 శాతం వరకు పడిపోయింది. సన్ ఫార్మాస్యూటికల్స్ అధిపతి బిలీనియర్ దిలీప్ సంఘ్వి కూడా తన నికర సంపదలో 3.48 బిలియన్ డాలర్లు పోగొట్టుకుని, 9.34 బిలియన్ డాలర్లగా నమోదు చేసుకున్నట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ తెలిపింది. అంటే ఈయన సంపద కూడా 21 శాతం మేర కిందకి పడిపోయింది. సంఘ్వి ప్రస్తుతం బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో 153వ సంపన్నుడిగా ఉన్నారు. మరో దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా తన నికర సంపదలో 2.83 బిలియన్ డాలర్లను చేజార్చుకున్నారు. దీంతో ఈయన నికర సంపద 37.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం అంబానీ ఈ భూమిపైనే 21వ సంపన్న వ్యక్తిగా పేరు గడిస్తున్నారు. ఈ క్యాలెండర్ ఏడాదిలో రిలయన్స్ షేర్లు 1 శాతం మేర పడిపోవడంతో పాటు అంబానీ ప్రమోట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ షేర్లు 25 శాతం పడిపోవడం, అంబానీ వాటా కలిగి ఉన్న రెండు మీడియా సంస్థల షేర్లు క్షీణించడం దీనికి కారణమైనట్టు తెలిసింది. సంపదను కోల్పోయిన వారిలో కుమార్ బిర్లా, కేపీ సింగ్, సిప్రస్ పూనవాలా ఉన్నారు. -
అంబానీతో పాటు మరో నలుగురు..
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో తన సత్తా చాటారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ టాప్ 100 ఇండెక్స్‌లో అంబానీ 19వ స్థానంలో నిలిచారు. అంతేకాక ఆసియాలోనే మూడో అత్యంత ధనిక వ్యక్తిగా పేరొందారు. 38.3 బిలియన్ డాలర్లు(రూ.2,49,160 కోట్లకు పైగా) సంపదతో ముఖేష్ అంబానీ ఈ స్థానంలో నిలిచారని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీతో పాటు మరో నలుగురు భారతీయులు కూడా బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఆర్సెలర్‌మిట్టల్ సీఈవో లక్ష్మి మిట్టల్, షాపూర్జీ పల్లోంజి గ్రూప్ చైర్మన్ పల్లోంజి మిస్త్రీ, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్ నాడార్లు ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ టాప్ 500 ఇండెక్స్‌లో మొత్తంగా 24 మంది భారతీయులు ఉన్నట్టు తెలిసింది. గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 9.3 బిలియన్ డాలర్లు పెరిగింది. కాగ, ఈ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఉన్నట్టు తెలిసింది. అమెరికన్లను మినహాయిస్తే, కేవలం ఇద్దరు యూరోపియన్లు మాత్రమే ఈ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఒకరు జరా వ్యవస్థాపకుడు అమెంషియో ఓర్టెగా, రెండో వ్యక్తి లగ్జరీ బ్రాండు ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఆసియా నుంచి అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, టెన్సెంట్ కో-ఫౌండర్, సీఈవో పోనీ మా లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
అంబానీ చేయివేస్తే...
న్యూయార్క్ : ప్రపంచంలోని ఆయా దేశాల్లో అత్యంత సంపన్నులు తమ సొమ్ముతో ప్రభుత్వాలను ఎన్ని రోజులు నడిపించగలరని లెక్కలు తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. బ్లూమ్‌బర్గ్ రాబిన్‌హుడ్ ఇండెక్స్ 2018 ప్రకారం సంపన్నుల నికర ఆస్తులు, ఆయా దేశాల ప్రభుత్వాల రోజువారీ వ్యయంతో లెక్కగట్టి ఈ విశ్లేషణ చేపట్టారు. భారత్‌లో అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదతో 20 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపించగలరని వెల్లడైంది. సైప్రస్‌లో అత్యంత సంపన్నుడైన జాన్ ఫ్రెడ్రిక్సన్ ఏకంగా 441 రోజుల పాటు తమ ప్రభుత్వ ఖర్చులను గట్టెక్కించగలరని తేలింది. సైప్రస్‌లో తక్కువ జనాభా, పరిమిత వ్యయం ఉండటంతో సర్కార్ నిర్వహణ ఖర్చులు అక్కడ తక్కువగా ఉండటం గమనార్హం. ఇక జపాన్, పోలాండ్, అమెరికా, చైనాలో దిగ్గజ సంపన్నులకూ తమ ప్రభుత్వాలను ఈదడం అత్యంత క్లిష్టమైన వ్యవహారమే. చైనాలో అలీబాబా అధినేత ప్రపంచంలోనే 16వ అత్యంత సంపన్నుడు జాక్‌మా తన సంపదతో డ్రాగన్ సర్కార్‌ను కేవలం నాలుగు రోజుల పాటే నడిపించగలరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అమెరికా ప్రభుత్వాన్ని కేవలం అయిదు రోజులే ఆదుకోగలరని రాబిన్‌హుడ్ ఇండెక్స్ విశ్లేషిస్తే వెల్లడైంది. బ్రిటన్ సంపన్నుడు హ్యూ గ్రొస్వెనార్, జర్మనీలో డైటర్ స్కార్జ్లూ అపార సంపదతోనూ కొద్ది గంటలు మాత్రమే తమ ప్రభుత్వాలను ఆదుకోగలరు. -
నాలుగు కంపెనీలుగా ఎయిరిండియా
న్యూఢిల్లీ : నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మకానికి ముందే ఎయిరిండియాను నాలుగు కంపెనీలుగా విడదీయాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇలా విడదీసిన ప్రతి కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కింద కనీసం 51 శాతం ఆఫర్ చేయాలని చూస్తుందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. కోర్ ఎయిర్‌లైన్ బిజినెస్, రీజనల్ ఆర్మ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఇంజనీరింగ్ ఆపరేషన్లుగా విడదీయాలని ప్రభుత్వం చూస్తుందని రిపోర్టు పేర్కొంది. కోర్ ఎయిర్‌లైన్ బిజినెస్‌ల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, లో-కాస్ట్ ఓవర్సీస్ ఆర్మ్ ఉండనుంది. 2018 చివరి వరకు ఈ ప్రక్రియ ముగియనుందని జూనియర్ ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా చెప్పినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఇటీవలే ఎయిరిండియాలో విదేశీ కంపెనీలు 49శాతం పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదించిన వాటాల విక్రయ ప్రక్రియకు తుది విధివిధాలను మంత్రుల గ్రూప్ నిర్ణయిస్తోంది. త్వరలోనే బిడ్డర్లను కూడా ఆహ్వనించనున్నట్టు తెలుస్తోంది. కాగ, 55 వేల కోట్లతో ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్పటికే రూ.23 వేల కోట్లను భరించింది. -
ఏడాదికి ఆయనకు రూ.45వేల కోట్లు
లెజెండరీ అమెరికన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తెలిసే ఉంటుంది. ఆయన సంపద ఒక్కసారిగా ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల్లోకి ఎగిసింది. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం వారెన్ బఫెట్ మొత్తం సంపద 81.5 బిలియన్ డాలర్లు అంటే రూ.5.3 లక్షల కోట్లతో ఆల్-టైమ్ గరిష్టాలకు చేరుకున్నట్టు తెలిసింది. దీంతో బెర్క్ షైర్ హాత్వే చైర్మన్ ఆయన అత్యంత ధనికుల జాబితాలో మూడో స్థానంలోకి వచ్చేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అనంతరం వారెన్ బఫెట్ నిలిచినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. గత ఐదేళ్లలో వారెన్ బఫెట్ సంపద రూ.2.28 లక్షల కోట్లు పెరిగినట్టు తెలిపింది. అంటే ఏడాదికి రూ.45,684 కోట్లు ఆర్జించారని తెలిసింది. నెలకు రూ.8.68 లక్షలను, సెకనుకు రూ.14,467ను ఆయన ఆర్జిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో వెల్లడైంది. -
భారత ఆర్థికవ్యవస్థలో 10 శాతం వీరివద్దనే
న్యూఢిల్లీ : భారత ఆర్థికవ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు కోటి కోట్లకు పైగానే. ఈ కోటి కోట్లలో సుమారు 10 శాతం మేర సంపద, అంటే 200 బిలియన్ డాలర్లకు పైనా సంపద దేశంలోని టాప్-20 పారిశ్రామికవేత్తల దగ్గరే ఉన్నట్టు తెలిసింది. 2017 తొలి ఏడు నెలల కాలంలో వీరి సంపద అదనంగా 50 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌లో వెల్లడైంది. 18 మంది టాప్ ఇండియన్ బిలీనియర్లలో ప్రతి ఒక్కరూ ఈ ఏడు నెలల కాలంలో తమ సంపదను 1 బిలియన్ డాలర్లు(రూ.6400 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువగానే పెంచుకున్నారని ఈ ఇండెక్స్ తెలిపింది. ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాలతో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అదనంగా ఏకంగా 13 బిలియన్ డాలర్లను పెంచుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా అదానీ గ్రూపుకు చెందిన గౌతమ్ అదానీ, విప్రో అజిమ్ ప్రేమ్‌జీ, ఆర్కే దమానీ వంటి వారు బ్లూమ్‌బర్గ్ డేటాలో దూసుకుపోయినట్టు వెల్లడైంది. వీరి సంపద 3-4 బిలయన్ డాలర్ల మధ్యలో ఎగిసినట్టు ఇండెక్స్ తన రిపోర్టులో పేర్కొంది. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు తొమ్మిదేళ్ల గరిష్టంలో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియోను విజయవంతంగా ఈ ఇండస్ట్రీస్‌ను లాంచ్ చేయడంతో తమ, నమ్మకం మరింత పెరుగుతుందని గ్రూప్ చెబుతోంది. విప్రో ప్రమోట్చేస్తున్న అజిమ్ ప్రేమ్‌జీ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాను కలిగి ఉన్నారు. అంతేకాక ఎన్సీసీ, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, జేఎం ఫైనాన్సియల్ సంస్థల్లో అజిమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్ వాటాలను కలిగి ఉంది. వీటన్నింటితో ప్రేమ్‌జీ సంపద 3.8 బిలియన్ డాలర్లు ఎగిసి 16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖేష్ అంబానీ, ప్రేమ్‌జీ మాత్రమే కాక, దమానీ, గౌతమ్ అదానీ, ఉదయ్ కొటక్, కుమార్ మంగళం బిర్లా, పంకజ్ పటేల్, విక్రమ్ లాల్, లక్ష్మీ మిట్టల్, కేపీ సింగ్, అజయ్ పిరామిళ్, పల్లోజి మిస్త్రీ వంటి వారు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌కి ప్రతేడాది 2 బిలియన్ డాలర్లను అందిస్తున్నారు.