
ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ తరువాత స్థానంలో నిలిచారు.
షేర్.. హుషారు
శుక్రవారం ఒక్కరోజే ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో రియలన్స్ షేర్ వ్యాల్యూ 4 శాతం పెరిగి..అంబానీ సంపాదనకు మరో 3.7 బిలియన్ల డాలర్లు చేరినట్లైంది. దీంతో 92.9 బిలియన్ డాలర్లతో వరల్డ్ వైడ్ బిలియనీర్ జాబితాలో 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయరన్‌ను వెనక్కి నెట్టారు. 92.60 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అపర కుబేరుడు వారెన్ బఫెట్ 103 బిలియన్ డాలర్లతో 10వస్థానంలో ఉన్నారు.
కలిసొచ్చిన కామెంట్స్
దేశీయ ఆన్‌లైన్ కామర్స్ మార్కెట్‌లో మరింత పట్టు కోసం రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్‌ఆర్‌వీఎల్) అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ వాటాల్ని కొనుగోలు చేసినట్లు గురువారం తెలిపింది.
ఈ ప్రకటన చేసిన మరుసటి రోజు (శుక్రవారం) నేషనల్ షాక్ ఎక్ఛేంజీలో 4.5 శాతానికి ఎగసి జీవితకాల గరిష్ట స్థాయిల్ని టచ్ చేయడంతో రియలన్స్ షేరు రూ .2,389.65 వద్ద ముగిసింది. దీంతో పాటు 'గ్రీన్ ఎనర్జీ' ద్వారా 100గిగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించడంతో రిలయన్స్ కు కలిసొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment