ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్‌లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.
షేర్ మార్కెట్‌లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.
ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్‌వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌లను దెబ్బతీసింది.
Comments
Please login to add a commentAdd a comment