LOSES
-
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్‌లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్‌వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయం
సైబర్ మోసానికి సంబందించిన మరో కేసు తెరమీదకు వచ్చింది. ముంబైకి చెందిన 59 ఏళ్ల రైల్వే అధికారి ఏకంగా రూ. 9 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంతకీ ఇదెలా జరిగింది? ఇలాంటి సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)లో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్)గా పని చేస్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌కు సెప్టెంబర్ 16న వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో జీరో ప్రెస్ చేయకుంటే మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతుందని ఉండటంతో.. అతడు జీరో ప్రెస్ చేశారు.జీరో ప్రెస్ చేయగానే వీడియో కాల్ కనెక్ట్ అయింది. అవతలి వ్యక్తి తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నారు. తనపైన (బాధితుడి మీద) మనీ ల్యాండరింగ్ కేసు నమోదైనట్లు, ఒక నకిలీ జడ్జి ద్వారా చెప్పించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ. 9 లక్షలు పంపించకుంటే చర్య తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించారు.కేసు నిజమేనేమో అని భయపడిన బాధితుడు తన ఖాతా నుంచి రూ. 9 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత పూర్తిగా మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటేటెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి మేము అధికారులము అని చెప్పినా.. మీకు సంబంధించిన వివరాలను అడిగినా.. నిర్థారించుకోకుండా వెల్లడించకూడదు. అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినట్లయితే.. పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు వెల్లడించాలి. తెలియని లేదా అనుమానాస్పద వాయిస్ మెసేజస్ లేదా టెక్స్ట్ మెసేజస్ వంటి వాటికి స్పందించకూడదు. -
ఇండియా కూటమికి ఎదురుదెబ్బలు?
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎంపీలోని ప్రముఖ ఖజురహో స్థానం నుండి ఇండియా అలయన్స్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఖజురహో లోక్‌సభ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీకి కేటాయించింది. ఇప్పుడు సమాజ్‌వాదీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇండియా కూటమికి నష్టమని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీడి శర్మ ఖజురహో స్థానం నుండి గిలిచి ఎంపీ అయ్యారు. ఈ విధంగా చూస్తే ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ఒక స్థానాన్ని కోల్పోయినట్లయ్యింది. ఇండియా అలయన్స్ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ సహా నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పన్నా సురేష్ కుమార్ ఈ విషయమై మాట్లాడుతూ ఎస్పీ అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ పత్రాలలో సంతకాలు లేవన్నారు. అలాగే ఓటరు జాబితా కాపీ కూడా లేదన్నారు. పలు కారణాలతో ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొత్తం నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయని తెలిపారు. ఖజురహో సీటుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ ఇద్దరు అభ్యర్థులను మార్చింది. మొదట మనోజ్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. రెండు రోజుల తర్వాత మనోజ్ యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మీరా యాదవ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పుడు మీరా యాదవ్ నామినేషన్ రద్దు కావడంతో కాంగ్రెస్, ఎస్పీల ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. -
పర్సు పక్కన పెట్టి క్రికెట్.. రూ. 6.72 లక్షలు గోవిందా!
ముంబై: పర్సు పక్కన పెట్టిన క్రికెట్ ఆడిన వ్యక్తి రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేకుంది. దక్షిణ ముంబైలోని క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన 28 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ తన క్రెడిట్, డెబిట్ కార్డులు దొంగతనానికి గురై రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మార్చి 30 న జరిగిన ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి చెప్పారు. ఎలా జరిగిందంటే.. ముంబై క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన బాధితుడు వివేక్ దవే క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్న వ్యాలెట్, మొబైల్ ఫోన్ సహా ఇతర వస్తువులను పక్కన పెట్టి ఆటలో నిమగ్నమయ్యాడు. ఆట ముగించుకుని బోరివలికి రైలులో ఇంటికి వెళుతుండగా తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ లావాదేవీ సందేశాలను గమనించాడు. వాటి ప్రకారం అతని బ్యాంక్ ఖాతా నుండి సుమారు లక్ష రూపాయలు కట్ అయ్యింది. దుండగులు అతని క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 5 లక్షలకు పైగా కొనుగోళ్లు చేసినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, బాధితుడు మూడు గంటల పాటు క్రికెట్ ఆడుతుండగా, గుర్తు తెలియని నిందితులు అతని క్రెడిట్, డెబిట్ కార్డులను దొంగిలించారు, ఏటీఎం నుండి రూ. 1 లక్ష నగదును విత్‌డ్రా చేశారు. నాలుగు నగల దుకాణాల్లో షాపింగ్ చేశారు. దీంతో బాధితుడు ఆ నగల దుకాణాలను సంప్రదించగా వారు సీసీ ఫుటీజ్ అందించారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇన్ఫోసిస్‌కి భారీ షాక్! రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్
దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కి భారీ షాక్ తగిలింది. గ్లోబల్ కంపెనీతో చేసుకున్న సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ భారీ ఒప్పందం ఈఏడాది సెప్టెంబర్‌లో ఖరారైంది. 15 సంవత్సరాల కాలానికి చేసుకున్న ఈ డీల్ ప్రారంభంలోనే ముగిసిపోవడం ఐటీ సేవల రంగంలో క్లయింట్ల డిమాండ్, సాంకేతిక బడ్జెట్లలో పెరుగుతున్న అనిశ్చితిని తెలియజేస్తోంది. ఇదీ చదవండి: ...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు “గ్లోబల్ కంపెనీతో ఎంఓయూకి సంబంధించి 'కంపెనీ అప్డేట్' పేరుతో 2023 సెప్టెంబర్ 14 నాటి ఇన్ఫోసిస్ ప్రకటనకు ఇది కొనసాగింపు. గ్లోబల్ కంపెనీ ఇప్పుడు ఎంవోయూను రద్దు చేయడానికి నిర్ణయించింది. దీంతో ఇరు పక్షాలు మాస్టర్ అగ్రిమెంట్‌ను అనుసరించడం లేదు” అని కంపెనీ డిసెంబర్ 23న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సీఎఫ్‌వో రాజీనామా చేసిన రెండు వారాల్లోనే.. కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఆకస్మికంగా వైదొలిగిన రెండు వారాల లోపే ఈ భారీ డీల్ క్యాన్సిల్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ మెరుగైన డిజిటల్ సేవలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందించడానికి గ్లోబల్ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు సెప్టెంబర్ 14న ప్రకటించింది. -
డాక్టర్‌కు షాకిచ్చిన సమోసాలు.. రూ.1.40 లక్షలకు టోకరా!
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఒక వైద్యుడు ఆన్లైన్లో సమోసాలు ఆర్డర్ చేసి మోసపోయారు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి, రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఉదంతం సాయన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కేఈఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న 27 ఏళ్ల వైద్యుడు తనకు ఎదురైన మోసంపై బోయివాలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్నేహితులతో పిక్నిక్ ప్లాన్ మోసపోయిన వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఆయన ఇటీవల ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆన్లైన్లో సమోసాలను ఆర్డర్ చేశారు. అయితే అప్పుడు తాను 25 ప్లేట్ల సమోసాల కోసం రూ.1.40 లక్షలు కోల్పోతానని గ్రహించలేకపోయారు. ఆయన తన స్నేహితులతో పాటు పిక్నిక్కు ప్లాన్ చేసుకున్నారు. ‘గురుకృప’కు ఫోన్ చేసి.. ఈ నేపధ్యంలో ప్రయాణంలో తినేందుకు ఏదైనా ఉండాలని భావించి, సమోసాలు ఆర్డర్ చేశారు. ఆయన గురుకృప రెస్టారెంట్‌కు ఫోన్ చేసి, 25 ప్లేట్ల సమోసాలను ఆర్డర్ చేశారు. ఇందుకోసం రూ.1500 పేమెంట్ చేయాలంటూ అటువైపు వారు సమాధానమిచ్చారు. పేమెంట్ అందలేదంటూ.. వారు చెప్పిన నంబరుకు డాక్టర్ రూ.1500 ట్రాన్స్ఫర్ చేశారు. కొదిసేపటి తరువాత ఆ వైద్యునికి తిరిగిఫోన్ వచ్చింది. వారు తమకు పేమెంట్ అందలేదని, మరో నంబరుకు పేమెంట్ చేయాలంటూ ఆ నంబర్ తెలిపారు. అలాగేవారు పేమెంట్ రిక్వస్ట్ లింక్ కూడా పంపారు. వెంటనే డాక్టర్ ఆ లింక్ ద్వారా పేమెంట్ చేశారు. ఇది జరిగిన కొద్ది నిముషాలకు డాక్టర్ ఖాతా నుంచి రూ.28 వేలు కట్ అయ్యాయి. బ్యాంక్ ఖాతా బ్లాక్ చేయించి.. ఇది చూసిన డాక్టర్ కంగుతిన్నారు. కొద్దిసేపటికి తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మూడు సార్లు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వైద్యుడు బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయించారు. అయితే అప్పటికే ఆయన ఖాతాలోని రూ.1.40 లక్షలను మోసగాళ్లు స్వాహాచేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: ఎంతటి సంపన్నుడయినా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా? నమ్మితే అంతే! -
లూడో గేమ్‌లో ఓటమి.. తనను తాను కుదువ పెట్టుకున్న మహిళ!
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. చుట్టుపక్కల పరిస్థితులను మర్చిపోయేంతలా అందులో లీనమైపోతున్నారు. సమయం సందర్భం లేకుండా సోషల్ మీడియాను విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ జూద వ్యసనంతో తనను తాను కుదవపెట్టుకుంది. పందెంలో యజమాని చేతిలో ఓడిపోవడంతొ అతనికి సొంతం అయిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రతాప్‌గఢ్‌లోని కొత్వాలి నగర్ దేవ్ కలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి రేణు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆరు నెలల క్రితం భర్త పనికోసం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు. అక్కడే ఇటుకలు తయారు చేసే కార్మికుడిగా పని చేస్తున్నాడు. అక్కడి నుంచి భార్యకు నిత్యం డబ్బులు పంపేవాడు. భర్త ఇచ్చిన డబ్బుతో వివాహిత తన ఇంటి యజమానితో రోజూ ఆన్లైన్ గేమ్ లూడోకు ఆడేది. మెల్లమెల్లగా ఆమె ఆ ఆటకు బానిసగా మారిపోయింది. అలా ఓ రోజు ఇద్దరి కలిసి ఆడుతూ పందెం వేసుకున్నారు. ఈ క్రమంలో మహిళ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక యజమానికి తనను తాకట్టు పెట్టి మరీ లూడో ఆడింది. తనపై తానే పందెం కాసిన ఈ ఆటలోనూ మహిళ ఓడిపోవడంతో చివరికి యజమాని దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో షాక్‌కు గురైన ఆమె భర్త ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నిత్యం జూదం, ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెట్టింగ్‌లో ఓడిపోవడంతో తన భార్య ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవిస్తోందని తెలిపాడు. అతన్ని విడిచిపెట్టి రావాలని కోరగా.. అందుకు ఆమె ఒప్పుకోవడం లేదని వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి -
వ్యాపారవేత్తకు భారీ షాక్: రూ. కోటి ఖాళీ, ఏం జరిగిందంటే?
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు హద్దే లేకుండా రోజురోజుకు మితిమీరుతున్నాయి. టెక్నాలజీ తెలియని అమాయక ప్రజలనే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ కోట్లను దోచేస్తున్నారు. తాజాగా ఒక వ్యాపారవత్త మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి కోటి రూపాయలను మాయం చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని థానే నగరంలో వ్యాపారవేత్త ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్‌ను హ్యాకింగ్ గురైందనీ, ఆ తరువాత రూ. 99.50 లక్షలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఈ నెల 6-7 తేదీల మధ్య వ్యాపారవేత్త ఫోన్ హ్యాక్ చేసి మరీ, బ్యాంకు ఖాతాలోని సొమ్మును నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇతర ఖాతాలకు తరలించారని వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ సర్కార్
-
నష్టాల్లో హైదరాబాద్ ‘మెట్రో’ సాయం చేయండి..
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా మెట్రో రవాణా నష్టాల్లో నడుస్తోందని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్అండ్ టీ ప్రతినిధులు సీఎం కె.చంద్రశేఖర్‌రావును కోరారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవాణా అంశంపై చర్చించేందుకు శుక్రవారం ప్రగతి భవన్లో ఎల్అండ్టీ సంస్థ సీఈవో, ఎండీ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వారి అభ్య ర్థనపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎల్అండ్టీ సంస్థకు ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ అంశంపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. -
కుప్పకూలిన ప్రభుత్వం: విశ్వాసం కోల్పోయిన ఓలి
ఖాట్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేటీ శర్మ ఓలి పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్ష కోల్పోయింది. అనుకూలంగా 96 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. 15 మంది ఎంపీలు ఎటువైపు లేరు. ప్రభుత్వానికి కావాల్సిన 136 మంది ఎంపీల మద్దతు లేకపోవడంతో ఓలీ ప్రభుత్వం పడిపోయింది. నేపాల్ పార్లమెంట్లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసర కాగా సీపీఎన్-యూఎంఎల్‌కు 121 మంది సభ్యులు ఉన్నారు. అయితే పుష్పకమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మద్దతు ఉపసంహరించుకుంది. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం ఉండగా మద్దతు కూడగట్టుకోవడంలో ఓలి విఫలమయ్యారు. దీంతో పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయారు. సోమవారం సాయంత్రం జరిగిన చర్చలో ఓలి తాను ప్రధానిగా చేసిన పనులు, సాధించిన విజయాలు.. లక్ష్యాలు తదితర అంశాలు పార్లమెంట్లో వివరించారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ చైర్పర్సన్ పుష్పకమల్ దహల్ విశ్వాస పరీక్షపై మాట్లాడారు. ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. మిగతా జనతా సమాద్‌వాది పార్టీ నాయకులు మహతో ఠాకూర్, ఉపేంద్రయాదవ్ విశ్వాస తీర్మానంపై మాట్లాడారు. విశ్వాసం కోల్పోవడంతో నేపాల్‌లో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్ -
అంతెత్తున పేరుకున్న చెత్త, అయినా వెడ్డింగ్ రింగ్ కోసం..
లండన్: వివాహ బంధంలో వెడ్డింగ్ రింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అవి భార్యభర్తల మధ్య ప్రేమకు ప్రాతినిథ్యం వహిస్తాయి. అయితే ఓ వ్యక్తి సరిగ్గా ప్రేమికుల రోజునే తన వెడ్డింగ్ రింగ్ పొగొట్టుకున్నాడు. భార్యకు ఏం చెప్పాలో.. రింగ్ ఎక్కడ పోయిందోనని తెగ గాబరాపడ్డాడు. చివరకు మున్సిపల్ సిబ్బంది చొరవడంతో ఉంగరాన్ని వెతికి పట్టుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. వివరాలు.. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ రాస్కు 2009లో లారాతో వివాహామైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు. పెళ్లై ఇన్నేళ్లవుతున్న రాస్ ఈ తన పెళ్లి ఉంగరాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎప్పుడూ దానిని చేతి వేలికి ధరించే ఉంటాడట. ఈ క్రమంలో ప్రేమికుల రోజున ఉదయాన్నే మున్సిపాలిటీ వాహనం రాగానే ఇంట్లోని చెత్తను అందులో పడేశాడు. తిరిగి ఇంట్లోకి వెళ్లి తన పనుల్లో మునిగిపోయాడు. అయితే, కాసేపయ్యాకు చూసుకుంటే వేలికి ఉండే ఉంగరం మాయమైంది. అది చూసి రాస్ షాకయ్యాడు. ఏమైందో తెలియక తెగ కంగారు పడ్డాడు. తను ఏమేం పనులు చేశాడో గుర్తు చేసుకున్నాడు. చెత్త వేసి వచ్చాకే ఉంగరం మిస్సయిందన్న విషయం తెలుసుకుని వెంటనే పరుగెత్తుకెళ్లాడు. అయితే అప్పటికే మున్సిపాలిటీ వాహనం ఆ కాలనీ నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా పోలీసు అధికారినికి తన గోడు చెప్పుకున్నాడు. ఆమె స్పందించి ఆ వాహనాన్ని వెంబడించింది. మున్సిపాలిటీ సిబ్బందికి జరిగిన విషయం చెప్పి ఉంగరం వెతకమని నలుగురు మున్సిపాలిటీ సిబ్బందిని కోరింది. దీంతో వారు వాహనంలో ఉంగరం వెతకడం ప్రారంభించారు. అంతెత్తున పేరుకున్న చెత్తలో దాదాపు 20 నిమిషాలు వెతికి ఉంగరాన్ని కనిపెట్టి రాస్కు ఇచ్చారు. దీంతో అతడు ప్రాణం లేచివచ్చినంతగా ఆనందపడ్డాడు. మళ్లీ తన ఉంగరం దొరుకుతుందని అనుకోలేదంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక ఈ విషయాన్ని బ్రిటిన్ మున్సిపాలిటీ అధికారులు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో సదరు సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే దీనిపై రాస్ స్పందిస్తూ.. ‘అసలు రింగ్ దొరుకుతుందని అనుకోలేదు. వాలెంటైన్స్ డే నాడే వెడ్డింగ్ రింగ్ పోయిందన్న విషయం నా భార్యకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నా ప్రాణం పోయినంత పనైంది’ అంటూ అతడు పోస్టు చేశాడు. అయితే ఈ ఉంగరం అతడికి ఎందుకంత ప్రత్యేకమో కూడా వివరించాడు. ఆ ఉంగరంపై తన భార్య రాసిన అక్షరాలు ఉన్నాయని, అవి లేజర్ ద్వారా సెట్ చేసినట్లు చెప్పాడు. అందుకే ఈ ఉంగరం తనకు చాలా ప్రత్యేకమని రాస్ చెప్పాడు. -
రిలయన్స్‌కు చమురు షాక్
సాక్షి, ముంబై: కోవిడ్-19 వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఆందోళనల కారణంగా స్టాక్‌మార్కెట్ల భారీ పతనానికి తోడు, సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ షాక్ ఆయిల్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)ను భారీగా తాకింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆర్ఐఎల్ షేరు 12 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా సోమవారం అత్యంత ఘోరంగా పడిపోయింది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్ఈలో 13.65 శాతం పతనమై రూ.1,094.95 కు చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 18శాతం కోల్పోయింది. తత్ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా భారీగా నష్టపోయి రూ. 7 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ క్యాప్ పరంగా ఐటీ మేజర్ టీసీఎస్ రూ .7.31 లక్షల కోట్లతో టాప్‌లోకి వచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా రూ .10 లక్షల కోట్లను అధిగమించి తొలి కంపెనీగా అవతరించిన ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం, 2019 డిసెంబర్లో సాధించిన రికార్డు స్థాయిల నుంచి రూ .2.7 లక్షల కోట్లకు పైగా పడిపోయింది. గత ఏడాది డిసెంబరులో ఆర్ఐఎల్ షేరు రూ .1,617 వద్ద 52 వారాల గరిష్ట స్థాయి తాకింది. అప్పటి నుండి ఇది 522 పాయింట్లు లేదా 32 శాతం కుప్పకూలింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు చ రిత్రలో ఎన్నడూ లేని విధంగా రోజు నష్టాన్ని నమోదు చేసింది. కీలక సూచీ సెన్సెక్స్ 2,450 పాయింట్లు, నిఫ్టీ 6.15శాతం కుప్పకూలింది. ముడి చమురు ధరలు 29 ఏళ్ల కనిష్టానికి పడిపోవడంతో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రభుత్వ రంగ ఆయిల్ స్టాక్స్ 13 శాతం ఎగియడం గమనార్హం. -
గంటకు దాదాపు రూ.రెండున్నర కోట్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం తరచూ ఇంటర్నెట్ను నిలిపివేయడం వల్ల నెట్వర్క్ కంపెనీలు భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. గంటకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు నష్టపోతున్నట్టు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ శుక్రవారం వెల్లడించారు. సీవోఏఐలో ఎయర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు సభ్యులుగా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోనలు మరింత పెరగకుండా ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని 18 జిల్లాల్లో 24 గంటల పాటు ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో టిక్‌టాక్, ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా వదంతులు వ్యాప్తిచెందడాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వ వర్గాల విశ్లేషణ. ఓ అధ్యయనం ప్రకారం ఇండియాలో సగటు ఇంటర్నెట్ వినియోగం నెలకు 10 జీబీ. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాకుండా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా యాప్‌లకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన డేటా వినియోగం ప్రకారం టెల్కోలకు జరుగుతున్న నష్టాన్ని లెక్కిస్తే ఇంచుమించుగా గంటకు రెండున్నర కోట్లుగా తేలిందని రాజన్ వివరించారు. మరోవైపు సీఏఏపై వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తరచూ నెట్ సేవలను నిలిపివేయడంపై నెట్ ప్రియులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కేనన్న కేరళ హైకోర్టు తీర్పును వారు ఉటంకిస్తున్నారు. చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్ @ 100 లోయలో ఇంటర్నెట్ ఎప్పుడు? -
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావం
మూడు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించవద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 329 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 248 పాయింట్లు పతనమై 39,502 పాయింట్ల వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 11,861 పాయింట్ల వద్ద ముగిశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీ ఘన విజయం నేపథ్యంలో గత మూడు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్లో క్లోజవుతున్నాయి. ఈ రికార్డ్ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని, బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయని నిపుణులంటున్నారు. తగ్గుతున్న బాండ్ల రాబడులు... మూడు నెలల అమెరికా బాండ్ల రాబడులు కన్నా, పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గాయి. ఇది మాంద్యానికి సూచన అని విశ్లేషకులంటున్నారు. మరోవైపు అమెరికా–చైనాల మధ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం కూడా ప్రభావం చూపడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. భారత్‌లో కూడా బాండ్ల రాబడులు తగ్గాయని, ఆర్బీఐ వచ్చేవారంలో కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలు దీనికి కారణమని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. అమెరికా, భారత్‌ల్లో బాండ్ల రాబడులు తగ్గుతుండటంతో మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు అభివృద్ది చెందిన దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 347 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఒక దశలో 18 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 329 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 347 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► ఇటీవలే జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన ఎస్బీఐలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ షేర్ 3.2 శాతం నష్టపోయి రూ.348 వద్ద ముగిసింది. త్వరలోనే ఈ బ్యాంక్ క్యూఐపీ విధానంలో రూ.15,000–18,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదన్న వార్త కూడా ప్రభావం చూపింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ ర్యాలీ నెలే! ఈ ఏడాది చివరి కల్లా సెన్సెక్స్ 42,000 పాయింట్లకు చేరగలదన్న గతంలో వెల్లడించిన లక్ష్యాలను ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ, బీఎన్పీ పారిబా కొనసాగించింది. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన ర్యాలీ నెల రోజుల్లో సమసిసోతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
మైలేజీ తక్కువ.. డ్యామేజీ ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్ : ప్రతి రెండున్నర కిలోమీటర్లకు లీటర్ డీజిల్ తాగుతున్నాయి ఆ బస్సులు.. లాభాల సంగతి దేవుడెరుగు!! ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ.20 వరకు నష్టం మిగులుతోంది. ఆ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే ఆర్టీసీ ఖజానా అంతగా ఖాళీ అవుతోంది. వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టుగా మింగేస్తూ గుదిబండగా మారాయి. ఎట్టకేలకు కళ్లు తెరచిన ఆర్టీసీ యాజమాన్యం ఆ కేటగిరీలోని ఏసీ బస్సులను ఉపసంహరించాలని నిర్ణయించింది. కానీ అదే కేటగిరీలోని నాన్ ఏసీ బస్సులను మాత్రం కొనసాగించనుంది. వాటిని కనిష్టంగా 10 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతామంటూ తొలుత తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వాటిని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. నాటి యూపీఏ ప్రభుత్వంలోని కొందరు నేతల కమీషన్ల కక్కుర్తితో ఆర్టీసీకి బలవంతంగా అంటగట్టిన లోఫ్లోర్ బస్సుల కథే ఇది. ఆది నుంచీ అంతే.. పెద్ద నగరాల్లో ప్రీమియం కేటగిరీ బస్సులు తిప్పాలని నిర్ణయించిన నాటి యూపీఏ ప్రభుత్వం.. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద హైదరాబాద్‌కు 100 వరకు లో ఫ్లోర్ బస్సులను అందజేసింది. స్థానికంగా కంపెనీల నుంచి చాసిస్ కొని ఆర్టీసీనే సొంతంగా బస్‌బాడీ రూపొందించుకునే వెసులుబాటు ఉన్నా.. కొందరు రాజకీయ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం బస్సులు కొనిపించి సరఫరా చేశారు. లో ఫ్లోర్ బస్సులు పెద్ద వయసు వారికి, వికలాంగులకు సౌకర్యంగా ఉంటాయని చెప్పి అంటగట్టారు. కానీ తయారీలో లోపాలతో అవి ఆది నుంచి ఆర్టీసీకి పెద్ద గుదిబండగా మారాయి. ఎట్టకేలకు ఏసీ బస్సుల ఉపసంహరణ లో ఫ్లోర్ కేటగిరీలో ప్రస్తుతం 30 వరకు ఏసీ బస్సులు తిప్పుతున్నారు. భారంగా మారటంతో వాటిని ఉపసంహరించాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించింది. అవి ఇప్పటికే 5 లక్షల కిలోమీటర్ల మేర తిరగటంతో 20 వరకు బస్సులను షెడ్డుకు పరిమితం చేశారు. కానీ నాన్ ఏసీ బస్సులను మాత్రం 10 లక్షల కిలోమీటర్ల వరకు తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై ఇప్పుడు డిపో మేనేజర్లు గగ్గోలు పెడుతున్నారు. తాము ఎంత పకడ్బందీగా పనిచేసి ఆదాయాన్ని పెంచినా, ఈ బస్సుల వల్ల చివరకు నష్టాలే మిగులుతున్నాయని, వాటిని కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టాలు ఇలా.. సాధారణంగా సగటు ఆర్డినరీ బస్సు లీటర్ డీజిల్‌కు 4.8 కి.మీ. నుంచి 5 కి.మీ. వరకు మైలేజీ ఇస్తోంది. అదే ఏసీ బస్సు 3 కి.మీ. మేర ఇస్తోంది. కానీ లో ఫ్లోర్ నాన్ ఏసీ బస్సులు మాత్రం కేవలం 2.5 కి.మీ. మైలేజీ మాత్రమే ఇస్తున్నాయి. అంటే సాధారణ ఆర్టీనరీ బస్సుతో పోలిస్తే డీజిల్ ఖర్చు రెట్టింపవుతోంది. వీటి తయారీ, బస్బాడీలో లోపాల వల్ల నిర్వహణ సమస్య తీవ్రంగా ఉంటోంది. ప్రతినెలా బస్సును పూర్తిగా మెయింటెనెన్స్ సర్వీస్ చేస్తేగాని బస్సు రోడ్డెక్కని పరిస్థితి. బస్సు వెనుక వైపు ఇంజిన్ ఇండే ఈ తరహా బస్సుల విడిభాగాల ఖరీదు చాలా ఎక్కువ. సాధారణ బస్సులకు 24 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తున్నారు. ప్రతిసారి 10.5 లీటర్ల ఆయిల్‌ను నింపుతారు. కానీ లో ఫ్లోర్ బస్సులకు 9 వేల కిలోమీటర్లకు ఓసారి మార్చాల్సి వస్తోంది. ప్రతిసారి 16.5 లీటర్ల మేర పోయాల్సి వస్తోంది. సాధారణ బస్సుల్లో 44 సీట్లు ఉంటుండగా వీటిలో కేవలం 32 సీట్లు మాత్రమే ఉంటున్నాయి. ఇవి డీలక్స్ కేటగిరీ బస్సులు కావడటంతో టికెట్ ఖరీదు ఎక్కువ. దీంతో ప్రయాణికులు వీటిని తక్కువగా వాడుతున్నారు. వెరసి టికెట్ ఆదాయం కూడా చాలా తక్కువ. ఎయిర్ సర్క్యులేషన్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. వారానికోసారి విడిభాగాలు చెడిపోయి మార్చాల్సి వస్తోంది. ఈ బస్సుల నుంచి విపరీతమైన పొగ వెలువడుతోంది. క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నా, తయారీలో లోపాల కారణంగా పొగను నియంత్రించటం సాధ్యం కావటం లేదు. -
అకాల వర్షం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అకాల వర్షం మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో అపార నష్టం కలిగించింది. మామిడి రైతులు భారీగా నష్టపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అదివారం వరకూ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సోమవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. చింతలపూడి మండలం యర్రంపాలెంలో పిడుగుపడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామానికి చెందిన తగరం దిలీప్ (14) మృత్యువాత పడ్డాడు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో పిడుగుపడి జంపన రామకృష్ణరాజు అనే వ్యక్తికి చెందిన తాటాకిల్లు కాలిపోయింది. ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కాలిపోయాయి. నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో కసుకుర్తి ప్రేమశేషారావు అనే రైతుకు చెందిన కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో రెండు చెట్లు కాలిపోయాయి. ఎస్సీ కాలనీలో 10 టీవీలు దగ్ధమయ్యాయి. కొందరి ఇళ్లల్లో కేబుల్ టీవీకి సంబంధించిన సెటాప్ బాక్స్‌లు మాడిపోయాయి. చింతలపూడి సెక్షన్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సుమారు 40 స్తంభాలు పడిపోయినట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో మామిడి, అరటి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. టి.నర్సాపురం మండలంలో మామిడికాయలు రాలిపోయాయి, ఆయిల్‌పామ్, అరటి తోటలు దెబ్బ తిన్నాయి. జీలుగుమిల్లి, పోలవరం, బుట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పోలవరం, కొయ్యలగూడెంలో మొక్కజొన్న, చింతలపూడి, బుట్టాయగూడెం, జీలుగువిుల్లి, కామవరపుకోట మండలాల్లో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. జీలుగువిులి్ల–దేవరపల్లి మధ్య జాతీయ రహదారిపై చెట్లు నేలకొరి గాయి. రౌతుగూడెంలో విద్యుత్ స్తంభాలు కూలిపోగా, దర్భగూడెం వద్ద తాడి చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. టి.నర్సాపురం, శ్రీరామవరం తదితర గ్రామాల్లో నిమ్మతోటలు పక్కకు వాలిపోయాయి. ఈదురుగాలులకు మామిడి రైతులతోపాటు వేరుశనగ, మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లింది. డెల్టాలోనూ.. తాళ్లపూడిలో మొక్కజొన్న పొత్తులు, ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పెనుమంట్ర మండలం ఇలింద్రపర్రు, జుత్తిగ, బ్రాహ్మణచెరువు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లోను, ఆచంట మండలం ఆచంట, వల్లూరు, కరుగోరుమిల్లి గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లోను కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. వాతావరణంలో మార్పుల వల్ల నరసాపురం ప్రాంతంలో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఇంకా 1,500 ఎకరాల్లో వరికోతలు పూర్తి కాలేదు. నియోజకవర్గంలో సుమారు 300 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా కాయలు రాలిపోయాయి. నష్టం విలువను అంచనా వేసే పనిలో ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. -
డాలర్ బలం: ప్రపంచ కరెన్సీలు బేర్
న్యూఢిల్లీ: ఫెడ్ వడ్డీరేట్ల పెంపుతో ప్రపంచ కరెన్సీలు నీరసించాయి. ముఖ్యంగా దేశీయ కరెన్సీ రూపాయి ఒక్కసారిగా కుదేలైంది. ఫెడ్ వడ్డీ రేటు పావుశాతం వడ్డనతో దేశీయ కరెన్సీలతోపాటు ఇతర ప్రపంచ కరెన్సీలు కూడా పతనమయ్యాయి. డాలర్ బలం, దేశీయ మార్కెట్ల బలహీనత రూపాయిని మరింత దెబ్బతీశాయని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మరోవైపు విదేశీ మదుపర్ల అమ్మకాలు కూడా రూపాయిపై ఒత్తిడి పెంచాయన్నారు. అమెరికా ఫెడ్ పావు శాతం పాయింట్ వడ్డీ రేటు పెంచిన నేపథ్యలో డాలర్ కు డిమాండ్ పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ కరెన్సీ డాలర్ పుంజుకుంది. దీంతో రూపాయి 43పైసలు నష్టపోయి మళ్లీ 67.86 స్థాయికి పడిపోయింది. చివరికి 39 పైసల నష్టానికి పరిమితమైంది. ఇంట్రాడేలో రూపాయి రూ.67.87 67.71 మధ్య ట్రేడ్ అయింది. చైనా కరెన్సీ యెన్ కూడా ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అటు డాలర్ బలం, ఇటు బ్రిటన్ కేంద్ర బ్యాంకు ప్రకటనతో పౌండ్ కూడా రికార్డు కనిష్టాన్ని నమోదుచేసింది. కాగా బుధవారం ముగిసిన పాలసీ సమీక్షలో ఫెడ్ వడ్డీ రేటును పావు శాతం పెంచడంతోపాటు ఇకపై రెండేళ్లపాటు ఏడాదికి కనీసం మూడుసార్లు రేట్లను పెంచే వీలున్నట్లు సంకేతమివ్వడంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో మార్కెట్లో అప్రమత్తత కొనసాగింది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. -
క్వాలియింగ్‌లో కశ్యప్ ఓటమి
ఒడెన్‌స: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్లో ప్రపంచ 92వ ర్యాంకర్ కశ్యప్ 13-21, 21-8, 20-22తో ప్రపంచ 47వ ర్యాంకర్ రౌల్ మస్ట్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్లును వృథా చేశాడు. ఒకదశలో 14-19తో వెనుకబడిన కశ్యప్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 20-19తో విజయానికి ఒక పాయింట్లు దూరంలో నిలిచాడు. అయితే రౌల్ మస్ట్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి కశ్యప్ ఓటమిని ఖాయం చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో సింధు, సాయిప్రణీత్, జయరామ్, ప్రణయ్ బరిలోకి దిగనున్నారు. -
అధికారుల నిర్ణయాలతోనే నష్టాలు
► ఆర్టీసీ ఈయూ నాయకుల ధ్వజం శ్రీకాకుళం : ఆర్టీసీ నష్టాలకు అధికారుల ఏకపక్ష నిర్ణయాలే కారణమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎస్.వి.రమణ, కె.శంకరరావు ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఈయూ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో అధికారుల సంఖ్య తగ్గించాల్సింది పోయి అందుకు విరుద్దంగా యాజమాన్యం కొత్త కొత్త పోస్టులను సృష్టించి అధికారుల సంఖ్యను అన్ని స్థాయిల్లోనూ పెంచుకుంటూ పోతున్నారన్నారు. ఖాళీలు ఉన్న చోట్ల కూడా రెగ్యులర్ సిబ్బందిని నియమించకుండా అవసరం లేని చోట కొంతమంది ప్రయోజనాల కోసం వందలాది మంది ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేసి లక్షలాది రూపాయలు సంస్థకు నష్టం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల గుర్తింపు సంఘం ఎన్నికలో స్వల్ప మెజారిటీతో రాష్ట్ర స్థాయి గుర్తింపులోకి వచ్చిన సంఘం కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ ఈయూ నాయకులు ఎస్ఎస్ఆర్ శర్మ, జి.త్రినాద్, ఆర్.జి.రావు, కుమారి, డి.వనజాక్షి, బి.జయదేవ్, ఎంటివి.రావు, బ్రహ్మం, కె.గోవిందరావు పాల్గొన్నారు. -
వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!
-
వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (86) దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లో లెజండరీ ఇన్వెస్టర్ గా పేరొందిన బఫెట్ కేవలం ఒక్క రోజులో వేల కోట్ల రూపాయలను నష్టపోవడం మార్కెట్ వర్గాలను విస్మయపర్చింది. 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,375 కోట్లు) నష్టపోయాడు. బఫెట్ మేజర్ పెట్టుబడులు పెట్టిన అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల యాజమాన్య సంస్థ ఫార్గో అండ్ కో భారీ కుంభకోణంలో ఇరుక్కుకోవడంతో ఈ పరిణామం సంభవించింది. 65.8 బిలియన్ డాలర్ల తోప్రపంచంలోనే నాలుగో అత్యధిక ధనవంతుడిగా ఉన్న బఫెట్ వేలకోట్ల సంపద క్షణాల్లోఆవిరైపోయింది. బఫెట్ కు చెందిన బెర్కషైర్ హాత్వే ఇంక్ వెల్స్ ఫార్గో లో అత్యధిక వాటాను కలిగింది. నిబంధనలను విరుద్ధంగా రెండు మిలియన్లకు పైగా అకౌంట్లు తెరిచారన్న ఆరోపణలతో 185 మిలియన్ డాలర్లను జరిమానాను కంపెనీ ఎదుర్కోంటోంది. సంస్థ ఉద్యోగులు ఆయా ఖాతాదారుల అనుమతులు లేకుండా 20 లక్షలకు పైగా ఖాతాలు తెరిచిరన కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా వేల్స్ ఫార్గో ఈక్విటీ విలువ 3.3 శాతానికి పైగా పడిపోయింది. దీంతో ఈ సంస్థలో అత్యధిక వాటాదారుగా ఉన్న బెర్క్ షైర్ హాత్ వే ఈక్విటీ 2 శాతం పడిపోయింది. మరోవైపు ఈ భారీ జరిమానా సంస్థను తీవ్రంగా బాధించిందని , తమ ప్రతిష్టకు భంగం కలిగిందని బ్యాంక్ ప్రకటించింది. రిటైల్ బ్యాంకర్ల దూకుడు ఉత్పత్తి అమ్మకపు గమ్యాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వెల్స్ ఫార్గో సీఈవో జాన్ స్టంఫ్ వచ్చేవారం సెనేట్ బ్యాంకింగ్ కమిటీముందు హాజరు కానున్నారు. 2013 లో లాస్ ఏంజిల్స్ టైమ్స్ విచారణ లో ఈ విషయంలో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసిన ఫార్గో అనుమతిలేకుండా ప్రారంభించిన ఖాతాలకు సంబంధించిన ఫీజును వాపస్ చేస్తామని వెల్లడించింది. -
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
ముంబయి : స్టాక్ మార్కెట్లు మంగళవారం సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 43 పాయింట్ల నష్టంతో 25వేల 775 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 7వేల 831 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, జీఎంఆర్ ఇన్ఫ్రా, గాటీ, ఇండియా సిమెంట్, జీవీకే పవర్ కంపెనీల షేర్లు లాభాలు మూటగట్టుకన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాక్స్ ఇండియా, ఇమానీ, అదానీ పోర్స్ కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి. గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. గురువారం మళ్లీ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. మరో వైపు గత రెండు రోజులుగా తగ్గిన బంగారంధర మంగళవారం స్పల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.25,740కి చేరింది. వెండి ధర కూడా పెరిగింది. రూ.350 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,150కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల వాతావరణం ఉండంతో దేశీయ మార్కెట్ లోకూడా బంగారం, వెండి డిమాండు పెరిగిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. విచూశాయి. -
విమానాశ్రయంలో హీరోయిన్ సూట్‌కేస్ చోరీ
జైపూర్: బాలీవుడ్ నటి, 'అతిథి' హీరోయిన్ అమృతారావు విలువైన సూట్‌కేస్ జైపూర్ విమానాశ్రయంలో చోరికి గురైంది. ఒక నగల యాడ్ షూటింగ్ నిమిత్తం ఆమె పింక్ సిటీకి వచ్చింది. ఈ క్రమంలో తాను తెచ్చుకున్న మూడు లగేజీ బ్యాగ్స్‌లో ఒకటి మిస్సయిన విషయాన్ని గమనించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో సుమారు లక్ష రూపాయల విలువైన వస్తువులున్నాయని తెలిపింది. మరోవైపు తమ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. తమ సిబ్బంది చాలా సిన్సియర్‌గా, జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి పోయిన సూట్ కేసును ఆమెకు అందజేస్తామన్నారు. మరోవైపు పింక్ సిటీ లో షూటింగ్ అంటూ చాలా ఉత్సాహంగా ఉందని అమృతారావు పేర్కొంది. పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మామూలేనని, విమానాశ్రయ అధికారులు తన సూట్ కేసును తిరిగి అందజేస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది. తెలుగులో మహేశ్ బాబు సరసన 'అతిథి' సినిమాలో అమృత నటించిన సంగతి తెలిసిందే. -
హీరోలకు ధీటుగా ప్రయోగాలు చేస్తున్న స్వీటి
-
పిచ్చెక్కించిన పులిబొమ్మ
తంపా: ఒక బాలుడు తెచ్చుకున్న పులిబొమ్మ.. తంపా విమానాశ్రయ అధికారులకు తలపోటు తీసుకొచ్చింది. ఆ వెంటనే రిలీఫ్ ఇచ్చి సరికొత్త ఆలోచనకు ప్రాణంపోసి వారిలో నవ్వులు పూయించింది. ఓవెన్ అనే ఆరేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి హ్యూస్టన్ వెళ్లేందుకు తంపా విమానాశ్రయానికి వచ్చాడు. అయితే, తన వెంట తెచ్చుకున్న హాబ్స్ అనే పులిబొమ్మ పోగొట్టుకున్నాడు. దీంతో అతడు బిక్కమొఖం పెట్టుకొని ఏడుపు మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోక తల్లి దండ్రులు విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా కలిసి ఎయిర్ పోర్ట్ మొత్తం జల్లెడ పెట్టారు. ఒక సాహసయాత్ర మాదిరిగా చేసి చివరికి చిన్న పిల్లలు ఆడుకునే ప్రాంతంలో దానిని గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద సాహసయాత్రగా చేసిన ఈ కార్యక్రమాన్ని 'ఎడ్వంచర్' అనే పేరుతో అప్పటికప్పుడు డాక్యుమెంటరీ రూపొందించారు. పులిబొమ్మ హాబ్స్‌తో ఫొటోలు దిగారు. ఆ పిల్లాడికి చూపించి సంతోష పెట్టారు. ఎట్టకేలకు ఓవెన్ తిరిగి తనకిష్టమైన హాబ్స్‌తో హ్యూస్టన్ వెళ్లాడు.