మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఒక వైద్యుడు ఆన్‌లైన్‌లో సమోసాలు ఆర్డర్ చేసి మోసపోయారు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి, రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఉదంతం సాయన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కేఈఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న 27 ఏళ్ల వైద్యుడు తనకు ఎదురైన మోసంపై బోయివాలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
స్నేహితులతో పిక్నిక్ ప్లాన్
మోసపోయిన వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఆయన ఇటీవల ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆన్‌లైన్‌లో సమోసాలను ఆర్డర్ చేశారు. అయితే అప్పుడు తాను 25 ప్లేట్ల సమోసాల కోసం రూ.1.40 లక్షలు కోల్పోతానని గ్రహించలేకపోయారు. ఆయన తన స్నేహితులతో పాటు పిక్నిక్‌కు ప్లాన్ చేసుకున్నారు.
‘గురుకృప’కు ఫోన్ చేసి..
ఈ నేపధ్యంలో ప్రయాణంలో తినేందుకు ఏదైనా ఉండాలని భావించి, సమోసాలు ఆర్డర్ చేశారు. ఆయన గురుకృప రెస్టారెంట్‌కు ఫోన్ చేసి, 25 ప్లేట్ల సమోసాలను ఆర్డర్ చేశారు. ఇందుకోసం రూ.1500 పేమెంట్ చేయాలంటూ అటువైపు వారు సమాధానమిచ్చారు.
పేమెంట్ అందలేదంటూ..
వారు చెప్పిన నంబరుకు డాక్టర్ రూ.1500 ట్రాన్స్‌ఫర్ చేశారు. కొదిసేపటి తరువాత ఆ వైద్యునికి తిరిగిఫోన్ వచ్చింది. వారు తమకు పేమెంట్ అందలేదని, మరో నంబరుకు పేమెంట్ చేయాలంటూ ఆ నంబర్ తెలిపారు. అలాగేవారు పేమెంట్ రిక్వస్ట్ లింక్ కూడా పంపారు. వెంటనే డాక్టర్ ఆ లింక్ ద్వారా పేమెంట్ చేశారు. ఇది జరిగిన కొద్ది నిముషాలకు డాక్టర్ ఖాతా నుంచి రూ.28 వేలు కట్ అయ్యాయి.
బ్యాంక్ ఖాతా బ్లాక్ చేయించి..
ఇది చూసిన డాక్టర్ కంగుతిన్నారు. కొద్దిసేపటికి తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మూడు సార్లు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వైద్యుడు బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయించారు. అయితే అప్పటికే ఆయన ఖాతాలోని రూ.1.40 లక్షలను మోసగాళ్లు స్వాహాచేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: ఎంతటి సంపన్నుడయినా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా? నమ్మితే అంతే!
Mumbai Doctor Viral Incident: డాక్టర్‌కు షాకిచ్చిన సమోసాలు.. రూ.1.40 లక్షలకు టోకరా!
Published Tue, Jul 11 2023 9:05 AM | Last Updated on Tue, Jul 11 2023 2:12 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment