online
-
బషర్ అసద్‌పై విష ప్రయోగం?
లండన్: రష్యాలో ఆశ్రయం పొందిన సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్(59)పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు రష్యా మాజీ గూఢచారిగా భావిస్తున్న జనరల్ ఎస్వీఆర్ అనే ఆన్లైన్ ఎకౌంట్లో ఈ విషయం బయటకు పొక్కిందని ‘ది సన్’పేర్కొంది. అసద్‌కు తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడంతో వైద్యం అందించారని తెలిపింది. అసద్‌పై హత్యా ప్రయత్నం జరిగిందనేందుకు ఇదే ఉదాహరణ అని సన్ పేర్కొంది. డిసెంబర్ మొదటి వారం కుటుంబం సహా వెళ్లిన అసద్ మాస్కోలోని సొంత అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైద్యం అందుతోందని, సోమవారానికి పరిస్థితి కుదుటపడిందని సన్ తెలిపింది. -
డాక్టర్ ‘గూగుల్’!
సాక్షి, హైదరాబాద్: ఏ సమస్యకైనా వెనకాముందూ ఆలోచించడం లేదు.. పరిష్కారం కావాలంటే.. గూగుల్ అన్వేషిస్తున్నారు. ఎలాంటి జబ్బుకైనా చికిత్స విధానాల కోసం ఆన్లైన్లో అన్వేషిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం రోజురోజుకు పెరిగిపోతోంది. అదెంతవరకు పోయిందంటే.. తలనొప్పి, పంటి నొప్పి వంటి చిన్న అనారోగ్యాలు మొదలుకుని పెద్ద పెద్ద జబ్బుల దాకా ఆన్లైన్లో శోధించడం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. దేనికైనా గూగుల్ ఉందిగా..సాధారణంగా మొబైల్ ఫోన్, టీవీ, వాషింగ్ మెషీన్, డెస్క్‌టాప్ కంప్యూటర్, లాప్‌టాప్‌లు మొదలుకుని కార్లు, ఇతర పరికరాలు, మెషీన్లలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలు ఎదురుకావడం తెలిసిందే. కానీ ఇళ్లలో ఇలాంటి సమస్యలు తలెత్తగానే.. వాటిపై అవగాహన ఉన్నవారు, నిపుణులను సంప్రదించడానికి ముందే వెంటనే గూగుల్‌లోనో, యూ–ట్యూబ్‌లోనో, మరే ఇతర సోషల్‌మీడియా ప్లాట్ఫామ్పైనో శోధించడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇలా ఇంటర్నెట్, వివిధ సామాజిక మాధ్యమాలు అనేవి పలురకాల సమాచారం, వివరాల సేకరణకు చిరునామాగా మారిపోయాయి. అన్ని వర్గాల వారు వివిధ అంశాలపై తరచూ సోషల్‌మీడియాను ఆశ్రయించడం ఇటీవల మరింతగా పెరిగిపోయింది. మిగతా విషయాలు ఎలా ఉన్నా.. ఆరోగ్యంతో ముడిపడిన విషయాలు, చికిత్స విధానాలు, అనారోగ్య సమస్యల పరిష్కారం వంటి వాటికి కూడా గూగుల్, వివిధ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. ఏ అనారోగ్య సమస్య తలెత్తినా.. ఏ మందు వేసుకోవాలి, చికిత్సకు ఏం చేయాలి అనేది కూడా ఆన్లైన్లో తెలుసుకోవడం ఆందోళనకు కారణమౌతోంది. ఈ ధోరణి మరింత పెరగడంతో.. ఇతరులకు వైద్యపరమైన సలహాలు గట్రా అందజేస్తున్నవారు క్రమంగా ‘గూగుల్ డాక్టర్లు’గా చెలామణి అవుతున్నారు. ముందుగా ఏదైనా అనారోగ్య సమస్య లక్షణాలను, దానికి సంబంధించిన చికిత్స పద్ధతుల గురించి గూగుల్‌లో శోధించి, ఆ తర్వాత సంబంధిత స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది.ఎవరైనా రోగులు తమకు కలిగిన చిన్న సమస్యకు సైతం.. అతిగా భయపడిపోయి ఆన్లైన్లో వాటికి చికిత్స లేదా పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నాలు మంచిది కాదని వైద్యులు, వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.వెర్టిగో.. పెనుసమస్యే..ఇటీవల కాలంలో ‘వెర్టిగో’తో బాధపడుతున్న వారు అధికంగా సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన సమాచారం, చికిత్స విధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ స్కిల్స్’లో ప్రచురితమైన ఈ పరిశీలనలో వెర్టిగో చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులు, విధానాలను తెలుసుకునేందుకు 51 శాతం ‘వెర్టిగో’ రోగులు మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. పరిసరాలు తిరుగుతున్నట్టు, కళ్లు తిరిగి పడిపోతున్నట్టు, ఒకచోట నిలబడలేక పడిపోతున్న భావనకు గురికావడం, విడవకుండా తలనొప్పి రావడం, నడిచేటప్పుడు ఇబ్బంది ఎదురుకావడం, శరీర బరువులో మార్పులు రావడం, వణుకుతున్న భావన కలగడం, స్వల్పకాలానికే కొన్ని విషయాల్లో మరుపు వంటివి ‘వెర్టిగో’ లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మధ్యవయసు వారు (54 శాతం), పిల్లలు (27 శాతం), పెద్దవయసు వారు (19 శాతం) ప్రయత్నించినట్టు ఈ సర్వేలో వెల్లడైంది. అన్ని వయసుల వారిని కలుపుకొంటే.. వారిలో 65 శాతం మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు బ్రాండ్‌వాచ్ (ఎంటర్‌ప్రెజ్–గ్రేడ్ సోషల్ లిసనింగ్ టూల్) అనేదాన్ని వినియోగించారు. దీనిద్వారా ట్విటర్ (ఎక్స్), యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, మెడికల్ ఫోరమ్స్, బ్లాగ్లు, ఈ–కామర్స్ సమీక్షలను పరిశీలించారు. ప్రధానంగా వీరంతా కూడా వివిధ సాధనాల ద్వారా వెర్టిగో సమస్యకు సమర్థవంతంగా ఎలా చికిత్స చేయాలి?, అందుకు నిపుణులైన వైద్యులెవరనే అంశంపై దృష్టి పెట్టారు.సోషల్ మీడియా.. రెండంచుల కత్తిఈ అధ్యయనం ద్వారా చివరకు తేల్చింది ఏమిటంటే.. సామాజిక మాధ్యమం రెండంచుల కత్తి లాంటిదని, ఏదైనా విషయమై సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇవి దోహదం చేయడమేకాక, ఆయా అంశాలపై సమాచారం తెలుసుకోవడంలో అంతరాలు ఏర్పడి కొన్ని తప్పుడు భావనలు, అభిప్రాయాలు, సూత్రీకరణలు చేసేందుకు కూడా దారి తీస్తున్నట్టు పేర్కొన్నారు. అందువల్ల ఈ విషయంలోనూ ప్రజలను చైతన్యపరిచేందుకు సోషల్‌మీడియాను వైద్యులు, నిపుణులు ఉపయోగించుకోవలసిన ఆవశ్యకత పెరిగిందంటున్నారు. ఈ మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారుతున్న అంశాలను పరిశీలించి.. ఏవైనా తప్పుడు భావనలు, అభిప్రాయాలు వ్యక్తమైతే వాటిని దూరం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇన్‌స్ట్రాగామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వైద్యులు ఆయా ముఖ్యమైన అంశాలకు సంబంధించిన చిన్నచిన్న వీడియోలను పెట్టడం ద్వారా.. లక్షలాది మందిలో చైతన్యాన్ని కలిగించి, చికిత్సా పద్ధతులపై విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని ఒక వైద్యుడు పేర్కొన్నారు. -
అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్
కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవారికి జియో ఓ శుభవార్త చెప్పింది. 2024 డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య 'జియో పేమెంట్స్ బ్యాంక్' (Jio Payments Bank)లో కొత్త సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసిన కస్టమర్లకు రూ. 5,000 విలువైన రివార్డులను అందించనున్నట్లు ప్రకటించింది.మెక్‌డొనాల్డ్స్, ఈజ్‌మైట్రిప్(EaseMyTrip), మ్యాక్స్ ఫ్యాషన్ (Max Fashion) ప్రముఖ బ్రాండ్ల కూపన్లను.. జియో పేమెంట్స్ బ్యాంక్ రివార్డులలో భాగంగా అందించనుంది. డిజిటల్ ఫస్ట్ విధానానికి ప్రసిద్ధి చెందిన ఈ బ్యాంకులో కస్టమర్లు కేవలం ఐదు నిమిషాలలోపు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే - ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.ఆన్లైన్ విధానం➤గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో జియో మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించి జియో మనీ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి.➤రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా మీ ఖాతాను ధృవీకరించండి.➤ధ్రువీకరించిన తరువాత మీ వ్యక్తిగత వివరాలు, చిరునామాతో పాటు.. ఇతర అవసరమైన సమాచారంతో అప్లికేషన్ ఫామ్‌ను పూరించండి.➤అప్లికేషన్ ఫామ్ పూరించిన తరువాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి.➤తరువాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకుని.. మీ ఖాతాను సెటప్ చేయండి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ని సందర్శించి మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.ఆఫ్‌లైన్ విధానం➡సమీపంలోని జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి.. జియో రిప్రెజెంటేటివ్ను కలవని.➡జియో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ తీసుకుని, అవసరమైన వివరాలను ఫిల్ చేయండి. ➡మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను అందివ్వండి. ➡ఇవన్నీ పూర్తయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ఖాతాను ధృవీకరించండి.➡యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటి వాటిని సెట్ చేసుకోవడం ద్వారా మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.అవసరమైన డాక్యుమెంట్స్ & అర్హతలు● జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి.. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్) వంటివి అవసరమవుతాయి.● 18 సంవత్సరాలు నిండి, చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగిన భారతీయులు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. -
TTD : శ్రీవాణి, ఎస్ఈడీ టికెట్ల విడుదల తేదీల మార్పు
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,863 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్లు.మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీలో మార్పుతిరుమల, 2024 డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేయడమైనది.డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్లో https://ttdevasthanams.ap.gov.in/home/dashboardలో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది. -
దుస్తులు పాతబడ్డాయా.. అమ్మేయండి..!
సాక్షి, అమరావతి: ఇంటినిండా బట్టలున్నట్టే ఉంటాయి. కానీ సమయానికి కట్టుకుందామంటే ఒక్కటీ సరైనది కనిపించదు. ఇలా పాతబడిపోయిన దుస్తులను ఏం చేయాలో తెలియదు. ఎవరికైనా ఇద్దామంటే ఏమనుకుంటారోననే సందేహం. వాటిని దాచుకోలేక, పడేయలేక సతమతమవుతుంటారు చాలామంది. ముఖ్యంగా మహిళలు. ఇకపై ఆ సందేహాలు, సతమతాలు అవసరం లేకుండా ఇళ్లల్లో ఉన్న పాత దుస్తులను కొనే యాప్‌లు, వెబ్సైట్లు వచ్చేశాయి. వీటిద్వారా వాడకుండా పక్కన పెట్టేసిన దుస్తులను ఆన్లైన్లో అమ్మేసేయొచ్చు. అంటే..పాత దుస్తులకూ డబ్బులొస్తాయన్నమాట. వాటిని కొనేందుకు కొన్ని వెబ్సైట్లు ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. ఆలస్యమెందుకు.. ఆ యాప్‌లు, వెబ్సైట్లు ఏమీటో తెలుసుకొని.. పాత వాటిని అమ్మేద్దాం..అమ్మడానికి ఆన్లైన్లో అనేక వేదికలుఆన్లైన్ల్లో పాత దుస్తులు కొనే వెబ్ సైట్లు, యాప్‌లు చాలానే ఉన్నాయి. ప్రీ అప్, బేచ్ దే, పోష్ మార్క్, ఓఎల్ఎక్స్, పీ పాప్, ఒయేలా, క్లాతింగ్ క్లిక్, ఈబే, ఓల్డ్ కార్ట్..వంటి పేర్లతో ఆన్లైన్ వ్యాపారాలు జరుగుతున్నాయి. కొన్ని సైట్లు, యాప్‌లు నేరుగా దుస్తులు కొనుగోలు చేసి వాటికి కొంత నగదును ఇస్తున్నాయి. అందుకోసం మీ దుస్తులను యాడ్ చేసి ధరను నిర్ణయించిన తర్వాత, కంపెనీ వాటిని చెక్ చేసి ఆమోదిస్తుంది. అనంతరం వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయిస్తుంది. మరికొన్ని వినియోగదారులకు నేరుగా అమ్మకందారులే దుస్తులను విక్రయించేందుకు అవకాశం ఇస్తున్నాయి. ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యాక సేల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, అమ్మాలనుకుంటున్న దుస్తులను క్లోజప్‌లో ఫొటో తీసి పోస్ట్ చేయాలి. వాటికి సంబంధించిన చిన్నపాటి సమాచారం (డిస్క్రిప్షన్)ను కూడా రాయాలి. ఆ తర్వాత డ్రెస్ ఏ కండీషన్లో ఉంది, ఎవరికి సరిపోతుంది (కేటగిరీ) అనే వివరాలను సెలక్ట్ చేసి దాని ధర (అమౌంట్) ను కూడా తెలపాలి. కొన్ని సంస్థలు అమ్మకం రుసుము (సెల్లింగ్ ఫీజు) తీసుకోవు. ఇంటికే వచ్చి మనం అమ్మిన పాత దుస్తులను తీసుకెళుతున్నాయి. దుస్తులు అమ్మే సమయంలో క్రెడిట్ పాయింట్స్ లేదా క్యాష్ ఆప్షన్ పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. బట్టలతో పాటు వాచీలు, చైన్లు, రింగులు, క్యాపులు, బూట్లు వంటి యాక్ససరీస్, డెకరేటివ్ ఐటమ్స్ కూడా అమ్ముకునేలా, కొనుక్కునేలా ఈ యాప్‌లలో ఆప్షన్లు ఉన్నాయి. మీషో వెబ్సైట్లో దేశవ్యాప్తంగా ఎవరైనా మీ దుస్తులను కొనే అవకాశం ఉంటుంది. ఫ్రీఅప్ అనే వెబ్ సైట్ కూడా మరో ఫేమస్ వెబ్ సైట్. ఈ యాప్ లో మీరు మీ పాత బట్టల ఫొటోలు పెట్టగానే వాటి క్వాలిటీని బట్టి ధర నిర్ణయిస్తుంది. ధర నచ్చితే హ్యాపీగా అమ్మేయొచ్చు. రీలవ్ వెబ్ సైట్ ద్వారా కూడా ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చు. క్లెటెడ్ అనేది ప్రత్యేకంగా ఇంటింటికీ సేవలందించడంలో ప్రసిద్ధి చెందిన యాప్. వెబ్ సైట్ నిర్వాహకులే ఇంటికొచ్చి పాత దుస్తుల బ్రాండ్, ప్రస్తుత పరిస్థితిని చూసి సరైన ధర నిర్ణయించి డబ్బులు కూడా ఇస్తారు. వ్యాపారం మీరే చేయొచ్చుఆన్లైన్లో పాత దస్తులను సేకరించి విక్రయించే వ్యాపారం చేయడానికి ఇటీవల యువత కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కొంత మంది లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. ఒక యాప్ లేదా వెబ్ సైట్ తయారు చేసి సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేయొచ్చు. నగరాల్లో కమిషన్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకుని దుస్తులు సేకరించవచ్చు. వాటిని రీసైక్లింగ్ చేసే కంపెనీలకు బల్‌్కగా అమ్మొచ్చు. ఇలా కొన్న పాత బట్టలను ఉపయోగించి కొందరు పిల్లోస్, పరుపులు, డెకరేషన్ ఐటమ్స్ తయారు చేస్తారు. అలాంటి వారిని సంప్రదించి మంచి ధరకు అమ్మేయొచ్చు. దీని ద్వారా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. -
భర్త వేధింపులు తట్టుకోలేక..
మియాపూర్: మనస్పర్థలు, కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చత్రి మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన మొక్కపాటి వెంకట నాగలక్ష్మి(28) వివాహం భీమవరానికి చెందిన సామినేని సతీష్ తో 2018లో జరిగింది. వీరికి 2019లో కుమార్తె జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వారు విడిపోయారు. 2023 నవంబర్‌లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుమార్తె వెంకటనాగలక్ష్మి దగ్గరే ఉంటుంది. నాగలక్ష్మి కూతురుతో కలిసి మియాపూర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 22న నాగలక్ష్మి ఏలూరు జిల్లా తోచిలుక గ్రామానికి చెందిన మువ్వా మణికంఠ మనోజ్‌ను రెండవ వివాహం చేసుకుంది. మనోజ్ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగాయి. నాగలక్ష్మి పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని మనోజ్ తన పేరుపై నమోదు చేయాలని, బ్యాంక్ అకౌంట్‌కు తన ఫోన్ నంబర్‌ను యాడ్ చేయించాలని ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ పాస్వర్డ్లు చెప్పాలని తరచూ వేధిస్తుండేవాడు. ఇటీవల కాలంలో రెండుసార్లు ఆమెను విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మనస్తాపం చెందిన నాగలక్ష్మి గత నెల 28వ తేదీన ఆన్లైన్లో గడ్డిమందు ఆర్డర్ చేయగా ఈ నెల 4వ తేదీ డెలివరీ అయ్యింది. కాగా బుధవారం మనోజ్, నాగలక్ష్మిల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నాగలక్ష్మి భర్త మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
యాజమాన్య కోటా.. ఇక ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ సీట్లను ఇప్పటివరకు ఏ కాలేజీకి ఆ కాలేజీ సొంతంగా భర్తీ చేసుకునేవి. ఈ సీట్లను కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉన్నా.. ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా భర్తీలోనూ పారదర్శకతను తీసుకొచి్చ, మెరిట్ విద్యార్థులకు మేలు చేసేందుకు ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేసేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం కోరింది. దీనిపై మండలి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలో మండలి కొన్ని కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది. పారదర్శకత కోసమే.. రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కోటాలో సీటు పొందిన వారిలో అర్హులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీ యింబర్స్‌మెంట్ వస్తుంది. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’కేటగిరీ కింద భర్తీ చేస్తారు. మిగిలినవి ఎన్ఆర్ఐల పిల్లలకు కేటాయించారు. యాజమాన్య కోటాలో సీటు పొందిన విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. జేఈఈ, టీజీఈఏపీ ర్యాంకు ఆధారంగా, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు వచ్చిన వారికే ఈ సీట్లు ఇవ్వాలి. ఇక సీ కేటగిరీ కింద ఎన్ఆర్ఐల పిల్లలకు సీట్లు కేటాయించాలి. అయితే, మెరిట్ లేకున్నా ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకొంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నిజానికి కనీ్వనర్ కోటాలో ఫీజు రూ.లక్ష ఉంటే.. మేనేజ్మెంట్ కోటాలోని బీ కేటగిరీ సీటుకు మూడింతలు.. అంటే రూ.3 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు ఐదింతలు.. అంటే రూ.5 లక్షల వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలి. కానీ.. మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీట్లను కాలేజీలు రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అంత ఫీజు చెల్లించలేని మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సీట్లు ఎవరికి, ఎంతకు అమ్ముకొంటున్నారన్న వివరాలు కూడా బయటపెట్టకపోవటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఈ సీట్లను భర్తీ చేయటం వల్ల నిర్ణీత ఫీజు చెల్లిస్తే మెరిట్ విద్యార్థులకే సీట్లు లభిస్తాయని, సీట్ల భర్తీ అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవీ ప్రతిపాదనలు... » బీ, సీ కేటగిరీ సీట్లకు ప్రభుత్వమే ఫీజులు ప్రతిపాదిస్తుంది. కనీ్వనర్ కోటాకన్నా బీ కేటగిరీకి మూడు రెట్లు, సీ కేటగిరీ సీట్లకు ఐదురెట్లు అధికంగా ఫీజులు వసూలు చేయవచ్చు. దీంతో పాటు లే»ొరేటరీలు, లైబ్రరీ ఫీజులు అదనంగా వసూలు చేసుకునే అధికారం ఇవ్వాలనే సూచన చేయనున్నట్లు సమాచారం. » ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నీట్ అనుసరిస్తున్న విధానాన్నే ఇంజనీరింగ్‌లోనూ అనుసరించాలనే మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేసే ఈ ప్రక్రియ మొత్తం కనీ్వనర్ కోటా మాదిరిగా సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఫీజులు మాత్రం కాలేజీలే నిర్ణయిస్తాయని అధికారులు అంటున్నారు. -
పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు
భారత ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇది ఆర్ధిక మోసాలను, గుర్తింపు చౌర్యం వంటి వాటిని నిరోధించడమే కాకుండా.. సమాచారం మరింత భద్రంగా ఉంటుంది. అయితే.. పాన్ 2.0 ఎప్పుడు వస్తుంది అన్నదానికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రస్తుతం వెలువడలేదు. అయితే కొత్త పాన్ కార్డులు వస్తే?.. పాత పాన్ కార్డులు ఏమవుతాయి. ఈ కొత్త పాన్ కార్డులు లేదా క్యూఆర్ కోడ్ పాన్ కార్డుల కోసం ఎక్కడ.. ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.పాత పాన్ కార్డులు రద్దవుతాయా?క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి.పాన్ 2.0 కోసం ఎలా అప్లై చేసుకోవాలి?➤పాన్ 2.0 కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోని పోర్టల్ సందర్శించాలి (పాన్ 2.0 ప్రాజెక్ట్ ఇటీవలే ప్రవేశపెట్టారు, కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లో పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు).➤అవసరమైన చోట వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.➤గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.➤అవసరమైనన్నీ నమోదు చేసిన తరువాత అప్లికేషన్ సబ్మీట్ చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్➤ఐడెంటిటీ ప్రూఫ్ కోసం.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్➤అడ్రస్ ప్రూఫ్ కోసం.. యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్➤డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం.. బర్త్ సర్టిఫికెట్, టీసీ, పాస్పోర్ట్పాన్ 2.0 కోసం అప్లై చేయాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డు.. రిజిస్టర్ మెయిల్‌కు వస్తుంది. అయితే క్యూఆర్ కోడ్‌తో వచ్చే ఫిజికల్ కార్డు కావాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డును భారతదేశంలో ఎక్కడికైనా డెలివరీ చేసుకోవాలంటే ఈ 50 రూపాయలు చెల్లించాలి. అంతర్జాతీయ డెలివరీలకు ఫీజులు వేరే ఉంటాయి. కాబట్టి దీనికి అదనంగా చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది. -
ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
అల్లిపురం: మహిళల అక్రమ రవాణా, ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, ముగ్గురు బాధిత మహిళలను కాపాడారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. పలువురు ఆకర్షణీయంగా వెబ్సైట్లను డిజైన్ చేసి.. పలు వెబ్సైట్ల నుంచి మహిళల వివరాలు, కాంటాక్ట్ నంబర్లు సేకరిస్తారు. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి నగరంలోని లాడ్జీలు, హోటళ్లలో ఉంచుతారు. ఏజెంట్ల నుంచి వచ్చిన సమాచారంతో కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుని మహిళలు ఉన్న చోటికి వారిని పంపిస్తారు. ఇలా గుట్టుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ విధంగానే వెబ్ డిజైనర్ రావాడ కామరాజు అలియాస్ దీపక్ www.findbestclass.com ను రూపొందించాడు. వ్యభిచారం కోసం మహిళలను రవాణా చేసే లోకాన్టో వెబ్సైట్ నుంచి ఏజెంట్ల పేర్లు, ఫోన్ నంబర్లను భద్రపరచుకుని.. వాటిని తన వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. వెబ్‌సైట్‌ను సంప్రదించిన కస్టమర్లకు ఏజెంట్ల వివరాలు, మహిళల ఫొటోలు పంపిస్తున్నాడు. తద్వారా కస్టమర్లకు, ఏజెంట్లకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఇందుకోసం డబ్బులు తీసుకుని.. ఏజెంట్లతోపాటు బాధితులకు కమిషన్ అందిస్తున్నాడు. కాగా.. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసుల సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. లాసన్స్‌బే కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న రావాడ కామరాజు, బాడి రాము, మాటూరి రమేష్, మంగేష్ రమేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. రావాడ కామరాజు తాను మహిళల అక్రమ రవాణా కోసం ఉపయోగించే 34 మంది ఏజెంట్ల పేర్లను వెల్లడించాడు. భూపేష్నగర్లోని లాడ్జీలో ఉంచిన ముగ్గురు బాధిత మహిళల వివరాలతో పాటు ఒక మహిళా ఏజెంట్, మగ ఏజెంట్ పేర్లను తెలియజేశాడు. అతను ఇచ్చిన సమాచారంతో బాధిత మహిళలను విడిపించి.. ఇద్దరు ఏజెంట్లు సూర్యవంశీ, అలీష సుభద్రలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహించడం, మహిళల అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని సీపీ హెచ్చరించారు. ప్రజలు వెబ్సైట్లు, ఇతర మాధ్యమాల ద్వారా మహిళలతో అక్రమ వ్యాపారం చేసినా, నిర్వహించినా చట్టప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సీపీ బాగ్చి స్పష్టం చేశారు. -
అన్లైన్ ఫ్యాషన్.. సేవల ఓషన్
శ్రీనగర్‌కాలనీలో నివసించే దివ్య గచ్చిబౌలిలోని బొటిక్‌లో డ్రెస్ స్టిచ్చింగ్ కి ఇచ్చారు.. స్టిచ్చింగ్ పూర్తయ్యాక వాళ్ల ఇంటికి ర్యాపిడో ద్వారా పంపారు. తీరా ఇంటికి వచ్చిన డ్రెస్ ధరించి చూస్తే కొన్ని ఆల్టరేషన్స్ అవసరం అని అర్థమైంది.. బొటిక్ వారిని సంప్రదిస్తే.. తమకు ఆ డ్రెస్‌ని ఇస్తే ఆల్టరేషన్స్ చేసి మరో రెండు రోజుల్లో పంపిస్తామన్నారు. కానీ దివ్య అదే రోజు ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉంది.. మరేం చేయాలి? ‘ఇలాంటి సమస్య మాతో రాదు మేం డ్రెస్‌ని మాత్రమే ఇంటికి పంపం. టైలర్, కుట్టుమిషన్‌తో సహా పంపిస్తాం. ఏవైనా మార్పు చేర్పులు ఉంటే క్షణాల్లో చేసేసి ఇస్తాం’ అంటోంది ఓ ఆన్లైన్ స్టిచ్చింగ్ సంస్థ. అమెరికాలో ఉంటున్న నగరవాసికి సిటీలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్‌లో ఓ చీర నచ్చింది. అయితే అది కొని తన దగ్గరకు పంపించినా, ఆ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, సీకో వర్క్ వగైరాల కోసం అమెరికాలో వెదకడానికి సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువే..! మరేం చేయాలి? ‘అంత కష్టం మీకక్కర్లేదు. ఆ షోరూమ్‌లో మీరు కొన్న చీర నేరుగా మాకే వస్తుంది. దానికి అవసరమైన బ్లౌజ్, వర్క్స్ పూర్తి చేసి భద్రంగా అమెరికా చేర్చే బాధ్యత మాదే’ అంటోంది మరో స్టిచ్చింగ్ సంస్థ. ఒకటా రెండా.. దుస్తులు/ఫ్యాబ్రిక్స్ కొనడం, వాటిని కుట్టించడం, అంతేనా.. అందంగా చీర కట్టించడం.. దాకా కాదు ఏ సేవాకు ఆన్లైన్లో అసాధ్యం అంటున్నాయి నగరంలో పుట్టుకొచి్చన పలు ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్స్. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆన్లైన్ టైలరింగ్ సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విజృంభిస్తూ.. అనూహ్యమైన రీతిలో దూసుకుపోతున్నాయి. ఈ తరహా ఆన్లైన్ విప్లవాలకు సారథ్యం వహిస్తున్న సంస్థల్లో అత్యధిక భాగం మహిళల ఆధ్వర్యంలోనే ఉండడం విశేషం. యాప్‌లోని మార్కెట్ ప్లేస్ ద్వారా.. ‘పలు చోట్ల పరిమిత విస్తీర్ణంలో ఎక్స్‌క్లూజివ్ బ్రాండెడ్ ఔట్లెట్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక డిజైనర్, ఒక కుట్టుమిషన్ వగైరాలు అందుబాటులోకి తెచ్చాం. కస్టమర్లు నేరుగా సంప్రదింపులు చేసి అక్కడే ఆర్డర్స్ ఇచ్చి వెళ్లొచ్చు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ కూడా చేయించుకోవచ్చు.. ఇలాంటివెన్నో కస్టమైజ్డ్ డ్రెస్సింగ్‌కు జత చేస్తున్నాం. అలాగే కస్టమర్స్ మా యాప్‌లోని మార్కెట్ ప్లేస్ ద్వారా నగరంలోని పలు షోరూమ్స్ నుంచి కొనుగోలు చేసిన చీరలు, డ్రెస్‌మెటీరియల్స్ మాకు చేరిపోతాయి. వాటికి అవసరమైన హంగులన్నీ జతచేసి తిరిగి కస్టమర్‌కు చేరవేసే బాధ్యత మాది. చీరకు బ్లౌజ్ వగైరాలు కుట్టడం మాత్రమే కాదు, అవసరమైతే చీర కట్టడం కూడా మా సిబ్బందే చేస్తారు.. విభిన్న రకాల శారీ డ్రేపింగ్స్ సైతం చేస్తారు. అంటూ నగరవాసులకు తాము అందిస్తున్న సేవల జాబితాను ‘సాక్షి’కి వివరించారు సుషి్మత. నగరవ్యాప్తంగా దాదాపుగా 80కిపైగా డిజైనర్లు, పదుల సంఖ్యలో షోరూమ్స్‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారామె. నగరంలో మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోనూ క్లౌడ్ టైలర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సాఫ్ట్వేర్ నుంచి డిజైనర్ వేర్ దాకా.. ‘ఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఏ సంస్థ లేదండీ. అలా చూస్తే ఇప్పుడు అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే’ అంటారు సుషి్మత. మంచి ఆదాయాన్నిచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని, అంతకు మించిన ఆత్మసంతృప్తిని ఆశిస్తూ.. ఓ రెండేళ్ల క్రితం నగరంలో క్లౌడ్ టైలర్ పేరిట టైలరింగ్ సేవల్ని ప్రారంభించా. ఇంటి దగ్గరకే వచ్చి కొలతలు తీసుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్లి, స్టిచి్చంగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికే తెచ్చి ఇవ్వడం అనే ఏకైక సేవతో వేసిన తొలి అడుగుకే అద్భుతమైన స్పందన వచి్చంది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మా సేవల్ని కూడా విస్తరించాం. – సుష్మిత లక్కాకుల, ఫ్యాషన్ డిజైనర్కుట్టుమిషన్తో సహా పంపిస్తాం.. విదేశాల్లో ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లు చేసిన అనుభవం ఉన్న రుహిసుల్తానా.. నగరానికి వచ్చి ఆన్లైన్ టైలరింగ్ సేవల్ని అర్బన్ సిలాయీ పేరుతో ప్రారంభించారు. అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యారు.. పిక్, స్టిచ్, డెలివర్ అనే కాన్సెప్‌్టతో ఆమె ప్రారంభించిన ఈ సంస్థ పూర్తిగా ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ‘ఇప్పుడీ రంగంలో మరికొందరు కూడా ఉన్నారు. అయితే చెప్పిన సమయానికి ఏ మాత్రం తేడా రాకుండా ఖచ్చితత్వంతో ఇచ్చే డెలివరీలో మాకు సాటి లేదు. అదే విధంగా ఇంటికి డ్రెస్ మాత్రమే కాదు ఆల్టరేషన్స్ అవసరమైతే కస్టమర్ కళ్ల ముందే దాన్ని కంప్లీట్ చేయడానికి ఓ మాస్టర్ని కుట్టుమిషన్‌తో సహా పంపిస్తాం’ అంటూ చెప్పారు. బంజారాహిల్స్‌లో ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నా.. విదేశాల్లో సైతం మాకు కస్టమర్స్ ఉన్నారు. వారికి షిప్పింగ్ ద్వారా సేవలు అందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనున్నాం. – రుహిసుల్తానా, అర్బన్ సిలాయీ నిర్వాహకురాలు -
స్టిచ్ ఆన్లైన్.. ఒక క్లిక్‌తో వండర్ఫుల్ స్టిచ్చింగ్!
సాక్షి, సిటీబ్యూరో: స్టిచ్ ఆన్లైన్.. ఇప్పుడు ఇదే నగరంలో నడుస్తున్న నయా ట్రెండ్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ ఆన్లైన్ మయమైంది. కరోనా తర్వాత ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోయింది. ఫుడ్‌తో పాటు మనకు కావాల్సిన వస్తువు ఏదైనా.. ఒక్క క్లిక్‌తో ఇంటికే డెలివరీ ఇస్తున్నారు. నిత్యావసర సరుకులు మొదలుకుని.. ఎలక్ట్రానిక్స్ వరకూ.. టూవీలర్స్ మొదలుకుని.. ఫోర్ వీలర్స్ వరకూ.. ఆఖరికి మెడికల్ సపోర్ట్ కూడా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేసింది.. దీంతో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అన్ని పనులూ చక్కబెట్టేసుకుంటున్నారు. ఇది బిజీబిజీగా ఉండేవారికి ఎంతో వెసులుబాటుగా మారింది. బట్టలు కూడా దాదాపు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. అయితే మనకు నచ్చిన, మన శరీరానికి నప్పే బట్టలు, కొలతల విషయంలో ఇబ్బంది తలెత్తుతోంది. దీనికి పరిష్కారంగానే స్టిచ్ ఆన్లైన్ ట్రెండ్ అవుతోంది. దీంతో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న సమయానికి ఇంటికి వచ్చి కొలతలు తీసుకుని, నచ్చిన మెటీరియల్‌తో నచ్చిన మోడల్‌తో స్టిచ్చింగ్ చేసి, ఇంటికే డెలివరీ ఇస్తున్నారు. దీని గురించిన మరిన్ని విశేషాలు..కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అనే సామెత టైలరింగ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఒకప్పుడు బట్టలు కుట్టించుకోవాలంటే.. టైలరింగ్ షాపుకు వెళ్లి కొలతలు ఇచ్చి కుట్టించుకునేవారు. ఆ తర్వాత రెడీమేడ్స్ రాకతో టైలరింగ్ మరుగునపడిపోయింది.. ఆ తర్వాత ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే సరిగ్గా ఇదే కాన్సెప్్టని ఉపయోగించి ఆన్లైన్ స్టిచ్చింగ్ పేరుతో టైలరింగ్‌కి నూతన హంగులు అద్దారు. అంతేకాదు.. ఇదే ప్రస్తుతం నగరంలో ట్రెండ్‌గా నడుస్తోంది.. అసలేంటీ ఆన్లైన్ స్టిచ్చింగ్? అనుకుంటున్నారా.. అదేనండి.. మనకు వెసులుబాటు ఉన్న సమయంలో మనం బుక్ చేసుకున్న ప్రాంతానికే వచ్చి కొలతలు తీసుకుని నచ్చిన మోడల్స్‌లో స్టిచ్ చేసి ఇంటికే డెలివరీ ఇస్తారన్నమాట!కరోనా తర్వాత..మన అవసరాలే ఆవిష్కరణలకు మూలం అన్నట్లు.. కరోనా సమయంలో ఎంతోమందికి కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో అవసరాల ద్వారా కలిగిన.. అవకాశాలను పలువురు అందిపుచ్చుకున్నారు. ఆ ఆలోచనలను స్టార్టప్స్‌గా మలచి వ్యాపారంలో రాణిస్తున్నారు. చాలామందికి టైలరింగ్ అనగానే ఓ కుట్టు మెషీన్ పెట్టుకుని వచ్చిన వారికి బట్టలు కుట్టడం. కానీ కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాలేని వారు, గర్భిణులకు బట్టలు కుట్టించుకోవడం కష్టం అవుతుంది. అందుకే వారి కోసం ఆన్లైన్ టైలరింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కమాటలో సింపుల్‌గా చెప్పాలంటే క్లౌడ్ టైలరింగ్ అన్నమాట. దీనికే రకరకాల పేర్లు కూడా ఉన్నాయి.. ఆన్లైన్ స్టిచ్, కాల్ దర్జీ, మై టైలర్ ఇలా చాలా వరకూ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్స్ వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నాయి. అభిరుచికి అనుగుణంగా..మోడ్రన్, ట్రెండీ ఫ్యాషన్ డిజైన్స్‌ను ఈ తరం యువత ఎంతగానో ఇష్టపడుతోంది. సోషల్ మీడియాలో నిత్యం వైరల్‌గా మారే వినూత్న డిజైన్లను సైతం వ్యక్తిగతంగా రూపొందించుకోవడానికి ఈ క్లౌడ్ టైలరింగ్ వారధిగా మారింది. తమకు నచ్చిన డిజైన్ల ఫొటోలు లేదా సోషల్ మీడియా లింక్స్ ఈ ఆన్లైన్ టైలర్లకు షేర్ చేస్తే చాలు.. వారి సైజులకు తగినట్టుగా వారు కోరుకున్న ఫ్యాషన్ వేర్ ఇంటికొచ్చేస్తున్నాయి. అంతేకాకుండా అభిమాన సెలబ్రిటీలు ధరించినటువంటి ఫ్యాషన్ హంగులను అనుకరించాలనుకునే ఔత్సాహికులకు కూడా ఈ ఆన్లైన్ వేదిక స్వర్గధామంలా మారింది. ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ లాయర్ మాదిరిగా.. సెలబ్రిటీలకు పర్సనల్ డిజైనర్ మాదిరిగా.. మనకూ ఓ పర్సనల్ టైలర్ అనే చెప్పొచ్చు. అందుకే ఈ ఆన్లైన్ టైలరింగ్ ట్రెండ్‌గా మారుతోంది.సెలబ్రిటీలకు సౌలభ్యంగా..సినీతారలు, బుల్లితెర సెలబ్రిటీలు మొదలు ఈ మధ్య ఫేమస్ అవుతున్న సోషల్‌మీడియా సెలబ్రిటీలు ఎందరో. వీరు షాపింగ్ వెళ్లాలన్నా, బొటిక్స్లో స్టిచ్చింగ్ కోసం వెళ్లాలన్నా అక్కడి పరిస్థితులు సందడిగా మారతాయి. అంతేకాకుండా వారికి కూడా అభిమానుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదురౌతోంది. ఇలాంటి తరుణంలో ఈ ఆన్లైన్ స్టిచ్చింగ్ సెలబ్రిటీలకు సౌలభ్యంగా మారిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ సైతం ఈ ఒరవడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.డిజైనర్ డ్రెస్సులు సైతం..సోషల్ మీడియాలోనో లేదా సినిమాలోనో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫాంలోనో.. లేదా నచ్చిన హీరో, హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కావాలనిపిస్తే.. ఆ క్లిప్ తీసి ఆన్లైన్ టైలరింగ్‌కి పంపిస్తే.. సరిగ్గా అదే తరహాలో డెలివరీ ఇస్తారు. అయితే.. అలాంటి డ్రెస్ కావాలని దగ్గర్లోని టైలర్ దగ్గరికి వెళ్తే.. వారికి ఆ తరహా స్టిచ్చింగ్ రాకపోవచ్చు.. మరీ పెద్ద పెద్ద బొటిక్‌లకు వెళ్తే కాస్త డబ్బులు ఎక్కువ చెల్లించుకోవాల్సి రావచ్చు.. అసలు అలాంటివి ఎక్కడ ఉంటాయో కూడా తెలియకపోవచ్చు.. తెలిసినా దూరాభారం అవ్వొచ్చు.. అందుకే వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం ఆన్లైన్ టైలరింగ్. మనకు నచ్చిన డిజైన్.. మనకు నప్పేలా.. మనకు ఫిట్ అయ్యేలా కుట్టిస్తారు. ఆన్లైన్లో ఎలా సాధ్యం?టైలరింగ్ అంటే మన శరీర కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్ ద్వారా ఎలా సాధ్యం అనే కదా డౌటు. ఆన్లైన్లో మనకు కావాల్సిన డిజైన్ డ్రెస్, జాకెట్, కుర్తా ఇలా ఇంకేదైనా సరే.. ఆర్డర్ పెడితే చాలు. మన ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ల స్టోర్ నుంచి ఓ వ్యక్తి వచ్చి కొలతలు తీసుకుంటారు. ఆ తర్వాత అన్ని పనులు చకచకా చేసేస్తారు. మనకు నచ్చిన డ్రెస్.. చెప్పిన టైంలో మన ఇంటికి వచ్చేస్తుంది. ఇందు కోసం కొలతలు తీసుకునేందుకు లోకల్ టైలర్స్‌తో ఒప్పందం చేసుకోవడం.. లేదా సిబ్బందిని నియమించుకోవడం చేస్తారు. లేని పక్షంలో కస్టమర్లు అందించిన సైజులకు అనుగుణంగా వారు కోరుకున్న డిజైన్లను రూపొందించి పంపిస్తారు. -
నిత్యావసరాలకు ఆన్‘లైన్’ కడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: తాము చెల్లించే డబ్బుకు పూర్తి విలువతో పాటు కొనుగోలు చేసే వస్తువుల్లో నాణ్యతే గీటురాయిగా ఆన్లైన్ కోనుగోలుదారులు పరిగణిస్తున్నారు. దేశంలో ఆన్లైన్ మాధ్యమాల ద్వారా నిత్యావసరాలను కొనుగోలు చేసేవారిలో 86 శాతం నాణ్యతతో కూడిన వస్తువులకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆన్లైన్లో ఆయా సంస్థలు, వేదికలు (ప్లాట్‌ఫామ్స్‌ను) ఎంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 227 జిల్లాల్లో 70 వేల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ‘లోకల్ సర్కిల్స్’నిర్వహించిన అధ్యయనంలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా గతంలోని కస్టమర్ల అలవాట్లతో పోలి్చతే కొన్నింటిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా గుర్తించారు.గతం నుంచి భారతీయులకు నెలవారీగా ఆయా వస్తువులు, నిత్యావసరాలను కొనుగోలుచేసే అలవాటు ఉండగా ఆన్లైన్ కొనుగోళ్లలో మార్పులు వచి్చనట్లుగా చెబుతున్నారు. ఆన్లైన్ మాధ్యమాల ద్వారానే నెలకు ఒక్కసారే కాకుండా, తమకు అవసరమున్నప్పుడల్లా వీలైనన్ని ఎక్కువ సార్లు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమైంది. 2023లో ఇలా అవసరానికి తగ్గట్లుగా కొనుగోలు చేస్తున్న వారు 23 «శాతం కాగా.. 2024లో వీరి సంఖ్య 57 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. డెలివరీ టైమ్ 24 గంటల్లోపు కోరుకుంటున్నవారు 67 శాతం ఉండగా, అరగంటలోనే ఈ వస్తువులు కావాలని కోరుకుంటున్నవారు 17 శాతం ఉన్నట్లుగా వెల్లడైంది. ఆన్లైన్ గ్రాసరీ సెక్టార్లో కస్టమర్ సపోర్ట్ విధానాన్ని కూడా వినియోగదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లుగా తేలింది. నిత్యావసరాల అమ్మకాల్లో అమెజాన్ ఫ్రెష్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వంటివి పుంజుకోవడంతో పాటు వీలైనంత త్వరితంగా ఆయా వస్తువులను కస్టమర్లకు చేర్చే విషయంలో పోటీపడుతున్నట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. ఆన్లైన్ నిత్యావసర వస్తువుల మార్కెట్ విస్తరిస్తున్న క్రమంలో టైర్–3, టైర్–4 నగరాల్లో నాణ్యత, విలువ, డెలవరీ స్పీడ్ వంటి వాటి విషయంలో కొంత ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్విక్ కామర్స్ పాŠల్ట్ఫామ్స్ ద్వారా వేగంగా తాము కోరుకుంటున్న నాణ్యతతో కూడిన వస్తువులను ఇంటిగుమ్మం వద్దకు తెప్పించుకోవడం, నాణ్యతా ప్రమాణాలను సరిచూసుకోవం వంటి వాటితో వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యాలు స్పష్టమవుతున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లు, కూరగాయల వంటి వాటి విషయంలో కృత్రిమ మేధతో (ఏఐ) కూడిన క్యాలిటీ చెక్‌లకు అవకాశమున్నా.. వేగంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువులు (ఎఫ్ఎంసీజీ)ల విషయంలో నాణ్యతను సరిచూసుకోవడం అనేది సవాళ్లతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కొండపల్లి బొమ్మ.. కోటకట్టి కూచుందమ్మా!
కొండపల్లి కొయ్య బొమ్మ ఒక్కసారి మన ఇంట్లోని షోకేస్‌లో చేరిందంటే.. ఎన్ని తరాలైనా అక్కడే కోటకట్టుకుని కూచుండిపోతుంది. అమ్మకు చిన్నప్పుడు జాతరలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి.. అబ్బాయి’ బొమ్మ నుంచి మొదలై.. అన్నయ్య ముచ్చటపడి కొనిపించుకున్న ఎడ్లబండి బొమ్మ.. అక్క కొనుక్కున్న తలాడించే బుట్ట»ొమ్మ.. నాన్నమ్మ భక్తిభావంతో కొనుక్కొచ్చిన దశావతారాల బొమ్మ ఒకదాని పక్కన మరొకటి చేరిపోతుంటాయి. ఎంతకాలమైనా చెక్కుచెదరకుండా తమ అందాలతో అలరిస్తుంటాయి. సాక్షి, అమరావతి: కొండపల్లి కొయ్య బొమ్మలు పురాణాల నేపథ్యం.. గ్రామీణ జీవితం.. జంతువుల రూపంలో సంతోషకరమైన వాస్తవిక వ్యక్తీకరణలను ప్రదర్శిస్తాయి. మెత్తటి కలప.. గింజలు.. పండ్ల తొక్కల నుంచి తీసిన రంగులతో ఆ బొమ్మలు అందాలను అద్దుకుంటాయి. పిల్లలు ఆడుకుంటూ ఆ బొమ్మల్ని ఒకరిపై ఒకరు విసురుకున్నా దెబ్బలు తగలవు. చంటి పిల్లలు ఆ బొమ్మల్ని నోట్లో పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగదు. వీటినే కొండపల్లి కొయ్య బొమ్మలంటారు.ఇప్పుడు ఈ బొమ్మలు కూడా ఆన్లైన్ మెట్లెక్కి అదుర్స్ అనిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఏటా రూ.3 కోట్ల విలువైన కొండపల్లి బొమ్మల విక్రయాలు జరుగుతుండగా.. ఆన్లైన్ మార్కెట్లోనూ అమ్మకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఈ–కామర్స్ సంస్థలు ఏటా రూ.15 లక్షల విలువైన బొమ్మల్ని ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నాయి. వీటి ధర కనిష్టంగా రూ.70 నుంచి గరిష్టంగా రూ.5 వేల వరకు పలుకుతున్నాయి. భౌగోళిక గుర్తింపు(జీఐ)ను పొందిన కొండపల్లి బొమ్మల ఖ్యాతి దేశవ్యాప్తమైంది. విజయవాడ సమీపంలోని కొండపల్లిలో ఇప్పటికీ దాదాపు 200 మంది హస్తకళాకారులకు ఇదే జీవనాధారం. రాజస్థాన్ నుంచి వలస వచ్చి.. రాజస్థాన్ నుంచి 400 ఏళ్ల క్రితం సంప్రదాయ హస్త కళాకారులు కొండపల్లికి వలస వచ్చారు. అక్కడే స్థిరపడిన వారిని ఆర్యకుల క్షత్రియులుగా పిలుస్తారు. వీరు మొదట్లో అనేక ఆలయాల్లో గరుడ, నంది, సింహ వాహనాల వంటి విగ్రహాలను చెక్కినట్టు చెప్తారు. కాలక్రమంలో కొయ్య బొమ్మలు, ఆట బొమ్మలు, అలంకరణ బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టారని చెబుతారు. అతి తేలికైన తెల్ల పొణికి చెక్కలను సేకరించి వివిధ ఆకృతుల్లో బొమ్మల తయారీని వారు జీవనోపాధిగా ఎంచుకున్నారు. తెల్ల పొణికి కర్రను చెక్కి దానికి ప్రత్యేకంగా తయారు చేసిన నిమ్మ జిగురు పూతతో చింతపండు గింజలు, ఇతర చిన్నపాటి వస్తువులను అతికి బొమ్మల్ని రూపుదిద్దుతారు. వాటికి కూరగాయల నుంచి సేకరించిన సహజ సిద్ధౖమెన రంగులు, పొడి రంగులు, ఆయిల్ పెయింట్లు అద్దుతారు. ఆ బొమ్మల జుట్టుగా మేక వెంట్రుకలను అతికించి తీర్చిదిద్దుతారు.గ్రామీణ వాతావరణం.. స్పష్టమైన వ్యక్తీకరణం కొండపల్లిలో తయారు చేసే బొమ్మలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు గ్రామీణ వాతావరణానికి అద్దం పడతాయి. జంతువుల నుంచి మనుషుల బొమ్మల వరకు ప్రతీ దాని మొహంలోనూ స్పష్టమైన వ్యక్తీకరణ తొణికిసలాడుతుంది. జంతువులు, వృత్తులు, రోజువారీ మనిషి జీవితం నుంచి పౌరాణిక పాత్రలు సైతం వీరి చేతిలో ఆకృతి దాల్చుతాయి. దశావతారాలకు ప్రాచుర్యం కళాత్మకమైన పనితనానికి కొండపల్లి కొయ్య బొమ్మలు గుర్తింపు పొందాయి. తాడిచెట్టు, ఎడ్లబండి, అంబారీ ఏనుగు, గ్రామీణ నేపథ్యంలోని బొమ్మలు, బృందావనం బొమ్మలకు భలే క్రేజ్ ఉంటుంది. వీరు తయారు చేసిన బొమ్మల్లో దశావతారాల బొమ్మలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. గీతోపదేశం, పెళ్లికూతురు–పెళ్లికొడుకును మోస్తూ వెళ్తున్న పల్లకీ–బోయీలు, గ్రామాల్లోని చేతివృత్తుల వాళ్ళ సెట్, జంతువుల బొమ్మలకు డిమాండ్ ఉంది. తల ఊపుతూండే అమ్మాయి, అబ్బాయి, బ్రాహ్మణుడు వంటివి చాలామందికి ఇష్టమైన కొండపల్లి బొమ్మలు. -
ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి.. గంజాయి చాక్లెట్లు తెప్పించి..
సాక్షి, హైదరాబాద్: జగిత్యాలలో గంజాయి చాక్లెట్లు తిన్న ఓ బాలుడు వాటి ప్రభావంతో బాలికపై అత్యాచారం చేశాడు. నిజామాబాద్‌కు చెందిన కొందరు చిన్నారులు ఈ చాక్లెట్లకు బానిసలయ్యారు. మరో పెద్దింటి బిడ్డను బానిసను చేయడానికి ప్రయత్నించారు. కొత్తూరు, చిట్యాల, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలల సమీపంలో ఉన్న దుకాణాల కేంద్రంగా ఈ చాక్లెట్ల దందా సాగింది. ఇలా 2022 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి చాక్లెట్లకు సంబంధించి ఏకంగా 42 కేసులు నమోదయ్యాయి. ఈ సరుకంతా ఈ–కామర్స్ సైట్ ఇండియామార్ట్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ విధానంగా ఇక్కడకు రావడం గమనార్హం. దీనిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేంద్రం అదీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో (ఎన్సీబీ) కలిసి పనిచేసి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ల్లో ఉన్న ఎనిమిది ఫ్యాక్టరీలను మూయించారు. ఆయుర్వేద మందుల పేరుతో.. గంజాయి చాక్లెట్ల కర్మాగారాల నిర్వాహకులు ఇండియామార్ట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే..కొరియర్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. వివిధ పేర్లతో రూపొందిన ఈ చాక్లెట్ల రేఫర్లు, కవర్లపై ఆయుర్వేద మందులుగా, 21 ఏళ్ల పైబడి వారికే అమ్మాలనే హెచ్చరికను ముద్రించారు.విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాల ద్వారా విద్యార్థుల చేతుల్లోకి వెళ్లి, వారిని బానిసలుగా మారుస్తున్న ఈ చాక్లెట్ల వ్యవహారం టీజీ ఏఎన్‌బీ దృష్టికొచి్చంది. తయారీదారులు చెబుతున్నట్టు అవి ఆయుర్వేద మందులే అయినా, కేవలం డాక్టర్ చీటీ ఆధారంగానే విక్రయించాలి. అలా కాకుండా ఆన్లైన్లో అమ్మేస్తుండటంతో లోతుగా ఆరా తీసిన అధికారులు అసలు విషయం గుర్తించారు. ఆపరేషన్ జరిగిందిలా.. మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల నమోదుకు వినియోగించే ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత కఠినమైందో..అంతే సున్నితమైంది. నిబంధనలు పాటించకపోతే కోర్టుల్లో ఆ కేసులు నిలబడవు. దీంతో టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్‌శాండిల్య, ఎస్పీలు సాయి చైతన్య, సీతారాం వ్యూహాత్మకంగా వ్యవహరించి డెకాయ్ ఆపరేషన్ చేశారు. అ«దీకృత పంచ్ విట్నెస్ (సాక్షులు) సమక్షంలోనే ఇండియామార్ట్ నుంచి ఆర్డర్ ఇచ్చారు. సీఓడీ కాకుండా తమ అధికారిక ఖాతా నుంచే చెల్లించారు.సదరు కంపెనీ కొరియర్లో పంపిన చాక్లెట్లను పంచ్ విట్నెస్ సమక్షంలోనే తీసుకొని పక్కాగా పంచనామా నిర్వహించారు. ఆపై ఈ వ్యవహారాన్ని వివరిస్తూ ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా నమోదైన కేసులో ఆ కంపెనీ యజమానిని నిందితుడిగా చేర్చారు. మరింతలోతుగా ఆరా తీసిన అధికారులు యూపీ, రాజస్తాన్‌ల్లో ఉన్న 8 గంజాయి చాక్లెట్స్ తయారీ కంపెనీలను గుర్తించారు. ఎన్సీబీ సహకారంతో దాడులు, అరెస్టులు ఈ విషయాలన్నీ టీజీ ఏఎన్‌బీ అధికారులు ఎన్సీబీ దృష్టికి తీసుకెళ్లారు. వారితో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లిన ప్రత్యేక బృందం అక్కడి బివ్రాన్ జిల్లాలో ఉన్న కంపెనీపై దాడి చేసి ఇద్దరు యజ మానులను అరెస్టు చేయించారు. ఆ ప్రాంతంతోపాటు రాజస్తాన్‌లోని మరో ఏడు కంపెనీల్లోనూ సోదాలు చేసి నమూనాలు సేకరించారు. వీటికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలు వచి్చన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ గంజాయి చాక్లెట్ల విక్రయానికి సంబంధించి ఇండియామార్ట్కు టీజీ ఏఎన్‌బీ నోటీసులు పంపించింది. వీటితో స్పందించిన ఆ సంస్థ తమ వెబ్సైట్లో ఉన్న ఈ తరహా ఉత్పత్తులు అన్నింటినీ తొలగించింది. వీటిని డెలివరీ చేసిన కొరియర్ సంస్థలనూ బాధ్యులను చేస్తూ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 87126–71111 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని, అలా చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘సాక్షి’కి తెలిపారు.యూనిట్ల వారీగా గంజాయి చాక్లెట్ల కేసులు ఇలా... సైబరాబాద్ 20 హైదరాబాద్ 10 రాచకొండ 04 నల్లగొండ 01 మెదక్ 01 సిరిసిల్ల 01 రామగుండం 01 సంగారెడ్డి 01 వరంగల్ 01 నారాయణపేట 01 కొత్తగూడెం 01 -
డార్క్ వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్‌లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
Home Food: హోమ్ ఫుడ్స్‌లో షీరో..
ఆన్లైన్లో అమ్మకాల జోష్ లక్షలు సంపాదిస్తున్న మహిళలు స్వయం ఉపాధిగా శిక్షణా తరగతులు షీరో హోమ్ ఫుడ్స్ కొత్త ప్రయత్నం వంటగది నుంచే వ్యాపారంమహిళలు నేడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ కొందరు మహిళలు వివిధ కారణాల రీత్యా ఇంటిగడప దాటలేని పరిస్థితి. కానీ ఏదో ఒక్కటి చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని పరితపిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమకు తెలిసిన వంటలతో ఎంతో కొంత ఆదాయాన్ని పొందాలని ఎందరో ఆలోచిస్తుంటారు. కానీ వాటిని ఎక్కడ? ఎలా? అమ్మాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అటువంటి మహిళలకు మేము ప్రోత్సాహం అందిస్తామంటూ నాలుగు సంవత్సరాల క్రితం ముందుకొచి్చన సంస్థే షీరో హోమ్ ఫుడ్స్. దీని పనేంటి? మహిళలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది? ఎలాంటి మెళకువలు నేర్పిస్తుంది? తెలుసుకుందాం.. తమ వంట గది నుండే మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేలా షీరో హోమ్ ఫుడ్ సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ప్రతి మహిళ తాము చేసే వంట రుచికరంగా ఉండాలనే తపన పడుతుంది. అయితే వారు చేసే వంట అమీర్‌పేటలో చేసినా, అనకాపల్లిలో చేసినా, అమెరికాలో చేసినా ఒకే రంగు.. ఒకే రుచితో పాటు.. ఒకేలా కనబడేలా ఉండేందుకు అన్ని రకాల వంటకాలకూ షీరో హోమ్ ఫుడ్స్ ఉచిత శిక్షణను అందిస్తోంది. దీంతో మహిళలు ప్రతి నెలా ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.10వేల నుండి లక్ష రూపాయల పైబడి సంపాదిస్తున్నారు. చెన్నై కేంద్రంగా ప్రారంభం ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ విస్తరిస్తున్న సమయంలో ప్రజలకు ఆన్లైన్ ద్వారా మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో తిలక్ వెంకటస్వామి, జయశ్రీ తిలక్ దంపతులు చెన్నైలో 2019లో షీరో హోమ్ ఫుడ్స్ సంస్థను ప్రారంభించారు. మహిళలు తమకు తెలిసిన వంట నైపుణ్యానికి షీరో సంస్థ అందించే మెళకువలను జోడించి దక్షిణ, ఉత్తరాది వంటకాలను రుచికరంగా, శుచికరంగా తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు.అందుబాటులో అనేక వంటకాలుతెలుగు వంటకాలే కాకుండా తమిళనాడు, కేరళ, ఉత్తరాది రుచులతో 150 రకాలకు పైగా వంటలను అవలీలగా నిర్ణీత సమయంలో చేసేలా తరీ్ఫదుని ఇస్తోంది. అంతే కాకుండా వారు చేసిన వంటకాలని తమ వెబ్సైట్, యాప్‌తో పాటు స్విగ్గీ, జొమాటో, వాయు, ఓఎన్‌డిసీ వంటి అనేక ఫుడ్ డెలివరీ పార్టనర్స్‌తో భాగస్వామ్యాన్ని కల్పించి, చక్కని ఆదాయాన్ని పొందేలా షీరో హోమ్ ఫుడ్స్ మహిళా సాధికారతకు కృషి చేస్తోంది. పప్పు, పచ్చడి, సాంబారు వంటి ఇంటి భోజన వంటకాలనే కాకుండా, వారు నిష్ణాతులుగా ఉన్న తినుబండారాలు, ఇతర అనేక వంటకాలు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించుకుని స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తోంది.స్వయంశక్తితో ఎదుగుతున్న మహిళలు షీరోలో చేరి ఎందరో మహిళలు తమ స్వయం శక్తితో పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు. పిల్లల ఫంక్షన్లు గర్వంగా చేసుకుంటున్నారు. దీంతోపాటు భర్తలకు చేదోడు వాదోడుగా ఉండగలిగే స్థాయిలో నిలుస్తున్నారు. నలుగురిలో తాము భిన్నమని నిరూపిస్తూ గర్వపడుతున్నారు. మా ఇంట్లో నాన్న హీరో అయితే అమ్మ షీరో అని పిల్లలు తలెత్తుకుని చెప్పేలా చేస్తున్నారు. ఇప్పటికే రెండు వేల మంది మహిళలకు చేయూతగా నిలిచిన షీరో హోమ్ ఫుడ్స్ సంస్థ కొద్ది సంవత్సరాల్లోనే పది లక్షల మంది మహిళలకు చేయూతగా నిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.ఉచిత సెమినార్ వివరాలు.. ఆసక్తి గల మహిళలు ఉచిత సెమినార్లో పాల్గొనేందుకు సెల్ : 6309527444లో తమ పేరు, ఏరియా, సిటీని వాట్సాప్ చేస్తే ఏ తేదీల్లో సెమినార్లో పాల్గొనాలో తెలియజేస్తామని ఆ సంస్థ కన్వీనర్ విజయ్ వర్మ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా ప్రధాన నగరాల మొదలు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఈ కిచెన్‌ని ప్రారంభించి మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చు. నగరంలో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యాలయం.. హైదరాబాద్, మెహిదీపట్నం, రేతి»ౌలిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యాలయం ఉంది. ప్రతి వారం మహిళలకు వంటలపై ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యాపార మెళకువలపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో 100 కిచెన్ పార్టనర్స్ ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 300 మంది కిచెన్ పార్టనర్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మాస్టర్ ప్రాంచైజ్ ఓనర్‌గా సువర్ణదేవి పాకలపాటి ఉంటూ మహిళల అభ్యున్నతే ధ్యేయంగా అహర్నిశలూ శ్రమిస్తున్నారు.పెట్టుబడి లేకుండా... షీరో హోమ్ ఫుడ్స్ సంస్థ ప్రస్తుతం రెండు మోడల్స్‌గా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. పెట్టుబడి లేకుండా ఇంట్లో వుండే స్టవ్, గిన్నెలతో వ్యాపారాన్ని ప్రారంభించే విధానం ఒకటి. ఈ మోడల్లో రూ.10 వేల నుంచి లక్ష వరకూ సంపాదించవచ్చు. కొద్దిపాటి పెట్టుబడితో నలుగురు లేదా ఐదుగురు మహిళలు కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కమ్యూనిటీ కిచెన్‌ని ప్రారంభించి సంపూర్ణ వ్యాపార మోడల్ మరొకటి. సంపూర్ణ వ్యాపార మోడల్లో రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్నవారికి ముందుగా ఓ సెమినార్ నిర్వహించి వ్యాపార నమూనాను వివరిస్తారు. తాము ఇందులో వ్యాపారం చేయగలం అని ముందుకొచ్చిన మహిళా మణులకు షీరో కుటుంబంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తోంది. -
Sagubadi: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..!
విదేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, చెక్క వస్తువులు, అలంకరణ చేపలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారా? విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ కంటికి నచ్చిన పూల మొక్కలనో, పంట మొక్కలనో, వాటి విత్తనాలనో అధికారుల కన్నుగప్పి వెంట తెస్తున్నారా?మిరపతో పాటు కొన్ని కూరగాయ పంటలు, మామిడి తోటలను ఇటీవల అల్లాడిస్తున్న నల్ల తామర ఇలాగే విదేశాల నుంచి వచ్చిపడిందేనని మీకు తెలుసా? కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి తోటలను పీడిస్తున్న రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ కూడా విదేశాల నుంచి మన నెత్తిన పడినదే. వీటి వల్ల జీవవైవిధ్యానికి, రైతులకు అపారమైన నష్టం కలుగుతోంది.ఒక దేశంలో ఉన్నప్పుడు పెద్దగా నష్టం కలిగించని పురుగులు, తెగుళ్లు వేరే దేశపు పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి జీవవైవిధ్యానికి పెను సమస్య్ఠగా మారే ప్రమాదం ఉంటుంది.ఒక్కసారి ఆ పర్యావరణంలో అది సమస్యగా మారిన తర్వాత దాన్ని నిర్మూలించటం చాలా సందర్భాల్లో అసాధ్యం. ఉదాహరణ.. మన రైతులను వేధిస్తున్న నల్లతామర, రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ. అందుచేత.. విదేశాల నుంచి సకారణంగా ఏవైనా మొక్కల్ని, విత్తనాలను, అలంకరణ చేపలను తెప్పించుకోవాలనుకుంటే.. అంతకు ముందే ఫైటోశానిటరీ సర్టిఫికెట్తో పాటు ఇతర అనుమతుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!తెలిసో తెలియకో పోస్టు, కొరియర్ల ద్వారా మన వంటి వారు కొనుగోలు చేస్తున్న విదేశీ మొక్కలు, విత్తనాలతో పాటు మనకు తెలియకుండా దిగుమతయ్యే సరికొత్త విదేశీ జాతుల పురుగులు, తెగుళ్లు మన దేశంలో పంటలకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆహార భద్రతకు ఎసరు పెట్టే పరిస్థితులూ తలెత్తవచ్చు. అందుకే అంతర్జాతీయంగా జన్యువనరుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టుల్లో, సీపోర్టుల్లో, సరిహద్దుల్లో ప్రత్యేక అధికార వ్యవస్థలను ఏర్పాటు చేశారు.మొక్కలు, విత్తనాలే కాదు.. మట్టి ద్వారా కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి చీడపీడలు తెలియకుండా రవాణా కావొచ్చు. ఆ మధ్య ఒక క్రికెటర్ తనతో పాటు తీసుకెళ్తున్న బూట్లకు అడుగున అంటుకొని ఉన్న మట్టిని సైతం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గుర్తించి, నివారించడానికి ఇదే కారణం.అధికారికంగా వ్యవసాయ పరిశోధనల కోసం దిగుమతయ్యే పార్శిళ్లను ఈ క్వారంటైన్ అధికారులు వాటిని నిబంధనల మేరకు పరీక్షించి, ప్రమాదం లేదనుకుంటేనే దిగుమతిదారులకు అందిస్తారు. జాతీయ మొక్కల జన్యువనరుల పరిశోధనా సంస్థ (ఎన్‌బిపిజిఆర్) ద్వారా ఇది జరుగుతుంది.ఒక వ్యాపార సంస్థ నుంచి నేరుగా వినియోగదారుల మధ్య (బి2సి) జరిగే ఆన్లైన్ వ్యాపారం వల్లనే సమస్య. విదేశాల్లోని వినియోగదారులకు ఓ వ్యాపార సంస్థ నేరుగా అమ్మకాలు జరుపుతున్నందున దిగుమతులకు సంబంధించిన ఫైటోశానిటరీ నిబంధనల అమలు కష్టతరంగా మారింది.అంతర్జాతీయంగా ఈ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ ΄్లాంట్ ్ర΄÷టెక్షన్ ఒడంబడిక (ఐపిపిసి) గతంలోనే కుదిరింది. ఇటీవల కాలంలో పెద్ద తలనొప్పిగా మారిన ఈ–కామర్స్ పార్శిళ్లను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థలకు ఐపిపిసి సరికొత్త మార్గదర్శకాలను సూచించింది.- గోల్డెన్ ఆపిల్ స్నెయిల్, - వరి మొక్కపై నత్త గుడ్లుఎవరేమి చెయ్యాలి?దేశ సరిహద్దులు దాటి సరికొత్త చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే, ప్రమాదవశాత్తూ వచ్చినా వాటిని తొలి దశలోనే గుర్తించి మట్టుబెట్టేందుకు సమాజంలోని అనేక వర్గాల వారు చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంది.రైతులు: చీడపీడలను చురుగ్గా గమనిస్తూ ఏదైనా కొత్త తెగులు లేదా పురుగు కనిపిస్తే వెంటనే అధికారులకు చె΄్పాలి. పర్యావరణ హితమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు: చీడపీడల నివారణ, నియంత్రణకు మేలైన పద్ధతులను రైతులకు సూచించాలి. వీటి అమలుకు మద్దతు ఇస్తూ.. మొక్కల ఆరోగ్య పరిరక్షణకు సంబంధీకులందరినీ సమన్వయం చేయాలి.ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు, పాలకులు: మొక్కల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి. పర్యావరణహితమైన సస్యరక్షణ చర్యలను ్రపోత్సహించాలి. ప్రమాదరహితమైన వ్యాపార పద్ధతులను ప్రవేశ పెట్టాలి. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో మొక్కల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ సంస్థలను అన్ని విధాలా బలోపేతం చేయాలి.దాతలు–సిఎస్ఆర్: మొక్కల ఆరోగ్య రక్షణ వ్యవస్థలను, సాంకేతికతలను బలోపేతం చేయాలి. ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులు సమకూర్చాలి. రవాణా, వ్యాపార రంగాలు: ప్రస్తుతం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఫైటోశానిటరీ చట్టాలను, ఐపిపిసి ప్రమాణాలను తు.చ. తప్పక పాటించాలి.ప్రజలు: విదేశాల నుంచి మన దేశంలోకి మొక్కల్ని, మొక్కల ఉత్పత్తుల్ని తీసుకురావటం ఎంతటి ప్రమాదమో గుర్తించాలి. అధికార వ్యవస్థల కన్నుగప్పే విధంగా ఈ–కామర్స్ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా విదేశాల నుంచి మొక్కలను, విత్తనాలను ఆర్డర్ చేయకుండా చైతన్యంతో మెలగాలి.విదేశీ నత్తలతో ముప్పు!ఓ కోస్తా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మంచినీటి నత్త జాతికి చెందిన గోల్డెన్ ఆపిల్ స్నెయిల్ను విదేశాల నుంచి తెప్పించి సిమెంటు తొట్లలో పెంచుతూ పట్టుబడ్డాడు. దక్షిణ అమెరికా దీని స్వస్థలం. అయితే, తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పాకిన ఈ నత్త ఆయా దేశాల్లో తామరతంపరగా పెరిగిపోతూ స్థానిక జలచరాలను పెరగనీయకుండా జీవవైవిధ్యాన్ని, వరి పంటను దెబ్బతీయటంప్రారంభించింది.లేత వరి మొక్కలను కొరికెయ్యటం ద్వారా పంటకు 50% వరకు నష్టం చేకూర్చగలదు. ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 200 కోట్ల డాలర్ల మేరకు పంట నష్టం కలిగించింది. వేగంగా పెరిగే లక్షణం గల ఈ నత్త మంచినీటి చెరువులు, కాలువలు, వరి ΄÷లాల్లో జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యక్తి ఈ నత్తలను పెంచుతూ మాంసాన్ని విక్రయించటంప్రారంభించిన విషయం తెలుసుకున్న అధికారులు అతని వద్ద ఉన్న విదేశీ నత్తలను, వాటి గుడ్లను పూర్తిగా నాశనం చేశారు.దీని వల్ల జీవవైవిధ్యానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఈ నత్తల్ని పెంచటంప్రారంభించినట్లు చెబుతున్నారు. కొరియర్ ద్వారా గాని, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి నత్తలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే, సకాలంలో అధికారులు స్పందించటం వల్ల మన వరి ΄÷లాలకు ఈ నత్తల ముప్పు తప్పింది.ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్..ఎండిన, ముక్కలు చేసిన లేదా పాలిష్ చేసిన ధాన్యాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా చీడపీడలను మోసుకొచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఉడికించటం, స్టెరిలైజ్ చేయటం, వేపటం వంటిప్రాసెసింగ్ చేసిన ఆహారోత్పత్తుల ద్వారా మాత్రం చీడపీడలు రవాణా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వీటికి ఫైటోశానిటరీ నిబంధనలు వర్తించవు.తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మాంటిడ్స్, పెంకు పురుగులు, పుల్లలతో చేసిన బొమ్మ మాదిరిగా కనిపించే పురుగులు (స్టిక్ ఇన్సెక్ట్స్), నత్తలు వంటి వాటిని కొందరు సరదాగా పెంచుకోవటానికి కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి పంపటం లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయటం వంటి పనులు చేస్తుంటారు. వీటి ద్వారా కూడా పురుగులు, తెగుళ్లు, వైరస్లు ఇతర దేశాలకు వ్యాపించే అకాశం ఉంటుంది. న్యూజిలాండ్‌లో మూడేళ్ల క్రితం ఒక స్కూలు విద్యార్థిని ఇంట్లో పెద్దలకు తెలియకుండా అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లను పోర్చుగల్ దేశం నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసి తెప్పించుకుంది. పార్శిల్ వచ్చిన తర్వాత గమనించిన ఆమె తల్లి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఆ పార్శిల్‌ను జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్షించి చూశారు.ఆ దేశంలో అప్పటికే ఉన్న అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్స్ గుడ్లతో పాటు కొత్త రకం ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లు కూడా ఆ పార్శిల్లో ఉన్నాయని గుర్తించి నాశనం చేశారు. ఈ విద్యార్థిని తల్లి చైతన్యం మెచ్చదగినది.సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు!ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా వస్తువుల వ్యాపారం (ఈ–కామర్స్) గతమెన్నడూ లేనంత జోరుగా సాగుతున్న రోజులివి. సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2022లో ఏకంగా 16,100 కోట్ల పార్శిళ్ల కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయి. కరోనా కాలంలో 20% పెరిగాయి. ఇప్పుడు వార్షిక పెరుగుదల 8.5%. 2027 నాటికి ఏటా 25,600 కోట్ల పార్శిళ్లు ఈ కామర్స్ ద్వారా బట్వాడా అయ్యే అవకాశం ఉందని అంచనా.- అమెరికాలోని ఓ తనిఖీ కేంద్రంలో ఈ–కామర్స్ పార్శిళ్లుముఖ్యంగా అసక్తిగా ఇంటిపంటలు, పూల మొక్కలు పెంచుకునే గృహస్తులు చిన్న చిన్న కవర్లలో విత్తనాలను విదేశాల్లోని పరిచయస్తులకు పోస్ట్/ కొరియర్ ద్వారా పంపుతుంటారు. విదేశీ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి విత్తనాలు, ఉద్యాన తోటల మొక్కలు, అలంకరణ మొక్కలు, వాటితో పాటు వచ్చే మట్టి, అలంకరణ చేపలు, చెక్కతో చేసిన వస్తువులు, యంత్రాల ప్యాకింగ్‌లో వాడే వుడ్ ఫ్రేమ్‌ల ద్వారా పురుగులు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా అవుతూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి.కరోనా కాలం నుంచి ప్రపంచ దేశాల మధ్య పార్శిళ్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటంతో నియంత్రణ వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. మన దేశంలో నియంత్రణ వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
BEALERT: మీ డేటా జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్‌గా మారిన యూపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్‌కుమార్ ఏకంగా పోలీసు వెబ్సైట్లు హ్యాక్ చేయడం ద్వారా ఆ విభాగానికే సవాల్ విసిరి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇలా ఇతనొక్కడే కాదు... ఆన్లైన్లో చాలామంది కేటుగాళ్లు అదను కోసం వేచి చూస్తున్నారు. కంప్యూటర్లకు తోడుగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి కొన్నింటిని నగర సైబర్‌క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయొద్దు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్, పోస్టింగ్స్ మామూలైపోయాయి. లైక్‌ల కోసం వ్యక్తిగత విషయాలను నెట్లో పడేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఎక్కువగా పోస్ట్ చేసినప్పుడు జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయకుండా ఉండాలి. వివిధ సర్వేల పేరుతో ఆన్లైన్లో వచ్చే ఫామ్స్ అనాలోచితంగా నింపొద్దు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు, పూర్తి పేర్లు రాయకూడదు.అఆ ‘పాస్వర్డ్లు’ వద్దే వద్దు ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన అనేక సర్వేలు పాస్వర్డ్స్ విషయంలో వినియోగదారుల వీక్నెస్ బయటపెట్టింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‘1234తో తమ పేరు/ఇంటి పేరు’, ‘పాస్వర్డ్స్ అనే పదం’తదితరాలు పెట్టుకుంటున్నారని, పిన్ల విషయంలో ‘1234’, ‘1111’, ‘0000’ వంటివే ఎక్కువగా వాడుతున్నారని గుర్తించింది. దీనికి భిన్నంగా ఊహించడం కష్టంగా ఉండే, డ్యూయల్ అథెంటికేషన్ తదితరాలను ఎంపిక చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో కచ్చితంగా క్యాపిటల్, సంఖ్య, గుర్తు (హ్యాష్‌ట్యాగ్, స్టార్, ఎట్ వంటివి) ఉండేలా చూసుకోవాలి.‘ఎక్స్టెన్షన్’లను తొలగించండి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల్లో మీరు ఉపయోగించిన... తరచూ వినియోగించే యాప్‌లు, బ్రౌజర్లకు ఎక్స్టెన్షన్లను అనేక మంది అలానే ఉంచుకుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుంది. ఈ నేపథ్యంలో కచి్చతంగా ప్రతి ఒక్కరూ ఆయా ఎక్స్‌టెన్షన్స్‌ను తొలగించాలి. అ«దీకృత మినహా ప్రతి యాప్‌ను అనుమానించాల్సిందే. అనేక యాప్స్ వినియోగదారు డేటాను సేకరించి, విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అధికారిక యాప్ స్టోర్స్ మాత్రమే వినియోగించాలి.‘చరిత్ర’ను తుడిచేయాల్సిందే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం నుంచి వ్యక్తిగత విషయాల కోసమూ వివిధ సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే 95% మందికి సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలన్న విషయం తెలియట్లేదు. ఇలా చేయకపోతే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చేరుతుంది. కొన్ని సెర్చ్ ఇంజన్లలో ఈ డిలీట్ ఆప్షన్ ఉండదు. అందుకే కచి్చతంగా సురక్షితమైన సెర్చ్ ఇంజన్, వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి.అదీకృత అప్డేట్స్ చేసుకోవాల్సిందే ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు వాడే యాప్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటిలో బగ్ లేదా లోపాలను గుర్తించడానికి తయారీదారులు నిత్యం పరిశోధన, అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఇలాంటివి గుర్తిస్తే ‘ప్యాచ్’ చేయడానికి సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ విడుదల చేస్తుంటారు. ఇలా అధీకృత సంస్థ నుంచి వచ్చే అప్డేట్స్ను కచ్చితంగా వినియోగించుకోవాలి. అలా చేయకపోతే డేటాను యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచి్చనట్లే అవుతుంది.లాగిన్ వివరాలు వేరుగా ఉండాలిథర్డ్ పార్టీ యాప్‌ల వినియోగం వీలున్నంత వరకు తగ్గించాలి. అంటే... వేర్వేరు యాప్‌లను లాగిన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించకూడదు. ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ ఖాతాలను లాగిన్ చేసేందుకు చాలా మంది ఫేస్బుక్ ఖాతాను వినియోగిస్తారు. అలాగే అనేక అంశాల్లో గూగుల్ వివరాలు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్క పాస్వర్డ్ సంగ్రహించే హ్యాకర్లు మిగిలిన అన్నింటినీ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి లాగిన్స్ అన్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ‘పబ్లిక్’ని వాడుకోవడం ఇబ్బందికరమేఆన్లైన్లో బ్రౌజ్ చేసేప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (వీపీఎన్) వినియోగించడం మంచిది. అత్యవసర సమయాల్లో పబ్లిక్ వైఫై వంటివి వినియోగించాల్సి వస్తే జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవాల్సిందే. ఇలాంటి సురక్షితం కాని నెట్వర్క్స్ వాడుతున్నప్పుడు బ్యాంకు లావాదేవీలు వంటి ఆర్థిక కార్యకలాపాలు చేయొద్దు. అలాగే ఓటీపీలు, పాస్వర్డ్స్, పిన్ నంబర్లు తదితరాలు ఎంటర్ చేయొద్దు. -
ఆన్లైన్లో పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఇలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ లేదా పాన్ కార్డు అనేది దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది పన్ను సంబంధిత ప్రయోజనాలకు, గుర్తింపు రుజువుగానూ పనిచేస్తుంది. ప్రతి పాన్ కార్డు ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్యను కలిగి ఉంటుంది. దీన్ని ఆదాయపు పన్ను శాఖ లామినేటెడ్ కార్డు రూపంలో జారీ చేస్తుంది.ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఏ ఉత్తరప్రత్యుత్తరాలపై పాన్ కార్డు నంబరును కోట్ చేయడం తప్పనిసరి. 2005 జనవరి 1 నుంచి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన చెల్లింపులకు చలాన్లపై పాన్ కోట్ చేయడం తప్పనిసరి. ఈ క్రింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లలో పాన్ ను కోట్ చేయడం కూడా తప్పనిసరి. దీని కోసం పాన్ కార్డును ఎప్పటికప్పుడు వెరిఫై చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్లో పాన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియస్టెప్ 1: ఇన్కమ్ ట్యాక్స్ 'ఈ-ఫైలింగ్' పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.స్టెప్ 2: 'క్విక్ లింక్స్' సెక్షన్ నుంచి 'వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్' హైపర్ లింక్‌పై క్లిక్ చేయండి.స్టెప్ 3: పాన్, పూర్తి పేరు (పాన్ ప్రకారం), పుట్టిన తేదీ ఎంటర్ చేసి 'స్టేటస్'పై క్లిక్ చేయండిస్టెప్ 4: ఇమేజ్‌లో ఉన్న విధంగా క్యాప్చా ఎంటర్ చేసి మీ పాన్ వివరాలను ధ్రువీకరించడానికి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి. -
ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి/నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మిడియట్ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియకు ఇంటర్మిడియట్ విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అధ్యాపకులు సెంటర్లలో మాన్యువల్‌గా చేస్తున్న ప్రక్రియను ఇకపై ఇంటి నుంచి లేదా కళాశాల నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ విధానం వల్ల మూల్యాంకనంలో పొరపాట్లు జరగవని, తద్వారా రీ వెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్‌కు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖర్చు, సమయం ఆదా అవడంతో పాటు విద్యార్థికి నూరు శాతం న్యాయం జరుగుతుంది. తక్కువ సమయంలోనే ఫలితాలు ఇవ్వవచ్చని చెబుతున్నారు. డీఆర్డీసీల స్థానంలో స్కానింగ్ సెంటర్లు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఇప్పటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్, డి్రస్టిబ్యూషన్ సెంటర్ (డీఆర్డీసీ) లు ఉన్నాయి. ఆన్లైన్ మూల్యాంకనంలో డీఆర్డీసీ స్థానంలో రీజినల్ రిసెప్షన్ స్కానింగ్ సెంటర్లు (ఆర్ఆర్ఎస్సీ) ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి జిల్లాలో సేకరించిన జవాబు పత్రాలను జంబ్లింగ్ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నంలలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ రోజు జవాబు పత్రాలను ఈ కేంద్రాల్లో స్కాన్ చేస్తారు. ప్రతి ప్రశ్నను పరిశీలించాల్సిందే ఆన్లైన్ మూల్యాంకనంలో పొరపాట్లకు తావుండదు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే అనేక పొరపాట్లకు ఆన్లైన్ విధానంతో చెక్ పెట్టవచ్చు. విద్యార్థి రాసినా, రాయకపోయినా ప్రతి ప్రశ్నను అధ్యాపకుడు పరిశీలించాలి. జవాబుకు ఇచి్చన గరిష్ట మార్కులకంటే ఎక్కువ వేసినా సిస్టం తీసుకోదు. – ఎం.నీలావతిదేవి,జిల్లా ఇంటర్మిడియట్ విద్యా శాఖాధికారి, పల్నాడు జిల్లాతప్పులకు ఆస్కారం లేదు ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ, పలు విద్యా సంస్థలు ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో తప్పులకు ఆస్కారం ఉండదు. ముందుగానే కొన్ని జవాబు పత్రాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తాం. వాటిని అధ్యాపకులకూ పంపిస్తాం. నిపుణులు మూల్యాంకనం చేసిన విషయం అధ్యాపకుడికి తెలియదు. దీనివల్ల వారు పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తున్నారో తెలుస్తుంది. మాన్యువల్ విధానంలో పలు పొరపాట్లు జరిగేవి. ఆన్లైన్ విధానంలో ఒక్క తప్పు కూడా జరగదు. – సౌరభ్ గౌర్,ఇంటర్ విద్యా మండలి కమిషనర్ఆన్లైన్ మూల్యాంకనం ఇలా..స్కాన్ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అర్హతలుండి జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదైన అధ్యాపకులకు పంపిస్తారు. వారు httpr://apbieeva.order.in/ వెబ్సైట్లో తమ టీచర్ యుఐడీ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. సైట్లో ప్రతి రోజూ ఒక్కో అధ్యాపకునికి 60 జవాబు పత్రాలు ఉంటాయి. ⇒ ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల్లోపు ఇల్లు లేదా కళాశాలలో సొంత ల్యాప్‌టాప్/ కంప్యూటర్ లేదా కాలేజీ సిస్టంలో మాత్రమే మూల్యాంకనం చేయాలి. ఇంటర్నెట్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లను వినియోగించకూడదు. ⇒ మొత్తం 25 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థి వివరాలు ఉన్న మొదటి పేజీ తప్ప, మిగిలిన 24 పేజీలు అధ్యాపకులకు ఇస్తారు. తద్వారా ఏ పేపర్ ఎవరిదో అధ్యాపకులకు తెలియదు. మొదటి పేజీలోని విద్యార్థి బార్కోడ్ నంబర్ డీ–కోడ్ అవడంతో కంప్యూటర్ తప్ప మరొకరు గుర్తించడం సాధ్యం కాదు. ⇒ కంప్యూటర్‌కు ఉన్న కెమెరా ద్వారా ప్రతి 15 నిమిషాలకు అధ్యాపకుడి లైవ్ ఫొటో బోర్డుకు చేరుతుంది. తద్వారా మూల్యాంకనం ఎవరు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలుస్తుంది. ⇒ ఆన్లైన్లో కనిపించే జవాబు పత్రాలను ఫొటోలు తీసినా, ఇతరులకు పంపినా ఆ వివరాలు కూడా బోర్డుకు తెలిసేలా ‘ఏఐ’ టెక్నాలజీని వినియోగించారు. ⇒ ఆన్లైన్ మూల్యాంకనంలో డాష్‌బోర్డుపై ఎడమ చేతి వైపు జవాబు పత్రం, కుడివైపు గ్రిడ్‌లో ప్రశ్నల నంబర్లు, వాటికి కేటాయించిన మార్కులు ఉంటాయి. పక్కనే ఎగ్జామినర్ ఇచ్చే మార్కుల నమోదుకు బాక్స్ ఉంటుంది. అధ్యాపకుడు అందులో మార్కులు వేయాలి. ⇒ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకపోతే ఆ ప్రశ్న సంఖ్య ఆన్లైన్లో కనిపిస్తుంది. ⇒ ఒక గ్రూప్‌లో 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటే కొందరు విద్యార్థులు 6 ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఇలాంటప్పుడు రాసిన అన్ని జవాబులకు మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వచి్చన 4 జవాబులనే సిస్టం తీసుకుంటుంది. దీనిద్వారా విద్యారి్థకి న్యాయం జరుగుతుంది. ⇒ మాన్యువల్ మూల్యాంకనంలో ఎగ్జామినర్లు కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటిని మర్చిపోవడం, టోటల్ మార్కుల నమోదులో పొరపాట్లు జరుగుతుంటాయి. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోరినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఏ జవాబుకైనా మార్కులు ఇవ్వకపోతే వెంటనే ‘ఎర్రర్’ చూపి ఎక్కడ మార్కులు వేయలేదో చూపుతుంది. దీంతో మార్కుల నమోదు మర్చిపోయేందుకు ఆస్కారం లేదు. ప్రతి జవాబుకు తప్పనిసరిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకుడు ఇచి్చన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలిస్తారు. జవాబు పత్రాల్లో 10 శాతం పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్కులను నమోదు చేస్తారు. -
విశాఖ జైలులో ఈ–ములాఖత్‌లు ప్రారంభం
ఆరిలోవ: విశాఖ జైలులో ఖైదీలు వారి కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి చూసుకునే వెసులుబాటు లభించింది. ఇందుకోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ–ములాఖత్‌ల విధానాన్ని జైలు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికే ఈ అవకాశం ఉండేది. ములాఖత్‌కు వెళ్లిన వారి ద్వారానే మిగిలిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై స్వయంగా ములాఖత్‌లతో పాటు ఈ–ములాఖత్ విధానాన్ని కూడా అందుబాటులోకి తేవడంతో ఖైదీలు ఇంట్లో వారందరిని చూస్తూ వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు ఈ – ములాఖత్ కోసం అధికారులు ప్రత్యేకంగా వెబ్సైట్లో అప్లికేషన్‌ను రూపొందించారు. ఖైదీ కుటుంబ సభ్యులు ముందుగా ఆ వెబ్సైట్ ద్వారా ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జైలు అధికారులు వాటిని పరిశీలించి వారికి నిర్దిష్టమైన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. ఆ వివరాలను ఖైదీకి కూడా తెలియజేస్తారు. ఆ సమయానికి ఖైదీ కంప్యూటర్లో కుటుంబ సభ్యులను చూస్తూ వారితో ముచ్చటించొచ్చు.ఇందుకోసం జైలులో కూడా ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. భౌతికంగా ములాఖత్‌కు రాలేని వారు ఇకపై ఆన్లైన్ ద్వారా అయినా వారానికి రెండుసార్లు మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. ఈ–ములాఖత్ ద్వారా సోమవారం పలువురు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ తెలిపారు. -
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు అవసరమైన కీలకమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు సరైనవి ఉండడం చాలా అవసరం.ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉన్నా, మారినా వెంటనే సరిచేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు మొదట ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే అదే వెబ్సైట్లోనే పాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వేళ యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా చేసినట్లయితే ఆ వెబ్సైట్ ద్వారానే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలి.NSDL e-Gov పోర్టల్‌లో.. స్టెప్ 1: NSDL e-Gov పోర్టల్‌ను ఓపెన్ చేయండిస్టెప్ 2: 'సర్వీసెస్' ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'పాన్' ఎంచుకోండి.స్టెప్ 3: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా' అనే విభాగం కోసం స్క్రోల్ చేసి 'అప్లై' మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అవసరమైన వివరాలతో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయండిస్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, ఈ-మెయిల్ ద్వారా టోకెన్ నంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబరు సెషన్ సమయం ముగిసినట్లయితే ఫారం డ్రాఫ్ట్ వెర్షన్ కు తీసుకెళ్తుంది. ఇక్కడ 'కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్' పై క్లిక్ చేయాలి.స్టెప్ 6: ఈ-కేవైసీ, ఈ-సైన్ (పేపర్ లెస్) ద్వారా డిజిటల్ గా సబ్మిట్ చేయండిస్కాన్ చేసిన ఇమేజ్ లను ఈ-సైన్ ద్వారా సబ్మిట్ చేయండిఅప్లికేషన్ డాక్యుమెంట్ లను భౌతికంగా ఫార్వర్డ్ చేయండి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.ఆధార్ ఓటీపీ ద్వారా ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేయడానికి, 'ఈ-కేవైసీ & ఈ-సైన్ (పేపర్‌లెస్) ద్వారా డిజిటల్‌గా సబ్మిట్ చేసే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోండి.స్టెప్ 7: అప్డేట్ చేసిన పాన్ కార్డు కొత్త ఫిజికల్ కాపీ మీకు అవసరమని సూచించండి. దీనికి నామమాత్రపు ఛార్జీలు వర్తించవచ్చు.స్టెప్ 8: మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి.స్టెప్ 9: అవసరమైన వివరాలను అప్డేట్ చేసి, సంబంధిత దిద్దుబాటు లేదా అప్డేట్ ఎంచుకోండి. 'కాంటాక్ట్ ఇతర వివరాలు' పేజీకి వెళ్లడానికి 'నెక్ట్స్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 10: కొత్త చిరునామా, అప్డేటెడ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి.స్టెప్ 11: పాన్ కాపీతో పాటు అప్డేట్ చేసిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేయండి.స్టెప్ 12: మీ పేరును పేర్కొనడం ద్వారా డిక్లరేషన్ విభాగాన్ని పూర్తి చేయండి.స్టెప్ 13: మీ ఫోటో, సంతకం కాపీని జతచేసిన తర్వాత 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 14: ఫారం ప్రివ్యూను సమీక్షించుకుని, మీ ఆధార్ నంబర్ మొదటి ఎనిమిది అంకెలను నమోదు చేయండి.స్టెప్ 15: పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లండి. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా పేమెంట్ చేయవచ్చు. విజయవంతంగా చెల్లించిన తరువాత, చెల్లింపు రశీదు జారీ అవుతుంది.స్టెప్ 16: పాన్ కార్డ్ అప్డేట్ / కరెక్షన్ ప్రక్రియను ఖరారు చేయడానికి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించి 'అథెంటికేట్' మీద క్లిక్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.స్టెప్ 17: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి.స్టెప్ 18: తర్వాత స్క్రీన్‌పై ఈ-సైన్‌తో 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.స్టెప్ 19: నియమనిబంధనలను అంగీకరించి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ' పై క్లిక్ చేయండి.స్టెప్ 20: వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి. అక్నాలెడ్జ్ మెంట్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఫైలును తెరవడానికి పాస్ వర్డ్ DD/MM/YYYY ఫార్మెట్ లో మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.UTIITSL పోర్టల్‌లో ఇలా..స్టెప్ 1: UTIITSL వెబ్‌సైట్‌ను తెరవండిస్టెప్ 2: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్' ట్యాబ్‌ను ఎంచుకుని ‘క్లిక్ టు అప్లయి’ మీద క్లిక్ చేయండిస్టెప్ 3: 'అప్లయి ఫర్ చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ డీటెయిల్స్' ట్యాబ్‌ను ఎంచుకోండిస్టెప్ 4: డాక్యుమెంట్ సబ్మిషన్ విధానాన్ని ఎంచుకుని, మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ మోడ్‌ను ఎంచుకుని, 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.స్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. 'ఓకే' మీద క్లిక్ చేయండి.స్టెప్ 6: ఎక్కడెక్కడ అప్డేట్స్ అవసరమో అక్కడ కచ్చితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి 'నెక్ట్స్ స్టెప్' పై క్లిక్ చేయండిస్టెప్ 7: మీ ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా అప్డేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.స్టెప్ 8: పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్ బటన్ క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.స్టెప్ 9: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.స్టెప్ 10: ఫారంలోని వివరాలను సమీక్షించి, 'మేక్ పేమెంట్' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపు కొనసాగించండి.స్టెప్ 11: నచ్చిన ఆన్లైన్ పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. విజయవంతంగా పేమెంట్ చేసినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఈ ఫారాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది.సాధారణంగా పాన్ కరెక్షన్ ప్రక్రియలకు 15 రోజులు పడుతుంది. మీ పాన్ కార్డు పోస్ట్ ద్వారా పంపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.ఆఫ్‌లైన్‌లో పాన్ అప్డేట్ ఇలా..» ఇంటర్నెట్ నుంచి పాన్ కార్డు కరెక్షన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.» ఫారం అన్ని విభాగాలను కచ్చితంగా పూర్తి చేసి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి» అవసరమైన డాక్యుమెంట్లతో నింపిన ఫారంను సమీపంలోని పాన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి.» సబ్మిట్ చేసి, రుసుము చెల్లించిన తర్వాత, కేంద్రం నుంచి అంగీకార స్లిప్ పొందండి.» 15 రోజుల వ్యవధిలో, ఈ అంగీకార స్లిప్‌ను ఎన్ఎస్డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కు పంపండి.కావాల్సిన డాక్యుమెంట్లుపాన్ కార్డు డూప్లికేట్ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి గుర్తింపు రుజువులు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపన్ను రశీదులు, యుటిలిటీ బిల్లులు వంటి చిరునామా రుజువులు. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ మార్క్ షీట్ తదితరాల ఆధారాలు. -
Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఒకప్పుడు పెద్ద తతంగమే ఉండేది. సమీపంలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దాని పరిస్థితేమిటో తెలిసేది కాదు. ఓటర్ల జాబితా విడుదలైనప్పుడు అందులో పేరుంటే ఓటు హక్కు వచ్చినట్టు తెలిసేది! ఇదంతా గతం. ఇప్పుడు ఎన్నికల సంఘం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. సేవలు, విధులను దాదాపుగా డిజిటలీకరించింది. తద్వారా పాదర్శకతను పెంచే దిశగా కృషి చేస్తోంది. ఓటరుగా నమోదు మొదలుకుని తప్పొప్పులు, చిరునామా సవరణలు, ఓటు బదిలీ దాకా ఇప్పుడన్నీ కూర్చున్న చోటినుంచి ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. అంతేనా?! ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది, అక్కడికెలా వెళ్లాలి, అభ్యర్థులు, వారి ఆస్తులు, కేసుల వివరాల వంటివన్నీ స్మార్ట్ ఫోన్ నుంచే తెలుసుకోవచ్చు. ఎన్నికల్లో అవకతవకలపై ఫిర్యాదులు కూడా ఆన్లైన్లోనే చేసేయవచ్చు. ఇలా గడిచిన దశాబ్ద కాలంలో ఎన్నికల సంఘం తీసుకొచి్చన డిజిటల్ మార్పులు అన్నీ ఇన్నీ కావు. వాటిని ఓసారి తెలుసుకుందాం...ఎల్రక్టానిక్ పోస్టల్ బ్యాలెట్ (2016)ఎన్నికల విధుల్లో ఉండే సరీ్వస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్లను ఎల్రక్టానిక్ రూపంలో పంపించేందుకు ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. ఎల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్‌గా పిలుస్తారు.ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (2019)తమ నియోజకవర్గంలో పోలింగ్ ఎప్పుడో ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో తమ పేరునూ పరిశీంచుకోవచ్చు. అభ్యర్థుల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ ఎంత ఉందన్నది ఎప్పడికప్పుడు తెలుసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు కూడా అందుబాటులో ఉంటాయి.ఎరోనెట్ (2018) ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్స్ నెట్వర్క్ సంక్షిప్త రూపమే ఎరోనెట్. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడి సదుపాయాలు వినియోగించుకునేందుకు వీలుగా డిజిటల్ నెట్‌వర్క్‌ను ఈసీ రూపొందించింది. ఎన్వీఎస్పీ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా పౌరులు నమోదు చేసే డేటాకు ఇది బ్యాకప్‌గా పని చేస్తుంటుంది.సి–విజిల్ యాప్ (2018)ఎన్నికల నియమావళిని అభ్యర్థులు ఉల్లంఘించినా, అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు చేస్తున్నా; ఓటర్లను ధన, వస్తు రూపంలో ప్రలోభాలకు గురి చేస్తున్నా ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫొటో, వీడియో రుజువులను లొకేషన్ జియోట్యాగ్ చేసి అప్లోడ్ చేయవచ్చు.సక్షమ్ ఈసీఐ యాప్ (2023)గతంలో దీన్ని పర్సన్స్ విత్ డిజెబుల్డ్ యాప్ (పీడబ్ల్యూడీ)గా పిలిచేవారు. దివ్యాంగులు ఇందులో అభ్యర్థుల సమాచారం, పోలింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలి? ఫిర్యాదుల నమోదు, బూత్ వరకు వెళ్లేందుకు సాయం కోరడం తదితర సేవలను పొందవచ్చు. అబ్జర్వర్ యాప్ (2019)ఎన్నికల పరిశీలకులు (సాధారణ, పోలీసు, వ్యయ) ఈ యాప్ ద్వారా తమ నివేదికలను ఫైల్ చేయవచ్చు. సి–విజిల్ యాప్ ద్వారా వచి్చన ఫిర్యాదులు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడ ఉందన్నది ఈ యాప్ ద్వారా ఎన్నికల అధికారులు చూడవచ్చు. అవసరమైతే స్క్వాడ్‌ను పిలవడం తదితర టాస్క్‌లను నిర్వహించుకోవచ్చు.గరుడ యాప్ (2020)బూత్ స్థాయి అధికారుల కోసం తెచి్చన యాప్. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, క్షేత్రస్థాయి తనిఖీలు, డాక్యుమెంట్లు, ఫొటోల అప్‌లోడింగ్‌కు వీలు కల్పిస్తుంది.నో యువర్ క్యాండిడేట్ (2022)అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్ ద్వారా ఓటర్లు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, వారిపై క్రిమినల్ కేసులు తదితర పూర్తి సమాచారం లభిస్తుంది.ఓటర్ టర్నౌట్ యాప్ (2019)పోలింగ్ నాడు దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎలా ఉందో ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.క్యాండిడేట్ నామినేషన్ యాప్ (2020)అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ యాప్ ద్వారా డిజిటల్‌గానే దాఖలు చేయవచ్చు. అఫిడవిట్ డిజిటల్ కాపీని అప్లోడ్ చేసి, సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఆన్లైన్లోనే చెల్లించవచ్చు.ఈ–ఎపిక్/డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులు (2021) ఎలక్షన్ ఫొటో ఐడీ కార్డ్ (ఎపిక్) ఎంతో ముఖ్యమైనది. భౌతిక కార్డు లేని వారు ఈ–ఎపిక్‌ను ఈసీ పోర్టల్ నుంచి మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ చూపించి కూడా ఓటు వేయవచ్చు.నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (ఎన్వీఎస్పీ) (2015) ఈ పోర్టల్ (వెబ్సైట్) ద్వారా కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, నియోజకవర్గాలు, వాటి పరిధిలో పోలింగ్ కేంద్రాల సమచారం తెలుసుకోవచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో), ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ల వివరాలు కూడా ఇక్కడే లభిస్తాయి. ఎన్వీఎస్పీ ఆధునీకరణ (2019) ఓటర్లకు కావాల్సిన సేవలన్నింటికీ ఏకీకృత పోర్టల్‌గా www.nvsp.in పేరుతో ఈసీ దీన్ని అభివృద్ధి చేసింది. తర్వాత ఠి్టౌ్ఛటట.్ఛఛిజీ.జౌఠి.జీnకు అనుసంధానం చేసింది. ఐటీ నెట్వర్క్ (2019) దేశవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో తాజా సమాచారం, ఓట్ల లెక్కింపు తాలూకు తాజా ఫలితాలు తెలుసుకునేందుకు ఎన్నికల సిబ్బంది కోసం తీసుకొచి్చన నెట్వర్క్. 2019 ఎన్నికల కౌంటింగ్‌కు ముందు దీన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, రిటరి్నంగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఐటీ సదుపాయం ద్వారా తాజా సమాచారం తెలుసుకుని డిజిటల్ తెరలపై ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడింది. ఆధార్‌తో అనుసంధానం (2022) ఓటర్ జాబితాలో కచ్చితత్వానికి వీలుగా ఓటర్ల ఎపిక్‌లతో ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
అమెరిలో ఏప్రిల్ 27 వ తారీకు సాయంత్రం (భారత దేశ కాలమానము ఏప్రెల్ 28 ఉదయము) తొలి ప్రపంచ తెలుగు సమితి, "వరల్డ్ తెలుగు కన్సార్టియం" అంతర్జాల సమావేశం అద్భుతంగా జరిగింది.ఎనిమిది దేశాలకు చెందిన 27మంది వక్తలు, సంధానకర్తలతో సభ కళ కళ లాడింది. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ , తెలుగు సాహిత్య ప్రపంచం లోని అతిరధ, మహారధులు పాల్గొన్నారు. మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు, వారి రచనల పై ఉత్తేజమైన ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.ఈ సమావేశాన్ని యూట్యూబ్ లో వీక్షించవచ్చు. -
తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వసమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు”అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారంఅని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూపాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్నసాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ..“భాషాసౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యంకలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయ వలసిన కృషి ఎంతైనా ఉందన్నారు” పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పీహెచ్డీ పట్టా అందుకుని, అదే విశ్వ విద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానంఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపు కథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు.ప్రత్యక అతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలుమొదలైనసాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగ వీక్షణంగా ప్రతిభా వంతంగా స్పృశించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వతెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు)– ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన, పరిశోధనా విభాగంలో సహాయా చార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనేఅంశంపై పి.ఎచ్.డి చేస్తున్నబుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.