వండుకునే ఓపిక లేకనో, కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడో లేదా కొత్తగా తినాలనే ఆశతోనే రెస్టారెంట్లనుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని లాగించేస్తున్నారా? అయితే ఇకపై ఇలా చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అంతేకాదు మనం తినబోతున్న ఆహారం శుభ్రంగానే ఉందా లేదా అనేది చెక్ చేసుకోకపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి షాకిచ్చే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక వ్యక్తి ముంబై రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన ఆహారాన్ని హ్యాపీగా ఆరంగించేశాడు. కానీ ఆతరువాతే అసలు తిప్పలు మొదలయ్యాయి. ఫలితంగా ఒకటి రెండు కాదు 75 గంటల పాటు ఆసుపత్రి పాలయ్యాడు.
I Rajeev shukla (pure vegetarian) from prayagraj visited Mumbai, on 8th Jan'24 night ordered veg meal box from BARBEQUE NATION, worli outlet that a contained dead mouse, hospitalised for 75 plus hours. complaint has not been lodged at nagpada police station yet.
Please help pic.twitter.com/Kup5fTy1Ln
— rajeev shukla (@shukraj) January 14, 2024
రాజీవ్ శుక్లా తన బాధాకరనమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీని ప్రకారం జనవరి 8న ముంబై వెళ్లాడు. ఫుడ్ చైన్ బార్బెక్యూ నేషన్‌కు చెందిన వర్లీ అవుట్‌లెట్ నుండి వెజ్ మీల్ ఆర్డర్ చేశాడు. కొంత ఆహారం తిన్న తరువాత అందులో చనిపోయిన ఎలుకను చూసి షాకయ్యాడు. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫుడ్ ఆర్డర్ రసీదు, డెలివరీ ప్యాకేజీ, ఫుడ్ ఫోటోతోపాటు తను ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అలాగే తానింకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా ట్వీట్ చేశాడు. స్పష్టం చేశాడు.దీంతో ఇది నెట్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. తమ తమ అనుభవాలను పంచుకుంటూ ట్వీపుల్ స్పందించారు.
బార్బెక్యూనేషన్, ఇతర అధికారుల హ్యాండిల్‌లను ట్యాగ్ చేశారు. దీంతో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ బార్బెక్యూ నేషన్ స్పందించింది. సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment