Dead rat
-
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్: చచ్చిన ఎలుక ఎక్స్ట్రా, కట్ చేస్తే..!
వండుకునే ఓపిక లేకనో, కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడో లేదా కొత్తగా తినాలనే ఆశతోనే రెస్టారెంట్లనుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని లాగించేస్తున్నారా? అయితే ఇకపై ఇలా చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అంతేకాదు మనం తినబోతున్న ఆహారం శుభ్రంగానే ఉందా లేదా అనేది చెక్ చేసుకోకపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి షాకిచ్చే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక వ్యక్తి ముంబై రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన ఆహారాన్ని హ్యాపీగా ఆరంగించేశాడు. కానీ ఆతరువాతే అసలు తిప్పలు మొదలయ్యాయి. ఫలితంగా ఒకటి రెండు కాదు 75 గంటల పాటు ఆసుపత్రి పాలయ్యాడు. I Rajeev shukla (pure vegetarian) from prayagraj visited Mumbai, on 8th Jan'24 night ordered veg meal box from BARBEQUE NATION, worli outlet that a contained dead mouse, hospitalised for 75 plus hours. complaint has not been lodged at nagpada police station yet. Please help pic.twitter.com/Kup5fTy1Ln — rajeev shukla (@shukraj) January 14, 2024 రాజీవ్ శుక్లా తన బాధాకరనమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీని ప్రకారం జనవరి 8న ముంబై వెళ్లాడు. ఫుడ్ చైన్ బార్బెక్యూ నేషన్‌కు చెందిన వర్లీ అవుట్లెట్ నుండి వెజ్ మీల్ ఆర్డర్ చేశాడు. కొంత ఆహారం తిన్న తరువాత అందులో చనిపోయిన ఎలుకను చూసి షాకయ్యాడు. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫుడ్ ఆర్డర్ రసీదు, డెలివరీ ప్యాకేజీ, ఫుడ్ ఫోటోతోపాటు తను ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అలాగే తానింకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా ట్వీట్ చేశాడు. స్పష్టం చేశాడు.దీంతో ఇది నెట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తమ తమ అనుభవాలను పంచుకుంటూ ట్వీపుల్ స్పందించారు. బార్బెక్యూనేషన్, ఇతర అధికారుల హ్యాండిల్‌లను ట్యాగ్ చేశారు. దీంతో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ బార్బెక్యూ నేషన్ స్పందించింది. సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది. -
ఎలుక చనిపోయిందని అన్నీ తగలబెట్టాడు
► మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం ఆవరణంలో ఘటన మల్కాజిగిరి: మన ఇంట్లో ఎలుక చస్తే తీసి దూరంగా పడేస్తాం... అంతేగాని ఇంట్లోని సామగ్రి అంతా బయటవేసి తగులబెట్టం. ఘనత వహించిన ఓ అధికారి తాను విధులు నిర్వహించే రూమ్‌లో ఎలుక చనిపోయిందనే సాకుతో ఆ రూమ్‌లోని విలువైన రికార్డులను కార్యాలయ ఆవరణలో వేసి తగులబెట్టించాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయ ఆవరణలో జరిగింది. వివరాలు... 2007–08 సంవత్సరంలో నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్ మంజూరు చే సిన తర్వాత మున్సిపల్ కమిషనర్ సంతకం చేసిన ప్రొసీడింగ్స్ కాపీ నకలు మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలోని యూజీడీ విభాగంలో భద్రపరిచారు. వీటిని మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమైన సమయంలో జలమండలి అధికారులకు అందజేయాల్సి ఉన్నా.. అలా చేయలేదు. ప్రొసీడింగ్ కాపీలు పోగొట్టుకున్నవారు, నల్లా కనెక్షన్ కోసం ఫీజు చెల్లించిన వారు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగితే, తమ వద్దే వాటిని ఉంచుకున్న అధికారులు అందుబాటులో లేవని చెప్పారు. దీంతో దరఖాస్తుదారులు మళ్లీ ఫీజు చెల్లించి నల్లా కనెక్షన్ పొందారు. ఇదిలా ఉండగా, యూజీడీ విభాగంలోని తన గదిలో ఎలుక చనిపోయిందనే సాకుతో అక్కడ ఉన్న పత్రాలను ఓ అధికారి సర్కిల్ కార్యాలయం ఆవరణంలోని పారిశుధ్య విభాగం పర్యవేక్షణ అధికారి చాంబర్ వెనుక ఖాళీ ప్రదేశంలో కుప్పగా పోసి తగుల బెట్టించాడు. ఎంతో ముఖ్యమైన పత్రాలను ఇలా ఇష్టారాజ్యంగా తగులబెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని సర్కిల్ కమిషనర్, జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందింలేదని ప్రజలు వాపోతున్నారు. -
మధ్యాహ్న బోజనం సాంబార్లో ఎలుక
-
భోజన ప్యాకెట్లో చనిపోయిన ఎలుక
తిరుక్కురన్ ప్యాంట్రీకార్ నిర్వాహకుల నిర్లక్ష్యం విజయవాడ స్టేషన్లో అయ్యప్పల ఫిర్యాదు పూర్ణానందంపేట : రైలులోని ప్యాంట్రీకార్ సిబ్బంది ప్రయాణికులకు విక్రయించిన భోజన ప్యాకెట్లో చనిపోయిన ఎలుక ఉండటంతో కలకలం రేగింది. ఈ విషయంపై ఫిర్యాదు స్వీకరించేందుకు రైలులోని అధికారులు నిరాకరించడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు... మచిలీపట్నానికి చెందిన 30 మంది అయ్యప్ప మాలధారులు కన్యాకుమారి నుంచి నిజాముద్దీన్ వెళ్లే తిరుక్కురన్ (12641) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వస్తున్నారు. బీ-2 ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నవారు గూడూరు వద్ద రైలులోని ప్యాంట్రీకార్ నుంచి 30 ఆహార పొట్లాలను కొనుగోలు చేశారు. వీటిలో ఒకదానిలో చనిపోయిన ఎలుక ఉంది. ఈ విషయాన్ని సా యిబాబు అనే భక్తుడు మిగిలిన వారికి తెలియజేసి ఎవ రూ ఆహారం తినవద్దని సూచించారు. అప్పటికే భోజనం తింటున్న ఇద్దరు అయ్యప్పలు వాంతులు చేసుకోవడంతో అందరూ కలిసి ఈ విషయాన్ని రైలులోని అధికారుల దృష్టి కి తీసుకెళ్లారు. వారు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ‘ఇది సాధారణ విషయమే.. మ ర్చిపోండి..’ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో రైలు విజయవాడకు చేరిన తర్వాత స్టేషన్ మేనేజర్ సురేష్‌కు అయ్యప్పలు ఫిర్యా దు చేశారు. దీనిపై ఆయన స్పందించి ..ఆహార పదార్థాల శాం పిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పా రు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ చేయిస్తామని, అవసరమైతే ప్యాంట్రీకార్ నిర్వాహకుడి కాంట్రాక్టు రద్దు చేసి రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి 41రోజుల పాటు నియమనిష్టలతో దీక్షను పాటించి తిరిగి వస్తున్న మాకు భోజనంలో ఎలుక కనిపించడం మా మనోభావాలను దెబ్బతీసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. - లీలాసాయి (ప్రయాణికుడు) ప్రాణాలకు భద్రత లేదు రైళ్లలో ప్రయాణిస్తు కొనుగోలు చేసిన పదార్థాలు తీనాలంటేనే భయపడాల్సి వస్తోంది. నాణ్యతలేని ఆహార పదార్థాలు తని అనారోగ్యం పాలైతే పట్టించుకునే వారే ఉండటంలేదు. దీంతో ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండాపోతోంది. - ఆనందరావు (ప్రయాణికుడు) సాయంత్రం వరకు భోజనం లేకుండానే ప్రయాణించా రైలులో కొన్న ఆహారపదార్థంలో ఎలుక కనిపించడంతో కొన్నవాటిని పడవేసి, ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం లేకుండానే ప్రయాణించాల్సి వచ్చింది. రైల్వే అధికారులు ప్రయాణికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించం దారుణం. రూ. 50 ధరతో విక్రయిస్తున్న ఆహారం నాణ్యత లేకపోగా, ఇటువంటి జీవాలు వస్తుండటం ప్రయాణికుల ప్రాణాల విషయంలో రైల్వేశాఖ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నదో తెలుస్తుంది. - మురళీకృష్ణ(ప్రయాణికుడు)