భోజన ప్యాకెట్లో చనిపోయిన ఎలుక | Lunch packet dead rat | Sakshi
Sakshi News home page

భోజన ప్యాకెట్లో చనిపోయిన ఎలుక

Published Sun, Dec 21 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

భోజన ప్యాకెట్లో చనిపోయిన ఎలుక

భోజన ప్యాకెట్లో చనిపోయిన ఎలుక

తిరుక్కురన్ ప్యాంట్రీకార్
నిర్వాహకుల నిర్లక్ష్యం
విజయవాడ స్టేషన్‌లో అయ్యప్పల ఫిర్యాదు

 
పూర్ణానందంపేట : రైలులోని ప్యాంట్రీకార్ సిబ్బంది ప్రయాణికులకు విక్రయించిన భోజన ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక ఉండటంతో కలకలం రేగింది. ఈ విషయంపై ఫిర్యాదు స్వీకరించేందుకు రైలులోని అధికారులు నిరాకరించడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు... మచిలీపట్నానికి చెందిన 30 మంది అయ్యప్ప మాలధారులు కన్యాకుమారి నుంచి నిజాముద్దీన్ వెళ్లే తిరుక్కురన్ (12641) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వస్తున్నారు. బీ-2 ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నవారు గూడూరు వద్ద రైలులోని ప్యాంట్రీకార్ నుంచి 30 ఆహార పొట్లాలను కొనుగోలు చేశారు. వీటిలో ఒకదానిలో చనిపోయిన ఎలుక ఉంది. ఈ విషయాన్ని సా యిబాబు అనే భక్తుడు మిగిలిన వారికి తెలియజేసి ఎవ రూ ఆహారం తినవద్దని సూచించారు. అప్పటికే భోజనం తింటున్న ఇద్దరు అయ్యప్పలు వాంతులు చేసుకోవడంతో అందరూ కలిసి ఈ విషయాన్ని రైలులోని అధికారుల దృష్టి కి తీసుకెళ్లారు.

వారు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ‘ఇది సాధారణ విషయమే.. మ ర్చిపోండి..’ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో రైలు విజయవాడకు చేరిన తర్వాత స్టేషన్ మేనేజర్  సురేష్‌కు అయ్యప్పలు ఫిర్యా దు చేశారు. దీనిపై ఆయన స్పందించి ..ఆహార పదార్థాల శాం పిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పా రు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ చేయిస్తామని, అవసరమైతే ప్యాంట్రీకార్ నిర్వాహకుడి కాంట్రాక్టు రద్దు చేసి రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.
 
 మా మనోభావాలు దెబ్బతిన్నాయి

41రోజుల పాటు నియమనిష్టలతో దీక్షను పాటించి తిరిగి వస్తున్న మాకు భోజనంలో ఎలుక కనిపించడం మా మనోభావాలను దెబ్బతీసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
 - లీలాసాయి (ప్రయాణికుడు)
 
ప్రాణాలకు భద్రత లేదు


 రైళ్లలో ప్రయాణిస్తు కొనుగోలు చేసిన పదార్థాలు తీనాలంటేనే భయపడాల్సి వస్తోంది. నాణ్యతలేని ఆహార పదార్థాలు తని అనారోగ్యం పాలైతే పట్టించుకునే వారే ఉండటంలేదు. దీంతో ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండాపోతోంది.    - ఆనందరావు (ప్రయాణికుడు)
 
 సాయంత్రం వరకు భోజనం లేకుండానే ప్రయాణించా

 రైలులో కొన్న ఆహారపదార్థంలో ఎలుక కనిపించడంతో కొన్నవాటిని పడవేసి, ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం లేకుండానే ప్రయాణించాల్సి వచ్చింది. రైల్వే అధికారులు ప్రయాణికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించం దారుణం. రూ. 50 ధరతో విక్రయిస్తున్న ఆహారం నాణ్యత లేకపోగా, ఇటువంటి జీవాలు వస్తుండటం ప్రయాణికుల ప్రాణాల విషయంలో రైల్వేశాఖ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నదో తెలుస్తుంది.     
- మురళీకృష్ణ(ప్రయాణికుడు)
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement