ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు. ఇంట్లో వండిన భోజనం మాదిరిగా అందిస్తారు. అక్కడ డబ్బావాలాలు, స్టూడెంట్‌లకి, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటి భోజనశైలి మాదిరి ఫుడ్‌ని డెలివరి చేస్తారు. అలాంటి బిజినెస్ న్యూయార్క్‌లో కూడా కనిపించడమే విశేషం. అదికూడా మనదేశంలో ఉన్నట్లే ఉంది.
అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ఇషాన్ శర్మ నెట్టింట పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. న్యూయార్క్(New York)లో నివశిస్తున్న తన స్నేహితుడు వారానికి ఐదు రోజులు తన ఆఫీస్‌కి ఇంటి భోజనం తెప్పించుకుని తింటున్నాడంటూ పలు ఆసక్తికర విషయాలను ఆ వీడియోలో తెలిపారు. గుజరాతి మహిళా బృందం((Gujarati Women) ఇంటి భోజనం మాదిరిగా చక్కగా వండగా, ఒక అతను ఆ ఫుడ్‌ని డెలివరీ(Food Delivery) చేస్తుంటాడని అన్నారు. ఈ సర్వీస్‌లో మొత్తం ఎనిమిది వందల మందికి పైగా సభ్యులు ఉన్నారంటే..ఈ సర్వీస్ ఎంత పెద్ద స్థాయిలో నడుస్తుందో అర్థమవుతుందన్నారు.
అయితే ఇక్కడ ఇలా ఫుడ్ డెలివరీ చేయాలంటే ఆహార లైసెన్స్ తప్పనిసరి అని అంటున్నాడు ఇషాన్ శర్మ. ఈ సర్వీస్ మొత్తం పని అంతా సమర్థవంతమైన వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారానే చకచక అయిపోతుంది. మెరికాలో ఉండే భారతీయలు ఇంటి భోజనం మిస్సయ్యమని బాధను పోగడుతుండంటంతోనే ఈ సర్వీస్‌కి ఇంతలా విశేష ఆదరణ అని చెప్పొచ్చు. అంతేగాదు ఈ వ్యాపార ఐడియా గురించి న్యూయార్క్ స్థానిక మీడియాలో కూడా ప్రచురితమైంది. ఇది వంటల్లో నైపుణ్యం ఉన్నవారికి ఉపయోగపడే వ్యాపారమే గాక, అత్యధిక డిమాండ్ ఉన్న బిజినెస్ అని తేటతెల్లమైంది కదూ..!.
(చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..!)
Comments
Please login to add a commentAdd a comment