Barbeque
-
ఇల్లు తుడిచే మాప్ కాదు, బీబీక్యూ మాప్ సాస్: వీడియో వైరల్
ఇంటర్నెట్లో ఫుడ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని ఆకర్షణీయంగా ఉంటే, మరికొన్ని మాత్రం యాక్.. అనిపిస్తుంటాయి కదా. అలాంటి ఇంట్రస్టింగ్ వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Chef Matt Cooper (@stadiumchef) దోసల పెనం మీద చీపురు కట్టతో తుడవడం చూశాం. మొన్నఒక వ్యక్తి అనేక చికెన్ కాల్చడం కోసం పొడవైన తుడుపుకర్రను వాడేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. తాజాగా ఒక మహిళ మాంసాన్ని గ్రిల్ చేస్తూ, మాప్ స్టిక్ వాడడం నెటిజన్లకు షాకిచ్చింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో 45 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకంది. 47వేలకు పైగా కామెంట్లు వెల్లువెత్తాయి.stadiumchef ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక మహిళా చెఫ్ సాస్ కంటైనర్‌లో తుడుపుకర్రను ముంచి, తరువాత బీబీక్యూలోని మీట్‌పై పూసింది. బీబీక్యూ మాప్ సాస్ అనే క్యాప్షన్‌తో షేర్ ఈ చేసిన వీడియోపై వివరణ కూడా ఇచ్చింది. ఇలాంటి మాప్స్ గ్రిల్డ్ మాంసాన్ని చేసేందుకు స్పెషల్‌గా తయారు చేస్తారని వివరణ ఇచ్చింది. పెద్దమొత్తంలో స్మోక్డ్ మీట్ చేసేటపుడు ఇవి ఉపయోగపడతాయి. మీరు దక్షిణాదికి చెందినవారు కాకపోతే, అర్థం కాదు అని కూడా ఆమె తెలిపింది. ఇంత వివరణ ఇచ్చినా ఇది చూసి వెంటనే కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘‘అస్సలు హైజీనిక్‌గా లేదు..బాబోయ్ బాక్టీరియా మయం రా బాబూ.. నేను తిన’’ అని ఒక యూజర్ కమెంట్ చేయగా, చాలామంది బీబీక్యూ మాప్‌ను సమర్ధించారు. -
Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ!
ఒక నేర ముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతాబలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణచేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేర ముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తూంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఎ ప్రిన్స్ రాజధానిసహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్‌లకు అసలేం కావాలి?. కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాలవశం కావడంతో స్వదేశం తిరిగిరాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకురావడానికే జనం భయపడుతున్నారు. హైతీలో ప్రధాన గ్యాంగ్‌లు ఎన్ని? హైతీలో దాదాపు 200 వరకు నేరముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ ‘బార్బెక్యూ’ చెరీజియర్ నేతృత్వంలోని జీ9 ఫ్యామిలీ అండ్ అలీస్ అలయన్స్, గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలోని జీపెప్ నేరముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టుకోసం చాన్నాళ్లుగా ఈ రెండు వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు జీ9, జీపెప్ నేరముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్ల లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు గ్యాంగ్‌లు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్దెదింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశాక నేరసామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగేలా చేశారు. 2021 జులైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీ హైతియన్ టెట్ కాలే(పీహెచ్‌టీకే)తో జిమ్మీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో జిమ్మీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసె భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా రెండు ముఠాలు బలీయమయ్యాయి. హింస ఎప్పుడు మొదలైంది? హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ‘పాపా డాక్’ డ్యువేలియర్, అతని కుమారుడు జీన్‌క్లాడ్ డ్యువేలియర్‌ల 29 ఏళ్ల నియంతృత్వ పాలనాకాలంలోనే ఈ గ్యాంగ్‌లు పురుడుపో సుకున్నాయి. డ్యువేరియర్లు ఒక సమాంతర మిలటరీ(టోంటోన్స్ మకౌటీస్)ని ఏర్పాటు చేసి వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని అంతమొందించారు. ‘హైతీలో నేరముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేరముఠాల వైఖరి గతంతో పోలిస్తే దారుణం’ అని వర్జీనియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, హైతీ వ్యవహారాల నిపుణుడు రాబర్ట్ ఫాటన్ విశ్లేషించారు. నేతలనూ శాసిస్తారు బెదిరింపులు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లతో నేరముఠాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించుకు పోయారు. సాయుధముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయపార్టీలు, నేతలనే శాసిస్తున్నాయి. పరిపాలన వాంఛ అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేర ముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసె హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దె దింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీచేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటిచేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. సంకీర్ణ బలగాలు వస్తున్నాయా? కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికాసహా పలుదేశాలు నిర్ణయించాయి. ఐరాస ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాల ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాటు, అన్ని భాగస్వామ్యపక్షాల సంప్రతింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. మన వాళ్లను వెనక్కి రప్పిస్తాం: భారత విదేశాంగ శాఖ హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రతింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్: చచ్చిన ఎలుక ఎక్స్ట్రా, కట్ చేస్తే..!
వండుకునే ఓపిక లేకనో, కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడో లేదా కొత్తగా తినాలనే ఆశతోనే రెస్టారెంట్లనుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని లాగించేస్తున్నారా? అయితే ఇకపై ఇలా చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అంతేకాదు మనం తినబోతున్న ఆహారం శుభ్రంగానే ఉందా లేదా అనేది చెక్ చేసుకోకపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి షాకిచ్చే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక వ్యక్తి ముంబై రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన ఆహారాన్ని హ్యాపీగా ఆరంగించేశాడు. కానీ ఆతరువాతే అసలు తిప్పలు మొదలయ్యాయి. ఫలితంగా ఒకటి రెండు కాదు 75 గంటల పాటు ఆసుపత్రి పాలయ్యాడు. I Rajeev shukla (pure vegetarian) from prayagraj visited Mumbai, on 8th Jan'24 night ordered veg meal box from BARBEQUE NATION, worli outlet that a contained dead mouse, hospitalised for 75 plus hours. complaint has not been lodged at nagpada police station yet. Please help pic.twitter.com/Kup5fTy1Ln — rajeev shukla (@shukraj) January 14, 2024 రాజీవ్ శుక్లా తన బాధాకరనమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీని ప్రకారం జనవరి 8న ముంబై వెళ్లాడు. ఫుడ్ చైన్ బార్బెక్యూ నేషన్‌కు చెందిన వర్లీ అవుట్లెట్ నుండి వెజ్ మీల్ ఆర్డర్ చేశాడు. కొంత ఆహారం తిన్న తరువాత అందులో చనిపోయిన ఎలుకను చూసి షాకయ్యాడు. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫుడ్ ఆర్డర్ రసీదు, డెలివరీ ప్యాకేజీ, ఫుడ్ ఫోటోతోపాటు తను ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అలాగే తానింకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా ట్వీట్ చేశాడు. స్పష్టం చేశాడు.దీంతో ఇది నెట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తమ తమ అనుభవాలను పంచుకుంటూ ట్వీపుల్ స్పందించారు. బార్బెక్యూనేషన్, ఇతర అధికారుల హ్యాండిల్‌లను ట్యాగ్ చేశారు. దీంతో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ బార్బెక్యూ నేషన్ స్పందించింది. సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది. -
Multifunction Steamer: బిర్యానీ, నూడుల్స్, బార్బెక్యూ ఐటమ్స్ చేసుకోవచ్చు.. ధర 29 వేలు!
హైక్వాలిటీ హీట్ రెసిస్టెంట్ గ్లాస్ కవర్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ హీట్ పాట్.. ట్రెండీ లుక్స్‌లోనూ.. పనితనంలోనూ సూపర్బ్. ఇరువైపులా ఇన్సులేటెడ్ హ్యాండిల్స్ కలిగిన ఈ డివైజ్‌ని వినియోగించడం చాలా సులభం. 5.5 లీటర్ల సామర్థ్యమున్న ఈ పాత్రలో చాలా వంటకాలను రుచికరంగా, ఎక్కువ పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. దీన్ని కుకర్‌లా, స్టీమర్‌లా, గ్రిల్‌లా అన్ని రకాలుగానూ వినియోగించొచ్చు. స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి పరికరం ఇంట్లో ఉంటే.. ఎంత పనైనా చకచకా అయిపోతుంది. 2100 వాట్స్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ వోక్‌లో బిర్యానీ వంటి పలు రైస్ ఐటమ్స్‌తో పాటు.. నూడుల్స్, కర్రీస్, బార్బెక్యూ ఐటమ్స్ ఇలా అన్నీ రకాలనూ తయారుచేసుకోవచ్చు. చికెన్, మటన్ వంటివి ఇందులో.. చాలా క్రిస్పీగా గ్రిల్ అవుతాయి. దీనికి ట్రాన్స్పరెంట్ మూత కూడా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ అవుతుంటే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. -ధర - 392 డాలర్లు (రూ.29,323) చదవండి: పొటాటోతో ఫ్యాటీ బాడీకి చెక్ చెప్పొచ్చా? -
శ్రమ లేకుండా వంటలను వడ్డించే గాడ్జెట్ గురించి మీకు తెలుసా?
టెక్నాలజీ తెచ్చిపెట్టే హంగుల్లో.. అవసరాలను క్షణాల్లో తీర్చే మేకర్స్‌లో.. కుకింగ్ వేర్ చాలా ప్రత్యేకం. శ్రమ లేకుండా వంటలను వడ్డించే ఈ ఇండోర్ గ్రిల్.. ఏకకాలంలో చాలా రుచులని అందిస్తుంది. ఓ పక్కన కుకింగ్ బౌల్, మరో పక్క గ్రిల్ ప్లేట్ అటాచ్ అయ్యి ఉన్న ఈ మల్టీ మేకర్.. వండి వార్చేవారికి ఓ బహుమతి. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో రెండు మూడు ఫ్యామిలీస్ కలసి చేసుకునే వంటకు ఇలాంటి మేకర్ చాలా చక్కగా సహకరిస్తుంది. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్ వెజ్ని గ్రిల్ చేసుకోవడంతో పాటు.. సూప్స్, స్వీట్స్, కట్లెట్స్, రైస్ ఐటమ్స్ మొదలు ఇంకా చాలానే వండుకోవచ్చు. టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి సహకరించే రెగ్యులేటర్.. పవర్ కనెక్ట్ చేసుకునే కనెక్టర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక కుడివైపు ఆయిల్ లీకేజ్ హోల్ నుంచి కింద ఉండే సొరుగులోనికి వ్యర్థాలు చేరతాయి. ఇరువైపులా హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్స్ ఉంటాయి. దాంతో ఒక చోటు నుంచి మరో చోటుకి గాడ్జెట్‌ని సులభంగా మూవ్ చేసుకోవచ్చు. -
బార్బెక్యూలో పాచిపోయిన మటన్, హల్వా
సాక్షి, విజయవాడ: నగరంలోని బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్లో పుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. కనీసం కోవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ ఎస్పీ కనకరాజు, పుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. 'నిల్వ ఉన్న 1,500 కిలోల మటన్‌ను గుర్తించాం. ఆహారంలో నిషిద్ధ రంగులు వాడుతున్నారు. ఎంతోకాలంగా నిల్వ ఉంచిన హల్వాను వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. హోటల్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. రెస్టారెంట్‌లోకొన్ని సాంపిల్స్ సేకరించాం. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి రిపోర్టుల ఆధారంగా రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
అనాథలకు హైహై లంచ్
-
బార్బిక్యూ భామలు
-
‘బార్బిక్యూ’లో కర్రీకింగ్...
ఇండియన్ కర్రీస్ తయారీలో పేరొందిన కర్రీకింగ్ పాట్ చాప్‌మ్యాన్ నగరానికి వచ్చారు. బంజారాహిల్స్‌లోని బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్లో తనదైన శైలిలో గరిటె తిప్పి ఘుమఘుమలు పంచారు. భారతీయ వంటకాలంటే తనకెంతో ఇష్టమని, తమ అమ్మమ్మల కాలంలో ఇండియాలోని లక్నోలో నివసించిన సందర్భంగా ఇండియన్ డిషెస్ తినడం అలవాటైందని చాప్‌మ్యాన్ చెప్పారు. ఇండియన్ క్యుజిన్లోని వెరైటీలను ఇంగ్లండ్ వాసులకు రుచి చూపించడమే కాకుండా ఈ క్యుజిన్లో మాస్టర్లను తయారు చేసేందుకు శిక్షణ సైతం అందిస్తున్నానన్నారు. ఈనెల 20 వరల్డ్ చెఫ్స్డేను పురస్కరించుకుని బార్బెక్యూ రెస్టారెంట్స్‌లో రోజుకు ఒకటి చొప్పున చాప్‌మ్యాన్ శైలిలో వండిన 14 రకాల ప్రాచుర్యం పొందిన వంటకాలను ఫుడ్ లవర్స్‌కు రుచి చూపిస్తామని బార్బెక్యూ నేషన్ కలినరీ ఆపరేషన్స్ హెడ్ విజయ్ ఆనంద్ భక్షి చెప్పారు.