టెక్నాలజీ తెచ్చిపెట్టే హంగుల్లో.. అవసరాలను క్షణాల్లో తీర్చే మేకర్స్‌లో.. కుకింగ్ వేర్ చాలా ప్రత్యేకం. శ్రమ లేకుండా వంటలను వడ్డించే ఈ ఇండోర్ గ్రిల్.. ఏకకాలంలో చాలా రుచులని అందిస్తుంది. ఓ పక్కన కుకింగ్ బౌల్, మరో పక్క గ్రిల్ ప్లేట్ అటాచ్ అయ్యి ఉన్న ఈ మల్టీ మేకర్.. వండి వార్చేవారికి ఓ బహుమతి.
చిన్న చిన్న ఫంక్షన్స్‌లో రెండు మూడు ఫ్యామిలీస్ కలసి చేసుకునే వంటకు ఇలాంటి మేకర్ చాలా చక్కగా సహకరిస్తుంది. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్ వెజ్‌ని గ్రిల్ చేసుకోవడంతో పాటు.. సూప్స్, స్వీట్స్, కట్లెట్స్, రైస్ ఐటమ్స్ మొదలు ఇంకా చాలానే వండుకోవచ్చు.
టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి సహకరించే రెగ్యులేటర్.. పవర్ కనెక్ట్ చేసుకునే కనెక్టర్‌కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక కుడివైపు ఆయిల్ లీకేజ్ హోల్ నుంచి కింద ఉండే సొరుగులోనికి వ్యర్థాలు చేరతాయి. ఇరువైపులా హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్స్ ఉంటాయి. దాంతో ఒక చోటు నుంచి మరో చోటుకి గాడ్జెట్‌ని సులభంగా మూవ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment