grill
-
కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?
పూర్వం కాలం కట్టెల పొయ్యి, బొగ్గు మీద చేసిన వంటకాలు తినేవారు. ఎందుకంటే..? అప్పుడూ ఇలా ఎల్పీజీ గ్యాస్‌లు అందుబాటులో లేకపోవడంతో కట్టెలతో నానాపాట్లు పడేవారు. కట్టెలు కాల్చగానే వచ్చే పొగతో తెగ ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. నాటి పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోడం, ఆర్థిక పరిస్థితి తదితర కారణాల రీత్య వాటిపైనే ఆధారపడేవారు. అయితే ప్రస్తత కాలంలో వంటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా జనాలు కట్టెలు, బొగ్గులు మీద చేసిన వంటకాలంటేనే తెగ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రిల్ చికెన్, పైనాపిల్ గ్రిల్, పన్నీర్ గ్రిల్ , రొయ్యలు గ్రిల్ వంటివి తెగ లొట్టలేసుకు తింటున్నారు. కానీ నిపుణుల మాత్రం రుచిగా ఉన్నా అలాంటివి అస్సలు దగ్గరకు రానియ్యొద్దని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. చాలా మంది కట్టెల పొయ్యి , బొగ్గుల మీద కాల్చిన వంటలు చాలా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్‌గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే . కానీ కట్టెల పొయ్యి వంట వద్దు..బొగ్గుల మీద కాల్చినవి అస్సలు తినొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వేడివేడిగా మనముందే ఇచ్చే గ్రిల్ ఫుడ్ ఐటెమ్స్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత డబైనా ఖర్చు పెట్టి మరీ గ్రిల్ వంటకాలు లొంటలు వేసుకుని మరీ లాగించేస్తాం. వాటివల్ల క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే పూర్వమే బొగ్గుల పొయ్యి మీద వంటలు మానేశారని అన్నారు. అంతేగాదు కట్టెల పొయ్యి మీ వంటల చేసేటప్పుడు వచ్చే పొగకు శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నాయనే గ్యాస్‌పై వంటలు చేయడం మొదలయ్యింది. ఇటీవల కాలంలో భారత్ ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి వైపే అడుగులు వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకు నిదర్ననం ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిన క్యాన్సర్ బాధితుల సంఖ్యే. మరోవైపు యువత ఇలాంటి డీప్ ఫ్రైలు, కాల్చిన ఫుడ్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో దీర్ఘకాలిక కేన్సర్లు పుట్టుకొస్తాయి. దీంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతారు యువత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందులో ఉపయోగించే టేస్టింగ్ సాల్ట్స్, షుగర్ లెవెల్స్ పెంచే ఫుడ్స్ ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తాయని చెప్పారు. ఎంతలా యువత వీటికి దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే మైక్రో ఓవెన్లో చేసిన వంటకాలకు కూడా దూరంగా ఉండమంటున్నారు. సాధ్యమైనంత మేర కూరగాయాలు 70 శాంత ఉడికించినవి, మాంసం పూర్తి స్థాయిలో ఉడికించి తినడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె సంపద విలువ..!) -
హైకింగ్, పిక్నిక్కి పర్ఫెక్ట్ గ్రిల్ ఇది.. నిమిషాల్లో వెరైటీ వంటలు
క్యాంపింగ్ అనగానే కంఫర్ట్ చూసుకుంటాం. ఏదైతే సులభంగా, సురక్షితంగా ఉంటుందో దాన్నే ఎంచుకుంటాం. అలాంటి కుక్ వేరే ఇది. ఈ గ్రిల్‌ని.. హైకింగ్, పిక్నిక్.. ఇలా ఎక్కడికి వెళ్లినా చక్కగా వెంట తీసుకెళ్లొచ్చు. బార్బెక్యూ రుచులను అందించడంలో దిట్ట. మన్నికైన స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ గ్రిల్.. తుప్పు పట్టదు. చాలా సౌకర్యంగా ఉంటుంది. దీనిపై పైనాపిల్, స్వీట్ కార్న్, చికెన్, ఫిష్, రొయ్యలు ఇలా అన్నింటినీ గ్రిల్ చేసుకోవచ్చు. శాండ్విచ్, బర్గర్ వంటివి నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఒకేసారి చాలా ఐటమ్స్ తయారు చేసుకోవడానికి రెండు వేరువేరు గ్రిల్ ప్లేట్స్.. గ్రిల్ పాన్స్ ఉంటాయి. ఇరువైపులా స్టోరేజ్ ర్యాక్స్ ఉంటాయి. వండినవి.. ప్లేట్లో వేసుకుని, ఆ ర్యాక్స్‌పై పెట్టుకోవచ్చు. లేదా ఉప్పు, కారం, మసాలాలు అందుబాటులో ఉండేలా వాటిపై ఉంచుకోవచ్చు. ఈ గ్రిల్‌ని ఫోల్డ్ చేసుకోవడం, అనువుగా స్టాండ్స్‌పై అమర్చుకోవడం.. అవసరాన్ని బట్టి ఎత్తుని అడ్జస్ట్ చేసుకోవడం ఇలా ప్రతీదీ చాలా ఈజీ. ధర 74 డాలర్లు (రూ.6,050). -
మూత తెరిస్తే మూడినట్టే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై ఉన్న మ్యాన్‌హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ బిగింపునకు జలమండలి చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మ్యాన్న్హోళ్ల మూత తెరిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేసింది. చిన్నపాటి వర్షాలకు డ్రైనేజీల పొంగిపొర్లడం.. ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే లోతైన మ్యాన్ హోళ్లతో పాటు సుమారు 22 వేలకు పైగా మ్యాన్ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ బిగించింది. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, రెడ్ మార్కు ఏర్పాటు చేస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (ఈఆర్టీ), మాన్సూన్ సేఫ్టీ టీం (ఎమ్మెస్టీ), సేఫ్టీ ప్రోటోకాల్ టీం (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు వినియోగించే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రత్యేక టీంలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్ మోటార్ ఏర్పాటు చేసింది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగించనున్నారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ టీంలు ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు ఎయిర్‌టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉంచడంతో పాటు మ్యా¯న్న్హోళ్ల నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు చేపట్టింది. సీవరేజీ బృందం ఏర్పాటు.. మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందాన్ని జలమండలి ఏర్పాటు చేసింది. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షించే వి«ధంగా ఆదేశాలు జారీ చేసింది. లీకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు క్లియర్ చేసేవిధంగా చర్యలకు తీసుకుంటుంది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా, ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313కి ఫోన్‌చేసి సమాచారం అందించవచ్చని, వార్డు కార్యాలయాల్లోనూ నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. మ్యాన్‌హోళ్ల మూత తెరిస్తే నేరమే.. ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూత తెరిచినా, తొలగించినా చట్ట ప్రకారం నేరమని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలను అతిక్రమించి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయిస్తారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్మికులకు శిక్షణ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై జలమండలి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించే విధానం, పారిశుద్ధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై సూచనలు ఇవ్వడంతో పాటు పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్సపైనా అవగాహన కల్పిస్తుంది. విస్తృత ప్రచారం వర్షాకాలంలో సీవరేజీ నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి? ఎలా నడుచుకోవాలి? అనే అంశాలపై జలమండలి విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చూట్టింది. స్థానిక కాలనీల సంఘాలు, ఎస్‌హెచ్ గ్రూపుల సభ్యులతో ప్రజలకు అవగాహన కలి్పస్తోంది. టెలివిజన్, ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కఠినంగా వ్యవహరిస్తాం.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ప్రస్తుత వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్పిట్ల మూతలు తెరిచే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రోనాల్డ్‌రాస్ హెచ్చరించారు. మ్యాన్ హోల్స్, క్యాచ్ పిట్స్ మూతలు తెరిచి ఉండటంతోనే ఇటీవల ప్రమాదాలు జరిగాయన్నారు. అనధికార వ్యక్తులు మ్యాన్‌హోల్స్ మూతలను తెరిచినా, తొలగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. మ్యాన్‌హోల్స్ వల్ల ఎక్కడైనా వరద నీటి సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్ 040– 2111 1111ను సంప్రదించాలన్నారు. -
Portable Grill: పోర్టబుల్ గ్రిల్.. చికెన్, మటన్ అన్నింటికీ.. ధర 6,131
ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేవి నోరూరించే పసందైన రుచులే. స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినప్పుడు.. అలాంటి రుచులను అందిస్తూ ఆ సందర్భాన్ని అమృత జ్ఞాపకంగా మిగిల్చేదే.. ఈ లగేజ్ స్టయిల్ పోర్టబుల్ గ్రిల్. దీన్ని మన లగేజ్‌తో పాటు వెంట తీసుకెళ్తే చాలు, రుచుల పంట పండినట్లే. ఇందులో ఎలాంటి వంటైనా నిమిషాల్లో రెడీ అవుతుంది. చికెన్, మటన్ వంటి వాటినీ రకరకాలుగా గ్రిల్ చేసుకోవచ్చు. నచ్చిన విధంగా టోస్ట్ చేసుకోవచ్చు. చిత్రంలో కనిపిస్తున్న ఈ మెషిన్ని ఓపెన్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా సులభం. ఇది చూడటానికి సూట్‌కేస్‌లా ఉంటుంది. మేకర్ ముందు భాగంలో రెండు రెగ్యులేటర్స్ ఉంటాయి. ఇది గ్యాస్ సాయంతో పనిచేస్తుంది. చిన్న గ్యాస్ సిలెండర్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. గ్రిల్ ప్లేట్స్ మార్చుకోవచ్చు. ఈ మేకర్ లోపల రెండు స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన గ్యాస్ స్టవ్‌లు అమర్చి ఉంటాయి. దీని మూత ఒకవైపు మేకర్‌కి అటాచ్ అయ్యుంటుంది. దాంతో సూట్‌కేస్‌ను తెరిచినట్లుగా ఓపెన్ చేసుకోవచ్చు. తేలికగా అటూ ఇటూ కదపడానికి ఒకవైపు రెండు చక్రాలు ఉంటాయి. మరోవైపు డివైజ్ మొత్తాన్ని పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది. అదే మెషిన్ నిలబడటానికి స్టాండ్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇరువైపులా కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఉప్పు, కారం డబ్బాలు పెట్టుకోవడానికి స్పెషల్ ప్లేట్స్ అమర్చి ఉంటాయి. ధర - 80 డాలర్లు (రూ.6,131) చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! -
ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు ఆపదలో ఉన్న బాధితులనే కాదు... మూగజీవులనూ రెస్క్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా సుల్తాన్‌బజార్ గస్తీ సిబ్బంది సోమవారం ఉదయం గేట్ గ్రిల్లో చిక్కుకున్న ఓ పిల్లికి ప్రాణం పోశారు. ఈ విషయాన్ని సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్లో పోస్టు చేసిన అధికారులు దాంతో పాటు ఓ ప్రశ్నను సంధించారు. దీనికి అనేకమంది నెటిజనుల తమదైన శైలిలో స్పందిస్తూ సలహాలు, సూచలు ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుల్తాన్‌బజార్ ఠాణాకు చెందిన పెట్రో కార్–1 సిబ్బంది సోమవారం ఉదయం తమ విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తున్నారు. వీరి వాహనం కుబ్తిగూడలోని థామస్ చర్చి వద్దకు చేరుకునే సరికి ఓ ఇంటి వద్ద హడావుడి కనిపించింది. అక్కడకు వెళ్లిన గస్తీ పోలీసులు ఆరా తీయగా.. ఆ ఇంటి గేటు గ్రిల్లో పిల్లి తల ఇరుక్కుందని, బయటకు తీసుకోవడానికి అది నానా తంటాలు పడుతోందని గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మార్జాలానికి గ్రిల్ నుంచి విముక్తి కల్పించారు. పిల్లి గ్రిల్లో చిక్కుకున్న ఫొటోను పోస్టు చేసిన సిటీ పోలీసు ఫేస్బుక్ పేజ్ దాంతో పాటు ‘పిల్లిని విడుదల చేయడానికి సులభమైన మార్గాన్ని వ్యాఖ్యానించండి’ అంటూ పేర్కొన్నారు. దీనికి నెటిజనుల నుంచి భారీ స్పందన వచ్చింది. తమకు తోచిన సూచనలు చేశారు. కొందరైతే అలా చిక్కుకున్న పిల్లులను బయటకు తీయడానికి అనుసరించాల్సిన విధానాలతో కూడిన యూట్యూబ్ వీడియోల లింకుల్నీ షేర్ చేశారు. పిల్లి తలకు, గ్రిల్‌కు నూనె పూసి తీయాలని, వెల్డింగ్‌తో కట్ చేయాలని ఇలా సలహాలు ఇచ్చారు. -
స్టయిలిష్ క్యాంపింగ్ గ్రిల్ తక్కువ ధరకే.. త్వరపడండి
అవుట్ డోర్ పార్టీలు.. లాంగ్ డ్రైవ్‌లు.. ఎంజాయ్ చెయ్యడానికి చాలా బాగుంటాయి కానీ.. ఆకలేసే సమయానికి నచ్చిన వంటకం దొరక్కుంటే మాత్రం ఆ ఎంజాయ్మెంట్ అంతా క్షణంలో ఆవిరైపోతుంది. అలాంటప్పుడే మనతో పాటు ఒక కంఫర్టబుల్ కుక్ వేర్, కొంత వంట సామాగ్రి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే ఈ క్యాంపింగ్ గ్రిల్. చూడటానికి చిన్న బ్రీఫ్కేస్లా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లొచ్చు. ఈ మేకర్‌ను ఓవర్ హీట్, స్క్రాచ్ రెసిస్టెన్స్, డిఫార్మేషన్ వంటి వాటిని తట్టుకోగల హైక్వాలిటీ స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందించారు. 130 చదరపు అంగుళాల బార్బెక్యూ గ్రిల్‌పై క్రిస్పీ రుచులను వేగంగా చేసుకోవచ్చు. కార్బన్ ఫైబర్ ట్రేలో బొగ్గులను నింపి.. నిప్పు రాజేస్తే.. ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. కారులో వెళ్లినా, బస్సు మీద వెళ్లినా.. ఫ్యామిలీతో వెళ్లినా, ఫ్రెండ్స్‌తో వెళ్లినా దీన్ని చాలా స్టయిలిష్‌గా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ధర 140 డాలర్లు (రూ.10,409) -
శ్రమ లేకుండా వంటలను వడ్డించే గాడ్జెట్ గురించి మీకు తెలుసా?
టెక్నాలజీ తెచ్చిపెట్టే హంగుల్లో.. అవసరాలను క్షణాల్లో తీర్చే మేకర్స్‌లో.. కుకింగ్ వేర్ చాలా ప్రత్యేకం. శ్రమ లేకుండా వంటలను వడ్డించే ఈ ఇండోర్ గ్రిల్.. ఏకకాలంలో చాలా రుచులని అందిస్తుంది. ఓ పక్కన కుకింగ్ బౌల్, మరో పక్క గ్రిల్ ప్లేట్ అటాచ్ అయ్యి ఉన్న ఈ మల్టీ మేకర్.. వండి వార్చేవారికి ఓ బహుమతి. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో రెండు మూడు ఫ్యామిలీస్ కలసి చేసుకునే వంటకు ఇలాంటి మేకర్ చాలా చక్కగా సహకరిస్తుంది. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్ వెజ్ని గ్రిల్ చేసుకోవడంతో పాటు.. సూప్స్, స్వీట్స్, కట్లెట్స్, రైస్ ఐటమ్స్ మొదలు ఇంకా చాలానే వండుకోవచ్చు. టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి సహకరించే రెగ్యులేటర్.. పవర్ కనెక్ట్ చేసుకునే కనెక్టర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక కుడివైపు ఆయిల్ లీకేజ్ హోల్ నుంచి కింద ఉండే సొరుగులోనికి వ్యర్థాలు చేరతాయి. ఇరువైపులా హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్స్ ఉంటాయి. దాంతో ఒక చోటు నుంచి మరో చోటుకి గాడ్జెట్‌ని సులభంగా మూవ్ చేసుకోవచ్చు. -
కొత్త కొత్తగా: ఇన్సులేటెడ్ ఫుడ్ ఫ్లాస్క్.. హై పవర్ మల్టీ కుకర్
బయట కూడా ఇంటి ఆహారమే కావాలనుకుంటే టిఫిన్ బాక్స్ సర్దుకోవచ్చు. అయితే అందులోని తిండి ఎట్టి పరిస్థితుల్లో వేడివేడిగా అయినా లేదా చల్లగానైనా ఉండాలంటే మాత్రం ఈ ఇన్సులేటెడ్ ఫుడ్ ఫ్లాస్క్ (మన్నికైన స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన జార్) లోనే ప్యాక్ చేసుకోవాలి. డబుల్వాల్ ఇన్సులేషన్ కలిగిన ఈ పాత్రలో వేడి లేదా చల్లారిన భోజనాన్ని తీసుకుని వెళ్లడం చాలా సులభం. స్కూల్, ఆఫీస్, క్యాంపింగ్, ప్రయాణాలు వంటి పలు చోట్లకు వెళ్లేప్పుడు ఈ థర్మల్ ఫుడ్ కంటైనర్ భలే సహకరిస్తుంది. ఇందులో 9 గంటల పాటు వేడి పదార్థాలను, 16 గంటల పాటు చల్లటి పదార్థాలను భద్రపర్చుకోవచ్చు. మూతకు పైభాగంలో ఫోల్డబుల్ స్పూన్‌ను అమర్చుకోవచ్చు. ఈ మూతను తీయడం చాలా తేలిక. దీన్ని ఒక బౌల్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. అందులో ఆహారాన్ని వేసుకుని తినొచ్చు. ఈ ఫ్లాస్క్‌ని పెట్టుకోవడానికి ప్రత్యేకమైన బ్యాగ్ కూడా లభిస్తుంది. దీని ధర వచ్చేసి 19 డాలర్లు (రూ.1,401). హై పవర్ మల్టీ కుకర్ ఒకే సమయంలో రెండు రకాల రుచులను సిద్ధం చేయగల ఈ స్టైలిష్ డిజైన్ మల్టీ-ఫంక్షనల్ కుకర్కి మార్కెట్లో గిరాకీ బాగానే ఉంది. ఇందులో ఆహారాన్ని వేయించుకోవచ్చు, ఉడికించుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు. దీన్ని శుభ్రం చేసుకోవడం, భద్రపర్చడం చాలా సులభం. ఈ కుకర్‌లో ఆమ్లెట్స్, పాన్ కేక్స్, పిజ్జా వంటి భిన్న రుచులను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇందులో గుండ్రటి పాన్ బౌల్‌తో పాటు చతురస్రాకారపు పాన్ ప్లేట్ కూడా ఉంటాయి. అవసరాన్ని బట్టి వాటిని అమర్చుకోవచ్చు. గుండ్రటి పాన్ బౌల్,దానిమీద మేకర్‌తో పాటు వచ్చిన వైట్ కలర్ డిజైన్ డు ప్లేట్, దానిపైన పాన్, ఆపైన ట్రాన్స్ పరెంట్ మూత.. ఇలా వరుసగా పెట్టుకోవాల్సి ఉంటుంది. నాలుగు వేర్వేరు ఉష్ణోగ్రతా స్థాయిలు కలిగిన రెగ్యులేటర్ .. మేకర్‌కు ముందువైపు ఉంటుంది. చెమటోడనివ్వకుండా వంటను చేయిస్తుంది. దీని ధర వచ్చేసి ధర 79 డాలర్లు (రూ. 5,828). పోర్టబుల్ చార్కోల్ గ్రిల్ సాంకేతికత వంటిల్లునూ సౌకర్యంగా మార్చినా వంట చెరుకు మీద వండిన రుచులను మాత్రం వడ్డించలేకపోతోందని నిరాశ పడేవారి కోసమే వచ్చింది పోర్టబుల్ చార్కోల్ గ్రిల్. దీని సాయంతో.. ఎలాంటి వంట అయినా బొగ్గులపై నిమిషాల్లో పూర్తయిపోతుంది. చికెన్, మటన్, రొయ్యలు వంటి నాన్ వెజ్ ఐటమ్స్‌తో పాటు కూరగాయలు.. ఇంకెన్నో గ్రిల్లింగ్ వంటకాల ఘుమఘుమలనూ ఆస్వాదించవచ్చు. చిత్రంలో కనిపిస్తున్న ఈ గ్రిల్లో హోల్ చికెన్ వంటి పెద్ద పెద్ద ఐటమ్స్‌తోపాటు.. కట్లెట్స్, బర్గర్స్, కబాబ్స్ వంటి వెరైటీలనూ సిద్ధం చేసుకోవచ్చు. ఈ గ్రిల్ అడుగు భాగంలో బొగ్గులు వేసుకోవడానికి ప్రత్యేకమైన బౌల్ ఉంటుంది. అందులో నిప్పు రాజేసి, పైన గ్రిల్ మీద కావాల్సిన ఆహారాన్ని కరకరకలాడేలా వండుకోవచ్చు. వేగంగా వండి పెట్టడానికి ఓ ప్రత్యేకమైన మూత కూడా ఉంటుంది ఇందులో. దాన్ని ఈ సాధనానికిరువైపులా లాక్ చేసుకునే వీలూ ఉంటుంది. ఈ తరహా గ్రిల్స్.. మార్కెట్లో రెడ్, బ్లాక్, స్కై బ్లూ కలర్స్‌లో అమ్ముడుపోతున్నాయి. పట్టుకోవడానికి అనువుగా మూత పైభాగంలో హ్యాండిల్ కూడా ఉంటుంది. దీని ధర వచ్చేసి 72 డాలర్లు (రూ.5,312). చదవండి: తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న జియో -
గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి కాలు