బయట కూడా ఇంటి ఆహారమే కావాలనుకుంటే టిఫిన్ బాక్స్ సర్దుకోవచ్చు. అయితే అందులోని తిండి ఎట్టి పరిస్థితుల్లో వేడివేడిగా అయినా లేదా చల్లగానైనా ఉండాలంటే మాత్రం ఈ ఇన్సులేటెడ్ ఫుడ్ ఫ్లాస్క్ (మన్నికైన స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన జార్) లోనే ప్యాక్ చేసుకోవాలి. డబుల్‌వాల్ ఇన్సులేషన్ కలిగిన ఈ పాత్రలో వేడి లేదా చల్లారిన భోజనాన్ని తీసుకుని వెళ్లడం చాలా సులభం. స్కూల్, ఆఫీస్, క్యాంపింగ్, ప్రయాణాలు వంటి పలు చోట్లకు వెళ్లేప్పుడు ఈ థర్మల్ ఫుడ్ కంటైనర్ భలే సహకరిస్తుంది.
ఇందులో 9 గంటల పాటు వేడి పదార్థాలను, 16 గంటల పాటు చల్లటి పదార్థాలను భద్రపర్చుకోవచ్చు. మూతకు పైభాగంలో ఫోల్డబుల్ స్పూన్‌ను అమర్చుకోవచ్చు. ఈ మూతను తీయడం చాలా తేలిక. దీన్ని ఒక బౌల్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. అందులో ఆహారాన్ని వేసుకుని తినొచ్చు. ఈ ఫ్లాస్క్‌ని పెట్టుకోవడానికి ప్రత్యేకమైన బ్యాగ్ కూడా లభిస్తుంది. దీని ధర వచ్చేసి 19 డాలర్లు (రూ.1,401).
హై పవర్ మల్టీ కుకర్
ఒకే సమయంలో రెండు రకాల రుచులను సిద్ధం చేయగల ఈ స్టైలిష్ డిజైన్ మల్టీ-ఫంక్షనల్ కుకర్‌కి మార్కెట్‌లో గిరాకీ బాగానే ఉంది. ఇందులో ఆహారాన్ని వేయించుకోవచ్చు, ఉడికించుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు. దీన్ని శుభ్రం చేసుకోవడం, భద్రపర్చడం చాలా సులభం. ఈ కుకర్‌లో ఆమ్లెట్స్, పాన్ కేక్స్, పిజ్జా వంటి భిన్న రుచులను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇందులో గుండ్రటి పాన్ బౌల్‌తో పాటు చతురస్రాకారపు పాన్ ప్లేట్ కూడా ఉంటాయి. అవసరాన్ని బట్టి వాటిని అమర్చుకోవచ్చు. గుండ్రటి పాన్ బౌల్,దానిమీద మేకర్‌తో పాటు వచ్చిన వైట్ కలర్ డిజైన్ డు ప్లేట్, దానిపైన పాన్, ఆపైన ట్రాన్స్ పరెంట్ మూత.. ఇలా వరుసగా పెట్టుకోవాల్సి ఉంటుంది. నాలుగు వేర్వేరు ఉష్ణోగ్రతా స్థాయిలు కలిగిన రెగ్యులేటర్ .. మేకర్‌కు ముందువైపు ఉంటుంది. చెమటోడనివ్వకుండా వంటను చేయిస్తుంది. దీని ధర వచ్చేసి ధర 79 డాలర్లు (రూ. 5,828).
పోర్టబుల్ చార్‌కోల్ గ్రిల్
సాంకేతికత వంటిల్లునూ సౌకర్యంగా మార్చినా వంట చెరుకు మీద వండిన రుచులను మాత్రం వడ్డించలేకపోతోందని నిరాశ పడేవారి కోసమే వచ్చింది పోర్టబుల్ చార్‌కోల్ గ్రిల్. దీని సాయంతో.. ఎలాంటి వంట అయినా బొగ్గులపై నిమిషాల్లో పూర్తయిపోతుంది. చికెన్, మటన్, రొయ్యలు వంటి నాన్ వెజ్ ఐటమ్స్‌తో పాటు కూరగాయలు.. ఇంకెన్నో గ్రిల్లింగ్ వంటకాల ఘుమఘుమలనూ ఆస్వాదించవచ్చు. చిత్రంలో కనిపిస్తున్న ఈ గ్రిల్‌లో హోల్ చికెన్ వంటి పెద్ద పెద్ద ఐటమ్స్‌తోపాటు.. కట్లెట్స్, బర్గర్స్, కబాబ్స్ వంటి వెరైటీలనూ సిద్ధం చేసుకోవచ్చు.
ఈ గ్రిల్ అడుగు భాగంలో బొగ్గులు వేసుకోవడానికి ప్రత్యేకమైన బౌల్ ఉంటుంది. అందులో నిప్పు రాజేసి, పైన గ్రిల్ మీద కావాల్సిన ఆహారాన్ని కరకరకలాడేలా వండుకోవచ్చు. వేగంగా వండి పెట్టడానికి ఓ ప్రత్యేకమైన మూత కూడా ఉంటుంది ఇందులో. దాన్ని ఈ సాధనానికిరువైపులా లాక్ చేసుకునే వీలూ ఉంటుంది. ఈ తరహా గ్రిల్స్.. మార్కెట్‌లో రెడ్, బ్లాక్, స్కై బ్లూ కలర్స్‌లో అమ్ముడుపోతున్నాయి. పట్టుకోవడానికి అనువుగా మూత పైభాగంలో హ్యాండిల్ కూడా ఉంటుంది. దీని ధర వచ్చేసి 72 డాలర్లు (రూ.5,312).
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment