పూర్వం కాలం కట్టెల పొయ్యి, బొగ్గు మీద చేసిన వంటకాలు తినేవారు. ఎందుకంటే..? అప్పుడూ ఇలా ఎల్‌పీజీ గ్యాస్‌లు అందుబాటులో లేకపోవడంతో కట్టెలతో నానాపాట్లు పడేవారు. కట్టెలు కాల్చగానే వచ్చే పొగతో తెగ ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. నాటి పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోడం, ఆర్థిక పరిస్థితి తదితర కారణాల రీత్య వాటిపైనే ఆధారపడేవారు. అయితే ప్రస్తత కాలంలో వంటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా జనాలు కట్టెలు, బొగ్గులు మీద చేసిన వంటకాలంటేనే తెగ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రిల్ చికెన్, పైనాపిల్ గ్రిల్, పన్నీర్ గ్రిల్ , రొయ్యలు గ్రిల్ వంటివి తెగ లొట్టలేసుకు తింటున్నారు. కానీ నిపుణుల మాత్రం రుచిగా ఉన్నా అలాంటివి అస్సలు దగ్గరకు రానియ్యొద్దని చెప్పేస్తున్నారు. ఎందుకంటే..
చాలా మంది కట్టెల పొయ్యి , బొగ్గుల మీద కాల్చిన వంటలు చాలా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్‌గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే . కానీ కట్టెల పొయ్యి వంట వద్దు..బొగ్గుల మీద కాల్చినవి అస్సలు తినొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
వేడివేడిగా మనముందే ఇచ్చే గ్రిల్ ఫుడ్ ఐటెమ్స్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత డబైనా ఖర్చు పెట్టి మరీ గ్రిల్ వంటకాలు లొంటలు వేసుకుని మరీ లాగించేస్తాం. వాటివల్ల క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే పూర్వమే బొగ్గుల పొయ్యి మీద వంటలు మానేశారని అన్నారు. అంతేగాదు కట్టెల పొయ్యి మీ వంటల చేసేటప్పుడు వచ్చే పొగకు శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నాయనే గ్యాస్‌పై వంటలు చేయడం మొదలయ్యింది.
ఇటీవల కాలంలో భారత్ ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి వైపే అడుగులు వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకు నిదర్ననం ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిన క్యాన్సర్ బాధితుల సంఖ్యే. మరోవైపు యువత ఇలాంటి డీప్ ఫ్రైలు, కాల్చిన ఫుడ్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో దీర్ఘకాలిక కేన్సర్లు పుట్టుకొస్తాయి. దీంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతారు యువత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అందులో ఉపయోగించే టేస్టింగ్ సాల్ట్స్, షుగర్ లెవెల్స్ పెంచే ఫుడ్స్ ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తాయని చెప్పారు. ఎంతలా యువత వీటికి దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే మైక్రో ఓవెన్‌లో చేసిన వంటకాలకు కూడా దూరంగా ఉండమంటున్నారు. సాధ్యమైనంత మేర కూరగాయాలు 70 శాంత ఉడికించినవి, మాంసం పూర్తి స్థాయిలో ఉడికించి తినడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె సంపద విలువ..!)
Comments
Please login to add a commentAdd a comment