
చర్మం గరుకుగా పొడిబారినట్లుగా అయిపోయి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా..?. అందుకోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడటానికి బదులుగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపితే మేలు అని చెబుతున్నారు చర్మ నిపుణులు. మొక్కల ఆధారిత ఆహారాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో నిండి ఉంటాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది కూడా. వీటిలో చర్మానికి కావాల్సిన విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మంపై వచ్చే మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు చర్మం ఆకృతికి, ఆర్థ్రీకరణను ప్రోత్సహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మరీ అందుకోసం తీసుకోవాల్సిన సూపర్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..!.
జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ 2022లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం..నిర్దిష్ట పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు , పాలీఫెనాల్ అధికంగా ఉండే పానీయాలు తదితరాలు మెరుగ్గా ఉండే ఆరోగ్యకరమైన చర్మంలో కీలకపాత్ర పోషిస్తాయని తేలింది. ఈ ఆహారాలు యవ్వనంతో నిగనిగలాడే చర్మాన్ని అందిస్తాయని పరిశోధన వెల్లడించింది. మరి యవ్వన చర్మానికి దోహదపడే మొక్కల ఆధారిత ఆహారాలు ఏవంటే..
నారింజ:
ఇది విటమిన్ 'సీ'కి అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ సంశ్లేషణ, చర్మం మరమత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. ముదురుఎరుపు రంగు కండ కలిగిన బ్లడ్ ఆరెంజ్‌లతో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సుమారు 20 నుంచి 27 ఏళ్ల వయసు గల యువత 21 రోజుల పాటు ప్రతిరోజూ 600 ఎంఎల్ బ్లడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల డీఎన్‌ఏ నష్టం తగ్గడం తోపాటు విటమిన్ సీ, కెరోటినాయిడ్ల స్థాయిలు పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది.
టమోటాలు..
దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మానికి శక్తిమంతమైన యాంటీ ఆక్సీడెంట్‌లను అందిస్తుంది. పెద్దలు ప్రతిరోజు ఆలివ్‌నూనె తోపాటు 55 గ్రాముల టమోటా పేస్ట్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు గణనీయంగా తగగుతాయని పరిశోధనలో తేలింది. దీనిలో చర్మ నష్టం నుంచి రక్షించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు సూర్యరశ్మి, కాలుష్యం, పర్యావరణ ఒత్తిళ నుంచి చర్మాన్ని రక్షించడంలో టమోటాలు సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.
బాదంపప్పు
బాదంపపపులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు(ఎంయూఎఫ్‌ఏ), విటమిన్ ఈ, పాలీఫైనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మరక్షణకు దోహదం చేస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు 16 వారాల పాటు మొత్తం రోజువారీ కేలరీల్లో 20% బాదంపప్పులు తీసుకోవడంతో గణనీయమైన మార్పులు కనిపించాయని అన్నారు.
సోయబీన్స్..
దీనిలో ఐసోఫ్లేవోన్‌లుగా పిలిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్రోజెన్‌తో సమానమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం తోపాటు చర్మం పొడిబారడం, గాయలయ్యే అవకాశాలు ఎక్కుగా ఉంటాయట. ఎప్పుడైతే సోయాబీన్ తీసుకోవడం మొదలుపెడతామో..అప్పటినుంచి చర్మ స్థితిస్థాపకతలో మంచి మార్పుల తోపాటు ఆర్థ్రీకరణ పెరిగి గీతలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కోకో
కోకోలో ఫ్లేవనోల్స్ నిండి ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. పరిశోధనలో 24 వారాలపాటు ఓ వృద్ధ మహిళ ప్రతిరోజూ కోకో పానీయం తీసుకోవడంతో ఆమె చర్మంలో ముడతలు, గరుకుదనం తగ్గి యవ్వనపు కాంతి సంతరించుకుందని శాస్తవేత్తలు చెబుతున్నారు.
అందువల్ల పోషకాలు అధికంగా ఉండే ఈ మొక్కల ఆధారిత ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆర్థ్రీకరణ, స్థితిపాకత తోపాటు మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన యవ్వన చర్మాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు చర్మ నిపుణులు.
(చదవండి: మహిళల రక్షణకు ఉపకరించే చట్టాలివే..)
Comments
Please login to add a commentAdd a comment