వయసు పైబడుతున్న కొద్దీ అందంగా, ఫిట్‌గా కనిపించమేమోననే బెంగ అందర్నీ పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే, కొన్ని సూచనలు పాటిస్తే ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మాన్ని కాపాడకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.
వయసు 40 దాటే సరికి, ముఖ వర్చస్సు తగ్గడం, ముడతలు, చర్మం సాగడం వంటి సమస్యలు మొదలవుతాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ మార్పులు చాలా తొందరగా కనిపిస్తాయి. చర్మం నిగారింపు కోల్పోతుంటుంది. పెళ్లి, పిల్లలు తరువాత స్త్రీలలో జరిగే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావమే దీనికి కారణం.
జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని మాత్రమేకాదు, బయటికి మనం కనిపించే తీరును కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపించకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం కూడా కీలకమే.
ఆరోగ్యంగా ఉండాలంటే, చక్కటి ఆహారం, సరిపడా నిద్ర, క్రమం తప్పని వ్యాయామం. వ్యాయామం శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, ధ్యానం, ఏరోబిక్ వ్యాయామాలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం కొల్లాజెన్ ఉత్పత్తికి సాయం చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు ఆహారంలో చేర్చుకోవాలి.
సరిపడా నీళ్లు తాగాలి.
చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ అవసరం. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది. ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది.
విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఎక్కువ ఎండకు, ఎక్కువ చలికి ఎక్స్‌పోజ్ కాకూడదు. రసాయన రహిత క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖం చర్మం సాగిపోకుండా, బిగుతుగా ఉంచేందుకు ఫేషియల్ మాస్కులు కొంతవరకు పనిచేస్తాయి.
అలాగే ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులు, యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, హైడ్రేటింగ్ సీరమ్‌లు, హైలురోనిక్ యాసిడ్, విటమిన్లు, నర్చరింగ్ ఆయిల్స్, షియా బటర్ ఉన్న మాయిశ్చరైజర్‌లను వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడవచ్చు.
నోట్ : మనిషికి ముసలితనం రావడం, యవ్వనంలోని అందాన్ని కోల్పోవడం సహజం. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు, పోషకాలతో నిండిన ఆహారం, చక్కటి వ్యాయామం, ఇతర ఆరోగ్య సూత్రాలను పాటించాలి. మానసిక,శారీరక ఆరోగ్యం బాహ్య సౌందర్యాన్ని ప్రభావితం చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment