
వయసును దాచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును దాచుకోవడం కుదరక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారి కోసం అందుబాటులోకి వచ్చింది ఈ హోమ్ స్కిన్‌కేర్ టూల్. దీని పేరు లక్సేన్ బ్యూటీ ఫర్మాగ్లో బాడీ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్.
ఇది ఇట్టే వయసును దాచేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ టైటెనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ఈ పరికరం శరీరంలోని ప్రతిభాగాన్నీ యవ్వనం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతుంది. ఇది కాళ్లు, చేతులు, తొడలు, నడుము, వీపు, పొట్ట తదితర భాగాలకు చక్కని మర్దన అందిస్తుంది.
అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం చర్మాన్ని తేలికగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మం బిగిని పునరుద్ధరిస్తుంది. మృతకణాలను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ పరికరం ముఖం సహా శరీర భాగాల్లోని చర్మం పైపొరను సున్నితంగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు, వయసుతో వచ్చే మచ్చలు సహా చిన్నచిన్న సౌందర్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి స్క్రబర్‌లా, బ్రష్‌లా పనిచేసి చర్మానికి కొత్త మెరుపునిస్తుంది.
ఇది మన్నికైన, సరసమైన, సులభమైన మాన్యువల్ సాధనం కావడంతో దీనికి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. వారానికి ఐదే ఐదు నిమిషాలు కేటాయించి.. పైనుంచి కింద వరకూ ఆయిల్ లేదా క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుని, దీనిని రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని చాలా తేలికగా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. దీని ధర 149 డాలర్లు. అంటే 12,810 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment