anti aging
-
యవ్వనం కోసం మిలియనీర్ పాట్లు : వికటించిన ప్రయోగం, కానీ!
టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడానికి, యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. తన జీవసంబంధమైన వయస్సును తగ్గించుకోవడానికి 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మద్దతుతో, విపరీతమైన మందులు, వ్యాయామం, అనేక చికిత్సల ద్వారా వయసును తగ్గించుగాకలిగాడు. అయితే, అతని తాజా యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బ్రయాన్ జాన్సన్ స్వయంగా ఇన్‌స్టాలో వివరించాడు.యవ్వన రూపాన్ని పొందే క్రమంలో ముఖానికి కొవ్వు ఇంజక్షన్ వికటించి, అతని ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా అంటూ తన ఫోటోలను జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. డోనర్ ఇచ్చిన కొవ్వును ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో తన ముఖం ఎర్రగా వాచిపోయిందని తెలిపాడు. దీన్నే "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అంటారు. ముఖంలో మంట మొదలైందనీ, ఆ తర్వాత మరింత అధ్వాన్నంగా మారిపోయిందని తెలిపాడు. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని వివరించాడు. అయితే అతని కఠినమైన 1,950-కేలరీల డైట్‌తో గణనీయమైన బరువు తగ్గిన తర్వాత ఈ పరిణాం చోటు చేసుకోవడం గమనార్హం. ఏడు రోజుల తర్వాత, తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నాడు తదుపరి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలపై తమ టీం పని చేస్తోందన్నాడు. View this post on Instagram A post shared by Bryan Johnson (@bryanjohnson_) కాగా బ్రయాన్ జాన్సన్ ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్మెంట్, యాంటీ యాజింగ్ మందులు చికిత్సలతో తన చర్మ వయస్సుతోపాటు, గుండె, లివర్ శరీరంలోని ప్రతీ భాగం వయస్సును తగ్గించుకున్నట్టు ఇంతకు ముందే ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర -
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్‌కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్‌ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్‌ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్‌లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్‌లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్‌లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్‌గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్‌గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, హెచ్‌వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
ఆరోగ్యంగా, అందంగా యంగ్ లుక్ కావాలా.. ఈ చిట్కాలు పాటించండి!
వయసు పైబడుతున్న కొద్దీ అందంగా, ఫిట్‌గా కనిపించమేమోననే బెంగ అందర్నీ పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే, కొన్ని సూచనలు పాటిస్తే ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మాన్ని కాపాడకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.వయసు 40 దాటే సరికి, ముఖ వర్చస్సు తగ్గడం, ముడతలు, చర్మం సాగడం వంటి సమస్యలు మొదలవుతాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ మార్పులు చాలా తొందరగా కనిపిస్తాయి. చర్మం నిగారింపు కోల్పోతుంటుంది. పెళ్లి, పిల్లలు తరువాత స్త్రీలలో జరిగే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావమే దీనికి కారణం.జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని మాత్రమేకాదు, బయటికి మనం కనిపించే తీరును కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపించకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం కూడా కీలకమే. ఆరోగ్యంగా ఉండాలంటే, చక్కటి ఆహారం, సరిపడా నిద్ర, క్రమం తప్పని వ్యాయామం. వ్యాయామం శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, ధ్యానం, ఏరోబిక్ వ్యాయామాలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం కొల్లాజెన్ ఉత్పత్తికి సాయం చేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు ఆహారంలో చేర్చుకోవాలి.సరిపడా నీళ్లు తాగాలి.చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ అవసరం. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది. ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది.విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.ఎక్కువ ఎండకు, ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కాకూడదు. రసాయన రహిత క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖం చర్మం సాగిపోకుండా, బిగుతుగా ఉంచేందుకు ఫేషియల్ మాస్కులు కొంతవరకు పనిచేస్తాయి.అలాగే ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులు, యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, హైడ్రేటింగ్ సీరమ్‌లు, హైలురోనిక్ యాసిడ్, విటమిన్లు, నర్చరింగ్ ఆయిల్స్, షియా బటర్ ఉన్న మాయిశ్చరైజర్లను వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడవచ్చు.నోట్ : మనిషికి ముసలితనం రావడం, యవ్వనంలోని అందాన్ని కోల్పోవడం సహజం. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు, పోషకాలతో నిండిన ఆహారం, చక్కటి వ్యాయామం, ఇతర ఆరోగ్య సూత్రాలను పాటించాలి. మానసిక,శారీరక ఆరోగ్యం బాహ్య సౌందర్యాన్ని ప్రభావితం చేస్తాయి. -
వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్ అయిన బ్రియాన్ జాన్సన్! ఏకంగా..
మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(48) తన వృద్ధాప్యాన్ని తిప్పేకొట్టే ప్రతయత్నంలో విజయం సాధించాడు. ఆయనకు వయసు మీద పడుతున్న యువకిలా కనిపించాలనుకున్నారు. అందుకోసం ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో గత కొంతకాలం కఠినమైన డైట్‌ని అనుసరించాడు. ప్రత్యేకమైన ఆహారం, వందకు పైగా మాత్రలు వేసుకున్నాడు. తన శరీరంలో ప్రతి భాగం 18 ఏళ్ల యువకుడిలో ఉండేలా ప్రతి నిత్యం దాదాపు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేవాడు. దీని కోసం అని అతను కోట్లలో డబ్బు వెచ్చించాడు కూడా. ఎట్టకేలకు వయసు మీద పడుతున్న యువకుడిలో వయసు తగ్గించుకునే బ్లూప్రింట్ ప్రాజెక్ట్ విజయవంతమయ్యిందని, తాను యువకుడిలా మారానని వెల్లడించారు. వృద్ధాప్య ఛాయలకు విజయవంతంగా చెక్పెట్టానన్నారు. అందుకు సంబంధించిన రహస్యాన్ని బ్లూప్రింట్ స్టాక్ పేరుతో మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపాడు. ఇది మన ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేసే అమౌంట్ కంటే తక్కవలోనే ఈప్రొడక్ట్ స్టాక్‌ని తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. ఆ ప్రొడక్ట్‌లో డ్రింక్ మిక్స్, ప్రొటీన్, ఎనిమిది మాత్రలు, స్నేక్ ఆయిల్, 61 శక్తిమంతమైన థెరపీలు, 400 కెలరీలు సప్లిమెంటరీస్ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రొడక్స్లను ప్రమోట్ చేస్తే ఇది తల్లిపాలకు సరిసమానమైనదని చెబతూ ఉత్త్పత్తుల వివరాలను ఎక్స్‌లో వెల్లడించారు. ఈ ఉత్పత్తుల పనితీరుపై దాదాపు వెయ్యి క్లినకల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అంతేగాదు తన వయసు కంటే ఐదేళ్లు తగ్గించుకున్నానని, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు. ఆయన ఈ బ్లూప్రింట్ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. వయసు రీత్యా వచ్చే జుట్టు రాలు సమస్యకు కూడా చెక్ పెట్టానని చెప్పారు. ఈ ఉత్పత్తులను తమ డైట్లో భాగం చేసుకుంటే భోజనం రెండు పూటలా తీసుకోవచ్చలేదన్నది తెలియాల్సి ఉంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేసే ఈ బ్లూప్రింట్ స్టాక్ అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్ పోర్చుగల్, స్పెయిన్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, అరబ్ దేశాలు తోసహా మొత్తం 23 దేశాల్లో అందుబాటులో ఉందని వెల్లడించారు బ్రయాన్ జాన్సన్. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
18 ఏళ్ల కుర్రాడిగా కనిపించాలని..! ఎంత ఖర్చు చేస్తున్నాడంటే..
వయసుపై బడే కొద్దీ అందంగా, ఫిట్‌గా కనిపించేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు కొందరు. అయితే.. ఈ మార్గాల్లో కాకుండా విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్న వాళ్లనూ తరచూ చూస్తున్నాం. రివర్స్ ఏజింగ్.. అంటే వయసు వెనక్కి తీసుకెళ్లడం. అసలు అది సాధ్యమేనా? అనే విషయం పక్కనపెడితే.. వైద్యసాంకేతిక విధానాల ద్వారా సుసాధ్యం చేయొచ్చనే ప్రయోగాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా.. అలాంటి ప్రక్రియతో వార్తల్లోకి ఎక్కిన ఓ సాఫ్ట్వేర్ మిలియనీర్ ప్రయత్నం గురించి బ్లూమ్‌బర్గ్ కథనం ఆధారంగా. బ్రయాన్ జాన్సన్.. వయసు 45 ఏళ్లు. బయోటెక్ మేధావిగా ఈయనకంటూ యూఎస్‌లో ఓ పేరుంది. పైగా సంపాదనతో మిలియనీర్‌గా ఎదిగాడు. అయితే 18 ఏళ్ల టీనేజర్‌గా కనిపించేందుకు ఈయనగారు ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేశారు. మన కరెన్సీలో అది 16,29,68,990 రూపాయలు. ఈ ట్రీట్మెంట్లో భాగంగా.. శరీర తత్వం 18 ఏళ్లుగా కనిపించాలని, గుండె 37 ఏళ్ల వ్యక్తికి ఉండేలా, చర్మం 28 ఏళ్ల వ్యక్తి ఉండేలా కనిపించేందుకు చికిత్సలు తీసుకుంటున్నాడట. అంతేకాదు.. ప్రతీరోజూ 30 మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు అతని శరీర పనితీరును పర్యవేక్షిస్తున్నారట. ఈ రివర్స్ ఏజింగ్ ప్రక్రియ మొత్తం 29 ఏళ్ల ఫిజిషియన్ ఒలీవర్ జోల్మాన్ నేతృత్వంలో జరుగుతోంది. విశేషం ఏంటంటో.. జోల్మాన్తో పాటు జాన్సన్‌కు కూడా వృద్ధాప్యం, దీర్ఘాయువు లాంటి అంశాలపై ఆసక్తి ఎక్కువట. అందుకే.. గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను నేరుగా తనపైనే చేయించుకునేందుకు ముందుకు వచ్చాడతను. అందుకోసం కాలిఫోర్నియా వెనిస్లోని తన నివాసాన్నే ప్రయోగశాలగా మార్చేశాడతను. అధికారికంగా యాంటీ ఏజింగ్ కోసం అతను చేస్తున్న ఖర్చు(వ్యక్తిగతంగా) ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పింది కూడా. ఒకవైపు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు.. రెగ్యులర్‌గా చేయాల్సిన ఎక్స్ర్సైజులు, తీసుకోవాల్సిన ఆహారం.. ఇలాంటివన్నీ షరామాములుగా కాకుండా వైద్యుల సమక్షంలోనే ప్రత్యేకంగా చేస్తున్నాడు. గత ఏడాది కాలంగా.. 2 మిలియన్ డాలర్ల డబ్బు ఖర్చు చేశాడతను. ఈ ఏడాదిలో బ్రెయిన్, లంగ్స్, లివర్, కిడ్నీలు, పళ్లు, చర్మం, జుట్టు, మర్మాంగం.. ఇతర అవయవాలన్నింటిని 18 ఏళ్ల వ్యక్తిగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాడతను. ఈ ప్రయోగంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినా పర్వాలేదని, ఒకవేళ ప్రయోగం సక్సెస్ అయితే నవయవ్వనంగా కనిపించాలనుకుంటున్న మనిషి కోరిక నెరవేరేందుకు ఒక మార్గం దొరుకుతుందని అంటున్నాడు బ్రయాన్ జాన్సన్. -
బొప్పాయి, దానిమ్మ.. రోజూ తింటే కలిగే లాభాలు! ముఖంపై ముడతలు.. ఇంకా
వయసు పెరిగే కొద్ది రకరకాల మార్పులు రావడం సహజం. ముఖ్యంగా ముఖంపై ముడతలు, ముఖం మెరుపు కోల్పోయి కళావిహీనం కావటం, కళ్లకింద ఉబ్బెత్తుగా ఉండటం, మంగు మచ్చలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటినుంచి ఉపశమనానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేకమైన కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటి వినియోగం వల్ల పరిష్కారం లభించకపోగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా కొన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటూ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లను వాడటం వల్ల శరీరం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మసమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాం... బొప్పాయి దీనిలో చర్మానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి బొప్పాయి పండ్లను ప్రతి రోజూ తినడం మంచిది. బొప్పాయిలో యాంటీ ఏజింగ్ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి దీనిని తినడం వల్ల శరీరానికి అధిక పరిమాణం లో యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మం ఆరోగ్యంగా మిలమిలలాడుతుంది. అంతేకాదు, అనేకరకాల చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆకు కూరలు ఆకు కూరల్లో క్లోరోఫిల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా, కళ్లు మెరుపులీనుతూ ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరల వాడకం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. పాలు, బాదం పాలలో ఉండే పోషకాల గురించి చిన్నప్పటినుంచి వింటున్నదే కాబటిట ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి కాబట్టి రోజూ గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని ఆపడానికి సహాయపడుతుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఆహారంలో దానిమ్మను వినియోగించాలి. దానిమ్మ రసాన్ని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దానిమ్మను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెరుగు శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభించాలంటే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. పెరుగును ఫేస్ ప్యాక్‌గా కూడా వాడచ్చు. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే ముడతలు తొలగిపోవడంతోపాటు చర్మంపై రంధ్రాలు, మచ్చలు లేకుండా ముఖచర్మం మృదువుగా తయారవుతుంది. పిల్లలకు చిన్నప్పటినుంచి పెరుగు తినే అలవాటు చేయడం మంచిది. పైన చెప్పుకున్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మందులు, సౌందర్య సాధనాలతో పనిలేకుండా యవ్వనంగా ఉండచ్చని నిపుణుల మాట. చదవండి: Carrot Juice: క్యారట్ జ్యూస్ తాగే అలవాటుందా?... ఈ విషయాలు తెలిస్తే.. -
Health Tips: టొమోటాలు, సోయా, బెర్రీలు.. ఇంకా.. ఇవి తినండి... వయసు తగ్గించుకోండి!
సాధారణంగా చాలామంది స్త్రీలు ముఖ్యంగా గృహిణులు కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తమ గురించి తాము ఏమాత్రం పట్టించుకోరు. ఫలితంగా నిండా నాలుగు పదులు కూడా రాకుండానే వయసు మీద పడ్డట్టు కనిపిస్తారు. అయితే కొన్ని రకాల పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందంగా... ఆరోగ్యంగా.. ఉన్న వయసు కంటే తక్కువగా కూడా కనిపిస్తారు. అవేంటో తెలుసుకుందాం.. పాలు స్త్రీలు పాలు తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాలి. పాలలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పెరుగు కొవ్వు తక్కువగా ఉండే పెరుగు స్త్రీలకు ఎంతో హితకరమైనది. ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. స్త్రీలకు వచ్చే కొన్నిరకాల ఇన్ఫెక్షన్లను, అల్సర్‌ను కూడా తగ్గిస్తుంది. టొమోటాలు స్త్రీలకు టమాటాలు ఔషధంతో సమానం. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇక టొమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి. టొమోటాలను రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాల సోయా పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలకు కొదవే ఉండదు. ఇవి అతివలను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ డ్రై ఫ్రూట్స్‌ను తింటే బలంగా ఉంటారు. క్యాన్సర్‌ను అడ్డుకునే బెర్రీలు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను రోజూ తింటే మీరు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశమే రాదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్‌తో పోరాడే ఔషధ గుణాలుంటాయి. వీటితో పాటు గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్, అవిసె గింజెలు సైతం యవ్వనంగా కలినపించడంలో దోహందం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూశారుగా... ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తున్నామని బాధపడకుండా పైన చెప్పుకున్న వాటిని రోజువారీ తీసుకుంటూ అందంగా.. ఆరోగ్యంగా... యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించడం మంచిది కదా! -
ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. బెజోస్ అంతరిక్షయాత్రపై నెటిజన్లు తీవ్ర విమర్శలను గుప్పించారు. అంతేకాకుండా కొంతమంది తమ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఖాతాలను వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. కాగా తాజాగా జెఫ్ బెజోస్ మరో ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! మానవుడు ఎల్లప్పుడు యవ్వనంగా ఉండేందుకు చేస్తోన్న ప్రయోగాలకు ఊతం ఇస్తూ ఆయా కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఆల్టోస్ ల్యాబ్స్ యాంటీ ఏజింగ్‌పై పరిశోధనలను చేస్తోంది. ఈ కంపెనీ వెనుక జెఫ్‌బెజోస్ ఉన్నట్లు ఏమ్ఐటీ టెక్ రివ్యూలో తెలిసింది. మానవ కణాలను రిప్రోగ్రామ్ చేయడం ద్వారా మానవుడుకి వృద్దాప్యం దరిచేరకుండా ఆల్టోస్ ల్యాబ్స్ పరీక్షలను చేస్తోంది. ఆల్టోస్ ల్యాబ్‌లో జెఫ్ బెజోస్ ఇన్వెస్ట్ చేసిన కొద్దిరోజులకు కంపెనీ భారీ వేతనాలతో పలు శాస్త్రవేత్తలను నియమించుకున్నట్లు ఎమ్ఐటీ టెక్ రివ్యూలో తెలిసింది. ఈ విషయంపై జెఫ్‌బెజోస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ స్పందించలేదు. యాంటీ ఏజింగ్ పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో యూనిటీ టెక్నాలజీస్ అనే బయోటెక్ సంస్థలో కూడా ఏర్పాటు చేయనుంది. ఎమ్ఐటీ టెక్ రివ్యూ ప్రకారం యాంటీ ఏజింగ్ పరిశోధనలో భాగంగా ఆల్టోస్ ల్యాబ్స్ కణాల రీప్రోగ్రామింగ్ టెక్నాలజీపై దృష్టిసారించింది. 2012లో నోబుల్ అవార్డును గెలిచిన షిన్యా యమనాకా ఆల్టోస్ ల్యాబ్స్‌కు సైంటిఫింక్ అడ్వైజరీ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..? -
అవును వారు బామ్మలే..కానీ!
లండన్ : జుట్టు ముగ్గుబుట్టవడం..ముడతలు పడిన చర్మం..ఉద్యోగం దూరమవడం ఇవన్నీ వయసు తెచ్చే మార్పులే. 60 దాటగానే అన్నీ అయిపోయాయనుకునే నిర్వేదం నుంచి 70లు దాటితేనే అసలైన జీవితాన్ని ఆస్వాదించవచ్చంటున్నారు ఈ నయా బామ్మలు. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని చెప్పే వాళ్లని చూశాం కానీ, వయసు తమ శరీరానికీ దూరమే అన్నట్టు ఈ వృద్ధుల దినచర్య అందరి కళ్లకు కడుతోంది. బోల్డర్ అనే వెబ్సైట్ చేసిన పరిశోధనలో చలాకీ వృద్ధుల దూకుడు వెల్లడైంది. కృష్ణ రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తారనుకునే 70 ఏళ్ల పైబడిన వారినే ఈ వెబ్సైట్ పలుకరించగా వారి చురుకైన లైఫ్‌స్టైల్ చూసి విస్తుపోయే పరిస్థితి ఎదురైంది. వీరిలో ఒకరు 82 ఏళ్ల వయసులో ప్రేమలో పడి వివాహం చేసుకున్నవారు కాగా, మరొకరు 85 ఏళ్ల వయసులో ఏకంగా రోజూ ఒక మైలు దూరం స్విమ్ చేస్తున్నారు. వీరంతా ఇప్పటికీ ఏదో ఒక పనిచేస్తుండటం గమనార్హం. తమ జీవితంలో అత్యంత సంతోషదాయకమైన దశ ఇదేనని వారంతా చెప్పుకొచ్చారు. వృద్ధాప్యం జీవితంలో అత్యంత దుర్భర దశ అనుకుని అసలు వాస్తవం గ్రహించాలని వీరిని ఇంటర్వ్యూ చేయగా భిన్నమైన పరిస్ధితి తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఆ వెబ్సైట్ పేర్కొంది. 87 ఏళ్ల వయసులో టెన్నిస్.. తాను ఇప్పటికి 70 ఏళ్లు పైగా టెన్నిస్ ఆడుతున్నానని కెనడాలోని ఒంటారియాకు చెందిన ముఫీ గ్రీవ్ (87) వెల్లడించి ఇంటర్వ్యూ చేసిన వారిని షాక్‌కు గురిచేశారు.తాను 30, 40, 50 ఇలా వయసు పెరుగుతున్న కొద్దీ ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదని, జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఎదో రంగంలో విజయం సాధిస్తే తమకు లభించే ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పదని ఆమె చెప్పుకొచ్చారు. తాను 62 ఏళ్ల వయసులో బ్రైన్ ట్యూమర్‌తో బాధపడినా సానుకూల దృక్పథంతో సమస్యలు అధిగమించానని వెల్లడించారు. సమస్యలతో దిగాలుపడి కూర్చోవడం తనకు ఇష్టం ఉండదని పాజిటివ్ మైండ్‌తో పరిగెత్తడమే తనకు తెలిసిన విషయమన్నారు. గోల్ప్‌లో 90 స్కోర్ చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు. ఏడు పదుల వయసులో స్విమ్మింగ్ ఎలరీ మెక్గొవన్ ఏడు పదుల వయసు దాటిన ఈ బామ్మ స్విమ్మింగ్‌లో పలు వరల్డ్ ఛాంపియన్షిప్లను కైవసం చేసుకున్నారు. రష్యాలో వింటర్ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తనకు గాయమైనా రేస్ ముగిసే వరకూ రక్తం కారుతున్నా తనకు ఆ విషయం తెలియలేదని ఎలరీ చెబుతారు. తాను ప్రతివారం పైలేట్స్, స్పిన్ క్లాసులు తీసుకుంటానని ఆరోగ్యకర ఆహారం, పరిమితంగా రెడ్‌వైన్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెప్పకొచ్చారు. గత ఏడాది తన కుమారుడు జేమ్స్ హఠాన్మరణం చావు పట్ల తొలిసారిగా భయాన్ని కల్పించిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే జీవితాన్ని చాలించాలని లేదని, కానీ నా వయసు ఏటికేడు పెరుగుతూ పోతోందని అన్నారు. అయినా తాను జీవితంలో సాధించాలనే పట్టుదలను వీడలేదని, అంటార్కిటికాను ఈదడం తన తదుపరి టార్గెట్ అని చెప్పారు. పదహారు ఫ్లోర్లు: అవలీలగా ఎక్కేస్తారు రీటా గిల్మోర్ 87 ఏళ్ల వయసులో తన రెస్టారెంట్‌లోని 16 ఫ్లోర్లనూ ఎక్కిదిగుతారు. కస్టమర్లు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ బ్రెయిన్‌ను చురుకుగా ఉంచుకుంటానని ఆమె చెబుతారు. మద్యం ముట్టకుండా..పొగ తాగకుండా ఉండటమే తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమనే రీటా రోజూ మేకప్ వేసుకోవడమే కాదు స్ధానిక దుస్తుల కంపెనీకి ఇప్పటికీ మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఆయుష్షును పెంచే సరికొత్త మాత్ర!
మానవ జీవితకాలాన్ని పొడిగించుకునే పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలలు మరో ముందడుగు వేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరంలోని అవయవాల పనితీరును తగ్గిస్తూ వచ్చే ప్రొటీన్ మాలిక్యూల్స్ జాడను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జిఎస్కే -3 గా పిలవబడే ప్రొటీన్ మాలిక్యూల్ అవయవాల పనితీరు సామర్థ్యాన్ని తగ్గిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో జీఎస్కె 3ను నియంత్రించడం ద్వారా ఆయుష్షను పొడిగించుకోవచ్చని డాక్టర్ జార్జ్ ఇవాన్ క్యాస్టిల్లో-క్వాన్ నేతృత్వంలో నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం మానవ ఆయుర్దాయాన్ని మరో 10 సంవత్సరాలు పెంచేలా ఓ చిన్న మాత్రను తయారు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అవయవాల పనితీరును నియంత్రిస్తున్న జీఎస్కె 3ని నివారిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని దీన్ని నేరుగా ప్రభావితం చేసే మాత్ర తయారీకి ఎంతో కాలం పట్టకపోవచ్చని జార్జ్ వ్యాఖ్యానించారు. తమ పరిశోధన ద్వారా అల్జీమర్స్ వ్యాధికి గురయ్యే వారి వయసును పొడిగించగలిగితే చాలా మంచి విషయమవుతుందన్నారు. 100 నుంచి 120 సంవ్సతరాల సుదీర్ఘ కాలం బతకాలని కాకుండా.. కనీసం బతికనన్నాళ్లు ఆరోగ్యవంతంగా జీవించడం అవసరమన్నారు. అన్ని యాంటీ ఏజింగ్ మందుల్లో లాగానే దీంట్లో కూడా లిథియం వాడుతున్నప్పటికీ, తక్కువ లిథియం మోతాదు, తక్కువ దుష్ఫలితాలతో ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు తమ ప్రయోగాలు కొనసాగుతున్నాయని తెలిపారు. జీవితకాలం పొడిగింపు విషయంలో చాలా వివాదాలు ఉన్నప్పటికీ, వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవడం ముఖ్యమన్నారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, మధుమేహం, పార్కిన్సన్, క్యాన్సర్ వంటి రోగాలను సైతం ఈ మాత్రతో దూరం చేయవచ్చని ఆయన తెలిపారు. 'జీఎస్కే-3ని కనుగొనడంతో మేమెంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. వయసుతో పాటే వచ్చే అన్ని రోగాల నుంచి ఇక విముక్తి లభించనుంది. మధ్య వయసులో ఈ మాత్రల ద్వారా చికిత్స తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే అన్ని రకాల వ్యాధులు సమీప భవిష్యత్తులో నివారించవచ్చు' అని జార్జ్ పేర్కొన్నారు. లండన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన ఫలిస్తే ఏడు నుంచి పది సంవత్సరాల జీవితం కాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు చెప్పారు. జర్నల్ సెల్ రిపోర్ట్స్ లో ప్రచురితమైన మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ బయాలజీ, యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ లేబరేటరీ కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నట్టు తెలిపారు.