మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(48) తన వృద్ధాప్యాన్ని తిప్పేకొట్టే ప్రతయత్నంలో విజయం సాధించాడు. ఆయనకు వయసు మీద పడుతున్న యువకిలా కనిపించాలనుకున్నారు. అందుకోసం ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో గత కొంతకాలం కఠినమైన డైట్‌ని అనుసరించాడు. ప్రత్యేకమైన ఆహారం, వందకు పైగా మాత్రలు వేసుకున్నాడు. తన శరీరంలో ప్రతి భాగం 18 ఏళ్ల యువకుడిలో ఉండేలా ప్రతి నిత్యం దాదాపు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేవాడు. దీని కోసం అని అతను కోట్లలో డబ్బు వెచ్చించాడు కూడా.
ఎట్టకేలకు వయసు మీద పడుతున్న యువకుడిలో వయసు తగ్గించుకునే బ్లూప్రింట్ ప్రాజెక్ట్ విజయవంతమయ్యిందని, తాను యువకుడిలా మారానని వెల్లడించారు. వృద్ధాప్య ఛాయలకు విజయవంతంగా చెక్‌పెట్టానన్నారు. అందుకు సంబంధించిన రహస్యాన్ని బ్లూప్రింట్ స్టాక్ పేరుతో మార్కెట్‌లో విక్రయించనున్నట్లు తెలిపాడు. ఇది మన ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేసే అమౌంట్ కంటే తక్కవలోనే ఈప్రొడక్ట్ స్టాక్‌ని తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. ఆ ప్రొడక్ట్‌లో డ్రింక్ మిక్స్, ప్రొటీన్, ఎనిమిది మాత్రలు, స్నేక్ ఆయిల్, 61 శక్తిమంతమైన థెరపీలు, 400 కెలరీలు సప్లిమెంటరీస్ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రొడక్స్‌లను ప్రమోట్ చేస్తే ఇది తల్లిపాలకు సరిసమానమైనదని చెబతూ ఉత్త్పత్తుల వివరాలను ఎక్స్‌లో వెల్లడించారు.
ఈ ఉత్పత్తుల పనితీరుపై దాదాపు వెయ్యి క్లినకల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అంతేగాదు తన వయసు కంటే ఐదేళ్లు తగ్గించుకున్నానని, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు. ఆయన ఈ బ్లూప్రింట్ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. వయసు రీత్యా వచ్చే జుట్టు రాలు సమస్యకు కూడా చెక్ పెట్టానని చెప్పారు. ఈ ఉత్పత్తులను తమ డైట్‌లో భాగం చేసుకుంటే భోజనం రెండు పూటలా తీసుకోవచ్చలేదన్నది తెలియాల్సి ఉంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేసే ఈ బ్లూప్రింట్ స్టాక్ అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్ పోర్చుగల్, స్పెయిన్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, అరబ్ దేశాలు తోసహా మొత్తం 23 దేశాల్లో అందుబాటులో ఉందని వెల్లడించారు బ్రయాన్ జాన్సన్.
(చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్‌మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!)
Comments
Please login to add a commentAdd a comment